Shobha Shetty
-
శోభా శెట్టి బర్త్‌డే.. దగ్గరుండి కేక్ కట్ చేయించిన బిగ్‌బాస్ ఫ్రెండ్స్ (ఫోటోలు)
-
తిరుమల శ్రీవారిని దర్శించుకున్న బిగ్‌బాస్ ఫేమ్ టేస్టీ తేజ, శోభ శెట్టి (ఫోటోలు)
-
'బిగ్‌బాస్' హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లతో బయటకొచ్చిన శోభా శెట్టి
కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్లో వైల్డ్ కార్డ్ ఎంట్రీ ఇచ్చిన శోభా శెట్టి అనుకోని పరిస్థితుల్లో హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఎలిమేనేషన్ ప్రక్రియలో తాను సేవ్ అయినప్పటికీ హౌస్‌లో ఉండలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ భరించలేకున్నానంటూ తనను బిగ్ బాస్ నుంచి బయటకు పంపాలని హౌస్ట్ కిచ్చా సుదీప్‌ను కోరింది. అయితే, తాను బయటకు రావడానికి గల కారణాలు తెలిపి హౌస్ నుంచి వచ్చేసింది.తెలుగు బిగ్ బాస్ సీజన్ 7లో తనదైన గేమ్‌తో ఇక్కడి ప్రేక్షకులను మెప్పించిన శోభా శెట్టి ఇలా కన్నీళ్లు పెట్టుకోవడం చూసి టాలీవుడ్ ఆడియన్స్ ఆశ్చర్యపోయారు. ఇక్కడి బిగ్‌బాస్‌లో శివంగిలా సత్తా చాటిన ఆమె ఎందుకు బయటకొచ్చిందో ఇలా పేర్కొంది. కేవలం రెండు వారాల పాటు మాత్రమే ఉన్న శోభ.. తన అనారోగ్య కారణాల వల్ల షో నుంచి బయటకు వచ్చేసింది. బిగ్‌బాస్‌లో గేమ్ ఆడాలని ఉంది కానీ ఆరోగ్యం సహకరించడం లేదని ఆమె పేర్కొంది. బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత తన షోషల్‌మీడియాలో ఒక పోస్ట్ చేసింది.'నా బిగ్ బాస్ ప్రయాణం ముగిసింది. ఆటపై దృష్టి పెట్టేందుకు ఆరోగ్యం సహకరించడం లేదు. ముందుకు వెళ్లాలనే సంకల్పం ఉన్నప్పటికీ, శరీరం దానిని ముందుకు సాగనివ్వడం లేదు. నా ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించి, జీవిత బాధ్యతలతో ముందుకు సాగేందుకే ఈ నిర్ణయం తీసుకున్నా. నాపై చూపిన మీ ప్రేమ, మద్దతుకు నేను ఎప్పటికీ కృతతో ఉంటాను. నేను తెలిసి లేదా తెలియక ఎవరినైనా బాధపెట్టి ఉంటే దయచేసి నన్ను క్షమించండి. నా అభిమానులకు, కలర్స్ కన్నడ టీమ్‌తో పాటు మన ప్రియమైన కిచ్చా సుదీప్ సర్కి ధన్యవాదాలు' అని శోభా శెట్టి పోస్ట్ చేసింది. -
బిగ్‌బాస్ హౌస్‌లో వైల్డ్ కార్డ్‌గా అడుగుపెట్టిన శోభా శెట్టి
బిగ్‌బాస్ షో చప్పగా సాగుతున్నప్పుడు, తిరిగి పట్టాలెక్కించేందుకు వైల్డ్కార్డులనే నమ్ముకుంటున్నారు. అందుకే గత సీజన్‌తో పాటు ఈ సీజన్లో కూడా ఈ ఫార్ములానే నమ్ముకున్నారు. అది ఈసారి కాస్త ఫలించినట్లు కనిపిస్తోంది. ఎంటర్టైన్మెంట్ లేక బోసిపోయిన బిగ్‌బాస్ హౌస్‌కు కాస్త కొత్త కళ వచ్చినట్లయింది.వైల్డ్ కార్డులనే నమ్ముకుంటున్నారుఅటు కన్నడ బిగ్‌బాస్ పదకొండో సీజన్లో కూడా వైల్డ్ కార్డు ఎంట్రీలకు ముహూర్తం ఫిక్స్ చేశారు. ఏడు వారాలుగాయవంతంగా కొనసాగుతున్న ఈ షోలో నేడు ఇద్దరు సెలబ్రిటీలు భాగం కానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రోమో కూడా బయటకు వచ్చేసింది.గతేడాది తెలుగులో.. ఇప్పుడు కన్నడలోప్రోమోలో ఫేస్ రివీల్ చేయలేదు కానీ వచ్చిన ఇద్దరిలో ఒకరు మన తెలుగువారికి బాగా సుపరిచితురాలు. తనే కార్తీక దీపం సీరియల్ విలన్ శోభా శెట్టి. పోయిన ఏడాదే తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో పాల్గొంది. సీరియల్లో చూపించిన ఉగ్రరూపాన్నే ఇక్కడ కూడా చూపించి కొంత నెగెటివిటీ మూటగట్టుకుంది.మరి ఈసారైనా..?కాకపోతే ఎవరినైనా ఎదురించే స్వభావం జనాలకు తెగ నచ్చేసింది. టాప్ 5 వరకు రాకుండానే వెనుదిరిగిన ఈ బ్యూటీ ప్రస్తుతం కన్నడ బిగ్‌బాస్‌లో ఎంట్రీ ఇవ్వనుంది. హౌస్‌లో ఎవరు నీకు పోటీ? అని హోస్ట్ కిచ్చా సుదీప్ అడిగితే.. తనకు ఎవరూ పోటీ కారంటోంది శోభా. మరి అక్కడ ఎన్నివారాలు హౌస్‌లో కొనసాగుతుందో చూడాలి! View this post on Instagram A post shared by Colors Kannada Official (@colorskannadaofficial) మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ బ్యూటీ చీర సింగారం (ఫోటోలు)
-
బిగ్‌బాస్ బ్యూటీ శోభాశెట్టి ట్రెడిషనల్ లుక్.. అదిరిందిగా! (ఫొటోలు)
-
అమ్మచీరచుట్టుకున్న ఆనందంలో బిగ్ బాస్ బ్యూటీ (ఫొటోలు)
-
పెళ్లి వీడియోతో సాయిపల్లవి చెల్లి.. గ్లామరస్ కావ్య థాపర్!
పెళ్లి ఫొటోలు, వీడియో షేర్ చేసిన సాయిపల్లవి చెల్లిచీరలో అందాలతో సీరియల్ బ్యూటీ జ్యోతి రాయ్ మాయడ్యాన్సుతో దుమ్మురేపిన బిగ్ బాస్ శోభ, శుభశ్రీచీరలో మల్లెపూలతో మెరిసిపోతున్న హీరోయిన్ కావ్య థాపర్బ్లాక్ అండ్ వైట్ పోజుల్లో మలయాళ నటి నిమిషా సజయన్గేమ్ ఆడుతూ చిల్ అవుతున్న సింగర్ హారికా నారాయణన్త్రో బ్యాక్ వీడియో పోస్ట్ చేసిన బిగ్ బాస్ ఫేమ్ వితికా షేరు View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by Pooja Kannan (@poojakannan_97) View this post on Instagram A post shared by NIMISHA BINDU SAJAYAN (@nimisha_sajayan) View this post on Instagram A post shared by Subhashree Rayaguru ( Subha ) (@subhashree.rayaguru) View this post on Instagram A post shared by Vasanthi Krishnan (@vasanthi__krishnan) View this post on Instagram A post shared by Priyanka M Jain (@priyankamjain___0207) View this post on Instagram A post shared by iamkalpika (@iamkalpika27) View this post on Instagram A post shared by Kavya Thapar (@kavyathapar20) View this post on Instagram A post shared by SAMPAADA (@sampaada1) View this post on Instagram A post shared by Vithika Sheru (@vithikasheru) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) -
ఖరీదైన కారు గిఫ్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ శోభాశెట్టి (ఫొటోలు)
-
కాబోయే భర్తకు కాస్ట్ లీ కారు గిఫ్ట్ ఇచ్చిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి
గతేడాది బిగ్‌బాస్ 7వ సీజన్‌తో మరింత గుర్తింపు తెచ్చుకున్న సీరియల్ నటి శోభాశెట్టి. అంతకు ముందు 'కార్తీకదీపం'లో మోనిత అనే విలన్ పాత్రలో ఆకట్టుకున్న ఈమె.. ఒకటి రెండు సినిమాల్లోనూ నటించింది. కానీ గతేడాది బిగ్ బాస్ షోలో పాల్గొనడం వల్ల ఈమెపై పాజిటివిటీ కంటే నెగిటివిటీనే ఎక్కువ ఏర్పడింది. దానికి పెద్ద రీజన్ ఏం లేదు. అదంతా పక్కనబెడితే నెలన్నర క్రితం యశ్వంత్ అనే నటుడితో నిశ్చితార్థం చేసుకుంది.(ఇదీ చదవండి: పెళ్లికి రూ.60 లక్షలదాకా ఖర్చు.. ఏం లాభం? నాలుగేళ్లకే విడిపోయిన 'బిగ్ బాస్' జోడీ)'కార్తీకదీపం' సీరియల్లో యశ్వంత్, శోభా శెట్టి నటించారు. అలా షూటింగ్ జరుగుతున్న టైంలో తొలుత ఫ్రెండ్స్ అయ్యారు. ఆ తర్వాత ప్రేమలో పడ్డారు. బిగ్ బాస్ షోలోనే శోభాశెట్టి తన ప్రేమ విషయాన్ని బయటపెట్టింది. రీసెంట్గా ఎంగేజ్మెంట్ చేసుకుంది. దీనితో పాటు కొత్త ఇంట్లో కూడా అడుగుపెట్టింది.ఇప్పుడు తనకు కాబోయే భర్త యశ్వంత్ పుట్టినరోజు సందర్భంగా లక్షలు విలువ చేసే కారుని అతడికి గిఫ్ట్‌గా ఇచ్చింది. బీస్ట్ ఎక్స్‌యూవీ 700 కారుని శోభాశెట్టి కొనుగోలు చేసిన ఫొటోలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. మార్కెట్లో ఈ కారు ధర రూ.15 లక్షల నుంచి రూ.20 లక్షల మధ్యలో ఉంది. ఏదేమైనా పుట్టినరోజుకే ఈ రేంజు గిఫ్ట్ ఇచ్చింది అంటే పెళ్లికి శోభా ఇంకేం బహుమతిని ఇస్తుందో?(ఇదీ చదవండి: రూ.5 కోట్ల ఆఫర్ రిజెక్ట్ చేసిన అనుష్క.. కారణం అదేనా?) -
Shobha Shetty: కొత్తింటి కల సాకారం చేసుకున్న బిగ్‌బాస్ బ్యూటీ.. ప్రియుడితో గృహప్రవేశం (ఫోటోలు)
-
Shobha Shetty Engagement: గ్రాండ్‌గా ప్రియుడితో సీరియల్ నటి శోభా శెట్టి ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
అది పెళ్లిచూపులు.. ఇది ఎంగేజ్మెంట్.. అందంగా ముస్తాబైన శోభా
మోనిత.. బుల్లితెర ప్రేక్షకులకు బాగా గుర్తుండిపోయిన పేరు. కార్తీకదీపం సీరియల్లో విలన్ క్యారెక్టర్‌తో బాగా ఫేమస్ అయిందీ బ్యూటీ. తర్వాత తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో అడుగుపెట్టి మరింత క్రేజ్ సంపాదించుకుంది. ఈ రియాలిటీ షోలోనే తాను ప్రేమలో ఉన్నట్లు వెల్లడించింది. నటుడు యశ్వంత్‌తో డేటింగ్లో ఉన్నట్లు తెలిపింది. వీరిద్దరూ కార్తీకదీపం సీరియల్లో కలిసి నటించారు. షార్ట్ ఫిలింస్‌లోనూ నటించారు. ఆ సమయంలోనే వీరి మధ్య ప్రేమ చిగురించింది.నిశ్చితార్థంబిగ్బాస్ అయిపోగానే పెళ్లికి రెడీ అంటూ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందీ బ్యూటీ. అందులో భాగంగానే జనవరిలో పెద్దల సమక్షంలో పెళ్లి చూపులు నిర్వహించారు. ఇరు కుటుంబాలు తాంబూలాలు మార్చుకున్నారు. ఎంగేజ్మెంట్కు ముహూర్తం పెట్టుకున్నారు. తాజాగా వీరి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తెలుస్తోంది. నిశ్చితార్థం కోసం ఇలా రెడీ అయ్యామంటూ శోభ యూట్యూబ్‌లో ఓ వీడియో షేర్ చేసింది.చిరునవ్వుతో పలకరింపుచేతుల నిండా మెహందీ వేసుకుని ఒంటి నిండా నగలతో అందంగా ముస్తాబైంది. పసుపు రంగు బ్లౌజ్‌కు మగ్గం వర్క్ వేయించింది. దీనికి లైట్ కలర్లో ఉన్న చీరను మ్యాచ్ చేసింది. తన ఎంగేజ్మెంట్ కోసం వచ్చిన అందరినీ చిరునవ్వుతో పలకరించింది. ఈ వీడియో చూసిన అభిమానులు శోభా శెట్టికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. -
కొత్త ఇంట్లోకి అడుగుపెట్టిన 'బిగ్‌బాస్' శోభాశెట్టి.. వీడియో వైరల్
'కార్తీకదీపం' సీరియల్, 'బిగ్‌బాస్ 7' షోతో గుర్తింపు తెచ్చుకున్న శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగు పెట్టేసింది. సోమవారం గృహ ప్రవేశం జరగ్గా.. బిగ్‌బాస్ షోలో తనతో పాటు పాల్గొన్న తేజ, ప్రియాంక, గౌతమ్, సందీప్ మాస్టర్ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.(ఇదీ చదవండి: టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ షాకింగ్ డెసిషన్.. ఎగ్ ఫ్రీజింగ్ వీడియో వైరల్)కర్ణాటకకు చెందిన శోభాశెట్టి.. కన్నడలో పలు షోలు చేసింది. తెలుగులోకి 'కార్తీకదీపం' సీరియల్‌తో ఎంట్రీ ఇచ్చింది. ఇందులో మోనిత అనే విలన్‌గా ఆకట్టుకునే ఫెర్ఫార్మెన్స్ చేసింది. గతేడాది బిగ్‌బాస్ 7వ సీజన్లో పాల్గొన్న ఈమె.. ఫైనల్ వరకు వచ్చింది కానీ విజేత కాలేకపోయింది. మరోవైపు ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డి అని పరిచయం చేసింది. వీళ్లకు ఇప్పటికే నిశ్చితార్థం కూడా జరిగింది.ప్రస్తుతం శోభాశెట్టి కొత్త ఇంట్లోకి అడుగుపెట్టేసింది. ఈ గృహ ప్రవేశానికి బిగ్ బాస్ ఫ్రెండ్స్ అందరూ వచ్చారు. అయితే షోలో పాల్గొన్న తర్వాత వచ్చిన డబ్బులతోనే శోభా ఇల్లు కట్టుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా శోభా కొత్త ఇంట్లో ఉన్న వీడియోని టేస్టీ తేజ తన యూట్యూబ్‌లో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 16 సినిమాలు రిలీజ్.. అవేంటంటే?) -
Shobha Shetty Latest Photos: లంగా ఓణీలో మరింత అందంగా 'బిగ్‌బాస్' శోభాశెట్టి (ఫొటోలు)
-
అమర్‌ను సర్ప్రైజ్ చేసిన శోభ.. అతడి కోసం త్యాగం..
బిగ్‌బాస్ షోను డీల్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. కంటెస్టెంట్లను మెచ్చుకోవాలి. తప్పు చేసినవారిని సరిచేయాలి.. వారి నుంచి ఎంటర్టైన్మెంట్ రప్పించాలి.. ఎపిసోడ్‌ను జోష్‌గా ఉంచాలి.. ప్రేక్షకులు షో చూడగలిగేలా చేయాలి.. ఇలా చాలానే ఉంటాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నా సరే బిగ్‌బాస్‌ను ఓ బాధ్యతగా భుజానెత్తుకున్నాడు కింగ్ నాగార్జున. వరుసగా ఐదు సీజన్లకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎనిమిదో సీజన్‌కు కూడా ఆయనే యాంకర్‌గా ఉంటాడు. ఇందులో డౌటే లేదు. శోభాకు టీషర్ట్ గిఫ్ట్ కాకపోతే నాగ్ ఎక్కువగా కోప్పడడు. అలాంటిది ఏడో సీజన్లో మాత్రం ఉగ్రరూపాన్ని చూపించాడు. ఒక్కొక్కరు మారు మాట్లాడకుండా చేశాడు. అమ్మాయిలను మాత్రం సుతిమెత్తగానే వారించేవాడు. ఓ రోజు శోభా శెట్టి నాగ్ ధరించిన టీ షర్ట్ చూసి ముచ్చటపడింది. అది కావాలని మనసులో మాట బయటపెట్టింది. అంత ప్రేమగా అడిగితే మన్మథుడు కాదంటాడా? షో అయిపోయిన వెంటనే ఆ టీ షర్ట్‌ను ఇచ్చేశాడు. కానీ అదే షోలో అమర్దీప్ అడిగితే మాత్రం నీకు ఇచ్చేదేంటన్నట్లుగా చూశాడు. ఫ్రెండ్ కోసం త్యాగం ఇక షో అయిపోయాక ఆ టీషర్ట్ ధరించి ఫోటోషూట్ కూడా చేసింది శోభ. అయితే స్నేహితుడి కోరిక గుర్తొచ్చి అతడి కోసం ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నాగార్జున తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన టీషర్ట్‌ను ఓ షోలో అమర్‌కు త్యాగం చేసింది. 'ఇది నాకెంతో విలువైన బహుమతి. కానీ ఆరోజు అమర్ నాగ్ సర్‌ను అడిగాడు, కాబట్టి ఇది తనకు ఇచ్చేస్తున్నా' అని చెప్పింది. అది తీసుకుని మురిసిపోయిన అమర్ స్టేజీపైనే దాన్ని ధరించి సంబరపడ్డాడు. ఇది చూసిన జనాలు శోభను మెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: షారుక్ ఖాన్ అంత ఆస్తి లేదు, భరణం ఎంతిచ్చానంటే? -
చాలాసార్లు మోసపోయా.. డబ్బులు తిరిగివ్వలేదు.. ఇన్నాళ్లకు!:శోభ
బిగ్‌బాస్ షో వల్ల పాపులారిటీ ఎంతొస్తుందో నెగెటివిటీ కూడా అంతే వస్తుంది. షోలో ఏమాత్రం తడబడ్డా, గొడవలు పడ్డా వారిని సోషల్ మీడియాలో ఇట్టే ట్రోలింగ్ చేస్తుంటారు. అలా తెలుగు బిగ్‌బాస్ ఏడో సీజన్లో శోభా శెట్టిపై విపరీతమైన ట్రోలింగ్ జరిగింది. ప్రతీదీ తనకే కావాలన్న స్వార్థం, ఓటమిని అంగీకరించలేని తత్వం, చిన్నదానికీ గొడవపడే వైఖరి ఆమెను విమర్శలపాలు చేసింది. అదే సమయంలో శివంగిలా పోరాడే గుణం, స్నేహితుల కోసం ఎంతవరకైనా వెళ్లే మంచి మనసు ఆమెకు అభిమానులను తెచ్చిపెట్టింది. ఎన్నో ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల.. ఇక షో ముగిశాక తన పర్సనల్ లైఫ్‌పై ఎక్కువ ఫోకస్ చేసిందీ బ్యూటీ. ఈ మధ్యే తన ప్రియుడు యశ్వంత్‌తో ఎంగేజ్మెంట్ జరుపుకుంది. తాజాగా మరో శుభవార్త చెప్పింది శోభ. చాలా ఏళ్లుగా ఎదురుచూస్తున్న కల ఇప్పుడు సాకారమైందని, అయోధ్య రామమందిర ప్రారంభోత్సవం రోజు(జనవరి 22న) కొత్తింటి తాళం తన చేతికొచ్చిందని ఆనందం వ్యక్తం చేసింది. శోభా మాట్లాడుతూ.. 'రెండేళ్ల క్రితం నిర్మాణంలో ఉన్న అపార్ట్మెంట్ చూశాం. నచ్చడంతో అడ్వాన్స్ డబ్బులు కూడా ఇచ్చాం. కానీ ఏవో కారణాల వల్ల ఆ భవన నిర్మాణం ఆగిపోయింది. డబ్బులు తిరిగివ్వలేదు అప్పుడు మేమిచ్చిన డబ్బులు కూడా తిరిగివ్వలేదు. అలా చాలాసార్లు మోసపోయాం. ఈ క్రమంలో ఈ ఇల్లు కూడా కొంటానా? లేదా? అని టెన్షన్‌పడ్డాను, కానీ మొత్తానికి నా కల నెరవేరింది. బిగ్‌బాస్ ఇచ్చిన డబ్బులతో ఈ ఇల్లు తీసుకోలేదు. రెండేళ్ల క్రితమే దీన్ని కొనుగోలు చేశాము. కాకపోతే ఆలస్యంగా ఈ ఇంటి తాళం నా చేతికి వచ్చింది. మేము 15వ అంతస్థులో ఉన్న ఫ్లాట్ తీసుకున్నాం. ఇంటీరియర్ డిజైనింగ్‌కు మరో నాలుగు నెలలు పడుతుంది. ఆ తర్వాతే ఈ ఇంటికి షిఫ్ట్ అవుతాం' అని చెప్పుకొచ్చింది. -
బిగ్ బాస్ శోభాశెట్టి ఎంగేజ్మెంట్ అప్డేట్
-
సైలెంట్‌గా ఎంగేజ్మెంట్ చేసుకున్న 'బిగ్‌బాస్' శోభాశెట్టి
బిగ్‌బాస్ 7 ఫేమ్ శోభాశెట్టి ఎలాంటి హడావుడి లేకుండా నిశ్చితార్థం చేసుకుంది. సరిగ్గా ఓ రెండు నెలల క్రితం ఇదే షోలో ప్రియుడిని పరిచయం చేసింది. ఇప్పుడు ఎంగేజ్మెంట్ చేసుకుంది. అలానే త్వరలో పెళ్లి కూడా చేసుకోనుంది. ఇంతకీ ఈ కార్యక్రమం ఎప్పుడు ఎక్కడ జరిగింది? శోభాశెట్టి దీని గురించి ఏం చెప్పిందనేది ఇప్పుడు చూద్దాం. కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. 'కార్తీకదీపం' సీరియల్లో మోనిత అనే విలన్ పాత్రతో బోలెడంత గుర్తింపు తెచ్చుకుంది. దాదాపు ప్రతి తెలుగింటిలోనూ ఈమెకు అభిమానులు ఉండొచ్చు. నటిగా అలా అదరగొట్టేసింది. ఇక గతేడాది జరిగిన బిగ్‌బాస్ 7వ సీజన్లో పాల్గొని దాదాపు చివరివరకు వచ్చేసింది. శివాజీ అండ్ గ్యాంగ్‌కి తన మాటలతో చుక్కలు చూపించింది. చాలామంది ఈమెని విమర్శించారు కానీ శివాజీ లాంటి వాళ్లతో పోలిస్తే శోభా చాలా బాగా ఆడిందని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్‌పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!) ఇకపోతే ఇదే షోలో తన ప్రియుడు యశ్వంత్ రెడ్డిని పరిచయం చేసింది. శోభా-యశ్వంత్.. ఇదే 'కార్తీకదీపం' సీరియల్లో కలిసి నటించారు. షార్ట్ ఫిల్మ్స్‌లోనూ యాక్ట్ చేశారు. అలా పనిచేస్తూ ప్రేమలో పడ్డారు. అయితే గతేడాది వీళ్ల నిశ్చితార్థం జరగాల్సింది కానీ ఎందుకో క్యాన్సిల్ అయిపోయిందట. ఈ విషయాన్ని స్వయంగా శోభాశెట్టిని ఇప్పుడు బయటపెట్టింది. తాజాగా బెంగళూరులోని శోభాశెట్టి ఇంట్లో నిశ్చితార్థం జరిగింది. యశ్వంత్-శోభా దండలు మార్చుకున్నాడు. అయితే ఇది నిశ్చితార్థ వేడుక అని వీడియోలో శోభాశెట్టి ఎక్కడ చెప్పలేదు. తర్వాత వీడియోలో దీని గురించి చెబుతానని దాటవేసింది. త్వరలో పెళ్లి డేట్ కూడా చెప్పేస్తుందేమో? (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) -
Shobha Shetty: బిగ్‌బాస్ బ్యూటీకి నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. టీ షర్ట్‌లో శోభ (ఫోటోలు)
-
నాగార్జున స్పెషల్ గిఫ్ట్.. ఎగిరి గంతేసిన బిగ్‌బాస్ బ్యూటీ
విలనిజం పండించడం అంత ఈజీ కాదు. విలన్‌గా హీరోహీరోయిన్లను డామినేట్ చేయడమూ అంత ఈజీ కాదు. కానీ 'కార్తీక దీపం' సీరియల్‌తో మోనిత అలియాస్ శోభా శెట్టి అన్నీ సుసాధ్యమే అని నిరూపించింది. కొన్ని సార్లు హావభావాలతోనే విలనిజం పండించేది. మరికొన్నిసార్లు తన యాక్టింగ్‌తో అవతలవారిని డామినేట్ చేసేది. ఈ ధారావాహికలో ఆమె చేసే కుట్రలు, కుతంత్రాలు చూసి జనాలు అమ్మో.. అని దడుచుకునేలా చేసింది. నాగార్జునను అడిగేసిన శోభ ఎంతో టాలెంట్ ఉన్న ఈ నటి తెలుగు బిగ్‌బాస్ 7లోనూ ఛాన్స్ దక్కించుకుంది. ఉల్టా పుల్టా కాన్సెప్ట్‌తో వచ్చిన ఈ సీజన్లో తన ఆటతో, అందంతో రఫ్ఫాడించింది. చాలాసార్లు తనలోని మోనితను బయటకు తీసుకువచ్చేది శోభ. అదే సమయంలో ఎవరికీ జంకకుండా, తనకు నచ్చింది చేసుకుంటూ పోతూ శివంగిలా ఆడేది. ఈ తీరు చాలామంది జనాలను కట్టేపడేసింది. ఇక షోలో ఉన్నప్పుడు ఓసారి హోస్ట్ నాగార్జున వేసుకున్న వెరైటీ షర్ట్ చూసి ముచ్చటపడిపోయింది శోభ. అది తనకు కావాలని అడిగింది. దాన్ని సీరియస్‌గా తీసుకున్న నాగ్ నిజంగానే ఆ డ్రెస్‌ను ఆమెకు బహుమతిగా ఇచ్చాడు. ఈ విషయాన్ని శోభ తన యూట్యూబ్ ఛానల్లో వెల్లడించింది. గుర్తుపెట్టుకుని మరీ బహుమతిచ్చిన నాగ్ 'బహుశా ఆరో వారంలో అనుకుంటా.. అప్పుడు నాగార్జున ధరించిన టీ షర్ట్ కావాలని అడిగాను. తర్వాత నేను 14వ వారంలో ఎలిమినేట్ అయ్యాను. నేను టీ షర్ట్ అడిగిన విషయం గుర్తుపెట్టుకుని మరీ ఎలిమినేట్ అయిన రోజు నాగ్ సర్ స్వయంగా ఆ టీషర్ట్ ఇచ్చారు. ఆయన వేసుకున్న టీషర్ట్ నాకు ఇచ్చేశారు.. అంతకంటే సంతోషం ఏముంటుంది? ఇది ధరించి ఫోటోషూట్ కూడా చేశాను' అంటూ తన షూట్ ఎలా జరిగిందో వీడియోలో చూపించింది. ఇది చూసిన జనాలు.. శోభా అనుకున్నది సాధించింది.. నువ్వు ఇలాగే డేర్ అండ్ డాషింగ్‌గా ఉండాలి, మరిన్ని మంచి అవకాశాలతో కెరీర్లో పైకి ఎదగాలి అంటూ కామెంట్లు చేస్తున్నారు. చదవండి: ఫుడ్ పాయిజన్ తర్వాతే ఇలా.. క్రికెట్ ఆడేటప్పుడు అలా అవడంతో. డిఫరెంట్ కాన్సెప్ట్ మూవీ.. ఇన్నాళ్లకు ఓటీటీలో రిలీజ్ -
త్వరలో పెళ్లి చేసుకోబోతున్న ప్రియాంక, శోభా శెట్టి !
-
అవార్డ్ గెలుచుకున్న శోభా
-
'బిగ్‌బాస్ 7'లో ఓడిపోతేనేం.. ఇప్పుడు శోభాశెట్టికి ఆ అవార్డ్
ఈసారి బిగ్‌బాస్ సీజన్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. మరీ ముఖ్యంగా ఇందులో పాల్గొన్న సీరియల్ నటి శోభాశెట్టి ఇంకా గుర్తుండిపోతుంది. ఎందుకంటే ఆట కంటే గొడవలతో చాలా ఫేమ్ తెచ్చుకుంది. అదే టైంలో విపరీతమైన ట్రోలింగ్ కూడా ఫేస్ చేసింది. బిగ్‌బాస్ ట్రోఫీ కచ్చితంగా గెలిచి తీరుతానని చెప్పిన శోభా.. 14వ వారం ఎలిమినేట్ అయి ఆ కల నెరవేర్చుకోలేకపోయింది. అయితేనేం ఇప్పుడో అవార్డ్ గెలుచుకుని మళ్లీ వార్తల్లో నిలిచింది. (ఇదీ చదవండి: డార్లింగ్ ప్రభాస్ ఒక్క రోజు భోజనం ఖర్చు ఎంతో తెలుసా?) శోభాశెట్టి అంటే బహుశా ఎవరికీ తెలియకపోవచ్చు. 'కార్తీకదీపం' మోనిత అంటే మాత్రం టక్కున గుర్తుపట్టేస్తారు. ఈ సీరియల్లో లేడీ విలన్‌గా చేసి చాలా పేరు తెచ్చుకుంది. అలా ఈసారి బిగ్‌బాస్ షోలో అడుగుపెట్టింది. కానీ ఆట, గెలుపు కంటే గొడవలు పెట్టుకోవడంతోనే ఈమె బాగా ఫేమస్ అయింది. ఒకానొక టైంలో ఈమెని ఎలిమినేట్ చేయకుండా ఇంకా ఉంచుతున్నారేంట్రా బాబు అని చాలామంది అనుకున్నారు. కానీ ఇలాంటి క్యారెక్టర్ షోలో లేకపోతే పెద్దగా మజా ఉండదు. సోఫాజీ అలియాస్ శివాజీకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చే విషయంలో ఎక్కడా తగ్గని శోభా.. దాదాపు చివరి వరకు వచ్చేసింది. ఫినాలేకి వారం ఉందనగా ఎలిమినేట్ అయిపోయింది. తాజాగా ఈమెకు ఉత్తమ ప్రతినాయకగా రాష్ట్రీయ గౌరవ్ అవార్డ్ వచ్చింది. ఈ విషయాన్ని శోభానే స్వయంగా తన ఇన్ స్టాలో ఫొటోలతో సహా పోస్ట్ చేసింది. ప్రస్తుతానికైతే ఈమె కొత్త సీరియల్స్ ఏం చేయట్లేదు. త్వరలో షోల్లో గానీ, సీరియల్స్‌లో గానీ శోభా మళ్లీ కనిపించే అవకాశముంది. (ఇదీ చదవండి: Bigg Boss Telugu: పల్లవి ప్రశాంత్ వివాదం.. నిర్వాహకులు షాకింగ్ డెసిషన్) View this post on Instagram A post shared by Shobhashetty (@shobhashettyofficial) -
గుడ్‌న్యూస్ చెప్పిన బిగ్‌బాస్ బ్యూటీ..
తెలుగు బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ ప్రియాంక జైన్ గుడ్‌న్యూస్ చెప్పింది. త్వరలోనే మూడు ముళ్లబంధంలోకి అడుగుపెట్టనున్నట్లు చెప్పింది. గత కొన్నేళ్లుగా నటుడు శివకుమార్‌తో ప్రేమలో మునిగి తేలుతోందీ నటి. ఇటీవల బిగ్‌బాస్ హౌస్‌లో తాను శివకుమార్‌తో ప్రేమలో ఉన్న విషయాన్ని ధ్రువీకరించింది. అంతేకాదు, అతడు హౌస్‌లోకి రాగానే పెళ్లెప్పుడు చేసుకుందాం.. బిగ్‌బాస్ అయిపోగానే భార్యాభర్తలుగా కొత్త జర్నీ మొదలుపెడదాం అంటూ ఎమోషనలైంది. అప్పుడే పెళ్లి అటు శివకుమార్ సైతం.. ప్రియురాలిని ముద్దులతో ముంచెత్తి ఆప్యాయంగా హత్తుకున్నాడు. బిగ్‌బాస్ 7లో టాప్ 5కి చేరుకున్న ప్రియాంక తాజాగా తన పెళ్లి గురించి యూట్యూబ్ ఛానల్లో అప్డేట్ ఇచ్చింది. వచ్చే ఏడాదే పెళ్లి చేసుకోబోతున్నట్లు ప్రకటించింది. త్వరలోనే మూహూర్తం ఫిక్స్ చేసి ఆ పెళ్లి తేదీ కూడా సోషల్ మీడియాలో వెల్లడిస్తామని తెలిపింది. అలాగే తన పెళ్లి గురించి చాలా ఆలోచనలు ఉన్నాయని, అవన్నీ మరో వీడియోలో చెప్తానంది. శోభా పెళ్లి కూడా అప్పుడే! ఇకపోతే బిగ్‌బాస్ హౌస్‌లో ఓ టాస్క్‌లో భాగంగా తన జుట్టు కత్తిరించుకున్న ప్రియాంక.. తన హెయిర్ ఇంకాస్త పొడుగ్గా అయిన తర్వాతే వివాహం చేసుకుంటానంది. పనిలో పనిగా మరో సీక్రెట్ కూడా బయటపెట్టింది. తన బెస్ట్ ఫ్రెండ్, బిగ్‌బాస్ 7 కంటెస్టెంట్ శోభా కూడా త్వరలోనే పెళ్లి పీటలెక్కనుందని సీక్రెట్ రివీల్ చేసింది. దీంతో అభిమానులు వీరిద్దరికీ ముందస్తుగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. చదవండి: నాకోసం ఎవరూ ముందుకు రాలే.. దుస్తులు కొనుక్కునే స్థోమత లేక.. -
వెనకాల గోతులు తవ్వుతోంది.. అమర్ వీడియో చూసి షాకైన శోభ
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆదివారం నాడు శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. తన ఎలిమినేషన్‌ను జనాలే కాదు శోభా కూడా పసిగట్టేసింది. అందుకే ఏదైతే అదైందని గతవారం హౌస్‌లో విశ్వరూపం చూపించింది. అందరి మీదా అరిచేసింది. కావాలని గొడవపెట్టుకుంది. ఇతరుల్ని రెచ్చగొట్టింది. చివరకు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. తాజాగా ఆమె బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా గీతూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. మీరు హౌస్‌లో ప్రిన్స్ యావర్ సహా పలువురిని టార్గెట్ చేశారనిపించింది.. నిజమేనా? అని గీతూ అడగ్గా.. గేమ్‌ను టార్గెట్ చేశానే తప్ప ఎవరినీ టార్గెట్ చేయలేదని వివరణ ఇచ్చింది. తేజ కోసం బిగ్‌బాస్‌కు రాలే.. తేజ నువ్వు లేకుండా ఉండలేనన్న మీరు అతడు వెళ్లిపోయాక ఒక్కసారి కూడా తల్చుకోలేదేంటి? అని అడిగింది గీతూ.. దీనికి శోభా స్పందిస్తూ.. తేజ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు రాలేదు, తేజని తల్చుకుని ఏడుస్తూ సింపతీ రావాలనుకోలేదని క్లారిటీ ఇచ్చింది. శోభా ఇంకా మాట్లాడుతూ.. అమర్, అర్జున్.. ఇద్దరికీ సపోర్ట్ చేస్తాను. ప్రియాంక నా స్నేహితురాలైనా సపోర్ట్ చేయను. ఎందుకంటే అమర్ గెలవాలని ఎక్కువగా ఉంది. శివాజీ స్ట్రాటజీతో ఆడుతున్నాడు. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలంటే మెంటల్ గేమ్ ఆడటం చాలా అవసరం.. అది శివాజీ గ్రిప్‌లో పెట్టుకున్నాడు. జనాలకు ఏది చేస్తే నచ్చుతుంది అనేది ఆలోచించి మరీ ఆడుతున్నాడు. ఇలా ఆడితే ఏకంగా విన్నర్ అయిపోవచ్చు. అమర్ మాటలు విని షాక్ అమర్.. శోభ గురించి మాట్లాడిన వీడియో చూపించింది గీతూ. 'శోభ బ్యాక్‌బిచింగ్ చేస్తుంది. స్వార్థం ఎక్కువైపోయింది.. అంత స్వార్థంగా ఆలోచించేవారు గేమ్‌లో ముందుకు వెళ్లలేరు' అని మాట్లాడాడు.. ఇది చూసి షాకైన శోభ.. 'ఇది నాకు తెలియలేదు, హౌస్‌లో ఈ వీడియో చూపించాల్సింది' అని అభిప్రాయపడింది. ఇక చాలామటుకు గీతూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేసింది శోభ. చదవండి: బంగారు తల్లీ.. నిన్ను కలిసేవరకు నాకీ శోకం తప్పదు.. విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్ -
Bigg Boss 7: అనుకున్నట్లే శోభా ఎలిమినేషన్.. కాకపోతే అదొక్కటే అసంతృప్తి!
బిగ్‌బాస్ 7వ సీజన్ 14వ వారం కూడా పూర్తయిపోయింది. అనుకున్నట్లే శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోయింది. అయితే చివరకొచ్చేసరికి కాస్త టెన్షన్ పెట్టారు గానీ అప్పటికే అందరికీ సీన్ అర్థమైపోయింది. అయితే శోభా.. ఎలిమినేట్ కావడం మాటేమో గానీ సడన్‌గా తనలో ఓ మార్పు చూపించి అందరికీ షాకిచ్చింది. ఇంతకీ ఆదివారం ఏం జరిగిందనేది Day 98 ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?) పశ్చాత్తాపం టాస్క్ శనివారం అందరినీ ఓ ఆటాడేసుకున్న హోస్ట్ నాగార్జున.. ఆదివారం వచ్చేసరికి ఫుల్ కూల్ అయిపోయాడు. 14 వారాల్లో ఏ వారం మీరు పశ్చాత్తాపంగా ఫీలయ్యారు? ఎందుకు? అనే చిన్న గేమ్ ఒకటి పెట్టాడు. ప్రియాంక.. 7వ వారంలో భోలెని ఓ మాట అనకుండా ఉండాల్సిందని చెప్పింది. శోభాశెట్టి.. 9వ వారం యావర్‌ని పిచ్చోడని అనకుండా ఉండాల్సిందని చెప్పింది. అమర్.. 14వ వారం తను ఎందుకలా పిచ్చోడిలా ప్రవర్తించానే అర్థం కాలేదని అన్నాడు. శివాజీ.. 14వ వారంలో ఆడపిల్లల గురించి ఉపయోగించిన పదాలు వ్యక్తిగతంగా ఫీలయ్యాను కానీ మిగతావాళ్లకు అవి టచ్ అయ్యాయని, ఈ విషయంలో పశ్చాత్తాపపడ్డానిని సంజాయిషీ ఇచ్చుకున్నారు. మిగతా వాళ్లందరూ ఒక్క ముక్కలో చెబితే.. శివాజీ మాత్రం సీరియల్ సాగదీసినట్లు చాంతాడంత చెప్పాడు. పోనీ అదైనా చక్కగా ఉందా అంటే.. మొత్తం యాక్టింగే కనిపించింది. ఎవరు ఏం నేర్చుకున్నారు? ఇక పశ్చాత్తాపం గేమ్ పూర్తయిన తర్వాత 14 వారాల్లో ఒక్కో కంటెస్టెంట్.. ఎవరి దగ్గర ఏం నేర్చుకున్నారో చెప్పాలని నాగ్ చెప్పాడు. దీంతో ఫస్ట్ మాట్లాడిన అమర్.. ప్రశాంత్ దగ్గర నుంచి గేమ్ ఆడటం నేర్చుకున్నాను. అర్జున్ దగ్గర నిజాయతీ నేర్చుకున్నానని అన్నాడు. శివాజీ దగ్గర ఓపికగా ఉండటం నేర్చుకున్నానని యావర్ అన్నాడు. అమర్‌లా ఫౌల్ గేమ్స్ ఆడొద్దని నేర్చుకున్నానని ప్రియాంక చెప్పింది. శివాజీ దగ్గర లౌక్యం, యావర్ దగ్గర పట్టుదల, ప్రశాంత్ దగ్గర కలిసిపోయి నవ్వుతూ మాట్లాడటం, ప్రియాంక దగ్గర నవ్వుతూ మాట్లాడటం నేర్చుకున్నానని అర్జున్ చెప్పాడు. శోభా మాత్రం.. ఎవరి దగ్గర ఏం నేర్చుకోలేదు కానీ ఫోన్ లేకుండా బతకడం నేర్చుకున్నానని డిఫరెంట్‌గా చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: లేటు వయసులో పెళ్లి చేసుకున్న జైలర్ నటుడు, ఫోటోలు వైరల్) ఫైనలిస్టులుగా వాళ్లు గతవారం టికెట్ టూ ఫినాలే పోటీల్లో గెలిచి చివరివరకు నిలిచిన అర్జున్.. తొలి ఫైనలిస్ట్‌గా నిలిచాడు. ఇక ఇప్పుడు సేవింగ్, ఎలిమినేషన్ లాంటిది కాకుండా ఎవరెవరు ఫైనలిస్ట్ అయ్యారనేది నాగార్జున ప్రకటించాడు. వరసగా ప్రియాంక, యావర్, అమర్, ప్రశాంత్.. ఫినాలే వీక్‌లోకి అడుగుపెట్టినట్లు చిన్నచిన్న హింట్స్ రూపంలో రివీల్ చేశారు. చివరగా శోభా-శివాజీ మిగలగా.. కాసేపు సస్పెన్స్ తర్వాత శోభా ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే తాను బయటకెళ్లిపోతానని ముందే తెలుసో ఏమో గానీ పెద్దగా రియాక్ట్ కాలేదు. సైలెంట్‌గా స్టేజీపైకి వచ్చేసింది. అయితే ఆమె ఓవరాల్ జర్నీ వీడియో చూపించినప్పుడు మాత్రం కన్నీళ్లు పెట్టుకుంది. అలానే ఇన్నిరోజులు హౌసులో అందరితో పోట్లాడిన శోభా.. ఎలిమినేట్ అయిన తర్వాత మాత్రం శాంతమూర్తిలా అందరి గురించి మంచిగా చెబుతూ కనిపించేసరికి.. ఈమెలో ఏంట్రా ఈ మార్పు అని అనుకున్నారు. అయితే ఎలిమినేట్ అవుతానని తెలియడం వల్లనో ఏమో గానీ శివాజీ, యావర్‌లని గేమ్స్ పేరుతో ట్రిగ్గర్ చేసి, వాళ్ల నిజస్వరూపాల్ని బయటపెట్టి వెళ్లిపోయింది. ఇప్పుడున్న వాళ్లతో శోభాతో కొన్ని విషయాల్లో బ్యాడ్ అయ్యిండొచ్చు కానీ ఆమెని చివరి వారం కూడా ఉంచుంటే శివాజీని ఆడుకునేది. ఇప్పుడు ఆమె ఎలిమినేట్ అయిపోవడం.. ఆమె అభిమానులకు చిన్న అసంతృప్తిని మిగిల్చింది. ఇకపోతే టాప్-6 సెలబ్రేషన్స్ చేసుకోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: ముంబైలో లగ్జరీ ఇల్లు, ఖరీదైన కార్లు.. రామ్ చరణ్ ఆస్తులెంతో తెలుసా?) -
Bigg Boss 7: శోభాశెట్టి ఎలిమినేట్.. మొత్తం రెమ్యునేషన్ ఎంతో తెలుసా?
చాలామంది ప్రేక్షకులు ఎప్పటినుంచో తెగ ఆరాటపడుతున్నట్లు.. శోభాశెట్టి ఎలిమినేట్ అయిపోయింది. 14వ వారం బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చేసింది. అయితే ఇది ఆమెకు ఇది పెద్ద షాకింగ్ విషయమేం కాదు. ఎందుకంటే ఇలా జరుగుతుందని ముందే ఊహించింది. ఇంతకీ శోభా ఎలిమినేషన్‌కి కారణమేంటి? మొత్తంగా రెమ్యునరేషన్ ఎంత సంపాదించింది? శోభా ఎలిమినేషన్ కరెక్టేనా? శోభాశెట్టి.. బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్లో సీరియల్ బ్యాచ్‌కి లీడర్. ఫస్ట్ నుంచి అమర్-ప్రియాంకకి సపోర్ట్ చేస్తూనే వచ్చింది. లెక్క ప్రకారం చూస్తే ఈమె చాన్నాళ్ల క్రితమే ఎలిమినేట్ అయిపోవాలి. కానీ షో ఆర్గనైజర్స్ అలా చేయలేదు. శోభాశెట్టిలో వీళ్లకు టీఆర్పీ కనిపించింది. దీంతో మోస్తరుగా ఆడినా సరే ఆమెని చివరివరకు లాక్కొచ్చేశారు. ఎందుకంటే అవసరం అలాంటిది మరి. అలానే శివాజీతో ఢీ అంటే ఢీ అనేలా ఫైట్ చేసింది కూడా ఈమె ఒక్కతే. అలాంటి శోభాని ముందే పంపేంచేసి ఉంటే షోలో మజా ఉండేది కాదు. ఇన్నాళ్లకు శోభా అవసరం తీరిపోయింది. దీనికి తోడు ప్రస్తుతమున్న వాళ్లలో ఓటింగ్ శాతం శోభాదే తక్కువ. అలా ఈమె ఎలిమినేట్ అయిపోవాల్సి వచ్చింది. శివాజీ పరువు పాయే ఈ సీజన్లో సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్.. అందరికి అందరూ అలానే తయారయ్యారు. గేమ్స్ పరంగా అర్జున్, ప్రియాంక మినహా ఒక్కరు కూడా తిన్నగా ఆడలేదు. దీని గురించి పక్కనబెడితే 14 వారాలుగా అమర్‌ని పురుగు కంటే హీనంగా చూసిన శివాజీ.. నోటికి ఎన్ని వస్తే అన్ని మాటలు అన్నాడు. 'పనికిమాలినోడా' లాంటి చీప్ కామెంట్స్ చేశాడు. అయినా సరే అమర్.. వీటిని పెద్దగా పట్టించుకోలేదు. కానీ ఈ వారం.. ఓ టాస్క్ సందర్భంగా జస్ట్ పదే పదే నిమిషాల్లో శివాజీని ఆడేసుకుంది. దీంతో సోఫాజీ ట్రిగ్గర్ అయిపోయాడు. కట్ చేస్తే.. ఆడపిల్లల్ని పీకుతా, పీకమీద కాలేసి తొక్కుతా అని శివాజీ చిల్లర కామెంట్స్ చేశాడు. దీంతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోయింది. దీన్ని కవర్ చేసేందుకు ప్రస్తుతం సోషల్ మీడియాలో శివాజీ బ్యాచ్ పెయిడ్ ప్రమోషన్స్ చేస్తున్నారు. అయితే ఈ విషయంలో శోభా సూపర్ ఆడింది అని చెప్పం గానీ ఎలిమినేట్ అయి వెళ్తూ వెళ్తూ శివాజీ పరువు మాత్రం తీసేసి వెళ్లిపోయింది. రెమ్యునరేషన్ ఎంత? సీరియల్ నటిగా శోభాకి కాస్త పేరుంది. అలానే వారానికి రెండున్నర లక్షల రూపాయల చొప్పున రెమ్యునరేషన్ మాట్లాడుకున్నట్లు తెలుస్తోంది. అంటే 14 వారాలకుగానూ మొత్తం రూ.35 లక్షల వరకు రెమ్యునరేషన్ అందుకున్నట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు ఎలిమినేట్ అయినవాళ్ల పరంగా చూసుకుంటే మాత్రం శోభాదే హయస్ట్ అని చెప్పొచ్చు. సో అదన్నమాట విషయం. -
అతన్ని ఆ మాట అనకుండా ఉండాల్సింది: శోభా శెట్టి ఎమోషనల్
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ చివరి ఘట్టానికి చేరుకుంది. బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న షో మరో వారంలో ముగియనుంది. ఈ వారంలో ఒకరు ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ ఉండగా.. చివరి వారంలో ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో ఉండనున్నారు. ఇప్పటికే ఈ వారంలో ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్ ఎవరో కూడా తెలిసిపోయింది. బిగ్‌బాస్ హౌస్‌లో ఉన్న ఏడుగురిలో శోభాశెట్టి బయటకు రానుంది. తాజాగా ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో హోస్ట్‌గా నాగార్జున 14 వారాల్లో మీరు పశ్చాత్తాప పడిన సందర్భం ఏదైనా ఉందా? అని ప్రశ్నించారు. దీనికి హౌస్మేట్స్ అందరూ తమ అభిప్రాయాలను వెల్లడించారు. (ఇది చదవండి: నా సామిరంగ.. నిన్ను ఎత్తుకెళ్లిపోవాలనిపిస్తుందే పిల్లా!) మొదట అంబటి అర్జున్ మాట్లాడారు. కేవలం బలం ఉంటే సరిపోదు.. బలంతో పాటు జనాల ప్రేమ కూడా కావాలనేది ఆ వారంలో తెలిసింది సార్ అన్నాడు. ఆ తర్వాత శోభాశెట్టి మాట్లాడుతూ యావర్‌ను పిచ్చోడా అని అనేశాను. తాను ఆ మాట అనకుండా ఉండాల్సింది అన్నారు. ఆ తర్వాత యావర్ మాట్లాడుతూ 11 వారంలో ఫౌల్ జరిగింది.. కానీ నేను అది కావాలని చేయలేదు అన్నాడు. ఆ తర్వాత 14 వారంలో నేను వాడిన పదాలు నా వ్యక్తిగత అనుకున్నా.. కానీ అది ఇతరులకు టచ్ అవుతుందనేది మీరు చెప్పాక తెలిసిందని శివాజీ అన్నాడు. నేను అన్నది పొరపాటు అయిండొచ్చు.. నేను అన్న మాటల్లో ఆ పదం అనుకోకుండా దొర్లింది. నా కోసం నేను స్టాండ్ తీసుకున్నప్పుడు ఏది జరగలేదు అన్నారు. అయితే నాగార్జున శివాజీని ఉద్దేశించి బతుకు.. బతికించు అన్న పదం వాడావు.. అది నీ ఫీలాసఫీ అని నాకు అర్ధమైంది అన్నారు. దీంతో ప్రోమో ముగిసింది. మిగిలిన కంటెస్టెంట్స్ కూడా ఎక్కడ తప్పు చేశారో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. (ఇది చదవండి: ఒంటి మీద నూలు పోగు లేకుండా కనిపించి షాకిచ్చిన హీరో.. ఎందుకంటే?) -
బిగ్‌బాస్ 7: ఎలిమినేషన్ రౌండ్.. శివాజీ వర్సెస్ శోభా! చివరకు..
శోభా శెట్టి.. అన్నీ తన సొంతం కావాలనుకుంటుంది. ఏ టాస్క్ అయినా తనే గెలిచేయాలనుకుంటుంది. అందరూ తనకే సపోర్ట్ ఇవ్వాలనుకుంటుంది. పొరపాటున తనను కాదని పక్కవాళ్లకు మద్దతు ఇచ్చారంటే ఇక అంతే సంగతులు.. ఫినాలే దగ్గరపడుతున్నా తన పంతం మార్చుకోలేదు శోభ. చెప్పాలంటే ఈ వారం ఇంకా మొండిగా వ్యవహరించింది. స్నేహితులను కూడా విడిచిపెట్టలేదు. అటు స్పై బ్యాచ్తోనూ ఇటు తన ఫ్రెండ్స్‌తోనూ గొడవపడింది. ఊహించిందే నిజమైంది ఓపక్క తనకు ఓట్లు పడుతున్నాయి, తాను వీక్ కాదంటూనే.. మరోపక్క ఈవారం వెళ్లిపోయేది తానేనంటూ రెండు మాటలు మాట్లాడింది. అటు ప్రేక్షకులు సైతం ఈ వారం ఇంటి నుంచి శోభాను బయటకు పంపించేయాలని డిసైడ్ అయ్యారు. చివరకు అందరి అంచనా నిజమైంది.. శోభా ఎలిమినేట్ అయింది. ఫినాలేకు అడుగు దూరంలోనే ఆమె బిగ్‌బాస్ జర్నీ ఆగిపోయింది. అయితే ఈసారి నామినేషన్లో ఉన్నవారిని సేవ్ చేసుకుంటూ రాలేదు నాగ్. ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఒక్కొక్కరి పేర్లు ప్రకటించాడు. అలా ప్రియాంక, ప్రశాంత్, అమర్, యావర్ ఫినాలేలో అడుగుపెట్టారు. చివరి రౌండ్లో ఇద్దరు అర్జున్ ఎలాగో ఫినాలే అస్త్ర గెలవడంతో ఈ వారం నామినేషన్లోనే లేడు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లయిన శివాజీ, శోభ మధ్యే జరిగినట్లు తెలుస్తోంది. శివాజీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా తన సింపతీ గేమ్ వల్ల ఓట్లు పడుతున్నాయి. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. ఇక శోభా శెట్టి సైకోలా మారిపోయి తన గేమ్ తానే చెడగొట్టుకుంది. దీంతో తాను తవ్వుకున్న గోతిలో తనే పడింది, ఈవారం ఎలిమినేట్ అయింది. మరి ఎలిమినేషన్ తర్వాత శోభా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: శివాజీ బ్యాచ్‌ని ఉతికారేసిన నాగార్జున.. ఆ విషయమే కారణమా? -
Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!
మిగతా సీజన్లతో పోలిస్తే గొడవలు, గ్రూపుల గోల వల్ల బిగ్‌బాస్.. ఈసారి చాలా ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. అయితే ఈ మొత్తం వివాదంలో శోభాశెట్టి అనే ఓ క్యారెక్టర్ వల్ల ఎక్కడలేని మజా వచ్చింది. ఈసారి ఆమె ఎలిమినేట్ అయిపోయిందని అంటున్నారు. సరే దాని గురించి పక్కనబెడితే మాత్రం.. కొన్ని నిజాల్ని స్వయంగా నాగార్జున ముందే ఒప్పేసుకుంది. కాకపోతే హోస్ట్‌కే బొమ్మ చూపించింది. శోభా ట్రాపులో నాగార్జున 14వ వారం వీకెండ్‌కి వచ్చేసింది. అంటే మరో వారం రోజుల పాటు షో నడుస్తుంది అంతే. ఈ విషయం శోభాకి కూడా తెలుసు. ఎలానూ కప్ గెలుస్తానని నమ్మకం అయితే లేదు. ఏదైతే అది అయిందని చెప్పి, మొత్తానికే తెగించేసింది. వీకెండ్ వస్తే నాగార్జున.. కచ్చితంగా అడుగుతాడని తెలిసే శివాజీ, యావర్‌తో కావాలనే గొడవలు పెట్టుకుంది. కరెక్ట్‌గా ఆమె ఊహించినట్లే నాగ్.. వీటి గురించే అడిగి శోభా ట్రాపులో పడ్డాడు. (ఇదీ చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు మూవీ.. అక్కడే స్ట్రీమింగ్..) ఫేవరిజం నిజమే! శివాజీ సరే.. ఫేవరిజం అని ప్రతిసారి అంటున్నారు. నాక్కూడా క్లారిటీ కావాలని ఆయన్ని అడుగుదామనుకున్నానని శోభా.. నాగార్జునతో శోభా చెప్పింది. మరి టాస్క్ సందర్భంగా ప్రియాంకని నువ్వు ఎంకరేజ్ చేయడం కరెక్టేనా? అని నాగ్ అడిగితే.. అవును ప్రియాంక అంటే ఇష్టం, అందుకే సపోర్ట్ చేశానని శోభా ఒప్పుకొంది. అలా తన బ్యాచ్ అంటే ఫేవరిజం ఉందని పరోక్షంగా అంగీకరించింది. ఇంకా డెప్త్‌గా నాగ్ అడుగుతుండేసరికి.. ఈ వారం నా మైండ్ అంతా డిస్ట్రబెన్స్గా ఉందని చెప్పి మొత్తం సీన్ మార్చేసింది. దీంతో నాగ్ కూడా ఏం అనలేకపోయాడు. శోభాకి అది ముందే తెలుసా? బహుశా శోభాకి కూడా ఈసారి తానే ఎలిమినేషన్ అవుతానని ముందే తెలిసినట్లుంది. అందుకే మొత్తానికే తెగించేసి.. ఏదైతే అది అవుతుందని తెలిసి అందరితో గొడవలు పెట్టేసుకుంది. మరీ ముఖ్యంగా తనని మొదటి నుంచి ఇబ్బంది పెడుతున్న శివాజీ, యావర్‌కి రైట్ లెఫ్ట్ ఇచ్చిపడేసింది. ఈమె దెబ్బకు వీళ్లిద్దరూ అసలు రంగు బయటపడింది. దీని వల్ల శోభా కంటే వాళ్లిద్దరికే డ్యామేజ్ ఎక్కువ ఉండొచ్చు. తీరా వీటన్నింటి గురించి నాగ్ అడిగేసరికి.. మైండ్ డిస్ట్రబ్ అని ప్లేట్ మార్చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో శోభా.. తను అనుకున్నది సాధించినట్లే కనిపిస్తోంది. సో అదన్నమాట విషయం. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
Bigg Boss 7: అపరిచితుడులా ప్రవర్తిస్తున్న అమర్.. ప్రియాంకతో అలాంటి సిల్లీ గొడవ!
బిగ్‌బాస్ 14వ వారం నామినేషన్స్ ఒకేరోజులో పూర్తయ్యాయి. కానీ అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం రాత్రంతా నడుస్తూనే ఉంది. 'ఓట్ ఫర్ అప్పీల్' అనే టాస్క్ పెట్టిన బేసిక్ లాజిక్ మర్చిపోయి మరీ ప్రేక్షకుల్ని పిచ్చోళ్లని చేశాడు. శోభా అయితే ఓటు అడిగే విషయంలో అవసరం లేకపోయినా సరే ఎమోషనల్ అయిపోయింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 93 హైలైట్స్‌లో చూద్దాం. రైతుబిడ్డ ఎదురుదెబ్బ నామినేషన్స్‌లో అర్జున్ తప్ప మిగతా వాళ్లంతా ఉన్నారని బిగ్‌బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. నామినేషన్స్‌లో భాగంగా 'అమ్మాయిలా మాట్లాడుతున్నావ్' అని అర్థమొచ్చేలా ప్రశాంత్, అమర్‌తో అన్నాడు. తననే 'ఆడోడు' అని అంటావా? అని అమర్.. అదే పదాన్ని పదేపదే చెబుతూ ప్రశాంత్‌ని రెచ్చగొట్టాడు. సెటైర్స్ కూడా వేశాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా) ఓటు అప్పీలుకు ఛాన్స్ చిల్ పార్టీ పేరుతో కొన్ని గేమ్స్ ఉంటాయని చెప్పిన బిగ్‌బాస్.. ఇందులో గెలిచిన వాళ్లకు ఓటు అడిగే ఛాన్స్ దక్కుతుందని చెప్పాడు. అలా పాట ప్లే కాగానే.. బెంచ్‌పై వస్తువుల్లో ఒకదాన్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ పోటీలో చివరివరకు నిలిచిన యావర్ విజేతగా నిలిచాడు. ఇక కలర్స్ జంపింగ్ గేమ్‌లో అందరూ తడబడ్డారు కానీ శోభా చివరివరకు ఉండి విన్నర్ అయింది. అమర్ కాదు అపరిచితుడు ఈ గేమ్ అయిపోయిన తర్వాత శోభా, ఓ టెడ్డీ బేర్ తీసుకుని రూంలోకి వచ్చింది. అక్కడే అన్న అమర్-ప్రియాంకతో కాసేపు మాట్లాడింది. ఆ తర్వాత ప్రియాంక.. సరదాగానే తలగడతో అమర్ ముఖంపై కొట్టింది. సీరియస్ అయిపోయిన అమర్.. అలిగి బయటకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత లోపలికి వచ్చాడు. అప్పుడు ప్రియాంక-శోభా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి హర్ట్ అయిన అమర్.. ఏమైంది? మాట్లాడకపోతే మాట్లాడొద్దు అని ప్రియాంకపై సీరియస్ అయ్యాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!) అమర్ అలా అనేసరికి ప్రియాంక ఊరుకోలేదు. రిటర్న్‌లో గట్టిగానే ఇచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావ్? అదీ ఇదీ అని అమర్‌కి ఆన్సర్ ఇచ్చింది. బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది, స్ట్రెయిట్‌గా చేయాల్సిన పని స్ట్రెయిట్‌గా చేయవ్ అని అమర్, ప్రియాంకని ఉద్దేశిస్తూ అన్నాడు. ఎందుకు గతవారం జరిగిన విషయాన్ని ఇప్పుడు తీస్తున్నావ్ అని ప్రియాంక రెచ్చిపోయింది. ఈ గొడవలోకి ఎంటరైన శోభా.. మా ఇద్దరి మీద నీకో ఏదో ఉంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్ అని అమర్‌కి కౌంటర్ ఇచ్చింది. అయితే ఇదంతా కూడా కంటెంట్ ఇవ్వాలని చేశారా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత అర్జున్ మాట్లాడుతూ.. టైమ్ పాస్ కావట్లేదా మీ ముగ్గురికి? అని చిన్న సెటైర్ వేసి నవ్వేశాడు. ఓటు ఫర్ అప్పీలు టాస్క్ పోటీల్లో గెలిచిన యావర్, శోభా.. ఇద్దరు కూడా 'ఓటు ఫర్ అప్పీలు' చేసుకోవాలని, కాకపోతే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశముంటుందని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. శోభాకి తక్కువ ఓట్లు పడిన కారణంగా.. అప్పీలు చేసుకునే ఛాన్స్ ఆమెకి దక్కింది. దీంతో.. 'అందరికీ నమస్కారం. నేను 'కార్తీకదీపం' మోనితగానే మీకు తెలుసు. బిగ్‌బాస్‌లో చూసేవాళ్లకు శోభాశెట్టిగా తెలుసు. ఇక్కడ మీరు నాకు చాలాచాలా సపోర్ట్ చేశారు. ఈ రోజు నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నాం. కడుపు నిండా తింటున్నాం అంటే మీ అందరీ సపోర్ట్ కారణం. థ్యాంక్యూ సోమచ్ ఫర్ ద సపోర్ట్. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్‌బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?) 6వ సీజన్ వరకు అబ్బాయిలే గెలిచారు. సీజన్ 7లో నేను గెలవాలి, టైటిల్ కొట్టుకుని వెళ్లాలి. ఈ సీజన్ లో ఉల్టా పుల్టాలో అమ్మాయిగా నేను గెలవాలి అనేది ఒకత్తైతే.. బిగ్‌బాస్ గెలిస్తే వచ్చే అమౌంట్ గానీ వేరే ఏదైతే ఉందో నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసుంటే ప్లీజ్ క్షమించండి. ప్లీజ్ ఓటు చేయండి' అని శోభా.. ప్రేక్షకుల్ని ఓట్లు అడుక్కుంది. ఇక ఓటు ఫర్ అప్పీలు టాస్క్‌లో ఏ ఒక్కరు ఉండాలని.. ఇంటి సభ్యులు డిసైడ్ చేస్తున్న టైంలో ప్రియాంక-శోభా మధ్య చిన్నపాటి వాదన జరిగింది. యావర్ నువ్వు నెక్స్ట్ గేమ్‌లో గెలిచి, మళ్లీ ఈ ప్లేసులో నిల్చుంటావ్! అందుకే నేను శోభాకి ఇవ్వాలనుకుంటున్నాని ప్రియాంక కారణం చెప్పింది. అంటే నేను వీక్‌గా ఉన్నానా.. ప్రియాంక మాటల్ని నెగిటివ్‌గా తీసుకుంది. దీంతో కాసేపు గొడవ జరిగింది. ఈ రోజు ఎపిసోడ్లో మిగతా సోది అంతా పక్కనబెడితే సీరియల్ బ్యాచ్ ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. అప్పుడే గొడవ పడతారు. అప్పుడే కలిసిపోతారేంట్రా బాబు అనిపించింది. అలానే ఎక్కడైనా గేమ్స్ లో ఓడిపోతే ఓట్లు అడుక్కుంటారు. ఈరోజు మాత్రం ఓ పోటీలో గెలిచిన శోభనే ఓట్ల కోసం ప్రాధేయపడటం విడ్డూరంగా అనిపించింది. మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్‌బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?
బిగ్‌బాస్ 7 చివరకొచ్చేసింది. 14వ వారానికి సంబంధించిన నామినేషన్స్ పూర్తయ్యాయి. దీంతో ఈ వారం బిగ్‌బాస్ ఏం ప్లాన్ చేశాడా? అని అందరూ అనుకుంటున్నారు. ఇలాంటి టైంలో అసలైన ఫిట్టింగ్ పెట్టేశాడు. ఎలిమినేషన్ గురించి చిన్న హింట్ కూడా ఇచ్చేశాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన ప్రోమో రిలీజ్ కాగా, ఇది సమ్‌థింగ్ ఇంట్రెస్టింగ్గా అనిపిస్తోంది. టాస్క్‌తో బిగ్‌బాస్ ట్విస్ట్ 'టికెట్ టూ ఫినాలే' పోటీలో గెలిచి ఫైనలిస్ట్ అయిన అర్జున్.. చిట్టచివరి నామినేషన్స్ నుంచి సేవ్ అయ్యాడు. ఇతడు తప్పితే మిగతా ఆరుగురు(అమర్, ప్రశాంత్, శోభా, ప్రియాంక, యావర్, శివాజీ).. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. రాబోయే రెండు వారాలకు ఓటింగ్ లైన్స్ ఓపెన్ అయిపోయాయని చెప్పిన బిగ్ బాస్.. తక్కువ ఓట్లు వచ్చిన చివరి వ్యక్తి 14వ వారం ఎలిమినేట్ అయిపోతాడని నామినేషన్స్ సందర్భంగా చెప్పారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!) మంగళవారం ఎపిసోడ్లో భాగంగా 'వోట్ ఫర్ మీ' పేరుతో టాస్క్ పెట్టారు. బిగ్‌బాస్ మాట్లాడుతూ.. 'యావర్, శోభా.. మీరిద్దరూ మీ ఓటు అప్పీలు చేసేందుకు మిగతావారి కంటే చేరువలో ఉన్నారు. కానీ మీ ఇద్దరిలో నుంచి ఒక్కరికి మాత్రమే ఓటు అప్పీలు చేసుకునే వీలుంది. ఆ ఒక్కరు ఎవరు అనే విషయం మిగతా ఇంటి సభ్యుల నిర్ణయంపై ఆధారపడి ఉంటుంది' అని ఫిట్టింగ్ పెట్టాడు. ఈ టాస్క్‌లో భాగంగా యావర్‌కి శివాజీ, ప్రశాంత్ ఓటేశారు. శోభాకి ప్రియాంక, అమర్‌తో పాటు అర్జున్ కూడా ఓటేసినట్లు ప్రోమోలో చూపించారు. ప్రస్తుతం హౌస్‌లో ఉన్నవాళ్లలో అర్జున్ ఫైనల్ వీక్కి అర్హత సాధించాడు. మిగతా ఆరుగురిలో శోభా, యావర్ మాత్రం చివరి స్థానాల్లో ఉంటారు. అంటే ఈ వారం వీళ్లిద్దరిలో ఒకరు ఎలిమినేట్ అయిపోయే ఛాన్సులు గట్టిగా ఉన్నాయి. ఇప్పుడు అదే విషయాన్ని టాస్క్ పేరు చెప్పి బిగ్‌బాస్ హింట్ ఇచ్చాడా అనే సందేహం వస్తోంది. అయితే ఈ టాస్కులో శోభా కాస్త భయపడినట్లు కనిపిస్తుంది. చూద్దాం మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) -
నామినేషన్స్‌లో ట్విస్ట్.. అమర్‌కు షాకిచ్చిన ప్రియాంక..
బిగ్‌బాస్ తెలుగు గ్రాండ్ ఫినాలేకు ముహూర్తం దగ్గరపడింది. సీజన్ 7 కథ కంచికి చేరేందుకు ఇంకా రెండు వారాలు మాత్రమే ఉంది. గౌతమ్ ఎలిమినేషన్‌తో హౌస్‌లో ఏడుగురు మాత్రమే మిగిలారు. వీరిలో అర్జున్ టికెట్ టు ఫినాలే గెలిచి నేరుగా ఫైనల్స్‌లో అడుగుపెట్టారు. టికెట్ టు ఫినాలే టాస్క్‌లో రెండో స్థానంలో నిలిచిన అమర్‌దీప్‌ను ఇమ్యూనిటీ లేకుండా కెప్టెన్ చేశారు. దీంతో అతడు కూడా నామినేషన్ ప్రక్రియలో ఉన్నాడు. నిజానికి ఫినాలేకు దగ్గర్లో ఉన్న సమయంలో హౌస్మేట్స్ అంతా నామినేట్ అవుతుంటారు. కానీ ఈసారి నామినేషన్స్‌ను ఇంటిసభ్యుల చేతిలో పెట్టాడు బిగ్‌బాస్. ఎవరిని ఇంటి నుంచి బయటకు పంపించాలనుకుంటారో వారి ముఖాలను టైల్స్‌పై స్టాంప్ వేసి, ఆ టైల్స్‌ను పగలగొట్టాలన్నాడు. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. ప్రిన్స్ యావర్.. శోభను నామినేట్ చేశాడు. శోభ.. ప్రిన్స్, శివాజీలను నామినేట్ చేసింది. ప్రియాంక.. అమర్‌దీప్‌ను నామినేట్ చేసి అందరికీ షాకిచ్చింది. తాజా సమాచారం ప్రకారం అర్జున్ మినహా మిగతా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి ఈ నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేవరకు ఆగాల్సిందే! చదవండి: ఆ ఒక్కటే గౌతమ్‌కి మైనస్.. అందుకే ఇలా ఎలిమినేట్! -
బిగ్‌బాస్ 7: స్ట్రాంగ్ కంటెస్టెంట్ డాక్టర్ బాబు అవుట్!
అనుకున్నదొక్కటి.. అయినదొక్కటి.. బోల్తా కొట్టిందిలే బుల్ బుల్ పిట్టా... ఈ పాట పాడుకునే సమయం వచ్చేసింది. ఈ వారం నామినేషన్స్ వల్ల అర్జున్ మీద విపరీతమైన నెగిటివిటీ వచ్చేసింది. ఈసారి ఈయన జెండా ఎత్తేయడం పక్కా అనుకున్నారంతా! కానీ అందరి అంచనాలను తలకిందులు చేస్తూ తన సత్తా ఏంటో చూపించాడు అర్జున్. టికెట్ టు ఫినాలే రేసులో అందరినీ వెనక్కు నెడుతూ, ఎవరి సపోర్ట్ లేకుండా సింగిల్‌గా ఆడి ఫినాలే అస్త్ర గెలిచాడు. అయితే ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయితేనే కదా టాప్ 5లో చోటు దక్కించుకునేది అని అందరూ డౌట్ పడ్డారు. కానీ ఈ వారం మొదట సేవ్ అయింది అర్జునే! నాగార్జున ఈ సీజన్లో ఫస్ట్ ఫైనలిస్ట్‌గా అర్జున్ను ప్రకటిస్తూ అతడిని సేవ్ చేశాడు. దీంతో ఎలిమినేషన్ గండం గౌతమ్, శోభల మెడకు చుట్టుకుంది. కానీ శోభ కోసం ఎవరినైనా బలి చేసేందుకు బిగ్‌బాస్ రెడీ.. కాబట్టి ఆమెకు బదులుగా స్ట్రాంగ్ కంటెస్టెంట్‌ను పంపించే ప్లాన్ చేశారట! టాప్5లో ఉండేందుకు అర్హత ఉన్న గౌతమ్ కృష్ణను ఎలిమినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఇది చూసిన డాక్టర్ బాబు అభిమానులు.. అన్‌ఫెయిర్ బిగ్‌బాస్ అంటూ సోషల్ మీడియాలో ఆర్తనాదాలు చేస్తున్నారు. చదవండి: శివాజీ ప్రవర్తన వల్ల బాధపడ్డా.. ఆ నొప్పితో బాధపడుతున్న అమర్.. బిగ్‌బాస్ హౌస్‌లో నో ట్రీట్మెంట్ -
Bigg Boss 7: మాటలు జారిన అమర్.. ప్రియాంక తప్పు చేయకపోయినా సరే అలా!
బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్లో ఫినాలేలో తొలి స్థానం కోసం మంచి పోటీ నడుస్తోంది. మంగళవారం ఓ మూడు గేమ్స్ జరగ్గా.. తాజాగా మరో రెండు గేమ్స్ జరిగాయి. ఇందులో SPY(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌కి షాక్ తగిలింది. మరోవైపు సీరియల్ బ్యాచ్ లో ప్రియాంకని ఒంటరి చేసేశారు. శోభా-అమర్ కలిసి ఈమెపై మానసికంగా దాడి చేశారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో అసలేం జరిగిందనేది Day 87 హైలెైట్స్లో ఇప్పుడు చూద్దాం. ఓ దాంట్లో టాప్.. మరో దానిలో ఫెయిల్ సోమవారం మూడు గేమ్స్ జరగ్గా.. రెండింటిలో అర్జున్ విజయం సాధించాడు. తాజాగా బుధవారం పెట్టిన గేమ్స్‌లోనూ అర్జున్ చాలా స్మార్ట్‌గా వ్యవహరించాడు. 'టికెట్ టూ ఫినాలే' కోసం 'ఎత్తరా జెండా' అని పెట్టిన నాలుగో గేమ్‌లో ప్రశాంత్, యావర్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. అర్జున్ మూడో స్థానం సంపాదించాడు. ఇక 'గెస్ చేయ్ గురూ' అని పెట్టిన ఐదో గేమ్‌లో.. వినిపించే సౌండ్స్ బట్టి, అవేంటనేవి వరసగా పలకపై రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్జున్ 31 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఇదే పోటీలో సరిగా ఆడని కారణం.. ప్రశాంత్, యావర్ మధ్యలో ఔట్ అయిపోయారు. అలా స్పై బ్యాచ్ ఎదురుదెబ్బ తగిలింది (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రియాంక పాయింట్స్ దానం ఇక ఐదు గేమ్స్ పూర్తయిన తర్వాత చివరి స్థానంలో ప్రియాంక ఉన్న కారణంగా.. 'టికెట్ టూ ఫినాలే' రేసు నుంచి ఆమెని బిగ్‌బాస్ తప్పించాడు. అయితే ఆమె దగ్గరున్న వాటిలో సగం పాయింట్స్ వేరొకరికి ఇచ్చేయాల్సి ఉంటుంది చెప్పగా.. 125 పాయింట్లని గౌతమ్‌కి ఇచ్చేసింది. దీంతో ఓవరాల్ పొజిషన్లో గౌతమ్... మూడో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఆ పాయింట్లు తనకు ఇస్తుందనుకున్న అమర్.. ప్రియాంకపై అలిగాడు. మాటలు జారిన అమర్ ప్రియాంక ఎలిమినేట్ అయిపోయి, తన పాయింట్లు గౌతమ్‌కి ఇచ్చేయడాన్ని అమర్ తీసుకోలేకపోయాడు. ఆమె తప్పు చేసిందని అన్నాడు. అది తన గేమ్, తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని శోభా.. పరిస్థితి వివరించడానికి చూసింది. కానీ అమర్ తీసుకోలేకపోయాడు. కాసేపటి తర్వాత ప్రియాంకతో మాట్లాడుతూ.. నాకు ఇవ్వాలనిపించలేదా? అని అమర్.. డైరెక్ట్‌గా ఆమెనే అడిగాడు. ప్రియాంక, అమర్‌కి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పడానికి చూస్తుంటే.. 'వెధవని అయిపోయింది నేనేగా' అని అమర్ మాట జారాడు. ఏం చెప్పాలనుకుంటున్నావ్, క్లియర్‌గా చెప్పి వెళ్లు అని ప్రియాంక.. తిరిగి మాట్లాడుతుండగానే అమర్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) అమర్ ఇలా తయారయ్యాడేంటి? ప్రియాంకపై ఏది పడితే మాట్లాడేసిన అమర్.. 'అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు' అని తనలో తానే ఏదేదో మాట్లాడేసుకున్నాడు. 'పిచ్చ నా కొడకా, ఇప్పుడైనా నీకు కళ్లు తెరుచుకుంటే బాగుపడతావ్' అని తనని తానే తిట్టుకున్నాడు. మరోచోట.. ప్రియాంక, గౌతమ్‌తో మాట్లాడుతూ.. వాళ్లకు వాళ్లకే గ్రాటిట్యూడ్ ఉంటుంది, మాకు ఉండదా అని శోభా-అమర్‌ని ఉద్దేశిస్తూ తన మనసులో మాట బయటపెట్టింది. ఇదంతా జరిగిన కాసేపటి తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. చేసిన దానికి క్షమాపణలు చెప్పింది. తప్పయిపోయింది, ప్లీజ్ క్షమించు అని బతిమాలాడుకుంది. అయినా సరే అమర్.. శాంతించలేదు. దీంతో మిగతా వాళ్లతో ఈ విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ ఓ విషయం మాత్రం వింతగా అనిపించింది. ఎందుకంటే అమర్.. మరీ స్వార్థపరుడిలా ప్రవర్తించాడా అనే సందేహం వచ్చింది. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ప్రియాంక ఏం చేయాలో కూడా అమరే డిసైడ్ చేస్తాడా? ఆమెకు స్వాతంత్రం లేదా అనిపించింది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్!) -
Bigg Boss 7: సీరియల్ బ్యాచ్ కొట్లాట.. చివరకొచ్చేసరికి ఇలా తయారయ్యేంట్రా!
బిగ్‌బాస్ గత సీజన్స్ మాటేమో గానీ ఈసారి మాత్రం బ్యాచ్‌ల గోల ఎక్కువైంది. అంతెందుకు రీసెంట్ వీకెండ్ ఎపిసోడ్లో స్వయంగా హోస్ట్ నాగార్జున ఒప్పుకొన్నాడు. చుక్క బ్యాచ్, ముక్క బ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. ఇందులో శివాజీ ఆధ్వర్యంలోని ముక్క బ్యాచ్ బాగానే ఉంది. చుక్క బ్యాచ్ అధ్వానంగా తయారైంది. బయటవాళ్లతో కాదు వీళ్లలో వీళ్లే గొడవపడి ఆ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రస్తుత సీజన్లో సీరియల్ బ్యాచ్ సభ్యులైన అమర్, ప్రియాంక, శోభా.. ప్రారంభం నుంచి ఒక్కటిగా ఆడుతున్నారు. మరోవైపు శివాజీ, ప్రశాంత్, యావర్.. ఓ బ్యాచ్‌గా ఆడుతున్నారు. నామినేషన్స్ దగ్గర నుంచి గేమ్స్ వరకు పోటీ అంతా వీళ్ల మధ్య ఉంటోంది. శివాజీ బ్యాచ్‌తో పోలిస్తే సీరియల్ బ్యాచ్ కొన్ని విషయాల్లో బెటర్. కానీ ఇప్పుడు వీళ్లే తమ నిల్చున్న కొమ్మ తామే నరుక్కుంటున్నట్లు అనిపిస్తోంది. తాజాగా 'టికెట్ టూ ఫినాలే' కోసం పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోభా, శివాజీ ఇప్పటికే తక్కువ పాయింట్లు సాధించిన కారణంగా గేమ్ నుంచి సైడ్ అయిపోయారు. అమర్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, యావర్, ప్రియాంక.. ఇలా దాదాపుగా అబ్బాయిలే ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా తక్కువ పాయింట్లు ఉన్న కారణంగా గేమ్ నుంచి సైడ్ అవ్వాలి. దీంతో ఆమె తన సగం పాయింట్లని వేరొకరికి ఇవ్వాలని చెప్పగా, గౌతమ్‌కి ఇచ్చేసింది. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) 12వ వారం ప్రియాంక కెప్టెన్ కావడానికి గౌతమ్ సాయం చేశాడు. ఇప్పుడు పాయింట్స్ ఇచ్చి అతడి రుణం తీర్చుకుంది. అయితే పాయింట్స్ ఇవ్వడానికి తాను కనిపించలేదా అని అమర్ హర్ట్ అయిపోయారు. దీంతో శోభా-అమర్ ఒక్కటైపోయారు. ప్రియాంకని వేరు చేసి చూస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్కటిగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. శివాజీని అన్ని విషయాల్లోనూ ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు చివరకొచ్చేసరికి వీళ్లలో వీళ్లు కొట్లాడుకుని.. శివాజీ బ్యాచ్ కి హెల్ప్ అయ్యేలా ఉన్నారనిపిస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే మాత్రం.. తెలియకుండానే శివాజీ బ్యాచ్ కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. గేమ్‌లో ఉన్న ఆ కాస్త మజా కూడా పోవడం గ్యారంటీ. అయితే ఈ గొడవలో ప్రియాంక కాస్త ఆలోచనతో వ్యవహరించినట్లు అనిపించింది. అమర్ మాత్రం ప్రతిదానికి అలుగుతూ తనపై ఉన్న సింపతీని కాస్త నెగిటివిటీ చేసుకునేలా కనిపిస్తున్నాడు. మరోవైపు అతడికి సపోర్ట్ చేస్తున్న శోభా కూడా తెలియకుండానే మరింత నెగిటివీ తెచ్చుకుంటోందనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) -
'మీ దోస్తాన్ మళ్లీ స్టార్ట్ చేసిర్రు'.. నా కళ్లు తెరుచుకున్నాయన్న రైతు బిడ్డ!
బుల్లితెర ప్రేక్షకులను ఫుల్ ఎంటర్టైన్ చేస్తోన్న రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 మరో వారం ముగిసింది. గతవారం ఎవరిని ఎలిమినేట్ చేయని బిగ్‌బాస్.. ఈ సారి ఏకంగా ఇద్దరిని ఇంటికి పంపించేశాడు. ఇప్పటివరకు హౌస్‌లో ఎనిమిది మంది కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ ముగియడంతో మళ్లీ నామినేషన్స్ పర్వం మొదలైంది. ఇప్పటి నుంచి టాప్-5 లో నిలిచేందుకు టఫ్ ఫైట్ కొనసాగడం ఖాయంగా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో నామినేషన్ ప్రక్రియలో వాదనలు వేరే లెవెల్లో జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఆ వివరాలేంటో ఓ లుక్కేద్దాం. ప్రోమో ప్రారంభంలోనే యావర్‌ను నామినేట్ చేస్తూ శోభాశెట్టి.. గేమ్ ఓవర్ శెట్టి అని రాశావ్ అంటూ చెప్పింది. దీనికి నువ్వు చూశావా అని యావర్ అడగడంతో.. నేను చూడలేదంటూ సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్‌ను అమర్ నామినేట్ చేశాడు. దీంతో రైతు బిడ్డ ఫుల్ ఎమోషనల్ అవుతూ ఏడ్చేశాడు. దీంతో అమర్.. పోరా కూర్చోపో.. ఎలిమినేట్ చేయను పో అన్నాడు. దీనికి అన్నా నిన్ను నమ్మినందుకు నేను బాధపడతున్నా అంటూ ప్రశాంత్ మాట్లాడారు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. ఆ తర్వతా శివాజీని నామినేట్ చేస్తూ మధ్యలో ప్రశాంత్ టాపిక్ తీసుకొచ్చాడు గౌతమ్. నేను ఎప్పుడైనా యావర్, ప్రశాంత్‌కు సపోర్ట్ చేశానా? అని గౌతమ్‌ను ప్రశ్నించాడు. ఆ తర్వాత గౌతమ్‌ను అమర్ నామినేట్ చేశాడు. నాకు సపోర్ట్ చేస్తా అని మోసం చేశావ్ అన్నాడు. మధ్యలో శివాజీ ఎంటరయ్యాడు. వాంటెడ్‌గా చేస్తుంటే జనాలేమైనా పిచ్చోళ్లా ఇక్కడ ఉంచడానికి అని గౌతమ్ ఫైరయ్యాడు. ఆ తర్వాత ప్రశాంత్‌ను శోభా నామినేట్ చేస్తూ.. నువ్వు చాలా సేఫ్‌గా ఆడావు.. నీవల్లే అమర్ కెప్టెన్సీ పోయిందంటూ నామినేట్ చేసింది. దీనికి ఆశ్చర్యపోయిన ప్రశాంత్ అన్నా.. నా వల్లే కెప్టెన్సీ పోయిందా? అని అమర్‌ను అడిగాడు. దీనికి ప్రశాంత్‌పై ఓ రేంజ్లో ఫైర్ అయింది శోభా. దీనికి మీరు మళ్లీ దోస్తాన్ స్టార్ట్ చేసిర్రు.. నా కళ్లు ఇప్పడే తెరుచుకున్నాయి అన్నాడు ప్రశాంత్. దీనికి శోభా.. అవును బరాబర్ ఆ రోజు సేఫ్ గేమ్ ఆడింది పల్లవి ప్రశాంత్ అంటూ గట్టిగానే వాదించింది. దీంతో ప్రోమో ముగిసింది. ఎవరు, ఎవరినీ నామినేట్ చేశారనేది పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూసేయండి. -
Shobha Shetty: మాటలతోనే కాదు, అందంతోనూ దడ పుట్టిస్తున్న నటి (ఫోటోలు)
-
Bigg Boss 7: అమర్‌కి ఎదురుదెబ్బలు.. మొన్న ప్రియాంక ఇప్పుడు శోభా!
బిగ్‌బాస్ షో నిర్వహకులు, హౌస్మేట్స్ ఇద్దరికి ఇద్దరూ అలానే తగలడ్డారు. లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే సరిగ్గా ఈ డైలాగే గుర్తొచ్చింది. ఎందుకంటే అందరూ ఫెర్ఫార్మ్ చేయమని.. బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. అందుకు తగ్గట్లే ఎంటర్టైన్ చేయాల్సింది పోయి అందరూ కలిసి చిరాకు కలిగేలా చేశారు. మరీ ముఖ్యంగా శోభా-అమర్దీప్ అయితే నస పెట్టారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 80 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. టాస్క్ ఓకే.. ఫెర్ఫార్మెన్సే? ఎవిక్షన్ పాస్ ప్రశాంత్ గెలుచుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక మిసెస్ బిగ్‌బాస్‌ని ఎవరో హత్య చేశారని, చంపిందెవరో కనుక్కోమని అర్జున్-అమర్‌కి బిగ్‌బాస్ టాస్క్ ఇవ్వడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీళ్లిద్దరూ కూడా ఇన్వెస్టిగేట్ ఆఫీసర్స్ ఇంద్రజిత్-కామ్‌జిత్ రోల్స్ చేశారు. అశ్విని-శోభాశెట్టి రిపోర్టర్స్‌గా, రతిక-గౌతమ్ సీక్రెట్ ప్రేమ జంటగా, యావర్-ప్రియాంక.. పని మనషులుగా నటించారు. శివాజీ, నువ్వు మర్డరర్ అని చెప్పిన బిగ్‌బాస్.. పోలీసులు దొరక్కుండా మరిన్నీ మర్డర్స్ చేయాలని సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?) శోభా-అమర్ నస సీరియల్ బ్యాచ్ అనగానే శోభా-అమర్-ప్రియాంక గుర్తొస్తారు. ఇప్పటివరకు ఒక్కటిగా ఆడుతూ వస్తున్న వీళ్ల మధ్య గ్యాప్ వస్తోంది. గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచిన తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. నేను గెలుస్తుంటే నీకు ఆనందంగా లేదని ఉన్న నిజాన్ని బయటపెట్టింది. ఇప్పుడు టాస్క్‌లో భాగంగా శోభా తన మైక్ పట్టుకుని పైపైకి వస్తుందని చెప్పి, ఓవర్ ల్యాప్ చేస్తున్నావ్ నువ్వు అని అమర్, ఆమెతో అన్నాడు. దీంతో శోభా హర్ట్ అయిపోయింది. స్మెల్ వస్తోంది, దూరంగా వెళ్లు అని పదేపదే అంటున్నాడని చెప్పి అమర్‌తో శోభా గొడవ పెట్టుకుంది. ఈ వాదన ఎక్కువయ్యేసరికి అమర్.. తన లాఠీ విసిరేసి మరీ కాస్త అతి చేశాడు. వెనక్కి తోయడం అనేది యాక్టింగ్‌లో భాగం, నేను ఎవరినైనా కావాలని ఆపుతున్నానా అని అమర్ తన పాయింట్ చెప్పాడు. అయితే ఈ మాట తనని చూసి ఎందుకు అంటున్నావ్ అని అశ్విని, అమర్‌పై రెచ్చిపోయింది. గొడవ మీ ఇద్దరికీ జరిగితే నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావ్ అని అశ్విని అరిచింది. ఫెర్ఫార్మ్ చేయండ్రా అని బిగ్ బాస్ చెబితే సీరియల్ బ్యాచ్‌లోని అమర్-శోభా మాత్రం అనవసర వాదనలతో చాలా నస పెట్టేశారు. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా రైతుబిడ్డ ప్రశాంత్ మొక్కని శివాజీ మాయం చేశాడు. అయితే మిగతా రోజులతో పోలిస్తే.. లేటెస్ట్ ఎపిసోడ్ చాలా నీరసంగా సాగింది. హౌస్మేట్స్ ఒక్కరు కూడా కనీసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!
బిగ్‌బాస్ షోలో శివాజీ బాగా ఆడుతున్నాడా? అంటే కచ్చితంగా కాదు. షో నిర్వహకులు శివాజీ మంచోడు అనే ఇమేజ్ క్రియేట్ చేశారు. అందుకే మీకు అలా అనిపిస్తోంది. ఇప్పుడు ఓ గేమ్ సందర్భంగా శివాజీ నిజస్వరూపం మరోసారి బయటపడింది. తనదాకా వచ్చేసరికి తన శిష్యుడు ప్రశాంత్‌తోనే గొడవపెట్టుకున్నాడు. సంచాలక్ శోభా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే ఎక్కడలేని అతి చేశాడు. ఇంతకీ గురువారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 74 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. బిగ్‌బాస్ ఫిట్టింగ్ యవర్‌కి ప్లస్ అర్జున్ ఎవిక్షన్ పాస్ గెలుచుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ముగిసింది. అర్జున్, తన ఎవిక్షన్ పాస్ డిఫెండ్ చేసుకోవాలని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో టాప్-5లో ఒకరితో 'షేక్ బేబీ షేక్' అనే గేమ్ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. యవర్ని ఎంచుకోగా.. అర్జున్‌ని అతడు ఓడించేసి ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దీని తర్వాత 'స్కూటర్ పై సవారీ' పోటీలో తెలివిగా ప్రశాంత్‌ని ఎంచుకున్నాడు. ఫిజికల్ పరంగా స్ట్రాంగ్ అయిన ప్రశాంత్.. నంబర్స్ గుర్తుంచుకునే ఈ టాస్కులో తేలిపోయాడు. దీంతో మళ్లీ యావర్ ఎవిక్షన్ పాస్ డిఫెండ్ చేసుకున్నాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆరోగ్యంతో చెలగాటం.. శోభాశెట్టికి అలాంటి పరిస్థితి!) శోభాశెట్టి వాంతులు ఇక ఎవిక్షన్ పాస్ కాపాడుకునేందుకు 'ఐ లవ్ బర్గర్' అనే టాస్క్ పెట్టగా.. యావర్, శోభాశెట్టిని తన ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు. అయితే ఆమె అప్పుడే భోజనం చేసి పోటీలో పాల్గొనడం వల్ల బర్గర్ అస్సలు తినలేకపోయింది. బాత్రూంలోకి వెళ్లి వాంతి చేసుకుంది. ఇక్కడ కూడా అదృష్టంతో పాటు తెలివి కలిసొచ్చేసరికి యావర్ విజయం సాధించాడు. అయితే ఈ పోటీలో ఓడిపోయిన తర్వాత శోభాశెట్టి తెగ బాధపడిపోయింది. 'ఈ వారం నాకు ఇదొక్కడే గేమ్, అది చూడగానే నాకు కాన్ఫిడెన్స్ పోయింది. అప్పుడే తిన్నా, ఎంతసేపు కూర్చున్నా, తినకుండా ఉన్నా బాగుండేది' అని ప్రియాంకతో చెబుతూ బాధపడింది. ప్రశాంత్‌పై అరిచిన శివాజీ ఎవిక్షన్ పాస్ కాపాడుకునేందుకు చివరగా 'టేక్ ఏ బౌ' అని పోటీ పెట్టాడు. ఇందులో యావర్, మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్ శివాజీ, ప్రియాంకతో ఒకేసారి గేమ్ ఆడాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఈ గేమ్‌లో తొలుత ప్రియాంక బాల్స్ కిందపడిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇక ప్రశాంత్ డిస్ట్రబ్ చేస్తున్నాడని శివాజీ బాల్స్ విసిరికొట్టి మరీ గేమ్ నుంచి బయటకొచ్చేశాడు. ఇక బజర్ మోగకముందే యవర్ బాల్స్ కూడా కిందపడిపోయాయి. ఇక ఈ గేమ్ జరుగుతున్న టైంలో గేమ్స్ సరిగ్గా ఆడండని ప్రశాంత్ అందరితో చెప్పాడు. దానికి డిస్ట్రబ్ అయిన శివాజీ.. ప్రశాంత్‌పై ఓ రేంజులో రెచ్చిపోయాడు. 'నువ్వు మాట్లాడకు.. నువ్వు ఎక్కువ డిస్ట్రబ్ చేస్తున్నావ్ అందరినీ' అని శివాజీ తన కోపన్నంతా బయటపెట్టాడు. మరోవైపు గేమ్ అవుతున్న సమయంలో.. శివాజీ అదే పనిగా బాల్స్‌ని చేతిలో హోల్డ్ చేశాడు. దీంతో స్వయంగా బిగ్‌బాస్ కూడా.. బాల్స్ అదేపనిగా పట్టుకుంటున్నారు శివాజీ అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ శివాజీ ఫౌల్ గేమ్ ఆడాడని బయటపడింది. (ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్) శోభాతో పనికిరాని గొడవ ఇక గేమ్ పూర్తయిన తర్వాత శోభా-ప్రశాంత్ ఏదో చెప్పాలని అనుకుంటూ ఉండగా.. బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. 'నియమాల ప్రకారం ఎవరు గెలిచారో చెప్పండి' అని అన్నాడు. దీంతో సంచాలకులుగా వ్యవహరించిన శోభా-ప్రశాంత్ అసలేం జరిగిందా అని మాట్లాడుకుంటూ ఉండగా.. పానకంలో పుడకలా శివాజీ మధ్యలో ఎంటరయ్యాడు. అటు ఇటు అదేపనిగా తిరుగుతూ శోభాతో.. 'మీ ఇష్టం, మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి' అని కావాలనే ఇరిటేట్ చేశాడు. కానీ శోభా చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ.. అసలెందుకు అరుస్తున్నారు అన్నా మీరు' అని శివాజీని అడిగింది. దీంతో కావాలనే గట్టిగట్టిగా అరుస్తూ శోభాని రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు. తనకే ఎవిక్షన్ పాస్ ఇచ్చేయాలి, లేకపోతో ఒప్పుకోను అన్నంత రేంజులో హడావుడి చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. శివాజీ ఆడింది ఫౌల్ గేమ్. మళ్లీ సంచాలక్ శోభాశెట్టి ఎవరు కరెక్ట్ గా ఆడారా అని డిస్కస్ చేస్తుండగానే ఆమె నిర్ణయాన్ని తారుమారు చేసేయాల్సిందే అనేలా శివాజీ చాలా ఇరిటేట్ చేశాడు. దీనిబట్టి శివాజీ.. బిగ్ బాస్ పరువు తీయడానికి తయారయ్యాడ్రా బాబు అనిపించింది. అలానే తనదాకా వచ్చేసరికి తన గ్రూప్ కే చెందిన ప్రశాంత్ ని కూడా వదల్లేదు. దీంతో శివాజీ నిజస్వరూపం ఇదీ అని అందరికీ అర్థమైంది. అలా గురవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!) -
Bigg Boss 7: ఆరోగ్యంతో చెలగాటం.. శోభాశెట్టికి అలాంటి పరిస్థితి!
బిగ్‌బాస్ షో సంగతేమో గానీ.. ఆర్గనైజర్స్ పెడుతున్న కొన్ని టాస్కులు ఆయా కంటెస్టెంట్స్ ప్రాణాల మీదకొస్తున్నాయి. తాజాగా తెలుగులో ప్రసారమవుతున్న ఏడో సీజన్లో అలాంటి ఓ సంఘటన జరిగింది. ఎవిక్షన్ పాస్ కోసం బిగ్‌బాస్ ఓ టాస్క్ పెట్టాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ అందులో ఆడిన శోభాశెట్టి మాత్రం.. గెలవాలనే ఊపులో ఉక్కిరిబిక్కిరి అయిపోయింది. దీంతో అందరూ భయపడిపోయాడు. ఇంతకీ అసలేం జరిగింది? బిగ్‌బాస్ 7వ సీజన్ ప్రస్తుతం 11వ వారానికి వచ్చేసింది. దీంతో ఎవరికి వాళ్లు కప్ కొట్టడమే టార్గెట్‌గా టాస్కుల్లో పోటీపడుతున్నారు. ఇకపోతే ఈ వారం కెప్టెన్సీ కోసం కాకుండా ఎవిక్షన్ పాస్ కోసం రకరకాల టాస్కులు పెడుతున్నారు. బుధవారం ఎపిసోడ్లో భాగంగా అర్జున్, ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నట్లు చూపించారు. కానీ తర్వాత టాస్కులో యావర్ గెలిచి.. ఆ పాస్ చేజిక్కుంచుకున్నాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఈ విషయమై క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్: ఆమెకు ప్రెగ్నెన్సీ టెస్ట్.. టెన్షన్లో ఆ కంటెస్టెంట్) గురువారానికి సంబంధించి లేటెస్ట్ ప్రోమో రిలీజ్ చేయగా.. అందులో ప్రశాంత్‌తో పోటీపడిన యావర్, తన ఎవిక్షన్ పాస్ డిఫెండ్ చేసుకున్నాడు. ఇకపోతే 'ఐ లవ్ బర్గర్' అనే టాస్కులో భాగంగా శోభాశెట్టితో పోటీపడ్డాడు. ఈ గేమ్‌లో యావర్ పర్లేదు గానీ శోభాశెట్టి మాత్రం తెగ ఇబ్బంది పడింది. ఓవైపు గేమ్ ఆడుతూ, మరోవైపు బర్గర్ తిన్నప్పటికీ ఊపిరి అందలేదు. దీనికి తోడు కడుపులో తిప్పేసింది. దీంతో బాత్రూమ్కి పరుగెత్తి వాంతి చేసుకుంది. అయితే ఇలాంటి గేమ్స్ కరెక్ట్‌గా ఆడితే పర్లేదు గానీ కాస్త నెమ్మదిగా తినే కంటెస్టెంట్స్.. ఇలాంటి పోటీల్లో పాల్గొంటే ఎటొచ్చి ప్రాణాల మీదకొచ్చే ప్రమాదముందని ప్రోమో చూస్తుంటే భయమేసింది. అయితే బాత్రూంలో వాంతి చేసుకున్న శోభాశెట్టి.. పరిస్థితి ఇప్పుడు ఓకేనా లేదా అనేది తెలియాలంటే ఫుల్ ఎపిసోడ్ వచ్చేవరకు వెయిట్ చేయాల్సిందే. (ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్) -
ఓటమిని తీసుకోలేని శివాజీ.. రైతుబిడ్డపై ఫ్రస్టేషన్
బిగ్‌బాస్ హౌస్‌లో ఆటలు.. గెలుపోటములు సహజం, సర్వసాధారణం.. ఓడిపోయినప్పుడు కొందరు బాధతో ఏడుస్తారు. మరికొందరు ఆవేశంతో అరుస్తారు. హౌస్‌లో పెద్దమనిషిని అని చెప్పుకునే శివాజీ వీళ్లను బుజ్జగిస్తూ ఉంటాడు. ఇదంతా ఆటరా.. ఇలాంటి చిన్నచిన్నవాటికి గొడవలు దేనికిరా? ఎంజాయ్ చేయాలి కానీ.. అని నీతిబోధలు వల్లె వేస్తుంటాడు. అయినా నీతులు చెప్పడానికే కానీ పాటించడానికా? అన్నట్లు ఉంటుంది శివాజీ ప్రవర్తన.. ఓడిపోయి పక్కవాళ్లపై నిందలు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో అది మరోసారి రుజువైంది. బిగ్‌బాస్ విల్లు టాస్క్ ఇచ్చాడు. ఇందులో ప్రిన్స్, ప్రియాంక, శివాజీ ఆడారు. వీరిలో శివాజీ, ప్రియాంక ఓడిపోగా ప్రిన్స్ గెలిచాడు. కానీ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన శివాజీ ఆవేశంతో ఊగిపోయాడు. ఆడుతుంటే పదేపదే మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తున్నాడని రైతుబిడ్డపై ఫ్రస్టేషన్ చూపించాడు. ఇక ఈ గేమ్‌లో శివాజీ ఓడిపోయాడని శోభ అనడంతో నీ ఇష్టం వచ్చినట్లు ఇచ్చుకో.. ఇది కరెక్ట్ కాదు అని అరిచాడు. శివాజీ డబుల్ యాక్షన్ మీరు ఇలా మాట్లాడొద్దు అని శోభ అనేసరికి రోషం పొడుచుకొచ్చిన శివాజీ.. నీకన్నా పెద్దగా అరుస్తా.. ఎందుకరుస్తున్నావ్. అరవలేనా నేను అంటూ ఆమె మీదకు దూసుకెళ్లాడు. ఇది చూసిన నెటిజన్లు శివాజీ ద్వంద వైఖరిని ఎండగడుతున్నారు. ఆడ లేక మద్దెల ఓడు అన్నట్లు ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. కాగా బిగ్‌బాస్ ఇంట్లో ఈ వారం ఇంతవరకు కెప్టెన్సీ టాస్క్ పెట్టలేదు. కానీ ఎలిమినేషన్ నుంచి కాపాడే బ్రహ్మాయుధమైన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను మాత్రం ప్రవేశపెట్టాడు. యావర్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ విన్నర్.. ఓ గేమ్ పెట్టి అందులో గెలిచిన అర్జున్‌కు ఆ పాస్ అందించాడు. కానీ అలా ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నాడు బిగ్‌బాస్. మరికొన్ని టాస్కులు ఉంటాయని.. చివరగా గెలిచిన వ్యక్తికి ఈ పాస్ సొంతమవుతుందని వెల్లడించాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన అన్ని పోటీల్లో ప్రిన్స్ యావర్ దుమ్ముదులిపి పాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి దీన్ని ఎవరి కోసం వాడతాడు? అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: పోలీసులకు దొరికిపోయిన యాంకర్ సుమ తనయుడు. ఏం జరిగిందంటే? -
Bigg Boss 7: లవ్‌స్టోరీ అంతా బయటపెట్టిన శోభా.. ఈ సీజన్ టాప్-5 వాళ్లే!?
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్ఫుల్గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి చాలా ఇంట్రెస్టింగ్ విషయాలు మాట్లాడారు. అలానే కన్నడ బ్యూటీ శోభాశెట్టి.. ఈ షో సాక్షిగా తన ప్రియుడ్ని పరిచయం చేసింది. వాళ్ల లవ్‌స్టోరీ కూడా మొత్తం బయటపడింది. ఓ మాదిరి ఎంటర్టైనింగ్గా సాగిన ఈ ఎపిసోడ్ లో ఓవరాల్‌గా ఏం జరిగిందనేది Day 70 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?) దీపావళి గేమ్‌తో షురూ ఈ ఆదివారం దీపావళి సందర్భంగా బిగ్‌బాస్ కళకళలాడింది. హౌస్ట్ నాగార్జునతో పాటు కంటెస్టెంట్స్ అందరూ నిండుగా ముస్తాబై వచ్చారు. 'ఫైండ్ ద క్రాకర్' అనే చిన్న పోటీతో ఎపిసోడ్ మొదలైంది. ఈ గేమ్ లో ప్రియాంక-అమరదీప్ జోడీ గెలిచింది. దీని తర్వాత ఒక్కో ఇంటి సభ్యుడి ఫ్యామిలీ మెంబర్స్-ఫ్రెండ్స్ స్టేజీపైకి వచ్చారు. హౌస్మేట్స్ అందరితోనూ మాట్లాడుతూ ఎవరు బాగా ఆడుతున్నారు? ఎవరు ఇంకా మెరుగవ్వాలి అని సలహాలు ఇచ్చారు. అలానే ఆయా కంటెస్టెంట్ కి సపోర్ట్‌గా వచ్చినవాళ్లు ఓవరాల్ టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు. ఈసారి టాప్-5 వాళ్లే ఇకపోతే అమరదీప్ ఫ్యామిలీ మెంబర్స్ నుంచి శోభాశెట్టి ఫ్యామిలీ మెంబర్స్ వరకు ఎవరికి వాళ్లు తమ అభిప్రాయాలు చెబుతూ ఎవరైతే ఈసారి టాప్-5లో ఉండొచ్చనేది గెస్ చేశారు. అయితే ఓవరాల్ లిస్టు చూసుకుంటే ప్రతిఒక్కరూ శివాజీకి ఏదో ఓ స్థానంలో పెట్టారు. దీంతో అతడికి 11 ఓట్లు పడ్డాయి. ఇతడి తర్వాత ప్రశాంత్‌కి 7, అమరదీప్-ప్రియాంకకు చెరో 6, గౌతమ్‌కి 5 ఓట్లు పడ్డాయి. మిగిలిన హౌస్‌మేట్స్‌కి ఒకటి రెండు ఓట్లు పడ్డాయంతే. దీనిబట్టి చూసుకుంటే.. ఈసారి టాప్-5లో శివాజీ, ప్రశాంత్, అమరదీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ అభిప్రాయపడ్డారు. (ఇదీ చదవండి: హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' కంటెస్టెంట్) శోభా లవర్ ఆగయా దీపావళి ఎపిసోడ్‌కి ఆయా హౌస్మేట్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు కదా! శోభా కోసం మాత్రం ఆమె తండ్రితో పాటు బాయ్‌ఫ్రెండ్ యశ్వంత్ రెడ్డి వచ్చాడు. అలా శోభా-యశ్వంత్.. బిగ్‌బాస్ సాక్షిగా తమ ప్రేమకథని బయటపెట్టారు. దాదాపు మూడన్నరేళ్లుగా ప్రేమించుకుంటున్నామని చెప్పుకొచ్చారు. అలానే శోభానే తొలుత ప్రపోజ్ చేసిందని, యశ్వంత్ బయటపెట్టాడు. 'నీకు నేను లైఫ్ లాంగ్ ఉంటాను, పెళ్లి చేసుకుంటావా అని అడిగింది. నీ కష్టాల్లో, సుఖాల్లో తోడుంటాను, నీకు ఏ ప్రాబ్లమ్ వచ్చినా తోడుంటాను, పెళ్లి చేసుకుందాం అని అడిగింది. దీంతో నేను ఇంట్రెస్ట్ లేదని చెప్పాను. కానీ తను చెప్పిన తర్వాత ఓకే అన్నాను' అని శోభా బాయ్‌ఫ్రెండ్ మొత్తం విషయాన్ని చెప్పాడు. అయితే రఫ్ అండ్ టఫ్ గా ఉండే శోభా.. ముందే తానే ప్రపోజ్ చేయడం, జీవితాంతం తోడుంటాని ప్రియుడితో చెప్పడంతో.. ఈమెలో ఈ యాంగిల్ కూడా ఉందా అని ఆశ్చర్యపోతున్నారు. భోలె ఎలిమినేట్ ఓవైపు దీపావళి స్పెషల్ ఎపిసోడ్ జరుగుతూనే నామినేషన్స్ లో ఉన్నవాళ్లలో ఎవరు సేవ్ అయ్యారు? ఎవరు డేంజర్ జోన్ లో ఉన్నారనేది నాగ్ చెబుతూ వచ్చాడు. గౌతమ్, శివాజీ, రతిక సేవ్ అయిపోగా.. చివరగా యవర్, భోలె మిగిలారు. వీళ్లిద్దరూ భోలె ఎలిమినేట్ అయినట్లు నాగ్ ప్రకటించాడు. అయితే గత ఐదువారాలుగా తనకు తోడుగా ఉన్న భోలె వెళ్లిపోయేసరికి అశ్విని కన్నీళ్లు పెట్టుకుంది. అయితే ఈరోజు ఎపిసోడ్లో రితికా సింగ్, ఫరియా అబ్దుల్లా లాంటి హీరోయిన్స్ డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టగా.. శ్రీలీల, కాజల్ తదితరులు సినిమా ప్రమోషన్స్ కోసం వచ్చారు. చివర్లో హైపర్ ఆది వచ్చి అందరూ గురించి చెబుతూ దడదడలాడించాడు. అలా ఆదివారం ఎపిసోడ్ ఎండ్ అయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7 : అమ్మాయిలపై శివాజీ వెకిలి కూతలు.. ఇదేం పద్దతి బాసూ..?) -
Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?
బిగ్‌బాస్ షో అంటే ఎప్పుడూ గొడవలే కాదు సర్ప్రైజులు కూడా ఉంటాయి. గత కొన్నిరోజులుగా హౌసులో ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. ఇందులో భాగంగా కంటెస్టెంట్స్ అందరి ఫ్యామిలీలో ఎవరో ఒకరు బిగ్ బాస్ హౌసులోకి వచ్చి, కాసేపు మాట్లాడి వెళ్లిపోయారు. ఇదంతా పక్కనబెడితే దీపావళి స్పెషల్ ఎపిసోడ్లో మాత్రం శోభాశెట్టి లవర్ని ఆమె చెప్పకుండా స్టేజీపై తీసుకొచ్చి షాకిచ్చారు. శోభాశెట్టికి షాక్ ఫ్యామిలీ వీక్‌లో భాగంగా శోభాశెట్టిని కలవడానికి హౌసులోకి ఆమె తల్లి రత్నమ్మ వచ్చింది. కాసేపు మాట్లాడి వెళ్లిపోయింది. ఇప్పుడు దీపావళి ఎపిసోడ్లో మాత్రం శోభాశెట్టి తండ్రితో పాటు ఆమె బాయ్‌ఫ్రెండ్ వచ్చాడు. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో ఈ సంగతి బయటపడింది. అయితే తన ప్రేమికుడిని స్టేజీపై అస్సలు ఎక్స్పెక్ట్ చేయని శోభా షాక్ అయిపోయింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!) కుర్రాడు ఎవరో తెలుసా? శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ పేరు యశ్వంత్. ఇతడు కూడా నటుడే. ఏ 'కార్తీకదీపం'లో మోనితగా శోభాశెట్టి బోలెడంత క్రేజ్ తెచ్చుకుందో అదే సీరియల్లో డాక్టర్‌బాబు పాత్ర తమ్ముడు ఆదిత్యగా యశ్వంత్ యాక్ట్ చేశాడు. కలిసి నటిస్తున్నప్పుడు స్నేహితులుగా ఉన్న వీళ్లు కొన్నాళ్లకు ప్రేమికులుగా మరో స్టెప్ వేశారు. అయితే తన ప్రేమ విషయాన్ని ఎప్పుడూ బయటపెట్టలేదు. దాదాపు మూడన్నరేళ్ల నుంచి లవ్‌స్టోరీ చాలా రహస్యంగా మెంటైన్ చేస్తూ శోభా వచ్చింది. గతంలో శోభా-యశ్వంత్ 'బుజ్జి బంగారం' అని ఓ సినిమా చేశారు. అప్పుడు కూడా జంట బాగుందన్నారు కానీ వీళ్ల కాంబో ప్రేమలో ఉందని కనిపెట్టలేకపోయారు. కానీ బిగ్‌బాస్ నిర్వహకులు ఇప్పుడు ఆ విషయాన్ని తెలుసుకుని.. ఏకంగా దీపావళి ఎపిసోడ్‌కి తీసుకొచ్చి శోభాశెట్టి ప్రేమ వ్యవహారాన్ని బయటపెట్టారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: శివాజీని తిట్టడానికే భయపడుతున్న నాగ్.. మరీ ఇలా అయితే ఎలా?) -
తల్లి కాళ్ల మీద పడ్డ శోభ.. ఏడిపించేసిన ప్రిన్స్ యావర్ బ్రదర్స్..
బిగ్‌బాస్ హౌస్.. ఇప్పుడు రోలర్ కోస్టర్ రైడ్‌గా మారింది. ఎప్పడూ కోపతాపాలు మాత్రమే చూపించే కంటెస్టెంట్లు అందరూ ఈ వారం మాత్రం ఎమోషనల్ అయిపోయారు. వారాల తరబడి ఇంటికి దూరంగా ఉన్న హౌస్మేట్స్ కుటుంబ సభ్యులను చూడగానే కన్నీళ్లు పెట్టుకున్నారు. ఇప్పటివరకు శివాజీ, అర్జున్, గౌతమ్, అశ్విని, భోలె, ప్రియాంకల ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. నేటి ఎపిసోడ్లో అమర్దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్‌ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి రానున్నారు. గిఫ్ట్ చూసి ఎమోషనల్ తల్లిని చూడగానే శోభ కేకలు పెడుతూ ఏడ్చేసింది. తర్వాత యావర్‌కు ఓ అద్భుతమైన గిఫ్ట్ ఇచ్చింది. అందులో ప్రిన్స్ తల్లి ఫోటో ఫ్రేమ్ ఉంది. అది చూసి యావర్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. తల్లి కాళ్లకు నమస్కరించి ఆమె ఆశీర్వాదాలు తీసుకుంది శోభ. మరో ప్రోమోలో ఇంటిసభ్యులను కాసేపు ఆడుకున్నాడు బిగ్‌బాస్. ఇంటి గేటు తెరుస్తూ.. మూస్తూ దాగుడుమూతలు ఆడాడు. ఇంతలో యావూ.. యావూ.. మేరా బచ్చా అని అన్న సులేమాన్ గొంతు వినబడటంతో చిన్నపిల్లాడిలా గెంతులేశాడు ప్రిన్స్. కన్నీళ్లు పెట్టిస్తున్న అన్నదమ్ముల బంధం అన్నను గట్టిగా పట్టుకుని ఏడ్చేశాడు. ఇక గౌతమ్ తల్లి తన తమ్ముడిపై అంత ప్రేమ చూపించినందుకు డాక్టర్ బాబుకు కృతజ్ఞతలు చెప్పాడు. తల్లి ప్రేమ ఎలా ఉంటుందో తెలియదంటూ అతడు కూడా కన్నీళ్లు పెట్టుకున్నాడు. కప్పుతోనే రావాలంటూ ప్రిన్స్ దగ్గర మాట తీసుకుని వీడ్కోలు పలికాడు. ఈ ప్రోమో చూసిన అభిమానులు యావర్‌ను చూస్తే మా కళ్లలో నీళ్లు తిరుగుతున్నాయంటున్నారు. చదవండి: ప్రతి ఒక్కరికీ గతం ఉంటుంది.. రతికతో బ్రేకప్‌పై రాహుల్ రియాక్షన్ ఇదీ! -
నలిగిపోయిన అశ్విని, ఇచ్చిపడేసిన రతిక.. సీరియల్ బ్యాచ్ సేఫ్
నామినేషన్స్ అంటే డైరెక్ట్‌గా బయటకు పంపించేయరురా.. ఇదొక ప్రక్రియ మాత్రమే.. జనాలకు నచ్చితే ఉంటాం, లేదంటే పోతాం.. అంటూ నీతులు వల్లవేస్తుంటాడు శివాజీ. కానీ తనదాకా వచ్చేసరికి మాత్రం ఎవరైనా నామినేట్ చేస్తే చాలు తోక తొక్కిన తాచులా లేస్తుంటాడు. అవతలి వారి గొంతు పెగలనియ్యకుండా ఏది పడితే అది అనేస్తాడు. ఈరోజు కూడా అదే జరిగింది. తనను నామినేట్ చేయడంతో అతడి అహం దెబ్బ తింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.. కత్తులు దూసిన కంటెస్టెంట్లు వాళ్లూ వీళ్లు చెప్తే కాదు, శివాజీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలంటూ గౌతమ్‌కు సలహాలిచ్చాడు అర్జున్. తాను కూడా సరైన సమయం కోసం వేచి చూస్తున్నానన్నాడు. అనంతరం బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియ గురించి వెల్లడించాడు. ఈసారి నామినేషన్స్ బిగ్‌బాస్ మహారాజ్యంలో జరుగుతాయని, ఈ రాజ్యంలో శోభ, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా ప్రకటించాడు. శంఖారావం వచ్చిన ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్లు కత్తులను బయటకు తీసి మిగతా ప్రజల్లో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఆ ఇద్దరిలో ఎవరి నామినేషన్ సబబు అనిపిస్తే వారిని రాజమాతలు నేరుగా నామినేట్ చేస్తారు. రాజకీయాలు జరిగాయన్న భోలె మొదట అమర్, అర్జున్ కత్తులు అందుకున్నారు. అమర్ మాట్లాడుతూ.. భోలె షావళిని టీమ్ నుంచి వెళ్లగొడుతుంటే తనను తాను సమర్థించుకోలేకపోయాడన్నాడు. దీనికి భోలె స్పందిస్తూ అక్కడ రాజకీయాలు జరిగాయని, అందుకే ఆ గ్రూపు నుంచి బయటకు రావడానికి సంకోచించలేదన్నాడు. అర్జున్ మాట్లాడుతూ.. చెప్పుడు మాటలు విని గౌతమ్ శివాజీ మీద అసత్య ఆరోపణలు చేశాడంటూ డాక్డర్బాబును నామినేట్ చేశాడు. అమర్, అర్జున్‌లలో రాజమాతలు అమర్ చెప్పిన పాయింట్ ఎక్కువ సమ్మతంగా అనిపించడంతో అతడి ప్రకారం భోలెను డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. జీవితాలతో ఆడుకోకూడదు.. సోది మొదలుపెట్టిన భోలె ప్రిన్స్.. అమర్‌ను, ప్రశాంత్.. గౌతమ్‌ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యారు. రాజమాతలు..ప్రశాంత్‌కు మద్దతుగా నిలబడి గౌతమ్‌ను నామినేట్ చేశారు. తర్వాత భోలె షావళి.. అమర్ నన్ను వీక్ అనడం నచ్చలేదంటూ నామినేట్ చేశాడు. కానీ అది సూటిగా చెప్పకుండా జీవితాలతో ఆడుకోకూడదు.. అదీ ఇదీ అని ఏదేదో సోది చెప్పాడు. ఇంతలో రాజమాత ప్రియాంకకు రోషం పొడుచొక్కింది. అమర్ నిన్ను వీక్ అనలేదు, బిగ్‌బాస్ అన్నాడంటూ అతడి తరపున లాయర్లా వాదించింది. ఊరుకో అని అశ్విని నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆమె మీదకు గయ్యిమని లేచింది. శివాజీని అడ్డంగా బుక్ చేసిన గౌతమ్ గౌతమ్.. శివాజీ ఎవరినో కొట్టేసి పోతానన్నాడు. నాగ్ దాని గురించి అడిగితే తనను తాను కొట్టుకుని పోతానని మాట మార్చాడని చెప్పాడు. రాజమాతలు గౌతమ్‌కు మద్దతుగా నిలిచి శివాజీని నేరుగా నామినేషన్లోకి పంపించారు. ఇది సహించలేకపోయిన శివాజీ.. వాడి పాయింట్స్ మీకు కరెక్ట్‌గా అనిపించాయా? నేను తప్పుడు నా బిడ్డనైతే నన్ను ఎలిమినేట్ చేయండి అని ఆగ్రహించాడు. ఇంతలో ప్రియాంక, శోభ.. అశ్విని గొడవపడ్డారు. తనను అసలు మాట్లాడనివ్వట్లేదని, గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తున్నారని బాధపడింది అశ్విని. కాళ్లు మొక్కిన అశ్విని నువ్వొక్కదానివి గ్రేట్.. ఇక్కడ కూర్చున్న మేమంతా వేస్టా? అని ప్రియాంకతో వాదిస్తూ ఏడ్చింది. మధ్యలో శోభ గట్టిగట్టిగా అరవడంతో.. మేమిద్దరం మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావని ఆమెపై ఫైర్ అయింది. కానీ వాళ్లముందు అశ్విని నిలబడగలదా? అశ్విని ఒక్కమాట అంటే ప్రియాంక, శోభ నాలుగు మాటలంటూ తనను డామినేట్ చేశారు. వారితో అరిచే ఓపిక లేక ఏడుస్తూ ఇద్దరి కాళ్లు మొక్కింది. దీంతో ఆ సీరియల్ నటులిద్దరూ ఇదంతా ఓవర్ యాక్షన్ అని తిట్టిపోశారు. అనంతరం శివాజీ, ప్రిన్స్ కత్తులు పట్టుకుని నిలబడ్డారు. మొదటగా శివాజీ.. గోనెసంచి గేమ్‌లో అమర్ నా చేయి పట్టుకుని లాగడంతో చేయంతా నొప్పి పుట్టిందంటూ నామినేట్ చేశాడు. అమర్‌ను టార్గెట్ చేసిన ఆ ఇద్దరు నిజానికి ఈ శివాజీయే అమర్ వల్ల చేయి బాగైందని కూడా సంతోషించాడు. ఇప్పుడు అమర్‌ను టార్గెట్ చేస్తూనే పైకి మాత్రం ఇతరత్రా కారణాలు చెప్పుకొచ్చాడు. ప్రిన్స్ యావర్ సైతం మరోసారి అమర్‌ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ ఇద్దరూ ఒకరినే నామినేట్ చేసేందుకు వీల్లేదన్నాడు బిగ్‌బాస్. ఎవరో ఒకరిని నామినేట్ చేయకపోతే నువ్వే నామినేట్ అవుతావని హెచ్చరించాడు. దీంతో యావర్ తనకు తానుగా నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. అటు రాజమాతలు కూడా యావర్‌నే నామినేట్ చేశారు. ఈరోజు చాలామంది అమర్‌ను నామినేట్ చేసేందుకు ప్రయత్నించినా రాజమాతలు మాత్రం విశ్వప్రయత్నాలు చేసి అతడిని కాపాడారుజ. బలైన రతిక అనంతరం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. రాజమాతలు చర్చించుకుని వారిలో ఒకరు నామినేట్ అవ్వాలన్నారు. రతిక, అశ్విని.. ప్రియాంకను నామినేట్ చేయగా ప్రియాంక, శోభ.. రతికను నామినేట్ చేశారు. ప్రియాంక, రతికకు టై అవడంతో నామినేషన్ బాధ్యతను కెప్టెన్‌కు అప్పగించాడు బిగ్‌బాస్. శోభకు మరో ఆప్షనే లేదు, ప్రియాంకను సేవ్ చేసి రతికను నామినేట్ చేసింది. కానీ ఈ క్రమంలో పెద్ద యుద్ధమే నడిచింది. నువ్వు నాకు ఆఫ్ట్రాల్ అంటూ శోభకు ఇచ్చిపడేసింది రతిక.ఈ వారం భోలె షావళి, శివాజీ, గౌతమ్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్లో ఉన్నారు. చదవండి: జూన్‌లో పెళ్లి.. త్వరలో తండ్రి కాబోతున్న హీరో.. -
బిగ్‌బాస్: కన్నీళ్లతో ప్రియాంక, శోభల కాళ్లు మొక్కిన అశ్విని..
బిగ్‌బాస్ షో నుంచి మరొకరిని బయటకు పంపించేందుకు అవసరమైన నామినేషన్స్ ప్రక్రియ మొదలైంది. అయితే ఈసారి దీన్ని వినూత్నంగా ప్లాన్ చేశాడు బిగ్‌బాస్. ఇంట్లోని ఆడవాళ్లను రాజమాతలుగా ప్రకటించాడు. మిగతా ఇంటిసభ్యులు ఎవరినైతే నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పి అందుకు తగ్గ కారణాలు చెప్పాల్సి ఉంటుంది. రాజమాతలకు ఆ కారణం సరైనది అనిపిస్తేనే నామినేషన్ జరుగుతుంది. అమర్‌ను వెనకేసుకొచ్చిన ప్రియాంక ముందుగా గౌతమ్ మాట్లాడుతూ.. నా క్యారెక్టర్, డాక్టర్ వృత్తి గురించి శివాజీ అలా మాట్లాడటం నచ్చలేదంటూ సోఫాజీని నామినేట్ చేశాడు. తర్వాత భోలె షావళి.. నీకు నవ్వు వీక్ అయి బయటకు వచ్చావని అన్నావంటూ అమర్‌ను నామినేట్ చేశాడు. ఇంతలో రాజమాత ప్రియాంక మధ్యలో కలగజేసుకుంటూ అమర్.. నిన్ను వీక్ అనలేదని వెనకేసుకొచ్చింది. నువ్వు విషయాన్ని కప్పిపుచ్చుతున్నావ్.. మధ్యలో ఎందుకొస్తున్నావు? ఒర్రొద్దు అని అడిగాడు. నువ్వు చాలా గ్రేటు.. ఇక్కడ కూర్చున్నవాళ్లందరం వేస్ట్. వదిలెయ్ ప్రియాంక అంటూ ఆమెను కూల్ చేసేందుకు అశ్విని ప్రయత్నించగా నేను అతడితో మాట్లాడుతున్నాను అంటూ రెచ్చిపోయింది ప్రియాంక. ప్రతిసారి నా నోరెత్తితే చాలు ప్రాబ్లమైపోతుంది ఇక్కడ.. ఇప్పుడేంటి నువ్వు చాలా గ్రేటు.. ఇక్కడ కూర్చున్నవాళ్లందరం వేస్ట్.. కనీసం నా పెదవి కూడా విప్పనివ్వడం లేదు. ఇంకేం చేయాలి? అని ఏడుస్తూ ప్రియాంక, శోభల కాళ్లు మొక్కింది. నామినేషన్స్‌లో రతిక ఎందుకిలా ప్రవర్తిస్తున్నావు? ఇలా చేయడం కరెక్ట్ కాదు అంటూ ప్రియాంక, శోభ హెచ్చరించినా అశ్విని ఆవేశం, బాధ చల్లారలేదు.. కాగా రాజమాతలుగా లేడీ కంటెస్టెంట్లను పెట్టింది వారిని నామినేషన్స్ నుంచి కాపాడటానికే అన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. అయినప్పటికీ చివర్లో ఏదో ట్విస్ట్ ఉండేలా కనిపిస్తోంది. ఎందుకంటే ఈవారం నామినేషన్స్ లిస్టులో రతిక పేరు కూడా ఉందట! రతికతో పాటు ప్రిన్స్ యావర్, శివాజీ, గౌతమ్, భోలె షావళి నామినేషన్స్‌లో ఉన్నట్లు సమాచారం. చదవండి: అడ్డంగా దొరికిపోయిన తేజ.. ఆన్సర్ చెప్పమంటే నీళ్లు నములుతున్నాడే -
తేజ అవుట్.. తను లేకుండా ఉండలేనంటూ శోకమందుకున్న శోభ
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆల్రెడీ లీకవడంతో ఎపిసోడ్లో పెద్ద పస లేకుండా పోయింది. అయితే అటు తేజ కన్నా రతిక తానెక్కడ ఎలిమినేట్ అవుతుందోనని తెగ భయపడిపోయింది. ప్లీజ్, ఒక్క ఛాన్స్ ఇవ్వండి.. అని నాగ్‌ను అర్థించింది. ఇంతలో తేజ ఎలిమినేట్ అనడంతో ఊపిరి పీల్చుకుంది. మరి హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో నేటి(నవంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన.. నాగార్జున కొన్ని సామెతలను ఇచ్చి అది ఎవరికి బాగా సూటవుతుందో చెప్పాలన్నాడు. భోలె షావళి.. అమర్ది కుక్క తోక వంకర అన్నాడు. అమర్.. గాడిదకేం తెలుసు గంధపు చెక్క వాసన అనే బోర్డును అశ్విని మెడకు తగిలించాడు. ప్రశాంత్ ఏకులా వచ్చి మేకులా తగిలాడన్నాడు అర్జున్. ఇక తేజ ఏమీ లేని ఆకులా ఎగిరెగిరిపడతాడని చెప్పాడు ప్రశాంత్. నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందనే సామెత అశ్వినికి బాగా సూటవుతుందని అభిప్రాయపడింది ప్రియాంక. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? భోలె షావళి.. ఓడ ఎక్కేవరకు ఓడ మల్లన్న.. ఓడ దిగాక బోడ మల్లన్న అని పేర్కొంది రతిక. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభం? అనేది రతిక విషయంలో నిజమైందన్నాడు గౌతమ్. పొరుగింటి పుల్లకూర రుచి అనే బోర్డు భోలెకు వేశాడు తేజ. చేతులు కాలాక ఆకులు పట్టుకుంటే ఏం లాభమనే బోర్డు శివాజీకి వేశాడు ప్రిన్స్ యావర్. వేలు ఇస్తే చేయి గుంజినట్లు అనే బోర్డును ప్రియాంక మెడలో వేసింది అశ్విని. కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు? అనే సామెత తేజకు పర్ఫెక్ట్గా సూటవుతుందన్నాడు శివాజీ. ఇటు రా అంటే ఇల్లంత నాదే అన్నట్లుగా తేజ ప్రవర్తిస్తాడంది శోభ. ఎలిమినేషన్ భయంతో ఏడ్చేసిన రతిక తర్వాత జిగర్తాండ డబుల్ ఎక్స్ చిత్ర యూనిట్ రాఘవ లారెన్స్, ఎస్జే సూర్య స్టేజీపైకి వచ్చి సందడి చేశారు. వీరు హౌస్‌మేట్స్‌తో హుక్ స్టెప్ గేమ్ ఆడించి వెళ్లిపోయారు. తర్వాత తెలుగమ్మాయి ఈషా రెబ్బ హౌస్‌లోకి వెళ్లి పీరియడ్స్ సమస్యల గురించి మాట్లాడి అవగాహన తీసుకొచ్చే ప్రయత్నం చేసింది. అనంతరం నాగ్ అందరినీ సేవ్ చేసుకుంటూ రాగా చివరగా రతిక, తేజ మాత్రమే మిగిలారు. ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానోనని రతిక తెగ ఏడ్చేసింది. చివరకు తేజ ఎలిమినేట్ అనగానే రతికకు పోయిన ప్రాణం తిరిగి వచ్చినట్లయింది. ఇక తేజ ఏడవకూడదనుకుంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. శోభకు ఎక్కువ మార్కులిచ్చిన తేజ ఇక్కడ మరో విషయం ఏంటంటే.. తేజ కంటే శోభ ఎక్కువ ఏడ్చింది. అందరికీ వీడ్కోలు పలికేముందు హౌస్‌మేట్స్‌కు మార్కులు ఇచ్చాడు తేజ. శోభకు పదికి 20 మార్కులిచ్చాడు. గౌతమ్‌కు 8, అర్జున్‌కు 8 మార్కులిచ్చాడు. ప్రిన్స్ యావర్‌కు 10, భోలె షావళికి 7మార్చులిచ్చాడు. ఆటపరంగా ఓకే కానీ మాటతీరు మార్చుకోవాలంటూ అశ్వినికి 8 ఇచ్చాడు. ఓటమిని తీసుకోలేడంటూ ప్రశాంత్‌కు 9, వంటలక్క ప్రియాంకకు 10, అమర్‌దీప్‌కు 9, శివాజీకి 8, రతికకు 5 మార్కులిచ్చాడు. అంటూ ఏడుపందుకున్న శోభ సెలవు తీసుకోవడమే ఆలస్యం అనుకునే సమయానికి శోభ మళ్లీ ఏడుపు మొదలుపెట్టింది. ఇక్కడ నువ్వు లేకుండా ఎలా ఉండాలో తెలియట్లేదు, భయమేస్తోంది తేజ అంటూ శోకమందుకుంది. నీతో ఒక్కరోజు మాట్లాడకుండా ఉన్నందుకే ఏదోలా ఉంది.. అలాంటిది నువ్వు లేకుండా హౌస్‌లో చాలా రోజులు ఉండాలంటే భయమేస్తోంది అని కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌లో ఉన్నప్పుడు నువ్వెవరు? అంటూ గడ్డిపోచ కన్నా హీనంగా చూసిన శోభ తనకోసం ఏడుస్తున్నందుకు సంతోషపడాలా? బాధపడాలా? తెలియని అయోమయంలో ఉన్న శోభ ఎప్పటిలాగే చిరునవ్వుతో వీడ్కోలు తీసుకున్నాడు. చదవండి: తొమ్మిది వారాల్లో తేజ అంత సంపాదించాడా? ఎలిమినేషన్‌కు కారణమిదే! -
బిగ్‌బాస్ 7: టేస్టీ తేజ అవుట్.. అతడి భయమే నిజమైంది!
బిగ్‌బాస్ హౌస్‌లో ప్రస్తుతం 12 మంది మిగిలారు. వీరిలో శివాజీ, గౌతమ్, ప్రశాంత్, అశ్విని మినహా మిగతా అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఈసారి ఎలిమినేషన్ గురిం శోభా మీదే ఉంది. నిజానికి ఆమె గతవారమే ఎలిమినేట్ అవుతుందని అంతా ఊహించారు. కానీ బిగ్‌బాస్ వారి అంచనాలను తలకిందులు చేస్తూ సందీప్‌ను పంపించేసి ఆమెను హౌస్‌లో ఉంచేశాడు. ఈసారి కూడా బిగ్‌బాస్ అదే ప్లాన్ అమలు చేస్తున్నట్లు కనిపిస్తోంది. తన కోసం మరో కంటెస్టెంట్‌ను బలి చేస్తున్నారట.. ఇంతకీ ఆ కంటెస్టెంట్ మరెవరో కాదు.. శోభా జిగిరీ దోస్త్ టేస్టీ తేజ. ఎలిమినేషన్స్ అంటేనే బెంబేలెత్తిపోతాడు తేజ. ఎవరైనా నామినేట్ చేస్తే నేనే పాపం చేశాను? నన్నెందుకు నామినేట్ చేశారు? అన్నట్లుగా అమాయకంగా ఎక్స్ప్రెషన్ ఇస్తాడు. కానీ ఇతడు మాత్రం వేరేవాళ్లను చెత్త కారణాలతో నామినేట్ చేస్తుంటాడు. నిద్రపోతున్న తనమీద నాలుగు చుక్కల నీళ్లు చిలకరించిందని పూజాను నామినేట్ చేసి తనను బయటకు పంపించేశాడు. స్ట్రాంగ్ కంటెస్టెంట్, నామినేషన్స్‌లోకి వస్తే ఆత్మస్థైర్యం పెరుగుతుంది.. అదీ ఇదీ అంటూ సందీప్ మాస్టర్‌ను ఆకాశానికి ఎత్తేసి అవతలకు తోసేశాడు. నామినేషన్స్‌లో సిల్లీ రీజన్స్ చెప్పొద్దు అని అందరూ మొత్తుకున్నా తేజ తన తీరు మార్చుకోలేదు. గతవారం సందీప్‌ను ఏ కారణంతో అయితే నామినేట్ చేశాడో అదే కారణంతో అర్జున్ను నామినేట్ చేశాడు. ఇలా సిల్లీ రీజన్స్ వద్దని వార్నింగ్ ఇస్తూ తేజను నామినేట్ చేశాడు శివాజీ. అప్పటినుంచి ఎక్కడ ఎలిమినేట్ అయిపోతానోనని భయంతో వణికిపోతున్నాడు తేజ. చివరకు అతడు అనుకున్నట్లే జరిగింది. బిగ్‌బాస్ హౌస్‌లో టేస్టీ తేజ ప్రయాణం ముగిసినట్లు తెలుస్తోంది. ఒకరకంగా శోభ కోసం తేజ ఎలిమినేట్ అయిపోయాడు! చదవండి: శివాజీ వారిని చెడగొడుతున్నాడు.. మానస్ -
ఎలిమినేట్ చేయండన్న గౌతమ్, చెప్పుతో కొట్టుకుంటానన్న అమర్దీప్
బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. అయితే గౌతమ్ టీమ్‌ను గెలిపించాలని బిగ్‌బాస్ బలంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. ఎరుపు, నలుపు రంగులో ఉన్న బాల్స్ గౌతమ్ సంపాదించగా వాటితో విజయం సాధించేలా బిగ్‌బాస్ పావులు కదిపాడు. అసలు హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తాజా(నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. ఆ టీమ్‌లోని అందరూ కంటెండర్లే బిగ్‌బాస్ బ్లాక్ బాల్ ఎవరి దగ్గరుందని అడిగాడు. వీరసింహాలు టీమ్ తమ దగ్గరే ఉందని బదులిచ్చారు. ఈ నల్ల బంతి సాయంతో అవతలి టీమ్ దగ్గరున్న అన్ని బంతులను తీసుకోవచ్చని భలే సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో వీరసింహాలు టీమ్ సభ్యులు ఎగిరి గంతేశారు. కానీ గర్జించే పులుల టీమ్‌లోని శివాజీ, ప్రియాంక మాత్రం ఓ రెండు బంతులకు కక్కుర్తి పడ్డారు. అన్నీ ఇచ్చేయమన్నాక ఇంకెందుకు ఆలోచిస్తున్నారని గౌతమ్ ప్రశ్నించగా మా ఇష్టమొచ్చినట్లు చేస్తామన్నాడు శివాజీ. దీంతో గౌతమ్ ఆవేశంతో ఊగిపోయాడు. ఇక అన్ని బంతులు వీరసింహాలకే దక్కి పైచేయి సాధించడంతో ఆ టీమ్‌లో ఉన్న అందరినీ కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్. రతికతో దూరంగా ఉండమన్న శివాజీ మరోవైపు రతికతో కాస్త దూరంగా ఉండమని యావర్‌ను హెచ్చరించాడు శివాజీ. మీ అతి చనువు జనాలకు నచ్చకపోవచ్చని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బంతుల టాస్కు మధ్యలో వీరసింహాలు టీమ్ తమ సభ్యులైన భోలె షావళిని అవతలి టీమ్‌లోని అర్జున్‌తో స్వాప్ చేసిన సంగతి తెలిసిందే కదా! అయితే తాను మొదట తేజ పేరు సూచించానని గౌతమ్ అన్నాడు. అదేంటి? నువ్వు భోలె పేరు చెప్పావటగా అని అశ్విని గబుక్కున అడిగేసింది. అది విని షాకైన గౌతమ్.. భోలె దగ్గరకు వెళ్లి నేను డైరెక్ట్‌గా మీ పేరు చెప్పలేదు.. అది టీమ్ నిర్ణయం అని క్లారిటీ ఇచ్చాడు. స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకున్న ప్రిన్స్ అనంతరం బిగ్‌బాస్ బీన్ బ్యాగ్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. కానీ ఇక్కడో మెలిక పెట్టాడు. వీరసింహాలు టీమ్‌లోని కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అవతలి టీమ్‌లోని కంటెస్టెంట్లు ఆడాల్సి ఉంటుందన్నాడు. అలాగే ఓ కంటెండర్ స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు. దీంతో ప్రిన్స్ యావర్ ఆట నుంచి వైదొలిగాడు. గౌతమ్ తరపున అశ్విని, అర్జున్ తరపున శివాజీ, తేజ తరపున ప్రియాంక, రతిక తరపున భోలె షావళి ఆటలో దూకారు. ఇదసలే ఫిజికల్ టాస్క్.. చేయి నొప్పి ఉన్న శివాజీ ముందే ఆటలో నుంచి వైదొలగాల్సింది. అయినా సరే తన ప్రతాపం చూపిస్తానంటూ ఆడేందుకు వెళ్లాడు. దెబ్బ తగలడంతో శివాజీ అవుట్ తీరా అక్కడ అందరూ లాక్కుని పీక్కునే క్రమంలో అతడి చేతికి దెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆటలో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఆటలో అమర్దీప్- అశ్విని కొట్టుకున్నారు. బిగ్‌బాస్ గీసిన వృత్తంలో నుంచి అందరూ బయటకు వచ్చారని సంచాలకుడైన ప్రశాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ గీత దాటి బయటకు వచ్చింది శివాజీ అన్న అని, కావాలంటే వీడియో చూడమన్నాడు అమర్దీప్. ఒకవేళ తాను చెప్పింది తప్పయితే చెప్పుతో కొట్టుకుంటానని సవాలు విసిరాడు. అమర్ సాయం.. కెప్టెన్‌గా శోభ ఇక బీన్ బ్యాగ్ టాస్కులో శోభా శెట్టి తరపున ఆడి, పోరాడి అమర్ గెలిచాడు. మొత్తానికి అమర్ సాయంతో ఈ సీజన్లో శోభా శెట్టి తొలి లేడీ కెప్టెన్‌గా అవతరించింది.ఇక శోభా కెప్టెన్ అయిందో, లేదో అర్జున్, తేజ ఆమెను ఏడిపించేందుకు ప్రయత్నించారు. ఎలిమినేట్ అయి వెళ్లేటప్పుడు నీ దగ్గరున్న కాయిన్స్ ఎవరికి ఇస్తావు? అని అర్జున్ అడగడంతో చిర్రుబుర్రులాడింది శోభ. కామెడీ చేయడానికి కూడా ఓ సమయం ఉంటుందని విసుక్కుంది. శివాజీపై ఫిర్యాదు తర్వాత గౌతమ్.. శివాజీ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశాడు. 'శివాజీ అన్న గేమ్‌ను ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు. నీతి, నిజాయితీ, ధర్మం అని మాటలు చెప్తుంటాడు.. కానీ ఆయన చాలా తప్పులు చేస్తున్నాడు. అవన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆయన చేసేదంతా చేసి మళ్లీ ఏమీ ఎరుగనట్లు తప్పించుకుంటున్నాడు. ఇలా ఆడి, గెలిచి ఆయన కప్పు కొట్టుకుంటాడేమో.. కానీ ఇది నేను భరించలేకపోతున్నాను. నేను తప్పయితే నన్ను ఎలిమినేట్ చేసేయండి' అని కెమెరాల ముందు బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేశాడు. చదవండి: రాహుల్-రతిక పెళ్లి.. అతడు పెట్టిన కండీషన్స్ వల్లే బ్రేకప్! -
కెప్టెన్‌గా శోభ.. ఈ వారం ఎవరు బలి కానున్నారు?
బిగ్‌బాస్ షోలో తొమ్మిదో వారం ఎలిమినేషన్ దగ్గరపడుతోంది. అమర్ దీప్, రతికా రోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్, టేస్టీ తేజ, భోలే షావలి, ప్రిన్స్ యావర్.. ఈ వారం నామినేషన్లో ఉన్నారు. శోభ, తేజలకు ఆల్రెడీ ఎలిమినేషన్ భయం పట్టుకుంది. నిజానికి శోభ గతవారమే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్.. అయితే తను వెళ్లిపోతే షో చప్పగా ఉంటుందనుకున్నారో, మరేంటో కానీ ఆమెను సేవ్ చేసి సందీప్ మాస్టర్‌ను పంపించేశారు. శోభా కోసం మరొకరు బలి? ఈ వారం కూడా శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోని అనధికారిక పోల్స్‌లో కూడా శోభా తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది. దీంతో ఆమె ఎలిమినేషన్ ఖాయమే అని నెటిజన్లు ఫిక్సయిపోతున్నారు. కానీ ఇలాంటి గ్లామరస్, అలాగే తన అరుపులతో హౌస్‌ను దద్దరిల్లేలా చేసే కంటెస్టెంట్ వెళ్లిపోతే షో నీరసించిపోవడం, టీఆర్పీ దెబ్బతినడం ఖాయం. ఈ రకంగా బిగ్‌బాస్ ఆలోచిస్తే మాత్రం మరోసారి తనకు బదులుగా మరో కంటెస్టెంట్‌ను పంపించే ఆస్కారం లేకపోలేదు. అప్పుడు చైతూ ఎలిమినేట్! ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ వారం ఇంటి కెప్టెన్‌గా శోభా అవతరించినట్లు తెలుస్తోంది. తను కెప్టెన్ అయితే వచ్చేవారం ఇమ్యూనిటీ లభిస్తుంది. కానీ ఈ వారం లభించదు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే శోభా కోసం అమర్ గేమ్ ఆడి గెలిపించాడట. అది కూడా బీన్ బ్యాగ్ గేమ్. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్లోనూ ఇలాంటి టాస్కే నడిచింది. అప్పుడు ఆర్జే చైతూ కోసం అఖిల్ ఆడాడు.. తాను గెలిచి చైతూను కెప్టెన్ చేశాడు. కానీ ఆ వారం చైతూ నామినేషన్స్‌లో ఉండటంతో కెప్టెన్సీ పవర్ అనుభవించకుండానే ఎలిమినేట్ అయిపోయాడు. మరి ఈ వారం శోభా కెప్టెన్సీని అనుభవించకముందే ఎలిమినేట్ అవుతుందా? లేదంటే తనకోసం తేజ లేదా ఏ ఇతర కంటెస్టెంట్‌నైనా బలి చేయనున్నారా? అనేది చూడాలి! చదవండి: ఏం తప్పు చేశానో చెప్పండి?.. శివాజీపై మండిపడ్డ గౌతమ్! -
వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అమర్‌పై మళ్లీ విషం కక్కిన శివాజీ
కెప్టెన్ గౌతమ్ హౌస్‌లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఈ వారం ఆడపిల్లలు పనే చేయక్కర్లేదని బంపరాఫర్ ఇచ్చాడు. ఇంకేముంది.. లేడీ కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. అటు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలుపెట్టాడు బిగ్‌బాస్. మరి నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి.. మళ్లీ విషం కక్కిన శివాజీ బద్దకస్తుడైన తేజ శవాసనం వేస్తూ నేలకు అతుక్కుపోయాడు. ఇది గమనించిన బిగ్‌బాస్ తేజకు ఏదైనా శిక్ష వేయమని కెప్టెన్‌ను ఆదేశించాడు. కెప్టెన్ గౌతమ్.. తేజ అమ్మాయిలా చీర కట్టుకోవాలని చెప్పాడు. ఇంకేముంది, శోభ.. అతడికి చీర కట్టి రెడీ చేసింది. ఇదే అదను అనుకున్న తేజ.. అందరు అమ్మాయిలకు హగ్గులిచ్చుకుంటూ పోయాడు. ఇక పెద్దమనిషిని అని చెప్పుకునే శివాజీ ఎప్పటిలాగే అమర్‌పై విషం చిమ్మాడు. వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ప్రతి సీజన్లో అందరూ కలిసి ఒకర్ని హీరోను చేస్తే ఈ సీజన్లో నన్ను విలన్‌ను చేశారు అని తనకు తానే అనుకున్నాడు అమర్. చాలెంజ్ విసిరిన బిగ్‌బాస్ తర్వాత బిగ్‌బాస్.. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. ఇందుకోసం ఇంటిసభ్యులను రెండు టీమ్‌లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్‌లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు. మొదట బాల్స్ టాస్కు పెట్టాడు కానీ ఫలితాలను ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. చాలెంజ్ గెలిచిన టీమ్‌కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదటి చాలెంజ్కే రైతుబిడ్డ అవుట్ మొదట జంపింగ్ జపాంగ్ అనే చాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో వీరికి అవతలి టీమ్‌లో ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందరూ చర్చించుకుని ప్రశాంత్‌ను గేమ్ నుంచి సైడ్ చేశారు. తనను ఆటలో నుంచి పక్కకు తోసేయడంతో రైతుబిడ్డ కంటతడి పెట్టుకున్నాడు. శివాజీ తన చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్రశాంత్ మెడలో వేశాడు. అయితే ప్రశాంత్ కంటే భోలె ఎక్కువ ఫీలైపోయాడు. ప్రియుడి కోసం ఏడ్చేసిన శోభ మరోవైపు శోభ తన ప్రవర్తన మీద తనే డౌట్ పడింది. బయట ఉన్న ప్రియుడిని ఉద్దేశిస్తూ.. వాడు నన్ను అర్థం చేసుకుంటాడంటావా? అని తేజతో కబుర్లాడింది. 'వాడు చాలా మెచ్యూర్డ్.. అర్థం చేసుకుంటాడు.. కానీ నమ్మకంతో పాటు భయం కూడా ఉంది. ఒకవేళ వాడికి నచ్చనట్లు ఏమైనా ప్రవర్తించానా? నీ విషయంలో వేరేలా ఉన్నాను. అది తనకు నచ్చకపోవచ్చేమో.. ఎవరికి తెలుసు? అయినా ఏమీ అవదనే అనుకుంటున్నాను. పొరపాటున ఏదైనా జరిగితే నేనసలు తట్టుకోలేను. వాడు బాగా గుర్తొస్తున్నాడు' అంటూ శోభ ఏడ్చేసింది. ఇక రేపటి ఎపిసోడ్లో మిగతా చాలెంజ్‌లు ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనేది చూడాలి! చదవండి: లావణ్య మెడలో మూడు ముళ్లు వేసిన వరుణ్ తేజ్ -
Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?
బిగ్‌బాస్‌లో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే నామినేషన్స్ అప్పుడు మాత్రం మంచి ఊపు వస్తుంది. ఎందుకంటే అన్నిరోజులు మనసులో దాచుకున్నవన్నీ సోమవారం బయటకు కక్కేస్తారు. తమ కోపాన్నంతా చూపించేస్తారు. అలా ఈసారి కూడా మంచి వాడీవేడిగా సాగాయి. అయితే ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు తగువులాడుకోవడం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ ఏంటి విషయం? వరసగా ఏడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు. ఎనిమిదో వారం మాత్రం సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేశాం. ఇకపోతే ఈసారి ఒక్కో కంటెస్టెంట్.. ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ అయిన వ్యక్తులు.. డ్రాగన్ స్నేక్ ముందు నిల్చుంటే అందులో కలర్ పౌడర్ ముఖంపై పడుతుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) ప్రియాంక vs అమరదీప్ ఈసారి అనుకోని విధంగా నామినేషన్స్ జరిగాయి. ఇన్నాళ్లు ఒకరికొకరు అండగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. ఇప్పుడు ఎవరికి వాళ్లు ఆడాలని డిసైడ్ అయినట్లు ఉన్నారు. శోభాని అర్జున్ నామినేట్ చేయగా, ఇక ఏది పడితే అది మాట్లాడుతున్నాడని అమరదీప్తో ప్రియాంక గొడవ పెట్టుకుంది. నామినేషన్స్ కంటే ఇదే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇకపోతే తేజ.. అర్జున్, రతికని నామినేట్ చేశాడు. ప్రియాంక.. రతికని నామినేట్ చేసింది. భోలె షావళి.. ప్రియాంకని నామినేట్ చేశాడు. ఎప్పటిలానే శివాజీ బ్యాచ్‌లోని శివాజీ, ప్రశాంత్.. ఏదో పగ ఉన్నట్లు కావాలనే పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి అమరదీప్‌ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో క్లియర్‌గా కనిపించింది. ఓవరాల్ గా ఈ వారం.. ప్రియాంక, అమరదీప్, శోభాశెట్టి, అర్జున్, తేజ, రతిక, భోలె, యవర్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి? (ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!) -
బిగ్‌బాస్ 7: సందీప్ ఎలిమినేట్.. ఏడుస్తూ ఆ నిజం చెప్పేసిన శోభా!
బిగ్‌బాస్ 7లో షాకింగ్ ఎలిమినేషన్. చివరివరకు ఉంటాడని చాలామంది ఊహించిన సందీప్ మాస్టర్ హౌస్ నుంచి బయటకెళ్లిపోవాల్సి వచ్చింది. అయితే అతడు ఎలిమినేట్ కాగానే కొన్ని అసలు నిజాలు బయటపడ్డాయి. వీటిలో శివాజీ, శోభా బయటపెట్టారు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 56 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. గేమ్స్‌తో టైంపాస్ ఎలిమినేషన్ నుంచి ప్రియాంక, గౌతమ్ సేవ్ కావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. అలా సరదా సరదాగా పడవ గేమ్‌తో ఆదివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. మీతో పాటు పడవలో తోడుగా ఇద్దరుంటే వాళ్లలో ఎవరిని తోసేస్తారు? ఎవరిని ఉంచుతారు అని గేమ్ పెట్టారు. అలానే డైలాగ్ కొట్టు గురు! అని మరో గేమ్ పెట్టారు. ఇవి టైమ్‌పాస్ తప్పితే పెద్దగా అలరించలేదు. (ఇదీ చదవండి: 'సీతారామం' బ్యూటీ తెలుగింటి కోడలు కానుందా?) సందీప్ ఎలిమినేట్ ఆదివారం ఎపిసోడ్ లో వరసగా అశ్విని, అమరదీప్, శివాజీ, భోలె సేవ్ అయ్యారు. చివరగా శోభా, సందీప్ మిగిలారు. కాసేపు టెన్షన్ తర్వాత సందీప్ ఎలిమినేట్ అయినట్లు హోస్ట్ నాగార్జున ప్రకటించారు. ఇది చూసి తేజ, అమరదీప్ షాకయ్యారు. ఇక సందీప్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసి దగ్గర నుంచి శోభా ఏడుస్తూనే ఉంది. శివాజీ అయితే నువ్వు ఎలిమినేట్ అవుతావని అనుకోలేదని అన్నాడు. అంటే శోభా ఎలిమినేట్ అవుద్దని శివాజీ అనుకున్నాడు. కానీ అంచనా తప్పిందని బాధపడ్డాడు. ఇకపోతే వరసగా అమ్మాయిలు ఎలిమినేట్ కావడాన్ని సందీప్, తన ఎలిమినేషన్‌తో బ్రేక్ చేశాడు. సందీప్ మాస్టర్ ఎలిమినేట్ అయ్యాడని తెలిసి.. 'వెళ్లిపోవద్దు మాస్టర్, మీరెళ్లిపోతే నేను ఉండలేను' అని శోభా బోరున ఏడ్చేసింది. హౌస్ నుంచి స్టేజీపైకి వెళ్లిన తర్వాత కూడా సందీప్‌ని చూస్తూ శోభా ఏడుస్తూనే ఉంది. అయితే సందీప్ ఎలిమినేట్ కావడం తమ బ్యాచ్‌ని బలహీనంగా చేస్తుందని శోభాకి అర్థమైంది కాబట్టి ఏడుస్తూ.. మీరు లేకపోతే ఉండలేనంటూ కన్నీళ్లు పెట్టుకుంది. అలా ఓ నిజం బయటపడినట్లు అయింది. సందీప్ వెళ్లిపోయాడు కాబట్టి అమర్-ప్రియాంక-శోభాపై శివాజీ బ్యాచ్ ఇంకా పగ, ప్రతీకారాలు చూపిస్తారనడంలో ఎలాంటి సందేహం లేదు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'కేసీఆర్' సినిమా కోసం ఇల్లు తాకట్టు పెట్టిన 'జబర్దస్త్' కమెడియన్) -
వీళ్లకేమో తిట్లు.. శివాజీకేమో బుజ్జగింపులు.. ఏంటిది బిగ్‌బాస్?
బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. కొందరిపై కోప్పడ్డాడు. మరికొందరిని మాత్రం బుజ్జగించాడు. ఇంకొందరిని మెచ్చుకున్నాడు. మరీ తీసిపడేయలేం కానీ ఓ మాదిరి ఇంట్రెస్టింగ్‌గానే శనివారం ఎపిసోడ్ సాగింది. సీరియల్ బ్యాచ్‌పై ఫుల్ సీరియస్ అయిన నాగ్.. శివాజీతో పవర్తించిన తీరు మాత్రం కాస్త విచిత్రంగా అనిపించింది. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 55 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. పిచ్చోడు గొడవ గురించి గౌతమ్.. కొత్త కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. నాగ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. శుక్రవారం జరిగిన సంగతుల్ని కాసేపు చూసిన నాగ్.. వర్తమానానికి వచ్చేశాడు. ఫస్ట్ ఫస్ట్ శోభాశెట్టితో మొదలుపెట్టాడు. అసలు యవర్ని 'పిచ్చోడు' అని ఎందుకు అన్నావ్? అని అడిగాడు. అనర్హత పేరు చెప్పి తనకు మిర్చి దండ వేశాడని, నేను మాట్లాడటానికి ట్రై చేస్తుంటే.. తనని మాట్లాడనివ్వలేదని, అందుకే పిచ్చోడు అని అన్నానని శోభా చెప్పుకొచ్చింది. మరి గతవారం భోలె.. ఎర్రగడ్డ అనే పదం వాడితే గింజుకున్నావ్, అది మెంటల్ అని అన్నావ్, ఒప్పుకోనని అన్నావ్.. ఇప్పుడెందుకు ఇలా చేశావ్ అని నాగ్ సీరియస్ అయ్యాడు. 'నీకు క్షమించే గుణం లేనప్పుడు మాటలు జారకూడదు కదమ్మా' అని సుతిమెత్తగా కౌంటర్ వేశాడు. (ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో హీరోలకు మించిన ఫాలోయింగ్.. ఎవరీ 'నెపోలియన్'?) యవర్ కూడా పడ్డాయ్ ఈ గొడవలో శోభాది ఎంత గొడవ ఉందో యవర్ది కూడా అంతే తప్పు ఉందన్నట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. మిర్చిదండ విసిరి కొట్టావ్, బిగ్‌బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశావ్.. మారావ్ అనుకుంటే.. మళ్లీ ముందులానే ప్రవర్తించావ్ యవర్ అని మనోడికి కాస్త గడ్డిపెట్టాడు. 'నువ్వు ప్రవర్తించిన విధానం చూస్తే.. నేను, ఆడియెన్స్ ఎవరైనా సరే పిచ్చోడు అనే అంటారు' కదా అన్నాడు. అయితే యవర్, శోభా.. ఇద్దరూ కూడా తమని తాము సమర్థించుకోవాలని చూశారు. ఇలా మిమ్మల్ని మీరు జస్టిఫై చేయాలని చూడకండి, ఫూల్ అవుతారు అని నాగ్ కౌంటర్ వేశాడు. అమర్ vs ప్రశాంత్ గొడవ నామినేషన్స్ సందర్భంగా ప్రశాంత్‌తో మాట్లాడుతూ అమరదీప్ కుర్చీ తన్నాడు. 'ఈ నా కొడుకు' అనే పదం వాడటం గురించి నాగ్ అడిగాడు. అమర్ ఏదో చెప్పాలని చూశాడు కానీ వర్కౌట్ కాలేదు. దీంతో నాగ్ మాట్లాడుతూ.. 'ప్రశాంత్ అంటే నీకు చిన్నచూపు అని అంటాటు' అని నాగ్ అనగానే.. 'లేదు సర్ లేదు సర్' అని అమర్ క్లారిటీ ఇచ్చాడు. అక్కడితో ఆ టాపిక్ ముగిసింది. ఇక నామినేషన్స్ లో ఒకలా, మిగతా సమయాల్లో మరోలా ప్రవర్తిస్తుంటావ్? ఏంటి ప్రశాంత్ ఇది అని నాగ్.. కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ఇక రతిక గురించి మాట్లాడిన నాగార్జున.. 'హౌసులో కబుర్లు చెప్పడానికి వెళ్లావా? గతం గతహ... అంత ఛాన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావ్? ఎందుకు ఆడట్లేదు? నామినేషన్స్‌లో లేవని కాన్ఫిడెన్సా? గతం గురించి మాట్లాడుకుంటే గతంలో ఉండిపోతావ్, మనుషుల గురించి ఫోకస్ చేయొద్దు' అని రతికకు సుతిమెత్తగా నాగ్ కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: నటుడి ఇంట్లో దొంగతనం.. డబ్బులు, బంగారంతో పనిమనిషి పరార్!) శివాజీకి బుజ్జగింపులు 'ఎవరో ఒకర్ని కొట్టేసి వెళ్లిపోతా?' అన్నావ్ కదా శివాజీ అసలేమైంది? అని నాగ్ అడిగాడు. 'నేను అవన్నీ చెప్పుకోలేను. చాలా విషయాలు బాగోట్లేదు. నేను నీతిగానే ఉంటున్నాను. మనుషుల పేర్లు చెప్పలేని గానీ చాలామంది ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటోంది. నన్ను పంపించేశానా? నన్ను తిట్టినా ఓకే?' అని శివాజీ నాగార్జునతో అన్నాడు. ప్రశాంత్, యవర్‌కి వాళ్ల బిహేవియర్ గురించి చెప్పావా? అని నాగ్ అడగ్గా.. వీళ్లతో పాటు సందీప్‌కి కూడా చెప్పానని శివాజీ అన్నాడు. దీని తర్వాత నాగ్ మాట్లాడుతూ.. 'శివాజీ సేఫ్ ఆడొద్దు. నీకు ఏమనిపిస్తే అది చెప్పు' అని నాగ్ అన్నాడు. 'ఇదే చివరి అవకాశం.. ఇక చేయి దాటిపోతే చెప్పేస్తా బాబుగారు' అంటూ నాగ్-శివాజీ ఇద్దరికి ఇద్దరూ బుజ్జగించుకున్నట్లు అనిపించింది. అయితే శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత హోస్ట్ నాగార్జున.. సీరియల్ బ్యాచ్ ని ఏమైనా టార్గెట్ చేశాడా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే శోభాశెట్టి, అమరదీప్తో గట్టిగా మాట్లాడిన నాగ్.. ఎవడో ఒకడ్ని కొట్టేసి వెళ్లిపోతా అని ఎగిరెగిరి పడిన శివాజీతో మాత్రం నాగ్ బుజ్జగింపులు జరిపాడు. అలా అనొద్దు, సేఫ్ ఆడొద్దు అని చెప్పాడు. అలానే ఈ ఎపిసోడ్ చూస్తే.. సీరియల్ బ్యాచ్ ఓవైపు, శివాజీకి ఓ బ్యాచ్ ఉందని క్లియర్‌గా అర్థమైంది. ఇకపోతే నామినేషన్స్‌లో ఉన్న 8 మందిలో ప్రియాంక, గౌతమ్ సేవ్ అయినట్లు నాగ్ చెప్పాడు. ఇంకా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం క్లారిటీ వస్తుంది. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
'పిచ్చోడు' గొడవపై నాగ్ సీరియస్.. బయటపడ్డ యవర్ అసలు రంగు!
బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చిందంటే నాగ్ వచ్చేస్తాడు. వారమంతా కంటెస్టెంట్స్ చేసిన తప్పులు బయటపెడతాడు. ఒక్కొక్కరికి నిలబెట్టి మరీ కడిగేస్తాడు. ప్రతివారం ఇదే జరుగుతూ ఉంటుంది. అలా ఈ వీకెండ్ అందరికీ గట్టిగానే పడ్డాయి. కానీ యవర్‌కి మాత్రం కోలుకోలేని రేంజులో కౌంటర్స్ పడినట్లు కనిపిస్తున్నాయి. 'పిచ్చోడు' గురించి మొత్తానికే సీరియస్ అయ్యాడు. తాజాగా రిలీజ్ చేసిన ఈ ప్రోమో, ఎపిసోడ్‌పై ఆసక్తి పెంచుతోంది. అసలేంటి గొడవ? ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్‌గా శోభాశెట్టితో పాటు మరికొందరు నిలిచారు. వీళ్లలో ఎవరికి అనర్హులు చెప్పాలని.. మిగతా వాళ్లకు బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో యవర్.. శోభాశెట్టికి ఎండుమిర్చి దండ వేశాడు. కానీ శోభాకి ఇది నచ్చలేదు. కాస్త సౌండ్ పెంచేసరికి యవర్ రెచ్చిపోయాడు. అమ్మాయి అని కూడా చూడకుండా శోభాశెట్టి మీదమీదకి వెళ్లి మరీ అరిచాడు. దీంతో ఆమె ఓ సందర్భంలో యవర్ని పిచ్చోడు అని సంభోదించింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) నాగ్ ఏం చెప్పాడు? శనివారం ఎపిసోడ్లో భాగంగా నాగ్ ఈ విషయమై సీరియస్ అయ్యాడు. శోభా, యవర్ని నిలబెట్టి మరీ కడిగేశాడు. ఫస్ట్ శోభాతో మాట్లాడిన నాగ్.. 'గతవారం భోలె.. నిన్ను ఎర్రగడ్డ అన్నందుకు గింజుకున్నావ్, మరి నువ్వు పిచ్చోడు అనడం కరెక్టా?' అని అడిగాడు. 'నీకు క్షమించే గుణం లేనప్పుడు నువ్వు మాటలు జారకూడదు కదమ్మా' అని చల్లబరిచాడు. ఇక యవర్‌తో మాట్లాడుతూ.. 'బిగ్‌బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేయకూడదని కంప్లీట్ రూల్స్ ఉన్నాయ్. మళ్లీ యువర్ బ్యాక్ టూ ద ఒరిజినల్ బిహేవియర్, నువ్వు ప్రవర్తించిన పద్ధతి చూస్తే.. నేనైనా ఆడియెన్స్ అయినా, ఎవరైనా సరే పిచ్చోడు అంటారు' అని నాగ్ సీరియస్ అయినట్లు ప్రోమోలో చూపించారు. యవర్ అసలు రంగు హౌసులో శివాజీకి శిష్యరికం చేస్తున్న యవర్.. వచ్చిన తొలి రెండు వారాల్లో గట్టిగా గొడవలు పడ్డాడు. ఆ తర్వాత గురువు శివాజీ చెప్పడంతో పాటు హౌస్మేట్స్ అదే చెప్పేసరికి కోపాన్ని తగ్గించుకున్నట్లు కవరింగ్ ఇచ్చాడు. ఇప్పుడు శోభా చిన్నగా ఓ మాట అనేసరికి నిజంగానే రెచ్చిపోయి, మిర్చిదండ విసిరేయడం, అమ్మాయి అని చూడకుండా మీదమీదకి వెళ్లిపోవడం లాంటివి చేసి.. నిజంగానే పిచ్చోడు అని నాగ్‌తోనే అనిపించుకున్నాడు. తన అసలు స్వరూపాన్ని బయటపెట్టి మళ్లీ బ్యాడ్ అయిపోయాడు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!) -
శోభ శెట్టి సేఫ్.. షాకిచ్చిన బిగ్ బాస్.. వారిద్దరిలో ఒకరు ఔట్
బిగ్‌బాస్ సీజన్ 7 సగం పూర్తి అయింది. ఎనిమిది వారాల తర్వాత తొలిసారి ఓ మేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి పోతున్నాడు. మొదటి ఏడు వారాలు లేడీ కంటెస్టెంట్లే హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. ఈ వారం నామినేషన్స్‌లో శివాజీ, బోలే, సందీప్, శోభా శెట్టి, అశ్విని, గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్ ఉన్నారు. బిగ్ ఫైట్‌లో గెలిచిన శోభ బిగ్‌బాస్‌లో శివాజీ బ్యాచ్‌ను ఢీ కొట్టేది శోభ మాత్రమే కాబట్టి ఆమెను ఎలిమినేషన్ చేయాలనే ప్లాన్‌లో బయట ఉన్న శివాజీ పీఆర్ టీమ్ చాలా గట్టిగానే పోరాడింది. అలా శివాజీకి డప్పు కొట్టే బ్యాచ్ మొత్తం శోభాశెట్టిని టార్గెట్ చేసింది. కొందరైతే ఆమెపై ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా కామెంట్లు చేయడం దారుణం. నామినేషన్ లిస్ట్‌లో శోభ పేరు చేరగానే ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరకు బిగ్‌బాస్ సీజన్ 6లో సామాన్యుడిలా వెళ్లి తెలుగు ప్రేక్షకుల ప్రేమకు దగ్గరైన ఆదిరెడ్డి కూడా శివాజీ బ్యాచ్‌లోని సభ్యులకే ఎక్కువ సపోర్ట్‌గా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆదిరెడ్డి కూడా.. హౌస్‌లో శివాజీ చేస్తున్న పొలంగట్టు పంచాయితీలనే వెనుకేసుకొస్తున్నారు. ఒకట్రెండు సందర్భాల్లో మినహా శివాజీ బ్యాచ్‌నే ఆదిరెడ్డి కూడా వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు ఏ చిన్న తప్పులు చేసినా.. వాటిని ఆదిరెడ్డి కూడా హైలెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆదిరెడ్డికి మంచి ఆదరణ ఉంది. అతనికంటూ మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అతను చెప్పే ప్రతి మాటకు ప్రస్తుతం ఒక వ్యాల్యూ ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఎక్కువగా శివాజీ బ్యాచ్‌నే వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శివాజీ బ్యాచ్ సేఫ్ అవుతున్నారని చెప్పవచ్చు. తన ఆటతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించే భోలే కూడా శివాజీ బ్యాచ్ అండతో సేఫ్ అవుతున్నాడు. ఎందుకు సేఫ్ కొన్నిసార్లు ఆటలో శోభ కూడా తప్పులు చేసి ఉండవచ్చు.. ఆమెతో పాటు శివాజీ బ్యాచ్ కూడా ఎన్నో తప్పులు చేశారు. ఎందుకోగానీ శోభాశెట్టి మీద విపరీతమైన వ్యతిరేకత పెంచడానికి గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నయ్. వాటంన్నిటినీ ఆమె మళ్లీ తిప్పికొట్టింది. హౌస్‌లో నిలిచింది. శివాజీ బ్యాచ్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేస్తున్నందువల్ల కావచ్చు. శివాజీ టీమ్‌ను శోభ మాత్రమే ఢీ కొడుతుంది. అలాంటిది ఆమెను హౌస్ నుంచి పంపిస్తే ఆటలో మజా ఉండదు. షో రేటింగ్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆమె సేఫ్ అయినట్లు తెలుస్తోంది. శోభ కూడా ఆటలో ఫైట్ చేస్తుంది. రెచ్చగొడుతుంది.. అప్పుడే ఏడుస్తుంది. కానీ ఏ టాస్కులనూ వదలదు. తన శక్తిమేరకు పోరాడుతుంది. ఏదేమైన ఆటలో ఉండాల్సిన కేరక్టర్ శోభ అని చెప్పవచ్చు. శివాజీ బ్యాచ్ అండతో ఆయన సేఫ్ ఎనిమిదో వారం బిగ్‌బాస్ నుంచి ఆట సందీప్ ఎలిమినేషన్ జరిగిపోయింది.. దాదాపు ఇదే ఖాయం. మొదటి వారంలోనే లక్కీగా ఐదు వారాలు ఎలిమినేషన్ల నుంచి ఇమ్యూనిటీ పొందాడు. ఇదే అతనికి బిగ మైనస్ అయింది. ఓట్లు వేసే వాళ్లు అతనికి చేరవు కాకుండా చేసింది. ఏడు వారల తర్వాత ఆయన ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉండటంతో ఓట్లు వేసే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. ఈసారి నామినేషన్లలో చేరడంతో ఇక లీస్ట్ వోట్లతో హౌజ్ నుంచి వెనుతిరగక తప్పలేదు. ఆటలో మరీ అంత బ్యాడ్ పర్ఫామెన్స్ సందీప్ ఇవ్వలేదు. కానీ శివాజీ బ్యాచ్ కాదు.. శోభాశెట్టి బ్యాచ్… అందుకే తన మీద కూడా బాగా వ్యతిరేకతను బయట ఉండే వారు క్రియేట్ చేశారు. ఆటల్లో, టాస్కుల్లో తను యాక్టివ్గానే ఉన్నాడు. కానీ చివరకు ఔటవ్వక తప్పలేదు. వాస్తవానికి ఈ వారం లక్కీ పర్సన్ భోలే.. ఆతను శివాజీ బ్యాచ్‌లో చేరడం వల్లే సేఫ్ అయ్యాడు. మరోవైపు శివాజీ టీమ్‌కు శత్రువు అయిన శోభతో వైరం క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఆయన సేఫ్ అయ్యాడని తెలుస్తోంది. -
శోభాశెట్టి ట్రాపులో పడిన రతిక.. ఈమెది దెయ్యం తిండి అట!
బిగ్‌బాస్ 7 సీజన్ కొన్నాళ్ల ముందుతో పోలిస్తే ఇప్పుడు కాస్త ఇంట్రెస్టింగ్ మారింది. గొడవలు, తిట్టుకోవడాలు ఎక్కువయ్యాయి. అదే టైంలో కెప్టెన్సీ కోసం కంటెస్టెంట్స్ కిందామీదా పడుతున్నారు. తాజాగా కెప్టెన్సీ దక్కించుకునేందుకు ఫైనల్ టాస్క్ ఒకటి పెడ్డగా.. ఇందులో శోభాశెట్టి హైలైట్ అయ్యింది. అదే టైంలో ఈమె వల్ల రతిక బండారం బయటపడింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 54 హైలైట్స్‌లో చూద్దాం. ప్రశాంత్ vs రతిక అక్క ఈ వారం కెప్టెన్సీ కంటెండర్స్‌గా ప్రియాంక, గౌతమ్, శోభా, ప్రశాంత్, సందీప్ నిలవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ప్రశాంత్-రతిక మధ్య 'అక్క' అనే పదం గురించి డిస్కషన్‌తో శుక్రవారం ఎపిసోడ్ షురూ అయింది. తనని అక్క అని పిలవొద్దని, బయట చాలా ప్రాబ్లమ్ అయిందని రతిక చెప్పుకొచ్చింది. కానీ ప్రశాంత్ అస్సలు వినలేదు. అక్క అనే పిలుస్తానని భీష్మించుకు కూర్చున్నాడు. మధ్యలో కారణం లేకుండా ఓసారి ఏడ్చాడు కూడా. ఈ మొత్తం వ్యవహారాన్ని చక్కదిద్దిన పెద్దమనిషి శివాజీ.. రతిక-ప్రశాంత్ మధ్య సంధి కుదిర్చాడు. (ఇదీ చదవండి: తల్లి చివరి కోరిక తీర్చబోతున్న మహేశ్‌బాబు.. త్వరలో శుభకార్యం!) కొత్త కెప్టెన్ వచ్చాడ్రోయ్ ఇక కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసులో ఉన్న ఐదుగురిలో ఎవరికి కెప్టెన్ అయ్యేందుకు అనర్హత ఉందో, వాళ్ల మెడలో ఎండుమిర్చి దండ వేయాలని.. 'ఈ మిర్చి చాలా హాట్' అనే టాస్కుని బిగ్‌బాస్ పెట్టాడు. చివరగా ఎవరి మెడలో అయితే తక్కువ దండలు ఉంటాయో వాళ్లే కెప్టెన్ అవుతారని అన్నాడు. ఇందులో అస్సలు ఒక్క దండ కూడా పడని గౌతమ్.. బిగ్‌బాస్ హౌసుకి కొత్త కెప్టెన్ అయ్యాడు. ఎవరు ఎవరికి దండేశారు? అమరదీప్ - ప్రశాంత్ తేజ - ప్రశాంత్ యవర్ - శోభాశెట్టి భోలె - ప్రియాంక అశ్విని - ప్రియాంక రతిక - శోభాశెట్టి అర్జున్ - సందీప్ శివాజీ - సందీప్ (ఇదీ చదవండి: అబద్ధం చెప్పి దొరికిపోయిన శ్రీలీల.. ఆ హీరోకి ఆల్రెడీ ముద్దు!) శోభా ట్రాప్‌లో ఇద్దరు అయితే ఈ టాస్కులో భాగంగా తనని అనర్హత పేరు చెప్పి మిర్చి దండ వేయడంపై శోభాశెట్టి తట్టుకోలేకపోయింది. తొలుత యవర్‌తో.. తొలి రెండు పోటీల్లో ఓడిపోయి, మూడే గేమ్‌లో గెలిచావ్ అందుకే ఈ దండ వేస్తున్నా అని కారణం చెప్పాడు. దీంతో శోభా పెద్ద గొడవ పెట్టుకుంది. ఏకంగా పిచ్చోడు అనేసింది. దీంతో అతడు నిజంగానే మెంటలెక్కినట్లు అరిచాడు. మిర్చి దండ విసిరి కొట్టాడు. దీంతో ఇద్దరి మధ్య హోరాహోరీ సాగింది. ఇది అయిన తర్వాత లివింగ్ రూంలో కూర్చుని శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గేమ్‌లో గెలిస్తే ఓ బాధ, గెలవకపోతే ఓ బాధ అని ఏడ్చేసింది. రతిక మళ్లీ అదే తప్పు హౌసులో మాటలు మారుస్తూ అందరి ఆట చెడగొడుతుందనే కారణంతో రతిక ఇప్పటికే ఓసారి హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. ఇప్పుడు మళ్లీ అదే తప్పు చేస్తోంది. శోభాకి మిర్చి దండ వేసిన ఈమె.. ఏదో చెప్పాలని ప్రయత్నించింది. కానీ శోభా ఊరుకోలేదు. దీంతో చాలాసేపు గొడవ జరిగింది. 'నిన్న నువ్వే నాతో అన్నావ్.. లేడీ కెప్టెన్ ఉంటే బాగుంటుందని, ఇప్పుడు నువ్వే దండం వేస్తున్నావ్' అని రతిక నిజస్వరూపాన్ని శోభా బయటపెట్టింది. అలా శోభా కావాలనే రెచ్చగొడితే.. యవర్, రతిక ఇద్దరూ ట్రాపులో పడ్డారు. ఇది జరిగిన తర్వాత రతిక గురించి శోభా-అశ్విని మాట్లాడుకున్నారు. రతిక ఏంటి? దెయ్యంలా అంత తింటుంది! అని అశ్విని బయటపెట్టింది. రతిక.. తినడం, తిరగడం, మాట్లాడటం తప్ప హౌసులోకి ఏం చేయట్లేదని శోభా అరుస్తూ చెప్పింది. అలా శుక్రవారం ఎపిసోడ్ కాస్త నీరసంగానే ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?
'బిగ్‌బాస్ 7' షో ఇప్పుడు మంచి మజా ఇస్తోంది. ఎందుకంటే చోటామోటా కంటెస్టెంట్స్ అందరూ ఎలిమినేట్ అయిపోయారు. సగం రోజులు కూడా అయిపోయాయి. దీంతో ఎవరికి వాళ్లు హౌసులో ఉండేందుకు గట్టిగా ప్రయత్నిస్తున్నారు. దీంతో ఎంతటి గొడవకైనా వెనుకాడటం లేదు. మరోవైపు ఈసారి ఎనిమిది నామినేట్ కాగా అందులో ఓ స్టార్ కంటెస్టెంట్ ఎలిమినేట్ అయ్యే ఛాన్స్ గట్టిగా ఉంది. ఇంతకీ ఆ ఒక్కరు ఎవరో తెలుసా? హౌసులో రెండు గ్రూపులు బిగ్‌బాస్ షో నిర్వహకులు చెప్పేదాని ప్రకారం.. హౌసులో ఎవరికి వాళ్లు గేమ్ ఆడాలి. కానీ ప్రస్తుత సీజన్లో మాత్రం రెండు గ్రూపులు ఏర్పడ్డాయి. పెద్ద మనిషి అని చెప్పుకొంటున్న శివాజీ.. యవర్, ప్రశాంత్, భోలెకి అండగా నిలుస్తున్నాడు. మొన్నటివరకు ఇది అంత పెద్దగా బయటపడలేదు. ఇప్పుడిప్పుడే అసలు నిజాలు బయటకొస్తున్నాయి. మరోవైపు అమరదీప్, శోభా, ప్రియాంకతో పాటు సందీప్ ఓ గ్రూపుగా ఉన్నారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఎలిమినేషన్ మజా ప్రతిసారి ఎలిమినేషన్లో ఎవరో ఒకరు వీక్ కంటెస్టెంట్ ఉండేవాళ్లు. దీంతో వాళ్లు బయటకెళ్లిపోవడం గ్యారంటీ అని తెలిసేది. కానీ ఈసారి అలా కాదు. శివాజీ, భోలె, అమరదీప్, సందీప్, శోభాశెట్టి, ప్రియాంక, గౌతమ్, అశ్విని.. ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లందరూ ఎవరి పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్లు.. స్ట్రాటజీలతో గేమ్ ఆడుతున్నారు. దీంతో ఎవరూ ఎలిమినేట్ అవుతారా అని ఆసక్తి పెరిగింది. శోభాకి గండం? అయితే ఈసారి శివాజీకి ఎక్కువ ఓట్లు పడినట్లు తెలుస్తోంది. అనుహ్యంగా భోలె రెండో స్థానంలో ఉన్నాడట. తర్వాతి స్థానాల్లో వరసగా అమరదీప్, అశ్విని, గౌతమ్, ప్రియాంక ఉన్నట్లు సమాచారం. ఇక చివరి రెండు స్థానాల్లో సందీప్, శోభాశెట్టి దాదాపు ఒకేలా ఓట్లు పడ్డాయట. కానీ శోభాశెట్టిపై ఎలిమినేషన్ వేటు తప్పదని అంటున్నారు. ఒకవేళ అలా కాదంటే మాత్రం సందీప్ మాస్టర్ బయటకెళ్లిపోవడం గ్యారంటీ. ఈ ఇద్దరిలో ఎవరు ఎలిమినేట్ అయినా సరే పెద్ద షాకింగే అని చెప్పొచ్చు. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
పిచ్చోడంటూ తిట్టిన శోభ.. ఉగ్రరూపం దాల్చిన ప్రిన్స్
బిగ్‌బాస్ షోలో ప్రేమానురాగాలు, రాగద్వేషాలు, ఆప్యాయతలు, కలతలు- కలహాలు.. ఇలా అన్నీ ఉంటాయి. కానీ ఈ సీజన్లో మాత్రం రాగద్వేషాలు, కలతలు, కలహాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఆటలో పోట్లాటలను స్పోర్టివ్‌గా తీసుకోకుండా అనవసర కోపాలకు, గొడవలకు పోతున్నారు. మరీ ముఖ్యంగా శోభా శెట్టి ప్రతిదానికి చిటపటలాడుతోంది. మోనితలా మారుతున్నావు అని అటు భోలె, ఇటు నాగార్జున హెచ్చరిస్తున్న తన తీరు మార్చుకోవడం లేదు. మోనితలా మారడం కాదు తన అసలు స్వభావం మోనితయే అన్నంత విచిత్రంగా ప్రవర్తిస్తోంది. అతిగా ఆశపడటం, ఆవేశపడటం.. ఆటలో తను మాత్రమే కష్టపడుతుందని భావించడం.. ఏ ఛాన్సయినా తనకు మాత్రమే దక్కాలని అతిగా ఆశపడటం, ఆవేశపడటం.. లేదంటే అవతలివారి మీదకు గయ్యిమని లేవడం.. ఇలా ఒకదాని మీద ఇంకోటి తప్పులు చేసుకుంటూ పోతూ నెగెటివిటీ మూటగట్టుకుంటోంది. తాజాగా కెప్టెన్సీ టాస్కులోనూ మరోసారి సైకో మోనితలా మారింది శోభ. ఈ మేరకు ప్రోమో రిలీజైంది. బిగ్‌బాస్ ఈ మిర్చి చాలా హాట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కెప్టెన్సీ కంటెండర్లలో ఎవరు కెప్టెన్ అవుతారనేది మిగతా ఇంటిసభ్యులు నిర్ణయించాల్సి ఉంటుందని చెప్పాడు. చిందులు తొక్కిన శోభ ముందుగా అమర్.. నామినేషన్స్‌లో ఉన్నవాళ్లకు కెప్టెన్సీ అవసరం నీకన్నా ఎక్కువ ఉందంటూ ప్రశాంత్ మెడలో మిర్చి మాల వేశాడు. భోలె షావళి.. ప్రియాంక మెడలో మిర్చిమాల వేశాడు. రతిక రోజ్, ప్రిన్స్.. శోభా శెట్టికి దండేశారు. ఇంకేముంది... ఆ మిర్చి ఘాటు శోభ నషాళానికి ఎక్కింది. నన్నే కెప్టెన్సీ పోటీ నుంచి తప్పిస్తారా? అని బుసలు కొట్టింది. బక్వాస్ రీజన్స్.. ఇలాంటి పరిస్థితి ఏదో ఒకరోజు నీక్కూడా వస్తుంది.. అప్పుడు నేను మాట్లాడతా.. పిచ్చోడు అని తిట్టేసింది. ప్రిన్స్‌ను పిచ్చోడనేసింది.. నన్ను పిచ్చోడు అంటున్నావా? అని ప్రిన్స్ అడగ్గా.. మళ్లీ మళ్లీ అంటా.. ఏం చేస్తావ్? అని రెచ్చగొట్టింది. పిచ్చోడినా నేను? అని ప్రిన్స్ శోభా మీదకు వెళ్లి అరిచి మిర్చి దండను నేలకేసి కొట్టాడు. భోలె.. తనను మెంటల్ హాస్పిటల్‌కు పంపించాలని అన్నందుకు అతడిని జీవితంలో క్షమించనంది శోభా. మరి ఇప్పుడు ప్రిన్స్ యావర్‌ను పిచ్చోడు అనడం అసలు సమంజసమేనా? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇక ఇంటి కొత్త కెప్టెన్‌గా గౌతమ్ అవతరించినట్లు తెలుస్తోంది. చదవండి: స్కంద ఓటీటీ రిలీజ్ వాయిదా.. రామ్ ఫ్యాన్స్‌కు నిరాశ.. -
రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ అనేది అమృతం కన్నా ఎంతో విలువైనది. కెప్టెన్సీ వస్తే ఒక వారం పాటు ఇమ్యూనిటీ లభించినట్లే! ఈ లెక్కన ఆ వారమంతా ఏ పనీ చేయనక్కర్లేదు, నామినేషన్స్ ఉండవు, ఎలిమినేషన్ భయమే లేదు. పైగా తన మాటే శాసనం అన్నట్లుగా కెప్టెన్ ఏది చెప్తే అదే నడుస్తుంది. అందుకే కెప్టెన్ అవ్వాలని కంటెస్టెంట్లు తహతహలాడిపోతుంటారు. కెప్టెన్సీ కోసం పోటీపడే కంటెండర్లను ఎంపిక చేసేందుకు బిగ్‌బాస్ బీబీ మారథాన్ పోటీ పెట్టాడు. మరి ఈ మారథాన్‌లో ఏం జరిగింది? ఎవరు కంటెండర్లుగా నిలిచారు? అనేది తాజా(అక్టోబర్ 26) ఎపిసోడ్లో చూసేద్దాం.. నీటితో గేమ్ కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఈ ఎపిసోడ్లో ముందుగా స్టోర్ ఇట్.. పోర్ ఇట్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా షవర్ నుంచి వచ్చే నీళ్లను తలపై స్పాంజిలో నింపుకుని తమ కంటైననర్లో పిండుకోవాలి. ఈ గేమ్‌లో అర్జున్, అశ్విని, సందీప్, భోలె షావళి ఆడారు. ఒకరినొకరు తోసుకున్నారు. ఈ క్రమంలో అర్జున్ తోసేయడంతో అశ్విని కిందపడిపోయింది. ఇక బజర్ మోగిన ప్రతిసారి కంటైనర్‌లో తక్కువ నీళ్లు ఉన్నవారు అవుట్ అవుతారు. మొదట భోలె అవుట్ కాగా అతడు తన కంటైనర్‌లోని నీటిని అశ్వినికి ఇచ్చేశాడు. ఇద్దరి త్యాగాలు.. గెలిచిన సందీప్ తర్వాతి రౌండ్లో అశ్విని అవుట్ కాగా ఆమె తన నీటిని సందీప్ మాస్టర్‌కు ఇచ్చేసింది. మూడో రౌండ్లో అర్జున్ ఎంత కష్టపడ్డా సందీపే గెలిచి కెప్టెన్సీ కంటెండర్ అయ్యాడు. తర్వాత అమర్‌తో సందీప్ ముచ్చట్లు పెట్టాడు. అర్జున్ సీరియస్‌గా ఆడుతున్నాడని, తను తోసేశాడని ఆరోపించాడు. ఎక్కడ కొడితే ఎక్కడ నొప్పి వస్తుందో నాకూ తెలుసు. నా మోచేయి చాలు తన హైట్‌కు.. అంటూ ఏదేదో మాట్లాడాడు. ఇక అర్జున్ తను గేమ్ ఆడేటప్పుడు ఎవరూ తనకు సపోర్ట్ చేయలేని తెగ ఫీలైపోయాడు. ఇంతకుముందు నో మాస్టర్ అనేవాళ్లు, ఇప్పుడు మాస్టర్ మాస్టర్ అంటున్నారనగానే శివాజీ.. అవన్నీ గచ్చిబౌలి స్ట్రాటజీస్ అంటూ చులకనగా మాట్లాడాడు. అక్కా అనొద్దంటూ వెంటపడ్డ రతిక హౌస్‌లో రీఎంట్రీ ఇచ్చిన రతిక వచ్చినప్పటినుంచి ఇంకా ఏ అలజడి సృష్టించకుండా ఉందేంటా? అనుకునేలోపు మళ్లీ మొదలెట్టేసింది. యావర్‌తో నిన్ను, శివనన్నని తప్ప హౌస్‌లో ఎవరినీ నమ్మను.. మనం ఇద్దరం ఒకే ప్లేట్లో తింటుంటే ప్రియాంక.. మనల్ని లవ్‌బర్డ్స్ అందట. నీ మనసులో, నా మనసులో ఏం లేదు. ఫ్రెండ్లీగా ఉన్నాం.. లవ్ కనెక్షన్ ఎట్లా వస్తుంది అని మాట్లాడింది. మరోవైపు ప్రశాంత్‌తో తనను అక్కా అనొద్దంటూ సతాయించింది. అతడికేమో ఆమె పెట్టిన టార్చర్ గుర్తొచ్చి ఏడుస్తూ అక్కా అనే పిలుస్తా అన్నాడు. ఆమె మాత్రం అందుకొప్పుకోలేదు. చివర్లో శివాజీ కలగజేసుకుని అక్కా అని పిలవనవసరం లేదు అంటూ తీర్పునిచ్చాడు. కంటెండర్‌గా గౌతమ్ కాసేపటికి ఎంప్టీ ద కంటైనర్ టాస్క్ ఇచ్చాడు. దీంతో శోభా.. నేను ఆడతా.. నన్ను ఆడనివ్వకపోతే ఎవరినీ ఆడనివ్వను.. నేను ఆడాల్సిందే అంటూ ఓరకంగా వార్నింగే ఇచ్చింది. దీంతో అర్జున్.. ఆమెతో పోరు పడలేక శివాజీ, అశ్విని, గౌతమ్‌లతో పాటు శోభాకు ఛాన్స్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో గౌతమ్ గెలిచాడు. ఓటమిని తీసుకోలేని శోభ ఏడుపు మొదలెట్టేసింది. తర్వాత తేజ-శోభలను బిగ్‌బాస్ ఆటపట్టించాడు. తేజను తిననివ్వకుండా ఎందుకంత క్రూరంగా ప్రవర్తిస్తున్నావ్.. స్వయంగా మీరే రెండు చపాతీలు చేసి తేజకు తినిపించాలంటూ శోభకు పనిష్మెంట్ ఇచ్చాడు. దీంతో లవ్ సింబల్ షేప్‌లో చపాతీ చేసి తేజ వద్దంటున్నా అతడి వెనకాలే వెళ్తూ ముద్దలు తినిపించింది. ఎట్టకేలకు కంటెండర్‌గా శోభా ఇక చివరగా వేర్ ఇట్ అండ్ విన్ ఇట్ గేమ్ పెట్టాడు. మళ్లీ శోభా.. నేను ఆడతా.. అంటూ మళ్లీ మొదలుపెట్టింది. అర్జున్ ఏదో ఆలోచిస్తుంటే అలిగి వెళ్లిపోయింది. దీంతో అశ్విని, అర్జున్ త్యాగం చేసి తేజ, యావర్, శోభాలకు అవకాశం ఇచ్చారు. ఇందులో తేజకు అమర్, శోభాకు ప్రియాంక, యావర్‌కు ప్రశాంత్ సపోర్ట్ చేశాడు. ఈ గేమ్‌లో శోభా అత్యధికంగా 72 దుస్తులేసుకుని విన్నర్‌గా నిలిచింది. ఈ వారం బీబీ మారథాన్‌లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. చదవండి: సడన్‌గా ఓటీటీలోకి వచ్చిన లేటెస్ట్ మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే? -
అశ్వినిని తోసిపడేసిన అర్జున్.. తన పీక పట్టుకున్నాడన్న సందీప్
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇప్పటికే రెండు టాస్కులు జరగ్గా వాటిలో ప్రియాంక, ప్రశాంత్ గెలిచి కంటెండర్లుగా నిలిచారు. అమర్, రతిక ఆటలో నుంచి అవుట్ అయి రేసులోనే లేకుండా పోయారు. ఇక మిగిలిన కంటెస్టెంట్ల కోసం నేడు బిగ్‌బాస్ మరిన్ని టాస్కులు పెట్టనున్నాడు. ఈమేరకు ప్రోమోలు రిలీజయ్యాయి. షవర్ కింద స్పాంజ్ ఉన్న హెల్మెట్ పెట్టుకుని నిలబడాలి. తర్వాత ఆ స్పాంజ్‌లోని నీళ్లను తమ కంటెయినర్లలో నింపాలి. అర్జున్ ఆటతీరుపై అసహనం ఈ టాస్కులో అర్జున్, భోలె షావళి, అశ్విని, సందీప్ ఆడారు. స్పాంజ్‌ను పూర్తిగా తడుకుపుకునేందుకు పోటీపడి మరీ ఆడారు. ఈ క్రమంలో ఒకరినొకరు తోసుకున్నారు. అర్జున్ అయితే అశ్వినిని కింద పడేశాడు. ఈ గేమ్ ముగిసిన తర్వాత సందీప్.. అర్జున్ ఆటతీరుపై అసహనం వ్యక్తం చేశాడు. ఫిజికల్ చేయాలంటే రెండు నిమిషాలు పట్టదు. నా పీక పట్టుకుని తోశాడు. ఆ పిల్లను ఒక్క తోపు తోస్తే కింద పడింది అంటూ అర్జున్ మీద మండిపడ్డాడు. ఈ ఆటలో సందీప్ గెలిచినట్లు తెలుస్తోంది. గెలిచిందెవరంటే? ఇక మరో ఆటలో వీలైనన్ని ఎక్కువ దుస్తులు వేసుకోవాలని ఫన్నీ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో తేజ, శోభా శెట్టి, ప్రిన్స్ యావర్ ఆడారు. ఇక తేజ తనవే కాకుండా అందరి బట్టలు సైతం వేసుకోవడంతో హౌస్మేట్స్ పడీపడీ నవ్వారు. ఈ టాస్కులో శోభ గెలిచినట్లు తెలుస్తోంది. ఇప్పటివరకు లైవ్‌లో జరిగిన గేమ్స్ ప్రకారం ప్రియాంక, శోభా, గౌతమ్, పల్లవి ప్రశాంత్, సందీప్ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. మరి ఈ వారం ఎవరు కెప్టెన్‌గా అవతరిస్తారో చూడాలి! చదవండి: భోపాల్ గ్యాస్ లీకేజీ దుర్ఘటన.. 39 ఏళ్ల తర్వాత వెబ్ సిరీస్‌గా.. ఏ ఓటీటీలో అంటే? -
లవ్‌బర్డ్స్ శోభా-తేజ మధ్య గొడవ.. పుల్ల పెట్టిన శివాజీ!
బిగ్‌బాస్ 7లో ఈ వారం నామినేషన్ హడావుడి ముగిసింది. 8 మంది లిస్టులో ఉన్నారు. తాజాగా కెప్టెన్సీ కంటెండర్స్ టాస్కులు షురూ చేశాడు. ఓ రెండు గేమ్స్ జరిగాయి. మరోవైపు హౌసులో ఇప్పటికే మాటలతో మాయ చేస్తూ బండి లాక్కొచ్చేస్తున్న శివాజీ.. శోభా-తేజ మధ్య పుల్లపెట్టి మంట ఎక్కువ చేస్తే ప్రయత్నాలు చేస్తున్నాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 52 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: విజయ్ 'లియో' ఓటీటీ రిలీజ్ ఫిక్స్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) అతి చేస్తున్న శివాజీ నామినేషన్స్ పూర్తవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ స్టార్టయింది. ఇక అయిపోయిన నామినేషన్ గురించి శివాజీ ఏదేదో మాట్లాడాడు. 'నామినేషన్ అనేది తెలివైన ప్రక్రియ. కానీ ఆ టైంలో కారణాలు లేకుండా, కొందరు హీరో అయిపోదామని ఎగిరెగిరి పడుతున్నారు. ఈ ప్రక్రియని అపహాస్యం చేస్తున్నారు' అని సీరియల్ బ్యాచ్‌ని ఉద్దేశిస్తూ అన్నాడు. అయితే ఆ ఎగిరెగిరి పడేవాళ్లలో ప్రశాంత్ కూడా ఉన్నాడు. అంటే శివాజీ లెక్క ప్రకారం.. ప్రశాంత్‌కి కూడా ఈ కామెంట్ వర్తిస్తుంది. ఎందుకంటే ప్రశాంత్ కూడా నామినేషన్స్‌లో తప్ప మిగతా రోజులు గేమ్స్ ఆడినా సరే ఉన్నాడా లేడా అన్నట్లు పవర్తిస్తుంటాడు. కన్నీళ్లు పెట్టుకున్న శోభా స్ట్రాంగ్‌గా ఉండే శోభా కన్నీళ్లు పెట్టుకుంది. గత నామినేషన్స్‌లో భోలె మెంటల్ అనడాన్ని గుర్తుచేసుకుని మరీ తేజతో మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఆ తర్వాత కాసేపటికి తన ఫ్రెండ్స్ అయిన అమర్-ప్రియాంక-సందీప్ దగ్గర మాట్లాడుతూ.. భోలె ఓ వేస్ట్ కేండిడేట్ అని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. (ఇదీ చదవండి: నోరు జారిన యాంకర్ సుమ.. మళ్లీ దానిపై సెటైర్లు కూడా!) కెప్టెన్సీ గేమ్స్ షురూ ఈ వారం కెప్టెన్ అయ్యేందుకు 'BB మారథాన్' పేరుతో పోటీ పెట్టనున్నారు. ఇందులో పెట్టే ఒక్కో గేమ్‌లో నలుగురు పోటీ పడతారు. ఇందులో గెలిచిన వాళ్లు కెప్టెన్సీ కంటెండర్ అవుతారు. చివరి స్థానంలో ఉన్నవాళ్లు ఎలిమినేట్ అవుతారు. అలా 'రిజల్ట్ ఏంటో గెస్ చేయాలంతే?' పేరుతో తొలి గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని వస్తువులు నీటిలో వేస్తారు. అవి తేలుతాయో, మునుగుతాయో చెప్పాలంతే.. ఈ పోటీలో ప్రియాంక విజేతగా నిలవగా, అమరదీప్ ఓడిపోయాడు. శోభా, తేజ మధ్య స్థానాలు సంపాదించారు. 'డబ్బాలు సెట్ చేయాలంతే' అనే రెండో గేమ్‌లో ప్రశాంత్ విన్నర్ అయ్యాడు. రతిక ఎలిమినేట్ అయిపోయింది. గౌతమ్, యవర్ కూడా ఈ గేమ్ ఆడినప్పటికీ మధ్య స్థానాల్లో నిలబడ్డారు అంతే. పుల్లలు పెడుతున్న శివాజీ రెండో గేమ్‌లో రతిక ఓడిపోయిన తర్వాత తేజ ఆమెతో జోక్‌గా.. 'ఓడిపోయినందుకు నువ్వు కూడా అన్నం తిననని బిగ్‌బాస్‌తో చెప్పు' అన్నాడు. దీంతో శోభా రెచ్చిపోయింది. తేజతో గొడవ పెట్టుకుంది. ఎందుకలా అన్నావ్ అని గట్టిగా అరుస్తూ వాదన పెట్టుకుంది. మధ్యలో తేజతో మాట్లాడిన శివాజీ.. శోభా గురించి పుల్ల పెట్టే ప్రయత్నం చేశాడు. 'అతి సర్వత్రా వర్జయాత్' అని ఏవేవో సినిమా డైలాగ్స్ కొడుతూ తేజని మరింత రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. ఇలా చేస్తే తేజ.. శోభాకి దూరమై తన దగ్గరకు వచ్చేస్తాడని శివాజీ ఆశపడుతున్నట్లు ఉన్నాడు. ఒకటి రెండు రోజులు ముందు కూడా శోభా వెనక తిరుగుతున్నాడని తేజకి శివాజీ క్లాస్ పీకాడు. ఇవన్నీ చూస్తుంటే శివాజీ.. బిగ్‌బాస్‌లో ఆడకుండా రాజకీయాలు ఎక్కువ చేస్తున్నాడనిపిస్తోంది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: గాలి తీసేసిన తమన్.. ఈ కౌంటర్ బోయపాటికేనా?) -
నామినేషన్స్‌లో శివాజీ నిజస్వరూపం బయటపెట్టిన శోభా!
బిగ్‌బాస్ 7 నామినేషన్స్‌లో హౌస్మేట్స్ మళ్లీ మాటలతో కొట్టేసుకున్నారు. పెద్దమనిషిలా కలరింగ్ ఇస్తూ వస్తున్న శివాజీ నిజస్వరూపాన్ని శోభాశెట్టి బయటపెట్టేసింది. ఇక భోలె గురించి అయితే చెప్పనక్కర్లేదు. గతవారంలానే ఇరిటేట్ చేశాడు. లాజిక్ అనేది లేకుండా ఏదేదో మాట్లాడాడు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 50 హైలైట్స్‌లో చూద్దాం. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?) రతిక గురించి డిస్కషన్ పూజామూర్తి ఎలిమినేట్, రతిక రీఎంట్రీతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. పొద్దుపొద్దునే రతిక గురించి రైతుబిడ్డ-పాటబిడ్డ బాత్రూంలో డిస్కషన్ పెట్టారు. రతిక తిరిగొచ్చింది కదా? ఎలా అనిపిస్తుందని భోలె, ప్రశాంత్‌ని అడిగాడు. దీంతో ప్రశాంత్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడీ ఈ టాపిక్ ఎందుకు ఎత్తాడురా బాబు అని అనుకున్నాడు. ఎందుకు దిగాలుగా కనిపిస్తున్నావ్? అని భోలె అడగ్గా.. నాన్న వీడియో చూశా కదా! అందుకని అన్నాడు. దీంతో భోలె చల్లబడ్డాడు. రతికపై బిగ్‌బాస్ ప్రేమ రతికపై బిగ్‌బాస్‌కి ఎంత ప్రేముందో మళ్లీ రుజువైంది. ప్రేక్షకులే మాకు ఈమె వద్దు బాబోయ్ అని ఎలిమినేట్ చేసి బయటకు పంపేసినా, పక్కా ప్లాన్ చేసి మరీ రీఎంట్రీ పేరుతో రతికని మళ్లీ హౌసులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడేమో ఈ వారం అస్సలు ఆమెని నామినేట్ చేయొద్దని ఆర్డర్ పాస్ చేశాడు. ఆమె గురించి చెప్పడానికి కంటెస్టెంట్ దగ్గరు ఎలానూ రీజన్స్ ఉండవు. కాబట్టి రతికని నామినేట్ చేయరు. అయినా సరే బిగ్‌బాస్ ప్రత్యేకించి చెప్పడం రతికపై ప్రేమ ఎక్కువైపోయినట్లు అనిపించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో ఇంటి గోడని కూల్చేసిన అధికారులు.. అదే కారణమా?) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శివాజీ - శోభాశెట్టి, ప్రియాంక అశ్విని - శోభాశెట్టి, ప్రియాంక గౌతమ్ - ప్రశాంత్, భోలె ప్రియాంక - భోలె, అశ్విని సందీప్ - అశ్విని, భోలె శోభాశెట్టి - శివాజీ, యవర్ భోలె - శోభాశెట్టి, గౌతమ్ లాజిక్స్ మర్చిపోతున్న శివాజీ ఫస్ట్ ఫస్ట్ శివాజీతో నామినేషన్స్ మొదలయ్యాయి. గతవారం నామినేషన్స్ సందర్భంగా భోలెతో గొడవపడటం తనకు నచ్చలేదని చెప్పి శోభా, ప్రియాంకని నామినేట్ చేశాడు.పెద్దోడు కదా సారీ చెప్పిన తర్వాత కూడా అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని శోభాతో అన్నాడు. శివాజీ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. పెద్దోడు అయితే బూతులు తిట్టేసి సారీ చెబితే క్షమించేయాలేమో? (ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్‌చరణ్) ఇచ్చిపడేసిన శోభా ఇక తన నామినేషన్స్ సందర్భంగా శోభాశెట్టి, శివాజీకి ఇచ్చిపడేసింది. 'భోలెతో గొడవ జరిగిన తర్వాత నేను తప్పు చేశానని చెప్పొచ్చు. లేదంటే వీకెండ్లో అయినా చెప్పొచ్చు. అలా కాకుండా నామినేషన్స్‌లో మాత్రమే చెప్పి, ప్రేక్షకులందరిముందు నన్ను బ్యాడ్ చేద్దామనుకుంటున్నారా?' అని శివాజీని అడిగింది. పైకి పెద్దమనిషి అని చెప్పుకొని.. మనుషుల్ని శివాజీ ఎలా బ్యాడ్ చేస్తున్నాడనేది శోభా ప్రశ్నతో ప్రూవ్ అయింది. అతడి నిజస్వరూపాన్ని బయటపడింది. శివాజీ ఆట చూస్తే ఒకటి మాత్రం కచ్చితంగా అర్థమవుతోంది. మాట వినేవాళ్లని మంచి చేసుకోవడం, అలా కాదంటే మెంటల్‌గా డౌన్ చేయడం. అమరదీప్‌ని తొలివారం నుంచి అలానే టార్గెట్ చేశాడు. అతడిని మెంటల్‌గా డిస్ట్రబ్ చేసి అల్లకల్లోలం చేశాడు. నువ్వు తోపు, తురుము అనేసరికి అమరదీప్ సరిగా కాన్సట్రేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు అదే టెక్నిక్ శోభా మీద ప్రయోగిద్దామని శివాజీ చూస్తున్నట్లు ఉన్నాడు. ఎందుకంటే నామినేషన్స్‌లో శోభాని ఉద్దేశిస్తూ.. నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలంటే, నువ్వు మాత్రమే పోగలవు. నిన్ను ఎవడూ పంపించేయలేడు అని అన్నాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?) -
బిగ్‌బాస్: నామినేషన్స్‌లో ఏడుగురు, ఆ కంటెస్టెంట్ మాత్రం నయా రికార్డు!
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరూ వెళ్లేకొద్దీ నామినేషన్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ సీజన్లో వరుసగా ఏడుగురు అమ్మాయిలను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. అయితే రతికను మాత్రం తిరిగి హౌస్‌లోకి పంపించారు. ఇకపోతే గతవారం భోలె షావళి బూతులు మాట్లాడుతూ అందరికీ బీపీ తెప్పించాడు. వీకెండ్ ఎపిసోడ్‌లోనూ నాగ్ క్లాస్ పీకాడు. ఇప్పుడదే వ్యవహారాన్ని నామినేషన్ అస్త్రంగా మార్చుకున్నాడు శివాజీ. భోలె తప్పులు మాట్లాడాడు. కానీ అతడు సారీ చెప్పినా క్షమించకపోవడం తప్పంటూ శోభా శెట్టిని నామినేట్ చేశాడు. అర్హత లేదు, బయటకు వెళ్లు మాటలు పడింది తాను.. క్షమించడం, క్షమించకపోవడం తన ఇష్టమని శోభా అభిప్రాయపడింది. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నన్ను నెగెటివ్‌గా చూపించేందుకు ఇదే మంచి అవకాశం అనుకున్నారంటూ శివాజీ కుట్రను బయటపెడుతూ అతడి మీద ఫైర్ అయింది. ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు, బయటకు వెళ్లు అని చెప్తున్నారు.. అంతే కదా అని నిలదీసింది. దానికి శివాజీ.. నాతో సహా ఇక్కడున్న ఎవరికీ ఇంట్లో ఉండే అర్హత లేదు అంటూ తలతిక్క సమాధానం ఇచ్చాడు. ఏడుగురు నామినేట్ ఇక రోజు కూడా భోలె షావళి- ప్రియాంకల మధ్య వాగ్వాదం జరిగేట్లు కనిపిస్తోంది. కాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ వారం శివాజీ, భోలె షావళి, అమర్దీప్, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, గౌతమ్.. మొత్తంగా ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి కూడా సందీప్ నామినేషన్స్‌లోకి రాకపోవడం గమనార్హం. వరుసగా ఎనిమిది వారాలుగా సందీప్ నామినేషన్స్ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. ఈ లెక్కన ఎక్కువ వారాలు నామినేట్ అవని కంటెస్టెంట్‌గా సందీప్ రికార్డు సృష్టిస్తున్నాడు. చదవండి: వారిని ఎలిమినేట్ చేయాల్సిందన్న పూజా మూర్తి... గీతూ కౌంటర్లకు దండం పెట్టేసిందిగా -
అమర్దీప్ మీద కేకలేసిన శోభ, కేక్ కోసం ఫైటింగ్!
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్ టాస్క్ నడుస్తోంది. ఇందులో భాగంగా ఇంటిసభ్యులు గులాబీపురం, జిలేబిపురం అనే గ్రామస్థులుగా విడిపోయారు. వీరిలో ఏ గ్రూపు గ్రహాంతరవాసులను మెప్పిస్తుందో ఆ గ్రూపులోని వారు కెప్టెన్సీకి పోటీపడతారు. ఇప్పటికే ఓ టాస్కులో జిలేబిపురం గెలిచింది. మరి తాజా(అక్టోబర్ 19) ఎపిసోడ్లో ఎవరు గెలిచారు? అనేది చూసేద్దాం.. మళ్లీ బుసలు కొట్టిన మోనిత గులాబీపురం, జిలేబిపురం గ్రామప్రజలుగా కంటెస్టెంట్లు జీవించేస్తున్నారు. ఇక తేజ అయితే పెళ్లి రోజు, తొలి రాత్రి అంటూ శోభా శెట్టితో సరసాలాడాడు. మిగతావారు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఎవరికి వారు తమ టాలెంట్ చూపించారు. ఇంతలో అండర్ వాటర్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో అమర్-సందీప్ బాగానే కష్టపడ్డారు. కానీ చివరకు జిలేబిపురాన్ని గెలిపించాడు సందీప్. దీంతో శోభాలో ఉన్న మోనిత ఒక్కసారిగా నిద్రలేచింది. గెలుస్తానన్న నమ్మకం లేకపోతే వెళ్లకూడదు.. ప్రతీది ఓడిపోతున్నాం అంటూ అమర్దీప్ మీద అరిచేసింది. బోణీ కొట్టిన గులాబీపురం.. తర్వాత స్పేస్ షిప్ ఛాలెంజ్‌లో ప్రశాంత్, గౌతమ్ పోటీపడ్డారు. ఈసారి టాస్కులో గౌతమ్.. గులాబీపురాన్ని గెలిపించాడు. దీంతో మొదటి బోణీ కొట్టడంతో గులాబీపురం గ్రామస్తుల ముఖాలు వికసించిపోయాయి. అయితే జిలేబీపురానికి చెందిన ప్రియాంక డల్‌గా కూర్చోవడంతో ఆమె దగ్గరకు వెళ్లిన అమర్.. మాకొచ్చింది ఒకటేలే.. సల్లబడు అన్నాడు. సల్లబడు ఏంటి? ఓవర్‌గా మాట్లాడకు అని ఫైర్ అయింది. నేను సరదాగా అన్నానంటూ అమర్ చెప్పినా తను పట్టించుకోలేదు. అలిగి వెళ్లిపోయింది. తర్వాత ప్రియాంక దగ్గరకు వెళ్లిన అమర్ సారీ చెప్పాడు. మొన్నటివరకు శివాజీ, ప్రశాంత్‌తో గొడవపడ్డ అమర్దీప్ ఈరోజు తన స్నేహితులిద్దరితోనూ మాటలు పడాల్సి వచ్చింది. శోభా పేరు పచ్చబొట్టు వేయించుకోమన్న బిగ్‌బాస్ ఇదిలా ఉంటే కిచెన్‌లో టాటూ గురించి కబుర్లు చెప్పుకున్నారు తేజ, శోభ, పూజా మూర్తి. ఇది విన్న బిగ్‌బాస్ పచ్చబొట్టు వేయించుకోవచ్చుగా అని తేజకు సలహా ఇచ్చాడు. సరదాగా అన్నాడేమో అని లైట్ తీసుకునేలోపే పదేపదే పచ్చబొట్టు విషయాన్ని గుర్తు చేస్తూ వచ్చాడు. శోభ పేరు టాటూ వేయించుకోవాలని, ఏ డిజైన్ కావాలో సెలక్ట్ చేసుకో అని ఓ పేపర్ కూడా పంపించాడు. అసలే పెళ్లి కావాల్సినవాడిని, ఈ పచ్చబొట్టు నా వల్ల కాదంటూ బిగ్‌బాస్‌కు మొర పెట్టుకున్నాడు తేజ. బయటకు వెళ్లాక (పెళ్లికి) అవకాశముందని చెప్తే వేయించుకుంటానని తేజ అనగా వేయించుకో అని ఆటపట్టించింది శోభ. అమర్ మీద పడ్డ శోభ రాత్రి తేజ కోసం బిగ్‌బాస్ ఓ కేక్ పంపించాడు. దానిపై శోభ అని రాసి ఉంది. ఇది ముగింపు కాదు, ముందుంది ముసళ్ల పండగ అంటూ ఓ లేఖ సైతం పంపాడు. తనకు ఎందుకు వార్నింగ్ ఇచ్చాడో అని జుట్టు పీక్కున్నాడు తేజ. ఇంతలో అమర్.. కేక్‌ను ఎంతసేపు చూస్తూ కూర్చోవాలని ఓ ముక్క లటుక్కున తినేశాడు. అప్పుడు తేజ, శోభ.. ఇద్దరూ అమర్ మీద అరిచారు. కేక్ మీద నా పేరుంది.. ఎలా తిన్నావని ఆగ్రహించింది శోభ. శోభకు ఐ లవ్ యూ చెప్పిన తేజ చాలా సేపు తల గోక్కున్న తర్వాత తేజ కేక్ కట్ చేసి అందరికీ తలా ఓ ముక్క ఇచ్చాడు. అంతా అయిపోయాక శోభను గార్డెన్‌కు పిలిచాడు. కేక్ ఎందుకు పంపించాడు? దానిపై నీ పేరు ఎందుకు రాశాడు? అంటూ ప్రశ్నల చిట్టా చదివాడు తేజ. ఏదో చెబుతావనుకుంటే సోది చెప్తున్నావంటూ శోభా కోపంగా లేచింది. దీంతో తేజ సడన్‌గా ఐ లవ్ యూ చెప్పడంతో థూ అని ఊసేసి ముందుకు వెళ్లిపోయింది శోభ. మొత్తానికి తేజ-శోభ లవ్ ట్రాక్ కోసం బిగ్‌బాస్ గట్టిగానే కష్టపడుతున్నట్లు కనిపిస్తోంది. చదవండి: ‘టైగర్ నాగేశ్వరరావు’ మూవీ ట్విటర్ రివ్యూ -
నా కుమారుడిని అలా చేస్తారనుకోలేదు.. ఏడ్చేసిన భోలె షావళి తల్లి
వైల్డ్ కార్డ్ ఎంట్రీల తర్వాత కొత్త జనాభాతో హౌస్ కళకళలాడిపోయింది. అటు నామినేషన్స్ కూడా మరింత వాడివేడిగా జరిగాయి. ఈ వారం జరిగిన నామినేషన్స్ అయితే పీక్స్‌కు వెళ్లిపోయాయి! భోలె షావళి బూతులు మాట్లాడటం.. అతడిని ప్రియాంక, శోభ ఎడాపెడా వాయించేయడం తెలిసిందే! ఈ క్రమంలో ప్రియాంక అతడిని థూ అని చీదరించుకుంది. నా కొడుకుది ఎంతో మంచి గుణం తాజాగా ఈ నామినేషన్స్ రచ్చపై భోలె షావళి తల్లి, సోదరి స్పందించారు. ముందుగా ఆమె తల్లి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకున్నారు. 'అంత మంచి మనసున్నవాడు, పది మందికి అన్నం పెట్టే వాడిని హౌస్‌లో అలా చేస్తారనుకోలేదు. నా కొడుకును ప్రియాంక థూ అని ఎందుకు అన్నదో అర్థం కావట్లేదు. నా కొడుకు నన్ను ప్రాణానికి ప్రాణంగా చూసుకుంటాడు. ఎక్కడికి వెళ్లినా నా కాళ్లు మొక్కి ఆశీర్వాదాలు తీసుకుంటాడు. ఎంతో మంచి గుణం వాడిది. అతడితో హౌస్‌లో ఎవరూ మాట్లాడట్లేదు. తను కలుపుకుపోదామని చూస్తున్నా వాళ్లు దూరం పెడుతున్నారు' అంటూ ఏడ్చేసింది. సీరియల్ బ్యాచ్ టార్గెట్ చేస్తోంది భోలె చెల్లి మాట్లాడుతూ.. 'మా అన్నయ్య అందరినీ ప్రేమిస్తాడు. కానీ తన మంచితనాన్ని ఓర్వలేకపోతున్నారు. తనకు అతిగా మాట్లాడే అలవాటు లేదు. తనకు నటించడం రాదు. సీరియల్ బ్యాచ్ మా అన్నయ్యను కావాలని టార్గెట్ చేస్తున్నారు. ప్రియాంక థూ.. అనేంత తప్పు తనేం చేశాడు. శోభా శెట్టి తన మీద పడి అరిచేస్తోంది. అంత అవసరం లేదు. ఆ ఎపిసోడ్ చూస్తుంటే మా రక్తం ఉడికిపోయింది. కానీ ఏం చేయలేకపోయాం. శోభా, ప్రియాంక.. హౌస్‌లో మొదటి నుంచి ఆటిట్యూడ్ చూపిస్తున్నారు. ఓవరాక్షన్ చేస్తున్నారు. సీరియల్స్‌లో నటించినందుకు వారికి ఫ్యాన్స్ ఉండొచ్చు. కానీ థూ అని ఊసేంత తప్పు మా అన్నయ్య ఏమీ చేయలేదు. తను ఏం మాట్లాడినా తప్పులాగే చూస్తున్నారు. వాళ్లెంత ఛీ కొట్టినా మా అన్నయ్య మాత్రం కూల్‌గానే మాట్లాడాడు' అని ఫైర్ అయింది. చదవండి: యంగ్ టైగర్‌కు అరుదైన గౌరవం.. ప్రతిష్టాత్మక జాబితాలో చోటు! -
భోలె గలీజు పురాణం.. ఆడపిల్లలని చూడకుండా ఆ కామెంట్స్!
బిగ్‌బాస్ ఎపిసోడ్ చూస్తుంటే అయితే ఎంటర్టైన్మెంట్ లేదంటే విసుగొస్తుంది. కానీ చిరాకు మాత్రం రాదు. అయితే ఇప్పుడు ఓ కంటెస్టెంట్ వల్ల అదే జరిగింది. హౌసులో గలీజుగా బూతులు మాట్లాడాడు. అది కూడా ఆడపిల్లల ముందు. పైగా దానికో పిచ్చి సమర్ధన. ఇదంతా కూడా మంగళవారం నామినేషన్స్ సందర్భంగా జరిగింది. ఇంతకీ తాజాగా ఏం జరిగిందనేది Day 44 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. బయటకొచ్చిన మోనిత ఏడుగురు తమ తమ నామినేషన్స్ పూర్తి చేయడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తొలుత వచ్చిన శోభా.. భోలెని నామినేట్ చేస్తున్నట్లు చెప్పింది. అయితే టాస్కులో 'ఆడపిల్ల కాబట్టి వదిలేశాను' అనే స్టేట్మెంట్ ఎలా పాస్ చేశారు? అని, అది తనకు నచ్చలేదని కారణం చెప్పింది. అయితే కుండ పగలగొట్టని చెప్పాలి లేదంటే డిఫెండ్ చేయాలి కానీ.. 'నీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తుందిరా' అని కామెడీ చేశాడు. నువ్వు మోనిత కావొద్దని సలహా ఇచ్చాడు. ఆ తర్వాత కూడా పదేపదే మోనిత అనే పేరు ప్రస్తావిస్తూ.. వింత వింత సామెతలన్నీ చెబుతూ పిచ్చెక్కించాడు. (ఇదీ చదవండి: విజయ్ దెబ్బకు వెనకబడిపోయిన బాలకృష్ణ!) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శోభాశెట్టి - తేజ, భోలె శివాజీ - గౌతమ్, అమరదీప్ అశ్విని - పూజామూర్తి, అర్జున్ గౌతమ్ - భోలె, శివాజీ భోలె - శోభాశెట్టి, ప్రియాంక యవర్ - గౌతమ్, అమరదీప్ భోలె బూతు పురాణం అయితే శోభాశెట్టి నామినేట్ చేస్తున్న టైంలో భోలె ఓ బూతు పదాన్ని వాడాడు. దీంతో పక్కనే ఉన్న ప్రియాంక మనోభావాలు దెబ్బతిన్నాయి. ఏం మాట్లాడుతున్నారు మీరు అసలు? అని ప్రియాంక అనగానే.. 'ఆగమ్మ కాసేపు ఆగు' అని మరింత ఇరిటేషన్ తెప్పించాడు. మధ్యలో 'మా రైతుబిడ్డ' అని చెప్పి ప్రశాంత్ ఫ్యాన్స్ సింపతీ కొట్టేద్దామని చూశాడు. మధ్యలో ఎంటరైన శోభా.. ప్రేమ చూపించి, ప్రశాంత్ ఫ్యాన్స్ ఓట్లు కొట్టేద్దామనుకుంటున్నారా? అని భోలె ఆలోచన బయటపెట్టి, కడిగిపారేసింది. దీంతో వచ్చే వారమే వెళ్లిపోతా, రాస్కో అని భోలె బరస్ట్ అయిపోయాడు. అంత సీరియస్‌గా గొడవ జరుగుతుంటే.. 'ఆడపిల్లలు మీకు మంచి భవిష్యత్తు ఉంది' అని ఏదేదో మాట్లాడాడు. ఇక కాసేపటి తర్వాత స్పందించిన బిగ్‌బాస్.. బూతులు మాట్లాడటం ఆపేయకపోతే సహించేది లేదని అన్నాడు. (ఇదీ చదవండి: 'లియో' మూవీ.. రెమ్యునరేషన్ ఎవరికెంత ఇచ్చారు?) మళ్లీ శోభా vs భోలె ఇక భోలె తన నామినేషన్స్‌లో భాగంగా శోభా, ప్రియాంకని నామినేట్ చేశాడు. కానీ సరైన కారణాలు చెప్పలేకపోయాడు. అలా అని వాళ్లతో వాదించనూ లేకపోయాడు. మధ్యలో 'నీకు ఎర్రగడ్డే దిక్కు' అని శోభాతో అన్నాడు. దీంతో ఆమె మళ్లీ రెచ్చిపోయింది. అయితే బూతులు మాట్లాడటం తనకు ఊతపదం అని ఏదో చెప్పుకొచ్చాడు కానీ అది ఏ మాత్రం కరెక్ట్‌గా అనిపించలే. ఈ వారం నామినేట్ అయింది వీళ్లే భోలె అశ్విని తేజ ప్రశాంత్ పూజా అమరదీప్ గౌతమ్ అయితే భోలెని సరిగ్గా పరిశీలిస్తే ఓ విషయం క్లియర్‌గా అర్థమైంది. రైతుబిడ్డ అనే పేరుని పోలినట్లు పాటబిడ్డ అని ట్యాగ్ పెట్టుకుని సింపతీ కొట్టేద్దామనుకున్నాడు. అలానే శివాజీలా మంచి మాటలు చెబుతూ.. హౌసులో ఉండిపోదామనుకున్నాడు. కానీ వచ్చిన రెండోవారానికే భోలె నిజస్వరూపాన్ని ప్రియాంక, శోభాశెట్టి బయటపెట్టేశారు. దీనికి తోడు బూతులు మాట్లాడటంతో భోలె తన పరువు తానే తీసుకున్నట్లు అయింది. మరి ఇలాంటి ఇరిటేటింగ్ క్యారెక్టర్ ఉంటాడా? ఎలిమినేట్ అయిపోతాడా అనేది చూడాలి. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 40 సినిమాలు రిలీజ్) -
'నీలాంటోళ్లను చాలామందిని చూసినా'.. ప్రియాంకపై భోలె షావలి ఫైర్!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 మరింత ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం హౌస్‌లో ఆరోవారం నామినేషన్స్ ప్రక్రియ కొనసాగుతోంది. ప్రస్తుతం మొదటిరోజే ఏడుగురు నామినేషన్స్ ప్రక్రియను పూర్తి చేశారు. మిగిలిన వారు ఈ రోజు జరిగే ఎపిసోడ్లో నామినేట్ చేయనున్నారు. తాజాగా ఈ రోజుకు సంబంధించిన ఎపిసోడ్ ప్రోమో రిలీజైంది. ప్రోమోలో శోభాశెట్టి మాట్లాడుతూ..'తేజ నువ్వు పనిష్మెంట్ అనేది చాలా సిల్లీగా తీసుకుంటున్నావ్. ఈరోజు కూడా వెళ్తా. నేను వీఐపీ గదిలోనే ఉంటా. అది నా ఇష్టం' అని చెప్పింది. దీనికి టేస్టీ తేజ రిప్లై ఇస్తూ.. ఇదంతా జస్ట్ ఫర్ ఫన్ బ్రో అని చెప్పాడు. ప్రతిదీ నీకు ఫన్.. కానీ మాకే సీరియస్‌గా అనిపిస్తోందని చెప్పింది శోభాశెట్టి. (ఇది చదవండి: ఇకపై అన్నీ ఆనంద క్షణాలే..: రాశీ ఖన్నా) ఆ తర్వాత ప్రియాంక జైన్, శోభాశెట్టిని ఉద్దేశించి.. 'మీకు కోపం వస్తే నాకు పాపం అనిపిస్తోందిరా? ఆడపిల్లలు.. మీకు మంచి భవిష్యత్తు ఉంది అని భోలె షావలి కాస్తా వెటకారంగా' అన్నారు. దీనికి కోపం తెచ్చుకున్న ప్రియాంక జైన్.. 'ఆడపిల్ల అంటూ నటించినవ్ కదా.. ఇంతసేపు కనిపిస్తోంది' అంటూ భోలే షావలిపై మండిపడింది. ఆ తర్వాత నీలాంటోళ్లను చాలామందిని చూసినా అని భోలె షావలి అనడంతో.. కోపంతో ప్రియాంక అక్కడి నుంచి వెళ్లిపోతుంది. ఆ తర్వాత షావలి అరే ఎంత మంచిగా ఉన్నా నేను' అంటాడు. కానీ ప్రియాంక్ మాట్లాడుతూ..'నువ్వు నటించావ్' అంటుంది. ఆ తర్వాత శోభాశెట్టి మాట్లాడుతూ.. 'పక్కన ఆడపిల్ల ఉన్నప్పుడు కంట్రోల్ యువర్ టంగ్ అంటూ భోలె షావలికి వార్నింగ్ ఇస్తుంది'. అనంతరం తూ.. అని ప్రియాంక జైన్ అనడంతో.. నేను అదే తిరిగి అంటే నీ బతుకు ఏం కావాలా? అంటాడు భోలె షావలి. ఆ తర్వాత శోభాశెట్టి అతన్ని నామినేట్ చేస్తూ కుండ పగలగొడుతుంది. ఇక టేస్టీ తేజ శోభాశెట్టితో మాట్లాడుతూ.. రూమ్‌లో ఉన్న వాళ్లందరు నామినేట్ చేయడం ఒక ఎత్తు.. నువ్వు నా కుండ పగలగొట్టడం ఒక ఎత్తు అంటూ అక్కడి నుంచి వెళ్లి పోవడంతో ప్రోమో ముగిసింది. హౌస్‌లో జరుగుతున్న పరిణామాలు చూస్తుంటే నామినేషన్స్ ప్రక్రియ మరింత హీటెక్కినట్లు కనిపిస్తోంది. ఒకరిపై ఒకరు సీరియస్‌గా విమర్శలు చేసుకుంటూ మరింత ఆసక్తికరంగా మార్చేశారు. ప్రోమో చూస్తే ఓవరాల్‌గా ఈ రోజు ఎపిసోడ్లో నామినేషన్స్ ప్రక్రియ రసవత్తరంగా సాగనున్నట్లు కనిపిస్తోంది. ఈ వారం నామినేషన్స్ లో భాగంగా సోమవారం కేవలం ఏడుగురు మాత్రమే తమ తమ నామినేషన్స్ పూర్తి చేశారు. మిగిలిన వాళ్లు మంగళవారం నామినేషన్ ప్రక్రియని పూర్తి చేయనున్నారు. (ఇది చదవండి: నయని ఎలిమినేషన్‌తో బిగ్‌బాస్ అగ్రిమెంట్ గుట్టు విప్పిన అర్జున్ కల్యాణ్) -
బిగ్‌బాస్ ఎలిమినేషన్: వరుసగా ఆరో వారమూ అమ్మాయేనా?
బిగ్‌బాస్ హౌస్‌కు గ్లామర్ టచ్ కావాలంటే అమ్మాయిలుండాల్సిందే! అందుకే షో ప్రారంభంలో 14 మంది కంటెస్టెంట్లను తీసుకువస్తే అందులో ఏడుగురు అమ్మాయిలే ఉన్నారు. కానీ ఏం లాభం? వరుసపెట్టి అమ్మాయిలనే హౌస్ నుంచి పంపించేస్తూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు ఐదుగురు అమ్మాయిలు ఎలిమినేట్ అవుతూ వచ్చారు. మొదట కిరణ్ రాథోడ్.. తనకు తెలుగు రావడం లేదని పంపించేశారు. షకీల.. కంటెంట్ కోసం అతి చేయకుండా హుందాగా వ్యవహరించింది. ఇలా ఒద్దికగా, పద్ధతిగా ఉంటే మాకెందుకు అనుకున్నారో ఏమో.. తననూ పంపించేశారు. అలా ఒక్కొక్కరూ వెళ్లిపోయారు దామిని.. సింగర్‌గా తన టాలెంట్ చూపించే ఈ బ్యూటీ కిచెన్‌లో వండి వార్చడానికే ఎక్కువ ప్రాధాన్యతనిచ్చింది. ఈ వంటలక్క మాకొద్దని తనను పంపించేశారు. రతిక రోజ్.. స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్నారంతా! పోయి పోయి పల్లవి ప్రశాంత్‌తో పెట్టుకుంది. అతడితోనే లవ్ ట్రాక్ నడిపి, వర్కవుట్ కాకపోవడంతో ప్లేటు తిప్పేసింది. అదే ఆమెను దెబ్బ కొట్టింది, ఆ దెబ్బకు బిగ్‌బాస్ హౌస్ బయటకు వచ్చి పడింది. శుభశ్రీ.. ఈ అందాల సుందాంగి గేమ్ ఆడటం మొదలుపెట్టింది. కానీ ఇంత ఆలస్యంగా గేమ్ స్టార్ట్ చేసి మా మనోభావాలు దెబ్బతీశావంటూ తనను కూడా ఎలిమినేట్ చేసేశారు. తేజ లేక హౌస్ డల్.. కాబట్టి అతడికి నో! నెక్స్ట్ ఎవరు? అన్నది అసలైన ప్రశ్న. ఈవారం నామినేషన్లో ఏడుగురు ఉన్నారు. అమర్దీప్, ప్రిన్స్ యావర్, తేజ, శోభా శెట్టి, నయని పావని, అశ్విని శ్రీ, పూజా మూర్తి.. వీరంతా నామినేషన్లో ఉన్నారు. ఇందులో అమర్దీప్, ప్రిన్స్ ఇప్పుడప్పుడే ఎలిమినేట్ అయ్యే కంటెస్టెంట్లు కానే కాదు. తేజ లేకపోతే హౌస్‌లో ఎంటర్టైన్మెంట్ అనేదే ఉండదు. కాబట్టి మరికొన్నాళ్లు అతడిని హౌస్‌లో ఉంచే ఛాన్స్ ఉంది. మిగిలిందల్లా నయని పావని, శోభ, అశ్విని, పూజా మూర్తి.. నలుగురూ ఆడపిల్లలే! వీరిలో శోభ ముందు నుంచీ ఉన్న కంటెస్టెంట్ కాబట్టి ఫాలోయింగ్ దండిగా ఉంటుంది, గండం గట్టెక్కుతుందనుకుంటున్నారేమో.. సోషల్ మీడియా నడుస్తున్న ప్రచారం ప్రకారం ఈ వారం మోనితనే ఎలిమినేట్ కానుందట! చేజేతులా ఎలిమినేషన్ కొనితెచ్చుకుంటున్న మోనిత తన తిక్కకు లెక్క లేదన్నట్లుగా ప్రవర్తిస్తోంది శోభా శెట్టి. గేమ్‌లో సవ్యంగా ఆడటానికి బదులు అడ్డదిడ్డంగా ఆడుతోంది. తనే తోపు అన్నట్లుగా మాట్లాడుతోంది. ప్రేక్షకులకు ఇదంతా చిరాకు తెప్పిస్తోంది. తనను పంపించేస్తే అప్పుడు తన గ్రూపులో ఉన్న మిగతా వాళ్లు కూడా సరైన దారిలోకి వస్తారని అభిప్రాయపడుతున్నారు. అయినా అశ్విని, పూజా, నయని ఉండగా శోభకు తక్కువ ఓట్లు రావడమేంటో అర్థం కావడం లేదని మరికొందరు తల గోక్కుంటున్నారు. ఏదేమైనా ఈ వారం కూడా అమ్మాయే ఎలిమినేట్ అయ్యేట్లు కనిపిస్తోంది. మరి బయటకు వెళ్లేది మోనితనా? లేదంటే వైల్డ్ కార్డ్ కంటెస్టెంట్లా? అన్నది తెలియాల్సి ఉంది. చదవండి: శోభా ఓవరాక్షన్.. ఆటలో మరీ ఇంతలా దిగజారాలా? -
శోభా శెట్టి చిల్లర గేమ్.. అంతా అయ్యాక ఏడుపొకటి!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ప్రస్తుతం ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లుగా మారింది. మొదట్లో తమ ప్రతాపం చూపించిన పోటుగాళ్లు నెమ్మదిగా వెనకబడ్డారు. ఆరంభంలో ఓటమిపాలవుతూ వచ్చిన ఆటగాళ్లు తర్వాత వరుసగా విజయాలు అందుకుంటూ వచ్చారు. చివరకు ఇరు టీములు చెరి మూడు పాయింట్లతో సమానంగా నిలబడ్డారు. అదెలాగో తాజా(అక్టోబర్ 12) ఎపిసోడ్ హైలైట్స్‌లో చూసేద్దాం.. ఓటమి నుంచి పాఠాలు పల్లవి ప్రశాంత్ కెప్టెన్ అయ్యాడే కానీ ఆ నాయకుడి లక్షణాలైతే లేవు. ఇతడు అవతలి వారికి పని చెప్పడానికి బదులు అవతలి వారు ఏదైనా పని చెప్తుంటే చేసేస్తున్నాడు. అన్నింటినీ ఓ కంట గమనిస్తూనే ఉన్న బిగ్‌బాస్ ప్రశాంత్ దగ్గరున్న కెప్టెన్సీ బ్యాడ్జ్ తీసుకుని ఏడిపించిన సంగతి తెలిసిందే కదా! అయితే అది కేవలం వార్నింగ్ మాత్రమేనంటూ తిరిగి కెప్టెన్సీ బ్యాడ్జ్ వెనక్కు ఇచ్చేశాడు. ఇక అమర్.. ఓటమి నుంచి గుణపాఠాలు నేర్చుకుంటున్నాడు. ఏదేమైనా ఆడాలి.. ఇచ్చిపడేయాలి.. అని తనలో తానే మాట్లాడుకున్నాడు. మేకప్ కోసం ప్రాణం పోతోంది మరోవైపు శోభా శెట్టి మేకప్ లేక ముఖం మాడ్చుకుని కూర్చుంది. ఇలా కూర్చుంటే అయ్యే పని కాదని పోటుగాళ్ల దగ్గర కాసింత మేకప్ అడిగి మరీ ముఖాన కొట్టుకుంది. అబ్బే, బిగ్‌బాస్ ఒప్పుకోలేదు, పనిష్మెంట్ ఇవ్వాల్సిందేనన్నాడు. దీంతో అర్జున్.. తేజ మూడు రోజులుగా వాడుతున్న టీషర్ట్‌ను వేసుకోవాలని చెప్పాడు. అది కంపు కొడుతున్నా చేసేదేం లేక ముక్కు మూసుకుని దాన్ని ధరించింది శోభా. ఎవరు స్మార్ట్? తర్వాత ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లలో ఎవరు స్మార్ట్ అనేది తేల్చేందుకు హూ ఈజ్ స్మార్ట్ అనే టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఇందులో సినిమాలు, పాటలు, డైలాగులకు సంబంధించి రకరకాల ప్రశ్నలడిగాడు. ఇందులో ఆటగాళ్లే గెలిచారు. అయితే శోభా కాస్త ఓవర్ చేసింది. బిగ్‌బాస్ అడిగే ప్రశ్నకు ఏది కరెక్ట్ సమాధానం అనుకుంటారో దాన్ని మాత్రమే తీసుకుని బోర్డుపై పెట్టాలి. కానీ శోభ ఎందుకైనా మంచిది అన్నట్లుగా రెండు బోర్డులను పట్టుకుని నేనివ్వను అంటూ చిల్లరగా ప్రవర్తించింది. ఏడ్చేసిన శోభా శెట్టి అయితే రెండు బోర్డులు తీసుకున్నా సరైన సమాధానం చెప్పలేదులే అంటూ శోభా పరువు తీశాడు బిగ్‌బాస్. అలా రెండు బోర్డులు పట్టుకోకూడదని వార్నింగ్ ఇచ్చాడు. పూజా మూర్తితోనూ గొడవకు దిగింది శోభ. తను చెప్తే నీతులు, ఎదుటివాళ్లు చెప్తే బూతులా.. అని పూజా ఆగ్రహించింది. అయితే తన గురించి అలా సామెత చెప్పడం నచ్చలేదంటూ ఏడ్చేసింది మోనిత పాప.అనంతరం ఎవరు ఫోకస్ అనే టాస్క్ జరగ్గా ఇందులోనూ ఆటగాళ్లే గెలిచారు. దీంతో ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు గేమ్ చెరి మూడు పాయింట్లతో టై అయింది. మరి నెక్స్ట్ బిగ్‌బాస్ ఏ గేమ్ ఇస్తాడు? ఎవరు గెలుస్తారు? అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: ముంబైకి షిఫ్ట్ అయిన మంచు లక్ష్మి.. ఆడిషన్స్‌కు కూడా రెడీ అంటూ.. పల్లవి ప్రశాంత్ గురించి ఆశ్చర్యపోయే విషయాలు చెప్పిన సోహైల్ -
రెండో రోజుకే చుక్కలు చూపించారు.. వెళ్లిపోతానని హాట్ బ్యూటీ గోల
బిగ్‌బాస్ హౌసులోకి వైల్డ్ కార్ట్ ఎంట్రీగా ఐదుగురు కొత్తోళ్లు వచ్చారు. వాళ్లలో ఓ హాటెస్ట్ బ్యూటీ ఉంది. ఆదివారం ఆమె ఒంపుసొంపులు చూసి అబ్బా సూపర్ అనుకున్న ప్రేక్షకులు.. సోమవారం ఆమె కన్నీళ్లు పెట్టుకోవడం చూసి అయ్యో రామా అనుకున్నారు. ఓ లేడీ కంటెస్టెంట్ వల్ల ఇలా జరిగింది. అలానే నామినేషన్స్ కూడా పూర్తయ్యాయి. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏమైందనేది Day 36 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 35 సినిమాలు రిలీజ్) పుల్ల పెట్టిన బిగ్‌బాస్ కొత్తగా వచ్చిన ఐదుగురు సభ్యులు ఇంట్లోకి వచ్చేయడంతో ఆదివారం ఎపిసోడ్ పూర్తయింది. వాళ్లని చూపించడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఉదయం లేవగానే బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. కొత్తగా వచ్చినవాళ్లని పోటుగాళ్లు.. ఇప్పటికే హౌసులో ఉన్నవాళ్లు ఆటగాళ్లు అని చెప్పాడు. అలానే హెడ్స్ ఆఫ్ లగేజ్ గేమ్‌లో భాగంగా హౌసులో ఉన్నవాళ్లందరికీ కలిపి కేవలం ఏడు వస్తువులు మాత్రమే ఇవ్వాల్సి ఉంటుందని తిరకాసు పెట్టేశాడు. నామినేషన్స్ రచ్చ తొలుత పోటుగాళ్లు మాత్రమే నామినేషన్ చేస్తారని.. గత ఐదువారాలుగా ఉన్న ఇంటి సభ్యుల్ని మాత్రమే నామినేట్ చేయాలని బిగ్‌బాస్ చెప్పాడు. వీళ్లలో ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కింద లిస్ట్ ఉంది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? నయని పావని - తేజ, అమరదీప్ భోలె షావళి - అమరదీప్, సందీప్ అశ్విని - అమరదీప్, శోభాశెట్టి పూజామూర్తి - తేజ, యవర్ అర్జున్ - సందీప్, అమరదీప్ (ఇదీ చదవండి: ఆ స్టార్ డైరెక్టర్‌కి ఇంత అందమైన చెల్లెలు ఉందా? ఎవరో గుర్తుపట్టారా?) ఇకపోతే నామినేషన్స్‌లో భాగంగా అమరదీప్ స్వార్థంతో ఆడుతున్నాడని అశ్విని చెప్పింది. అలానే శోభాశెట్టి గ్రూపిజంతో ఆడుతోందని చెప్పింది. దీంతో శోభా ఫైర్ అయింది. అసలు గ్రూపిజం అంటే ఏంటి? నేను ఎవరితో గ్రూపులో ఉన్నానంటూ రెచ్చిపోయింది. ప్రశ్నల మీద ప్రశ్నలు అడుగుతూ కన్ఫ్యూజ్ చేసి పడేసింది. పోటుగాళ్ల నామినేషన్ పూర్తయిన తర్వాత.. బట్టల విషయంలో అశ్విని- శోభాశెట్టి మధ్య గొడవ జరిగింది. దీంతో శోభా గురించి చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌస్‌కి తానే మహారాణి అనుకుంటుందా అని చెబుతూ కన్నీళ్లు పెట్టుకుంది. హౌసులో ఆమె పాలిటిక్స్ నడిపిస్తోందని చెప్పింది. వచ్చినప్పటి నుంచి చూస్తున్నా, వాళ్లందరూ మాట్లాడుకుని తనని సెపరేట్ చేసేశారని బోరున ఏడ్చేసింది. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ ఇక పోటుగాళ్లు నామినేషన్స్ పూర్తిచేసిన తర్వాత ఆటగాళ్లకు ఛాన్స్ ఇస్తున్నట్లు బిగ్‌బాస్ చెప్పాడు. ఇందులో భాగంగా పోటుగాళ్లలో ఒకరిని, ఆటగాళ్లలో ఒకరిని నామినేట్ చేయాల్సి ఉంటుందని క్లారిటీ ఇచ్చాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారనేది కింద లిస్ట్ ఉంది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమరదీప్ - అశ్విని, యవర్ శోభాశెట్టి - అమరదీప్, అశ్విని శివాజీ - అమరదీప్, పూజామూర్తి తేజ - సందీప్, నయని పావని ప్రియాంక - తేజ, అశ్విని సందీప్ - తేజ, అర్జున్ యవర్ - శోభాశెట్టి, పూజామూర్తి ప్రశాంత్ - నయని పావని, అమరదీప్ ఈ నామినేషన్లో భాగంగా అమరదీప్, అశ్వినిని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య వాదన జరుగుతున్నప్పుడు.. మీరు కన్నింగ్, సెల్ఫిష్ అని పదాలు నా గురించి వాడటం సరికాదని అశ్విని కామెంట్స్‌పై అభ్యంతరం వ్యక్తం చేశాడు. మరోవైపు శోభాశెట్టి.. అశ్విని నామినేట్ చేసేసరికి ఆమె తట్టుకోలేకపోయింది. అందరూ తననే నామినేట్ చేస్తున్నారని గట్టిగా ఏడ్చేసింది. తనని పక్కనున్నవాళ్లు ఓదారుస్తున్నా సరే ఇంటికెళ్లిపోతా, ఎలిమినేట్ చేసేయండి అని చిన్నపిల్లలా ఏడ్చేసింది. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే ఆదివారం ఎపిసోడ్ లో హాట్‌హాట్‌గా కనిపించి వావ్ అనిపించిన అశ్విని.. ఎలిమినేషన్స్ అనేసరికి ఏడవటం చాలామంది కుర్రాళ్లు అవాక్కయ్యేలా చేసింది. (ఇదీ చదవండి: ఆర్.నారాయణమూర్తికి సారీ చెప్పిన యంగ్ హీరో!) -
నామినేషన్స్‌లో ట్విస్ట్.. కొత్తవాళ్లకే ఛాన్స్! ఒక్కొక్కరికీ ఉంటదీ..
బిగ్‌బాస్.. హౌస్‌లో ఉన్న కంటెస్టెంట్లకు దిమ్మతిరిగే షాకిచ్చాడు. రేసులో ముందు వరుసలో ఉన్నాం అని ధీమాగా ఉన్న హౌస్‌మేట్స్‌కు నిన్న ఒక్కసారిగా ఝలక్ ఇచ్చాడు. మరో ఐదుగురు కొత్త కంటెస్టెంట్లను హౌస్‌లోకి దించాడు. వీరితోనూ ఆడి గెలవాలని ఛాలెంజ్ విసిరాడు. ఇక కొత్తగా వచ్చిన ఐదుగురు కంటెస్టెంట్లను పోటుగాళ్లగా.. ఇప్పటికే హౌస్‌లో ఉన్న పాత కంటెస్టెంట్లను ఆటగాళ్లుగా విభజించాడు బిగ్‌బాస్. తాజాగా రిలీజైన ప్రోమో పోటుగాళ్లు మాత్రమే నామినేట్ చేస్తారని ట్విస్ట్ ఇచ్చాడు. ఇంకేముంది, హౌస్‌లో ఉన్న ఆటగాళ్లంతా చేసేదేం లేక బిక్కమొహం వేసుకుని కూర్చున్నారు. నామినేట్ చేయాలనుకునేవారి ముఖంపై ఎక్స్ మార్క్ వేసి అందుకు తగిన కారణాలు చెప్పాలన్నాడు బిగ్‌బాస్. మొదటగా నయని పావని.. తేజ గేమ్ ఆడినట్లు కనిపించలేదని తనను నామినేట్ చేశాడు. గౌతమ్‌ను బెల్ట్‌తో కొట్టిన విషయంపై తేజను పూజా మూర్తి నామినేట్ చేసింది. స్వార్థంగా ఆలోచిస్తున్నావంటూ అమర్దీప్ ముఖంపై ఎక్స్ మార్క్ వేసింది అశ్విని శ్రీ. తర్వాత శోభా శెట్టిని నామినేట్ చేసింది. అయితే పదేపదే గ్రూపిజం అనడంతో తట్టుకోలేకపోయింది శోభా. ఏంటి గ్రూపిజం? గ్రూపిజం వల్ల మీరు నష్టపోయారా? వేరేవాళ్లు నష్టపోయారా? అని ఫైర్ అయింది. ఇకపోతే మొదట పోటుగాళ్లకు ఛాన్స్ ఇచ్చిన బిగ్‌బాస్ తర్వాత ఆటగాళ్లకు ఇతరుల్ని నామినేట్ చేసే అవకాశం ఇచ్చినట్లు తెలుస్తోంది. కాగా ఈ వారం అశ్విని, నయని పావని, పూజా మూర్తి, తేజ, శోభా శెట్టి, అమర్దీప్, సందీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్ బ్యూటీ శుభశ్రీ.. ఐదు వారాల్లో ఎంత వెనకేసిందంటే? -
త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!
బిగ్‌బాస్ అంటేనే ఫిట్టింగ్ బాస్.. అన్నీ తేరగా ఇచ్చేయడు. కంటెస్టెంట్లను ముప్పలు తిప్పలు పెట్టి, ఏడిపించి చివరకు వారిక్కావాల్సింది ఇస్తాడు. బిగ్‌బాస్ ఇచ్చే అరకొరవాటి కోసం హౌస్‌లో నానా గొడవలే జరుగుతాయి. ఈసారి బిగ్‌బాస్.. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని చెప్తూనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తాజా(సెప్టెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. యావర్‌కు తెలుగు క్లాసులు బిగ్‌బాస్ ఇంట్లో కెప్లెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందుకోసం ఇంట్లోవారంతా జంటలు జంటలుగా విడిపోయారు. వీరిలో ఆటలో వెనుకబడి అందరికన్నా తక్కువ స్టార్లు సొంతం చేసుకున్న శోభా శెట్టి- ప్రియాంకలను బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు. మిగిలిన నాలుగు జంటలు అమర్ దీప్- సందీప్, శివాజీ- ప్రశాంత్, తేజ- యావర్, గౌతమ్- శుభశ్రీలు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లారు. ఇకపోతే తెలుగు కష్టంగా మాట్లాడుతున్న యావర్‌కు నాలుగు తెలుగు ముక్కలు నేర్పించాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో తేజ, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ.. అతడికి తెలుగు క్లాసులు తీసుకున్నారు. రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఆర్డర్లు, వార్నింగ్‌లు.. అల్లరి విద్యార్థిగా యావర్ అదరగొట్టాడు. తెలుగు పండింతులైన తేజను ఓ ఆటాడుకున్నాడు. మరోవైపు శివాజీ ఎప్పటిలాగే అతి చేశాడు. కాఫీ కోసం బిగ్‌బాస్ మీదకే నిప్పులు చెరుగుతున్నాడు. కాఫీ ఇవ్వని బతుకు.. నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్ నుంచి వెళ్లిపోతా.. అని మరోసారి బెదిరింపులకు దిగాడు. కాఫీ లేకపోతే ఏం ఆలోచించలేకపోతున్నా.. కామెడీ చేయమంటే ఎలా చేస్తాం.. వీడెవడ్రా బిగ్‌బాస్? కాఫీ ఇవ్వనంటాడు.. అని చిందులు తొక్కాడు. ఈయన ఓవరాక్షన్ చూసిన బిగ్‌బాస్ అతడికి కాఫీనే పంపించలేదు. ఎమోషనల్ టాస్క్.. ఇకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా చిట్టి ఆయిరే అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లందరికీ ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని, కానీ ప్రతి జంటలో ఒకరు లెటర్ చదివితే మరొకరు త్యాగం చేయాలి.. త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఎవరైతే లెటర్ చదువుతారో వారే కెప్టెన్సీ పోటీదారుడు అవుతారన్నమాట! త్యాగం చేసిన శుభ శ్రీ ఈ టాస్క్ గురించి ప్రకటించగానే శివాజీ.. నేను ఈ టాస్క్ ఆడటం లేదు అంటూ శివాజీ మైక్ కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌తో.. నువ్వే ఆడు, లెటర్ తీసుకో అని చెప్పాడు. మరోవైపు గౌతమ్- శుభశ్రీ.. ఎవరు లెటర్ అందుకోవాలనే దాని గురించి కాసేపు వాదులాడి చివరకు త్యాగానికి పూనుకుంది శుభ. అటు గౌతమ్ తన తండ్రి రాసిన లేఖ చదివి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తన లేఖను చించేసిన యావర్ యావర్- తేజా.. ఇద్దరూ త్యాగానికి సిద్ధపడ్డారు. ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్లలేనంటూ యావర్ తన లేఖను చింపేశాడు. దీంతో తేజా తన తండ్రి రాసిన లెటర్ చదివి చాలా ఎమోషనలయ్యాడు. ఏడవనంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి తర్వాతి ఎపిసోడ్లో ఎవరు త్యాగం చేస్తారు? ఇంకా ఎవరు కెప్టెన్సీ పోటీదారులవుతారో చూడాలి! -
ఆ కంటెస్టెంట్స్‌కు బిగ్ బాస్ బిగ్ షాక్.. అదేంటో తెలుసా?
ఇప్పటికే బిగ్ బాస్ తెలుగు సీజన్-7 ఆసక్తికరంగా కొనసాగుతోంది. ఇప్పటికే నాలుగు వారాలు పూర్తి కాగా.. నలుగురు కంటెస్టెంట్స్ హౌస్ నుంచి బయటకొచ్చేశారు. ఇక ఐదోవారం మొదలవ్వగానే బిగ్ బాస్ కంటెస్టెంట్స్‌కు బిగ్ షాక్ ఇచ్చారు. ఇప్పటి వరకు పవర్ అస్త్రను సొంతం చేసుకున్న కంటెస్టెంట్స్ నామినేషన్స్ నుంచి సేఫ్ అయ్యారు. అయితే ఐదోవారం మొదటి రోజే పవరాస్త్రాలను బిగ్ బాస్ వెనక్కి తీసుకున్నారు. దీంతో హౌస్‌లో ఈ వారంలో నామినేషన్స్ మరింత ఆసక్తికరంగా మారనున్నాయి. ఇప్పటికే ఈ రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ప్రోమోలో పవరాస్త్రాలను వెనక్కి తీసుకున్న తర్వాత కంటెస్టెంట్స్ రియాక్షన్ ఎలా ఉందో ఓ లుక్కేద్దాం. (ఇది చదవండి: 'బిగ్‌బాస్'కే నీతులు చెబుతున్న శివాజీ.. హౌస్‌లో ఇకపై కష్టమే!) ప్రోమో ప్రారంభంలోనే శుభశ్రీ, గౌతమ్ మధ్య రొమాంటిక్ సీన్స్‌తో మొదలైంది. నేను మాట్లాడికే ఇష్టం లేదా అంటూ గౌతమ్‌ను ప్రశ్నిస్తుంది శుభశ్రీ. దీనికి గౌతమ్ లాయల్టీ ఉంది కాబట్టి భరిస్తున్నా అంటాడు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. నా మనోభావాలు దెబ్బతిన్నాయి. కాఫీ కూడా ఇవ్వలేని బతుకా నాది అనిపిస్తుంది. అంటే సెల్ఫ్ రెస్పెక్ట్‌గా మారిపోయింది. ఆ తర్వాత బిగ్ బాస్ పవరాస్త్రాలను తిరిగివ్వాలని ఆదేశిస్తాడు. దీంతో ఆట సందీప్, పల్లవి ప్రశాంత్, శోభాశెట్టి తమ పవరాస్త్రాలను బిగ్ బాస్ చెప్పిన విధంగానే ఓ పెట్టెలో భద్రపరుస్తారు. దీంతో ఆ ముగ్గురి పవరాస్త్రాలు పోవడంతో శివాజీ అవహేళనగా మాట్లాడతాడు. శివాజీ హేళన చేయడం శోభాశెట్టికి ఆగ్రహం తెప్పిస్తుంది. కొందరు ఉంటారు.. మనం బాగుపడకపోయినా ఫరవాలేదు.. పక్కవాడు మాత్రం అస్సలు బాగుపడకూడదు అనేవాళ్లు అంటూ శివాజీని ఉద్దేశించి మాట్లాడింది. అయితే ఇప్పటికే శివాజీ తన పవర్ అస్త్రను కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ప్రోమో చూస్తే ఇక ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ మొదలవగా.. దీంతో మిగిలిన కంటెస్టెంట్స్‌ను కూడా నామినేట్ చేసే అవకాశం వచ్చింది. మరీ ఈ వారంలో ఎవరూ సేఫ్ అవుతారో.. ఎవరెవరు నామినేషన్స్‌లో నిలుస్తారో వేచి చూడాల్సిందే. -
మళ్లీ రతిక ఎక్స్ గురించి రచ్చ.. నామినేషన్స్‌లో ఎవరెవరున్నారంటే?
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ 14 మందితో మొదలైంది. కిరణ్ రాథోడ్, షకీలా, దామిని ఎలిమినేషన్‌తో ప్రస్తుతం 11 మందే మిగిలారు. అదిగో వైల్డ్ కార్డ్ ఎంట్రీ.. అంటూ కొంతకాలంగా ఊహాగానాలు వినిపిస్తున్నాయి కానీ ఇంతవరకు దాని జాడే లేదు. ఈసారి సీజన్ ఉల్టాపల్టా అన్నారు కాబట్టి మరో రెండు వారాల తర్వాత వైల్డ్ కార్డ్ ఎంట్రీలు ఉండే ఆస్కారం ఉంది. ఇకపోతే ఈరోజు మండే అంటే బిగ్‌బాస్ ఇంట్లో కంటెస్టెంట్ల మధ్య మంటపెట్టే రోజు. నీ కాళ్లు పట్టుకోవాలా? తాజాగా నామినేషన్స్‌పై బిగ్‌బాస్ ప్రోమో వచ్చేసింది.. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు వస్తాయని అన్నావంటూ రతిక శివాజీతో వాదనకు దిగింది. నేను లేకపోతే నాగార్జున వీడియోలు వేసి చూపిస్తే నీ పరిస్థితేంటి? అని ప్రశ్నించాడు తిరిగి ప్రశ్నించాడు శివాజీ. అయినా మెట్టు దిగని రతిక ఇంకా సాగదీయడంతో ఇప్పుడు నీ కాళ్లు పట్టుకోవాలా? అని అడిగాడు. అలా వీళ్లిద్దరి మధ్య ఏదో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. జడ్జిలు ఏకీభవిస్తేనే నామినేషన్ మరోవైపు బిగ్‌బాస్ కొత్త తరహా నామినేషన్ ప్రవేశపెట్టాడు. పవరాస్త్ర గెలుచుకుని హౌస్‌మేట్స్‌గా ప్రమోషన్ పొందిన శోభా, శివాజీ, సందీప్‌లను జ్యూరీ సభ్యులిగా నియమించాడు. ఇతర కంటెస్టెంట్లు నామినేట్ చేయాలనుకున్న వ్యక్తిని బోనులో నిలబెట్టి తగిన కారణాలు చెప్పాల్సి ఉంటుంది. వారి కారణాలు ఆ జడ్జిలకు సమ్మతంగా అనిపిస్తే అవతలివారు నామినేట్ అవుతారు. తేజ, ప్రియాంకను నామినేట్ చేసిన ప్రిన్స్ ముందుగా ప్రిన్స్ యావర్.. ఫెమినిజాన్ని అడ్డుపెట్టుకుని ఇద్దరమ్మాయిలు నన్ను ఆటలో నుంచి తప్పించారంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. కానీ ఇందుకు జడ్జి శోభా ఒప్పుకోలేదు. ఇద్దరమ్మాయిలున్నారు కాబట్టి త్యాగం చేస్తానని నువ్వు తేజతో అన్నావా? లేదా? అని నిలదీసింది. దీనికి ప్రిన్స్.. అది వేరే విషయమని.. అందరి ముందు చెప్పినదాని గురించి తాను మాట్లాడుతున్నానని వాదించాడు. తర్వాత తేజను సైతం నామినేట్ చేశాడు. బయట సెలబ్రిటీ గురించి ఎందుకు? అటు శుభశ్రీ సైతం కరెక్ట్ పాయింట్లు మాట్లాడింది. ఈ హౌస్‌లో సెలబ్రిటీలు, రాజకీయ నాయకుల గురించి మాట్లాడకూడదన్న రూల్ ఉందని, దాన్ని రతిక అతిక్రమించిందని పేర్కొంది. ఇక్కడ లేని వ్యక్తి, ఓ సెలబ్రిటీ గురించి పదేపదే మాట్లాడటం తప్పని నామినేట్ చేసింది. మొత్తానికి ఈ వారం గౌతమ్, ప్రిన్స్, శుభశ్రీ, తేజ, రతిక, ప్రియాంక నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. చదవండి: బిగ్‌బాస్: దామిని అవుట్.. వెళ్తూ వెళ్తూ ఆ సర్ప్రైజ్ -
సీరియల్ బ్యాచ్‌ని వాయించేసిన నాగార్జున.. తప్పుల్ని గుర్తుచేస్తూ!
'బిగ్‌బాస్' షో అంటే నామినేషన్స్, కంటెస్టెంట్స్ మధ్యగొడవలు, వీకెండ్ లో నాగార్జున ప్రతి ఒక్కరికీ వేసే కౌంటర్స్ ఇలా ఉండాలి. కానీ ఈసారి అలాంటివి ఏం లేకుండా మూడో వారం చివరకొచ్చేసింది. ఇలాంటి టైంలో నాగ్ రూట్ మార్చారు. హౌసులో సీరియల్ బ్యాచ్‌గా పేరు తెచ్చుకున్న అమరదీప్, శోభాశెట్టిని నాగ్ ఓ రేంజులో ఆటాడేసుకున్నాడు. ఇంతకీ ప్రోమోలో ఏముంది? ముందు పెట్టిన గేమ్‌లో అమరదీప్తో మరో ఇద్దరు కూడా ఫెయిలయ్యారు. ఈ కారణంతో అతడు గేమ్ ఆడటానికి అనర్హుడని ప్రియాంక చెప్పింది. ఈ విషయాన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. దీన్ని ఒప్పుకొంటున్నావా? అని అమరదీప్ నే డైరెక్ట్‌గా అడిగేశాడు. దీంతో అతడు తల అడ్డంగా ఊపుతూ నో అన్నాడు. అలాంటప్పుడు నీ పాయింట్ ఎందుకు బయటపెట్టుకోలేదని అమర్‌ని నాగ్ అడిగాడు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి ఆ బ్లాక్‌బస్టర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) 'అసలు నువ్వు నీకోసం ఆడుతున్నావా? ప్రియాంక కోసం ఆడుతున్నావా?' అని ఓ రేంజులో అమరదీప్‌కి నాగార్జున ఇచ్చిపడేశాడు. తన కోసమే తాను ఆడుతున్నా అని అమర్ చెప్పగా.. మరే అదే పాయింట్ ప్రశాంత్ చెబితే ఎందుకు గోల చేశావ్ అని నాగ్ ఆటాడేసుకున్నాడు.వీకెస్ట్ (బలహీనమైన) కంటెస్టెంట్‌ని ఎలిమినేట్ చేయమన్నారు, మరి నువ్వేమన్నావ్.. యవర్ స్ట్రాంగ్ కంటెస్టెంట్ అని చెప్పి, సైడ్ చేసేశావ్. అంటే దీనిబట్టి నువ్వు వీక్ కంటెస్టెంట్ అని ఒప్పుకొంటున్నట్లే కదా అని శోభాశెట్టితో నాగ్ అన్నాడు. దీంతో ఆమెకి ఏం మాట్లాడాలో అర్థం కాలేదు. అలానే సంచాలక్‌గా సందీప్ ఫెయిలయ్యాడని నాగ్ ఇచ్చిపడేశాడు. ఆట మధ్యలో అసలు ఇన్వాల్స్ కాకూడదు, మరి నువ్వు ఎందుకు పాయింట్స్ ఇస్తున్నావ్ అని సందీప్‌ని ఓ రేంజులో ఆడేసుకున్నాడు. హౌజులో ఉన్నవాళ్ల అభిప్రాయం తీసుకుని.. అతడి బ్యాటరీ లెవల్ పచ్చ నుంచి పసుపునకు తగ్గించాడు. ప్రోమో చూస్తుంటే ఈసారి మంచి హీట్ ఉండబోతుందనిపిస్తుంది. అదే టైంలో ప్రోమో చూసి మోసపోవద్దని కూడా అనిపిస్తుంది. చూడాలి మరి ఏం జరుగుతుందో? (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) -
అమ్మాయిల స్కెచ్.. యవర్ అడ్డంగా బలైపోయాడు!
'బిగ్‌బాస్'లో ఎప్పుడేం జరుగుతుందో అస్సలు ఊహించలేకపోతున్నాం. ఇప్పుడు కూడా అలానే జరిగింది. అంతా బాగానే ఉందనుకునే టైంలో ప్రిన్స్ యవర్‌కి ఇద్దరమ్మాయిలు షాకిచ్చారు. వాళ్లు వేసిన స్కెచ్ దెబ్బకు మనోడు అడ్డంగా బలైపోయాడు. ఏడుపు తప్ప ఇంకేం మిగల్లేదు. ఇంతకీ హౌసులో 19వ రోజు ఎపిసోడ్లో ఏం జరిగిందనేది ఇప్పుడు హైలైట్స్‌లో చూద్దాం. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) ఫిట్టింగ్ పెట్టేశాడు! తొలి రెండు వారాల్లో పవరస్త్రని సందీప్, శివాజీ గెలుచుకున్నారు. మూడో వారం పవరస్త్ర కోసం జరిగిన పోటీలో ఫైనల్‌గా ముగ్గురు మిగిలారు. కదలకుండా నిల్చుకుని ప్రిన్స్ యవర్, అత్యంత కారంగా ఉండే చికెన్ ముక్కలు తిని శోభా, జుత్తుని కత్తిరించుకుని ప్రియాంక.. ఫైనల్-3లో నిలబడ్డారు. ఇక శుక్రవారం ఎపిసోడ్ మొదలవడమే బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టేశాడు. పోటీలో ఉన్న ముగ్గురిలో ఏ ఒక్కరు అనర్హులో.. వాళ్లే డిసైడ్ చేసుకోవాలని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. యవర్ బలైపోయాడు అయితే సైడ్ అయ్యే వ్యక్తి ఎవరా అని ముగ్గురు చాలాసేపు డిస్కషన్ చేసుకున్నారు. ఈ క్రమంలోనే శోభా, యవర్ పేరుని.. యవర్, శోభా పేరుని చెప్పారు. అలా చెప్పిన టైంలో ఒకరిపై ఒకరు అరుస్తూ గొడవపడ్డారు. ఇక డిసైడింగ్ ఓటు వేయాల్సిన ప్రియాంక.. శోభా పేరు చెప్పింది. అలానే టేబుల్ పై ఉన్న యవర్ బొమ్మని ఇద్దరూ కలిసి సుత్తితో ఇరగ్గొట్టారు. తనని పక్కకు జరపడాన్ని తట్టుకోలేకపోయిన యవర్.. అదే సుత్తితో తన బొమ్మ ఉన్న బెంచ్‌ని బలంగా కొట్టాడు. దెబ్బకు అది విరిగిపోయింది. (ఇదీ చదవండి: ఎట్టకేలకు ఓటీటీలోకి రాబోతున్న 'ఏజెంట్') కోపానికి కారణాలు చెప్పాడు గతవారం రణధీర టీమ్‌లో ఉండి కష్టపడినప్పుడు కావొచ్చు.. ఇప్పుడు కావొచ్చు యవర్‌కి అవకాశం రాలేదు. దీంతో తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయాడు. తొలుత హౌస్ అంతా అరుస్తూ తిరిగాడు. కాసేపటికి ఏడుపు మొదలుపెట్టాడు. శివాజీ దగ్గర కూర్చుని తన బాధలు చెప్పాడు. జాబ్ లేదు, ఒకానొక టైంలో రూ.100 కూడా లేని రోజులు ఉన్నాయని.. అందుకే తనకు కోపం, ఆకలి అని కన్నీళ్లు పెట్టుకుంటూ చెప్పాడు. తనకు సరైన జడ్జిమెంట్ దక్కట్లేదని బాధపడిపోయాడు. ఆమె గెలిచిందా? చివరగా మిగిలిన ప్రియాంక-శోభాశెట్టి మధ్య బుల్ ఫైట్ పోటీ పెట్టాడు. ఇందులో భాగంగా ఎలక్ట్రికల్ బుల్ ఉంటుంది. దానిపై మూడు రౌండ్లు కలిపి ఎవరైతే ఎక్కువసేపు ఉంటారో వాళ్లు విజయం సాధించినట్లు అని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ ఆటలో భాగంగా చాలా తెలివిగా వ్యవహరించిన ప్రియాంక.. బుల్‌పై తాడుని పట్టుకుని పడుకున్న పొజిషన్లో ఉండిపోయింది. మూడుసార్లు అలానే చేసింది. శోభాశెట్టి మాత్రం ప్రతిసారి కూర్చున్న పొజిషన్లో బుల్‌పై తక్కువసేపే ఉన్నట్లు అనిపించింది. ఇద్దరు ప్రియాంకనే విజేత అనిపిస్తుంది. కానీ అధికారిక ప్రకటన మాత్రం వీకెండ్ ఎపిసోడ్లో నాగార్జున చేస్తారని బిగ్‌బాస్ చెప్పడంతో శుక్రవారం ఎపిసోడ్ ఎండ్ అయింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో 3వ వారం ఎలిమినేట్ అయ్యేది ఆమెనా?) -
బిగ్‌బాస్ టాస్క్.. నొప్పి తట్టుకోలేక లేడీ కంటెస్టెంట్ కేకలు!
బిగ్‌బాస్ 7.. మూడో వారంలోకి వచ్చేసింది. తొలిరెండు వారాలు కాస్త చప్పగా సాగిన ఈ రియాలిటీ షో క్రమక్రమంగా గొడవలతో హీటెక్కుతున్నట్లు అనిపిస్తుంది. హౌసులో ఉండేందుకు, పవరస్త్ర సాధించేందుకు కంటెస్టెంట్స్ దేనికైనా తెగిస్తున్నారు. ఈ క్రమంలోనే ఓ లేడీ కంటెస్టెంట్స్ ఇప్పుడు గాయపడింది. కేకలు వేస్తూ రచ్చ రచ్చ చేస్తింది. ఇంతకీ ఏమైంది? (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి' సినిమా రివ్యూ) ఏం జరిగింది? మూడో పవరస్త్ర కోసం జరుగుతున్న పోటీలో కంటెండర్స్‌గా యవర్, శోభాశెట్టి, ప్రియాంక ఉన్నారు. అయితే ప్రియాంక స్థానంలో అమరదీప్ ఉండాల్సింది. కానీ జత్తు కత్తిరించుకోని కారణంగా అతడి బదులు ప్రియాంక పోటీలో నిలిచింది. అయితే మరో ఫిట్టింగ్ పెట్టిన బిగ్‌బాస్.. ప్రిన్స్ యవర్ సైడ్ అయ్యేలా చేశాడు. దీంతో పవరస్త్ర ఫైనల్ పోరు కోసం ప్రియాంక, శోభాశెట్టి నిలిచాడు. బుల్ ఫైట్- ప్రమాదం ఇక చివరి టాస్కులో భాగంగా ఎలా పడితే అలా కదిలే ఎలక్ట్రిక్ ఎద్దుపై ఎవరు ఎక్కువ సేపు కూర్చుంటే వాళ్లదే పవరస్త్ర అని బిగ్‌బాస్ చెప్పాడు. హైట్ తక్కువ కావడంతో ప్రియాంక.. అలా దానిపై పూర్తిగా పడుకుని ఉండిపోయింది. శోభాశెట్టి మాత్రం ఆ జర్క్లకు తట్టుకోలేకపోయింది. ఓ సందర్భంగా పట్టుకున్న తాడుని వదిలేసి కిందపడింది. ఈ క్రమంలోనే ఆమె చేతికి గాయమైంది. దాన్ని గౌతమ్ చూస్తున్న క్రమంలోనే నొప్పితే అరిచింది. ప్రస్తుతం అందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఇన్నాళ్లకు మోక్షం కలిగింది)