Omicron Variant
-
కరోనా కొత్త వేరియెంట్ లక్షణాలు.. అశ్రద్ధ వద్దు
ఏడాదిన్నర కిందట కరోనా వేరియంట్ ఒమిక్రాన్.. విపరీతమైంగా వైరస్ వ్యాప్తికి కారణమైంది. కోవిడ్‌తో ఆస్పత్రుల్లో చేరారు చాలామంది. వైరస్ ఉధృతిని తట్టుకోలేక.. అదే సమయంలో వాళ్లకున్న ఆరోగ్య సమస్యలతో పలువురు మరణించారు కూడా. ఆ తర్వాత వైరస్ ఉధృతి తగ్గుముఖం పట్టి.. జనాలు కరోనాను పట్టించుకోవడం పూర్తిగా మానేశారు. కరోనాతో మమేకమై బతికేందుకు మానసికంగా సిద్ధమైపోయారు. అయితే.. ఆ ఒమిక్రాన్ ఉపరకం జేఎన్.1 ఇప్పుడు భారత్‌లో మళ్లీ కేసుల పెరుగుదలకు కారణం అవుతోంది. కరోనా వైరస్ జేఎన్.1 ఉపరకం తొలి కేసు అమెరికాలో వెలుగు చూసింది. సెప్టెంబర్‌లో ఇది అక్కడ విజృంభించింది. తాజాగా.. డిసెంబర్ మొదటివారంలో చైనాలోనూ కేసులు వెలుగుచూశాయి. ఇక ఇప్పుడు భారత్ వంతు వచ్చింది. జేఎన్.1 వేరియంట్ అంత ప్రమాదకరమైంది ఏం కాదు.. ఇతర వేరియంట్లతో పోల్చితే జేఎన్.1 ప్రజారోగ్యానికి ఎక్కువ హాని కలిగిస్తోందని చెప్పడానికి ఎటువంటి ఆధారాలు లేవు.. ఇది ఇప్పుడు వైద్యనిపుణులు చెబుతున్నమాట. ఈ మాటనే.. ఇప్పటివరకు జరిగిన అధ్యయనాల ఆధారంగా సమర్థించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. కానీ.. పెరుగుతున్న కేసులు చలికాలం.. ఫ్లూ సీజన్. ఇదంతా కామన్ అని అనుకుంటారంతా. కానీ, ఏడు నెలల తర్వాత కేసుల్లో కనిపిస్తున్న పెరుగుదల. కొత్త వేరియెంట్ కేసుల గుర్తింపుతో పాటు సింగిల్ డిజిట్ ఫిగర్ దాటే దిశగా కరోనా మరణాలు. ఈ పరిస్థితుల్లో కరోనా విజృంభిస్తే పరిస్థితి ఏంటి?. పరిస్థితిని ఎదుర్కొనేందుకు సిద్ధమని ప్రకటిస్తూనే.. అప్రమత్తంగా ఉండాలని రాష్ట్రాలకు, కేంద్రపాలిత ప్రాంతాలను కేంద్రం అప్రమత్తం చేసింది. అందుకు తగ్గట్లే కేసుల్లో రోజూవారీ కొత్త కేసుల పెరుగుదల కనిపిస్తోంది. లక్షణాలివే.. జ్వరం, ఒళ్లు నొప్పులు జలుబు.. ముక్కు కారడం, గొంతు నొప్పి, వాసన-రుచి శక్తిని కోల్పోవడం, తలనొప్పి.. కొందరిలో కడుపు నొప్పి, గ్యాట్రిక్ సమస్య వాంతులు, విరేచనాలు మరికొందరిలో శ్వాసకోశ సమస్యలు పై లక్షణాలు పూర్తి స్థాయిలో కనిపించడానికి నాలుగు నుంచి ఐదురోజుల సమయం పడుతుంది. ఈ తరహా లక్షణాలు కనిపించినప్పుడు.. నిర్లక్ష్యం వద్దు. దగ్గర్లోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, ల్యాబ్‌లకు వెళ్లి టెస్టులు చేయించుకోవాలి. పాజిటివ్‌గా తేలితే.. ఐసోలేషన్ ద్వారా జాగ్రత్త పడాలి. తద్వారా చుట్టూ ఉండేవాళ్లకు వైరస్ సోకకుండా జాగ్రత్త పడొచ్చు. మాస్కులు ధరించడం, స్వీయ శుభ్రత పాటించడం ద్వారా అసలు వైరస్సే సోకకుండా జాగ్రత్త పడొచ్చు. సామాజిక వ్యాప్తికి ఎంట్రీ దశలో.. నవంబర్‌కు ముందు దాకా.. భారత్‌లో ఇన్‌ఫ్లూయెంజా కేసుల్లో 1 శాతం మాత్రమే కోవిడ్ కేసులుగా నిర్ధారణ అయ్యాయి. నవంబర్ తర్వాత నుంచి 9 శాతంగా బయటపడ్డాయి. ఇప్పుడది.. 30 శాతంకి చేరింది. అందుకు ఉదాహరణగా.. కొచ్చిలో ఒక్కరోజు వ్యవధిలో జ్వరాలు, జలుబులతో కొందరికి టెస్టులు చేశారు. వాళ్లలో 30% మందికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో ఆ పేషెంట్ల ఇంట్లోవాళ్లకు, చుట్టుపక్కలవాళ్లకు పరీక్షలు చేయించగా.. వాళ్లలో కూడా కొందరికి పాజిటివ్ వచ్చింది. ఒక్క కేరళలోనే కాదు.. మహారాష్ట్ర, కర్ణాటక, తెలంగాణ.. ఇలా పలు రాష్ట్రాల్లోనూ కొత్త వేరియెంట్ కేసులు పదుల సంఖ్యలో బయటపడుతున్నాయి. అక్కడా టెస్టులు చేస్తే అలాంటి పరిస్థితులే ఎదురవుతాయి. సామాజిక వ్యాప్తి దశలోకి ప్రవేశించిందనడానికి ఇదే నిదర్శనమని అంటున్నారు నిపుణులు. అధ్యయనాల సంగతి గుర్తు చేస్తూ.. కోవిడ్ అంటే లైట్.. ఇంట్లోనే చికిత్స తీసుకుంటే సరిపోతుందని అనుకునేవాళ్లే ఇప్పుడు ఎక్కువ. కానీ, కోవిడ్‌ను సాధారణ జలుబు జ్వరం ఎంతమాత్రం అనుకోవద్దని.. తీసి పారయొద్దని ప్రపంచ ఆరోగ్య సంస్థ మాజీ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ అంటున్నారు. తీవ్ర అనారోగ్యానికి గురికాక తప్పదని హెచ్చరిస్తున్నారామె. శరీరంపై సుదీర్ఘకాలం ప్రతికూల ప్రభావం చూపెడుతుందని.. గుండెజబ్బులతో పాటు మానసిక సమస్యలకు కారణమవుతుందని పలు అధ్యయనాల నివేదికల్ని గుర్తు చేస్తున్నారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా ద్వారా ప్రకటించిన ఆరోగ్య-అత్యవసర పరిస్థితి ముగిసినా.. మానవాళి ఆరోగ్యం మీద అది చూపించే ప్రతికూలత తగ్గలేదనే అంటున్నారామె. తట్టుకోగలమా? కరోనా తొలినాటి పరిస్థితులు ఇప్పుడు లేకపోవచ్చు. ప్రాణాంతక డెల్టా వేవ్‌ను ఎదుర్కొన్న అనుభవమూ ఉండొచ్చు. వ్యాక్సినేషన్ అందించే ధైర్యం మరో కారణం కావొచ్చు. కానీ, ఇప్పుడు గనుక కేసులు పెరిగితే?.. ఒమిక్రాన్ ఉపరకం అయినా జేఎన్.1.. మాతృక వేరియెంట్లాగే చెలరేగిపోతే!. వైరస్ బారినపడి వాళ్లకు దానిని తట్టుకోగలిగే శక్తి లేకపోతే. ఆ భారం ఆస్పత్రులు, వైద్య సిబ్బందిపై కచ్చితంగా పడుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కొంచెం జాగ్రత్త ఇప్పుడున్న పరిస్థితుల్లో.. వైరస్ సోకుండా జాగ్రత్తలు పాటించడం కష్టమేమీ కాదు. వయసు పైబడిన వాళ్లు, దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవాళ్లు, పిల్లలు, మరీ ముఖ్యంగా రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నవాళ్లు మాస్క్‌లు ధరించడం మంచిదని సూచిస్తున్నారు. ‘‘మనమంతా సమష్టిగా పనిచేయాల్సిన సమయమిది. మళ్లీ కొవిడ్ వ్యాప్తిపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కానీ, అప్రమత్తంగా ఉండాలి. ఆసుపత్రుల సంసిద్ధత, వైరస్ వ్యాప్తిని నిరోధించడం, ప్రజలకు అవగాహన కల్పించడంపై మనం సిద్ధంగా ఉండాలి. ఆసుపత్రుల్లో ప్రతి మూడు నెలలకోసారి మాక్ డ్రిల్ నిర్వహించాలి. ఆరోగ్యపరమైన అంశాలను రాజకీయం చేయొద్దు. రాష్ట్రాలకు కేంద్రం పూర్తిగా సహకరిస్తుంది’’.. తాజా సమీక్షలో రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య శాఖ చేసిన సూచన ఇది. -
కొత్త రూపంలో కోవిడ్-19.. భారత్‌కూ తప్పని ముప్పు?
కరోనా వైరస్ ఇప్పుడు కొత్త రూపాలను తీసుకుంటోంది. ఒమిక్రాన్ వేరియంట్ ఉత్పరివర్తనమై బీఏ.2.86 లేదా పిరోలా రూపంలో బ్రిటన్‌లో వేగంగా వ్యాప్తి చెందుతోంది. దీని ప్రభావం భారతదేశంలో కూడా ఉండనుందని వైద్య నిపుణులు చెబుతున్నారు. యూకేలో వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్‌తో తీవ్ర ప్రమాదం లేనప్పటికీ, ఈ వ్యాధి లక్షణాలతో జనం పలు ఇబ్బందులు పడుతున్నారని వైద్యులు చెబుతున్నారు. రుచి లేదా వాసన కోల్పోవడం కోవిడ్-19 ప్రధాన లక్షణం అయితే, పిరోలా లేదా బీఏ.2.86 లక్షణాలు అతిసారం, అలసట, నొప్పి, అధిక జ్వరం, ముక్కు కారటం, గొంతు నొప్పి. పిరోలా సోకినప్పుడు ముందుగా దాని ప్రభావం ముఖంపైనే కనిపిస్తుందని వైద్యులు చెబుతున్నారు. కళ్లలో మంట, చర్మంపై దద్దుర్లు కనిపిస్తాయని, ఈ వ్యాధి శ్వాసకోశ వ్యవస్థను ప్రభావితం చేస్తుందని అంటున్నారు. యూకే హెల్త్ సెక్యూరిటీ ఏజెన్సీ (యూకేహెచ్ఎస్ఏ) తెలిపిన వివరాల ప్రకారం ఈ కొత్త వైరస్‌కు సంబంధించిన కేసులు వేగంగా పెరుగుతున్నాయి. కాగా ఈ వ్యాధిని ఎదుర్కొనేందుకు టీకాల ప్రచారాన్ని యూకేహెచ్ఎస్ఏ ముమ్మరం చేసింది. వృద్ధులు, పిల్లలు, బలహీనమైన రోగనిరోధక శక్తి కలిగినవారిపై ప్రత్యేక దృష్టి పెట్టింది. కరోనా టీకా బూస్టర్ డోసు తీసుకోని వారు వెంటనే ఈ డోస్ తీసుకోవాలని వైద్యాధికారులు ప్రజలకు సూచించారు. ఈ వైరస్ బారిన పడకుండా ఉండేందుకు రద్దీ ప్రదేశాలకు దూరంగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. ఇంటిలో ఉండేటప్పుడు కూడా మాస్క్ ధరించడం ఉత్తమం అని చెబుతున్నారు. కాగా బీఏ.2.86 కేసులు తొలిసారి గత జూలైలో కనిపించాయి. ఇది కూడా చూడండి: ఉత్తరాదిన పొగమంచు.. దక్షిణాదిన భారీ వర్షాలు! -
COVID-19: ప్రతి 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్
వాషింగ్టన్: ఒమిక్రాన్ వేరియెంట్ తర్వాత కరోనా బాధితుల్లోని ప్రతీ 10 మందిలో ఒకరికి లాంగ్ కోవిడ్ బయటపడుతోందని అమెరికా అధ్యయనంలో వెల్లడైంది. కోవిడ్ సోకిన ప్రతీ పది మందిలో ఒకరు ఇప్పటికీ అనునిత్యం ఏదో ఒక అనారోగ్య సమస్యతో బాధపడుతున్నట్టుగా నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ హెల్త్ అధ్యయనం నివేదిక తెలిపింది. చిన్న పనికే అలిసిపోవడం, మెదడుపై ప్రభావం, తల తిరగడం, గ్యాస్ట్రిక్ సమస్యలు, గుండె దడ, సెక్స్‌పై అనాసక్తత, తరచూ దాహం వేయడం, రుచి, వాసన కోల్పోవడం, విపరీతమైన దగ్గు, ఛాతీలో నొప్పి వంటివన్నీ లాంగ్ కోవిడ్ ఉన్నవారిలో కనిపిస్తున్నాయని ఆ నివేదిక వివరించింది. -
దేశంలో మళ్లీ పెరుగుతోన్న కరోనా కేసులు
-
Corona Alert: ఒక్కసారిగా పెరిగిన కేసులు.. 230 రోజుల తర్వాత ఈ స్థాయిలో
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్య 10 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 10,158 మంది వైరస్ బారిన పడ్డారు. కిందటి రోజుతో పోలిస్తే 30శాతం అధికంగా నమోదయ్యాయి. గత గత ఏడు నెలల్లో(230 రోజులు) ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,42,10,127కు చేరింది. ప్రస్తుతం 44,998 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివ్ రేటు 4.42శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.71శాతం.. మరణాల రేటు 1.19%గా ఉంది. భారత్‌లో సగటున గత వారంలో రోజుకు 5,555 కోవిడ్ కేసులు నమోదవ్వగా అంతకు ముందు వారం 3,108 వెలుగు చూశాయి. అయితే కరోనా వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఎండమిక్ దశలోకి ప్రవేశిస్తోందని వైద్య నిపుణులు వెల్లడించారు. వచ్చే 10 నుండి 12 రోజుల్లో కొత్త కేసులు పెరుగుతాయని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కేసులు తగ్గుతాయని తెలిపారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రిలో చేరికలు మాత్రం తక్కువగా ఉన్నాయని రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. అయితే కొత్త కేసులపై ఆందోళన అవసరం లేదని అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటే చాలని.. దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. చదవండి: గుడ్‌న్యూస్..మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి -
IND: ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కలకలం.. పిల్లల్లో కొత్త లక్షణాలు!
ఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ మళ్లీ టెన్షన్ పెడుతోంది. దేశవ్యాప్తంగా మళ్లీ పాజిటివ్ కేసులు క్రమంగా పెరుగుతున్నాయి. ఊహించని విధంగా పాజిటివ్ కేసుల సంఖ్య 6వేలు దాటడం ఆందోళనకు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో కరోనా కట్టడిపై కేంద్ర ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇదిలా ఉండగా.. దేశంలో కోవిడ్ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB.1.16 వేగంగా వ్యాప్తిచెందుతోంది. దీని ఫలితంగానే దేశంలో పాజిటివ్ కేసులు పెరుగుతున్నాయని వైద్యులు తెలిపారు. ఈ నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరిస్తున్నారు. ఇక, ఈ వేరియంట్‌పై పరిశోధనలు కూడా చేస్తున్నట్టు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. మరోవైపు.. ఈ వేరియంట్ చిన్న పిల్లలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. ఈ వేరియంట్ సోకిన పిల్లల్లో కొత్త లక్షణాలు కనిపిస్తున్నాయి. తాజాగా కోవిడ్ బారిన పడుతున్న పిల్లల్లో కళ్లు దురదగా ఉండటం, పుసులు కట్టడం వంటి లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నట్టు వైద్యులు వెల్లడించారు. గతంలో కరోనా బారిపడినవారిలో ఇలాంటి లక్షణాలు లేవని తెలిపారు. ఈ కొత్త లక్షణాలతో పాటుగానే గతంలో మాదిరిగానే కోవిడ్ బాధితులకు హైఫీవర్, జలుబు, దగ్గు, గొంతునొప్పి, ఒళ్లునొప్పులు, తలనొప్పి వంటి లక్షణాలు కనిపిస్తున్నాయి. XBB.1.16 #Arcturus For the last 2 days, have started getting pediatric Covid cases once again after a gap of 6 mo! An infantile phenotype seems emerging—treated infants w/ high fever, cold & cough, & non-purulent, itchy conjunctivitis w/ sticky eyes, not seen in earlier waves pic.twitter.com/UTVgrCCLWU — Vipin M. Vashishtha (@vipintukur) April 6, 2023 -
25 దేశాల్లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ .. డబ్ల్యూహెచ్ఓ అలర్ట్..
న్యూఢిల్లీ: కరోనా ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 కేసులు పెరుగుతున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ హెచ్చరించింది. ఈ వేరియంట్ ఇప్పటికే 25 దేశాలకుపైగా విస్తరించిందని పేర్కొంది. ప్రపంచవ్యాప్తంగా పరిస్థితిని తాము నిశితంగా పరిశీలిస్తున్నామని, దీని ముప్పు గురించి తెలుసుకొని పూర్తి వివరాలు వెల్లడిస్తామని చెప్పింది. ఎక్స్‌బీబీ.1.5 వేరియంట్ ప్రపంచానికి కొత్త ముప్పుగా పరిణమించింది. అత్యంత ప్రమాదకరమైన ఈ వేరియంట్ శరవేగంగా విస్తరిస్తోంది. అమెరికాలో గత ఏడాది డిసెంబర్లో ఈ వేరియంట్ వల్లే అత్యధిక కేసులు వెలుగుచూశాయి. ఇప్పుడు ప్రపంచంలోని ఇతర దేశాల్లోనూ ఈ కేసులు నమోదవుతున్నాయి. భారత్ బేఫికర్.. మరోవైపు భారత్‌లో మాత్రం కరోనా వేరియంట్ల ప్రభావం కన్పించండం లేదు. గత 24 గంటల్లో కొత్తగా 214 కేసులు మాత్రమే నమోదయ్యాయి. కరోనా పాజిటివిటీ రేటు 0.01గా ఉంది. ప్రస్తుతం 2,509 యాక్టివ్ కేసులున్నాయి. రికవరీ రేటు 98.8శాతంగా ఉంది. చదవండి: చైనాలో దయనీయ పరిస్థితులు.. బెడ్స్ లేక నేలపైనే రోగులకు చికిత్స -
కోవిడ్ కలకలం.. భారత్‌కు వచ్చిన ప్రయాణికుల్లో 11 వేరియంట్లు
న్యూఢిల్లీ: కరోనా మహమ్మారి పీడ ముగిసిపోయిందనుకునేలోపే మరోసారి పంజా విసురుతోంది. చైనాతోపాటు వివిధ దేశాల్లో మళ్లీ కోవిడ్ కేసులు ప్రబలుతున్నాయి. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ల భయం మొదలవ్వడంతో భారత్‌తో సహా అన్నీ దేశాలు అప్రమత్తమయ్యాయి. అంతర్జాతీయ ప్రయాణికులకు కరోనా పరీక్షలు తప్పనిసరి చేశాయి. దేశంలో కూడా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బి.ఎఫ్.7 కేసులు వెలుగుచూడటంతో విదేశాల నుంచి భారత్‌కు వచ్చే ప్రయాణికులకు కరోనా పరీక్షలు నిర్వహించాలని కేంద్ర ఆరోగ్య శాఖ ఆదేశించింది. రద్దీగా ఉండే ప్రదేశాలతో పాటు అన్ని విమానాశ్రయాల్లోనూ మాస్కులు ధరించాలని తెలిపింది. ఈ క్రమంలో విమానాశ్రయాలు, ఓడరేవుల వద్ద అంతర్జాతీయ ప్రయాణికులకు నిర్వహిస్తున్న కరోనా టెస్టుల్లో వివిధ రకాల వేరియట్ల కేసులు బయట పడుతున్నాయి. తాజాగా డిసెంబర్ 24 నుంచి జనవరి 3 మధ్య ప్రయాణికులకు చేసిన కరోనా టెస్టుల్లో 11 రకాల కరోనా వైరస్ వేరియంట్లు బయటపడినట్లు కేంద్ర ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. ఇవన్నీ ఒమిక్రాన్ సబ్ వేరియట్లేనని స్పష్టం చేశాయి. ఇందులో కొత్త వేరియంట్లేవీ లేవని.. ఇవన్నీ గతంలో దేశంలో నమోదైనవేనని పేర్కొన్నాయి. మొత్తం 19,227 మంది అంతర్జాతీయ ప్రయాణికులకు కొవిడ్ పరీక్షలు చేయగా.. 124 మందికి పాజిటివ్‌గా తెలినట్లు పేర్కొన్నాయి. ఈ 124 మందిలో 40 మంది నమూనాల జీనోమ్ సీక్వెన్స్ ఫలితాలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. ఇందులో 14 నమూనాల్లో.. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1 వేరియంట్ ఆనవాళ్లు.. ఒక శాంపిల్‌లో బీఎఫ్ 7.4.1 వేరియంట్ గుర్తించారు. కాగా కేంద్ర వైద్యారోగ్యశాఖ వెల్లడించిన వివరాల ప్రకారం గడిచిన 24 గంటల్లో 188 కొత్త కేసులు వెలుగు చూశాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 2,554గా ఉన్నాయి. రికవరీ రేటు 98.8 శాతంగా ఉంది. చదవండి: చైనాను వణికిస్తున్న కరోనా.. వీధుల్లోనే శవాలను కాల్చేస్తున్నారు.. -
కోవిడ్ అలర్ట్: బెంగాల్లో నలుగురికి చైనా వేరియంట్ బీఎఫ్7
కోల్‌కతా: చైనా, అమెరికా సహా పలు దేశాల్లో కరోనా కేసులు పెరిగేందుకు కారణమవుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7 విజృంభిస్తోంది. ఈ వేరియంట్ కేసులు ఇప్పటికే భారత్‌లోకి ఎంట్రీ ఇచ్చిన సంగతి తెలిసింది. తాజాగా పశ్చిమ బెంగాల్లో నలుగురికి ఈ బీఎఫ్.7 సోకినట్లు నిర్ధరణ అయింది. అమెరికా నుంచి ఇటీవలే భారత్‌కు వచ్చిన నలుగురి నమూనాలు జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించగా.. బీఎఫ్.7 వేరియంట్ సోకినట్లు తేలిందని అధికారులు వెల్లడించారు. ప్రస్తుతం బాధితుల ఆరోగ్యం నిలకడగానే ఉందని తెలిపారు. కోవిడ్ కొత్త వేరియంట్ బీఎఫ్7 సోకిన వారిలో ముగ్గురు నదియా జిల్లాలోని ఒకే కుటుంబానికి చెందిన వారిగా గుర్తించారు. మరో వ్యక్తి బిహార్ నుంచి వచ్చి కోల్‌కతాలో నివాసం ఉంటున్నాడు. ఈ నలుగురితో సన్నిహితంగా మెలిగిన 33 మందిని గుర్తించి పరీక్షలు నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. వారందరినీ నిశితంగా పరిశీలిస్తున్నామని, ప్రస్తుతం వారి ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉందని వెల్లడించారు. గత ఏడాది డిసెంబర్ నుంచి విదేశాల నుంచి కోల్‌కతా విమానాశ్రయానికి వచ్చిన వారికి కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్‌గా తేలిన వారి నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంపించి పరీక్షిస్తున్నారు. గత వార కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో ఓ విదేశీయుడితో పాటు ఇద్దరికి కోవిడ్ పాజిటివ్‌గా తేలింది. జీనోమ్స్ సీక్వెన్సింగ్‌లో వారికి బీఎఫ్.7 సోకినట్లు తేలింది. ఇదీ చదవండి: Fact Check: భారత్‌లో కోవిడ్ భయాలు.. స్కూళ్లు, కాలేజీలకు కరోనా సెలవులు! నిజమెంత? -
షాకింగ్.. చైనాలోని ఆ నగరంలో 70% మందికి కరోనా!
కరోనా పుట్టినిల్లుగా భావించే చైనాలో మహమ్మారి విలయతాండం చేస్తోంది. డిసెంబర్లో జీరో కోవిడ్ పాలసీని ఎత్తేవేసినప్పటి నుంచి దేశ వ్యాప్తంగా భారీగా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. కరోనా కేసులతోపాటు మరణాలు కూడా భారీ స్థాయిలో సంభవిస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి తోడు కరోనా లెక్కలు బయటకు చెప్పకపోవడంతో డ్రాగన్ దేశంలో పరిస్థితి ఊహలకు అందకుండా మారింది. లండన్‌కు చెందిన ఎనలిటిక్స్ సంస్థ ఎయిర్ఫినిటీ నివేదిక ప్రకారం డిసెంబర్ మొదటి 20 రోజుల్లో చైనాలో 250 మిలియన్లకు పైగా ప్రజలు ఈ వైరస్ బారిన పడ్డారు. తాజాగా చైనాలోని షాంఘై నగరంలోని జనాభాలో దాదాపు 70 శాతం మందికి పైగా ఇప్పటికే కోవిడ్ సోకి ఉంటుందని సీనియర్ వైద్యులు పేర్కొన్నారు. షాంఘైలోని హాస్పిటళ్లు కోవిడ్ రోగులతో నిండిపోతున్నాయని తెలిపారు. రుయిజిన్ హాస్పిటల్ వైస్ ప్రెసిడెంట్, షాంఘై కోవిడ్ అడ్వైజరీ ప్యానెల్ నిపుణుడు చెన్ ఎర్జన్ దీనిపై మాట్లాడుతూ.. షాంఘైలో ఉన్న 2.5 కోట్ల మంది ప్రజల్లో.. చాలా మందికి వైరస్ సోకి ఉంటుందన్నారు. ఈ నగరంలో ప్రస్తుతం వైరస్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని, జనాభాలో 70 శాతం మందికి కోవిడ్ సోకి ఉంటుందని తెలిపారు. గత ఏప్రిల్, మే నెలలతో పోలిస్తే అది 20 నుంచి 30 శాతం అధికంగా ఉంటుందన్నారు. రుయిజిన్ హాస్పిటల్లో ప్రతి రోజు 1600 ఎమర్జెన్సీ అడ్మిషన్లు జరుగుతున్నాయని, అందులో 80 శాతం కోవిడ్ కేసులేనని పేర్కొన్నారు.చెప్రతి రోజు హాస్పిటల్‌కు వంద అంబులెన్సులు వస్తున్నట్లు చెన్ ఎర్జన్ తెలిపారు. 65 ఏళ్లు దాటిన వారంతా ఎమర్జెన్సీ విభాగంలో జాయిన్ అవుతున్నట్లు చెప్పారు. కాగా బీజింగ్, తియాంజిన్, చాంగ్కింగ్, గాంగ్జూ లాంటి నగరాల్లో ఇప్పటికే కోవిడ్ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయని అక్కడి అధికారులు వెల్లడించారు. అంతేగాక ఈ ఏడాది ఆరంభంలో కరోనా ఇన్ఫెక్షన్లు అధికంగా ఉంటాయని నిపుణులు చెబుతున్నారు. మరోవైపు చైనాలో కోవిడ్ విజృంభిస్తున్న నేపథ్యంలో భారత్‌తోపాటు అమెరికా, దక్షిణ కొరియా, ఇటలీ, యూకే, ఫ్రాన్స్, జపాన్ తైవాన్ వంటి పలు దేశాలు చైనా నుంచి వచ్చే ప్రయాణికులకు తప్పనిసరి కోవిడ్ పరీక్షలను విధించాయి.అయితే చైనా ప్రయాణికులపై ఇతర దేశాలు విధించిన ఆంక్షలను బీజింగ్ తీవ్రంగా స్పందించింది. దీనికి ప్రతీకార చర్యలు తీసుకుంటామని హెచ్చరించింది. చదవండి: చైనా.. ఇప్పటికైనా కరోనా అసలు లెక్కలు చెప్పు..! -
కరోనా XBB వేరియంట్ గుప్పిట్లో భారత్.. ముప్పు తప్పదా?
న్యూఢిల్లీ: కోవిడ్-19 సబ్ వేరియంట్ ఒమిక్రాన్‌తో ఇప్పటికే భారత్‌లో థర్డ్ వేవ్ అల్లకల్లోలం చేసింది. ఇప్పుడు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ XBB వేరియంట్ ఆందోళన కలిగిస్తోంది. చైనాలో ఈ వేరియంట్ ప్రమాదకరంగా మారుతుండడం అందుకు బలం చేకూర్చుతోంది. ఈ క్రమంలోనే కేంద్ర పరిశోధన సంస్థ, సార్స్ కోవ్-2 జీనోమ్ సీక్వెన్సింగ్ కన్సార్టియ్ ఇన్సకాగ్(ఐఎన్ఎస్ఏసీఓజీ) ఈ కొత్త వేరియంట్‌పై ఆందోళన వ్యక్తం చేసింది. దేశవ్యాప్తంగా ఎక్స్‌బీబీ వేగంగా విస్తరిస్తోందని సోమవారం ఓ బులిటెన్ విడుదల చేసింది. ఎక్స్‌బీబీతో పాటు బీఏ.2.75, బీఏ.2.10 సైతం దేశవ్యాప్తంగా విస్తరిస్తున్నా వాటి ప్రభావం అంతంత మాత్రంగానే ఉన్నట్లు తెలిపింది. ‘ముఖ్యంగా ఈశాన్య భారతంలో బీఏ 2.75 ప్రభావం ఎక్కువగా ఉంది. అయితే, వ్యాధి వ్యాప్తి, ఆసుపత్రుల్లో చేరుతున్న సంఘటనల్లో ఎలాంటి పెరుగుదల లేకపోవటం ఊరట కలిగిస్తోంది. ఒమిక్రాన్, దాని ఉప రకాలు భారత్‌లో వేగంగా విస్తరిస్తున్నాయి. XBB అనేది భారత దేశం అంతటా ప్రస్తుతం ప్రభావం చూపుతున్న అత్యంత ప్రబలమైన వేరియంట్. నమోదవుతున్న కేసుల్లో 63.2 శాతం ఎక్స్‌బీబీ వేరియంట్‌వే. బీఏ.2.75 కేసులు 46.5 శాతం, ఎక్స్‌బీబీ దాని ఉపరకాలు 35.8 శాతం ఉన్నాయి. ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ.1ల వ్యాప్తిపై ఇన్సకాగ్ నిశితంగా పరిశీలిస్తోంది.’ అని బులిటెన్‌లో పేర్కొంది ఇన్సకాగ్. ఇదీ చదవండి: ఆధునిక భారతదేశ చరిత్రపై విస్తృత పరిశోధనలు చేయాలి -
పంజా విసురుతోన్న కోవిడ్ ‘సూపర్ వేరియంట్’.. అంత ప్రమాదకరమా?
వాషింగ్టన్: అమెరికాలో మళ్లీ కోవిడ్ మహమ్మారి విజృంభిస్తోంది. అత్యంత వేగంగా వ్యాప్తి చెందే ఒమిక్రాన్ బీఏ.2 సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5(సూపర్ వేరియంట్) ప్రస్తుతం కల్లోలం సృష్టిస్తోంది. ప్రస్తుతం అగ్రరాజ్యంలో నమోదవుతున్న కేసుల్లో 40 శాతం కేసులు ఈ సూపర్ వేరియంట్ కారణమవుతున్నట్లు సీడీసీ నివేదిక వెల్లడించింది. ఈ క్రమంలో చైనాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ బీఎఫ్7తో పాటు ఎక్స్‌బీబీ.1.5 సూపర్ వేరియంట్‌పై ప్రజారోగ్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ప్రపంచం ఎదుర్కొంటున్న దుర్భర పరిస్థితికి ప్రధాన కారణం ఎక్స్‌బీబీ వేరియంట్‌గా పేర్కొన్నారు మిన్నేసోటా వర్సిటీ నిపుణులు డాక్టర్ మిచెల్ ఓస్టెర్హోమ్. అమెరికాలో తీవ్రత ఎక్కువగా ఉన్న 10 రాష్ట్రాలోని 7 రాష్ట్రాల్లో ఎక్స్‌బీబీ కేసులే అత్యధికంగా ఉన్నట్లు పేర్కొన్నారు. డిసెంబర్ 31 నాటికి అమెరికాలో నమోదైన కేసుల్లో బీఏ.2, ఎక్స్‌బీబీ, ఎక్స్‌బీబీ1.5ల కారణంగా 44.1 శాతం కేసులు నమోదయ్యాయి. తొలికేసు భారత్‌లోనే.. ఎక్స్‌బీబీ వేరియంట్‌ను తొలుత భారత్‌లోనే ఈ ఏడాది ఆగస్టులో గుర్తించారు. కొద్ది రోజుల్లోనే భారత్‌తో పాటు సింగపూర్‌లో ఈ వేరియంట్ వేగంగా విస్తరించింది. ఇది ఎక్స్‌బీబీ.1, ఎక్స్‌బీబీ1.5 వేరియంట్లుగా రూపాంతరం చెందింది. ఇతర వేరియంట్లతో పోలిస్తే దీని లక్షణాలు వేరుగా ఉన్నాయని, దీంతో వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు జాన్ హోప్కిన్స్ వర్సిటీ నిపుణులు తెలిపారు. ఎక్స్‌బీబీ.1.5 వేగంగా వ్యాప్తి చెందడానికి గల కారణాలేంటి? ఎక్స్‌బీబీ1తో పోలిస్తే ఎక్స్‌బీబీ1.5 శరీరంలోని యాంటీబాడీలను తప్పించుకోవటమే కాదు, రోగనిరోధక శక్తిని దాటుకుని కణాల్లోకి ప్రవేశిస్తోందని తెలిపారు పెకింగ్ యూనివర్సిటీ శాస్త్రవేత్తలు. అలాగే కీలక గ్రాహకాల ద్వారా కణాలను తన అధీనంలోకి తెచ్చుకుంటుని హెచ్చరించారు. ఎక్స్‌బీబీ ఉప రకాలు పుట్టుకస్తున్న కొలది ప్రస్తుత కోవిడ్ వ్యాక్సిన్ల సామర్థ్యం తగ్గిపోతుందని కొలంబియా యూనివర్సిటీ శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. దీంతో వేగంగా ఒకరి నుంచి ఒకరికి వ్యాప్తి చెందడంతో పాటు ఒకసారి సోకినవారికి సైతం మళ్లీ సులభంగా అంటుకుంటుందని వెల్లడించారు. ⚠️NEXT BIG ONE—CDC has royally screwed up—unreleased data shows #XBB15, a super variant, surged to 40% US (CDC unreported for weeks!) & now causing hospitalization surges in NY/NE.➡️XBB15–a new recombinant strain—is both more immune evasive & better at infecting than #BQ & XBB.🧵 pic.twitter.com/xP2ESdnouc — Eric Feigl-Ding (@DrEricDing) December 30, 2022 ఇదీ చదవండి: భారత్ జోడో యాత్ర బుల్లెట్ ప్రూఫ్ కారులో చేసేది కాదు: రాహుల్ -
షాకింగ్ రిపోర్ట్: కోవిడ్ కొత్త వేరియంట్ల తయారీ కేంద్రంగా చైనా!
బీజింగ్: చైనాలో కోవిడ్ మహమ్మారి వేగంగా వ్యాప్తి చెందుతూ లక్షల మందికి సోకుతోంది. కొద్ది రోజుల్లోనే దేశంలోనే 60 శాతం జనాభాకు ఈ వైరస్ సోకే ప్రమాదం ఉందనే నివేదికలు కలవర పెడుతున్నాయి. అందుకు ప్రధానంగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఎఫ్.7తో పాటు మరో మూడు వేరియంట్లు కారణమని గుర్తించారు. ఈ క్రమంలోనే ఓ షాకింగ్ న్యూస్ యావత్ ప్రపంచాన్ని ఆందోళనకు గురి చేస్తోంది. కోవిడ్-19 విజృంభణతో చైనా కొత్త వేరియంట్ల పుట్టుకకు బలమైన కేంద్రంగా మారబోతోందని ఆరోగ్య విభాగం నిపుణులు హెచ్చరిస్తున్నారు. ప్రజాగ్రహంతో జీరో కోవిడ్ పాలసీకి మంగళం పాడిన చైనా ప్రభుత్వం, జనవరి 8 నుంచి విదేశీ ప్రయాణికుల క్వారంటైన్ నిబంధనలనూ ఎత్తివేసింది. మరోవైపు.. రోజువారీ కోవిడ్ నివేదికలను వెల్లడించటాన్ని ఆపివేసింది చైనా జాతీయ ఆరోగ్య కమిషన్. కొద్ది రోజులుగా వేలాది మంది వైరస్ బారినపడినట్లు తెలుస్తోంది. వైద్య వ్యవస్థపై తీవ్ర ఒత్తిడి పెరుగుతోంది. వ్యాక్సినేషన్ సరిగా లేకపోవటం, రోగనిరోధక శక్తి తక్కువగా ఉండటం వల్ల చైనాలో.. ప్రపంచ జనాభాలోని ఐదోవంతు మందిలో ఈ వైరస్ వ్యాప్తి చెందే ప్రమాదం ఉంది. దీంతో కొత్త వేరియంట్లు అభివృద్ధి చెందేందుకు చైనా కేంద్ర బిందువుగా మారబోతోందని ఇతర దేశాల నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కొత్తవారిలోకి వైరస్ ప్రవేశించినప్పుడు అది మ్యూటేషన్ చెందేందుకు అవకాశం ఉంటుందని జెనీవా యూనివర్సిటీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ డైరెక్టర్ ఆంటోయిన్ ఫ్లాహాల్ట్ పేర్కొన్నారు. ‘ఒక్కసారిగా సుమారు 1.4 బిలియన్ ప్రజలు సార్స్ కోవ్2 బారినపడ్డారు. ఇది కచ్చితంగా కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే వాతావరణాన్ని కల్పిస్తుంది. కొద్ది నెలల్లోనే 500లకుపైగా ఒమిక్రాన్ కొత్త వేరియంట్లను గుర్తించాం. అయితే, అవి తొలుత ఎక్కడ మ్యుటేట్ అయ్యాయనే విషయాన్ని చెప్పడం చాలా కష్టం.’ అని పేర్కొన్నారు ఆంటోయిన్. మరోవైపు.. వైరస్‌కు వంశవృద్ధి కోసం చైనా బలమైన కేంద్రంగా మారనుందని ఫ్రాన్స్‌కు చెందిన వైరాలజీ ప్రొఫెసర్ బ్రూనో లీనా ఆందోళన వ్యక్తం చేశారు. ఇదీ చదవండి: Corona In China: చైనాలో కరోనా వ్యాప్తికి ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు కారణం! -
Corona Virus: చైనాలో ఒకటి కాదు.. నాలుగు వేరియంట్లు..!
న్యూఢిల్లీ: చైనాలో విజృంభిస్తున్న కరోనా కొత్త వేరియంట్ గురించి ప్రజలు భయాందోళన చెందాల్సిన అవసరం లేదని కేంద్ర కోవిడ్ ప్యానల్ చీఫ్ ఎన్ కే అరోరా వెల్లడించారు. చైనా నుంచి సరైన సమాచారం లేనందున.. ప్రజలు అప్రమత్తంగా ఉంటూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సూచించారు. చైనాలో కోవిడ్ వ్యాప్తికి ఒకటి కాదు నాలుగు వేరియంట్లు కారణమని పేర్కొన్నారు. డ్రాగన్ దేశంలో మహమ్మారి విలయానికి వైరస్ల కాక్టెయిల్ కారణమని స్పష్టంగా తెలుస్తోందన్నారు. ఈ మేరకు ఆయన మాట్లాడుతూ.. బీఎఫ్.7 వేరియంట్ కేసులు కేవలం 15 శాతం మాత్రమే నమోదవుతున్నాయని.. అత్యధికంగా 50 శాతం కేసులు బీఎన్, బీక్యూ వేరియంట్ ద్వారా వ్యాపిస్తున్నాయని తెలిపారు. అదేవిధంగా ఎస్వీవీ వేరియంట్ నుంచి మరో 15 శాతం కోవిడ్ కేసులు నమోదవుతున్నాయన్నారు. దీంతో రోగుల్లో భిన్నమైన లక్షణాలు కనిపిస్తున్నాయని వెల్లడించారు. కోవిడ్ మొదటి, రెండు, మూడో వేవ్‌ల నుంచి వ్యాక్సిన్లు, ఇన్ఫెక్షన్ల ద్వారా భారతీయులకు హైబ్రిడ్ ఇమ్యూనిటీ లభించిందని తెలిపారు. దీని కారణంగా జలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొన్నారు. అయితే చైనా వాళ్లకు ఈ వేరియంట్లు వారికి కొత్తవని అన్నారు. ఇంతకుముందు ఇన్ఫెక్షన్ బారిన పడలేదన్నారు. అంతేగాక అక్కడి వ్యాక్సిన్ల ప్రభావం తక్కువగా ఉండటం, వంటి కారణాల వల్ల చైనీయుల్లో ఎక్కువ మంది మూడు, నాలుగు డోసులు తీసుకున్నారని పేర్కొన్నారు. చదవండి: పసలేని చైనా టీకా.. ఏమాత్రమూ లొంగని కరోనా.. తమకొద్దంటున్న దేశాలు చైనాతో పోల్చుకుంటే భారత్ లో 97 శాతం మంది మాత్రమే రెండు డోసులు తీసుకున్నారని ఆరోరా తెలిపారు. మిగిలిన వారు ఒకటి కంటే ఎక్కువసార్లు కోవిడ్ బారిన పడ్డారని పేర్కొన్నారు. ఇక పిల్లల విషయానికొస్తే 12 ఏళ్ల లోపు చిన్నారులు 96 శాతం మంది ఒక్కసారి వైరస్ బారిన పడినట్లు చెప్పారు. వ్యాక్సినేషన్ జరుగుతున్న సమయంలో కూడా చాలా మందికి కోవిడ్ సోకిందని... వీటన్నింటిని చూస్తే మహమ్మారి నుంచి మనం చాలా సురక్షితంగా ఉన్నట్లు భావిస్తున్నామన్నారు. అయితే కేసుల విషయంలో చైనా నుంచి అస్పష్టమైన సమాచారం ఉన్నందుకున జాగ్రత్తగా ఉంటే మంచిదన్నారు. చదవండి: చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు -
చైనాను కుదిపేస్తున్న కరోనా.. రోజుకు ఏకంగా 10 లక్షల కేసులు
బీజింగ్: చైనాలో కరోనా నానాటికీ చుక్కలు చూపుతోంది. రోజూ లక్షలాది మంది దాని బారిన పడుతున్నారు. షాంఘై సమీపంలోని పారిశ్రామిక నగరం జిజెయాంగ్‌లో రోజుకు కనీసం 10 లక్షలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. కొద్ది రోజుల్లోనే ఇవి రోజుకు పాతిక లక్షలు దాటొచ్చని చెబుతున్నారు. దేశవ్యాప్తంగా ఆస్పత్రులకు రోగుల వెల్లువ నానాటికీ పెరుగుతోంది. మార్చురీల బయట శవాలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. చాలాచోట్ల కనీసం 10 రోజులకు పైగా వెయిటింగ్ పీరియడ్ నడుస్తోంది. ఒకవైపు కేసులు ఇలా కట్టలు తెంచుకుంటుంటే మరోవైపు వాటి కట్టడి ప్రయత్నాలను, నిబంధనలను పూర్తిగా గాలికొదిలేస్తూ చైనా ప్రభుత్వం హఠాత్తుగా కీలక నిర్ణయం తీసుకుంది. దేశ సరిహద్దులను పూర్తిగా తెరవాలని నిర్ణయించింది. అంతేగాక విదేశాల నుంచి వచ్చే ప్రయాణికులకు మూడేళ్లుగా అమలు చేస్తున్న క్వారంటైన్ నిబంధనను కూడా పూర్తిగా ఎత్తేయనుంది. ఇవన్నీ జనవరి 8 నుంచి అమల్లోకి వస్తాని ప్రకటించింది. ఇందుకు వీలుగా కరోనాను డెంగీ తదితర జ్వరాలతో సమానమైన బి కేటగిరీకి తగ్గిస్తూ జాతీయ ఆరోగ్య సంస్థ నిర్ణయం తీసుకుంది. రోజువారీ కరోనా కేసుల సంఖ్య వెల్లడిని కూడా ఆదివారం నుంచి చైనా ఆపేయడం తెలిసిందే. చదవండి: Bomb Cyclone: అమెరికాలో కొనసాగుతున్న మంచు విలయం -
మళ్లీ కరోనా ఆంక్షలు పెట్టిన కేంద్రం
మళ్లీ కరోనా ఆంక్షలు పెట్టిన కేంద్రం -
కోవిడ్ కేసుల ట్రాకింగ్ ఫస్ట్.. మాస్క్ మస్ట్
న్యూఢిల్లీ: చైనాలో కోవిడ్ విజృంభణకు కారణమైన కరోనా వైరస్ వేరియంట్ భారత్‌లోనూ ప్రబలే వీలుందన్న భయాల నడుమ ప్రధాని మోదీ ప్రజలకు సూచనలు చేశారు. ‘కోవిడ్ ఇంకా అంతం కాలేదు. జనసమ్మర్థ ప్రాంతాల్లో మాస్క్‌లు కచ్చితంగా ధరించండి. పండుగలు, నూతన సంవత్సర వేడుకలు సమీపిస్తున్న నేపథ్యంలో అందరూ అప్రమత్తంగా ఉండండి’ అని ప్రజలకు జాగ్రత్తలు చెప్పారు. దేశంలో కోవిడ్ పరిస్థితి, భారత ఆరోగ్య వ్యవస్థ సన్నద్ధత తదితర అంశాలపై ప్రధాని మోదీ గురువారం ఢిల్లీలో అత్యున్నత స్థాయి సమీక్ష సమావేశం నిర్వహించారు. జీనోమ్ సీక్వెన్సింగ్ పెంచండి ‘కోవిడ్ పరిస్థితి సంక్షిష్టంగా మారకుండా అడ్డుకోండి. కోవిడ్ నియమాలు కచ్చితంగా అమలయ్యేలా చూడండి. కొత్త కేసుల ట్రాకింగ్‌పై దృష్టిపెట్టండి. అంతర్జాతీయ విమానాశ్రయాల్లో ‘నిఘా’ పెంచండి’ అని ఉన్నతాధికారులకు సూచించారు. ఔషధాలు, వ్యాక్సిన్లు, ఆస్పత్రుల్లో పడకల అందుబాటుపై అధికారులను ఆరాతీశారు. ‘ ప్రజలంతా జనసమ్మర్ద ప్రాంతాల్లో మాస్క్ ధరించేలా చర్యలు తీసుకోండి. ప్రికాషన్ డోస్ అందరికీ అందేలా చూడండి. సులభంగా వైరస్ ప్రభావానికి లోనయ్యే వారికి, వృద్ధులకు ప్రికాషన్ డోస్ అందుబాటులో ఉంచండి. టెస్టింగ్ సంఖ్యను పెంచండి. జన్య క్రమ విశ్లేషణలను అధికం చేయండి. వ్యాక్సినేషన్‌పై అవగాహనను మరింతగా పెంపొందించండి’ అని అధికారులకు మోదీ సూచించారు. ‘అనుమానిత రోగుల శాంపిళ్లను రోజువారీగా ఇన్సాకాగ్ వారి జీనోమ్ సీక్వెన్సింగ్ ల్యాబ్‌లకు పంపాలని రాష్ట్రాలకు సూచించాం’ అని ఆ తర్వాత ప్రధాని కార్యాలయం ఒక ప్రకటనలో పేర్కొంది. రోజువారీ సగటు కేవలం 153 కేసులే ‘జీనోమ్’ ద్వారా కొత్త వేరియంట్ కేసులను త్వరగా కనిపెట్టి అప్రమత్తమయ్యే అవకాశాలు మెరుగుపడతాయి. కోవిడ్ చికిత్స ఉపకరణాలు, సౌకర్యాలు, మానవ వనరుల అందుబాటు విషయంలో మరింత జాగురూకత అవసరం’ అని మోదీ అన్నారు. ఈ సందర్భంగా ప్రపంచదేశాల్లో కోవిడ్ తాజా పరిస్థితిపై కేంద్ర ఆరోగ్యశాఖ కార్యదర్శి, నీతి ఆయోగ్(ఆరోగ్యం) సభ్యుడు ఒక సమగ్ర ప్రజెంటేషన్ చూపించారు. ‘భారత్‌లో పరిస్థితి అదుపులో ఉంది. రోజువారీ సగటు కేసుల సంఖ్య కేవలం 153కు, డిసెంబర్22తో ముగిసిన వారంలో వారపు పాజిటివిటీ రేటు 0.14 శాతానికి దిగొచ్చిందని అధికారులు వివరించారు. అయితే, ప్రపంచవ్యాప్తంగా చూస్తే గత ఆరు వారాలుగా సగటున రోజుకు 5.9 లక్షల కేసులు నమోదవుతుండటం గమనార్హం. ఈ భేటీలో కేంద్ర ఆరోగ్యశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ, కేంద్ర హోం మంత్రి అమిత్ షా, విమానయాన మంత్రి జ్యోతిరాదిత్య సింథియా, విదేశాంగ మంత్రి జైశంకర్, సమాచార ప్రసార శాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్, నీతి ఆయోగ్ సీఈవో అయ్యర్, నీతి ఆయోగ్(ఆరోగ్యం) సభ్యుడు వీకే పాల్, కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. ఢిల్లీ, ఉత్తరప్రదేశ్‌సహా పలు రాష్ట్ర ప్రభుత్వాలు సైతం తమ రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై గురువారమే సమీక్షా సమావేశాలు నిర్వహించాయి. -
XBB వేరియంట్ వెరీ డేంజర్.. కేంద్రం స్పందన ఇదే..
కరోనా వైరస్ వేరియంట్లు ప్రపంచ దేశాలను మరోసారి భయాందోళనలకు గురిచేస్తున్నాయి. కొత్త వేరియంట్ల కారణంగా ఇప్పటికే చైనాతో పాటుగా మరికొన్ని దేశాల్లో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతోంది. దీంతో, అక్కడ ప్రభుత్వాలు వైరస్ కట్టడికి పూర్తి స్థాయిలో ప్రణాళికలు చేస్తున్నాయి. కాగా, వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇటు భారత ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇదిలా ఉండగా.. కోవిడ్ ఒమిక్రాన్ వేరియంట్‌పై సోషల్ మీడియాలో ఓ వార్త చక్కర్తు కొడుతోంది. కోవిడ్ ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్ వ్యాప్తి ప్రారంభమయిందని.. అలాగే ఈ వేరియంట్ ప్రాణాంతకమైనదంటూ వాట్సాప్ గ్రూప్‌లో ఓ వార్త వైరల్‌గా మారింది. దీంతో, పాటుగా ఎక్స్‌బీబీ వేరియంట్‌ను గుర్తించడం చాలా కష్టమని అందులో ఉంది. దీని వల్ల మరణాల రేటు ఎక్కువగా ఉంటుందని.. ఇది గతంలో వచ్చిన డెల్టా వేరియంట్ కన్నా ఐదు రెట్లు ప్రమాదకరమైనదని.. కాబట్టి మరింత జాగ్రత్త అవసరం అంటూ వార్తలో రాసి ఉంది. కాగా, వార్తపై నెటిజన్లు భయాందోళనలకు గురవుతున్నారు. ఇక, ఈ వార్తపై కేంద్ర ఆరోగ్యశాఖ క్లారిటీ ఇచ్చింది. ఇది ఫేక్ వార్త అంటూ కేంద్ర ఆరోగ్యశాఖ కొట్టిపారేసింది. ట్విట్టర్ వేదికగా దీనిపై స్పందించింది. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియంట్‌పై సోషల్ మీడియాలో ఫేక్ వార్త ప్రచారంలో ఉంది. ఈ వార్తలను ప్రజలు నమ్మకండి అంటూ క్లారిటీ ఇచ్చింది. ప్రజల్లో భయాందోళనలు సృష్టించేందుకు సోషల్ మీడియాలో తప్పుడు వార్తలను ప్రచారం చేస్తున్నారని సీరియస్ కామెంట్స్ చేసింది. కరోనా వ్యాప్తి నేపథ్యంలో కేంద్రం అప్రమత్తంగా ఉన్నట్టు స్పష్టం చేసింది. ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని పేర్కొంది. మరోవైపు.. ఎక్స్‌బీబీ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ కూడా స్పందించింది. ఎక్స్‌బీబీ వేరియంట్ వల్ల సోకే వ్యాధి తీవ్రత తక్కువగా ఉంటుందని క్లారిటీ ఇచ్చింది. #FakeNews This message is circulating in some Whatsapp groups regarding XBB variant of #COVID19. The message is #FAKE and #MISLEADING. pic.twitter.com/LAgnaZjCCi — Ministry of Health (@MoHFW_INDIA) December 22, 2022 -
భారత్‌లో కరోనా కలకలం.. ప్రధాని మోదీ ఉన్నత స్థాయి సమీక్ష
న్యూఢిల్లీ: చైనాతోపాటు ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ మరోసారి దడ పట్టిస్తోంది. కోవిడ్ పుట్టినిల్లుగా భావించే చైనాలో ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్ ప్రస్తుతం వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఇన్నాళ్లు జీరో కోవిడ్ పేరుతో అతి జాగ్రత్తలు తీసుకున్న చైనా ఒక్కసారిగా అన్ని ఆంక్షలు ఎత్తేయడంతో అక్కడ పరిస్థితి అతలాకుతలమైంది. కేసులు మరణాలు ఒక్కసారిగా పెరిగిపోయాయి. రాబోయే కాలంలో పాజిటివ్ కేసుల సంఖ్య అనూహ్యంగా పెరగనున్నట్లు వార్తలు వెలువడుతుండడంతో అన్నీ దేశాల్లో ఆందోళన మొదలైంది. చైనా తప్పిదాలతో కరోనా మళ్ళీ దేశదేశాల్లో కోరలు చాచే ప్రమాదం కనిపిస్తోంది. తాజాగా భారత్‌లోని కోవిడ్ పరిస్థితులపై ప్రధాన మంత్రి నరేంద్రమోదీ గురువారం ఉన్నతస్థాయి సమీక్ష చేపట్టనున్నారు. చైనాలో వెలుగు చూసిన ఒమిక్రాన్ సబ్ వేరయంట్ బీఎఫ్.7 భారత్‌లో ఇప్పటికే నాలుగు నమోదయ్యాయి. గుజరాత్లో రెండు, ఒడిశాలో రెండు కేసులు వెలుగు చూసిన నేపథ్యంలో మోదీ వీటిపై చర్చించనున్నారు. వైరస్వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్త చర్యలపై అధికారులతో సమీక్షించనున్నారు. గుజరాత్లో బీఎఫ్.7 సోకిన ఇద్దరు పేషేంట్లు హోం ఐసోలేషన్ చికిత్స పొంది ఇప్పుడు పూర్తిగా కోలుకున్నారని రాష్ట్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా ప్రస్తుతం భారత్‌లో 10 రకాల కోవిడ్ వేరియంట్లు ఉండగా తాజాగా బీఎఫ్7 నమోదైంది. చదవండి: Covid-19: దేశంలోని అన్ని ఎయిర్‌పోర్టుల్లో కరోనా పరీక్షలు.. మరోవైపు ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఎఫ్.7 ఇప్పటికే భారత్‌లోనూ బయటపడటంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. భారత్‌లోని అన్ని విమానాశ్రయాల్లో కోవిడ్ టెస్ట్‌లు నిర్వహించడం ప్రారంభించారు. దేశంలో మహమ్మారి వ్యాప్తిపై కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ బుధవారం సమీక్ష సమావేశం నిర్వహించారు. . కరోనా ముప్పు ఇంకా ముగిసిపోలేదని, ప్రజలంతా తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. అయితే విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో తగిన జాగ్రత్తలు పాటిస్తే భారత్‌కు అంత ముప్పేమి ఉండదని నిపుణలు చెబుతున్నారు. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఈ వేరియెంట్లో ఎక్కువగా కనిపిస్తాయని.. మాసు్కలు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటే భయపడాల్సిన అవసరం లేదని సూచిస్తన్నారు. ఈ సబ్ వేరియంట్ కేసులు అమెరికాలోని మొత్తం కేసుల్లో 5%, యూకేలో 7.26% ఉన్నాయి. అక్కడ మరీ అధికంగా కేసులు నమోదు కావడం లేదు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అంతగా లేదు. అందుకే భారత్‌లోనూ ఇది ప్రభావం చూపించదనే అంచనాలు ఉన్నాయి. -
చైనాతో ఇండియాను పోల్చొద్దు.. కరోనాపై భయాలు వద్దు
సాక్షి, హైదరాబాద్: మన దేశంలో కోవిడ్ ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, ప్రస్తుతం వ్యాప్తిలో ఉన్నవన్ని ఒమిక్రాన్ సబ్ వేరియంట్లేనని, భయపడాల్సిన అవసరం లేదని కోవిడ్ నోడల్ సెంటర్ సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. బుధవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతు ఇండియాకు చైనాకు చాలా వ్యత్యాసం ఉందన్నారు. చైనా అజాగ్రత్తగా వ్యవహించిందని, అక్కడి ప్రజలందరికీ వ్యాక్సినేషన్ జరగలేదని, హెర్డ్ ఇమ్యూనిటీ రాకపోవడంతో మరోమారు విజృంభిస్తున్నట్లు నిపుణుల పరిశీలన లో తేలిందన్నారు. ఇండియాను చైనాతో పోల్చవద్దన్నారు. ఇండియాలో ముఖ్యంగా తెలంగాణలో వ్యా క్సినేషన్ వందశాతం పూర్తయిందన్నారు. ఒమిక్రాన్ సబ్వేరియంట్లే వ్యాప్తిలో ఉన్నాయని, కరోనా వైరస్ రూపాంతరం చెంది కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయన్నారు. ► చిన్నారులు, వృద్ధులు, గర్భిణిలు, బాలింతలు, దీర్ఘకాల రుగ్మతలతో బాధపడేవారు కోవిడ్ తర్వాత వచ్చే బ్లాక్‌ఫంగస్ వంటి రుగ్మతల బారిన పడే అవకాశాలున్నాయని, వారంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ► మెడికల్ ఎడ్యుకేషన్ డైరక్టర్ (డీఎంఈ) రమేష్‌రెడ్డి ఆదేశాల మేరకు కరోనా పాజిటివ్ బాధితుల నుంచి నమూనాలు సేకరించి గాంధీ మెడికల్ కాలేజీ వైరాలజీ ల్యాబ్‌లో జీనోమ్ సీక్వెన్సింగ్ పరీక్షలు నిర్వహిస్తున్నామని వివరించారు. ► కోవిడ్ నిబంధనలు తప్పనిసరిగా పాటిస్తు, మాస్క్‌లు ధరించాలని, శానిటైజర్లతో చేతులు పరిశుభ్రం చేసుకోవాలని, సామూహిక, ఎక్కువమంది గుమిగూడే ప్రదేశాలకు దూరంగా ఉండాలన్నారు. ► గాంధీ ఆస్పత్రిలో ప్రస్తుతం ఎనిమిది మంది కోవిడ్ బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని చెప్పారు. గత కొన్ని నెలలుగా బాధితుల సంఖ్య పదికి మించలేదన్నారు. ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశం లేదని, వస్తే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. -
భారత్ లో బయటపడిన ఒమిక్రాన్ BF- 7 వేరియంట్...ఎయిర్ పోర్టుల్లో హైఅలర్ట్
-
కరోనా బీఎఫ్.7 వేరియంట్.. భయం వద్దు.. జాగ్రత్తలు చాలు
బీఎఫ్.7.. కరోనా ఒమిక్రాన్‌లో సబ్‌వేరియెంట్. ప్రస్తుతం చైనా వెన్నులో వణుకు పుట్టిస్తోంది. విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వేరియెంట్ ప్రపంచ దేశాలకు కొత్తేం కాదు. అక్టోబర్‌లోనే బిఎఫ్.7 కేసులు అమెరికా, కొన్ని యూరప్ దేశాల్లో వెలుగులోకి వచ్చాయి. ఈ సబ్ వేరియెంట్ అత్యంత బలమైనది. కరోనా సోకి యాంటీబాడీలు వచ్చిననవారు, వ్యాక్సిన్ తీసుకున్న వారిలో రోగనిరోధక శక్తిని ఎదిరించి మరీ ఇది శరీరంలో తిష్టవేసుకొని కూర్చుంటుంది. అందుకే ప్రజలందరూ జాగ్రత్తలు తీసుకోవడం తప్పనిసరని అంటువ్యాధుల నిపుణులు సూచిస్తున్నారు. భారత్‌లో జనవరిలో థర్డ్ వేవ్ వచ్చిన సమయంలో ఒమిక్రాన్‌లోని బిఏ.1, బీఏ.2 సబ్ వేరియెంట్లు అధికంగా కనిపించాయి. ఆ తర్వాత బీఏ.4, బీఏ.5లని కూడా చూశాం. ఇన్నాళ్లు అతి జాగ్రత్తలు తీసుకున్న చైనా ఒక్కసారిగా అన్ని ఆంక్షలు ఎత్తేయడంతో అక్కడ ప్రజల్లో కరోనాని తట్టుకునే రోగనిరోధక వ్యవస్థలేదు. అదే ఇప్పుడు చైనా కొంప ముంచింది. వాస్తవానికి ఇప్పుడు చైనాలో నెలకొన్నలాంటి స్థితిని దాటి మనం వచ్చేశామని కోవిడ్–19 జన్యుక్రమ విశ్లేషణలు చేసే సంస్థ ఇన్సాకాగ్ మాజీ చీఫ్ డాక్టర్ అనురాగ్ అగర్వాల్ చెప్పారు. 2021 ఏప్రిల్–మే మధ్యలో డెల్టా వేరియెంట్‌తో భారత్‌లో భారీగా ప్రాణ నష్టం జరిగిందని, ఆ సమయంలో కరోనా సోకిన వారిలో రోగనిరోధక శక్తి అధికంగా ఉందని అన్నారు. ఇక ఒమిక్రాన్‌లో బీఎఫ్.7 చైనాలో అత్యధికంగా వృద్ధుల ప్రాణాలు తీస్తోందని, మన దేశంలో యువజనాభా ఎక్కువగా ఉండడం వల్ల భయపడాల్సిన పని లేదని డాక్టర్ అగర్వాల్ చెబుతున్నారు. అయితే విస్తృతంగా వ్యాప్తి చెందే ఈ వైరస్‌తో జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. గొంతు నొప్పి, దగ్గు, జ్వరం వంటి లక్షణాలు ఈ వేరియెంట్లో ఎక్కువగా కనిపిస్తాయి. మాసు్కలు ధరించడం, భౌతిక దూరం వంటి జాగ్రత్తలు తీసుకుంటే బీఎఫ్.7తో భారత్‌కు ముప్పేమీ ఉండదని వైద్య నిపుణులంటున్నారు. ఈ సబ్ వేరియెంట్ కేసులు అమెరికాలోని మొత్తం కేసుల్లో 5%, యూకేలో 7.26% ఉన్నాయి. అక్కడ మరీ అధికంగా కేసులు నమోదు కావడం లేదు. ఆస్పత్రుల్లో చేరే వారి సంఖ్య కూడా అంతగా లేదు. అందుకే భారత్‌లోనూ ఇది ప్రభావం చూపించదనే అంచనాలు ఉన్నాయి. చదవండి: దేశంలో క్యాన్సర్ విజృంభణ -
Covid Alert: మళ్ళీ ప్రమాదఘంటికలు
ఒకరికి తెద్దునా... ఇద్దరికి తెద్దునా... అందరికీ తెద్దునా అని జనవ్యవహారం. చైనా తప్పిదాలతో కరోనా మళ్ళీ దేశదేశాల్లో కోరలు సాచే ప్రమాదం కనిపిస్తోంది. నిన్నటి దాకా కఠిన నిబంధనలు, లాక్డౌన్లు, సామూహిక పరీక్షలతో జీరో–కోవిడ్ విధానాన్ని అనుసరించిన చైనా గత నెలలో జనా గ్రహంతో హఠాత్తుగా ఆంక్షలు సడలించేసరికి పరిస్థితి అతలాకుతలమైంది. కేసులు, మరణాలు ఒక్కసారిగా పెరిగి, ఆస్పత్రులు చేతులెత్తేశాయి. ఫార్మసీల్లో మందులు ఖాళీ. శవాల గుట్టలతో శ్మశా నాల్లో తీరిక లేని పని. జపాన్, అమెరికా, కొరియా, బ్రెజిల్‌లోనూ కేసులు ఉన్నట్టుండి పెరుగుతుండ డంతో, భారత్ అప్రమత్తమైంది. కరోనా పాజిటివ్ నమూనాలకు జీనోమ్ సీక్వెన్సింగ్ జరిపి, కొత్త వేరియంట్లపై కన్నేయాలని భారత సర్కార్ ఆదేశించడం సరైన చర్య. ఆరోగ్యశాఖ ఉన్నత స్థాయి సమీక్షాసమావేశంతో అప్రమత్తత బావుంది. కాకపోతే, 80 కోట్ల చైనీయులకు కొత్తగా కరోనా సోకే ముప్పు, లక్షలాది మరణాల అంచనా, భారత్‌లో కరోనా చాటు రాజకీయాలే ఆందోళనకరం. కరోనా విషయంలో ప్రపంచంలో ప్రతి ఒక్కరూ సురక్షితం కానంత వరకు, ఏ ఒక్కరూ సురక్షితం కానట్టే. ఏ ఒక్కరు అజాగ్రత్తగా ఉన్నా, ఇట్టే వ్యాపించే ఈ మహమ్మారితో ప్రతి ఒక్కరికీ ముప్పే. ఇది రెండేళ్ళుగా వైద్యనిపుణులు ఘోషిస్తున్న మాట. కానీ, చైనా మూర్ఖత్వం ఇవాళ మిగతా ప్రపంచానికి శాపమైంది. కరోనా నియంత్రణలో పాశ్చాత్య ప్రపంచం కన్నా తామే గొప్ప అని చైనా చెప్పుకుంటూ వచ్చింది. పొరుగున భారత్ సహా ప్రజాస్వామ్య ప్రపంచమంతా అనుసరిస్తున్న పద్ధతులకు భిన్నంగా లోపభూయిష్ఠ ‘జీరో–కోవిడ్’ విధానాన్ని చైనీయులపై బలవంతాన రుద్దింది. తొలినాళ్ళలో అది ఫలితమిచ్చినా, టీకాలతో, లాక్డౌన్లు ఎత్తేసి జీవనం సాగించడమే ప్రత్యామ్నా యమని ప్రజలకు వివరించడం నిరంకుశ సర్కారుకు కష్టమైపోయింది. తీరా ప్రత్యామ్నాయ వ్యూహం కానీ, క్రమంగా సాధారణ పరిస్థితి తేవడం కానీ చేయక ఒక్కసారిగా ఆంక్షల గేట్లు ఎత్తేయడం ఘోర తప్పిదమైంది. ఒక్క నెలలో 10 లక్షల పైగా కేసులు బయటపడ్డాయి. మూడేళ్ళ క్రితం ప్రపంచానికి కరోనాను అంటించినట్టు ఆరోపణలు ఎదుర్కొన్న చైనా నేటికీ ఆ మహమ్మారి నుంచి బయటకు రాలేకపోవడం విధి వైచిత్రి. ఈ దుఃస్థితికి స్వయంకృతాపరాధాలే కారణం. అతి జాతీయవాదంతో దేశీయంగా తయారైన టీకాలనే చైనా వాడడం, తీరా అవి సమర్థంగా పనిచేయకపోవడం, ఇప్పటికీ చైనా జనాభాలో అధిక శాతం మందికి టీకాకరణ జరగకపోవడం, వాస్తవాలను బయట పెట్టకపోవడం – ఇలా చైనా చేసిన తప్పులు అన్నీ ఇన్నీ కావు. మూడేళ్ళలో మూడు ప్రధాన కరోనా వేవ్‌లు చూసిన పొరుగు దేశం భారత్ ఈ విషయంలో మెరుగ్గా వ్యవహరించింది. శాస్త్రీయ శోధనకు ప్రభుత్వ సహకారం, దేశీయ టీకాల పనితనం, దేశవ్యాప్తంగా ఉద్యమస్థాయిలో టీకాకరణ, పలు విమర్శ లున్నా కోవాగ్జిన్‌ను ప్రోత్సహించడం కలిసొచ్చాయి. అయితే, మన దగ్గర కరోనా రాజకీయాలకూ కొదవ లేదు. తాజా కరోనా భయాన్ని సైతం అధికారపక్షమైన బీజేపీ రాజకీయాలకు వాడుకునేందుకు ప్రయత్నిస్తోంది. కాంగ్రెస్ నేత రాహుల్ 100 రోజుల పైగా చేస్తున్న ‘భారత్ జోడో యాత్ర’కు బాణం గురి పెట్టింది. విమానయానాలు సహా దేశమంతటా కరోనా నిబంధనలపై మాట్లాడని కేంద్ర వైద్య మంత్రి తీరా త్వరలో దేశ రాజధానికి చేరనున్న ప్రతిపక్ష నేత పాదయాత్రకు కోవిడ్ ప్రోటోకాల్ సాకుతో లేఖ రాయడం చిత్రమే. ‘టీకాలు వేసుకున్నవారే రాహుల్‌తో యాత్ర చేయాలి, యాత్ర చేసినవారు ఐసొలేషన్‌లో ఉండా’లంటున్న పెద్దలు రాజస్థాన్, కర్ణాటకల్లో బీజేపీ యాత్రలను మాత్రం విస్మరించడమేమిటి? కేంద్రం కరోనా మార్గదర్శకాలివ్వాల్సింది యావత్ భారత్‌కే తప్ప ఒక్క భారత్ జోడో యాత్రకు కాదు. చైనాలో విస్తృతంగా వ్యాపిస్తూ, సంక్షోభం సృష్టిస్తున్న బీఎఫ్.7 కరోనా వేరియంట్ ఇప్పటికే గుజరాత్లో బయటపడింది. అలాగే, టీకా వేసుకున్నా ఈ ఒమిక్రాన్ ఉప వేరియంట్ సోకడం ఆగట్లేదట. ఈ మాటలు ఆందోళనకరమే. అయితే, 2021 మధ్యలో మన దేశంలో సంక్షోభం రేపిన డెల్టా వేరియంట్‌తో పోలిస్తే, ఈ ఏడాది మొదటి నుంచి మన దగ్గరున్న ఒమిక్రాన్ ఆ స్థాయి కల్లోలం రేపలేదు. ఆ మాటకొస్తే ఈ ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఎఫ్.7 భారత్‌లో సెప్టెంబర్ నుంచే ఉందని కథనం. మనకు సహజ వ్యాధినిరోధకతా వచ్చింది. దేశంలో పెరిగిన కరోనా వైద్య వసతుల రీత్యా మనం మరీ బెంబేలెత్తాల్సిన పని లేదు. కానీ మాస్క్‌ధారణ, గుంపులకు దూరంగా ఉండడం, భౌతిక దూరం, చేతులకు శానిటైజర్ లాంటి ప్రాథమిక జాగ్రత్తలను మళ్ళీ ఆశ్రయించక తప్పదు. చైనా దెబ్బతో కొత్త వేరియంట్లు తలెత్తే ముప్పుంది. గతంలో చైనాలో కరోనా మొదలైనప్పుడు అలక్ష్యం చేసి, మనతో సహా ప్రపంచం పీకల మీదకు తెచ్చుకుంది. ప్రస్తుతానికి మన పరిస్థితి బాగున్నా రానున్న సెలవులు, పెరగనున్న పర్యటనలతో అప్రమత్తత కీలకం. కరోనా పరీక్షలు పెంచి, కొత్త వేరియంట్లపై కన్నేసి ఉంచాలి. కరోనా టెస్టింగ్, కేసుల ట్రేసింగ్, ట్రీటింగే ఇప్పటికీ మహా మంత్రం. దేశంలో ప్రతి అయిదుగురిలో ఒకరే బూస్టర్ డోస్ వేయించుకున్నందున ప్రభుత్వం ప్రజల్ని చైతన్యపరిచి, ప్రోత్సహించడం అవసరం. ఏమైనా, ఒక విషయం తప్పక గుర్తుంచు కోవాలి... కరోనా కథ ఇంకా కంచికి చేరలేదు. మన జాగ్రత్తే మనకు రక్ష. ప్రమాదఘంటికలు మోగుతున్న వేళ అవసరానికి మించి సంసిద్ధంగా ఉన్నా తప్పు లేదు కానీ... అత్యవసరమైనదాని కన్నా తక్కువ సిద్ధపడితేనే తిప్పలు – అది ప్రభుత్వానికైనా, ప్రజలకైనా! -
ఆంక్షలను ఎత్తివేశాక..చైనాలో ఘోరంగా పెరుగుతున్న కరోనా కేసులు
చైనాలో ప్రజలు, విద్యార్థులు బహిరంగంగా ఆందోళనలు చేపట్టిన నేపథ్యంలో చైనా ప్రభుత్వం ఆంక్షలు సడలించిన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి అనూహ్యంగా చైనాలో కరోనా కేసులు చాలా వేగంగా పెరిగిపోతున్నాయి. చైనా రోజువారిగా చేసే సాధారణ కరోనా పరిక్షలు రద్దు చేశాక వెల్లువలా కేసులు పెరిపోవడం ప్రారంభమైంది. ఈ మేరకు పలువురు అంటువ్యాధుల నిపుణులు హెచ్చరికల నేపథ్యంలో బీజింగ్‌లో పలు దుకాణాలు స్వచ్ఛందంగా మూతపడ్డాయి. అదీగాక వ్యాధి సోకిన వారు గృహ నిర్బంధలో ఉండటంతో కొన్ని వ్యాపారాలు మూతబడగా...మరికొన్ని దుకాణాలు కరోనా వ్యాప్తి నేపథ్యంలో స్వచ్ఛందంగా మూసేశారు. ఈ మేరకు చైనీస్ ఎపిడెమియాలజిస్ట్ జాంగ్ నాన్షాన్ మాట్లాడుతూ...చైనాలో ప్రస్తుతం ఓమిక్రాన్ ప్రభలంగా వ్యాపిస్తోంది. కనీసం ఒక్కరూ దీని భారిన పడ్డా.. అతను సుమారుగా 18 మందికి సంక్రమింప చేయగలడని అన్నారు. ఇప్పటికే ప్రధాన నగరాల్లో సుమారు 10 వేల మందికి పైగా ప్రజలకు సోకినట్లు జాంగ్ చెప్పారు. మరోవైపు ఆరోగ్య కార్యకర్తలు నివాసితులకు సాధారణ కరోనా పరీక్షలు నిర్వహించడం మానేశాక కొత్తకేసులకు సంబంధించిన అధికారిక లెక్కలు కూడా కనుమరగయ్యాయి. ప్రసత్తం ఆరోగ్య అధికారులు చెప్పిన గణాంకాల ప్రకారం సుమారు 1,661 కొత్త కేసులు ఉన్నాట్లు వెల్లడించారు. బీజింగ్‌లో ఆదివారం అత్యధిక జనాభ కలిగిన చాయోయాంగ్‌లోని మాల్స్‌లో పలు దుకాణాలు మూతబడి నిర్మానుష్యంగా ఉన్నాయి. ప్రస్తుతం చైనా ఆర్థిక పరిస్థితి కూడా మందగమనంలో ఉంది. దీనికి తోడు మొన్నటివరకు ఉన్న జీరో కోవిడ్ ఆంక్షల నేపథ్యంలో వ్యక్తిగత ఆదాయాలు కూడా అత్యంత దయనీయ స్థితిలో ఉన్నాయి. ప్రస్తుతం మళ్లీ కరోనా విజృంభిస్తున్న తరుణంలో రానున్న పరిస్థితుల్లో వ్యక్తిగత ఆదాయాలు మరింత ఘోరంగా ఉంటాయని ఆర్థికవేత్త మార్క్ విలియమ్స్ చెబుతున్నారు. క్యాపిటల్ ఎకనామిక్స్ ప్రకారం, చైనా ఆర్థిక వ్యవస్థ 2023 మొదటి త్రైమాసికంలో 1.6%గా రెండవ త్రైమాసికంలో 4.9% వృద్ధి ఉంటుందని అంచానా వేసింది. సాధారణ స్థితికి రావడానికి ఇంకా కొన్ని నెలల సమయం పడుతుందని విలయమ్స్ చెప్పారు. చైనా కొన్ని ఆంక్షలు సడలించినప్పటికీ పర్యాటకులతో సహా విదేశీయులు రాకుండా సరిహద్దులను మూసివేసే ఉంచింది. చైనా ప్రయాణికులైన తప్పనిసరిగా కేంద్రీకృత ప్రభుత్వ సౌకర్యాల వద్ద ఐదు రోజులు నిర్బంధంలో ఉండి, ఇంటి వద్ద మరో మూడు రోజులు స్వీయ నిర్బంధంలో ఉండాల్సిందే. చైనా జీరో కోవిడ్ పాలసీని సడలించినప్పటికీ కొన్నింటి విషయాల్లో ఆంక్షలు పూర్తిగా సడలించలేదు. (చదవండి: చమురు విషయంలో పాక్‌కి గట్టి షాక్ ఇచ్చిన రష్యా) -
భారత్‌లో ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కేసులు
కరోనా కేసులు తగ్గుముఖం పట్టడం.. ‘తీవ్రత దృష్ట్యా’ ప్రజలు సైతం వైరస్‌ను పెద్దగా పట్టించుకోని పరిస్థితులు నెలకొన్నాయి. అయితే పూర్తి స్థాయిలో కరోనా కథ మాత్రం ఇంకా ముగియలేదు. ఈ నేపథ్యంలో.. తాజాగా కరోనా వైరస్ వేరియెంట్ ఒమిక్రాన్‌లో అత్యంత వేగంగా కేసుల వ్యాప్తికి కారణమయ్యే ఒక ఉప రకాన్ని భారత్‌లో గుర్తించారు. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్ కేసులు మన దేశంలో వెలుగు చూశాయి. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్ అంటే.. బీఏ.2.75, బీజే.1ల రీకాంబినెంట్. శాస్త్రీయ నామం బీఏ.2.10 (BA.2.10) మహారాష్ట్ర, కేరళ, ఇతర ప్రాంతాల్లో ఈ వేరియెంట్‌కు సంబంధించిన కొత్త కేసులు వెలుగు చూశాయి. అయితే ఈ వేరియెంట్ విషయంలో నిపుణులు అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. అందుకు కారణం.. సింగపూర్‌లో గత కొన్నిరోజులుగా కేసులు రెట్టింపు సంఖ్యలో వెలుగు చూస్తున్నాయి కాబట్టి. ఒమిక్రాన్‌లో అత్యంత వేగంగా ఇన్ఫెక్షన్ను వ్యాపించే గుణం ఈ వేరియెంట్‌కు ఉందని పరిశోధకులు నిర్ధారించారు. ఇక గుజరాత్లో ఇప్పటికే బీఏ.5.1.7, బీఎఫ్.7 కేసులు వెలుగు చూశాయి. ఇవి కూడా వైరస్‌ను వేగంగా వ్యాపింపజేసే గుణం ఉన్న వేరియెంట్లే కావడం గమనార్హం. Omicron XBB తీవ్రత.. ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్ తీవ్రత ప్రమాదకరమేమీ కాదు. కరోనా తరహా దగ్గు, లో ఫీవర్, జలుబు, వాసన గుర్తింపు లేకపోవడం, ఒళ్లు నొప్పులు.. ఇలా కరోనా తరహాలోనే లక్షణాలే కనిపిస్తున్నాయి. అలాగే మంచి చికిత్సతో తొందరగానే కోలుకోవచ్చు. కాబట్టి ఆందోళన చెందాల్సిన అవసరం ఏమాత్రం లేదు. కానీ, దాని గుణం వల్ల ఇన్ఫెక్షన్ను అతిత్వరగా.. వేగంగా వ్యాపింపజేస్తుంది. అంతేకాదు ఆస్పత్రిలో చేర్చే కేసుల్ని పెంచే అవకాశాలు ఎక్కువని.. నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ కేసులు ప్రస్తుతం భారత్‌లో ఐదు రాష్ట్రాల్లో 70 దాకా నమోదు అయ్యాయి. ఒకవేళ ఈ వేరియెంట్ గనుక విజృంభిస్తూ.. మూడు నుంచి నాలుగు వారాల్లో కేసులు మళ్లీ పుంజుకునే అవకాశాలున్నాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ► ఆగస్టులో ఈ వేరియెంట్‌ను మొదట అమెరికాలో గుర్తించారు. ► సింగపూర్‌లో ఒక్కరోజులోనే 4,700 నుంచి 11,700 కేసులు పెరిగాయంటే తీవ్రత ఏపాటిదో అర్థం చేసుకోవచ్చు. చాలామంది ఆస్పత్రుల్లో చేరుతున్నారు కూడా. ► ఇతర వైరస్‌లలాగే.. Corona Virus కూడా తన రూపాల్ని మార్చుకుంటూ పోతోంది. ► ఎక్స్‌బీబీ వేరియెంట్‌పై వ్యాక్సినేషన్ ప్రభావం పెద్దగా ఉండదని.. ఎందుకంటే దాని మ్యూటేషన్ అంతుచిక్కడం లేదని సైంటిస్టులు చెప్తున్నారు. ► ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్, ఒమిక్రాన్ ఎక్స్‌బీబీ వేరియెంట్‌పై స్పందించారు. పండుగ సీజన్ దృష్ట్యా భారత్ సహా మరికొన్ని దేశాల్లో ఈ వేరియెంట్ మరో వేవ్‌కు కారణం కావొచ్చని ఆమె అంచనా వేస్తున్నారు. ఇదీ చదవండి: ఈ కెమెరాతో 15 మైళ్ల దూరంలో ఉన్న గోల్ఫ్ బంతిని కూడా క్లియర్‌గా చూడవచ్చు. -
Omicron BF.7: ముంచుకొస్తున్న నాలుగో వేవ్?!
సాక్షి, హైదరాబాద్: కోవిడ్ మహమ్మారి నుంచి పూర్తిస్థాయిలో విముక్తికి మరికొంత కాలం వేచిచూడక తప్పేట్లు లేదు. తాజాగా గుజరాత్, మహారాష్ట్రలలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ బీఎఫ్.7 కేసుల వ్యాప్తితో కరోనా జాగ్రత్తలతో పాటు, కేసుల పర్యవేక్షణ, ‘జీనోమిక్ సర్వెలెన్స్’పెంచాలని అధికారులను కేంద్ర ఆరోగ్యశాఖ ఆదేశించింది. దీపావళి వేడుకలు ఘనంగా జరుపునేందుకు దేశప్రజలు సిద్ధం కావడం, హిమాచల్‌ప్రదేశ్ ఎన్నికలతో పాటు, కొన్ని రాష్ట్రాల్లో ఉప ఎన్నికల నేపథ్యంలో అపమ్రత్తంగానే ఉండాలని సూచించింది. బీఎఫ్.7 వేరియెంట్‌కు అత్యంత వేగంగా వ్యాప్తి చెందే స్వభావంతో పాటు గతంలో కరోనా సోకడం వల్ల, వ్యాక్సిన్లతో ఏర్పడిన యాంటీబాడీస్‌ను తప్పించుకునే గుణం ఉండడం ఆందోళన రేకెత్తిస్తోంది. దీని కారణంగా భారత్‌లో నాలుగో వేవ్ ఏర్పడుతుందా అన్న ఆందోళన వైద్య పరిశోధకులు, నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ‘‘కొత్త వేరియెంట్ పట్ల వచ్చే రెండువారాలు అప్రమత్తంగా ఉండాలి. ఇతర దేశాల్లో కేసుల్లో పెరుగుతున్నందున మనపైనా ప్రభావం ఉంటుంది’అని నేషనల్ టెక్నికల్ అడ్వెయిజరీ గ్రూప్ ఆఫ్ ఇమ్మునైజేషన్ చైర్మన్ డా.ఎన్కే అరోరా స్పష్టంచేశారు. గత రెండున్నరేళ్లుగా కరోనా పేషెంట్లకు చికిత్సతో పాటు దానిలో మార్పులను గమనిస్తున్న చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్ డా.హరికిషన్, క్రిటికల్‌కేర్ నిపుణులు డా. కిరణ్ మాదల తాజా పరిస్థితులపై ‘సాక్షి’తో తమ అభిప్రాయాలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు... వారి మాటల్లోనే.. మరో వేవ్‌గా మారే అవకాశాలు తక్కువే కానీ... ఈ వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతోందని తెలుస్తోంది. ఐతే ఒమిక్రాన్ సోకాక, వ్యాక్సినేషన్ లేదా సహజసిద్ధంగా ఏర్పడిన రోగనిరోధకశక్తితో ప్రపంచంలోని 60 శాతానికి పైగా ప్రజల్లో రక్షణలు ఏర్పడ్డాయి. దేశంలో ఒమిక్రాన్ వేవ్ వచ్చి 7,8 నెలలు దాటినా కొత్త వేరియెంట్ ఏదీ రాలేదు. వ్యాక్సినేషన్ సగటుశాతం పెరగడమే దానికి కారణం కావొచ్చు. అందువల్ల కొత్త వేరియెంట్‌ను ఒమిక్రాన్ ఉపవర్గంగానే చూడాలి. వైరస్‌కు ఏర్పడే మ్యుటేషన్ల ప్రభావం చూపొచ్చునని అంటున్నారు. కానీ మనదగ్గర కోవిడ్ మూడుదశలు ముగిసినందున, ప్రజల ఇమ్యూనిటీ లెవల్స్‌ను బట్టి చూస్తే అది మరో వేవ్‌గా మారే అవకాశాలు తక్కువే. కరోనా ఉపద్రవంలో ఒమిక్రానే చివరి వేరియెంట్ కావొచ్చుననే ఆశాభావంతో పరిశోధకులున్నారు. ఐతే 70 ఏళ్లకు పైబడిన వారు వివిధ దీర్ఘకాలిక జబ్బులతో బాధపడుతున్న వారు జాగ్రత్తలు తీసుకోవాల్సిందే. – డా. కిరణ్ మాదల, క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వాసుపత్రి జాగ్రత్తగా ఉండాల్సిందే.. ఒమిక్రాన్ సబ్వేరియెంట్గా గుర్తించారు. దీని తీవ్రత ఏమిటనే దానిపై ఇంకా స్పష్టత లేదు. దీని వేగవంతమైన వ్యాప్తి అనేది బెల్జియం, యూఎస్ కేసుల ఆధారంగా తెలుస్తోంది. జ్వరం, దగ్గు, గాలిపీల్చడంలో ఇబ్బంది, ఒళ్లు నొప్పులు, జలుబు, తలనొప్పి, గొంతునొప్పి, రుచి కోల్పోవడం వంటివి దీని లక్షణాలు. ఊపిరి తీసుకోవడంలో ఇబ్బందులు వస్తే ఆక్సిజన్ స్థాయిలను క్రమం తప్పకుండా పర్యవేక్షించాలి. తీవ్రమైన లక్షణాలుంటే వెంటనే డాక్టర్లను సంప్రదించాలి. గుండె, శ్వాసకోశాలు, మూత్రపిండాలు, కాలేయం, డయాబెటీస్ వంటి దీర్ఘకాలిక సమస్యలున్న వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. – డా.హరికిషన్ గోనుగుంట్ల, చీఫ్ ఇంటర్వెన్షనల్ పల్మనాలజిస్ట్, యశోద -
ప్రమాదకరంగా ఒమిక్రాన్ సబ్ వేరియంట్.. శీతాకాలంలో విజృంభణ!
లండన్: కరోనా వైరస్‌లో(సార్స్–కోవ్–2) కొత్తగా పుట్టుకొచ్చిన బీఏ.2.75.2 అనే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ప్రమాదకరంగా పరిణమిస్తున్నట్లు స్వీడన్‌లోని కరోలిన్స్కా ఇనిస్టిట్యూట్ పరిశోధకులు గుర్తించారు. ఇది మనుషుల రక్తంలోని ప్రతిరక్షకాల (యాంటీబాడీలు) నుంచి సమర్థంగా తప్పించుకున్నట్లు తేల్చారు. అంతేకాకుండా ఇప్పుడు అందుబాటులో ఉన్న కోవిడ్–19 యాంటీబాడీ చికిత్సలను కూడా తట్టుకుంటున్నట్లు చెప్పారు. ఈ పరిశోధన వివరాలను లాన్సెట్ అంటువ్యాధుల పత్రికలో ప్రచురించారు. ప్రస్తుత శీతాకాలంలో కరోనా మహమ్మారి ముప్పు పొంచి ఉందని, అందుకే ముందుజాగ్రత్తగా అప్డేటెడ్ టీకాలు తీసుకోవాలని, రోగ నిరోధక శక్తిని పెంచుకోవాలని పరిశోధకులు సూచించారు. కరోనా ఒమిక్రాన్‌లోని బీఏ.2.75 అనే వేరియంట్ ఉత్పరివర్తనం చెందడంతో బీఏ.2.75.2 ఉప వేరియంట్ పుట్టినట్లు కనిపెట్టారు. ఈ ఏడాది మొదట్లోనే ఇది బయటపడింది. కొన్ని దేశాల్లో వ్యాప్తి చెందుతోంది. ఇప్పటికైతే తక్కువ సంఖ్యలోనే కేసులు నమోదవుతున్నప్పటికీ భవిష్యత్తులో ఇదే పరిస్థితి ఉంటుందని చెప్పలేమన్నది పరిశోధకులు మాట. కోవిడ్–19 బారిన పడే అవకాశం అధికంగా ఉన్నవారికి యాంటీవైరల్ ట్రీట్మెంట్ అందుబాటులో ఉంది. ఇదీ చదవండి: BioNTech: త్వరలో క్యాన్సర్ వ్యాక్సిన్! -
ప్రమాదకారి ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ల విజృంభణ
బీజింగ్: డ్రాగన్ కంట్రీపై కరోనా వైరస్ మరోసారి పంజా విసురుతోంది. తగ్గినట్లే తగ్గి.. కేసులు క్రమక్రమంగా పెరుగుతూ పోతున్నాయి. మూడు రెట్లు కొత్త కేసులు పెరిగిపోవడంతో అధికారులు అప్రమత్తం అయ్యారు. ఒమిక్రాన్ నుంచి ప్రమాదకారిగా భావిస్తున్న రెండు ఉప వేరియెంట్లు శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో కేసుల సంఖ్య అమాంతం పెరగడానికి కారణంగా తేలింది. ఈ క్రమంలో పలు చోట్ల మళ్లీ లాక్డౌన్ విధించగా.. తీవ్ర ప్రభావం చూపించే వేరియెంట్లు కావడంతో ప్రపంచం ఒక్కసారిగా ఉలిక్కి పడింది. కరోనా వైరస్ వేరియెంట్ ఒమిక్రాన్ నుంచి బీఎఫ్.7, బీఏ.5.1.7 ఉప వేరియెంట్లు.. వాయవ్య చైనాలో ఎక్కువగా వ్యాప్తి చెందుతున్నాయి. సోమవారం నమోదు అయిన కేసుల సంఖ్య గణనీయంగా ఉందని అక్కడి అధికారులు చెబుతున్నారు. వీటి బారిన పడ్డ చాలామంది ఆస్పత్రి పాలవుతున్నారు. అదే సమయంలో బీఏ.5.1.7 సబ్ వేరియెంట్ కేసులు తొలిసారి చైనా గడ్డపై వెలుగు చూడడం గమనార్హం. ఈ విషయాన్ని గ్లోబల్ టైమ్స్ కూడా ధృవీకరించింది. షాంగైతో పాటు చాలా రీజియన్లలో సోమవారం నుంచే కఠిన లాక్‌డౌన్‌ను మళ్లీ అమలు చేస్తున్నారు. ఒమిక్రాన్ ఉప వేరియెంట్ BF.7. అత్యంత ప్రమాదకరమైందని, ఇన్ఫెక్షన్ రేటు వేగంగా.. అధికంగా ఉంటుందని, రాబోయే రోజుల్లో పెనుముప్పునకు దారి తీయొచ్చని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే హెచ్చరించిన విషయం తెలిసే ఉంటుంది. ఈ తరుణంలో.. చైనాలోనే ఈ ప్రమాదకారిక ఉప వేరియెంట్ ప్రతాపం చూపిస్తుండడం గమనార్హం. అయితే ఇది చైనాకు మాత్రమే పరిమితం అవుతుందనుకుంటే పొరపాటని.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని ప్రపంచాన్ని హెచ్చరించింది డబ్ల్యూహెచ్‌వో. ప్రపంచంలోనే కట్టుదిట్టమైన కఠోర కరోనా ఆంక్షల్ని అమలు చేస్తోంది చైనా. సరిహద్దుల్ని మూసేసి.. జీరో కోవిడ్ పాలసీ విధానంతో ప్రజలు ఇబ్బంది పడినా.. విమర్శలు ఎదుర్కొన్నా కూడా కరోనా కట్టడికి యత్నిస్తోంది. అయినప్పటికీ కొత్త వేరియెంట్లు విరుచుకుపడడం గమనార్హం. అధికార కమ్యూనిస్ట్ పార్టీ 20వ పార్టీ కాంగ్రెస్ నేపథ్యంలో.. కరోనా విజృంభిస్తోందన్న కథనాలు చైనాను మాత్రమే కాదు.. ఇతర దేశాలను ఉలిక్కిపడేలా చేస్తున్నాయి. -
ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం.. భారీగా పెరుగుతున్న కేసులు!
ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ తీవ్రత కొద్దిరోజులుగా తగ్గుముఖం పట్టింది. పాజిటివ్ కేసుల సంఖ్య క్రమంగా తగ్గింది. ఈ క్రమంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తున్నాయి. తాజాగా కోవిడ్‌లో ఒమిక్రాన్ బీఏ.4.6 అనే కొత్త వేరియంట్ అమెరికా, యూకేలతో పలు దేశాల్లో విస్తరిస్తోంది. దీంతో, పాజిటివ్ కేసులు మళ్లీ పెరుగుతున్నాయి. వివరాల ప్రకారం.. యూకేలో కొత్త వేరియంట్ వ్యాప్తి కొనసాగుతోంది. కాగా, తమ దేశంలో సేకరించిన మొత్తం నమూనాల్లో 3.3% ఈ రకాలే ఉన్నట్లు యూకే ఆరోగ్య భద్రతా సంస్థ ఓ ప్రకటనలో పేర్కొంది. తాజాగా ఈ సంఖ్య 9 శాతానికి చేరినట్టు అధికారులు వెల్లడించారు. మరోవైపు.. అమెరికాలో సైతం ఈ వేరియంట్ కేసులు 9 శాతానికి పైగానే నమోదు అవుతున్నట్టు సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సంస్థ తెలిపింది. ఇదిలా ఉండగా.. కేవలం ఈ రెండు దేశాల్లోనే కాకుండా ఇతర దేశాల్లో సైతం కొత్త వేరియంట్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, ఒమిక్రాన్ బీఏ.4.6 కూడా బీఏ.4 లాంటిదేనని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కొత్త వేరియంట్.. టీకాలు తీసుకున్న వారిపై కూడా అటాక్ చేస్తుంది. ఇక, ఒమిక్రాన్‌లోని ఇతర వేరియంట్ల మాదిరిగానే దీనివల్ల కూడా వ్యాధి తీవ్రత, మరణాలు సంభవించే అవకాశాలు తక్కువని వైద్యులు స్పష్టం చేశారు. కాగా, ఈ ఏడాది జనవరిలో బీఏ.4 వేరియంట్ ఆఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. ఆ తర్వాత బీఏ.5 వేరియంట్ ప్రపంచ దేశాల్లో వ్యాప్తిచెందింది. మరోవైపు.. భారత్‌లో కూడా కరోనా తీవ్రత కొనసాగుతోంది. గడిచిని 24 గంటల్లో దేశంలో కొత్తగా 5,108 పాజిజివ్ కేసులు నమోదు కాగా, అదే సమయంలో వైరస్ కారణంగా 19 మంది మృతిచెందారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా 45,749 యాక్టివ్ కేసులు ఉన్నయని కేంద్ర ఆరోగ్య శాఖ తాజా బులిటెన్‌లో పేర్కొంది. ఇక, నిన్న ఒక్కరోజే కరోనా నుంచి 5,675 మంది కోలుకున్నారు. There is a new subvariant of the omicron COVID variant which has been quickly gaining traction in the US, and now in the UK: BA.4.6.https://t.co/dWLdclZ6Y0 — Economic Times (@EconomicTimes) September 15, 2022 -
ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియెంట్ గుర్తింపు.. కలకలం
ఢిల్లీ: దేశంలో ఒకవైపు కరోనా కేసులు తగ్గుముఖం పడుతున్న వేళ.. మరో కలకలం మొదలైంది. భారత్‌లోకి ప్రవేశించిన.. కరోనా వేరియెంట్ ఒమిక్రాన్ కొత్త సబ్‌వేరియెంట్ దేశరాజధానిలో అలజడి సృష్టిస్తోంది. ఢిల్లీలోని లోక్ నాయక్ జై ప్రకాశ్ నారాయణ్ ఆస్పత్రికి వచ్చిన శాంపిల్స్‌లో ఈ సబ్‌వేరియెంట్ నమునాలు గుర్తించినట్లు వైద్యాధికారులు తెలిపారు. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ 2.75.. చాలా శాంపిల్స్‌లో గుర్తించినట్లు మెడికల్ డైరెక్టర్ డాక్టర్ సురేష్ కుమార్ వెల్లడించారు. ఢిల్లీలో కోవిడ్ కేసులు.. పాజిటివిటీ రేటు పెరిగిపోతున్న వేళ.. ఆస్పత్రుల్లో చేరుతున్న బాధితుల సంఖ్యా పెరుగుతోందని డాక్టర్ సురేష్ వెల్లడించారు. ఇంతకు ముందు ఇన్ఫెక్షన్ ద్వారా సంక్రమించిన ఇమ్యూనిటీ, వ్యాక్సినేషన్‌ను లెక్కచేయకుండా ఈ ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ శరవేగంగా విస్తరిస్తోందని వైద్యులు వెల్లడించారు. వ్యాప్తి రేటు ఎక్కువగా ఉండే ఈ సబ్‌వేరియెంట్ కారణంగానే కేసులు పెరిగిపోతున్నాయన్నారు. ఇక 90 శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం అధ్యయనాలు చేస్తున్నారు. యాంటీ బాడీలు ఉన్నవాళ్లతో పాటు వ్యాక్సిన్ డోసులు తీసుకున్నవాళ్లపైనా ఇది ప్రభావితం చూపిస్తోందని వైద్యులు తెలిపారు. అయితే తీవ్రత తక్కువగానే ఉన్నప్పటికీ.. వయసుపైబడిన వాళ్లపై ఇది తీవ్ర ప్రభావం చూపెట్టే అవకాశాలు ఉన్నట్లు వైద్యులు చెప్తున్నారు. ఇదిలా ఉంటే.. ఢిల్లీలో గత ఇరవై నాలుగు గంటల్లో రెండు వేలకు పైనే కేసులు నమోదు అయ్యాయి. పాజిటివిటీ రేటు 15.41 శాతంగా ఉంది. ఏడుగురు కరోనాతో మరణించగా.. ఫిబ్రవరి 6వ తేదీ తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదు కావడం ఇదే. దీంతో కేంద్రం.. అప్రమత్తం అయ్యింది. ఇదీ చదవండి: చైనాలో కొత్త వైరస్.. ఆందోళన -
కరోనా సరికొత్త వేరియెంట్.. సెంటారస్!.. మనదేశంలోనూ ఉందా?
ఒకప్పుడు బాగా సైన్స్ తెలిసిన వాళ్లకే కొన్ని గ్రీకు, రోమన్లాంటి పారిభాషిక పదాలు తెలిసేవి. కానీ కరోనా పుణ్యమా అని చాలా చాలా కొత్త కొత్త పేర్లు అందరికీ తెలిసి వస్తున్నాయి. ఆ కోవలో ఇప్పుడు సరికొత్తగా మరో పదం తెలిసివచ్చింది. దాని పేరే ‘సెంటారస్’. ఇది కూడా కరోనాకు చెందిన సరికొత్త వేరియెంట్. అయితే ఇది ఒమిక్రాన్ తాలూకు ఒక సబ్ వేరియెంట్‌గా శాస్త్రవేత్తలు పేర్కొంటున్నారు. ఒక వైరస్ తాలూకు వేరియెంట్‌కు మనుషులు నిరోధకత సాధించగానే... తన మనుగడ కోసం కొత్త కొత్త వేరియెంట్లు పుట్టుకొస్తాయన్న విషయం తెలిసిందే. ఇప్పటివరకూ కోవిడ్‌కు సంబంధించి... ఆల్ఫా, బీటా, గామా, డెల్టా, డెల్టా ప్లస్, ఒమిక్రాన్ వంటి అనేక పేర్లు విన్నాం. ఆ తర్వాత వాటిల్లోనే డెల్టా, ఒమిక్రాన్ కలిసిపోయి... డెల్మిక్రాన్ వంటివీ, ఒమిక్రాన్ ఫ్లూతో కలవడంతో ఫ్లూరాన్ వంటి మరికొన్ని సబ్వేరియెంట్లూ పుట్టుకొచ్చాయి. ఇదే వరసతో కోవిడ్‌కు సంబంధించి ఇప్పుడు తాజాగా మరో సబ్–వేరియెంట్ ఆవిర్భవించింది. దాని పేరే ‘సెంటారస్’. ఈ పేరుకు ఇంకా కొన్ని ప్రాధాన్యాలున్నాయి. ‘సెంటారస్’ అనే పేరును ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అధికారికంగా పెట్టలేదు. అయితే... మనకు (భూమికి) చాలా దూరంలో ఉన్న సెంటారస్ అనే గ్యాలక్సీ పేరు దీనికి పెట్టారనీ... గ్రీకు మైథాలజీ ప్రకారం సగం గుర్రం, సగం మానవ దేహం ఉన్న గ్యాలక్సీ పేరు దీనికి ఇచ్చారనీ... గుర్రం పరుగులా వేగంగా విస్తరించే స్వభావం ఉన్నందునే ఈ పేరు పెట్టారంటూ ‘గ్సేబియర్ ఆస్టేల్’ అనే కోవిడ్ పరిశీలకుడి మాట. అయితే ఇప్పటివరకైతే దాని తీవ్రత అంతగా కనిపించడం లేదు. తొలిసారిగా ‘నెదర్లాండ్’లో అవును ఉంది. సెంటారస్ (బీఏ 2.75) సబ్–వేరియెంట్‌ను ఈ ఏడాది మే నెలలోనే మన దేశంలోనూ ఉన్నట్లు గుర్తించారు. అయితే తొలిసారిగా దీన్ని ‘నెదర్లాండ్’లో కనుగొన్నారు. ఇప్పుడు ఈ వేరియెంట్ యూఎస్ఏ, యూకే, జర్మనీ, ఆస్ట్రేలియాల్లో సోకుతోంది. ఇప్పుడీ వేరియెంట్ పై దేశాలు కలుపుకుని దాదాపు పది దేశాల్లో విస్తరిస్తున్నట్లు శాస్త్రవేత్తలు చెబుతున్నారు. అంత తీవ్రమైనదేమీ కాదు... ఈ సెంటరాస్ వేరియెంట్ చాలా వేగంగా పాకుతుందంటూ కొంతమంది శాస్త్రవేత్తలు తొలుత ఆందోళన పడ్డారు. ఒమిక్రాన్ విషయంలో ఆందోళన పడ్డట్టుగానీ ఇది కూడా అంత తీవ్రమైనది కాదని తొలి పరిశీలనల్లో తేలింది. పైగా ఇది ఒమిక్రాన్ తర్వాత వచ్చిన సబ్–వేరియెంట్ కావడం... కొత్త కొత్త వేరియెంట్లు వస్తున్నకొద్దీ వాటి తీవ్రత తగ్గుతూ పోతుండటం వల్ల... ఇది శాస్త్రవేత్తలు అంచనా వేసినంత తీవ్రంగా లేకపోవడం ఓ సానుకూల అంశం. జెనీవాలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ గ్లోబల్ హెల్త్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆంటోనీ ఫ్లాహాల్ట్ మాట్లాడుతూ... ‘‘ఇలా వేరియెంట్లు రూపు మార్చుకుంటున్న కొద్దీ ఈ కొత్త కొత్త స్ట్రెయిన్ల కారణంగా కరోనాలోని ఫలానా వేరియెంట్‌కు అంటూ నిర్దిష్టంగా వ్యాక్సిన్ కనుగొనడం కష్టమవుతుంది’’ అంటూ వ్యాఖ్యానించారు. డచ్ ఇన్స్టిట్యూట్కు చెందిన మరో నిపుణుడు మాట్లాడుతూ ‘‘మనం సార్స్–సీవోవీ–2 కోసం రూపొందించిన వ్యాక్సిన్ కోటగోడను దాటుకుని ఇవి లోనికి ప్రవేశించగలవా లేదా అన్న అంశం ఇంకా తెలియద’’ని పేర్కొన్నారు. యూనివర్సిటీ ఆఫ్ ఈస్ట్ యాంగ్లియాకు చెందిన ప్రొఫెసర్ పాల్ హంటర్ మాట్లాడుతూ ‘‘ఇప్పటివరకూ ఇది చాలా నెమ్మదిగానే ఉంది. పెద్దగా విధ్వంసకారిలా అనిపించడం లేదు’’ అని తెలిపారు. ఇంకా మనదేశానికి చెందిన ‘సార్స్–సీవోవీ–2’ జీనోమిక్ కన్సార్షియమ్ కో–ఛైర్ పర్సన్ డాక్టర్ ఎన్.కె. అరోరా మాట్లాడుతూ ‘‘ఇది మన దేశంలో కొత్తగా, అరకొరగా మరికొన్ని కేసులకు కారణమవుతున్నప్పటికీ, తీవ్రమైనదేమీ కాదు. దీనివల్ల కొత్తగా నాలుగో వేవ్ రాదు’’ అంటూ భరోసా ఇస్తున్నారు. ఇప్పటికే మన దేశవాసుల్లోని చాలామంది డబుల్ వ్యాక్సినేషన్ తీసుకుని ఉండటం, మరికొందరు బూస్టర్ డోసుకూడా తీసుకోవడం, మూడో వేవ్‌లో ఒమిక్రాన్ చాలామందికి స్వాభావికమైన నిరోధకత ఇచ్చి ఉండటంతో పాటు... తాజాగా ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మూడో డోసు బూస్టర్‌ను కూడా ఉచితంగా ఇవ్వనుండటంతో ఇకపై ఈ వేరియెంట్ ఓ పెద్ద సమస్య కాబోదనేది చాలా మంది నిపుణుల భావన. -
'బీఏ5 వేరియంట్' కలవరం.. మూడు డోసులు తీసుకున్నా ఇన్ఫెక్షన్
కాలిఫోర్నియా: ప్రపంచవ్యాప్తంగా కరోనా కలవరం కొనసాగుతూనే ఉంది. రోజుకో కొత్త రూపంలో మానవాళిని భయపెడుతోంది ఈ మహమ్మారి. కొద్ది రోజులుగా భారత్‌తో పాటు పలు దేశాల్లో కొత్త కేసులు భారీగా నమోదవుతున్నాయి. ఈ క్రమంలో ఒమిక్రాన్ సబ్‌వేరియంట్‌పై విస్తుపోయే విషయాలు వెల్లడించారు శాస్త్రవేత్తలు. కోవిడ్ వ్యాక్సిన్ తీసుకోవటం వల్ల, గతంలో వైరస్ బారినపడి కోలుకోవటం వల్ల ఏర్పడిన రోగనిరోధక శక్తిని సైతం ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ.5 హరిస్తోందని తేల్చారు. వారాల వ్యవధిలోనే మళ్లీ సోకుతోందని వెల్లడించారు. బీఏ.4తో పాటు బీఏ.5 వేరియంట్ కారణంగానే భారత్, అమెరికా, యూకే, ఇటలీ, చైనాల్లో కొత్త కేసులు పెరుగుతున్నాయని అంచనాకు వచ్చారు. కరోనా మహమ్మారి బారినపడి కోలుకున్న వారిలో సహజసిద్ధంగా రోగనిరోధక శక్తి వస్తుందని పలు నివేదికలు వెల్లడించాయి. అది మళ్లీ వైరస్ సోకకుండా కొన్ని నెలల పాటు రక్షణ కల్పిస్తుందని తెలిపాయి. అయితే.. రోగనిరోధక శక్తిని హరిస్తూ బీఏ.5 వేరియంట్ ప్రమాదకరంగా మారుతోంది. సులభంగా ఒకరి నుంచి ఒకరికి సోకుతోంది. 'ఈ వేరియంట్ ఎందుకు ప్రమాదకరంగా మారుతోందంటే.. గతంలో వచ్చిన ఇమ్యూనిటీని ఎదుర్కొని సులభంగా శరీరంలోకి ప్రవేశించటమే. 2020లో వచ్చిన డెల్టా, ఒమిక్రాన్ బీఏ1 వేరియంట్ బారినపడి కోలుకోగా వచ్చిన రోగనిరోధక శక్తి సైతం ఎలాంటి రక్షణ కల్పించదు' అని తెలిపారు కాలిఫోర్నియా యూనివర్సిటిలో పని చేస్తున్న అంటువ్యాధులు నిపుణులు బ్లూమ్‌బెర్గ్. ఇటీవల సైన్స్ జర్నల్‌లో ప్రచురితమైన నివేదిక సైతం బీఏ5 వేరియంట్‌పై హెచ్చరించింది. మూడు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారిలోనూ ఈ వేరియంట్ మళ్లీ సోకుతున్నట్లు పేర్కొంది. రోగనిరోధక శక్తిని రహస్యంగా ఎదురుకునే వేరియంట్‌గా అభివర్ణించారు లండన్‌లోని ఇంపీరియల్ కళాశాల పరిశోధకులు. గతంలోని వేరియంట్ల కంటే ప్రమాదకరమని, ఈ వేరియంట్‌ను ఇమ్యూన్ వ్యవస్థ గుర్తించలేకపోతోందని వెల్లడించారు. ఇదీ చదవండి: 'సూపర్ మూన్'గా జాబిల్లి.. మరో రెండ్రోజుల్లోనే.. -
డ్రాగన్ కంట్రీకి దడ పుట్టిస్తున్న ఒమిక్రాన్.. కొత్తగా సబ్‌వేరియంట్ కలకలం
షాంఘై: కరోనాను కట్టడి చేసేందుకు 'జీరో పాలసీ' పేరుతో లాక్డౌన్ సహా అత్యంత కఠిన ఆంక్షలు విధిస్తోంది చైనా. అయినప్పటికీ కొత్త వేరియంట్లు పుట్టుకొస్తుండటం డ్రాగన్ కంట్రీకి తలనొప్పులు తెస్తోంది. తాజాగా షాంఘై నగరంలోని పుడాంగ్ జిల్లాలో కరోనా ఒమిక్రాన్ సబ్‌వేరియంట్ B.A.5.2.1 అనే కొత్త రకాన్ని గుర్తించినట్లు అధికారులు ఆదివారం తెలిపారు. విదేశాల నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో జులై 8న ఈ వేరియంట్‌ను గుర్తించినట్లు నగర హెల్త్ కమిషన్ డిప్యూటీ డెరెక్టర్ జావో డాండన్ వెల్లడించారు. రెండు నెలల అనంతరం షాంఘై నగరంలో జూన్ మొదటివారంలో లాక్‌డౌన్‌ను ఎత్తివేశారు. అయితే కొత్త కేసులు వెలుగుచూసిన ప్రాంతంలో కఠిన ఆంక్షలు అమలు చేస్తూ వస్తున్నారు. ఇటీవల కాలంలో స్థానికంగా వ్యాప్తి చెందుతున్న కేసుల సంఖ్య పెరిగినట్లు జావో వివరించారు. దీంతో షాంఘైలో నివాసముండే వారికి జులై 12-14 మధ్య రెండు రౌండ్ల కరోనా పరీక్షలు నిర్వహించిననున్నట్లు చెప్పారు. విదేశాల్లో అత్యంత వేగంగా వ్యాప్తి చెందుతున్న ఒమిక్రాన్ BA.5 రకాన్ని చైనాలో తొలిసారి మే 13న షాంఘై నగరంలో గుర్తించారు. ఉగాండ నుంచి వచ్చిన ఓ వ్యక్తి నమూనాలో ఇది బయటపడింది. ఇప్పుడు అందులోనే సబ్వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. చైనాలో ఇప్పటివరకు మొత్తం 2,26,610 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్ కారణంగా 5,226 మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా బారినపడినవారిలో 2,20,380 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,004 యాక్టివ్ కేసులున్నాయి. -
దేశంలో ఒమిక్రాన్ కొత్త వేరియంట్.. ప్రపంచవ్యాప్తంగా 2వారాల్లో..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో తొలిసారిగా ఓమిక్రాన్ వైరస్ కొత్త ఉప–వేరియంట్‌ను గుర్తించినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తెలిపింది. దీనికి బీఏ.2.75 అని పేరు పెట్టారు. యూరప్–అమెరికాలో బీఏ.4 , బీఏ.5 కేసులు ఉన్నాయని డబ్ల్యూహెచ్ఓ డైరెక్టర్ జనరల్ టెడ్రోస్ అధనామ్ ఘెబ్రేయేసస్ తెలిపారు. భారత్ వంటి దేశాల్లో బీఏ.2.75 అనే కొత్త సబ్–వేరియంట్ ప్రమాదం ఎక్కువగా ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ తన నివేదికలో పేర్కొంది. ఈ వేరియంట్ తొలిసారిగా భారత్‌లో కనిపించిందని, తర్వాత మరో 10 దేశాల్లోనూ గుర్తించామని ఆయన వెల్లడించారు. కాగా డబ్ల్యూహెచ్ఓ గణాంకాల ప్రకారం ప్రపంచంలో కరోనా కేసుల సంఖ్య గత రెండు వారాల్లో ఏకంగా 30 శాతం పెరిగింది. కాగా, గత 24 గంటల్లో భారత్‌లో 18,930 కొత్త కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. కోవిడ్‌తో మరో 35 మంది మరణించారు. యాక్టివ్ కేసులు 1,17,893కు పెరిగాయి. చదవండి: (10 నెలల చిన్నారికి ఉద్యోగమిచ్చిన రైల్వే) -
Corona Virus: 110 దేశాల్లో వెల్లువలా కరోనా కేసులు
జెనీవా: కరోనా వైరస్.. వైద్య నిపుణులు అనుకున్నదాని కంటే మొండి ఘటంగా మారుతోంది. మహమ్మారిగా కరోనా కథ ముగిసిపోవడం లేదు. కేవలం రూపం మాత్రమే మార్చుకుంటోంది అంతే. ప్రస్తుతం 110 దేశాల్లో కేసులు వెల్లువలా పెరిగిపోతుండడంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ(WHO) హెచ్చరికలు జారీ చేసింది. ఈ మహమ్మారి మారుతోంది కానీ అది ముగియలేదు. #COVID19 వైరస్‌ని ట్రాక్ చేయగల మా(డబ్ల్యూహెచ్‌వో) సామర్థ్యం ముప్పు అంచుకి చేరుకుంది. ఒమిక్రాన్, దాని నుంచి పుట్టుకొస్తున్న వేరియెంట్లను ట్రాక్ చేయడం, విశ్లేషించడం చాలా కష్టతరంగా మారుతోంది. కాబట్టి ప్రపంచ దేశాలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది అని డబ్ల్యూహెచ్‌వో డైరెక్టర్ జనరల్ ట్రెడోస్ ప్రకటించారు. బీఏ.4, బీఏ.5.. కేసులు వెల్లువలా పెరిగిపోతున్నాయ్. కానీ, కొత్త వేరియెంట్ల జాడను ట్రేస్ చేయలేకపోతున్నాం. వాటిలో ముప్పు కలిగించే వేరియెంట్లు లేకపోలేదు. దాదాపు 110 దేశాల్లో పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఈ పెరుగుదల గతంతో పోలిస్తే.. 20 శాతం అధికంగా పెరిగిపోయాయి. కేవలం డబ్ల్యూహెచ్‌వో పరిధిలోని ఆరు రీజియన్లలో మూడింటిలో మరణాలు పెరిగిపోయాయి. ఇప్పుడు కొవిడ్ ప్రొటోకాల్స్ పాటించడం ఒక్కటే రాబోయే ముప్పును తగ్గించగలదు. గత 18 నెలల నుంచి.. 12 బిలియన్ వ్యాక్సిన్స్ వ్యాక్సిన్ డోసుల ప్రక్రియ పూర్తైంది. కనీసం 70 శాతం జనాభాకు వ్యాక్సినేషన్ పూర్తి చేయాలని.. తద్వారా వైరస్ వ్యాప్తిని కట్టడి చేయడమో, జరగబోయే నష్ట తీవ్రతను తగ్గించడమో చేసుకోవచ్చని ప్రపంచ దేశాలకు పిలుపు చేయాలని డబ్ల్యూహెచ్‌వో పిలుపు ఇచ్చింది. మరోవైపు భారత్‌లోనూ 14వేలకు తగ్గకుండా కొత్త కేసులు నమోదు అవుతుండడం చూస్తున్నాం. -
దేశంలో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం
ఢిల్లీ: భారత్‌లో ఒమిక్రాన్ సబ్‌వేరియెంట్ కేసుల కలకలం మొదలైంది. ప్రపంచవ్యాప్తంగా అత్యంత వేగంగా కరోనా వైరస్ వ్యాప్తిని చెందిస్తున్న వేరియెంట్లుగా బీఏ.4, బీఏ.5లను పరిశోధకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో ఈ రెండు ఉపవేరియెంట్‌ల కేసులు ఇప్పుడు మన దేశంలోనూ వెలుగు చూడడం ఆందోళనకు గురి చేస్తోంది. భారత్‌లో బీఏ.4, బీఏ.5 సబ్‌వేరియెంట్ కేసులు బయటపడినట్లు ఇన్సాకాగ్ (INSACOG) ప్రకటించింది. బీఏ.4 కేసులు తెలంగాణ, తమిళనాడులో వెలుగు చూడగా.. బీఏ.5 కేసు తెలంగాణలోనే బయటపడిందని తెలిపింది. ఒమిక్రాన్ వేరియెంట్లో ఉపవేరియెంట్లు బీఏ.4, బీఏ.5లు.. కరోనాలో ఇప్పటిదాకా అత్యంత వేగవంగా వైరస్‌ను వ్యాప్తి చెందించేవిగా పేరొందాయి. దక్షిణాఫ్రికా నుంచి దీని విజృంభణ మొదలైందని తెలిసిందే. అయితే ఒమిక్రాన్ ప్రధాన వేరియంట్ కంటే ఇవి ప్రమాదకారి కాదని, కాకపోతే వీటి ద్వారా సామాజిక వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఇదివరకే స్పష్టం చేసింది. ఇన్సాకాగ్ ఆదవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో.. తమిళనాడులో 19 ఏళ్ల యువతిలో బీఏ.4 ఉపవేరియెంట్ బయటపడిందని, అలాగే తెలంగాణలో (హైదరాబాద్ ఎయిర్పోర్ట్) సౌతాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తి శాంపిల్‌లోనూ ఈ ఉపవేరియెంట్ వెలుగు చూసింది. మరోవైపు తెలంగాణలోనే 80 ఏళ్ల వ్యక్తికి బీఏ.5 ఉపవేరియెంట్ కనుగొన్నట్లు ఇన్సాకాగ్ తెలిపింది. ఈ వృద్ధుడికి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని, పైగా వ్యాక్సినేషన్ ఫుల్‌గా పూర్తికాగా, కేవలం స్వల్పకాలిక లక్షణాలే బయటపడినట్లు తెలిపింది. ముందస్తు జాగ్రత్తగా అప్రమత్తమైన అధికారులు.. కాంటాక్ట్ ట్రేసింగ్ మొదలుపెట్టారు. భారత్‌లో ఇప్పటికే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల ఈ రెండు సబ్ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఈ రెండు సబ్ వేరియంట్ల వల్ల కొద్దిరోజుల్లో కేసులు పెరగవచ్చు, కానీ, ఉద్ధృతి తక్కువగానే ఉంటుందంటున్నారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ.. మరిన్ని వేరియెంట్లు.. అందులో ప్రమాదకరమైనవి ఉండే అవకాశాలు ఉన్నందున అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని తెలిపారు. ఇన్సాకాగ్ (ఇండియన్ సార్స్ కోవ్-2 జీనోమిక్స్ కన్సార్టియం).. కరోనా వేరియెంట్ల కదలికలపై, కేసుల పెరుగుదలపై నిరంతర పర్యవేక్షణ నిర్వహించే కేంద్ర ఆధీన విభాగం. చదవండి: శారీరకంగా కలవడం వల్లే వైరస్ విజృంభణ! -
ఒమిక్రాన్ కలవరం.. తమిళనాడులో సబ్‌వేరియంట్ బీఏ.4 రెండో కేసు
BA4 Variant India: కరోనా వైరస్ చిన్న గ్యాప్ ఇచ్చి మళ్లీ దడ పుట్టిస్తోంది. కొత్త రూపం దాల్చుకొని ప్రజలపై పంజా విసురుతోంది. ఇప్పుడిప్పుడే హమ్మయ్యా అనుకుంటున్న ప్రజలను బాబోయ్ అంటూ భయాందోళనకు గురిచేస్తోంది. భారత్‌లోనూ ఒమిక్రాన్ సబ్ వేరియంట్ కేసులు కలకలం రేపుతున్నాయి. మొన్నటికి మొన్న ఒమిక్రాన్ బీఏ.4 తొలి కేసు హైదరాబాద్‌లో వెలుగు చూడగా.. తాజాగా తమిళనాడులో రెండో కేసు నమోదయ్యింది. ఈ విషయాన్ని రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి సుబ్రమణియన్ ధృవీకరించారు. ఈ మేరకు శనివారం ఓ ప్రకటన విడుదల చేశారు. చెంగళ్పట్టు జిల్లాలోని నవలూరుకు చెందిన వ్యక్తికి ఈ వైరస్ సోకినట్లు తెలిపారు. సంబంధిత వార్త: హైదరాబాద్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు కాగా బీఏ4 వేరియంట్ మొట్టమొదటిసారిగా 2022 జనవరి 10న దక్షిణాఫ్రికాలో వెలుగుచూసింది. ఆ తర్వాత ఆఫ్రికా దేశాలన్నింటిలోనూ ఈ కేసులు వెలుగులోకి వచ్చాయి. ఈ కేసుకు సంబంధించి ఇండియా సార్స్ కోవ్ 2 జీనోమిక్స్ కన్సార్షియం ఈ నెల 23న బులెటిన్ విడుదల చేయనుంది. అయితే ఒమిక్రాన్ సబ్ వేరియంట్ BA.4 లేదా BA.5 సోకిన వ్యక్తులకు కొత్త లక్షణాలు ఏవీ కనిపించడం లేదని వైద్యులు చెబుతున్నారు. అంతేగాక ఈ కొత్త వేరియంట్లు పెద్దగా ప్రమాదకరమైనవని కావని అభిప్రాయపడుతున్నారు. ఇక బీఏ.4 సబ్ వేరియంట్ హైదరాబాద్‌లో నమోదు అయిన విషయం తెలిసిందే. బీఏ.4 తొలికేసు వెలుగుచూసిన తర్వాత అతనితో కాంటాక్ట్ అయిన వారిని గుర్తించే పనిలో ఉన్నామని అధికారులు పేర్కొన్నారు. దక్షిణాఫ్రికా నుంచి హైదరాబాద్ వచ్చిన వ్యక్తి ఈ వేరియంట్ బారిన పడినట్లు అధికారులు తెలిపారు. సంబంధిత వ్యక్తిలో లక్షణాలు ఏవీ లేవని వైద్యులు వెల్లడించారు. -
హైదరాబాద్‌లో ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్‌కు చెందిన రెండు సబ్ వేరియంట్ కేసులు తెలంగాణలో వెలుగుచూశాయి. ఇవి దేశంలోనే తొలిసారిగా హైదరాబాద్‌లో నమోదయ్యాయి. సబ్ వేరియంట్ ‘బీఏ.4’కేసు ఈ నెల తొమ్మిదో తేదీన నమోదైంది. హైదరాబాద్ విమానాశ్రయంలో దిగిన దక్షిణాఫ్రికాకు చెందిన 42 ఏళ్ల వ్యక్తికి వైద్యపరీక్షలు నిర్వహించగా బీఏ.4 సోకినట్లు నిర్ధారణ అయింది. మరో సబ్ వేరియంట్ ‘బీఏ.2.12.1’కేసు కూడా ఈ నెల ఆరో తేదీన నమోదైంది. ఇటీవల అమెరికా నుంచి ఇక్కడికి వచ్చిన తెలంగాణకు చెందిన 51 ఏళ్ల వ్యక్తిలో అది బయటపడింది. ఈ ఇద్దరి నమూనాలను సెంటర్ ఫర్ డీఎన్ఏ ఫింగర్ ప్రింటింగ్ అండ్ డయాగ్నొస్టిక్స్ (సీడీఎఫ్‌డీ)లో జీనోమ్ సీక్వెన్సింగ్ చేయగా రెండు వేర్వేరు ఒమిక్రాన్ సబ్ వేరియంట్లు ఉన్నట్లుగా తేలింది. అయితే ఆ ఇద్దరి పరిస్థితి ఎలా ఉందో ఇప్పటివరకు తెలియరాలేదు. వారు వైద్య, ఆరోగ్య శాఖ పర్యవేక్షణలోనే ఆసుపత్రుల్లో ఉన్నారా? లేదా? అన్న వివరాలను అధికారులు వెల్లడించడంలేదు. కాగా, దక్షిణాఫ్రికా తదితర దేశాల్లో కోవిడ్ కేసుల ఉద్ధృతికి కారణమైన ఒమిక్రాన్ సబ్ వేరియంట్ ’బీఏ.4 ’ కేసులు భారత్‌లోని మరిన్ని నగరాల్లో నమోదయ్యే అవకాశముందని భారత వైద్య పరిశోధన మండలి శాస్త్రవేత్త ఒకరు అభిప్రాయపడ్డారు. ఇంతకుముందు కరోనా వచ్చి, రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్నవారికి కూడా ఇవి సోకుతున్నట్టు ఇప్పటికే నిర్ధారణ అయింది. ఒమిక్రాన్ వేరియంట్ కంటే ఇవి ప్రమాదకారి కాదని, కాకపోతే వీటి వ్యాప్తి మాత్రం అధికంగా ఉంటుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టం చేసింది. భారత్‌లో ఇప్పటికే టీకా కార్యక్రమాన్ని విస్తృతంగా చేపట్టడం వల్ల ఈ రెండు సబ్ వేరియంట్ల ప్రభావం స్వల్పంగానే ఉండవచ్చని పలువురు నిపుణులు అభిప్రాయపడ్డారు. ఈ రెండు సబ్ వేరియంట్ల వల్ల కొద్దిరోజుల్లో కేసులు పెరగవచ్చు, కానీ, ఉద్ధృతి తక్కువగానే ఉంటుందంటున్నారు. బాధితులకు తీవ్రస్థాయి అనారోగ్య ముప్పు, ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఉండవని అభిప్రాయపడుతున్నారు. చదవండి: మంకీపాక్స్ సెక్స్ వల్లే విజృంభణ! -
నార్త్ కొరియాలో కరోనా కలకలం.. ఆందోళనలో కిమ్
ఉత్తరకొరియాలో కరోనా కలకలం సృష్టిస్తోంది. తాజాగా నార్త్ కొరియాలో కరోనా కేసు నమోదు అయినట్టు ఆ దేశ మీడియా తెలిపింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా మహమ్మారిని అడ్డుకుంటున్నట్లు ప్రకటించుకుంటూ వచ్చిన కిమ్ ప్రభుత్వం తొలి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు ప్రకటించింది. రాజధాని ప్యాంగ్ యాంగ్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతుండగా, సదరు వ్యక్తుల నుంచి నమూనాలను సేకరించారు. ఒమిక్రాన్ పాజిటివ్ కేసు అని నిర్ధారణ అయిన తర్వాత నార్త్ కొరియా అధ్యక్షుడు కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో సమావేశమయ్యారు. మహమ్మారి కట్టడికి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. ఇదిలా ఉండగా.. కరోనా కారణంగా తొలిసారిగా కిమ్ జోంగ్ ఉన్ మాస్కు ధరించి కనపడటం అందరినీ ఆశ్చర్యపరిచింది. దీనికి సంబంధించిన వీడియోలు, ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరోవైపు.. తొలి ఒమిక్రాన్ కేసు నమోదైన 24 గంటల్లోపే ఆ రోగి చనిపోవడంతోపాటు మరో ఆరు కొత్త కేసులు వచ్చినట్లు శుక్రవారం వెల్లడైంది. దీంతో కిమ్ జోంగ్ ఉన్ ఆందోళన చెందుతున్నట్టు తెలుస్తోంది. ఇక, నార్త్ కొరియాలో కోవిడ్ టీకాలు అందుబాటులో లేకపోవడంతో పరిస్థితులు ప్రమాదకరంగా మారే అవకాశాలున్నాయి. ఉత్తర కొరియన్లు ఇప్పటివరకు టీకాలు తీసుకోలేదు. అంతకుముందు ఉచితంగా వ్యాక్సిన్లు ఇస్తామని ప్రపంచ ఆరోగ్య సంస్థ డబ్ల్యూహెచ్‌వో, రష్యా, చైనా ప్రకటించినప్పటికీ.. కిమ్ తిరస్కరించారు. North Korea claims ‘first ever’ Covid outbreak with hermit kingdom going into lockdown pic.twitter.com/6V7GH30XuB — The Sun (@TheSun) May 13, 2022 ఇది కూడా చదవండి: రణరంగంగా మారిన రావణ లంక.. మంత్రులకు చేదు అనుభవం -
దడ పుట్టిస్తున్న ధరలు.. ఎనిమిదేళ్ల తర్వాత మళ్లీ..
న్యూఢిల్లీ: దేశ ప్రధాన ఆర్థిక రంగం ఇంకా సవాళ్లలోనే కొనసాగుతోందని తాజాగా విడుదలైన రిటైల్ ద్రవ్యోల్బణం, పారిశ్రామిక ఉత్పత్తి గణాంకాలు వెల్లడించాయి. కరోనా మూడవ వేవ్ (ఒమిక్రాన్) సవాళ్ల నేపథ్యంలో మార్చిలో పారిశ్రామిక ఉత్పత్తి కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. ఇక సామాన్యునికి ఆందోళన కలిగించే స్థాయిలో వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం ఏప్రిల్‌లో ఏకంగా 7.79 శాతానికి ఎగసింది. అంటే 2021 ఇదే నెలతో పోల్చితే రిటైల్ ఉత్పత్తుల బాస్కెట్ ధర 7.79 శాతం పెరిగిందన్నమాట. 2021 ఏప్రిల్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.23 శాతం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో ఉండాలి. అయితే వరుసగా నాలుగు నెలల నుంచి ఆపై స్థాయిలోనే రిటైల్ ద్రవ్యోల్బణం కొనసాగుతుండడం గమనార్హం. కరోనా సవాళ్లతో నెలకొన్న సరఫరాల సమస్యలు ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధంతో మరింత పెరిగాయి. డాలర్ మారకంలో రూపాయి కనిష్ట స్థాయి పతనం ధరా భారాన్ని మరింత పెంచుతోంది. జాతీయ గణాంకాల కార్యాలయం (ఎన్ఎస్ఓ) గురువారం విడుదల చేసిన ద్రవ్యోల్బణం గణాంకాల్లో ముఖ్యాంశాలు పరిశీలిస్తే... ► 2014 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం 8.33 శాతానికి చేరింది. అటు తర్వాత మళ్లీ ఆ స్థాయిలో రేటును చూడ్డం ఇదే తొలిసారి. ► ఆహార, ఇంధన ధరల భారీ పెరుగుదల తాజాగా రిటైల్ ద్రవ్యోల్బణాన్ని పెంచుతోంది. ► 2021 ఏప్రిల్‌లో ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం 1.96% అయితే, 2022 మార్చితో 7.68%గా ఉంది. ఏప్రిల్‌లో ఈ రేటు ఏకంగా 8.38%కి పెరిగింది. ఫుడ్ బాస్కెట్లో ఒక్క కూరగాయల ధరలు ఏకంగా 15.41% పెరిగాయి. మార్చిలో ఈ పెరుగుదల 11.64 %. ► ఇంధనం, లైట్ విభాగంలో రిటైల్ ద్రవ్యోల్బణం మార్చిలో 7.52 శాతం ఉంటే, ఏప్రిల్‌లో 10.80 శాతానికి ఎగసింది. ► వంట నూనెలు, ఫ్యాట్స్ విభాగంలో ధరల భారం మార్చితో పోల్చితే (18.79 శాతం) స్వల్పంగా 17.28 శాతానికి తగ్గినా సామాన్యునికి ఈ స్థాయి ధరల పెరుగుదలే చాలా తీవ్రమైనది కావడం గమనార్హం. ఎరువులతోపాటు భారత్ వంట నూనెల అవసరాలకు ఉక్రెయిన్ ప్రధాన వనరుగా ఉంది. యుద్ధంతో ఆ దేశం అతలాకుతలం నేపథ్యంలో సరఫరాల సమస్యలు తీవ్రమయ్యాయి. జూన్‌లో మరో దఫా రేటు పెంపు! ఈ సంవత్సరం ప్రారంభం నుంచి రిటైల్ ద్రవ్యోల్బణం లక్ష్యానికి మించి నమోదవుతోంది. జనవరిలో 6.01 శాతం, ఫిబ్రవరిలో 6.07 శాతం, మార్చిలో 17 నెలల గరిష్ట స్థాయిలో ఏకంగా 6.95 శాతానికి చేరడం ఆందోళన కలిగిస్తోంది. తాజా సమీక్షా నెలల్లో రిటైల్ ద్రవ్యోల్బణం 7.79 శాతానికి చేరడంతో జూన్ మొదటి వారంలో జరిగే పాలసీ సమీక్ష సందర్భంగా ఆర్బీఐ ఎంపీసీ మరో దఫా రేట్ల పెంపు ఖాయమని నిపుణులు పేర్కొంటున్నారు. పాలసీ విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం అంచనాలను ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏప్రిల్ మొదటి వారం ఆర్బీఐ పరపతి సమీక్ష భారీగా 1.2 శాతం మేర పెంచేసింది. దీనితో 2022–23లో రిటైల్ ద్రవ్యోల్బణం 4.5 శాతం ఉంటుందన్న క్రితం అంచనాలు 5.7 శాతానికి పెరిగాయి. వరుసగా నాలుగు త్రైమాసికాల్లో ద్రవ్యోల్బణం 6.3 శాతం, 5.8 శాతం, 5.4 శాతం, 5.1 శాతంగా ఉంటుందని ఆర్బీఐ కమిటీ అంచనావేసింది. అయితే ఈ లెక్కలు తప్పే అవకాశాలు స్పష్టమవడంతో నేపథ్యంలో ఈ నెల మొదట్లో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ద్రవ్యపరపతి విధాన మధ్యంతర కమిటీ ద్రవ్యోల్బణం కట్టడే లక్ష్యంగా రెపో రేటును అనూహ్య రీతిలో 4 శాతం నుంచి 4.4 శాతానికి పెంచింది. నాలుగేళ్ల తర్వాత రెపో రేటు పెరగడం ఇదే తొలిసారి. 2018 ఆగస్టు తర్వాత ఆర్బీఐ పాలసీ రేటు పెంపు ఇది. కరోనా సవాళ్ల తీవ్రత నేపథ్యంలో... 2020, మే 22న రుణ రేటును కనిష్ట స్థాయికి (4 శాతానికి) తగ్గించిన నాటి నుంచి 4 శాతం వద్ద రెపో రేటు కొనసాగుతోంది. వరుసగా 11 ద్వైమాసిక సమావేశాల కాలంలో రెపో రేటును 4 శాతం వద్ద యథాతథంగా ఆర్బీఐ కొనసాగిస్తోంది. 4.4 శాతానికి రెపో రేటును పెంచడంతోపాటు వ్యవస్థలో నుంచి తక్షణం రూ.87,000 కోట్లు వెనక్కు మళ్లే విధంగా... రెపో రేటుతో బ్యాంకులు ఆర్బీఐ వద్ద తప్పనిసరిగా ఉంచాల్సిన ‘వడ్డీ రహిత’ నిధులకు సంబంధించిన నగదు నిల్వల నిష్పత్తి (సీఆర్ఆర్)ని కూడా పరపతి విధాన కమిటీ 50 బేసిస్ పాయింట్లు పెంచి, 4.5%కి చేర్చింది. మేలోనూ పైపైనే... గతవారం అనూహ్యంగా జరిగిన ఆర్బీఐ రేటు పెంపు నిర్ణయం సమర్థనీయమేనని వినియోగ ధరల సూచీ ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం తాజా స్పీడ్ (7.79 శాతం) స్పష్టం చేస్తోంది. అలాగే జూన్ 2022లో మరో దఫా రేటు పెంపు ఖాయమన్న అంచనాలను ఈ గణాంకాలు పెంచుతున్నాయి. 2021 మేలో అధిక బేస్ వల్ల (6.3 శాతం) 2022 మేలో రిటైల్ ద్రవ్యోల్బణం కొంత తగ్గవచ్చని భావిస్తున్నాం. హై బేస్ ప్రాతిపదిక కొంత తగ్గినా, ఆర్బీఐకి నిర్దేశిస్తున్న లక్ష్యానికి ఎగవనే 6.5 శాతంగా మేలో ద్రవ్యోల్బణం ఉంటుందని మేము అంచనా వేస్తున్నాము – అదితి నాయర్, ఇక్రా చీఫ్ ఎకనమిస్ట్. పారిశ్రామికోత్పత్తికి హైబేస్, ఒమిక్రాన్ తలనొప్పులు పారిశ్రామిక ఉత్పత్తి సూచీ (ఐఐపీ) వృద్ధి రేటు 2022 మార్చిలో కేవలం 1.9 శాతంగా నమోదయ్యింది. కరోనా మూడవ వేవ్ ఒమిక్రాన్ సవాళ్లతో పాటు 2021 మార్చి నెల హై బేస్ (అప్పట్లో వృద్ధి రేటు ఏకంగా 24.2 శాతం) దీనికి కారణమని విశ్లేషణలు వినిపిస్తున్నాయి. ‘పోల్చుతున్న నెలలో’ అతి తక్కువ లేదా ఎక్కువ గణాంకాలు నమోదుకావడం, అప్పటితో పోల్చి, తాజా సమీక్షా నెలలో ఏ కొంచెం ఎక్కువగా లేక తక్కువగా అంకెలు నమోదయినా అది ‘శాతాల్లో’ గణనీయ మార్పును ప్రతిబింబించడమే బేస్ ఎఫెక్ట్. మొత్తం ఐఐపీలో దాదాపు 70 శాతం వాటా కలిగిన తయారీ రంగం సమీక్షా నెల మార్చిలో పేలవ పనితనాన్ని ప్రదర్శించింది. జనవరి, ఫిబ్రవరిలో కూడా ఐఐపీపై (వృద్ధి రేటు కేవలం 1.5 శాతం) ఒమిక్రాన్ ప్రతికూల ప్రభావం పడిన సంగతి తెలిసిందే. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వశాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం దాదాపు అన్ని కీలక రంగాలపై హై బేస్ ప్రభావం కనిపించింది. ► తయారీ: మార్చిలో కేవలం 0.9 శాతం వృద్ధి నమోదయ్యింది. గత ఏడాది ఇదే నెల్లో ఈ రేటు ఏకంగా 28.4 శాతం. ► మైనింగ్: వృద్ధి రేటు 6.1% నుంచి 4 శాతానికి తగ్గింది. ► విద్యుత్: 22.5 శాతం వృద్ధి రేటు 6.1 శాతానికి దిగివచ్చింది ► క్యాపిటల్ గూడ్స్: భారీ యంత్ర పరికరాల ఉత్పత్తి, డిమాండ్‌కు ప్రాతిపదిక అయిన ఈ విభాగంలో వృద్ధి రేటు 50.4 శాతం నుంచి ఏకంగా 0.7 శాతానికి తగ్గింది. ►కన్జూమర్ డ్యూరబుల్స్: 2021 మార్చిలో 59.9 శాతం వృద్ధి నమోదయితే, తాజా సమీక్షా నెల్లో అసలు వృద్ధి లేకపోగా 3.2 శాతం క్షీణించింది. 2021–22లో 8.4 శాతం పురోగతి కాగా మార్చితో ముగిసిన 2021–22 ఆర్థిక సంవత్సరంలో ఐఐపీ వృద్ధి రేటు 8.4 శాతంగా ఉంది. 2020–21 ఇదే కాలంలో అసలు వృద్ది నమోదుకాకపోగా 8.4 శాతం క్షీణతలో ఉంది. 2020 మార్చి నుంచి ఒడిదుడుకుల బాట... మహమ్మారి కరోనా భయాలతో 2020 మార్చి 25 మే 31వ తేదీ వరకూ నాలుగు దశల్లో (మార్చి 25– ఏప్రిల్ 14, ఏప్రిల్ 15– మే 3, మే 4– మే 17, మే 18–మే 31) కఠిన లాక్డౌన్ అమలైన సంగతి తెలిసిందే. అప్పటి నుంచి ఐఐపీ తీవ్ర ఒడిదుడుకుల్లో ఉంది. 2020 మార్చి (మైనస్ 18.7%) నుంచి ఆ ఏడాది ఆగస్టు వరకు క్షీణతలోనే నడిచింది. అటు తర్వాత కొన్ని నెలల్లో భారీ వృద్ధి కనబడినా, దానికి ప్రధాన కారణం లో బేస్ ఎఫెక్ట్ కారణంగా కనబడింది. -
ఉత్తర కొరియాలో మొదటి కరోనా కేసు.. కిమ్ కీలక నిర్ణయం
ప్యాంగ్యాంగ్: కరోనా మహమ్మారి ప్రపంచ నలుమూలల వ్యాపించి వీర విహారం చేసిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో కూడా తమ దేశంలో ఒక్క కేసు కూడా నమోదు కాలేదని ఉత్తర కొరియా పేర్కొంది. ఈ వార్త ప్రపంచ దేశాలకు కొంత ఆశ్చర్యానికి కూడా గురి చేసింది. కానీ తాజాగా ఆ దేశంలో కూడా కరోనా కేసు నమోదు అయినట్టు ఉత్తర కొరియా మీడియా తెలిపింది. దాదాపు రెండు సంవత్సరాలకు పైగా మహమ్మారిని అడ్డుకుంటున్నట్లు ప్రకటించుకుంటూ వచ్చిన కిమ్ ప్రభుత్వం తాజాగా గురువారం( మే 11) నాడు తొలి కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కేసు నమోదైనట్లు ప్రకటించింది. రాజధాని ప్యోంగ్యాంగ్లో ప్రజలు జ్వరాలతో బాధపడుతుండగా, సదరు వ్యక్తుల నుంచి ఆదివారం నమూనాలు సేకరించారు. గురువారం ఆ ఫలితాలు రావడంతో వారికి ఓమిక్రాన్ వేరియంట్‌తో సోకినట్లు అధికారులు ధృవీకరించారు. ఈ వార్త తెలిసిన తక్షణమే ఆ దేశాధినేత కిమ్ జోంగ్ ఉన్ అధికారులతో సమావేశమయ్యారు. అందులో.. మహమ్మారి కట్టడికి కోసం దేశవ్యాప్తంగా లాక్డౌన్ విధించాలని నిర్ణయం తీసుకున్నారు. తమ భూభాగంలోకి కొవిడ్-19 ప్రవేశించకుండా అడ్డుకోగలిగామని ఉత్తర కొరియా ఇన్నాళ్లు గర్వంగా చెప్పుకుంటూ వచ్చిన చివరికి తలవంచాల్సి వచ్చింది. ఇటీవల చైనాలో వైరస్ కేసులు వెలుగు చూసిన వెంటనే అంతర్జాతీయ సరిహద్దులను మూసివేసి.. వర్తకులు, పర్యాటకులను సైతం దేశంలోకి రాకుండా చేసింది. అయినప్పటికీ ఒమిక్రాన్ కొరియాలో ప్రవేశించింది. చదవండి: China: చైనాలో మరో విమాన ప్రమాదం.. ఒక్కసారిగా మంటలు రావడంతో -
Sakshi Cartoon: ఎలుకల నుండి మానవుల్లోకి ఒమిక్రాన్
ఎలుకల నుండి మానవుల్లోకి ఒమిక్రాన్ -
Covid 4th Wave: ఫోర్త్ వేవ్‌కు అవకాశాలు తక్కువ.. కానీ
సాక్షి, హైదరాబాద్ : కరోనా మహమ్మారి పీడ పూర్తిగా తొలగిపోలేదని, వచ్చేనెలలో కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని, ఫోర్త్‌వేవ్ వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని కోవిడ్ నోడల్ కేంద్రమైన సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ పలు అంశాలను వివరించారు. ప్రస్తుతం ఉన్న డెల్టా, ఒమిక్రాన్, ఎక్స్‌ఈలు సబ్ వేరియంట్లని, వీటి ప్రభావం తక్కువగా ఉంటుందని, కరోనా కొత్త వేరియంట్లపై మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రూపాంతరం చెందిన కరోనా వైరస్ కొత్త వేరియంట్లు ప్రతి ఆరునెలలకు ఒకసారి పుట్టుకొస్తున్నాయని, మూడో వేవ్‌లో నూతన వేరియంట్ ఒమిక్రాన్ బలహీనపడి పెద్దగా ప్రభావం చూపించలేదన్నారు. రూపాంతరం చెందిన కరోనా వైరస్ మే, జూన్ నెలల్లో నాలుగో వేవ్ రూపంలో కాకున్నా కొంతమేర ప్రభావం చూపించడంతో పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతుందని వైద్యనిపుణులు అంచనాకు వచ్చారని తెలిపారు. చదవండి: Corona: కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరిక! నెలరోజులుగా సింగిల్ డిజిట్... కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీ ఆస్పత్రిలో కరోనా బాధితుల సంఖ్య గత నెలరోజులుగా సింగిల్ డిజిట్‌కే పరిమితమైందని, ప్రస్తుతం కేవలం నలుగురు పాజిటివ్ రోగులకు వైద్యసేవలు అందిస్తున్నామని రాజారావు తెలిపారు. గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు -
Corona: కరోనా ఫోర్త్ వేవ్ హెచ్చరిక!
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసుల విజృంభణ మళ్లీ మొదలవుతోందా? డెయిలీ కేసుల పెరుగుతుండడం అందుకు నిదర్శనమా? జూన్ కంటే ముందే.. ఫోర్త్ వేవ్ మొదలయ్యే అవకాశాలు ఉన్నాయా?.. అవుననే సంకేతాలు ఇస్తూనే అప్రమత్తంగా ఉండాలంటూ హెచ్చరిస్తున్నారు వైద్య నిపుణులు. భారత్‌లో వరుసగా 11 వారాల పాటు తగ్గుముఖం పట్టిన కరోనా కేసుల్లో ఒక్కసారిగా పెరుగుల చోటు చేసుకుంది. గత ఒక్కవారంలోనే 35 శాతం కేసులు పెరుగుదల కనిపిస్తోంది. దేశంలో కొన్ని రోజులుగా రోజువారీ కేసులు వెయ్యికి దిగువనే నమోదవుతున్నాయి. కానీ, ఇప్పుడు ఆ సంఖ్య ఒకేసారి రెండు వేలను దాటేసింది. గత 24 గంటల్లో(సోమవారం బులిటెన్ ప్రకారం..) 2,183 కొత్త కేసులు నమోదయ్యాయి. అంతకు ముందు రోజు నమోదైన కేసుల సంఖ్య 1,150 మాత్రమే. అంటే కేసుల సంఖ్య ఒక్క రోజులోనే దాదాపుగా 90 శాతం మేర పెరిగింది. రోజూవారీ పాజిటివిటీ రేటు చూసుకుంటే.. 0.31 శాతం నుంచి 0.83 శాతానికి పెరిగింది. ఢిల్లీ, హర్యానా, ఉత్తర ప్రదేశ్‌లో ఇన్ఫెక్షన్ల పెరుగుదల ఎక్కువగా నమోదు అయ్యింది. అయితే చాలాచోట్ల కేసులు తగ్గుముఖం పట్టిన పరిస్థితులు కనిపిస్తున్నా.. కొత్త వేరియెంట్లను తక్కువగా అంచనా వేయొద్దని, కేసులు ఒక్కసారిగా వెల్లువెత్తే అవకాశం లేకపోలేదని, ఈ పెరుగుదలను ఫోర్త్ వేవ్‌కి సంకేతాలుగా భావించి అప్రమత్తంగా ఉండాలని పలు రాష్ట్రాల ప్రభుత్వాలకు వైద్య నిపుణులు సూచిస్తున్నారు. కేసుల్ని పరిశీలించండి వైరస్ తీవ్రత లేదన్న ఉద్దేశం, వ్యాక్సినేషన్ కారణంగా ప్రభుత్వాలు సైతం కరోనాను పెద్దగా పట్టించుకోవడం లేదు. చాలాచోట్ల టెస్టింగ్-ట్రేసింగ్ కూడా జరగడం లేదు. ఈ తరుణంలో కరోనా మృతుల సంఖ్య కూడా అనూహ్యంగా పెరగడం కలవరపరుస్తోంది. గత 24 గంటల్లో దేశంలో 214 మరణాలు నమోదయ్యాయి. వీటిలో 62 కేరళ బ్యాక్ లాగ్ మరణాలు ఉన్నప్పటికీ... అంతకు ముందు రోజులో పోలిస్తే రెగ్యులర్ కరోనా మరణాల సంఖ్య భారీగానే నమోదు అయ్యాయి. ఇప్పటికే కరోనా తీవ్రత తగ్గడంతో పలు రాష్ట్రాలు ఆంక్షల్ని సడలించడం, పూర్తి ఎత్తేయడం చేశాయి. దీంతో మాస్క్ ల్లేకుండా జనాలు స్వేచ్ఛగా సంచరించడం పెరిగింది. ఇదే కేసులు పెరగడానికి కారణం అవుతుందని ఎయిమ్స్ వైద్యులు భావిస్తున్నారు. ఈ తరుణంలో.. కేసుల పెరుగుదలపై దృష్టిసారించాలని వైద్య నిపుణులు రాష్ట్రాలకు కీలక సూచన చేస్తున్నారు. ఇన్ఫెక్షన్ నుంచి రక్షణ కవచంగా భావించే ‘మాస్క్’ ధరించడాన్ని రూల్ తప్పనిసరి అమలు చేయాలని వాళ్లు కోరుతున్నారు. మాస్క్ మళ్లీ తప్పనిసరి యూపీలో కరోనా కేసుల పెరుగుదల కలవరపెడుతోంది. ఈ తరుణంలో గౌతమ్ బుద్ధ నగర్లో 65, ఘజియాబాద్‌లో 20, లక్నోలో 10 కొత్త కేసులు బయటపడ్డాయి. దీంతో ఆరు జిల్లాల్లో మాస్క్ తప్పనిసరి నిబంధనను మళ్లీ తీసుకొచ్చింది యూపీ ప్రభుత్వం. ఇక తెలంగాణలోనూ మాస్క్‌ను తప్పనిసరి చేయబోతున్నారంటూ కథనాలు వెలువడుతున్నా.. డైరెక్టర్ ఆఫ్ హెల్త్ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఫోర్త్‌వేవ్ హెచ్చరికలు! ఇదిలా ఉండగా.. ఈ పరిస్థితులు ఫోర్త్ వేవ్‌కి దారి తీస్తాయో లేదో ఇప్పుడే చెప్పలేమన్న కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ. .అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం మాత్రం ఉందని గుర్తు చేస్తోంది. దేశరాజధాని ఢిల్లీలో 517 కేసులు నమోదు అయ్యాయి. గత పదిహేను రోజుల్లో క్లోజ్ కాంటాక్ట్ 500 శాతం పెరిగినట్లు గణాంకాలు చెప్తున్నాయి. ఘజియాబాద్, నోయిడా రీజియన్‌లోనూ పాజిటివ్ కేసులు బయటపడుతున్నాయి. విద్యార్థులతోనే కరోనా విజృంభిస్తున్నట్లు అధికారులు తెలియజేశారు. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లో స్కూల్స్ మూతపడుతున్నాయి. దేశంలో ఇప్పటిదాకా నమోదైన కేసుల సంఖ్య 4,30,44,280కి చేరుకోగా... మరణాల సంఖ్య 5,21,965గా నమోదు అయ్యింది. ప్రస్తుతం దేశంలో 11,542 యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశంలో వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా వేగంగా కొనసాగుతోంది. నిన్న ఒక్కరోజే 2,66,459 డోసుల వ్యాక్సిన్ వేశారు. ఇప్పటి వరకు 1,86,54,94,355 డోసుల వ్యాక్సిన్ పంపిణీ చేశారు. సంబంధిత వార్త: మళ్లీ పెరుగుతున్న కోవిడ్ కేసులు.. కొత్త మార్గదర్శకాలు జారీ -
sakshi Cartoon: ఒమిక్రాన్ కొత్త వేరియంట్లపై WHO నిఘా
ఒమిక్రాన్ కొత్త వేరియంట్లపై WHO నిఘా -
భారత్‌లో ఎక్స్ఈ స్ట్రెయిన్ కేసులు.. ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు
XE Covid Variant, సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య తగ్గుముఖం పడుతోంది. కనిష్ట స్థాయిలో రోజువారీ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. కాగా, పలు దేశాల్లో మాత్రం కొత్త వేరియంట్లు కలకలం సృష్టిస్తూనే ఉన్నాయి. చైనా, యూకే వంటి దేశాల్లో కరోనా కారణంగా లాక్డౌన్ సైతం విధిస్తున్నారు. తాజాగా భారత్‌లో ఒమిక్రాన్ ఎక్స్ఈ స్ట్రెయిన్ తొలి కేసు నమోదు కావడం అందరినీ టెన్షన్‌కు గురిచేస్తోంది. ఈ నేపథ్యంలో ఒమిక్రాన్ ఎక్స్ఈ స్ట్రెయిన్‌పై నేషనల్ టెక్నికల్ అడ్వైజరీ గ్రూప్ ఆన్ ఇమ్యూనైజేషన్ (NTAGI) చీఫ్ డాక్టర్ ఎన్కే అరోరా కీలక వ్యాఖ్యలు చేశారు. సోమవారం ట్విట్టర్ వేదికగా ఆయన ఓ వీడియోలో మాట్లాడుతూ.. కొత్త వేరియంట్ల పట్ల భయపడాల్సిన అవసరంలేదన్నారు. ఎక్స్ఈ తరహాలో మరిన్ని వేరియంట్లు వస్తాయన్నారు. కానీ, వైరస్ పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కాగా, దేశంలో ఒకేసారి భారీగా పాజిటివ్ కేసులు నమోదు కాకపోవడంతో కొత్త వేరియంట్ పట్ల ఆందోళన చెందాల్సిన పనిలేదన్నారు. ఇదిలా ఉండగా.. ఒమిక్రాన్ కొత్త స్ట్రెయిన్ ఎక్స్ఈ కేసులు గుజరాత్, మహారాష్ట్రలో నమోదు అయ్యాయి. దీంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అంతకు ముందు ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియంట్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పందిస్తూ బీఏ.2 వేరియంట్ కంటే ఇది పదిశాతం వేగంగా వ్యాప్తి చెందుతుందని పేర్కొంది. Omicron giving rise to many new variants. It is of X series like XE & others. These variants will keep on occurring. Nothing to panic about... At the moment from Indian data it doesn’t show a very rapid spread: NK Arora, Chairman, Covid working group NTAGI pic.twitter.com/fu5E3QmdoJ — ANI (@ANI) April 11, 2022 -
‘చావమంటారా?’.. కరోనా పుట్టినింట హాహాకారాలు
లాక్‌డౌన్‌ను భరించడానికి ప్రజలకు ఓ ఓపిక అంటూ ఉంటుంది. కరోనా తొలినాళ్లలో లాక్‌డౌన్‌తో భారత్ ఎలాంటి పరిస్థితి ఎదుర్కుందో చూశాం. అయితే కరోనా పుట్టినిల్లు చైనాలో మాత్రం ప్రజలు పట్టుమని పది, పదిహేను రోజులు కూడా భరించలేకపోతున్నారు. కారణం.. అత్యంత కఠినమైన లాక్డౌన్ అక్కడ అమలు అవుతోంది కాబట్టి. జీరో టోలరెన్స్ పేరిట చైనా అనుసరిస్తున్న వైఖరిపై తొలి నుంచి విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ మధ్య పేషెంట్లను కంటెయినర్లలో ఉంచి మానవ హక్కుల సంఘాల నుంచి సైతం విమర్శలు ఎదుర్కొంది డ్రాగన్ క్రంటీ. ఇప్పుడు దేశంలోనే.. ఆ మాటకొస్తే ప్రపంచంలోనే అతిపెద్ద నగరాల్లో ఒకటైన షాంగైను లాక్‌డౌన్‌తో దిగ్భంధించి.. జనజీవనాన్ని అగమ్య గోచరంగా తయారు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. ఈ తీరుపైనా తీవ్రస్థాయిలో విమర్శలు వస్తున్నాయి. దాదాపు మూడు కోట్ల దాకా జనాభా ఉన్న షాంగై నగరం లాక్డౌన్ కట్టడిలో ఉండిపోయింది. ఇంటికే పరిమితమైన జనాలు.. పిచ్చెక్కిపోయి కిటికీలు, బాల్కనీల గుండా ఆర్తనాదాలు పెడుతున్నారు. ట్విటర్, ఇన్‌స్టా, ఇతర సోషల్ మీడియా నెట్‌వర్క్‌లలో ఇందుకు సంబంధించిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే.. చివరకు ఆకలి చావులు, ఆత్మహత్యల లాంటి విషాదాలే మిగులుతాయని నిపుణులు వాపోతున్నారు. Residents in #Shanghai screaming from high rise apartments after 7 straight days of the city lockdown. The narrator worries that there will be major problems. (in Shanghainese dialect—he predicts people can’t hold out much longer—he implies tragedy).pic.twitter.com/jsQt6IdQNh — Eric Feigl-Ding (@DrEricDing) April 10, 2022 యావో మింగ్ లె, యావో సీ(చావు బతుకుల) మధ్య ఉన్నమంటూ అపార్ట్మెంట్ల నుంచి కేకలు పెడుతున్నారు కొందరు. నిత్యావసరాలు దొరక్క.. ఆకలితో అలమటించిపోతున్నారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇంటర్నెట్లో వైరల్ అవుతున్నాయి. అయితే 2019లో తొలి కరోనా కేసు వుహాన్ నుంచి వెలుగు చూశాక.. ఈ స్థాయిలో చైనా కరోనా కేసుల్ని ఎదుర్కొవడం ఇదే ప్రథమం. కరోనా వైరస్ ఒమిక్రాన్ వేరియెంట్ (బీఏ.2) బ్రేకింగ్‌పాయింట్‌ను దాటేయడంతోనే కరోనా కేసులు వెల్లువెత్తుతున్నాయి అక్కడ. ఒక్క ఆదివారమే ఇక్కడ 25 వేల కేసులు నమోదు అయ్యాయట!. రికార్డు స్థాయిలో టెస్టుల వల్లే ఈ ఫలితం కనిపిస్తోంది. ఈ తరుణంలో.. మరింత కఠినంగా లాక్‌డౌన్‌ను ముందుకు తీసుకెళ్లాలని అక్కడి అధికారులు భావిస్తున్నారు. మరోవైపు సాయంలో కాస్త ఆలస్యమైనప్పటికీ.. సాయం మాత్రం అందుతూనే ఉందని అధికారులు అంటున్నారు. BREAKING—China’s grip on BA2. At least 23 cities in China on full or partial lockdown—cities with over 193 million residents. Food shortages throughout even Shanghai. Doctors and nurses also exhausted—this doctor collapsed, and was carried off by patients at an isolation center. pic.twitter.com/raJlRNEezC — Eric Feigl-Ding (@DrEricDing) April 9, 2022 నిత్యం జనాలతో సందడిగా ఉండే షాంగై నగరం.. ఇప్పుడు ఎడారి వాతావరణంను తలపిస్తోంది. ఆరోగ్య సిబ్బంది, వలంటీర్లు, డెలివరీ బాయ్స్, ఆరోగ్యానికి సంబంధించిన సమస్యలు(అదీ అత్యవసరం అయితే తప్ప) ఇతరులకు బయట తిరిగేందుకు అనుమతి ఇవ్వడం లేదు. వైరస్ కట్టడికి జనాలు సహకరించాలని, ఏదైనా తేడా జరిగితే అమెరికా, ఇటలీ, బ్రిటన్ లాంటి పరిస్థితులు తప్పవని, కాబట్టి కష్టమైన కొంచెం సహకరించాలని ప్రజలను కోరుతున్నారు అక్కడి వైద్యాధికారులు. అయితే కేసులు ఎక్కువగా వస్తున్నా.. ప్రజావ్యతిరేక నిరసనల దృష్ట్యా మంగళవారం నుంచి కొన్ని ప్రాంతాల్లో సడలింపులు ఇవ్వాలని అధికారులు నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. సంబంధిత వార్త: కరోనా కోరల్లో చైనా.. ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలు -
గుజరాత్లో కొత్తవేరియెంట్ ఎక్స్ఈ కేసు గుర్తింపు!
న్యూఢిల్లీ: కరోనా వైరస్‌లో అత్యంత వేగవంతంగా వ్యాపించే ఒమిక్రాన్ ఎక్స్ఈ వేరియెంట్ కేసు గుజరాత్లో నమోదు అయ్యింది. ఈ విషయాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ సైతం నిర్ధారించినట్లు తెలుస్తోంది. గుజరాత్లో మార్చి 13న కరోనా బారిన పడ్డ సదరు పేషెంట్.. వారం తర్వాత కోలుకున్నాడు. అయితే శాంపిల్ జీనోమ్ సీక్వెన్సింగ్‌లో సదరు పేషెంట్ ఎక్స్ఈ సబ్ వేరియెంట్ బారినపడినట్లు తెలుస్తోంది. అతని వివరాలు, ట్రావెల్ హిస్టరీ తదితర వివరాలను వెల్లడించేందుకు అధికారులు సుముఖత వ్యక్తం చేయలేదు. ఇదిలా ఉండగా.. దేశంలో ముంబైలో తొలి ఎక్స్ఈ కేసు నమోదు అయ్యిందని అధికారుల ప్రకటన హడలెత్తించింది. అయితే కేంద్రం మాత్రం ఆ ప్రకటనను ఖండించింది. ఒమిక్రాన్‌లో బీఏ-2 అత్యంత వేగంగా వ్యాపించే వేరియెంట్‌గా గుర్తింపు ఉండేది. ఈ జనవరిలో యూకేలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్ఈను.. ఒమిక్రాన్ బీఏ-2 కన్నా పది రెట్లు వేగంగా వ్యాపించే వేరియెంట్‌గా గుర్తించారు. ఇది అంత ప్రమాదకరమైంది ఏం కాదని, కాకపోతే వేగంగా వ్యాపించే గుణం ఉంది కాబట్టి జాగ్రత్తగా ఉండాలని వైద్యనిపుణులు హెచ్చరించారు. మరోవైపు దేశంలో 18 ఏళ్లు పైబడినవాళ్లకు మూడో డోసు(ప్రికాషన్) వ్యాక్సినేషన్ ప్రక్రియను ఆదివారం నుంచి అందుబాటులోకి తీసుకురానుంది కేంద్రం. -
ముంబైలో కొత్త వేరియంట్.. నాలుగో వేవ్‌కు సంకేతమా? లక్షణాలివే..
దేశంలో మళ్లీ కరోనా కలవరం మొదలైంది. కొత్త వేరియంట్ ఒమిక్రాన్ XE ముంబైలో తొలి కేసు వెలుగు చూసింది. జెనెటిక్ ఫార్ములా డిటర్మినేషన్‌లో భాగంగా మొత్తం 230 శాంపిల్స్‌ను పరీక్షించగా 228మందికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. ఒక శాంపిల్‌లో కప్పా రకం వైరస్ బయటపడగా.. మరో వ్యక్తికి XE వేరియంట్ సోకినట్లు శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇప్పటికే మే, జూన్ నెలలో ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు అంచనా వేశారు. మరి XE వేరియంట్ దేశంలో వైరస్ నాలుగో దశ విజృంభణకు కారణమవుతుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జనవరి 19న మొదటిసారిగా బ్రిటన్‌లో XE వేరియంట్ వెలుగుచూసింది. ఒమిక్రాన్‌లోని రెండు ఉపరకాల కలయికతో ఈ రకం పుట్టినట్టు సైంటిస్టులు గుర్తించారు. ఈ మ్యూటెంట్‌కు వేగంగా వ్యాప్తిచెందే లక్షణం ఉందని WHO ఇటీవలే హెచ్చరించింది. తాజాగా ముంబైలో XE కేసు నిర్థారణ కావడంతో కేంద్రం అప్రమత్తమైంది. ఇప్పుడిప్పుడే విస్తరిస్తున్న XE వేరియంట్ లక్షణాలు ఇంకా పూర్తిస్థాయిలో గుర్తించలేదు. సంబంధిత వార్త: భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం కొత్త వేరియంట్ లక్షణాలు అయితే.. ఒమిక్రాన్ వేరియంట్ తరహాలోనే ఈ సబ్ వేరియంట్ సోకిన వారికి జలుబు, ముక్కు కారడం, తుమ్ములు, గొంతునొప్పి వంటి ఆరోగ్య సమస్యలు ఉంటాయని వైద్య నిపుణులు చెబుతున్నారు. ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటివరకూ 600 మంది XE వేరియంట్ బారిన పడినట్లు ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాలు పేర్కొన్నాయి. తాజాగా భారత్‌లో XE వేరియంట్ వెలుగుచూడటంతో ఫోర్త్ వేవ్ ముప్పు పొంచి ఉందని నిపుణులు అంటున్నారు. కోవిడ్ నిబంధనలు పాటించడం వల్ల వైరస్ ఉధృతిని అడ్డుకోవచ్చని సూచిస్తున్నారు. అయితే ముంబై బీఎంసీ అధికారులు చెప్పిన ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కేసును కేంద్ర వైద్యారోగ్యశాఖ ఇంకా నిర్ధారించలేదు. -
భారత్‌లో ఒమిక్రాన్ కొత్త వేరియంట్ కలకలం
ముంబై: రెండేళ్ల నుంచి కరోనా మహమ్మారి ప్రజలను పట్టి పీడిస్తూనే ఉంది. వైరస్ కట్టడికీ ఎన్ని ప్రయత్నాలు చేసినా రూపం మార్చుకొని మళ్లీ దాడి చేస్తోంది. భారత్‌లో ప్రస్తుతం కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన విషయం తెలిసిందే. దీంతో కరోనా ఖతమైందనుకున్నాం. అందుకు తగ్గట్టే అన్ని రాష్ట్రాలు మాస్క్ ధరించడం మినహా అన్ని కోవిడ్ ఆంక్షలను క్రమంగా ఎత్తేస్తున్నాయి. అయితే తాజాగా మహమ్మారికి సంబంధించి మరో పిడుగులాంటి వార్త ప్రజలను కలవరానికి గురిచేస్తోంది. భారత్‌లో ఒమిక్రాన్‌లో రెండు కొత్త వేరియంట్లు వెలుగు చూశాయి. మహారాష్ట్ర రాజధాని ముంబైలో ఒకరికి ఒమిక్రాన్ ఎక్స్ఈ (XE) వేరియంట్ కేసు నమోదైనట్లు బృహాన్ ముంబై కార్పొరేషన్ అధికారులు వెల్లడించారు. దీంతోపాటు మరొకరికి కాపా వేరియంట్ కేసు నమోదైనట్లు పేర్కొన్నారు. జెనెటిక్ ఫార్ములా డిటర్మినేషన్‌లో భాగంగా మొత్తం 230 శాంపిల్స్‌ను పరీక్షించగా 228మందికి ఒమిక్రాన్ సోకినట్టు నిర్థారణ అయ్యింది. ఒక శాంపిల్‌లో కప్పా రకం వైరస్ బయటపడగా.. మరో వ్యక్తికి XE వేరియంట్ గుర్తించారు. అయితే కొత్త రకం వేరియంట్ నమోదైన వారిలో ఎవరికీ తీవ్ర లక్షణాలు లేవని, ఎవరికీ ఆక్సిజన్ సపోర్ట్, ఐసీయూ అవసరం లేదని బీఎంసీ అధికారులు తెలిపారు. చదవండి: నుదుటిపై తిలకం పెట్టుకుందని విద్యార్థినిని చితకబాదిన టీచర్ ఇదిలా ఉండగా యూకేలో జనవరి 19న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ XE కేసు నమోదైంది. ఇక ఒమిక్రాన్ - BA.1, BA.2 నుంచి రూపాంతరం చెందినదే ఈ కొత్త వేరియంట్ XE. ప్రస్తుతంలో ప్రపంచంలో దీని కేసులు ఎక్కువ నమోదు కాలేదు కానీ ఇతర వేరియంట్ల కంటే ఇది 10 శాతం ఎక్కువగా వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్ఓ తెలిపింది. మరోవైపు దేశంలో కొత్త వేరియంట్ వెలుగు చూసిన క్రమంలో కేంద్ర వైద్యారోగ్యశాఖ అప్రమత్తమైంది. కాగా దేశంలో గడిచిన 24 గంటల్లో 1086 కోవిడ్ కేసులు, 71 మరణాలు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 4,24,97,567కు చేరింది. ప్రస్తుతం 11,871 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 98.76గా.. పాజిటివిటీ రేటు 0.22గా ఉంది. చదవండి: Viral Video: ఓరిని తెలివి సల్లగుండా.. పరీక్షల్లో ఇలా కూడా కాపీ కొడతారా! -
కొత్త వేరియెంట్లు రావని అనుకోవడానికి లేదు
సాక్షి, హైదరాబాద్: ‘కొన్ని దేశాల్లో కోవిడ్ ఉధృతి ఇంకా కొనసాగుతోంది. ఐరోపా, చైనా, దక్షిణ కొరియా, వియత్నాం తదితర దేశాల్లో కేసులు పెరుగుతున్నాయి. ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచవ్యాప్తంగా కరోనా తగ్గిపోయిందని అనుకోవడానికి లేదు. దీన్ని మనం హెచ్చరికగా తీసుకుని భారత్‌కు ఇక ఏమీ కాదనే అతి విశ్వాసాన్ని వీడాలి. మరో నెలరోజులపాటు అప్రమత్తంగా ఉంటూ ఇతర దేశాల్లోని పరిస్థితులను గమనిస్తూ అన్ని జాగ్రత్తలు తీసుకోవాలి’ అని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్ హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు డా.కె. శ్రీనాథ్‌రెడ్డి సూచించారు. ప్రస్తుతం దేశంలో ముఖ్యంగా రెండు తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసులు అత్యల్పస్థాయికి చేరుకున్న నేపథ్యంలో ప్రస్తుత పరిస్థితులు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ‘సాక్షి’ ఇంటర్వ్యూలో శ్రీనాథ్‌రెడ్డి వివరించారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే... ఇతర దేశాల నుంచి ప్రమాదం పొంచే ఉంది ఒమిక్రాన్ వేరే దేశాల్లో ఇంకా పరిభ్రమిస్తోంది. రూపును మార్చుకుంటోంది. ఒమిక్రాన్ బీఏ.1, బీఏ.2 కాకుండా ఎక్స్, ఎక్స్ఈ, ఎక్స్ఎఫ్ అనే కొత్త వేరియెంట్లు అధిక ఇన్ఫెక్షన్లు కలిగిస్తాయని నిపుణులు చెబుతున్నారు. అది కొత్తరూపంలో మళ్లీ మనదేశంలోకి ప్రవేశిస్తుందా లేదా అన్నది ఇప్పుడే చెప్పలేం. కాబట్టి ఇప్పుడు మనలో ఏర్పడిన రోగనిరోధక శక్తి మూడు, నాలుగు నెలల తర్వాత కూడా ఉంటుందా అన్నది తెలియదు. అంటే ఆ తర్వాత అధికశాతం మందిలో ఇమ్యూనిటీ స్థాయిలు తగ్గాక కొత్త వేరియెంట్లు ప్రవేశిస్తే పరిస్థితి ఏమిటనేది చెప్పలేం. వైరస్ స్థిమితంగా ఉండటం లేదు ఇప్పుడు కూడా ఎలాంటి ప్రమాదం ఉండదని కొందరు చెబుతున్నారు. గతంలోనూ థర్డ్‌వేవ్‌కు ఆస్కారం లేదని చెప్పారు. అయితే, ఒమిక్రాన్ వచ్చింది. అందువల్ల ఇక కొత్త వేరియెంట్లు రావనుకోవడానికి లేదు. ఒకవేళ మన దగ్గర 2, 3 నెలల్లోనే కొత్తవి వచ్చినా పెద్దగా ప్రమాదం ఉండకపోవచ్చు. ఎప్పుడు ఏ వేరియెంట్లు ఎక్కడి నుంచి వస్తున్నాయో చెప్పలేం. ఎందుకంటే వైరస్ ఇంకా పరిణామ దశలోనే ఉంది. అది ఇంకా పూర్తిగా స్థిమితంగా ఉండటం లేదు. వచ్చే వేరియెంట్లతో తీవ్రత పెరగొచ్చు లేదా తగ్గొచ్చు. వైరస్ తీరు తేలేదాకా అందరూ వ్యక్తిగత జాగ్రత్తలు పాటిస్తూ రక్షణ చర్యలు తీసుకోవడమే మంచిది. 12 ఏళ్లలోపు వారికి పెద్దగా ప్రమాదం లేదు ప్రపంచవ్యాప్తంగా 12 ఏళ్ల లోపు వారికి తీవ్రమైన జబ్బు చేసే ఆస్కారం చాలా తక్కువగా ఉంది. అందువల్ల వారికి టీకాలు వేయడం వల్ల పెద్దగా ప్రయోజనం ఉండదు. రోగనిరోధక వ్యవస్థ పూర్తిగా రూపుదిద్దుకుంటున్న క్రమంలో ఆ వయసు వారికి కరోనా టీకాలు ఇవ్వడం వల్ల అంతకంటే ప్రమాదకర జబ్బులను ఎదుర్కునే శక్తిని తగ్గించినట్టు అవుతుందా అనే ప్రశ్న కూడా ఎదురవుతోంది. ఇప్పటికైతే 12 ఏళ్లలోపు వారికి కోవిడ్ టీకా ఇవ్వాల్సిన అవసరం లేదంటున్నారు. అన్ని వేరియెంట్లపై పనిచేసేలా టీకాలు ఏ వేరియెంట్‌పై అయినా ప్రభావవంతంగా పనిచేసే టీకా తయారీలో శాస్త్రవేత్తలు నిమగ్నమయ్యారు. అయితే కేవలం టీకాపైనే ఆధారపడకుండా మాస్క్‌లు ధరించడం, వ్యక్తిగత, చేతుల పరిశుభ్రత పాటించడం వంటి జాగ్రత్తలను కొనసాగించాలి. ఇదివరకు జపాన్, దక్షిణ కొరియాల్లో ఎవరికైనా జలుబు చేస్తే మాస్క్‌లు వేసుకుని వెళ్లే వాళ్లు. అలాంటి అలవాట్లను మనం కూడా అలవరచుకోవాలి. వారికి బూస్టర్ డోస్‌లు మంచిది 18 ఏళ్లు నిండిన వారందరికీ బూస్టర్ డోస్‌లు ఇవ్వడం మంచిదని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ వైరాలజీ సూచిస్తోంది. కేంద్ర ప్రభుత్వం కూడా దీనిపై పునరాలోచనలో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే 60 ఏళ్లలోపు వయసు వారిలో రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారు, దీర్ఘకాలిక జబ్బులున్న వారికి బూస్టర్‌డోస్‌లు ఇవ్వడం మంచిది. ఎందుకంటే ఈ కేటగిరిలోని వారు సులభంగా వైరస్ బారిన పడే అవకాశం ఉంటుంది. -
రికార్డు స్థాయి కరోనా కేసులతో హడల్
China's Covid caseload hit thousands per day: కరోనా పుట్టినిల్లు చైనాని గత కొన్ని రోజులుగా ఈ మహమ్మారి హడలెత్తిస్తోంది. గత రెండేళ్లలో ఎన్నడూ లేనివిధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ఇక ఒక్కరోజే సుమారు 20 వేల కరోనా కేసులను వెలుగు చూసినట్లు బుధవారం ఒక నివేదిక వెల్లడైంది. మొత్తానికి జీరో కోవిడ్ విధానం దారుణంగా విఫలమై చైనాలో అత్యధికంగా కేసులు నమోదు అవుతున్నాయి. అతి పెద్ద నగరమైన షాంఘైలో ఒమిక్రాన్ మ్యుటెంట్కి సంబంధించిన కేసులు వెల్లువెత్తుతున్నాయి. దీంతో లాక్డౌన్ సహా అంతర్జాతీయ ప్రయాణాల పైనా కఠిన ఆంక్షలు అమలు చేస్తోంది అక్కడి ప్రభుత్వం. పరిస్థితి చేజారిపోనివ్వకుండా ఆర్మీని సైతం రంగంలోకి దించారు. చైనాలో తాజాగా.. సుమారు 20,472 కేసులు నమోదైయ్యాయని, కొత్తగా ఎటువంటి మరణాలు సంభవించలేదని జాతీయ ఆరోగ్య కమిషన్ పేర్కొంది. ఒక్క షాంఘై నగరంలోనే దాదాపు 80% మేర కరోనా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. పైగా ఈ మహానగరంలో దశల వారీగా లాక్డౌన్లు విధించకుంటూ పోతుండటంతో నిర్బంధంలో ఉన్న ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు తాజాగా బుధవారం షాంఘై మొత్తం జనాభాకి కరోనా నిర్ధారణ పరీక్షలను నిర్వహించనున్నట్లు అధికారులు వెల్లడించారు. యూకేలో ఇమ్యూనిటీ పవర్ లేక.. ఈ కరోనా మహమ్మారీ ప్రారంభమైనప్పటి నుంచి గత రెండెళ్లలో లేనివిధంగా ఇంగ్లండ్‌లో మార్చి నెల నుంచి అత్యధిక స్థాయిలో కరోనా కేసులు నమోదయ్యాయి. 50 ఏళ్లు పైబడిన వారిలో ఒమిక్రాన్ సబ్ వేరియంట్ బీఏ.2కి సంబంధించిన కేసులు నమోదవుతున్నట్లు ఇంపీరియల్ కాలేజ్ లండన్ నేతృత్వంలోని రియాక్ట్-1 అధ్యయనం పేర్కొంది. ఈ ఒమిక్రాన్ సబ్ వేరియంట్‌కి సంబంధించిన కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నట్లు వెల్లడించింది. అంతేకాదు దాదాపు 90% కేసులే వీటికి సంబంధించినవే. అలాగే ఆస్పత్రులలో చేరే వారే సంఖ్యకూడా పెరిగే అవకాశం ఉందని రియాక్ట్ ప్రోగ్రామ్ డైరెక్టర్ పాల్ ఇలియాట్ తెలిపారు. వ్యాక్సిన్లు తీసుకున్నప్పటికీ వ్యాధి నిరోధక శక్తి క్షీణించడంతో 55 ఏళ్ల పైబడినవారే ఈ కొత్త కరోనా వేరియంట్ బారిన పడుతున్నట్లు అధ్యయనం పేర్కొంది. అయితే యూకే జనవరి నుంచి కరోనా కేసులు తగ్గుముఖం పట్టడంతో కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం తగ్గించింది. కానీ రికార్డు స్థాయిలో నమోదవుతున్న ఈ కేసుల నేపథ్యంలో వ్యాప్తి చెందుతున్న ఆ కొత్త ఒమిక్రాన్ వేరియంట్లను గుర్తించడం కష్టమౌవుతుందని ఇంపీరియల్‌లోని స్టాటిస్టికల్ ఎపిడెమియాలజీ ప్రొఫెసర్ క్రిస్టల్ డోన్నెల్లీ ఆందోళన వ్యక్తం చేశారు. (చదవండి: చైనాను కలవరపెడుతున్న కరోనా.. జిన్ పింగ్ సంచలన నిర్ణయం) -
China Corona: ప్రపంచాన్ని నివ్వెరపరుస్తున్న దృశ్యాలు
కరోనా పుట్టుకకు చైనానే కారణమని ఆరోపణలు ఉన్నాయి. ఆరంభంలో వైరస్ విజృంభించినా.. అంతే వేగంగా వైరస్‌ను అదుపు చేసింది. అయితే రెండేళ్ల పాటు ప్రపంచమంతా అతలాకుతలం అయిపోతుంటే.. చైనా మాత్రం జీరో టోలరెన్స్ పేరిట హడావిడి చేసింది. ఈ తరుణంలో ప్రపంచాన్ని నివ్వెరపరస్తున్న దృశ్యాలు కనిపిస్తున్నాయి ఇప్పుడు అక్కడ. షాంగై.. రెండున్నర కోట్ల జనాభా ఉన్న మహానగరం. అధిక జనసాంద్రతతో పాటు ప్రపంచంలో అత్యంత రద్దీ ఉండే ప్రాంతాల్లో ఒకటి. అలాంటి నగరం మూగబోయింది. మనుషులు, పశువులు రోడ్డెక్కడం లేదు. కఠిన లాక్‌డౌన్‌తో ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నారు. నిత్యావసరాలు, ఆస్పత్రి సేవలు సకాలంలో దొరక్క చాలామంది ఇబ్బంది పడుతున్నారు. నిరసనల గళం వీలైన రీతిలో వినిపిస్తున్నారు. రోబోలతో వీధుల వెంట కరోనా జాగ్రత్తలు చెప్పిస్తున్నారు. Behold… the abandoned streets of the most populace city on Earth, Shanghai, in the strictest pandemic lockdown the world has ever seen. Normally these streets are shoulder-to-shoulder crowded. Eeerie. pic.twitter.com/HGdvK6NLOD — Eric Feigl-Ding (@DrEricDing) April 1, 2022 ప్రపంచంలోనే అత్యంత కఠినమైన లాక్‌డౌన్‌ను అమలు చేస్తోంది చైనా ఇప్పుడు. సోమవారం నుంచి షాంగైలో ఇది మొదలైంది. షాంగైలో ప్రతి నలుగురిలో ముగ్గురికి కరోనా లక్షణాలు కనిపిస్తున్నాయట. ఒమిక్రాన్ శరవేగంగా విస్తరిస్తుండడంతో.. ఇంత కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటోంది. ఇందుకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు ఇంటర్నెట్లో చక్కర్లు కొడుతున్నాయి. This is how people walk their dog during #Covid19 #lockdown 😆 pic.twitter.com/RWOtzYCBQm — Clumsybear0129 (@clumsybear0129) March 29, 2022 కుక్కల ఓనర్లు వాటికి తాళ్లు కట్టి కిందకి దించి.. కాలకృత్యాలు తీర్చడం, ఒక బిల్డింగ్ నుంచి మరొక బిల్డింగ్‌కు సరుకుల రవాణా తాళ్ల సాయంతో చేయడం, చెత్తను విసిరేందుకు ప్రత్యేకమైన ఏర్పాట్లు, స్మార్ట్ ఫోన్లలోనే ముఖ్యమైన పనులు, ప్రజల కోసం డ్రోన్ల సాయం.. ఇలాంటి దృశ్యాలు కనిపిస్తున్నాయి అక్కడ. Protest against lockdown in Shanghai. "We want to eat. We want to go to work. We have the right to know!"#chinalockdown #lockdown #Shanghai pic.twitter.com/I9DARcC06V — Eitan Waxman (@EitanWaxman) March 27, 2022 కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో ఈ జాగ్రత్తలు తీసుకుంటోంది అక్కడి ప్రభుత్వం. ఆఖరికి విధుల్లోనూ పోలీసులు భాగం కావడం లేదంటే పరిస్థితి తీవ్రత అర్థంచేసుకోవచ్చు. రోబోలతోనే పాట్రోలింగ్ చేయిస్తున్నారు. నిశబ్దమైన రోడ్ల మీద అప్పుడప్పుడు ఆంబులెన్స్ సౌండ్ తప్ప మరేమీ వినిపించడం లేదు. వెరసి.. షాంగై ఇప్పుడు ఘోస్ట్ టౌన్‌ను తలపిస్తోంది. Full Lockdown in Shanghai, this is how they broadcast announcements. Robot Dog + Speakers#Shanghai #COVID #Lockdown pic.twitter.com/5kJdLrnL8p — Jay in Shanghai 🇨🇳 (@JayinShanghai) March 29, 2022 Breaking: Shanghai authorities are using drones to aid the #covid #lockdown in #Pudong #Shanghai. Skynet isn't enough for them. pic.twitter.com/GJS1g7xofw — Harvey JI-Campaigner of Toilet Revolution (@JiPrisoner) March 29, 2022 -
చైనాలో మళ్లీ మొదలైన కరోనా మరణాలు.. ఏడాది తర్వాత
కరోనా ఈజ్ బ్యాక్.. వినడానికి కొంచెం భయంగానే ఉన్నా ఇదే నిజం.. ప్రతీసారి మహమ్మారి తగ్గిపోయింది అని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు మూడు వేవ్‌లో రూపంలో వచ్చిన కోవిడ్ ప్రజల జీవితాలతో చెలగాటమడింది. లక్షలమంది ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా చిన్నాభిన్నం చేసింది. ప్రస్తుతం కరోనా పుట్టినిల్లుగా భావించే చైనా, దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది. చైనాలో జీరో కొవిడ్ విధానం ఉన్నా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు తగ్గడం లేదు. ప్రస్తుతం చైనాలో కోవిడ్ సామాజిక వ్యాప్తి దశ అధికంగా ఉంది. గత రెండేళ్లలో లేనంతగా ఇప్పుడు అక్కడ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అయితే చైనాలో కోవిడ్ కేసులు పెరగడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. కాగా చైనాలో మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. శనివారం మహమ్మారి బారినపడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో గత ఏడాది కాలంలో కోవిడ్ మరణం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. చదవండి: Invisibility Shield Co.: మీరు గానీ.. ఒక్కసారి గానీ.. ఈ షీల్డ్ వెనక్కి వెళ్లారంటే! చివరిసారిగా జనవరి 2021లో కరోనాతో మరణించారు. చైనాలో శనివారం 2,157 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కరోనా టెస్టులు, ట్రాకింగ్, ట్రీట్‌తోపాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని, వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ‘డైనమిక్ జీరో కోవిడ్’ విధానాన్ని సవరించాలని ప్రభుత్వం భావిస్తోందని వచ్చిన వార్తలను చైనా శుక్రవారం తోసిపుచ్చింది. చదవండి: కరోనా కల్లోలం: ఒక్క రోజే 6 లక్షల పాజిటివ్ కేసులు -
దక్షిణ కొరియాలో కొవిడ్ విలయతాండవం
-
కరోనా కల్లోలం: ఒక్క రోజే 6 లక్షల పాజిటివ్ కేసులు
హమ్మయ్యా! కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. అని అనుకునేలోపే.. రూపు మార్చుకొని మళ్లీ పంజా విసురుతోంది. కరోనా ఉద్భవించిన చైనాలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. స్టైల్త్ ఒమిక్రాన్ రూపంలో చైనాను కోవిడ్ మళ్లీ వణికిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియాలోనై కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇక ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు. దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఊహించని స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే కొత్తగా 6 లక్షల కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు ఇంత భారీగా రోజువారీ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో 6,21,328 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 429 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క రోజులోనే 55 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. దీంతో మొత్తం దేశంలో కేసుల సంఖ్య 8,250,592కి పెరిగింది. చదవండి: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా కేసులు వెలుగు చూడటంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుల్లో ఎక్కువగా ఒకరినుంచి ఒకరికి సంక్రమించినవేనని ఉన్నయని తెలిపారు. కాగా బుధవారం కూడా 400,000 కొత్తగా కేసులతో గరిష్ట స్థాయికి చేరింది. మార్చి మధ్యలో కోవిడ్ 1,40,000 నుంచి 2, 70,000 గరిష్ట స్థాయికి రోజువారీ కేసులకు చేరుకుంటుందని నెల కిందటే అంచనా వేసిన విషయం తెలిసిందే. చదవండి: జాగ్రత్త.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది! -
చైనా, దక్షిణకొరియాల్లో కరోనా విజృంభణ.. కొత్త రూపంలో ఒమిక్రాన్!
South Korea is battling fresh Covid-19 outbreaks: చైనాలో కరోనా కేసులు విజృంభిస్తున్నాయి. ఒమిక్రాన్ వేరియంట్ సరికొత్త రూపాన్ని సంతరించుకుని మళ్లీ దడ పుట్టిస్తోంది. అయితే ఇప్పుడు తాజాగా దక్షిణ కొరియాలో కూడా అదే తరహాలో ఈ కొత్త కరోనా కేసులు నమోదవుతున్నాయి. అంతేకాదు రోజువారిగా 4 లక్షల కేసుల రికార్డును నమోదు చేసింది. గతేడాది కరోనా మొదటి వేవ్‌లోని కేసులతో పోలిస్తే ఇదే అత్యధికం. ఈ తాజా కేసులతో ఇప్పుడు దక్షిణ కొరియాలో సుమారు 7,629,275కి పెరిగిందని కొరియా డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ ఏజెన్సీ (కేడాసీఏ) బుధవారం పేర్కొంది. అంతేకాదు గత 24 గంటల్లో దాదాపు 293 మరణాలు సంభవించినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఇప్పుడు చైనా తర్వాత దక్షిణ కొరియా ఈ కరోనా వ్యాప్తితో అతలాకుతలం అవుతోంది. చైనాలోని 13 నగరాల్లో కఠిన ఆంక్షలు మరోవైపు చైనా కూడా మునుపెన్నడూ లేని పరిస్థితిని డ్రాగన్ దేశం ఎదుర్కొంటోంది. జీరో కొవిడ్ స్ట్రాటజీ విఫలమవ్వడమే కాక కనివినీ ఎరుగని రీతిలో కేసులు పెరిగుపోతున్నాయి. మంగళవారం ఒక్కరోజులోనే 5,280 కేసుల్ని నమోదు చేసింది. అది బుధవారం నాటికి మొత్తం కరోనా కేసుల్లోని మూడొంతులకు పైగా కొత్త కరోనా కేసుల రికార్డును నమోదు చేసింది. దీంతో చైనా దేశవ్యాప్తంగా సుమారు 13 ప్రధాన నగరాల్లో పూర్తిగా లాక్డౌన్ విధించింది. మరికొన్ని నగరాల్లో పాక్షిక లాక్డౌన్లు విధించింది. చైనా జాతీయ ఆరోగ్య కమిషన్ ప్రకారం ఈశాన్య ప్రావిన్స్‌లోని జిలిన్లో 3 వేల కొత్త కేసులు నమోదయ్యాయని తెలిపింది అంతేగాక ప్రావిన్షియల్ క్యాపిటల్ ఆఫ్ చాంగ్‌చున్‌తో సహా అక్కడి అనేక నగరాల్లోని దాదాపు మూడు కోట్ల మంది నివాసితులు హోం క్యారంటైన్లో ఉన్నారని వెల్లడించింది. అంతేకాదు అతిపెద్ద నగరం షాంఘైలో కొద్ది మొత్తంలో ఆంక్షల సడలింపుతో లాక్డౌన్ విధించింది. దీంతో నగరంలో అనేక పరిశ్రమలు మూతపడ్డాయి, ప్రజా రవాణాను నిలిపివేశారు. మరోవైపు ప్రపంచంలోని చాలా దేశాలు సాధారణ స్థతికి చేరుకుంటుంటే తమ దేశంలో ఈ కరోనా మహమ్మారి విజృంభిస్తున్నందున చైనా ప్రజలు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు ప్రపంచంలోని రెండవ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా చెలామణి అవుతున్న చైనాలోఇప్పుడూ ఆర్థిక మేఘాలు కమ్ముకుంటున్నాయి. అంతేగకా హాంకాంగ్ స్టాక్ మార్కెట్ మూడు శాతానికి పైగా పడిపోయిందని ఆక్స్ఫర్డ్ ఎకనామిక్స్‌కు చెందిన టామీవు బ్రీఫింగ్ తెలపింది. చైనా తన మునుపటి జీడిపీ వృద్ధి రేటు 5.5 లక్ష్యాన్ని చేరుకోవడం కూడా కష్టమని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. మిగతా దేశాల కంటే చాలా కఠినతరమైన ఆంక్షలు విధించనప్పటికీ అవన్ని విపలమై ఈ రేంజ్ కేసులు పెరగడం ఒకరకంగా దురదృష్టమనే చెప్పాలి. (చదవండి: కరోనా మళ్లీ విజృంభణ.. ఒక్కసారిగా పెరుగుతున్న కేసులు! భారత్‌లోనూ కరోనా మరణాలపై ఆందోళన!) -
జాగ్రత్త.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది!
ఒమిక్రాన్ వేరియెంట్ ఉధృతి తర్వాత Covid-19 కేసులు ఒక్కసారిగా తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో మరో వేవ్ ఉండబోదంటూ వైద్య నిపుణులు సైతం ఉపశమనం ఇచ్చే వార్త చెప్పారు. మరి వేరియెంట్.. అదీ ప్రమాదకరమైంది పుట్టుకొస్తే తప్పా భయాందోళనలు అక్కర్లేదంటూ ప్రకటనలు చేశారు. ఈ తరుణంలో అటు అమెరికాలో, ఇటు చైనాలో, ఇంకోపక్క యూరప్ దేశాల్లోనూ కరోనా కేసులు పెరిగిపోతున్న ట్రెండ్ కనిపిస్తోంది. కొవిడ్-19 ట్రెండ్స్‌ను మానిటర్ చేస్తున్న వేస్ట్‌వాటర్ నెట్వర్క్ నివేదికల ప్రకారం.. అమెరికాలో కరోనా కేసుల్లో పెరుగుదల కనిపిస్తోంది. మార్చి 1వ తేదీ నుంచి మార్చి 10వ తేదీ మధ్య కరోనా కేసుల ఈ పెరుగుదల స్పష్టంగా కనిపించింది. కిందటి నెల ఇదే టైంలో ఈ కేసుల సంఖ్య తక్కువగా నమోదు అయ్యాయి. కారణాలు.. స్కూల్స్ రీ ఓపెనింగ్, ఆఫీసులకు తిరిగి వెళ్తుండడం, మాస్క్ నిబంధనల సడలింపు కారణాల అయి ఉండొచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు. దీనికి తోడు వేడిమి పరిస్థితులతో జనాలు బయటే ఎక్కువగా తిరుగుతున్నారు. ఈ తరుణంలో.. వైరస్ విజృంభిస్తోందని అంచనా వేస్తున్నారు. బ్లూమరాంగ్ డేటా రివ్యూ ప్రకారం.. 530 మురుగు నీటి పర్యవేక్షణ ప్రాంతాల నుంచి శాంపిల్స్ సేకరణ ద్వారా ఒక నిర్ధారణకు వచ్చారు. ఇందులో మార్చి 1-10వ తేదీల మధ్య 59శాతం కేసులు తగ్గుముఖం పట్టగా, 5 శాతం కేసులు స్థిరంగా ఉన్నాయి. అయితే 36 శాతం కేసులు పెరిగినట్లు చూపించాయి. ఈ సర్వేలో ఎంత మేర కేసులు పెరుగుతున్నాయనేది చెప్పకపోయినా.. మురుగు నీటి sewer water లో వైరస్ జాడ గుర్తించినట్లు తెలిపారు. న్యూయార్క్‌తో సహా పలు ప్రాంతాల్లో కేసులు విపరీతంగా పెరిగినట్లు నివేదికలు చెప్తున్నాయి. ‘‘ఈ ప్రస్తుత ట్రెండ్ మునుముందు కూడా కొనసాగుతుందా? పెరుగుదల ఇలాగే ఉంటుందా? అనే దానిపై నిర్ధారణకు రావడం తొందరపాటు చర్యే అవుతుందని, స్థానిక ఆరోగ్య ప్రతినిధులను పర్యవేక్షణకు ఆదేశించినట్లు.. సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ సీడీసీ ప్రతినిధి కిర్బీ వెల్లడించారు. ఇదిలా ఉంటే.. యూరోపియన్ దేశాల్లోనూ ఇలాంటి పెరుగుదలే కనిపిస్తోంది. జర్మనీ, స్విట్జర్లాండ్, ఆస్ట్రియా.. ఇతర ఐరోపా దేశాల్లో కేసులు పెరిగిపోతున్నాయి. గత రెండు వారాల్లో కేసులు పెరిగిపోతున్నట్లు ఆయా దేశాల కరోనా గణాంకాలు చెప్తున్నాయి. అక్కడా యూఎస్ తరహా వాతావరణం, ఉక్రెయిన్ యుద్ధ హడావుడి నేపథ్యంలో వలసల కారణాలతో కేసులు పెరిగిపోతుండొచ్చని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇక కరోనా పుట్టినిల్లుగా భావిస్తున్న చైనాలో కేసుల సంఖ్య పెరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ పరిణామంతో ప్రపంచం ఉలిక్కి పడింది. కరోనా మొదలైనప్పటికీ ఆ దేశంలో హయ్యెస్ట్ కేసులు సోమవారం నమోదు కావడం విశేషం. ఏకంగా 5,280 కేసులు నమోదు అయ్యాయి అక్కడ. ఈ నేపథ్యంలో టెస్టుల సంఖ్య పెంచిన డ్రాగన్ సర్కార్.. కఠిన లాక్‌డౌన్‌తో కట్టడికి ప్రత్నిస్తోంది. హాంకాంగ్‌లోనూ కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. భారత్‌లో మాత్రం ఇందుకు విరుద్ధమైన పరిస్థితులు కనిపిస్తున్నాయి. రోజు రోజుకు కరోనా కేసులు తగ్గుతున్నాయి. వరుసగా రెండోరోజు 3 వేలకు దిగువకు కేసులు నమోదైయ్యాయి. కానీ, మరణాల సంఖ్య మాత్రం వందకు చేరువైంది. కేంద్ర వైద్యారోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ బులిటెన్ మంగళవారం రిలీజ్ చేసిన బులిటెన్ ప్రకారం.. గడిచిన 24 గంటల్లో 7 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా..2 వేల 568 మందికి వైరస్ ఉందని తేలింది. మొత్తం కేసుల సంఖ్య 4.29 కోట్లకు చేరింది. తాజాగా కరోనా మహమ్మారి కారణంగా 97 మంది మృతి చెందారు. ఇందులో ఒక్క కేరళ నుంచే 78 మరణాలు నమోదయ్యాయి. గత కొంతకాలంగా కరోనా కేసులు తగ్గుతున్నా.. మరణాల సంఖ్యలో మాత్రం తేడా కనిపిస్తోంది. -
China Corona: ప్చ్.. చైనా జీరో టోలరెన్స్ అట్టర్ ఫ్లాప్
జీరో టోలరెన్స్ పేరిట చైనా చేపట్టిన చర్యలేవీ సత్పలితాలను ఇవ్వడం లేదు. సరికదా.. గత మూడు వారాలుగా కరోనా కేసులు తీవ్రస్థాయిలో విజృంభిస్తున్నాయి. తాజాగా.. ఒక్కరోజులో ఏకంగా 5,280 కేసులు నమోదు అయ్యాయి. బయటి ప్రపంచం దృష్టిలో.. కరోనా మొదలైనప్పటి నుంచి చైనాలో నమోదు అయిన అత్యధిక కేసులు ఇవే!. చైనా China లో కరోనా కేసులు తీవ్ర స్థాయిలో విజృంభిస్తున్నాయి. ఆదివారం బులిటెన్‌లో 1,337 కేసులు, సోమవారం బులిటెన్‌లో 3,507 కేసులు, మంగళవారం ఉదయం రిలీజ్ చేసిన కరోనా బులిటెన్.. ఏకంగా 5,280 కేసుల్ని చూపించింది. ఈశాన్య ప్రావిన్స్ అయిన జిలిన్‌లోనే మూడు వేలకు పైగా కేసులు నమోదు అయినట్లు నేషనల్ హెల్త్ కమీషన్ వెల్లడించింది. అయితే పరిస్థితిని వారంలోగా అదుపులోకి తీసుకొస్తామని జిలిన్ గవర్నర్ ప్రకటించినప్పటికీ.. పరిస్థితి అందుకు విరుద్ధంగా ఉందని చైనా వైద్య సిబ్బంది చెప్తున్నారు. ఇదిలా ఉండగా.. జిలిన్, ఉత్తర కొరియాకు సరిహద్దు ప్రాంతం. అందుకే ఇరు ప్రాంతాల మధ్య ప్రయాణాలను కొన్నాళ్లపాటు నిషేధించింది చైనా. జీరో టోలరెన్స్ అంటే.. కఠినంగా కట్టడి చేయడం, పెద్ద ఎత్తున్న పరీక్షలు నిర్వహించడం.. ఇది జీరో టోలరెన్స్‌లో భాగంగా చైనా అనుసరిస్తున్న విధానం. రెండు సంవత్సరాల మూసేసిన సరిహద్దులు, సామూహిక పరీక్షలు, లాక్డౌన్లు, నిర్బంధాలు అమలు చేసింది. ఎక్కడికక్కడే కేసుల్ని కట్టడి చేసింది. ఈ క్రమంలో హేయమైన చర్యలకూ పాల్పడి.. అంతర్జాతీయ సమాజం నుంచి విమర్శలు ఎదుర్కొంది. కానీ, జీరో టోలరెన్స్‌ను పటాపంచల్ చేస్తూ.. వైరస్ విజృంభిస్తోంది ఇప్పుడు. దేశవ్యాప్తంగా కేసులు పెరుగుతున్నందున.. మునుపెన్నడూ లేని పరిస్థితిని డ్రాగన్ ఎదుర్కొంటోంది. 2019లో వుహాన్‌లో కేసులు వెలుగు చూసినప్పటి నుంచి.. ఇప్పటిదాకా చైనాలో ఈ రేంజ్ కేసులు రావడం ఇదే మొదటిసారి. ఇప్పుడు కూడా జీరో కొవిడ్ స్ట్రాటజీతో.. కఠిన లాక్డౌన్ అమలు చేస్తూ జనాలను ఇళ్లకే కట్టడి చేస్తూ వస్తోంది. అయినప్పటికీ లాభం లేకుండా పోతోంది. వింటర్ ఒలింపిక్స్ ముగిశాక.. ఆంక్షల సడలింపులతో జనసంచారం ఒక్కసారిగా పెరిగింది. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఒక్కసారిగా విజృంభిస్తోంది. ఇది కొత్త వేరియెంట్లు అనే ప్రచారం నడుస్తున్నప్పటికీ.. సైంటిస్టులు మాత్రం అది ఒమిక్రాన్ stealth omicron అయి ఉండొచని అభిప్రాయపడుతున్నారు. ఇది ఏ తరహా వేరియెంట్ అన్నదానిపై చైనా ఆరోగ్య విభాగం స్పష్టత ఇవ్వడం లేదు. భారీ ఎఫెక్ట్ కేసులు పెరిగిపోతుండడంతో.. 11 ప్రధాన నగరాల్లో లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. దాదాపు కోటిన్నర జనాభా ఉన్న టెక్‌హబ్ షెంజెన్‌లో బయట మనిషి కనిపించడం లేదు. మరోవైపు లాక్డౌన్ వల్ల ఆర్థికంగానూ ప్రభావం పడుతోంది. మంగళవారం ఉదయం.. కరోనా ఎఫెక్ట్‌తో హాంకాంగ్ స్టాక్ మార్కెట్ భారీగా పతనం అయ్యింది. అక్కడా కేసులు గణనీయంగా నమోదు అవుతున్నాయి. బీజింగ్, షాంగై విమానశ్రయాలకు భారీగా విమానాలు రద్దు అయ్యాయి. షాంగైలోనూ లాక్డౌన్ కఠినంగా అమలు అవుతోంది. మరణాల గోప్యత కరోనా కేసుల వెల్లడి విషయంలో చైనా చాలాకాలం పాటు గమ్మున ఉండిపోయింది. కొన్ని నెలల కేసుల వివరాలను చైనా బయటకు రిలీజ్ చేయకపోవడం విశేషం. ఇక మరణాల సంగతి సరేసరి. ఇప్పటిదాకా కేవలం ఐదు వేల మరణాలు నమోదు అయ్యాయని చెప్తోంది. అత్యధిక జనాభా ఉన్న చైనాలో.. ఇది నమ్మశక్యంగా ఉందంటారా?. ఏది ఏమైనా జీరో టోలరెన్స్‌ను ఎంత ఘనంగా ప్రచారం చేసుకున్న చైనా.. ఇప్పుడు కరోనా కేసుల్ని కట్టడి చేయడంలో మాత్రం ఘోరంగా తడబడుతోంది. -
చైనాలో విజృంభిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్
-
చైనాలో కొత్త వేరియెంట్ విజృంభణ!
ప్రపంచాన్ని కలవరపాటుకు గురి చేసే వార్త, కథనాలు మరోసారి తెర మీదకు వచ్చాయి. చైనా నుంచి మరో వైరస్ పుట్టుకొచ్చిందని, కాదు కాదు కరోనాలోనే కొత్త వేరియెంట్ విజృంభిస్తోందని.. హడలెత్తించే పోస్టులు సోషల్ మీడియాలోనూ దర్శనమిచ్చాయి. ఈ తరుణంలో కరోనా లెక్కలతో దోబుచులాడుతున్న చైనాలో అసలేం జరుగుతుందనే విషయాన్ని కొన్ని రహస్య దర్యాప్తు మీడియా విభాగాలు బయటపెట్టే ప్రయత్నం చేశాయి. ఈశాన్య చైనాలోని జిలిన్ ప్రావిన్స్‌లో ఉన్న చాంగ్‌చున్ పట్టణంతోపాటు, అనేక ప్రాంతాల్లో ఇటీవల లాక్డౌన్లు విధించారు. ఒక్క చాంగ్‌చున్ పట్టణ పరిధిలో దాదాపు 90 లక్షల మంది నివసిస్తున్నారు. కరోనా వైరస్ వెలుగు చూశాక వుహాన్ లాక్డౌన్ తర్వాత.. ఈ రేంజ్లో భారీగా లాక్ డౌన్ విధించడం ఇదే కావడం గమనార్హం. ఈ సిటీలో ప్రస్తుతం లాక్డౌన్ కఠినంగా అమలు చేస్తున్నారు. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థలు అన్నీ మూతపడ్డాయి. రెండు రోజులకు ఒకసారి, ఇంటి నుంచి ఒక్కరు మాత్రమే బయటకు రావడానికి అనుమతిస్తున్నారు. ఈ విషయాలన్నీ చైనా అధికారిక మీడియా సంస్థ కూడా ధృవీకరించింది. అసలు విషయం ఏంటంటే.. ఈ తరుణంలో ప్రస్తుతం విజృంభిస్తోంది కరోనా వైరస్సేనని, అందులో శరవేగంగా వ్యాపించిన ఒమిక్రాన్ వేరియెంట్ కేసులేనని స్పష్టత ఇచ్చాయి ఇండిపెండెంట్ మీడియా హౌజ్‌లు. గడిచిన వారం రోజుల్లోనే వెయ్యికిపైగా కేసులు నమోదు కావడంతో అక్కడి ప్రభుత్వం లాక్డౌన్ విధించారట. శుక్రవారం ఒక్కరోజే వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదుకాగా, చాంగ్‌చున్‌లో దాదాపు నాలుగు వందల కేసులు, జిలిన్ ప్రాంతంలోనే 98 కేసులు నమోదయ్యాయి. బయటి ప్రపంచానికి తెలిసి.. సుమారు రెండేళ్ల తర్వాత ఈ స్థాయిలో కేసులు నమోదవుతున్నాయి. ప్రపంచవ్యాప్తంగా.. శుక్రవారం నాడు నమోదైన కేసుల్లో.. అత్యధికంగా న్యూజిలాండ్ తొలిస్థానంలో ఉంది. చైనాలో మాత్రం 1,369 కేసులు నమోదు అయ్యాయి. వీటిలో చాలావరకు ఒమిక్రాన్ కేసులే ఉన్నాయి. దీంతో ప్రతీ ముగ్గురిలో ఒకరికి కరోనా టెస్టులు నిర్వహిస్తున్నారు. ఈ తరుణంలో.. కరోనా వైరస్ నుంచి ఎలాగోలా బయటపడిపోయామంటూ ఊపిరి పీల్చుకుంటున్న దేశాలు.. చైనాలో కొత్త వైరస్, వేరియెంట్ వార్తలతో ఆందోళనకు గురయ్యాయి. అయితే చైనాలో విజృంభిచేది ఒమిక్రాన్ వేరియెంట్ అని, ప్రమాదకరమైంది కాదని సైంటిస్టులు ఊరట ఇస్తున్నారు. భారత్‌లో మరో వేవ్ కష్టమేనని, అయినా అప్రమత్తంగా ఉండడం మంచిదన్న సంకేతాలు ఇటీవలె వైద్య నిపుణులు ఇచ్చిన సంగతీ తెలిసిందే. వింటర్ ఒలింపిక్స్ తర్వాత.. గత కొన్ని రోజులుగా చైనాలో రోజువారీ అత్యధిక కేసులు నమోదవుతున్నాయి. గ్వాంగ్ డాంగ్, జిలిన్, షాన్ డాంగ్ ప్రావిన్సులలో మెజారిటీ కేసులు నమోదవుతున్నట్లు అధికారులు తెలిపారు. వింటర్ ఒలింపిక్స్ నేపథ్యంలో కట్టడి ద్వారా కేసుల్ని నియంత్రించుకోగలిగింది చైనా. అయితే జీరో కోవిడ్ టోలరెన్స్ పేరిట దారుణంగా వ్యవహరించిన దాఖలాలు చూసి ప్రపంచం నివ్వెరపోయింది. వింటర్ ఒలింపిక్స్ ఈవెంట్స్ ముగిశాక జనసంచారం పెరిగిపోవడంతో ఇప్పుడు కేసులు మళ్లీ పెరుగుతున్నాయి అంతే. మరోవైపు హాంకాంగ్‌లో కూడా భారీగా కరోనా కేసులు వెలుగు చూస్తున్నాయట. దీంతో ఆయా ప్రాంతాల్లో పరిస్థితికి తగ్గట్లుగా అధికారులు ఆంక్షలను అమలు చేస్తున్నారు. ఇది అసలు సంగతి. -
కరోనాకు వేవ్‌లు లేవు... వేరియంట్లే
సాక్షి, హైదరాబాద్: ప్రజలను భయబ్రాంతులకు గురిచేసిన కరోనా మహమ్మారి ఇకపై వేవ్ రూపంలో వచ్చే అవకాశాలు తక్కువగా ఉన్నాయని, వివిధ రకాల వేరియంట్లు మాత్రం ఉంటాయని గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు అభిప్రాయపడ్డారు. మంగళవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఫస్ట్, సెకెండ్ వేవ్‌లలో విశ్వరూపం చూపించిన కరోనా వైరస్ థర్డ్‌వేవ్ నాటికి బలహీన పడిందన్నారు. గత పాండమిక్‌లు, వైరస్ల చరిత్ర పరిశీలిస్తే మూడు వేవ్‌ల తర్వాత వైరస్లు వివిధ రకాలుగా రూపాంతరం చెంది, కొంతమేర శక్తి కోల్పోయి బలహీన పడినట్లు వైద్య నిపుణుల పరిశీలనలో తేలిందన్నారు. ఫస్ట్, సెకండ్ వేవ్‌లలో ప్రాణనష్టం జరిగిందని, థర్డ్‌వేవ్‌లో మరణాల సంఖ్య గణనీయంగా తగ్గిందన్నారు. ఒమిక్రాన్ వేరియంట్ అత్యంత బలహీనమైనదిగా నిర్ధారణ అయిందన్నారు. వైరస్లు కొంతకాలం తర్వాత రూపాంతరం చెంది బలహీన పడతాయని, కొన్ని సందర్భాల్లో మాత్రం మరింత బలపడి విజృంభిస్తుందని, అయితే ప్రస్తుత పరిస్థితుల్లో కోవిడ్ టీకా అందుబాటులోకి రావడం, వైరస్‌పై అవగాహన కలగడం, రోగనిరోధకశక్తి పెరగడం వంటి అంశాలను దృష్టిలో పెట్టుకుంటే కోవిడ్ వైరస్ తన ప్రభావాన్ని కొంతమేర కొల్పోయినట్లు భావించవచ్చన్నారు. (క్లిక్: తెలంగాణ: రానున్న 15 ఏళ్లలో భారీగా తగ్గనున్న యువత..) గాంధీ ఆస్పత్రిలో ప్రస్థుతం 31 మంది కరోనా బాధితులకు వైద్యసేవలు అందిస్తున్నామని, కోవిడ్ డిశ్చార్జీలు కొనసాగుతుండగా, అడ్మిషన్ల సంఖ్య పూర్తిగా తగ్గిందన్నారు. మూడు వేవ్‌ల్లో వేలాది మంది బాధితుల ప్రాణాలను కాపాడిన ఘనత గాంధీ వైద్యులు, సిబ్బందికే దక్కుతుందన్నారు. పూర్తిస్థాయిలో కరోనా ముప్పు తొలగిపోలేదని, వేవ్ రాకున్నా, వేరియంట్లు ఉన్నాయని, ప్రజలంతా అప్రమత్తంగా ఉంటూ కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. (క్లిక్: ఓయూలో అబ్బాయిల హాస్టల్.. అమ్మాయిలకు!) -
ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్!... కోలుకున్నా ఇంకా బాధిస్తునే ఉంటుంది!
NV Ramana today called Omicron a "silent killer: సుప్రీంకోర్టు భౌతిక విచారణలకు హాజరవ్వాలన్న అభ్యర్థన పై భారత ప్రధాన న్యాయమూర్తి ఎన్వీ రమణ ఒమిక్రాన్ గురించి కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ ఒమిక్రాన్ సైలెంట్ కిల్లర్ అని సంభోధించారు. ఒక నెల క్రితం ఈ వేరియంట్ భారినపడ్డానని తర్వాత కోలుకున్నాక కూడా తాను ఆ వేరియంట్ ప్రభావంతో ఇంకా బాధపడుతునే ఉన్నానని చెప్పుకొచ్చారు. అంతేకాదు తాను కరోనా మొదటి వేవ్‌లోనే కరోనా వైరస్ భారిన పడ్డానని, నాలుగు రోజుల్లో కోలుకున్నానని, మళ్లీ ఇప్పుడు ఈ వేవ్‌లో భారిన పడి బయటపడ్డాక కూడా ఇంకా 25 రోజులుగా బాధపడుతూనే ఉన్నానని అన్నారు. సుప్రీం కోర్టు బార్ అసోసియేషన్‌కు నేతృత్వం వహిస్తున్న సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ కేసులు తగ్గుముఖం పట్టడంతో పూర్తి భౌతిక విచారణకు తిరిగి రావాలని సుప్రీంకోర్టును అభ్యర్థించడంతో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం హైబ్రిడ్ శైలిలో విచారణలు జరుగుతున్నాయి. వారానికి రెండుసార్లు భౌతిక విచారణలు, మిగిలినవి ఆన్లైన్లో జరుగుతున్నాయి. అయితే కరోనా ఇంకా తగ్గుముఖం పట్టలేదని ఇంకా 15 వేల కేసులు పెరిగాయని జస్టీస్ రమణ అన్నారు. దీనికి సీనియర్ న్యాయవాది వికాస్ సింగ్ ప్రజలు మాత్రం కోలుకుంటున్నారంటూ కౌంటరిచ్చారు. వెంటనే జస్టీస్ రమణ తాము చూస్తాం అని వ్యగ్యంగా బదులిచ్చారు. ఈ మేరకు గత మూడో వేవ్‌లో సుప్రీం కోర్టు న్యాయవాదులు, సిబ్బంది అధిక సంఖ్యలో కరోనా భారిన పడిన సంగతి తెలిసిందే. (చదవండి: 10, 12వ తరగతుల ఆఫ్‌లైన్ పరీక్షలపై సుప్రీంకోర్టులో విచారణ) -
తస్మాత్ జాగ్రత్త!
దాదాపు నెల్లాళ్లపాటు దేశాన్ని వణికించిన ఒమిక్రాన్ ముగిసినట్టేనని కేంద్ర ప్రభుత్వం చేసిన ప్రకటన అందరికీ ఊరటనిచ్చి ఉంటుంది. అమలు చేస్తున్న ఆంక్షల్ని సమీక్షించి, అవసరాన్ని బట్టి పాక్షికంగా తొలగించటమో, పూర్తిగా ఎత్తేయటమో రాష్ట్రాలు నిర్ణయించుకోవాలని కూడా కేంద్రం సూచించింది. రెండేళ్లనుంచి జనం కోవిడ్ పడగ నీడలో జీవితాలు గడుపుతున్నారు. ఏనాడూ ఊహకైనా అందని ఆంక్షలు చవిచూశారు. 2020 అక్టోబర్‌లో వైరస్ తగ్గుముఖం పడుతున్న వైనం కనబడినప్పుడు ఏమైందో మరిచిపోకూడదు. ఒకపక్క వైరస్ విషయంలో నిర్లక్ష్యం పనికిరాదని, ఎవరికి వారు జాగ్రత్తగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నా ప్రభుత్వాలు, కొన్ని రాజకీయ పక్షాలు పెడచెవిన పెట్టాయి. ప్రజానీకం సైతం పండుగలు, ఉత్సవాల్లో మునిగిపోయారు. వేరే దేశాల్లో అప్పటికే రెండో దశ విజృంభణ మొదలైనా అందరూ బేఖాతరు చేశారు. మన దేశంలో రెండో దశ ప్రవేశించి, ఎవరికీ తెలియకుండానే ముగిసిందని కొందరూ... అసలు రెండో దశకు ఆస్కారమే లేదని మరికొందరూ వాదించారు. ఇవన్నీ సాగుతుండగానే చాపకింద నీరులా వైరస్ వ్యాప్తి మొద లైంది. కేసుల సంఖ్య వందల నుంచి వేలకు వెళ్లింది. చివరకు నిరుడు మార్చిలో కోవిడ్ రెండో దశ ప్రారంభమైందని కేంద్రం ప్రకటన విడుదల చేసింది. కానీ అప్పటికే ఆలస్యమైంది. 19 రాష్ట్రాల్లో రెండో దశ తడాఖా చూపింది. అధికారిక గణాంకాలను బట్టి చూస్తే ఆ ఏడాది జూలై నాటికి 2.54 లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. తొలి దశలో చనిపోయిన 1.57 లక్షలమందిని కలుపుకొంటే అప్పటికి దేశంలో 4 లక్షల 11 వేల 435 మంది కేవలం కరోనా మహమ్మారి కారణంగా మరణిం చారు. అయినప్పటికీ మొన్న డిసెంబర్లో ఒమిక్రాన్ తలెత్తేనాటికి యథాప్రకారం అలసత్వమే కన బడింది. అంతకు అయిదారు నెలలముందు వైరస్ స్వైర విహారం చేసిన తీరును అందరూ మరి చారు. ఒమిక్రాన్ వ్యాప్తి ఊహకందనంత వేగంగా ఉన్నా అదృష్టవశాత్తూ ఆ నిష్పత్తిలో మరణాలు సంభవించలేదు. ఇది సహజంగానే మరింత నిర్లక్ష్యానికి దారితీసింది. మొత్తంగా ఒమిక్రాన్ కేసులు బుధవారం నాటికి 30,615 వరకూ ఉండగా 514 మంది చనిపోయారు. ప్రస్తుతం ప్రపంచ దేశాలు ఒక్కొక్కటే ఆంక్షల్ని తొలగిస్తున్నాయి. మాస్క్‌లు ధరించాల్సిన అవసరం లేదని కూడా చెబుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం తాజా ప్రకటనను ఈ కోణంలో అర్థం చేసుకుంటే మరోసారి కష్టాల్లో పడకతప్పదు. ఎప్పటికప్పుడు కరోనా పరీక్షలు జరపడం, వైరస్ జాడల్ని గుర్తించి అవసరాన్ని బట్టి తగిన ఆంక్షలు అమల్లోకి తీసుకురావడం, వ్యాధిగ్రస్తులకు చికిత్స, అవసరమైనవారికి వ్యాక్సిన్ ఇవ్వడం కొనసాగించాలి. మాస్క్‌లు ధరించడం, భౌతిక దూరం పాటించడం తప్పనిసరి. ఎందుకంటే ఈ వైరస్‌ను తేలిగ్గా తీసుకోవద్దనీ, దాని పోకడలు ఎలా ఉంటాయో అంచనా వేయటం కష్టమనీ ఇప్పటికీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. కరోనా వైరస్ ఒమిక్రాన్ రూపం తీసుకున్నాక అది బలహీనపడిందని అంటున్నవారు లేకపోలేదు. కానీ మును ముందు ఈ వైరస్ అత్యంత ప్రమాదకరంగా పరిణమించినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ ఈమధ్యే హెచ్చరించింది. వాస్తవానికి ఆంక్షలు సడలించవచ్చునని కేంద్రం ప్రకటించడానికి చాలాముందుగానే ప్రభుత్వాల్లో అలసత్వం ఏర్పడింది. ఇదంతా ఏ స్థాయిలో ఉందంటే సడలింపు గురించి కేంద్రం ప్రకటించాక అసలు ఆంక్షలు అమల్లో ఉన్నాయా అని అందరూ ఆశ్చర్యపోయారు. మన దేశంలో దాదాపు 80 శాతంమందికి రెండు డోసుల వ్యాక్సినేషన్ పూర్తయిందని గణాంకాలు చెబుతున్నాయి. అంచనా వేసిన స్థాయిలో ఒమిక్రాన్ నష్టం కలగ జేయకపోవడానికి ఆ వైరస్ బలహీనపడటం ఒక కారణమైతే, జనాభాలో అధిక శాతంమంది రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకోవడం మరో కారణం కావొచ్చు. గతంతో పోలిస్తే కరోనా వైరస్‌కు సంబంధించి మన పరిజ్ఞానం గణనీయంగా పెరిగింది. ఆ మహమ్మారి రూపు రేఖా విలాసాలను కనిపెట్టి దాన్ని నియంత్రించే పనిలో దేశదేశాల్లోని శాస్త్రవేత్తలూ నిమగ్నమై ఉన్నారు. మనిషిలోని రోగ నిరోధక వ్యవస్థను ఛేదించేలా అది రూపాంతరం చెందడానికి దానిలోని ఏ జన్యువులు తోడ్పడుతున్నాయన్న అంశంలో చురుగ్గా పరిశోధనలు సాగుతున్నాయి. ఇవన్నీ అంతిమంగా కరోనా వైరస్‌పై పూర్తి స్థాయిలో విజయం సాధించడానికి తోడ్పడితే మంచిదే. కరోనా వైరస్ పేరిట మన దేశంలో లాక్డౌన్లు, ఇతరత్రా ఆంక్షలు ఎంత అసంబద్ధంగా అమలు చేశారో, దాని పర్యవసానంగా ఎన్ని కోట్లమంది జీవితాలు ఛిద్రమయ్యాయో కళ్ల ముందుంది. అయినా కొన్ని రాష్ట్రాలు గుణపాఠాలు నేర్చుకోలేదు. ఒమిక్రాన్ పేరు చెప్పి బడులకు సెలవులు ప్రకటించడం, వేరే రాష్ట్రాలనుంచి రాకపోకలను అడ్డగించడం వంటి చర్యలు అమల య్యాయి. వైరస్ కేసుల వ్యాప్తి తగ్గుముఖం పడుతున్నా ఆంక్షలు సడలించాలన్న ఆలోచనే లేనట్టు ప్రభుత్వాలు వ్యవహరించాయి. ఇప్పటికైనా అహేతుకమైన చర్యలు చాలించాలి. వైద్య రంగ మౌలిక సదుపాయాల కల్పనపైనే ప్రధానంగా దృష్టి కేంద్రీకరించాలి. అధిక జనాభా ఉన్న మనలాంటి దేశంలో మహమ్మారులు ఎంతటి ఉత్పాతాన్ని సృష్టించగలవో అర్థమైంది గనుక ప్రభుత్వాలు అలసత్వాన్ని విడనాడాలి. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో తగినంతమంది సిబ్బందిని నియమించడం, అక్కడ మెరుగైన వైద్య ఉపకరణాలు అందుబాటులో ఉంచటం మొదలుకొని అన్ని రకాల చర్యలూ తీసుకోవాలి. ఖర్చు కోసం వెనకాడకుండా పకడ్బందీ పథకాలు రూపొందించి అమలు చేయాలి. -
మూడో ముప్పు తప్పినట్టేనా?
అరసవల్లి: ముమ్మర వ్యాక్సినేషన్.. ఎక్కడికక్కడ కోవిడ్ టెస్టులు.. ఆస్పత్రుల్లో సదుపాయాల ఏర్పాటు.. అధికారుల నిరంతర పర్యవేక్షణ.. కలగలిపి సిక్కోలును కోవిడ్ మూడో ముప్పు బారి నుంచి తప్పిస్తున్నాయి. ఒకటి రెండు దశల్లో జిల్లాను అతలాకుతలం చేసిన కరోనా మూడోసారి మాత్రం కనికరిస్తోంది. పూర్తిగా అంతం కాకపోయినా కేసులు, మరణాల సంఖ్య ప్రస్తుతం గణనీయంగా తగ్గింది. కోవిడ్ మొదటి దశలో జిల్లాలో వేలాది పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. మరణాల సంఖ్య కూడా అధికంగా నమోదైంది. చాలా కుటుంబాలు ఆర్థికంగా కూడా ఛిన్నాభిన్నమయ్యాయి. కొద్దికాలం తర్వాత డెల్టా వైరస్ కూడా జిల్లాను భయపెట్టింది. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులను పొట్టన పెట్టుకుంది. వందలాది కుటుంబాలు దిక్కులేకుండా పోయాయి. ఆ తర్వాత కొన్ని నెలల పాటు కోవిడ్ నిద్రావస్థకు వెళ్లింది. మళ్లీ తాజాగా ఒమిక్రాన్ అంటూ తరుముకొచ్చింది. కానీ అప్పటికే అధికారులు ముమ్మరంగా వ్యాక్సినేషన్ చేయడం, ఆస్పత్రుల్లో సదుపాయాలను అప్‌గ్రేడ్ చేయడంతో ప్రాణనష్టం తప్పింది. కలెక్టర్ శ్రీకేష్ బి.లాఠకర్ ఆదేశాల మేరకు జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బగాది జగన్నాథరావు బృందం నిరంతరం పరిస్థితులను పర్యవేక్షించింది. ప్రధానంగా వ్యాక్సినేషన్ ప్రక్రియను యుద్ధ ప్రాతిపదికన అమలు చేసింది. దీంతో జిల్లాలో రోజుకు సుమారు 80 వరకు కేసులు అధికంగా నమోదైనప్పటికీ.. హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూనే అంతా సురక్షితంగా బయటపడగలిగారు. ముందు జాగ్రత్త చర్యలతో.. జిల్లాలో వ్యాక్సినేషన్ ప్రక్రియలో భాగంగా 15 నుంచి 60 ఏళ్లకు పైగా ఉన్న వారికి రెండు విడతలుగా వ్యాక్సిన్లు వేశారు. ఏకంగా 103 శాతం మొదటి డోస్‌ను అలాగే రెండో డోస్‌ను కూడా సుమారు 80 శాతానికి పైగానే పూర్తి చేశారు. అలాగే బూస్టర్ డోస్‌ను వీలైనంత వేగంగా వేశారు. ఫ్రంట్‌లైన్ వారియర్స్ పూర్తి స్థాయి బాధ్యతతో పనిచేయడంతో కేసులు గణనీయంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన వారం రోజులుగా సింగిల్ డిజిట్‌లోనే కేసులు నమోదు కావడం శుభ సూచికం. -
కరోనా కొత్త రూపాంతరం దడ! ... ఇప్పటి వరకు 25 కేసులు నమోదు!
Deltacron Cases Found In UK: కరోనా వైరస్ కొత్త రూపాంతరం గురించి ప్రపంచ ఆరోగ్య నిపుణులు ఆందోళనకు గురవుతున్నారు. ఇది డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్ల లక్షణాలను ప్రదర్శిస్తున్నందున డెల్టాక్రాన్‌గా నిపుణలు వ్యవహరించారు. అంతేకాదు డెల్టాక్రాన్‌గా పిలుస్తున్న ఈ హైబ్రిడ్ వేరియంట్‌ని యూకేలో తొలిసారిగా గుర్తించారు. అయితే ఈ వేరియంట్ ఎంతగా వ్యాప్తి చెందుతుంది, ఎంతవరకు ప్రమాదకరమైనది అనే విషయాలను అధికారికంగా ఇప్పటివరకు యూకే నిపుణులు వెల్లడించలేదు. అయితే సెకండ్‌వేవ్‌లో డెల్టా వేగంగా వ్యాపించి ఎంతలా ప్రాణాంతకంగా మారిందో తెలిసిందే. మూడోవేవ్‌లో ఒమిక్రాన్ అంత ప్రభావంతంగా వ్యాప్తి చెందకపోయినప్పటికి మరింత ప్రమాదకారి మాత్రం కాలేదు. అలాగే మరణాల సంఖ్య, కేసుల సంఖ్య తక్కువే. ఈ మేరకు ఈ డెల్టాక్రాన్ వేరియంట్‌ను గత ఏడాది చివర్లో సైప్రస్‌లో లియోనిడోస్ కోస్ట్రికిస్ అనే పరిశోధకుడు మొదటిసారిగా కనుగొన్నారు. యూనివర్శిటీ ఆఫ్ సైప్రస్‌లో పనిచేస్తున్న లియోనిడోస్ కోస్ట్రికిస్ తన బృందం ఈ డెల్టాక్రాన్కి సంబంధించి సుమారు 25 కేసులను గుర్తించినట్లు పేర్కొన్నారు. అంతేకాదు 25 డెల్టాక్రాన్ కేసుల సీక్వెన్సులు జనవరి 7, 2022న వైరస్‌లో మార్పులను ట్రాక్ చేసే అంతర్జాతీయ డేటాబేస్ అయిన GISAIDకి పంపించారు కూడా. కానీ కొంతమంది నిపుణులు మాత్రం ఇది "ల్యాబ్ ఎర్రర్‌గా" తోసిపుచ్చారు. ఈ క్రమంలో ఇంపీరియల్ కాలేజ్ లండన్ బార్క్లే లాబొరేటరీలో పరిశోధనా సహచరుడు థామస్ పీకాక్ కూడా డెల్టాక్రాన్ అంత ప్రభావవంతమైనది కాదని స్పష్టంగా తెలుస్తుందని అన్నాడు. కానీ కోస్ట్రికిస్ తన వాదనను సమర్థించటమే కాక కరోనా వైరస్ కొత్త రూపాంతరం అయిన ఈ హైబ్రిడ్ వేరియంట్ డెల్టా, ఓమిక్రాన్ వేరియంట్ల కంటే వేగంగా వ్యాపిస్తుందంటూ హెచ్చరిస్తున్నాడు. మరోవైపు ప్రపంచ ఆరోగ్యసంస్థ ఒమిక్రాన్ వేరియంట్ చాలా దేశాల్లో వేగంగా సంక్రమించే అత్యంత ప్రమాదకర వేరియంట్‌గా ఉందని పేర్కొనడం గమనార్హం. (చదవండి: కుక్క గర్భవతి అనుకుని ఆసుపత్రికి తీసుకెళ్లాడు... ఆశ్చర్యపోయిన వైద్యులు) -
కరోనా థర్డ్‌వేవ్: ఆరు వారాల్లోనే ఆగింది.. బాధితుల్లో ఆ వయసువారే అధికం
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ఎవరూ ఊహించని పరిణామం. అందరూ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్న సమయం. మొదటి వేవ్, సెకండ్ వేవ్‌ల తరహాలోనే విలయం సృష్టిస్తుందనుకున్న కరోనా థర్డ్ వేవ్ ఆరువారాల్లోనే చాప చుట్టేసింది. ఒమిక్రాన్ వేరియంట్ వేగంగా వ్యాప్తి చెందుతుందని, భారీగా నష్టం జరుగుతుందని వార్తలొచ్చాయి. కానీ, నామమాత్రంగా కూడా ప్రభావం చూపించలేదు. మూడో వేవ్ కేవలం 6 వారాల్లోనే అంతమైంది. ఆస్పత్రుల్లో చేరిన వారి సంఖ్య చాలా స్వల్పంగా ఉంది. ఎంత ఉధృతంగా వచ్చినా ఎదుర్కొనేందుకు సర్కారు భారీగా చర్యలు చేపట్టడంతో నియంత్రణ సాధ్యమైంది. కేసులూ తక్కువే మొదటి, సెకండ్ వేవ్‌లతో పోలిస్తే మూడో వేవ్‌లో పాజిటివ్ కేసులు తక్కువగా నమోదయ్యాయి. ఫస్ట్ వేవ్‌లో రమారమి 6 లక్షలకు పైగా పాజిటివ్ కేసులొచ్చాయి. సెకండ్ వేవ్‌లో సైతం 8 లక్షల కేసులొచ్చాయి. థర్డ్‌వేవ్‌లో ఇప్పటివరకు 2 లక్షల కేసులు మాత్రమే నమోదయ్యాయి. మొదటి వేవ్‌లో కేసులు అదుపులోకి రావడానికి 10 నెలలు పట్టింది. సెకండ్ వేవ్‌లోనూ నాలుగు మాసాలు పట్టింది. కానీ థర్డ్ వేవ్ ఆరు వారాల్లోనే అదుపులోకి వచ్చింది. పూర్తిస్థాయిలో వ్యాక్సిన్ ప్రక్రియ జరగడం వల్లే కేసుల తీవ్రత తగ్గినట్టు నిపుణులు చెబుతున్నారు. భయాందోళనలు లేవు థర్డ్ వేవ్‌లోనూ కుర్రాళ్లే ఎక్కువగా కరోనా బారినపడ్డారు. మొత్తం కేసుల్లో 21–30 ఏళ్ల మధ్య వయస్కులు 26.63 శాతం ఉన్నారు. దీన్ని బట్టి చూస్తే కుర్రాళ్లు థర్డ్‌వేవ్‌లో ఎదురొడ్డి నిలిచినట్టయ్యింది. పైగా ఈసారి భయాందోళనలు కూడా లేవు. మహమ్మారిని ఎలా ఎదుర్కోవాలో, దీన్నుంచి ఎలా బయట పడాలో అవగాహన ఉండటంతో సులభంగా గట్టెక్కారు. రికవరీ రేటు కూడా ఎక్కువగానే ఉన్నట్టు తాజా గణాంకాల్లో వెల్లడైంది. మొత్తం బాధితుల్లో మూడు శాతం మంది మాత్రమే ఆస్పత్రులకు వచ్చినట్టు తేలింది. అదే సెకండ్ వేవ్‌లో 17 శాతం మంది ఆస్పత్రుల్లో చేరారు. -
ఒమిక్రాన్ మళ్లీ రాదనుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్ ఒకసారి వచ్చిపోయాక మళ్లీ రాదని నిర్లక్ష్యం వద్దని కిమ్స్ ఆస్పత్రి పల్మనాలజిస్ట్, స్లీప్ డిపార్డర్స్ స్పెషలిస్ట్ డా. వీవీ రమణప్రసాద్ అన్నారు. ఒకసారి ఒమిక్రాన్ వచ్చి తగ్గాక మళ్లీ నెల, నెలన్నరలో రీ ఇన్ఫెక్షన్ వస్తోందని, దీని పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కరోనా ప్రస్తుత పరిస్థితులపై ‘సాక్షి’తో ఆయన మాట్లాడారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్లు వస్తున్నాయా? ఒకసారి ఒమిక్రాన్ వచ్చాక మళ్లీ రాదనుకోవద్దు. గత నెలలో ఒమిక్రాన్ సోకి నెగెటివ్ వచ్చాక బయట తిరిగి వైరస్‌కు మళ్లీ ఎక్స్పోజ్ అయిన కొందరు కరోనా బారిన పడుతున్నారు. కొన్ని రోజుల వ్యవధిలోనే ఒమిక్రాన్ రీ ఇన్ఫెక్షన్ కేసులు మళ్లీ వస్తున్నాయి. అలాంటి కొన్ని కేసులు గుర్తించాం. కాబట్టి కరోనా ఎండమిక్ స్టేజ్‌కు చేరే దాకా జాగ్రత్తలు తీసుకోవాలి. రెండోసారి వచ్చిన వాళ్లలో లక్షణాలేంటి? కరోనా రెండోసారి సోకినా తీవ్రత ఎక్కువగా ఉండట్లేదు. లక్షణాలూ మునుపటిలా స్వల్పంగానే ఉంటున్నాయి. ఇప్పటి వరకు వచ్చిన కేసులన్నీ దాదాపుగా ‘అప్పర్ రెస్పిరేటరీ సిస్టమ్’లోనే ఉంటున్నాయి. డెల్టాతో ›ఇన్ఫెక్ట్ అయిన వారు, అస్సలు టీకా తీసుకోనివారు కొంతమంది దీర్ఘకాలిక కోవిడ్ అనంతరం అనారోగ్య సమస్యలతో ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పుడు ఎలాంటి సమస్యలతో వస్తున్నారు? ప్రస్తుతం ఒకరోజు జ్వరం, జలుబు, ఒళ్లు నొప్పులు, ఇతర లక్షణాలు తగ్గిపోయాక కఫంతో కూడిన దగ్గు ‘అలర్జీ బ్రాంకైటీస్ లేదా అస్థమా’ సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. రాత్రి కాగానే కొంచెం దగ్గురావడం, పడుకున్నాక దగ్గుతో ఇబ్బంది పడటం, కొందరికి పిల్లి కూతలుగా రావడం వంటి సమస్యలతో వస్తున్నారు. వారం కిందట ఒకరోజు జ్వరం, కొద్దిగా ఒళ్లునొప్పులు వచ్చి తగ్గిపోయాయని, ఆ తర్వాత ఇలాంటి సమస్యలు వస్తున్నాయని ఎక్కువ మంది చెబుతున్నారు. అలా వారికి అప్పటికే కరోనా సోకిందని తెలుస్తోంది. చాలా మందికి మళ్లీ ఆస్థమా లేదా ‘అలర్జీ బ్రాంకైటీస్’ సమస్యలు పెరుగుతున్నాయి. కాబట్టి ఇలాంటి వాళ్లు దుమ్ము, పొగ, చల్లటి పదార్థాలు, చల్లటి గాలి నుంచి తగిన రక్షణ పొందుతూ జాగ్రత్తలు తీసుకోవాలి. లాంగ్ కోవిడ్ సమస్యలుంటున్నాయా? అసలు టీకాలు తీసుకోని వారు, ఒక్క డోస్ తీసుకున్న వారికి సంబంధించి వైరస్ సోకాక వారం, పది రోజుల తర్వాత దగ్గు, ఆయాసం పెరిగిన కేసులు స్వల్పంగా వస్తున్నారు. వీరిలో కొన్ని కేసులు ‘లంగ్ షాడోస్’ వంటివి వస్తున్నాయి. ఇంకా అక్కడక్కడ డెల్టా కేసులు వస్తున్నాయి కాబట్టి న్యూమోనియా, ఇతర లక్షణాలు కనిపిస్తున్నాయి. -
కొత్త వేరియంట్ల ముప్పు అధికమే!
జెనీవా: ఒమిక్రాన్ వేరియంట్‌తోనే మహమ్మారి ముప్పు పూర్తిగా తొలగిపోయినట్లు భావించరాదని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)కు చెందిన కోవిడ్–19 టెక్నికల్ లీడ్ మారియా వాన్ కెర్ఖోవ్ చెప్పారు. కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ముప్పు అధికంగానే ఉందని తెలిపారు. ఒమిక్రాన్‌లోని నాలుగు వేర్వేరు వెర్షన్లను క్షుణ్నంగా పరిశీలిస్తున్నామని పేర్కొన్నారు. వైరస్ ఎన్నో రకాలుగా మార్పులకు గురవుతోందని, ఉత్పర్తివర్తనాలు సంభవిస్తున్నాయని, కొత్త వేరియంట్ల పుట్టుకకు అవకాశాలు ఎన్నో రెట్లు ఉన్నట్లు గుర్తించామని వివరించారు. కరోనా కొత్త వేరియంట్ల బారి నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలంటే వ్యాక్సినేషన్ ఒక్కటే సరిపోదని, నియంత్రణ చర్యలు కచ్చితంగా పాటించాలని సూచించారు. వైరస్ వ్యాప్తిని అడ్డుకొనే చర్యలు కచ్చితంగా చేపట్టాలన్నారు. కరోనా కేసులు 17 శాతం తగ్గాయ్ అంతకుముందు వారంతో పోలిస్తే కోవిడ్–19 పాజిటివ్ కేసులు గత వారం రోజుల్లో ప్రపంచవ్యాప్తంగా 17 శాతం తగ్గాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) వెల్లడించింది. కరోనా సంబంధిత మరణాలు 7 శాతం తగ్గిపోయానని తెలిపింది. అమెరికాలో పాజిటివ్ కేసులు ఏకంగా 50 శాతం పడిపోయాయని పేర్కొంది. ఈ మేరకు తాజాగా ఒక నివేదిక విడుదల చేసింది. మొత్తం కేసుల్లో ఒమిక్రాన్ వేరియంట్ కేసులే 97 శాతం ఉన్నాయని వివరించింది. మిగతా 3 శాతం కేసులు డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని నివేదికలో ప్రస్తావించింది. ప్రస్తుతం ప్రపంచంలోని అన్ని దేశాల్లో ఒమిక్రాన్ ఉనికిని గుర్తించారని స్పష్టం చేసింది. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 6 వరకూ ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 1.9 కోట్ల కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని, 68,000 మంది మరణించారని తెలియజేసింది. కోవిడ్ నియంత్రణకు కొత్త కాంబో డ్రగ్! కోవిడ్–19 వ్యాప్తి నియంత్రణకు ప్రయోగాత్మక ఔషధం బ్రెక్వినార్ను రెమ్‌డెసివిర్ లేదా మోల్నుపిరవిర్తో కలిపి ఇస్తే మెరుగైన ఫలితాలు కనిపిస్తున్నట్లు అమెరికాలోని యూనివర్సిటీ ఆఫ్ పెన్సిల్వేనియాలో నిర్వహించిన అధ్యయనంలో గుర్తించారు. ఈ అధ్యయనం వివరాలను నేచర్ పత్రికలో ప్రచురించారు. రెమ్‌డెసివిర్ లేదా మోల్నుపిరవిర్‌ను వేర్వేరుగా ఇచ్చినప్పటి కంటే బ్రెక్వినార్ కాంబినేషన్‌తో ఇస్తే వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటున్నట్లు అధ్యయనకర్తలు తేల్చారు. అయితే, ఈ కాం బో డ్రగ్‌పై క్లినికల్ ట్రయల్స్ నిర్వహించాల్సి ఉంది. -
ఒమిక్రాన్ ఎంత పని చేసిందంటే..
కరోనా వేరియేంట్లలో ప్రమాదకరం కాకపోయినా.. వేగంగా ఇన్ఫెక్షన్లతో వెల్లువలా కేసులు పెరగడానికి కారణమైంది ఒమిక్రాన్. కిందటి ఏడాది చివర్లో మొదలైన ఒమిక్రాన్ విజృంభణ.. ఇంకా కొనసాగుతూనే వస్తోంది. ప్రస్తుతం చాలా దేశాల్లో కేసుల తగ్గుముఖంతో సాధారణ ప్రజానీకానికి సడలింపులు, ఆంక్షల ఎత్తివేతతో సాధారణ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఈ తరుణంలో ఒమిక్రాన్‌పై ఓ లెక్క అంటూ రిలీజ్ చేసింది డబ్ల్యూహెచ్‌వో.. ప్రపంచవ్యాప్తంగా ఒమిక్రాన్‌ను నవంబర్ చివర్లో కరోనా వేరియెంట్‌గా ప్రకటించింది ప్రపంచ ఆరోగ్య సంస్థ. అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా 130 మిలియన్ల కేసులు నమోదు అయ్యాయని WHO ఒక ప్రకటన విడుదల చేసింది. అంతేకాదు అప్పటి నుంచి ప్రపంచవ్యాప్తంగా ఐదు లక్షల మరణాలు నమోదు అయ్యాయని తెలిపింది. విషాదానికి మించినది ఈ పరిణామం అని ఈ గణాంకాలపై వ్యాఖ్యానించారు ఆరోగ్య సంస్థ మేనేజర్ అబ్ది మహముద్. ప్రమాదకరమైన డెల్టా వేరియెంట్ తర్వాత ఒమిక్రాన్.. ప్రపంచంపై తన ఆధిపత్యం ప్రదర్శించింది. ప్రమాదకరమైంది కాకపోయినా.. త్వరగతిన వ్యాపిస్తూ కేసుల సంఖ్యను పెంచేసింది. కరోనా వేరియెంట్లు వచ్చి తగ్గిన పేషెంట్లపై మరికొంత కాలం ప్రభావం చూపిస్తుండగా.. ఒమిక్రాన్ మాత్రం సుదీర్ఘకాలం చూపించే అవకాశం ఉండడం గమనార్హం. కరోనా మొదలైనప్పటి నుంచి తీవ్రస్థాయిలో రేంజ్లో కేసులు వెల్లువెత్తడం ఒమిక్రాన్ వల్లే అయ్యింది. అనధికారికంగా ఈ లెక్కలు ఇంకా ఎక్కువే ఉండొచ్చు. కానీ, ప్రభుత్వాల నుంచి అందిన సమాచారం మాత్రమే ఇది అని వ్యాఖ్యానించారు. ఇదిలా ఉండగా.. కరోనాలో ఒమిక్రాన్ చివరి వేరియెంట్ కాకపోవచ్చని, ఒకవేళ తర్వాత వేరియెంట్ గనుక పుట్టుకొస్తే.. దాని తీవ్రత మరింత దారుణంగా ఉండబోతుందంటూ డబ్ల్యూహెచ్‌వో ఇదివరకే ప్రపంచాన్ని హెచ్చరించిన విషయం తెలిసిందే. COVID-19 డిసెంబర్ 2019 లో చైనాలో కరోనా వైరస్ పుట్టిందని ప్రకటించినప్పటి నుంచి.. ప్రపంచవ్యాప్తంగా 40 కోట్లమందికిపైగా కరోనా(వివిధ వేరియెంట్లు) బారినపడ్డారు. మొత్తం 57 లక్షల మందికి పైగా కరోనాతో మరణించారు. ఇందులో భారత్ నుంచి మరణాలు ఐదు లక్షలకు పైగా ఉన్నాయి. ప్రపంచవ్యాప్తంగా వ్యాక్సినేషన్లో భాగంగా ఇప్పటిదాకా పది బిలియన్లకు పైగా వ్యాక్సిన్ డోసులు ప్రజలకు అందాయి. -
టీ20 సిరీస్ రద్దు.. కారణం అదేనా?
వచ్చే నెలలో జరగాల్సిన న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ రద్దుచేయబడింది. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా బుధవారం అధికారికంగా ప్రకటించింది. న్యూజిలాండ్‌లో ఓమిక్రాన్ నిబంధనల కారణంగా ఇరు బోర్డుల అంగీకరంతో సిరీస్ రద్దు చేశారు. కాగా ముందుగా అక్కడి ప్రభుత్వం సరిహద్దుల వద్ద నిబంధనలను సడలించడంతో ఇరు జట్లు మధ్య టీ20 సిరీస్‌ను ప్లాన్ చేశారు. అయితే ఓమిక్రాన్ న్యూజిలాండ్‌లో విజృభించడతో మళ్లీ అక్కడి ప్రభుత్వం రూల్స్‌ను కట్టుదిట్టం చేసింది. ఈ నేపథ్యంలోనే ఇరు జట్లు మధ్య సిరీస్ రద్దు చేసినట్లు తెలుస్తోంది. "మేము న్యూజిలాండ్- ఆస్ట్రేలియా టీ20 సిరీస్ షెడ్యూల్ చేసిన సమయంలో అంతాబాగానే ఉండేది. ట్రాన్స్-టాస్మాన్ దేశాల సరిహద్దు తెరవబడుతుందని మేము ఆశించాము. అయితే దేశంలో ఓమిక్రాన్ విజృభించడతో సరిహద్దుల వద్ద నిభందనలు మరింత కఠినమయ్యాయి. ఈ క్రమంలోనే ఇరు దేశాల మధ్య సిరీస్ జరగడం అసాధ్యం అని భావించాం. అందుకే మేము ఈ సిరీస్‌ను రద్దు చేశాం" అని న్యూజిలాండ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ డేవిడ్ వైట్ పేర్కొన్నారు. ఇక షెడ్యూల్ ప్రకారం.. మార్చి 17, 18,20 తేదీల్లో నేపియర్ వేదికగా ఆస్ట్రేలియా న్యూజిలాండ్‌లో మూడు టీ20 మ్యాచ్‌లు ఆడాల్సి ఉంది. -
తెలంగాణలో కరోనా మూడోదశ: గుడ్‌న్యూస్ చెప్పిన డీహెచ్ శ్రీనివాసరావు
సాక్షి, హైదరాబాద్: కరోనా మూడో దశ పూర్తిగా ముగిసిపోయిందని తెలంగాణ హెల్త్ డైరెక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. తెలంగాణలో కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టాయని, తెలంగాణకు ఇది శుభపరిణామమని పేర్కొన్నారు. ఈ మేరకు రాష్ట్రంలో కోవిడ్ పరిస్థితిపై డీహెచ్ మాట్లాడుతూ.. మూడో దశ డిసెంబర్ నుంచి ప్రారంభమైందని, జనవరిలో మూడో దశ ఉద్ధృతి పెరిగిందన్నారు. రాష్ట్రంలో కోవిడ్ పాజిటివిటీ రేటు అత్యధికంగా 5 శాతానికి వెళ్లిందని, ప్రస్తుతం 2 శాతం కంటే తక్కువ ఉందన్నారు. మరోవైపు దేశంలో కూడా కరోనా కేసులు లక్షలోపే నమోదవుతున్నాయని, పాజిటివిటీ రేటు భారీగా తగ్గిందన్నారు. రెండేళ్ళుగా కరోనా ప్రపంచాన్ని పట్టిపీడించిందని డీహెచ్ అన్నారు. ‘కోవిడ్ మొదటి దశ వల్ల 10 నెలలు ఇబ్బంది పడ్డాం. సెకండ్ వేవ్ ఆరునెలలు పాటు ఇబ్బందులకు గురి చేసింది. ఎంతో మంది ప్రాణాలు బలిగొంది. మూడో దశలో 28 రోజుల్లోనే ఎక్కువ కేసులు నమోదయ్యాయి. జనవరి 25న అత్యధికంగా 4,800 కేసులు నమోదయ్యాయి. థర్డ్ వేవ్ కేవలం రెండు నెల్లోనే అదుపులోకి వచ్చింది. ఈ దశలో మొత్తం కేవలం 3 వేల మంది మాత్రమే ఆసుపత్రుల్లో చేరారు’ అని వెల్లడించారు. చదవండి: భర్త వేధింపులు.. స్కిన్ ఎలర్జీ తగ్గిస్తానని స్టెరాయిడ్స్ ఇచ్చి ఫీవర్ సర్వేతో సత్ఫలితాలు ‘ఫీవర్ సర్వే వల్ల సత్ఫలితాలు వచ్చాయి. ఫీవర్ సర్వే చేపట్టడం ద్వారా కోటి ఇళ్లలో సర్వే చేశాం. 4 లక్షల మందికి కిట్లు అందజేశాం. కోవిడ్ నియంత్రణలో వ్యాక్సిన్ కీలక ఆయుధంగా పనిచేసింది. ఒమిక్రాన్ వేరియంట్ చాలా సీరియస్ వైరస్. కానీ వ్యాక్సిన్‌తో దీన్ని అరిగట్టగలిగాం.సూచనలు, జాగ్రత్తలు చేపట్టడం వల్లనే ఒమిక్రాన్ పరిస్థితి విషమించలేదు. ఇంకా ఇప్పటివరకు ఎవరు వ్యాక్సిన్ తీసుకోలేదో వారు తీసుకోవాలి. ఇక ముందు కూడా కరోనా జాగ్రత్తలు పాటించాలి’ అని సూచించారు. రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవు ‘రాష్ట్రంలో ఎలాంటి కోవిడ్ ఆంక్షలు లేవు. జనవరి 31 st వరకే ఆంక్షలు ఉన్నాయి.. వాటిని కూడా పూర్తిగా ఎత్తివేసింది. అన్ని సంస్థలు 100 శాతం పనిచేయొచ్చు. ఉద్యోగులు అందరూ కార్యాలయాకు వెళ్లొచ్చు. ఐటీ కంపెనీలు కూడా వర్క్ ఫ్రం హోం తీసేయొచ్చు. విద్యాసంస్థలను కూడా పూర్తిగా ప్రారంభించాం. ఇప్పటి వరకు రాష్ట్రంలో అయిదు కోట్ల మందికి టీకాలు వేశాలు. 82శాతం మందికి రెండు డోస్‌లు ఇచ్చాం. వచ్చే కొద్ది నెలలపాటు కొత్త వేరియంట్ పుట్టే అవకాశం లేదు. కోవిడ్ త్వరలో ఎండమిక్ అవుతుంది. భవిష్యత్తులో సాధారణ ఫ్లూలా మారుతుంది.’ అని పేర్కొన్నారు. చదవండి: రాని కరోనాను రప్పించి మరీ.. -
వారంలోనే సగానికి తగ్గిన కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు గణనీయంగా తగ్గాయి. వారం వ్యవధిలోనే సగానికి పైగా తగ్గడం గమనార్హం. ఈ నెల ఒకటో తేదీన రాష్ట్రంలో 2,850 కేసులు నమోదు కాగా, సరిగ్గా వారానికి అంటే సోమవారంనాటికి 1,380 నమో దయ్యాయి. అన్ని జిల్లాల్లోనూ కేసులు తగ్గుముఖం పట్టడం విశేషం. ఒమిక్రాన్ తీవ్రత ఒక్కసారిగా పెరిగి, ఇప్పుడు అదేస్థాయిలో తగ్గుముఖం పడుతోందని వైద్య వర్గాలు చెబుతున్నాయి. రాష్ట్రంలో సోమవారం 68,720 మందికి కరోనా నిర్దారణ పరీక్షలు చేయగా, అందులో 1,380 మంది వైరస్ బారినపడ్డారు. అంటే పాజిటివిటీ 2 శాతం నమోదైంది. ఇప్పటి వరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.78 లక్షలకు చేరుకుంది. తాజాగా 3,877 మంది కోలుకోగా, మొత్తం ఏడున్నర లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో కరోనాతో ఒకరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌కు 4,101 మంది బలయ్యారు. -
లక్ష దిగువకు పడిపోయిన కరోనా కేసులు! కొత్తగా ఎన్నంటే..
Corona New Cases Update: భారత్‌లో మూడో వేవ్‌లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పట్టడం మొదలైంది. గత ఇరవై నాలుగు గంటల్లో 83, 876 కేసులు నమోదు అయ్యాయని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వెల్లడించింది. గడిచిన 24 గంటల్లో.. మొత్తం 83, 876 కొత్త కేసులు నమోదు అయ్యాయి. 11,56,363 మందికి కరోనా టెస్ట్‌లు నిర్వహించగా.. 83 వేలకు పైగా పాజిటివ్ కేసులు నిర్ధారణ అయ్యాయి. కరోనా మరణాలు 895 చోటు చేసుకున్నాయి. ఒక్కరోజులో 1,99, 054 మంది కరోనా నుంచి కోలుకున్నారు. జనవరి 6 తర్వాత లక్ష మార్క్‌కు దిగువన కేసులు నమోదు కావడం ఇదే తొలిసారి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 11, 08, 938 కాగా, రోజూవారీ పాజిటివిటీ శాతం 5, 02, 874గా ఉంది. ఇక ఇప్పటివరకు దేశంలో కరోనాతో 5, 02, 874మంది(అధికార గణాంకాల ప్రకారం) చనిపోయారు. మొత్తం రికవరీల సంఖ్య 4,06,60,202గా నమోదు అయ్యింది. వ్యాక్సినేషన్ డ్రైవ్‌లో భాగంగా భారత్‌లో ఇప్పటిదాకా 1,69,63,80,755 డోసులు అందించింది. #Unite2FightCorona#LargestVaccineDrive#OmicronVariant 𝗖𝗢𝗩𝗜𝗗 𝗙𝗟𝗔𝗦𝗛https://t.co/DmnW6kanpU pic.twitter.com/06W1fEECj9 — Ministry of Health (@MoHFW_INDIA) February 7, 2022 వర్క్‌ఫ్రమ్ హోం ముగిసింది కాగా, సోమవారం నుంచి ప్రభుత్వ ఉద్యోగులందరికీ కార్యాలయాలకు పూర్తి హాజరు కావాల్సి ఉంటుందని కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ తెలిపారు. కోవిడ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. కార్యాలయాలు కోవిడ్ ప్రోటోకాల్‌లను ఖచ్చితంగా పాటించాలని, ప్రభుత్వ ఉద్యోగులందరికీ వర్క్‌ఫ్రమ్ హోం ఇక ముగిసినట్లేనని సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉంటే ఒమిక్రాన్ విజృంభణ సమయంలో కేంద్ర ఉద్యోగులకు వర్క్‌ఫ్రమ్ హోం వెసులుబాటు కల్పించిన విషయం తెలిసిందే. -
రివర్స్ రెపో పావు శాతం పెరగొచ్చు
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ (ఎంపీసీ) చివరి సమీక్షా సమావేశం వచ్చే వారం (8–10వ తేదీల్లో) జరగనుంది. ఈ సందర్భంగా కీలక రేట్లను పావు శాతం మేర పెంచుతూ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని బ్రిటిష్ బ్రోకరేజీ సంస్థ బార్క్లేస్ అంచనా వేసింది. ‘‘ఒమిక్రాన్ వేరియంట్ విస్తరణ నేపథ్యంలో వృద్ధిపై ఆందోళనలు వ్యక్తమవుతున్నాయి. దీనికితోడు ద్రవ్యోల్బణం దాదాపుగా ఆర్బీఐ నియంత్రణల పరిధిలోనే ఉంది. దీంతో వృద్ధికి మద్దతుగా ఆర్బీఐ సర్దుబాటు విధానాన్నే కొనసాగించొచ్చు. రివర్స్ రెపో రేటును 0.20–0.25 శాతం వరకు పెంచొచ్చు’’ అని బార్క్లేస్ అంచనా వేసింది. ప్రస్తుతం ఈ రేటు 3.35%గా ఉంది. ప్రభుత్వం ఊహించని విధంగా రుణ సమీకరణ పరిమాణాన్ని బడ్జెట్లో పెంచినందున ఇది పాలసీ సాధారణీకరణ దిశగా ఆర్బీఐకి సంకేతం ఇచ్చినట్టేనని కొందరు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బడ్జెట్లో మూలధన వ్యయాలపై దృష్టి సారించడం ఆర్థిక వ్యవస్థకు ప్రేరణనిస్తుందని.. ద్రవ్యోల్బణం సహా స్థూల ఆర్థిక నేపథ్యాన్ని మార్చదని బార్క్లేస్ పేర్కొంది. చమురు ధరలు ఐదు రాష్ట్రాల ఎన్నికలు ముగిసే వరకు పెరగకపోవచ్చని అంచనా వేసింది. ఆర్బీఐ అప్రమత్తంగా ఉంటూ, ద్రవ్యోల్బణం అంచనాలను ఎగువవైపు పరిమితి (2–6) వద్ద కొనసాగించొచ్చని పేర్కొంది. -
కరోనా: లక్షకు పడిపోయిన కొత్త కేసులు.. 865 మరణాలు
న్యూఢిల్లీ: మూడో వేవ్ భారత్‌లో కరోనా కేసుల తగ్గుముఖం మొదలైంది. తాజాగా ఒక్కరోజులో కొత్త కేసుల సంఖ్య లక్ష దాకా పడిపోయింది. ఆదివారం వెల్లడించిన గణాంకాల ప్రకారం.. 1, 07, 474 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అదే సమయంలో మరణాల సంఖ్య మాత్రం తగ్గట్లేదు. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆదివారం ఉదయం వెల్లడించిన వివరాల ప్రకారం.. గత 24 గంటల్లో మొత్తం 14, 48, 513 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా.. 1, 07, 474 మందికి పాజిటివ్ నిర్దారణ అయ్యింది. కరోనా మరణాల సంఖ్య 865గా రికార్డు అయ్యింది. దీంతో మొత్తం మరణాల సంఖ్య.. 5,01,979 పూర్తి చేసుకుంది. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 12, 25, 011గా ఉంది. ఇక రికవరీల సంఖ్య 1, 13, 246 కాగా.. మొత్తం రికవరీల సంఖ్య 4, 04, 61, 148కి చేరింది. రికవరీ రేటు గణీయంగా పెరిగిందని ప్రకటించుకుంది కేంద్రం. రోజూవారీ పాటిజివిటీ రేటు 7.42 శాతానికి పడిపోగా.. వీక్లీ పాజిటివిటీ రేటు 10.20శాతం ఉంది. మొత్తం 1,69,46,26,697 వ్యాక్సిన్ డోసుల్ని ప్రజలకు అందించింది కేంద్రం. -
చరిత్రలో తొలిసారి.. ఒక్కరోజు బ్రహ్మోత్సవం.. ఏకాంతమే!
సాక్షి, తిరుమల: ప్రతి ఏడాదీ సూర్యజయంతి రోజున నిర్వహించే రథసప్తమి వేడుకలను ఈ సారి కోవిడ్ నేపథ్యంలో శ్రీవారి ఆలయంలో ఏకాంతంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా ఈ నెల 8న ఆలయంలో అన్ని ఆర్జిత సేవలు రద్దు చేశారు. కరోనా కారణంగా స్వామివారి ఉత్సవాలను రెండేళ్లుగా భక్తుల సమక్షంలో కాకుండా శ్రీవారి ఆలయంలోనే ఏకాంతంగా నిర్వహిస్తున్నారు. గత ఏడాది బ్రహ్మోత్సవాలతోపాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలను కూడా ఏకాంతంగా నిర్వహించారు. రథసప్తమి వేడుకలను మాత్రం భక్తుల సమక్షంలో నిర్వహించారు. అయితే ఈ ఏడాది ఒమిక్రాన్ విజృభణతో రథసప్తమి వేడుకలను కూడా ఏకాంతంగా నిర్వహించాలని టీటీడీ అధికారులు నిర్ణయించారు. చరిత్రలో తొలిసారి రథసప్తమి వేడుకలను ఏకాంతంగా నిర్వహించనుండడం గమనార్హం. ఒకే రోజు సప్తవాహనాలపై.. రథసప్తమి వేడుకలను శ్రీవారి ఆలయంలో ఒక్కరోజు బ్రహ్మోత్సవం, మినీ బ్రహ్మోత్సవంగా పిలుస్తుంటారు. బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు తొమ్మిది రోజుల్లో 16 వాహనాలపై కొలువుదీరి మాడ వీధుల్లో విహరిస్తూ భక్తులను అనుగ్రహిస్తారు. రథసప్తమి పర్వదినంనాడు మాత్రం శ్రీవారు సప్త వాహనాలపై భక్తులకు దర్శనమిస్తారు. వేకువజాము నుంచే వాహన సేవలు ప్రారంభమవుతాయి. కానీ ఈ ఏడాది అన్ని వాహన సేవలు ఆలయానికే పరిమితం కానున్నాయి. చదవండి: (వైఎస్ కుటుంబ ఆదరణ మరచిపోలేనిది: అన్నమయ్య వంశస్తులు) -
Corona New Cases: ఒక్కసారిగా తగ్గిన కరోనా కేసులు.. పాజిటివిటీ రేటు!
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మూడో వేవ్‌లో.. ఒక్కసారిగా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో లక్షా 27 వేల 952 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి పోల్చుకుంటే పాజిటివిటీ రేటు 9.2 శాతం నుంచి 7.9 శాతానికి పడిపోవడం విశేషం. ఇక కిందటి రోజుతో పోలిస్తే.. 14 శాతం కేసుల తగ్గుదల చోటు చేసుకోవడం విశేషం. రికవరీల సంఖ్య 2, 30, 814గా ఉంది. ఒక్కరోజులో 1,059 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,31,648గా ఉంది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5, 01, 114కి చేరుకుంది. మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 1,68,98,17,199 పూర్తి చేసుకుంది. -
యూఎస్‌లో కోవిడ్ దడ! దాదాపు 9 లక్షలకు చేరుకున్న కోవిడ్ మరణాల సంఖ్య!!
న్యూయార్క్: జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ గణాంకాల ప్రకారం కోవిడ్-19 మరణాల సంఖ్య దాదాపు 9 లక్షలకు పైనే చేరుకుందని పేర్కొంది. ఈ ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా ఇన్ఫ్క్షన్లు, ఆస్పత్రిలో చేరిన వారి సంఖ్య గణనీయంగా పెరింగిందని తెలిపింది. తాజా గణాంకాల ప్రకారం ఈ కరోనా కొత్త వేరియంట్ కారణంగా యూఎస్‌లో మరణాల సంఖ్య ప్రపంచంలోని మిగతా దేశాల కంటే అత్యధికం అని వెల్లడించింది. అంతేకాదు ఆరు నెలల నుంచి 5 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు ఫైజర్ బయోఎన్‌టెక్ రెండు డోస్‌ల కరోనా వ్యాక్సిన్లు ఫ్రిబ్రవరి నాటికి అందుబాటులో ఉంటాయని తెలపింది. (చదవండి: ఈ పార్క్‌లో మెరిసేదంతా బంగారమే!... ఔను! రూ. 87 లక్షల గోల్డ్ క్యూబ్!!) -
కరోనా అప్డేట్: ఐదు లక్షలు దాటిన మరణాలు! కొత్త కేసులు ఎన్నంటే..
Corona New Cases Update: గత 24 గంటల్లో భారత్‌లో 1, 49, 394 కొత్త కేసులు నమోదు అయ్యాయి. అంతకు ముందు రోజుతో పోలిస్తే ఇది 13 శాతం తక్కువ. అలాగే టెస్టుల ఆధారంగా పాజిటివిటీ రేటు 9.27 శాతంగా నమోదు అయ్యింది. ఇక రికవరీల సంఖ్య 2, 46, 674 కాగా, గత ఒక్కరోజులో కరోనాతో దేశవ్యాప్తంగా 1,072మంది చనిపోయారు. దీంతో దేశవ్యాప్తంగా కరోనా మరణాల సంఖ్య అధికారికంగా ఐదు లక్షలు దాటింది(5, 00,055). ప్రస్తుతం యాక్టివ్ కేసులు 14, 35, 569గా ఉంది. అత్యధిక కేసులు Omicron variant of SARS-COV2(ఒమిక్రాన్ వేరియెంట్)వే ఉన్నాయి. దేశవ్యాప్తంగా వ్యాక్సినేషన్ 168.47 కోట్ల డోసులకు చేరుకుంది. కరోనా విజృంభణ కేరళలో అత్యధికంగా కొనసాగుతోంది. అమెరికా, బ్రెజిల్ తర్వాత అత్యధిక కరోనా మరణాలు నమోదు అయిన దేశంగా భారత్ నిలిచింది. ప్రపంచవ్యాప్తంగా 387.5 మిలియన్ల కరోనా కేసులు నమోదు అయ్యాయి ఇప్పటిదాకా. -
అలాగైతే బడులు తెరవచ్చు!
న్యూఢిల్లీ: కరోనా పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉన్న జిల్లాల్లో బడులను తెరవచ్చని కేంద్రం నూతన మార్గదర్శకాలు జారీ చేసింది. అయితే ఈ విషయంలో అంతిమ నిర్ణయం రాష్ట్ర ప్రభుత్వాలదేనని తెలిపింది. దేశంలో కరోనా పరిస్థితులు మెరుగుపడుతున్నాయని, కొత్త కేసులు స్థిరంగా తగ్గుతున్నాయని నీతి ఆయోగ్ సభ్యుడు వీకే పాల్ చెప్పారు. అందుకే బడులు తెరవడంపై మార్గదర్శకాలు విడుదల చేశామన్నారు. దేశంలో ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, అరుణాచల్‌ప్రదేశ్, లక్షద్వీప్, మధ్యప్రదేశ్, సిక్కిం, కర్ణాటక, త్రిపుర, తమిళనాడు, గోవా, మణిపూర్ సహా 11 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో మాత్రమే పాఠశాలలు పూర్తిస్థాయిలో తెరుచుకున్నట్టు కేంద్ర విద్యాశాఖ సంయుక్త కార్యదర్శి స్వీటీ ఛాంగ్సన్ చెప్పారు. అసోం, ఛత్తీస్‌గఢ్, చండీగఢ్, హరియాణా, హిమాచల్‌ప్రదేశ్, మిజోరం, రాజస్తాన్, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర, మేఘాలయ, కేరళ, నాగాలాండ్, గుజరాత్, డామన్ డయ్యూ, అండమాన్ నికోబార్ దీవులు, పశ్చిమబెంగాల్ సహా 16 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో పాక్షికంగా తెరుచుకున్నాయని, బిహార్, ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, పుదుచ్ఛేరి, జార్ఖండ్, లద్దాఖ్, జమ్మూకశ్మీర్, ఒడిశా, దిల్లీ తదితర 9 రాష్ట్రాల్లో ఇంకా పాఠశాలలు పునఃప్రారంభం కాలేదని చెప్పారు. చాలా రాష్ట్రాల్లో స్కూలు సిబ్బంది వ్యాక్సినేషన్ పూర్తికావచ్చిందన్నారు. ప్రస్తుతం దేశంలో 268 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం కన్నా తక్కువ ఉందని పాల్ చెప్పారు. కరోనా వల్ల దేశీయ చిన్నారుల విద్యాభ్యాసం తీవ్రంగా దెబ్బతింటోందని అందరిలో ఆందోళన ఉందన్నారు. అందువల్ల సాధ్యమైనంత వరకు బడులు తెరిచేందుకు యత్నించాలన్నారు. పాఠశాలలకు నూతన మార్గదర్శకాలివే.. ► పిల్లల మధ్య 6 అడుగులు దూరం ఉండేలా తరగతుల్లో సీటింగ్ ఏర్పరచాలి. ► పాఠశాలలో పరిశుభ్ర వాతావరణం ఉంచుతూ, ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► పాఠశాల బస్సులు/వ్యాన్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేయాలి. ► విద్యార్థులు, సిబ్బంది అంతా మాస్కులు ధరించాలి. ► పిల్లలను స్కూళ్లకు పంపేందుకు వారి తల్లిదండ్రుల సమ్మతిని తీసుకొనేలా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలు చర్యలు చేపట్టాలి. ► ఒకవేళ తల్లిదండ్రులు ఆన్లైన్ తరగతులవైపే మొగ్గుచూపితే అందుకు అనుమతించాలి. ► ఇల్లులేని, వలస కూలీల పిల్లలు, కోవిడ్ సోకిన పిల్లలపై ప్రత్యేక దృష్టిసారించాలి. -
ప్రస్తుతమున్న టీకాలు ఒమిక్రాన్‌ను నిరోధిస్తాయా?
న్యూఢిల్లీ: కొత్తగా వెలుగు చూసిన ఒమిక్రాన్ ఉప వేరియంట్ బీఏ.2 వ్యాప్తి అధికంగా ఉండే అవకాశం ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ సైంటిస్ట్ డాక్టర్ సౌమ్య స్వామినాథన్ తెలిపారు. మిగతా సబ్ వేరియంట్స్‌తో పోలిస్తే ఇది చాలా శక్తివంతమైనదని.. భారత్, డెన్మార్క్ దేశాల్లో ఇది ఎక్కువగా ప్రభావం చూపనుందని ‘ఎన్డీటీవీ’తో చెప్పారు. ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బయటపడి రెండు నెలలే అయినందువల్ల దాని ప్రభావంపై ప్రపంచ ఆరోగ్య సంస్థ ఎటువంటి అంచనాకు రాలేకపోతుందన్నారు. ఒమిక్రాన్ తిరిగి ఇన్ఫెక్షన్కు కారణమవుతుందా, దీర్ఘకాలిక రోగనిరోధక శక్తిని ఎలా ప్రభావితం చేస్తుందో తెలుసుకోవడానికి అధ్యయనాలు ఇంకా కొనసాగుతున్నాయని చెప్పారు. కొత్త వేరియంట్ నుంచి కోలుకున్న రోగుల రక్తం డెల్టా ఇన్ఫెక్షన్కు కారణమయినట్టు కొన్ని అధ్యయనాలు పేర్కొన్నాయని.. భవిష్యత్ వేరియంట్ల విషయంలో ఇలా జరుగుతుందో, లేదో కచ్చితంగా చెప్పలేమన్నారు. ప్రస్తుతం అందుబాటులో ఉన్న వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌ను సమర్థవంతంగా పూర్తిస్థాయిలో కట్టడి చేయలేవని సౌమ్య స్వామినాథన్ వెల్లడించారు. ‘పస్తుతమున్న టీకాలు డెల్టా వేరియంట్ కంటే కూడా తక్కువగా కొత్త వేరియంట్‌ను న్యూట్రలైజ్ చేసే అవకాశం ఉంది. అయితే, టీకాలు వేసిన రోగులలో మరణాలు.. తీవ్రమైన వ్యాధి కేసులు తక్కువగా ఉన్నట్లు క్లినికల్ డేటా చూపిస్తోంది. కాబట్టి ప్రస్తుత వ్యాక్సిన్లు ఒమిక్రాన్‌పై పనిచేస్తాయా, లేదా అనే దాని గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆసుపత్రిలో చేరడం, మరణాలను తగ్గించే విషయంలో టీకాలు బాగా పనిచేస్తున్నాయి. వృద్ధులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి వ్యాక్సిన్లు రక్షణ కవచంగా నిలుస్తున్నాయ’ని చెప్పారు. యాంటీబాడీ ప్రతిస్పందనను మాత్రమే పరిగణనలోకి తీసుకుని వ్యాక్సిన్ల పనితీరుపై అంచనా రాలేమని.. క్లినికల్ డేటాను జాగ్రత్తగా పరిశీలించడంతో పాటు టీ-సెల్ ప్రతిస్పందన వంటి ఇతర అంశాలను కూడా అధ్యయనం చేయాల్సి ఉంటుందని వివరించారు. కోవిడ్ ఆర్ఎన్ఏ వైరస్ కాబట్టి భవిష్యత్‌లో మరిన్ని వేరింయట్స్ రావొచ్చన్నారు. వీటన్నింటినీ ఎదుర్కొనే యూనివర్సల్ వ్యాక్సిన్ గురించి డబ్ల్యూహెచ్ఓ కసరత్తు చేస్తోందన్నారు. బూస్టర్ డోస్ తీసుకోవాలా, వద్దా అనే దానిపై నిర్ణయం తీసుకోవడానికి స్థానిక డేటాను తప్పనిసరిగా అధ్యయనం చేయాలని సౌమ్య స్వామినాథన్ స్పష్టం చేశారు. అధిక జనాభాకు టీకాలు వేయడంలో భారతదేశం విజయవంతం అయిందని ప్రశంసించారు. నోటి ద్వారా తీసుకునే మాత్రలు కోవిడ్ అన్ని వేరియంట్లను నియంత్రించడానికి పనికొస్తాయని తెలిపారు. మోనోక్లోనల్ యాంటీబాడీ చికిత్సలు మాత్రం ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదన్నారు. -
ఓ పక్క ఒమిక్రాన్.. మరో పక్క సీజనల్ వ్యాదులు.. గర్భిణీలు ఏ జాగ్రత్తలు తీసుకోవాలంటే..
మాతృత్వం ఓ వరం. బిడ్డకు జన్మనిచ్చిన క్రమంలో గర్భిణులకు ఎదురయ్యే సవాళ్లు.. ఇబ్బందులు వర్ణనాతీతం. గర్భిణులు తమ ఆరోగ్యాన్ని జాగ్రత్తగా కాపాడుకుంటూ.. శిశువును నవ మాసాలు మోస్తూ కాన్పు సమీపిస్తున్న కొద్దీ మరింత అప్రమత్తంగా ఉంటారు. రక్తహీనత, పోషకాహార లేమితో సతమతమయ్యే గర్భిణులు.. రెండేళ్లుగా కోవిడ్ విసురుతున్న సవాళ్లకు ఎదురీదుతున్నారు. కరోనా వేళ.. కాబోయే అమ్మకు అండగా నిలుస్తోంది రాష్ట్ర ప్రభుత్వం. జిల్లా వైద్య శాఖ వీరి క్షేమ సమాచారాన్ని ఎప్పటికప్పుడు సేకరించి.. తద్వారా వారికి అవసరమైన సేవలందిస్తోంది. – సాక్షి, విశాఖపట్నం కరోనా మహమ్మారి భయపెడుతోంది. నిన్న మొన్నటివరకు పదుల సంఖ్యలో ఉన్న కేసులు నేడు వందలు దాటి వేలకు చేరుకుంటున్నాయి. ఒక పక్క ప్రపంచాన్ని భయపెడుతున్న ఒమిక్రాన్ వేరియంట్.. మరో పక్క సెకండ్‌వేవ్‌లో చుట్టేసిన డెల్టా వేరియంట్, సీజనల్ జ్వరాలు విస్తరిస్తున్న తరుణంలో కేసుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. కరోనా రెండో దశతో పోల్చితే థర్డ్ వేవ్‌ను ఎందుర్కొనేందుకు ముందస్తుగా ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో 7,531 ఆక్సిజన్, వెంటిలేటర్ బెడ్లను జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఏర్పాటు చేసింది. కోవిడ్ కేర్ సెంటర్లను ఏర్పాటు చేయడంతో పాటు నోడల్ అధికారులను నియమించింది. జిల్లాలో 15 ఏళ్లు దాటిన వారికి దాదాపుగా వ్యాక్సినేషన్ పూర్తయింది. మొదటి, రెండో దశల్లో 4,012 మంది గర్భిణులు కరోనా బారిన పడ్డారు. ఈ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ముందస్తు చర్యలు తీసుకుంది. ప్రస్తుత పరిస్థితుల్లో గర్భిణులు, బాలింతలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించడంతో పాటు వారికి రక్షణగా నిలుస్తోంది. గర్భిణుల్లో బీపీ, మధుమేహం, ఇతర రుగ్మతలున్న వారిని ముందుగానే గుర్తించి.. వారికి వ్యాక్సినేషన్ పూర్తయిందా.. లేదా అని ఆరా తీసుకున్నారు. ఒక వేళ టీకా వేసుకోకపోతే నేరుగా వారి ఇంటికే వెళ్లి వ్యాక్సిన్ వేసే బాధ్యతను స్థానిక ఏఎన్ఎంలకు అప్పగించారు. కరోనా మూడో దశలో భారీగా కేసులు నమోదవుతున్న దృష్ట్యా.. జిల్లా ఉన్నతాధికారులు తరచూ వైద్యాధికారులు, వైద్యులతో సమీక్షలు నిర్వహిస్తూ.. అప్రమత్తం చేస్తున్నారు. మూడు నెలలు నిండిన గర్భిణి నుంచి ప్రసవం అయ్యే వరకు ఆరోగ్య పరిస్థితులను తెలుసుకోవడంతో పాటు, ప్రసవం అయిన తర్వాత శిశువుకు మెరుగైన వైద్యం అందించడం, అవగాహన కల్పించడం వంటి బాధ్యతలు ఏఎన్ఎంలు, ఆశ కార్యకర్తలు నిర్వర్తిస్తున్నారు. కరోనా నిబంధనలు పాటిస్తూ.. పీహెచ్సీ వైద్యాధికారుల పర్యవేక్షణలో వైద్య సేవలందిస్తున్నారు. ‘తల్లీబిడ్డ’సంరక్షణకు ప్రాధాన్యం కరోనా వేళ తల్లీబిడ్డ జాగ్రత్తగా ఉండాలంటే.. కోవిడ్ నిబంధనలు పాటిస్తూ ముందుకు వెళితే ఎలాంటి వైరస్లు దరిచేరవు. ఇంటిలో ఉన్నా.. ఆస్పత్రిలో ఉన్నా అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. తల్లికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయితే బిడ్డకు కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కనుక బాలింతలు ప్రత్యేక చర్యలు చేపట్టాలి. గర్భిణులు కూడా కడుపులో ఉన్న బిడ్డను దృష్టిలో పెట్టుకుని నిబంధనలు అనుసరించాలి. పౌష్టికాహారం తీసుకుంటూ ఉంటే కరోనా కష్టకాలాన్ని సులభంగా అధిగమించవచ్చని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. అప్రమత్తంగా ఉండాలి కరోనా విజృంభిస్తున్న వేళ బాలింతలు, గర్భిణులు మరింత అప్రమత్తంగా ఉండాలి. కరోనా ఉధృతి తగ్గేవరకు ఇంటికే పరిమితం కావాలి. ఇతరులతో పలకరింపులు కూడా తగ్గించుకోవాలి. జలుబు, జ్వరం, ఇతర వైరస్ లక్షణాలు కనిపించిన వెంటనే ఆస్పత్రికి వెళ్లి పరీక్షలు చేయించుకోవాలి. బయటకు వెళ్లే సమయంలో మాస్క్ ధరించడం..భౌతిక దూరాన్ని పాటించడం మరిచిపోవద్దు. ఈ కొద్ది కాలం గర్భిణులు, బాలింతలు జాగ్రత్తగా ఉండాల్సిందే.. – డాక్టర్ విజయలక్ష్మి, డీఎంహెచ్‌వో బర్త్ వెయిటింగ్ హాళ్లు ప్రసవ సమయంలో గర్భిణులకు మరింత మెరుగైన వైద్యసేవలందించాలనే లక్ష్యంతో ‘బర్త్ వెయింటిక్ హాళ్లు–ప్రెగ్నెంట్ వుమెన్ హాస్టల్’ఏర్పాటు చేశారు. ఐటీడీఏ పరిధిలోని మొత్తం 15 బర్త్ వెయింటింగ్ హాళ్లలో కరోనా నిబంధనలు తప్పనిసరి చేశారు. ప్రసవం తేదీకి 10 రోజుల ముందు నుంచే వారి పర్యవేక్షణ బాధ్యతలు, కరోనా జాగ్రత్తలు చెప్పడంతో పాటు ఆచరించేలా చూసే బాధ్యతలను ముగ్గురు ఏఎన్ఎంలు, ఓ డాక్టర్‌కు అప్పగించారు. అనుక్షణం అప్రమత్తం ► కరోనా వేళ గర్భిణులు, బాలింతలు అనుక్షణం అప్రమత్తంగా ఉండాలి. ► రెండు గంటలకు ఒకసారి 20–40 సెకన్ల పాటు చేతులను సబ్బు లేదా శానిటైజర్‌తో పూర్తిగా శుభ్రపరుచుకోవాలి. ► బయటకు వెళ్లినప్పుడు కచ్చితంగా భౌతిక దూరాన్ని పాటిస్తూ మాస్క్‌ను ధరించాలి. ► కరోనా లక్షణాలు ఉన్న వారు తప్పనిసరిగా పరీక్ష చేయించుకోవాలి. ► ఇప్పటికీ వ్యాక్సిన్ వేయించుకోకపోతే వెంటనే ఏఎన్ఎంలను సంప్రదించి.. టీకా తీసుకోవాలి. ► బాలింతలు, గర్భిణులు పౌష్టికాహారం తీసుకోవడం, తగినంత నిద్ర ఉండేలా చూసుకోవాలి. ► ఇంటిలో కుటుంబ సభ్యులతో మెలిగే సమయంలో మీటరు దూరం ఉండేలా చూసుకోవడంతో పాటు వీలైనంత మేర మాస్క్ ధరించడం మంచిది. ► ఎక్కువగా జనం ఉన్న రద్దీ ప్రదేశాలకు వెళ్లకూడదు. ► ఇరుగు పొరుగు వారితో కూడా గతంలో లాగా గుంపులుగా కూర్చొని చర్చలు నిర్వహించకుండా ఇంటికే పరిమితం కావడం మంచిది. 17 అంబులెన్స్‌ల ద్వారా సేవలు జిల్లా వ్యాప్తంగా యాంటినాటల్ మెటర్నటీ చెకప్‌కు 17కు పైగా 108 అంబులెన్స్‌లను కేటాయించారు. ఐటీడీఏ పరిధిలో 8, మిగతా నియోజవర్గాల్లో 9 అంబులెన్స్‌ల ద్వారా ఆరోగ్య పరీక్షలు చేస్తున్నారు. గర్భిణులను ఆస్పత్రికి తీసుకెళ్లే ముందు, తర్వాత అంబులెన్స్ మొత్తం శానిటైజేషన్ చేయడం వంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
కలవరపెడుతున్న ఒమిక్రాన్ కొత్త వేరియంట్ బీఏ.2.. స్పందించిన డబ్ల్యూహెచ్ఓ
లండన్: ప్రపంచంలో కరోనా ఉధృతి కొనసాగుతునే ఉంది. మరొవైపు ఒమిక్రాన్ కూడా కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న విషయం తెలిసిందే. దీనికి తోడు కొత్త కొత్త వేరియంట్లు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం బీఏ.2 వేరియంట్ పలు దేశాల్లో కలకలం సృష్టిస్తోంది. దీనిపై డబ్ల్యూహెచ్‌వో పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. తాజా అధ్యయనాల ప్రకారం.. బీఏ.2 వేరియంట్ ఇప్పటికే.. 57 దేశాలలో వెలుగులోకి వచ్చింది. ఇది ఒమిక్రాన్ వేరియంట్ కన్నా.. రెట్టింపు వేగంతో వ్యాపిస్తుందని డబ్ల్యూహెచ్‌వో తెలిపింది. కాగా, ఈ వేరియంట్ పదివారాల క్రితం దక్షిణాఫ్రికాలో వెలుగులోకి వచ్చింది. చాలా తక్కువ సమయంలో పలుదేశాల్లో విస్తరించిందని పరిశోధకులు తెలిపారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సేకరించిన తాజా నమునాలలో.. అనేక కొత్త వేరియంట్లు కనుగొనబడ్డాయని తెలిపారు. వీటిలో ప్రధానంగా.. బీఏ.1, బీఏ.1.1, బీఏ.2 మరియు బీఏ.3. రకానికి చెందిన వేరియంట్లు గుర్తించబడినట్లు పరిశోధకులు పేర్కొన్నారు. వీటిలో బీఏ.2 సబ్ వేరియంట్ ఒమిక్రాన్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 ఏమార్చగలదని తెలిపారు. కొత్త వేరియంట్ ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకొనే సామర్థ్యం కల్గి ఉందని పరిశోధకులు పేర్కొన్నారు. ప్రస్తుతం బీఏ.1, బీఏ.1.1 వేరియంట్లను గుర్తించామని, గ్లోబల్ సైన్స్ ఇనిషియేటివ్‌కి 96 శాతం.. ఓమిక్రాన్ వేరియంట్‌ను పోలి ఉందని పరిశోధకులు వెల్లడించారు. బీఏ.2 వేరియంట్ మానవ కణాలలోకి ప్రవేశించడానికి అనేక ఉత్పరివర్తనాలు కల్గి ఉండి, స్పష్టమైన పెరుగుదల ఉందని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. డబ్ల్యూహెచ్‌వో పరిశోధకుల్లో ఒకరైన వాన్ కెర్ఖోవ్ బీఏ.2 వేరియంట్‌పై స్పందిచారు. దీనిపై సమాచారం పరిమితంగా ఉందని తెలిపారు. బీఏ.1 కంటె కూడా.. బీఏ.2 అధిక వ్యాప్తిని కలిగి ఉందని తెలిపారు. ప్రస్తుతం డెల్లా వేరియంట్.. మునుపటి కరోనా కంటె.. తక్కువ తీవ్రత కల్గి ఉందని అన్నారు. ప్రస్తుతం కరోన ఒక ప్రమాదకరమైన వ్యాధిగా మిగిలిపోయిందని వాన్ కెర్ఖోవ్ చెప్పుకొచ్చారు. చదవండిః సొంత వాహనాల్లోనూ మాస్క్ తప్పనిసరి! ఇంకెన్నాళ్లు? -
కొనసాగుతున్న కరోనా ఉధృతి.. తగ్గిన పాజిటివిటీ రేటు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,61,386 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,81,109 మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు దేశంలో 3,95,11,307 మంది మహమ్మారి బారి నుంచి కోలుకున్నారు. ప్రస్తుతం 16,21,603 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 9.26% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 167.29 కోట్ల మంది వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నారు. India reports 1,61,386 fresh COVID cases and 2,81,109 recoveries in the last 24 hours Active cases: 16,21,603 Total recoveries: 3,95,11,307 Daily positivity rate: 9.26% Total vaccination: 167.29 crore pic.twitter.com/QD2jptRtG4 — ANI (@ANI) February 2, 2022 -
ఒమిక్రాన్‌కు ఉప వేరియెంట్!.. బీఏ.2గా నామకరణం
లండన్/జెనీవా: ప్రస్తుతం ప్రపంచాన్ని బెంబేలెత్తిస్తున్న కరోనా వైరస్ వేరియంట్ ఒమిక్రాన్‌కు ఉప వేరియంట్ పుట్టుకొచ్చినట్లు డెన్మార్క్‌లోని స్టాటెన్స్ సీరం ఇనిస్టిట్యూట్(ఎస్ఎస్ఐ)కు చెందిన పరిశోధకుల అధ్యయనంలో వెల్లడయ్యింది. ఇది అసలైన ఒమిక్రాన్ రకం వైరస్ కంటే మరింత వేగంగా వ్యాప్తి చెందుతున్నట్లు తేలింది. సబ్ వేరియంట్‌ను బీఏ.2గా పరిగణిస్తున్నారు. ఒమిక్రాన్‌కు బీఏ.1గా నామకరణం చేసిన సంగతి తెలిసిందే. బీఏ.2, బీఏ.1లలో ఏది అధికంగా వ్యాప్తి చెందుతోందన్న అంశాన్ని పరిశోధకులు నిశితంగా పరిశీలించారు. బీఏ.2 వ్యాప్తి వేగం అధికంగా ఉన్నట్లు గుర్తించారు. మెడ్ఆర్ఎక్స్ఐవీ అనే వెబ్సైట్లో ఈ అధ్యయన ఫలితాలను పోస్టు చేశారు. ఒకరి నుంచి మరొకరికి వేగంగా వ్యాప్తి చెందే లక్షణం బీఏ.2 సబ్ వేరియంట్‌కు సహజంగానే సంక్రమించిందని అధ్యయనకర్తలు చెబుతున్నారు. మనుషుల్లోని రోగ నిరోధక శక్తిని బీఏ.2 ఏమార్చగలదని పేర్కొంటున్నారు. అంటే ఇమ్యూనిటీ నుంచి ఈ సబ్ వేరియంట్ సులభంగా తప్పించుకోగలదని చెప్పొచ్చు. బీఏ.2 వ్యాప్తి రేటు 39 శాతం, బీఏ.1 వ్యాప్తి రేటు 29 శాతంగా ఉందని తమ అధ్యయనంలో గుర్తించినట్లు ఎస్ఎస్ఐ పరిశోధకులు ఒక ప్రకటనలో తెలియజేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కరోనా వ్యాక్సిన్ తీసుకొంటే వైరస్ నుంచి చాలావరకు రక్షణ పొందవచ్చని సూచిస్తున్నారు. వ్యాక్సిన్ తీసుకోనివారితో పోలిస్తే తీసుకున్నవారిలో బీఏ.1, బీఏ.2 వ్యాప్తి చాలా తక్కువగా ఉన్నట్లు వెల్లడించారు. కాబట్టి టీకా తీసుకోకపోతే వైరస్ బారినపడే అవకాశాలు ఎన్నో రెట్లు అధికంగా ఉంటాయని చెప్పారు. ఎస్ఎస్ఐ అధ్యయనంలో యూనివర్సిటీ ఆఫ్ కోపెన్‌హగన్, స్టాటిస్టిక్స్ డెన్మార్క్, టెక్నికల్ యూనివర్సిటీ ఆఫ్ డెన్మార్క్ పరిశోధకులు కూడా పాలుపంచుకున్నారు. వైద్య వ్యర్థాలతో మానవాళికి పెనుముప్పు కోవిడ్–19 మహమ్మారికి వ్యతిరేకంగా ప్రపంచమంతా పెద్ద యుద్ధమే చేస్తోంది. ముఖానికి మాస్కులు, చేతులకు గ్లౌజ్‌లు, ఆసుపత్రుల్లో పీపీఈ కిట్లు నిత్యావసరాలుగా మారిపోయాయి. నిత్యం లక్షలాది మాస్కులు, గ్లౌజ్‌లు అమ్ముడుపోతున్నాయి. అంతిమంగా ఇవన్నీ చెత్త కిందకే చేరుతున్నాయి. ఇక కరోనా వ్యాక్సినేషన్లో భాగంగా ఉపయోగిస్తున్న సిరంజీల గురించి చెప్పాల్సిన పనిలేదు. వ్యాక్సినేషన్ కోసం ఒకసారి వాడి పారేసే సిరంజీలే ఉపయోగిస్తున్నారు. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా వైద్య వ్యర్థాల (హెల్త్‌కేర్ వేస్ట్) గుట్టలుగా పేరుకుపోతున్నారని, వీటితో మానవాళికి పెనుముప్పు పొంచి ఉందని ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) ఆందోళన వ్యక్తం చేసింది. లెక్కలేనంతగా పోగుపడుతున్న వైద్య వ్యర్థాలతో ప్రజల ఆరోగ్యానికే కాదు, పర్యావరణానికి సైతం ప్రమాదమేనని మంగళవారం వెల్లడించింది. ఈ పరిస్థితిలో త్వరగా మార్పు రాకపోతే ఊహించని పరిణామాలు ఎదురవుతాయని హెచ్చరించింది. ఇందుకోసం ప్రభుత్వాలతోపాటు ప్రజలు సైతం నడుం కట్టాలని పిలుపునిచ్చింది. మాస్కులు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు, సిరంజీలను ఎక్కడపడితే అక్కడ వదిలేయకుండా శాస్త్రీయంగా నిర్మూలించాలని సూచించింది. వ్యర్థాల నిర్మూలన విధానాలను మెరుగుపర్చడంపై ప్రభుత్వాలు ప్రత్యేకంగా దృష్టి పెట్టాలని కోరింది. ప్రజలు అవసరానికి మించి మాస్కులు, గ్లౌజ్‌లు, పీపీఈ కిట్లు ఉపయోగిస్తున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ టెక్నికల్ ఆఫీసర్ డాక్టర్ మార్గరెట్ మాంట్గోమెరీ చెప్పారు. దీనికి స్వస్తి పలకాలని అన్నారు. కరోనా రక్షణ పరికరాల తయారీ విషయంలో పర్యావరణ హిత, పునర్వినియోగ, బయోడిగ్రేడబుల్ మెటీరియల్‌కు ప్రాధాన్యం ఇవ్వాలని ఇంటర్నేషనల్ సాలిడ్ వేస్ట్ అసోసియేషన్ ప్రతినిధి డాక్టర్ అన్నె వూల్రిడ్జ్ తెలిపారు. -
Corona Virus: భారత్‌లో స్వల్పంగా తగ్గిన కొత్త కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. నిన్నటితో పోల్చితే కేసుల సంఖ్య స్వల్పంగా తగ్గింది. కానీ మరణాల సంఖ్య పెరగడం ఒకింత ఆందోళన కల్గిస్తుంది. గడిచిన 24 గంటలలో 1,67,059 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 2,54,076మంది వైరస్ బారి నుంచి కోలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 1192 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 17,43,059 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.69% శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు దేశంలో 1,66,68,48,204 మంది వ్యాక్సినేషన్ పూర్తిచేసుకున్నారు. India's daily cases drop below 2 lakh; the country reports 1,67,059 new #COVID19 cases, 1192 deaths and 2,54,076 recoveries in the last 24 hours Active case: 17,43,059 (4.20%) Daily positivity rate: 11.69% Total Vaccination : 1,66,68,48,204 pic.twitter.com/7yjkgUUMB8 — ANI (@ANI) February 1, 2022 చదవండిః మరిదితో వెళ్లిపోయి.. మూడో భర్త ముందు పతివ్రతనే అని.. -
సీన్ రివర్స్.. కేసులు తగ్గుతున్నా.. మరణాలు పెరుగుతున్నాయ్
న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ మహమ్మారి వ్యాప్తి స్థిరంగా కొనసాగుతోంది. వరుసగా ఆరో రోజు మూడు లక్షలకు దిగువనే కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 16,15,993 పరీక్షలు నిర్వహించగా 2,34,281 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. ఓ వైపు కొత్త కేసులు తగ్గినా.. మరణాలు మాత్రం పెరిగాయి. నిన్న 893 మంది కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,94,091కు పెరిగాయి. అయితే కొత్త కేసుల కంటే రికవరీలే ఎక్కువ ఉండటం కొంత ఊరటనిచ్చే అంశం. ఒక్కరోజే 3,52,784 మంది కోవిడ్ నుంచి రికవరీ అయ్యారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం ప్రస్తుతం యాక్టివ్ 18,84,937 కేసులు ఉన్నాయి. మొత్తం రికవరీల సంఖ్య 3,87,13,494కి పెరగగా.. రికవరీ రేటు 94.21శాతంగా ఉంది. రోజువారీ పాటిటివిటీ రేటు13.39 శాతం నుంచి 14.50 శాతానికి పెరిగింది. వారం వారీ పాజిటివ్ రేటు16.0 శాతానికి పెరిగింది. మరోవైపు దేశ వ్యాప్తంగా వ్యాక్సినేషన్ శరవేగంగా సాగుతోంది. ఇప్పటివరకు 165.70 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు పంపిణీ చేశారు. అలాగే మొత్తం 72.73 కోట్ల పరీక్షలు నిర్వహించారు. చదవండి: నియోకోవ్ వైరస్‌పై డబ్ల్యూహెచ్ఓ కీలక వ్యాఖ్యలు! -
తగ్గేదేలే అంటున్న కోవిడ్.. ప్రతి 100 మందిలో 15 మంది..
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా భారీ సంఖ్యలో కేసులు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు దేశంలో పాటిటివిటీ రేటు క్రమంగా పెరుగుతోంది. ప్రస్తుతం రోజువారీ పాజిటివిటీ రేటు 15.88 శాతానికి పెరిగింది. అంటే ప్రతి 100 మందిలో 15 మంది కోవిడ్ బారిన పడుతున్నారు. ఇక గడిచిన 24 గంటల్లో 2,51,209 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్న కరోనాతో 627 మంది మృత్యువాత పడ్డారు. ఒకే రోజు 3,47,443 మంది కోవిడ్‌నుంచి కోలుకున్నారు. దేశంలో మొత్తం కేసుల సంఖ్య 4 కోట్ల ఆరు లక్షలకు చేరింది. మరణాల సంఖ్య 4,92,327కు చేరింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కోవిడ్‌పై శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీని ప్రకారం దేశంలో ప్రస్తుతం 21 లక్షల 5వేల 611 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశంలో 164.44 కోట్ల వ్యాక్సినేషన్ పంపిణీ చేశారు. దక్షిణాది రాష్ట్రాలతో వ్యాక్సినేషన్, కరోనా తాజా పరిస్థితులపై కేంద్రం ఆరోగ్య శాఖ మంత్రి మన్సుక్ మాండవీయ శుక్రవారం సమీక్ష నిర్వహించనున్నారు. తమిళనాడు, కేరళ, ఆంధ్రప్రదేశ్, లక్షద్వీప్, తెలంగాణ, అండమాన్&నికోబార్ దీవుల ఆరోగ్యశాఖ మంత్రులు ఈ సమావేశానికి హాజరు కానున్నట్లు తెలుస్తోంది. చదవండి: కరోనా బారిన పడ్డ కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి జైశంకర్ -
పారాసెటమాల్ 650 ఎంజీ చాలు.. అనవసర మందులు వాడొద్దు
సాక్షి, అమరావతి: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ చికిత్సలో పారాసెటమాల్ 650 ఎంజీ వాడితే చాలని, అనవసర మందులు వాడొద్దని రాష్ట్ర కరోనా నిపుణుల కమిటీ సభ్యుడు, ఆంధ్ర మెడికల్ కళాశాల ప్రొఫెసర్ డాక్టర్ ఎ. ప్రేమ్‌కుమార్ తెలిపారు. అనేక దేశాలు, డబ్ల్యూహెచ్‌వో దీనినే నిర్ధారించాయని చెప్పారు. ఒమిక్రాన్ తీవ్రత, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, చికిత్స తదితర అంశాలపై డాక్టర్ ప్రేమ్ కుమార్ ‘సాక్షి’కి తెలిపిన వివరాలు ఆయన మాటల్లోనే.. ఒమిక్రాన్ బారిన పడిన వారు పారాసెటమాల్ మూడు పూటలా మూడు నుంచి ఐదు రోజులు వేసుకోవాలి. జ్వరం వచ్చినప్పుడు శరీరంలోని తేమ ఆవిరి రూపంలో చర్మం నుంచి బయటికి వెళ్తుంది. అందువల్ల డీహైడ్రేషన్ అవకుండా రోజుకు 2.5 లీటర్లకు తగ్గకుండా నీళ్లు, మజ్జిగ, పళ్ల రసాలు తీసుకోవాలి. కొందరిలో ఐదు రోజుల తర్వాత దగ్గు ఉంటుంది. తీవ్రమైన దగ్గుతో బాధపడే వారు బుడెసోనైడ్ ఇన్హేలర్ను 800 మైక్రో గ్రామ్స్ ఉదయం, రాత్రి 5 రోజులు పీల్చాలి. ఇప్పటికీ కొందరు విచ్చలవిడిగా ఐవర్‌మెక్టిన్, డాక్సీసైక్లిన్, జింకోవిట్, స్టెరాయిడ్స్ వంటివి సూచిస్తున్నారు. అవేమీ అవసరం లేదు. ఒమిక్రాన్ చికిత్సలో మోనోక్లోనల్ యాంటీబాడీ కాక్టెయిల్ కూడా పనిచేయదు. హోమ్ ఐసోలేషన్ ప్రధానం సామాజిక వ్యాప్తి దశకు ఒమిక్రాన్ చేరుకుంది. వేగంగా వ్యాపిస్తోంది. ఆసుపత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య మాత్రం చాలా తక్కువ. అందువల్ల హోమ్ ఐసోలేషన్ ముఖ్యం. పాజిటివ్ అయిన వారు వారం రోజులు ఇంట్లోనే ఉండాలి. రోగికి ఇంట్లో ఇతరులు ఎదురుపడాల్సి వస్తే ఇరువురు ఎన్–95 మాస్క్ లేదా డబుల్ సర్జికల్ మాస్క్ వేసుకోవాలి. జ్వరం, ఒళ్లు నొప్పులు మూడు రోజులు దాటి తీవ్రంగా ఉన్నా, ఛాతీలో నొప్పి, ఊపిరి తీసుకోవడం కష్టంగా ఉండటం, కళ్లు తిరిగిపడటం, మగత వంటి లక్షణాలుంటే వైద్యులను సంప్రదించాలి. ఒకే ప్రభావం ఉండదు ఒమిక్రాన్ సోకిన చాలా మందిలో ఒకే లక్షణాలు ఉంటున్నాయి. ప్రభావం మాత్రం అందరిపైనా ఒకేలా లేదు. వ్యాక్సిన్ వేసుకోని వారు, 60 ఏళ్లు పైబడిన వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు, కీళ్ల నొప్పులు, ఇతర రోగాలకు స్టెరాయిడ్స్ వాడే వారిలో రోగనిరోధక శక్తి తక్కువగా ఉంటుంది. వీరిపై ప్రభావం ఎక్కువే. యువత, ఆరోగ్యవంతుల్లో ఏమీ కాదన్న ధీమా ఎక్కువగా ఉంది. వీరికి ఏమీ అవ్వకపోవచ్చు. జాగ్రత్తలు పాటించకుండా విచ్చలవిడిగా తిరిగితే ఇళ్లలో, చుట్టుపక్కల ఉండే వృద్ధులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు వీరి ద్వారా వైరస్ సోకే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రతి ఒక్కరూ విధిగా కరోనా జాగ్రత్తలు పాటించాలి. -
మాస్కు ఆంక్షలను ఎత్తేసిన ఇంగ్లండ్
లండన్: మాస్కులు తప్పనిసరి సహా పలు కోవిడ్ ఆంక్షలను ఇంగ్లండ్ గురువారం ఎత్తేసింది. బూస్టర్ డోస్ టీకా తీవ్రమైన అనారోగ్యంతోపాటు ఆస్పత్రుల్లో చేరడాన్ని తగ్గించిందని బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించిన అనంతరం ఇంగ్లండ్ ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో గురువారం నుంచి ఇంగ్లండ్‌లో ఎవ్వరూ మాస్కులు ధరించాల్సిన అవసరం లేదు. ఇక నైట్ క్లబ్బులు, ఇతర వేదికలకు కోవిడ్ పాసులు కూడా అవసరం లేదని తెలిపింది. ఇక ఇంటినుంచే పని, స్కూళ్లలో ఫేస్ మాస్కుల నిబంధనను గత వారమే ప్రభుత్వం ఎత్తివేసింది. ఓమిక్రాన్ వేరియంట్ వేగవంతమైన వ్యాప్తిని అడ్డుకోవడానికి, బూస్టర్ డోస్ వేసుకోవడానికి సమయమిస్తూ డిసెంబర్ మొదటివారం నుంచే ‘ప్లాన్ బి’ చర్యలు ప్రారంభించింది. అందరికీ బూస్టర్ డోసు టీకాలు వేయడంతోపాటు, నిర్ధారణ పరీక్షలు, యాంటీ వైరల్ చికిత్సలను అందించడంలో యూరప్ బలంగా పనిచేసిందని ఆరోగ్య కార్యదర్శి సాజిద్ జావీద్ తెలిపారు. వైరస్ పూర్తిగా నిర్మూలనయ్యే అవకాశం లేదని, వైరస్‌తో సహజీవనం నేర్చుకున్నామని ఆయన తెలిపారు. దేశంలో ఒమిక్రాన్ తగ్గుముఖం పడుతున్నా.. పిల్లలు, వృద్ధుల్లో ఎక్కువగా ఉందని పేర్కొన్నారు. 12 ఏళ్లు పైబడినవారందరికీ వ్యాక్సినేషన్ 84 శాతం పూర్తయ్యిందని, అర్హత ఉన్నవాళ్లంతా రెండో డోసు తీసుకున్నారని, 81 శాతం మంది బూస్టర్ డోసు కూడా తీసుకున్నారని వెల్లడించారు. ఆస్పత్రుల్లో చేరిక, ఐసీయూ చికిత్సలో ఉన్నవారి సంఖ్య స్థిరంగా కొనసాగుతోందని, కొత్త సంవత్సరం సమయంలో రోజుకు రెండులక్షలున్నా ఇప్పుడు లక్షకు పడిపోయాయని తెలిపారు. మరోవైపు గురువారం యూకేలో 96,871 కొత్త కేసులు నమోదయ్యాయి. 338 మరణాలు సంభవించాయి. గతవారమే ప్రకటన ఒమిక్రాన్ బారిన పడినవారి సంఖ్య గరిష్ట స్థాయికి చేరుకుందని ప్రధాని బోరిస్ జాన్సన్ గత వారమే ప్రకటించారు. అయితే... తమ వినియోగదారులను ఫేస్ మాస్కులు ధరించమని కోరతామని కొన్ని దుకాణదారులు, రవాణా సంస్థలు ప్రకటించిన నేపథ్యంలో ప్రభుత్వం చట్టపరమైన చర్యల నుంచి తప్పుకొంది. ఇక అయితే రాజధానిలోని బస్సులు, సబ్ వే రైళ్లలో ఇప్పటికీ మాస్కులు వసరమని లండన్ మేయర్ సాధిక్ ఖాన్ తెలిపారు. ఇక ఒమిక్రాన్ సోకి వారికి ఐదురోజుల ఐసోలేషన్ సరిపోతుందన్నారు. కోవిడ్ 19ను ఫ్లూలాగా పరిగణించి దీర్ఘకాలిక ప్రణాళిక తయారు చేస్తున్నట్లు అక్కడి ఆరోగ్యాధికారులు తెలిపారు. స్కాట్లాండ్, వేల్స్, ఉత్తర ఐర్లాండ్‌లు సొంత ప్రజారోగ్య నియమాలను రూపొందించుకున్నాయి. అదేవిధంగా వారి వైరస్ నిబంధనలను కొంత సడలించాయి. -
ఆసుపత్రుల్లో 3,386 మంది
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు ఏమాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నమోదైన దానికంటే బయట ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకునే అవకాశం రావడంతో వివరాలు బయటికి రావడం లేదు. దీంతో అలాంటి వారు బయటికొస్తూ ఇతరులకు కూడా అంటిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది. తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 39,520 క్రియాశీలక కేసులున్నాయి. వాటిలో 844 మంది ఐసీయూలో, 1,412 మంది ఆక్సిజన్‌పై ఉన్నారు. 1,130 మంది సాధారణ పడకలపై చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్నారని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. ఒక్క రోజే 3,944 కరోనా కేసులు రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూనే ఉంది. గురువారం రాష్ట్రంలో 97,549 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,944 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.51 లక్షలకు చేరుకుంది. తాజాగా 2,444 మంది కోలుకోగా, మొత్తంగా 7.07 లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్క రోజులో కరోనాతో ముగ్గురు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌కు 4,081 మంది బలయ్యారు. ఇక ప్రస్తుతం 39,520 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వాటిలో 3,386 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కరోనా బులెటిన్‌లో డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు. -
ఒమిక్రాన్ రోగనిరోధక శక్తి డెల్టానూ ఎదుర్కొంటోంది
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ సోకినవారిలో రోగనిరోధక శక్తి గణనీయంగా పెరిగిందని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తెలిపారు. ఇది డెల్టాతో పాటు ఇతర వేరియెంట్లను సైతం సమర్ధవంతంగా ఎదుర్కోగలదని వెల్లడించారు. ఒమిక్రాన్ వచ్చిన వారిలో తిరిగి డెల్టా వేరియెంట్ వచ్చే అవకాశమే లేదని ఐసీఎంఆర్ శాస్త్రవేత్తలు తేల్చి చెప్పారు. మొత్తం 39 మంది వ్యక్తులపై ఈ అధ్యయనం నిర్వహించారు. వీరిలో 25 మంది ఆస్ట్రాజెనెకా టీకా రెండు మోతాదులను తీసుకోగా, ఎనిమిది మంది వ్యక్తులు ఫైజర్ రెండు డోసులు తీసుకున్నారు. ఆరుగురు అసలు టీకాలు వేసుకోలేదు. టీకా వేసుకున్నవారికంటే, వేసుకోనివారిలో ఈ రోగనిరోధక శక్తి తక్కువగా ఉన్నట్లు అధ్య యనం పేర్కొన్నది. ఒమిక్రాన్ బారిన పడిన తరువాత అతి తక్కువ సమయంలోనే అధ్య యనం చేయడం ఇందుకు కారణం కావచ్చని అభిప్రాయపడింది. -
తెలంగాణ: వచ్చేవారంలో పతాకస్థాయికి ఒమిక్రాన్.. తగ్గేది మాత్రం అప్పుడే!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వచ్చే వారం నాటికి తీవ్రస్థాయికి చేరుకుంటుందని కాంటినెంటల్ ఆసుపత్రుల చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రపంచ ప్రసిద్ధిగాంచిన గ్యాస్ట్రో ఎంటరాలజిస్ట్ డాక్టర్ గురు ఎన్ రెడ్డి అభిప్రాయపడ్డారు. వచ్చే వారం తర్వాత తగ్గుతుందని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. దేశంలో రెండు మూడు వారాల్లో పీక్కు చేరుకుంటుందని చెప్పారు. ఫిబ్రవరి చివరి నాటికి తగ్గుముఖం పడుతుందన్నారు. మానవుడి పుట్టుక తర్వాత ఇంత వేగంగా విస్తరించిన వైరస్ లేదని, ఇదే మొదటిసారి అని తెలిపారు. ప్రస్తుతం కరోనా వైరస్ తీవ్రత, వ్యాప్తి, చికిత్స, వ్యాక్సినేషన్ తదితర అంశాలపై డాక్టర్ గురు ఎన్ రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ముఖ్యాంశాలు ఆయన మాటల్లోనే.. 80 శాతం మందికి వైరస్... మీజిల్స్ వైరస్ తీవ్రంగా విస్తరిస్తుంది అనుకున్నాం. కానీ ఒమిక్రాన్ దానిని మించిపోయింది. దీనివల్ల ప్రపంచవ్యాప్తంగా 80 శాతం మంది వైరస్ బారినపడతారు. 50 నుంచి 80 శాతం వేగంతో విస్తరిçస్తున్నందున త్వరగా ఇన్ఫెక్ట్ చేస్తుంది. దగ్గు, జలుబు తుంపర్ల ద్వారా ఇది విస్తరిస్తుంది. మాస్క్ లేకుండా ఉంటే మరింత వేగంగా విస్తరిస్తుంది. ఇళ్లలో ఒకరికి వస్తే ఇతరులకూ వ్యాపిస్తుంది. (చదవండి: ఆటలు వద్దు.. సూచనలు జారీ చేసిన విద్యాశాఖ కమిషనర్) ఊపిరితిత్తులను ఇన్ఫెక్ట్ చేయదు ఒమిక్రాన్ సోకినప్పుడు ఎక్కువ కేసుల్లో లక్షణాలు చాలా తక్కువగా ఉంటున్నాయి. దగ్గు, జలుబు, ఒళ్లు నొప్పులు ఉంటాయి. గొంతులో ముక్కులో ఉండే వైరస్ ఇది. ఊపిరితిత్తులను ఇన్పెక్ట్ చేయదు. డెల్టా మందులు పనికిరావు డెల్టాకు వాడే మందులు ఒమిక్రాన్‌కు పనికిరావు. డెల్టాకు స్టెరాయిడ్స్, రెమిడిసివిర్, మోనొక్లోనాల్ యాంటీబాడీస్ ఉపయోగించాం. కానీ ఒమిక్రాన్‌కు ‘మాన్లువిరపిర్’అనే మాత్ర వేసుకోవాలి. ఇది ఎం తో సురక్షితమైంది. మొదటి రెండ్రోజులు జ్వరం అ లాగే ఉంటే ఈ మందు వేయొచ్చు. కానీ గర్భిణిలు, త్వరలో ప్రెగ్నెన్సీ వచ్చే వారికి ఇవ్వకూడదు. ఈ మందు తీసుకున్న ఆరు నెలల వరకు ప్రెగ్నెన్నీ కో సం ప్రయత్నించకూడదు. కొందరు అనుభవం లేని డాక్టర్లు ఇప్పటికీ అనవసరంగా క్లోరోక్విన్, ఐవర్‌మెక్టిన్, యాంటీబయోటిక్ మందులు ఇస్తున్నారు. డెల్టానా, ఒమిక్రానా తెలుసుకోవచ్చు ఎస్ జీన్ ఆర్టీపీసీఆర్ కోవిడ్ టెస్ట్చేస్తే అందులో ఒమిక్రానా లేదా డెల్టా అనేది స్పష్టంగా తెలుస్తుంది. ఈ పరీక్షలు ప్రభుత్వంలో అందుబాటులో లేవు. ప్రైవేట్ పరీక్ష కేంద్రాల్లో కొన్నిచోట్ల చేస్తున్నారు. మేము మా ఆస్పత్రిలో రూ.1,200 తీసుకుని ఔట్ పేషెంట్లకు, అవసరమైన వారికి కూడా చేస్తున్నాం. డోలో వేసుకుంటే చాలు: ఒమిక్రాన్‌లో జ్వరం వస్తే డోలో వేసుకుంటే సరిపోతుంది. ఏడు రోజులు ఐసోలేషన్‌లో ఉండి, చివరి 24 గంటల్లోపు జ్వరం లేకుంటే సాధారణ జీవనంలోకి రావొచ్చు. డోలో వేసుకున్నా రెండు మూడు రోజుల్లో జ్వరం తగ్గకపోతే అప్పుడు డాక్టర్‌ను సంప్రదించాలి. ఇది సోకితే భవిష్యత్తులో కోవిడ్ రాదు ఒమిక్రాన్ వచ్చిపోయిన వారికి దీర్ఘకాలిక రోగనిరోధక శక్తి వస్తుందని శాస్త్రవేత్తలు అంటున్నారు. అది ఏళ్లపాటు ఉంటుందంటున్నారు. మళ్లీ భవిష్యత్తులో కోవిడ్ రాకుండా కాపాడుతుందని అంటున్నారు. ఒమిక్రాన్ వచ్చినవారికి డెల్టా వేరియంట్ వచ్చే అవకాశం ఉండదు. కానీ డెల్టా వచ్చిన వారికి ఒమిక్రాన్ వస్తుంది. బూస్టర్‌తో మెరుగైన రక్షణ రెండు వ్యాక్సిన్ల తర్వాత బూస్టర్ తీసుకోవాలని సూచిస్తున్నాం. మూడు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నవారికి పూర్తిస్థాయి భద్రత ఉంటుంది. ఒమిక్రాన్ వచ్చినా 90 శాతం మందికి ఐసీయూకు వెళ్లే ప్రమాదం ఉండదు. మరణాలు ఉండవు. అలసట, తలనొప్పి ఉంటాయి ఒమిక్రాన్ వచ్చి తగ్గిన తర్వాత మూడు నాలుగు వారాల వరకు అలసట, తలనొప్పి, ఆందోళనతో కూడిన మానసిక స్థితి ఉంటుంది. ఒమిక్రాన్ వైరస్ వెన్నెముక ద్రవంలోకి చేరుకొని, తర్వాత మెదడుకు చేరుకొని అక్కడ వాపు తీసుకొస్తుంది. దీనివల్ల నాలుగైదు వారాలు పై సమస్యలు వస్తాయి. నిద్ర సరిగా పట్టక పోవడం ఉంటుంది. పిల్లలు తట్టుకుంటున్నారు పిల్లలు ఒమిక్రాన్‌ను తట్టుకుంటున్నారు. ఎవరికీ ఏమీ కావట్లేదు. తల్లిదండ్రులు భయపడి పిల్లల్ని ఆస్పత్రులకు తీసుకొచ్చి చూపిస్తున్నారు. 10% కంటే తక్కువ ఐసీయూ ఆక్యుపెన్సీ హైదరాబాద్‌లో మాలాంటి ఐదారు పెద్దాసుపత్రుల్లోని ఐసీయూల్లో 10 శాతం కంటే తక్కువ ఆక్యుపెన్సీ ఉంది. కొందరు డాక్టర్ల పర్యవేక్షణలో ఉండాలని కోరుకుంటూ వస్తున్నారు. కొందరు కొత్త మందుల కోసం వస్తున్నారు. మన ప్రభుత్వాలను అభినందించాలి మన దేశంలో వ్యాక్సినేషన్ బాగా జరగడం వల్ల మరణాలు పెద్దగా లేవు. మరణించేవారిలో 90 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే. వ్యాక్సినేషన్‌తో ఎంతో ప్రయోజనం చేకూరింది. తెలంగాణ , ఏపీల్లో పీహెచ్‌సీల్లో సైతం వ్యాక్సిన్లను అందుబాటులో ఉంచిన ప్రభుత్వాలను అభినందించాలి. (చదవండి: కర్ణాటక ప్రభుత్వం కీలక నిర్ణయం.. హాఫ్ హెల్మెట్‌కు బై బై?) -
మనిషి చర్మంపై ఒమిక్రాన్ ఎన్ని గంటలు సజీవంగా ఉంటుందో తెలుసా?
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా పంజా విసురుతున్న విషయం తెలిసిందే. ఇప్పటి వరకు వెలుగుచూసిన వేరియంట్ల కంటే అత్యంత వేగంగా ఒమిక్రాన్ వ్యాపిస్తోంది. అయితే ఒమిక్రాన్ ఎందుకు ఇంత ఎక్కువగా వ్యాప్తి చెందుతోందనే కారణం తాజాగా బయటపడింది. మనిషి శరీరంపై 21 గంటలపాటు ఒమిక్రాన్ వేరియంట్ నిలిచి ఉంటుందని తాజాగా ఓ అధ్యయనంలో తేలింది. అంతేకాదు ప్లాస్టిక్‌పై ఈ వేరియంట్ 8 రోజులపాటు సజీవంగా ఉంటుంది తేలింది. జపాన్‌కు చెందిన క్యోటో ప్రిఫెక్చురల్ యూనివర్సిటీ పరిశోధకులు ఈ విషయాన్ని కనుగొన్నారు. వుహాన్‌లో ఉద్భవించిన సార్క్ సీఓవీ2 ఒరిజినల్ వేరియంట్‌తోపాటు ఇతర వేరియంట్లపై పరిశోధనలు చేసి ఈ నిర్ధారణకు వచ్చారు. ఆల్ఫా, బీటా, డెల్టా, ఒమిక్రాన్ వేరియంట్లు ఒరిజినల్‌తో పోలిస్తే మనిషి చర్మంపై, ప్లాస్టిక్‌పై రెండు రెట్లు అధికంగా జీవించి ఉన్నట్లు గుర్తించారు. ఒమిక్రాన్ ఇతర అన్నీ వేరియంట్ల కంటే ఎక్కువ సామర్థ్యం ఉన్నందున డెలటఆ వేరియంట్ కంటే కూడా అధికంగా వ్యాప్తి చెందుతుందని పరిశోధకులు గుర్తించారు. చదవండి: ఒమిక్రాన్ చివరి వేరియెంట్ అనుకోలేం ప్లాస్టిక్ సర్ఫేస్‌లపై ఒరిజనల్ వేరియంట్ 56 గంటలు, ఆల్ఫా వేరియంట్ 191.3 గంటలు, బీటా వేరియంట్ 156.6 గంటలు, గామా వేరియంట్ 59.3 గంటలు, డెల్టా వేరియంట్ 114 గంటలు సజీవంగా ఉంటుందని తేల్చి చెప్పారు. వీటన్నింటికి మించి ఒమిక్రాన్ వేరియంట్ ప్లాస్టిక్‌పై 193.5 గంటలపాటు సజీవంగా ఉండనున్నట్లు పరిశోధకులు పేర్కొన్నారు. చదవండి: కరోనా ఉధృతి: గడిచిన 24 గంటల్లో 2,85,914 కేసులు అదే విధంగా చర్మం మీద ఒరిజినల్ వేరియంట్ 8.6 గంటలు, ఆల్ఫా వేరియంట్ 19.6 గంటలు, బీటా 19.1 గంటలు, డెల్టా 16.8 గంటలు, ఒమిక్రాన్ 21.1 గంటలు ఉంటుందని తెలిపారు. కాగా ఆల్ఫా, బీటా వేరియంట్ల మధ్య మనుగడ సామర్థ్యంలో గణనీయమైన తేడా లేదు. ఇవి ఇంతకముందు అధ్యయనాల ఫలితాలకు అనుగుణంగా ఉందని పరిశోధకులు తెలిపారు. -
ఒక్కరోజే 4,559 కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. మంగళవారం రాష్ట్రంలో 1.13 లక్షల మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 4,559 మంది వైరస్ బారినపడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తంగా కేసుల సంఖ్య 7.43 లక్షలకు చేరుకున్నాయి. తాజాగా 1,961 మంది కోలుకోగా, మొత్తంగా 7.03 లక్షల మంది రికవరీ అయ్యారు. ఒక్కరోజులో కరోనాతో ఇద్దరు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌తో 4,077 మంది మృతిచెందారు. ప్రస్తుతం 36,269 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వాటిల్లో 3,335 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారని ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు తెలిపారు. -
93% ఒమిక్రానే.. అయినా లక్షణాలు లేవు.. నిబంధనలు పాటించకుంటే!
సాక్షి, గాంధీఆస్పత్రి : కోవిడ్ థర్డ్‌వేవ్‌లో కరోనా నిర్ధారణ అయినప్పటికీ లక్షణాలు కనిపించడం లేదని, ప్రస్తుత బాధితుల్లో 93 శాతం ఒమిక్రాన్, 7 శాతం డెల్టా వేరియంట్లు ఉన్నాయని గాంధీఆస్పత్రి సూపరింటెండెంట్ ప్రొఫెసర్ రాజారావు తెలిపారు. కోవిడ్ నోడల్ కేంద్రమైన గాంధీలో 167 మంది కోవిడ్ రోగులకు వైద్యచికిత్సలు అందిస్తున్నామని, వీరిలో కరోనాతోపాటు దీర్ఘకాల వ్యాధులు, వివిధ రుగ్మతలతో బాధపడుతున్న 74 మంది పరిస్థితి ఒకింత విషమంగా ఉందని, వీరిని ప్రధాన భవనంలోని రెండో అంతస్తులోని కోవిడ్ ఐసీయులో ప్రత్యేక వైద్యసేవలు అందిస్తున్నామని వివరించారు. చదవండి: ఒమిక్రాన్ భారత్: అంతా అయోమయం.. గందరగోళమే! ఒమిక్రాన్ వేరియంట్ అంతగా ప్రమాదకారి కాదనే ధైర్యంతో కోవిడ్ నిబంధనలు పాటించకుంటే కొత్త వేరియంట్లు పుట్టుకొచ్చే ప్రమాదం ఉందని, ప్రజలంతా మరింత అప్రమత్తంగా ఉండాలని సూచించారు. గాంధీలో అవుట్ పేషెంట్, అత్యవసర సేవలు, పేషెంట్ అడ్మిషన్లు, సర్జరీలు యథావిధిగా కొనసాగుతున్నాయని స్పష్టం చేశారు. చదవండి: ఒమిక్రాన్ చివరి వేరియెంట్ అనుకోలేం -
ఒమిక్రాన్ చివరి వేరియెంట్ అనుకోలేం
జెనివా: కరోనా ఎండమిక్ దశకి వచ్చేశామని ప్రపంచ దేశాలు భావిస్తే ప్రమాదకరమని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) చీఫ్ టెడ్రోస్ అధ్నామ్ ఘెబ్రెయాసస్ హెచ్చరించారు. కరోనా వైరస్ నుంచి మరిన్ని వేరియెంట్లు వచ్చే అవకాశాలు అధికంగా ఉన్నాయని అన్నారు. సోమవారం జరిగిన డబ్ల్యూహెచ్ఓ ఎగ్జిక్యూటివ్ బోర్డు సమావేశంలో మాట్లాడుతూ తొమ్మిది వారాల కిందట ఒమిక్రాన్ వేరియెంట్‌ని గుర్తిస్తే ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా 8 కోట్ల మంది వైరస్ బారిన పడినట్టు తమకు నివేదికలు అందాయన్నారు. 2020 ఏడాది మొత్తంగా నమోదైన కేసుల కంటే ఇది ఎక్కువని చెప్పారు. కరోనా పరిస్థితులు దేశ దేశానికి మారిపోతున్నాయని చెప్పిన టెడ్రోస్ ఈ ఏడాది చివరి నాటికల్లా కోవిడ్–19 అత్యవసర పరిస్థితి నుంచి బయటపడతామని ఆశాభావం వ్యక్తం చేశారు. కొన్ని లక్ష్యాలను నిర్దేశించుకొని ప్రపంచదేశాలన్నీ కలసికట్టుగా కృషి చేస్తే కరోనా తుది దశకు చేరుకుంటామన్నారు. స్వల్పంగా తగ్గిన రోజువారీ కేసులు భారత్‌లో రోజు వారీ కేసుల సంఖ్య కాస్త తగ్గుముఖం పట్టింది. గత 24 గంటల్లో 3,06,064 కేసులు నమోదైనట్టు కేంద్ర ఆరోగ్య శాఖ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక యాక్టివ్ కేసుల సంఖ్య భారీగా పెరిగింది. 22,49,335కి యాక్టివ్ కేసులు చేరుకున్నాయి. రోజువారీ పాజిటివిటీ రేటు 20.75 నమో దు కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 17.03గా ఉంది. శరద్ పవార్‌కు కరోనా ఎన్సీపీ అధినేత శరద్ పవార్‌కు కరోనా సోకింది. డాక్టర్ల సూచన ప్రకారం చికిత్స తీసుకుంటున్నానని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని పవార్ ట్వీట్ చేశారు. 81 సంవత్సరాల పవార్ ఆరోగ్యంపై ప్రధాని మోదీ సైతం ఆరా తీశారు. ఆయన త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ప్రధానికి పవార్ కృతజ్ఞతలు తెలిపారు. తనను ఇటీవల కలిసినవారంతా కరోనా పరీక్ష చేయించుకోవాలని పవార్ సూచించారు. ఇటీవలే కరోనా సోకి ఆస్పత్రిలో చేరిన పంజాబ్ మాజీ సీఎం ప్రకాశ్ సింగ్ బాదల్ సోమవారం డిశ్చార్జయ్యారు. -
ఆటలు వద్దు.. విద్యాశాఖ కమిషనర్ సూచనలు జారీ
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో కోవిడ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో విద్యార్థుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఇందులో భాగంగా ఇటీవల ఒమిక్రాన్ వ్యాప్తి ఎక్కువవుతున్న నేపథ్యంలో తాజాగా అన్ని స్కూళ్లకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ ఎస్.సురేష్‌కుమార్ పలు సూచనలు జారీ చేశారు. గతంలో జారీ చేసిన కోవిడ్ ప్రోటోకాల్ అంశాలను పాటిస్తూనే.. కొన్ని విషయాల్లో మరింత జాగ్రత్తగా ఉండాలని ఆదేశించారు. సంక్రాంతి సెలవుల అనంతరం శానిటైజ్ చేయించడం, మాస్కులు తప్పనిసరి చేయడం వంటి చర్యలతో స్కూళ్లను పునఃప్రారంభించిన సంగతి తెలిసిందే. దీంతో తొలిరోజే 65 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. ప్రస్తుతం 90 శాతానికి పైగా విద్యార్థులు స్కూళ్లకు వస్తున్నారు. -
ఐసీఎంఆర్ మార్గదర్శకాలు మా ముందుంచండి
సాక్షి, అమరావతి: వేగంగా వ్యాప్తిచెందుతున్న కోవిడ్ వేరియంట్ ఒమిక్రాన్‌పై ఇండియన్ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) మార్గదర్శ కాలను తమ ముందుంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని హైకోర్టు సోమవారం ఆదేశించింది. కోవిడ్ వల్ల మరణించినవారి కుటుంబాలకు పరిహారంపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతున్నందున, తా ము జోక్యం చేసుకోబోమని చెప్పింది. మాస్క్‌లు ధరించని వారిపై కఠిన చర్యలు చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. మాస్క్ విషయంలో ఉల్లంఘనలు ఎన్ని? ఎంతమేర జరిమానాలు వసూలు చేశారు? తదితర వివరాలను తమ ముందుం చాలని ఆదేశించింది. ఐసీఎంఆర్ వివరాలను పరిశీలించిన తర్వాత కోవిడ్ విషయంలో తగిన ఆదేశాలు జారీచేస్తామని తెలిపింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి (సీజే) జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా, న్యాయమూర్తి జస్టిస్ మల్లవోలు సత్యనారాయణమూర్తి ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. కరోనాకు సంబంధించి దాఖలైన పలు ప్రజా ప్రయోజన వ్యాజ్యాలపై సీజే ధర్మాసనం సోమవారం మరోసారి విచారణ జరిపింది. ఈ వ్యాజ్యాల్లో కోర్టు సహాయకారి (అమికస్ క్యూరీ), సీనియర్ న్యాయవాది వైవీ రవిప్రసాద్ వాదనలు వినిపిస్తూ.. ఒమిక్రాన్ ఉధృతి ఎక్కువగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం తగిన సంఖ్యలో పరీక్షలు నిర్వహించడంలేదన్నారు. 39 వేల పరీక్షలు నిర్వహిస్తే, అందులో 14 వేలు పాజిటివ్ కేసులు వచ్చాయన్నారు. దీనికి ధర్మాసనం స్పందిస్తూ, మూడో దశలో ప్రజలే పరీక్షలు చేయించుకోవడం లేదని చెప్పింది. ఐసీఎంఆర్ సైతం పరీక్షలు వద్దని, లక్షణాలు ఉంటేనే చేయించుకోవాలని చెప్పిందని గుర్తు చేసింది. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది (ఎస్‌జీపీ) చింతల సుమన్ స్పందిస్తూ.. ఐసీఎంఆర్ మార్గదర్శకాలను అన్ని రాష్ట్రాలకు పంపిందని, వాటి ప్రకారం దేశంలో కోవిడ్ పరీక్షలు తగ్గాయన్నారు. ప్రజలు ఇంటి వద్దే పరీక్షలు చేయించుకుంటున్నారని తెలిపారు. «ఇరువురి వాదనలు విన్న ధర్మాసనం తదుపరి విచారణను ఫిబ్రవరి 10కి వాయిదా వేసింది. -
ఒక్కరోజే 3,980 కరోనా కేసులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతోంది. సోమవారం రాష్ట్రంలో 97,113 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,980 మంది వైరస్ బారినపడ్డారు. దీంతో ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7.38 లక్షలకు చేరుకున్నాయి. ఈమేరకు ప్రజారోగ్య సంచాలకుడు శ్రీనివాసరావు కరోనా బులెటిన్ విడుదల చేశారు. తాజాగా 2,398 మంది కోలుకోగా, 7.01 లక్షల మంది రికవర్ అయ్యారని తెలిపారు. ఒక్కరోజులో కరోనాతో ముగ్గురు చనిపోగా ఇప్పటివరకు 4,075 మంది మృతిచెందారన్నారు. ప్రస్తుతం 33,673 క్రియాశీలక కరోనా కేసులున్నాయని వెల్లడించారు. -
హై ఫీవర్, దగ్గు, ఆయాసం.. 5 రోజుల్లో తగ్గకుంటే జర జాగ్రత్త!
►కరోనా వ్యాప్తి తీవ్రమవుతోంది. కేసులు రోజురోజుకూ పెరుగుతున్నాయి. ఆసుపత్రులకు వచ్చే ఔట్పేషెంట్లు, ఇతర విభాగాలకు వచ్చేవారు, పీహెచ్‌సీలు, ప్రైవేట్ డయాగ్నొస్టిక్ సెంటర్లు, ఆసుపత్రుల్లో కరోనా పరీక్షలు చేసుకుంటున్న వారూ పెద్దసంఖ్యలో ఉంటున్నారు. పలువురు జ్వరం, జలుబు, తలనొప్పి, దగ్గు వంటి స్వల్ప లక్షణాలు కనిపించగానే ఇళ్లల్లోనే ఐసోలేషన్‌లో గడుపుతున్నారు. ఇప్పుడున్న ఈ భిన్నమైన వాతావరణంలో ఆయావర్గాల ప్రజల్లో కోవిడ్ టెస్ట్, ఐసోలేషన్, చికిత్స, తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వచ్చింది ఒమిక్రానా, డెల్టానా అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో గత రెండేళ్లుగా కరోనా చికిత్సలో నిమగ్నమైన కిమ్స్ ఆసుపత్రి పల్మనాలజీ, స్లీప్ డిజార్డర్స్ స్పెషలిస్ట్ డాక్టర్ వీవీ రమణప్రసాద్ ‘సాక్షి’ప్రత్యేక ఇంటర్వ్యూలో వివిధ అంశాలపై స్పష్టతనిచ్చారు. ఇవీ ముఖ్యాంశాలు... – సాక్షి, హైదరాబాద్ ప్రస్తుత పరిస్థితి.. 90 శాతం ఒమిక్రాన్‌తోపాటు 10 శాతం డెల్టా కేసులు కూడా వస్తున్నాయి. డెల్టా తీవ్రత పట్ల జాగ్రత్త పడాలి. ఔట్‌పేషెంట్ విభాగానికి వచ్చేవారిలో ఎక్కువమందిలో ఒకే రకమైన స్వల్ప లక్షణాలుంటున్నాయి. త్రీ జీన్ డ్రాపౌట్ ఆర్టీపీసీఆర్ టెస్ట్‌ల్లో అధికంగా ఒమిక్రాన్ కేసులే బయటపడుతున్నాయి. ఒకవేళ టెస్ట్‌ల్లో ఎస్ జీన్ పాజిటివ్ వస్తే అవి డెల్టా లేదా ఒమిక్రాన్, మరో వేరియెంట్ బీ ఏ 2 కావొచ్చు. అందువల్ల అయోమయంతో కొందరు వైద్యులు మోనోక్లోనల్ యాంటీ బాడీ కాక్టెయిల్ థెరపీ ఇస్తున్నారు. ఇది అవసరం లేదు. ఐదురోజుల వరకు వేచి చూసి, లక్షణాలు తగ్గకుంటే, అప్పుడు కాక్టెయిల్ ఇవ్వొచ్చు. ఒక్క డోస్ టీకా కూడా తీసుకోనివారు లేదా ఒక్కడోసే తీసుకున్నవారు, పెద్దవయసు వారు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్నవారిలో కేసులు పెరుగుతున్నాయి. ఆక్సిజన్ స్థాయిల తగ్గుదలతో ఆసుపత్రుల్లో చేరుతున్నారు. ఆక్సిజన్ లెవల్స్ తగ్గి, ‘లంగ్ షాడో’స్తో డెల్టా కేసులొస్తున్నాయి. అందువల్ల డెల్టా అనేది పూర్తిగా లేదని చెప్పలేం. మరి, చికిత్స.. ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలున్న కేసుల్లో మామూలు చికిత్స అందిస్తే సరిపోతుంది. మోల్నుపిరవిల్ యాంటీ వైరల్ లేదా మోనోక్లోనల్ యాంటీ బాడీ మందు ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకటి, రెండురోజులు జ్వరం వచ్చి తగ్గినా, 2, 3 రోజులు జలుబు ఉండి తగ్గినా, 4, 5 రోజులకు గొంతులో గరగర తగ్గిపోయినా వీరంతా ఐదురోజులు ముగిసేనాటికి దాదాపు సాధారణస్థాయికి చేరుకుంటున్నారు. రక్తం పలుచన చేసే మందులు వాడాల్సిన అవసరం అంతగా పడటంలేదు. ఎక్కువ శాతం మంది 3 నుంచి 5 రోజుల్లో మామూలు స్థితికి చేరుకుంటున్నారు. కొంచెం నీరసంగా ఉన్నా ఏడో రోజుకల్లా విధుల్లో చేరుతున్నవారే ఎక్కువ. ఐదు రోజుల తర్వాత కూడా తగ్గకపోతే.. ఐదురోజుల తర్వాత కూడా హైగ్రేడ్ టెంపరేచర్‌తో జ్వరం, కొత్తగా దగ్గు, ఆయాసం వంటివి వచ్చి చేరడం, ఆక్సిజన్ స్థాయిల్లో హెచ్చుతగ్గులు ఉన్నాయంటే అలాంటివి డెల్టా వేరియంట్ కేసులయ్యే అవకాశాలు ఎక్కువ. ఐదురోజుల తర్వాత కూడా తీవ్రత తగ్గని వారికి దగ్గు, జలుబు, ఇతర లక్షణాలు కొనసాగే వారు యాంటీ డికంజెస్టెంట్లు, బ్రాంకోడైలేటరల్తో చికిత్స చేయించుకోవాలి. గోరువెచ్చని నీళ్లు తాగడం, ఫ్రిజ్‌లో ఉన్న చల్లటి పదార్థాలు తినకపోవడం, వేడిపదార్థాలే భుజించడం, వేడి పానీయాలు వంటివి తీసుకున్నవారిలో అత్యధికులు పదోరోజుకల్లా సాధారణస్థితికి వచ్చేస్తున్నారు. ఒమిక్రాన్ కేసుల గుర్తింపు... గొంతులో నస, జ్వరం, జలుబు, తలనొప్పి, 3 నుంచి 5 రోజుల్లో తగ్గే ఆయాసం, ఆక్సిజన్ స్థాయిల్లో ఎలాంటి మార్పులు చోటు చేసుకోకపోతే వాటిని ఒమిక్రాన్ కేసులుగా చెప్పవచ్చు. డెల్టా లక్షణాలు... ఇప్పటికీ డెల్టా కేసులు వస్తున్నాయి. రుచి, వాసన లేకపోవడం, విరేచనాలు, దగ్గు, ఆయాసం, ఆక్సిజన్ స్థాయిల తగ్గుదలను డెల్టా లక్షణాలుగా భావించి జాగ్రత్తపడాలి. లేదంటే వ్యాధి ముదిరి న్యూమోనియాకు దారితీసి, నీరసం, జ్వరం వంటివి కొనసాగి ఆసుపత్రుల్లో, ఐసీయూల్లో చేరే పరిస్థితులు ఏర్పడుతున్నాయి. వీళ్లు అంటించేస్తున్నారు... ఒమిక్రాన్ లేదా డెల్టా బారిన పడినా ఆ లక్షణాలు బయటపడని, కనిపించని పేషెంట్లు సమాజంలో, కుటుంబంలోని ఇతరులకు అంటించేస్తున్నారు. ఒమిక్రాన్‌లో డబ్లింగ్ ఇంపాక్ట్ రెండురోజులే కావడంతో కేసులు పెరుగుతున్నాయి. లక్షణాలు లేని వారిని వారం సెల్ఫ్ ఐసోలేషన్‌లో పెడితే సరిపోతుంది. ఆసుపత్రుల్లో టెస్ట్ చేశాక పాజిటివ్‌గా తేలిన కేసుల్లో అత్యధికుల ఇళ్లలోని వాళ్లకు అప్పటికే లక్షణాలున్నట్టు తేలింది. దీంతో వాళ్లు ఆస్పత్రులకు వస్తున్నట్టు నిర్ధారణైంది. -
ఒమిక్రాన్ భారత్: అంతా అయోమయం.. గందరగోళమే!
భారత్‌లో థర్డ్ వేవ్‌ను దాదాపుగా ఒమిక్రాన్ వేవ్‌గా పరిగణిస్తున్నారు ఆరోగ్య నిపుణులు. శరవేగంగా చొచ్చుకుపోతున్న ఈ వేరియెంట్.. ఎక్కువ మందిలో మైల్డ్ సింటమ్స్ చూపిస్తుండడం గమనార్హం. అదే టైంలో దగ్గు, జలుబు, జ్వరాల లక్షణాలతో తమకు సోకింది కరోనాయేనా? కాదా? అనే గందరగోళంలో కొట్టుమిట్టాడుతున్నారు కోట్ల మంది!. భారత్‌లో కరోనా కేసుల విజృంభణ కొనసాగుతోంది. అయితే వ్యాక్సినేషన్, తీవ్రత లేని వేరియెంట్ల వల్ల ప్రభావం తక్కువగా ఉందని ప్రభుత్వ వైద్య నిపుణులు పేర్కొంటున్నప్పటికీ.. ఒకవైపు రెండు డోసులు తీసుకున్న వాళ్లపైనా వైరస్ దాడి చేస్తుండడం, మరోవైపు ఆస్ప్రత్రుల్లో, ఐసీయూల్లో చేరుతున్న సెమీ అర్బన్, గ్రామీణ ప్రాంతాల పేషెంట్ల సంఖ్య నెమ్మదిగా పెరుగుతుండడం.. కరోనా తీవ్రత ఉందనే విషయాన్ని తెలియజేస్తున్నాయి. ఈ తరుణంలో ఒమిక్రాన్ వేరియెంట్ రానున్న రోజుల్లో మరింత విజృంభించనుందనే ప్రకటనలు మరింత ఆందోళన కలిగిస్తున్నాయి. ఇప్పటికే సామాజిక వ్యాప్తిలో ఉన్న ఒమిక్రాన్ వేరియెంట్.. ముందు ముందు మరింత ప్రభావం చూపెట్టనుందనేది కొందరు టాప్ ఎక్స్పర్ట్స్ చెప్తున్న మాట. ఢిల్లీ, ముంబై లాంటి మెట్రో నగరాల్లో కేసులు తగ్గుముఖం పట్టాయని అధికారులు చెప్తున్నా.. ఆస్పత్రుల్లో పేషెంట్లు నిండిపోవడం, పాజిటివిటీ రేటు-మరణాలు పెరగడం, ప్రభుత్వాల తరపున టెస్ట్‌ల సంఖ్య తగ్గిపోతుండడం, లక్షణాలున్నా జనాలు టెస్టులకు ఆసక్తి చూపించకపోవడం లాంటి కారణాలు ఉంటున్నాయి. కాబట్టి, కరోనా సాధారణం అయిపోయిందన్న వాదనను పక్కనపెట్టి.. అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. రోజూ తగ్గినా.. వారం పెరిగింది గత 24 గంటల్లో దేశంలో 3,06,064 కొత్త కేసులు వచ్చాయని కేంద్ర ఆరోగ్య శాఖ ప్రకటించుకుంది. అంటే సగటు డెయిలీ కేసులు 8 శాతం తగ్గిందని, మరణాలు 439 నమోదు అయ్యాయని, గత ఐదు రోజుల్లో ఇవే తక్కువ మరణాలని కేంద్రం ప్రకటించింది. సాధారణంగా వారాంతంలో టెస్టులు జరిగేవి తక్కువ. తద్వారా వచ్చే ఫలితాల సంఖ్య కూడా తక్కువే ఉంటోంది. ఈ తరుణంలో కేసులు తగ్గుముఖం పడుతున్నాయంటూ ఆరోగ్య శాఖ ప్రకటన ఆశ్చర్యం కలిగించేదే!. కానీ, వీక్లీ పాజిటివిటీ రేటు గనుక చూసుకుంటే.. భారీ స్థాయిలో పెరుగుతూ వస్తోంది. కిందటి నెలలో(డిసెంబర్ 2021, 27వ తేదీన) పాజిటివిటీ రేటు 0.63 శాతంగా ఉంది. అది జనవరి 24 నాటికి 17.03 శాతానికి చేరుకుంది. కిందటి వారం మరణాలు 1,396 నమోదుకాగా.. జనవరి 17-23 తేదీల మధ్య 2,680 మరణాలు నమోదు అయ్యాయి. ఇందుకు కారణం.. ఒమిక్రాన్ వేరియెంట్‌తో ఉధృతంగా పెరుగుతున్న కరోనా కేసులే అని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆర్టీపీసీఆర్కు చిక్కకుండా.. కరోనా ఒమిక్రాన్ వేరియంట్లో ‘దొంగ ఒమిక్రాన్’ అనే ఉపరకం ఈ ఆందోళనకు మూలకారణం. ‘బీఏ.2’.. ఇది ఆర్టీపీసీఆర్ టెస్ట్ లకు దొరక్కుండా విస్తరిస్తుండడంపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఒమిక్రాన్‌లో బీఏ.1, బీఏ.2, బీఏ.3 ఉపరకాలు ఉన్నట్టు డబ్ల్యూహెచ్‌వో ప్రకటించింది. ఇందులో బీఏ.1 ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాల్లో విస్తరించింది. ఇప్పుడు బీఏ.2 కూడా వేగంగా విస్తరిస్తోంది. ప్రస్తుతం మన దేశంలో వేరియెంట్ విస్తరిస్తున్నా.. బయటపడక పోవడానికి కారణం బీఏ.2 కేసులు.. బీఏ.1 వేరియెంట్‌ను దాటి పోవడమే కారణంగా భావిస్తున్నారు సైంటిస్టులు. బీఏ.1 మ్యూటేషన్ లో ఎస్ లేదా స్పైక్ జీన్ తొలగిపోవడం అన్నది ఆర్టీపీసీఆర్ పరీక్షల్లో గుర్తించొచ్చు. కానీ, బీఏ.2 మ్యూటేషన్ భిన్నంగా ఉంది. దీంతో ఇది ఆర్టీపీసీఆర్ టెస్టుల్లో చాలామందికి ‘పాజిటివ్’ నిర్ధారణ కావడం లేదు. ఫిబ్రవరిలో.. కరోనా తారాస్థాయికి చేరడం గురించి జనవరి మొదటి వారం నుంచే విస్తృతస్థాయిలో చర్చ నడుస్తోంది. ప్రస్తుత ఉధృతి కొనసాగితే.. ఫిబ్రవరి 15 నుంచి భారత్‌లో కొవిడ్ కేసులు తగ్గుముఖం పట్టవచ్చని కేంద్ర వర్గాలు చెప్తున్నాయి. కానీ, ఆరోగ్య నిపుణలు మాత్రం రాబోయే వారాలే మరి అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. సంబంధిత వార్త: సాధారణ జలుబుగానే వచ్చి వెళ్లిపోతోందని ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు! తలనొప్పి, గొంతులో గరగరా? -
కాస్త తగ్గిన కరోనా కేసులు.. అయినా 3 లక్షలపైనే.. కొత్తగా ఎన్నంటే
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ ఉధృతి కొనసాగుతోంది. గత రెండు రోజుల నుంచి కొత్త కేసుల్లో తగ్గుముఖం కనిపిస్తోంది. గడిచిన 24 గంటల్లో 3,06, 064 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. నిన్నటితో పోలిస్తే 8.2 శాతం తక్కువ నమోదయ్యాయి. ఆదివారం 439 మంది మృత్యువాత పడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,89,848కు పెరిగింది. ఒక్క కర్ణాటకలోనే 50 వేల కేసులొచ్చాయి. ఆ తరువాత కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉంది. చదవండి: సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్ రోజువారీ పాజిటివిటి 17.07 శాతం నుంచి 20.75 శాతానికి పెరిగింది. ప్రస్తుతం దేశంలో 22 లక్షల 49వేల 335 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రికవరీ రేటు 93.07గా ఉంది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. చదవండి: లక్షల్లో కేసులు.. ఒమిక్రాన్‌పై ఇన్సాకాగ్ కీలక అప్డేట్ -
సామాజిక వ్యాప్తి దశలో ఒమిక్రాన్
న్యూఢిల్లీ: దేశంలో కరోనా వేరియెంట్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని కోవిడ్‌పై అధ్యయనం చేసే కేంద్ర సంస్థ ఇన్సాకాగ్ హెచ్చరించింది. మెట్రో నగరాల్లో ఒమిక్రాన్ కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయని వెల్లడించింది. ముఖ్యంగా ఢిల్లీ, ముంబై నగరాల్లో ఈ కేసులు తారా స్థాయికి చేరుకున్నాయని చెప్పింది. సార్స్–కోవిడ్ జన్యుక్రమాన్ని విశ్లేషించడంతో పాటు వైరస్ వ్యాప్తిపై అవగాహన, దాని కట్టడికి మార్గాలు, ప్రజారోగ్యంపై సూచనలు సలహాలు ఇన్సాకాగ్ ఇస్తూ ఉంటుంది. ఒమిక్రాన్ కేసుల్లో స్వల్ప లక్షణాలు, లేదంటే లక్షణాలు లేకుండా ఉన్న కేసులే ఎక్కువగా వస్తున్నాయని జనవరి 3, 10 తేదీలలో విడుదల చేసిన బులెటిన్‌లో పేర్కొంది. ఆ బులెటిన్‌లో వివరాలను కేంద్ర ప్రభుత్వ అధికారులు ఆదివారం వెల్లడించారు. ఆస్పత్రిలో చేరే కేసులు, ఐసీయూ కేసులు ఎక్కువగా లేకపోయినప్పటికీ ముప్పు మాత్రం పొంచి ఉందని, అందరూ జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. ‘‘భారత్‌లో ఒమిక్రాన్ ప్రస్తుతం సామాజికంగా వ్యాప్తి చెందే దశలో ఉంది. పలు మెట్రో నగరాల్లో ఈ కేసులు అత్యధికంగా వెలుగులోకి వస్తున్నాయి. ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ బీఏ.2 కేసులు కూడా వ్యాపిస్తున్నాయి’’ అని ఆ బులెటిన్‌లో వెల్లడించింది. అంతర్గతంగా వ్యాప్తి విదేశీ ప్రయాణికుల నుంచి కాకుండా అంతర్గతంగానే ఒమిక్రాన్ అధికంగా వ్యాప్తి చెందుతోందని ఇన్సాకాగ్ తన బులెటిన్‌లో పేర్కొంది. వైరస్‌లో జన్యుపరమైన మార్పులు అధికంగా చోటు చేసుకుంటూ ఉండడంతో నిరంతరం అందులో జరిగే మార్పుల్ని పర్యవేక్షిస్తున్నామని ఇన్సాకాగ్ స్పష్టం చేసింది. కరోనా వైరస్‌లో ఎన్ని రకాల జన్యు మార్పులు జరిగినప్పటికీ కోవిడ్ నిబంధనల్ని తు.చ తప్పకుండా పాటించడం, వ్యాక్సిన్ తీసుకోవడమే మనకి రక్షణ కవచాలని వివరించింది. తగ్గిన ఆర్ వాల్యూ : మద్రాస్ ఐఐటీ కరోనా కేసులు విజృంభిస్తున్న నేపథ్యంలో మద్రాస్ ఐఐటీ చేసిన అధ్యయనంలో కాస్త ఊరటనిచ్చే అంశం వెల్లడైంది. . కోవిడ్–19 వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించే తీవ్రతను వెల్లడించే ఆర్ వాల్యూ 1.57కి తగ్గింది. ఆర్ వాల్యూ 1 కంటే ఎక్కువ ఉంటే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టుగానే భావించాలి. ఆర్ వాల్యూ 1 కంటే తక్కువ ఉంటే వ్యాధి తగ్గుముఖం పడుతున్నట్టు లెక్క. జనవరి 14–21 మధ్య ఆర్ వాల్యూ 1.57 ఉన్నట్టుగా ఐఐటీ మద్రాస్ అధ్యయనం నివేదిక వెల్లడించింది. జనవరి 7–13 మధ్య ఆర్ వాల్యూ 2.2 ఉండగా జనవరి మొదటి వారంలో అత్యధిక స్థాయిలో ఆర్ వాల్యూ 4కి చేరుకుంది. ఇక డిసెంబర్ 25 నుంచి 31 మధ్య ఆర్ వాల్యూ 2.9గా ఉంది. ఐఐటీ మద్రాస్ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ కంప్యూటేషనల్ మోడల్ ద్వారా కరోనా వ్యాప్తిపై అధ్యయనం చేసింది. ప్రొఫెసర్ నీలేష్ ఎస్ ఉపాధ్యాయ, ప్రొఫెసర్ ఎస్. సుందర్‌లు ఈ అధ్యయనానికి నేతృత్వం వహించారు. దీని ప్రకారం ఆర్ వాల్యూ ముంబైలో 0.67, ఢిల్లీలో 0.98, చెన్నైలో 1.2, కోల్‌కతాలో 0.56గా ఉంది. ఇక వచ్చే 14 రోజుల్లో ఒమిక్రాన్ కేసులు గరిష్ట స్థాయికి చేరుకుంటాయని ఆ అధ్యయనం అంచనా వేసింది. 3.33 లక్షల కేసులు నమోదు దేశంలో వరసగా నాలుగో రోజు 3 లక్షలకి పైగా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో 3,33,533 కేసులు నమోదయ్యాయి. ఇక క్రియాశీల కేసుల సంఖ్య 21, 87,205కి చేరుకుంది. తాజాగా ఒకే రోజు 525 మంది కరోనాతో మరణించారు. కరోనా రికవరీ రేటు 93.18గా ఉంది. కేరళలో కేసుల కట్టడికి ఆదివారం ఒక్క రోజు సంపూర్ణ లాక్డౌన్ విధించారు. అత్యవసరాలకి తప్ప మరి దేనికి ఎవరూ బయటకు రాకుండా చర్యలు చేపట్టారు. ఉదయం 7 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు లాక్డౌన్ అమలు చేయడంతో రాష్ట్రవ్యాప్తంగా నిర్మానుష్య పరిస్థితులు నెలకొన్నాయి. -
లక్షల్లో కేసులు.. ఒమిక్రాన్‌పై ఇన్సాకాగ్ కీలక అప్డేట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసుల పెరుగుదలపై ఇండియన్ సార్స్–కోవ్–2 జెనోమిక్స్ కన్సార్టియం (ఇన్సాకాగ్) కీలక అప్డేట్ ఇచ్చింది. దేశంలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి స్థాయికి చేరుకుందని తెలిపింది. ఢిల్లీ, ముంబయి నగరాల్లో ఈ వేరియంట్ విస్తృతంగా వ్యాప్తి చెందుతోందని వెల్లడించింది. విదేశీ ప్రయాణికుల నుంచి వ్యాపించే దానికన్నా దేశీయంగా అంతర్గత వ్యాప్తే అధికంగా ఉన్నట్లు ఇన్సాకాగ్ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. వ్యాక్సిన్ పొందిన ప్రయాణికుల్లో తొలుత ఒమిక్రాన్ వేరియంట్‌ను గుర్తించారు. ఈ వేరియంట్ సోకినా ప్రస్తుతం చాలా మందిలో వైరస్ లక్షణాలు బహిర్గతం కావడంలేదు. మరి కొందరిలో స్వల్ప స్థాయి లక్షణాలే కనిపిస్తున్నాయి. వ్యాప్తి తీవ్రత అధికంగా ఉన్నప్పటికీ, ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరం తక్కువేనని, ప్రాణాపాయ ముప్పు కూడా స్వల్పమేనని ఇన్సాకాగ్ పేర్కొంది. అంతమాత్రాన ఒమిక్రాన్‌ను నిర్లక్ష్యం చేయడం తగదని, తగు రక్షణ విధానాలను పాటించాల్సిందేనని స్పష్టంచేసింది. (చదవండి: కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే) భారీగా కేసులు ఇక గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 3,33,533 మందికి కోవిడ్ పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో మొత్తం యాక్టివ్ కేసుల సంఖ్య 21,87,205 కు పెరిగింది. రెండో వేవ్ (35 లక్షలకు పైగా యాక్టివ్ కేసులు) తర్వాత ఈ స్థాయిలో యాక్టివ్ కేసులు ఉండటం ఇదే తొలిసారి. వైరస్ బాధితుల్లో తాజాగా 525 మంది ప్రాణాలు విడిచారు. ఇందులో అత్యధికంగా కేరళ నుంచి 132 మంది, మహారాష్ట్ర నుంచి 48 మంది బాధితులు ఉన్నారు. గత 24 గంటల్లో 2,59,168 మంది కోలుకున్నారు. పాజిటివిటీ రేటు 17.78 శాతంగా ఉండగా.. రికవరీ రేటు 93.18 శాతంగా ఉంది. మొత్తం కేసుల్లో యాక్టివ్ కేసుల 5.57 శాతం. ఈమేరకు కేంద్ర ఆరోగ్య శాఖ ఆదివారం నాటి బులెటిన్‌లో పేర్కొంది. (చదవండి: పిల్లల్ని బడికి పంపించేది లేదు! ) -
గరిష్టానికి ఒమిక్రాన్ కేసులు.. అక్కడ ఇక మాస్కు తప్పనిసరి కాదు!
లండన్: దేశంలో కరోనా కట్టడికి అమలు చేస్తున్న నిబంధనల్లో చాలావాటిని బ్రిటీష్ ప్రభుత్వం తొలగించింది. దేశంలో ఒమిక్రాన్ కేసులు గరిష్టానికి చేరినందున (అంటే అంతకుమించి ఇక పెరగవని అర్థం) ఈ నిబంధనలు తొలగిస్తున్నామని బ్రిటన్ ప్రధాని బోరిస్ జాన్సన్ ఇటీవల ప్రకటించారు. దీంతో ఇకపై ఎక్కడైన తప్పనిసరిగా మాస్కు ధరించాలన్న నిబంధన వచ్చే గురువారం నుంచి రద్దు కానుంది. అలాగే పెద్ద పెద్ద కార్యక్రమాలకు హాజరయ్యేవారు టీకా సర్టిఫికెట్ తప్పక తీసుకరావాలన్న నిబంధన కూడా కనుమరుగుకానుంది. గురువారం నుంచి పాఠశాల గదుల్లో మాస్కులు తప్పనిసరి నిబంధన కూడా తొలగించనున్నట్లు ప్రధాని చెప్పా రు. ప్రజలు వర్క్ ఫ్రం హోం చేయాల్సిన అవసరం లేదని, ఉద్యోగులు భౌతిక హాజరుపై తమ సంస్థలతో చర్చించాలని సూచించారు. అయితే కరోనా వ్యాప్తి నివారణకు తప్పనిసరి మాస్కుధారణ నిబం ధన కొనసాగిస్తామని స్కాట్లాండ్ డిప్యూటీ ఫస్ట్ మినిస్టర్ జాన్ స్విన్నీ చెప్పారు. బ్రిటన్‌లో లాగా తాము నిబంధనలు ఎత్తివేయడం లేదన్నారు. పార్లమెంట్ సూచన మేరకు నిబంధనలు కొనసాగిస్తామని, పార్లమెంట్ సూచిస్తే నిబంధనలు మారుస్తామని చెప్పా రు. పబ్లిక్ స్థలాల్లో మాస్కు ధారణ తప్పదన్నారు. ప్లాన్ బీ టు ఏ ఓఎన్ఎస్ (ఆఫీస్ ఆఫ్ నేషనల్ స్టాటిస్టిక్స్) అంచనా ప్రకారం దేశమంతా ఒమిక్రాన్ గరిష్టానికి చేరిందని హౌస్ ఆఫ్ కామన్స్‌కు ప్రధాని తెలిపారు. ఓఎన్ఎస్ డేటా ప్రకారం కొన్ని ప్రాంతాలు మినహా ఇంగ్లండ్‌లో ఇన్ఫెక్షన్ స్థాయిలు పడిపోతున్నాయని వెల్లడించారు. ప్లాన్ బీ (తీవ్ర నిబంధనలు) నుంచి ప్లాన్ ఏ (స్వల్ప నిబంధనలు)కు మరలేందుకు కేబినెట్ అంగీకరించిందని చెప్పారు.దేశంలో ఆస్పత్రిలో చేరికలు క్రమంగా తగ్గిపోతున్నాయని, ఐసీయూ అడ్మిషన్లు కూడా పడిపోయాయని వివరించారు. సెల్ఫ్ ఐసోలేషన్ లాంటి కొన్ని నిబంధనలు మాత్రం కొనసాగుతాయన్నారు. బ్రిటన్‌లో ఈ సెల్ఫ్ ఐసోలేషన్ సమయాన్ని 7 నుంచి 5 రోజులకు గత సోమవారం నుంచి తగ్గించారు. మార్చి నాటికి సెల్ఫ్ ఐసోలేషన్ నిబంధన కూడా ఎత్తివేస్తామని బోరిస్ అంచనా వేశారు. కోవిడ్ దాదాపు ఎండమిక్ దశకు చేరుతోందని, అయినా ప్రజలు అప్రమత్తంగా ఉండడం మంచిదని సూచించారు. -
కరోనానే పెద్ద పరీక్ష!
ప్రస్తుతం ఎన్నికలు జరుగుతున్న ఐదు రాష్ట్రాలకు రోజురోజుకీ పెరుగుతున్న కరోనా తీవ్రత పెద్ద పరీక్ష పెడుతోంది. ఓ వైపు పెరుగుతున్న కేసులకు తోడు మరోవైపు అనుకున్న స్థాయిలో ముందుకు సాగని వ్యాక్సినేషన్ ప్రక్రియ ఇటు ఎన్నికల సంఘానికి అటు రాజకీయ పార్టీలకు పెద్ద సవాల్‌గా పరిణమిస్తోంది. గడిచిన పది రోజుల్లోనే ఉత్తర్‌ప్రదేశ్, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలో 70 శాతానికి పైగా కేసులు పెరగడం, వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం లేకపోవడం కలవరపెట్టేలా ఉంది. వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని ఇప్పటికే ఎన్నికల కమిషన్ ఆయా రాష్ట్రాలను ఆదేశించినప్పటికీ అది క్షేత్రస్థాయిలో ఎంతమేర పుంజుకుంటుందన్నది ప్రశ్నగానే మారింది. మరిన్ని రోజులు నిషేధమే! దేశ వ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఇంతకింతకీ పెరుగుతోంది. ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసిన ఈ నెల 8న దేశవ్యాప్తంగా యాక్టివ్ కేసుల సంఖ్య 4.72 లక్షలు ఉండగా, అదే రోజున రోజువారీ కేసుల సంఖ్య 1.41 లక్షలుగా ఉంది. అయితే క్రమంగా పెరుగుతూ ప్రస్తుత యాక్టివ్ కేసుల సంఖ్య 20.18 లక్షల వరకు చేరగా, రోజువారీ కేసులు 3.47 లక్షలకు చేరాయి. ఇక ఎన్నికలు జరుగుతున్న రాష్ట్రాల్లో కేసుల సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఒక్క యూపీలోనే పది రోజుల కిందటి కేసుల సంఖ్యతో పోలిస్తే కేసులు 11 వేల నుంచి 18వేలకు చేరాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవా, మణిపూర్లలో ఇదే పరిస్థితి కనిపిస్తోంది. ఈ దృష్ట్యానే బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలపై ఈ నెల 15వరకు ఉన్న నిషేధాన్ని ఎన్నికల సంఘం 22 వరకు పొడిగించింది. 22 తర్వాత సైతం దీనిపై షరతులతో కూడిన సభలకు అనుమతించే అవకాశాలున్నాయని ఎన్నికల సంఘం వర్గాలు చెబుతున్నాయి. ఇదే సమయంలో వ్యాక్సినేషన్ ప్రక్రియను వేగిరం చేయాలని పంజాబ్, మణిపూర్ రాష్ట్రాలను ఆదేశించింది. ఈ రాష్ట్రాల్లో మొదటి విడత వ్యాక్సినేషన్ పంజాబ్‌లో 79 శాతం, మణిపూర్‌లో 58 శాతం మాత్రమే పూర్తయింది. యూపీలో రెండో విడత వ్యాక్సినేషన్ 56.40 శాతమే పూర్తవడంతో వ్యాక్సినేషన్ ప్రక్రియలో వేగం పెంచాలని ఈసీ సూచించింది. అయితే ప్రస్తుతం ఆస్పత్రుల్లో చేరుతున్న వారి సంఖ్య గణనీయంగా లేకపోవడం, మరణాల రేటు తక్కువగా ఉండటం కొంత ఉపశమనం ఇస్తోంది. బహిరంగ సభలు, ఎన్నికల ర్యాలీలపై ఎన్నికల సంఘం నిషేధం విధించడంతో ఓటర్లను చేరుకునేందుకు నానాయాతన పడుతున్న పార్టీలు, ఇప్పటికే అందుబాటులో ఉన్న అన్ని ప్లాట్‌ఫారమ్‌లపై ప్రచారాలు మొదలుపెట్టాయి. డిజిటల్ క్యాంపెయినింగ్ ప్రక్రియ ముమ్మరంగా చేస్తున్నప్పటికీ ఏ ప్లాట్ఫారంలో లేని ఓటర్లను చేరుకోవడం అన్ని పార్టీలకు పెద్ద సవాలుగా మారనుంది. -
కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రస్తుతం నమోదవుతున్న కరోనా పాజిటివ్ కేసుల్లో 90 శాతం ఒమిక్రాన్ వేరియంట్‌వే ఉంటున్నాయి. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు వస్తున్న శాంపిల్స్ ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టంచేస్తున్నాయి. ఈ విషయంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరంలేదని వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు భరోసా ఇస్తున్నారు. వైరస్ సోకితే ఎదురయ్యే పరిణామాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన పెంచుకుని, అప్రమత్తంగా వ్యవహరించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇవీ లక్షణాలు.. రాష్ట్రంలో ప్రస్తుతం వైరస్ బారిన పడిన అత్యధికుల్లో తొలి రెండు రోజులు చలిచలిగా ఉండటం.. జ్వరం, ఒళ్లు నొప్పులు, నీరసం, తలనొప్పి ఉంటోంది. మూడో రోజు నుంచి జ్వరం, ఒళ్లు నొప్పులు తగ్గుముఖం పట్టి.. జలుబు, ముక్కు దిబ్బడ, ముక్కు కారడం, గొంతులో గరగర, గొంతు మంట, పట్టేసినట్లు ఉండటం, దగ్గు వంటి సమస్యలు వస్తున్నాయి. – ఈ లక్షణాలు మూడు, నాలుగు రోజులు ఉంటున్నాయి. – వారం రోజుల్లో ఈ సమస్యలన్నీ పూర్తిగా నయమవుతున్నాయి. పదిశాతం మందికే ఆక్సిజన్ అవసరం.. ఆసుపత్రుల్లో చేరుతున్న పాజిటివ్ రోగుల సంఖ్య చాలా తక్కువగా ఉంటోంది. మెజారిటీ శాతం హోమ్ ఐసోలేషన్‌లో ఉంటూ వైరస్ నుంచి కోలుకుంటున్నారు. రెండు డోసులు టీకా తీసుకోని వారు.. అధిక రక్తపోటు, మధుమేహం, గుండె, కిడ్నీ జబ్బులు సహా, ఇతర అదుపులో లేని కోమొర్బెడిటీ జబ్బులతో బాధపడుతున్న వారే ఎక్కువగా ఆసుపత్రుల్లో చేరుతున్నారు. మూడ్రోజుల క్రితం విశాఖ కేజీహెచ్‌లో అధికారులు వీరిని పరిశీలించారు. ఒక్కరోజులో 158 మంది చేరగా, వీరిలో కేవలం 10 మందికి మాత్రమే ఆక్సిజన్ అవసరం ఏర్పడినట్లు గుర్తించారు. వీరికి ఐదు లీటర్ల ఆక్సిజన్ మాత్రమే బేసిక్ సపోర్ట్ కోసం వినియోగించారు. మిగిలిన 148 మందినీ పరీక్షల అనంతరం సలహాలు, సూచనలిచ్చి సాయంత్రానికే ఇంటికి పంపారు. ఆ పది మంది కూడా గతంలో ఆస్తమా, డయాబెటిక్, అధిక రక్తపోటు వంటి వాటితో బాధపడిన వారే. ఈ జబ్బులకు వాడుతున్న మందులు, చికిత్సను నిర్లక్ష్యం చేయడం, అదే సమయంలో కరోనా బారిన పడటంవల్ల ఆసుపత్రుల్లో చేరాల్సిన పరిస్థితులు ఎదురైనట్లు డాక్టర్లు గుర్తించారు. హోమ్ ఐసోలేషన్ కిట్‌లో మార్పులు ఈ నేపథ్యంలో.. హోమ్ ఐసోలేషన్ కిట్‌లో నిపుణుల కమిటీ సూచనల మేరకు వైద్య, ఆరోగ్య శాఖ మార్పులు చేసింది. జింక్ మాత్రలను కిట్ నుంచి తొలగించారు. జింక్ వాడటంవల్ల మ్యూకోర్మైకోసిస్ రావడానికి ఆస్కారం ఉందని అధ్యయనాల్లో వెల్లడైంది. దీంతో జింక్‌ను తొలగించారు. అదే విధంగా.. సెట్రిజెన్ స్థానంలో ‘లెవో సెట్రిజెన్’ను చేర్చారు. సెట్రిజెన్ వాడకంవల్ల మత్తుగా ఉంటోంది. దీంతో ఈ మాత్ర స్థానంలో మరో మాత్రను చేర్చారు. ప్రస్తుతం పంపిణీ చేస్తున్న హోమ్ ఐసోలేషన్ కిట్‌లో లెవో సెట్రిజెన్, విటమిన్ సీ, డీ, బీ కాంప్లెక్స్, పారాసెటిమాల్, ఫామోటిడిన్.. ఇలా ఆరు రకాల మందులు ఉంటున్నాయి. ఆసుపత్రిలో చికిత్స ఎవరికి అవసరమంటే.. – ఇతర జబ్బులు ఉన్న వారందరూ ఆసుపత్రుల్లో చేరాల్సిన అవసరంలేదు. – అదుపులో లేని ఇతర జబ్బులున్న వారు వైద్యుల సూచనల మేరకు ఆసుపత్రుల్లో చేరాల్సి ఉంటుంది. (ఉదా.. శరీరంలో చక్కెర శాతం 200, 300 ఇలా అదుపులో లేకుండా పెరగడం, స్పృహ తప్పి పడిపోవడం) – జ్వరం, దగ్గు తీవ్రమైనప్పుడు, ఆక్సిజన్ శ్యాచురేషన్ 94 శాతానికన్నా తక్కువగా ఉన్నావారు. – కరోనా బారినపడి 10 రోజుల్లో ప్రసవించే గర్భిణులు, హైరిస్క్ గర్భిణులు. – పిల్లలు కరోనా బారిన పడినట్లైతే పీడియాట్రిక్ వైద్యుడి సలహాలు, సూచనల మేరకు ఆసుపత్రుల్లో చేరాలి. – శస్త్రచికిత్సల అనంతరం ఏడు రోజుల్లోపు వైరస్ సోకిన వారు.. – వైద్యులు ఆరోగ్య పరిస్థితిని వాకబు చేసిన అనంతరం అధిక ప్రమాదం నిర్ధారణ అయిన పక్షంలో.. ఆందోళన వద్దు.. నీళ్లు బాగా తాగాలి వైరస్ బారినపడిన వారు రోజుకు కనీసం 2.5 లీటర్ల నీరు తాగాలి. నీరు, పళ్ల రసాలు, మజ్జిగ, ఫ్లూయిడ్స్ తీసుకోవాలి. ఎక్కువ ద్రవ పదార్థాలు తీసుకుని, మూత్రాన్ని ఎక్కువగా విసర్జించడంవల్ల పోస్ట్ కోవిడ్ ఇబ్బందులను అధిగమించవచ్చు. త్వరగా సాధారణ పరిస్థితుల్లోకి రావచ్చు. జీనోమ్ సీక్వెన్సింగ్‌కు వస్తున్న నమూనాల్లో 90శాతం ఒమిక్రాన్ కేసులు అని తేలుతున్నప్పటికీ ప్రజలెవరూ ఆందోళన చెందొద్దు. పాజిటివ్ అని తెలిసిన వెంటనే స్థానిక గ్రామ/వార్డు సచివాలయానికి సమాచారం వెళ్తుంది. ఆరోగ్య సిబ్బంది మీకు ఫోన్‌చేసి హోమ్ ఐసోలేషన్ కిట్ ఇంటికి తెచ్చిస్తారు. ఆరోగ్య పరిస్థితిపై వాకబు చేస్తారు. అలాగే, 104కు ఫోన్‌చేసి కరోనాకు సంబంధించిన అన్ని సేవలు ప్రజలు పొందవచ్చు. – డాక్టర్ వినోద్‌కుమార్, రాష్ట్ర కోవిడ్ వైద్య నిర్వహణ ప్రత్యేక అధికారి గతంలో వాడుతున్న మందులు కొనసాగించాలి కోమొర్బెడిటీ జబ్బులతో బాధపడుతున్న వారు గతంలో వాడుతున్న మందులను ఆపకూడదు. మందులు వాడకం, ఆరోగ్య పరిస్థితిపై నిర్లక్ష్యం చేసిన క్రమంలో కరోనా సోకితే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి ఉంటుంది. రెండో దశలో మాదిరి ఇప్పుడు ఊపిరితిత్తులపై ప్రభావం ఉండటంలేదు. శ్వాస తీసుకోవడానికి ఇబ్బందులు పడుతున్న వారు చాలా అరుదుగా ఉంటున్నారు. ముందస్తు జాగ్రత్తలు పాటిస్తే వైరస్ సోకినా ఇబ్బందులు ఎదురు కావు. సాధారణ దగ్గు, జలుబు, జ్వరం వచ్చి తగ్గిపోయినట్లే తగ్గిపోతుంది. – డాక్టర్ ప్రభాకర్‌రెడ్డి, డిప్యూటీ సూపరింటెండెంట్, కర్నూల్ జీజీహెచ్ -
ఉగ్రరూపం దాల్చిన కరోనా.. రికార్డు స్థాయిలో కేసులు.. కొత్తగా ఎన్నంటే!
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గత కొన్ని రోజులుగా భారీ స్థాయిలో కేసులు వెలుగు చూస్తున్నాయి. దేశంలో కోవిడ్ కొత్త కేసుల సంఖ్య మూడు లక్షలకు పైగా నమోదవుతున్నాయి. ఎన్నడూ లేని విధంగా రికార్డు స్థాయిలో కేసులు నమోదవుతుండటం ఆందోళన రేకేత్తిస్తోంది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 3,47,254 కొత్త కేసులు నమోదయ్యాయి. మహమ్మారి బారినపడి గురువారం రోజు 703 మంది మృత్యువాతపడ్డారు. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ కరోనాపై శుక్రవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. చదవండి: థర్డ్ వేవ్ ప్రభావం తక్కువే! భారత్‌లో ఇప్పటి వరకు 3.85 కోట్ల మందికి కోవిడ్ సోకగా.. 4,88,396 మంది ప్రాణాలు కోల్పోయారు. దేశంలో ప్రస్తుతం 20,18,825 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 17.94 శాతానికి పెరిగింది. నిన్న 2,51,777 మంది కోవిడ్ నుంచి కోలుకోవడంతో మొత్తం రికవరీల సంఖ్య 3,60,58,806కి పెరిగింది. రికవరీ రేటు 93.50శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు 9,692కు చేరాయి. ఇప్పటి వరకు 160.43 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లు ఇచ్చారు. చదవండి: యూపీ ఎన్నికలు.. సమోసా-చాయ్ నుంచి బీఎండబ్ల్యూ వరకు.. ఇవే ధరలు -
ఆంక్షల నడుమ మేడారం జాతర? మొదటివారంలో కీలక సమావేశం
సాక్షి, హైదరాబాద్: అంతర్జాతీయ స్థాయిలో ప్రఖ్యాతి గాంచిన మేడారం సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహణపై రాష్ట్ర ప్రభుత్వం పక్కాగా వ్యవహరిస్తోంది. కోటికిపైగా భక్తులు హాజరుకానున్న ఈ జాతర వచ్చేనెల 16వ తేదీ నుంచి 19వ తేదీవరకు నాలుగు రోజులపాటు జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు, అభివృద్ధి పనులు చకచకా సాగుతున్నాయి. ప్రస్తుతం రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి అత్యంత వేగంగా సాగుతోంది. నిత్యం వేల సంఖ్యలో కరోనా వైరస్ బారిన పడుతున్నారు. రోజురోజుకూ వైరస్ వ్యాప్తి వేగం పెరుగుతున్న పరిస్థితుల్లో మేడారం జాతర వైరస్ వ్యాప్తికి కారణం కాకూడదని గిరిజన సంక్షేమ శాఖ అభిప్రాయపడుతోంది.ఇందులో భాగంగా వ్యూహాత్మక కార్యాచరణ చేపట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరింది. మొదటివారంలో ప్రత్యేక సమావేశం... వచ్చేనెలలో కోవిడ్ వ్యాప్తి తారాస్థాయికి చేరుతుందని వైద్య,ఆరోగ్య శాఖ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి మాసమంతా అత్యంత జాగ్రత్తగా ఉండాలని వైద్య, ఆరోగ్య శాఖ ఇప్పటికే హెచ్చరికలు చేసింది. ఈ క్రమంలోనే రాష్ట్ర ప్రభుత్వం వచ్చేనెల మొదటివారంలో ప్రత్యేక సమావేశాన్ని ఏర్పాటు చేసింది. వర్చువల్ పద్ధతిలో సమావేశాన్ని నిర్వహించేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. నాలుగు రోజులపాటు జరిగే ఈ జాతరలో ఎలాంటి అపశ్రుతులు దొర్లకుండా ఉండేందుకు పక్కా కార్యాచరణ సిద్ధం చేసేందుకు ఈ సమీక్ష కీలకం కానుంది. జాతరకు భక్తులను పరిమిత సంఖ్యలో అనుమతివ్వాలా.. భౌతిక దూరాన్ని పాటిస్తూ అనుమతి ఇస్తే ఎలాంటి ఏర్పాట్లు చేయాల్సి ఉంటుంది.. శానిటైజేషన్ ఏర్పాట్లు, మాస్కుల నిర్వహణ, తక్ష ణ వైద్య సేవల కల్పన తదితర అంశాలపై లోతు గా చర్చించి నిర్ణయం తీసుకోనున్నట్లు గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు చెబుతున్నారు. వడివడిగా నిర్మాణ పనులు ప్రస్తుతం జాతర పనులు వేగంగా కొనసాగుతున్నాయి. మొత్తం 21 ప్రభుత్వ విభాగాలకు రూ.75 కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం వివిధ పనులు నిర్దేశించింది. కోటికి పైగా భక్తులు/పర్యాటకులు హాజరు కానుండటంతో ప్రభుత్వం అక్కడ రవాణా, వసతికి అత్యంత ప్రాధాన్యం ఇవ్వనుంది. దీంతోపాటు తాగునీటి సరఫరా, భద్రత చర్యలు కీలకం కానున్నాయి. జాతరకు మంజూరు చేసిన మొత్తంలో దాదాపు 50శాతం నిధులు ఈ మూడు శాఖలకే ఖర్చు చేయనుంది. రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్ ప్రతి వారం పనుల పురోగతిపై సమీక్ష నిర్వహిస్తూ అధికారులకు మార్గనిర్దేశం చేస్తున్నారు. -
సాధారణ జలుబుగానే వచ్చి వెళ్లిపోతోందని ఒమిక్రాన్‌ను లైట్ తీసుకోవద్దు!
సాక్షి, హైదరాబాద్: ఒమిక్రాన్‌తో ఏమీ కాదని అజాగ్రత్తగా ఉండొద్దని జనరల్ ఫిజీషియన్, డయాబెటాలజిస్ట్ డా. ప్రభుకుమార్ చల్లగాలి (లైఫ్ మల్టీస్పెషాలిటీ క్లినిక్స్) హెచ్చరించారు. వృద్ధులు, దీర్ఘకాల అనారోగ్య సమస్యలు, రోగనిరోధకశక్తి తక్కువగా ఉన్న వారిపై డెల్టా, ఒమిక్రాన్‌ల తీవ్రత ఒకేలా ఉంటుందని గుర్తుంచుకోవాలన్నారు. డెల్టా రకంతో ఇంకా ప్రమాదమేనని చెప్పారు. వచ్చే మూడు వారాలు జాగ్రత్తగా ఉండాలని సూచించారు. కొత్త వేరియెంట్‌తో పిల్లలకు ముప్పేమీ లేదని చెప్పారు. కరోనా కొత్త మ్యుటేషన్లు వచ్చే అవకాశాలను తోసిపుచ్చలేమన్నారు. వివిధ అంశాలపై ‘సాక్షి’తో ఆయన ఇంకా ఏమన్నారంటే.. పండుగలప్పుడు నిర్లక్ష్యం వల్లే.. ఒమిక్రాన్ చాలా మటుకు సాధారణ జలుబుగానే వెళ్లిపోతోంది. చాలా మంది మూడు నుంచి ఐదు రోజుల్లోనే మామూలై పోతున్నారు. కరోనా లక్షణాల్లో ఇప్పుడు ఎక్కువగా గొంతు నొప్పి, జ్వరం, ఒళ్లు నొప్పులు, దగ్గు, జలుబు, కీళ్లు, కాళ్ల నొప్పులే ఉంటున్నాయి. ఎవరికైతే రెండు, మూడు రోజుల్లో వైరస్ తీవ్రత తగ్గట్లేదో, ఆక్సిజన్ సాచురేషన్ 95 శాతం కంటే తగ్గుతోందో వారిపై వైద్యులు ఎక్కువ దృష్టి పెడుతున్నారు. తీవ్రంగా మారుతున్న వారికే యాంటీ వైరల్ మందులు ఇస్తున్నారు. అయితే ఒమిక్రాన్ స్వల్ప లక్షణాలతో ప్రభావం చూపుతోందని అజాగ్రత్తగా ఉండటం సరికాదు. అందరికీ ఇది సోకే అవకాశం ఉంది కాబట్టి ఒకసారి మనకూ వచ్చి పోతే మంచిదని నిర్లక్ష్యంగా వ్యవహరించొద్దు. రాబోయే 3 వారాలు అనవసర ప్రయాణాలు నియంత్రించి జాగ్రత్తలు తీసుకుంటే థర్డ్ వేవ్ క్రమంగా తగ్గిపోయే అవకాశాలే ఎక్కువ. క్రిస్మస్, న్యూ ఇయర్, సంక్రాంతి సందర్భంగా ప్రజలు కొంత నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకే ఇప్పుడు కేసులు పెరుగుతున్నాయి. ఒమిక్రానే ప్రధాన వేరియెంట్‌గా మారితే.. అన్ని దేశాల్లో డెల్టాను అధిగమించి ఒమిక్రాన్ ప్రధాన వేరియెంట్‌గా మారి 95 శాతం ఈ కేసులే వచ్చినపుడు కరోనా దాదాపుగా తగ్గిపోతుందనేది ఒక అంచనా. నెదర్లాండ్స్, అమెరికా, యూకేలలో 95 శాతం కేసులు ఒమిక్రాన్‌వే ఉంటున్నాయి. మనదేశంలోనూ డెల్టా కేసులను ఒమిక్రాన్ కేసులు అధిగమిస్తే ఇక్కడా గణనీయమైన మార్పులు వస్తాయి. ఏదో ఓ మూల నుంచి మళ్లీ రావొచ్చు వందేళ్ల క్రితం వచ్చిన స్పానిష్ ఫ్లూ.. ఒకటి, రెండు వేవ్‌లు ప్రభావం చూపి థర్డ్ వేవ్, ఫోర్త్ వేవ్‌తో ముగిసింది. ఇప్పుడు కరోనాలోనూ ఇదే జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని నిపుణులు అంచనా వేస్తున్నారు. ఐతే వైరస్ పూర్తిగా అంతర్థానమై పోదని గుర్తుంచుకోవాలి. ప్రపంచంలో అనేక వైరస్లు సజీవంగా ఉంటాయి. ఏదో ఓ మూల నుంచి మళ్లీ వచ్చే అవకాశాలు లేకపోలేదు. -
ఒమిక్రాన్‌ను ఆపలేం!.. మార్చి నాటికి..
సాక్షి, హైదరాబాద్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ వాయువేగంతో దూసుకువెళ్తోందని.. మార్చి నాటికి ప్రపంచంలో ఏకంగా సగం మంది దాని బారిన పడతారని ప్రముఖ అంతర్జాతీయ జర్నల్ లాన్సెట్ అంచనా వేసింది. ఈ నెల 17వ తేదీ నాటికే ప్రపంచవ్యాప్తంగా 12.5 కోట్ల మంది ఒమిక్రాన్ బారినపడి ఉంటారని అంచనా వేసింది. గతేడాది ఏప్రిల్‌లో డెల్టా వేరియంట్ తీవ్రస్థాయిలో ఉన్నప్పటితో పోలిస్తే ఇది పదిరెట్లు ఎక్కువని పేర్కొంది. డెల్టాతో పోలిస్తే.. ఒమిక్రాన్ కారణంగా ఆస్పత్రుల్లో చేరేవారి సంఖ్య 50 శాతం తగ్గిందని, వెంటిలేటర్ అవసరం పడేవారి సంఖ్య 90 శాతం తగ్గిందని వివరించింది. అయితే.. కేసులు భారీగా పెరుగుతుండటంతో ఆ మేరకు ఆస్పత్రుల్లో చేరికలు కూడా ఎక్కువగా ఉంటాయని స్పష్టం చేసింది. గతంలో కరోనా బారినపడిన వారిలో ప్రతి ఐదుగురిలో ఒకరిని గుర్తించారని.. ప్రస్తుతం ఒమిక్రాన్‌లో లక్షణాలు పెద్దగా కనిపించకపోవడం వల్ల అది సోకిన ప్రతి 20 మందిలో సగటున ఒకరినే గుర్తించగలుగుతున్నామని పేర్కొంది. లాన్సెట్ నివేదికలోని ముఖ్యాంశాలివీ.. ►గత వేరియంట్లలో లక్షణాలు లేనివారు 40 శాతం ఉంటే.. ఒమిక్రాన్ విషయంలో ఇది 80 నుంచి 90 శాతంగా ఉంటోంది. గతంలో ఆస్పత్రులకు వచ్చినవారికి ఇతర సాధారణ చికిత్సలకు ముందు పరీక్షలు చేస్తే.. 2 శాతం మందికి కరోనా ఉన్నట్టు తేలేది. ఇప్పుడది ఏకంగా పది శాతానికి చేరుకుంది. ►ఇటీవల కేసులు బాగా పెరుగుతున్నాయి. అందరూ మాస్క్‌లు, వ్యాక్సిన్, బూస్టర్ డోసుల గురించే మాట్లాడుతున్నారు. ఇటువంటి చర్యలను గతంలోనే మొదలుపెట్టి ఉంటే బాగుండేది. ►ఇప్పటికిప్పుడు 80 శాతం మాస్క్‌లు పెట్టుకున్నా.. వచ్చే నాలుగు నెలల కాలంలో కేవలం 10 శాతం మాత్రమే కేసులు తగ్గించవచ్చు. బూస్టర్ ఇవ్వడం, వ్యాక్సినే తీసుకోనివారికి ఇవ్వడం వల్ల ఇప్పటికిప్పుడు ఒమిక్రాన్‌ను నుంచి బయటపడలేం. అదెప్పుడో చేసి ఉండాలి. ►వచ్చే నాలుగు నుంచి ఆరు వారాల కాలంలో మనం తీసుకునే ఏ రకమైన చర్యతోనూ ఒమిక్రాన్ నుంచి బయటపడలేం. దాని ప్రభావానికి గురికావాల్సిందే. ఒమిక్రాన్ పీక్ స్థాయికి వెళ్లాక ఐదు వారాల్లోగా తగ్గిపోతుంది. ►ఈ నెల 17వ తేదీ నాటికి 25 దేశాల్లో ఒమిక్రాన్ తీవ్రస్థాయిలో ఉంది. జనవరి మూడో తేదీ నాటికే ఇండియాలో సామాజికవ్యాప్తి స్థాయిలో ఉంది. మిగతా దేశాల్లో ఫిబ్రవరి రెండో వారం నాటికి కేసులు తీవ్రస్థాయికి చేరుకుంటాయి. ►స్కూళ్ల నుంచి విద్యార్థులను దూరం చేయడం, ఉద్యోగులను కార్యాలయాలకు దూరంగా ఉంచడం వంటి చర్యలతో ఇప్పటికిప్పుడు ప్రయోజనం ఏమీలేదు. ఒమిక్రాన్ మనం తీసుకునే చర్యలకంటే స్పీడ్‌గా ఉంది. ►ఒమిక్రాన్‌ను అరికట్టేందుకు సరికొత్త వ్యూహాలను రూపొందించాలి. చైనా, న్యూజిలాండ్ దేశాల్లో సహజంగా మొదటి కేసుతోనే అప్రమత్తం అవుతారు. అసలే కేసులు రాకుండా చూడడం ఆ దేశాల వ్యూహం. ►ప్రస్తుతం వ్యాక్సినేషన్ పెరుగుతోంది. బూస్టర్ డోసులు కూడా వేస్తున్నారు. దీనితో కరోనాను ఎదుర్కొనే శక్తి, రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ఒమిక్రాన్ వేవ్ నిలిచిపోయాక కరోనా వ్యాప్తి గణనీయంగా తగ్గిపోతుంది. ►తర్వాత కూడా కొత్త వేరియంట్లు రావొచ్చు. అవి ప్రమాదకరంగా ఉండొచ్చు, ఉండకపోవచ్చు. ఇది నిరంతర ప్రక్రియగా చూడాల్సి ఉంది. దానికి మనం అలవాటు పడాల్సిందే. ►కరోనా భవిష్యత్తులో సీజనల్ వ్యాధిగా, సాధారణ ప్రమాదకర ఫ్లూగా మార్పు చెందే అవకాశముంది. 2017–18 ఫ్లూ సీజన్లో అమెరికాలో 52 వేల మంది చనిపోయారు. ఇలాంటి ప్రమాదకర సీజనల్ వ్యాధిగా కరోనా మారిపోతుంది. -
తెరుచుకోనున్న పాఠశాలలు!...వచ్చేవారం నుంచే తరగతుల ప్రారంభం!
ముంబై: వచ్చే వారం నుంచే పాఠశాలలు తెరుకోనున్నాయని, అన్ని తరగతులు ప్రారంభమవుతాయని మహారాష్ట్ర విద్యామంత్రి వర్ష గైక్వాడ్ పేర్కొన్నారు. కోవిడ్ ప్రోటోకాల్‌ని అనుసరించే ఒకటి నుంచి 12 తరగతులు పాఠశాలలు ప్రారంభవుతాయని తెలిపారు. పైగా ముఖ్యమంత్రి ఉద్ధవ్ థాకరేఈ ప్రతిపాదనను అంగీకరించారని చెప్పారు. ఈ మేరకు ఆరోగ్య మంత్రి రాజేష్ మాట్లాడుతూ..."పిల్లలు చదువుకు దూరమవుతున్నందున పాఠశాలలను తిరిగి తెరవాలంటూ కొన్ని వర్గాల నుంచి డిమాండ్లు వచ్చాయి." అని తెలిపారు. ఒమిక్రాన్ వేరియంట్ ఉధృతి నేపథ్యంలో మహారాష్ట్ర ప్రభుత్వం ఫిబ్రవరి 15 వరకు రాష్ట్రంలోని పాఠశాలలను మూసివేస్తున్నట్లు ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు నిపుణులతో చర్చించిన తర్వాత, కరోనా కేసుల సంఖ్య తక్కువగా ఉన్న సెషన్లను ప్రారంభించాలని నిర్ణయించామని విద్యామంత్రి గైక్వాడ్ పేర్కొన్నారు. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య 73,25,825కి చేరగా, మరణాల సంఖ్య 1,41,934కి పెరిగిందని ఆరోగ్య శాఖ తెలిపింది. (చదవండి: ఎన్నికల ప్రచారంతో చీరల వ్యాపారానికి పెరిగిన డిమాండ్!!) -
'వైద్య నిపుణుల సూచనలతో బడులు ప్రారంభిస్తాం'
సాక్షి, ముంబై: వైద్య నిపుణులు ఇచ్చే సూచనలు సలహాల మేరకు రాష్ట్రంలో తిరిగి బడులు ప్రారంభించే యోచనలో ఉన్నట్లు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి వర్షా గైక్వాడ్ పేర్కొన్నారు. బడుల పునఃప్రారంభంపై ఇప్పటికే ఓ ప్రతిపాదనను రూపొందించినట్లు ఆమె బుధవారం విలేకరులకు వెల్లడించారు. రాష్ట్రంలో నెలకొన్న కరోనా కేసుల తాజా పరిస్థితులపై ఒక నివేదిక రూపొందించినట్లు ఆయన తెలిపారు. వాటిని ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రేకు పంపించామని, త్వరలో సానుకూల నిర్ణయం వస్తుందని భావిస్తున్నట్లు వెల్లడించారు. ముంబైతోపాటు రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ కేసులు పెరగడంతో ఫిబ్రవరి 15వ తేదీ వరకు పాఠశాలలు మూసివేయాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. కానీ, పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచాలని ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో విద్యార్థుల తల్లిదండ్రుల్లో అసంతృప్తి, వ్యతిరేకత వాతావరణం నెలకొంది. అంతేగాకుండా ఈ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ సోషల్ మీడియాలో సందేశాలు వైరల్ అవుతున్నాయి. శుభకార్యాలకు, మాల్స్, థియేటర్లలో 50% అనుమతిస్తున్నారు. కానీ, పాఠశాలలు తెరిస్తే విద్యార్థులకు కరోనా సోకుతుందని మూసి ఉంచడం సమంజసం కాదని, విద్యార్థులు నష్టపోతున్నారని సందేశాలు వైరల్ అవుతున్నాయి. అలాగే పాఠశాలలు పూర్తిగా మూసి ఉంచే బదులు ఒక ప్రణాళిక ప్రకారం తెరవాలని ఉపాధ్యాయులు కూడా డిమాండ్ చేస్తున్నారు. చదవండి: (ప్రముఖ క్రిమినల్ లాయర్ శ్రీకాంత్ షివాడే కన్నుమూత) రెండు నెలల కిందట కరోనా తగ్గుముఖం పట్టడంతో విద్యావేత్తలు, నిపుణుల సలహాల ప్రకారం అప్పట్లో పాఠశాలలు తెరిచామని వర్షా తెలిపారు. కానీ, గత పక్షం రోజుల కిందట కరోనా కేసుల సంఖ్య మళ్లీ పెరగడంతో మూసివేయాల్సి వచ్చిందన్నారు. ప్రస్తుతం రోగుల సంఖ్య మెల్లమెల్లగా తగ్గుముఖం పడుతోంది. దీంతో విద్యార్థుల తల్లిదండ్రుల సంఘటనలతో చర్చించామని, ఆ సమయంలో వారు ఒక నివేదక అందజేశారని వర్షా వెల్లడించారు. పాఠశాలలు ప్రారంభించాల్సిందేనని అనేక మంది డిమాండ్ చేశారని తెలిపారు. దీంతో రోగుల సంఖ్య ఎక్కడెక్కడ తక్కువగా ఉందో అక్కడ పాఠశాలలు తెరిచేందుకు స్థానిక అధికారులకే అధికారమివ్వాలని ప్రతిపాదించామని, ఆ మేరకు ముఖ్యమంత్రికి నివేదిక అందజేశామని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభించాలనే ఉద్ధేశం తమకు కూడా ఉందని, ప్రస్తుతం 15–18 ఏళ్లలోపు పిల్లలకు కరోనా టీకా డోసు వేసే ప్రక్రియకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు తెలిపారు. పాఠశాలలకు వచ్చే విద్యార్థులతో పాటు బోధన, బోధనేతర సిబ్బంది కూడా రెండు టీకాలు తీసుకుని విధుల్లో చేరేలా సూచనలిస్తున్నట్లు వర్షా స్పష్టం చేశారు. లేదంటే పరిస్థితి మొదటికే వచ్చే ప్రమాదముందని హెచ్చరించారు. -
Corona: ఒక్కరోజే 3 లక్షల కేసులు..8 నెలల తర్వాత తొలిసారి..
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తోంది. కేసుల సంఖ్య రోజురోజుకూ అమాంతం పెరుగుతోంది. జ్వరం, జలుబు, దగ్గు లక్షణాలతో లక్షలాది మంది బాధపడుతున్నారు. దేశంలో తాజాగా కొత్త కేసుల సంఖ్య మూడు లక్షల మార్క్‌ను దాటేశాయి. గడిచిన 24 గంటల్లో 19,35,180 కరోనా పరీక్షలు నిర్వహించగా.. రికార్డు స్థాయిలో 3,17,532 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. బుధవారం రోజు491 మంది మృత్యువాతపడ్డారు. కిందటి రోజుతో పోలిస్తే 12శాతం ఎక్కువ నమోదయ్యాయి. దేశంలో 8 నెలల తర్వాత రోజువారీ కేసులు 3 లక్షలు దాటడం ఇదే తొలిసారి. చివరిసారిగా సెకెండ్ వేవ్ సమయంలో గతేడాది మే 15న 3,11,077 రోజువారీ కేసులు నిర్ధారణ అయ్యాయి. పాజిటివిటీ రేటు 15 శాతం నుంచి 16.41 శాతానికి పెరిగింది. ఈ మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3.82 కోట్లకు చేరింది. ఇప్పటి వరకు 4,87,693 మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు దేశంలో ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 9,287కు పెరిగింది. చదవండి: మార్చికల్లా కరోనా మటాష్..! గుడ్ న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్ -
ఓపీ చూసి.. మందులు రాసి!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో ఒమిక్రాన్ కేసులు గణనీయంగా పెరుగుతున్నా, ఆసుపత్రుల్లో చికిత్స తీసుకోవాల్సినంత తీవ్రత ఏమీలేదని వైద్యనిపుణు లు అంటున్నారు. సాధారణ జ్వరం, జలుబు, దగ్గు బాధితులకు మాదిరిగా ఓపీ(ఔట్ పేషెంట్) చూసి మందులు రాసి ఇంటికి పంపిస్తున్నారు. ఇళ్లల్లోనే ఐసోలేషన్‌లో ఉండి మందులు వాడితే సరిపోతుం దని వైద్యులు చెబుతున్నారు. కానీ, కొందరు ప్రముఖులు, సినీనటులు మాత్రం ఆసుపత్రి ఐసోలేషన్ లో ఉండటానికి ఇష్టపడుతున్నారని అంటున్నారు. ఇదేస్థాయిలో సెకండ్‌వేవ్ ఉన్నప్పుడు?: ప్రస్తు తం తెలంగాణలో నమోదైన కేసులతో దాదాపు సమానంగా సెకండ్ వేవ్‌లో గతేడాది ఏప్రిల్‌లో 13న 3,052 కేసులున్నాయి. అప్పుడు యాక్టివ్ కేసు లు 24,131కాగా, 16,118 మంది ఐసోలేషన్‌లో ఉన్నారు. అంటే 67% మంది ఐసోలేషన్ లో ఉంటే, 33% మంది ఆసుపత్రుల్లో ఉన్నారు. ఆసుపత్రిలో చేరిన ప్రతి నలుగురిలో ముగ్గురు ఆక్సిజన్, ఐసీయూలో ఉండాల్సి వచ్చింది. కానీ, ఇప్పుడు క్రియా శీలక కేసులు 22 వేలకుపైగా ఉన్నా, అందులో 10% మంది మాత్రమే ఆసుపత్రిలో ఉన్నారు. మిగిలిన 90% మంది హోం ఐసోలేషన్‌లో ఉన్నారు. అప్పట్లో రోజూ కోవిడ్ రోగుల కోసం 300 టన్నుల ఆక్సిజన్ అవసరం ఉండగా, ఇప్పుడు కేవలం 30 టన్నులు మాత్రమే అవసరమవుతుంది. సెకండ్ వేవ్‌లో దేశంలో 18 లక్షల క్రియాశీలక కేసులు రావడానికి 36 రోజులు పడితే, ప్రస్తుత థర్డ్‌వేవ్‌లో అన్ని కేసులు రావడానికి 18 రోజులు మాత్రమే పట్టింది. అంటే వ్యాప్తి తీవ్రత ఎక్కువగా ఉంది. ♦ ప్రపంచ ఆరోగ్య సంస్థ నివేదిక ప్రకారం డెల్టా తో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్లో తీవ్రమైన కోవిడ్ వచ్చే అవకాశం 83 శాతం తక్కువ. ♦ డెల్టా కంటే ఒమిక్రాన్‌లో కరోనా వైరస్ లోడ్ గొంతులో 70 రెట్లు అధికం. గొంతులో ఒమిక్రాన్ పునరుత్పత్తి జరుగుతుండగా, డెల్టా వేరియంట్ తన సంతతిని ఊపిరితిత్తుల్లో పెంచుకునేది. అందువల్ల అప్పుడు కేసులు చాలా తీవ్రమయ్యేవి. ♦ ఊపిరితిత్తుల్లోకి వైరస్ చేరిక డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్‌లో పదిశాతం మాత్రమే ♦ యూకేలో ఒమిక్రాన్‌కు ముందు నమోదైన కరోనా కేసుల్లో రెండు శాతమే రీఇన్ఫెక్షన్ ఉండగా, ఇప్పుడు ఐదు రెట్లు పెరిగింది. ♦వ్యాక్సిన్ వేసుకున్నా వైరస్ వ్యాప్తి జరుగుతుంది. వ్యాక్సిన్ అనంతర ఇన్ఫెక్షన్లు యూకేలో 84 శాతం ఉన్నాయి. వారంతా రెండుడోసులు తీసుకున్నవారే. ఢిల్లీలో 68 శాతం ఒమిక్రాన్ కేసులకు చెందినవారంతా రెండుడోసులు తీసుకున్నవారే. అందులో వారిలో 61 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు. ♦ ఢిల్లీ ప్రభుత్వ విశ్లేషణ ప్రకారం... ఒమిక్రాన్‌తో చనిపోయినవారిలో 92 శాతం మంది వ్యాక్సిన్ తీసుకోనివారే. వైరస్ వ్యాప్తిని టీకా ఆపలేకపోయినా... మరణాలను ఆపుతుంది. -
కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రం పునరుద్ధరణ
సాక్షి, అమరావతి: కొత్త వేరియంట్ ఒమిక్రాన్‌తో కోవిడ్ కేసులు పెరగకుండా చర్యలు చేపట్టేందుకు, రోగులకు వైద్య సేవలు అందుబాటులో ఉంచేందుకు రాష్ట్ర స్థాయి కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రాన్ని తక్షణమే పునరుద్ధరిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కోవిడ్ నిబంధనల అమలు, ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో, కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన వైద్యం అందించడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, ఆక్సిజన్, పరికరాలు అందుబాటులో ఉంచడం, హోం ఐసొలేషన్ కిట్లు సరఫరా, ఫీవర్ సర్వే, అత్యవసర మందులు తదితర అంశాలను సమర్ధంగా పర్యవేక్షించేందుకు ఈ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) అధ్యక్షతన పలువురు ఐఏఎస్ అధికారులతో దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేరకు సీఎస్ డాక్టర్ సమీర్ శర్మ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. కోవిడ్ కమాండ్ కంట్రోల్ కేంద్రంలో ఐఏఎస్ అధికారులు, వారి బాధ్యతలు ► ఎం.టి.కృష్ణబాబు: కోవిడ్ కేర్ సెంటర్లలో రోగులకు నాణ్యమైన ఆహారం సరఫరా, పారిశుద్ధ్యం పర్యవేక్షణ, ఆక్సిజన్ అందుబాటులో ఉండేలా చర్యలు ► ఎం.రవిచంద్ర: జిల్లాస్థాయిలో కమాండ్ కంట్రోల్ కేంద్రాల ఏర్పాటు, నిర్వహణ, కోవిడ్ కేర్ సెంటర్లలో శిక్షణ పొందిన వైద్య సిబ్బందిని అందుబాటులో ఉంచడం, 104 కాల్ సెంటర్ నిర్వహణ, కోవిడ్ కేసుల రోజువారీ సమాచారం, ప్రజల్లో చైతన్యం కలిగించడం, సహాయ చర్యల్లో జాయింట్ కలెక్టర్లు, ఎన్జీవోలు, యునిసెఫ్‌తో సమన్వయం ► ఎ.బాబు: రాష్ట్ర, జిల్లా స్థాయిలో 104 కాల్ సెంటర్లు సమర్ధంగా పనిచేసేలా చూడటం, హెల్ప్ డెస్క్, సీసీ టీవీ వ్యవస్థల పర్యవేక్షణ ► వి.వినయ్‌చంద్: ఆరోగ్య శ్రీ ఆస్పత్రుల్లో కోవిడ్ వైద్య సేవలు, ల్యాబ్ మేనేజ్మెంట్, మొబైల్ మెడికల్ యూనిట్లు, అంబులెన్స్‌ల పర్యవేక్షణ ► మురళీధర్ రెడ్డి: కోవిడ్ మందులు, పరికరాల కొనుగోలు, ఆక్సిజన్ లైన్లు, పీఎస్ఏ ప్లాంట్లు, వెంటిలేటర్లు సక్రమంగా పనిచేసేలా చూడటం, శిక్షణ పొందిన సిబ్బందిని అందుబాటులో ఉంచడం ► జె.సుబ్రహ్మణ్యం: కోవిడ్ కేసుల వివరాల సేకరణ, విశ్లేషణ, నివేదికలు రూపొందించడం, గ్రామ, వార్డు సచివాలయ స్థాయిలో పాజిటివ్ కేసులు పెరగకుండా రోజూ కలెక్టర్లతో సమన్వయం చేసుకుని సమర్ధవంతమైన చర్యలు చేపట్టడం ► ఐఏఎస్‌లు జి.సృజన, షాన్మోహన్, ఐఆర్టీఎస్ అధికారి వాసుదేవరెడ్డి: మెడికల్ ఆక్సిజన్ సరఫ రా,పరిశ్రమల యూనిట్లు, రైల్వేతో సమన్వ యం, ఎల్ఎంఓ కేటాయింపు, ఉత్పత్తి బాధ్యత ► వి.వినోద్‌కుమార్: క్లినికల్ మేనేజ్మెంట్ అండ్ ట్రైనింగ్, క్లినికల్ మేనేజ్మెంట్ ప్రొటోకాల్, వెంటిలేటర్ల సరఫరా, ఇతర పరికరాలు అందుబాటులో ఉంచడం ► రవి శంకర్: అత్యవసర మందులు అందుబాటులో ఉంచడం, మందుల ధరల నియంత్రణ ► జి.ఎస్. నవీన్‌కుమార్: ఫీవర్ సర్వే పర్యవేక్షణ, హోం ఐసొలేషన్ కిట్ల పంపిణీ, సంబంధిత కేంద్ర ప్రభుత్వ విభాగాలతో సమన్వయం -
మహమ్మారిని ఎదుర్కొనడంపైనే బడ్జెట్ దృష్టి
న్యూఢిల్లీ: భారత్ ఎకానమీ రికవరీ ఇంకా పేలవంగా ఉందని బ్యాంకింగ్ దిగ్గజం స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్బీఐ) పేర్కొంది. ఆర్థికమంత్రి నిర్మలాసీతారామన్ వచ్చే నెల 1వ తేదీన పార్లమెంటులో 2022–23 వార్షిక బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్న నేపథ్యంలో ఎస్బీఐ చీఫ్ ఎకనమిస్ట్ సౌమ్యకాంతి ఘోష్ బుధవారం ఒక ప్రీ–బడ్జెట్ సిఫారసుల నోట్‌ను విడుదలచేశారు. ఈ డాక్యుమెంట్ ప్రకారం, మహమ్మారిని ఎదుర్కొనడంపై రానున్న బడ్జెట్ ప్రత్యేకంగా దృష్టి పెట్టాలి. ద్రవ్యలోటు పరమైన ఇబ్బందుల పరిశీలించడం మాత్రమే తాజా పరిస్థితుల్లో సరికాదు. కొత్త ఆర్థిక సంవత్సరంలో మార్కెట్ విక్రయం ద్వారా ఎల్ఐసీ వాటా విక్రయాన్ని పూర్తిచేయాలి. కొత్త ఆర్థిక సంవత్సరానికి ఇది అత్యుత్తమ పప్రారంభం అవుతుంది. 2022–23లో ఖజానాకు దాదాపు రూ.3 లక్షల కోట్ల నిధులను సమకూర్చుకోడానికి, ద్రవ్యలోటును 6.3 శాతానికి తగ్గించడానికి ఈ చర్య దోహదపడుతుంది. ద్రవ్యలోటు కట్టడి చేయాలన్నా అది 40 బేసిస్ పాయింట్ల కన్నా అధికంగా ఉండకూడదు. ప్రస్తుతం ఎకానమీలో కీలక రంగాలకు ప్రభుత్వ మద్దతు అవసరం. సంపద పన్ను వంటి కొత్త పన్నుల జోలికి వెళ్లవద్దు. ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో ఇలాంటి చర్యలు లాభాలకన్నా ప్రతికూల ఫలితాలకే దారితీస్తుంది. జీడీపీలో దాదాపు 29 శాతం వాటాతో 11 కోట్ల మందికి పైగా ఉపాధి కల్పిస్తున్న ఉన్న లఘు, చిన్న మధ్య తరహా పరిశ్రమలకు మద్దతునిచ్చేలా ప్రభుత్వ చర్యలు ఉండాలి. 2022–23 ఆర్థిక సంవత్సరం చివరి వరకూ అత్యవసర రుణ హామీ పథకాన్ని (ఈసీఎల్జీఎస్) కొనసాగించాలి. -
నాలుగు రోజుల్లో రూపాయికి తొలి లాభం
ముంబై: డాలర్ మారకంలో రూపాయి విలువ వరుస నాలుగురోజుల ట్రేడింగ్ సెషన్లలో తొలిసారి లాభపడింది. ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో 14పైసలు లాభపడి 74.44 వద్ద ముగిసింది. అయితే ఈ లాభం ధోరణి తాత్కాలికమేనని రూపాయి భారీగా బలపడిపోయే పరిస్థితి లేదన్నది నిపుణుల అభిప్రాయం. క్రూడ్ ఆయిల్ ధరలు, ఈక్విటీల బలహీనత, ద్రవ్యోల్బణం, కొత్త వేరియంట్ ఒమిక్రాన్, అమెరికా సెంట్రల్ బ్యాంక్ వడ్డీరేట్ల నిర్ణయాల వంటి సవాళ్లు రూపాయికి ప్రతికూలమని ట్రేడర్లు అభిప్రాయపడుతున్నారు. రూపాయి మంగళవారం ముగింపు 74.58. బుధవారం ఉదయం ట్రేడింగ్‌లో 74.70 కనిష్ట స్థాయి వద్ద ప్రారంభమైంది. ఇంట్రాడేలో 74.32 గరిష్ట స్థాయిని చూసింది. ఈ వార్త రాస్తున్న మంగళవారం రాత్రి 11 గంటల సమయంలో అంతర్జాతీయ ఫ్యూచర్స్ మార్కెట్లో డాలర్ మారకంలో రూపాయి విలువ నష్టాల్లో 74.36 వద్ద ట్రేడవుతుండగా, ఆరు కరెన్సీ విలువల (యూరో, స్విస్ ఫ్రాంక్, జపనీస్ యన్, కెనడియన్ డాలర్, బ్రిటన్ పౌండ్, స్వీడిష్ క్రోనా) ప్రాతిపదకన లెక్కించే డాలర్ ఇండెక్స్ స్థిరంగా 95.52 వద్ద ట్రేడవుతోంది. రూపాయికి ఇంటర్ బ్యాంక్ ఫారెక్స్ మార్కెట్లో ఇప్పటి వరకూ ఇంట్రాడే కనిష్ట స్థాయి 76.92 (2020, ఏప్రిల్ 22వ తేదీ). ముగింపులో రికార్డు పతనం 76.87 (2020, ఏప్రిల్ 16వ తేదీ). -
ఖమ్మంలో విజృంభిస్తున్న కరోనా
-
మార్చికల్లా కరోనా మటాష్..! గుడ్ న్యూస్ చెప్పిన టాప్ సైంటిస్ట్
న్యూఢిల్లీ: కరోనా థర్డ్ వేవ్ దేశాన్ని అల్లాడిస్తున్న వేళ ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) వేసిన అంచనాలు కొత్త ఊపిరిపోస్తున్నాయి. కరోనా పీడ ఎప్పుడు విరగడైపోతుందా అని ఆత్రుతగా ఎదురుచూస్తున్న ప్రజలు కోవిడ్–19 నిబంధనల్ని నిర్లక్ష్యం చేయకుండా తు.చ. తప్పకుండా పాటిస్తే మరో రెండు నెలల్లోనే ఆ మంచిరోజులు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దేశంలో కరోనా మహమ్మారి మార్చి నాటికి ఎండమిక్ దశకు చేరుకుంటుందని ఐసీఎంఆర్‌లో వ్యాధుల నివారణ విభాగం చీఫ్ సమీరన్ పాండా చెప్పారు. ఎండమిక్ దశ అంటే దేశవ్యాప్తంగా ఒకేసారి కరోనా ఉధృతి కనపడకుండా అక్కడక్కడా విసిరేసినట్లు కొద్ది ప్రదేశాలకు కరోనా వ్యాప్తి పరిమితం కావడం, కరోనా సాధారణ వైరస్‌గా మారిపోయి ప్రజలు దానితో సహజీవనం చేసే పరిస్థితికి చేరుకోవడం. ప్రజలందరూ కోవిడ్ రక్షణ కవచాలైన మాస్కులు ధరించడం, భౌతికదూరం పాటించడం, తరచూ చేతులు కడుక్కోవడం వంటివి తప్పనిసరిగా చేస్తూ ఉంటే, కొత్త వేరియంట్లు ఏవీ పుట్టుకొని రాకపోతే కరోనా ఇక తుది దశకు చేరుకున్నట్టేనని అన్నారు. కరోనా ఎండమిక్ దశ మార్చి 11 నుంచి మొదలయ్యే అవకాశాలున్నాయని చెప్పారు. ‘‘డెల్టా వేరియంట్ స్థానాన్ని ఒమిక్రాన్ ఆక్రమిస్తే కరోనాకి అదే ముగింపు అవుతుంది. కొత్తగా ఏ వేరియంట్లు రాకపోతే ఇక కరోనా ముగిసిపోయినట్టే. డిసెంబర్ 11 నుంచి మొదలైన కరోనా థర్డ్ వేవ్ మూడు నెలల్లో ముగిసిపోతుంది’’ అని ఐసీఎంఆర్ నిపుణుల బృందం గణిత శాస్త్ర విధానం ఆధారంగా రూపొందించిన అంచనాల్లో వెల్లడైందని పాండా తెలిపారు. ‘‘మార్చి 11 నుంచి కరోనా ఉధృతి తగ్గిపోతుంది. ఢిల్లీ, ముంబైలలో కోవిడ్–19 కేసులు గరిష్ట స్థాయికి చేరుకున్నాయో లేదో తెలియాలంటే మరి రెండు, మూడు వారాలు వేచిచూడాలి. ఆ రెండు నగరాల్లో పాజిటివిటీ రేటు తగ్గుతున్నప్పటికీ అక్కడ కరోనా పరిస్థితి ఏ దశలో ఉందో ఇప్పుడే చెప్పలేము. ఒకట్రెండు రోజుల్లో అక్కడ పరిస్థితులపై ఒక అంచనాకి రాలేము. ప్రస్తుతానికి ఒమిక్రాన్, డెల్టా కేసులు అక్కడ 80:20 నిష్పత్తిలో నమోదవుతున్నాయి’’ అని పాండా వివరించారు. కరోనా పరీక్షలు తప్పనిసరి వివిధ రాష్ట్రాల్లో కరోనా పరిస్థితి వివిధ దశల్లో ఉందని పాండా చెప్పారు. కరోనా మహమ్మారి రూపాంతరం చెందుతూ ఉంటే దానికి అనుగుణంగా కోవిడ్–19 పరీక్షలకు సంబంధించి వ్యూ హాలు మార్చుకుంటామన్నారు. కరోనా పరీక్షలు తగ్గించాలని తాము ఎప్పుడూ రాష్ట్రాలకు చెప్పలేదన్నారు. కరోనా స్వభావం మారినప్పుడల్లా ఐసీఎంఆర్ కోవిడ్–19 పరీక్షలు, నిర్వహణ వ్యూహాలను మార్చుకుంటూ ఉంటుందని వివరించారు. కరోనా అత్యవసర పరిస్థితులు ఇక ఉండవ్ : ప్రపంచ ఆరోగ్య సంస్థ దావోస్: కోవిడ్–19తో విధించే అత్యవసర పరిస్థితులు ఈ ఏడాదితో ముగిసిపోయే అవకాశాలున్నాయని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) అంచనా వేస్తోంది. వ్యాక్సిన్ పంపిణీలో అసమానతలను నిర్మూలించి అందరికీ లభ్యమయ్యేలా చర్యలు చేపడితే కోవిడ్–19 మర ణాలు, ఆస్పత్రిలో చేరికలు, లాక్డౌన్లు వంటివి అరికట్టవచ్చునని డబ్ల్యూహెచ్ఒ ప్రతినిధి డాక్టర్ మైఖేల్ ర్యాన్ చెప్పారు. కోవిడ్ వ్యాక్సిన్ అసమానతలపై వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ ఏర్పాటు చేసిన చర్చా కార్యక్రమంలో పాల్గొన్న మైఖేల్ ఇలాంటి వైరస్‌లో మన పర్యావరణ వ్యవస్థలో అంతర్భాగంగానే ఎప్పటికీ ఉంటాయన్నారు. అన్ని దేశాలకు సమానంగా టీకా పంపిణీ జరిగితే ప్రజారోగ్య అత్యవసర పరిస్థితి ఇక రాకపోవచ్చునని అన్నారు. ఫిబ్రవరి 28 వరకు అంతర్జాతీయ విమానాలపై నిషేధం పొడిగింపు న్యూఢిల్లీ: ఒమిక్రాన్ కేసుల ఉధృతి కొనసాగుతూ ఉండడంతో అంతర్జాతీయ విమానాల రాకపోకలపై నిషేధాన్ని ఫిబ్రవరి 28 వరకు పొడిగించినట్టుగా డైరెక్టర్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) వెల్లడించింది. అయితే పరస్పర ఒప్పందం ఉన్న దేశాలకు ప్రత్యేక విమానాలు నడుస్తాయని, అందులో ఎలాంటి మార్పు లేదని స్పష్టం చేసింది. కరోనా మొదటి వేవ్ సమయంలో 2020 మార్చి 23 నుంచి అంతర్జాతీయ విమానాలపై డీసీజీఏ నిషేధం విధించిన విషయం తెలిసిందే. అప్పట్నుంచి విడతల వారీగా నిషేధాన్ని కొనసాగిస్తూ వస్తోంది. 40 దేశాలకు ప్రత్యేక విమానాలు మాత్రం యథాతథంగా తడుస్తాయని డీసీజీఏ పేర్కొంది. ఒకే రోజు 2.82 లక్షల కరోనా కేసులు దేశవ్యాప్తంగా కరోనా కేసుల ఉధృతి ఒక్కసారిగా పెరిగింది. ఒకే రోజు 2,82,970 కేసులు నమోదయ్యాయి. 18,31,000కి క్రియాశీల కేసుల సంఖ్య చేరుకున్నట్టుగా కేంద్ర ఆరోగ్య శాఖ బుధవారం వెల్లడించింది. ప్రతీ కరోనా కేసుని జన్యుక్రమ విశ్లేషణకు పంపించడం సాధ్యం కాదని అందుకే ఒమిక్రాన్ కేసులు ఎంత శాతం నమోదవుతున్నాయో కచ్చితమై న లెక్కలు చెప్పలేమని స్పష్టం చేసింది. రోజువారీ పాజిటివిటీ రేటు 15.13 శాతం, వీక్లీ పాజిటివిటీ రేటు 15.53శాతంగా ఉంది. (కీలక విషయాలు వెల్లడి.. రాష్ట్రాల కోవిడ్ మృతుల సంఖ్యలో భారీ తేడా?) -
పెట్రోల్, డీజిల్ విక్రయాలపై ఒమిక్రాన్ ప్రభావం
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా ప్రస్తుత నెల మొదటి 15 రోజుల్లో పెట్రోల్, డీజిల్ విక్రయాలు తగ్గుముఖం పట్టాయి. కరోనా ఒమిక్రాన్ వ్యాప్తిని అడ్డుకునేందుకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కర్ఫ్యూ, ఆంక్షలు విధించడం అమ్మకాలపై ప్రభావం చూపించినట్టు తెలుస్తోంది. ఆంక్షల కారణంగా విమన సర్వీసులు, కార్యాలయాలకు రవాణా తగ్గడం తెలిసిందే. డీజిల్ విక్రయాలు 2.47 మిలియన్ టన్నులుగా ఉన్నాయి. 2021 జనవరి 1–15 నాటి అమ్మకాలతో పోలిస్తే 5 శాతం తక్కువగాను, 2021 డిసెంబర్ నెల మొదటి 15 రోజుల విక్రయాలతో పోలిస్తే 14.1 శాతం తగ్గాయి. దేశ ఇంధన వినియోగంలో డీజిల్ వాటా 40 శాతంగా ఉంటుంది. డీజిల్ వినియోగం పారిశ్రామిక కార్యకలాపాలను కూడా ప్రతిఫలిస్తుంది. 2020 జనవరి నెల మొత్తంమీద డీజిల్ అమ్మకాలు 8 శాతం తగ్గడం గమనార్హం. ఇక పెట్రోల్ విక్రయాలు ఈ ఏడాది జనవరి 1–15 వరకు 9,64,380 టన్నులుగా ఉన్నాయి. 2021 డిసెంబర్ నెల మొదటి పక్షం రోజుల విక్రయాలతో పోలిస్తే 13.81 శాతం తక్కువగాను, 2021 జనవరి నెల మొదటి 15 రోజులతో పోలిస్తే 3 శాతం తగ్గాయి. 2020 జనవరి నెల మొదటి 15 రోజుల విక్రయాలతో పోల్చి చూస్తే మాత్రం 6 శాతం పెరిగినట్టు తెలుస్తోంది. ఏవియేషన్ టర్బయిన్ ఫ్యూయల్ విక్రయాలు 13 శాతం తగ్గి 2,08,980 టన్నులుగా ఉన్నాయి. ఎల్పీజీ విక్రయాలు 5 శాతం పెరిగాయి. -
Corona: ముంచుకొస్తున్న ముప్పు.. 248 రోజుల తర్వాత అత్యధిక కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు వెలుగు చూస్తున్నాయి. గత రెండు రోజులుగా కాస్త తగ్గుముఖం పట్టిన కేసులు తాజాగా మరోసారి భారీగా పెరిగాయి. గడిచిన 24 గంటల్లో 2,82,970 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 248 రోజుల తర్వాత ఇంత భారీ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలిసారి. ఇక నిన్నటితో పోలిస్తే 18 శాతం అంటే 44,889 కేసులు పెరిగాయి. మంగళవారం రోజు వైరస్ కారణంగా 441మంది ప్రాణాలు కోల్పోయారు. ఒక్క రోజే 1,88,157 మంది కోలుకున్నారు. చదవండి: డాక్టర్‌కే ఐదు డోసుల వ్యాక్సిన్! దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశం ప్రస్తుతం దేశంలో 18,31,000 యాక్టివ్ కేసులున్నాయి. పాజిటివిటీ రేటు 14.43 శాతం నుంచి 15.13 శాతానికి పెరిగింది. రికవరీ రేటు 93.88శాతంగా ఉంది. ఇప్పటి వరకు దేశంలో 3 కోట్ల 79 లక్షల మంది కరోనా బారిన పడగా.. 4,87.202 మంది మరణించారు. అయితే మహారాష్ట్ర, ఢిల్లీల్లో కేసులు తగ్గుముఖం పట్టినా.. కర్నాటక, కేరళలో కొత్త కేసుల సంఖ్య ఆందోళనకర స్థాయిలో పెరుగుతోంది. ఇక దేశంలో కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ కేసులు 8,961 చేరినట్టు కేంద్ర ఆరోగ్యశాఖ బుధవారం వెల్లడించింది. చదవండి: రసవత్తరంగా యూపీ ఎన్నికల సమరం.. అసెంబ్లీ బరిలో అఖిలేష్ India reports 2,82,970 COVID cases (44,889 more than yesterday), 441 deaths, and 1,88,157 recoveries in the last 24 hours. Active case: 18,31,000 Daily positivity rate: 15.13% 8,961 total Omicron cases detected so far; an increase of 0.79% since yesterday pic.twitter.com/Fz8ZfjplTF — ANI (@ANI) January 19, 2022 -
కాస్త తగ్గిన కరోనా కేసులు.. అయినా కొత్తగా 2 లక్షలకు పైనే
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. కనీవినీ ఎరుగని రీతిలో లక్షల్లో రోజువారీ కేసులు నమోదవుతుండటం తీవ్ర ఆందోళన రేపుతోంది. దేశంలో నమోదవుతున్న కేసుల సంఖ్య చూస్తే ప్రమాద ఘంటికలు మోగుతున్నట్టు అనిపిస్తోంది. అయితే గత రోజుతో పోలిస్తే దేశంలో తాజాగా రోజువారీ కరోనా కేసులు స్వల్పంగా తగ్గాయి. గడిచిన 24 గంటల్లో 2,38,018 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అయితే కొత్త కేసులు 20 వేలకు పైగా తగ్గడం సానుకూలాంశం అయినప్పటికీ 2లక్షలకు పైనే కొత్త కేసులు నమోదయ్యాయి. పాజిటివిటీ రేటు కూడా 19.65 శాతం నుంచి 14.43 శాతానికి తగ్గడం కొంత ఊరటనిస్తోంది. చదవండి: దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్! 9వేలకు చేరువలో ఒమిక్రాన్ కేసులు సోమవారం రోజు వైరస్ కారణంగా మరో 310 మంది మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 4,86,761కు చేరింది. నిన్న ఒక్కరోజే 1,57,421 మంది కోలుకోగా రికవరీ రేటు 94.09శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 17,36,628 యాక్టివ్ కేసులున్నాయి. ఇక కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ 28 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వ్యాపించింది. దేశ వ్యాప్తంగా ఒమిక్రాన్ బాధితుల సంఖ్య 9వేలకు చేరువైంది. ప్రస్తుతం 8,891 ఒమిక్రాన్ కేసులు నమోదైనట్లు కేంద్ర ఆరోగ్యశాఖ వెల్లడించింది. కాగా ఇప్పటివరకు భారత్‌లో 158కోట్ల డోసులు పంపిణీ చేసినట్లు కేంద్రం పేర్కొంది. చదవండి: జ్వరం, జలుబు, దగ్గుతో ఉక్కిరిబిక్కిరి.. కరోనా కావచ్చేమోనని? -
దేశీయ వ్యాక్సిన్‌తో ఒమిక్రాన్‌కి చెక్!
డెల్టా కంటే వేగంగా వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వేరియంట్‌ని కట్టడి చేసేలా మరో సరికొత్త ఎంఆర్ఎన్ఏ (మెసెంజర్ ఆర్ఎన్ఏ) వ్యాక్సిన్ రానుంది. ఈవ్యాక్సిన్ను పూణేకు చెందిన జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ అభివృద్ధి చేసింది. అయితే ఈ వ్యాక్సిన్ సమర్థతకు సంబంధించిన క్లినికల్ ట్రయిల్స్ వచ్చే నెలలో (ఫిబ్రవరి)లో ప్రారంభమవుతాయని అధికారులు చెప్పారు. ఈ మేరకు జెనోవా బయోఫార్మాస్యూటికల్స్ మెసెంజర్ ఆర్ఎన్ఏ వ్యాక్సిన్ ఫేజ్-2 పరిశోధన డేటాను సమర్పించింది. అంతేగాక తదుపరి ఫేజ్-3కి సంబంధించిన డేటాను కూడా సిద్ధం చేసింది. పైగా డ్రగ్స్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ) చెందిన సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ కమిటీ (ఎస్ఇసీ) త్వరలో ఈ డేటాలను సమీక్షించనుందని అధికారులు వెల్లడించారు. మెసెంజర్ ఆర్ఎన్ఏ ఏంటంటే.. అభివృద్ధి చేసిన భారత్ ఆధారిత తొలి ఎంఆర్ఎన్ఏ కోవిడ్-19 వ్యాక్సిన్‌కి సంబంధించిన ఫేజ్-2, ఫేజ్-3 పరిశోధనలను డీసీజీఐ ఇంతకుముందే ఆమోదించిందని ఫార్మాస్యూటికల్స్ కంపెనీ వెల్లడించింది. కాగా ఈ వ్యాక్సిన్ పేరు ‘HGCO19’ అని పేర్కొంది. జెనోవా ఫార్మాస్యూటికల్స్ కంపెనీ ఫేజ్-1కి సంబంధించిన పరిశోధనలను భారత నేషనల్ రెగ్యూలేటరీ అథారిటికి సంబంధించిన సెంట్రల్ డ్రగ్స్ స్టాండర్డ్ కంట్రోల్ ఆర్గనైజేషన్ (సీడీఎస్సీఓ)కి సమర్పించినట్లు కూడా పేర్కొంది. అయితే ఫేజ్I పరిశోధనలను సమీక్షించిన నిపుణులు ఈ వ్యాక్సిన్ HGCO19 సురక్షితమైన ఇమ్యునోజెనిక్‌గా గుర్తించినట్లు కంపెనీ మీడియాకి తెలిపింది. ఈ వ్యాక్సిన్లు న్యూక్లియిక్ యాసిడ్ వ్యాక్సిన్ల వర్గానికి చెందినవి, ఇవి వ్యాధిని కలిగించే వైరస్లు లేదా వ్యాధికారక క్రిముల నుండి వచ్చే జన్యు పదార్థాన్ని ఎదుర్కొనేలా వ్యాధినిరోధక శక్తిని పెంపొందిస్తుందని తెలిపింది. అయితే తదుపరి రెండు దశలకు సంబంధించిన క్లినికల్ ట్రియిల్స్ త్వరలో ప్రారంభించనున్నట్లు తెలిపింది. -
టీకా తీసుకున్నా.. ఒమిక్రాన్!
సాక్షి,హైదరాబాద్: దేశంలో కోవిడ్ వ్యాక్సిన్ రెండు డోసులు తీసుకున్న వారిలోనూ ‘ఒమిక్రాన్’వ్యాప్తి చెందుతున్నట్లు తాజా అధ్యయనంలో వెల్లడైంది. ప్రస్తుతం నమోదవుతున్న పాజిటివ్ కేసుల్లో ఏకంగా 88 శాతం మంది రెండు డోసులు వ్యాక్సిన్ తీసుకున్న వారేనని ఢిల్లీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ లివర్ అండ్ బిలియరీ సైన్సెస్ (ఐఎల్‌బీఎస్) పేర్కొంది. ఒమిక్రాన్ వేరియంట్‌పై దేశంలో తొలిసారిగా ఐఎల్‌బీఎస్ పరిశీలన చేపట్టింది. గతేడాది డిసెంబర్లో ఢిల్లీలో నమోదైన ఒమిక్రాన్ కేసుల తీరును ఐఎల్‌బీఎస్ విశ్లేషించింది. మొత్తం 264 పాజిటివ్ కేసులను పరిగణనలోకి తీసుకొని అందుకు సంబంధించి లోతైన అధ్యయనం చేసింది. ఒమిక్రాన్ బాధితుల్లో వైరస్ లక్షణాలు, చికిత్స, వారు కోలుకున్న తీరు, రెండు డోసుల టీకాలు తీసుకున్న తేదీల సమాచారం తదితర వివరాలను పరిశీలించింది. ఢిల్లీలో ఒమిక్రాన్ సామాజిక వ్యాప్తి జరుగుతున్నట్లు ఈ అధ్యయనం స్పష్టం చేస్తోంది. మూడు రకాలు... దేశంలో ఒమిక్రాన్ వేరియంట్ మూడు రకాలుగా ఉన్నట్లు ఐఎల్‌బీఎస్ చెబుతోంది. ఒమిక్రాన్ 1, 2 3 వేరియంట్లలో ప్రస్తుతం అత్యధికంగా వ్యాప్తి చెందుతున్నది మొదటి రకంగా వివరించింది. ఐఎల్‌బీఎస్ చేసిన పరిశీలనలో 264 కేసులను పరిగణనలోకి తీసుకోగా వాటిని ఒక క్రమ పద్ధతిలో ఎంపిక చేసుకొని పరిశీలన చేసినట్లు వెల్లడించింది. కోవిడ్–19 ఒమిక్రాన్ వేరియంట్ దక్షిణాఫ్రికాలో పుట్టగా... భారత్‌లోకి వ్యాప్తి చెందే క్రమం విదేశీ ప్రయాణికుల ద్వారా అని గుర్తించారు. అయితే ఐఎల్‌బీఎస్ ఎంపిక చేసుకున్న పాజిటివ్ కేసుల్లో 39 శాతం మంది మాత్రమే విదేశీ ప్రయాణ చరిత్ర ఉన్నట్లు గుర్తించగా... మిగతా 61 శాతం మంది ఎలాంటి ప్రయాణాలు చేయలేదు. ఈ వ్యాప్తి క్రమాన్ని సామాజిక వ్యాప్తిగా ఐఎల్‌బీఎస్ అంచనా వేస్తోంది. ప్రస్తుతం పరిశీలనకు తీసుకున్న నమూనాల్లో 18 ఏళ్ల నుంచి 60 ఏళ్లున్న వారు ఏకంగా 68 శాతం మంది ఉన్నారు. ఈ లెక్కన 18–60 ఏళ్ల మధ్య వారిలోనే వైరస్ వ్యాప్తి అత్యధికంగా ఉన్నట్లు స్పష్టమవుతోంది. ఇక ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందిన వారిలో 60 శాతం మందికి ఎలాంటి లక్షణాలు లేవు. కేవలం 40 శాతం మందిలో లక్షణాలు గుర్తించినప్పటికీ అవన్నీ దాదాపు స్వల్ప లక్షణాలుగా ఐఎల్‌బీఎస్ పరిశీలన చెబుతోంది. వ్యాక్సిన్‌తో ప్రొటెక్షన్... ప్రస్తుతం దేశంలో వ్యాక్సినేషన్ ప్రక్రియ అత్యంత వేగంగా సాగుతోంది. రెండు డోసుల పంపిణీ లక్ష్యం దాదాపు దగ్గరపడింది. ఈ క్రమంలో కోవిడ్ వ్యాప్తి చెందినా రిస్క్ మాత్రం తక్కువగా ఉన్నట్లు ఢిల్లీ ప్రభుత్వ గణాంకాలు చెబుతున్నాయి. జనవరి 9–12 మధ్య కరోనాతో ఢిల్లీలో 89 మంది మరణించగా వారిలో 93 శాతం మంది వ్యాక్సిన్ వేసుకోని వారిగా అక్కడి ప్రభుత్వం తెలిపింది. వ్యాక్సిన్ వేసుకోవడంతో వైరస్ వ్యాప్తి చెందినా... పెద్దగా ప్రమాదం బారినపడే అవకాశం లేదని స్పష్టమవుతోంది. ఇక గచ్చిబౌలిలోని తెలంగాణ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ (టిమ్స్)లో ప్రస్తుతం నమోదైన అడ్మిషన్ల విషయానికి వస్తే... ఐసీయూలో చేరిన వారిలో 70% మంది టీకా తీసుకోని వారిగా ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. ఒమిక్రాన్‌తో డెల్టాకు చెక్... ప్రస్తుతం ఒమిక్రాన్ వ్యాప్తి వేగంగా ఉంది. ఈ వేరియంట్‌తో పెద్దగా నష్టం లేనప్పటికీ జాగ్రత్తగా ఉండటం మంచిది. మనలో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందితే ఇకపై డెల్టా వేరియంట్ వ్యాప్తి చెందదని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా 149 దేశాల్లో ఒమిక్రాన్ వ్యాప్తి చెందుతోంది. డెల్టా వేరియంట్‌తో పోలిస్తే ఒమిక్రాన్ చిన్నపిల్లల్లో దుష్ప్రభావాలు పెద్దగా చూపట్లేదు. – డాక్టర్ కిరణ్ మాదల క్రిటికల్ కేర్ విభాగాధిపతి, నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల -
తెలంగాణలో ఆంక్షలకు వేళాయె!
సాక్షి, హైదరాబాద్: కరోనా ఒమిక్రాన్ వేరియంట్ కారణంగా కేసుల ఉధృతి పెరిగి, మూడో వేవ్ మొదలైన నేపథ్యంలో రాష్ట్రంలో ఆంక్షల విధింపునకు రంగం సిద్ధమైంది. కరోనా పరిస్థితులు, ముందు జాగ్రత్త చర్యలపై మంత్రివర్గం సోమవారం కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు అధ్యక్షతన సోమవారం మధ్యాహ్నం 2 గంటలకు ప్రగతిభవన్‌లో కేబినెట్ భేటీకానుంది. ఇందులో కరోనా అంశాలతోపాటు వ్యవసాయం, పంటల కొనుగోళ్లు తదితర అంశాలపై చర్చించనున్నారు. ఏం చేస్తే బాగుంటుంది? రాష్ట్రంలో కరోనా వ్యాప్తి, నియంత్రణ చర్యలకు సంబంధించి వైద్యారోగ్య శాఖ అధికారులతో కేబినెట్ సమీక్షించనుంది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ ఆస్పత్రుల్లో కరోనా వైద్యసేవల ఏర్పాట్లను పరిశీలించి, అవసరమైన ఆదేశాలు జారీ చేయనుంది. ఇదే సమయంలో రాష్ట్రంలో కరోనా వ్యాప్తికి అడ్డుకట్ట వేయడానికి ఏం చేస్తే బాగుంటుందన్న దానిపై సమీక్షించి పలు కీలక నిర్ణయాలు తీసుకోనుంది. ఇక కరోనా కట్టడికోసం ఇతర రాష్ట్రాల్లో అమలు చేస్తున్న విధానాలను పరిశీలించనుంది. ప్రస్తుతం ఢిల్లీలో కేసుల ఉధృతి పెరుగుతుండడంతో.. వారాంతపు కర్ఫ్యూతోపాటు రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. అక్కడ రెస్టారెంట్లు, బార్లను మూసివేసి.. కేవలం పార్శిల్ సేవలకే అనుమతి ఇచ్చారు. యూపీ, ఏపీ సహా పలు రాష్ట్రాల్లో రాత్రి కర్ఫ్యూను అమలు చేస్తున్నారు. దేశంలో ఎక్కడా పూర్తిస్థాయి లాక్డౌన్ విధించలేదు. అయితే ఇతర పెద్ద రాష్ట్రాలతో పోల్చితే రాష్ట్రంలో కరోనా కేసులు తక్కువగా ఉంటుండటం ఊరటనిచ్చే అంశమని, ఇక్కడ ఎలాంటి లాక్డౌన్ విధించే పరిస్థితులు లేవని అధికారవర్గాలు చెప్తున్నాయి. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో కేసులు ఎక్కువగా నమోదవుతుండటంతో.. నగరంలో రాత్రి కర్ఫ్యూ విధించే అంశంపై కేబినెట్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నాయి. ఇతర జిల్లాల్లో రాత్రి కర్ఫ్యూ విధించే అవకాశాలు లేవని, గతంలో రాత్రి కర్ఫ్యూ పెట్టినప్పుడు పెద్దగా ప్రయోజనం కలగలేదని గుర్తు చేస్తున్నాయి. ఒమిక్రాన్‌తో కేసులు పెరుగుతున్నా.. ఆస్పత్రుల్లో చేరికలు, మరణాలు తక్కువగా ఉండటంతో కొత్త ఆంక్షల విధింపుపై ప్రభుత్వం ఆచితూచి నిర్ణయం తీసుకోనుందని స్పష్టం చేస్తున్నాయి. అన్నిరకాల ర్యాలీలు, జన సామూహిక కార్యక్రమాలపై విధించిన నిషేధాన్ని ఈ నెలాఖరు వరకు పొడించే అవకాశాలు ఉన్నాయని అధికారవర్గాలు తెలిపాయి. మెరుగైన వైద్య చికిత్సలు, ఆస్పత్రుల్లో వైద్య సదుపాయాలు, టెస్టుల సంఖ్య పెంపు, రెండో డోసు వ్యాక్సినేషన్ 100 శాతం పూర్తి చేయడం, ఫ్రంట్ లైన్ వర్కర్లతో పాటు 65ఏళ్లుపై బడిన దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు బూస్టర్ డోసులు వేయడం, హైదరాబాద్ నలువైపులా కొత్త సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రుల నిర్మాణంలో పురోగతి వంటి అంశాలపై మంత్రివర్గం చర్చించనుందని పేర్కొన్నాయి. వ్యవసాయంపై చర్చ యాసంగిలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటల సాగు స్థితిగతులు, రైతుబంధు పంపిణీ, ధాన్యం సేకరణ వంటి అంశాలపై సోమవారం నాటి కేబినెట్ భేటీలో చర్చించే అవకాశముంది. రాష్ట్ర బడ్జెట్ 2022–23 రూపకల్పన, శాఖల వారీగా చేయాల్సిన కసరత్తు, శాసనసభ బడ్జెట్ సమావేశాల నిర్వహణ వంటి అంశాలపైనా నిర్ణయాలు తీసుకోనున్నారు. ఇక కొత్త జోనల్ విధానానికి అనుగుణంగా ఉద్యోగుల కేటాయింపులు దాదాపు పూర్తయ్యాయి. సీఎం కేసీఆర్ ఇచ్చిన హామీ మేరకు 50వేల ప్రభుత్వ ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ల కోసం నిరుద్యోగులు నిరీక్షిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగాల భర్తీపైనా చర్చించే అవకాశం ఉంది. యాదాద్రి ఆలయం ప్రారంభోత్సవ ఏర్పాట్లు, ధరణి పోర్టల్, పోడు భూములు, దళితబంధు అమలు వంటి అంశాలు సైతం చర్చకు రానున్నాయి. -
Telangana Cabinet Meet: రేపు తెలంగాణ కేబినెట్ భేటీ.. లాక్‌డౌన్‌పై ఊహాగానాలు..
-
South Africa: నో లాక్డౌన్! ఆంక్షల్లేవ్.. కరోనా వైరస్‌తో కలిసి జీవిస్తాం..
No lockdown In South Africa: కోవిడ్ 19తో కలిసి జీవించేందుకు సిద్ధంగా ఉన్నాం.. లాక్డౌన్ కానీ, క్వారంటైన్ ఆంక్షలుగానీ విధించే ప్రసక్తి లేదని దక్షిణాఫ్రికా తాజాగా మీడియాకు తెల్పింది. తొందరపాటు చర్యలకు పూనుకోకుండా మహమ్మారి వ్యాప్తికి అడ్డుకట్ట వేసేందుకు ఆచరణయోగ్యమైన నిర్ణయాలపై ప్రభుత్వం దృష్టి సారించినట్టు తెల్పింది. ఆంక్షల విధింపు పరోక్షంగా ఆర్థిక వ్యవస్థ, జీవనోపాధి, ఇతర సామాజిక అంశాలపై ప్రమాదకర ప్రభావాన్ని చూపుతున్నాయని దక్షిణాఫ్రికా వైద్య నిపుణులు జనవరి 9న తెలిపారు. ప్రపంచవ్యాప్తంగా విధించిన కోవిడ్ -19 ఆంక్షలను ప్రభుత్వం గుడ్డిగా అనుసరించకూడదని, స్థానికంగా అవి ఆచరణ యోగ్యంకాదని, అవి కేవలం నామమాత్రపు ప్రయోజనాలను మాత్రమే ఇస్తాయన్నారు. కాగా దక్షిణాఫ్రికాలో ఇప్పటివరకూ 93 వేల కోవిడ్ మరణాలు సంభవించగా, 33,60,879 మంది కోలుకున్నారు. ప్రస్తుతం 1,02,476 కోవిడ్ యాక్టీవ్ కేసులున్నాయి. మొత్తం 35 లక్షల (3.5 మిలియన్లు) కోవిడ్ 19 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గత ఏడాది నవంబర్‌లో దక్షిణాఫ్రికాలో కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వెలుగుచూసిన సంగతి తెలిసిందే! దీంతో ప్రస్తుతం దేశంలో కోవిడ్ నాలుగో వేవ్‌లో కొట్టుమిట్టాడుతోంది. కొత్త వేరియంట్ దాటికి ప్రపంచ దేశాలు గజగజలాడిపోతుంటే దక్షిణాఫ్రికా ప్రభుత్వం మరిన్ని ఆంక్షలు విధించడానికి బదులు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. అధిక స్థాయి లాక్డౌన్లకు వెళ్లకుండా, తక్షణ ఆరోగ్య ముప్పు పొంచి ఉందా? లేదా? అనే అంశంపై ప్రభుత్వం దృష్టి నిలిపిందని నిపుణులు తెలిపారు. అంతేకాకుండా ఒమిక్రాన్‌కు ముందు వచ్చిన కోవిడ్ మూడు వేవ్‌లు సహజ సంక్రమణల ద్వారా రోగనిరోధక శక్తి బలం పుంజుకుందని వారు తెలిపారు. ఒమిక్రాన్ ప్రమాదాన్ని టీ సెల్ ఇమ్యునిటీ ఎదుర్కొంటుందన్నారు. అయినప్పటికీ దేశంలో తక్కువ స్థాయిలో నమోదవుతున్న కోవిడ్ 19 పాజిటివ్ కేసులను దృష్టిలో ఉంచుకుని అధిక రిస్క్ గ్రూపుల కోసం బూస్టర్ డోస్‌లతో సహా వ్యాక్సినేషన్ ప్రక్రియలను పెంచడం, ఐసోలేషన్ వంటి ఆచరణాత్మక విధానాలను ప్రభుత్వం ఎంచుకోవాలని నిపుణులు సూచించారు. చేతి పరిశుభ్రత, థర్మల్ స్క్రీనింగ్, అవుట్డోర్ స్పోర్ట్స్ ఈవెంట్లకు అనుమతించకపోవడం, వెంటిలేషన్ లేని ఇండోర్ ప్రదేశాలలో మాస్కులు ధరించడం, తగినంత వెంటిలేషన్ ఉండేలా చర్యలు తీసుకోవడంపై అక్కడి ప్రభుత్వ దృష్టి నిలిపింది. చదవండి: కన్నీళ్లకు కరగని తాలిబన్లు! అతని కళ్ల ముందే.. -
తెలంగాణలో విద్యాసంస్థల సెలవులు పొడిగింపు
School Holidays Extended in Telangana Because Of Covid-19: తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు సెలవులు పొడిగిస్తూ సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఈ నెల(జనవరి) 30 వరకు సెలవుల్ని పొడిగించినట్లు తెలంగాణ చీఫ్‌సెక్రటరీ ప్రకటించారు. కరోనా నేపథ్యంలోనే విద్యా సంస్థలకు సెలవులు పొడిగించినట్లు తెలిపారు. జనవరి తొలి వారంలోనే కేసుల సంఖ్య గణనీయంగా పెరగడంతో సంక్రాంతి సెలవులను మూడు రోజులు ముందుకు జరిపి ఈనెల 8వ తేదీ నుంచే ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. సంక్రాతిని కలిపేసుకుని ఈనెల 16 వరకు సెలవులు ఉండగా.. 17 నుంచి విద్యా సంస్థలు తెరవాల్సి ఉంది. అయితే రాష్ట్రంలో కరోనా కేసుల సంఖ్య క్రమక్రమంగా పెరుగుతున్న నేపథ్యంలో నెలాఖరు వరకు సెలవులు పొడిగించాలని కేసీఆర్ సర్కార్ నిర్ణయించినట్లు సమాచారం. అన్ని విద్యాసంస్థలకు ఈ సెలవులు వర్తిస్తాయని స్పష్టత ఇచ్చింది సర్కార్. ఇక రాష్ట్రంలో కరోనా ఆంక్షలను 20వ తేదీకి వరకు ప్రభుత్వం పొడిగించిన నేపథ్యంలో.. విద్యా సంస్థలకు సెలవులు కూడా పొడిగించాలని వైద్య,ఆరోగ్య శాఖ ప్రభుత్వానికి సూచించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే తెలంగాణలో తాజాగా ఒక్కరోజులో 1,963 కొత్త కేసులు నమోదు కాగా, యాక్టివ్ కేసుల సంఖ్య 22, 017గా ఉంది. -
ఐదు రాష్ట్రాల ఎన్నికలు.. ఈసీ ఆంక్షల పొడగింపు
కరోనా, ఒమిక్రాన్ వేరియంట్ విజృంభణ వేళ.. కేంద్ర ఎన్నికల సంఘం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఎన్నికల ర్యాలీలు, రోడ్ షో లు, సభలపై జనవరి 22 వరకు నిషేధం కొనసాగుతుందని ప్రకటించింది. శనివారం ఐదు రాష్ట్రాలలో కరోనా పరిస్థితిని కీలక సమావేశంలో సమీక్షించిన కేంద్ర ఎన్నికల సంఘం ఈ మేరకు నిర్ణయం తీసుకుంది. ఫిజికల్ ర్యాలీలు, రోడ్‌షోలపై నిషేధం కొనసాగుతుందని తెలిపింది. ఇక 300 మందితో ఇండోర్(క్లోజ్డ్) సభలకు అనుమతి ఇస్తూ.. హాల్ కెపాసిటీ లో 50% మందితో సభ నిర్వహించుకోవచ్చని పార్టీలకు అనుమతి ఇచ్చింది ఈసీ. రాజకీయ పార్టీలన్నీ కరోనా ప్రోటోకాల్, ఎన్నికల కోడ్ కచ్చితంగా పాటించాలని ఆదేశించింది. ఎన్నికలు జరగాల్సిన ఉత్తరప్రదేశ్, ఉత్తరాఖండ్, పంజాబ్, మఇిపూర్, గోవాలో కరోనా కల్లోలం కలకలం రేపుతోంది. భారీ ఎత్తున నమోదవుతున్న కేసులు ఆయా రాష్ట్రాల్లో. దీంతో ఎన్నికల సంఘం తాజాగా ఐదు రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్ ప్రకటించే క్రమంలో ఆయా చోట్ల ఎన్నికల బహిరంగ సభలు, ర్యాలీలపై జనవరి 15 వరకూ నిషేధం విధిస్తున్నట్లు ప్రకటించింది. తర్వాత పరిస్దితిని బట్టి తుది నిర్ణయం తీసుకుంటామని వెల్లడించింది. దీంతో ఇవాళ నిషేధంపై సమీక్ష నిర్వహించి.. పొడగింపు నిర్ణయం వెల్లడించింది. ఐదు రాష్ట్రాలలో అసెంబ్లీ ఎన్నికలు ఫిబ్రవరి 10 నుంచి మార్చి 7 వరకు ఏడు దశల్లో జరుగుతాయి. పంజాబ్, ఉత్తరాఖండ్, గోవాలలో ఫిబ్రవరి 14న ఒకే దశలో ఎన్నికలు జరగనున్నాయి. మణిపూర్‌లో మాత్రం ఫిబ్రవరి 27, మార్చి 3 తేదీల్లో రెండు దశల్లో ఓటింగ్ జరగనుంది. ఫిబ్రవరి 10, మార్చి 7 మధ్య ఉత్తరప్రదేశ్ ఏడు దశల్లో 403 ఎమ్మెల్యేలను ఎన్నుకోనుంది. ఓట్ల లెక్కింపు మొత్తంగా మార్చి 10న జరగనుంది. -
మరో 2.64 లక్షల కేసులు
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా సంక్రమణ వేగం ప్రతిరోజూ మరింతగా పుంజుకుంటోంది. గత 24 గంటల్లో ఏకంగా 2,64,202 కొత్త కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 3,65,82,129కు చేరుకుంది. వీటిలో 5,753 ఒమిక్రాన్ కేసులు ఉన్నాయి. గత 220 రోజుల్లో లేనంతగా యాక్టివ్ కేసులు 12,72,073కు పెరిగాయి. మరో 315 మంది కోవిడ్‌తో కన్నుమూశారు. దీంతో మొత్తం కోవిడ్ బాధితుల మరణాల సంఖ్య 4,85,350కు ఎగబాకింది. రికవరీ రేటు 95.20 శాతానికి తగ్గింది. రోజువారీ పాజిటివిటీ రేటు గణనీయంగా 14.78 శాతానికి పెరిగింది. మరణాల రేటు 1.33 శాతంగా నమోదైంది. దేశవ్యాప్తంగా ఇప్పటిదాకా 155.39 కోట్ల కోవిడ్ టీకాలను కేంద్రం పంపిణీచేసింది. ఇప్పటిదాకా 3,48,24,706 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. మరోవైపు ఢిల్లీలో పాజిటివిటీ రేటు ఆందోళనకర స్థాయిలో 29.21 శాతానికి పెరిగింది. గత 24 గంటల్లో 24వేలకుపైగా కేసులులొచ్చాయి. మహారాష్ట్రలో 43వేలకుపైగా కేసులు నమోదయ్యాయి. -
ఉగాది దాకా జాగ్రత్త!
కరోనా విజృంభణకు చెక్ పెట్టాలంటే.. సంక్రాంతి నుంచి ఉగాది దాకా జాగ్రత్తగా ఉండాల్సిందేనని ప్రముఖ వైద్యుడు, పబ్లిక్‌హెల్త్ ఫౌండేషన్ ఆఫ్ ఇండియా (పీహెచ్ఎఫ్ఐ) అధ్యక్షుడు కె.శ్రీనాథ్‌రెడ్డి స్పష్టం చేశారు. స్వీయ నియంత్రణ చాలా ముఖ్యమని.. మాస్కులు, భౌతికదూరం వంటి కోవిడ్ నిబంధనలు పాటించాలని సూచించారు. ప్రస్తుతం ముంబై, ఢిల్లీ వంటి నగరాల్లో పాజిటివ్ కేసులు తగ్గుతున్నా.. ఈ నెలాఖరు దాకా ఇదే పరిస్థితి కొనసాగితేనే కరోనా తగ్గుముఖం పట్టినట్టు భావించాలని చెప్పారు. కొద్దిపాటి ఆంక్షలు విధిస్తే సరిపోతుందని, లాక్డౌన్ అవసరం లేదని పేర్కొన్నారు. ప్రస్తుత కరోనా పరిస్థితుల నేపథ్యంలో శ్రీనాథ్‌రెడ్డి ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఆ విశేషాలు.. – సాక్షి, హైదరాబాద్ సాక్షి: ప్రస్తుత కరోనా పరిస్థితి ఎలా ఉందంటారు? డాక్టర్ శ్రీనాథ్: కేవలం పాజిటివ్ కేసుల సంఖ్య కాకుండా.. సీరియస్ అయ్యే వారి ఆధారంగా అంచనా వేయాలి. ప్రస్తుతం మొత్తం కేసుల్లో 5–10 శాతం మధ్యలోనే ఆస్పత్రుల్లో చేరుతున్నట్టు తేలింది. ఇప్పుడు తీవ్ర పరిస్థితులు లేకపోయినా.. కరోనాను తక్కువగా అంచనా వేయొద్దు. ఎక్కువ మంది డాక్టర్లు, వైద్య సిబ్బందికి వైరస్ సోకి ఐసోలేషన్‌కు వెళ్లాల్సి వస్తోంది. దీనితో వైద్యసేవలకు అంతరాయం ఏర్పడుతోంది. రాబోయే రోజుల్లో చాలా మందికి పాజిటివ్ రావొచ్చు. ఒమిక్రాన్ వేరియంట్ ముక్కు, గొంతులోనే ఎక్కువగా పెరుగుతోంది. ఊపిరితిత్తుల్లోకి వ్యాప్తి చెందే అవకాశాలు తక్కువ. అందువల్ల తీవ్ర వ్యాధిగా మారకపోవచ్చు. కానీ వృద్ధులు, తీవ్ర అనారోగ్య సమస్యలున్న వారిపై ప్రభావం చూపే అవకాశాలున్నాయి. మూడో వేవ్ ఎప్పటికల్లా పీక్కు వెళ్లొచ్చు? ►అందరూ నిబంధనలు పాటిస్తే జనవరి చివరి వరకల్లా కేసులు తగ్గిపోవచ్చు. అజాగ్రత్తగా ఉంటే ఫిబ్రవరి దాకా పెరగవచ్చు. ప్రస్తుతం పెద్ద నగరాల్లో కేసులు తగ్గుముఖం పట్టే సూచనలున్నాయి. చిన్న పట్టణాలు, గ్రామీణ ప్రాంతాల్లో పరిస్థితులపై స్పష్టత రాలేదు. సంక్రాంతి, ఇతర సెలవులంటూ ఇష్టారీతిన ప్రయాణాలు చేస్తే అక్కడా కేసులు పెరుగుతాయి. అత్యవసరమైతేనే ప్రయాణం చేయాలి. పండుగలు, పబ్బాలను ఇళ్లలో, కుటుంబ సభ్యుల మధ్యే జరుపుకోవడం మంచిది. యూఎస్, ఇతర దేశాల వంటి పరిస్థితి వస్తుందా? ►నిజానికి అమెరికాలో డెల్టా వ్యాప్తే ఇంకా ముగియలేదు, పైగా ఒమిక్రాన్ విజృంభణతో కేసులు పెరుగుతున్నాయి. అదీగాక అక్కడ 60శాతం మంది ఒక్క డోసే తీసుకున్నారు. అక్కడ ఆస్పత్రుల్లో చేరుతున్న వారిలో చాలా వరకు వ్యాక్సిన్ తీసుకోని వారే. అందువల్ల అమెరికా పరిస్థితి వేరు. ఇక పశ్చిమ దేశాల ప్రభావం మన దేశంపై ఎలా ఉంటుందో ఇప్పుడే చెప్పలేం. తొలివేవ్ సమయంలో ఆల్ఫా వేరియెంట్ మనకు ఆలస్యంగా వచ్చింది. రెండో వేవ్‌లో డెల్టా వేరియంట్ ముందు మన దగ్గర వచ్చాకే.. యూఎస్, ఇతర దేశాల్లో ప్రభావం చూపింది. ప్రస్తుతం ప్రభుత్వాలు తీసుకోవాల్సిన చర్యలేంటి? ►సరైన మాస్కులు పెట్టుకుంటే కరోనా ప్రమాదం చాలా వరకు తగ్గుతుంది. రెండు, మూడు పొరల క్లాత్ మాస్కులు వాడాలి. క్లాత్ మాస్కు, సర్జికల్ మాస్కు కలిపి పెట్టుకుంటే మంచిది. పేదలు, అల్పాదాయ వర్గాలు మాస్కులపై డబ్బులు ఖర్చుపెట్టలేక.. సాధారణ మాస్కులతోనే ఉంటే వైరస్ బారినపడతారు, వ్యాప్తి పెరుగుతుంది. అందువల్ల వారికి ప్రభుత్వాలే ఉచితంగా సర్జికల్, ఇతర మాస్కులు అందజేయాలి. ఒమిక్రానే చివరి వేరియెంట్ అనుకోవచ్చా? ►ఒమిక్రానే కరోనా చివరి వేరియెంట్ అనుకుంటే.. అత్యధిక మందికి సోకి ఇమ్యూనిటీ రావొచ్చు. రెండు, మూడు నెలల్లోగా ప్రపంచవ్యాప్తంగా పరిస్థితులు కుదుటపడొచ్చు. కానీ మరోవేరియెంట్ వచ్చే ప్రమాదం లేదని చెప్పలేం. అందువల్ల కనీసం ఏప్రిల్‌దాకా జాగ్రత్తలు పాటించాలి. -
ఒమిక్రాన్ బలం మన బలహీనతే!
సాక్షి, అమరావతి: ‘డెంగ్యూ, మలేరియా, ఇన్‌ఫ్లూయాంజాతో నేటికీ మరణాలు సంభవిస్తున్నాయి. రోగ నిరోధకత బలహీనంగా ఉన్న వారిపై వీటి ప్రభావం ఉంటోంది. ఇదే తరహాలో కరోనా వైరస్ కొత్త వేరియంట్ల రూపంలో బలహీన రోగ నిరోధకత ఉన్న వారిపై తీవ్ర ప్రభావం చూపుతోంది’ అని సెంటర్ ఫర్ సెల్యూలార్ అండ్ మాలిక్యులర్ బయాలజీ (సీసీఎంబీ) డైరెక్టర్ డాక్టర్ వినయ్ నందికూరి తెలిపారు. కరోనా మూడో దశ వ్యాప్తి, ఒమిక్రాన్ ప్రభావంపై పలు అంశాలను ఆయన ‘సాక్షి’ ప్రతినిధికి వివరించారు. సీసీఎంబీలో ఏపీ నమూనాలను జీనోమ్ సీక్వెన్సింగ్ చేస్తున్నారు. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ తీవ్రత ఎలా ఉంది? డెల్టాతో పోలిస్తే ప్రస్తుతం వ్యాపిస్తున్న ఒమిక్రాన్ వైరస్ బలహీనంగా ఉంది. డెల్టా వైరస్ శరీరంలోకి వేగంగా ప్రవేశించడంతో పాటు స్పైక్ ప్రోటీన్‌తో కణాలపై దాడి చేస్తుంది. రిప్లికేషన్ (ఉత్పాదక సామర్థ్యం) బాగా ఉంటుంది. ప్రస్తుతం ఒమిక్రాన్ వేగంగా వ్యాíపిస్తున్నా డెల్టా అంత తీవ్రతతో దాడి చేయడం లేదు. రిప్లికేషన్ తగ్గింది. వైరస్ ఎండమిక్ దశకు చేరుకున్నట్లేనా? డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వేరియంట్లో వైరస్ క్షీణించింది. దీన్ని ఆధారంగా చేసుకుని వైరస్ ఎండమిక్ దశకు చేరిందని భావించలేం. భవిష్యత్‌లో బలమైన లక్షణాలతో వైరస్ రూపాంతరం చెందవచ్చేమో చెప్పలేం. ఇన్‌ఫ్లూయాంజా దేశంలోకి వచ్చినప్పుడు ఎన్ని రోజులు ఉందో తెలిసిందే. కేసుల నమోదు ఎప్పటిలోగా తారస్థాయికి చేరవచ్చు? మన దేశంలో ప్రస్తుతం పాండమిక్ దశలో ఉన్నాం. ఈ దశలో సాధారణంగా ప్రతి మూడు రోజులకు కేసుల నమోదు రెట్టింపు అవుతూ వస్తుంది. ఈ నెలాఖరు, ఫిబ్రవరి మొదటి వారంలో కేసుల నమోదు తారస్థాయికి చేరుతుంది. పాజిటివిటీ రేటు పెరిగే కొద్దీ ఆసుపత్రులపై ఒత్తిడి పెరుగుతుంది. ప్రస్తుతం అమెరికాలో ఇదే జరుగుతోంది. బలహీన రోగనిరోధకత ఉన్న వారిపై ఒమిక్రాన్ వైరస్ తీవ్ర ప్రభావం చూపుతోంది. ఒమిక్రాన్ + డెల్టా కేసులు నమోదయ్యాయా? ఇప్పటివరకూ మేం పరీక్షించిన నమూనాల్లో ఒమిక్రాన్ + డెల్టా కేసులు నమోదవలేదు. కేవలం ఒమిక్రాన్ కేసులు మాత్రమే ఉంటున్నాయి. టీకాల నుంచి రక్షణ ఉంటోందా? గతంలో వైరస్ సోకడం, టీకాలు తీసుకోవడం వల్ల వచ్చిన రోగనిరోధకతను దాటుకుని ఒమిక్రాన్ వేరియంట్ శరీరంలోకి ప్రవేశిస్తోంది. గతంలో వైరస్‌తో పరిచయం ఉండటం, టీకాలు తీసుకుని ఉండటం వల్ల టీ సెల్స్ కొంత రక్షణగా ఉంటున్నాయి. బలహీన రోగ నిరోధకత ఉండే వృద్ధులు, రోగులకు చికిత్స అందించే వైద్యులు, వైద్య సిబ్బంది, ఇతరులకు ప్రభుత్వం ప్రికాషన్ డోసు అందిస్తోంది. అర్హులైన వారంతా ప్రికాషన్ డోసు తీసుకోవాలి. ప్రికాషన్ డోసు కింద ఏ వ్యాక్సిన్ వేసుకోవాలి? విదేశాల్లో మొదటి రెండు డోసులు కింద తీసుకున్న టీకా కాకుండా వేరే రకం టీకాను ప్రికాషన్ డోసు కింద ఇస్తున్నారు. ఇలా తీసుకోవడం వల్ల ఇబ్బందులు ఏమీ ఉండవు. మన దేశంలో మాత్రం మొదటి రెండు డోసులు ఏ టీకా తీసుకుంటే ప్రికాషన్ డోసుగా అదే టీకాను పంపిణీ చేస్తున్నారు. కాబట్టి మొదటి రెండు డోసుల కింద ఏ టీకా తీసుకుంటే అదే టీకాను ప్రికాషన్ డోసు కింద పొందాలి. -
అప్రమత్తతే ఆయుధం!
ప్రపంచవ్యాప్తంగా పెరుగుతున్న కరోనా కేసులు మరోసారి పారాహుషార్ అంటున్నాయి. అమెరికా, ఫ్రాన్స్, ఇటలీ, స్పెయిన్, అర్జెంటీనా అధిక శాతం కేసులతో అతలాకుతలమవుతున్నాయి. మునుపటి కరోనా వేరియంట్ల కన్నా అనేక రెట్ల వేగంతో వ్యాపిస్తున్న ఒమిక్రాన్ దెబ్బతో ప్రపంచ వ్యాప్తంగా కేసులు వారం క్రితమే 30 కోట్లు దాటేశాయి. అన్ని దేశాల్లో కలిపి సగటున రోజూ 20 లక్షల పైగా కొత్త కేసులొస్తున్నాయి. అమెరికాలో ఒకే రోజు ప్రపంచ రికార్డు స్థాయిలో 13.5 – 15 లక్షల దాకా కేసులు రావడం అక్కడి తీవ్రతకు దర్పణం. నూరేళ్ళ క్రితం 1918లో వచ్చిన స్పానిష్ ఫ్లూతో 5 కోట్ల మంది ప్రాణాలు కోల్పోగా, కరోనా ఈ రెండేళ్ళలో 55 లక్షల పైచిలుకు మందిని పొట్టనబెట్టుకుంది. ఒక్క భారత్‌లోనే మరణాలు 5 లక్షలకు చేరువవుతున్నాయని గణాంకాలు. పరీక్షలు అంతంత మాత్రంగా చేస్తున్నా, తాజా మూడో వేవ్‌లో మనదేశంలోనూ ఒకే రోజున కేసుల నమోదు 2.5 లక్షలకు ఎగబాకడం గమనార్హం. గత మే తర్వాత ఈ స్థాయిలో కేసులు రావడం ఇదే తొలిసారి. అందుకే, రానున్న పండుగలు, ఉత్సవాల నేపథ్యంలో అప్రమత్తత అవసరమని ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం గుర్తు చేసింది. డెల్టాతో పోలిస్తే ఒమిక్రాన్ వల్ల మరణాలు ప్రపంచవ్యాప్తంగా తక్కువే అంటున్నా, భారీ సంఖ్యలో కేసులు వస్తుండడంతో అమెరికా సహా అన్నిచోట్లా ఆరోగ్య వ్యవస్థలపై ఒత్తిడి పడుతోంది. మన దేశం మొత్తం మీద డిసెంబర్ ఆఖరులో 1.1 శాతమే ఉన్న పాజిటివిటీ రేటు ఇప్పుడు 11 శాతం దాటేసింది. 300 జిల్లాల్లో వారం వారీ పాజిటివిటీ రేటు పైపైకి పాకేస్తోంది. పార్లమెంటు సిబ్బంది కావచ్చు, పోలీసులు కావచ్చు, ఉస్మానియా – గాంధీ లాంటి ఆస్పత్రుల్లో డాక్టర్లు కావచ్చు, ఐఐటీ హైదరాబాద్‌లో విద్యార్థులు కావచ్చు – ఒక్కసారిగా పదులు, వందల సంఖ్యలో కరోనా బారిన పడుతున్నట్టు వస్తున్న వార్తలు ఆందోళనకరం. టీకా రెండు డోసులు వేసుకున్నా సరే, జన సమూహాలతో కలసి తిరగడం, అశ్రద్ధ వహించడం కారణాలవుతున్నాయి. అందుకే, కేంద్రం తాజా పరిస్థితిపై దృష్టి పెట్టింది. ఆస్పత్రుల్లో 2 రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వలు ఉంచుకోమంది. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ప్రధాని మోదీ గురువారం సమీక్షా సమావేశం జరపాల్సి వచ్చింది. ఇప్పటికైతే మన దగ్గర ఆస్పత్రి పాలవుతున్న రోగులు, మరణాలు, ఆక్సిజన్ అవసరం అన్నీ తక్కువగానే ఉండడం ఓ శుభవార్త. అది చూసి, చాలామంది తాజా వేరియంట్‌ను సాధారణ జలుబుగా భావించి, అశ్రద్ధ చేస్తున్నారు. అదో ఇబ్బంది. ఒమిక్రాన్‌ను మామూలు జలుబు లాగా భావిస్తే తిరకాసేనని నీతి ఆయోగ్ సభ్యుడు డాక్టర్ వీకే పాల్ హెచ్చరించాల్సి వచ్చింది. కాగా, దేశంలో విజృంభిస్తున్న ఈ కరోనా మూడో వేవ్ మరో 2 నుంచి 8 వారాల్లో గరిష్ఠ స్థాయికి చేరుతుందని నీతి ఆయోగ్ అంచనా. అందరూ అప్రమత్తం కావాల్సిన మాట అది. పరిస్థితులు ఇలా ఉన్నా సరే, పార్టీలు పాదయాత్రలనూ, ప్రభుత్వాలు ధార్మిక ఉత్సవాలనూ కొనసాగిస్తూ, ప్రజల ప్రాణాల కన్నా ఓటు బ్యాంకు రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తుంటే ఏమనాలి? 44 శాతం మేర కేసులు పెరిగిన కర్ణాటకలో కాంగ్రెస్ నేతలు వేలాది జనంతో చేపట్టిన పాదయాత్ర ఇందుకు ఓ మచ్చుతునక. చివరకు అధిష్ఠానం జోక్యంతో గురువారం ఆ యాత్రకు బ్రేకు పడింది. భారత్‌లో కరోనాకు టీకా మొదలుపెట్టి, మరో మూడు రోజుల్లో ఏడాది పూర్తవుతోంది. ఇప్పటి వరకు దేశంలోని అర్హులలో 92 శాతానికి ఒక డోస్ వేయగలగడం సంతోషకరమే. కానీ, ఇప్పటికీ రెండో డోసు పూర్తి కాని వారి సంఖ్య గణనీయం. 15 నుంచి 18 ఏళ్ళ వారికి ఈ నెల 3న మొదలుపెట్టాక, 3 కోట్ల మందికి టీకాలేయడం బాగానే ఉంది. నిర్ణయం కాస్తంత ఆలస్యమైతేనేం... వృద్ధులకూ, ఇతర వ్యాధిపీడితులకూ ‘ముందు జాగ్రత్త’ మూడో డోసూ వేస్తున్నాం. కానీ, అనేక లోటుపాట్లున్నాయి. దేశంలోని 13.7 కోట్ల మంది సీనియర్ సిటిజన్లకు టీకాలేయాలనుకుంటే, ఇప్పటికీ 1.2 కోట్ల మందికి కనీసం ఒక డోసైనా పడలేదు. 15 ఏళ్ల లోపు పిల్లలకు ఇంకా టీకాల్లేవు. దేశంలో ఉండవలసిన దాని కన్నా 10 లక్షల మంది తక్కువ డాక్టర్లున్నారు. ఇలాంటి చోట ఆరోగ్య వ్యవస్థ కుప్పకూలితే అంతే సంగతులు. కాబట్టి, ఆ పరిస్థితి రాకుండా చూసుకోవడమే తెలివైన పని. ఆఫ్రికా లాంటి దేశాల్లో 20 శాతం జనాభాకే టీకాలందితే, అల్పాదాయ దేశాల్లో నేటికీ 10 శాతం కన్నా తక్కువ మందికే ఒక డోసు టీకా పడిందన్నది గమనార్హం. డెల్టా, ఒమిక్రాన్‌ల వెంట కొత్తగా డెల్టాక్రాన్ పేరు ప్రపంచంలో వినపడుతున్న ప్రస్తుత పరిస్థితుల్లో అన్ని జాగ్రత్తలూ తీసుకోక తప్పదు. ముందు జాగ్రత్త, కరోనా నిరోధంలో క్రియాశీలత, సమష్టి పోరాటం ముఖ్యమన్న మోదీ మాటలు మదిలో నిలుపుకోవాల్సినవే. కోవిడ్‌తో ప్రపంచ ఆర్థిక వ్యవస్థ దాదాపు 3 లక్షల కోట్ల డాలర్లు (రూ. 223 లక్షల కోట్లు) నష్టపోతుందని లెక్కిస్తున్న వేళ మన ఆర్థిక వ్యవస్థ పూర్తి లాక్‌డౌన్‌ను భరించే పరిస్థితి లేదు గనక, స్థానికంగా మైక్రో కంటైన్మెంట్ జోన్లతో వ్యాప్తిని అరికట్టడం ముఖ్యం. ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రిసెర్చ్‌లు ఘడియకో మాట, పూటకో ప్రోటోకాల్ చెబుతున్న వేళ మన చేతిలోనే ఉన్న అస్త్రాలైన మాస్కులు ధరించడం, టీకా వేయించుకోవడంలో అలక్ష్యం అసలే వద్దు. ఎందుకంటే, మనం ఊహించని రీతిలో ప్రవర్తిస్తూ, విరుచుకు పడడమే జిత్తులమారి వైరస్ల లక్షణం. నూరేళ్ళ క్రితంతో పోలిస్తే నాలుగు రెట్లు ఎక్కువ జనాభాతో, ప్రపంచమే ఓ కుగ్రామమైన వేళ జాగ్రత్తగా ఉండాల్సింది మనమే! -
కరోనా ఉధృతి.. రాష్ట్ర సీఎంలతో మోదీ వీడియో కాన్ఫరెన్స్
-
చుట్టేస్తోంది.. జాగ్రత్త: ప్రధాని మోదీ
న్యూఢిల్లీ: అనూహ్య వేగంతో సోకుతున్న ఒమిక్రాన్ వేరియంట్ విషయంలో దేశం మరింత అప్రమత్తతో ముందుకెళ్లాలని ప్రధాని మోదీ మరోమారు హెచ్చరించారు. అన్ని రాష్ట్రాల్లో ప్రజారోగ్య వ్యవస్థల సంసిద్ధత, కోవిడ్ వ్యాక్సినేషన్‌పై అత్యున్నతస్థాయి సమీక్షలో భాగంగా ప్రధాని మోదీ గురువారం అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడారు. గత 236 రోజుల్లో ఎన్నడూలేని గరిష్ట స్థాయిలో 2,47,417 కొత్త కేసులు నమోదైన రోజే ప్రధాని నేతృత్వంలో ఈ వర్చువల్ భేటీ జరగడం పరిస్థితి తీవ్రతకు అద్దం పడుతోంది. జిల్లా స్థాయిలో మౌలిక వైద్య సదుపాయాలను మెరుగుపరచాలని, యుద్ధప్రాతిపదికన కోవిడ్ టీకా కార్యక్రమాన్ని కొనసాగించాలని మోదీ సూచించారు. ప్రతీ రాష్ట్రంలోని ఆరోగ్య పరిస్థితులను నేరుగా తెల్సుకునేందుకు, ఆయా రాష్ట్రాల్లో అవలంబిస్తున్న ఆదర్శవంతమైన వైద్య విధానాలపై అవగాహన పెంచుకునేందుకే సీఎంలతో భేటీ నిర్వహించినట్లు ప్రధాని చెప్పారు. సీఎంలతో భేటీలో ప్రధాని చేసిన హెచ్చరికలు, ఇచ్చిన సూచనలు ఆయన మాటల్లో.. వేగంగా విస్తరిస్తోంది భయాలను నిజం చేస్తూ భారత్‌లో ఒమిక్రాన్ వేరియంట్ ఎక్కువ వేగంతో విస్తరిస్తోంది. గత వేరియెంట్ల కంటే కొన్నిరెట్లు ఎక్కువ వేగంగా వ్యాప్తిస్తోంది. అయితే, రాష్ట్ర ప్రభుత్వాలు తీవ్రమైన కోవిడ్ ఆంక్షలు అమలుచేస్తూనే ఆ కఠిన చర్యలు.. దేశ ఆర్థికవ్యవస్థ, ప్రజల జీవనాన్ని దెబ్బతీయకుండా చూసుకోవాలి. స్థానికంగా కంటైన్మెంట్పై దృష్టిపెట్టండి. కోవిడ్‌తో పోరాడుతున్న మనం.. భవిష్యత్తులో మరిన్ని వేరియంట్లను ఎదుర్కొనేందుకు సంసిద్ధంగా ఉండాలి. భయపడాల్సిన పనిలేదు.. ఆయుధముంది ఒమిక్రాన్ వంటి కొత్త వేరియంట్లతో ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. అప్రమత్తత విషయంలో నిర్లక్ష్యం వద్దు. వేరియంట్ ఏదైనా సరే వాటిని ఎదుర్కొనేందుకు కోవిడ్ టీకాల రూపంలో మనకు సరైన ఆయుధాలు సిద్ధంగా ఉన్నాయని ఎందరో ప్రపంచ వైద్య నిపుణులు భరోసా ఇస్తున్నారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేయాలి. అమెరికాలో రోజుకు దాదాపు 14 లక్షల కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఈ తరుణంలో మనం అన్నివేళలా అప్రమత్తంగా ఉండాల్సిందే. నివారణ, సమిష్టి కార్యాచరణ మరింతగా కేసులు పెరగకుండా అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కోవిడ్ నివారణ చర్యలకు అధిక ప్రాధాన్యతనివ్వాలి. స్థానికంగా కంటైన్మెంట్ ప్రణాళికకు పదునుపెట్టాలి. దేశంలో కోవిడ్ టీకాకు అర్హులైన జనాభాలో 92 శాతం మందికి తొలి డోస్ ఇవ్వడం పూర్తయింది. దాదాపు 70 శాతం మంది రెండో డోస్ సైతం తీసుకున్నారు. కేవలం 10 రోజుల్లోనే దాదాపు మూడు కోట్ల మంది టీనేజర్లకు టీకాలు ఇచ్చాం. 100 శాతం వ్యాక్సినేషన్ సాకారమయ్యేలా ఇంటింటికీ టీకా (హర్ ఘర్ దస్తక్) కార్యక్రమాన్ని మరింతగా విస్తృతం చేయాలి. -
వామ్మో ఒమిక్రాన్ ! కరోనాతో చైనాలో పరిస్థితి చేజారుతోందా ?
కరోనా విషయంలో బయటి ప్రపంచానికి చైనా చెప్పేదొకటి.. క్షేత్రస్థాయిలో జరిగేదొకటి. కరోనా వ్యాప్తి ఇప్పటికీ కంట్రోల్లోనే ఉందంటూ చైనా చెబుతున్నా వాస్తవ పరిస్థితులు వేరుగా ఉన్నాయి. చైనాలో కరోనా తీవ్రతను తెలిపే సంఘటనలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. తాజాగా ఫోక్స్ వ్యాగన్ తీసుకున్న నిర్ణయం కూడా వాటి సరసన చేరింది. చైనా యూనిట్లు ప్రపంచలో అతి పెద్ద కార్ల తయారీ కంపెనీగా పేరుంది జర్మన్ కార మేకర్ ఫోక్స్ వ్యాగన్కి. ఈ కంపెనీకి ప్రపంచ వ్యాప్తంగా అనేక దేశాల్లో కార్ల తయారీ యూనిట్లు ఉన్నాయి. చైనాలోని టియాన్జిన్ నగరంలో ఫోక్స్ వ్యాగన్ కంపెనీకి కార్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్‌తో పాటు కార్ల తయారీలో వినియోగించే విడిభాగాలు తయారు చేసే ఫ్యాక్టరీ ఉంది. ప్రమాదకరంగా ఒమిక్రాన్ వ్యాప్తి పెరిగినప్పటి నుంచి ఫ్యాక్టరీలో ఫోక్స్ వ్యాగన్ కంపెనీ కోవిడ్ జాగ్రత్తలు తీసుకుంటోంది. అయితే ఒక్కసారిగా చైనాలో కేసుల సంఖ్య అనూహ్యంగా పెరిగిపోవడంతో ఫోక్స్ వ్యాగన్ యాజమాన్యం ఆందోళన చెందింది. దానికి తగ్గట్టే ఫోక్స్‌వ్యాగన్ యూనిట్లలో పని చేస్తున్న ఉద్యోగులు, కార్మికులు కోవిడ్ బారిన పడ్డారు. బుధవారం నాటికి 30 మందికి కరోనా నిర్థారణ కాగా గురువారం మరో 41 మందిలో కోవిడ్ లక్షణాలు కనిపించాయి. కఠిన నిర్ణయం ఊహించని వేగంతో ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండటంతో టియాన్జిన్ నగరంలో ఉన్న కార్ మాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్, కాంపోనెంట్ ఫ్యాక్టరీ రెండింటిని మూసేస్తున్నట్టు గురువారం ఫోక్స్‌వ్యాగన్ ప్రకటించింది. చైనాలోని తమ యూనిట్లలో కోవిడ్ ప్రవేశించింది. ఇప్పటికే కోవిడ్ లక్షణాలు ఉన్న యాభై మందికి పైగా శాంపిల్స్ ల్యాబ్‌కి పంపించాం. ముందు జాగ్రత్త చర్యగా ఇక్కడి ప్లాంట్లలో కార్యకలాపాలు నిలిస్తున్నామని ఫోక్స్‌వ్యాగన్, చైనా ప్రతినిధి తెలిపారు. ఔ చదవండి: ఎక్కడ నుంచైనా పనిచేయండి..! తిరిగేందుకు రూ. లక్ష మేమిస్తాం..! -
ఉద్యోగులకు గుడ్‌న్యూస్.. ఐటీ కంపెనీల కీలక నిర్ణయం!
కరోనా మహమ్మారి ముచ్చటగా మూడోసారి కూడా కోరలు చాస్తోంది. ఫలితంగా ప్రపంచవ్యాప్తంగా భారీగా కేసులు నమోదవుతున్నాయి. భారత్‌లో రోజుకు రెండు లక్షల కేసులు రావడం గమనార్హం. దేశంలో కూడా ఓమిక్రాన్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతుండంతో ఈ కొత్త సంవత్సరంలో కూడా ఐటీ ఉద్యోగులు, కేంద్ర ప్రభుత్వ ఇంటి నుంచే పనిచేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. దేశవ్యాప్తంగా అనేక కంపెనీలు వర్క్ ఫ్రమ్ హోమ్ విధానాన్ని మళ్లీ ప్రారంభించాయి. ఈ ఏడాది చివరి వరకు ఉద్యోగులు ఇంటి నుంచి పని చేయాల్సిన పరిస్థితి ఏర్పడవచ్చు అని నిపుణులు చెబుతున్నారు. ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మేజర్ కాగ్నిజెంట్ నుంచి ప్రధాన ఈ-కామర్స్ సంస్థలు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వరకు ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయలని అభ్యర్థించాయి. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్)తో సహా చాలా ఐటీ సంస్థలు జనవరి నుంచి 50-70 శాతం సిబ్బందితో ఆఫీస్ ఓపెన్ చేయలని ఇంతకు ముందు నిర్ణయించాయి. అయితే, కొత్త కోవిడ్-19 వేరియంట్ ఓమిక్రాన్ రాకెట్ వేగంతో పెరుగుతుండటంతో దేశ రాజధానితో సహా వివిధ రాష్ట్రాల్లో హైబ్రిడ్ వర్కింగ్ మోడల్‌ను అమలు చేస్తున్నాయి. ఢిల్లీ జిల్లా విపత్తు నిర్వహణ అథారిటీ(డీడీఎమ్ఏ) జనవరి 11న విడుదల చేసిన మార్గదర్శకాల ప్రకారం.. అన్ని ప్రైవేటు ఆఫీసులు మూసివేయాలి. కార్యాలయాల్లో కేవలం అత్యవసరమైన విధులకు మాత్రమే కంపెనీలు పనిచేయాలని డీడీఎమ్ఏ సూచించింది. మిగిలిన వారికి రిమోట్ వర్క్ సదుపాయాన్ని ఇవ్వాలని స్పష్టం చేసింది. ఒకే బాటలో టీసీఎస్, ఇన్ఫోసిస్, హెచ్‌సీఎల్.. దేశంలోని అతిపెద్ద ఐటీ సేవల సంస్థ టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్(టీసీఎస్) గత నెలలో తన ఉద్యోగులలో 90 శాతం మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారని తెలిపింది. మా ఉద్యోగులు, కాంట్రాక్టర్లు, కుటుంబాలు, క్లయింట్ల ఆరోగ్యం & భద్రతను దృష్టిలో ఉంచుకొని అందరినీ ఇంటి నుంచి పనిచేయాలని హెచ్‌సీఎల్ సూచించింది. ఉద్యోగులను తిరిగి కార్యాలయానికి పిలవడానికి ముందు కోవిడ్-19 వేరియెంట్ల విజృంభిస్తుండటంతో హైబ్రిడ్ వర్కింగ్ మోడల్ కొనసాగించాలని కోరుకుంటున్నట్లు హెచ్‌సిఎల్ టెక్నాలజీస్ పేర్కొంది. దేశంలో మారుతున్న కోవిడ్-19 పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఈ ఏడాది కూడా దాదాపు వర్క్ ఫ్రమ్ హోం చేయాల్సి ఉంటుందని ఇన్ఫోసిస్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ రిచర్డ్ లోబో ఎకనామిక్ టైమ్స్ కు చెప్పారు. పరిస్థితులు సద్దుమణిగి, ఇన్ఫెక్షన్ రేట్లు తగ్గి, వ్యాక్సినేషన్ పుంజుకున్న తర్వాత బహుశా అప్పుడు కార్యాలయాలకు రావాల్సి ఉంటుందని తను స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం కేంద్ర ప్రభుత్వం ఇంతకు ముందు తన ఉద్యోగులలో 50 శాతం మంది సెక్రటరీ స్థాయికి దిగువన గల ఉద్యోగులను ఇంటి నుంచి పని చేయడానికి అనుమతించింది. అంగవైకల్యం ఉన్న వ్యక్తులు, గర్భిణీ మహిళా ఉద్యోగులకు కార్యాలయాలకు రావాల్సిన అవసరం లేదు అని తెలిపింది. కార్యాలయంలో భారీగా రద్దీ ఉండకుండా టైమింగ్స్ మార్చినట్లు స్పష్టం చేసింది. కార్యాలయంలో సామాజిక దూరం పాటించాలని, మాస్క్ తప్పకుండా ధరించాలని కోవిడ్ నియమాలను తప్పనిసరి చేసింది. -
అక్కడ తండ్రులు వ్యాక్సిన్లు వేసుకోకపోతే పిల్లలతో గడపనివ్వరట!
ప్రస్తుతం కరోన కొత్తవేరియంట్ ఒమిక్రాన్ భయంతో ప్రపంచ దేశాలు ఒక్కో రీతిలో ఆంక్షలు విధిస్తున్నాయి. ఈ కరోనా వైరస్ కట్టడిలో భాగంగా కాస్త కఠినమైన ఆంక్షలు తీసుకోవడానికే మొగ్గుచూపుతున్నాయి. అందులో భాగంగానే కెనడాలోని ఓ తండ్రికి చేదు అనుభవం ఎదురైంది. అసలేం జరిగిందంటే...కెనడియన్లో ఓ తండ్రి తన సెలవు రోజుల్లో తన కొడుకుతో ఎక్కువ సమయం గడిపేలా అవకాశం ఇవ్వమంటూ కోర్టు మెట్లు ఎక్కాడు. అయితే తల్లి ఈ విషయాన్ని వ్యతిరేకించింది. సదరు వ్యక్తి వ్యాక్సిన్ తీసుకోలేదంటూ అతను సోషల్ మీడియాలో పెట్టిన పోస్ట్‌లను సాక్ష్యంగా కోర్టులో చూపించింది. పైగా తనకు మరో ఇద్దరు పిల్లలు ఉన్నారని కూడా చెప్పింది. దీంతో కోర్టు వ్యాక్సిన్ వేసుకోనప్పుడూ కొడుకుతో గడిపే హక్కు లేదని స్పష్టం చేసింది. ప్రస్తుతం ఉన్న కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ఉధృతి నేపథ్యంలో మిగతా పిల్లల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకునే ఈ ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపింది. అంతేకాదు కరోనా వ్యాక్సిన్లు తీసుకోనివాళ్ల పై ఆరోగ్య పన్ను విధించనున్నట్లు ప్రకటించింది. అయితే ఇప్పటికే వ్యాక్సిన్ తీసుకోనివాళ్లను వీధుల్లోకి రానీయకుండా నిషేధించింది. (చదవండి: జీరో కోవిడ్ టాలరెన్సే లక్ష్యంగా... ఇంత పైశాచిక నిబంధనలా!!) -
రెండు రోజులకు సరిపడా ఆక్సిజన్ నిల్వచేయండి
న్యూఢిల్లీ: ఒమిక్రాన్ వేరియంట్ విజృంభిస్తున్న వేళ కరోనా కేసుల సంఖ్యలో పెరుగుదల వేగం అనూహ్యంగా ఎక్కువైంది. ఈ నేపథ్యంలో ఆస్పత్రిలో కోవిడ్ రోగుల చేరికలు పెరిగే ప్రమాదం మరింతకానుంది. దీంతో ఆస్పత్రుల్లో కనీసం 48 గంటలకు సరిపడా మెడికల్ ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచుకోవాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్రం సూచనలు చేసింది. ప్రైవేట్ వైద్య కేంద్రాల్లోనూ ఆక్సిజన్ సేవలు అందుబాటులో ఉన్నందున డిమాండ్ ఒక్కసారిగా పెరిగితే అందుకు అనుగుణంగా సరఫరా ఉండేలా కార్యాచరణను అమలుచేయాలని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలకు రాసిన లేఖలో కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేశ్ భూషణ్ పేర్కొన్నారు. ఇన్–పేషెంట్ ఆస్పత్రులు, ఆక్సిజన్ సేవలందించే కేంద్రాల వద్ద ఆక్సిజన్ బఫర్ స్టాక్‌ను సిద్ధంగా ఉంచాలన్నారు. ద్రవ ఆక్సిజన్ ట్యాంక్‌లను నింపాలని, రీఫిల్లింగ్ కోసం ఇబ్బందులు పడకుండా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రాల వద్ద అదనపు ఆక్సిజన్ సిలిండర్లు, నిండుకుంటే వెంటనే తెప్పించే ఏర్పాట్లూ చేయాలని పేర్కొన్నారు. కాగా, కోవిడ్ తాజా పరిస్థితిపై గురువారం సాయంత్రం నాలుగున్నరకు ప్రధాని మోదీ సీఎంలతో వర్చువల్ సమీక్ష నిర్వహిస్తారు. కరోనా కేసుల ఉధృతి ఆగటం లేదు. గత 24 గంటల్లో దేశవ్యాప్తంగా 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. ఒమిక్రాన్‌ను జలుబుగా లెక్కకట్టొద్దు కరోనా కేసుల్లో వారపు పాజిటివిటీ మూడొందలకుపైగా జిల్లాల్లో ఐదు శాతాన్ని మించడంతో ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా పరిగణించవద్దని, తేలిగ్గా తీసుకోవద్దని, అప్రమత్తంగా ఉండాలని నీతి ఆయోగ్ సభ్యుడు(ఆరోగ్యం) వీకే పాల్ చెప్పారు. -
ఒమిక్రాన్‌పై కేంద్రం హెచ్చరికలు.. వారం రోజుల్లోనే..
న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌ను సాధారణ జలుబుగా భావించవద్దని కేంద్రం హెచ్చరించింది. కరోనా తాజా పరిస్థితులపై ప్రధాని మోదీ అధ్యక్షతన సమీక్షా సమావేశం జరిగింది. దేశంలో కరోనా వేగంగా విస్తరిస్తోందని, కేవలం వారం రోజుల్లోనే 300 జిల్లాల్లో పాజిటివిటీ రేటు 5 శాతం దాటిందని స్పష్టం చేసింది. అయితే.. డెల్టా కంటే ఒమిక్రాన్ వేగంగా వ్యాపిస్తున్నా.. ఆసుపత్రుల్లో చేరే వారి సంఖ్య తక్కువగానే ఉందని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్ తెలిపారు. అటు.. కరోనా బాధితుల డిశ్చార్జ్ పాలసీని సవరించినట్లు చెప్పిన అగర్వాల్.. కోవిడ్ టెస్టులో పాజిటివ్ వచ్చి.. స్వల్ప లక్షణాలు ఉన్న బాధితులను ఏడు రోజుల్లో డిశ్చార్జ్ చేయాలన్నారు. వీరికి మళ్లీ వైరస్ నిర్థారణ పరీక్షలు అవసరం లేదని చెప్పారు. మరోవైపు థర్డ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో కేంద్రం రాష్ట్రాలకు కీలక ఆదేశాలు జారీ చేసింది. కనీసం 48 గంటల మెడికల్ ఆక్సిజన్‌ను బఫర్ స్టాక్‌లో ఉంచాలని స్పష్టం చేసింది. మెడికల్ ఆక్సిజన్ కంట్రోల్ రూమ్‌లను పటిష్ట పర్చాలని సూచించింది. అన్ని ఆరోగ్య కేంద్రాల్లో తగినంత ఆక్సిజన్ లభ్యత ఉండేలా చర్యలు చేపట్టాలని ఆదేశించింది. ప్రైవేటు ఆసుపత్రుల్లో ప్రాణవాయువు కొరత ఏర్పడితే సరఫరా చేసేందుకు సిద్ధంగా ఉండాలని కేంద్రం స్పష్టం చేసింది. -
ఇప్పటికీ దరఖాస్తు చేసుకోలేదు.. ఆనందయ్యకు నోటీసులు ఇచ్చాం: ఆయుష్ శాఖ
సాక్షి, విజయవాడ: అనుమతులు లేకుండా ఒమిక్రాన్‌కు మందు ఉందంటూ ప్రచారం చేసుకుంటున్న సంస్థలపై ఆయుష్ శాఖ చర్యలు తీసుకుంటోంది. తూర్పుగోదావరి జిల్లాలో అనుమతులు లేకుండా ఒమిక్రాన్ పేరుతో ఆయుర్వేద మందులు అమ్ముతున్న ఓ సంస్థను ఆయుష్ శాఖ అధికారులు సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయుష్ కమిషనర్ రాములు మాట్లాడుతూ.. ఒమిక్రాన్ పేరుతో అనుమతులు లేని ఆయుర్వేద మందులు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఒమిక్రాన్‌కు మందు ఇస్తానంటూ ప్రచారం చేసుకుంటున్న ఆనందయ్యకు కూడా నోటీసులు ఇచ్చామని తెలిపారు. చదవండి: హైదరాబాద్, వైజాగ్‌లలో భారీగా అప్రెంటిస్ ట్రెయినీలు ఆనందయ్య తన మందుపై ఇప్పటికీ ప్రభుత్వానికి ధరఖాస్తు చేసుకోలేదని వెల్లడించారు. ఆనందయ్య మందుపై కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలోనే ప్రభుత్వం పది రోజుల వ్యవధిలో వేగంగా నిర్ణయం తీసుకుందని తెలిపారు. కేంద్ర ఆయుష్ శాఖ కోవిడ్ నివారణకు సూచించిన అన్ని ఆయుర్వేదం, హోమియో మందులు అన్ని డిస్పెన్సరీలలో అందుబాటులో ఉంచామని చెప్పారు. వీటి కోసం ఏపీ ప్రభుత్వం 13 కోట్ల రూపాయిలు ఖర్చు చేసిందన్నారు. ఒమిక్రాన్‌కు మందు ఉందంటూ ప్రైవేట్ వ్యక్తులు చేస్తున్న ప్రచారాలని నమ్మి మోసపోవద్దని ఆయుష్ కమిషనర్ సూచించారు. ప్రభుత్వ ఆయుర్వేద డిస్పెన్సరీలలో కేంద్ర అయుష్ శాఖ సూచించిన మందులనే వినియోగించాలని తెలిపారు. చదవండి: మహిళా పోలీసులకు ప్రత్యేక నిబంధనలను విడుదల చేసిన ప్రభుత్వం -
అనుకున్నదొకటి అయింది మరొకటి.. సందడే కరువాయే!
-
ఒమిక్రాన్‌పై డబ్ల్యూహెచ్‌వో తీవ్ర హెచ్చరిక.. అక్కడ సగం మందికి ఒమిక్రాన్!
సాక్షి, న్యూఢిల్లీ: ఒమిక్రాన్‌పై ప్రపంచ ఆరోగ్య సంస్థ తీవ్ర హెచ్చరికలు జారీ చేసింది. రానున్న ఆరు నుంచి ఎనిమిది వారాల్లో.. యూరోప్‌లో సగం మందికి ఒమిక్రాన్ వేరియంట్ సోకే ప్రమాదం ఉన్నట్లు డబ్ల్యూహెచ్‌వో వైద్య నిపుణుడు డాక్టర్ హన్స్ క్లూజీ చెప్పారు. పశ్చిమం నుంచి తూర్పు దిశగా ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఏడాది తొలి వారంలోనే యూరోప్‌లో 70 లక్షల కొత్త కేసులు నమోదయ్యాయని, దీని ఆధారంగా డబ్ల్యూహెచ్‌వో ఈ అంచనా వేసినట్లు ఆయన పేర్కొన్నారు. కేవలం రెండు వారాల వ్యవధిలోనే ఇన్ఫెక్షన్లు రెండింతలు అయినట్లు తెలుస్తోంది. యూరోప్‌లో 8 వారాల్లోగా సగం మందికి ఒమిక్రాన్ సోకుతుందని సియాటిల్‌కు చెందిన ఇన్స్టిట్యూట్ ఫర్ హెల్త్ మెట్రిక్స్ అండ్ ఎవాల్యువేషన్ సంస్థ వెల్లడించినట్లు డాక్టర్ క్లూజీ తెలిపారు. ఇదిలాఉండగా.. ప్రపంచవ్యాప్తంగా 150 దేశాలకు ఒమిక్రాన్ వ్యాపించింది. 2,46,780 కేసులతో యూకే తొలి స్థానంలో ఉండగా.. 66,563 కేసులతో డెన్మార్క్ రెండో స్థానంలో ఉంది. ఇక భారత్‌లో 4,868 ఒమిక్రాన్ కేసులున్నాయి. (చదవండి: వాసనతో ప్రమాదం పసిగట్టి గోల్డ్ మెడల్ అందుకున్న చిట్టి హీరో.. ఇక లేడు) -
నెల్లూరు ఆనందయ్యకు నోటీసులు జారీ
-
కరోనా కల్లోలం: భారత్‌లో భారీగా పెరిగిన కేసులు..
Covid Third Wave: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతుంది. గడిచిన 24 గంటలలో 1,94,720 కొత్త కేసులు నమోదయ్యాయి. గత 24 గంటలలో 60,405 మంది వైరస్ బారి నుంచి కొలుకున్నారు. అదే విధంగా, మహమ్మారి బారిన పడి 442 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం 9,55,319 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నట్లు కేంద్ర వైద్యారోగ్యశాఖ బులెటిన్‌ను ప్రకటించింది. ప్రస్తుతం పాజిటివిటీ రేటు 11.05 శాతంగా ఉంది. మరోవైపు ఒమిక్రాన్ కేసులు కూడా శరవేగంగా పెరుగుతున్నాయి. దేశంలో ఇప్పటివరకు 4,868 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. చదవండి: Omicron: ఒమిక్రాన్ ప్రతీ ఒక్కరికి సోకుతుంది -
Vaikuntha Ekadashi: ఉత్తర ద్వార దర్శనం లేదు
సాక్షి, నల్లకుంట (హైదరాబాద్): ఈ నెల 13న (గురువారం) ముక్కోటి ఏకాదశిని పురస్కరించుకొని వైష్ణవాలయాలకు భక్తులు పోటెత్తే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో దేవాదాయ కమిషనర్ ఆదేశాల మేరకు ముక్కోటి ఏకాదశి రోజున న్యూ నల్లకుంటలోని సీతారామాంజనేయ సరస్వతీదేవి ఆలయంలో ఉత్తరద్వార దర్శనం ఉండదని ఆలయ ఈవో శ్రీధర్ తెలిపారు. స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, అర్చనలు చేయించాలనుకునే భక్తులు ఆలయ గుమస్తా వద్ద టికెట్టు తీసుకుంటే వారు భక్తుల గోత్ర నామాలపై పూజలు నిర్వహిస్తారని ఈవో తెలిపారు. కరోనా వైరస్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఆలయాల్లో తీర్థ, ప్రసాద వితరణ కూడా నిషేధమని చెప్పారు. అలాగే ఆలయ ప్రాంగణంలో భక్తులు కూర్చోవడానికి కూడా అనుమతి లేదని తెలిపారు. వైరస్ కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలకు భక్తులు సహకరించాలని సూచించారు. భక్తులకు అనుమతి లేదు.. జగద్గిరిగుట్ట: రాష్ట్రంలో కరోనా, ఒమిక్రాన్ పాజిటివ్ కేసులు పెరుగుతుండటంతో జగద్గిరిగుట్టలోని శ్రీలక్ష్మి వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఈ నెల 13న వైకుంఠ ఏకాదశి, 14న గోదాదేవి కల్యాణం నేపథ్యంలో భక్తులకు దర్శనములు నిలుపుదల చేసినట్లు ఆలయ ఈవో ఓ ప్రకటనలో తెలిపారు. రాష్ట్ర చీఫ్ సెక్రెటరీ ఆదేశానుసారం శాస్త్రోయుక్తంగా కేవలం వేద పండితులు, సిబ్బంది సమక్షంలో అంతరంగికంగా వేడుకలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. చదవండి: కరోనా థర్డ్ వేవ్.. వైరస్ పడగలో వీఐపీలు -
Omicron: ఒమిక్రాన్ ప్రతీ ఒక్కరికి సోకుతుంది
Booster doses won't stop the rapid spread of Omicron variant: కోవిడ్-19 కొత్త వేరియంట్ అయిన ఒమిక్రాన్ దాదాపు నియంత్రించలేం అని నిపుణులు నొక్కి చెబుతున్నారు. పైగా బూస్టర్ వ్యాక్సిన్లు ఈ ఒమిక్రాన్ వైరస్ వ్యాప్తిని కట్టడి చేయలేవని, ప్రతి ఒక్కరూ ఈ వైరస్ బారిన పడతారని వక్కాణించారు. అయితే ఈ కొత్త రకం వేరియంట్‌కి భయపడవలసిన అవసరంలేదని నిజానికి అందరూ ఈ వైరస్‌ని ఎదుర్కోగలరని అన్నారు. ఇది డెల్టా కంటే ప్రమాదకరమైనది కాదని కాకపోతే ఆచరణాత్మకంగా మాత్రం ఈ ఒమిక్రాన్ వైరస్ ఉధృతిని ఆపలేం అని ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్‌లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఎపిడెమియాలజీకి సంబంధించిన సైంటిఫిక్ అడ్వైజరీ కమిటీ చైర్పర్సన్, ఎపిడెమియాలజిస్ట్ డాక్టర్ జైప్రకాష్ ములియిల్ అన్నారు.అయితే ఇక ఈ వ్యాధి మనకు జలుబు వలే వస్తుంటుందని కూడా చెప్పారు. పైగా దీన్ని ఎదుర్కొగల సహజ రోగ నిరోధక శక్తి మనలో ఉంటుందని, అందువల్ల భారత్ ఇతర దేశాల మాదిరి తీవ్రంగా ప్రభావితం కాలేదని విశ్వాసం వ్యక్తం చేశారు. అంతేకాదు వ్యాక్సిన్లు ప్రవేశ పెట్టక ముందే మన దేశంలో దాదాపు 85% మందికి కరోనా వైరస్ బారిన పడ్డారని తెలిపారు. అలాగే వ్యాక్సిన్లు అనేవి శాశ్వత సహజ వ్యాధి నిరోధక శక్తిని ఇవ్వలేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఏ వైద్య సంస్థలు బూస్టర్ డోస్‌లు వైరస్ భారిన పడకుండా చేయగలవని స్పష్టం చేయలేదనే విషయాన్ని నొక్కి చెప్పారు. ఈ బూస్టర్ డోస్‌లు కేవలం ముదు జాగ్రత్త చర్యగా తీసుకునే చికిత్సలో భాగమే తప్ప ఆ వైరస్ భారిన పడకుండా మాత్రం కట్టడి చేయలేదని తెలిపారు. ఈ మేరకు బూస్టర్ డోస్ తీసుకున్నవాళ్లు సైతం ఈ కరోనా వైనస్ బారిన పడ్డారని నివేదికలు చెబుతున్నాయని ములియిల్ చెప్పారు. (చదవండి: యూరోపియన్ పార్లమెంట్ అధ్యక్షుడి కన్నుమూత) (చదవండి: నిందితుడికి బెయిల్.. అతన్ని రాత్రి గృహనిర్బంధం చేయాల్సిందే!)