కరోనా ఈజ్ బ్యాక్.. వినడానికి కొంచెం భయంగానే ఉన్నా ఇదే నిజం.. ప్రతీసారి మహమ్మారి తగ్గిపోయింది అని ఊపిరి పీల్చుకునేలోపే మళ్లీ విరుచుకుపడుతోంది. ఇప్పటి వరకు మూడు వేవ్‌లో రూపంలో వచ్చిన కోవిడ్ ప్రజల జీవితాలతో చెలగాటమడింది. లక్షలమంది ప్రాణాలను గాల్లో కలిపేసింది. ఎన్నో కుటుంబాలను ఆర్థికంగా, మానసికంగా చిన్నాభిన్నం చేసింది. ప్రస్తుతం కరోనా పుట్టినిల్లుగా భావించే చైనా, దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ తన విశ్వరూపాన్ని చూపిస్తోంది.
చైనాలో జీరో కొవిడ్ విధానం ఉన్నా స్టెల్త్ ఒమిక్రాన్ కేసులు తగ్గడం లేదు. ప్రస్తుతం చైనాలో కోవిడ్ సామాజిక వ్యాప్తి దశ అధికంగా ఉంది. గత రెండేళ్లలో లేనంతగా ఇప్పుడు అక్కడ వైరస్ వేగంగా వ్యాపిస్తోంది. అయితే చైనాలో కోవిడ్ కేసులు పెరగడానికి ప్రజల్లో వ్యాధి నిరోధక శక్తి లేకపోవడమేనని వైద్యులు చెబుతున్నారు. కాగా చైనాలో మళ్లీ కరోనా మరణాలు మొదలయ్యాయి. శనివారం మహమ్మారి బారినపడి ఇద్దరు మృత్యువాతపడ్డారు. దీంతో గత ఏడాది కాలంలో కోవిడ్ మరణం చోటుచేసుకోవడం ఇదే తొలిసారి కావడం గమనార్హం.
చదవండి: Invisibility Shield Co.: మీరు గానీ.. ఒక్కసారి గానీ.. ఈ షీల్డ్ వెనక్కి వెళ్లారంటే!
చివరిసారిగా జనవరి 2021లో కరోనాతో మరణించారు. చైనాలో శనివారం 2,157 పాజిటివ్ కేసులు వెలుగు చూశాయి. దీంతో కరోనా టెస్టులు, ట్రాకింగ్, ట్రీట్‌తోపాటు కోవిడ్ నిబంధనలు పాటించాలని, వ్యాక్సిన్ వేసుకోవాలని ప్రభుత్వం అన్ని రాష్ట్రాలు ఆదేశాలు జారీచేసింది. మరోవైపు కరోనా వ్యాప్తి పెరుగుతుండటంతో ‘డైనమిక్ జీరో కోవిడ్’ విధానాన్ని సవరించాలని ప్రభుత్వం భావిస్తోందని వచ్చిన వార్తలను చైనా శుక్రవారం తోసిపుచ్చింది.
చదవండి: కరోనా కల్లోలం: ఒక్క రోజే 6 లక్షల పాజిటివ్ కేసులు
Comments
Please login to add a commentAdd a comment