![Sivaji Comments On Bigg Boss - Sakshi](/styles/webp/s3/article_images/2023/12/31/Sivaji-Comments-On-Bigg-Boss_0.jpg.webp?itok=eJLcALzc)
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న అక్కసు శివాజీలో కనిపిస్తుంది. అందుకే ఆయన పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికీ కూడా అమర్, శోభా పట్ల పలు చిల్లర వ్యాఖ్యలతో పాటు పరుష పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు. చివరకు అమర్ రన్నర్ ఎలా అయ్యాడో అంటూ చెప్పుకొస్తున్నాడు. బిగ్ బాస్‌లో శివాజీని అన్నిరోజులు ఉంచడమే గొప్ప విషయం అనుకుంటుంటే.. తనను తాను ఎదో గొప్ప అనుకునే భ్రమలో ఇప్పటికీ ఆయన ఉన్నాడు.
శివాజీ వల్లే ఈ సీజన్‌లో ఇంత రచ్చ అయిందని చెప్పేవారు ఎందరో ఉన్నారు. అనవసరంగా తనను ఈ సీజన్‌లోకి తీసుకున్నారని కూడా పలువురు కామెంట్లు కూడా చేశారు. హౌస్‌లో ఎప్పుడూ కూడా తాను పోతా పోతా అంటాడు, ఆటలు ఆడడు, బెడ్డు వదలడు, పైగా చెయ్యి నొప్పి, మాట్లాడితే వెటకారాలు, నీతిబోధలు. బిగ్ బాస్‌లో ఆయన చేసింది ఇదే కదా.. మరోకటి ఏమైనా ఉంటే చెప్పండి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు కూడా. గట్టు పంచాయితీలు తీర్చే ఈ పెద్దకు ఇద్దరు పాలేర్లు. వారిద్దరినీ తన చుట్టూ తిప్పుకోవడం.. బిగ్ బాస్‌లో శివాజీ చేసింది ఏమిటి..? నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడం.. ఇప్పడు బిగ్ బాస్ బయట కూడా అదే చేస్తున్నాడు.
శోభా శెట్టి గొడవతో తనను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం బిగ్ బాస్ చేశారని తాజాగా శివాజీ సంచలన ఆరోపణ చేశాడు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్లింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని అంటూ శివాజీ ఇలా చెప్పాడు. 'గేమ్ ఒక దశకు వచ్చాక విన్నర్ ఎవరు..? ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా అంచనా వేశాను. 1, 2, 3 స్థానాల్లో మనం ముగ్గురం ఉండబోతున్నామని ప్రశాంత్ చేతిలో రాశాను. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని బిగ్ బాస్ కావాలనే హైలైట్ చేస్తూ వచ్చాడు.
బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం నాకు నచ్చలేదు. అతను (అమర్) చపాతి చేస్తే బాగుంది నాకు కూడా పంపించు అని బిగ్ బాస్ అంటాడు... నేను ఎంతో కష్టపడి వడలు చేపిస్తే కనీసం ఒక మాట కూడా నాకు దక్కలేదు. పలుసార్లు పౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని చివరకు రన్నరప్‌ను చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి చెడ్డ పేరు వస్తుంది. ఇదే విషయం నాగ్ సారుకు కూడా త్వరలో చెబుతాను. న్యాయంగా అయితే టాప్ 3లో ప్రశాంత్, నేను, యావర్ ఉండేవాళ్లం.' అని శివాజీ అన్నారు.
Comments
Please login to add a commentAdd a comment