sivaji
-
నెం.1 స్థానంలో నిఖిల్.. గౌతమ్ సాయాన్ని మర్చిపోని సోహైల్
వారమంతా కంటెస్టెంట్ల ఫ్యామిలీస్ వచ్చారు. ఈరోజు ఫ్యామిలీ మెంబర్స్‌తో పాటు కంటెస్టెంట్ల ఫ్రెండ్స్ కూడా స్టేజీపైకి వచ్చారు. వారికి నాగ్ ఓ టాస్క్ ఇచ్చాడు. తమ కుటుంబ సభ్యుడిని మినహాయించి మిగతావారిలో ఎవరు టాప్ 5లో ఉంటారో చెప్పాలన్నాడు. మరి ఎవరెవరు ఏయే కంటెస్టెంట్లను టాప్ 5లో పెట్టారో నేటి (నవంబర్ 16) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..టాప్ 5 ర్యాంకులుమొదట ప్రేరణ తల్లి రూప, చెల్లి ప్రకృతితో పాటు నటి ప్రియ వచ్చారు. ప్రకృతి మిస్ ఇండియా తెలంగాణతో పాటు బెనెటి యూనివర్సిటీ మిస్ సుడోకుగా నిలిచిందంటూ నాగ్ అభినందించాడు. తర్వాత ప్రేరణ తల్లి.. నిఖిల్‌ను మొదటి స్థానంలో, నబీల్ను రెండో స్థానంలో, గౌతమ్, యష్మి, రోహిణిలను మిగతా మూడు స్థానాల్లో పెట్టారు.రవి సలహాను లెక్కచేయని విష్ణుతర్వాత విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి పావని, యాంకర్ రవి వచ్చారు. నీకు నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకోకపోతే జనాలు నీకెందుకు ఓట్లు వేస్తారు? ముందు నీకు నువ్వు ముఖ్యం అనుకుని గేమ్ ఆడమని రవి సలహా ఇచ్చాడు. కానీ విష్ణుప్రియ వింటేగా..? నాకోసం నేను ఆలోచిస్తే అహంకారమంటూ పిచ్చిగా మాట్లాడింది. దీంతో పావని నీపై నువ్వు ఫోకస్ చేయు అని హెచ్చరించడంతో కాస్త వెనక్కు తగ్గింది.కోవై సరళ కంటే పెద్ద ఆర్టిస్టు..వీరు గౌతమ్‌ను 1, నిఖిల్‌ను 2, నబీల్ను 3, పృథ్వీని 4, రోహిణిని 5వ స్థానంలో పెట్టారు. రోహిణి కోసం నాన్నతో పాటు నటుడు శివాజీ స్టేజీపైకి వచ్చారు. కోవై సరళ కంటే కూడా పెద్ద ఆర్టిస్టు అవుతావు అని శివాజీ.. రోహిణిని మెచ్చుకున్నాడు. టాప్ 5 గురించి మాట్లాడుతూ.. విష్ణు 1, నబీల్ 2, నిఖిల్ 3, గౌతమ్ 4, తేజ 5వ స్థానంలో ఉంటారన్నాడు.గౌతమ్ సాయం మర్చిపోని సోహైల్పృథ్వీ కోసం తమ్ముడు విక్రమ్, నటి దర్శిని వచ్చారు. నిఖిల్, నబీల్, యష్మి, ప్రేరణ, విష్ణుప్రియను టాప్ 5లో వరుస స్థానాల్లో ఉంచారు. పృథ్వీ సేవ్ అయినట్లు ప్రకటించారు. గౌతమ్ తల్లి మంగమ్మతో పాటు నటుడు సోహైల్ వచ్చారు. ఈ సందర్భంగా సోహైల్ మాట్లాడుతూ.. నా సినిమా రిలీజ్ సమయంలో 120 టికెట్లు స్పాన్సర్ చేసి జనాలకు చూపించాడు అని తెలిపాడు.నబీల్ కోసం భోలెఇక నబీల్ను 1, నిఖిల్‌ను 2, ప్రేరణను 3, తేజను 4, అవినాష్‌ను 5వ స్థానాల్లో పెట్టారు. తర్వాత గౌతమ్‌ను సేవ్ చేశారు. నబీల్ కోసం అతడి సోదరుడు సజీల్తో పాటు సింగర్ భోలె షావళి వచ్చారు. వీళ్లు నిఖిల్, గౌతమ్, అవినాష్, తేజ, విష్ణుప్రియకు టాప్ 5 ర్యాంకుల్ని వరుసగా ఇచ్చారు.మరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
విష్ణు గెలవాలన్న శివాజీ.. గౌతమ్‌పై పంచులు
బిగ్‌బాస్ తెలుగు ఎనిమిదో సీజన్లో పట్టుమని పదిమందే మిగిలారు. వీళ్లందరి కుటుంబసభ్యులను హౌస్‌లోకి పంపించి నూతనోత్తేజాన్ని నింపారు. అయితే ఎప్పటిలాగే వీకెండ్లో మరికొంతమంది ఫ్యామిలీ మెంబర్స్‌ను తీసుకువచ్చారు. ఈ మేరకు ఓ ప్రోమో రిలీజ్ చేశారు.మరోసారి ఫ్యామిలీస్..ప్రేరణ కోసం ఆమె తల్లి, చెల్లితో పాటు సినీ నటి ప్రియ వచ్చింది. విష్ణుప్రియ కోసం ఆమె చెల్లి, యాంకర్ రవి వచ్చారు. రోహిణి కోసం ఆమె తండ్రి, శివాజీ వచ్చినట్లు తెలుస్తోంది. వచ్చినవాళ్లతో టాప్ 5లో ఎవరుంటారన్న గేమ్ ఆడించారు. నువ్వు గెలవాలంటూ విష్ణును టాప్ 1 ప్లేస్‌లో పెట్టాడు శివాజీ. అది చూసి విష్ణుప్రియ సైతం షాకైంది. గౌతమ్‌పై శివాజీ పంచులుగౌతమ్ను కూడా శివాజీ ఓ ఆట ఆడుకున్నాడు. యష్మి బిజీగా ఉంది, నిన్ను పట్టించుకోలేదు.. నీకు వర్కవుట్ కాలేదని అక్కా అన్నావ్.. అయినా నీకు రోహిణి కంటే మంచి అమ్మాయి దొరుకుతుందా? అని సెటైర్లు వేశాడు. ఎవరికి టైటిల్ దక్కనుంది? ఎవరు ఫినాలేలో అడుగుపెడతారన్నది కంటెస్టెంట్ల ఇంటిసభ్యులు డిసైడ్ చేయనున్నారు. దీంతో హౌస్‌లో ఉన్నవారికి కూడా గేమ్‌పై ఓ క్లారిటీ రానుంది. చదవండి: నా అకౌంట్ నుంచి వచ్చే మెసేజ్‌లను పట్టించుకోవద్దు: విశ్వంభర దర్శకుడు -
రీ-రిలిజ్‌కు రజనీకాంత్ ఐకానిక్ సినిమా
'శివాజీ: ది బాస్' రీరిలీజ్ కానుంది. శంకర్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా 2007లో విడుదలైంది. ఈ చిత్రంలో రజనీకాంత్, శ్రియ శరన్,సుమన్ ప్రధాన పాత్రలలో నటించారు. కోలీవుడ్ చరిత్రలో 100 కోట్ల క్లబ్లో చేరిన తొలి తమిళ చిత్రంగా శివాజీ నిలిచింది . AR రెహమాన్‌కు 'శివాజీ' 100వ సినిమా కావడం విశేషం. అయితే, అప్పట్లో మంచి విజయాన్ని అందుకున్న ఈ సినిమా సుమారు 17 ఏళ్ల తర్వాత మరోసారి రీరిలీజ్ కానుంది.సెప్టెంబర్ 20న 4K వర్షన్లో శివాజీ విడుదల కానుంది. అయితే, ఎంపిక చేసిన స్క్రీన్లలో, టిక్కెట్ ధర రూ. 99 మాత్రమే ఉండనుంది. 2012లో రజనీకాంత్ పుట్టినరోజు సందర్భంగా శివాజీ చిత్రాన్ని 3D వర్షన్లో విడుదల చేశారు. ఆ సమయంలో సినిమా నిడివి 30 నిమిషాలు తగ్గించారు. 3D కొత్త డాల్బీ అట్మాస్ ప్లాట్‌ఫారమ్‌తో ప్రారంభించబడిన మొదటి భారతీయ చిత్రంగా రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంతకాలానికి మళ్లీ 3D వర్షన్‌ను కూడా విడుదల చేయనున్నారు. సెప్టెంబర్ 20న రీరిలీజ్ కానున్న శివాజీ సినిమా కోసం రజనీకాంత్ ఫ్యాన్స్ ఎదురుచూస్తున్నారు. -
శివాజీ-లయ.. చాన్నాళ్ల తర్వాత మళ్లీ జంటగా
అప్పట్లో సినిమాలు చేసి పూర్తిగా టాలీవుడ్‌కి దూరమైపోయిన శివాజీ.. బిగ్‌బాస్ గత సీజన్లో పాల్గొని గుర్తింపు తెచ్చుకున్నాడు. ఆ మధ్య ఓ వెబ్ సిరీస్‌తో నటుడిగా కమ్ బ్యాక్ ఇచ్చాడు. ప్రస్తుతం తనే నిర్మాతగా మారి ఓ సినిమా చేస్తున్నాడు. క్రైమ్ కామెడీ థ్రిల్లర్ కథతో తీస్తున్నారు. ఇందులో శివాజీకి జోడిగా లయ నటిస్తోంది. తాజాగా ఈ చిత్రం పూజతో లాంఛనంగా ప్రారంభమైంది.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?)హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా ప్రారంభోత్సవానికి దిల్ రాజు, బోయపాటి శ్రీను, నిర్మాత బెక్కం వేణు గోపాల్ తదితరులు హాజరయ్యారు. ఇకపోతే ఈ సినిమాతో సుధీర్ శ్రీరామ్ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కాబోతున్నాడు.గతంలో శివాజీ, లయ జంటగా పలు తెలుగు సినిమాల్లో హీరోహీరోయిన్లుగా చేశారు. 'మిస్సమ్మ', 'టాటా బిర్లా మధ్యలో లైలా', 'అదిరిందయ్యా చంద్రం' తదితర మూవీస్ ప్రేక్షకుల్ని అలరించాయి. మళ్లీ ఇన్నాళ్ల తర్వాత ఈ కాంబోలో సినిమా రావడం విశేషం. ఈ నెల 20 నుంచి షూటింగ్ ప్రారంభించబోతున్నారు. త్వరలో మిగతా వివరాలు వెల్లడిస్తారు.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!) -
క్రైమ్... థ్రిల్
విశ్వంత్, శిల్పా మంజునాథ్ హీరో హీరోయిన్లుగా నటించిన క్రైమ్ థ్రిల్లర్ మూవీ ‘హైడ్ న్ సిక్’. బసిరెడ్డి రానా దర్శకత్వంలో నిశాంత్, ఎంఎన్ఓపీ సమర్పణలో సహస్ర ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై నరేంద్ర బుచ్చిరెడ్డి నిర్మించిన చిత్రం ఇది. తాజాగా ఈ సినిమా మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించిన నటుడు శివాజీ మాట్లాడుతూ– ‘‘ఇటీవల ఇండస్ట్రీకి కొత్త ప్రతిభ ఎక్కువగా వస్తోంది.ఇది మంచి పరిణామం. ‘హైడ్ న్ సిక్’ సినిమాకు ప్రేక్షకులు విజయం చేకూర్చాలి’’ అన్నారు. ‘‘ఈ సినిమా విజయం సాధిస్తుంది’’ అని తెలిపారు విశ్వంత్. ‘‘ఎన్ని కష్టాలొచ్చినా ఈ సినిమాను ఆపేది లేదని నిర్మాత భరోసా ఇచ్చారు. ఆ ధైర్యంతో ఈ సినిమాను పూర్తి చేశాం’’ అని పేర్కొన్నారు బసిరెడ్డి రానా. దర్శకులు మల్లి అంకం, ఆదిత్యా హాసన్, నవీన్ మేడారం అతిథులుగా హాజరై, ‘హైడ్ న్ సిక్’ విజయాన్ని ఆకాంక్షించారు. -
యూత్ ఫుల్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ‘కాలం రాసిన కథలు’
యమ్ యన్ వి సాగర్ , శృతి శంకర్ , వికాస్ , విహారికా చౌదరి ప్రధాన పాత్రల్లో నటించిన తాజా చిత్రం ‘కాలం రాసిన కథలు’. ఈ మూవీకి యమ్ యన్ వి సాగర్ దర్శకత్వం వహించడంతో పాటు నిర్మాతగానూ వ్యవహరించారు. తాజాగా ఈ మూవీ పోస్టర్ని హీరో శివాజీ విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. "ఈ చిత్రం టైటిల్ మరియు కాన్సెప్ట్ చాలా బాగున్నాయి. ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుకుంటున్నాను’అని అన్నారు.దర్శక నిర్మాతలు యమ్ యన్ వి సాగర్ సాగర్ మాట్లాడుతూ, "మచిలీపట్నం పెడన పరిసర ప్రాంతాల్లో ఈ చిత్ర సింహ భాగం షూటింగ్ జరిగింది. యూత్ ఫుల్ లవ్ మరియు ఫ్యామిలీ ఎంటర్టైనర్ గారు రూపొందిన మా చిత్రం ద్వారా నూతన నటీనటులు చిత్ర పరిశ్రమకు పరిచయం అవుతున్నారు. ముఖ్యంగా ఐదు జంటల మధ్య జరిగే అద్భుతమైన సంఘర్షణలతో అన్ని వర్గాల ప్రేక్షకుల్ని మెప్పించే ట్విస్టులు ఈ సినిమాలో ఉన్నాయి. అంతే కాకుండా, సెకండ్ హాఫ్ లో శివుడి మీద ఉండే సన్నివేశాలు ప్రేక్షలులని రక్తి కట్టిస్తాయి. ఇప్పటికే రిలీజ్ అయిన టీజర్ మరియు సాంగ్స్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఈ చిత్రం ఆగస్టు 29న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు వస్తుంది" అని తెలిపారు. -
పాన్ ఇండియా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ
టాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ 'కూర్మనాయకి'. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్‌తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల.వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ రోజు శివాజీ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి వెల్కమ్ చేస్తూ స్పెషల్ వీడియోను కూర్మనాయకి టీమ్ రిలీజ్ చేసింది. శివాజీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా 'కూర్మనాయకి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. థర్డ్ షెడ్యూల్ లో శివాజీ జాయిన్ అయ్యారు. కూర్మనాయకి సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారు. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు. -
అప్పుడు షూటింగ్ నుంచి పారిపోయాను: హీరోయిన్ శ్రియ
శ్రియని సిల్వర్ స్క్రీన్ బ్యూటీఫుల్ హీరోయిన్ అని పిలవొచ్చు. తెలుగు, తమిళ, కన్నడ, హిందీలో నటించిన ఈమె.. చాలా గుర్తింపు తెచ్చుకుంది. చాలా తక్కువ టైంలోనే రజనీకాంత్, చిరంజీవి, నాగార్జున, విజయ్ లాంటి స్టార్ హీరోలతో కలిసి పనిచేసింది. కొన్నాళ్ల క్రితం పెళ్లి చేసుకుని, ఓ పాపకు తల్లి అయినప్పటికీ.. గ్లామర్ విషయంలో ఏ మాత్రం తగ్గట్లేదు. నటనకు అస్సలు దూరం కాలేదు. శ్రియ నటించిన 'షో టైం' అనే వెబ్ సీరీస్ స్ట్రీమింగ్కి రెడీ అయింది. ఈ సందర్భంగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన గురించి కొన్ని సీక్రెట్స్ బయటపెట్టింది. (ఇదీ చదవండి: సింపుల్‌గా పెళ్లి చేసుకున్న టాలీవుడ్ లేడీ సింగర్) 'నటిగా పరిచయమైన తొలి రోజుల్లో చాలా సమస్యల్ని ఎదుర్కొన్నాను. ఓసారి అయితే షూటింగ్ నుంచి పారిపోయాను. 'కందసామి' సినిమాలో నటిస్తున్నప్పుడు ఓ సీన్ కోసం చాలా టేక్స్ తీసుకున్నాను. కానీ హీరో విక్రమ్ ఎంతో ఓపిగ్గా నాతో పాటు నటించారు. అది ఎప్పటికీ మర్చిపోను. అలానే రజనీకాంత్ 'శివాజీ' మూవీలో నటిస్తున్నప్పుడు ఆయన నాకు చాలా మంచి సలహా ఇచ్చారు' ''మీరు చాలా అందంగా ఉన్నారు, సక్సెస్ఫుల్ సినిమాలు చేస్తున్నారు. రేపు ఈ పరిస్థితి మారిపోయి ఫ్లాప్స్ చూడొచ్చు. అయినాసరే ప్రేక్షకులతో మర్యాదగా ప్రవర్తించండి, వారితో ప్రేమగా ఉండండి' అని రజనీకాంత్ నాతో చెప్పారు. ఇప్పటికీ నేను అదే పాటిస్తున్నాను' అని శ్రియ చెప్పుకొచ్చింది. అయితే షూటింగ్ నుంచి పారిపోయానని శ్రియ చెప్పింది గానీ అది ఏ మూవీ అనేది చెప్పలేదు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. అవి మాత్రం డోంట్ మిస్) -
బిగ్‌బాస్ 7 విన్నర్ ప్రశాంత్ అరెస్ట్‌పై స్కిట్.. ముఖం మాడ్చుకున్న శివాజీ!
బిగ్‌బాస్ 7 షో దాదాపు నెలన్నర క్రితమే అయిపోయింది. రైతుబిడ్డ అని చెప్పుకొన్న పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. ఫైనల్ తర్వాత హైదరాబాద్ రోడ్లపై నానా రచ్చ చేశాడు. అతడి అభిమానులైతే.. ఆర్టీసీ బస్సులతో పాటు పలువురు కార్లని కూడా ధ్వంసం చేశారు. దీంతో ప్రశాంత్‌ని పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఇంత సీరియస్ విషయాన్ని ఇప్పుడు కామెడీ చేసి పడేశారు. గతంలో ఎప్పుడూ లేని విధంగా బిగ్‌బాస్ 7వపై బోలెడన్ని విమర్శలు వచ్చాయి. మరీ ముఖ్యంగా శివాజీ ఆటతీరు, షోలో అమ్మాయిలపై చేసిన వల్గర్ కామెంట్స్.. షో చూడాలనే ఆసక్తిని పూర్తిగా చంపేశాయి. ఇక బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత కూడా శివాజీ బుర్ర ఇంకా అలానే ఉండిపోయింది. అమర్, శోభాపై పిచ్చిపిచ్చి కామెంట్స్ చేశాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో 27 సినిమాలు రిలీజ్.. అదొక్కటి స్పెషల్) సరే ఇదంతా పక్కనబెడితే శివాజీ ఈ మధ్య ఓ వెబ్ సిరీస్‌లో యాక్ట్ చేశాడు. ఓటీటీలో అది ప్రేక్షకుల్ని అలరిస్తోంది. దాని ప్రమోషన్స్ కోసం ప్రముఖ కామెడీ షోకి వచ్చాడు. అయితే చాలా కాంట్రవర్సీ అయిన పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌ని ఇందులో స్కిట్‌గా వేశారు. పాపం అంత సీరియస్ విషయాన్ని పూర్తిగా కామెడీ చేసి పడేశారు. స్కిట్ చూస్తున్న టైంలో శివాజీ ముఖమైతే పూర్తిగా మాడిపోయింది. ఏదో తెచ్చిపెట్టుకున్నట్లు కాస్త నవ్వాడు అంతే! తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోలో ఇదంతా ఉంది. అయితే బిగ్‌బాస్ షోలోకి రాకముందు శివాజీపై కొందరి వరకు కాస్త మంచి అభిప్రాయం ఉండేది. కానీ ఎప్పుడైతే ఈ షోలో పార్టిసిపేట్ చేశాడో.. తన ప్రవర్తనతో ఉన్న ఆ కాస్త పరువు కూడా పోగొట్టుకున్నాడు! ఇప్పుడు అదే శివాజీకి దోస్త్ అయిన ప్రశాంత్ అరెస్టుపై స్కిట్ వేసి.. శివాజీని సైలెంట్ అయిపోయేలా చేసేపడేశారు. (ఇదీ చదవండి: 14 నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చేసిన సినిమా.. ఫ్రీగా చూసే ఛాన్స్) -
అమర్ రన్నర్ కావడంతో నాగార్జునకు చెడ్డపేరు: శివాజీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న అక్కసు శివాజీలో కనిపిస్తుంది. అందుకే ఆయన పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికీ కూడా అమర్, శోభా పట్ల పలు చిల్లర వ్యాఖ్యలతో పాటు పరుష పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు. చివరకు అమర్ రన్నర్ ఎలా అయ్యాడో అంటూ చెప్పుకొస్తున్నాడు. బిగ్ బాస్‌లో శివాజీని అన్నిరోజులు ఉంచడమే గొప్ప విషయం అనుకుంటుంటే.. తనను తాను ఎదో గొప్ప అనుకునే భ్రమలో ఇప్పటికీ ఆయన ఉన్నాడు. శివాజీ వల్లే ఈ సీజన్లో ఇంత రచ్చ అయిందని చెప్పేవారు ఎందరో ఉన్నారు. అనవసరంగా తనను ఈ సీజన్లోకి తీసుకున్నారని కూడా పలువురు కామెంట్లు కూడా చేశారు. హౌస్‌లో ఎప్పుడూ కూడా తాను పోతా పోతా అంటాడు, ఆటలు ఆడడు, బెడ్డు వదలడు, పైగా చెయ్యి నొప్పి, మాట్లాడితే వెటకారాలు, నీతిబోధలు. బిగ్ బాస్‌లో ఆయన చేసింది ఇదే కదా.. మరోకటి ఏమైనా ఉంటే చెప్పండి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు కూడా. గట్టు పంచాయితీలు తీర్చే ఈ పెద్దకు ఇద్దరు పాలేర్లు. వారిద్దరినీ తన చుట్టూ తిప్పుకోవడం.. బిగ్ బాస్‌లో శివాజీ చేసింది ఏమిటి..? నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడం.. ఇప్పడు బిగ్ బాస్ బయట కూడా అదే చేస్తున్నాడు. శోభా శెట్టి గొడవతో తనను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం బిగ్ బాస్ చేశారని తాజాగా శివాజీ సంచలన ఆరోపణ చేశాడు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్లింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని అంటూ శివాజీ ఇలా చెప్పాడు. 'గేమ్ ఒక దశకు వచ్చాక విన్నర్ ఎవరు..? ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా అంచనా వేశాను. 1, 2, 3 స్థానాల్లో మనం ముగ్గురం ఉండబోతున్నామని ప్రశాంత్ చేతిలో రాశాను. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని బిగ్ బాస్ కావాలనే హైలైట్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం నాకు నచ్చలేదు. అతను (అమర్) చపాతి చేస్తే బాగుంది నాకు కూడా పంపించు అని బిగ్ బాస్ అంటాడు... నేను ఎంతో కష్టపడి వడలు చేపిస్తే కనీసం ఒక మాట కూడా నాకు దక్కలేదు. పలుసార్లు పౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని చివరకు రన్నరప్‌ను చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి చెడ్డ పేరు వస్తుంది. ఇదే విషయం నాగ్ సారుకు కూడా త్వరలో చెబుతాను. న్యాయంగా అయితే టాప్ 3లో ప్రశాంత్, నేను, యావర్ ఉండేవాళ్లం.' అని శివాజీ అన్నారు. -
బిగ్ బాస్ అమర్‌పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆపై బెయిల్ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్లో రన్నర్‌గా ఆమర్ దీప్ ఉంటే టాప్-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్‌లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్‌ను హ్యాండిల్ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్‌ను బిగ్ బాస్ తీసుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్‌లో కొందరు యావర్‌తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది. ఫైనల్‌గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్ బాస్‌లో ప్రశాంత్‌ను మానశికంగా కొందరు టార్చర్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్‌ను అమర్ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్, ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్‌ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్‌కు బౌండ్ అయి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టి అమర్‌ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్‌పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్ వరకే పరిమితం. అయినా ప్రశాంత్, అమర్ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ -7 ముగిసి పోయిన చాప్టర్.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ.. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ.. అమర్‌ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హౌస్‌లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అమర్ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్‌పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి. -
బిగ్ బాస్‌కు ముందే SPY బ్యాచ్ స్టార్ట్ అయిందా.. వీడియో వైరల్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 ముగిసింది. ఈ సీజన్ ప్రధానంగా SPY (శివాజీ, ప్రశాంత్, యావర్) SPA (శోభ,ప్రియాంక,అమర్) బ్యాచ్‌ల మధ్యే నడిచింది. చివరకు స్పై బ్యాచ్‌లోని ప్రశాంత్ విన్నర్‌గా నిలిచాడు. బిగ్ బాస్ సీజన్ ప్రారంభంలోనే శోభ,ప్రియాంక,అమర్ ముగ్గురూ గ్రూప్ గేమ్ ఆడుతున్నారని.. వాళ్లందరూ 'స్టార్ మా' బ్యాచ్ అంటూ మొదట్లోనే శివాజీ కన్నింగ్ ప్లాన్ వేశాడు. వాస్తవానికి ఆ విషయంలో వాళ్లే ఒప్పుకున్నారు. ఇక్కడికి రాక ముందే తామందరం మంచి స్నేహితులం.. ఈ షో గురించి తమ మధ్య ఎలాంటి బంధం లేదని చెప్పలేమని తెలిపి వారు గ్రూప్‌గానే గేమ్ ఆడుతూ వచ్చారు. ఇదే క్రమంలో శివాజీ, యావర్, ప్రశాంత్ కూడా SPY అనే పేరుతో గ్రూప్ అయ్యారు.. వారు కూడా గ్రూప్ గేమ్ ఆడుతూ పదే పదే SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ గేమ్ ఆడుతుందని హౌస్‌లో పదేపదే ప్రచారం చేయడం ప్రారంభించారు. కానీ వీరు ముగ్గురు హౌస్‌లోకి రాక ముందే ఒకరికొకరితో పరిచయం ఉంది అంటూ గతంలోనే కొన్ని వార్తలు వచ్చాయి. హౌస్‌లోకి వచ్చిన తర్వాతే వాళ్ల మధ్య పరిచయం అయినట్లూ ఈ ముగ్గురు కూడా కలరింగ్ ఇచ్చారు. ఎక్కడా తమ మధ్య ముందే పరిచయం ఉందని రివీల్ చేయలేదు. బిగ్ బాస్‌లోనే మొదటి పరిచయం అయినట్లు కనిపించారు. అలా ఈ ముగ్గురు ఒకటిగా గేమ్ ఆడుతూ.. SPA బ్యాచ్ మాత్రమే గ్రూప్ అంటూ పదే పదే ఎదురుదాడి చేశారు. SPY బ్యాచ్‌పై ముందు నుంచే చాలా అనుమానాలు కనిపించాయి. బిగ్ బాస్‌కు ముందు ప్రశాంత్‌ను ఎక్కడా చూడలేదని యావర్ చెప్పాడు. అంతేకాకుండా కలవలేదని చెప్పాడు. ఇక్కడికి వచ్చాకే ఫ్రెండ్స్ అయ్యామని చెప్పుకొచ్చాడు. అదంతా నిజమేనని జనాలు కూడా నమ్మారు. కానీ అది అబద్దం అని తేలిపోయింది. తాజాగా సోషల్ మీడియాలో ఒక వీడియో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో పల్లవి ప్రశాంత్, యావర్ చాలా క్లోజ్‌గా మాట్లాడుకుంటున్నారు. బిగ్ బాస్‌కు ముందే వారిద్దరి మధ్యే బాటలు సాగాయని తేలిపోయింది. ఇదే క్రమంలో శివాజీ, ప్రశాంత్ మధ్య కూడా పరిచయం ఉందని సమాచారం. బిగ్ బాస్ స్టార్ట్ కాకముందు ప్రశాంత్‌ను ఇంటర్వ్యూ చేయాలని ఒక యూట్యూబ్ వారిని శివాజీనే సూచించాడట. ఇలా ఈ ముగ్గురి మధ్య పరిచయం ఉన్నప్పటికీ దానిని దాచి వారి గేమ్ ప్లాన్‌ను మొదలు పెట్టారు. దీంతో స్పై బ్యాచ్ ముందే ప్లాన్ చేసుకొని వచ్చారనే కామెంట్స్ వినిపిస్తన్నాయి. ఇది చూసిన స్పై ఫ్యాన్స్ సైతం ఒక్కసారిగా అవాక్కవుతున్నారు. జనాలను మోసం చేసారంటూ కామెంట్స్ చేస్తున్నారు. కానీ చాలా ఏళ్ల నుంచి తమ మధ్య స్నేహం ఉందని ఓపెన్‌గా చెప్పిన స్పా బ్యాచ్... ఆట కోసం తమ స్నేహాన్ని వదులుకోలేమని చెప్పి ఆటలో ఎన్ని గొడవలు జరిగినా మళ్లీ కలిసిపోతూ.. స్నేహంలో ఇవన్నీ సహజమే అనేలా తమ ఆటను కొనసాగించి నిజమైన అభిమానులను సొంతం చేసుకున్నారు. View this post on Instagram A post shared by 𝐒𝐌𝐃🧘 (@swaasa_meedha_dhyaasa_) -
జనం చూశారు.. అమర్‌కు జై కొట్టారు, శివాజీనీ ఛీ కొట్టారు!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. వీరందరూ తమకు తోచిన ఆట ఆడారు. హౌస్‌లో ఉండేందుకు ప్రయత్నించారు. కానీ షో ముందుకు సాగాలంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే! అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ పోగా గ్రాండ్ ఫినాలే వచ్చేసరికి ఆరుగురు మిగిలారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. షోలో కొనసాగడం కోసం కష్టపడ్డ ఎంతోమంది ముందే ఎలిమినేట్ అయిపోగా.. ఏమాత్రం కష్టపడకుండా సోఫాలో సేద తీరుతూ.. బిగ్‌బాస్‌కే ఆర్డర్లు వేసిన శివాజీ మాత్రం టాప్ 3 వరకు వచ్చాడు. పగతో రగిలిపోయాడు.. ఈయనది మాస్టర్ మైండ్ అని నాగ్ అన్నారు. నిజమే, శివాజీ అంత కన్నింగ్ మాస్టర్ మైండ్ బిగ్‌బాస్ చరిత్రలోనే ఎవరికీ లేదు. ఒకరి మీద పగపెట్టుకుని ద్వేషంతో రగిలిపోతూ కుట్రలు పన్నుతూ పైకి మాత్రం ఏమీ ఎరుగనివాడిలా నటించడం ఆయనకే సాధ్యమైంది. శివాజీ హౌస్‌లో చేసింది రెండే రెండు. ఒకటి.. అమర్‌ను టార్గెట్ చేయడం. రెండు.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లను తన గుప్పిట్లో పెట్టుకోవడం. కామన్ మ్యాన్‌కు సపోర్ట్ చేస్తే జనాల్లో తనకు మంచి గుర్తింపు వస్తుందనుకున్నాడు. అందుకే రైతుబిడ్డను, అలాగే నటుడిగా పెద్ద గుర్తింపు లేని ప్రిన్స్ యావర్‌ను తన గ్రూపులో చేర్చుకున్నాడు. టాస్కుల్లో విజృంభించి ఆడేది వీళ్లిద్దరే కాబట్టి వీళ్లేది సాధించినా అది తన ఖాతాలోనే వేసుకునేవాడు. మానసికంగా వేధించిన ఛీవాజీ బిగ్‌బాస్ 7 మొదలైనప్పుడే అమర్ టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. ఈ విషయం తెలిసిన శివాజీ అతడి గురించి అంతా రీసెర్చ్ చేసి మరీ తనను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. తనను ఎప్పుడూ కిందకు లాగాలని చూశాడు. సూటిపోటి మాటలతో వేధించాడు. లక్షలాది మంది ప్రేక్షకులు చూసే షోలో అతడిని పనికిరాని వెధవగా చిత్రీకరించాడు. తను ఏం చేసినా తప్పనేవాడు. శివాజీ కుట్రలు తెలియని అమర్దీప్ అతడిని మాత్రం గురువుగానే భావించాడు. ఈ వంకతో మరింత చనువు తీసుకున్న సోఫాజీ.. అమర్ మీద ఎన్నోసార్లు విషం కక్కాడు. ఏదైనా అంటే సరదాగా అన్నానని తప్పించుకునేవాడు. డమ్మీ చాణక్య.. జనం చూశారు! పదేపదే జనం చూస్తున్నారు అని చెప్పే శివాజీ.. తను అనే మాటలను, తన చేష్టలను జనం పట్టించుకోరనుకున్నాడేమో! కానీ జనం చూశారు. ఈ డమ్మీ చాణక్య పన్నాగాలు తెలుసుకున్నారు. ఒకరిని కిందకు లాగాలనుకుంటే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. అమర్‌కు జై కొట్టి రెండో స్థానంలో నిలబెట్టాడు. అతడిని తొక్కేయాలని చూసిన శివాజీని మూడో స్థానానికే పరిమితం చేశారు. ఇక్కడే శివాజీ ఓడిపోయాడు. అమర్‌కు వేస్ట్ ఫెలో, పనికిమాలినోడు, వెధవన్నర వెధవ, పిచ్చి పోహ.. ఇలా ఎన్నో బిరుదులిచ్చాడు. మరి అతడి చేతిలో ఓడిపోయిన శివాజీని ఏమని పిలిస్తే బాగుంటుందో అతడికే తెలియాలి. వాళ్లు లేకపోయుంటే శివాజీ 'జీరో' పోనీ శివాజీ హౌస్‌లో పెద్దగా పొడిచేసిందేమైనా ఉందా? అంటే అదీ లేదు. ఒక టాస్క్ ఆడలేదు, ఎంటర్టైన్మెంట్ అసలే చేతకాలేదు. పైగా ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ప్రతిసారి తన చేయినొప్పిని సాకుగా చూపిస్తూ ఎంచక్కా ట్రిప్పుకు వచ్చినట్లు సోఫాలో సెటిలై గేమ్ చూస్తూ ఎంజాయ్ చేశాడు. సీజన్ అంతా చేయినొప్పినే చూపిస్తూ సింపతీ ఓట్లు సంపాదించుకున్నాడు. ప్రశాంత్‌ను విన్నర్ చేసింది తానే అని విర్రవీగుతున్న శివాజీ ఈ రోజు కనీసం టాప్ 3లో అయినా ఉన్నాడంటే అందుకు కారణం.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్లే! ఇది ఎవరూ కాదనలేని నిజం! వాళ్లు లేకపోయుంటే శివాజీ 'జీరో'. చదవండి: ప్రశాంత్‌ను కారు దిగనివ్వని పోలీసులు.. రైతుబిడ్డను అన్నా.. ఇట్ల చేస్తే ఎలా? -
Bigg Boss 7: శివాజీకి బొమ్మ చూపించిన బిగ్‌బాస్.. చివరకు అదొక్కటే మిగిలింది!
శివాజీ... బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ ఇచ్చిన హైప్ చూస్తే నిజంగా గెలిచేస్తాడేమో అని అందరూ తెగ భయపడ్డారు. ఎందుకంటే ఈ సీజన్ మొదటిరోజు నుంచి సోఫాపై కూర్చుని ఆర్డర్స్ వేయడం, ప్రశాంత్-యావర్‌లతో పనిచేయించుకోవడం తప్పితే ఒక్క విషయంలోనూ ఎంటర్టైన్ చేయలేకపోయాడు. నాగార్జున అయితే మాస్టర్ మైండ్, చాణక్య లాంటి పెద్దపెద్ద బిరుదులిచ్చేసి శివాజీని ఆకాశంలో కూర్చోబెట్టాడు. చివరకు అక్కడి నుంచే కిందకు తోసేశాడు. అసలు ఈ సీజన్లో శివాజీ ఏం చేశాడు? ఇంతకీ ఆడాడా లేదా? నటుడు, డబ్బింగ్ ఆర్టిస్టుగా శివాజీ కాస్తోకూస్తో గుర్తింపు ఉంది. అప్పట్లో హీరో, సైడ్ క్యారెక్టర్ తరహా పాత్రలు చేశాడు కానీ ఆ తర్వాత ట్రెండ్‌కి తగ్గట్లు మింగిల్ కాలేక యాక్టింగ్ పక్కనబెట్టేశాడు. అలా నటుడిగా కనుమరుగైపోయాడు. రాజకీయాల్లోకి వచ్చి 'గరుడ పురాణం' చెప్పాడు. చాల్లే నీ సేవలు అని చెప్పి పక్కకు తోసేశారు. ఇక అన్నీ అయిపోయేసరికి ఏం చేయాలో తెలీక పిల్లల మీద ప్రతాపం చూపించడానికా అన్నట్లు బిగ్‌బాస్ లోకి వచ్చాడు. ఇక్కడ కూడా మనోడికి మొండిచెయ్యే మిగిలింది. కప్ కొట్టడం సంగతి అటుంచితే కనీసం రన్నరప్ కూడా కాలేకపోయాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 30 సినిమాలు) శివాజీ బిగ్‌బాస్ హౌసులోకి ఎంట్రీ ఇచ్చినప్పుడు.. 3-4 వారాలు ఉంటే గ్రేట్ అని చాలామంది ప్రేక్షకులు అనుకున్నారు. కానీ ఫినాలే వరకు వచ్చేశాడు. ఏ మాత్రం పనిచేయకపోయినా సరే టాప్-3 వరకు వచ్చేశాడు. అయితే శివాజీ ఈ షోకే అనర్హుడు అని చెప్పడానికి బోలెడన్ని కారణాలున్నాయి. అందులో మొదటిది నాగార్జున సపోర్ట్. గేమ్ షో అంటే సొంతంగా ఆడాలి. కానీ శివాజీ ఎప్పుడు అలా చేసింది లేదు. నోటికొచ్చింది మాట్లాడేయడం.. వీకెండ్ వచ్చేసరికి 'బాబుగారు అలా కాదు.. బాబుగారు ఇలా కాదు' అని డిఫెండ్ చేసుకోవడం.. నాగార్జున శివాజీకి వంతపాడటం. ఇక ప్రశాంత్-యావర్‌ని గుప్పిట్లో పెట్టుకుని, పనులన్నీ వీళ్లతో చేయించుకోవడం కూడా శివాజీ గేమ్ ప్లాన్‌లో భాగమేమో? ఇక బిగ్‌బాస్‌లో శివాజీ మాటతీరు చాలా వరస్ట్! ఎందుకంటే హౌసులోని ప్రతిఒక్కరూ ఇతర కంటెస్టెంట్స్‌ని పేరు పెట్టి పిలవాలి. కానీ శివాజీ ఈ విషయంలో చాలా పూర్. కారణం లేకపోయినా సరే అమర్‌పై మొదటి నుంచే చాలా పగ పెంచేసుకున్నాడు. ప్రతివారం నామినేట్ చేసేవాడు. 'పనికిమాలినోడా', 'పిచ్చోడా' అని నోటికి ఏమొస్తే అలా పిలిచేవాడు. అమర్.. ఇవన్నీ పట్టించుకోడు కాబట్టి లైట్ తీసుకున్నాడు. గౌతమ్ లేదా అర్జున్‌ని ఇలా గానీ పిలుచుంటే శివాజీకి ఇచ్చిపడేసేవాళ్లు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!) శివాజీలో ఇంకో అవలక్షణం ఏంటంటే.. ఆడపిల్లలతో ఎలా బిహేవ్ చేయాలో తెలీదు. మిగతా లేడీ కంటెస్టెంట్స్.. తన మాటకు ఎదురుచెప్పలేదు. దీంతో వాళ్లని అమ్మ అమ్మ అని పిలిచేవాడు. వాళ్లని ఏం అనేవాడు కూడా కాదు. కానీ శోభా-ప్రియాంక.. శివాజీ నిజస్వరూపాన్ని ఉన్నది ఉన్నది చెప్పేవారు. మాటకు మాట కౌంటర్ ఇచ్చేవారు. ఇది శివాజీ అస్సలు తీసుకోలేకపోయాడు. 'ఒక్కటి పీకుతా', 'పీక మీద కాలేసి తొక్కుతా' లాంటి పిచ్చికూతులన్నీ కూసి, షో పరువు తీశాడు. మళ్లీ ఏమైనా అంటే.. మాది పల్నాడు, మా దగ్గర ఇలానే మాట్లాడుతారని చెప్పి పుట్టిన ఊరిపేరు కూడా చెడగొట్టాడు. బిగ్‌బాస్ షోలోకి వచ్చిన మొదటి వారాల్లోనే శివాజీ కుడి చేతికి గాయమైంది. దీంతో చాలా గేమ్స్‌లో పార్టిసిపేట్ చేయలేదు. కొన్ని గేమ్స్‌లో కనీస పోటీ ఇవ్వకుండానే చేతులెత్తేశాడు. ఏమన్నా అంటే డిస్ట్రబ్ చేశావ్ అదీ ఇదీ అని అవతల వాళ్లపై అరిచేవాడు. ఈ సీజన్ మొత్తంలో పవరస్త్ర గెలుచుకోవడం, కెప్టెన్ కావడం (ఇంటి సభ్యుల సహకారంతోనే) తప్పితే చెప్పుకోదగ్గ ఘనత శివాజీకి ఒక్కటీ లేదు. ఇక ఫినాలేకి కొన్ని రోజులు ఉందనగా హోస్ట్ నాగార్జునతోనే పిచ్చి వాదనకు దిగాడు. ఇలా బోలెడన్ని కారణాల దృష్ట్యా.. శివాజీని నిర్వహకులు విన్నర్ కాదు కదా కనీసం రన్నరప్ కూడా చేయలేదు. పొరపాటున శివాజీ గానీ విన్నర్ అయ్యింటే మాత్రం అంతకంటే విచిత్రం మరొకటి ఉండేది కాదు. ఓవరాల్‌గా చూసుకంటే.. షోలో పార్టిసిపేట్ చేయడం, రెమ్యునరేషన్ తీసుకోవడం అనే సంతృప్తి తప్పితే శివాజీకి ఇంకేం మిగల్లేదు! (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) -
Bigg Boss 7: ఈ సీజన్ విన్నర్ నేనే.. శివాజీ తలతిక్క కామెంట్స్!
బిగ్‌బాస్ 7 అయిపోయింది. రైతుబిడ్డ గెలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఇకపోతే గెలిచేస్తాడు, ట్రోఫీ కొట్టేస్తాడు, చాణక్య అని మాట్లాడుకున్న శివాజీ.. ఊహించని విధంగా మూడో స్థానానికి పరిమితమయ్యాడు. ఏదో హౌస్ట్ నాగార్జున, నిర్వహకులు పుణ్యమా అని ఏ మాత్రం ఆడకపోయినా సరే శివాజీ ఇక్కడ వరకు వచ్చాడు. లేకపోతే మనోడికి అంత సీన్ లేదు. ఇక షో అయిపోయిన తర్వాతైనా సరే తిన్నగా మాట్లాడకుండా తలతిక్క కామెంట్స్ చేస్తున్నాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం) బిగ్‌బాస్ షోలో పాల్గొన్న ప్రతి ఒక్కరూ.. ఎలిమినేట్ అయిపోయిన తర్వాత అదే ఛానల్లో ఇంటర్వ్యూ ఇస్తారు. అలా గీతూ రాయల్.. శివాజీని ఇంటర్వ్వూ చేసింది. షోలో అంటే గెలవాలి కాబట్టి వంద అబద్ధాలు చెప్పొచ్చు. కానీ ఇక్కడ కూడా శివాజీ అదే బాపతు సమాధానాలు ఇస్తూ సెల్ఫ్ డబ్బా కొట్టుకోవడం మాత్రం ఆపలేదు. టాప్-3 వరకు వస్తారని ఊహించారా? అని అడిగిదే.. 'ఈ సీజన్ విన్నర్ నేను, నాకు తెలుసు' అని తలతిక్క సమాధానం చెప్పాడు. టాప్-3వరకు వచ్చి, మీరు ఆగిపోవడానికి కారణం ఏమనుకుంటున్నారు? అని అడిగితే.. తిన్నగా సమాధానం చెప్పకుండా.. పల్లవి ప్రశాంత్, ఊరి నుంచి వచ్చాడు, అతడిపై మాటలు దాడి చేశారు, అడ్డుకున్నాను.. ఇలా అడిగిన ప్రశ్నకు ఆన్సర్ చెప్పకుండా ఏదేదో మాట్లాడాడు. యావర్, ప్రశాంత్ మీ వల్లే ఇంతదూరం వచ్చారని అనుకుంటున్నారా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'అవును, కాకపోతే వాళ్ల వెనకాల ఓ శక్తి ఉందని అందరికీ తెలియజేశాను' అని శివాజీ అన్నాడు. వీళ్లిద్దరి మైండ్‌లో లేని ఆలోచనలు పుట్టించారు కదా అని అడగ్గా.. నీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్పడానికి రాలేదని హౌస్ట్తోనే వాగ్వాదానికి దిగాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ ప్రశాంత్ విజయానికి అసలు కారణాలు ఇవేనా?) అమర్‌ని కావాలనే తొలిరోజు నుంచి టార్గెట్ చేసినట్లు అనిపించింది? దీనికి ఏమంటారు అని శివాజీని అడగ్గా.. మీకు మళ్లీ మళ్లీ చెప్పేదేంటంటే అమర్ గాడు, నేను వెరీగుడ్ ఫ్రెండ్స్ అని మొత్తం ప్లేట్ మార్చేశాడు. హౌసులో అమర్‌ని పేరుతో కాకుండా ఎన్ని రకాల పదాలతో శివాజీ పిలిచాడో ఈ సందర్భంగా గుర్తుచేసుకుంటే మీకు ఆన్సర్ తెలుస్తుంది. మీ బ్యాచ్‌లో ఫేవరిజం లేదా? అనే ప్రశ్నకు బదులిస్తూ.. 'మీరు ఎంత అనుకున్నా జనం చూస్తున్నారు' అని అదే పాత చింతకాయ పచ్చడి డైలాగ్స్ కొట్టాడు తప్పితే తిన్నగా ఆన్సర్ చెప్పలేకపోయాడు. శివాజీ అసలు బిగ్‌బాస్‌లోకి ఎందుకొచ్చాడు? అని అడగ్గా.. బిగ్‌బాస్ తెలుగు సీజన్లలో నా పేరు గుర్తుండాలి. దటీజ్ మై మార్క్ అని విచిత్రమైన సమాధానాలు చెప్పాడు. అయితే ఈ కామెంట్స్ అన్నీ కూడా ప్రోమోలో చెప్పినవి. ఇక పూర్తి ఇంటర్వ్యూలో ఎన్నెన్ని విచిత్ర విన్యాసాలు చేశాడో చూడాలి? (ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) -
Bigg Boss 7: రూ.10 లక్షల టెంప్టింగ్ ఆఫర్.. ఆ విషయంలో అర్జున్, ప్రియాంక సూపర్
మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ ఫినాలే అంటే హడావుడి ఎలా ఉండాలి. ఇంటి సభ్యులు గానీ ప్రేక్షకులు గానీ టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోవాలి. ఈ విషయంలో నిర్వహకులు పూర్తిగా చేతులెత్తేశారు. ఏం చేయాలో తెలీక ఏదేదో చేస్తూ ఫుల్ టైమ్ పాస్ చేస్తూ వచ్చారు. చివర్లో సూట్‌కేస్‌తో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేయాలనుకున్నారు గానీ ఇందులోనూ సక్సెస్ కాలేకపోయారు. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 104 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. టైమ్‌పాస్ పల్లీ బఠాణీ ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ ఉంది కాబట్టి నాగార్జున శనివారం రాలేదు. ఇంట్లో ఉన్న ఆరుగురితోనే టైమ్ పాస్ చేయించాలని ఫిక్సయిన బిగ్‌బాస్.. చిన్నపిల్లల ఆటలన్నీ పెట్టాడు. కళ్లకు గంతలు కట్టుకుని ఎవరు కొట్టారో చెప్పుకోండి చూద్దాం అనే తరహాలో ఓ గేమ్ పెట్టాడు. ఇందులో ఏమంత ఫన్ క్రియేట్ కాలేదు. దీని తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లలా యాక్ట్ చేసి చూపించాలని బిగ్‌బాస్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రైతుబిడ్డ ప్రశాంత్, అమర్‌లా యాక్ట్ చేసి చూపించిన అర్జున్.. అలానే కాఫీ ఇవ్వకపోతే బయటకెళ్లిపోతానంటూ శివాజీ చేసే హడావుడిని రీక్రియేట్ చేసిన ప్రియాంక.. ఫుల్ మార్కులు కొట్టేశారు. మిగతా నలుగురికి ఛాన్స్ రాలేదో, మరి వాళ్లు చేయలేదో తెలియలేదు. శ్రీముఖి ఎంటర్టైనర్ ఇక త్వరలో ప్రారంభమయ్యే 'సూపర్ సింగర్' కొత్త సీజన్ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. 'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడిపించింది. ఈ ఆటలో భాగంగా శివాజీని శ్రీముఖి ఓ ప్రశ్న అడగ్గా.. బయటకెళ్లిన తర్వాత నయని పావనితో బాండింగ్ పెంచుకుంటానని శివాజీ అన్నాడు. రతిక.. ఓసారి ఎలిమినేట్ అయి, హౌసులోకి తిరిగొచ్చినా సరే ఇంకా మెచ్యూరిటీ లెవల్స్ రాలేదని శివాజీ చెప్పాడు. అలానే మరో ప్రశ్నకు బదులిచ్చిన యావర్.. అశ్వినిని పెళ్లి చేసుకుంటా, రతికతో డేట్‌కి వెళ్తా, శుభశ్రీని కిల్ చేస్తానని నవ్వుతూ చెప్పాడు. సూట్‌కేస్ గమ్ ప్రతి సీజన్లో ఉన్నట్లే ఫినాలేకి ఓ రోజు ముందు హౌసులోకి బిగ్‌బాస్ డబ్బుల సూట్‌కేస్ పంపించాడు. రూ.3 లక్షల మొత్తంతో వేలం పాట మొదలుపెట్టాడు. ఎవరు తీసుకుంటారంటూ ఒకరి తర్వాత మరొకరికి ఆఫర్ ఇచ్చాడు. రూ.3 లక్షల దగ్గర మొదలైన ఈ ఆఫర్.. వరసగా రూ.5 లక్షలు, రూ.8 లక్షలు, రూ.10 లక్షల వరకు వెళ్లింది. కానీ ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ మొత్తం మంచి టెంప్టింగ్గా ఉన్నప్పటికీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే ఈ వేలంపాట జరుగుతున్నప్పుడు మధ్యలో శివాజీ.. అర్జున్, అమర్‌తో చిన్న పిచ్చి డిస్కషన్ పెట్టాడు. ఎంత కావాలి? ఎంత కావాలి? అని అన్నాడు. తనకు రూ.40 లక్షలిస్తే పోతానని అర్జున్.. రూ.45 లక్షలైతే వెళ్లిపోతానని అమర్ అన్నాడు. ఇక చివరగా ప్రియాంకకు ఇంటి నుంచి ఫుడ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆదివారం ఫినాలే ఎపిసోడ్ సాయంత్రం 6 లేదా 7 గంటలకు మొదలయ్యే ఛాన్స్ ఉంది. -
Bigg Boss 7: శివాజీ అతి బద్ధకం.. అమర్‌కి సర్ప్రైజ్ ఇచ్చిన రైతుబిడ్డ
బిగ్‌బాస్ 7 పూర్తయిపోవడానికి ఇంకొన్ని గంటలే ఉంది. మొన్నటివరకు జర్నీ వీడియోలతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసిన నిర్వహకులు.. ఇప్పుడు ఏం చేయాలో తెలీక టైమ్ పాస్ చేస్తున్నారు. అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. శివాజీ మాత్రం అతి బద్ధకంతో చిరాకు తెప్పిస్తున్నాడు. రైతుబిడ్డ అమర్‌కి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 103 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ అలాంటి భాష ఆరుగురు ఇంటిసభ్యులు నిద్రలేవడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే అమర్.. మిగిలిన ఐదుగురి జాతకం చెప్పాలని చెప్పి ఓ టాస్క్ ఇచ్చాడు. ఉన్నంతలో మనోడు బాగానే ఎంటర్టైన్ చేయాలని చూశాడు. కానీ మధ్యలో శివాజీ దూరి.. వెధవ-వెధవ అనే పదేపదే అడ్డుతగిలి చిరాకు తెప్పించాడు. టాస్క్ సరిగా పూర్తి చేయనీకుండా తలనొప్పి తీసుకొచ్చాడు. ఇక ఉన్న ఆరుగురూ మరీ బద్ధకంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయిన బిగ్‌బాస్.. విన్నర్‌గా నిలిచేవారు చివరివరకు వచ్చి ఆగిపోరు అని అలెర్ట్‌గా ఉండాలని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?) యావర్ సేఫ్ గేమ్ ఇక గురువారం ఎపిసోడ్లో భాగంగా అర్జున్, శివాజీ, అమర్.. ఇంట్లో వాళ్లు పంపిన ఫుడ్‌ని ఆస్వాదించారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రియాంక, ప్రశాంత్, యావర్ కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. అయితే వీళ్లకి ఫుడ్ దక్కుతుందా లేదా అనేది అర్జున్, అమర్, శివాజీ చేతుల్లో ఉంటుందని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్ల ముగ్గురికి గేమ్స్ పెట్టి, అందులో గెలిచిన వాళ్లు ఫుడ్ ఎవరికి రావాలో డిసైడ్ చేస్తారని బిగ్‌బాస్ చెప్పాడు. తొలి గేమ్‌లో గెలిచిన అమర్.. యావర్ పేరు చెప్పాడు. అయితే ఇంటి ఫుడ్ మరో సభ్యుడితో పంచుకోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా.. ఎవరి పేరు చెప్పినా మరొకరు ఫీల్ అవుతారని నాకు ఫుడ్ వద్దని చెప్పేశాడు. శివాజీ బద్ధకం ఇక కప్పులు బ్యాలెన్స్ చేసే రెండో గేమ్‌లో అర్జున్ గెలిచాడు. ప్రశాంత్ పేరు చెప్పాడు. అయితే ప్రశాంత్ నువ్వు ఎవరితో ఫుడ్ పంచుకుంటావ్? అని బిగ్‌బాస్ అడగ్గా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఈ రోజు అమర్ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంత్ ఇతడి పేరు చెప్పాడు. వీళ్లిద్దరూ ప్రశాంత్ అమ్మ చేసి పంపిన మటన్ కర్రీ, బగారా రైస్ తిన్నారు. ఇకపోతే రెండు గేమ్స్‌లోనూ శివాజీ మరీ బద్ధకం ఆడి.. ఒక్క గేమ్‌లోనూ గెలవలేకపోయాడు. ఇలాంటోడిని గనుక బిగ్‌బాస్ పొరపాటున విజేతని చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు! మరోవైపు తనదగ్గరున్న పాయింట్స్ ఉపయోగించుకున్న అమర్.. తన భార్య తేజస్వితో బిగ్‌బాస్ హౌస్ నుంచి లైవ్ వీడియో కాల్ మాట్లాడాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన ప్రభాస్..) -
శివాజీకి కూతురు ఉంది.. బయటపెట్టిన సమీర్
శివాజీ.. ఒకప్పుడు మంచి నటుడు.. కానీ రాజకీయాల్లోకి అడుగుపెట్టి మురికిపట్టిపోయాడు. స్వార్థపరులకు, అవకాశవాదులవైపు నిలబడి అందరితో ఛీ కొట్టించుకున్నాడు. ఫలితంగా జనాల్లో ఆదరణ తగ్గిపోయింది. అవకాశాలు దూరమయ్యాయి. ఇంట్లో ఖాళీగా ఉంటున్న సమయంలో బిగ్‌బాస్ ఛాన్స్ రావడంతో ఓకే చెప్పాడు. అలా బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్నాడు. ఎప్పుడూ నిజాలే మాట్లాడతాను, అబద్ధం చెప్పను.. అసలు అబద్ధం అంటే ఎలా ఉంటుందో తెలీదన్నట్లుగా పోజు కొడుతుంటాడు శివాజీ. పీక మీద కాలేసి తొక్కుతా.. చెప్పేవి శ్రీరంగ నీతులు.. చేసేది చిల్లర పనులు అన్నట్లుగా ఈయన చెప్పేది ఒకటుంటుంది.. వాస్తవం మరొకటి ఉంటుంది. ఈ మధ్య అతడు షోలో ఆడవాళ్ల గురించి పిచ్చి కూతలు కూశాడు. శోభ కోపంతో అరిచినందుకుగానూ.. అలాంటి అమ్మాయిలు మా ఇంట్లో ఉంటే పీక మీద కాలేసి తొక్కేవాడిని.. రెండు పీకేవాడిని.. అంటూ నోటికొచ్చింది వాగాడు శివాజీ. అలా అపడం తప్పని నాగార్జున చెప్పినా వినిపించుకోలేదు. మీ ఇంట్లో ఆడపిల్ల ఉంటే పీక మీద కాలేసి తొక్కుతావా? అని నాగ్ నిలదీస్తే.. అవును.. ఇలాగే ప్రవర్తిస్తా.. రెండు పీకుతా అని దురుసుగా సమాధానమిచ్చాడు. ఎవరికీ తెలియని విషయం చెప్పిన సమీర్ ఆఖరికి ఆడియన్స్ కూడా అలా కాలేసి తొక్కుతాననడం నచ్చలేదని చెప్తున్నా.. తనను తాను సమర్థించుకున్నాడే తప్ప తప్పును అంగీకరించడానికి ఇష్టపడలేదు. హౌస్‌లో ఉన్న ప్రియాంక, శోభను కూడా ఎప్పుడూ చులకన చేసి మాట్లాడుతూ ఆడవారి పట్ల తనకెంత చులకన భావం ఉందనే విషయాన్ని బయటపెడుతూనే వచ్చాడు. ఈ నేపథ్యంలో బిగ్‌బాస్ మాజీ కంటెస్టెంట్, నటుడు సమీర్.. శివాజీ గురించి ఓ షాకింగ్ విషయాన్ని బయటపెట్టాడు. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు ఉందని చెప్పాడు. శివాజీకి కూతురు ఉందా? ఈ విషయం తెలిసి నెటిజన్లు అవాక్కవుతున్నారు. ఎందుకంటే శివాజీ.. ఇప్పటివరకు తనకు ఇద్దరు కొడుకులు మాత్రమే సంతానం అని చెప్పుకుంటూ వచ్చాడు. ఎక్కడా తనకు కూతురు ఉన్నట్లు ప్రస్తావించలేదు. బిగ్‌బాస్ షోలోనూ పెద్ద కొడుకు ఫ్యామిలీ వీక్‌లో హౌస్‌లోకి వెళ్లాడు. అలాగే సండే ఎపిసోడ్లో శివాజీ భార్యతో పాటు చిన్న కొడుకు స్టేజీపై కనిపించారు. కానీ కూతురు ప్రస్తావన, ఉనికి మాత్రం ఎక్కడా లేదు. నెటిజన్ల డౌటానుమానాలు అయితే ఇన్నాళ్లూ శివాజీ గుట్టుగా దాచిన తన కూతురి విషయాన్ని బయటపెట్టాడు సమీర్. ఓ ఇంటర్వ్యూలో సమీర్ మాట్లాడుతూ.. శివాజీకి ఓ కూతురు ఉందన్నాడు. దీంతో యాంకర్.. శివాజీకి ఇద్దరు కొడుకులతో పాటు ఓ కూతురు ఉందా? అని తిరిగి ప్రశ్నించగా.. అవును, అతడికి ఓ కూతురు కూడా ఉందని నొక్కి చెప్పాడు. మరి శివాజీ ఆ విషయాన్ని ఎందుకు బయటపెట్టలేదు? తన కూతురి గురించి ఇంతవరకు ఎక్కడా ఒక్క మాట కూడా ఎందుకు మాట్లాడలేదు? అని నెటిజన్లు రకరకాలుగా అనుమానిస్తున్నారు. చదవండి: Adhik Ravichandran Marriage Photos: ప్రముఖ డైరెక్టర్‌తో ప్రభు కూతురి రెండో పెళ్లి.. విశాల్ స్వీట్ వార్నింగ్.. -
ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ
బిగ్‌బాస్ 7 ఫినాలే దగ్గరపడుతోంది. ఇప్పుడు కూడా హౌస్మేట్స్.. వారిలో వారే కొట్టుకోకుండా కాస్త కలిసిమెలిసి ఉండేందుకు సరదా టాస్కులిచ్చాడు బిగ్‌బాస్. ఒకరి కోసం మరొకరు ఆడాలంటూ వారి మధ్య బంధాన్ని బలపర్చేందుకు ప్రయత్నించాడు. మరి ఎవరు ఎవరికోసం ఆడారు? ఏలియన్స్ ఇంట్లో ఎందుకు దూరాయి? ఈ విషయాలన్నీ తాజా ఎపిసోడ్ (డిసెంబర్ 14) హైలైట్స్‌లో చూసేద్దాం.. మీ ఇంటి వంట.. ఈ వారం నామినేషన్ల గోల లేదు, పెద్దగా టాస్కులు కూడా లేకపోవడంతో హౌస్మేట్స్ విశ్రాంతి తీసుకుంటున్నారు. బద్ధకస్తులుగా మారిపోయిన కంటెస్టెంట్లను హుషారెత్తించేందుకు బిగ్‌బాస్ మరోసారి హాచీ ఏలియన్స్‌ను రంగంలోకి దింపాడు. ఈ హాచీ.. కంటెస్టెంట్ల కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందని, తమను సంతోషపరిస్తేనే ఆ ఆహారం ఇస్తామని చెప్పింది. అయితే మీ ఫుడ్ కోసం తోటి ఇంటిసభ్యులు ఆ ఆహారాన్ని సంపాదించాల్సి ఉంటుందని మెలిక పెట్టింది. శివాజీ కోసం ఆడి గెలిచిన ప్రియాంక మొదటగా అర్జున్ ఇంటి నుంచి రాగిముద్ద-మటన్ కూర వచ్చింది. ఈ ఫుడ్ కోసం యావర్ షేక్ బాల్ షేక్ గేమ్ ఆడి గెలిచాడు. తనకోసం ఆడి గెలిచిన యావర్‌కు తన చేతితో ఇంటి ఫుడ్‌ను తినిపించాడు అర్జున్. శివాజీ కోసం ఇంటి నుంచి చికెన్ కర్రీ వచ్చింది. దీనికోసం ప్రియాంక బ్యాలెన్స్ ది బాల్స్ గేమ్ ఆడి గెలిచి చికెన్ కూర శివాజీకి దక్కేలా చేసింది. ఆ తర్వాత అమర్‌దీప్‌కు రొయ్యల బిర్యానీ వచ్చింది. దీని కోసం శివాజీ బెలూన్ల టాస్క్ ఆడి గెలవడంతో అమర్ రొయ్యల బిర్యానీని ఇతరులతో షేర్ చేసుకుంటూ కడుపునిండా ఆరగించాడు. గంట ఎపిసోడ్లో ఎవరెంత కనిపిస్తారు? తర్వాత కొందరు గ్రహాంతరవాసుల్లాగా మాస్కులు పెట్టుకుని ఇంట్లోకి వచ్చి అందరినీ ఓ ఆటాడుకుని వెళ్లిపోయారు. అనంతరం బిగ్‌బాస్.. మీ 14 వారాల జర్నీలో మీ ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా 60 నిమిషాల ఎపిసోడ్లో మీరు ఎంతసేపు కనిపించడానికి అర్హులో చెప్పాలంటూ కొన్ని బోర్డులు ఇచ్చాడు. ముందుగా అర్జున్.. 10 నిమిషాల బోర్డు తన మెడలో వేసుకున్నాడు. ఫౌల్స్ ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, తిట్లు తింటూ అమర్ 20 నిమిషాలు కనబడతాడని అనుకుంటున్నట్లు చెప్పాడు. శివాజీకి 15, ప్రియాంకకు 7, ప్రిన్స్ యావర్‌కు 5, ప్రశాంత్‌కు 3 నిమిషాల బోర్డులు ఇచ్చాడు. అమర్‌ను చులకనగా చూస్తున్న శివాజీ శివాజీ.. ఎవరికీ తక్కువ నిమిషాల బోర్డు ఇవ్వబుద్ధి కావట్లేదంటూనే అమర్ మెడలో 3 నిమిషాల బోర్డు వేసి క్లాస్ పీకాడు. నువ్వు ఈ 2 వారాలే ఆడావు.. అంతకుముందు ఏమీ ఆడలేదంటూ మరోసారి తనను టార్గెట్ చేశాడు. కొన్నిసార్లు నువ్వు నెగెటివ్ కంటెంట్ కోసం ప్రయత్నించావు, అసలు గేమ్ ఆడలేదు అని అన్నాడు. 3 నిమిషాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, నేను గేమ్ ఆడానన్నా.. అని అమర్ డిఫెండ్ చేసుకుంటుంటే.. నేను 5 వేసుకున్నప్పుడు నీకు 3 నిమిషాలు వేస్తే రోగమా? అని తిట్టాడు శివాజీ. అంతేకాదు.. అర్జున్‌కు 7 ఇచ్చి అమర్ కంటే నువ్వు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలవన్నాడు. ముష్టి బ్యాచ్ ప్రియాంకకు 10 ఇచ్చి మిగిలిన 15, 20 నిమిషాల బోర్డులు ప్రిన్స్, ప్రశాంత్ చేతిలో పెట్టి ఇద్దరూ తమకు నచ్చినవి వేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. తర్వాత అందరూ ఈ బోర్డుల ప్రక్రియను ఒకరి తర్వాత ఒకరు పూర్తి చేశారు. కాగా ఫినాలే దగ్గరపడుతున్నప్పటికీ టైం దొరికినప్పుడల్లా అమర్ మీద విషం కక్కుతూనే ఉన్నాడు శివాజీ. వేస్ట్ ఫెలో, దొంగ, వెధవ, పనికిమాలినోడు, పిచ్చి పోహా.. ఇలా ఎన్నో మాటలన్నాడు. తాజా ఎపిసోడ్‌లోనూ స్పా(శోభ, ప్రియాంక, అమర్) బ్యాచ్‌ను ఉద్దేశిస్తూ ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. అంటూ తన స్పై బ్యాచ్ దగ్గర చులకనగా మాట్లాడాడు. వాళ్ల ముందేమో పద్ధతిగా, పెద్దాయనలా ప్రవర్తిస్తూ పక్కకు రాగానే ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ మరోసారి తన వంకరబుద్ధి బయటపెట్టుకున్నాడు శివాజీ. చదవండి: నటుడు కన్నుమూత.. గురువు మరణం కలిచివేసిందంటూ భారతీరాజా పోస్ట్.. -
Bigg Boss 7: శివాజీ బయటపడలేదు.. ప్రియాంక మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయింది!
బిగ్‌బాస్ మరోసారి ఏడిపించేశాడు. అవును ప్రియాంక, తనని తాను కంట్రోల్ చేసుకోలేనంతగా ఎమోషనల్ చేశాడు. అయితే శివాజీ మాత్రం పెద్దగా బయటపడలేదు. మరోవైపు ఓ గొడవ వల్ల విడిపోయిన అర్జున్-యావర్ మళ్లీ ఒక్కటయ్యారు. ఈ క్రమంలోనే యావర్ బోరున ఏడ్చేయడం కంటతడి పెట్టించింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 100 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీకి ఓ రేంజు ఎలివేషన్ సోమవారం ఎపిసోడ్లో జర్నీ వీడియోలతో అమర్, అర్జున్‌ని ఎమోషనల్ చేసిన బిగ్‌బాస్.. మంగళవారం ఎపిసోడ్‌ని శివాజీతో స్టార్ట్ చేశాడు. ఇతడి బిగ్‌బాస్ జ్ఞాపకాల్ని.. 'బుక్ ఆఫ్ మెమొరీస్'లో పొందుపరిచి శివాజీని సర్ప్రైజ్ చేశాడు. అనంతరం దాదాపు 17 నిమిషాల వీడియోని ప్లే చేసి మరీ శివాజీకి ఓ రేంజు ఎలివేషన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఈ క్రమంలోనే శివాజీ.. 25 ఏళ్ల ఇండస్ట్రీ కెరీర్ ఓ ఎత్తు.. బిగ్‌బాస్ జర్నీ ఓ ఎత్తు.. ఇక్కడి నుంచి ఎంతో కొంత నేర్చుకుని వెళ్తాం. అదైతే సత్యం బిగ్‌బాస్.. కప్పు గెలుస్తామా? లేదా అనేది పక్కనబెడితే.. చివరివారం వరకు వచ్చిన ఆరుగురు మాత్రం ప్రేక్షకుల హృదయాల్ని గెలిచారని తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: 'కాంతార' సినిమాలో ఛాన్స్ కోసం స్టార్ హీరోయిన్ తిప్పలు!) ప్రియాంక గట్టిపిల్ల శివాజీ తర్వాత ప్రియాంకని పిలిచిన బిగ్‌బాస్.. ఈమెకి సంబంధించిన ఫొటోలని డిస్ప్లే చేశారు. అయితే మిగతా ఫొటోల సంగతేమో గానీ తన బాయ్‌ఫ్రెండ్ శివతో ఉన్న పిక్ చూసిన తర్వాత తనని తాను కంట్రోల్ చేసుకోలేకపోయింది. ఇక ప్రియాంక గురించి ఎలివేషన్స్ ఇచ్చిన బిగ్‌బాస్.. సింపుల్ ప్రియాంకగా ఉండే మీరు.. శివంగి ప్రియాంకగా నామినేషన్స్‌లో మీరు ఎంత బలమైన కంటెస్టెంట్ అనేది మీరు ఎలాంటివారో తెలిసింది. పొట్టి పిల్ల కాదు గట్టిపిల్ల.. మీరు 100 శాతం ఇస్తూ వచ్చారు. మీ పట్టుదలే మిమ్మల్ని జీవితంలో మొదటి స్థానంలో నిలుపుతుందని కోరుకుంటూ మీ ప్రయాణం చూద్దాం అని దాదాపు 15 నిమిషాల వీడియోని ప్లే చేశాడు. అయితే ఈ వీడియో చూస్తున్నంతసేపు కూడా ప్రియాంక ఎమోషనల్ అవుతూ, ఆనంద బాష్పలతో కనిపించింది. మరోవైపు గతంలో ఓసారి నామినేషన్స్ సందర్భంగా ఇక యావర్‌తో మాట్లాడనని చెప్పిన అర్జున్.. తన జర్నీ వీడియోలో ఇద్దరం కలిసున్న సీన్స్ భలే ఉన్నాయని చెప్పాడు. దీంతో యావర్, అర్జున్‌ని హగ్ చేసుకుని గట్టిగా ఏడ్చేశాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. ఈరోజు ఎపిసోడ్ గురించి మీకు రాసి చెబితే ఆ ఫీల్ క్యారీ చేయలేం. కాబట్టి కుదిరితే ఫుల్ వీడియో చూడండి. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) -
బిగ్‌బాస్ 7: ఎలిమినేషన్ రౌండ్.. శివాజీ వర్సెస్ శోభా! చివరకు..
శోభా శెట్టి.. అన్నీ తన సొంతం కావాలనుకుంటుంది. ఏ టాస్క్ అయినా తనే గెలిచేయాలనుకుంటుంది. అందరూ తనకే సపోర్ట్ ఇవ్వాలనుకుంటుంది. పొరపాటున తనను కాదని పక్కవాళ్లకు మద్దతు ఇచ్చారంటే ఇక అంతే సంగతులు.. ఫినాలే దగ్గరపడుతున్నా తన పంతం మార్చుకోలేదు శోభ. చెప్పాలంటే ఈ వారం ఇంకా మొండిగా వ్యవహరించింది. స్నేహితులను కూడా విడిచిపెట్టలేదు. అటు స్పై బ్యాచ్తోనూ ఇటు తన ఫ్రెండ్స్‌తోనూ గొడవపడింది. ఊహించిందే నిజమైంది ఓపక్క తనకు ఓట్లు పడుతున్నాయి, తాను వీక్ కాదంటూనే.. మరోపక్క ఈవారం వెళ్లిపోయేది తానేనంటూ రెండు మాటలు మాట్లాడింది. అటు ప్రేక్షకులు సైతం ఈ వారం ఇంటి నుంచి శోభాను బయటకు పంపించేయాలని డిసైడ్ అయ్యారు. చివరకు అందరి అంచనా నిజమైంది.. శోభా ఎలిమినేట్ అయింది. ఫినాలేకు అడుగు దూరంలోనే ఆమె బిగ్‌బాస్ జర్నీ ఆగిపోయింది. అయితే ఈసారి నామినేషన్లో ఉన్నవారిని సేవ్ చేసుకుంటూ రాలేదు నాగ్. ఫినాలే వీక్‌లో అడుగుపెట్టిన కంటెస్టెంట్లు వీళ్లే అంటూ ఒక్కొక్కరి పేర్లు ప్రకటించాడు. అలా ప్రియాంక, ప్రశాంత్, అమర్, యావర్ ఫినాలేలో అడుగుపెట్టారు. చివరి రౌండ్లో ఇద్దరు అర్జున్ ఎలాగో ఫినాలే అస్త్ర గెలవడంతో ఈ వారం నామినేషన్లోనే లేడు. ఇక ఎలిమినేషన్ ప్రక్రియ మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్లయిన శివాజీ, శోభ మధ్యే జరిగినట్లు తెలుస్తోంది. శివాజీ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నా తన సింపతీ గేమ్ వల్ల ఓట్లు పడుతున్నాయి. దీంతో అతడు ఎలిమినేట్ అయ్యే ఛాన్సే లేదు. ఇక శోభా శెట్టి సైకోలా మారిపోయి తన గేమ్ తానే చెడగొట్టుకుంది. దీంతో తాను తవ్వుకున్న గోతిలో తనే పడింది, ఈవారం ఎలిమినేట్ అయింది. మరి ఎలిమినేషన్ తర్వాత శోభా రియాక్షన్ ఎలా ఉంటుందో తెలియాలంటే నేటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: శివాజీ బ్యాచ్‌ని ఉతికారేసిన నాగార్జున.. ఆ విషయమే కారణమా? -
Bigg Boss 7: ప్రశాంత్ మోసాన్ని బయటపెట్టిన నాగ్.. శివాజీ వరస్ట్ బిహేవియర్!
బిగ్‌బాస్ 7లో శివాజీ ఓ చెదపురుగు. పురుగు వల్ల చెక్క అంతా డ్యామేజ్ అయినట్లు.. సోఫాజీ అలియాస్ శివాజీ వల్ల ఈ సీజన్ తీరే దెబ్బతినేసింది. దీన్ని బాగుచేయడం నాగ్ వల్ల కూడా కాదు. అయినా సరే పెద్దాయన ముసుగు వేసుకున్న ఈయన ఇప్పటికీ తీరు మార్చుకోవడం లేదు. స్వయంగా నాగార్జున.. నువ్వు చేసింది తప్పురా బాబు అని చెబుతున్నాసరే ఒప్పుకోలేదు. శివాజీ ఒక్కడికే కాదు ఇతడి బ్యాచ్ మొత్తానికి గట్టిగా పడ్డాయి. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 97 ఎపిసోడ్ హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. అర్జున్-ప్రియాంక ఫర్ఫెక్ట్ ప్లేయర్స్ వీకెండ్ కాబట్టి వచ్చేసిన నాగార్జున.. శుక్రవారం సంగతులన్నీ చూశాడు. అలా శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇక ఈసారి ఏడుగురు ఇంటి సభ్యుల తప్పుల్ని బయటపెట్టడమే నాగ్ పనిగా పెట్టుకున్నాడు. అయితే ప్రియాంక, అర్జున్ మాత్రం సేవ్ అయ్యాడు. ఫినాలే వీక్కి చేరుకున్నా సరే ఈ వారమంతా గేమ్స్ ఆడి, ఒక్కటంటే ఒక్క తప్పు చేయని అర్జున్.. జస్ట్ ఒకే ఒక్క ఫౌల్ చేసిన ప్రియాంకని నాగ్ మెచ్చుకున్నాడు. దీనిబట్టి చూస్తే ప్రియాంక కూడా ఫినాలే వీక్కి ఆల్మోస్ట్ చేరిపోయినట్లే ఓ క్లారిటీ వచ్చేసింది. (ఇదీ చదవండి: మెగాహీరో రామ్ చరణ్‌కు మరో గ్లోబల్ అవార్డ్) శోభాకి స్మూత్‌గా కౌంటర్స్ ఫస్ట్ ఫస్ట్ శోభా ఫేస్ ఉన్న మార్బెల్ పగలగొట్టిన నాగ్, ఆమెని కన్ఫెషన్ రూంలోకి పిలిచాడు. అలా ఆమెతో పర్సనల్‌గా మాట్లాడాడు. అయితే వెళ్తున్నప్పుడే ఆమె భయపడుతూ వెళ్లింది. దీన్ని పాయింట్ ఔట్ చేసిన నాగ్.. ఎందుకు భయపడుతున్నావ్ అని అడిగాడు. అసలేమైంది? శివాజీతో గొడవ ఎందుకు? అని నాగ్ అడగ్గా.. 'తెలుగమ్మాయిలు కాదు, ఫేవరిజం అని శివాజీ పదేపదే అంటున్నారు. కొన్నికొన్నిసార్లు ప్రియాంక, నాతో వ్యంగ్యంగా మాట్లాడుతున్నారు. అలానే ప్రతిసారి గ్రూపిజం, గ్రూపిజం అని అంటున్నారు. దీని గురించి మాట్లాడుదామని అనుకున్నాను కానీ కుదర్లేదు' అని శివాజీతో వాదనపై శోభా దగ్గర క్లారిటీ తీసుకున్నాడు. అయితే నువ్వు అందరినీ డిస్ట్రబ్ చేస్తున్నావ్, ఇంకా చెప్పాలంటే రెచ్చగొడుతున్నావ్ అని నాగ్, శోభాపై సీరియస్ అయ్యాడు. హౌస్ వాతావరణం కూడా నీ వల్ల కలుషితం అయిపోయిందని అన్నాడు. దీంతో శోభా ఏడ్చేసింది. దీంతో నాగ్ రూట్ మార్చాడు. ఆడపిల్ల ఏడిస్తే షోకి మళ్లీ బ్యాడ్ నేమ్ రావొచ్చని.. ఏమైంది శోభా చెప్పు? అని చాలా స్మూత్ గా అడిగాడు. అయితే వెళ్లిపోతానేమోనని భయమేస్తుంది సర్, అందుకే అలా అని నాగ్ ప్రశ్నలకు శోభా ఆన్సర్ చెప్పుకొచ్చింది. యావర్ అస్సలు మారడు శోభా తర్వాత యావర్ ని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. శోభాని 'చీ..థూ' అని అనడంపై సీరియస్ అయ్యాడు. ఆ ప్రవర్తన బాగుందా? వరస్డ్ బిహేవియర్ అని అన్నాడు. మధ్యలో యావర్.. తనది తప్పు కాదని సమర్థించుకోవడానికి తెగ ప్రయత్నించాడు. దీంతో నాగ్ సీరియస్ అయ్యాడు. నిన్ను చూసిన మాకు ఏమనిపించిందంటే.. ఇది యావర్ నిజస్వరూపం, ఇప్పుడు బయటకొచ్చింది అని నాగ్.. యావర్ గురించి స్మూత్‌గా నిజాలు చెప్పేశాడు. నీది తప్పు, బయటకెళ్లి శోభాకి మనస్పూర్తిగా సారీ చెప్పు అని వార్నింగ్ ఇచ్చాడు. ఆ గొడవలో శోభాది కూడా తప్పు ఉందని యావర్, మళ్లీ మళ్లీ అదే పాట పాడేసరికి.. ఇక నీకు చెప్పలేను, దండంరా బాబు అని నాగ్ తన విసుగు చూపించాడు. (ఇదీ చదవండి: సెన్సార్ పూర్తి చేసుకున్న సలార్.. పిల్లలకు థియేటర్లలోకి నో ఎంట్రీ!) రైతుబిడ్డ మస్త్ యాక్టింగ్ రైతుబిడ్డని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగ్.. అతడి నిజస్వరూపాన్ని, ఆస్కార్ లెవల్ యాక్టింగ్ బయటపెట్టాడు. చెప్పు ప్రశాంత్.. నీకు ఏ వీడియోలు చూపించాలి అని నాగ్ వంగిమరీ దండం పెడుతూ సెటైరికల్‌గా మాట్లాడాడు. ఎందుకు ప్రశాంత్ నీకు అందరి మీద అపనమ్మకం ఉంది? నువ్వు అడిగిన ప్రతి వీడియో చూపించడానికి ఉన్నాడా బిగ్ బాస్? అని నాగ్ ఫుల్ సీరియస్ అయ్యాడు. నాగ్ విషయం చెప్పడానికి ట్రై చేస్తుంటే.. అతడిని కూడా ఏమార్చడానికి ప్రయత్నించాడు. దీంతో నాగ్.. చెప్పింది వినరా బాబు అని సైలెంట్ చేశాడు. ఇక అమర్ కొరికేశాడని ప్రశాంత్ సీన్ చేసిన విషయంపై ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఫస్ట్ ఏమో బ్లడ్ వచ్చిందని రైతుబిడ్డ అన్నాడు. అయితే డాక్టర్‌తో ఇప్పుడే మాట్లాడానని చెప్పిన నాగ్.. నో టూత్ మార్క్, నో బ్లడ్ అని అసలు విషయం చెప్పాడు. అదికాదు సర్ చేయి ఉబ్బిపోయిందని రైతుబిడ్డ మాట మార్చేశాడు. మధ్యలో అర్జున్ కూడా పిలిచిన నాగ్.. ప్రశాంత్‌ని అమర్ కొరకలేదని, జస్ట్ పట్టి వదిలేశాడని చెప్పాడు. జరిగిన దానికి, నువ్వు అక్కడ చేసినదానికి ఎంత సీన్ చేశావ్ తెలుసా? అని నాగ్ ప్రశాంత్‌పై ఓ రేంజులో రెచ్చిపోయాడు. మిగతా విషయాల్లో ఎంతో నొప్పి భరించావ్ కానీ అమర్ దగ్గరకొచ్చేసరికి తప్పు ఎక్కడ చేస్తాడా అని ఎదురుచూస్తున్నావ్.. అమర్ విషయంలో పెట్టిన శ్రద్ధ ఆట విషయంలో పెట్టుంటే బాగుండేదని నాగ్ అన్నాడు. అలానే ఈ హౌసులో నువ్వు శివాజీ సేవకుడివా? గులంవా? అని నాగ్ సీరియస్ అయ్యాడు. నాగ్ చెబుతుంటే ప్రశాంత్ అడ్డు తగిలాడు. ప్రశాంత్ నువ్వు చేసిందే తప్పు, అటుఇటు తీసుకెళ్లకు అని నాగ్ కౌంటర్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: తెగించేసిన శోభాశెట్టి.. ఆ నిజాలన్నీ ఒప్పేసుకుంది కానీ!) శివాజీ ఓ వరస్డ్ కేండిడేట్ శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన నాగార్జున.. ఇన్నివారాలు సపోర్ట్ చేసినట్లు కాకుండా సీరియస్ అయ్యాడు. ఇప్పటికీ మాట్లాడకపోతే షోని ప్రేక్షకులు చూడటం మానేస్తారని తెలుసు. అందుకే నాగ్ ఈసారి తెచ్చిపెట్టుకుని మరీ శివాజీపై సీరియస్ అయ్యాడు. ఆడపిల్లలని పీకుతా అని శివాజీ అన్న కామెంట్‌పై నాగ్.. వివరణ అడిగాడు. ప్రశాంత్‌ని గత రెండు వారాల నుంచి టార్చర్ చేస్తున్నారని, అందుకే ఆ ముగ్గురిపై(శోభా-అమర్-ప్రియాంక) సీరియస్ అయ్యానని అన్నాడు. నువ్వు చేసింది తప్పు శివాజీ అని నాగ్ బల్లగుద్ది చెబుతున్నాసరే.. తనని తాను చాలా సమర్థించుకున్నాడు. ప్రేక్షకుల్లోని అమ్మాయి తన బాధ చెబుతున్నా సరే.. ఆమెతో కూడా వాదించాడు తప్పితే తాను చేసింది తప్పని శివాజీ ఒప్పుకోలేదు. ఆడపిల్ల తప్పు చేస్తే గొంత మీద కాలేసి తొక్కుతా అని శివాజీ కామెంట్ చేసి మరో వీడియోని నాగ్ చూపించాడు. అయితే అది కోపం, ఫ్రస్టేషన్ వల్ల వచ్చింది బాబుగారు అని శివాజీ నంగనాచి కబుర్లు చెప్పాడు. ఫ్లోలో వచ్చిన మాట తప్పితే.. వాంటెడ్ గా అన్న మాట కాదు అని శివాజీ ఓ పనికిమాలిన రీజన్ చెప్పాడు. దీనిబట్టి శివాజీ.. ఎంత వరస్ట్ కంటెస్టెంట్ అనేది అర్థమైపోయింది. అమర్‌కి గట్టిగా పడ్డాయ్ ఈ వారం నిజంగా పిచ్చిపట్టిన వాడిలా ప్రవర్తించిన అమర్‌ని కూడా నాగ్ ఓ రేంజులో ఆడేసుకున్నాడు. ఏమైంది అమర్, నీకు పిచ్చెక్కిందా? కెప్టెన్ గా ఏంటా బిహేవియర్? అని.. ప్రశాంత్ ని తోసుకుంటూ మెడికల్ రూంలోకి తీసుకువెళ్లడంపై నాగ్ సీరియస్ అయ్యాడు. యావర్, ప్రశాంత్ మీదనే ఎందుకలా చేస్తున్నావ్ అని సీరియస్ అయ్యాడు. ఈ మొత్తం వ్యవహారంలో చపాతీలు కలపడం అనే ఓ చిన్న విషయాన్ని నాగ్ తీసుకొచ్చాడు. ఇంత సీరియస్ డిస్కషన్లో నాగ్ దీని గురించి ఎందుకు మాట్లాడాడు అనేది అస్సలు అర్థం కాలేదు. అలానే నిజంగా 'పిచ్చి నా కొడుకు'లానే బిహేవ్ చేస్తున్నావ్ అని అమర్ ప్రవర్తన గురించి తన కోపాన్ని బయటపెట్టాడు. నన్ను కూడా బయట ఇద్దరు ముగ్గురు అడిగారు.. అమర్ ఎందుకలా సైకోలా బిహేవ్ చేస్తున్నాడని నాగ్ తనకెదురైన సంఘటన గురించి చెప్పుకొచ్చాడు. ఇకపోతే ఈవారం సేవింగ్ లాంటివి ఏం ఉండవు, ఫినాలేకి వెళ్లేది ఎవరో చెప్పడం మాత్రమే ఉంటుందని నాగ్ క్లారిటీ ఇవ్వడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. అయితే ఇప్పటికే శివాజీ బ్యాచ్‌ని నాగార్జున వెనకేసుకొస్తున్నాడని అందరికీ క్లియర్ గా అర్థమైంది. ఇప్పటికీ వాళ్లని తిట్టకపోతే షో పరువు పోతుందని నాగ్ తిట్టినట్లు అనిపించింది అంతే. (ఇదీ చదవండి: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు) -
శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు
Bigg Boss 7 Day 96 Highlights: బిగ్ బాస్‌లో ప్రస్తుతం వరుసగా కొట్లాటలు.. గొడవలు.. భారీగానే జరుగుతున్నాయి. మొదటి నుంచి SPY బ్యాచ్‌లో ఎలాంటి గొడవలు లేకుండా గ్రూప్‌గానే గేమ్ ఆడుతూ వస్తున్నారు. అదే విధంగా SPA బ్యాచ్ కూడా గ్రూప్ గేమ్ ఆడుతూనే ఇంత వరకు వచ్చింది. కానీ వీరిలో యూనిటి మాత్రం ఎక్కడా కనిపించలేదు. స్నేహితులం అని చెప్పుకుంటున్న వీరి మధ్య కూడా పొరపచ్చాలు వస్తున్నాయి. శోభపై మాటలు తూలిన శివాజీ.. గొంతుపై కాలేసి తొక్కుతా అంటూ బిగ్ బాస్‌లో ఓట్ అప్పీల్ కోసం ఫన్నీ టాస్క్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే శోభ,అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకున్న విషయం తెలిసిందే. ఓట్ అప్పీల్ కోసం జరుగుతున్న ఫన్సీ గేమ్స్‌లో శివాజీ,శోభ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరంగా ఉన్నాయి. ఒకానొక సమయంలో బాల్ టాస్క్ ఆడలేనని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అసలు శివాజీ ఆడేదే కన్నింగ్ గేమ్.. యావర్, ప్రశాంత్‌ను వెంటేసుకుని ఇతరులపై నాలుగు పిచ్చి మాటలు విసురుతాడు. కానీ ఎప్పుడూ కూడా శివాజీపై బిగ్ బాస్ కిమ్మనడు. దీనినే అలుసుగా తీసుకున్న శివాజీ తాజాగా జరిగిన బాల్ టాస్క్ విషయంలో శోభపై ఫైర్ అవుతాడు. చిల్లరోళ్లు, క్యారెక్టర్ లెస్, మేము పీకేదానికి ఉన్నామా..? అంటూ శివాజీ రెచ్చిపోతాడు. రేపు శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో... వాడు భయపడిపోడా..? అంటూ అవసరం లేని మాటలు శివాజీ వాగుతాడు. పెళ్లి తర్వాత ఇలాగే ఉంటే అంటూ టాపిక్కు సంబంధంలేని వ్యాఖ్యాలు చేశాడు శివాజీ. ప్రియాంక, శోభను ఉద్దేశిస్తూ.. ఇలాంటి ఆడపిల్లలను ఎక్కడా చూడలేదు.. అదే మన ఇంట్లో ఇలాంటి వాళ్లుంటే గొంతుమీద కాలు వేసే తొక్కేవాడినంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదే క్రమంలో శివాజీని కూడా శోభ పదేపదే ట్రిగ్గర్ చేస్తూ మాట్లాడుతుంది. దానిని సంహించలేని శివాజీ ఇలా వ్యక్తిగతంగా మాట్లాడటం ఏ మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. ఓట్ అప్పీల్ చేసుకున్న శివాజీ ఓట్ అప్పీల్ చేసుకునేందుకు అర్జున్. శివాజీ పోటీ పడుతారు. అప్పటికే అర్జున్ ఓట్ అప్పీల్ చేసుకోవడం వల్ల హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ శివాజీకే ఓట్ అప్పీల్ అవకాశం దక్కేలా సపోర్ట్ చేస్తారు. తర్వాత ఆయన ఓట్ అప్పీల్ చేసుకుంటాడు. తన గేమ్ నచ్చితే ఓట్ వేయాలని ఆయన కోరుతాడు. SPA బ్యాచ్‌లో గొడవలకు కారణమైన శోభ బిగ్ బాస్‌లో ఒక యాడ్‌కు సంబంధించిన టాస్క్‌లో అమర్, శోభ మధ్య గొడవ జరుగుతుంది. హౌస్‌లో రెండు గ్రూపులుగా డివైడ్ చేసి.. ఒక బ్యాచ్‌లో ప్రియాంక, శివాజీ, ప్రశాంత్ ఉంటారు. మరోక బ్యాచ్‌లో శోభ,యావర్,అర్జున్ ఉంటారు. సంచాలక్‌గా అమర్ ఉంటాడు. వీరికి ఇచ్చిన టాస్క్‌లో వండర్ ఉమెన్‌గా ప్రియాంకను విన్నర్‌గా ప్రకటిస్తాడు అమర్ దీంతో శోభకు కోపం రావడం.. ఆపై అమర్ నిర్ణయాన్ని తప్పుపట్టిన శోభ గొడవకు దిగుతుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్ కాదని చెప్పవచ్చు. అక్కడ గెలిచింది ప్రియాంకనే కదా... మనం అనే విషయాన్ని మరిచిపోయి అమర్‌తో గొడవకు దిగుతుంది. అప్పుడు అమర్ కూడా పక్కన వాళ్లను చూసి నేర్చుకో ఎలా ఉండాలో అని చెబుతాడు. ఇలా SPA బ్యాచ్‌లో చిచ్చు పెట్టిన వ్యక్తిగా శోభ మిగిలిపోయింది. Sivaji crossed all the limits today. 40 seconds of utter garbage🤮 Ammayila character nunchi valla marriage life varaku neechamga dhigajaaripoyi maatladadu @StarMaa @iamnagarjuna#Sivaji #BiggBoss7Telugu#biggbosstelugu7 pic.twitter.com/SK59Km9Xo4 — Betty🌶️ (@BinduFanBettyyy) December 8, 2023 -
'బిగ్‌బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?
బిగ్‌బాస్ 7వ సీజన్ చివరకొచ్చేసింది. ప్రస్తుతం 14వ వారం నడుస్తోండగా, మరో 10 రోజుల్లో షో పూర్తి అయిపోతుంది. ఈ క్రమంలోనే విన్నర్ ఎవరవుతారనే కుతుహలం ఉండటం పక్కా. అందుకు తగ్గట్లే నిర్వహకులు.. ఉన్న ఏడుగురితో గేమ్స్ అవీఇవీ అని టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం ముగ్గురే ఉన్నారు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) మిగతా సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్‌బాస్ అనుకున్నంత ఇంట్రెస్ట్ లేకుండానే సాగుతోంది. శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం తప్పితే ఓ ఎంటర్టైన్మెంట్ సరిగా లేదు, ఓ లవ్ ట్రాక్ లేదు. ఎమోషనల్‌గా ఫీలయ్యే సంఘటన లేదు. ఎలాగోలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు తప్పితే చాలా బోర్ కొట్టించేస్తున్నారు. ఏదైతేనేం షో చివరకు వచ్చేశాం. విజేత ఎవరనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది. అయితే గడిచిన వీకెండ్ సందర్భంగా నిర్వహకులు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ రెండు వారాలు కూడా ఓటింగ్ లైన్స్ తెరుచుకునే ఉంటాయని, ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్.. బిగ్‌బాస్ 7 విజేతగా నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటింగ్ నంబర్స్ చూసుకుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 34 శాతం ఓట్లతో టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) ప్రశాంత్ తర్వాత శివాజీ, అమర్దీప్ దాదాపు 20 శాతం ఓటింగ్ పర్సంటేజ్‌తో ఉన్నారు. ఆ తర్వాత వరసగా యావర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులోని తొలి ముగ్గురిలోనే స్థానాలు అటుఇటు మారాలి తప్పితే మిగతా వాళ్లు.. టాప్-3లోకి వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే ప్రశాంత్, శివాజీ, అమర్‌లలో ఎవరో ఒకరే విజేత అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విజేత అని బిగ్‌బాస్ నిర్వహకులు చెప్పారు. కానీ రాబోయే 10 రోజుల్లో ఏమైనా జరగొచ్చు. లెక్కలు మార్చొచ్చు. ఎన్ని లెక్కలు మారినా సరే ప్రశాంత్ లేదంటే అమర్ విజేత అయితే పెద్దగా సమస్య ఉండదు. శివాజీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతావాళ్లతో పోలిస్తే.. మనోడు చాలా విషయాల్లో పూర్. ఏదో మాటలతో లాక్కోచ్చేస్తున్నాడు అంతే! ఏదైతేనేం టైటిల్ కోసం పోటీ మంచిగా నడుస్తోంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరనుకుంటున్నారు? (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: శివాజీ తెలివిలేని పని.. ప్రియాంక ప్రాణం మీదకొచ్చింది!
బిగ్‌బాస్ 7వ సీజన్లో శివాజీ ఉన్నాడంటే ఉన్నాడంతే. ఓ టాస్క్ సరిగా ఆడలేడు, గేమ్‌లో గెలవలేడు. పోనీ సంచాలక్ బాధ్యత అయినా సరిగా చేశాడా? అంటే అది లేదు. తాజాగా శివాజీ పెట్టిన నిర్ణయం.. ప్రియాంక ప్రాణాల మీదకు తెచ్చింది. మరోవైపు 'టికెట్ టూ ఫినాలే' కోసం ఆల్రెడీ పోటీ మొదలైంది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 86 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ సోది ముచ్చట నామినేషన్స్ పూర్తవడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. మిగతా వాళ్ల సంగతి పక్కనబెడితే అర్జున్, గౌతమ్ తనని నామినేట్ చేయడాన్ని శివాజీ తీసుకోలేకపోయాడు. పొద్దుపొద్దునే ప్రశాంత్‌తో మాట్లాడుతూ.. మొన్నే వెళ్లిపోవాల్సిందిరా, ఎందుకురా ఈ మెంటల్ టార్చర్ అని గౌతమ్‌ని ఉద్దేశించి అన్నాడు. అలానే తన విషయంలో అర్జున్‌ది 100 శాతం పిచ్చి స్ట్రాటజీ అని, నన్ను పంపించేయండ్రా బాబు అని మాట్లాడాడు. ఇది జరిగిన కాసేపటి తర్వాత ప్రియాంకతోనూ మాట్లాడుతూ.. వెళ్లిపోయినా బాగుండేది, పిల్లలు బాగా గుర్తొస్తున్నారని శివాజీ చెప్పుకొచ్చాడు. అయితే ఇవన్నీ కూడా సోది ముచ్చట్లలానే అనిపించాయి. టికెట్ టూ ఫినాలే షురూ 13వ వారం వచ్చేసింది. అంటే ఫినాలే జరగడానికి రెండు వారాలు కూడా లేదు. దీంతో బిగ్‌బాస్.. తన గేమ్ షురూ చేశాడు. 'టికెట్ టూ ఫినాలే' మొదలుపెట్టాడు. ఇందులో భాగంగా పలు గేమ్స్ పెడతారని, వీటన్నింటిలో గెలిచి ఎక్కువ పాయింట్స్ సంపాదించిన హౌస్‌మేట్.. ఇకపై కేవలం ఇంటి సభ్యునిగా ఉండకుండా నేరుగా ఫినాలే వారానికి చేరుకుంటారు. మొట్టమొదటి ఫైనలిస్ట్ అవుతారని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అర్జున్ దూకుడు.. అమర్ అదృష్టం 'టిక్ టాక్ టిక్' అని తొలి గేమ్‌లో భాగంగా.. బాణం వేగంగా తిరుగుతూ ఉంటుంది. ఆ బాణం టచ్ అయితే ఔట్ అయినట్లు కాదు, ఫ్లాట్ ఫామ్ పైనుంచి కింద పడితే ఔట్ అయినట్లు అని బిగ్‌బాస్ తొలుత చెప్పాడు. కాసేపటి తర్వాత బాణానికి కాలు తగిలినా సరే ఫౌల్(ఔట్) అని ట్విస్ట్ ఇచ్చాడు. ఇందులో ప్రశాంత్, గౌతమ్, శోభా, శివాజీ, యావర్, అమర్, ప్రియాంక వరసగా ఎలిమినేట్ అయిపోయారు. చివరగా మిగిలిన అర్జున్ విజేతగా నిలిచాడు. పూలని సేకరించే రెండో టాస్క్‌లో తక్కువ పూలు ఉన్న కారణంగా శివాజీ, ప్రియాంక ఎలిమినేట్ అయిపోయారు. ఇలా రెండు గేమ్స్‌తో మొదటి లెవల్ పూర్తయింది. పాయింట్ల ప్రకారం చివర్లో ఉన్న శివాజీ, శోభా ఎలిమినేట్ అయిపోయారు. వాళ్లు పాయింట్స్ వేరొకరికి ఇవ్వాలని చెప్పగా.. అమర్‌కి ఇచ్చేశారు. అలా మనోడికి లక్ కలిసొచ్చింది. తలతిక్క సంచాలక్స్.. గేమ్ డిస్ట్రబ్ ఇక చివరగా 'గాలం వేయ్ బుట్టలో పడేయ్' అనే టాస్క్ పెట్టారు. దీనికి శివాజీ, శోభా సంచాలక్స్గా వ్యవహరించారు. అయితే రింగ్‌తో బంతిని బయటకు లాగిన తర్వాత ఎవరైనా సరే దాన్ని తీసేసుకోవచ్చని ఓ పిచ్చి రూల్ పెట్టారు. ఈ పోటీ అర్జున్.. బంతిని ఫస్ట్ ఫస్ట్ లాగేసి ఎక్కువ పాయింట్స్ సంపాదించాడు. అయితే ప్రియాంక మూడుసార్లు బంతిని బయటకు లాగినప్పటికీ ప్రశాంత్, యావర్, అమర్.. ఈమె దగ్గర నుంచి లాగేసుకున్నారు. చివర్లో అమర్ అయితే ఈమెని ఎలా పడితే అలా లాగేశాడు. బయటకు చెప్పలేదు గానీ ప్రియాంకకు దెబ్బలు గట్టిగానే తగిలినట్లు అనిపించాయి. ఇక్కడ చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే.. శివాజీకి గ్రూప్ గేమ్స్ అంటే ప్రశాంత్-యావర్ తో ఏదే మేనేజ్ చేసి ఆడేస్తాడు. కానీ ఒంటరిగా ఆడాలనేసరికి దొరికిపోయాడు. తాజాగా రెండు గేమ్స్ లోనూ ఓడిపోయి.. టికెట్ టూ ఫినాలే రేస్ నుంచి తప్పించారు. పోనీ అది కాదని సంచాలక్ బాధ్యతలు ఇస్తే, అందులోనూ ఎక్కడలేని పిచ్చి రూల్స్ అన్ని పెట్టి.. ప్రియాంక విజయావకాశాల్ని దెబ్బతీసేశాడు చేశాడు. 13వ వారంలో శివాజీ తీరు వల్ల అతడొక్కడే కాదు.. మొత్తం గేమ్ తీరే దెబ్బతింటోంది. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. -
Bigg Boss 7: శివాజీకి షాకిచ్చిన బిగ్‌బాస్.. ఓట్లు పడినా ఈసారి వేటు గ్యారంటీ!
'బిగ్‌బాస్' షోలో శివాజీ ఆటలు ఇన్నిరోజులు సాగాయేమో కానీ ఇకపై మాత్రం నో ఛాన్స్. అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. ఇప్పటివరకు ఓట్లు పడితే సేవ్ అవుతూ వచ్చాడు. ఈసారి మాత్రం వేటు పడటం గ్యారంటీ అనిపిస్తుంది. మొన్నీమధ్యే శివాజీకి బిగ్‌బాస్.. వార్నింగ్ లాంటి హింట్ ఇచ్చాడు. కాకపోతే మనోడు అప్పుడు అర్థం చేసుకోలేకపోయాడు. ఇప్పుడు రియాలిటీలో అదంతా తెలిసి వస్తోంది. ఇంతకీ ఏం జరుగుతోంది? శివాజీకి బుర్రపనిచేయలేదు మొన్న వీకెండ్ ఎపిసోడ్లో భాగంగా భుజం సమస్య గురించి శివాజీని బిగ్‌బాస్ అడిగి తెలుసుకున్నాడు. నొప్పి ఎలా ఉందని అడుగుతూనే.. ఇకపై హౌస్‌లో ఉండాలనుకుంటున్నారా? వెళ్లిపోవాలనుకుంటున్నారా? అని చాలా పద్ధతిగా అడిగాడు. శివాజీ మాత్రం... ఉంటానని, వెళ్లిపోతానని రకానికి ఒకలా చెప్పాడు. చివరగా నాగార్జున సర్ది చెప్పడంతో.. కొనసాగుతానని అన్నాడు. అయితే అన్ని విషయాల్లో ముందు చూపుతో ఆలోచించే శివాజీ.. బిగ్‌బాస్ ఇచ్చిన హింట్‌ని సరిగా అర్థం చేసుకోలేక పప్పులో కాలేశాడు. కరెక్ట్‌గా చెప్పాలంటే శివాజీకి బుర్రలేదని క్లియర్‌గా అర్థమైపోయింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) శివాజీకి వరస షాక్‌లు ఈవారం నామినేషన్స్ పూర్తయిపోయాయి. అమర్ తప్ప మిగతా ఏడుగురు లిస్టులో ఉన్నారు. అయితే ఈసారి కెప్టెన్సీ కోసం టాస్క్‌లు ఏం ఉండవని నాగ్ ముందే చెప్పాడుగా. దీనికి తగ్గట్లే 'టికెట్ టూ ఫినాలే' పోరు మొదలైంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోల ప్రకారం మూడు గేమ్స్ పెట్టగా.. శివాజీ అడ్డంగా దొరికిపోయాడు. ఏ ఒక్క దానిలోనూ కనీసం చివరివరకు వెళ్లలేకపోయాడు. ఇలా వరస షాక్‌లు తగిలాయి. వేటు పడటం గ్యారంటీ? ప్రతివారం ఓట్లు పడితే నామినేషన్స్ నుంచి సేవ్ అయిపోవచ్చు. ఇన్నాళ్లు ఇదే జరుగుతోంది. అయితే చివరి వారాల్లో ఓట్లు ఎక్కువ పడితే సరిపోదు. గేమ్స్‌లోనూ గెలవాల్సి ఉంటుంది. ఇన్నాళ్లు గ్రూప్ గేమ్స్ కాబట్టి శివాజీ తన మాటలతో మేనేజ్ చేస్తూ బండి లాక్కొచ్చేశాడు. కానీ ఇప్పుడు జరిగేవన్నీ సింగిల్ గేమ్స్ కదా. శివాజీ పనితనం ఏంటో తేలుతుంది. ఒకవేళ టికెట్ టూ ఫినాలే పోటీలో గెలవకపోతే.. ఓటింగ్‌తో సంబంధం లేకుండా బయటకు పంపేసే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు జరుగుతున్న ఫిజికల్ టాస్క్‌ల వల్ల భుజం నొప్పి తిరగబెడితే మాత్రం.. శివాజీ మిడ్ వీక్ ఎలిమినేట్ అయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. (ఇదీ చదవండి: స్టార్ హీరోయిన్ ఎంగేజ్మెంట్.. కాబోయే భర్త ఎవరంటే?) -
ఆ ఒక్కరు తప్ప అందరూ నామినేషన్స్‌లో, ఎవరెవరంటే?
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో ఎనిమిది మంది మిగిలారు. వీరిలో ఎవరు టాప్ 5కి చేరతారు? ఎవరు ఫినాలేలో అడుగుపెట్టకుండానే తిరిగి వెళ్లిపోతారు? అనేది ఆసక్తికరంగా మారింది. నిన్న డబుల్ ఎలిమినేషన్‌తో అశ్విని, రతిక ఇద్దరినీ పంపించేశారు. ఎవిక్షన్ ఫ్రీ పాస్ వాడే ఛాన్స్ ఉన్నప్పటికీ రైతుబిడ్డ ఎవరికీ ఇవ్వడానికి మొగ్గుచూపలేదు. దీంతొ ఇద్దరమ్మాయిలు వెళ్లిపోయారు. తాజాగా మరో ఒకర్ని ఇంటికి పంపించేందుకు నామినేషన్ ప్రక్రియ మొదలుపెట్టారు. నామినేట్ చేయాలనుకునే ఇద్దరి ముఖంపై పెయింట్ వేయాలని చెప్పాడు. ప్రియాంక మాట్లాడుతూ.. మీరు నా గేమ్ చూసి చాలాసార్లు ప్రోత్సహించారు. దానికన్నా ఎక్కువ నాపై నెగెటివిటీ పెట్టుకున్నారు. నన్ను నెగెటివ్ చేయడానికి చాలా ప్రయత్నిస్తున్నారు అంటూ శివాజీని నామినేట్ చేసింది. అర్జున్, గౌతమ్ సైతం అతడిని నామినేట్ చేశారు. ఇక సోఫాజీని నామినేట్ చేసినందుకో ఏమో కానీ ప్రిన్స్ యావర్, ప్రశాంత్.. సీరియల్ బ్యాచ్‌ను నామినేట్ చేశారు. కానీ అమర్‌ను మాత్రం ఎవరూ నామినేట్ చేయకపోవడం విశేషం. దీంతో ఈ వారం అమర్ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్లో ఉన్నారు. మరి వీరిలో ఎవరు ఎవర్ని ఏ కారణాలతో నామినేట్ చేశారు? టికెట్ టు ఫినాలే దక్కించుకునేదెవరు? అనేది రానున్న ఎపిసోడ్స్‌లో తెలియనుంది. చదవండి: తెలుగులో స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్.. కానీ అలా చేశారు -
Bigg Boss 7: బయటకొచ్చేస్తానని శివాజీ డ్రామా? అమర్ నిజస్వరూపం బట్టబయలు!
బిగ్‌బాస్ షోలో కాస్తోకూస్తో ఆసక్తిగా ఉండేవి అంటే నామినేషన్స్, వీకెండ్ ఎపిసోడ్ మాత్రమే. ఈ సీజన్లో నామినేషన్స్ తప్ప వీకెండ్ ఎపిసోడ్స్ బోరింగ్‌గా సాగుతూ వచ్చాయి. ఇన్నాళ్లకు ఓ వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. హోస్ట్ నాగార్జున అయితే ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగేశాడు. అలానే చాలామంది ఊహించినట్లే అశ్విని ఎలిమినేట్ అయిపోయింది. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 83 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ భుజం డ్రామా కెప్టెన్సీ టాస్క్‌లో తనకు అన్యాయం జరగడంపై అమర్ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరొచ్చి చెప్పినా సరే ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాడు. ఇక శివాజీని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్‌బాస్.. భుజం నొప్పి తగ్గిందా? అంతా ఓకేనా అని ఆరా తీశాడు. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం కోలుకుంటున్నారని, రాబోయే వారాల్లో టఫ్ గేమ్స్ ఉంటాయని చెప్పాడు. హౌసులో ఉండాలనుకుంటున్నారా? బయటకొచ్చేయాలనుకుంటున్నారా? అని బిగ్‌బాస్ అడగ్గా.. కాస్త టైమ్ ఇస్తే ఆలోచించి చెబుతానని అన్నాడు. అయితే ఇకపై హౌసులో మీ గాయానికి ఎలాంటి ప్రమాదం జరిగినా బాధ్యత అంతా మీదే అని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు. తొలుత కొనసాగుతానని చెప్పిన శివాజీ.. కాసేపటి తర్వాత మనసు మార్చుకుని.. బయటకెళ్లిపోతా అని అన్నాడు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) ధైర్యం చెప్పిన నాగ్ ఇదంతా జరిగిన తర్వాత హోస్ట్ నాగార్జున కూడా కన్ఫెషన్ రూంకి పిలిచి మరీ శివాజీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు. 100 శాతం ఎఫర్ట్ పెట్టలేనప్పుడు కప్ ఆశించడం కరెక్ట్ కాదని, అందుకే వెళ్లిపోతానని అన్నట్లు శివాజీ చెప్పాడు. ఎక్కువ ఆలోచించొద్దు, భయమనేది వద్దని నాగ్ కాస్త సర్దిచెప్పేసరికి శివాజీ అంగీకరించాడు. ఇకపై ఏం జరిగినా బాధ్యత తనదేనని చెప్పాడు. దీనిబట్టి చూస్తే.. ఒకవేళ గాయం ఏమైనా తిరగబెడితే మాత్రం ఎప్పుడైనా సరే శివాజీ హౌస్ నుంచి బయటకెళ్లిపోయే ఛాన్స్ ఉంది. మరి చివరి వారం వరకు ఉంటాడా లేదా అనేది అతడి గాయం తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది. అమర్ నిజస్వరూపం ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న ప్రశాంత్‌ని నాగార్జున మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అశ్విని నిలబెట్టి.. డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకుంటావా? కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అని అని నాగ్ సీరియస్ అయ్యాడు. అనంతరం అమర్‌తో మాట్లాడాడు. గతంలో ప్రశాంత్ ఏడుస్తుంటే, దాన్ని యాక్టింగ్ అని అమర్ అందులో అన్నట్లు ఉంది. తాజాగా కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అమర్ ఏడవటాన్ని లింకప్ చేసి నాగ్ ప్రశ్నించాడు. వేరేవాళ్లు ఏడిస్తే, వాళ్లది యాక్టింగ్ అని నువ్వు అన్నావ్.. ఇప్పుడేమో నువ్వు చేసింది యాక్టింగా? అని నాగ్ అడిగేసరికి.. నా వరకు వస్తే గానీ తెలియలేదు అని అమర్ తన అభిప్రాయం చెప్పాడు. అలానే గత వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా తన ఏడిచింది స్ట్రాటజీ అని శివాజీతో మాట్లాడుతూ అమర్ ఓ సందర్భంలో చెప్పాడు. ఆ వీడియోని కూడా స్క్రీన్‌పై ప్లే చేసిన నాగ్.. ఇదేంటని అడిగాడు. అమర్ ఏదో చెప్పబోతుంటే.. నీ విషయంలో ఏది యాక్టింగ్? ఏది జెన్యూనిటీ? ఏది స్ట్రాటజీ? అనేది మాకే అర్థం కావట్లేదని నాగ్ అసహనం వ్యక్తం చేశాడు. ఏదైనా సరే కెప్టెన్సీ కంటే కప్ ముఖ్యం అని చెప్పి అమర్‌ని నాగ్ శాంతింపజేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) శివాజీ వాదన శివాజీ.. కెప్టెన్సీ విషయమై అమర్‌కి మాటిస్తున్నా అన్నావ్? మాట కోసం చచ్చిపోతాను అన్నావ్? ఎందుకు మాట మార్చావ్ అని నాగ్, శివాజీని అడిగాడు. దానికి శివాజీ ఏదేదో చెప్పుకొచ్చాడు. అమర్ కెప్టెన్ అయితే తన డిప్యూటీలుగా ప్రియాంక-శోభాని పెట్టుకుంటానన్నాడని అది తనకు నచ్చలేదని, అలానే ప్రియాంక కెప్టెన్సీలో చాలా విషయాలు కరెక్ట్‌గా జరగలేదని నాగ్ ముందే చెప్పాడు. మధ్యలో లేచిన ప్రియాంక.. నాగ్ ముందే శివాజీతో వాదన పెట్టుకుంది. ఇదంతా కూడా చిన్నపిల్లలా యవ్వారంలా అనిపించింది తప్పితే డీసెంట్‌గా అయితే లేదు. అలానే 'హత్య టాస్క్' సందర్భంగా శోభాకి సీక్రెట్ చెప్పి, ఆమె డెడ్ అవ్వకుండా ప్రియాంక కాపాడింది. ఈ వీడియోని చూపించిన నాగ్.. ప్రియాంకని కూడా ఓ రేంజులో ఇచ్చిపడేశాడు. మీ ముగ్గురూ(అమర్-ప్రియాంక-శోభా).. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారని సీరియస్ అయ్యాడు. అశ్విని ఎలిమినేట్ చివర్లో యావర్‌ని కూడా నిలబెట్టి కెప్టెన్ అంటే హౌస్ మొత్తానికి కెప్టెన్ అని, ఆమెతో నామినేషన్స్ సందర్భంగా ప్రవర్తించిన తీరు సరికాదని చెప్పిన నాగార్జున.. యావర్‌తో ప్రియాంకకు సారీ చెప్పించాడు. కట్ చేస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గుర్తుచేసిన నాగ్.. గన్‌తో పేల్చడం అనేది పెట్టి అశ్విని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే ప్రశాంత్.. నువ్వేమైనా ఎవిక్షన్ పాస్ ఇప్పుడు ఉపయోగిస్తావా అని అడగ్గా.. 14వ వారం వేరొకరి కోసం ఉపయోగిస్తానని ప్రశాంత్, నాగార్జునకు మాటిచ్చేశాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరంటే?) -
పాతాళానికి పడిపోయిన శివాజీ గ్రాఫ్! మాట కోసం చస్తావా? పెద్ద జోక్..
'ఇచ్చిన మాట కోసం ప్రాణమిస్తాను బాబు గారూ.. నీతి, నిజాయితీ వైపే నిలబడతాను. ఎన్నడూ మాట తప్పను.. న్యాయం కోసం పోరాడుతాను..' అబ్బో.. ఇలా చెప్పుకుంటూ పోతే సోఫాజీ వీకెండ్లో నాగార్జున ముందు ఇచ్చే పర్ఫామెన్స్‌కు ఆస్కార్ ఇవ్వాల్సిందే! చేసేది గోరంత చెప్పేది కొండంత.. అవును మరి, తన డప్పు తను కొట్టుకోకపోతే నిజాలు, నిజస్వరూపాలు బయటపడిపోతాయి కదా.. ఆమాత్రం కవరింగ్ చేయాల్సిందే! కానీ ఎన్నాళ్లు? బిగ్‌బాస్ సీజన్ 7 కథ కంచికి చేరే సమయం దగ్గరపడుతోంది. ఇంకా ముసుగు వేసుకుంటే కష్టం కదా.. కానీ, నిన్నటి ఎపిసోడ్‌తో శివాజీ ముసుగు తొలగిపోయింది.. అతడి బండారం బయటపడింది. ఇద్దరికీ మాటిచ్చాడట.. ఎవరి మీదా పగ లేదు అంటూనే కెప్టెన్సీ టాస్క్‌లో అమర్ మీద ఉన్న అక్కసునంతా వెల్లగక్కాడు శివాజీ. నిజానికి అమర్.. కెప్టెన్సీ పోటీలో సపోర్ట్‌గా ఉండమని అడిగితే శివాజీ నా ఓటు నీకే.. విజయం నీదేపో అన్నంత బిల్డప్ ఇచ్చాడు. తీరా టాస్క్‌లో అర్జున్ భార్య.. అతడు రెండోసారి కెప్టెన్ కావాలని కోరింది. ఆమెకు మాటిచ్చాను.. అంటూ అమర్‌కు వెన్నుపోటు పొడిచాడు. పోనీ నిజంగానే అర్జున్ను కెప్టెన్ చేయాలనుకుంటే గత వారాల్లో చేసి ఉండొచ్చుగా.. అంతదాకా ఎందుకు? అర్జున్ వర్సెస్ శివాజీ ఉన్నప్పుడు.. స్వచ్ఛందంగా పోటీ నుంచి తప్పుకుని అర్జున్ను కెప్టెన్ చేసుంటే గొప్పోడివి అని అంతా చప్పట్లు కొట్టేవారు. టార్గెట్ చేసింది ఎవరు? ఏమీ ఆడకపోయినా సరే, చేతినొప్పి సింపథీతో హౌస్‌లో నెట్టుకొస్తున్న తనకు కెప్టెన్సీ కావాలి.. కానీ ఎన్నోసార్లు కెప్టెన్సీ కంటెండర్ దాకా వచ్చి కెప్టెన్‌కు అడుగుదూరంలో ఆగిపోయిన అమర్‌కు మాత్రం ఎట్టిపరిస్థితుల్లో ఇవ్వకూడదు. అలాంటప్పుడు అమర్‌కు అండగా నిలబడతానని మాటివ్వడం దేనికో? ఇక్కడ మరో విచిత్రం ఏంటంటే... తను అతడిని టార్గెట్ చేసింది పోయి.. అమర్ తనను టార్గెట్ చేశాడని టాస్క్‌లో పచ్చి అబద్ధాలు చెప్పాడు. నువ్వు నాకు వ్యతిరేకంగా అన్ని చేసినా నేను ఏమీ అనలేదని మహానుభావుడిలా నటించాడు. వెన్నుపోటు పొడిస్తే ఏడ్వక నవ్వుతారా? అవునవును, ఛాన్స్ దొరికినప్పుడల్లా అమర్ మీద వెకిలి డైలాగులు, వెకిలి చేష్టలు చేసిందెవరో అందరికీ తెలుసు. తనను నీచాతినీచంగా చూసినా, టార్గెట్ చేసినా అమర్ మాత్రం శివాజీకి గౌరవమిచ్చి మాట్లాడాడు. లోలోప ద్వేషంతో రగిలిపోతున్నా పైకి మాత్రం పెద్దమనిషిలా నటించాడు శివాజీ. పైగా నీకే నా సపోర్ట్ అని మాటిచ్చి గొంతు కోస్తే అమర్ అల్లాడిపోక ఇంకేం చేస్తాడు. చివరి కెప్టెన్సీ కళ్లముందే కోల్పోతుంటే, మాటిచ్చినవారే వెన్నుపోటు పొడుస్తుంటే కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు. ఈ ఏడుపులు.. డ్రామా.. సింపతీ ఆపంటూ కసురుకున్న శివాజీ.. ప్రశాంత్ ఏడిస్తే మాత్రం అతడి స్వభావమే అంత, కావాలని ఏడవట్లేదని వెనకేసుకొచ్చాడు. అది ఒక ఎమోషన్.. అని మాట్లాడాడు. గౌతమ్ చేస్తే తప్పు.. నువ్వు చేస్తే ఒప్పా? గత కెప్టెన్సీ టాస్క్‌లో గౌతమ్.. ప్రియాంక తన చెల్లి అంటూ ఆమెకు సపోర్ట్ చేశాడు. ఆటలో అన్నాచెల్లెళ్లు అనేవి ఉండవంటూ గౌతమ్‌ను నామినేట్ చేశాడు శివాజీ. కానీ నిన్న మాత్రం అర్జున్ భార్య కోసం అతడికి సపోర్ట్ చేస్తున్నా అన్నాడు. అంటే తను మాత్రం బంధాలు, బాంధవ్యాలు ఆలోచించొచ్చు.. పక్కవారు మాత్రం నోరు మూసుకుని ఉండాలి. ఇక్కడ మరో విషయం ఏంటంటే.. అమర్ కెప్టెన్ అయితే శోభా, ప్రియాంకలను డిప్యూటీలుగా పెట్టుకుంటానన్నాడు.. ఇది సోఫాజీకి నచ్చలేదట. కెప్టెన్ కానివారికి అవకాశం ఇవ్వొచ్చుగా అని వితండవాదన చేశాడు. మరి ఈ బాబుగారు కెప్టెన్ అయినప్పుడు ఆల్రెడీ కెప్టెన్ అయిన ప్రశాంత్, యావర్‌ను డిప్యూటీలుగా పెట్టుకున్నాడెందుకో? అంతే మరి మనం చేస్తే ఒప్పు.. పక్కోళ్లు చేస్తే తప్పు. ఏదేమైనా నిన్నటి ఒక్క ఎపిసోడ్‌తో శివాజీ గ్రాఫ్ పాతాళానికి పడిపోయిందనే చెప్పాలి! ఈ దెబ్బతో అతడు టాప్ 2 రేసులో కూడా లేకుండా పోయాడు. #Shivaji "arey maat icha.. maata kosam chachipotha po" Super dialogue kada.#BiggBossTelugu7 pic.twitter.com/JOYDNSudBR — BiggBossTelugu7 (@TeluguBigg) November 25, 2023 చదవండి: నెలసరి ఆలస్యం.. కంటెస్టెంట్‌కు ప్రెగ్నెన్సీ టెస్ట్.. ఫలితం ఏమని వచ్చిందంటే? -
అమర్‌ని మోసం చేసిన శివాజీ? చివరకు అలాంటి పరిస్థితి!
బిగ్‌బాస్ హౌస్‌లో అమర్ మరోసారి బలైపోయాడు. శివాజీ దారుణంగా మోసం చేశాడు. దీంతో నొప్పి తట్టుకోలేకపోయాడు. చివర్లో ఓకే చెప్పాడు గానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడంతో హౌస్మేట్స్ అందరూ షాకయ్యారు. అయితే ఆ ఒక్కటి చేయకపోవడమే అమర్ కెప్టెన్సీపై దెబ్బేసింది. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 82 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. చివరి కెప్టెన్సీ టాస్క్ ఈ వారం నామినేషన్స్ తర్వాత 'హత్యల టాస్క్' ఇచ్చిన అని బిగ్‌బాస్ గేమ్ పెట్టాడు. అది అయిపోవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ఏడో సీజన్లో చిట్టచివరి కెప్టెన్ కోసం 'పాయింట్ బ్లాంక్' అని టాస్క్ పెట్టడంతో శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ గేమ్ ప్రకారం.. ఓ చోట రెండు ఫొటోలు చూపిస్తారు. ఇద్దరు హౌస్మేట్స్ ఓ నిర్ణయానికొచ్చి, ఆ రెండు ఫొటోల్లో కెప్టెన్ కావడానికి ఎవరు అనర్హులో గన్‌తో కాల్చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా రివ్యూ) ఎవరు ఎవరిని కాల్చారు? ఎవరిని సేవ్ చేశారు? హౌస్మేట్స్ షూట్-సేఫ్ గౌతమ్ , ప్రియాంక - శోభా, అర్జున్ ప్రశాంత్, శోభాశెట్టి - అశ్విని, అమర్ యావర్, రతిక - ప్రశాంత్, శివాజీ శివాజీ, అశ్విని - యావర్, అర్జున్ అమర్, అర్జున్ - ప్రియాంక, శివాజీ యావర్, రతిక - గౌతమ్, అర్జున్ ప్రియాంక, అశ్విని - రతిక, అమర్ అమర్, గౌతమ్ - శివాజీ, అర్జున్ శివాజీ, శోభా - అర్జున్, అమర్ అమర్ కెప్టెన్సీ పిచ్చి గత వీకెండ్ సందర్భంగా.. 12వ వారం గురించి రెండు ట్విస్టులు ఇచ్చాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, అలానే కెప్టెన్సీ టాస్క్ కూడా ఈ వారం చివరిదని హోస్ట్ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్నవాళ్లలో అమర్, అశ్విని, రతిక.. కెప్టెన్ కాలేదు. దీంతో అమర్, తన ఫొటో కాల్చొద్దని అందరినీ బతిమలాడుకున్నాడు. దీనికి అందరూ ఓకే చెప్పారు కూడా. అయితే మిగతా వాళ్లతో పోలిస్తే.. నేను కెప్టెన్ అవ్వాలి, లేకపోతే ఉండలేను అనేంత రేంజులో అమర్ హడావుడి చేశాడు. దీన్ని పిచ్చి అంటారా? లేదా ఇంకేదైనా అంటారా అనేది అర్థం కాలేదు. శివాజీ వెన్నుపోటు? హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి అమర్ అంటే శివాజీకి ఎందుకో కోపం. కారణమున్నా లేకపోయినా సరే కొన్నివారాలు అతడినే నామినేట్ చేసేవాడు. ఇక ఇది చివరి వారమని.. తనకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని.. టాస్క్ ప్రారంభానికి ముందే అమర్ అడిగాడు. దానికి శివాజీ కూడా సరేనన్నాడు. కానీ చివర్లో అర్జున్, అమర్ ఫొటోలు వచ్చేసరికి తన ఓటు అర్జున్‌కి వేస్తున్నట్లు చెప్పాడు. అమర్ విషయంలో ప్లేటు తిప్పేశాడు. శివాజీకి జోడిగా ఉన్న శోభా మాత్రం.. అమర్ పేరు చెప్పింది. దీనిబట్టి చూస్తే శివాజీ.. మరోసారి అమర్ అంటే కోపాన్ని బయటపెట్టడంతో పాటు వెన్నుపోటు పొడిచేశాడు. (ఇదీ చదవండి: Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ) అదే కొంపముంచింది అయితే అర్జున్ భార్య అతడిని కెప్టెన్ కావాలని కోరుకుందని, అందుకే తన పేరు చెప్పినట్లు శివాజీ తన కారణం చెప్పాడు. దీంతో అమర్-శివాజీ మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగింది. అమర్ అయితే నేను ఎలాగైనా కెప్టెన్ కావాలన్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓవైపు అర్జున్ తన స్టాండ్ బలంగా చెబుతుండేసరికి.. ఇది ఎంతకీ తెగలేదు. దీంతో ఇక నిర్ణయం చెప్పకపోతే.. కెప్టెన్సీనే పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించాడు. అప్పుడు ఇక వేరే దారిలేక శోభా-శివాజీ కలిసి.. అర్జున్ పేరు చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అర్జున్ ఫొటోతో పాటు అమర్ ఫొటో కూడా కాలిపోయింది. అయితే ఈ విషయంలో శివాజీది ఎంత తప్పుందో అమర్ది కూడా అంతే తప్పుందని చెప్పొచ్చు. ఏడుస్తూ టైమ్ వేస్ట్ చేసుకోకుండా శివాజీని కన్విన్స్ చేసి ఉండాల్సింది. కానీ బ్యాడ్ లక్. నిర్ణయం ఆలస్యమయ్యేసరికి అర్జున్‌తో పాటు అమర్ ఫొటో కూడా కాలిపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. మరీ అమర్ కొత్త కెప్టెన్ అవుతాడా? లేదా? అనేది శనివారం ఎపిసోడ్లో తేలుతుందిలే. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ!
బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ మ్యాన్షన్ టాస్క్ జరుగుతోంది. బిగ్‌బాస్ భార్య హత్య జరిగిందని, చంపిందెరో కనుక్కోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ హత్య కేసును ఛేదించే బాధ్యతను పోలీస్ ఇన్వెస్టిగేటర్లయిన అమర్, అర్జున్‌లకు అప్పగించాడు. దీంతో హౌస్‌లో ఉన్న అందరినీ విచారిస్తున్నారు. మరి వీరు హంతకులను పట్టుకున్నారా? లేదా? అనేది తాజా (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. అమర్ మీద అదేపనిగా అక్కసు.. శివాజీ టాస్క్‌లో కూడా అమర్ మీద అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు. పోలీస్ గెటప్‌లో ఉన్న అమర్‌ను 420, జామకాయలు అమ్ముకునేవాడివి, వీడికెవడ్రా పోలీస్ డ్రెస్ ఇచ్చింది అంటూ హేళన చేస్తూ మాట్లాడాడు. అమర్ మాత్రం ఎంతో సహనంతో అతడికి గౌరవమిచ్చి మాట్లాడటం విశేషం. ఇక అర్జున్.. ప్రశాంత్‌ను ఎవరు చంపారో తెలుసుకుంటే హౌస్‌లో జరుగుతున్న హత్యలకు కారకుడిని పట్టుకున్నట్లే అన్నాడు. దీంతో అమర్.. శివాజీనే అని చెప్పాడు. ఆయన అందరినీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు అసలు గుట్టు బయటపెట్టాడు. హంతకుడిని పట్టించిన ముసలి వెంట్రుక ఇంతలో శివాజీకి మరో మర్డర్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా అద్దంపై క్రైయింగ్ బేబి అశ్విని గెటౌట్ అని రాయడంతో ఆమె చనిపోయి దెయ్యంగా మారింది. అయితే శివాజీ మీద రతిక అనుమానపడటంతో.. ఏయ్ పిచ్చా, ఏం చేస్తున్నవ్.. అని అరిచి కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అద్దం మీద ఏ పేస్ట్‌తో శివాజీ రాశాడో దాన్ని వెతికి తీసుకొస్తాడు అమర్. దానికి ఒక వెంట్రుక అంటుకుని ఉంటుంది. అది ముసలి వెంట్రుకలా ఉంది, తెల్లబడింది అని శివాజీపై అనుమాం వ్యక్తం చేస్తారు. హంతకుడు శివాజీనే అని శోభా, గౌతమ్, ప్రియాంకలు కూడా ఫిక్సయిపోతారు. ఫెయిలైన శివాజీ అనంతరం గౌతమ్‌ను చంపాలని టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఐయామ్ డెడ్ అని ఉన్న స్టిక్కర్ గౌతమ్‌కు అంటించాలన్నాడు. అయితే శివాజీయే ఇదంతా చేస్తున్నాడని మరోసారి పసిగట్టేశాడు అమర్. కానీ శివాజీ ఆ స్టిక్కర్‌ను గౌతమ్‌ను అంటించకపోవడంతో ఈ సీక్రెట్ టాస్క్‌లో ఫెయిలయ్యాడు. అలా ఆ టాస్క్ ప్రియాంకకు బదిలీ అయింది. ఎంతో అలవోకగా టాస్క్ పూర్తి చేసింది ప్రియాంక. ఇన్వెస్టిగేటర్లు మొదట రతికపై అనుమానంతో ఆమెను జైల్లో వేశారు. తర్వాత శివాజీపై అనుమానం బలపడటంతో రతికను వదిలేసి అతడిని జైల్లో బంధించారు. మరి హంతకుడు ఇతడేనని ఈసారైనా గట్టి నిర్ణయంతో ఉంటారా? మళ్లీ అతడిని వదిలేస్తారా? అనేది చూడాలి! చదవండి: ఓటీటీలో హిట్ సినిమాలు, హారర్ సిరీస్.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే? -
డాక్టర్ బాబా మజాకా.. గౌతమ్ తెలివికి శివాజీ, రైతుబిడ్డ షాక్!
సీక్రెట్ టాస్క్ అంటే అర్థమేంటి? ఎవరికీ తెలియకుండా టాస్క్ పూర్తి చేయాలి. కానీ అపర చాణక్యుడిలా బిల్డప్ ఇచ్చే శివాజీకి ఈ ముక్క తెలియకపోవడమేంటో! ప్రశాంత్ మిర్చి మొక్కను పోస్ట్ డబ్బాలో దాచేయమని శివాజీకి సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అయితే మొక్కను ఎలా దాచేయాలో పక్కనపెట్టి ముందుగా ప్రశాంత్‌ను ఓ గదిలో పెట్టి బంధించాడు. గేమ్‌లో అతడిని చంపేస్తున్నట్లు చెప్పి ఆ తర్వాత తీరికగా మొక్కను దాచాడు. ఖంగు తిన్న రైతుబిడ్డ ఎవరికీ ఏ అనుమానం రాలేదేమో కానీ గౌతమ్ మాత్రం ఈజీగా పసిగట్టేశాడు. ప్రశాంత్‌ను డెడ్ అయినట్లు ప్రకటించిన బిగ్‌బాస్ అతడిని దెయ్యంలా తెల్లబట్టలు వేసుకుని తిరగమన్నాడు. ఈ క్రమంలో దెయ్యంలా ఇల్లంతా తిరుగుతున్న ప్రశాంత్‌ను శివాజీ అన్ననే చంపాడు కదరా నిన్ను అని అడిగేశాడు. అతడి మాటతో ఖంగు తిన్న రైతుబిడ్డ సమాధానం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ తెలివితేటలను మాత్రం సోషల్ మీడియాలో కొనియాడుతున్నారు. పోలీసుల కన్నా ముందే పసిగట్టేశాడని మెచ్చుకుంటున్నారు. హంతకుడిని పసిగట్టిన గౌతమ్ అటు పోలీసుల ఇన్వెస్టిగేషన్‌లోనూ హోటల్ మేనేజర్ పాత్రలో ఉన్న శివాజీయే బిగ్‌బాస్ భార్యను హత్య చేసి ఉంటాడని క్లూ ఇచ్చాడు. నిజానికి ప్రశాంత్‌ను డెడ్ చేయాలన్న సీక్రెట్ టాస్క్‌తో పాటు బిగ్‌బాస్ భార్యను చంపింది నువ్వేనంటూ శివాజీకి ఓ నెక్లెస్ ఇచ్చాడు బిగ్‌బాస్. అటు గౌతమ్ ఆ రెండు పాయింట్లను కరెక్ట్‌గా గెస్ చేసి తనది మాస్టర్‌మైండ్ అని మరోసారి నిరూపించుకున్నాడు. కాగా మొదటి నుంచీ ఏ గ్రూపులోనూ చేరకుండా సింగిల్‌గా ఆడుతున్నాడు గౌతమ్. శివాజీ తప్పు చేశాడనిపించినప్పుడల్లా ధైర్యంగా ఎదురెళ్తున్నాడు. ఈ లక్షణాలే గౌతమ్‌ను ముందుకు తీసుకెళ్తున్నాయి. ఇదే ఆట కొనసాగిస్తే అతడు టాప్ 5లో ఉండటం ఖాయంగా కనిపిస్తోంది. శివాజీ ఇతడిని పిచ్చివాడు అని తీసిపారేశాడు కానీ అతడిని ఎదురించే దమ్మున్నోడు, ఆటలో సత్తా చూపే సరైనోడు అని అభిమానులు గౌతమ్‌ను కొనియాడుతున్నారు. చదవండి: బిగ్‌బాస్ ఆఫర్, ఖరీదైన కారు గిఫ్ట్.. క్లారిటీ ఇచ్చిన బర్రెలక్క -
Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?
బిగ్‌బాస్ 12వ వారం నడుస్తోంది. గతవారం లానే ఈసారి కూడా ఏకంగా 8 మంది నామినేట్ అయ్యారు. గత వీకెండ్ లో నాగ్ చెప్పినట్లు ఈసారి డబుల్ ఎలిమినేషన్ గండం ఉంది. మరోవైపు పెద్దాయన శివాజీకి అమర్దీప్ వల్ల షాక్ తగిలింది. ఇంతకీ అసలేం జరుగుతోంది? నామినేషన్స్-ఓటింగ్-ఎలిమినేషన్ సంగతేంటి అనేది ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ సంగతేంటి? బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్లో 11 వారాలు పూర్తయ్యాయి. పదివారాల పాటు ఒక్కో కంటెస్టెంట్ చొప్పున ఎలిమినేట్ చేస్తూ వచ్చారు. గతవారం మాత్రం యావర్ తన ఎవిక్షన్ పాస్ తిరిగిచ్చేసిన కారణాన్ని చూపిస్తూ నో ఎలిమినేషన్ అన్నారు. ఈ వారం మాత్రం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని నాగ్ బాంబు పేల్చాడు. దీంతో ఈసారి నామినేషన్స్ అనేది కాస్త ఇంట్రెస్టింగ్గా మారిపోయింది. కెప్టెన్ ప్రియాంక, శోభా తప్పితే మిగిలిన 8 మంది లిస్టులోకి చేరిపోయారు. (ఇదీ చదవండి: కాస్ట్లీ కారులో మెగాహీరో రామ్ చరణ్.. దీని ధరెంతో తెలుసా?) డేంజర్లో బ్యూటీస్? అయితే ప్రతిసారి రైతుబిడ్డ, శివాజీకి ఎక్కువ ఓట్లు పడేవి. ఈ వారం మాత్రం అనుహ్యంగా అమర్దీప్ అగ్రస్థానంలో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఓ రకంగా శివాజీకి దెబ్బే అని చెప్పొచ్చు. అమర్ టాప్‌లో ఉండగా, రెండు-మూడు స్థానాల్లో శివాజీ, ప్రశాంత్ ఉన్నారట. ఆ తర్వాత వరసగా యావర్, గౌతమ్, అర్జున్ ఉన్నట్లు తెలుస్తోంది. చివరి రెండు స్థానాల్లో రతిక, అశ్విని ఉన్నారట. అంటే ఆడ లేడీస్ ఇద్దరూ డేంజర్ జోన్లో ఉన్నట్లే. లిస్ట్ మారే ఛాన్స్ ఉందా? ప్రస్తుత పరిస్థితుల బట్టి ఈ వారం ఓటింగ్ విషయంలో పెద్దగా మార్పులేం ఉండకపోవచ్చని తెలుస్తోంది. అలానే అశ్విని.. ఈ వారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని, అసలు బిగ్‌బాస్‌లో ఉండటానికి తనకు ఇష్టం లేదనే విషయాన్ని పరోక్షంగా చెప్పేసింది. మరోవైపు రతిక.. ఒక్కటంటే ఒక్క విషయంలోనూ ఆకట్టుకోలేకపోతుంది. దానికి తోడు ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నవాళ్లతో పోలిస్తే వీళ్లిద్దరికీ ఫ్యాన్ బేస్ కూడా పెద్దగా లేదు. కాబట్టి ఓటింగ్ లిస్ట్ అనేది మారకపోవచ్చు. అంటే అమ్మాయిలిద్దరూ ఎలిమినేట్ అయిపోవడం గ్యారంటీ! శనివారం వరకు ఆగితే ఎలిమినేషన్ సంగతేంటో తేలిపోతుంది! అప్పటివరకు జస్ట్ వెయిట్ అండ్ సీ! (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
సీక్రెట్ టాస్క్‌లో ఫెయిల్... జైలుకు వెళ్లిన శివాజీ!
బిగ్‌బాస్ హౌస్‌లో ఓ సరదా, సీరియస్ టాస్క్ జరుగుతోంది. బిగ్‌బాస్ భార్య వండిన బిర్యానీని హౌస్మేట్స్ ఆవురావురుమని ఆరగించారు. కరువులో కొట్టుమిట్టాడుతున్నట్లుగా మెతుకు మిగల్చకుండా ప్లేటు ఖాళీ చేశారు. ఇంతలో బిగ్‌బాస్ ఓ విషాద వార్త మోసుకొచ్చాడు. తన భార్యను చంపేసి ఆమె దగ్గరున్న నెక్లెస్ ఎత్తుకెళ్లారని, ఆ హంతకుడిని కనిపెట్టాలని కోరాడు. ఈ క్రమంలో అమర్, అర్జున్ పోలీసులుగా అవతారం ఎత్తగా అశ్విని, శోభా రిపోర్టర్లుగా మారారు. ఇలా ఒక్కో కంటెస్టెంట్‌కు ఒక్కో రోల్ అప్పగించాడు. ఓపక్క హంతకుడిని పట్టుకునేందుకు పోలీసులు ప్రయత్నిస్తుంటే మరోపక్క కంటెస్టెంట్లకు క్రమానుసారంగా సీక్రెట్ టాస్కులు ఇస్తున్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో శివాజీకి ఎవరికీ అనుమానం రాకుండా పల్లవి ప్రశాంత్, అశ్వినిని చంపాలని సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. ఆ ఇద్దరినీ చంపాడు కానీ హౌస్మేట్స్ శివాజీయే చంపాడని పసిగట్టారు. దీంతో శివాజీని టాస్క్‌లో ఫెయిలైనట్లుగా తెలిపిన బిగ్‌బాస్ అతడిని జైల్లో వేసినట్లు తెలుస్తోంది. ఒక్క టాస్క్ అయినా సరిగా ఆడని శివాజీ పక్కవాళ్ల ఆటలకు మాత్రం వెయ్యి వంకలు పెడుతాడు. ఇప్పుడు బిగ్‌బాస్ ఇచ్చిన టాస్క్ కూడా సరిగా నిర్వర్తించలేక మరోసారి తన అసమర్థతను నిరూపించుకున్నాడు. చదవండి: పేరు కూడా అడగలేదు, గదిలోకి రమ్మని పిలిచాడు.. రోజూ తాగి వచ్చి టార్చర్.. -
Bigg Boss 7: బయటపడ్డ శివాజీ మరో కోణం.. మనోడు బిగ్‌బాస్‌లో బ్రెయిన్లెస్ 'చాణక్య'!
శివాజీ పేరు చెప్పగానే బిగ్‌బాస్ షోలో చాణక్య అని అంటారేమో! కానీ అంత సీన్ లేదని లేటెస్ట్ ఎపిసోడ్‌తో క్లారిటీ వచ్చేసింది. 12వ వారం నామినేషన్స్‌లో అసలు రంగు అంతా బయటపడింది. అస్సలు బుర్రలేదన్నట్లుగా నోటికొచ్చినట్లు మాట్లాడి ఇజ్జత్ మొత్తం తీసేసుకున్నాడు. డాక్టర్‌బాబు గౌతమ్ అయితే శివాజీ మైండ్‌ని చదివేశాడు. అసలు ఈ పెద్దాయన ఎందుకిలా ప్రవర్తిస్తున్నాడో క్లారిటీగా చెప్పేశాడు. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 79 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో రిలీజ్ కానున్న 24 సినిమాలు) గౌతమ్, శివాజీ.. ఇద్దరూ ఇద్దరే! ఆరుగురు హౌస్మేట్స్ సోమవారం ఎపిసోడ్లో తమ నామినేషన్స్ పూర్తి చేశారు. ఆగిన దగ్గర నుంచి మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. గౌతమ్‌ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పిన శివాజీ.. బ్యాలెన్సింగ్ టాస్క్‌తోపాటు మిగతా విషయాల్ని కారణాలుగా చెప్పాడు. కానీ గౌతమ్ మాత్రం... పాయింట్ టూ పాయింట్ చెప్పండన్నా అనేసరికి శివాజీ వాదించలేకపోయాడు. తర్వాత అశ్విని పేరు శివాజీ చెప్పాడు గానీ ఆమె సెల్ఫ్ నామినేట్ కాబట్టి.. ఆమెని నామినేట్ చేయడానికి వీల్లేదని బిగ్‌బాస్ చెప్పడంతో అర్జున్‌ని నామినేట్ చేశాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శివాజీ - గౌతమ్, అశ్విని యావర్ - అమర్దీప్, అర్జున్ శోభాశెట్టి - శివాజీ, అర్జున్ ప్రియాంక - యావర్, శివాజీ యావర్‌తో మాటల్లేవు! శివాజీది పూర్తయిన తర్వాత యావర్.. అమర్, అర్జున్‌ని నామినేట్ చేస్తున్నట్లు చెప్పాడు. తన తప్పొప్పుల గురించి, చేసినప్పుడే ఎందుకు చెప్పలేదని యావర్, అర్జున్‌ని అడిగాడు. అయితే ఇది చాలా సిల్లీ రీజన్ అని, ఇక హౌసులో ఉన్నన్నీ రోజులు నీతో మాట్లాడేది లేదని అర్జున్ సీరియస్‌గా చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరోవైపు కెప్టెన్‌గా నిన్ను కంట్రోల్ చేయాలని చూస్తే.. 'కెప్టెన్ కాదు నువ్వు' అని ఎందుకన్నావ్, అది నచ్చలేదని ప్రియాంక, యావర్‌ని నామినేట్ చేసింది. దీంతో తెలుగు సరిగా రానీ యావర్‌కి ఏం అర్థమైందో ఏంటో గానీ.. 'వేస్కో అది' అని పిచ్చిపిచ్చిగా బిహేవ్ చేస్తూ వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: యాంకర్ రష్మీతో పెళ్లెప్పుడు? సుడిగాలి సుధీర్ షాకింగ్ కామెంట్స్!) శివాజీ దగ్గర నో ఆన్సర్ యావర్ తర్వాత శివాజీని నామినేట్ చేస్తున్నట్లు ప్రియాంక చెప్పింది. రాజమాతలు టాస్కులో నేను చేసింది తప్పని ఎలా అంటారు? మేం ఏం మాట్లాడుకున్నామో మీకేమైనా తెలుసా? అని ప్రియాంక అడిగేసరికి శివాజీ దగ్గర సమాధానం లేదు. దీంతో తనకు అలవాటు అయినట్లు నానా హంగామా చేశాడు. మీరు ఏమనుకుంటారో అదే చేస్తారు, నామినేషన్ యాక్సెప్టెడ్ అని అనేసి శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. మరి.. మీరు ఇద్దరు(యావర్, ప్రశాంత్) మాత్రమే తప్పులు చేస్తుంటే, చెప్పి మరీ వాళ్లని సరిదిద్దుతున్నారు, మిగతా వాళ్లకు ఎందుకు చెప్పట్లేదని ప్రియాంక అడిగేసరికి.. శివాజీ ట్రిగ్గర్ అయిపోయాడు. ఈ హౌసులో ప్రతిసారి పొరపాట్లు మీద పొరపాట్లు జరుగుతున్నాయి అని అన్నాడు. అవి ఏంటి? అనే ప్రియాంక అడిగితే.. నేను చెప్పలేను, నేను చెప్పలేను అని శివాజీ ఏదేదో మాట్లాడాడు. ఎందుకంటే పెద్దాయన దగ్గర ఆన్సర్ లేదు! ఇక్కడ అర్థమైంది ఏంటంటే.. శివాజీ ఏం చేసినా తప్పు కాదు కానీ పక్కనోళ్లు చిన్న పొరపాటు చేసినా అది తప్పే. నాగార్జున నెత్తికెక్కించుకునేసరికి శివాజీ బాగా రెచ్చిపోతున్నాడు. అందుకే ప్రియాంకపై నోటికొచ్చినట్లు మాట్లాడుతూ.. పెద్దరికం పోగొట్టుకుని బ్రెయిన్లెస్ చాణక్య అయిపోయాడు. (ఇదీ చదవండి: ఓటీటీల్లోకి ఆ రెండు హిట్ మూవీస్.. ఒక్కరోజు గ్యాప్‌లో రిలీజ్!) శివాజీ గురించి చెప్పిన గౌతమ్ నామినేషన్స్ పూర్తయిన తర్వాత బయట కూర్చుని అర్జున్‌తో మాట్లాడిన గౌతమ్.. శివాజీ అసలు ఇలా ఎందుకు ప్రవర్తిస్తున్నాడో తన అభిప్రాయాన్ని చెప్పాడు. ఆ మధ్య కొన్ని వారాల పాటు ఆయన్ని ఎవరు ఎదురించలేదు, ఇప్పుడు అలా ఆయన చేసింది తప్పని చెబుతుంటే ఆయన తీసుకోలేకపోతున్నాడని గౌతమ్ చెప్పుకొచ్చాడు. దీంతో శివాజీ అసలు రంగు బయటపడినట్లయింది. ప్రియాంక తనని నామినేట్ చేయడాన్ని తీసుకోలేకపోయిన శివాజీ.. తన బ్యాచ్ సభ్యులైన యావర్, ప్రశాంత్‌తో మాట్లాడుతూ.. గేమ్ ఆడటానికి వచ్చినా కూడా ఓ క్యారెక్టర్ అంటూ ఉండాలి. పెద్ద గేమ్, స్ట్రాటజీ, నేను ఇలానే ఆడతాను లాంటివి అనడం ఓకే, కానీ క్యారెక్టర్ కావాలి కదా అని శివాజీ అన్నాడు. మరి ఇంత చెప్పినా శివాజీకి ఏమైనా క్యారెక్టర్ ఉందా అంటే లేదు. ఎప్పుడు చూడు ఆ యావర్-ప్రశాంత్లని రెచ్చగొట్టి అవతలి వాళ్లపైకి పంపించడం తప్పితే గేమ్ ఆడిన దాఖలాలు అయితే పెద్దగా కనిపించలేదు. ఎపిసోడ్ చివర్లో ఎవిక్షన్ పాస్ కోసం బ్యాలెన్సింగ్ టాస్క్ పెట్టగా అందులో రైతుబిడ్డ ప్రశాంత్ విజయం సాధించాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఈ వారం నామినేషన్స్ లిస్ట్ శివాజీ అర్జున్ రతిక గౌతమ్ ప్రశాంత్ యావర్ అమర్దీప్ అశ్విని (ఇదీ చదవండి: ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న రైతుబిడ్డ.. ఆమెని దెబ్బకొట్టడం గ్యారంటీ!?) -
Bigg Boss 7: రైతుబిడ్డతో గౌతమ్ 'పంచె' పంచాయతీ.. క్షమాపణలు చెప్పిన రైతుబిడ్డ!
బిగ్‌బాస్ 12వ వారంలో అడుగుపెట్టేసింది. అలానే సోమవారం కాబట్టి నామినేషన్స్ మంచి ఇంట్రెస్టింగ్గా సాగాయి. కాకపోతే ఈసారి అందరి శివాజీ గ్యాంగ్‌ని టార్గెట్ చేశారనిపించింది. మరోవైపు ఓ లేడీ కంటెస్టెంట్ ఎలిమినేషన్ అనే కత్తిపై డైరెక్ట్‌గా పీక పెట్టేసింది. దీంతో ఈ వారం ఈ హాట్ బ్యూటీ బయటకెళ్లిపోవడం గ్యారంటీ అనిపిస్తోంది. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా అసలేం జరిగిందనేది Day 78 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. రతికక చెప్పి మరీ అమర్ అలా ఎలిమినేషన్ చేయకపోవడంతో అందరూ రిలాక్స్ అయిపోయారు. అలా ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. అశ్విని-గౌతమ్ ఇద్దరూ దీని గురించి మాట్లాడుకున్నారు. మరోవైపు కెప్టెన్సీ ఫైనల్ గేమ్‌లో తనని టార్గెట్ చేసి కొట్టావ్ నిన్నే ఈసారి నామినేట్ చేస్తా రతిక అని అమర్ ఆమెతో చెప్పాడు. చెప్పినట్లే చేశాడు. ఇంకా ఎవరు ఎవర్ని నామినేట్ చేశారనేది లిస్ట్ ఇదిగో. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమర్దీప్ - యావర్, రతిక గౌతమ్ - ప్రశాంత్, శివాజీ రతిక - అమర్దీప్, ప్రశాంత్ అర్జున్ - యావర్, శివాజీ ప్రశాంత్ - గౌతమ్, రతిక అశ్విని - సెల్ఫ్ నామినేషన్ యావర్ నో లాజిక్స్ ఇక ఫస్ట్ ఫస్ట్ అమర్ వచ్చాడు. యావర్‌ని నామినేట్ చేశాడు. ఎవిక్షన్ పాస్ గేమ్ ఆడే విషయంలో కాలు కింద పెట్టావ్, అది తప్పే కదా అని అమర్ అన్నాడు. అవును నేను కావాలని చేయలేదు, అది అనుకోకుండా జరిగిందని యావర్ అన్నాడు. అలానే సంచాలక్ గా నువ్వు కూడా ఫెయిలయ్యావ్ కదా అని యావర్ అంటే.. అవును ఫౌల్ ఆడినందుకు నిన్ను నామినేట్ చేస్తున్నా, రిటర్న్ నన్ను నామినేట్ చేస్కో అని ఇద్దరి మధ్య కాస్త లాజిక్‌లెస్ డిస్కషన్ జరిగింది. ఆ తర్వాత రతికని నామినేట్ చేసి అమర్ మాట్లాడుతుండగా మధ్యలో యావర్ ఎంట్రీ ఇచ్చాడు. కెప్టెన్ ప్రియాంక, యావర్‌ని కంట్రోల్ చేయాలని ప్రయత్నిస్తుంటే.. అసలు నువ్వు ఎవరు? నువ్వు ఎవరు? అని యావర్ అతిచేశాడు. ప్రశాంత్ vs గౌతమ్ తొలుత గౌతమ్, ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ చేసే గేమ్‌లో సంచాలక్‌గా ఫెయిలయ్యావని కారణం చెప్పాడు. కానీ ప్రశాంత్ వింటేగా, అస్సలు ఒప్పుకోలేదు. ఆ టతర్వాత ప్రశాంత్ వచ్చి గౌతమ్ ని నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య చాలాసేపు వాదన నడిచింది. ఒకానొక దశలో గౌతమ్‌ని ఉద్దేశించి 'పంచె ఊసిపోకుండా చూస్కో' అని ప్రశాంత్ అన్నాడు. దీంతో పంచాయతీ మొదలైంది. కాసేపటి తర్వాత అసలు నా పంచె గురించి నువ్వెవరు అసలు.. ఎక్కువ తక్కువగా మాట్లాడకు, గుర్తుపెట్టుకో అని గౌతమ్ చాలా సీరియస్ అయ్యాడు. దీంతో గోళీలు వేస్కో అని మళ్లీ ప్రశాంత్ రెచ్చగొట్టాడు. దీంతో గౌతమ్ మాట్లాడుతూ.. ఇలాంటి వాటినే చిల్లర కథలు అంటారు, ఛీ అని సీరియస్ అయ్యాడు. పాయింట్ చెప్పు, పర్సనల్ కి రాకు అని గౌతమ్ వార్నింగ్ ఇచ్చాడు. పంచె అనేది తెలుగోడి సంస్కృతి, దాన్ని కించపరుస్తూ నువ్వు మాట్లాడటం మంచిది కాదు. అది నార్మల్‌గా చెప్పడానికి వచ్చినా, అది తప్పు వేలో తీసుకెళ్లడానికి చేస్తే బాగోదని గౌతమ్ కామెంట్స్ చేశాడు. దీంతో రైతుబిడ్డకి తప్పు తెలిసొచ్చింది. పంచె గురించి నేను తప్పుగా ఏం అనలే, దయచేసి నన్ను క్షమించండి. నేను పంచె ఊడిపోకుండా కాపాడుకో అని అన్నాను తప్పితే మరోమాట అనలే అని చేతులెత్తి మరీ రైతుబిడ్డ ప్రశాంత్ క్షమాపణలు చెప్పాడు. శివాజీని లాజిక్స్‌తో కొట్టారు ప్రశాంత్ తర్వాత శివాజీని.. గౌతమ్ నామినేట్ చేశాడు. మీరు బ్యాలెన్సింగ్ గేమ్‌లో ఎక్కువ ఫౌల్స్ చేశారని గౌతమ్ అనగానే.. నువ్వెవరయ్యా చెప్పడానికి అని శివాజీ అడిగాడు. నేను సంచాలక్‌గా వచ్చి చెప్పలేదు కదా అని గౌతమ్ రివర్స్ కౌంటర్ ఇచ్చాడు. నీకు ఏమి ఉండవ్, ఏదో ఒకటి చేయాలి, నీకు గొడవ కావాలి, నాకిష్టం లేదు యాక్సెప్టెడ్.. వేస్కో అని శివాజీ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. అలానే అర్జున్ కూడా శివాజీని నామినేట్ చేశాడు. బాల్స్ బ్యాలెన్స్ టాస్కులో ప్రశాంత్ అరుస్తున్నాడని చెప్పి.. మీరు గట్టిగట్టిగా అరుస్తూ బాల్స్ విసిరికొట్టి గేమ్ నుంచి బయటకెళ్లిపోయారు. అయితే అప్పటికే యావర్ ఆడుతున్నాడు కదా.. మీరు చెప్పిన దాని ప్రకారం చూస్తే మీరే తప్పు చేశారు కదా అని అర్జున్ చెప్పగానే.. శివాజీ దగ్గర ఆన్సర్ లేదు. దీంతో హెల్తీగా తీసుకుంటానని నవ్వి ఊరుకున్నాడు. ఇక్కడ శివాజీ దగ్గర ఆన్సర్ లేదు అందుకే ఏం చెప్పకుండా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇక సిల్లీ కారణాలతో తాను నామినేట్ చేయదలచుకోలేదని, ఎవరిని నామినేట్ చేయడానికి రీజన్స్ కనిపించట్లేదని అశ్విని చెప్పగా.. ఒకవేళ పేర్లు చెప్పకపోతే సెల్ఫ్ నామినేట్ అయిపోతారని బిగ్ బాస్ అన్నాడు. అలాగే అని అశ్విని ఓకే చెప్పింది. బహుశా ఆమెకి ఇంట్లో ఉండటం ఇష్టం లేనట్లు ఉంది. ఈ వారం ఎలానూ డబుల్ ఎలిమినేషన్ ఉంది కదా! వెళ్లిపోదాం అని ఫిక్స్ అయ్యి ఇలా సెల్ఫ్ నామినేట్ చేసుకున్నట్లు ఉందని అనిపించింది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. -
రైతుబిడ్డని వదలని రతిక.. అమర్, యావర్‌ల కొట్లాట ఆగేదేలే!
బిగ్‌బాస్ షోలో గతవారం ఎలిమినేషన్ ఎత్తేయడంతో కంటెస్టెంట్లు ఊపిరి పీల్చుకున్నారు. మరీ ముఖ్యంగా అశ్విని, రతిక అయితే తమ ప్రతాపం చూపించడానికి ఇంకో వారం దొరికిందని లోలోపలే సంతోషించారు. 12వ వారం నామినేషన్స్ మొదలుపెట్టాడు బిగ్‌బాస్. గేమ్‌లో ఫౌల్స్ ఆడావని యావర్‌ను నామినేట్ చేశాడు అమర్. అయితే అది తన తప్పు కాదని, సంచాలకుడిగా ఎవరేం తప్పు చేస్తున్నారో చూసుకోవాల్సిన బాధ్యత నీదేనని అమర్ మీద మండిపడ్డాడు. ఈ క్రమంలో వీరిద్దరి మధ్య పెద్ద గొడవే జరిగింది. ఎలిమినేషన్ ఫ్రీ పాస్ కోసం ఇచ్చిన టాస్కుల్లో ఒకటైన విల్లు గేమ్‌లో ఇద్దరూ తప్పు చేశారంటూ యావర్, శివాజీలను నామినేట్ చేశాడు అర్జున్. గేమ్‌లో అందరూ అరుస్తుంటే ఏకాగ్రత దెబ్బ తిందన్న నువ్వు గేమ్‌లో అవుట్ అవగానే మిగతావాళ్లు ఆట ఆడుతున్నా పట్టించుకోకుండా అరిచేశావని కరెక్ట్ పాయింట్ లాగాడు. దీంతో శివాజీ తన దగ్గర సమాధానం లేక నవ్వి ఊరుకున్నాడు. గౌతమ్.. ప్రశాంత్, శివాజీని.. రతిక.. ప్రశాంత్, అమర్లను నామినేట్ చేశారు. మొత్తానికి ఈ వారం కెప్టెన్ ప్రియాంక, శోభా శెట్టి మినహా మిగతా ఎనిమిది మంది నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. మరి నామినేషన్స్ ఎలా జరిగాయి? ఎవరు కరెక్ట్ పాయింట్స్ చెప్పారు? అనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: 'మళ్లీ చెప్తున్నా, అలా చేసుంటే భారత్ గెలిచేది..' నటుడి వ్యాఖ్యలపై ట్రోలింగ్ -
Bigg Boss 7: శివాజీ భజన చేస్తున్న బిగ్‌బాస్! చివరకు నాగార్జున కూడా అలానే?
బిగ్ బాస్ హౌసులో భజన ఎక్కువైంది. శివాజీ ఏం చేసినా, ఏం మాట్లాడినా అతడు చెప్పిన సమాధానాలు విని తలుపుతున్నారు. పాపం హోస్ట్ నాగార్జున కూడా ఏం చేయలేకపోతున్నాడు. షోకు కొన్ని నియమాలు అని ఉంటాయి. శివాజీ మీద ప్రేమ ఎక్కువై, అవి ఉన్నట్లు కూడా మరిచిపోతున్నాడు. బూతులు మాట్లాడినందుకు వార్నింగ్ ఇవ్వాల్సింది పోయి బతిమాలాడుకుంటున్నారు. సరే ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 76 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: పెళ్లి తర్వాత భర్త వరుణ్ గురించి లావణ్య ఫస్ట్ పోస్ట్!) శివాజీ ఒకటే భజన ప్రియాంక.. బిగ్‌బాస్ హౌసుకి కొత్త కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. వీకెండ్ కదా.. నాగార్జున రావడంతో శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. శుక్రవారం జరిగినదంతా చూసిన హోస్ట్ నాగ్.. ఇంటి సభ్యుల్ని పలకరించాడు. ఈవారం అసలేం జరిగిందనే విషయాన్ని శివాజీతో మొదలుపెట్టాడు. అంతా బానే ఉంది గానీ ఓ విషయం మాత్రం నచ్చట్లేదు శివాజీ అని నాగ్ అనగానే.. బూతులా బాబుగారు! వాటిని కావాలని అనలేదని, అలా వచ్చేశాయని ఏదో చెప్పడానికి ట్రై చేశాడు. అసలు అమర్‌ని పిచ్చి పోహో అని ఎందుకన్నావ్ శివాజీ అనగానే.. ఇంట్లో పోహా చేసుకుంటాం కదా బాబుగారు అందుకే అలా అన్నానని ఓ పనికిమాలిన లాజిక్ చెప్పాడు. అమర్దీప్ ఓ పిచ్చోడు. వాటిని నేను అస్సలు పట్టించుకోలేదని అన్నాడు. శివాజీని బతిమాలాడిన నాగ్ పిచ్చి నాయాల్ల, పిచ్చి పోహా, ఎర్రి పోహా.. ఇవన్నీ హౌసులో వాడే పదాలా? అని నాగ్, శివాజీపై సీరియస్ అయినట్లు నటించాడు. ఈ విషయంలో నీ అనుభవం ఏమైంది? ఈ విషయంలో నీ సహనం ఏమైంది? ఈ విషయంలో నీ సమర్థత ఏమైంది? అని నాగ్ అడిగాడు తప్పితే.. నియమాల ప్రకారం బిగ్‌బాస్‌లో బూతులు మాట్లాడుకూడదు. అలాంటి అర్థం వచ్చేలా మాట్లాడిన పనిష్మెంట్ ఇవ్వాలనే సోయి లేకుండా పోయింది. చూసే ప్రేక్షకుల్లో చాలామందికి వాటి అర్థాలేంటో, అవి ఎంత పెద్ద బూతులనేది తెలుసు. కానీ బిగ్‌బాస్ ఆర్గనైజర్స్, హోస్ట్ నాగార్జునకు తెలియకుండా పోయింది. దీంతో ఎప్పటిలానే ఆ టాపిక్‌ని నైస్‌గా సైడ్ చేసేసి, శివాజీకి కనీసం వార్నింగ్-పనిష్మెంట్ లాంటివి ఏం ఇవ్వకుండానే మిగతా విషయాలపై పడ్డారు. (ఇదీ చదవండి: బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్.. నో ఎలిమినేషన్) నో కెప్టెన్సీ టాస్క్ ఇక ఈ వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అమర్ ప్రవర్తన గురించి నాగ్ అడిగాడు. దీంతో హీట్ ఆఫ్ ద మూమెంట్లో ఎలాగైనా సరే కెప్టెన్ కావాలనే అలా చేశానని అమర్ ఏదో సంజాయిషీ ఇచ్చుకునే ప్రయత్నం చేశాడు. ఇక ఈ సందర్భంలో నాగ్ ఓ విషయమై ట్విస్ట్ ఇచ్చాడు. వచ్చే వారం మాత్రమే కెప్టెన్సీ టాస్క్ ఉంటుందని, మిగిలిన మూడు వారాల్లో కెప్టెన్సీ టాస్క్ ఏం ఉండదని బాంబ్ పేల్చాడు. రతికకి క్లాస్- ఆ పదాలు బ్యాన్ రతికని నిలబట్టి నాగ్ కడిగేశాడు. దేంట్లో గెలిచావ్ చెప్పు రతిక అని నాగార్జున సీరియస్ అయ్యాడు. ఈ ప్రశ్న అడగానికి ముందు ఆమె ఫొటో పెట్టి మూడు బాటిల్స్ పగలగొట్టాడు. ఈవారం నామినేషన్స్ మాట్లాడిన కొన్ని మాటల్ని బ్యాన్ చేస్తున్నట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. రతిక ఎక్కువగా చెప్పే.. 'వచ్చే వారం నుంచి నేనేంటో చూపిస్తాను', 'నేను ఇక్కడి నుంచి ఆడతాను' అనే వాటితో పాటు శివాజీ ఎక్కువగా చెప్పే 'జనాలు చూస్తున్నారు' అనే వాక్యంతో పాటు సీరియల్ బ్యాచ్ ఎక్కువగా ఉపయోగించే 'పోట్రే చేస్తున్నారు' అనే ఈ వాక్యాలన్నీ ఈరోజు నుంచి హౌసులో బ్యాన్ చేస్తున్నానని నాగ్ చెప్పాడు. అయితే ఈ పనేదో ముందే చేసుంటే బాగుండేది. ఇప్పుడు చేసి ఏం ఉపయోగం అనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) ఎవిక్షన్ పాస్ రిటర్న్ ఇక ప్రశాంత్ గురించి మాట్లాడిన నాగ్.. అసలు ఈ వారం ఏమైనా గేమ్ ఆడావా నువ్వు అని అడిగాడు. దీంతో తల అడ్డంగా ఊపుతూ ప్రశాంత్ సమాధానం చెప్పలేకపోయాడు. ఫ్యామిలీ వీక్‌లో అందరూ వచ్చిన నీ పేరు చెప్పేసరికి రిలాక్స్ అయిపోయావా కదా అని కౌంటర్స్ వేశాడు. అలానే ఎవిక్షన్ పాస్ దక్కించుకునే విషయంలో యావర్ ఫౌల్ గేమ్ ఆడినట్లు వీడియోలతో సహా నాగ్ బయటపెట్టాడు. దీంతో యావర్.. అది తనకు వద్దని తిరిగిచ్చేశాడు. అయితే ఈరోజు ఎపిసోడ్ చూసిన తర్వాత ఒకటే అనిపించింది. పెద్దాయన అనే ముసుగులో నీతులు చెప్పే శివాజీ.. తాను మాత్రం నీతులు పాటించాడు. బూతుల్ని నేరుగా మాట్లాడితే ప్రాబ్లమ్ అవుతుందని, పదాలు మార్చి మరి.. తెలివిలేని అమర్‌ని అంటాడు. వీకెండ్ లో వచ్చే నాగార్జున.. పనిష్మెంట్ ఇచ్చి బుద్ది చెప్పాల్సింది పోయి శివాజీ చెప్పిన దానికి తలూపేస్తాడు. దీనిబట్టి చూస్తే బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ ఎప్పుడు మారతారో అనే సందేహం వస్తోంది. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) -
రేయ్ పనికిమాలినోడా.. పిచ్చి పోహా.. అబ్బే, ఇవి బూతులు కావు!
అనగనగనగా ఓ పెద్ద మనిషి.. గేమ్ ఫెయిర్‌గా ఆడటం చేతకాదు.. కానీ పక్కవాళ్ల ఆటకు మాత్రం వంకలు పెడుతుంటాడు. ఎవరైనా కోపంతో అరిస్తే గడ్డిపోచలా తీసిపడేస్తాడు. తాను మాత్రం అందరి మీదా అరుస్తుంటాడు. అవతలివారికి నీతులు చెప్తుంటాడు, కానీ ఒక్కసారైనా పాటించే పాపాన పోలేదు. అందరి ముందు ఇతరుల్ని మెచ్చుకుంటాడు.. గెలిస్తే చప్పట్లు కొడతాడు.. కానీ వెనకాల మాత్రం వాళ్ల గురించి చెడుగా మాట్లాడుతూ గోతులు తీస్తాడు. ఓటమిని సహించలేడు అనరాని మాటలని, సూటిపోటి మాటలతో వేధించి ఎదుటి వ్యక్తి కుంగిపోయేలా చేస్తాడు.. కానీ వాళ్లు ఏడిస్తే మాత్రం వెళ్లి ఓదార్చినట్లు నటిస్తూ అందరి దృష్టిలో మంచివాడైపోయేందుకు ప్రయత్నిస్తాడు. జోకుల ముసుగులో లోపల ఉన్న పగ, ద్వేషాన్నంతా కక్కుతాడు. అలా ఎందుకన్నావని అడిగితే ఏదో సరదాగా అన్నాను, అందులో ఏ ఉద్దేశమూ లేదని నక్కవినయం ప్రదర్శిస్తాడు. ఓటమిని అస్సలు తీసుకోలేడు.. ఎదుటివారిని తొక్కేయాలని పన్నాగాలు పన్నుతాడు.. ఇలా చెప్పుకుంటూ పోతే అతడి గురించి పెద్ద చాటభారతమే అవుతుంది. ఇంత చెప్పాక ఆ పెద్ద మనిషి ఎవరో మీకీపాటికే అర్థమయ్యి ఉంటుంది. శివాజీ.. ఈయన ఎన్ని తప్పులు చేసినా బిగ్‌బాస్ టీం వెనకేసుకొస్తూనే ఉంది. దేవుడి మీద ఒట్టేసి అబద్ధాలు దీనికి తోడు నాగార్జున సైతం అతడు ఆడకపోయినా చాణక్యుడిగా వర్ణిస్తూ ఆకాశానికెత్తేశాడు. అప్పుడప్పుడు.. అక్కడ పొరపాటు చేశావ్, వాళ్లను కొడతానన్నావ్, వీళ్లను తిట్టావు అని ధైర్యం కూడదీసుకుని అడిగినా.. ఛఛ.. దేవుడి మీద ఒట్టు.. వాళ్లంతా నా బిడ్డలు.. నేనేదో సరదాగా అన్నాను అని ఎక్కడలేని వినయం, విధేయత పులుముకుని, ఒక వెకిలి నవ్వు నవ్వేస్తాడు. దీన్ని హోస్ట్, ఇతర కంటెస్టెంట్లు గుడ్డిగా నమ్మేస్తారు. తానేం చెప్పినా నడుస్తోంది, తనను ఆపేవాళ్లే లేరని శివాజీ రెచ్చిపోతూనే ఉన్నాడు. బూతులపై నాగ్ ప్రశ్నలు.. మరీ ముఖ్యంగా అమర్‌ను పనికిమాలినోడా.. పిచ్చి పోహా.. వేస్ట్ ఫెలో.. జీరో.. ఇలా ఎన్నో మాటలన్నాడు. ఇన్నాళ్లకు నాగ్ ఈ బూతులేంటి? అని ప్రశ్నించాడు. ఈ విషయంలో నీ అనుభవం? సహనం, సమర్థత ఏమైంది? అని అడిగాడు. ఈమేరకు ప్రోమో రిలీజైంది. కానీ శివాజీ ఎప్పటిలాగే అది సరదాగా అన్నానే తప్ప కావాలని అనలేదని అరిగిపోయిన టేప్ రికార్డర్‌లా మళ్లీ చెప్పిందే చెప్పడం ఖాయం. మరి ఈసారైనా బూతుల విషయంలో శివాజీకి నాగ్ వార్నింగ్ ఇస్తాడా? లేదంటే ఎప్పటిలాగే లైట్ తీసుకుంటాడా? చూడాలి! -
ఫౌల్ గేమ్ ఆడి దొరికిపోయిన శివాజీ.. మళ్లీ శోభాశెట్టితో పనికిరాని గొడవ!
బిగ్‌బాస్ షోలో శివాజీ బాగా ఆడుతున్నాడా? అంటే కచ్చితంగా కాదు. షో నిర్వహకులు శివాజీ మంచోడు అనే ఇమేజ్ క్రియేట్ చేశారు. అందుకే మీకు అలా అనిపిస్తోంది. ఇప్పుడు ఓ గేమ్ సందర్భంగా శివాజీ నిజస్వరూపం మరోసారి బయటపడింది. తనదాకా వచ్చేసరికి తన శిష్యుడు ప్రశాంత్‌తోనే గొడవపెట్టుకున్నాడు. సంచాలక్ శోభా ఏదో చెప్పడానికి ట్రై చేస్తుంటే ఎక్కడలేని అతి చేశాడు. ఇంతకీ గురువారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 74 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. బిగ్‌బాస్ ఫిట్టింగ్ యవర్‌కి ప్లస్ అర్జున్ ఎవిక్షన్ పాస్ గెలుచుకోవడంతో బుధవారం ఎపిసోడ్ ముగిసింది. అర్జున్, తన ఎవిక్షన్ పాస్ డిఫెండ్ చేసుకోవాలని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో టాప్-5లో ఒకరితో 'షేక్ బేబీ షేక్' అనే గేమ్ ఆడాల్సి ఉంటుందని చెప్పాడు. యవర్ని ఎంచుకోగా.. అర్జున్‌ని అతడు ఓడించేసి ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దీని తర్వాత 'స్కూటర్ పై సవారీ' పోటీలో తెలివిగా ప్రశాంత్‌ని ఎంచుకున్నాడు. ఫిజికల్ పరంగా స్ట్రాంగ్ అయిన ప్రశాంత్.. నంబర్స్ గుర్తుంచుకునే ఈ టాస్కులో తేలిపోయాడు. దీంతో మళ్లీ యావర్ ఎవిక్షన్ పాస్ డిఫెండ్ చేసుకున్నాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఆరోగ్యంతో చెలగాటం.. శోభాశెట్టికి అలాంటి పరిస్థితి!) శోభాశెట్టి వాంతులు ఇక ఎవిక్షన్ పాస్ కాపాడుకునేందుకు 'ఐ లవ్ బర్గర్' అనే టాస్క్ పెట్టగా.. యావర్, శోభాశెట్టిని తన ప్రత్యర్థిగా ఎంచుకున్నాడు. అయితే ఆమె అప్పుడే భోజనం చేసి పోటీలో పాల్గొనడం వల్ల బర్గర్ అస్సలు తినలేకపోయింది. బాత్రూంలోకి వెళ్లి వాంతి చేసుకుంది. ఇక్కడ కూడా అదృష్టంతో పాటు తెలివి కలిసొచ్చేసరికి యావర్ విజయం సాధించాడు. అయితే ఈ పోటీలో ఓడిపోయిన తర్వాత శోభాశెట్టి తెగ బాధపడిపోయింది. 'ఈ వారం నాకు ఇదొక్కడే గేమ్, అది చూడగానే నాకు కాన్ఫిడెన్స్ పోయింది. అప్పుడే తిన్నా, ఎంతసేపు కూర్చున్నా, తినకుండా ఉన్నా బాగుండేది' అని ప్రియాంకతో చెబుతూ బాధపడింది. ప్రశాంత్‌పై అరిచిన శివాజీ ఎవిక్షన్ పాస్ కాపాడుకునేందుకు చివరగా 'టేక్ ఏ బౌ' అని పోటీ పెట్టాడు. ఇందులో యావర్, మిగిలిన ఇద్దరు కంటెస్టెంట్ శివాజీ, ప్రియాంకతో ఒకేసారి గేమ్ ఆడాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. అయితే ఈ గేమ్‌లో తొలుత ప్రియాంక బాల్స్ కిందపడిపోవడంతో ఆమె ఎలిమినేట్ అయిపోయింది. ఇక ప్రశాంత్ డిస్ట్రబ్ చేస్తున్నాడని శివాజీ బాల్స్ విసిరికొట్టి మరీ గేమ్ నుంచి బయటకొచ్చేశాడు. ఇక బజర్ మోగకముందే యవర్ బాల్స్ కూడా కిందపడిపోయాయి. ఇక ఈ గేమ్ జరుగుతున్న టైంలో గేమ్స్ సరిగ్గా ఆడండని ప్రశాంత్ అందరితో చెప్పాడు. దానికి డిస్ట్రబ్ అయిన శివాజీ.. ప్రశాంత్‌పై ఓ రేంజులో రెచ్చిపోయాడు. 'నువ్వు మాట్లాడకు.. నువ్వు ఎక్కువ డిస్ట్రబ్ చేస్తున్నావ్ అందరినీ' అని శివాజీ తన కోపన్నంతా బయటపెట్టాడు. మరోవైపు గేమ్ అవుతున్న సమయంలో.. శివాజీ అదే పనిగా బాల్స్‌ని చేతిలో హోల్డ్ చేశాడు. దీంతో స్వయంగా బిగ్‌బాస్ కూడా.. బాల్స్ అదేపనిగా పట్టుకుంటున్నారు శివాజీ అని వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఇక్కడ శివాజీ ఫౌల్ గేమ్ ఆడాడని బయటపడింది. (ఇదీ చదవండి: రష్మిక ఫేక్ వీడియోపై మాజీ బాయ్‌ఫ్రెండ్ కామెంట్స్) శోభాతో పనికిరాని గొడవ ఇక గేమ్ పూర్తయిన తర్వాత శోభా-ప్రశాంత్ ఏదో చెప్పాలని అనుకుంటూ ఉండగా.. బిగ్‌బాస్ ఆర్డర్ వేశాడు. 'నియమాల ప్రకారం ఎవరు గెలిచారో చెప్పండి' అని అన్నాడు. దీంతో సంచాలకులుగా వ్యవహరించిన శోభా-ప్రశాంత్ అసలేం జరిగిందా అని మాట్లాడుకుంటూ ఉండగా.. పానకంలో పుడకలా శివాజీ మధ్యలో ఎంటరయ్యాడు. అటు ఇటు అదేపనిగా తిరుగుతూ శోభాతో.. 'మీ ఇష్టం, మీ ఇష్టమొచ్చినట్లు చేసుకోండి' అని కావాలనే ఇరిటేట్ చేశాడు. కానీ శోభా చాలా ప్రశాంతంగా మాట్లాడుతూ.. అసలెందుకు అరుస్తున్నారు అన్నా మీరు' అని శివాజీని అడిగింది. దీంతో కావాలనే గట్టిగట్టిగా అరుస్తూ శోభాని రెచ్చగొట్టడానికి ట్రై చేశాడు. తనకే ఎవిక్షన్ పాస్ ఇచ్చేయాలి, లేకపోతో ఒప్పుకోను అన్నంత రేంజులో హడావుడి చేశాడు. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. శివాజీ ఆడింది ఫౌల్ గేమ్. మళ్లీ సంచాలక్ శోభాశెట్టి ఎవరు కరెక్ట్ గా ఆడారా అని డిస్కస్ చేస్తుండగానే ఆమె నిర్ణయాన్ని తారుమారు చేసేయాల్సిందే అనేలా శివాజీ చాలా ఇరిటేట్ చేశాడు. దీనిబట్టి శివాజీ.. బిగ్ బాస్ పరువు తీయడానికి తయారయ్యాడ్రా బాబు అనిపించింది. అలానే తనదాకా వచ్చేసరికి తన గ్రూప్ కే చెందిన ప్రశాంత్ ని కూడా వదల్లేదు. దీంతో శివాజీ నిజస్వరూపం ఇదీ అని అందరికీ అర్థమైంది. అలా గురవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: హీరో మహేశ్‌బాబు మంచి మనసు.. నిజంగా శ్రీమంతుడే!) -
ఓటమిని తీసుకోలేని శివాజీ.. రైతుబిడ్డపై ఫ్రస్టేషన్
బిగ్‌బాస్ హౌస్‌లో ఆటలు.. గెలుపోటములు సహజం, సర్వసాధారణం.. ఓడిపోయినప్పుడు కొందరు బాధతో ఏడుస్తారు. మరికొందరు ఆవేశంతో అరుస్తారు. హౌస్‌లో పెద్దమనిషిని అని చెప్పుకునే శివాజీ వీళ్లను బుజ్జగిస్తూ ఉంటాడు. ఇదంతా ఆటరా.. ఇలాంటి చిన్నచిన్నవాటికి గొడవలు దేనికిరా? ఎంజాయ్ చేయాలి కానీ.. అని నీతిబోధలు వల్లె వేస్తుంటాడు. అయినా నీతులు చెప్పడానికే కానీ పాటించడానికా? అన్నట్లు ఉంటుంది శివాజీ ప్రవర్తన.. ఓడిపోయి పక్కవాళ్లపై నిందలు తాజాగా రిలీజ్ చేసిన ప్రోమోతో అది మరోసారి రుజువైంది. బిగ్‌బాస్ విల్లు టాస్క్ ఇచ్చాడు. ఇందులో ప్రిన్స్, ప్రియాంక, శివాజీ ఆడారు. వీరిలో శివాజీ, ప్రియాంక ఓడిపోగా ప్రిన్స్ గెలిచాడు. కానీ ఓటమిని జీర్ణించుకోలేకపోయిన శివాజీ ఆవేశంతో ఊగిపోయాడు. ఆడుతుంటే పదేపదే మాట్లాడుతూ డిస్టర్బ్ చేస్తున్నాడని రైతుబిడ్డపై ఫ్రస్టేషన్ చూపించాడు. ఇక ఈ గేమ్‌లో శివాజీ ఓడిపోయాడని శోభ అనడంతో నీ ఇష్టం వచ్చినట్లు ఇచ్చుకో.. ఇది కరెక్ట్ కాదు అని అరిచాడు. శివాజీ డబుల్ యాక్షన్ మీరు ఇలా మాట్లాడొద్దు అని శోభ అనేసరికి రోషం పొడుచుకొచ్చిన శివాజీ.. నీకన్నా పెద్దగా అరుస్తా.. ఎందుకరుస్తున్నావ్. అరవలేనా నేను అంటూ ఆమె మీదకు దూసుకెళ్లాడు. ఇది చూసిన నెటిజన్లు శివాజీ ద్వంద వైఖరిని ఎండగడుతున్నారు. ఆడ లేక మద్దెల ఓడు అన్నట్లు ఎందుకింత ఓవరాక్షన్ చేస్తున్నాడని విమర్శిస్తున్నారు. కాగా బిగ్‌బాస్ ఇంట్లో ఈ వారం ఇంతవరకు కెప్టెన్సీ టాస్క్ పెట్టలేదు. కానీ ఎలిమినేషన్ నుంచి కాపాడే బ్రహ్మాయుధమైన ఎవిక్షన్ ఫ్రీ పాస్‌ను మాత్రం ప్రవేశపెట్టాడు. యావర్.. ఎవిక్షన్ ఫ్రీ పాస్ విన్నర్.. ఓ గేమ్ పెట్టి అందులో గెలిచిన అర్జున్‌కు ఆ పాస్ అందించాడు. కానీ అలా ఇచ్చినట్లే ఇచ్చి వెనక్కు తీసుకున్నాడు బిగ్‌బాస్. మరికొన్ని టాస్కులు ఉంటాయని.. చివరగా గెలిచిన వ్యక్తికి ఈ పాస్ సొంతమవుతుందని వెల్లడించాడు. ఈ క్రమంలో బిగ్‌బాస్ హౌస్‌లో జరిగిన అన్ని పోటీల్లో ప్రిన్స్ యావర్ దుమ్ముదులిపి పాస్ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. మరి దీన్ని ఎవరి కోసం వాడతాడు? అనేది ఆసక్తికరంగా మారింది. చదవండి: పోలీసులకు దొరికిపోయిన యాంకర్ సుమ తనయుడు. ఏం జరిగిందంటే? -
Bigg Boss 7: శుద్ధపూస శివాజీ మళ్లీ దొరికేశాడు.. రతిక, ప్రశాంత్ వల్లే ఇలా!
బిగ్‌బాస్ 7లో మరో నామినేషన్స్ డే వచ్చేసింది. అయితే ఈసారి రతిక కాస్త ఓవరాక్షన్ చేసింది. అది కూడా ఓ విషయం అర్థం కావడం వల్లే. మరోవైపు అర్జున్, ప్రశాంత్ గాలి అంతా తీసేశాడు. అలా ప్రశాంత్-రతిక అతి వల్ల శివాజీ టార్గెట్ అయిపోయాడు. మరోవైపు శోభా-ప్రియాంక భిన్నంగా ప్రవర్తించారు. ఇంతకీ సోమవారం నామినేషన్స్ సందర్భంగా ఏం జరిగిందనేది Day 71 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ మాయలో రతిక భోలె ఎలిమినేట్ కావడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక భోలె వెళ్లిపోయాడని రతిక ఏడవడంతో సోమవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. తన ఫ్రెండ్ ఎలిమినేట్ అయినందుకు అశ్విని తెగ బాధపడిపోయింది. అస్సలు ఉండలని అనిపించట్లేదని ఏడుస్తూనే కనిపించింది. మరోవైపు ఎలిమినేషన్ మొదలవడానికి ముందు రతికని శివాజీ ఇన్ఫ్లూయెన్స్ చేశాడు. 'నువ్వు ఏమనుకుంటావో నాకు తెల్వదు, నామినేషన్స్‌లో నీ టాలెంట్ చూపియ్. నన్ను నమ్ము, ఇది నీకు చాలా హెల్ప్ అవుద్ది. అవతల వాళ్లు నిన్ను ప్రశ్నించే పరిస్థితి రాకుండా చూస్కో. అలానే వాళ్లు కూడా ఏం మాట్లాడుతున్నారో విను. భయంలో ఉండి వినకు' అని రతికతో చెప్పాడు. ప్రతిసారి తను ఎవరికీ ఏం చెప్పట్లేదు బాబుగారు అని చెబుతుంటాడు కదా! మరి ఇప్పుడు చేసిందేంటో శివాజీకే తెలియాలి. దీనిబట్టి రతిక గేమ్ మానేసి ఓట్లు కోసం శివాజీ మాయలో పడిందని క్లియర్‌గా అర్థమైంది. (ఇదీ చదవండి: పెళ్లికి తొందరపడుతున్న తమన్నా.. ఆ ప్రాబ్లమ్ వల్లే ఇలా!) నామినేషన్స్ షురూ సోమవారం ఎపిసోడ్లో భాగంగా కేవలం నలుగురు మాత్రమే తమ నామినేషన్స్ పూర్తిచేశారు. అయితే ఇన్ని వారాలు తినడం, ముచ్చట్లు పెట్టడం తప్ప మరో పనిచేయని రతిక.. ఈసారి నామినేషన్స్‌లో శివాజీ ఇన్ఫ్లూయెన్స్ వల్ల రెచ్చిపోయింది. అయితే చెప్పిన పాయింట్స్ కరెక్ట్‌గా ఉండే బాగున్ను. కానీ శోభా-ప్రియాంక ఈమెని కూల్‌గా హ్యాండిల్ చేసేసరికి రతికకి ఏం చేయాలో అర్థం కాక పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ అలానే బిహేవ్ చేసింది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? రతిక - శోభాశెట్టి, ప్రియాంక అర్జున్ - ప్రశాంత్, శోభాశెట్టి ప్రియాంక - రతిక, అశ్విని గౌతమ్ - అర్జున్, అమరదీప్ (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో సినిమా) రతిక భయపడిపోయింది ఓసారి ఎలిమినేట్ అయి రీఎంట్రీ ఇచ్చిన రతిక.. తిరిగొచ్చి మూడు వారాలు అవుతున్నా పెద్దగా పీకిందేం లేదు. దీపావళి ఎపిసోడ్లో అందరూ ఇదే చెప్పేసరికి ఈసారి నామినేషన్స్ లో ఏదో ఒకటి మాట్లాడేయాలని ఫిక్స్ అయింది. ఇప్పటికే చేయకపోతే ఇంటికి పంపేస్తారుగా. అందుకే తొలుత శోభాని నామినేట్ చేసింది. గతవారం కెప్టెన్‌గా ఎఫర్ట్ ఏం కనిపించలేదని నామినేషన్‌కి కారణం చెప్పింది. మరి వీకెండ్ ఎపిసోడ్లో నాగ్ సర్ అడిగినప్పుడు, నేను కెప్టెన్సీ బాగానే చేశానని ఎందుకు పైకెత్తావ్ అని శోభా అడగ్గానే.. రతిక టాపిక్ మార్చేసింది. దీనిబట్టి అర్థమైంది ఏంటంటే రతికకి ఎలిమినేషన్ భయం పట్టుకుంది. అందుకే హైప్ తెచ్చుకోవాలని నామినేషన్స్ లో కాస్త ఓవరాక్షన్ చేసింది గానీ పెద్దగా వర్కౌట్ కాలేదు. రతిక.. ప్రియాంకని కూడా నామినేట్ చేసింది. దీంతో ఈమె కూడా లాజిక్‌తో కొట్టింది. 'నీకు ఇప్పుడు కూడా చెప్పడానికి పాయింట్ లేదు. వేరే వాళ్లు వచ్చి చెబితే దాన్ని నువ్వు సాగదీయడం తప్ప నీకు వేరేవాళ్లపై చెప్పడానికి ప్రత్యేకంగా పాయింట్స్ లేవు. రావు కూడా' అని శివాజీని ఉద్దేశిస్తూ ప్రియాంక సీరియస్ అయింది. ఈ సందర్భంగా వేరే వాళ్లు వచ్చి చెబితే అన్నది శివాజీ గురించే! అలానే 'నాగార్జున సర్ చెప్పేంత వరకు, మీ అమ్మ వచ్చి చెప్పేంత వరకు నీకు నీ విలువ తెలియదు' అని రతిక గాలి మొత్తం ప్రియాంక తీసిపడేసింది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 31 సినిమాలు) ప్రశాంత్-శివాజీ యవ్వారం ఇక అర్జున్.. పల్లవి ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. 'నీ జోలికొస్తే నువ్వు వేస్తావ్, బాగానే ఉంటది. కానీ శివాజీ అన్న జోలికొచ్చినా సరే వేస్తావ్ చూడు అక్కడ కొంచెం బాగోదు' అని అర్జున్ కారణం చెప్పాడు. దీంతో ప్రశాంత్ ఎప్పటిలానే హంగామా క్రియేట్ చేయాలని చూశాడు. కానీ మిగతవాళ్లలా అర్జున్ ఊరుకోలేదు. ప్రశాంత్, నామినేషన్స్‌లో భుజం పైకెత్తి, అటుఇటు తిరుగుతూ ఎలా ప్రవర్తిస్తాడో.. సేమ్ అర్జున్ కూడా అలానే బిహేవ్ చేశాడు. దీంతో ప్రశాంత్ మెంటలెక్కిపోయాడు. 'శివాజీ అన్న నీకు ఫస్ట్ హెల్ప్ చేశాడు. నీకు వెన్నెముకలా నిల్చున్నాడు తప్పులేదు. ఇక నుంచైనా ఆయన ఆట నువ్వు ఆడటం మానేసి, నీ ఆట నువ్వు ఆడు' అని అర్జున్ మరో కారణం చెప్పాడు. దీంతో ప్రశాంత్‌కి ఏం చేయాలో అర్థం కాలేదు. ఇది ఇంకా పెరిగితే తన బండారం బయటపడుతుంది.. బాటిల్ పగలగొట్టేయమన్నాడు. అయితే ప్రశాంత్ గురించి అర్జున్ మాట్లాడుతున్నంతసేపు.. ఏదో తప్పు చేసినవాడిలా శివాజీ ముఖం దించేసి కనిపించాడు. సో దీనిబట్టి అర్థమైంది ఏంటంటే.. శివాజీ ఎన్ని నీతి కబుర్లు చెప్పినా సరే ప్రశాంత్, రతిక, యవర్ని ఇన్ఫ్లూయెన్స్ చేస్తూ గేమ్ ఆడుతున్నాడు. పాపం ఈ ముగ్గురు.. శివాజీ మహానుభావుడు, నీతిమంతుడు, చాణక్య అనుకుని.. అడుగులకు మడుగులొత్తుతున్నారు. ఇప్పటికైనా వీళ్లు శివాజీ చెప్పాడనో, అతడి మాట వింటే ఓట్లు పడతాయనో కాకుండా ఎవరి గేమ్ వాళ్లు ఆడితే బెటర్. లేదంటే ప్రశాంత్, రతిక, యవర్ అని కాకుండా.. శివాజీ చెంచాలుగానే మిగిలిపోతారు. అలా సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: శోభాశెట్టి బాయ్‌ఫ్రెండ్ ఇతడే.. ఈ కుర్రాడెవరో తెలుసా?) -
బిగ్ బాస్ టాప్-5 ఎవరంటే..? ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్ఫుల్గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు. ఈసారి టాప్- 5లో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా అభిప్రాయపడ్డారు. అమ్మాయిలలో ప్రియాంక మాత్రమే టాప్ ఫైవ్ రేసులో ఉంది. ► మొదట అమర్ దీప్ కోసం ఆయన అమ్మగారు వచ్చారు.. అమర్ స్నేహితుడు అయిన మానస్ కూడా స్టేజీపైన కనిపించాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్ మెంబర్స్ ఎవరు అనేది తేల్చేశారు. ► భోలే షావలి కోసం ఆయన స్నేహితులు వచ్చారు. వారిలో బిగ్ బాస్ వల్ల గుర్తింపు తెచ్చుకున్న నటుడు సయ్యద్ సోహెల్ ఉన్నాడు. మరో ఫ్రెండ్ మదీన్ వచ్చాడు. ► అశ్విని కోసం ఆమె తండ్రి శ్రీనివాస్, వారి కుటుంబ స్నేహితుడు తేజ వచ్చాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► అర్జున్ కోసం ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చాడు.. ఆయన ప్రకారం టాప్ ఫైవ్ ఉండేది వీళ్లే.. ► గౌతమ్ కుటుంబ స్నేహితుల ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీరే.. ► పల్లవి ప్రశాంత్ కోసం ఆయన అమ్మగారితో పాటు సోదరి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► ప్రియాంక జైన్ కోసం ఆమె అమ్మగారితో పాటు ప్రముఖ నటి ప్రగతి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ వీళ్లే ► రతికా రోజు కోసం ఆమె అమ్మగారితో పాటు యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ భాను వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► శోభ కుటుంబ సభ్యుల ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► శివాజీ కోసం ఆయన సతీమణితో పాటు వారి కుమారుడు రిక్కీ వచ్చాడు.. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► యావర్ కోసం ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ లిస్ట్ ఇదే -
బిగ్‌బాస్ 7: శివాజీని తిట్టడానికే భయపడుతున్న నాగ్.. మరీ ఇలా అయితే ఎలా?
బిగ్‌బాస్ షోలో మరో వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. ఎప్పటిలానే హోస్ట్ నాగార్జున.. స్మూత్‌గా కౌంటర్స్ వేశాడు. శివాజీ విషయంలో మాత్రం ఎప్పటిలానే మెతకగా ప్రవర్తించాడు. కాకపోతే తిట్టడానికి బదులు బతిమాలాడుకోవడం కాస్త వింతగా, విచిత్రంగా అనిపించింది. రతిక గురించి హౌస్మేట్స్ అందరూ ఓ నిజాన్ని బయటపెట్టారు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 69 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. సీరియల్ బ్యాచ్ మధ్య గొడవ కెప్టెన్సీ రేసులో చివరకు శివాజీ, అర్జున్ మిగలడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా.. ఫ్రెండ్స్ అనుకున్నవాళ్లే తన బొమ్మని తీసుకెళ్లలేదని అమరదీప్ తెగ బాధపడిపోయాడు. ఘోరంగా హర్ట్ అయ్యాడు. ఇదే విషయాన్ని సీరియల్ బ్యాచ్ దగ్గర చెప్పాడు. ఈ క్రమంలోనే శోభా-అమర్ మధ్య చిన్నపాటి గొడవ జరిగింది. ఇది జరిగిన కాసేపటికి శివాజీతో మాట్లాడుతూ.. మీరు-ప్రియాంక ముందే ఫిక్స్ చేసుకున్నారని రతిక అనేసింది. అంతే.. 'గేమ్ ఆడవ్ నువ్వు, మిగతావన్నీ ఆలోచిస్తుంటావ్' అని రతికపై శివాజీ సీరియస్ అయిపోయాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ అశ్వినికి ఆల్రెడీ పెళ్లయిందా? మరి అలా!) శివాజీకి హెడ్ వెయిట్ ఈ వారం కొత్త కెప్టెన్ శివాజీ అయ్యాడు. అయితే ఫిజికల్ టాస్క్ పెడితే అర్జున్‌పై గెలిచి శివాజీ కెప్టెన్ కావడం అసాధ్యం. దీంతో బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ చాలా తెలివిగా ఆలోచించి, హౌస్మేట్స్ అందరినీ సీక్రెట్ రూంకి పిలిపించి ఎవరు కెప్టెన్ అయితే బాగుంటుందని నాగార్జునతో అడిగించారు. ఒక్కరు కూడా మరోమాట లేకుండా శివాజీ పేరు చెప్పారు. షో నిర్వహకులు ప్లాన్ చేసినట్లు శివాజీ కెప్టెన్ అయిపోయాడు. అయితే శివాజీకి బాగా హెడ్ వెయిట్ పెరిగిపోయిందని, అతడితో మాట్లాడుతూ నాగార్జున అన్నాడు. బతిమాలుకున్న నాగార్జున ఎవరు తప్పు చేసినా గట్టిగా నిలదీసి బెదిరించే హోస్ట్ నాగార్జున.. శివాజీ విషయంలో శీతకన్ను ప్రదర్శిస్తుంటారు. మంచోడి అని ఎప్పటికప్పుడు ప్రొజెక్ట్ చేస్తుంటారు. ఇప్పుడు అదే చేశారు. నామినేషన్స్ సందర్భంగా శివాజీ రాజమాతల్ని ఉద్దేశిస్తూ.. 'రాజమాతలు మీ మూతలు పగుల్తాయ్' అన్న వీడియోని నాగ్ ప్లే చేశాడు. దీని గురించి క్లారిటీ ఇవ్వమని శివాజీని అడిగాడు. ఇక సోఫాజి.. సినిమా యాక్టింగ్ నాగ్ ముందు చేసేసి.. 'అదంతా సరదాకి అన్నాను' అని కవర్ చేశాడు. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా నిశ్చితార్థం చేసుకున్న 'విక్రమ్' నటుడు.. అమ్మాయి ఎవరంటే?) దీంతో శివాజీ తీరుపై నాగ్ బుద్ధి చెప్పాల్సింది పోయి, బతిమలాడుకున్నాడు. 'క్యాజువల్‌గా నువ్వు అనే మాటల్ని జనాలు వేరే విధంగా అర్థం చేసుకునే అవకాశముంది. కొంత కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరముంది. నువ్వు సరదాగా అనే మాటల మూలాన కొందరి మనోభావాలు దెబ్బతినొచ్చు, దెబ్బతింటాయి కూడా. చూస్కో, నోరు కంట్రోల్లో పెట్టుకో.. అందుకే వీడియో చూపించాను' అని నాగార్జున అన్నాడు. అయితే ఈ సంభాషణ అంతా కూడా బిగ్‌బాస్ హౌస్‌మేట్‌కి చెబుతున్నట్లు కాకుండా అలా చేయొద్దురా అని ఫ్రెండ్‌తో బతిమాలాడుకున్నట్లు అనిపించింది. ఇదంతా చూస్తే శివాజీకి హౌస్ట్ నాగార్జున ఫేవర్ అంతా బట్టబయలైంది. రతిక ఎలిమినేషన్ టెన్షన్ ఇక రతికని వీకెండ్ ఎపిసోడ్ లో చూసిన నాగార్జున్.. ఎందుకంత టెన్షన్ పడుతున్నావ్? అని అడిగాడు. 'అంత టెన్షన్లో వద్దు, ఎప్పుడు కొంచెం టెన్షన్లో ఉంటావ్.. వద్దు వద్దు' అని నాగార్జున అన్నాడు. దీంతో రతిక.. 'హౌసులో ఉండాలని ఉంది సర్ అందుకే ఇలా' అని చెప్పుకొచ్చింది. 'ఉండాలి అంటే నువ్వు ఆడాలి అంతే, సింపుల్ ఫార్ములా' అని నాగ్ చెప్పాడు. దీంతో రతిక.. ఎలిమినేషన్ భయం బయటపడింది. ఇకపోతే ఈ వారం పాస్-ఫెయిల్ అని చిన్న గేమ్ పెట్టగా.. ఇంటి సభ్యులందరూ కూడా రతిక పూర్తిగా ఫెయిలైందని ఓటేశారు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. దీపావళి సందర్భంగా ఆదివారం సాయంత్రం 7 గంటల నుంచి స్పెషల్ ఎపిసోడ్ ఉండనుంది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: పదో వారం ఆ కంటెస్టెంట్ ఎలిమినేట్!) -
Bigg Boss 7: శివాజీ vs గౌతమ్.. గొడవలో లాజిక్ లేదు కానీ ఆ నిజాలు బయటకు!
బిగ్‌బాస్ 7లో ప్రస్తుతం ఫ్యామిలీ వీక్ నడుస్తోంది. దీంతో హౌస్ అంతా ఎమోనషల్‌గా మారిపోయింది. ఇలాంటి టైంలో బిగ్‌బాస్ పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో మళ్లీ గొడవలు షురూ. శివాజీతో గౌతమ్ కొట్టుకుంటారేమో అనేంతలా రెచ్చిపోయాడు. కోపంలో అరుస్తూ గౌతమ్.. శివాజీ గురించి కొన్ని నిజాలు బయటపెట్టాడు. దీంతో అందరికీ శివాజీ నిజస్వరూపం ఇదేనా డౌట్ వచ్చింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో Day 68 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. అతి చేసిన రతిక ఫ్యామిలీ వీక్ సందర్భంగా కంటెస్టెంట్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఒక్కొక్కరుగా హౌసులోకి వస్తున్నారు. శుక్రవారం అలా తొలుత రతిక తండ్రి ఎంట్రీ ఇచ్చారు. అయితే ఆయన రావడంతో రతిక గట్టిగా పట్టుకుని ఏడ్చేసింది. ఇది కాస్త అతిలా అనిపించింది. ఎందుకంటే ఇప్పటికే ఓసారి రతిక ఎలిమినేట్ అయింది. దీంతో ఇంటికెళ్లి తల్లిదండ్రులని కలిసింది. దేవాలయాలకు కూడా తండ్రితో కలిసి వెళ్లినట్లు వీడియోలు పోస్ట్ చేసింది. ఇప్పుడేమో తండ్రి హౌసులోకి రాగానే తెచ్చిపెట్టుకున్నట్లు ఏడ్చేసింది. మళ్లీ వెంటనే ఏడుపు ఆపేసింది. బహుశా అందరూ తమ తమ ఫ్యామిలీ మెంబర్స్ ని పట్టుకుని ఏడుస్తున్నారని రతిక కూడా ఏడ్చినట్లు అనిపించింది తప్పితే రియల్ ఎమోషనల్ కనిపించలేదు. (ఇదీ చదవండి: ఓటీటీలోకి 'భగవంత్ కేసరి' సినిమా.. రిలీజ్ డేట్ ఫిక్స్?) రైతుబిడ్డ తండ్రి ఆగయా రతిక తండ్రి వెళ్లిన కాసేపటి తర్వాత పల్లవి ప్రశాంత్ తండ్రి వచ్చారు. చేనులో పండిన బంతిపూలని తీసుకొచ్చి కొడుక్కి ఇచ్చారు. అయితే నాన్న కోసం పొద్దున్నుంచి తినకుండా ఎదురుచూసిన ప్రశాంత్.. తండ్రితో కలిసి భోజనం చేశాడు. ఒకరికొకరు గోరుముద్దులు తినిపించుకోవడం చూడటానికి మంచిగా అనిపించింది. 'ఆట మంచిగా ఆడుకో, ఎవరివి ఏమనకు, నీ ఆట నువ్వు ఆడుకో' అని కొడుక్కి ధైర్యం చెప్పి ప్రశాంత్ తండ్రి వెళ్లిపోయారు. రతిక కన్నింగ్ గేమ్ ఫ్యామిలీ వీక్ అయిపోయింది. దీంతో కెప్టెన్సీ కోసం బిగ్ బాస్ 'ఓ బేబీ' అని ఓ టాస్క్ పెట్టాడు. ఇందులో భాగంగా ఓవైపు టేబుల్ ఆయా కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఫొటోలు అతికించిన బొమ్మలు ఉంటాయి. బజర్ మోగిన ప్రతిసారి ఎవరి బొమ్మ అయితే మిగిలిపోతుందో వాళ్లు ఎలిమినేట్ అయినట్లు. ఇందులో వరసగా శోభా, ప్రశాంత్, యవర్, అమరదీప్, రతిక, అశ్విని, భోలె, ప్రియాంక, గౌతమ్ ఎలిమినేట్ అయిపోయారు. అయితే ఈ గేమ్‌లో కావాలనే మూడు నాలుగుసార్లు పరుగెత్తకుండా రతిక కన్నింగ్ గేమ్ ఆడింది. చివరకు ఐదో ప్రయత్నంలో ఆమె బొమ్మని ఎవరు పట్టుకెళ్లలేదు. దీంతో తను తీసిన గోతిలో తానే పడి బలైపోయింది. (ఇదీ చదవండి: మెట్లపై నిద్రపోయేది.. సుమ సీక్రెట్ బయటపెట్టిన మరో యాంకర్!) శివాజీ vs గౌతమ్ ఇక చివరగా ముగ్గురున్నప్పుడు గౌతమ్ బొమ్మ శివాజీ తీసుకోవడంతో గౌతమ్.. ఎలిమినేట్ అయిపోయాడు. దీంతో కావాలనే శివాజీ తన బొమ్మ పట్టుకున్నారని చెప్పి గౌతమ్ సీన్ క్రియేట్ చేశాడు. అన్యాయం జరిగిందని చెప్పి శివాజీతో గొడవ పెట్టుకున్నాడు. ఇద్దరూ ఒకరిపై ఒకరు మీదపడి మరీ అరుచుకున్నారు. 'ప్రతిసారి నీతో గోల, వాంటెడ్‌గా గొడవ పెట్టుకుంటావ్, ప్రతిసారి నీకు అటెన్షన్ కావాలి, అలానే గొడవ చేస్కో' అని శివాజీ అనేసరికి గౌతమ్ మరింత రెచ్చిపోయాడు. 'మీకు కావాల్సినట్లు జరిపించండి, బిగ్‌బాస్‌తో మీరు మాట్లాడుకోండి. మీరు సెకండ్ బిగ్‌బాస్ అనుకుంటా, నేను కూర్చుని ఉంటాను' అనే శివాజీని ఉద్దేశిస్తూ గౌతమ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. 'నువ్వు కేవలం అటెన్షన్ కోసమే ఇదంతా చేస్తున్నావ్' అని శివాజీ తిరిగి అనేసరికి గౌతమ్‌కి పట్టరాని కోపం వచ్చేసింది. మైక్ పక్కనబెట్టి.. వెళ్లిపోతా బిగ్‌బాస్, తలుపు తెరవండి అని గట్టిగా బాదుతూ సీన్ క్రియేట్ చేశాడు. శివాజీ నిజస్వరూపం గౌతమ్ చెప్పిన దానిబట్టి చూస్తే.. శివాజీ, రెండో బిగ్‌బాస్‌లానే ప్రవర్తిస్తున్నాడు. ఎందుకంటే హౌసులోకి అడుగుపెట్టినప్పటి నుంచి పెద్దమనిషి తరహాలో అందరికీ నీతులు చెబుతూ, ప్రశాంత్-యవర్-భోలెతో ఓ బ్యాచ్ తయారు చేసుకుని ఏదేదో చేస్తున్నాడు. శివాజీ ఏం చేసినా సరే వీకెండ్ వచ్చేసరికి హౌస్ట్ నాగార్జున ఇతడికే సపోర్ట్ చేస్తున్నాడు. బహుశా హౌసులోకి రావడానికి ముందే శివాజీ.. బిగ్‌బాస్ ఆర్గనైజర్స్ అగ్రిమెంట్ చేసుకున్నాడేమో? అని డౌట్ ప్రేక్షకులకు కలుగుతోంది. అదే టైంలో హౌసులో గౌతమ్ తప్ప శివాజీతో ఏ ఒక్కరూ గొడవ పడటానికి ధైర్యం చేయట్లేదు. అందులో గౌతమ్, శివాజీకి కరెక్ట్ మొగుడిలా కనిపించాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ఎండ్ అయింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డకు ఆ బ్యాడ్ న్యూస్ చెప్పిన తండ్రి!) -
Bigg Boss 7: ముగ్గురికీ హింట్స్ ఇచ్చిన కుటుంబ సభ్యులు, ఏడిపించేశారు..
బిగ్‌బాస్ హౌస్‌లో ఓ మ్యాజిక్ ఉంది. తిట్టుకున్నా, కొట్టుకున్నా, ద్వేషించినా, ప్రేమించినా ఫ్యామిలీ వీక్ వచ్చేసరికి మాత్రం అంతా కలిసిపోతారు. ఆయా కంటెస్టెంట్ల అభిమానులు కూడా ఆ ఒక్కవారం ఏ కంటెస్టెంట్ మీదా విమర్శించలు గుప్పించడానికి ఇష్టపడరు. ఇంటి సభ్యులను చూసి కంటెస్టెంట్లు కన్నీళ్లు పెట్టుకుంటే వారిని చూసి ప్రేక్షక జనాలు సైతం ఎమోషనల్ అవుతుంటారు. మరి తాజా(నవంబర్ 7నాటి) ఎపిసోడ్లో ఏయే కంటెస్టెంట్ల కుటుంబ సభ్యులు హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చారో చూసేద్దాం.. కాలేజ్‌గా మారిన బిగ్‌బాస్ ఈ వారం ఫ్యామిలీ వీక్ కావడంతో ఇంకా అప్పుడే టాస్కుల జోలికి పోలేదు బిగ్‌బాస్. అంతేగాక బిగ్‌బాస్ హౌస్‌ను బీబీ కాలేజ్‌గా మార్చాడు. ఇక్కడ అందరూ విద్యార్థులుగా ఉంటారని, సమయానుసారం వీరిలో కొంతమంది టీచర్లుగా మారి పాఠాలు చెప్పాల్సి ఉంటుందన్నాడు. అంతిమంగా వినోదాన్ని అందించాలన్నాడు. ఇంతలో శివాజీని మెడికల్ రూమ్‌కు రమ్మన్నాడు బిగ్‌బాస్. అక్కడ ముఖానికి మాస్కు, తలకు క్యాప్ వేసుకుని ఉన్న డాక్టర్.. శివాజీ ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. ఎక్సర్సైజులు చేస్తున్నారా? అని అడగ్గా చేస్తున్నట్లు చెప్పాడు శివాజీ. రెండు, మూడు రోజుల్లో నొప్పి తగ్గిపోతుందని డాక్టర్ చెప్పగానే థాంక్యూ అంటూ అక్కడి నుంచి వెళ్లబోయాడు. శివాజీకి హింటిచ్చిన పెద్ద కుమారుడు ఇంతలో డాక్టర్.. నాన్న అని పిలవడంతో షాకైన శివాజీ వెనక్కు తిరిగాడు. వెంటనే మాస్కు, క్యాప్ అన్నీ తీసేయగా డాక్టర్‌గా వచ్చింది నా పెద్ద కొడుకా అని ఒక్కసారిగా ఏడ్చేశాడు. కెన్నీ.. శివాజీతో కబుర్లాడుతూ ఓ సలహా ఇచ్చాడు కెన్నీ. హౌస్‌లో అందరినీ నమ్మకు. యావర్, ప్రశాంత్ గురించి కాదు. మిగిలినవాళ్లు ఎంత రెచ్చగొట్టాలని చూసినా రెచ్చిపోకు. మాటలు జారుతున్నావు, చూసుకో అని హెచ్చరించాడు. హౌస్ నుంచి వెళ్లేటప్పుడు కూడా వీకెండ్లో నాగ్ సర్ ఇచ్చే పాయింట్లు దృష్టిలో పెట్టుకుని ఆడమన్నాడు. తర్వాత అర్జున్ అంబటి భార్య సురేఖ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. గర్భవతిగా ఉన్న భార్యను చాలారోజుల తర్వాత చూడటంతో కన్నీళ్లు ఆపుకోలేకపోయాడు అర్జున్. నీపై కోపం వస్తోంది: అర్జున్ భార్య సురేఖపై ముద్దుల వర్షం కురిపించాడు. నీ ఎమోషన్స్ దాచుకోకు.. బయటపెట్టు. నువ్వు రియాక్ట్ అవ్వట్లేదని నాకు కోపం వస్తుంది.. నువ్వు రియాక్ట్ అయితే చూడాలనుంది అంటూ అర్జున్‌కు సలహా ఇచ్చింది అతడి భార్య. భర్తకు ప్రేమగా గోరుముద్దలు పెడుతూ డల్‌గా ఉండకు.. కప్పు ముఖ్యం బిగిలూ అని తన లక్ష్యాన్ని గుర్తు చేసింది. ఇంతలో ఆమెకు సీమంతం చేసేందుకు బిగ్‌బాస్ పసుపు-కుంకుమ, పళ్లు, పూలు, గాజులు.. అన్నీ పంపించాడు. హౌస్ అంతా కలిసి సురేఖకి సీమంతం చేశారు. భర్త చేతుల మీదుగా సీమంతం జరుపుకున్న ఆనందాన్ని గుండె నిండా నింపుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది సురేఖ. బంగారుతల్లి.. ఏడ్చేసిన అశ్విని తల్లి కాసేపటికి హౌస్‌లో ఉన్న అందరినీ కదలకుండా ఉండాలన్నాడు బిగ్‌బాస్. సరిగ్గా అప్పుడే అశ్విని తల్లి ఎంట్రీ ఇచ్చింది. నా బంగారుతల్లి.. అంటూ అశ్వినిని పట్టుకుని ఏడ్చేసింది ఆమె తల్లి. అశ్విని అయితే నేనూ నీతో వచ్చేస్తానమ్మా అంటూ కన్నీళ్లు పెట్టుకుంది. పెద్దవాళ్లతో కలిసుండు.. నా అని నువ్వు ఎవరిని అనుకుంటావో వాళ్లు నీవాళ్లు కాదు.. ఎవరైతే కాదనుకుంటావో ఆ పెద్దవాళ్లే న్యాయంగా ఉంటారు. అని సలహా ఇచ్చింది అశ్విని తల్లి. ఇంతలో బిగ్‌బాస్ అశ్వినికి తన కుక్కపిల్ల(సోను) ఫోటోను గిఫ్ట్‌గా పంపాడు. తర్వాత భారంగా తల్లికి వీడ్కోలు పలికింది అశ్విని. అలా ఈరోజు ఎపిసోడ్ మొత్తం ఎమోషన్‌తో పిండేశారు. చదవండి: ఆ ఒక్క ఘటనతో కుదేలైన కెరీర్.. ఇప్పుడు ఫుల్ ఫామ్‌లో ఉన్న త్రిష -
బిగ్ బాస్‌లో ఫ్యామిలీ వీక్..
బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు పది వారాలు పూర్తి కావస్తుంది. ఇక నుంచి బలమైన కంటెస్టెంట్లే హౌస్ నుంచి ఎలిమినేషన్ కానున్నారు. దీంతో ఆట రసవత్తరంగా మారనుంది. ఇలాంటి సమయంలో కుటుంబ సభ్యులను హౌస్‌లోకి దింపుతున్నాడు బిగ్ బాస్. సాధారణంగా ప్రతి సీజన్లో సుమారు 12 వారంలో హౌస్‌లోకి కుటుంబ సభ్యులు వచ్చేవారు. ఇదీ ఉల్టాపుల్టా కదా అందుకే కొంచెం ముందుగానే ఈ ప్లాన్‌ను సెట్ చేశాడు బిగ్ బాస్. హౌస్‌లో మిగిలిన 11 మంది కంటెస్టెంట్స్‌కి సంబంధించిన ఫ్యామిలీ మెంబర్స్ హౌస్‌లోకి అడుగుపెట్టబోతున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం శివాజీ పెద్ద అబ్బాయి ఎంట్రీ ఇచ్చాడు. శివాజీకి రెగ్యులర్ హెల్త్ చెకప్‌లో భాగంగా అప్పుడప్పుడు డాక్టర్ రూమ్‌కు వెళ్తుంటాడు. అందులో భాగంగా ఆయన పెద్ద కుమారుడు శ్రీ మాస్క్‌తో పాటు కళ్లజోడు, కోట్ దరించి డాక్టర్ మాదిరి ఎంట్రీ ఇచ్చాడు.. సార్ మీ ఆరోగ్యం ఎలా ఉందని ప్రశ్నిస్తాడు.. కానీ అక్కడికి వచ్చింది తన కుమారుడేనని గుర్తించని శివాజీ ఫర్వాలేదని చెప్పి తిరిగి వెళ్తున్న సమయంలో నాన్న... అంటూ శ్రీ పిలుస్తాడు. ఆ సమయంలో శివాజీ ఒక్కసారిగా ఎమోషనల్ అవుతాడు. ఒక్కసారిగా తన బిడ్డను కౌగిలించుకున్న శివాజీ.. తర్వాత అందరికీ నా కుమారుడు అంటూ పరిచయం చేస్తాడు. ఆ సమయంలో అందరూ చాలా సంతోషంగా శ్రీ దగ్గరకు వచ్చి పలకరిస్తారు. బీటెక్ పూర్తి చేసుకున్న 'శ్రీ' మాస్టర్స్ కోసం అమెరికా వెళ్తున్నాడు. అన్నీ సెట్ అయితే మరో వారం లోపు ఆయన ప్రయాణం మొదలౌతుంది. ఇదే విషయాన్ని శివాజీకి కూడా శ్రీ తెలుపుతాడు. దీంతో వెళ్లె ముందు తన తండ్రిని శ్రీ ఇలా కలుసుకున్నాడు. బహుశా బిగ్ బాస్ కూడా ఈ విషయాన్ని గుర్తించే ఫ్యామిలీ వీక్‌ను రెండు వారాలు ముందుకు తీసుకొచ్చినట్లు తెలుస్తోంది. ఇలాంటి అనుబంధాల విషయంలో బిగ్ బాస్ తీసుకున్న నిర్ణాయాన్ని పలువురు అభినందిస్తున్నారు. తాజాగా విడుదలైన ప్రోమో బాగుందని నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. -
నలిగిపోయిన అశ్విని, ఇచ్చిపడేసిన రతిక.. సీరియల్ బ్యాచ్ సేఫ్
నామినేషన్స్ అంటే డైరెక్ట్‌గా బయటకు పంపించేయరురా.. ఇదొక ప్రక్రియ మాత్రమే.. జనాలకు నచ్చితే ఉంటాం, లేదంటే పోతాం.. అంటూ నీతులు వల్లవేస్తుంటాడు శివాజీ. కానీ తనదాకా వచ్చేసరికి మాత్రం ఎవరైనా నామినేట్ చేస్తే చాలు తోక తొక్కిన తాచులా లేస్తుంటాడు. అవతలి వారి గొంతు పెగలనియ్యకుండా ఏది పడితే అది అనేస్తాడు. ఈరోజు కూడా అదే జరిగింది. తనను నామినేట్ చేయడంతో అతడి అహం దెబ్బ తింది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి (నవంబర్ 6) ఎపిసోడ్ హైలైట్స్ చదివేయండి.. కత్తులు దూసిన కంటెస్టెంట్లు వాళ్లూ వీళ్లు చెప్తే కాదు, శివాజీని రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకోవాలంటూ గౌతమ్‌కు సలహాలిచ్చాడు అర్జున్. తాను కూడా సరైన సమయం కోసం వేచి చూస్తున్నానన్నాడు. అనంతరం బిగ్‌బాస్ నామినేషన్ ప్రక్రియ గురించి వెల్లడించాడు. ఈసారి నామినేషన్స్ బిగ్‌బాస్ మహారాజ్యంలో జరుగుతాయని, ఈ రాజ్యంలో శోభ, ప్రియాంక, అశ్విని, రతికలను రాజమాతలుగా ప్రకటించాడు. శంఖారావం వచ్చిన ప్రతిసారి ఇద్దరు కంటెస్టెంట్లు కత్తులను బయటకు తీసి మిగతా ప్రజల్లో ఎవరిని నామినేట్ చేయాలనుకుంటున్నారో చెప్పాలి. ఆ ఇద్దరిలో ఎవరి నామినేషన్ సబబు అనిపిస్తే వారిని రాజమాతలు నేరుగా నామినేట్ చేస్తారు. రాజకీయాలు జరిగాయన్న భోలె మొదట అమర్, అర్జున్ కత్తులు అందుకున్నారు. అమర్ మాట్లాడుతూ.. భోలె షావళిని టీమ్ నుంచి వెళ్లగొడుతుంటే తనను తాను సమర్థించుకోలేకపోయాడన్నాడు. దీనికి భోలె స్పందిస్తూ అక్కడ రాజకీయాలు జరిగాయని, అందుకే ఆ గ్రూపు నుంచి బయటకు రావడానికి సంకోచించలేదన్నాడు. అర్జున్ మాట్లాడుతూ.. చెప్పుడు మాటలు విని గౌతమ్ శివాజీ మీద అసత్య ఆరోపణలు చేశాడంటూ డాక్డర్బాబును నామినేట్ చేశాడు. అమర్, అర్జున్‌లలో రాజమాతలు అమర్ చెప్పిన పాయింట్ ఎక్కువ సమ్మతంగా అనిపించడంతో అతడి ప్రకారం భోలెను డైరెక్ట్‌గా నామినేట్ చేశారు. జీవితాలతో ఆడుకోకూడదు.. సోది మొదలుపెట్టిన భోలె ప్రిన్స్.. అమర్‌ను, ప్రశాంత్.. గౌతమ్‌ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యారు. రాజమాతలు..ప్రశాంత్‌కు మద్దతుగా నిలబడి గౌతమ్‌ను నామినేట్ చేశారు. తర్వాత భోలె షావళి.. అమర్ నన్ను వీక్ అనడం నచ్చలేదంటూ నామినేట్ చేశాడు. కానీ అది సూటిగా చెప్పకుండా జీవితాలతో ఆడుకోకూడదు.. అదీ ఇదీ అని ఏదేదో సోది చెప్పాడు. ఇంతలో రాజమాత ప్రియాంకకు రోషం పొడుచొక్కింది. అమర్ నిన్ను వీక్ అనలేదు, బిగ్‌బాస్ అన్నాడంటూ అతడి తరపున లాయర్లా వాదించింది. ఊరుకో అని అశ్విని నచ్చజెప్పేందుకు ప్రయత్నించగా ఆమె మీదకు గయ్యిమని లేచింది. శివాజీని అడ్డంగా బుక్ చేసిన గౌతమ్ గౌతమ్.. శివాజీ ఎవరినో కొట్టేసి పోతానన్నాడు. నాగ్ దాని గురించి అడిగితే తనను తాను కొట్టుకుని పోతానని మాట మార్చాడని చెప్పాడు. రాజమాతలు గౌతమ్‌కు మద్దతుగా నిలిచి శివాజీని నేరుగా నామినేషన్లోకి పంపించారు. ఇది సహించలేకపోయిన శివాజీ.. వాడి పాయింట్స్ మీకు కరెక్ట్‌గా అనిపించాయా? నేను తప్పుడు నా బిడ్డనైతే నన్ను ఎలిమినేట్ చేయండి అని ఆగ్రహించాడు. ఇంతలో ప్రియాంక, శోభ.. అశ్విని గొడవపడ్డారు. తనను అసలు మాట్లాడనివ్వట్లేదని, గడ్డిపోచ కన్నా హీనంగా చూస్తున్నారని బాధపడింది అశ్విని. కాళ్లు మొక్కిన అశ్విని నువ్వొక్కదానివి గ్రేట్.. ఇక్కడ కూర్చున్న మేమంతా వేస్టా? అని ప్రియాంకతో వాదిస్తూ ఏడ్చింది. మధ్యలో శోభ గట్టిగట్టిగా అరవడంతో.. మేమిద్దరం మాట్లాడుతుంటే నువ్వెందుకు మధ్యలోకి వస్తున్నావని ఆమెపై ఫైర్ అయింది. కానీ వాళ్లముందు అశ్విని నిలబడగలదా? అశ్విని ఒక్కమాట అంటే ప్రియాంక, శోభ నాలుగు మాటలంటూ తనను డామినేట్ చేశారు. వారితో అరిచే ఓపిక లేక ఏడుస్తూ ఇద్దరి కాళ్లు మొక్కింది. దీంతో ఆ సీరియల్ నటులిద్దరూ ఇదంతా ఓవర్ యాక్షన్ అని తిట్టిపోశారు. అనంతరం శివాజీ, ప్రిన్స్ కత్తులు పట్టుకుని నిలబడ్డారు. మొదటగా శివాజీ.. గోనెసంచి గేమ్‌లో అమర్ నా చేయి పట్టుకుని లాగడంతో చేయంతా నొప్పి పుట్టిందంటూ నామినేట్ చేశాడు. అమర్‌ను టార్గెట్ చేసిన ఆ ఇద్దరు నిజానికి ఈ శివాజీయే అమర్ వల్ల చేయి బాగైందని కూడా సంతోషించాడు. ఇప్పుడు అమర్‌ను టార్గెట్ చేస్తూనే పైకి మాత్రం ఇతరత్రా కారణాలు చెప్పుకొచ్చాడు. ప్రిన్స్ యావర్ సైతం మరోసారి అమర్‌ను నామినేట్ చేసేందుకు రెడీ అయ్యాడు. కానీ ఇద్దరూ ఒకరినే నామినేట్ చేసేందుకు వీల్లేదన్నాడు బిగ్‌బాస్. ఎవరో ఒకరిని నామినేట్ చేయకపోతే నువ్వే నామినేట్ అవుతావని హెచ్చరించాడు. దీంతో యావర్ తనకు తానుగా నామినేట్ అయ్యేందుకు రెడీ అయ్యాడు. అటు రాజమాతలు కూడా యావర్‌నే నామినేట్ చేశారు. ఈరోజు చాలామంది అమర్‌ను నామినేట్ చేసేందుకు ప్రయత్నించినా రాజమాతలు మాత్రం విశ్వప్రయత్నాలు చేసి అతడిని కాపాడారుజ. బలైన రతిక అనంతరం అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. రాజమాతలు చర్చించుకుని వారిలో ఒకరు నామినేట్ అవ్వాలన్నారు. రతిక, అశ్విని.. ప్రియాంకను నామినేట్ చేయగా ప్రియాంక, శోభ.. రతికను నామినేట్ చేశారు. ప్రియాంక, రతికకు టై అవడంతో నామినేషన్ బాధ్యతను కెప్టెన్‌కు అప్పగించాడు బిగ్‌బాస్. శోభకు మరో ఆప్షనే లేదు, ప్రియాంకను సేవ్ చేసి రతికను నామినేట్ చేసింది. కానీ ఈ క్రమంలో పెద్ద యుద్ధమే నడిచింది. నువ్వు నాకు ఆఫ్ట్రాల్ అంటూ శోభకు ఇచ్చిపడేసింది రతిక.ఈ వారం భోలె షావళి, శివాజీ, గౌతమ్, ప్రిన్స్ యావర్, రతిక రోజ్ నామినేషన్లో ఉన్నారు. చదవండి: జూన్‌లో పెళ్లి.. త్వరలో తండ్రి కాబోతున్న హీరో.. -
తేజ ఎలిమినేట్.. వారికి రీ ఎంట్రీ ఛాన్స్
బిగ్ బాస్ సీజన్ - 7 నుంచి టేస్టీ తేజ ఎలిమినేట్ అయ్యాడు. 9 వారాల పాటు ఆటలొ కొనసాగిన ఆయన పాజిటివిటీని సంపాదించుకుని హౌస్ నుంచి వచ్చేశాడు. ఇలాంటి సమయంలో ఇప్పటికే 8 వారంలోనే ఎలిమినేట్ అయిన ఆట సందీప్ రీ ఎంట్రీ ఇస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ విషయాన్ని తన అభిమానులు సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. అందుకు వారు కొన్ని కారణాలను కూడా చెబుతున్నారు. ఎనిమిదో వారంలో సందీప్ నామినేషన్ లిస్ట్‌లోకి రావడానికి ప్రధాన కారణం తేజ అని తెలిసిందే.. అలా మొదటిసారి నామినేట్ కావడం ఆపై సందీప్ ఎలిమినేషన్ అవడం జరిగిపోయింది. అదే విధంగా తేజ ఎలిమినేషన్‌కు కారణం శివాజీ.. నామినేషన్ సమయంలో సందీప్ అంశాన్ని లేవనెత్తి తేజను నామినేట్ చేశాడు శివాజీ... ఇలా ఈ ముగ్గురి మధ్యనే గేమ్ నడిచింది. బిగ్ బాస్‌లో ఉన్నంత వరకు అమర్,శోభ బ్యాచ్‌లో సందీప్ ఉన్నాడు.. కానీ హౌస్ నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆయన ఎక్కువగా శివాజీ, పల్లవి ప్రశాంత్‌నే మెచ్చుకుంటూ పలు ఇంటర్వ్యూలు ఇచ్చాడు. అదే సమయంలో అమర్,తేజ ఆట గురించి నెగటివ్‌గా మాట్లాడటం జరిగింది. ఇప్పటికే రతికా రోజ్‌కు రీ ఎంట్రీ అవకాశం ఇచ్చారు.. కానీ ఆమె అంతగా మెప్పించలేక పోయింది. దీంతో సందీప్‌కు ఉల్టాపుల్టా పేరుతో రీ ఎంట్రీ అవకాశం కల్పించాలని బిగ్‌బాస్ టీమ్ కూడా యోచిస్తుందట. అప్పుడు సందీప్ శివాజీ టీమ్ వైపు ఉంటాడా..? అమర్ బ్యాచ్ వైపు ఉంటాడా..? అనే విశయంలో రసవత్తరం మొదలౌతుంది. అన్నీ అనుకూలిస్తే మరో రెండు రోజుల్లో సందీప్ రీ ఎంట్రీ గ్యారెంటీ అని సమాచారం. బిగ్ బాస్‌లో సంచాలక్‌గా మాత్రమే ఆయన కొన్ని తప్పులు చేశాడు కానీ ఆటలో ఎక్కడా కూడా సహనం కోల్పోలేదు.. ఎలాంటి నెగటివ్ లేకుండా హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యాడు. -
సోఫాజీ.. శివాజీ పరువు తీసిన నాగ్.. వీళ్లు బంగారం, వాళ్లు బొగ్గు
నాగార్జునతో తేల్చుకునే సమయం కోసం తెగ ఎదురుచూశారు తేజ, గౌతమ్. ఇద్దరి ఫిర్యాదు శివాజీ గురించే! అయితే ఎప్పటిలాగే శివాజీని వెనకేసుకువచ్చే ప్రయత్నం చేశాడు నాగ్. గేమ్‌లో దొంగతనం చేయబోతే శివాజీ నానామాటలు తిట్టి, బెదిరించిన సంగతి తెలిసిందే కదా! అదంతా అతడి స్ట్రాటజీ అని శివాజీకి పాజిటివ్‌గా మాట్లాడారు. దీంతో తేజ, గౌతమ్ బిక్కమొహం వేసుకున్నారు. అటు అశ్విని కూడా గట్టిగానే కల్ఆస్ పీకాడు నాగ్. మరి నేటి(నవంబర్ 4) ఎపిసోడ్ హైలైట్స్‌లో ఏమేం జరిగాయో చదివేయండి.. శివాజీ ఫౌల్ గేమ్స్.. ఒప్పుకున్న యావర్ ఎప్పుడూ ప్రశాంత్, యావర్ జపం చేసే శివాజీ కెప్టెన్సీ టాస్కులో యావర్‌కు సపోర్ట్ చేయలేదు. అలా అని తన చేయి బాలేదని ఆడకుండా కూర్చోలేదు. ఆడి దెబ్బ తగిలితే అది సింపతీ కింద వర్కవుట్ అవుతుందని ఆలోచించాడు. ఎలాగో ఓడిపోయే గేమ్‌కు యావర్ తరపున ఎందుకని అర్జున్‌కు సపోర్ట్ చేస్తూ అతడి తరపున గేమ్ ఆడాడు. ఇది యావర్‌కు అస్సలు నచ్చలేదు. నాకోసం ఎందుకాడలేదు? అని నిలదీశాడు. అంతేకాదు అశ్విని దగ్గర కూడా శివాజీ అన్న ఫౌల్ గేమ్ ఆడాడని అసహనానికి లోనయ్యాడు. తేజను ఏడిపించిన శోభ మరోవైపు శోభా శెట్టి-తేజ వాష్‌రూమ్ ఏరియాలో గొడవపడ్డారు. అమర్ నా స్నేహితుడు కాబట్టి కెప్టెన్సీ టాస్క్‌లో సపోర్ట్ చేశాడు.. నువ్వెవరివి అసలు? మా ఇద్దరి మధ్య పుల్లలు పెడుతున్నావు.. నీ ఒరిజినల్ క్యారెక్టర్ ఇప్పుడు తెలుస్తుంది.. అని ఆవేశంతో బుసలు కక్కింది. తన మాటలతో కలత చెందిన తేజ ఒంటరిగా ఏడ్చాడు. అనంతరం జపాన్ ప్రమోషన్స్ కోసం కార్తీ బిగ్‌బాస్ స్టేజీ మీదకు వచ్చాడు. ఎప్పుడూ పొగుడుతూ ఉంటే నాగ్ ఈసారి కంటెస్టెంట్లపై సెటైర్లు వేస్తూ కార్తీకి పరిచయం చేశాడు. అశ్విని పుల్లలు పెడుతుందని, ప్రశాంత్ అపరిచితుడు అని, శోభ అపార్థం చేసుకుంటుందని, తేజ పక్కవారి బాధను రెట్టింపు చేస్తాడని, శివాజీ సోఫాజీ(సోఫాకే అతుక్కుపోయాడని) అని మాట్లాడాడు. కాసేపు కబుర్లాడాక కార్తీని పంపించేశాడు నాగ్. శివాజీని వెనకేసుకొచ్చిన నాగ్ ఇక బాల్స్ టాస్కులో శివాజీ దొంగతనం చేయకూడదని వాదించాడు. దాదాపు హౌస్ అంతా అతడి పెద్దరికానికి గౌరవమిచ్చి దొంగతనం ప్రయత్నం విరమించుకుంది. అలా దొంగతనాన్ని ఆపడమనేది శివాజీ స్ట్రాటజీ అని నాగ్ కవర్ చేశాడు. దొరికిందే ఛాన్సని శివాజీ కూడా అవును, అది నా స్ట్రాటజీ అంటూ ఎగిరెగిరి పడ్డాడు. కెప్టెన్సీ టాస్క్‌లో శివాజీ మ్యాచ్ ఫిక్సింగ్ చేసి నన్ను గేమ్ నుంచి తప్పించాలని చూశాడంటూ నాగ్‌కు ఫిర్యాదు చేశాడు గౌతమ్. అశ్విని కూడా అదే చెప్పిందన్నాడు. నిజంగానే శివాజీ.. అందరినీ ఇన్ఫ్లూయెన్స్ చేసి కెప్టెన్సీ టాస్క్ నుంచి గౌతమ్‌ను ఎలిమినేట్ చేయడానికి ప్రయత్నించాడా? అని ఇంటిసభ్యులను నాగ్ అడిగాడు. అయితే అలాంటిదేమీ జరగలేదని హౌస్ ముక్తకంఠంతో చెప్పింది. దీంతో గౌతమ్ తనకు క్లారిటీ వచ్చిందన్నాడు. వీళ్లు బంగారం.. వాళ్లు బొగ్గు తర్వాత హౌస్‌లో ఎవరెలా గేమ్ ఆడారనేదాన్ని బట్టి వారి ఫోటోలను బంగారం/మట్టి /బొగ్గు టేబుల్లో అతికించాడు. గౌతమ్‌ను బెస్ట్ కెప్టెన్‌గా అభివర్ణించిన నాగ్ అతడిని బంగారంగా పేర్కొన్నాడు. శోభ, తేజ, అమర్, అర్జున్ను, శివాజీలను సైతం బంగారం లైన్లో పెట్టాడు. భోలెను గేమ్‌లో స్వాప్ చేస్తుంటే చూస్తూ ఊరుకున్నాడని అతడిని బొగ్గు బోర్డులో పెట్టాడు. రతిక, అశ్విని గేమ్ ఆడలేదని వారిని కూడా బొగ్గు కేటగిరీలో వేశాడు. ఆటపై ఫోకస్ చేయలేదంటూ యావర్‌ను మట్టి కేటగిరీలో పెట్టాడు. తేజ కోసం బాగా ఆడావు, కానీ నీకోసం ఆడంటూ ప్రియాంక ఫోటోను మట్టిలో పెట్టాడు. మధ్యలో దూరిన శివాజీ ప్రశాంత్‌ను బంగారంలో పెట్టడంతో రైతుబిడ్డ ఏడ్చేశాడు. మాటిమాటికీ ఏడుస్తావ్.. సింపతీనా? అని అడగ్గా వెంటనే శివాజీ మధ్యలో దూరుతూ.. అతడి స్వభావమే అంత.. అని సపోర్ట్ చేశాడు. ఈరోజు క్లాసులు తీసుకోవడం మీదే ఫోకస్ పెట్టిన నాగ్ ఎవరినీ సేవ్ చేయకుండానే వెళ్లిపోయాడు. అయితే ఈ వారం తేజ ఎలిమినేట్ కానున్నాడని టాక్ నడుస్తోంది. మరి అదెంతవరకు నిజమనేది తెలియాలంటే రేపటి ఎపిసోడ్ చూడాల్సిందే! చదవండి: శోభ సేఫ్, తేజ ఎలిమినేట్.. చేసిన పాపం ఊరికే పోతుందా? -
ఎలిమినేట్ చేయండన్న గౌతమ్, చెప్పుతో కొట్టుకుంటానన్న అమర్దీప్
బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. అయితే గౌతమ్ టీమ్‌ను గెలిపించాలని బిగ్‌బాస్ బలంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. ఎరుపు, నలుపు రంగులో ఉన్న బాల్స్ గౌతమ్ సంపాదించగా వాటితో విజయం సాధించేలా బిగ్‌బాస్ పావులు కదిపాడు. అసలు హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తాజా(నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. ఆ టీమ్‌లోని అందరూ కంటెండర్లే బిగ్‌బాస్ బ్లాక్ బాల్ ఎవరి దగ్గరుందని అడిగాడు. వీరసింహాలు టీమ్ తమ దగ్గరే ఉందని బదులిచ్చారు. ఈ నల్ల బంతి సాయంతో అవతలి టీమ్ దగ్గరున్న అన్ని బంతులను తీసుకోవచ్చని భలే సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో వీరసింహాలు టీమ్ సభ్యులు ఎగిరి గంతేశారు. కానీ గర్జించే పులుల టీమ్‌లోని శివాజీ, ప్రియాంక మాత్రం ఓ రెండు బంతులకు కక్కుర్తి పడ్డారు. అన్నీ ఇచ్చేయమన్నాక ఇంకెందుకు ఆలోచిస్తున్నారని గౌతమ్ ప్రశ్నించగా మా ఇష్టమొచ్చినట్లు చేస్తామన్నాడు శివాజీ. దీంతో గౌతమ్ ఆవేశంతో ఊగిపోయాడు. ఇక అన్ని బంతులు వీరసింహాలకే దక్కి పైచేయి సాధించడంతో ఆ టీమ్‌లో ఉన్న అందరినీ కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్. రతికతో దూరంగా ఉండమన్న శివాజీ మరోవైపు రతికతో కాస్త దూరంగా ఉండమని యావర్‌ను హెచ్చరించాడు శివాజీ. మీ అతి చనువు జనాలకు నచ్చకపోవచ్చని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బంతుల టాస్కు మధ్యలో వీరసింహాలు టీమ్ తమ సభ్యులైన భోలె షావళిని అవతలి టీమ్‌లోని అర్జున్‌తో స్వాప్ చేసిన సంగతి తెలిసిందే కదా! అయితే తాను మొదట తేజ పేరు సూచించానని గౌతమ్ అన్నాడు. అదేంటి? నువ్వు భోలె పేరు చెప్పావటగా అని అశ్విని గబుక్కున అడిగేసింది. అది విని షాకైన గౌతమ్.. భోలె దగ్గరకు వెళ్లి నేను డైరెక్ట్‌గా మీ పేరు చెప్పలేదు.. అది టీమ్ నిర్ణయం అని క్లారిటీ ఇచ్చాడు. స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకున్న ప్రిన్స్ అనంతరం బిగ్‌బాస్ బీన్ బ్యాగ్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. కానీ ఇక్కడో మెలిక పెట్టాడు. వీరసింహాలు టీమ్‌లోని కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అవతలి టీమ్‌లోని కంటెస్టెంట్లు ఆడాల్సి ఉంటుందన్నాడు. అలాగే ఓ కంటెండర్ స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు. దీంతో ప్రిన్స్ యావర్ ఆట నుంచి వైదొలిగాడు. గౌతమ్ తరపున అశ్విని, అర్జున్ తరపున శివాజీ, తేజ తరపున ప్రియాంక, రతిక తరపున భోలె షావళి ఆటలో దూకారు. ఇదసలే ఫిజికల్ టాస్క్.. చేయి నొప్పి ఉన్న శివాజీ ముందే ఆటలో నుంచి వైదొలగాల్సింది. అయినా సరే తన ప్రతాపం చూపిస్తానంటూ ఆడేందుకు వెళ్లాడు. దెబ్బ తగలడంతో శివాజీ అవుట్ తీరా అక్కడ అందరూ లాక్కుని పీక్కునే క్రమంలో అతడి చేతికి దెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆటలో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఆటలో అమర్దీప్- అశ్విని కొట్టుకున్నారు. బిగ్‌బాస్ గీసిన వృత్తంలో నుంచి అందరూ బయటకు వచ్చారని సంచాలకుడైన ప్రశాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ గీత దాటి బయటకు వచ్చింది శివాజీ అన్న అని, కావాలంటే వీడియో చూడమన్నాడు అమర్దీప్. ఒకవేళ తాను చెప్పింది తప్పయితే చెప్పుతో కొట్టుకుంటానని సవాలు విసిరాడు. అమర్ సాయం.. కెప్టెన్‌గా శోభ ఇక బీన్ బ్యాగ్ టాస్కులో శోభా శెట్టి తరపున ఆడి, పోరాడి అమర్ గెలిచాడు. మొత్తానికి అమర్ సాయంతో ఈ సీజన్లో శోభా శెట్టి తొలి లేడీ కెప్టెన్‌గా అవతరించింది.ఇక శోభా కెప్టెన్ అయిందో, లేదో అర్జున్, తేజ ఆమెను ఏడిపించేందుకు ప్రయత్నించారు. ఎలిమినేట్ అయి వెళ్లేటప్పుడు నీ దగ్గరున్న కాయిన్స్ ఎవరికి ఇస్తావు? అని అర్జున్ అడగడంతో చిర్రుబుర్రులాడింది శోభ. కామెడీ చేయడానికి కూడా ఓ సమయం ఉంటుందని విసుక్కుంది. శివాజీపై ఫిర్యాదు తర్వాత గౌతమ్.. శివాజీ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశాడు. 'శివాజీ అన్న గేమ్‌ను ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు. నీతి, నిజాయితీ, ధర్మం అని మాటలు చెప్తుంటాడు.. కానీ ఆయన చాలా తప్పులు చేస్తున్నాడు. అవన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆయన చేసేదంతా చేసి మళ్లీ ఏమీ ఎరుగనట్లు తప్పించుకుంటున్నాడు. ఇలా ఆడి, గెలిచి ఆయన కప్పు కొట్టుకుంటాడేమో.. కానీ ఇది నేను భరించలేకపోతున్నాను. నేను తప్పయితే నన్ను ఎలిమినేట్ చేసేయండి' అని కెమెరాల ముందు బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేశాడు. చదవండి: రాహుల్-రతిక పెళ్లి.. అతడు పెట్టిన కండీషన్స్ వల్లే బ్రేకప్! -
హౌస్‌లో ఒక్కడైనా పదో తరగతి పాస్ అయిండా?.. నాగ్‌తోనే తేల్చుకుంటానన్న తేజ
బిగ్‌బాస్ హౌస్‌లో కెప్టెన్సీ కంటెండర్‌షిప్ టాస్క్ నడుస్తోంది. ఇందుకోసం ఇంటిని రెండు ముక్కలు చేశాడు బిగ్‌బాస్. ఆటలో కొట్లాటలు సహజమే.. బిగ్‌బాస్ హౌస్‌లో కొట్లాటల మధ్యలో ఆటలు వస్తూపోతూ ఉంటాయి. అలా ఈ రోజు రతిక-అమర్ గొడవపడ్డారు. మరి నేటి(నవంబర్ 2) ఎపిసోడ్లో ఇంకా ఏమేం జరిగాయో చదివేయండి.. ఏడ్చి సాధించింది.. కానీ ఏం లాభం? కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం బిగ్‌బాస్ బాల్స్ టాస్క్ ఇచ్చాడు. మధ్యమధ్యలో ఛాలెంజ్‌లు కూడా విసురుతున్నాడు. ఇక బాల్స్ టాస్క్‌లో రతిక- అమర్దీప్ గొడవపడ్డారు. ఒకరినొకరు తిట్టుకున్నారు. ఇంతలో బిగ్‌బాస్ బ్రేక్ ఫాస్ట్.. ఎయిమ్ లో అనే చాలెంజ్ ఇచ్చాడు. ఈ గేమ్‌లో అమర్దీప్- అర్జున్ గెలిచారు. ఇక ఆడతా.. ఆడతానంటూ అలిగి సాధించి మరీ గేమ్‌లో పాల్గొన్న శోభ ఓడిపోయింది. తన టీమ్‌లో ఎవరైనా ఓడిపోతే నానామాటలు అనే శోభ తానే ఓడిపోవడంతో కన్నీళ్లు పెట్టుకుంది. చాలెంజ్ గెలిచిన టీమ్‌కు బిగ్‌బాస్ రెండు ఆప్షన్స్ ఇచ్చాడు. వేలిముద్రగాళ్లం అనుకుంటున్నారా? అవతలి టీమ్‌లో ఒకరిని ఆటలో నుంచి తప్పిస్తారా? లేదంటే వారి దగ్గరి నుంచి 500 బాల్స్ తీసుకుంటారా? అని అడిగాడు. బాగా ఆలోచించిన శివాజీ టీమ్ అవతలి టీమ్‌లో నుంచి 500 బాల్స్ తీసుకుంది. మరోవైపు అశ్విని హౌస్‌మేట్స్‌పై ఉన్న కోపాన్నంతా భోలె దగ్గర కక్కేసింది. ఇక్కడ అందరూ ఐఏఎస్ ఆఫీసర్లు.. మనమేమో ఎల్కేజీ కూడా చదువుకోని వేలిముద్రగాళ్లం అన్నట్లు ప్రవర్తిస్తున్నారు. ఏం అనుకుంటున్నారో? ఏమో? ఒక్కొక్కడు పదో తరగతి కూడా పాస్ అయిండో? లేదో? ఒకరిని జడ్జ్ చేసే అధికారం వారికి ఎవరిచ్చారు? ఒక ముగ్గురు అయితే ఎంత నవ్వుకుంటున్నారో.. అని చికాకు పడింది. గేమ్‌కు అడ్డుపడుతున్న శివాజీ ఇంతలో అదిరిపోయే ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. గోల్డెన్ బాల్ దొరికిన టీమ్.. అవతలి టీమ్‌లో ఒకరితో స్వాప్ చేసుకోవచ్చని చెప్పాడు. దీంతో గౌతమ్ టీమ్ ఏకాభిప్రాయంతో తమ టీమ్‌లోని భోలె షావలిని అవతలి టీమ్‌లోకి పంపించి.. అందులో ఉన్న అర్జున్ను తమ టీమ్‌లోకి లాక్కుంది. రాత్రి శివాజీ టీమ్‌లోని బాల్స్ లాక్కుందామని ప్లాన్ వేసింది గౌతమ్ టీమ్. అయితే దొంగతనం చేయడానికి ససేమీరా కుదరదని వాదించాడు శివాజీ. డాక్టర్ అయ్యుండి ఇలా ఎథిక్స్ లేకుండా మాట్లాడతావా? అంటూ తన వృత్తిని మధ్యలోకి లాక్కొచ్చాడు. గౌతమ్ మీద ఫైర్ అయ్యాడు. దీంతో తేజ.. బాల్స్ దొంగతనం చేయొచ్చా? లేదా? అనేది నాగార్జున సర్నే అడిగి తేల్చుకుంటానన్నాడు. గౌతమ్- అశ్విని పెళ్లి చేసుకోవచ్చుగా ఇక మరుసటి రోజు అర్జున్.. అమర్ గురించి సెటైర్లు వేశాడు. వాడికి దూరంగా ఉందామంటే పదేపదే అన్నయ్యా అంటూ వస్తున్నాడంటూ తల పట్టుకున్నాడు. ఇంతలోనే బజర్ మోగడంతో మళ్లీ బాల్స్ గేమ్ మొదలైంది. అర్జున్ మీద ఎక్కి మరీ బాల్స్ పట్టుకునే ప్రయత్నం చేశాడు అమర్. అటు ప్రిన్స్ యావర్ తన టీషర్ట్‌లో బాల్స్ దాచుకున్నాడు. తర్వాత ప్రిన్స్.. అశ్విని-గౌతమ్‌లకు లింకు పెడుతూ మాట్లాడాడు. గౌతమ్.. అశ్వినిని పెళ్లి చేసుకోవచ్చుగా అని చెప్పాడు. అయితే మూడేళ్ల దాకా పెళ్లి చేసుకునే ఆలోచనే లేదన్నాడు గౌతమ్. తర్వాత ప్రశాంత్.. శోభకు గోరుముద్దలు తినిపించాడు. చదవండి: ఆహ్వానం అందినా వరుణ్- లావణ్యల పెళ్లికి హాజరు కాని జూనియర్ ఎన్టీఆర్! -
వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అమర్‌పై మళ్లీ విషం కక్కిన శివాజీ
కెప్టెన్ గౌతమ్ హౌస్‌లో కొత్త రూల్స్ తీసుకొచ్చాడు. ఈ వారం ఆడపిల్లలు పనే చేయక్కర్లేదని బంపరాఫర్ ఇచ్చాడు. ఇంకేముంది.. లేడీ కంటెస్టెంట్స్ రెచ్చిపోయారు. అటు నామినేషన్స్ ప్రక్రియ పూర్తవడంతో కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలుపెట్టాడు బిగ్‌బాస్. మరి నేటి (నవంబర్ 1) ఎపిసోడ్ హైలైట్స్ ఏంటో చదివేయండి.. మళ్లీ విషం కక్కిన శివాజీ బద్దకస్తుడైన తేజ శవాసనం వేస్తూ నేలకు అతుక్కుపోయాడు. ఇది గమనించిన బిగ్‌బాస్ తేజకు ఏదైనా శిక్ష వేయమని కెప్టెన్‌ను ఆదేశించాడు. కెప్టెన్ గౌతమ్.. తేజ అమ్మాయిలా చీర కట్టుకోవాలని చెప్పాడు. ఇంకేముంది, శోభ.. అతడికి చీర కట్టి రెడీ చేసింది. ఇదే అదను అనుకున్న తేజ.. అందరు అమ్మాయిలకు హగ్గులిచ్చుకుంటూ పోయాడు. ఇక పెద్దమనిషిని అని చెప్పుకునే శివాజీ ఎప్పటిలాగే అమర్‌పై విషం చిమ్మాడు. వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అని నోటికొచ్చినట్లు మాట్లాడాడు. ప్రతి సీజన్లో అందరూ కలిసి ఒకర్ని హీరోను చేస్తే ఈ సీజన్లో నన్ను విలన్‌ను చేశారు అని తనకు తానే అనుకున్నాడు అమర్. చాలెంజ్ విసిరిన బిగ్‌బాస్ తర్వాత బిగ్‌బాస్.. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. ఇందుకోసం ఇంటిసభ్యులను రెండు టీమ్‌లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్‌లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు. మొదట బాల్స్ టాస్కు పెట్టాడు కానీ ఫలితాలను ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. చాలెంజ్ గెలిచిన టీమ్‌కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదటి చాలెంజ్కే రైతుబిడ్డ అవుట్ మొదట జంపింగ్ జపాంగ్ అనే చాలెంజ్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో వీరికి అవతలి టీమ్‌లో ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందరూ చర్చించుకుని ప్రశాంత్‌ను గేమ్ నుంచి సైడ్ చేశారు. తనను ఆటలో నుంచి పక్కకు తోసేయడంతో రైతుబిడ్డ కంటతడి పెట్టుకున్నాడు. శివాజీ తన చేతుల మీదుగా డెడ్ బోర్డును ప్రశాంత్ మెడలో వేశాడు. అయితే ప్రశాంత్ కంటే భోలె ఎక్కువ ఫీలైపోయాడు. ప్రియుడి కోసం ఏడ్చేసిన శోభ మరోవైపు శోభ తన ప్రవర్తన మీద తనే డౌట్ పడింది. బయట ఉన్న ప్రియుడిని ఉద్దేశిస్తూ.. వాడు నన్ను అర్థం చేసుకుంటాడంటావా? అని తేజతో కబుర్లాడింది. 'వాడు చాలా మెచ్యూర్డ్.. అర్థం చేసుకుంటాడు.. కానీ నమ్మకంతో పాటు భయం కూడా ఉంది. ఒకవేళ వాడికి నచ్చనట్లు ఏమైనా ప్రవర్తించానా? నీ విషయంలో వేరేలా ఉన్నాను. అది తనకు నచ్చకపోవచ్చేమో.. ఎవరికి తెలుసు? అయినా ఏమీ అవదనే అనుకుంటున్నాను. పొరపాటున ఏదైనా జరిగితే నేనసలు తట్టుకోలేను. వాడు బాగా గుర్తొస్తున్నాడు' అంటూ శోభ ఏడ్చేసింది. ఇక రేపటి ఎపిసోడ్లో మిగతా చాలెంజ్‌లు ఎవరు గెలిచారు? ఎవరు కెప్టెన్సీ కంటెండర్స్ అయ్యారనేది చూడాలి! చదవండి: లావణ్య మెడలో మూడు ముళ్లు వేసిన వరుణ్ తేజ్ -
ఆటలో రైతుబిడ్డ ఔట్.. ప్రశాంత్ మెడలో డెడ్బోర్డు వేసిన శివాజీ
నామినేషన్స్‌తో బిగ్‌బాస్ హౌస్ వేడెక్కిపోయింది. ఈ పోట్లాటలు చాలు.. ఆట మొదలుపెడదాం అనుకున్నాడు బిగ్‌బాస్. ఈ వారం ఇంటిసభ్యులను రెండు టీమ్‌గా విడగొట్టి టాస్కులు పెడుతున్నాడు. ఈ క్రమంలో మొదట బెలూన్ టాస్క్ ఇచ్చాడు. ఇందులో ఒక టీమ్ నుంచి తేజ, ప్రిన్స్ యావర్ వస్తే మరో టీమ్ నుంచి అర్జున్, ప్రశాంత్ వచ్చి ఆడారు. ఈ గేమ్‌లో రెండు టీమ్‌ల మధ్య చిన్నగొడవ జరిగినట్లు కనిపిస్తోంది. ఇంతలో బిగ్‌బాస్ లెటర్ పంపించాడు. గెలిచిన టీమ్.. అవతలి టీమ్‌లో నుంచి ఒక ఆటగాడిని గేమ్ నుంచి తప్పించవచ్చని పేర్కొన్నాడు. వారి మెడలో డెడ్ బోర్డ్ వేయాలన్నాడు. దీంతో గౌతమ్ తన మాస్టర్ మైండ్‌ను ఉపయోగించి స్ట్రాంగ్ కంటెస్టెంట్ అయిన ప్రశాంత్‌ను ఆట నుంచి సైడ్ చేశాడు. ప్రశాంత్‌ను పక్కన పెట్టేయాలని నిర్ణయించడంతో శివాజీ అతడి మెడలో డెడ్ బోర్డ్ వేశాడు. అయితే మొదటి టాస్కులోనే తనను తప్పించడంతో ప్రశాంత్ కంటతడి పెట్టుకున్నాడు. రైతుబిడ్డను ఓదార్చిన అర్జున్.. ఒకరకంగా దీనివల్ల పాపులారిటీ పెరుగుతుందిలే అని సముదాయించాడు. అశ్విని అయితే.. వాడు మంచిగా ఆడుతున్నాడని అందరూ కుళ్లుకుని తీసేశారని అభిప్రాయపపడింది. మరోపక్క తేజను అమ్మాయిగా రెడీ చేశారు. దీన్ని అడ్వాంటేజ్‌గా తీసుకున్న తేజ అమ్మాయిలను హగ్ చేసుకోవడానికి పోటీపడ్డాడు. ఇక రానున్న గేమ్స్‌లో ఎవరు గెలుస్తారు? ఎవర్ని సైడ్ చేస్తారనేది చూడాలి! చదవండి: ఈ వారం నామినేషన్లో ఉంది వీళ్లే -
శివాజీ మీద పైచేయి సాధించిన అమర్
బిగ్ బాస్ నామినేషన్స్ ఈ వారం చాలా ఫన్నీ రీజన్స్‌తో ముగిసింది. మంగళవారం జరిగిన నామినేషన్లో యావర్ మాస్టర్ ప్లాన్ వేసి అశ్వినిని నామినేషన్లోకి తీసుకొచ్చాడు. నామినేషన్లో పసలేని కారణాలతో రతికా రోజ్, అశ్వినిలు ఉన్నారని చెప్పవచ్చు. కానీ ఈ వారం నామినేషన్ ప్రక్రియలో శివాజీ మీద అమర్ పైచేయి సాధించాడు. ఆ కథేంటో మంగళవారం జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందో Day 58 హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. సోమవారం ఎపిసోడ్లో ప్రశాంత్ ,ప్రియాంక,అర్జున్ ,శివాజీ,రతిక, తేజ, భోలె నామినేషన్ ప్రక్రియలో పాల్గొని వారికి నచ్చని ఇద్దరి పేర్లు చెబుతూ ఎలిమినేషన్ లిస్ట్‌లో చేర్చారు. మంగళవారం ఎపిసోడ్లో మొదట శోభ నామినేషన్ విదానాన్ని ప్రారంభంచింది. శోభ సరైన కారణాలతో రతికా రోజ్‌ను నామినేట్ చేసినా వాటిని తిప్పకొట్టడంలో రతిక విఫలమైంది. లాజికల్ పాయింట్లు లేకుండా రతిక మాట్లాడిన మాటలు చిరాకు తెప్పించాయి. ఆడియన్స్‌కు బాగా దొరికి పోతున్నావని ఒకానొక సమయంలో తేజ కలుగచేసుకుని రతికా రోజ్‌ను హెచ్చరిస్తాడు. అయినా ఆమె వినకుండా మరింత రెచ్చిపోయి పసలేని కారణాలు శోభకు చెప్పి రతిక ప్రేక్షకులకు దొరికిపోయింది. ఆ తర్వాత యావర్‌ను సరైన కారణంతో శోభ నామినేషన్ చేయడంతో ఆయన ఎటువంటి మాటలు మాట్లడకుండా స్వీకరిస్తాడు. యావర్‌తో అశ్విని ఫైట్ యావర్ మొదటగా శోభను నామినేషన్లో చేర్చగా వారిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదు. దానికి ప్రధాన కారణం యావర్ చెప్పిన సరైన పాయింట్లకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకుండాపోయింది. ఆ తర్వాత అశ్విని పేరును యావర్ లేవనెత్తుతాడు. ఆటలో కన్ఫ్యూజ్ అవుతున్నావని హౌస్‌లో ఉండాలంటే ఆట తీరును ఆర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని ఇవేవి నీలో లేవని అశ్వినికి తెలిపి యావర్ నామినేషన్ చేస్తాడు. అందుకు ఉదాహరణగా గతంలో అమర్‌ను నామినేట్ చేస్తానని చెప్పి ఆ తర్వాత ఫ్లిప్ అయి అర్జున్ను నామినేషన్ చేయడం ఏంటని యావర్ ప్రశ్నించాడు. అలా యావర్ చెప్పిన ఐదు పాయింట్లలో నాలుగు సరైనవే అనేలా ఉన్నాయి. కానీ సందీప్ మాస్టర్‌కు ఒక టాస్క్‌లో అశ్విని వాటర్ పోస్తుంది. దానిని యావర్ తప్పుబడుతూ నామినేట్ చేస్తాడు. ఇందులో ఏ మాత్రం పసలేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య నామినేషన్ ప్రక్రియ చాలా ఫన్నీగా జరుగుతుంది. శివాజీ మీద పైచేయి అమర్ చేసిన నామినేషన్లలో ఈ వారం శివాజీపై పైచేయి సాధించాడని చెప్పవచ్చు. శివాజీని ఉద్దేశిస్తూ.. అన్నా మీకు నేను ఎందుకు నచ్చనో అలాగే మీరు కూడా నాకు నచ్చరు అని ఓపెన్‌గానే చెబుతాడు అమర్. ఆటలో నేను మాత్రమే అరుస్తున్నాని, కేకలు వేస్తున్నానని ప్రతిసారి నన్ను నామినేషన్ చేస్తున్నావ్.. అలాగే నీ పక్కన ఉన్నవారు కూడా నామినేషన్ సమయంలో కేకలు వేస్తున్నారు కదా వారిని ఎందుకు హెచ్చరించరని సరైన పాయింట్‌ను శివాజీకి అమర్ వేశాడు. అప్పుడు శివాజీ కూడా వాళ్లకు వార్నింగ్ ఇచ్చాను.. చెబుతున్నాను అంటాడు. అలా చెప్పడం కాదన్నా.. నాకు ఎలా చెప్పారో వాళ్లను కూడా నామినేషన్లో నిలబెట్టి చెప్పండి అని అమర్ తెలుపుతాడు. దీంతో ఇబ్బంది పడ్డ శివాజీ ఆన్సర్ చెప్పలేక సైడ్ అయిపోతాడు. అలాగే సందీప్ మాస్టర్‌ను ఇంటి నుంచి పంపించావ్ అని తేజను నామినేట్ చేస్తాడు శివాజీ.. మరి సందీప్ మాస్టర్‌ను ఎలిమినేషన్ లిస్ట్‌లో పెట్టిన యావర్‌ను మాత్రం ఒక మాట కూడా అనలేకపోయాడు శివాజీ. ఇలా ఈ వారంలో శివాజీ దొరికిపోయాడు. ఈ వారం నామినేషన్లో ఉండేది వీళ్లే 1. అమర్ దీప్ 2. రతికా రోజ్ 3. శోభ శెట్టి 4. ప్రియాంక జైన్ 5. అర్జున్ 6. టేస్టీ తేజ 7. భోలే షావలి 8. ప్రిన్స్ యావర్ -
లాజిక్స్ మర్చిపోయిన శివాజీ.. అమర్ అడిగిన దానికి నో ఆన్సర్!
బిగ్ బాస్ నామినేషన్స్ ఈసారి మరీ అంత హోరాహోరీగా కానప్పటికీ ఇంట్రెస్టింగ్‌గానే సాగాయి. శివాజీ బ్యాచ్ అంతా సీరియల్ బ్యాచ్ ని మళ్లీ టార్గెట్ చేశారు. ఈరోజు అది మళ్లీ క్లియర్ అయిపోయింది. అలానే అమరదీప్ లాజిక్స్ మాట్లాడేసరికి శివాజీ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఇంతకీ సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 57 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. లాజిక్ లెస్ నామినేషన్స్ సందీప్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. కంటెస్టెంట్స్ నిద్రలేవడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా గౌతమ్ బాధ్యతలు అందుకున్నాడు. తనకు డిప్యూటీలుగా రతిక, శోభాని ఎంచుకున్నాడు. ఈ వారమంతా ఉమెన్స్ వీక్ సందర్భంగా.. ఇంట్లోని అమ్మాయిలకు విశ్రాంతి అని, అబ్బాయిలే అన్ని పనులు చేయాలని కెప్టెన్ గౌతమ్ ఆర్డర్ వేశాడు. తర్వాత నామినేషన్స్ షురూ అయ్యాయి. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రశాంత్ - అమరదీప్, తేజ ప్రియాంక - రతిక, భోలె అర్జున్ - శోభా, అమరదీప్ శివాజీ - అమరదీప్, తేజ రతిక - ప్రియాంక, శోభాశెట్టి తేజ - అర్జున్, రతిక భోలె - ప్రియాంక, అమరదీప్ రైతుబిడ్డ చల్లబడ్డాడు! నామినేషన్స్ అంటే రెచ్చిపోయే రైతుబిడ్డ ప్రశాంత్ దగ్గర ఈసారి కారణాలు లేవు. దీంతో ఎప్పటిలానే తన బ్యాచ్‌కి వ్యతిరకమైన అమరదీప్‌ని నామినేట్ చేసిపడేశాడు. గతవారం మిర్చి దండ వేశాడని తేజని కూడా నామినేట్ చేశాడు. దీంతో తేజకి చిరాకేసింది. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసులో గెలిచిన వాళ్ల మధ్య గేమ్ పెట్టి, విజేతని డిసైడ్ చేయండి. వాళ్ల గురించి తమకు అప్పజెప్పి ఈ పంచాయతీలు పెట్టకండి బిగ్‌బాస్ అని తన డిసప్పాయింట్మెంట్ బయటపెట్టాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?) శివాజీ పగ-ప్రతీకారం బిగ్‌బాస్‌లో పెద్దగా పనులేం చేయకుండా, పెద్దమనిషిలా కలరింగ్ ఇస్తూ ప్రతివారం నెట్టుకొస్తున్న శివాజీ.. ఎప్పటిలానే ఈసారి కూడా అమరదీప్‌ని నామినేట్ చేశాడు. గతవారం నామినేషన్స్ సందర్భంగా అమరదీప్ గట్టిగట్టిగా అరవడం, డబుల్ మీనింగ్‌లో మాట్లాడటం నచ్చలేదని శివాజీ అన్నాడు. మరి ప్రశాంత్ ఇలా అరిచాడు కదా అప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదన్న? అని అమరదీప్, శివాజీని ప్రశ్నించాడు. వాడికి చాలాసార్లు చెప్పాను, మార్చుకున్నాడని శివాజీ అన్నాడు. ఇక్కడ శివాజీ.. పుత్రప్రేమ క్లియర్‌గా బయపడింది. ఇక ప్రియాంక.. గేమ్ కనిపించలేదని రతికని నామినేట్ చేసింది. కానీ రతిక మాత్రం ప్రియాంక తనని చేసింది కదా అని ఆమెని నామినేట్ చేసి పడేసింది. అలా ఎంతో సీరియస్‌గా సాగుతున్న ఈ ప్రక్రియలో తేజ కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ఓవరాల్‌గా చూస్తే శివాజీ బ్యాచ్‌కి చెందిన శివాజీ, ప్రశాంత్, భోలె.. కావాలని టార్గెట్ చేసి మరీ అమరదీప్ ని నామినేట్ చేయడం.. గ్రూపుల యవ్వారాన్ని మొత్తం బయటపెట్టినట్లయింది. అలానే అమర్ అంటే శివాజీకి ఎందుకంత పగ అనేది అర్థం కావట్లేదు. (ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!) -
వీళ్లకేమో తిట్లు.. శివాజీకేమో బుజ్జగింపులు.. ఏంటిది బిగ్‌బాస్?
బిగ్‌బాస్ వీకెండ్ ఎపిసోడ్ వచ్చేసింది. హోస్ట్ నాగార్జున వచ్చేశాడు. కొందరిపై కోప్పడ్డాడు. మరికొందరిని మాత్రం బుజ్జగించాడు. ఇంకొందరిని మెచ్చుకున్నాడు. మరీ తీసిపడేయలేం కానీ ఓ మాదిరి ఇంట్రెస్టింగ్‌గానే శనివారం ఎపిసోడ్ సాగింది. సీరియల్ బ్యాచ్‌పై ఫుల్ సీరియస్ అయిన నాగ్.. శివాజీతో పవర్తించిన తీరు మాత్రం కాస్త విచిత్రంగా అనిపించింది. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 55 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. పిచ్చోడు గొడవ గురించి గౌతమ్.. కొత్త కెప్టెన్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. నాగ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. శుక్రవారం జరిగిన సంగతుల్ని కాసేపు చూసిన నాగ్.. వర్తమానానికి వచ్చేశాడు. ఫస్ట్ ఫస్ట్ శోభాశెట్టితో మొదలుపెట్టాడు. అసలు యవర్ని 'పిచ్చోడు' అని ఎందుకు అన్నావ్? అని అడిగాడు. అనర్హత పేరు చెప్పి తనకు మిర్చి దండ వేశాడని, నేను మాట్లాడటానికి ట్రై చేస్తుంటే.. తనని మాట్లాడనివ్వలేదని, అందుకే పిచ్చోడు అని అన్నానని శోభా చెప్పుకొచ్చింది. మరి గతవారం భోలె.. ఎర్రగడ్డ అనే పదం వాడితే గింజుకున్నావ్, అది మెంటల్ అని అన్నావ్, ఒప్పుకోనని అన్నావ్.. ఇప్పుడెందుకు ఇలా చేశావ్ అని నాగ్ సీరియస్ అయ్యాడు. 'నీకు క్షమించే గుణం లేనప్పుడు మాటలు జారకూడదు కదమ్మా' అని సుతిమెత్తగా కౌంటర్ వేశాడు. (ఇదీ చదవండి: 60 ఏళ్ల వయసులో హీరోలకు మించిన ఫాలోయింగ్.. ఎవరీ 'నెపోలియన్'?) యవర్ కూడా పడ్డాయ్ ఈ గొడవలో శోభాది ఎంత గొడవ ఉందో యవర్ది కూడా అంతే తప్పు ఉందన్నట్లు నాగ్ చెప్పుకొచ్చాడు. మిర్చిదండ విసిరి కొట్టావ్, బిగ్‌బాస్ ప్రాపర్టీని డ్యామేజ్ చేశావ్.. మారావ్ అనుకుంటే.. మళ్లీ ముందులానే ప్రవర్తించావ్ యవర్ అని మనోడికి కాస్త గడ్డిపెట్టాడు. 'నువ్వు ప్రవర్తించిన విధానం చూస్తే.. నేను, ఆడియెన్స్ ఎవరైనా సరే పిచ్చోడు అనే అంటారు' కదా అన్నాడు. అయితే యవర్, శోభా.. ఇద్దరూ కూడా తమని తాము సమర్థించుకోవాలని చూశారు. ఇలా మిమ్మల్ని మీరు జస్టిఫై చేయాలని చూడకండి, ఫూల్ అవుతారు అని నాగ్ కౌంటర్ వేశాడు. అమర్ vs ప్రశాంత్ గొడవ నామినేషన్స్ సందర్భంగా ప్రశాంత్‌తో మాట్లాడుతూ అమరదీప్ కుర్చీ తన్నాడు. 'ఈ నా కొడుకు' అనే పదం వాడటం గురించి నాగ్ అడిగాడు. అమర్ ఏదో చెప్పాలని చూశాడు కానీ వర్కౌట్ కాలేదు. దీంతో నాగ్ మాట్లాడుతూ.. 'ప్రశాంత్ అంటే నీకు చిన్నచూపు అని అంటాటు' అని నాగ్ అనగానే.. 'లేదు సర్ లేదు సర్' అని అమర్ క్లారిటీ ఇచ్చాడు. అక్కడితో ఆ టాపిక్ ముగిసింది. ఇక నామినేషన్స్ లో ఒకలా, మిగతా సమయాల్లో మరోలా ప్రవర్తిస్తుంటావ్? ఏంటి ప్రశాంత్ ఇది అని నాగ్.. కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ఇక రతిక గురించి మాట్లాడిన నాగార్జున.. 'హౌసులో కబుర్లు చెప్పడానికి వెళ్లావా? గతం గతహ... అంత ఛాన్స్ వచ్చిన తర్వాత ఏం చేస్తున్నావ్? ఎందుకు ఆడట్లేదు? నామినేషన్స్‌లో లేవని కాన్ఫిడెన్సా? గతం గురించి మాట్లాడుకుంటే గతంలో ఉండిపోతావ్, మనుషుల గురించి ఫోకస్ చేయొద్దు' అని రతికకు సుతిమెత్తగా నాగ్ కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: నటుడి ఇంట్లో దొంగతనం.. డబ్బులు, బంగారంతో పనిమనిషి పరార్!) శివాజీకి బుజ్జగింపులు 'ఎవరో ఒకర్ని కొట్టేసి వెళ్లిపోతా?' అన్నావ్ కదా శివాజీ అసలేమైంది? అని నాగ్ అడిగాడు. 'నేను అవన్నీ చెప్పుకోలేను. చాలా విషయాలు బాగోట్లేదు. నేను నీతిగానే ఉంటున్నాను. మనుషుల పేర్లు చెప్పలేని గానీ చాలామంది ప్రవర్తన ఇబ్బందికరంగా ఉంటోంది. నన్ను పంపించేశానా? నన్ను తిట్టినా ఓకే?' అని శివాజీ నాగార్జునతో అన్నాడు. ప్రశాంత్, యవర్‌కి వాళ్ల బిహేవియర్ గురించి చెప్పావా? అని నాగ్ అడగ్గా.. వీళ్లతో పాటు సందీప్‌కి కూడా చెప్పానని శివాజీ అన్నాడు. దీని తర్వాత నాగ్ మాట్లాడుతూ.. 'శివాజీ సేఫ్ ఆడొద్దు. నీకు ఏమనిపిస్తే అది చెప్పు' అని నాగ్ అన్నాడు. 'ఇదే చివరి అవకాశం.. ఇక చేయి దాటిపోతే చెప్పేస్తా బాబుగారు' అంటూ నాగ్-శివాజీ ఇద్దరికి ఇద్దరూ బుజ్జగించుకున్నట్లు అనిపించింది. అయితే శనివారం ఎపిసోడ్ చూసిన తర్వాత హోస్ట్ నాగార్జున.. సీరియల్ బ్యాచ్ ని ఏమైనా టార్గెట్ చేశాడా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే శోభాశెట్టి, అమరదీప్తో గట్టిగా మాట్లాడిన నాగ్.. ఎవడో ఒకడ్ని కొట్టేసి వెళ్లిపోతా అని ఎగిరెగిరి పడిన శివాజీతో మాత్రం నాగ్ బుజ్జగింపులు జరిపాడు. అలా అనొద్దు, సేఫ్ ఆడొద్దు అని చెప్పాడు. అలానే ఈ ఎపిసోడ్ చూస్తే.. సీరియల్ బ్యాచ్ ఓవైపు, శివాజీకి ఓ బ్యాచ్ ఉందని క్లియర్‌గా అర్థమైంది. ఇకపోతే నామినేషన్స్‌లో ఉన్న 8 మందిలో ప్రియాంక, గౌతమ్ సేవ్ అయినట్లు నాగ్ చెప్పాడు. ఇంకా ఆరుగురు నామినేషన్స్‌లో ఉన్నారు. వీళ్లలో ఎవరు ఎలిమినేట్ అవుతారనేది ఆదివారం క్లారిటీ వస్తుంది. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7లో ఈసారి షాకింగ్ ఎలిమినేషన్.. క్రేజీ కంటెస్టెంట్ ఔట్?) -
శోభ శెట్టి సేఫ్.. షాకిచ్చిన బిగ్ బాస్.. వారిద్దరిలో ఒకరు ఔట్
బిగ్‌బాస్ సీజన్ 7 సగం పూర్తి అయింది. ఎనిమిది వారాల తర్వాత తొలిసారి ఓ మేల్ కంటెస్టెంట్ హౌస్ నుంచి బయటికి పోతున్నాడు. మొదటి ఏడు వారాలు లేడీ కంటెస్టెంట్లే హౌస్ నుంచి బయటికి వచ్చేశారు. ఈ వారం నామినేషన్స్‌లో శివాజీ, బోలే, సందీప్, శోభా శెట్టి, అశ్విని, గౌతమ్, ప్రియాంక, అమర్ దీప్ ఉన్నారు. బిగ్ ఫైట్‌లో గెలిచిన శోభ బిగ్‌బాస్‌లో శివాజీ బ్యాచ్‌ను ఢీ కొట్టేది శోభ మాత్రమే కాబట్టి ఆమెను ఎలిమినేషన్ చేయాలనే ప్లాన్‌లో బయట ఉన్న శివాజీ పీఆర్ టీమ్ చాలా గట్టిగానే పోరాడింది. అలా శివాజీకి డప్పు కొట్టే బ్యాచ్ మొత్తం శోభాశెట్టిని టార్గెట్ చేసింది. కొందరైతే ఆమెపై ఏదో వ్యక్తిగత కక్ష ఉన్నట్లుగా కామెంట్లు చేయడం దారుణం. నామినేషన్ లిస్ట్‌లో శోభ పేరు చేరగానే ఆమెకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నెగటివ్ ప్రచారం చేయడం ప్రారంభించారు. చివరకు బిగ్‌బాస్ సీజన్ 6లో సామాన్యుడిలా వెళ్లి తెలుగు ప్రేక్షకుల ప్రేమకు దగ్గరైన ఆదిరెడ్డి కూడా శివాజీ బ్యాచ్‌లోని సభ్యులకే ఎక్కువ సపోర్ట్‌గా నిలుస్తున్నట్లు తెలుస్తోంది. ఆ క్రమంలోనే ఆదిరెడ్డి కూడా.. హౌస్‌లో శివాజీ చేస్తున్న పొలంగట్టు పంచాయితీలనే వెనుకేసుకొస్తున్నారు. ఒకట్రెండు సందర్భాల్లో మినహా శివాజీ బ్యాచ్‌నే ఆదిరెడ్డి కూడా వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో మిగిలిన కంటెస్టెంట్లు ఏ చిన్న తప్పులు చేసినా.. వాటిని ఆదిరెడ్డి కూడా హైలెట్ చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఆదిరెడ్డికి మంచి ఆదరణ ఉంది. అతనికంటూ మంచి ఫ్యాన్ బేస్ కూడా ఉంది. అతను చెప్పే ప్రతి మాటకు ప్రస్తుతం ఒక వ్యాల్యూ ఉంది. అలాంటి వ్యక్తి కూడా ఎక్కువగా శివాజీ బ్యాచ్‌నే వెనుకేసుకొస్తున్నట్లు తెలుస్తోంది. దీంతో శివాజీ బ్యాచ్ సేఫ్ అవుతున్నారని చెప్పవచ్చు. తన ఆటతో ప్రేక్షకులకు చిరాకు తెప్పించే భోలే కూడా శివాజీ బ్యాచ్ అండతో సేఫ్ అవుతున్నాడు. ఎందుకు సేఫ్ కొన్నిసార్లు ఆటలో శోభ కూడా తప్పులు చేసి ఉండవచ్చు.. ఆమెతో పాటు శివాజీ బ్యాచ్ కూడా ఎన్నో తప్పులు చేశారు. ఎందుకోగానీ శోభాశెట్టి మీద విపరీతమైన వ్యతిరేకత పెంచడానికి గట్టిగానే ప్రయత్నాలు సాగుతున్నయ్. వాటంన్నిటినీ ఆమె మళ్లీ తిప్పికొట్టింది. హౌస్‌లో నిలిచింది. శివాజీ బ్యాచ్‌తో ఢీ అంటే ఢీ అన్నట్టుగా ఫైట్ చేస్తున్నందువల్ల కావచ్చు. శివాజీ టీమ్‌ను శోభ మాత్రమే ఢీ కొడుతుంది. అలాంటిది ఆమెను హౌస్ నుంచి పంపిస్తే ఆటలో మజా ఉండదు. షో రేటింగ్ కూడా పడిపోయే ప్రమాదం ఉంది. అందుకే ఆమె సేఫ్ అయినట్లు తెలుస్తోంది. శోభ కూడా ఆటలో ఫైట్ చేస్తుంది. రెచ్చగొడుతుంది.. అప్పుడే ఏడుస్తుంది. కానీ ఏ టాస్కులనూ వదలదు. తన శక్తిమేరకు పోరాడుతుంది. ఏదేమైన ఆటలో ఉండాల్సిన కేరక్టర్ శోభ అని చెప్పవచ్చు. శివాజీ బ్యాచ్ అండతో ఆయన సేఫ్ ఎనిమిదో వారం బిగ్‌బాస్ నుంచి ఆట సందీప్ ఎలిమినేషన్ జరిగిపోయింది.. దాదాపు ఇదే ఖాయం. మొదటి వారంలోనే లక్కీగా ఐదు వారాలు ఎలిమినేషన్ల నుంచి ఇమ్యూనిటీ పొందాడు. ఇదే అతనికి బిగ మైనస్ అయింది. ఓట్లు వేసే వాళ్లు అతనికి చేరవు కాకుండా చేసింది. ఏడు వారల తర్వాత ఆయన ఎలిమినేషన్ లిస్ట్‌లో ఉండటంతో ఓట్లు వేసే ప్రేక్షకులకు అంతగా కనెక్ట్ కాలేదని చెప్పవచ్చు. ఈసారి నామినేషన్లలో చేరడంతో ఇక లీస్ట్ వోట్లతో హౌజ్ నుంచి వెనుతిరగక తప్పలేదు. ఆటలో మరీ అంత బ్యాడ్ పర్ఫామెన్స్ సందీప్ ఇవ్వలేదు. కానీ శివాజీ బ్యాచ్ కాదు.. శోభాశెట్టి బ్యాచ్… అందుకే తన మీద కూడా బాగా వ్యతిరేకతను బయట ఉండే వారు క్రియేట్ చేశారు. ఆటల్లో, టాస్కుల్లో తను యాక్టివ్గానే ఉన్నాడు. కానీ చివరకు ఔటవ్వక తప్పలేదు. వాస్తవానికి ఈ వారం లక్కీ పర్సన్ భోలే.. ఆతను శివాజీ బ్యాచ్‌లో చేరడం వల్లే సేఫ్ అయ్యాడు. మరోవైపు శివాజీ టీమ్‌కు శత్రువు అయిన శోభతో వైరం క్రియేట్ చేసుకున్నాడు. దీంతో ఆయన సేఫ్ అయ్యాడని తెలుస్తోంది. -
ప్రశాంత్, శివాజీ ముందే ప్లాన్.. సంచలన వ్యాఖ్యలు చేసిన నటరాజ్
బిగ్ బాస్ సీజన్ 7 దాదాపు సగానికి పైగానే పూర్తి అయింది. ఇప్పటికే ఏడు మంది కంటెస్టెంట్లు ఎలిమినేట్ అయ్యారు. ఉల్టాపుల్టా పేరుతో రతికా రోజ్ రీ ఎంట్రీ వల్ల షో పట్ల మరింత బజ్ క్రియేట్ చేయాలని బిగ్ బాస్ ప్లాన్ చేశాడు. మరోవైపు ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఆటలో వినిపించే బూతులను కూడా టెలికాస్ట్ చేస్తున్నారు. భోలే, అమర్ చేసిన వ్యాఖ్యలు అందులే భాగమే... ఇన్నీ చేస్తున్నా ఆడియన్స్‌లో అనుకున్నంత రీచ్ అయితే ఈ సీజ్న్ చేరుకోలేదని తెలుస్తోంది. తాజాగా ఈ సీజన్‌పై కొరియోగ్రాఫర్, డాన్సర్, బిగ్ బాస్ సీజన్ 5 కంటెస్టెంట్ నటరాజ్ మాస్టర్ తనదైన స్టైల్లో పలు ఆసక్తకరమైన వ్యాఖ్యలు చేశాడు. శివాజీ, పల్లవి ప్రశాంత్,యావర్,రతికా రోజ్, అమర్ వంటి వారి ఆటతీరుపై ఆయన స్పందించాడు. సమాజంలో పొలిటికల్ ఇమేజ్ క్రియేట్ చేసుకునేందుకే శివాజీ బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడు. ఇలాంటి మాయమర్మం చేయకపోతే జనాలు నమ్మరు. ఉదాహరణకు సత్యసాయిబాబ నోటి నుంచి శివలింగం, చేతి నుంచి విభూతి తీసి ప్రజలను ఎలా నమ్మించారో తెలిసిందే. (ఇదీ చదవండి: నా మొదటి లిప్ లాక్ సీన్ ఎవరితో అంటే.. ఊహించని ఆన్సర్ ఇచ్చిన శ్రీలీల) అలాగే శివాజీ కూడా ఒక రైతు బిడ్డకు (పల్లవి ప్రశాంత్) సాయం చేస్తూ తన ఇమేజ్ను చూపించుకునేందుకు, ప్రజల నుంచి సానుభూతిని పొందేందుకు ప్లాన్ చేస్తున్నాడని అర్థం అవుతుంది. హౌస్‌లో ప్రశాంత్,యావర్‌కు మాత్రమే శివాజీ సపోర్ట్‌గా ఉంటున్నాడు. వారిద్దరు కాకుండా మరో వ్యక్తి ఉంటే చూపించండి. యావర్‌కు పెద్దగా తెలుగు రాదు కాబట్టి కొంత వరకు మొదట్లో ఇబ్బంది పడ్డాడు. అలాంటి వ్యక్తుల పట్ల ప్రజల్లో ఒక సానుభూతి క్రియేట్ అవుతుంది. మన ఇండియన్స్ అంతా సెంటిమెంట్‌కు పడిపోతాం అది మన బ్లడ్‌లోనే ఉంది. అందుకే రైతు బిడ్డ అని చెప్పగానే ప్రశాంత్‌పై సానుభూతితో కూడిన అభిప్రాయం ప్రజల్లో ఏర్పడింది. ప్రశాంత్ గెలిస్తే శివాజీ ఎందుకు..? ఈ పాయింట్‌నే తెలివిగా శివాజీ అందిపుచ్చుకున్నాడు. అందుకే ప్రశాంత్‌కు ప్రతి విషయంలో శివాజీ సపోర్ట్ చేస్తున్నాడు. వీరిద్దరూ కూడా బిగ్‌బాస్ ఎంట్రీకి ముందే బయట మాట్లాడుకుని వెళ్లారని తెలుస్తోంది. ఇది నా అభిప్రాయం. వారిద్దరూ సోషల్ మీడియాలో గుర్తింపు ఉన్న ఒక యూట్యూబ్ ఛానల్‌కు వేరువేరుగా ఇంటర్వ్యూ ఇచ్చిన తర్వాతే బిగ్‌బాస్‌లోకి వచ్చారు. హౌస్‌లో ఎంట్రీ ఇచ్చిన రోజు నుంచే వారి ప్లాన్‌ను అమలు చేశారు. అందులో భాగంగానే ప్రశాంత్ నువ్వు గెలవాలి రా అని శివాజీ పదేపదే అంటున్నాడు. ప్రశాంత్ గెలిస్తే బిగ్‌బాస్‌లోకి శివాజీ ఎందుకు వెళ్లినట్లు అని నటరాజ్ ప్రశ్నించాడు. అంతేకాకుండా చాలామంది యూట్యూబర్స్, పలు సోషల్ మీడియాలను రన్ చేస్తున్న వారిని పల్లవి ప్రశాంత్ ముందే కలిసి హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చాడని నటరాజ్ మాస్టర్ చెప్పాడు. బిగ్ బాస్‌లోకి వెళ్లాలని అతను గత మూడేళ్లుగా ప్రయత్నం చేస్తున్నాడు. బిగ్ బాస్ ఫ్యాన్స్ పేజీలు ఉన్న వాళ్లందరినీ ప్రశాంత్ ముందే కలిశాడు. ఇలా గ్రౌండ్ వర్క్ చేసే బిగ్ బాస్‌లోకి వెళ్లాడు. వాటంన్నిటికీ తోడు శివాజీ ఇస్తున్న సపోర్ట్ వల్ల కూడా ప్రశాంత్ స్ట్రాంగ్ అయ్యాడు. కానీ రైతు బిడ్డలా మాత్రం హౌజ్‌లో ప్రశాంత్ కనిపించడంలేదు. అతనిపై సినిమా ప్రభావం ఎక్కువ ఉంది. అతని నామినేషన్ ప్రక్రియ చూస్తున్నప్పుడు ఆ సినిమాల ప్రభావం ఈజీగా కనిపిస్తుంది. -
ఎవరో ఒకర్ని కొట్టేసి పోతానన్న శివాజీ.. దేవుడు చూస్తాడట!
బిగ్‌బాస్ హౌస్‌లో ఈ వారం నామినేషన్స్‌తో బుర్ర హీటెక్కిపోయింది. ఎవరికి వారు ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడేశారు. మొన్నటివారమే బూతులు మాట్లాడాడని భోలె షావళికి నాగార్జున గట్టిగానే క్లాస్ పీకాడు. ఆ సంగతి కూడా మర్చిపోయి అమర్దీప్, సందీప్, గౌతమ్.. అందరూ తామేమీ తక్కువ కాదంటూ బూతులు మాట్లాడుతూ రెచ్చిపోయారు. ఇక శివాజీ మాత్రం ఎప్పటిలాగే అందరిముందు మంచిగా నటించాడు. శివాజీ ఫ్రస్టేషన్ కానీ నామినేషన్స్ అయ్యాక మాత్రం తన ఆవేశాన్నంతా బయటపెట్టాడు. సీరియల్ బ్యాచ్ మీద విషం కక్కాడు. 'దొంగలు దొంగ.. దొంగ.. అని పరిగెట్టిస్తున్నారు. జనాలు చూస్తారు. ఇప్పుడన్నా మనుషులు, ప్రజలు అనే వాళ్లుంటే ఈ వారం చూస్తా.. ఈ వారాన్ని బట్టి ఈ హౌస్‌లో ఉంటా.. తర్వాత ఎవరినో ఒకరిని కొట్టి నేనే స్వచ్ఛందంగా వెళ్లిపోతా. ఇక్కడున్నవాళ్లంతా ఏం చేస్తున్నారు? ఈ హౌస్ అంతా డిస్టర్బ్ అవుతుంటే ఏంటిదంతా? మరీ ఇంత అన్యాయమా? ఈ వారం తెలుస్తుంది.. ఎందుకంటే ఈ వారం పర్ఫెక్ట్గా నామినేషన్స్ పడ్డాయి.. ఇప్పుడు దేవుడు చూడాలి' అని మాట్లాడాడు. జనాలేమీ పిచ్చోళ్లు కాదు! హౌస్‌లో శివాజీ ఏం చెప్పినా ప్రిన్స్ యావర్, ప్రశాంత్ వింటారు. తను ఏం మాట్లాడినా గొర్రెల్లా తలూపుతారు. కానీ జనాల్ని కూడా మానిప్యులేట్ చేయాలనుకుంటున్నాడు శివాజీ. అదంత ఈజీ కాదు.. జనాలు ఆట తీరును చూసి ఓట్లేస్తారు, కానీ ఒకరు చెప్పగానే చేతులు కట్టుకుని దాన్ని ఫాలో అయిపోరు. పైగా ఒకరిని కొట్టేసి వెళ్లిపోతా అనడం చాలా పెద్ద మాట అని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. మొత్తానికి నామినేషన్స్ రచ్చతో ప్రేక్షకుల తలలు కూడా బొప్పి కట్టాయి. మరి ఈ వారం ఎవరిని పంపించేస్తారో చూడాలి! #Shivaji 🤧🤧 Kotese povatam enti anna 🥲#BiggBossTelugu7 pic.twitter.com/F4DOElVpd4 — PAVAN SAI (@PAVANSAI99949) October 24, 2023 చదవండి: ఆ ఇద్దరికీ ఫుల్ సపోర్ట్.. కానీ అతను పూర్తిగా మారిపోయాడు.. పూజా మూర్తి -
Bigg Boss 7: మళ్లీ దొరికిపోయిన శివాజీ.. అమర్ ఆ పాయింట్ చెప్పేసరికి!
బిగ్‌బాస్‌లో మిగతా వాటి సంగతెలా ఉన్నా నామినేషన్స్ మాత్రం మంచి మజా ఇస్తాయి. ఈసారి కూడా అలానే జరిగాయి. సోమవారం నాడు శోభాశెట్టి శివాజీ మీద రెచ్చిపోగా, మంగళవారం నాడు అమరదీప్ శివాజీపై రెచ్చిపోయాడు. ఎప్పుడూ హడావుడి చేసే రైతుబిడ్డ ఈసారి చల్లబడ్డాడు. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 51 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి:'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) శివాజీ రంగు బయటపడింది సోమవారం సగం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఇక మిగిలిన నామినేషన్స్‌తో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఫస్ట్ ఫస్ట్ వచ్చిన అమరదీప్ శివాజీని నామినేట్ చేశాడు. 'నేను చనిపోయేటప్పుడు కూడా నా పిల్లల్ని నీతో మాట్లాడొద్దని చెబుతాను' అని శివాజీ అనడం అస్సలు కరెక్ట్ కాదని అమరదీప్ అన్నాడు. అయితే ఇది జోక్‌గా అన్నానని శివాజీ ఏదో కవర్ చేశాడు. కానీ అమరదీప్ అలా అనేసరికి ముఖం మాడిపోయింది. కిందకు దించేసి అలా ఉండిపోయాడు. చివర్లో మాత్రం 'గుర్తులేదు, చూడలేదు, మర్చిపోయా.. దిస్ ఈజ్ మై ప్లాన్' అని శివాజీ అన్నాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమరదీప్ - శివాజీ, భోలె యవర్ - శోభాశెట్టి, సందీప్ తేజ - అశ్విని, సందీప్ ప్రశాంత్ - గౌతమ్, అమరదీప్ రతిక - శోభాశెట్టి, అమరదీప్ అర్జున్ - తేజ, భోలె నోరు జారిన సందీప్ ఇక యవర్, సందీప్‌ని నామినేట్ చేశాడు. ఒకానొక దశలో సందీప్ సీరియస్ అయ్యాడు. యవర్ని ఉద్దేశిస్తూ.. 'బొంగులోది' అనే పదం ఉపయోగించడంతో పాటు చేతితో ఓ సైగ చేశాడు. దీంతో 'బొంగు' అనే పదాన్ని పదే పదే రిపీట్ చేశాడు. దీంతో ప్రతిసారి బిగ్ బాస్.. బీప్ వేసుకోవాల్సి వచ్చింది. ఈ గొడవ జరుగుతుంటే మధ్యలో వచ్చిన శివాజీకి కూడా సందీప్ గట్టిగా ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమాలో విలన్‌గా రామ్‌చరణ్ ఫ్రెండ్!) ప్రశాంత్.. ఈసారి ఏం లే మిగతారోజుల్లో ఉన్నాడో లేడో అన్నట్లు ఉండే ప్రశాంత్.. నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టుకుని బుద్దిమంతుడిలా రెడీ అవుతాడు. అవతల వాళ్లు చెప్పేది పూర్తికాకుండానే వాదిస్తుంటాడు. ఈసారి మాత్రం అంత సీన్ లేకపోయింది. గౌతమ్.. ప్రశాంత్ గాలి మొత్తం తీసేశాడు. తనని నామినేట్ చేయడంతో.. ప్రశాంత్ దగ్గర సరైన కారణం లేదు. రివేంజ్ నామినేషన్ చేస్తున్నాడని చెప్పాడు. ప్రశాంత్ ఎప్పుడూ చేసినట్లు గౌతమ్ బిహేవ్ చేస్తూ.. కరెక్ట్ గా చెప్పాలంటే అరుస్తూ డైలాగ్స్ చెబుతూ మరీ టీజ్ చేశాడు. దెబ్బకు ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అమరదీప్‌ని కూడా నామినేట్ చేసిన ప్రశాంత్.. తమ గ్రూప్ సభ్యుడైన భోలె గురించి మాట్లాడటం నచ్చలేదని కారణం చెప్పాడు. దీంతో గ్రూప్ రాజకీయాలు బయటపడినట్లు అయింది. గ్రూపులో ఉన్న అతడిని కంట్రోల్ చేసుకోలేకపోయారని భోలె అనడంతో.. గ్రూప్ మెంబర్ అయిన శోభా రెచ్చిపోయింది. ఇంతలో అమరదీప్ చెవిలో గౌతమ్ ఏదో చెప్పాడని ప్రశాంత్ అనడంతో గౌతమ్ రెచ్చిపోయాడు. ఏదైనా చేసుకుంటా నువ్వేమైనా బిగ్ బాస్ వా దొబ్బెయ్ అని అమరదీప్, ప్రశాంత్‌తో అన్నాడు. నన్ను ఏకినా, పీకినా, లాగినా ఏం చేసుకున్నా వెనకడుగు వేయను. ఒక్కటి గుర్తుపెట్టుకో ఇక్కడి నుంచి పోతే కప్పుతోనే పోతా, ఎవ్వడు ఏమైనా చేసుకోండి అని అమరదీప్ గట్టిగా అరుస్తూ ప్రశాంత్‌తో చెప్పాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. మొత్తంగా ఈ వారం ఎనిమిది నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేట్ అయినోళ్లు శోభా భోలె శివాజీ అశ్విని ప్రియాంక అమరదీప్ సందీప్ గౌతమ్ (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) -
ఎవరెన్ని వెధవ ప్రయత్నాలు చేసినా కప్పు కొట్టుకునే పోతా: అమర్
వారాలు గడిచేకొద్దీ, హౌస్‌లో జనం పలుచబడే కొద్దీ నామినేషన్స్ రసవత్తంగా మారుతున్నాయి. ఈ వారం కూడా నామినేషన్స్‌తో ఇంటిసభ్యుల మధ్య మంట పెట్టేశాడు బిగ్‌బాస్. నామినేషన్స్ తప్ప మిగతా అన్ని సందర్భాల్లో అమాయకుడిగా కనిపించే ప్రశాంత్ నిన్న మళ్లీ ఓవరాక్షన్ మొదలుపెట్టాడు. ఈ రోజు కూడా అది కొనసాగేట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. మధ్యలో దూరిన శివాజీ.. గౌతమ్‌ను మళ్లీ ఇరిటేట్ చేశాడు. గౌతమ్‌తో పాటు అమర్‌దీప్‌ను సైతం నామినేట్ చేశాడు. అయితే ప్రశాంత్- అమర్ల మధ్య వార్ నడుస్తుంటే సందులో సడేమియాలా భోలె షావళి కలుగజేసుకున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన అమర్.. మధ్యలో వస్తే పగిలిపోద్ది.. అంటూ అక్కడున్న కుర్చీని తన్నాడు. అయినా సరే శివాజీ కలగజేసుకుంటూ నీకు అవసరం అయినప్పుడు ఒకలా మాట్లాడతావ్.. అవసరం లేనప్పుడు ఇంకోలా మాట్లాడతావా? అని అడిగాడు. విశ్వరూపం చూపించిన అమర్ అప్పటికే కోపంతో ఊగిపోతున్న అమర్.. మీరు వాడిని సపోర్ట్ చేయాలనుకుంటే చేసేయండి అని బదులిచ్చాడు. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని ఎంత వెధవ ప్రయత్నాలు చేసినా కప్పుతోనే పోతా.. ఐయామ్ బ్యాక్ అని తన విశ్వరూపం చూపించాడు అమర్. అటు శోభా శెట్టి- భోలె షావళిల మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. తేజ- అశ్విని మధ్య సైతం ఫైట్ జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తానికి నామినేషన్స్‌తో కంటెస్టెంట్ల మధ్య ఆరని చిచ్చు పెట్టేశాడు బిగ్‌బాస్. చదవండి: హీరోతో లవ్‌లో ఉన్న యాక్షన్ కింగ్ కూతురు -
నామినేషన్స్‌లో శివాజీ నిజస్వరూపం బయటపెట్టిన శోభా!
బిగ్‌బాస్ 7 నామినేషన్స్‌లో హౌస్మేట్స్ మళ్లీ మాటలతో కొట్టేసుకున్నారు. పెద్దమనిషిలా కలరింగ్ ఇస్తూ వస్తున్న శివాజీ నిజస్వరూపాన్ని శోభాశెట్టి బయటపెట్టేసింది. ఇక భోలె గురించి అయితే చెప్పనక్కర్లేదు. గతవారంలానే ఇరిటేట్ చేశాడు. లాజిక్ అనేది లేకుండా ఏదేదో మాట్లాడాడు. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 50 హైలైట్స్‌లో చూద్దాం. (ఇదీ చదవండి: హీరో ప్రభాస్ పెళ్లి చేసుకోకపోవడానికి కారణం అదా?) రతిక గురించి డిస్కషన్ పూజామూర్తి ఎలిమినేట్, రతిక రీఎంట్రీతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం అందరూ నిద్రలేవడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. పొద్దుపొద్దునే రతిక గురించి రైతుబిడ్డ-పాటబిడ్డ బాత్రూంలో డిస్కషన్ పెట్టారు. రతిక తిరిగొచ్చింది కదా? ఎలా అనిపిస్తుందని భోలె, ప్రశాంత్‌ని అడిగాడు. దీంతో ప్రశాంత్ మైండ్ బ్లాంక్ అయిపోయింది. ఇప్పుడీ ఈ టాపిక్ ఎందుకు ఎత్తాడురా బాబు అని అనుకున్నాడు. ఎందుకు దిగాలుగా కనిపిస్తున్నావ్? అని భోలె అడగ్గా.. నాన్న వీడియో చూశా కదా! అందుకని అన్నాడు. దీంతో భోలె చల్లబడ్డాడు. రతికపై బిగ్‌బాస్ ప్రేమ రతికపై బిగ్‌బాస్‌కి ఎంత ప్రేముందో మళ్లీ రుజువైంది. ప్రేక్షకులే మాకు ఈమె వద్దు బాబోయ్ అని ఎలిమినేట్ చేసి బయటకు పంపేసినా, పక్కా ప్లాన్ చేసి మరీ రీఎంట్రీ పేరుతో రతికని మళ్లీ హౌసులోకి తీసుకొచ్చాడు. ఇప్పుడేమో ఈ వారం అస్సలు ఆమెని నామినేట్ చేయొద్దని ఆర్డర్ పాస్ చేశాడు. ఆమె గురించి చెప్పడానికి కంటెస్టెంట్ దగ్గరు ఎలానూ రీజన్స్ ఉండవు. కాబట్టి రతికని నామినేట్ చేయరు. అయినా సరే బిగ్‌బాస్ ప్రత్యేకించి చెప్పడం రతికపై ప్రేమ ఎక్కువైపోయినట్లు అనిపించింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో ఇంటి గోడని కూల్చేసిన అధికారులు.. అదే కారణమా?) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? శివాజీ - శోభాశెట్టి, ప్రియాంక అశ్విని - శోభాశెట్టి, ప్రియాంక గౌతమ్ - ప్రశాంత్, భోలె ప్రియాంక - భోలె, అశ్విని సందీప్ - అశ్విని, భోలె శోభాశెట్టి - శివాజీ, యవర్ భోలె - శోభాశెట్టి, గౌతమ్ లాజిక్స్ మర్చిపోతున్న శివాజీ ఫస్ట్ ఫస్ట్ శివాజీతో నామినేషన్స్ మొదలయ్యాయి. గతవారం నామినేషన్స్ సందర్భంగా భోలెతో గొడవపడటం తనకు నచ్చలేదని చెప్పి శోభా, ప్రియాంకని నామినేట్ చేశాడు.పెద్దోడు కదా సారీ చెప్పిన తర్వాత కూడా అలా ప్రవర్తించడం కరెక్ట్ కాదని శోభాతో అన్నాడు. శివాజీ చెప్పిన దాని ప్రకారం చూస్తే.. పెద్దోడు అయితే బూతులు తిట్టేసి సారీ చెబితే క్షమించేయాలేమో? (ఇదీ చదవండి: వాళ్లకు క్షమాపణలు చెప్పిన మెగాహీరో రామ్‌చరణ్) ఇచ్చిపడేసిన శోభా ఇక తన నామినేషన్స్ సందర్భంగా శోభాశెట్టి, శివాజీకి ఇచ్చిపడేసింది. 'భోలెతో గొడవ జరిగిన తర్వాత నేను తప్పు చేశానని చెప్పొచ్చు. లేదంటే వీకెండ్లో అయినా చెప్పొచ్చు. అలా కాకుండా నామినేషన్స్‌లో మాత్రమే చెప్పి, ప్రేక్షకులందరిముందు నన్ను బ్యాడ్ చేద్దామనుకుంటున్నారా?' అని శివాజీని అడిగింది. పైకి పెద్దమనిషి అని చెప్పుకొని.. మనుషుల్ని శివాజీ ఎలా బ్యాడ్ చేస్తున్నాడనేది శోభా ప్రశ్నతో ప్రూవ్ అయింది. అతడి నిజస్వరూపాన్ని బయటపడింది. శివాజీ ఆట చూస్తే ఒకటి మాత్రం కచ్చితంగా అర్థమవుతోంది. మాట వినేవాళ్లని మంచి చేసుకోవడం, అలా కాదంటే మెంటల్‌గా డౌన్ చేయడం. అమరదీప్‌ని తొలివారం నుంచి అలానే టార్గెట్ చేశాడు. అతడిని మెంటల్‌గా డిస్ట్రబ్ చేసి అల్లకల్లోలం చేశాడు. నువ్వు తోపు, తురుము అనేసరికి అమరదీప్ సరిగా కాన్సట్రేట్ చేయలేకపోయాడు. ఇప్పుడు అదే టెక్నిక్ శోభా మీద ప్రయోగిద్దామని శివాజీ చూస్తున్నట్లు ఉన్నాడు. ఎందుకంటే నామినేషన్స్‌లో శోభాని ఉద్దేశిస్తూ.. నిన్ను ఇక్కడి నుంచి పంపించేయాలంటే, నువ్వు మాత్రమే పోగలవు. నిన్ను ఎవడూ పంపించేయలేడు అని అన్నాడు. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న ఆ స్టార్ సింగర్.. అమ్మాయి ఎవరంటే?) -
బిగ్‌బాస్: నామినేషన్స్‌లో ఏడుగురు, ఆ కంటెస్టెంట్ మాత్రం నయా రికార్డు!
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఒక్కొక్కరూ వెళ్లేకొద్దీ నామినేషన్స్ మరింత రసవత్తరంగా మారుతున్నాయి. అయితే ఎన్నడూ కనీవినీ ఎరుగని రీతిలో ఈ సీజన్లో వరుసగా ఏడుగురు అమ్మాయిలను హౌస్ నుంచి ఎలిమినేట్ చేశారు. అయితే రతికను మాత్రం తిరిగి హౌస్‌లోకి పంపించారు. ఇకపోతే గతవారం భోలె షావళి బూతులు మాట్లాడుతూ అందరికీ బీపీ తెప్పించాడు. వీకెండ్ ఎపిసోడ్‌లోనూ నాగ్ క్లాస్ పీకాడు. ఇప్పుడదే వ్యవహారాన్ని నామినేషన్ అస్త్రంగా మార్చుకున్నాడు శివాజీ. భోలె తప్పులు మాట్లాడాడు. కానీ అతడు సారీ చెప్పినా క్షమించకపోవడం తప్పంటూ శోభా శెట్టిని నామినేట్ చేశాడు. అర్హత లేదు, బయటకు వెళ్లు మాటలు పడింది తాను.. క్షమించడం, క్షమించకపోవడం తన ఇష్టమని శోభా అభిప్రాయపడింది. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. నన్ను నెగెటివ్‌గా చూపించేందుకు ఇదే మంచి అవకాశం అనుకున్నారంటూ శివాజీ కుట్రను బయటపెడుతూ అతడి మీద ఫైర్ అయింది. ఈ ఇంట్లో ఉండే అర్హత నాకు లేదు, బయటకు వెళ్లు అని చెప్తున్నారు.. అంతే కదా అని నిలదీసింది. దానికి శివాజీ.. నాతో సహా ఇక్కడున్న ఎవరికీ ఇంట్లో ఉండే అర్హత లేదు అంటూ తలతిక్క సమాధానం ఇచ్చాడు. ఏడుగురు నామినేట్ ఇక రోజు కూడా భోలె షావళి- ప్రియాంకల మధ్య వాగ్వాదం జరిగేట్లు కనిపిస్తోంది. కాగా సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం ఈ వారం శివాజీ, భోలె షావళి, అమర్దీప్, ప్రశాంత్, ప్రిన్స్ యావర్, గౌతమ్.. మొత్తంగా ఏడుగురు నామినేషన్స్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈసారి కూడా సందీప్ నామినేషన్స్‌లోకి రాకపోవడం గమనార్హం. వరుసగా ఎనిమిది వారాలుగా సందీప్ నామినేషన్స్ దరిదాపుల్లోకి కూడా రావడం లేదు. ఈ లెక్కన ఎక్కువ వారాలు నామినేట్ అవని కంటెస్టెంట్‌గా సందీప్ రికార్డు సృష్టిస్తున్నాడు. చదవండి: వారిని ఎలిమినేట్ చేయాల్సిందన్న పూజా మూర్తి... గీతూ కౌంటర్లకు దండం పెట్టేసిందిగా -
బూతులను సమర్థించిన శివాజీని ఢీ కొట్టిన శోభ
బిగ్ బాస్ ఎనిమిదో వారం నామినేషన్స్ ప్రక్రియకు రంగం సిద్ధమైంది. ఎప్పిటిలాగే ఈ వారం కూడా హౌస్‌లో నామినేషన్స్ రచ్చ భారీగానే జరిగినట్లు తెలుస్తోంది. తాజాగా విడుదలైన ప్రోమో ప్రకారం చూస్తే ఈసారి శివాజీని శోభ ఢీ కోట్టినట్లు కనిపిస్తుంది. గతవారంలో శోభ- ప్రియాంకల మీద బూతు పదాలతో భోలే షావాలి విరుచకపడ్డాడు. దీంతో వారిద్దరూ కూడా అదే రేంజ్లో తిప్పికొట్టారు. దీనిని తప్పుబడుతూ శోభను నామినేషన్ చేస్తున్నట్లు శివాజీ చెప్పాడు. మరోవైపు పల్లవి ప్రశాంత్‌తో గౌతమ్ నామినేషన్ వాగ్వాదం నడిచింది. హౌస్‌లో ఆడపిల్లలపై బూతులు.. సమర్థించిన శివాజీ శోభ- ప్రియాంకలపై గతవారంలో భోలే షావాలి బూతు మాటలు అన్నాడు. ఆ మాటలు తెలంగాణ మాండలికంలో అత్యంత దారుణమైనవి. అది గమనించిన ప్రియాంక శోభకు తెలిపి వెంటనే రియాక్ట్ అయ్యారు. తూ... అంటూ భోలేపై ప్రియాంక విరుచుకుపడింది. ఆపై వెంటనే ప్రియాంక క్షమాపణ కోరింది. కానీ బూతు మాటలు మాట్లాడిన భోలే అప్పటికి కనీసం క్షమాపణ కూడా కోరలేదు. కొంత సమయం తర్వాత బిగ్ బాస్ వార్నింగ్ ఇచ్చాక భోలే క్షమాపణలు కోరాడు. ఇదంతా జరుగుతూ ఉంటే అక్కడే ఉన్న వేరే లేడీ కంటెస్టెంట్లు గానీ, మేల్ కంటెస్టెంట్లు గానీ కిక్కుమనలేదు. అన్నింట్లో వేలు పెట్టే శివాజీ కూడా భోలేను ఒక్కమాట అనలేదు. కానీ ఇప్పుడు మాత్రం భోలే చేసింది తప్పే అంటూ కలరింగ్ ఇస్తున్నాడు శివాజీ. పైగా నేడు ఇదే గొడవను మళ్లీ తెరపైకి తెచ్చి శోభను నామినేట్ చేశాడు. అదే బూతు పదం శివాజీ కుటుంబ సభ్యులను అంటే తీసుకుంటాడా..? సారీ చెబితే సంతోషిస్తాడా..? వాళ్లిద్దరూ కూడా ఆడపిల్లలు.. భోలే మాటలకు కన్నీరు పెట్టలేదు. శివంగుల్లా తిరగబడ్డారు. తన మనసులో ఏదైతే ఉందో అదే బయటకు చెప్పారు. భోలేను క్షమిస్తున్నారా అని నాగార్జున అడిగినా.. లేదు సార్ అని చెప్పారు. అంతలా భోలే మాటలు వారిని బాధించాయి. కనీసం ఈ సోయ కూడా లేకుండా శోభ పేరును శివాజీ ఎలిమినేషన్ ప్రక్రియలో చేర్చాడు. దీంతో భోలే వాడిన బూతులను శివాజీ సమర్థించినట్లేనని స్పష్టంగా తెలుస్తోంది. ఇదంతా పట్టని కొన్ని పీఆర్ టీమ్ వాల్లు కావాలని తెలుగు వెబ్సైట్లతో ఆమె మీద వ్యతిరేకతను పెంచే ప్రయత్నం చేస్తున్నారు. కనీసం ఒక ఆడపిల్లను అంత మాట అనేశాడే అనే సోయ కూడా లేకుండా భోలే,శివాజీ లాంటి వారి కోసం పీఆర్ టీమ్‌లు పనిచేస్తున్నాయి. అయినా సరే ఆమె మరింత గట్టిగా ఆటలో నిలబడుతోంది. -
Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్‌తో సహా మొత్తం!
బిగ్‌బాస్ 7లో ఆడుతున్న రైతుబిడ్డ మాటల మార్చి దొరికిపోయాడు. ప్రూఫ్స్‌తో సహా హోస్ట్ నాగార్జున ఈ విషయాన్ని బయటపెట్టాడు. ఇక శివాజీ హౌసులో ఉంటాడా? వెళ్లిపోతాడా అనే దానిపై క్లారిటీ వచ్చేసింది. ఇన్నాళ్లు శివాజీ గురించి పెద్దగా మాట్లడని కంటెస్టెంట్ అతడి గురించి నిజాల్ని బయటపెట్టాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 48 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. భోలెకి నాగార్జున క్లాస్ కెప్టెన్సీ టాస్కులో సందీప్, అర్జున్ చివరి స్టేజీకి చేరుకోవడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. వీళ్లిద్దరి మధ్య ఫైనల్ గేమ్ పెట్టడంతో శనివారం ఎపిసోడ్ మొదలైంది. ఇందులో గెలిచిన అర్జున్.. బిగ్‌బాస్ 7 హౌసుకి మూడో కెప్టెన్ అయ్యాడు. ఇక ఇదంతా చూసిన హోస్ట్ నాగార్జున ప్రస్తుతానికి వచ్చేశాడు. కాసేపు పిచ్చాపాటి మాట్లాడిన తర్వాత ఒక్కొక్కరికీ క్లాస్ పీకాడు. ఈ వారం నామినేషన్స్‌లో బూతులు మాట్లాడి అతి చేసిన భోలెకి గట్టిగా పడ్డాయి. అతడు మరోసారి ఇలాంటివి జరగవని చెప్పాడు. దీంతో సమస్య అక్కడితో సాల్వ్ అయింది. (ఇదీ చదవండి: అవార్డ్ విన్నింగ్ సౌత్ సినిమా.. రెండేళ్ల తర్వాత ఇప్పుడు ఓటీటీలోకి) రైతుబిడ్డ నిజస్వరూపం రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో ప్రతిసారి సింపతీ గేమ్ ఆడుతున్న ప్రశాంత్.. ఈసారి అడ్డంగా దొరికిపోయాడు. ఈ వారం నామినేషన్స్‌లో భాగంగా.. సందీప్ తనని 'ఊరోడు' అని అన్నాడని, అది తనకు నచ్చలేదని కారణం చెప్పాడు. ఇప్పుడు అదే విషయాన్ని బయటకు తీసిన హోస్ట్ నాగార్జున.. మొత్తం గొడవ క్లియర్ చేసే ప్రయత్నం చేశాడు. అయితే నామినేషన్స్‌లో పూనకం వచ్చినట్లు రెచ్చిపోయిన ప్రశాంత్.. నాగ్ అడిగేసరికి మాత్రం నంగనాచి కబుర్లు చెబుతూ పిల్లిలా ప్రవర్తించాడు. హౌస్ట్ నాగార్జున.. ప్రశాంత్ చేసి తప్పని నేరుగా చెప్పొచ్చు. కానీ అలా చేయలేదు. ఇంట్లోని సభ్యులైన పూజా, అర్జున్‌లతో ఈ విషయాన్ని చెప్పించాడు. ప్రశాంత్ మాటలు మార్చేస్తున్నాడని ఈ ఇద్దరు చెప్పారు. దీంతో రైతుబిడ్డ నిజస్వరూపం బయటపడినట్లయింది. అయితే సందీప్ చెప్పిన తర్వాత అలా కాదు ఇలా అన్నానని చెప్పడానికి ప్రయత్నించానని, కానీ చెప్పే అవకాశం ఇవ్వలేదని నాగార్జునతో చెప్పాడు. కానీ ఇది కూడా అబద్ధమే. నాగ్ పెద్దగా సీరియస్‌గా తీసుకోలేదు. ఈ గొడవని పుల్‌స్టాప్ పెడదామని ఫిక్స్ అయిన నాగ్.. 'నేను గర్వంగా చెబుతున్నా మా నాన్న ఊరోడు' అని అనడంతో ప్రాబ్లమ్ సాల్వ్ అయింది. కానీ ప్రశాంత్ మాటలు మార్చి అడ్డంగా దొరికిపోవడంతో అతడి పరువంతా పోయినట్లయింది. (ఇదీ చదవండి: రాజమౌళికి షాక్.. డిజాస్టర్ దర్శకుడి చేతిలో 'మహాభారతం' సినిమా) పాము నిచ్చెన గేమ్ ఇక బిగ్‌బాస్ 7వ సీజన్ 100 రోజుల గేమ్ అని, శనివారం 50వ రోజు అని చెప్పిన నాగార్జున.. పాము-నిచ్చెన అనే గేమ్ పెట్టాడు. ఇందులో భాగంగా ఒక్కో కంటెస్టెంట్స్.. హౌసులోని తమకు ఎవరు సపోర్ట్ చేస్తున్నారు? ఎవరు కిందకు లాగుతున్నారు? అనేది చెప్పాల్సి ఉంటుంది. కంటెస్టెంట్.. నిచ్చెన, పాము ఎవరు? అశ్విని.. గౌతమ్, శోభా గౌతమ్.. అర్జున్, శివాజీ శివాజీ.. యవర్, అమరదీప్ అమరదీప్.. అర్జున్, తేజ అర్జున్.. గౌతమ్, శివాజీ యవర్.. శివాజీ, గౌతమ్ పూజా.. అర్జున్, అశ్విని ప్రియాంక.. శోభా, అశ్విని భోలె.. శివాజీ, శోభాశెట్టి శోభాశెట్టి.. ప్రియాంక, భోలె సందీప్.. శోభా, శివాజీ తేజ.. అమరదీప్, యవర్ ప్రశాంత్.. శివాజీ, పూజా ఈ ఆటలో భాగంగా శివాజీ రెండు వైపుల ఉన్నాడు. అతడి సపోర్టర్స్ అయిన ప్రశాంత్, యవర్, భోలె.. నిచ్చెన అని చెప్పారు. మరోవైపు గౌతమ్, అర్జున్,సందీప్.. శివాజీ పాములాంటోడని చెప్పారు. మరోవైపు శివాజీ.. తన ఆరోగ్యం గురించి నాగార్జునతో మాట్లాడాడు. శరీరం సహకరించట్లేదని బయటకెళ్లిపోతానని అన్నాడు. ఉండమని చెప్పడంతో.. ఫిజియోని ఏర్పాటు చేయాలని శివాజీ అన్నాడు. దీనికి నాగ్ ఒప్పుకొన్నాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. ఏడో వారం ఎలిమినేట్ అయ్యేది ఎవరనేది ఆదివారం ఎపిసోడ్లో తేలుతుంది. (ఇదీ చదవండి: 'టైగర్ నాగేశ్వరరావు'.. ఇప్పుడు జాగ్రత్త పడి ఏం లాభం?) -
నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!
బిగ్‌బాస్‌లో శివాజీ ఉండలేకపోతున్నాడు. గత ఆరువారాల నుంచి ఏదో మాటలు, మరోవైపు మైండ్ గేమ్‌తో నెట్టుకొచ్చేశాడు గానీ ఇప్పుడు వాటికి కూడా స్కోప్ లేకుండా పోయింది. ఓ విషయాన్ని తాను చేస్తే ఘనకార్యం అనుకుంటాడు. పక్కనోళ్లు చేస్తే మాత్రం నాన్సెన్స్ అంటున్నాడు. అమరదీప్తో జరిగిన ఓ సంఘటనతో ఇది బయటపడింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 47 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్.. ఏడోవారం కూడా అమ్మాయే?) శివాజీపై బిగ్‌బాస్ ప్రేమ కెప్టెన్సీ టాస్క్ పూర్తి కావడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. కెప్టెన్సీ టాస్కులో విజేతని ప్రకటించడంతో శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. టాస్కులో విజయం సాధించిన జిలేబీపురం గ్రామస్థులు కెప్టెన్సీ కంటెండర్స్‌గా నిలిచారు. అయితే సంచాలక్‌గా వ్యవహరించిన శివాజీకి కూడా ఛాన్స్ ఉందని, కాకపోతే గెలిచిన జట్టులో ఒకరితో ఎక్సేంజ్ చేసుకోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో భోలె.. తన కంటెండర్‌షిప్ శివాజీకి దానం చేశాడు. కొత్త కెప్టెన్ ఎవరు? కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం పోటీలో ఉన్న ఆరుగురిలో (ప్రియాంక, అర్జున్, సందీప్, ప్రశాంత్, అశ్విని, శివాజీ) ఎవరు కెప్టెన్ కావాలనేది ప్రత్యర్థి జట్టు గులాబీపురం చేతిలో ఉంటుందని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో శోభా వచ్చి అశ్వినిని ఎలిమినేట్ చేసింది. అమరదీప్.. శివాజీని ఎలిమినేట్ చేశాడు. పూజామూర్తి.. ప్రశాంత్‌ని ఎలిమినేట్ చేసింది. యవర్.. ప్రియాంకని ఎలిమినేట్ చేశాడు. ఫైనల్‌గా అర్జున్, సందీప్.. కెప్టెన్సీ కోసం పోటీపడబోతున్నారు. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్) శివాజీ అసహనం బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఎన్ని వారాలు, ఎలాంటి టాస్కులైనా సరే అన్నింటికి తట్టుకుని నిలబడాలి. ఈ క్రమంలోనే విజయం సాధించొచ్చు లేదంటే అక్కడివరకు వచ్చామనే ఆనందంతోనైనా బయటకెళ్లొచ్చు. తొలి కొన్నివారాలు మాటలు చెప్పుకొని శివాజీ మంచిగా బండి లాక్కోచేశాడు గానీ ఇప్పుడు శరీరంలోని సహనం అంతా పోయింది. దీంతో నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా అమరదీప్ శివాజీని నామినేట్ చేసి ఎలిమినేట్ చేసేశాడు. దీంతో శివాజీ.. 'నేనో వేస్ట్ కేండిడేట్లా కనిపిస్తున్నా. నేను ఈ హౌసులో పనికిరాను. నాకు ఈ హౌస్ వద్దు, నువ్వు(బిగ్‌బాస్) వద్దు, తలుపు తీస్తే నేను వెళ్లిపోతా' అని ఏది పడితే అది మాట్లాడాడు. లాజిక్ మర్చిపోయిన శివాజీ అయితే ఐదోవారమే కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చినా దాన్ని ప్రశాంత్ కోసం శివాజీ త్యాగం చేశాడు. అప్పుడేమో పెద్ద త్యాగమూర్తిలా నీతులు చెప్పాడు. ఇప్పుడు అమరదీప్.. తనని సైడ్ చేసేసరికి బుర్ర బాదుకున్నాడు. ఈ విషయమై అమర్, సందీప్‌తో మాట్లాడుతూ కరెక్ట్ లాజిక్ చెప్పాడు. 'ఆయనకు వాళ్లు(ప్రశాంత్, యవర్) ఎంత ముఖ్యమో నాకు నా వాళ్లు అంతే ఇంపార్టెంట్ కదా?' అని అమరదీప్ అన్నాడు. అప్పుడేమో శివాజీ, ప్రశాంత్‌కి కెప్టెన్సీ వచ్చేలా చేయొచ్చు. ఇప్పుడు మాత్రం అమర్.. తన వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వాలని చూసేసరికి శివాజీకి ఎక్కడలేని కోపమొచ్చేసింది. ఇదెక్కడి లాజిక్కో శివాజీకే అర్థం కావాలి. తీరా కాసేపటి తర్వాత అమర్‌తో అనరాని మాటలు అన్నాడు. 'నేను చచ్చిపోయేటప్పుడు కూడా నా పిల్లలకు నిన్ను నమ్మొద్దని చెబుతాను' అని శివాజీ తనతో అన్నట్లు అమర్, శోభా దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. మరో సందర్భంలో శివాజీ, తేజతో మాట్లాడుతూ శోభా వెనక తిరగడంపై అతడికి క్లాస్ పీకాడు. (ఇదీ చదవండి: అబ్బ.. ఏం డ్రామా శివాజీ.. అమర్‌దీప్‌పై అంత పగ దేనికి?) వెళ్లిపోతానని ఒకటే గోల ఇదే ఎపిసోడ్లో శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్... ఎలా ఉన్నారు? అని అడిగాడు. దీంతో శివాజీ జరిగిదంతా చెప్పాడు. 'చాలా ఇబ్బంది పడుతున్నా, చెయ్యంతా లాగుతుంది, నన్ను బయటకు పంపేయ్ బిగ్‌బాస్.. రోజు ఏడుస్తున్నా, ఎవరైనా ఉంటే నవ్వుతూ ఏడుస్తున్నా, ఇలా పిల్లలతో మాటలు పడటం కావట్లేదు. అన్ని ఉన్నాయ్ కానీ న్యాయం చేయలేకపోతున్నా, చాలా ఆశలతో ఇక్కడికి వచ్చా కానీ టైం పడతది బిగ్‌బాస్.. తెలుస్తుంది నా బాడీ నాకు కోపరేట్ చేయట్లేదని, అమరదీప్ చెప్పింది కరెక్టే, నేను వెళ్తా బిగ్‌బాస్.. వాళ్లందరి ముందు ఏడవలేకపోతున్నా. నాకు చాలా బరువుగా ఉంది. నేనుంటే కప్ కొడతానని నాకు తెలుసు. కప్పు కొడదామనే వచ్చా. మంచిగా ప్రారంభించినా, ఇప్పుడు పరిస్థితులు నాకు సహకరించట్లేదు. మీతో మాట్లాడుతుంటే కూడా నొప్పిగా ఉంది, కానీ దీన్నంతా కవర్ చేసుకుని అక్కడ నవ్వుతూ మాట్లాడుతున్నా' అని ఎమోషనల్ అయ్యాడు. అయితే మరోసారి డాక్టర్‌కి చూపించిన తర్వాత చూద్దాం అని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. శివాజీని ఎందుకు ఉంచుతున్నట్లు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఫిజికల్ టాస్కుల పరంగా శివాజీ ఒక్కటి ఆడట్లేదు. ఓసారి ఆడిన దానికే చెయ్యికి దెబ్బ తగిలింది. ఇప్పటికీ నొప్పితే విలవిల్లాడిపోతున్నాడు. అలానే ఇప్పటికే 10-15 సార్లు కంటే ఎక్కువగానే.. బయటకెళ్లిపోతా బయటకెళ్లిపోతా అని చెబుతున్నాడు. ఇంత చెబుతున్నాడు. ఇంతలా పోతా పోతా అని అంటున్నా సరే బిగ్‌బాస్, శివాజీపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడనేది అర్థం కాని ప్రశ్నలా మారిపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఈసారి ఆదివారం కాకుండా శనివారం ఎలిమినేషన్ ఉందంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) -
అబ్బ.. ఏం డ్రామా శివాజీ.. అమర్‌దీప్‌పై అంత పగ దేనికి?
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరైనా దేనికి వెళ్తారు? గేమ్ ఆడటానికి.. కానీ ఈ సీజన్లో ఒకరు మాత్రం ఆటగాడిగా కన్నా కోచ్‌గానే ఎక్కువగా వ్యవహరిస్తున్నాడు. అతడెవరో మీకీపాటికే అర్థమై ఉంటుంది. కర్ర విరగకుండా పామును చంపడం శివాజీకి బాగా తెలుసు. ఈ చావు తెలివితేటలతోనే హౌస్‌లో నెట్టుకుంటూ వస్తున్నాడు. అందరిలోనూ తనే పెద్ద తోపు అని ఫీలవుతాడు. ఎదుటివారు ఒక్కటంటే ఒక్క మాట తనకు వ్యతిరేకంగా మాట్లాడినా తీసుకోలేడు. కానీ తను మాత్రం అందరినీ ఏది పడితే అది అనేస్తాడు.. దానికి ఎవరూ అడ్డు చెప్పొద్దు అన్నట్లుగా మాట్లాడతాడు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయడంలో దిట్ట హౌస్‌లో ఇప్పటివరకు శివాజీని గట్టిగా ప్రశ్నించింది ఎవరైనా ఉన్నారా? అంటే.. అది అమర్దీప్, గౌతమ్ మాత్రమే! కానీ వాళ్లు అడిగే ప్రశ్నలకు తన దగ్గర సమాధానాలు లేని శివాజీ అడ్డదారిలో నరుక్కొచ్చేవాడు. అసలు నువ్వేం ఆడావు? నీ ఆట నాకు కనిపించలేదు అని బట్ట కాల్చి మీద వేసేవాడు. మొదటి నుంచీ ఇప్పటివరకు నువ్వు ఆడిందే లేదు అని వారిలో ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేవాడు. అలా అమర్‌ను కిందకు లాగడంలో సక్సెస్ అయ్యాడు కూడా! తను ఆడితే గేము.. అవతలివారు ఆడితే క్రైమూ.. ఈ వారం జరిగిన ఏలియన్స్ టాస్కులో కూడా శివాజీ ఆడలేదు. సంచాలకుడిగా మాత్రమే వ్యవహరించాడు. ఏలియన్స్ ఇచ్చిన టాస్కుల్లో జిలేబీపురం గెలవడంతో అందులో ఉన్న అందరూ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో టీమ్‌ను గెలిపించినవారికి ఒక ఛాన్స్ ఇద్దామనుకున్నాడు అమర్. అందుకని గేమ్ ఆడకుండా కూర్చున్న శివాజీని కెప్టెన్సీ పోటీ నుంచి తొలగించాడు. అది జీర్ణించుకోలేకపోయిన శివాజీ రివర్స్ గేమ్ స్టార్ట్ చేశాడు. సింపతీ డ్రామాలు నేనొక వేస్ట్ క్యాండెట్లా కనిపిస్తున్నాను అంటూ సీన్ క్రియేట్ చేశాడు. కన్ఫెషన్ రూమ్‌లోనూ బిగ్‌బాస్ ముందు ఏడ్చేశాడు. నేను ఆడటం లేదని పరోక్షంగా అనేసరికి తట్టుకోలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి ఇదే మాటను డైరెక్ట్‌గా గౌతమ్, అమర్‌దీప్‌లతో చాలాసార్లు అన్నాడు శివాజీ. నువ్వు ఏ గేమూ ఆడలేదు. నీకు ఆడటమే చేతకాదు.. అని నానామాటలు అని వారిని మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. అంటే తను చేస్తే ఒప్పు, ఎదుటివాళ్లు చేస్తే తప్పా? ఆ ఇద్దరినీ పావులుగా వాడుకుంటున్న శివాజీ అందరినీ గ్రూప్ గేమ్ అంటూ బ్లేమ్ చేసే శివాజీయే అసలైన గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లను తన ఆట కోసం పావులుగా మార్చుకున్నాడు. నామినేషన్స్ దగ్గరి నుంచి గేమ్ వరకు ఎక్కడ ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాడు. తను ఆడటం మానేసి వాళ్లతో ఆడించాలనుకుంటున్నాడు. అంతేకాదు, వారికి లేనిపోనివి నూరిపోస్తున్నాడు కూడా! పైకి మాత్రం తనకు అందరూ సమానమే అని నీతులు వల్లిస్తున్నాడు. అమర్‌దీప్‌ను మొదటి నుంచీ టార్గెట్ ఇకపోతే అమర్దీప్ గురించి బిగ్‌బాస్ షోకు రావడానికి ముందే బాగా తెలుసుకున్నాడు శివాజీ. అమర్-తేజస్వినిల ఇంటర్వ్యూ కూడా చూశానని అమర్‌తోనే చెప్పాడు. అంటే అతడిని సైడ్ చేయాలని ముందుగానే గట్టిగా ప్లాన్ వేసుకుని మరీ వచ్చాడు. మొదటి నుంచి అమర్‌ను టార్గెట్ చేస్తూ పోయాడు. గేమ్‌లో అమర్‌ను కిందకు లాగడమే కాకుండా తనను చులకన చేస్తూ మాట్లాడుతున్నాడు. 'నేను చనిపోయేటప్పుడు కూడా చెప్తారా.. నిన్ను మాత్రం నమ్మవద్దని నా పిల్లలకు చెప్తా..' అని శివాజీ తనతో అన్నాడని అమర్దీప్ బాధపడ్డాడు. అంటే అమర్ మీద శివాజీకి ఎంత కోపం ఉందో ఇక్కడే తెలిసిపోతుంది. రైతుబిడ్డకు సపోర్ట్ చేసేది అందుకే! వ్యక్తిగతంగా అతడి మీద అంత పగ దేనికి? ఎందుకని శివాజీ అమర్‌ను టార్గెట్ చేస్తున్నాడు? అని నెటిజన్లు బుర్ర గోక్కుంటున్నారు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అమర్‌దీప్‌ను సైడ్ చేయాలన్నది శివాజీకి ముందు నుంచీ ఉన్న ప్లాన్. అందులో భాగంగానే షో ప్రారంభం నుంచి అతడిని టార్గెట్ చేస్తూ తనను కిందకు లాగాడు. ఆ తర్వాత సామాన్యులకే తన మద్దతు అంటూ ప్రశాంత్, ప్రిన్స్‌లకు సపోర్ట్ చేస్తూ బయట తనకు పాపులారిటీ పెంచుకోవాలనుకున్నాడు. రైతుబిడ్డకు సపోర్ట్ చేస్తే బయట తనకు సింపతీ పెరుగుతుందని, అది తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నది తన ఆలోచన. పాతాళానికి తొక్కేస్తాడు అందుకే ఎప్పుడూ అతడిని ఆకాశానికెత్తేస్తూ ఉంటాడు, అవతలివారిని పాతాళానికి తొక్కేయాలని చూస్తుంటాడు. ఇప్పుడు ఏ గేమూ ఆడకపోయినా అవతలివారిని మాత్రం హేళన చేయడం ఆపడం లేదు. మళ్లీ అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరి బాగోగులు కోరుకున్నట్లు నటిస్తుంటాడు. కానీ ఇంకా ఎన్నాళ్లు శివాజీ? ఎప్పటికైనా ముసుగు తీయాల్సిందే.. నిజ స్వరూపం బయటపడాల్సిందే! Looks going personal now#BiggBossTelugu7 #Amardeep #Shivaji pic.twitter.com/jUU0BYWAzk — BiggBossTelugu7 (@TeluguBigg) October 19, 2023 చదవండి: మొన్నటివరకు శివాజీ.. ఇప్పుడు శోభ, ప్రియాంక.. అందరూ అమర్‌ను చులకనచేసి మాట్లాడేవారే -
బిగ్‌బాస్ 7: ఏడ్చేసిన శివాజీ.. కొత్త కెప్టెన్ ఎవరంటే?
బిగ్‌బాస్ హౌస్‌లో గ్రహాంతరవాసులు రావడం, కొన్ని టాస్కులు ఇవ్వడం, కంటెస్టెంట్లు పోటీపడి ఆడటం చూస్తూనే ఉన్నాం. గ్రహాంతర వాసులు ఇచ్చిన గేమ్‌లో జిలేబిపురం టీమ్ గెలిచింది. దీంతో ఆ టీమ్‌లో ఉన్న ప్రియాంక, అర్జున్, అశ్విని, ప్రశాంత్, సందీప్, శివాజీ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఇచ్చాడు బిగ్‌బాస్. గులాబీపురం కంటెస్టెంట్లు.. కెప్టెన్సీకి అర్హత లేదనుకునేవారి ఫోటోలను స్విమ్మింగ్ పూల్‌లో పడేసి పోటీ నుంచి తొలగించాలన్నాడు. ఈ క్రమంలో శోభ.. అశ్వినిని గేమ్ నుంచి తప్పించగా పూజా మూర్తి.. ప్రశాంత్ ఫోటో నీళ్లలో పడేసింది. ప్రిన్స్ యావర్.. ప్రియాంక ఫోటోను నీళ్లలో పడేశాడు. అమర్దీప్.. శివాజీ ఫోటో పడేశాడు. దీంతో చివరగా అర్జున్, సందీప్ మాత్రమే మిగిలారు. నెట్టింట చక్కర్లు కొడుతున్న సమాచారం ప్రకారం అర్జున్ ఈ వారం ఇంటి కెప్టెన్‌గా అవతరించినట్లు కనిపిస్తోంది. ఇకపోతే శివాజీని కన్ఫెషన్ రూమ్‌లోకి పిలిచిన బిగ్‌బాస్.. తన ఆరోగ్యం గురించి ఆరా తీశాడు. దీంతో ఎమోషనలైన శివాజీ ఇప్పటికీ చేతినొప్పితో ఇబ్బందిపడుతున్నట్లు తెలిపాడు. అందరి ముందు ఏడ్వలేకపోతున్నానంటూ కన్నీళ్లు పెట్టుకున్నాడు. చదవండి: ఐ లవ్యూ చెప్పిన తేజ.. థూ అని ఊసిన శోభ.. చులకనవుతున్న అమర్! -
వాళ్లు చెబితే ఒప్పుకోలేదు.. ఇప్పుడేమో శివాజీ నిజం బయటపెట్టాడు!
బిగ్‌బాస్ 7లో శివాజీ ఓ ఆటగాడు. కానీ అనుకోకుండా గాయపడ్డాడు. వయసు రీత్యా కాస్త ఇబ్బంది పడుతున్న హౌసులో ఉన్నాడు. అక్కడి వరకు బాగానే ఉంది. కానీ గత కొన్నివారాల నుంచి కంటెస్టెంట్స్ అందరూ ఓ విషయాన్ని అస్సలు ఒప్పుకోలేదు. ఇప్పుడేమో కంగారులో తనకు తానే నిజం బయటపెట్టాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 45 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!) శివాజీ ఏడుపు నామినేషన్స్ పూర్తి కావడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఉదయం నిద్రలేవడంతో బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇకపోతే బిగ్‌బాస్‌లోకి ఎవరొచ్చినా సరే గేమ్స్ ఆడాలి, మాటలతో మెప్పించాలి. అవతల వాళ్లని నొప్పించి అయినా సరే విజయం సాధించాలి. తప్పు రైటో పక్కనబెడితే యాక్టివ్‌గా ఉండాలి. కానీ శివాజీ మాటలతో కాలక్షేపం చేస్తున్నాడు. కొన్నిరోజుల ముందు గేమ్ ఆడితే గాయపడ్డాడు. దీంతో హౌసులో ఉండటమైతే ఉన్నాడు గానీ బిగ్‌బాస్ శివాజీని అస్సలు కష్టపెట్టట్లేదు. దీంతో శివాజీకి చిరాకేస్తుంది. అదే విషయాన్ని పరోక్షంగా చెబుతూ.. 'నేను ఇక్కడ ఉండలేకపోతున్నా, మీ ఇద్దరి (ప్రశాంత్, యవర్) కోసమే ఉంటున్నాను' అని యవర్‌తో చెబుతూ ఏడ్చేశాడు. గత కొన్నివారాల నుంచి కంటెస్టెంట్స్ ఇదే విషయాన్ని చెప్పారు. శివాజీ అన్న.. మీరు ప్రశాంత్, యవర్‌కి సపోర్ట్ చేస్తున్నారని అంటే.. ఇతడు ఒప్పుకోలేదు. ఇప్పుడేమో ఏడుస్తూ అసలు నిజం బయటపెట్టేశాడు. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి' సినిమా రిలీజ్‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?) గులాబీపురం vs జిలేబీపురం నామినేషన్స్ అయిపోయింది. ఇక కొత్త కెప్టెన్ కోసం టాస్క్ పెట్టాలి. ఇందులో భాగంగా ఓ స్పేస్ షిప్ కూలిపోయింది. అందులో గ్రహాంతర వాసుల్ని ఎవరైతే ఎంటర్టైన్ చేస్తారో వాళ్లకు పాయింట్స్ దక్కుతాయి. ఇందుకోసం హౌసులో ఉన్నవాళ్లు.. గులాబీపురం, జిలేబీపురం అనే ఊరిలో వ్యక్తులుగా గెటప్స్ వేసి కాసేపు అలరించారు. కానీ ఇదేమంత ఇంట్రెస్టింగ్గా అనిపించలేదు. బిగ్‌బాస్‌కి కూడా ఇదే అర్థమైపోయినట్లుంది. ఎక్కువసేపు లాగకుండా త్వరగా ముగించాడు. గుడ్లు పగిలాయ్ ఎంటర్టైన్మెంట్ టాస్క్ తర్వాత ఎగ్స్ టాస్క్ పెట్టారు. రిలే రేసులో ఉన్నట్లు నలుగురు ఉంటారు. ఒక చోట నుంచి మరోచోటుకి గుడ్డు ఓ బల్లపై తీసుకెళ్లాలి. ఎవరు ఎక్కువ తీసుకెళ్తే వాళ్లే విజయం సాధించినట్లు. ఈ గేమ్‌లో జిలేబీపురం టీమ్ విజయం సాధించింది. అలా బుధవారం ఎపిసోడ్ పెద్దగా మెరుపుల్లేకుండా ముగిసింది. (ఇదీ చదవండి: స్టార్ హీరో 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం) -
'బిగ్‌బాస్'లో డబుల్ మీనింగ్ డైలాగ్స్.. 'జబర్దస్త్'ని మించిపోయిందిగా!
బిగ్‌బాస్ 7 తెలుగు సీజన్ ఉన్నంతలో ఓ మాదిరిగా నడుస్తోంది. గొడవలు, అరుపులు, నామినేషన్స్, ఎలిమినేషన్స్‌తో అలా అలా సాగుతోంది. వారం పదిరోజుల క్రితం వైల్డ్ కార్ట్ కంటెస్టెంట్స్ అని చెప్పి ఐదుగురిని తీసుకొచ్చారు గానీ పెద్దగా మార్పేం రాలేదు. ఇన్నాళ్ల మాటల విషయంలో కాస్త కంట్రోల్ గా ఉన్నోళ్లు ఇప్పుడు ఆ ఒక్క విషయంలో హద్దులు దాటేశారు! డబుల్ మీనింగ్ మాటలతో రెచ్చిపోయారు. (ఇదీ చదవండి: Bigg Boss 7లో భోలె గలీజు పురాణం.. ఆడపిల్లలని చూడకుండా ఆ కామెంట్స్!) ఇంతకీ ఏమైంది? బిగ్‌బాస్ 7లో ప్రస్తుతం ఏడోవారం నడుస్తోంది. భోలె, అశ్విని, తేజ, ప్రశాంత్, పూజా, అమరదీప్, గౌతమ్ నామినేట్ అయ్యారు. సోమ,మంగవారాల్లో నామినేషన్ ప్రక్రియ పూర్తయింది. బుధవారం నుంచి కెప్టెన్సీ టాస్క్ మొదలుకానుంది. అయితే హౌస్ అంతా మరీ సీరియస్‌గా ఉందని చెప్పి కెప్టెన్సీ కోసం చిన్న ఫన్నీ టాస్క్ పెట్టారు. ఇందులో భాగంగా రెండు పల్లెటూళ్లు, అందులోని క్యారెక్టర్స్ అని అందరూ ఆయా పాత్రలిచ్చారు. అంతా బాగానే ఉంది కానీ శివాజీ, ప్రశాంత్ చెప్పిన డైలాగ్స్ శ్రుతిమించినట్లు అనిపించాయి. ఏం డైలాగ్స్? ఈ టాస్కులో భాగంగా ప్రశాంత్ 'అన్నా తిప్పేద్దునా' అని అంటే.. పక్కనే ఉన్న అశ్విని.. 'ఏంటిరా నువ్వు నన్ను తిప్పేది' అని అంటుంది. దీనికి బదులుగా 'నా చెంచా' అని ప్రశాంత్ అంటాడు. ఇంతలో శివాజీ అక్కడికొచ్చి.. 'ఊరుని ఒక ఊపు ఊపుతున్నవటా కదా' అని అంటాడు. 'ఇంత అందగత్తెని మరి ఆ మాత్రం ఊపనా ఏంటి?' అని అశ్విని అంటుంది. 'నీ అందం ఏంటో చూద్దాం తోటకి రా ఓసారి' అని శివాజీ కౌంటర్ ఇస్తాడు. పక్కనే ఉన్న సందీప్.. 'ఓ పెద్దాయన చాలా లేతాకు' అంటే, దానికి శివాజీ కౌంటర్ ఇస్తూ.. 'ఆకేదైనా ఆకే కదరా, మేము సున్నం రాస్తాం' అని అంటాడు. సరిగ్గా గమనిస్తే మాట్లాడే విషయంలో హద్దులు దాటేశారా అని డౌట్ వస్తుంది. అలానే ఇలాంటి డైలాగ్స్ విషయంలో 'జబర్దస్త్' షోని మించిపోతున్నారుగా అనే సందేహం రాకమానదు. (ఇదీ చదవండి: స్టార్ హీరో 25వ సినిమా.. 25 వేల మందికి అన్నదానం) -
ప్రేక్షకుల గుండెల్ని తాకిన నయని పావని.. ఈ కారణంతో నో రీ ఎంట్రీ
బిగ్ బాస్ సీజన్-7 నుంచి ఆరోవారం నయని పావని ఎలిమినేట్ అయ్యింది. వైల్డ్ కార్డ్‌తో హౌస్‌లోకి అడుగుపెట్టిన పావని ఒక వారంలోనే బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు వచ్చేసింది. సాధారణంగా ఈ షోను అందరూ ఎంటర్టైన్మెంట్ షో మాదిరే చూస్తారు. కానీ నయని పావని ఎలిమినేట్ అయిన తీరును చూసిన మెజారిటీ ప్రేక్షకులు కన్నీరు పెట్టుంటారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. హౌస్‌లోని సభ్యులతో పాటు ప్రేక్షకుల గుండెను ఆమె కన్నీళ్లు తాకాయి. చివరకు ఎంతో గొప్ప యాక్టర్, బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున కూడా తొలిసారి ఎమోషనల్ అయ్యాడు. నయని పావని స్టేజీపైన మాట్లుడుతున్న సమయంలో ఆమె కంట వస్తున్న కన్నీరు మెడ భాగం వరకు పోతూనే ఉంటాయి. ఆ దృశ్యాలను చూసిన ప్రతి ప్రేక్షకుడు కూడా ఎమోషనల్ అయ్యాడు అని చెప్పవచ్చు. కొద్దిరోజుల క్రిత్రం నయని పావని తండ్రి మరణించారని విషయం తెలిసిందే. అందుకే ఆమె శివాజీని నాన్న అంటూ పిలుస్తూ ఉండేది. స్టేజీపైన శివాజీని డాడీ అంటూ అలా ఉండిపోయిన ఆమె కోసం హౌస్ నుంచి తాను వెళ్లిపోతానని అవకాశం ఉంటే నయని పావనిని హౌస్‌లో ఉంచండని శివాజీ కోరుతాడు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ నుంచి శివాజీ ఔట్.. మళ్లీ వచ్చే ఛాన్స్ ఉందా?) అందుకు నాగార్జున అవకాశం లేదు.. అది ప్రేక్షకుల నిర్ణయం అంటాడు. ఆమె హౌస్ నుంచి వెళ్తున్న సమయంలో మొదటిసారి శివాజీ కూడా పావని కోసం గేట్ క్లోజ్ అయ్యే వరకు అక్కడే ఉన్నాడు. అలా ఆమె హౌస్‌లో ఉన్న వారందరిని మెప్పించింది. ఒక రకంగా ఆదివారం ఎపిసోడ్ నయని పావని వల్ల బిగ్ బాస్ ప్రేక్షకుల హర్ట్ మెల్ట్ అయిందని చెప్పవచ్చు. ఎలిమినేట్కు కారణాలు ఇవే నయని పావనికి ఇన్‌స్టాగ్రామ్‌లో సుమారు 6 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఎన్నో షార్ట్ ఫిలిమ్స్‌లలో నటించి సోషల్ మీడియాలో మంచి ఫాలోయింగ్ ఉంది. కానీ ఆమె హౌస్‌లోకి వెళ్తున్న సమయంలో పీఆర్ టీమ్‌ను ఏర్పాటు చేసుకోకుండా వెళ్లడం ప్రధాన కారణం అని తెలుస్తోంది. రీ ఎంట్రీ ఇచ్చిన వారందరిలో ఆమె బెటర్ అనేలా గేమ్ ప్లే చేసింది. ఈ వారంలో ఆమెపై ఎక్కడా నెగటివ్ రాలేదు. శివాజీతో ఆమెకు మంచి బాండింగ్ ఉంది. అలాగే పల్లవి ప్రశాంత్‌తో ఆమె క్లోజ్‌గా ఉంది. యావర్ ఆమె వల్లే హౌస్ కెప్టెన్ అయ్యాడు. ఈ ముగ్గురికి ఉన్న ఓట్ బ్యాంక్ ఆమె వైపు వెళ్లలేదు. దీనికి ప్రధాన కారణం ఆమెకు పీఆర్ టీమ్ లేకపోవడం అని చెప్పవచ్చు. అంతకు మించి ఆమెపై ప్రేక్షకుల్లో ఎలాంటి నెగటివిటీ లేదు. నయని పావని రీ ఎంట్రీ.. అవకాశాలు తక్కువే నయని పావని రీ ఎంట్రీ ఉంటే బాగుంటుంది అని ప్రతి బిగ్ బాస్ ప్రేక్షకుడు అనుకుంటున్నాడు. ఆ మేరకు ఇప్పటికే పలువురు ఆమె రీ ఎంట్రీ కోసం సోషల్ మీడియాలతో పాటు స్టార్ మా యూట్యూబ్ వీడియోల కింద మెసేజ్‌లు చేస్తున్నారు. కానీ బిగ్‌బాస్ ఆమెకు రీ ఎంట్రీ అవకాశం ఇవ్వకపోవచ్చని తెలుస్తోంది. ఎందకంటే నయని పావని ఎలిమినేషన్ ఎపిసోడ్‌తో భారీ గుర్తింపు వచ్చింది. మళ్లీ రీ ఎంట్రీ ఇస్తే ఆ ఇమేజ్ కోల్పోయే ఛాన్స్ ఉంది. దీంతో ప్రస్తుతానికి రీ ఎంట్రీ ఆప్షన్ ఇవ్వకుండా... త్వరలో రాబోయే బిగ్‌బాస్ OTT కోసం ఆమెను ఉపయోగించుకునే అవకాశమే ఎక్కువ ఉంది. దీనికి ప్రధాన కారణం ఆమె సోషల్ మీడియా ఇన్‌ఫ్లూయన్సర్. దీంతో ఆమెను OTT సీజన్ కోసం ఉపయోగించుకుంటే షో రేటింగ్ మరింతే పెరిగే ఛాన్స్ ఉంటుందని బిగ్‌బాస్ టీమ్ ఆలోచిస్తుందట. ఇదే నిజమైతే OTT సీజన్లో ఆమె టైటిల్ రేసులో నిలవడం ఖాయం. ఏదేమైనా నయని పావని రీ ఎంట్రీ అవకాశాలు చాలా తక్కువ. ఇందులో సందేహమే లేదు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) -
రైతుబిడ్డకు ఏడవడం మాత్రమే వచ్చు.. శివాజీ షాకింగ్ కామెంట్స్!
బిగ్ బాస్ హౌసులోకి కొత్తగా ఐదుగురు వచ్చారు. దీంతో కాస్త జోష్ వచ్చింది. ఇప్పుడు అదే ఊపు కొనసాగిస్తూ అదిరిపోయే ఫెర్ఫార్మెన్స్ ఇచ్చారు. మరోవైపు రైతుబిడ్డ ప్రశాంత్ కెప్టెన్సీని బిగ్ బాస్ పీకి పడేశాడు. అలానే అమరదీప్ ఎలిమినేషన్ భయం నుంచి కాస్త బయటకొచ్చాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏమేం జరిగిందనేది Day 38 హైలైట్స్‌లో చూద్దాం. (ఇదీ చదవండి: ఓటీటీలోకి రాబోతున్న 'స్కంద'.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) అమర్‌కి మోటివేషన్ ఆటగాళ్లు vs పోటుగాళ్లు మధ్య కెప్టెన్సీ కోసం పోటీ నడుస్తోంది. మంగళవారం గేమ్స్ సగంలోనే ఆగిపోయాయి. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ మొదలైంది. ఇక పోటీల్లో సరిగా ఫెర్ఫార్మ్ చేయలేదని అమరదీప్ డల్ అయిపోయాడు. దీంతో యవర్ అతడికి మోటివేషన్ చేశాడు. రాత్రి నిద్రపోయే టైంలో అమరదీప్ కన్నీళ్లు పెట్టుకున్నారు. ప్రియాంక, సందీప్ వచ్చి అతడిని సముదాయించారు. రైతుబిడ్డ కెప్టెన్సీ పాయే ప్రశాంత్ కెప్టెన్ అయితే అయ్యాడు గానీ పెద్దగా మెరుపుల్లేవు. దీంతో బిగ్ బాస్ అతడి కెప్టెన్సీని డైరెక్ట్‌గా రద్దు చేయొచ్చు గానీ అలా చేయలేదు. మిగతా హౌస్‌మేట్స్‌ని అసలు కెప్టెన్ అంటే ఏంటని అడిగితే.. వర్క్ డివైడ్ చేయాలి, లీడర్షిప్ క్వాలిటీ అని అతడికి వ్యతిరేకంగా చెప్పారు. తీరా ప్రశాంత్ మంచి కెప్టెన్ అని ఎంతమంది అనుకుంటున్నారు? అని అడిగితే శోభా, సందీప్, తేజ తప్ప అందరూ చేతులెత్తేశారు. అయినా సరే బిగ్‌బాస్ కనికరించలేదు. (ఇదీ చదవండి: హీరోయిన్ శ్రీలీలకు పెళ్లి? ఈ రూమర్స్‌లో నిజమెంత?) యవర్ ఇంగ్లీష్ లో మాట్లాడుతున్నా, తేజ నిద్రపోతున్నా, ఇంట్లో రేషన్ అయిపోతున్నా ఏం చేశావంటూ కెప్టెన్సీ పీకిపడేశాడు. ఇక కెప్టెన్సీ నుంచి తీసిపడేసరికి ప్రశాంత్ కన్నీళ్లు పెట్టుకున్నాడు. కెప్టెన్సీ ఇచ్చినప్పుడు సద్వినియోగం చేసుకోలేకపోయాడు. ఇప్పుడేమో ఇంట్లో ఏడుస్తూ కూర్చున్నాడు. ఇలాంటి టైంలో మరోచోట కూర్చుని మాట్లాడిన శివాజీ.. వాడికి(ప్రశాంత్) ఏడవడం తప్ప ఇంకేం రాదని అన్నాడు. విజేతగా పోటుగాళ్లు మంగళవారం ఎపిసోడ్లో కెప్టెన్సీ కోసం రెండు గేమ్స్ పెట్టిన బిగ్ బాస్.. బుధవారం మిగిలిన రెండు గేమ్స్ పెట్టాడు. 'హౌ ఈజ్ ఫాస్టెస్ట్' గేమ్‌లో భాగంగా బిగ్ బాస్ చెప్పిన రంగు ఉన్న ఏదైనా వస్తువుని తీసుకొచ్చి లాన్ లోని మార్క్ చేసిన ప్లేసులో వేయాలి. ఇందులో ఆటగాళ్లు గెలిచారు. 'హౌ ఈజ్ స్ట్రాంగెస్ట్' అని పెట్టిన ఇంకో పోటీలో పోటుగాళ్లు గెలిచారు. అలా నాలుగింటిలో మూడు గెలిచిన పోటుగాళ్లు.. కెప్టెన్సీ పోటీలో నిలిచారు. అలా బుధవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: గిఫ్ట్ ఇచ్చిన సమంత.. అతడు తెగ మురిసిపోయాడు!) -
'రాననుకున్నారా.. రాలేననుకున్నారా?.. కోపంతో ఊగిపోయిన గౌతమ్ కృష్ణ!
బిగ్ బాస్ తెలుగు సీజన్-7 2.0. ఇప్పటిదాకా జరిగిన షో ఒక ఎత్తు. ఇప్పుడు జరుగుతున్న షో ఒక ఎత్తు. ఎందుకంటే ఇప్పటివరకు ఉల్టా పుల్టా అంటూ సాగిన షో.. ఇప్పుడు ఐదుగురు కొత్త కంటెస్టెంట్స్‌తో మరింత రసవత్తరంగా మారింది. బిగ్‌బాస్ రోజుకు ఒక షాక్ ఇస్తూ ఆటను మరింత ఆసక్తికరంగా మార్చేస్తున్నారు. ఈ షో మొదలైన ఐదు వారాల్లో ఐదుగురు ఎలిమినేట్ అయిన సంగతి తెలిసిందే. అయితే ఐదో వారంలో బిగ్ ట్విస్ట్ ఉంటుందని.. ఇద్దరూ ఎలిమినేట్ కావొచ్చని భావించారు. కానీ అలాంటిదేం జరగలేదు. శుభశ్రీ హౌస్ నుంచి ఎలిమినేట్ కాగా.. గౌతమ్‌ను సీక్రెట్ రూమ్‌లోకి పంపి బిగ్ షాకిచ్చారు బిగ్ బాస్. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను రిలీజైంది. ఈ ప్రోమోలో గౌతమ్ కృష్ణ సీక్రెట్ రూమ్ నుంచి బయటికొచ్చేశాడు. (ఇది చదవండి: కొంతమంది నన్ను ఫ్లర్ట్ చేయడానికి యత్నించారు: శుభ శ్రీ) బయటకు వస్తూనే గౌతమ్ మాట్లాడుతూ..'రాననుకున్నారా.. రాలేననుకున్నారా? అంటూ సీక్రెట్ రూమ్‌లో ఉన్న గౌతమ్ ఎంతో ఆవేశంతో బయటకొచ్చాడు. అశ్వత్థామ ఇజ్ బ్యాక్ అంటూ ఎంట్రీ ఇచ్చాడు. 'తేనే పూసిన కత్తిని గొంతులో దింపారు కదా.. అయినా ఈ అశ్వత్థామ చావడు. ఎలా వెళ్లానో అలానే వచ్చా. దిస్ ఇజ్ 2.0 బేబీ' అంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. అయితే గౌతమ్ కృష్ణ మాటలు చూసి కంటెస్టెంట్స్ ఆశ్చర్యానికి గురయ్యారు. ఆ తర్వాత శివాజీనీ ఉద్దేశించి మాట్లాడారు. అన్న మీరు నన్ను ఎంటర్టైన్ చేయలేడేమో అన్నారు కదా? అని గౌతమ్ చెప్పడంతో.. తమ్ముడు ముందు నీ రీజన్ చెప్పు అంటూ శివాజీ అన్నారు. 'ఎంటర్టైన్ చేయడమంటే ప్యాంట్ తీసేసి తిరగడం కాదు కదన్నా.. కవర్‌ను చూసి బుక్‌ను జడ్జ్ చేయొద్దన్నారు అన్నా' గౌతమ్ చెప్పారు. ఆ తర్వాత శివాజీ మాట్లాడుతూ.. 'బట్టలిప్పడం ఎంటర్టైన్మెంటా? అని ఇంతమంది ముందు అన్నావ్. 100 సినిమాల్లో చేశా బట్టలు లేకుండా.. నేను ఒక నటుడిని.. ఏమైనా చేస్తా' అన్నారు. ఆ తర్వాత బిగ్ బాస్ వెంటనే గౌతమ్.. నీకు ఒక స్పెషల్ పవర్ ఇస్తున్నాను.. దీన్ని ఊపయోగించి నువ్వు ఒకరిని డైరెక్ట్‌గా నామినేట్ చేయొచ్చు' అని ఆప్షన్ ఇచ్చాడు. దీంతో గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయాలనుకున్నాడో చెప్పేలోగా ప్రోమో ముగిసింది. గౌతమ్ ఎవరినీ నామినేట్ చేయనున్నాడో ఇవాళ ప్రసారమయ్యే ఎపిసోడ్లో క్లారిటీ రానుంది. సీక్రెట్లో రూమ్‌లో ఉన్న గౌతమ్‌కు బయటకు రావడం, స్పెషల్ పవర్ ఇవ్వడం ఈ ఎపిసోడ్లో హాట్‌టాపిక్‌గా మారింది. కాగా.. ఈ వారం అశ్విని, నయని పావని, పూజా మూర్తి, తేజ, శోభా శెట్టి, అమర్దీప్, సందీప్, ప్రిన్స్ యావర్ నామినేషన్లో ఉన్నట్లు తెలుస్తోంది. (ఇది చదవండి: నామినేషన్స్‌లో ట్విస్ట్.. కొత్తవాళ్లకే ఛాన్స్! ఒక్కొక్కరికీ ఉంటదీ..) -
త్యాగం చేసిన ఆ ఇద్దరు.. ఆటలోనే లేకుండా పోయిన మరో ఇద్దరు!
బిగ్‌బాస్ అంటేనే ఫిట్టింగ్ బాస్.. అన్నీ తేరగా ఇచ్చేయడు. కంటెస్టెంట్లను ముప్పలు తిప్పలు పెట్టి, ఏడిపించి చివరకు వారిక్కావాల్సింది ఇస్తాడు. బిగ్‌బాస్ ఇచ్చే అరకొరవాటి కోసం హౌస్‌లో నానా గొడవలే జరుగుతాయి. ఈసారి బిగ్‌బాస్.. కంటెస్టెంట్లకు వారి ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని చెప్తూనే ఓ ట్విస్ట్ ఇచ్చాడు. అదేంటో తాజా(సెప్టెంబర్ 5) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. యావర్‌కు తెలుగు క్లాసులు బిగ్‌బాస్ ఇంట్లో కెప్లెన్సీ టాస్క్ జరుగుతోంది. ఇందుకోసం ఇంట్లోవారంతా జంటలు జంటలుగా విడిపోయారు. వీరిలో ఆటలో వెనుకబడి అందరికన్నా తక్కువ స్టార్లు సొంతం చేసుకున్న శోభా శెట్టి- ప్రియాంకలను బిగ్‌బాస్ కెప్టెన్సీ పోటీ నుంచి తప్పించాడు. మిగిలిన నాలుగు జంటలు అమర్ దీప్- సందీప్, శివాజీ- ప్రశాంత్, తేజ- యావర్, గౌతమ్- శుభశ్రీలు నెక్స్ట్ లెవల్‌కు వెళ్లారు. ఇకపోతే తెలుగు కష్టంగా మాట్లాడుతున్న యావర్‌కు నాలుగు తెలుగు ముక్కలు నేర్పించాలన్నాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో తేజ, అమర్దీప్, శోభా శెట్టి, ప్రియాంక, శివాజీ.. అతడికి తెలుగు క్లాసులు తీసుకున్నారు. రిక్వెస్ట్ చేయాల్సింది పోయి ఆర్డర్లు, వార్నింగ్‌లు.. అల్లరి విద్యార్థిగా యావర్ అదరగొట్టాడు. తెలుగు పండింతులైన తేజను ఓ ఆటాడుకున్నాడు. మరోవైపు శివాజీ ఎప్పటిలాగే అతి చేశాడు. కాఫీ కోసం బిగ్‌బాస్ మీదకే నిప్పులు చెరుగుతున్నాడు. కాఫీ ఇవ్వని బతుకు.. నాదీ ఓ బతుకేనా? కాఫీ ఇవ్వకపోతే హౌస్ నుంచి వెళ్లిపోతా.. అని మరోసారి బెదిరింపులకు దిగాడు. కాఫీ లేకపోతే ఏం ఆలోచించలేకపోతున్నా.. కామెడీ చేయమంటే ఎలా చేస్తాం.. వీడెవడ్రా బిగ్‌బాస్? కాఫీ ఇవ్వనంటాడు.. అని చిందులు తొక్కాడు. ఈయన ఓవరాక్షన్ చూసిన బిగ్‌బాస్ అతడికి కాఫీనే పంపించలేదు. ఎమోషనల్ టాస్క్.. ఇకపోతే కెప్టెన్సీ కంటెండర్ టాస్క్‌లో భాగంగా చిట్టి ఆయిరే అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో భాగంగా కంటెస్టెంట్లందరికీ ఇంటి నుంచి లెటర్స్ వచ్చాయని, కానీ ప్రతి జంటలో ఒకరు లెటర్ చదివితే మరొకరు త్యాగం చేయాలి.. త్యాగం చేసిన వారు కెప్టెన్సీ పోటీదారులయ్యే అవకాశం కోల్పోతారని ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఎవరైతే లెటర్ చదువుతారో వారే కెప్టెన్సీ పోటీదారుడు అవుతారన్నమాట! త్యాగం చేసిన శుభ శ్రీ ఈ టాస్క్ గురించి ప్రకటించగానే శివాజీ.. నేను ఈ టాస్క్ ఆడటం లేదు అంటూ శివాజీ మైక్ కుర్చీలో పడేసి బయటకు వెళ్లిపోయాడు. ప్రశాంత్‌తో.. నువ్వే ఆడు, లెటర్ తీసుకో అని చెప్పాడు. మరోవైపు గౌతమ్- శుభశ్రీ.. ఎవరు లెటర్ అందుకోవాలనే దాని గురించి కాసేపు వాదులాడి చివరకు త్యాగానికి పూనుకుంది శుభ. అటు గౌతమ్ తన తండ్రి రాసిన లేఖ చదివి చిన్నపిల్లాడిలా ఏడ్చేశాడు. తన లేఖను చించేసిన యావర్ యావర్- తేజా.. ఇద్దరూ త్యాగానికి సిద్ధపడ్డారు. ఒకరిని బాధపెట్టి ముందుకు వెళ్లలేనంటూ యావర్ తన లేఖను చింపేశాడు. దీంతో తేజా తన తండ్రి రాసిన లెటర్ చదివి చాలా ఎమోషనలయ్యాడు. ఏడవనంటూనే కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి తర్వాతి ఎపిసోడ్లో ఎవరు త్యాగం చేస్తారు? ఇంకా ఎవరు కెప్టెన్సీ పోటీదారులవుతారో చూడాలి! -
'బిగ్‌బాస్' ఇప్పటికి లైన్లో పడ్డాడు.. కంటెస్టెంట్స్ తన్నుకున్నారు!
బిగ్‌బాస్ లో ఇప్పటికే నాలుగు వారాలు అయిపోయింది. నలుగురు ఎలిమినేట్ అయిపోయారు. కానీ ఈ సీజన్లో పెద్దగా జోష్ అయితే కనిపించలేదు. గేమ్స్ కూడా పెద్దగా చెప్పుకోదగ్గవి జరగలేదు. అయితే తాజాగా కెప్టెన్సీ టాస్క్ కోసం పెట్టిన గేమ్ ఇప్పటివరకు అయిన వాటితో పోలిస్తే కాస్త ఇంట్రెస్ట్ కలిగించింది. ఇందులో ఊహించని వ్యక్తులు విజేతలుగా నిలవడం విశేషం. ఇంతకీ హౌస్‌లో బుధవారం ఏం జరిగిందనేది Day 31 హైలైట్స్‌లో చూద్దాం. (ఇదీ చదవండి: ఆ రోగంతో బాధపడుతున్న 'జవాన్' నటి.. దీని కారణంగా!) తెగని గొడవ ఇక కెప్టెన్సీ టాస్కులో భాగంగా స్మైల్ ప్లీజ్ అని ఫస్ట్ టాస్క్ పెట్టారు. చాలా గందరగోళంగా సాగిన అందులో గౌతమ్-శుభశ్రీని విజేతగా ప్రకటించారు. అయితే యవర్ తీర్పుపై హౌసులోని ప్రతిఒక్కరూ అసహనం వ్యక్తం చేశారు. అలా మంగళవారం ఎపిసోడ్ అయిపోయింది. అక్కడి నుంచే బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. రాత్రంతా ఆ గొడవ అలా సాగుతూనే ఉంది. రెండో టాస్క్ ఇక కెప్టెన్సీ పోటీలో భాగంగా 'దొరికితే దొంగ దొరక్కపోతే దొర' అని రెండో టాస్కు పెట్టారు. ఇందులో భాగంగా యాక్టివిటీ రూంలో బిగ్‌బాస్ ఫ్రెండ్ నిద్రపోతుంటాడు. ఆ రూంలోకి జోడీల్లో ఒక్కో సభ్యుడు వెళ్తాడు. మైకులో బిగ్‌బాస్ ఇచ్చిన క్లూస్ ప్రకారం వస్తువుల్ని కొట్టేయాల్సి ఉంటుంది. ఇలా సాగిన ఈ ఆటలో బాగానే సాగింది. అయితే బయటకొచ్చిన తర్వాత ప్రశాంత్ ఓ వస్తువుని కింద పడేయడంతో దాన్ని పక్కనే ఉన్న యవర్ తీసుకుని తన సంచిలో పెట్టేశాడు. దీంతో బయటంతా గందరగోళంగా మారింది. తెచ్చుకున్న దాంట్లో తీసుకోవడం ఏంట్రా అని శివాజీ గగ్గోలు పెట్టాడు. అయితే ఈ గేమ్‌లో భాష రాని కారణంగా శుభశ్రీ, యవర్ చేతికి దొరికిన వస్తువుల్ని పట్టుకొచ్చేశారు. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' బ్యూటీపై దారుణమైన కామెంట్స్.. గంటకు రూ.5 వేలు అంటూ!) ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ అయితే క్లూస్ ఆధారంగా చెప్పిన వస్తువులు కాకుండా రూంలో నుంచి వేరే వస్తువులు కూడా తీసుకొచ్చేయడంపై బిగ్‌బాస్ సీరియస్ అయ్యాడు. అలా అనవసర వస్తువులు ఎవరైతే తక్కువ తీసుకొచ్చారో వాళ్లే ఈ పోటీలో విజేతలన్నట్లు చెప్పాడు. అలా శివాజీ-ప్రశాంత్ ఇందులో విజయం సాధించారు. మూడో టాస్కులో భాగంగా ఫ్రూట్ నింజా అనే గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా జోడీలోని ఒకరు.. దూరంలో ఉన్న మరో వ్యక్తి తలపై ఉన్న బుట్టలో ఆరెంజ్ ఫ్రూట్ వేయాలి. అలా చెప్పిన టైంలో కలెక్ట్ చేసిన ఫ్రూట్స్ నుంచి జ్యూస్ సేకరించాలి. ఎవరిదైతే ఎక్కువ పరిమాణం ఉంటుందో వాళ్లు విన్నర్. ఇందులో తేజ-యవర్ విజేతగా నిలిచారు. ఓవరాల్‌గా చూసుకుంటే గౌతమ్-శుభశ్రీ 4 స్టార్స్, అమరదీప్-సందీప్ 4 స్టార్స్, ప్రశాంత్-శివాజీ 5 స్టార్స్, ప్రియాంక-శోభా 2 స్టార్స్, తేజ-యవర్ 2 స్టార్స్ సాధించారు. దీన్నిబట్టి చూస్తుంటే అస్సలు ఏ మాత్రం అంచనాల్లేని ప్రశాంత్-శివాజీ జోడీ ఈ కెప్టెన్సీ పోటీలో గెలిచారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక వీళ్లిద్దరి మధ్య తొలి కెప్టెన్సీ కోసం పోటీ ఉండనుంది. అది తర్వాత ఎపిసోడ్స్‌లో చూడొచ్చు. (ఇదీ చదవండి: ఛాన్స్ అడిగితే గెస్ట్ హౌస్‌కి రమ్మన్నారు: 'బాహుబలి' బామ్మ) -
శివాజీ పిచ్చి ప్రవర్తన.. గేమ్‌లో ఏకంగా బెంచ్‌నే తన్నేశాడు!
'బిగ్‌బాస్'లో నాలుగోవారం దాదాపు అందరూ నామినేట్ అయిపోయారు. పవరస్త్ర ఉన్న ముగ్గురు తప్పితే అందరూ నామినేషన్స్‌లో ఉన్నారు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ తాజాగా బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. ఇప్పటివరకు ఇచ్చిన పవరస్త్రలు అన్నీ లాగేసుకున్నాడు. అలానే కెప్టెన్సీ టాస్క్ కోసం గేమ్స్ మొదలుపెట్టాడు. దీంతో తొలిరోజే మొత్తం ఆగమాగం అయిపోయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 30 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: ఈ తెలుగు హీరోయిన్ని గుర్తుపట్టారా? 20 సినిమాల్లో ఒక్కటే హిట్!) బిగ్‌బాస్ ఫిట్టింగ్ నామినేషన్స్ పూర్తి కావడంతో సోమవారం ఎపిసోడ్ పూర్తయింది. ఆ తర్వాత కిచెన్‌లో గౌతమ్-శుభశ్రీ మాట్లాడుతున్న టైంలో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఇక అందరినీ ఒక్కచోట కూర్చోబెట్టిన బిగ్‌బాస్.. పెద్ద ఫిట్టింగ్ పెట్టాడు. ఇప్పటివరకు పవరస్త్రలు ఉన్న శోభాశెట్టి, సందీప్, ప్రశాంత్.. వాటిని తిరిగిచ్చేయాలని చెప్పాడు. దీంతో వీళ్ల ముగ్గురు అవాక్కయ్యారు. శివాజీ మాత్రం శునకానందం పొందాడు. శివాజీ ఇలా చేయడంపై శోభాశెట్టి తనలో తానే అసహనం వ్యక్తం చేసింది. గేమ్ స్టార్ట్ గత నాలుగు వారాలు కూడా పవరస్త్ర ఉన్నోళ్లే గేమ్స్ ఆడలేదు. ఇప్పుడు ఎవరి దగ్గర పవరస్త్ర లేదు కాబట్టి అందరూ ఆడేలా బిగ్‌బాస్ గేమ్ డిజైన్ చేశాడు. ఇందులో భాగంగా.. ఈ ఇంట్లో అత్యంత దగ్గరైనవారు, మీ నమ్మకాన్ని పొందేవారు, మీ వెన్నుదన్నుగా నిలిచేవారు, మీ బడ్డీస్ ఎవరో తెలుసుకోవాలని భావిస్తున్నట్లు చెప్పాడు. ఈ ప్రక్రియలో మీ బడ్డీతో జంటలుగా విడిపోవాల్సి ఉంటుందని, మీరు తీసుకునే నిర్ణయం ఈ వారం మీ భవిష్యత్తుని నిర్ణయిస్తుందని క్లారిటీ ఇచ్చాడు. దీంతో గౌతమ్ - శుభశ్రీ, శివాజీ - ప్రశాంత్, అమరదీప్ - సందీప్, ప్రియాంక - శోభాశెట్టి, యవర్ - తేజ జోడీగా విడిపోయారు. (ఇదీ చదవండి: థియేటర్లలోకి ఒకేరోజు 10 సినిమాలు.. మీరేం చూస్తారు?) గేమ్ తెచ్చిన పెంట అయితే ఈ గేమ్‌లో భాగంగా స్మైల్ ఆకారంలో ఉన్న బొమ్మలో నంబర్స్ ఉన్న కొన్ని దంతాను ఉండవు. లాన్లో ఉన్న రెండు ఏరియాల నుంచి పాకుకుని వెళ్లి, యాక్టివిటీ ఏరియాలోని ప్లేసుల్లో నంబర్స్ వెతకాలి. వాటిని తమకిచ్చిన పళ్ల ఆకారంలో అతికించి, అది పూర్తయిన తర్వాత గంట మోగించాలని చెప్పాడు. ఈ ఆటలో గెలిచిన వాళ్లు మొదటి కెప్టెన్సీ దక్కడంతో పాటు సూపర్ ఇమ్యూనిటీ లభిస్తుందని చెప్పాడు. అలానే ఈ వారం, వచ్చే వారం నామినేషన్స్ నుంచి సేవ్ అవుతారని అన్నాడు. స్మైల్ కంప్లీట్ చేసే టాస్కులో తొలుత నంబర్స్ ఫిట్ చేసిన తర్వాత శివాజీ-ప్రశాంత్ జోడీ బెల్ కొట్టారు. వీళ్లేమో నంబర్స్ సరిగా ఫిట్ చేయలేదు. తర్వాత బెల్ కొట్టిన అమరదీప్-సందీప్ జోడీ పూర్తి చేయకముందే బెల్ కొట్టారు. అనంతరం శోభా-ప్రియాంక, శుభశ్రీ- గౌతమ్ పెట్టారు. బజర్ మోగిన తర్వాత యవర్-తేజ ఈ టాస్కుని పూర్తి చేశారు. అయితే అందరూ తప్పులు చేయడంతో సంచాలక్స్గా వ్యవహరించిన యవర్-శోభాశెట్టి ఏదీ తేల్చుకోలేకపోయారు. కొన్ని గంటలపాటు చర్చలు జరిగిన తర్వాత కొన్ని గంటలపాటు చర్చోపచర్చలు సాగిన తర్వాత తొలిస్థానం గౌతమ్-శుభశ్రీ, రెండో స్థానం అమరదీప్-సందీప్, మూడో స్థానం శివాజీ-ప్రశాంత్ అని చెప్పారు. అయితే పాయింట్స్ గెలుస్తామనుకున్న తమ టీమ్ నాలుగో స్థానికి పరిమితం కావడంపై ప్రియాంక ఒప్పుకోలేదు. అలా మాట్లాడుతుండగానే మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: కన్నీళ్లు పెట్టుకున్న స్టార్ హీరో సిద్ధార్థ్.. తనని అవమానించారని!) -
'బిగ్‌బాస్'కే నీతులు చెబుతున్న శివాజీ.. హౌస్‌లో ఇకపై కష్టమే!
బిగ్‌బాస్ హౌసులో సోమవారం వచ్చిందంటే చాలు నామినేషన్స్ హడావుడి ఉంటుంది. ఈసారి కూడా అలానే జరిగింది. హౌస్ మేట్స్ అయినవాళ్లు తప్పించి అందరూ నామినేట్ అయ్యారు. అలానే పవరస్త్ర గెలుచుకునే విషయంలో కంటెస్టెంట్స్ అందరూ చివర్లో పెద్ద షాక్ తగిలింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 29 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీకి లగ్జరీ కట్ రతిక ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ అయిపోయింది. ఆ తర్వాత శివాజీని లగ్జరీ రూమ్ నుంచి వేరే గదికి షిప్ట్ చేయాలని బిగ్‌బాస్ ఆర్డర్ వేయడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే తనకి బెడ్ ఎక్కడ ఇవ్వాలని శోభా-ప్రశాంత్ మాట్లాడుతుండగా మధ్యలో తేజ ఎంటరయ్యాడు. దీంతో అతడితో శోభా గొడవపెట్టుకుంది. ఆ తర్వాత శివాజీ డీలక్స్ రూంలోకి వచ్చేశాడు. అదే టైంలో తేజని జైల్లో పెట్టారు. (ఇదీ చదవండి: శ్రీదేవి మృతిపై అసలు నిజాలు బయటపెట్టిన బోనీ కపూర్!) నామినేషన్స్ ఓకే ఓకే సాధారణంగా నామినేషన్స్ అంటే బిగ్‌బాస్ హౌస్ అంతా హీటెక్కి పోవడం గ్యారంటీ. కానీ ఈసారి అంత చెప్పుకోదగ్గ స్థాయిలో ఏం జరగలేదు. ఏదో ఏదో అలా అలా జరిగినట్లు అనిపించింది. ఇంతకీ ఎవరు ఎవరెవరిని నామినేట్ చేశారనేది ఇప్పుడు చూద్దాం. కంటెస్టెంట్స్ - నామినేట్ చేసినోళ్ల పేరు శివాజీ - అమరదీప్, ప్రియాంక ప్రియాంక - శివాజీ, యవర్ గౌతమ్ - అమరదీప్, శివాజీ శుభశ్రీ - అమరదీప్, ప్రియాంక యవర్ - అమరదీప్, ప్రియాంక అమరదీప్ - శుభశ్రీ, శివాజీ తేజ - గౌతమ్, యవర్ (ఇదీ చదవండి: మ్యూజిక్ ఇస్తే రూ.10 కోట్లు.. పాడితే మాత్రం పూర్తిగా ఫ్రీ) శివాజీ ఓవరాక్షన్ అయితే నామినేషన్స్స జరగడానికి ముందు ఓ సందర్భంలో మాట్లాడిన శివాజీ.. తనని వాళ్లందరూ విలన్లా చూడాలనుకున్నారు కానీ తానెప్పుడూ హీరోనే అని కాస్త అతిగా మాట్లాడుతూ కనిపించాడు. ఇక నామినేషన్స్‌లోనూ అమరదీప్‌ని నామినేట్ చేసి అతడితో చాలాసేపు వాదన పెట్టుకున్నాడు. గ్రూపులు కడుతున్నారని, హౌస్‌లోకి రాకముందే అందరూ కలిసికట్టుగా మాట్లాడుకుని వచ్చారని, ఇప్పుడు ఫేక్ గేమ్ ఆడుతున్నారని అన్నాడు. ఇక ప్రియాంక నామినేట్ చేసిన తర్వాత ఆమెతో మాట్లాడుతూ ఓ సందర్భంగా తాను బిగ్ బాస్ ప్రైజ్ గెలుచుకోవడానికి రాలేదని, ప్రేక్షకుల మనసులు గెలుచుకోవడానికి వచ్చానని అన్నాడు. అంటే ఎలాను గెలవను, ఉన్నన్ని రోజులు ఎంజాయ్ చేసి పోతానన్నట్లుగానే కామెంట్స్ చేశాడు. చెప్పినా ఒప్పుకోవట్లేదు గౌతమ్.. శివాజీని నామినేట్ చేస్తూ స్మైల్ ప్లీజ్ టాస్కులో తేజ, తనని అలా లాగుతుంటే కనీసం ఓ మాటయినా చెప్పొచ్చు కదా అని అడిగాడు. అయితే అప్పుడు తేజకి తను అలా చెప్పానని అన్నాడు. అయితే నిన్ననే దీనిపై నాగ్ క్లారిటీ ఇచ్చాడు. గౌతమ్ లాగుతున్నప్పుడు అరిచాడే తప్ప తేజ లాగుతున్నప్పుడు శివాజీ అరవలేదని వీడియో ప్లే చేసి మరీ చూపించాడు. కానీ శివాజీ మాత్రం తను అరిచానని మళ్లీ అదే పాట పాడుతున్నాడు. అలానే ఇందులో తనది తప్పుంటే ఎలిమినేట్ చేసేయండని కెమెరాల వంక చూస్తూ చెప్పాడు. తనది తప్పుంటే నామినేట్ చేసి ఎలిమినేట్ చేసేయండి అని శివాజీ అన్నాడు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) చిరాకు తెప్పిస్తున్న శివాజీ నామినేషన్స్ లో శివాజీ గోల అనుకుంటే అది అయిపోయిన తర్వాత కూడా వెళ్లిపోతా, వెళ్లిపోతా అనే పాటనే పాడుతున్నాడు. 'అందరూ తొండాట ఆడుతున్నారు బిగ్‌బాస్ కూడా తొండి ఆడుతున్నాడని. నన్ను ఎందుకు హౌస్‌మేట్‌గా తీసేశాడు. వాళ్లు వాళ్లు అనుకుని నన్ను బయటకు పంపేశారు. ఇవన్నీ బిగ్‌బాస్‌కి తెలియవా? బయటేస్తే వేశారు కాఫీ కూడా ఇవ్వట్లేదు? దేనికి ఆడాలి? ఎవరిని ఎంటర్ టైన్ చేయాలి?' అని చిరాకు తెప్పించాడు. ఇంతలా అరుస్తుంటే బిగ్ బాస్ నిర్వహకులు ఎందుకు ఇంకా శివాజీని భరిస్తున్నారో అర్థం కావట్లేదు. బిగ్‌బాస్ ట్విస్ట్ తతంగమంతా పూర్తయిన తర్వాత ఈ వారం.. హౌస్ నుంచి నామినేట్ అయిన వాళ్లలో తేజ, శివాజీ, ప్రియాంక, అమరదీప్, శుభశ్రీ, యవర్, గౌతమ్ ఉన్నారని బిగ్‌బాస్ చెప్పాడు. అలానే ఇప్పటివరకు పవరస్త్ర కోసం ఇన్నాళ్లు హౌస్మేట్స్ కష్టం బట్టి ఉండేది, ఇకపై ప్రేక్షకుల చేతుల్లో ఆ నిర్ణయం ఉంటుందని చెప్పి ట్విస్ట్ ఇచ్చాడు. అంటే ఈ వారం పవరస్త్ర గెలుచుకునేది ఎవరో.. బహుశా ఓటింగ్ ద్వారా ఆడియెన్స్ డిసైడ్ చేయబోతున్నారనమాట. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'బిగ్‌బాస్' ఎలిమినేషన్ తర్వాత రతిక ఫస్ట్ రియాక్షన్) -
బిగ్‌బాస్ 7: ఆ ముగ్గురు తప్ప అందరూ నామినేషన్స్‌లో!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో చిత్రవిచిత్రమైనవి జరుగుతున్నాయి. ఈసారి కెప్టెన్సీ, లగ్జరీ బడ్జెట్ టాస్క్‌లాంటివి ఏమీ పెట్టడం లేదు. కెప్టెన్సీకి బదులుగా పవరాస్త్రను ప్రవేశపెట్టారు. వీకెండ్లో కింగ్ ఆడించే గేమ్స్ గెలిచిన వారికి లగ్జరీ బడ్జెట్ ఇస్తున్నారు. టాస్కులు అరకొరగానే సాగుతున్నాయి. ఏదో ఆనవాయితీ ఉన్నట్లుగా ప్రతివారం అమ్మాయిలే ఎలిమినేట్ అవుతూ వస్తున్నారు. అలా ఇప్పటివరకు కిరణ్ రాథోడ్, షకీల, దామిని, రతికా రోజ్.. ఇలా వరుసగా నలుగురు ఇంటి నుంచి బయటకు వచ్చారు. ఇక శివాజీ చేస్తున్న అతికిగానూ తనకిచ్చిన పవరాస్త్రను తిరిగి వెనక్కు తీసుకున్న సంగతి తెలిసిందే! దీంతో నేటి నామినేషన్స్‌లో హౌస్మేట్స్ అతడిపై విరుచుకుపడ్డారు. ఈమేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. గౌతమ్ కృష్ణ.. ఓ టాస్క్‌లో తేజ తనను బెల్ట్‌తో కొట్టిన సంగతిని గుర్తు చేశాడు. ఆ టాస్క్‌లో తేజ అలా చేస్తుంటే ఆపలేకపోయారంటూ శివాజీని నామినేట్ చేశాడు. సందీప్ కంటెస్టెంట్‌గా ఉండుంటే తనకే నామినేట్ చేసేవాడినని, కానీ తను హౌస్‌మేట్ అయినందున తనను నామినేట్ చేసే ఛాన్స్ లేదన్నాడు. ప్రియాంక.. శివాజీ, యావర్‌ను నామినేట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ వారం సందీప్, శోభా శెట్టి, ప్రశాంత్ మినహా మిగతా ఏడుగురూ నామినేషన్లో ఉన్నట్లు కనిపిస్తోంది. మరి ఎవరు ఎవర్ని నామినేట్ చేశారో తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! -
బోరున ఏడ్చేసిన రతిక తల్లిదండ్రులు.. అందరినీ కదిలిస్తున్న వ్యాఖ్యలు
బిగ్‌బాస్ సీజన్-7 టైటిల్ ఫేవరెట్‌గా రతిక రోజ్ హౌస్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆమె అమాయికత్వంతో పాటు కొన్ని లక్షల మంది చూస్తున్న జడ్జిమెంట్ ప్రొగ్రామ్‌లో ఎలా ముందుకు వెళ్లాలో పసిగట్టలేకపోయింది. కొన్నిసార్లు తిక్కల వాదనలున్నా సరే రతిక కాస్త నయం. షోలో ఆమె ఇండివిడ్యుయాలిటీని చూపించింది. ఆటలో ఆమెకు నచ్చింది చేసింది. మరోక కంటెస్టెంట్ ఇచ్చిన సలహాను ఎక్కడా పాటించకుండా తన ఆటను కొనసాగించింది. ఆమె మొదట చేసిన అతిపెద్ద తప్పు రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్‌తో జతకట్టడం.. ఆ తర్వాత అతనితో విబేదాలు రావడం ఆమెకు మైనస్ అయింది. రైతుబిడ్డ అనే ట్యాగ్‌లైన్‌తో ప్రశాంత్ ఎంట్రీ ఇవ్వడంతో అతనికి చాలామంది ప్రేక్షకులు కనెక్ట్ అయ్యారు. తను కూడా శక్తికి మించి బిగ్‌బాస్‌లో పోరాడుతున్నాడు. రతిక ఊరు ఎక్కడ తాజాగా రతిక తల్లిదండ్రులు పలు ఆస్తికరమైన వ్యాఖ్యలు చేస్తూ.. తమ గతాన్ని గుర్తుచేసుకుని బోరున ఏడ్చారు. ఆమె పక్కా రైతు కుటుంబానికి చెందిన వ్యక్తి. ఇప్పటికీ ఆమె తండ్రి రాములు వ్యవసాయం చేస్తున్నాడు. రతిక అసలు పేరు ప్రియ అని తాము తెలంగాణలోని తాండూర్‌కు చెందిన వారమని ఆయన తెలిపాడు. కానీ ప్రస్తుతం ఆమె కోరికమేరకు హైదరాబాద్‌లో ఉంటున్నామని చెప్పాడు. రతిక వల్ల ఈ రోజు తమ జీవితం ఆనందంగా కొనసాగుతుందని రాములు తెలిపాడు. ఒకప్పుడు కనీసం రతిక స్కూల్ ఫీజులు కూడా కట్టలేని స్థితిలో ఉండగా తనకు నవోదయ పాఠశాల్లో సీటు రావడంతో ఆమెను చదివించగలిగాను అని చెబుతూ ఆమె తండ్రి రాములు కన్నీళ్లు పెట్టుకున్నాడు. గ్రామ సర్పంచ్‌గా నిజాయితీగా పనిచేశా గ్రామ సర్పంచిగా పనిచేసినప్పటికీ నిజాయితీగానే ఉన్నానని, బిడ్డల కోసం సంపాదించింది ఏమీలేదని ఆయన చెప్పాడు. ఆమె చదవులో మెరిట్ ఉండటంతో తెలంగాణ మంత్రి మల్లారెడ్డి ఉచితంగా ఆయన కాలేజీలో ఇంజనీరింగ్ చదివించాడని ఆయన పేర్కొన్నాడు. ఆమెది చిన్నపిల్ల మనస్థత్వం అని, అంతే తప్ప కావాలని ఎవరినీ ఇబ్బంది పెట్టదని తెలిపాడు. తమ ఇంట్లో ఎలా ఉంటుందో బిగ్‌బాస్‌లో కూడా అలాగే ఉందని ఇలా రాములు తెలిపాడు. రతిక ప్రేమ,పెళ్లిపై వ్యాఖ్యలు 'నాకు మగపిల్లలు లేరు.. ఇద్దరూ ఆడపిల్లలే.. రతిక రెండో పాప, మొదటి అమ్మాయికి ప్రభుత్వం ఉద్యోగం వచ్చింది. రతికనే కష్టపడి ఒక మగపిల్లాడిలా మమ్మల్ని పోషిస్తుంది. గతంలో ఎన్నో కష్టాలు పడ్డాము.. రతిక మా కుటుంబానికి కొడుకులా నిలబడింది. మానకొండూర్ ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ మొదట మా పాపకు 'తుపాకి రాముడు' సినిమాతో జీవితం ఇచ్చారు. తర్వాత ఆమెకు పలు అవకాశాలు వచ్చాయి. ఆమెపై కావాలనే కొందరు ప్రేమ పేరుతో పుకార్లు క్రియేట్ చేస్తున్నారు. ఆమె ఎవరినీ ప్రేమించలేదు. తను ఎప్పుడు పెళ్లి చేసుకుంటానంటే అప్పుడు ఒక తండ్రిగా నేను చేస్తా.. ఏదున్నా ఓపెన్‌గా ఇంట్లో చెప్తుంది. ఆమెకు నచ్చినట్లు పెళ్లి చేయడం నా భాద్యత' అని రాములు తెలిపాడు రతిక గురించి ఆమె తల్లి మాటల్లో.. తన కూతురు రతిక ఒక తల్లిగా తమ కుటుంబాన్ని చూసుకుంటుంది. ఆమె వల్లే తాము హైదరాబాద్‌కు వచ్చామని రతిక తల్లి అనిత ఇలా చెప్పింది. 'కుటుంబం కోసం మొదట్లో నేను ప్రైవేట్ హస్పిటల్లో పనిచేశాను.. తక్కువ జీతానికి అంతదూరం వెళ్లి కష్టపడటం ఎందుకు అని రతిక వారించడంతో ఉద్యోగం మానేశాను. మిమ్మల్ని పోషించడం కూతురిగా నా బాధ్యత అని హైదరాబాద్‌లో ఒక ఇల్లు రతికనే కొన్నది. ప్రస్తుతం ఆమె సంపాదనతోనే తాము ఉంటున్నట్లు రతిక తల్లిదండ్రులు తెలిపారు. కానీ తనకు పొలంలో పనిచేయడం ఇష్టం కాబట్టి వారంలో మూడు రోజులు తమ గ్రామం అయిన తాండూర్‌కు వెళ్తానని రాములు చెప్పాడు. తమకు ఉన్న కొద్ది భూమిలో వ్యవసాయం చేసుకుంటున్నట్లు ఆయన తెలిపాడు. శివాజీ,తేజ,యావర్ కంటే తక్కువా.. హౌస్ నుంచి ముందుగా శివాజీని పంపించేయాలని ఇప్పటికే కొందరు భారీగా కామెంట్లు చేస్తున్నారు. ఆయన నుంచి కనీసం వీసమెత్తు ఎంటర్టెయిన్మెంట్ కూడా చేయడం చేతకావడం లేదని విమర్శలు వస్తున్నాయి. ఆయన నుంచి పెత్తందారీ పోకడ భరించలేక కంటెస్టర్లు కూడా శివాజీ బయాస్డ్గా ఉన్నారని ముద్రవేశారు . ఇది గ్రహించే తన అస్త్రను పగులగొట్టి, డిమోషన్ ఇచ్చేశాడు బిగ్‌బాస్. మరోవైపు యాంగర్ యావర్, తేజలు సరేసరి.. ఏ మాత్రం ఎంటర్టైన్ చేయడంలేదని కామెంట్లు వస్తున్నాయి. ఇప్పటికే మహిళా కంటెస్టెంట్లను అందరినీ బిగ్‌బాస్ నుంచి వరుసగా బయటికి వచ్చేశారు. షకీలాతో మొదలుపెడితే.. కిరణ్ రాథోడ్, సింగర్ దామినిని పంపించేశాడు బిగ్‌బాస్. రతిక రోజ్‌ను మాత్రం పనికట్టుకుని ఒక వర్గం ఆడియన్సే పంపించారని టాక్ నడుస్తుంది. ఇలా మహిళలను అందరినీ హౌస్ నుంచి బిగ్‌బాస్ పంపించిడంతో వైల్డ్ కార్డు ఎంట్రీకి సమయం ఆసన్నమైందని ప్రచారం జరుగుతుంది.