health buliten
-
లక్ష్మమ్మ ఆరోగ్యం నిలకడగా ఉంది: వైద్యులు
-
ఎంపీ అవినాష్ రెడ్డి తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులిటెన్ విడుదల
-
అవినాష్ తల్లి లక్ష్మమ్మ హెల్త్ బులెటిన్ విడుదల
-
Corona Alert: ఒక్కసారిగా పెరిగిన కేసులు.. 230 రోజుల తర్వాత ఈ స్థాయిలో
న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గత కొన్ని రోజులుగా నమోదవుతున్న కోవిడ్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. రోజూవారీ పాజిటివ్ కేసుల్లో భారీగా పెరుగుదల కనిపిస్తోంది. తాజాగా కొత్త కేసుల సంఖ్య 10 వేలు దాటాయి. గడిచిన 24 గంటల్లో 10,158 మంది వైరస్ బారిన పడ్డారు. కిందటి రోజుతో పోలిస్తే 30శాతం అధికంగా నమోదయ్యాయి. గత గత ఏడు నెలల్లో(230 రోజులు) ఇంత భారీ స్థాయిలో పాజిటివ్ కేసులు వెలుగు చూడటం ఇదే తొలిసారి. మేరకు కేంద్ర వైద్యారోగ్యశాఖ గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటివరకు మొత్తం కేసుల సంఖ్య 4,42,10,127కు చేరింది. ప్రస్తుతం 44,998 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రోజువారీ పాజిటివ్ రేటు 4.42శాతానికి పెరిగింది. రికవరీ రేటు 98.71శాతం.. మరణాల రేటు 1.19%గా ఉంది. భారత్‌లో సగటున గత వారంలో రోజుకు 5,555 కోవిడ్ కేసులు నమోదవ్వగా అంతకు ముందు వారం 3,108 వెలుగు చూశాయి. అయితే కరోనా వ్యాప్తి పెరుగుతున్నప్పటికీ ప్రస్తుతం దేశంలో కోవిడ్ ఎండమిక్ దశలోకి ప్రవేశిస్తోందని వైద్య నిపుణులు వెల్లడించారు. వచ్చే 10 నుండి 12 రోజుల్లో కొత్త కేసులు పెరుగుతాయని పేర్కొన్నారు. కానీ ఆ తర్వాత కేసులు తగ్గుతాయని తెలిపారు. ఒకవైపు కరోనా కేసులు పెరుగుతున్నప్పటికీ ఆస్పత్రిలో చేరికలు మాత్రం తక్కువగా ఉన్నాయని రాబోయే రోజుల్లో కూడా ఇలాగే కొనసాగుతుందని చెప్పారు. అయితే కొత్త కేసులపై ఆందోళన అవసరం లేదని అన్నారు. తగు జాగ్రత్తలు తీసుకుంటూ వైరస్ వ్యాప్తిని అడ్డుకుంటే చాలని.. దీర్ఘకాలిక వ్యాధులు, శ్వాసకోశ ఇబ్బందులు ఉన్న వాళ్లు మాత్రం అప్రమత్తంగా ఉండాలని సూచించారు. కాగా ప్రస్తుతం దేశంలో ఒమిక్రాన్ సబ్ వేరియెంట్ ఎక్స్‌బీబీ.1.16 కారణంగా భారత్‌లో కరోనా కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని పేర్కొన్నారు. చదవండి: గుడ్‌న్యూస్..మళ్లీ కోవిషీల్డ్ ఉత్పత్తి -
విజృంభిస్తున్న కరోనా.. దేశంలో కొత్తగా కేసులు ఎన్నంటే..
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా పాజిటివ్ కేసులు, మరణాల సంఖ్య పెరుగుతోంది. దేశవ్యాప్తంగా గడిచిన 24 గంటల్లో కొత్తగా 58,097 కరోనా పాజిటివ్ నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. అదే విధంగా గడిచిన 24 గంటల్లో 534 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 3,43,21,803 మంది కోవిడ్ నుంచి కోలుకున్నారు. దేశంలో ఇప్పటివరకు కరోనా బరినపడి 4,82,551 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం దేశంలో 2,14,004 కొవిడ్ యాక్టివ్ కేసులు ఉన్నాయి. ప్రస్తుతం కోవిడ్ రోజువారి పాజిటివ్ రేటు 4.18 శాతంగా ఉంది. -
సాయిధరమ్ తేజ్ పై అపోలో హెల్త్ బులిటెన్
-
ఏపీలో కొత్తగా1,002 కరోనా కేసులు..
సాక్షి,అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 47,972 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా1,002 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి12 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 13,735 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 1,508 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 20 లక్షల 33 వేల 42 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ సోమవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం14,159యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,61,39,934 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి:Afghanistan: ‘అశ్రఫ్ ఘనీ డబ్బుతో పారిపోలేదు.. అది కట్టుకథ’ -
దేశంలో కొత్తగా 43,654 కరోనా కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కరోనా తీవ్రత తగ్గుముఖం పడుతోంది. దేశంలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 43,654 కరోనా పాజిటివ్ కేసులు నమోదైనట్లు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. గడిచిన 24 గంటల్లో 640 మంది కోవిడ్ బాధితులు మృతి చెందారు. దీంతో కరోనా వైరస్ బారినపడి మొత్తం 4,22,022 మంది ప్రాణాలు కోల్పోయారు. అంతేకాకుండా గత 24 గంటల్లో 41,678 మంది కోవిడ్ బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. దీంతో దేశంలో ఇప్పటివరకు మొత్తం 3,06,63,147 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. దేశంలో ప్రస్తుతం 3,99,436 కరోనా పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా మొత్తం 31.48 కోట్ల మంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. ఇక దేశంలో మొత్తం 44.61 మంది కరోనా వ్యాక్సిన్ తీసుకున్నారని కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. -
ఏపీలో కొత్తగా 2,567 కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఏపీలో గడిచిన 24 గంటల్లో 81,763 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా.. కొత్తగా 2,567 కరోనా కేసులు నమోదయ్యాయి. గత 24 గంటల్లో రాష్ట్రంలో కరోనా వైరస్ ప్రభావంతో 18 మంది మృతి చెందారు. తాజాగా 3,034 మంది కరోనా బాధితులు కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 2,31,30,708 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. కాగా ఇప్పటి వరకు రాష్ట్రంలో 18,87,236 మంది కరోనా బాధితులు కోలుకున్నారు. అంతేకాకుండా కరోనా మహమ్మారి బారినపడి మొత్తం 13,042 మంది ప్రాణాలు కోల్పోయారు. ప్రస్తుతం రాష్ట్రంలో 26,710 పాజిటివ్ కేసులు ఉన్నాయి. ఇక రాష్రంలో ఇప్పటి వరకు 19,26,988 మంది కరోనా బారిన పడ్డారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంగళవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. -
ఏపీలో క్రమంగా తగ్గుతున్న కరోనా కేసులు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ లో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. గత వారం రోజులుగా రోజువారీ కేసుల సంఖ్య తగ్గుతుండగా.. రికవరీలు కూడా పెరుగుతండటం ఊరటనిస్తోంది. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 94,595 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 3,175 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 29 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,844 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 3,692 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 54 వేల 754 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ శనివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 35,325 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,23,63,078 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. -
ఏపీ కరోనా: ఒక్క రోజే 5 వేలకు పైగా రికవరీ
సాక్షి, అమరావతి: గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 95,327 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 4,250 మందికి కరోనా పాజిటివ్‌గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 33 మంది మృత్యువాతపడ్డారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 12,599 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 5,570 మంది కోవిడ్ నుంచి కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా, ఇప్పటివరకు 18 లక్షల 22 వేల 500 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 44,773 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 2,17,32,933 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. చదవండి: పిచ్చిరాతలు రాస్తే సహించం.. -
కొనసాగుతున్న కరోనా ఉధృతి, రికార్డు స్థాయిలో కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కేసుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. దేశంలో వరుసగా ఎనిమిదో రోజు కరోనా కేసులు 3 లక్షలకు పైగా నమోదయ్యాయి. గడిచిన 24 గంటల్లో దేశంలో కొత్తగా 3,79,257 కరోనా కేసులు నమోదైనట్టు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఒకరోజు నమోదైన కేసుల్లో ఇవే అత్యధికం. కొత్తగా నమోదైన కేసులతో కలిపి దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,83,76,524 కు చేరింది. బుధవారం ఒక్కరోజే వైరస్ బాధితుల్లో 3,645 మంది మరణించినట్లు కేంద్రం తెలిపింది. దీంతో మొత్తం మృతు సంఖ్య 2,04,832 కు చేరింది. ఇప్పటివరకు మొత్తం 1,50,86,878 మంది కరోనా బాధితులు డిశ్చార్జ్ కాగా, దేశంలో ప్రస్తుతం 30,84,814 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 15 కోట్ల మందికి పైగా వ్యాక్సిన్ అందించారు. తెలంగాణలలో పెరుగుతున్న కరోనా కేసులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో కరోనా కేసుల సంఖ్య పెరుగుతోంది. తెలంగాణలో గడిచిన 24 గంటల్లో కొత్తగా 7,994 కరోనా కేసులు నమోదు కాగా, 58 మంది బాధితులు మృతి చెందినట్లు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇప్పటి వరకు తెలంగాణలో మొత్తం 4,27,960 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఇప్పటివరకు 3,49,692 మంది కరోనా బాధితులు వివిధ ఆస్పత్రుల నుంచి డిశ్చార్జ్ కాగా, 2,208 మంది మృతి చెందారు. రాష్ట్రంలో ప్రస్తుతం 76,060 కరోనా యాక్టివ్ కేసులు ఉన్నాయి. జీహెచ్ఎంసీ పరిధిలో 1,630 కరోనా కేసులు నమోదు కాగా, మేడ్చల్ 615, రంగారెడ్డి 558, నిజామాబాద్ 301, మహబూబ్‌నగర్ 263, ఖమ్మం 213, వరంగల్ అర్బన్ 162 కరోనా కేసులు నమోదు అయ్యాయి. చదవండి: భారత్‌కు రానున్న మరో టీకా: స్పుత్నిక్- వి వివరాలు! -
ఏపీలో కొత్తగా 12,634 కరోనా కేసులు..
అమరావతి: గడిచిన 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్‌లో 62,885 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 12,634 మందికి పాజిటీవ్‌గా నిర్థారణ అయ్యింది. అదే విధంగా, ఈరోజు.. ఏపీలో 69 మంది మరణించారు. కాగా, గత 24 గంటల్లో ఈ మహమ్మారి బారినుండి 4,304 మంది కోలుకున్నారు. ఇప్పటి వరకు ఏపీలో మొత్తంగా 9 లక్షల 36వేల 143 మంది కరోనా నుండి కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం 89,732 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఇప్పటి వరకు ఏపీలో 1,59,94,607 మందికి కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు ఏపీ రాష్ట్రవైద్యారోగ్య శాఖ ఆదివారం కరోనాపై హెల్త్ బులెటిన్‌ను విడుదల చేసింది. -
ఏపీలో కొత్తగా 295 కరోనా కేసులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో రికార్డు స్థాయిలో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నాయి. గడిచిన 24 గంటల్లో 59,410నమూనాలు పరీక్షించగా 295పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం కేసుల సంఖ్య 8,84,171కు చేరింది. కొత్తగా ఒకరు కరోనా బారిన పడి మృతి చెందడంతో 7,126 కి చేరింది. ఈ మేరకు గురువారం రాష్ట్ర వైద్యారోగ్యశాఖ హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో 368మంది కోవిడ్‌ను జయించి డిశ్చార్జ్ అయ్యారు. రాష్ట్రంలో ప్రస్తుతం 2,822 యాక్టివ్ కేసులు ఉన్నాయి. -
గడిచిన 24 గంటల్లో 1,486 కేసులు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో గడిచిన 24 గంటల్లో 42,299 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా 1,486 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో మొత్తం ఇప్పటి వరకు నమోదైన కేసుల సంఖ్య 2,24,545కి చేరింది. ఈమేరకు వైద్య ఆరోగ్యశాఖ మంగళవారం ఉదయం బులిటెన్ విడుదల చేసింది. ఇక గడిచిన 24 గంటల్లో కరోనాతో ఏడుగురు మృతి చెందడంతో మరణాల సంఖ్య 1,282కి చేరింది. నిన్న ఒక్క రోజే 1,891 మంది కోలుకున్నారు. దీంతో ఇప్పటివరకు కరోనా నుంచి కోలుకున్న బాధితుల సంఖ్య 2,02,577కి చేరింది. రాష్ట్రంలో ప్రస్తుతం 20,686 యాక్టివ్ కేసులు ఉన్నాయని, వారిలో 17,208 మంది హోం ఐసోలేషన్‌లో చికిత్స పొందుతున్నారని వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. తెలంగాణలో ఇప్పటి వరకు నిర్వహించిన కరోనా నిర్థారణ పరీక్షల సంఖ్య 38,98,829కి చేరింది. (చదవండి: కరోనాతో కొత్తముప్పు !) -
మరణాల్లో ముందున్న మహారాష్ట్ర
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా కేసులు 71 లక్షల పై చిలుకు మార్కు చేరుకున్నాయి. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 66,732 కొత్త కేసులు నమోదు కాగా.. 816 మంది వైరస్ బారిన పడి మరణించారు. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ సోమవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక నేడు సంభవించిన మరణాల్లో 84 శాతం పది రాష్ట్రాల నుంచి నమోదయ్యాయి. కోవిడ్ మరణాల్లో మహారాష్ట్ర ప్రథమ స్థానంలో ఉంది. గడిచిన 24 గంటల్లో ఇక్కడ 308 మంది కరోనా బారిన పడి మృతి చెందారు. ఇక ఇప్పటివరకు దేశవ్యాప్తంగా 71, 20,539 కోవిడ్ కేసులు నమోదు అయ్యాయి. వీరిలో 61,49,536 మంది కోలుకోగా.. ప్రస్తుతం 8,61,853 యాక్టీవ్ కేసులు ఉన్నాయి. ఇక ఇప్పటి వరకు వైరస్ బారిన పడి 1,09,150 మంది మృత్యువాత పడ్డారు. (చదవండి: 10 వేల పల్లెలపై కరోనా పడగ) కరోనావైరస్ కేసులు 21 రోజుల్లో 10 లక్షల నుంచి 20 లక్షలకు పెరిగాయి. 30 లక్షలు దాటడానికి 16 రోజులు, 40 లక్షలను దాటడానికి 13 రోజులు, 50 లక్షలు దాటడానికి 11 రోజులు పట్టింది. ఇక ఈ కేసులు 12 రోజుల్లో 50 లక్షల నుంచి 60 లక్షలకు పెరిగాయి. దేశంలో కోవిడ్ -19 కేసులు లక్షకు చేరుకోవడానికి 110 రోజులు పట్టింది.. కానీ 10 లక్షల మార్కును దాటడానికి 59 రోజులు మాత్రమే పట్టడం గమనార్హం. ఇక దేశవ్యాప్తంగా కోవిడ్ మరణాల రేటు (సీఎఫ్ఆర్) 1.54 శాతంగా ఉందని ఆరోగ్య మంత్రిత్వ శాఖ తెలిపింది. ఇండియన్ కౌన్సిల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ప్రకారం, అక్టోబర్ 10 వరకు దేశ వ్యాప్తంగా మొత్తం 8,68,77,242 నమూనాలను పరీక్షించగా.., శనివారం 10,78,544 టెస్ట్‌లు పరీక్షించారు. -
ఏపీలో పెరుగుతున్న రికవరీలు
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 66,769 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 5,120 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,34,427 కి చేరింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 6,349 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,78, 828గా ఉంది. (చదవండి: ‘వైట్‌హౌస్‌లో ఏం జరిగిందో చూశారుగా?!’) కాగా కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా 34మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6086కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 49,513 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 62,83,009 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు. -
24 గంటల్లో 86,052 పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ కరాళ నృత్యం చేస్తోంది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,052 కోవిడ్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. దాని ప్రకారం దేశంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 58 లక్షల 18 వేలు దాటింది. గడచిన 24 గంటలలో దేశంలో కరోనా వల్ల మొత్తం 1,141 మంది మృతి చెందగా దేశ వ్యాప్తంగా 81,177 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక దేశంలో ఇప్పటివరకు నమోదయిన కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 58,18,571గా ఉండగా.. యాక్టీవ్ కేసుల సంఖ్య 9,70,116గా ఉంది. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 47,56,164గా ఉండగా మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 92,290కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రెటు 81.74 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసులు 16.67 శాతంగా ఉన్నాయి. దేశంలో మొత్తం నమోదయిన కేసులలో మరణాల రేటు 1.59 శాతంగా ఉంది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 14,92,409 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు చేయగా...ఇప్పటి వరకు 6,89,28,440 టెస్టులు చేశారు. (చదవండి: రికవరీ రేటు పైపైకి) -
గడిచిన 24 గంటల్లో 83,347 కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: భారత్‌లో కోవిడ్ విజృంభణ కొనసాగుతుంది. గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 83,347 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. ఇక వైరస్ బారిన పడి గడిచిన 24 గంటల్లో 1,085 మంది మృతి చెందగా.. దేశ వ్యాప్తంగా డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 89,746గా ఉంది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 56,46,011గా ఉండగా.. యాక్టీవ్ కేసులు 9,68,377గా ఉన్నాయి. చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 45,87,613గా ఉండగా వైరస్ బారిన పడి దేశంలో మొత్తం మృతి చెందినవారి సంఖ్య 90,020కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 81.25 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసులు 17.15 శాతంగా ఉన్నాయి. ఇక మరణాల రేటు 1.59 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 9,53,683 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపగా.. ఇప్పటి వరకు 6,69,79,462 పరీక్షలు చేశారు. (చదవండి: రష్యా నుంచి రెండో కరోనా వ్యాక్సిన్) -
24 గంటల్లో 93,356 మంది డిశ్చార్జ్
సాక్షి, న్యూఢిల్లీ: దేశంలో కరోనా వైరస్ విజృంభిస్తోంది. ఇప్పటికే కోవిడ్ పాజిటివ్ కేసుల సంఖ్య 54 లక్షలు దాటింది. ఇక గడచిన 24 గంటలలో అత్యధికంగా రికార్డ్ స్థాయిలో 86,961 పాజిటివ్ కేసులు నమోదవ్వగా.. 1,130 మంది మృతి చెందారు. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 93,356 మంది డిశ్చార్జ్ అయ్యారు. కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఈ మేరకు సోమవారం హెల్త్ బుటిటెన్ విడుదల చేసింది. దేశంలో ఇప్పటివరకు నమోదయిన “కరోనా” పాజిటివ్ కేసుల సంఖ్య 54,87,581గా ఉంది. ఇక దేశ వ్యాప్తంగా యాక్టీవ్ కేసులు 10,03,299గా ఉండగా.. కరోనాకు చికిత్స పొంది డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 43,96,399కి చేరింది. కోవిడ్ వల్ల దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 87,882కు చేరింది. దేశంలో కరోనా రోగుల రికవరీ రేటు 79.68 శాతంగా ఉండగా.. యాక్టీవ్ కేసుల సంఖ్య 18.72 శాతంగా ఉంది. ఇక మరణాల రేటు 1.61 శాతానికి తగ్గింది. దేశ వ్యాప్తంగా గడచిన 24 గంటలలో 7,31,534 కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు జరపగా.. ఇప్పటి వరకు మొత్తం 6,43,92,594 కోవిడ్ పరీక్షలు చేశారు. (చదవండి: చలికాలంలో చుక్కలే..!) -
ఢిల్లీలో కొత్తగా 4,263 పాజిటివ్ కేసులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ రాజధానిలో కరోనా వైరస్ వ్యాప్తి కొనసాగుతోంది. గడిచిన ఇరవై నాలుగు గంటల్లో అక్కడ కొత్తగా 4,263 పాజిటివ్ కేసులు నమోదు కాగా.. 36 మంది కరోనాతో మృతి చెందారు. ఇక 3,081 మంది కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు. కాగా ఢిల్లీలో ఇప్పటి వరకు నమోదైన కోవిడ్ కేసుల సంఖ్య 2,25,796కు చేరుకోగా.. మొత్తంగా 4,806 మంది కరోనాతో మరణించారు. ఇప్పటివరకు చికిత్స పూర్తి చేసుకుని డిశ్చార్జ్ అయిన వారి సంఖ్య 1,91,203గా నమోదైంది. ప్రస్తుతం అక్కడ 29,787 యాక్టివ్ కేసులు ఉన్నాయి. ఈ మేరకు కేజ్రీవాల్ సర్కారు మంగళవారం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది.(చదవండి: మంగళగిరి ఎయిమ్స్‌కు 5 అమెరికన్ వెంటిలేటర్లు) 22 లక్షలు దాటిన టెస్టుల సంఖ్య ఢిల్లీలో ప్రస్తుతం కంటైన్మెంట్ జోన్ల సంఖ్య 1560గా ఉంది. ఇక కరోనా విజృంభణ కొనసాగుతున్న నేపథ్యంలో ఇప్పటివరకు మొత్తంగా 22,46,985 పరీక్షలు నిర్వహించారు. నేడు 10,398 ఆర్టీపీసీఆర్ టెస్లులు నిర్వహించగా.. రాపిడ్ టెస్టుల సంఖ్య 52,271గా నమోదైంది. ప్రతి మిలియన్ జనాభాలో కరోనా టెస్ట్ ల సంఖ్య 1,18,262. ఇక దేశ రాజధాని లో హోం ఐసోలేషన్ లో ఉన్న కేసుల సంఖ్య 16,576గా ఉండగా.. ప్రభుత్వ లేదా ప్రైవేట్ ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న బెడ్ల సంఖ్య 14,482గా ఉంది.(చదవండి: దేశంలో కొత్తగా 83,809 పాజిటివ్ కేసులు) -
కరోనా విలయం.. 43 లక్షలు దాటిన కేసులు
న్యూఢిల్లీ: దేశంలో కరోనా విజృంభణ కొనసాగుతోంది. గడచిన 24 గంటల్లో రికార్డ్ స్థాయిలో 89,706 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. వీటితో మొత్తం కోవిడ్ కేసుల సంఖ్య 43,70,129కి చేరింది. ప్రస్తుతం కరోనా కేసుల ప్రపంచ జాబితాలో దేశం రెండవ స్థానంలో ఉంది. ఇక కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన డాటా ప్రకారం గడిచిన 24 గంటల్లో కరోనా కారణంగా 1,115 మంది చనిపోగా.. 74,894 మంది డిశ్చార్జ్ అయ్యారు. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా 8,97,394యాక్టీవ్ కేసులు ఉండగా.. 33,98,884 మంది డిశ్చార్జ్ అయ్యారు. ఇక కరోనా వల్ల ఇప్పటి వరకు దేశంలో మొత్తం మృతి చెందిన వారి సంఖ్య 73,890. కరోనా రోగుల రికవరీ రేటు 77.77 శాతంగా ఉండగా.. యాక్టివ్ కేసులు 20.53 శాతంగా ఉన్నాయి. ఇక మరణాల రేటు 1.69 శాతానికి తగ్గింది. గడచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 11,54,549 కరోనా వైరస్ నిర్దారణ పరీక్షలు జరిపగా.. ఇప్పటివరకు మొత్తం 5,18,04,677 పరీక్షలు నిర్వహించారు. ఇక మహమ్మారి నియంత్రణ కోసం భారత ప్రభుత్వం చేపట్టిన చర్యలకు ఐక్యరాజ్య సమితి ఏజేన్సీలు మద్దతిస్తున్నాయి. ఈ క్రమంలో యూఎన్ సెక్రటరీ జనరల్ అధికార ప్రతినిధి స్టీఫేన్ డుజారిక్ మాట్లాడుతూ.. ‘కరోనా కట్టడి కోసం భారత ప్రభుత్ర నేత్రుత్వంలోని ఆరోగ్య, సామాజిక ఆర్థిక ప్రయత్నాలకు మద్దతు ఇస్తున్నాము. ఈ కార్యక్రమాలను రెసిడెంట్ కో ఆర్డినేటర్ రెనాటా డెసల్లియన్ నేతృత్వంలో ఇవి కొనసాగుతున్నాయి’ అని తెలిపారు. (చదవండి: నిమ్స్‌లో కోవాగ్జిన్ ఫేజ్–2 ట్రయల్స్ షురూ ) . -
క్షీణిస్తున్న ప్రణబ్ ముఖర్జీ ఆరోగ్యం
న్యూఢిల్లీ: మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జి ఇంకా తీవ్ర కోమాలోనే ఉన్నట్లు ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి బుధవారం విడుదల చేసిన హెల్త్ బులెటెన్‌లో తెలిపింది. ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదని, ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందిస్తున్నామని వెల్లడించింది. ప్రస్తుతం ఆయనకు కిడ్నీ సంబంధిత సమస్యలు కూడా తలెత్తాయని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. (చదవండి: ‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ప్రణబ్‌కు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఆ తర్వాత ఆయన ఊపిరితిత్తులకు ఇన్ఫెక్షన్ సోకిన సంగతి తెలిసిందే. -
ఏపీలో మరో 9544 పాజిటివ్ కేసులు
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 55,010 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9,544 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,940కు చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 434 మంది ఉన్నారు. వైరస్ బారిన పడి తాజాగా 91 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,092కి పెరిగింది. తాజా పరీక్షలతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 31,29,857కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే వైరస్ నుంచి కోలుకుని 8827 మంది డిశ్చార్ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది. -
ఇంకా వెంటిలేటర్‌పైనే ప్రణబ్
సాక్షి, న్యూఢిల్లీ : మాజీ రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీ(84) పరిస్థితి ఇంకా విషమంగానే ఉందని ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రి వైద్య బృందం శనివారం తెలిపింది. ఆయన పరిస్థితి ఇంకా మెరుగుపడలేదని, వెంటిలేటర్‌పైనే ఉంచి చికిత్స అందిస్తున్నామని పేర్కొంది. ‘ప్రణబ్ ఆరోగ్య పరిస్థితిలో ఎలాంటి మార్పు లేదు. ఆయనను ఇంటెన్సివ్ కేర్‌లో వెంటిలేటర్‌పై ఉంచి చికిత్స అందిస్తున్నాం. వైద్య నిపుణుల బృందం పర్యవేక్షణ కొనసాగుతోంది’ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. (చదవండి : ‘నాన్న కచ్చితంగా మళ్లీ జెండాను ఆవిష్కరిస్తారు’) ఈనెల 10వ తేదీన ఢిల్లీ కంటోన్మెంట్‌లోని ఆర్మీ రీసెర్చ్ అండ్ రెఫరల్ ఆస్పత్రిలో చేరిన ఆయనకు వైద్యులు ఆపరేషన్ చేసి మెదడులో ఏర్పడిన అడ్డంకిని తొలగించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా జరిగిన పరీక్షల్లో ఆయనకు కోవిడ్–19 పాజిటివ్‌గా నిర్ధారణైంది. అప్పటి నుంచి కోమాలో ఉన్న ఆయనకు వెంటిలేటర్‌పైనే చికిత్స అందుతోంది.