శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో అంటూ శివాజీ చిల్లర వ్యాఖ్యలు | Bigg Boss 7 Telugu Day 96 Episode Highlights | Sakshi
Sakshi News home page

Bigg Boss 7 Day 96 Highlights: శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడు.. చిల్లరోళ్లు అంటూ శివాజీ వ్యాఖ్యలు

Published Sat, Dec 9 2023 8:30 AM | Last Updated on Sat, Dec 9 2023 9:51 AM

Bigg Boss 7 Telugu Day 96 Episode Highlights - Sakshi

Bigg Boss 7 Day 96 Highlights: బిగ్‌ బాస్‌లో ప్రస్తుతం వరుసగా కొట్లాటలు.. గొడవలు.. భారీగానే జరుగుతున్నాయి. మొదటి నుంచి SPY బ్యాచ్‌లో ఎలాంటి గొడవలు లేకుండా గ్రూప్‌గానే గేమ్‌ ఆడుతూ వస్తున్నారు. అదే విధంగా SPA బ్యాచ్‌ కూడా గ్రూప్‌ గేమ్‌ ఆడుతూనే ఇంత వరకు వచ్చింది. కానీ వీరిలో యూనిటి మాత్రం ఎక్కడా కనిపించలేదు. స్నేహితులం అని చెప్పుకుంటున్న వీరి మధ్య కూడా పొరపచ్చాలు వస్తున్నాయి. 

శోభపై మాటలు తూలిన శివాజీ.. గొంతుపై కాలేసి తొక్కుతా అంటూ
బిగ్‌ బాస్‌లో ఓట్‌ అప్పీల్‌ కోసం ఫన్నీ టాస్క్‌లు జరుగుతున్నాయి. ఇప్పటికే శోభ,అర్జున్‌ ఓట్‌ అప్పీల్‌ చేసుకున్న విషయం తెలిసిందే. ఓట్‌ అప్పీల్‌ కోసం జరుగుతున్న ఫన్సీ గేమ్స్‌లో శివాజీ,శోభ మధ్య మాటల యుద్ధం నడిచింది. ఈ క్రమంలో శివాజీ చేసిన వ్యాఖ్యలు చాలా అభ్యంతరంగా ఉన్నాయి. ఒకానొక సమయంలో బాల్‌ టాస్క్‌ ఆడలేనని చెప్పి బయటకు వచ్చేస్తాడు. అసలు శివాజీ ఆడేదే కన్నింగ్ గేమ్.. యావర్‌, ప్రశాంత్‌ను వెంటేసుకుని ఇతరులపై నాలుగు పిచ్చి మాటలు విసురుతాడు. కానీ ఎప్పుడూ కూడా శివాజీపై బిగ్‌ బాస్‌ కిమ్మనడు.

దీనినే అలుసుగా తీసుకున్న శివాజీ తాజాగా జరిగిన బాల్‌ టాస్క్‌ విషయంలో శోభపై ఫైర్‌ అవుతాడు. చిల్లరోళ్లు, క్యారెక్టర్‌ లెస్‌, మేము పీకేదానికి ఉన్నామా..? అంటూ శివాజీ రెచ్చిపోతాడు. రేపు శోభను ఎవడు పెళ్లి చేసుకుంటాడో... వాడు భయపడిపోడా..? అంటూ అవసరం లేని మాటలు శివాజీ వాగుతాడు. పెళ్లి తర్వాత ఇలాగే ఉంటే అంటూ టాపిక్‌కు సంబంధంలేని  వ్యాఖ్యాలు చేశాడు శివాజీ.

ప్రియాంక, శోభను ఉద్దేశిస్తూ.. ఇలాంటి ఆడపిల్లలను ఎక్కడా చూడలేదు.. అదే మన ఇంట్లో ఇలాంటి వాళ్లుంటే గొంతుమీద కాలు వేసే తొక్కేవాడినంటూ నీచమైన వ్యాఖ్యలు చేశాడు. ఇదే క్రమంలో శివాజీని కూడా శోభ పదేపదే ట్రిగ్గర్‌ చేస్తూ మాట్లాడుతుంది. దానిని సంహించలేని శివాజీ ఇలా వ్యక్తిగతంగా మాట్లాడటం ఏ మాత్రం కరెక్ట్‌ కాదని చెప్పవచ్చు.  

ఓట్‌ అప్పీల్‌ చేసుకున్న శివాజీ
ఓట్‌ అప్పీల్‌ చేసుకునేందుకు అర్జున్‌. శివాజీ పోటీ పడుతారు. అప్పటికే అర్జున్‌ ఓట్‌ అప్పీల్‌ చేసుకోవడం వల్ల హౌస్‌లోని కంటెస్టెంట్లు అందరూ శివాజీకే ఓట్‌ అప్పీల్‌ అవకాశం దక్కేలా సపోర్ట్‌ చేస్తారు. తర్వాత ఆయన ఓట్‌ అప్పీల్‌ చేసుకుంటాడు. తన గేమ్‌ నచ్చితే ఓట్‌ వేయాలని ఆయన కోరుతాడు.

SPA  బ్యాచ్‌లో గొడవలకు కారణమైన శోభ
బిగ్‌ బాస్‌లో ఒక యాడ్‌కు సంబంధించిన టాస్క్‌లో అమర్‌, శోభ మధ్య గొడవ జరుగుతుంది. హౌస్‌లో రెండు గ్రూపులుగా డివైడ్‌ చేసి.. ఒక బ్యాచ్‌లో ప్రియాంక, శివాజీ, ప్రశాంత్‌ ఉంటారు. మరోక బ్యాచ్‌లో శోభ,యావర్‌,అర్జున్‌ ఉంటారు. సంచాలక్‌గా అమర్‌ ఉంటాడు. వీరికి ఇచ్చిన టాస్క్‌లో వండర్‌ ఉమెన్‌గా ప్రియాంకను విన్నర్‌గా ప్రకటిస్తాడు అమర్‌ దీంతో శోభకు కోపం రావడం.. ఆపై అమర్‌ నిర్ణయాన్ని తప్పుపట్టిన శోభ గొడవకు దిగుతుంది. ఇది ఎంత మాత్రం కరెక్ట్‌ కాదని చెప్పవచ్చు. అక్కడ గెలిచింది ప్రియాంకనే కదా... మనం అనే విషయాన్ని మరిచిపోయి అమర్‌తో గొడవకు దిగుతుంది. అప్పుడు అమర్‌ కూడా పక్కన వాళ్లను చూసి నేర్చుకో ఎలా ఉండాలో అని చెబుతాడు. ఇలా SPA బ్యాచ్‌లో చిచ్చు పెట్టిన వ్యక్తిగా శోభ మిగిలిపోయింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement