బిగ్‌బాస్ సీజన్ 7 సగం పూర్తి అయింది. ఎనిమిది వారాల తర్వాత తొలిసారి ఓ మేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి పోతున్నాడు. మొదటి ఏడు వారాలు లేడీ కంటెస్టెంట్లే హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. ఈ వారం నామినేషన్స్‌లో శివాజీ, బోలే, సందీప్, శోభా శెట్టి, అశ్విని, గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్ ఉన్నారు.
బిగ్ ఫైట్‌లో గెలిచిన శోభ
బిగ్‌బాస్‌లో శివాజీ బ్యాచ్‌ను ఢీ కొట్టేది శోభ మాత్రమే కాబట్టి ఆమెను ఎలిమినేషన్ చేయాలనే ప్లాన్‌లో బయట ఉన్న శివాజీ పీఆర్ టీమ్ చాలా గట్టిగానే పోరాడింది. అలా శివాజీకి డప్పు కొట్టే బ్యాచ్ మొత్తం శోభాశెట్టిని టార్గెట్ చేసింది. కొందరైతే ఆమెపై ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా కామెంట్లు చేయడం దారుణం. నామినేషన్ లిస్ట్‌లో శోభ పేరు చేరగానే ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరకు బిగ్‌బాస్ సీజన్ 6లో సామాన్యుడిలా వెళ్లి తెలుగు ప్రేక్షకుల ప్రేమకు దగ్గరైన ఆదిరెడ్డి కూడా శివాజీ బ్యాచ్‌లోని సభ్యులకే ఎక్కువ సపోర్ట్‌గా నిలుస్తున్నట్లు తెలుస్తోంది.
ఆ క్రమంలోనే ఆదిరెడ్డి కూడా.. హౌస్‌లో శివాజీ చేస్తున్న పొలంగట్టు పంచాయితీలనే వెనుకేసుకొస్తున్నారు. ఒకట్రెండు సందర్భాల్లో మినహా శివాజీ బ్యాచ్‌నే ఆదిరెడ్డి కూడా వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన కంటెస్టెంట్‌లు ఏ చిన్న తప్పులు చేసినా.. వాటిని ఆదిరెడ్డి కూడా హైలెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆదిరెడ్డికి మంచి ఆదరణ ఉంది. అతనికంటూ మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అతను చెప్పే ప్రతి మాటకు ప్రస్తుతం ఒక వ్యాల్యూ ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఎక్కువగా శివాజీ బ్యాచ్‌నే వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శివాజీ బ్యాచ్ సేఫ్ అవుతున్నారని చెప్పవచ్చు. తన ఆటతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించే భోలే కూడా శివాజీ బ్యాచ్ అండతో సేఫ్ అవుతున్నాడు.
ఎందుకు సేఫ్
కొన్నిసార్లు ఆటలో శోభ కూడా తప్పులు చేసి ఉండవచ్చు.. ఆమెతో పాటు శివాజీ బ్యాచ్ కూడా ఎన్నో తప్పులు చేశారు. ఎందుకోగానీ శోభాశెట్టి మీద విపరీతమైన వ్యతిరేకత పెంచడానికి గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నయ్. వాటంన్నిటినీ ఆమె మళ్లీ తిప్పికొట్టింది. హౌస్‌లో నిలిచింది. శివాజీ బ్యాచ్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేస్తున్నందువల్ల కావచ్చు.
శివాజీ టీమ్‌ను శోభ మాత్రమే ఢీ కొడుతుంది. అలాంటిది ఆమెను హౌస్ నుంచి పంపిస్తే ఆటలో మజా ఉండదు. షో రేటింగ్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆమె సేఫ్ అయినట్లు తెలుస్తోంది. శోభ కూడా ఆటలో ఫైట్ చేస్తుంది. రెచ్చగొడుతుంది.. అప్పుడే ఏడుస్తుంది. కానీ ఏ టాస్కులనూ వదలదు. తన శక్తిమేరకు పోరాడుతుంది. ఏదేమైన ఆటలో ఉండాల్సిన కేరక్టర్ శోభ అని చెప్పవచ్చు.
శివాజీ బ్యాచ్ అండతో ఆయన సేఫ్
ఎనిమిదో వారం బిగ్‌బాస్ నుంచి ఆట సందీప్ ఎలిమినేషన్ జరిగిపోయింది.. దాదాపు ఇదే ఖాయం. మొదటి వారంలోనే లక్కీగా ఐదు వారాలు ఎలిమినేషన్ల నుంచి ఇమ్యూనిటీ పొందాడు. ఇదే అతనికి బిగ మైనస్ అయింది. ఓట్లు వేసే వాళ్లు అతనికి చేరవు కాకుండా చేసింది. ఏడు వారల తర్వాత ఆయన ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉండటంతో ఓట్లు వేసే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. ఈసారి నామినేషన్లలో చేరడంతో ఇక లీస్ట్ వోట్లతో హౌజ్ నుంచి వెనుతిరగక తప్పలేదు.
ఆటలో మరీ అంత బ్యాడ్ పర్‌ఫామెన్స్ సందీప్ ఇవ్వలేదు. కానీ శివాజీ బ్యాచ్ కాదు.. శోభాశెట్టి బ్యాచ్… అందుకే తన మీద కూడా బాగా వ్యతిరేకతను బయట ఉండే వారు క్రియేట్ చేశారు. ఆటల్లో, టాస్కుల్లో తను యాక్టివ్‌గానే ఉన్నాడు. కానీ చివరకు ఔటవ్వక తప్పలేదు. వాస్తవానికి ఈ వారం లక్కీ పర్సన్ భోలే.. ఆతను శివాజీ బ్యాచ్‌లో చేరడం వల్లే సేఫ్ అయ్యాడు. మరోవైపు శివాజీ టీమ్‌కు శత్రువు అయిన శోభతో వైరం క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఆయన సేఫ్ అయ్యాడని తెలుస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment