న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్య 10 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 10,158 మంది వైరస్ బారిన పడ్డారు. కిందటి రోజుతో పోలిస్తే 30శాతం అధికంగా నమోదయ్యాయి. గత గత ఏడు నెలల్లో(230 రోజులు) ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి.
మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,42,10,127కు చేరింది. ప్రస్తుతం 44,998 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివ్ రేటు 4.42శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.71శాతం.. మరణాల రేటు 1.19%గా ఉంది. భారత్‌లో సగటున గత వారంలో రోజుకు 5,555 కోవిడ్ కేసులు నమోదవ్వగా అంతకు ముందు వారం 3,108 వెలుగు చూశాయి.
అయితే కరోనా వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఎండమిక్ దశలోకి ప్రవేశిస్తోందని వైద్య నిపుణులు వెల్లడించారు. వచ్చే 10 నుండి 12 రోజుల్లో కొత్త కేసులు పెరుగుతాయని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కేసులు తగ్గుతాయని తెలిపారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రిలో చేరికలు మాత్రం తక్కువగా ఉన్నాయని రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుందని చెప్పారు.
అయితే కొత్త కేసులపై ఆందోళన అవసరం లేదని అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటే చాలని.. దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు.
చదవండి: గుడ్‌న్యూస్..మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి
Comments
Please login to add a commentAdd a comment