సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్‌లో కరోనా వైరస్ నిర్ధారణ పరీక్షలు రికార్డు స్థాయిలో నిర్వహిస్తున్నారు. గడిచిన 24 గంటల్లో 55,010 కరోనా పరీక్షలు నిర్వహించారు. వీరిలో 9,544 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. దీంతో రాష్ట్రంలో మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 3,34,940కు చేరింది. వీరిలో ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వారు 2,461 మంది, ఇతర దేశాల నుంచి వచ్చిన వారు 434 మంది ఉన్నారు. వైరస్ బారిన పడి తాజాగా 91 మంది మరణించడంతో మొత్తం మరణాల సంఖ్య 3,092కి పెరిగింది. తాజా పరీక్షలతో మొత్తం కరోనా పరీక్షల సంఖ్య 31,29,857కి చేరింది. శుక్రవారం ఒక్కరోజే వైరస్ నుంచి కోలుకుని 8827 మంది డిశ్చార్ అయ్యారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ వైద్య ఆరోగ్యశాఖ శుక్రవారం హెల్త్ బులిటెన్‌ను విడుదల చేసింది.
Comments
Please login to add a commentAdd a comment