
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ మూడో వేవ్‌లో.. ఒక్కసారిగా కేసులు గణనీయంగా తగ్గాయి. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో లక్షా 27 వేల 952 కొత్త కేసులు నమోదు అయ్యాయి. నిన్నటి పోల్చుకుంటే పాజిటివిటీ రేటు 9.2 శాతం నుంచి 7.9 శాతానికి పడిపోవడం విశేషం.
ఇక కిందటి రోజుతో పోలిస్తే.. 14 శాతం కేసుల తగ్గుదల చోటు చేసుకోవడం విశేషం. రికవరీల సంఖ్య 2, 30, 814గా ఉంది. ఒక్కరోజులో 1,059 మరణాలు నమోదు అయ్యాయి. ప్రస్తుతం యాక్టివ్ కేసుల సంఖ్య 13,31,648గా ఉంది. మొత్తం కరోనా మరణాల సంఖ్య 5, 01, 114కి చేరుకుంది. మొత్తం వ్యాక్సినేషన్ డోసుల సంఖ్య 1,68,98,17,199 పూర్తి చేసుకుంది.
Comments
Please login to add a commentAdd a comment