సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ విజృంభణ కొనసాగుతూనే ఉంది. గడిచిన 24 గంటల్లో కొత్తగా 66,769 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించగా.. 5,120 మందికి కోవిడ్-19 పాజిటివ్‌గా తేలింది. ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ బుధవారం సాయంత్రం హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. దీంతో రాష్ట్రంలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 7,34,427 కి చేరింది. కరోనా నుంచి ఇవాళ కొత్తగా 6,349 మంది కోలుకోగా.. మొత్తం డిశ్చార్జి అయిన వారి సంఖ్య 6,78, 828గా ఉంది. (చదవండి: ‘వైట్‌హౌస్‌లో ఏం జరిగిందో చూశారుగా?!’)
కాగా కరోనాతో గత 24 గంటల్లో కొత్తగా 34మృతి చెందగా.. మొత్తం మరణాల సంఖ్య 6086కి పెరిగింది. ఏపీలో ప్రస్తుతం 49,513 యాక్టివ్ కేసులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. కాగా రాష్ట్రంలో ఇప్పటివరకు రికార్డు స్థాయిలో 62,83,009 మందికి కరోనా పరీక్షలు నిర్వహించారు.
Comments
Please login to add a commentAdd a comment