సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కరోనా కేసులు ఏమాత్రం ఆగడం లేదు. ప్రభుత్వ లెక్కల ప్రకారం నమోదైన దానికంటే బయట ఎక్కువగా వెలుగు చూస్తున్నాయి. ఎవరికి వారు సొంతంగా కరోనా నిర్ధారణ పరీక్షలు చేసుకునే అవకాశం రావడంతో వివరాలు బయటికి రావడం లేదు. దీంతో అలాంటి వారు బయటికొస్తూ ఇతరులకు కూడా అంటిస్తున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో చేరే సంఖ్య రోజురోజుకూ పెరుగుతోంది.
తాజా లెక్కల ప్రకారం రాష్ట్రంలో 39,520 క్రియాశీలక కేసులున్నాయి. వాటిలో 844 మంది ఐసీయూలో, 1,412 మంది ఆక్సిజన్‌పై ఉన్నారు. 1,130 మంది సాధారణ పడకలపై చికిత్స పొందుతున్నారు. మిగిలిన వారు ఇళ్లల్లో ఐసోలేషన్‌లో ఉన్నారని డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
ఒక్క రోజే 3,944 కరోనా కేసులు
రాష్ట్రంలో ఒమిక్రాన్ వేరియంట్ కరోనా వైరస్ వేగంగా విజృంభిస్తూనే ఉంది. గురువారం రాష్ట్రంలో 97,549 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు చేయగా, అందులో 3,944 మంది వైరస్ బారిన పడ్డారు. ఇప్పటివరకు రాష్ట్రంలో మొత్తం కేసుల సంఖ్య 7.51 లక్షలకు చేరుకుంది. తాజాగా 2,444 మంది కోలుకోగా, మొత్తంగా 7.07 లక్షల మంది రికవరీ అయ్యారు.
ఒక్క రోజులో కరోనాతో ముగ్గురు చనిపోగా, ఇప్పటివరకు వైరస్‌కు 4,081 మంది బలయ్యారు. ఇక ప్రస్తుతం 39,520 క్రియాశీలక కరోనా కేసులున్నాయి. వాటిలో 3,386 మంది ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారని కరోనా బులెటిన్‌లో డాక్టర్ శ్రీనివాసరావు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment