సాక్షి, న్యూఢిల్లీ : ప్రాణాంతక కరోనా వైరస్ విజృంభణ దేశంలో నానాటికీ పెరుగుతోంది. ఓవైపు కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య రోజురోజుకు రికార్డు స్థాయిలో నమోదవుతుండగా.. మరోవైపు మరణాల సంఖ్యా పెరగడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. తాజాగా గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 18,653 కరోనా పాజిటివ్ కేసులు నిర్ధారణ కాగా, వైరస్ బారినపడి 507 మంది మృతి చెందారు. దేశంలో కోవిడ్ వెలుగుచూసినప్పటి నుంచి ఇంతపెద్ద మొత్తంలో మరణాలు సంభంవించడం ఇదే తొలిసారి. తాజా గణాంకాలతో దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 5,85,493కి చేరగా.. మరణాల సంఖ్య 17,400కి పెరిగింది. ప్రస్తుతం 2,20,114 మంది బాధితులు ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. ఇప్పటి వరకు కరోనా నుంచి 3,47,979 మంది బాధితులు కోలుకున్నారు. ఇప్పటి వరకు 86 లక్షలకు పైగా కరోనా పరీక్షలు నిర్వహించారు. ఈ మేరకు కేంద్ర వైద్య ఆరోగ్యశాఖ బుధవారం హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. (అన్‌లాక్‌తో నిర్లక్ష్యం పెరిగింది!)
Comments
Please login to add a commentAdd a comment