హమ్మయ్యా! కరోనా మహమ్మారి తగ్గుముఖం పట్టింది.. అని అనుకునేలోపే.. రూపు మార్చుకొని మళ్లీ పంజా విసురుతోంది. కరోనా ఉద్భవించిన చైనాలో ఎన్నడూ లేని విధంగా కొత్త కేసులు నమోదవుతున్నాయి. స్టైల్త్ ఒమిక్రాన్ రూపంలో చైనాను కోవిడ్ మళ్లీ వణికిస్తోంది. మరోవైపు దక్షిణ కొరియాలోనై కోవిడ్ కల్లోలం సృష్టిస్తోంది. ఇక ఇజ్రాయెల్‌లో మరో కొత్త వేరియంట్‌ను గుర్తించారు.
దక్షిణ కొరియాలో ఒమిక్రాన్ వేరియంట్ కేసులు ఊహించని స్థాయిలో నమోదవుతున్నాయి. గురువారం ఒక్కరోజే కొత్తగా 6 లక్షల కేసులు వెలుగు చూశాయి. ఇప్పటి వరకు ఇంత భారీగా రోజువారీ కేసులు నమోదవ్వడం ఇదే తొలిసారి. దక్షిణ కొరియాలో రికార్డు స్థాయిలో 6,21,328 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 429 మంది మృత్యువాతపడ్డారు. ఒక్క రోజులోనే 55 శాతం పెరుగుదల చోటుచేసుకుంది. దీంతో మొత్తం దేశంలో కేసుల సంఖ్య 8,250,592కి పెరిగింది.
చదవండి: ఇజ్రాయెల్‌లో కరోనా కొత్త వేరియంట్ కలకలం
అయితే ఊహించిన దానికంటే ఎక్కువగా కేసులు వెలుగు చూడటంతో వైద్యారోగ్యశాఖ అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ కేసుల్లో ఎక్కువగా ఒకరినుంచి ఒకరికి సంక్రమించినవేనని ఉన్నయని తెలిపారు. కాగా బుధవారం కూడా 400,000 కొత్తగా కేసులతో గరిష్ట స్థాయికి చేరింది. మార్చి మధ్యలో కోవిడ్ 1,40,000 నుంచి 2, 70,000 గరిష్ట స్థాయికి రోజువారీ కేసులకు చేరుకుంటుందని నెల కిందటే అంచనా వేసిన విషయం తెలిసిందే.
చదవండి: జాగ్రత్త.. కరోనా మళ్లీ విజృంభిస్తోంది!
Comments
Please login to add a commentAdd a comment