
Chiranjeevi Acharya Movie Updates: ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో ఎలాగూ జనవరి మూవీస్ రిలీజెస్ షెడ్యూల్ మొత్తం మారిపోయింది. ఇప్పుడు ఫిబ్రవరిలోనూ అదే సీన్ రిపీట్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. సినీ అభిమానులను మరోసారి డిజప్పాయింట్ చేస్తూ ఆచార్య, ఖిలాడి లాంటి సినిమాలు మరో మంచి రిలీజ్ డేట్ వైపు చూసే ఆప్షన్స్ ఎక్కువగా కనిపిస్తున్నాయి.
ఫిబ్రవరి 4న ఆచార్య రిలీజ్ కావాల్సి ఉంది. రెండేళ్లుగా మెగాభిమానలు ఈగర్ గా వెయిట్ చేస్తున్న మెగా మల్టీస్టారర్ మూవీ ఇది. ఎట్టకేలకు ఫిబ్రవరిలో మూవీ రిలీజ్ అవుతోంది. అందుకు తగ్గట్లే కొరటాలశివ సినిమా ప్రమోషన్ ను సాగిస్తున్నాడు. లాహే, నీలాంబరి, సానా కష్టం లాంటి సింగిల్స్ రిలీజ్ చేసాడు. చిరు, చరణ్ లపై స్పెషల్ టీజర్స్ విడుదల చేసాడు. కాని ఇప్పుడు ఈ మెగా మల్టీస్టారర్ ఒమిక్రాన్ ఎఫెక్ట్ తో వాయిదా పడే అవకాశాలు ఉన్నాయట.
ఫిబ్రవరి 4న ఆచార్య పోస్ట్ పోన్ అయితే ఆ స్థానంలో శేఖర్ వస్తాడట. 2018 మలయాళ బ్లాక్ బస్టర్ జోసెఫ్ మూవీ తెలుగు రీమేక్ ఇది. నిజానికి ఈ మూవీని సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు. ఇప్పుడు ఆచార్య పోస్ట్ పోన్ కానుందనే టాక్ బయటికి రావడంతో ఆ డేట్ పై రాజశేఖర్ కన్నేశాడు.