
బిగ్‌బాస్ బ్యూటీ శోభా శెట్టి బర్త్‌డే నేడు (జనవరి 20). ఈ సందర్భంగా బిగ్‌బాస్ ఫ్రెండ్స్ తేజ, అమర్‌దీప్, ప్రియాంక జైన్ తనకు పుట్టినరోజు వేడుకలు చేశారు. చుట్టూ బెలూన్లతో డెకరేషన్, మధ్యలో కేక్ చూసి ఆశ్చర్యపోయింది శోభ. కేక్ కట్ చేయించిన అనంతరం ప్రియాంక.. ఎప్పటికీ నా బెస్ట్ ఫ్రెండ్‌గా ఉండిపోతావా? అంటూ రింగ్‌తో ప్రపోజ్ చేసింది. అందుకు శోభా సంతోషంగా అంగీకరించడంతో ప్రియాంక ఆమెకు ఉంగరం తొడిగింది. ఇక వీళ్లందరూ తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్‌లో పాల్గొన్నారు.










