Amardeep Chowdary
-
అమర్ దీప్-సుప్రిత సినిమా: ఆడియన్స్‌తోనే టైటిల్ రివీల్
ఒకప్పటితో కంపేర్ చేస్తే ఇప్పుడు సినిమాల ప్రమోషన్స్ వినూత్నంగా ఉంటున్నాయి. ముఖ్యంగా చిన్న సినిమాల మేకర్స్.. తమ మూవీని జనాల్లోకి తీసుకెళ్లడానికి ప్రమోషన్స్‌పై ప్రత్యేక దృష్టిపెడుతున్నారు. డిఫరెంట్‌గా ప్లాన్ చేసి.. సినిమాపై బజ్ క్రియేట్ చేసుకుంటున్నారు. తాజాగా ఓ సినిమా మేకర్స్ కూడా ప్రమోషన్స్‌ని డిఫరెంట్‌గా ప్లాన్ చేశారు. సినిమాకి టైటిల్ పెట్టే చాన్స్ ఆడియన్స్‌కే ఇచ్చేశారు. అదే బిగ్‌బాస్ ఫేం అమర్దీప్ కొత్త సినిమా. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని M3 మీడియా బ్యానర్ పై మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్నారు. ప్రముఖ నటి సురేఖవాణి కూతురు సుప్రీత హీరోయిన్గా నటిస్తోంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది. అయితే షూటింగ్ పూర్తి కాకముందే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు.‘సినిమా మాది - టైటిల్ మీది’ అని ఒక ప్రమోషనల్ వీడియో విడుదల చేస్తూ, తమ సినిమా సూట్ అయ్యే టైటిల్ ను ఆడియన్స్ నిర్ణయించాలని కోరారు. అనుకున్న టైటిల్ ని+91 8985713959 నంబర్‌కి వాట్సాప్ ద్వారా పంపించాలని ప్రేక్షకులను ఆహ్వానించారు. సెలెక్ట్ అయిన టైటిల్ ని సినిమా టీం స్వయంగా ప్రేక్షకుల ఇంటి వద్దకి వచ్చి వారితోనే టైటిల్ రివీల్ చేస్తున్నట్లు చిత్ర బృందం తెలిపారు. View this post on Instagram A post shared by M3 Media (@m3_media959) -
నిఖిల్ గొప్పతనాన్ని చెప్పిన అమర్, బిగ్‌బాస్ మాస్టర్ ప్లాన్
కొందరి ఫ్యామిలీస్, ఫ్రెండ్స్ శనివారం ఎపిసోడ్లో స్టేజీపైకి వచ్చేసి మాట్లాడారు. మిగిలినవారి ఫ్యామిలీస్ నేడు స్టేజీపై సందడి చేశారు. మరి ఎవరెవరు వచ్చారు? ఎవర్ని టాప్ 5లో పెట్టారు? అనేది నేటి (నవంబర్ 17) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి..మందు తాగుతానన్న యష్మియష్మి కోసం ఆమె ఫ్రెండ్స్ శ్రీసత్య, సంయుక్త స్టేజీపైకి వచ్చారు. సాయంత్రం ఆరు గంటల తర్వాత యష్మిని మీరు చూడలేరని నాగార్జునతో అన్నారు. అందుకు కారణమేంటో ఎలాగైనా తెలుసుకోవాలనుకున్న నాగ్.. ఆ సీక్రెట్ చెప్తే ప్రైజ్‌మనీకి రూ.3 లక్షలు యాడ్ అవుతాయన్నారు. ఈ బంపరాఫర్‌కు టెంప్ట్ అయిపోయిన యష్మి.. తాను మందు తాగుతానని ఒప్పేసుకుంది. నిన్నటిలాగే వీరితోనూ టాప్ 5 ఎవరనేది గేమ్ ఆడించాడు. టాప్ 5లో ఎవరంటే?తమ కంటెస్టెంట్‌ను పక్కనపెట్టి మిగతావారిలో ఐదుగురిని ఫైనలిస్టులుగా సెలక్ట్ చేయాల్సి ఉంటుంది. అలా గౌతమ్ 1, నిఖిల్ 2, నబీల్, అవినాష్, ప్రేరణ మిగతా మూడు స్థానాల్లో ఉన్నారు. తర్వాత యష్మిని సేవ్ చేశారు. తేజ తండ్రి శ్రీనివాసరెడ్డి, ఫ్రెండ్ వీజే సన్నీ వచ్చారు. తల్లిని హౌస్‌లోకి తీసుకురావాలన్న కలను నెరవేర్చుకున్నావు.. నిన్ను ఫినాలేలో చూడాలనుకున్న అమ్మ కలను కూడా నెరవేర్చు అని తేజపై భారం వేశాడు అతడి తండ్రి.అవినాష్‌తో సినిమాసన్నీ.. గౌతమ్, నిఖిల్, నబీల్, ప్రేరణ, అవినాష్‌ను వరుసగా టాప్ 5లో పెట్టాడు. అందరి అంచనాలను మనం అందుకోలేము.. నువ్వు నీలా ఉండు అంటూ నిఖిల్‌కు గోల్డెన్ సలహా ఇచ్చాడు. అనంతరం ముక్కు అవినాష్ కోసం అతడి తమ్ముడు అశోక్‌తో పాటు దర్శకుడు కోన వెంకట్ వచ్చారు. బిగ్‌బాస్ నుంచే చాలామంది నటుల్ని తీసుకుంటున్నాను.. అవినాష్‌తో కూడా ఓ సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు కోన వెంకట్. కంటెస్టెంట్లందరికీ తన సినిమా టైటిల్స్‌ను డెడికేట్ చేశాడు. అవినాష్ అదుర్స్, నబీల్ దూకుడుఅలా నిఖిల్‌కు బాద్షా, పృథ్వీకి బలుపు, విష్ణుప్రియకు నిన్ను కోరి, యష్మికి దేనికైనా రెడీ, ప్రేరణకు గీతాంజలి, రోహిణికి హ్యాపీ, గౌతమ్‌కు శివమణి, అవినాష్‌కు అదుర్స్, తేజకు ఢీ, నబీల్‌కు దూకుడు సినిమా టైటిల్స్ అంకితమిచ్చాడు. వీరు.. నబీల్ను 1, నిఖిల్‌ను 2, రోహిణిని 3, విష్ణుప్రియను 4, గౌతమ్‌ను 5వ ర్యాంకులో ఉంచారు. తర్వాత నిఖిల్ కోసం అతడి తండ్రి శశికుమార్, నటుడు అమర్దీప్ వచ్చేశారు. రెండు రోజులు నాతోనేఅమర్దీప్ మాట్లాడుతూ.. ఓ షో తర్వాత నా రెండు కాళ్లు నొప్పితో కదల్లేని స్థితికి వచ్చేశాయి. పూర్తిగా బిగుసుకుపోయాయి. షో నుంచి ఇంటికి వెళ్లకుండా సరాసరి నాతో పాటే నా రూమ్‌కు వచ్చాడు. రెండు రోజులు నాతోనే ఉన్నాడు. నన్ను వాష్‌రూమ్‌కు కూడా ఎత్తుకుని తీసుకుపోయాడు అంటూ నిఖిల్ స్నేహానికిచ్చే విలువను చాటిచెప్పాడు. అలాగే విష్ణుప్రియ, నబీల్, రోహిణి, గౌతమ్, తేజకు వరుస ఐదు ర్యాంకులిచ్చాడు.మగాళ్లపై ఆడాళ్ల విజయంర్యాంకుల గోల అయిపోవడంతో నాగ్.. హౌస్‌మేట్స్‌తో చిన్న గేమ్ ఆడించాడు. అమ్మాయిలను, అబ్బాయిలను రెండు టీములుగా విడగొట్టాడు. సినిమా పేరు చెప్పగానే హీరో, దర్శకుడు, హీరోయిన్ ఫోటోలను బోర్డుపై పెట్టాలన్నాడు. అలా ఈ ఆటలో మహిళల టీమ్ గెలిచింది. తర్వాత విష్ణుప్రియ సేవ్ అయినట్లు ప్రకటించాడు.అవినాష్‌ను సేవ్ చేసిన నబీల్చివరగా అవినాష్, తేజ నామినేషన్లో మిగిలారు. ఈ క్రమంలో నబీల్ను ఎవిక్షన్ షీల్డ్ వాడతావా? అని నాగ్ అడిగాడు. నాకు షీల్డ్ రావడానికి అవినాష్ కూడా ఓ కారణమే.. అందుకే అతడి కోసం వాడాలనుకుంటున్నాను. నేను గేమ్ ద్వారా మాత్రమే ముందుకు వెళ్తాను అని నబీల్ తన నిర్ణయం చెప్పాడు. దీంతో అవినాష్ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించిన నాగ్.. నబీల్ ఎవిక్షన్ షీల్డ్ వాడటం వల్ల అతడు సేవ్ అయినట్లు తెలిపాడు. టెన్షన్‌తో చచ్చిపోయిన తేజబిగ్బాస్ నాలుగో సీజన్లో ఎవిక్షన్ షీల్డ్‌తో సేవ్ అయ్యానని.. ఇప్పుడు మరోసారి అదే షీల్డ్ తనను కాపాడిందన్నాడు అవినాష్ మరి నా పరిస్థితి ఏంటని తేజ అయోమయానికి లోనయ్యాడు. అతడిని కాసేపు టెన్షన్ పెట్టిన నాగ్.. చివరకు సేవ్ అయినట్లు ప్రకటించాడు. ఈ వారం ఎలిమినేషనే లేదని తెలిపాడు. అయితే రేపు మాత్రం ఎలిమినేట్ అయిన కంటెస్టెంట్లతో నామినేషన్స్ చేయించాడు బిగ్‌బాస్. ఈ క్రమంలో సోనియా.. నిఖిల్‌ను నామినేట్ చేయడం గమనార్హం. ఆ తతంగమంతా రేపు చూసేయండిమరిన్ని బిగ్‌బాస్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
బిగ్‌బాస్ కంటెస్టెంట్ అమర్దీప్ బర్త్ డే.. ఈ స్పెషల్ పిక్స్ చూశారా?
-
అమర్దీప్ హీరోగా 'నా నిరీక్షణ'.. సినిమా లాంచ్ (ఫోటోలు)
-
హీరోగా 'బిగ్‌బాస్' అమరదీప్.. కొత్త సినిమా మొదలు
దసరా సందర్భంగా పలు చిన్న చిత్రాలు నుంచి అప్డేట్స్ వచ్చేశాయి. వీటిలో బిగ్‌బాస్ ఫేమ్ అమర్దీప్ హీరోగా చేస్తున్న మూవీ ఒకటి కాగా.. రాజేంద్ర ప్రసాద్ మనవరాలు ప్రధాన పాత్ర పోషించిన మూవీ రిలీజ్ తేదీని కూడా ప్రకటించారు.సీరియల్ నటుడిగా అందరికీ తెలిసిన అమర్దీప్.. గతేడాది బిగ్‌బాస్ షోలో పాల్గొని మరింత గుర్తింపు తెచ్చుకున్నాడు. హీరోగా ఇప్పటికే ఓ మూవీ చేస్తుండగా.. ఇప్పుడు 'నా నిరీక్షణ' పేరుతో మరో చిత్రాన్ని మొదలుపెట్టాడు. దసరా సందర్భంగా ఇది ప్రారంభమైంది. లిషి గణేష్ కల్లపు హీరోయిన్ కాగా సాయి వర్మ దాట్ల దర్శకుడు. పూజా కార్యక్రమాలతో ఈ ప్రాజెక్ట్ మొదలైంది.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ తెలుగు కంటెస్టెంట్ ఇంట్లో విషాదం)'ఎర్రచీర' రిలీజ్ ఎప్పుడంటే?నటుడు రాజేంద్రప్రసాద్ ముద్దుల మనవరాలు బేబీ సాయి తేజస్వి నటించిన కొత్త సినిమా 'ఎర్రచీర'. తల్లి సెంటిమెంట్ కథతో తీసిన ఈ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుంది. విజయదశమి శుభాకాంక్షలు చెబుతూ డిసెంబరు 20న థియేటర్లలో మూవీని విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. సుమన్ బాబు దీనికి దర్శకుడు.'పెన్ డ్రైవ్' మూవీ షురూవిష్ణు వంశీ, రియా కపూర్ హీరోహీరోయిన్లుగా చేస్తున్న సినిమా 'పెన్ డ్రైవ్'. ఎంఆర్ దీపక్ దర్శకుడు. కె.రామకృష్ణ నిర్మాత. నేటితరం ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా సమకాలీన కథా కథనాలతో తెరకెక్కుతోంది. దసరా సందర్భంగా పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది.(ఇదీ చదవండి: ప్రముఖ నేత దారుణ హత్య.. బిగ్‌బాస్ షూటింగ్ రద్దు)'ప్రేమలు' బ్యూటీ తెలుగు సినిమా'ప్రేమలు' ఫేమ్ మమిత బైజు చేస్తున్న తొలి తెలుగు సినిమా 'డియర్ కృష్ణ'. దినేష్ బాబు దర్శకుడు. కొత్తోళ్లు అక్షయ్, ఐశ్వర్యతో మమిత ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ కృష్ణుడి నమ్మే ఓ భక్తుడి స్టోరీతో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. -
బిగ్‌బాస్ అమర్దీప్ కొత్త సినిమా.. షూటింగ్ సెట్లోనే సన్మానం!
బిగ్‌బాస్ ఫేమ్ అమర్దీప్, సుప్రీత సురేఖవాణి జంటగా కొత్త చిత్రంలో నటిస్తున్నారు. మాల్యాద్రి రెడ్డి దర్శకత్వంలో ఒక కొత్త సినిమా తెరకెక్కిస్తున్నారు. ఈ చిత్రాన్ని ఏం3 మీడియా అండ్ మహా మూవీస్ బ్యానర్లో మహేంద్ర నాధ్ కూoడ్ల నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది.అయితే ఇటీవల ఓ డాన్స్ షోలో అమర్దీప్ చౌదరి, తేజు విజయం సాధించారు. ఈ సందర్భంగా షూటింగ్ సెట్లో సెలబ్రేషన్స్ చేసుకున్నారు. అమర్దీప్ మూవీ షూటింగ్ లోకేషన్లోనే టీం సభ్యులు అందరూ కలిసి కేక్ కట్ చేశారు. అనంతరం అమర్‌దీప్‌ను సన్మానించారు. దీనికి సంబంధించిన ఫోటోలు తెగ వైరలవుతున్నాయి.ఈ సందర్భంగా అమర్ దీప్ చౌదరి మాట్లాడుతూ..'నిజంగా నాకు చాలా సంతోషంగా ఉంది. కష్టపడితే విజయం వస్తుందని అనడానికి నిదర్శనం ఇదే. ప్రేక్షకుల సపోర్ట్ వలనే ఇదంతా సాధ్యమైంది. అలాగే మా సినిమా ని సైతం ప్రేక్షకులు ఆదరించాని కోరారు. ఈ కార్యక్రమంలో నిర్మాత మహేంద్ర నాధ్ కూoడ్ల ,డైరెక్టర్ మాల్యాద్రి రెడ్డి, హీరోయిన్ సుప్రీత, టేస్టీ తేజ పాల్గొన్నారు. -
కొత్త కారు కొన్న అమర్ దీప్, తేజస్విని.. ధర ఎంతో తెలుసా?
తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు అమర్దీప్ చౌదరి మెగాస్టార్ లెక్క.. సీరియల్స్ ద్వారా తెలుగు ఆడియెన్స్‌కు బాగా చేరువైన అమర్ ఆ గుర్తింపుతో బిగ్‌బాస్ సీజన్ 7లోకి ఎంట్రీ ఇవ్వడం. ఆపై రన్నర్‌గా నిలిచాడు. ఇక సీరియల్ నటి, కన్నడ బ్యూటీ అయిన తేజస్వని గౌడను ఆమర్ ప్రేమించి పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. అలా ఇద్దరూ సినిమా ఇండస్ట్రీలో కొనసాగుతున్నారు.బిగ్ బాస్ తర్వాత అమర్ జీవితమే మారిపోయిందని చెప్పవచ్చు. పలు సినిమా ఛాన్స్‌లతో పాటు సీరియల్స్‌తో ఫుల్ బిజీగా ఉన్నారు. ఇప్పటికే సురేఖా వాణి కూతురు సుప్రితతో అమర్ ఒక సినిమాలో నటిస్తున్నాడు. షూటింగ్ కార్యక్రమాలు కూడా వేగంగా జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో తాజాగా తన అభిమాన హీరో రవితేజతో కూడా సినిమా ఛాన్స్ దక్కించుకున్నాడు.అయితే, అమర్ దీప్, తేజస్విని తాజాగా కొత్త కారు కొన్నారు. బ్లాక్ కలర్లో ఉన్న టాటా సఫారి కారును వారు కొన్నారు. దీని ధర రూ. 25 లక్షలకు పైగానే ఉండవచ్చని తెలుస్తోంది. కారు ముందు తేజస్విని తన స్నేహితులతో సందడి చేసింది. అమర్‌తో కలిసి వారందరు దిగిన ఫోటోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. View this post on Instagram A post shared by Tejaswini Gowda (@_tejaswini_gowda_official) -
అమర్‌ను సర్ప్రైజ్ చేసిన శోభ.. అతడి కోసం త్యాగం..
బిగ్‌బాస్ షోను డీల్ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. కంటెస్టెంట్లను మెచ్చుకోవాలి. తప్పు చేసినవారిని సరిచేయాలి.. వారి నుంచి ఎంటర్టైన్మెంట్ రప్పించాలి.. ఎపిసోడ్‌ను జోష్‌గా ఉంచాలి.. ప్రేక్షకులు షో చూడగలిగేలా చేయాలి.. ఇలా చాలానే ఉంటాయి. అయితే సినిమాలతో బిజీగా ఉన్నా సరే బిగ్‌బాస్‌ను ఓ బాధ్యతగా భుజానెత్తుకున్నాడు కింగ్ నాగార్జున. వరుసగా ఐదు సీజన్లకు ఆయనే వ్యాఖ్యాతగా వ్యవహరించాడు. ఎనిమిదో సీజన్‌కు కూడా ఆయనే యాంకర్‌గా ఉంటాడు. ఇందులో డౌటే లేదు. శోభాకు టీషర్ట్ గిఫ్ట్ కాకపోతే నాగ్ ఎక్కువగా కోప్పడడు. అలాంటిది ఏడో సీజన్లో మాత్రం ఉగ్రరూపాన్ని చూపించాడు. ఒక్కొక్కరు మారు మాట్లాడకుండా చేశాడు. అమ్మాయిలను మాత్రం సుతిమెత్తగానే వారించేవాడు. ఓ రోజు శోభా శెట్టి నాగ్ ధరించిన టీ షర్ట్ చూసి ముచ్చటపడింది. అది కావాలని మనసులో మాట బయటపెట్టింది. అంత ప్రేమగా అడిగితే మన్మథుడు కాదంటాడా? షో అయిపోయిన వెంటనే ఆ టీ షర్ట్‌ను ఇచ్చేశాడు. కానీ అదే షోలో అమర్దీప్ అడిగితే మాత్రం నీకు ఇచ్చేదేంటన్నట్లుగా చూశాడు. ఫ్రెండ్ కోసం త్యాగం ఇక షో అయిపోయాక ఆ టీషర్ట్ ధరించి ఫోటోషూట్ కూడా చేసింది శోభ. అయితే స్నేహితుడి కోరిక గుర్తొచ్చి అతడి కోసం ఓ ముఖ్యమైన నిర్ణయం తీసుకుంది. నాగార్జున తనకు గిఫ్ట్‌గా ఇచ్చిన టీషర్ట్‌ను ఓ షోలో అమర్‌కు త్యాగం చేసింది. 'ఇది నాకెంతో విలువైన బహుమతి. కానీ ఆరోజు అమర్ నాగ్ సర్‌ను అడిగాడు, కాబట్టి ఇది తనకు ఇచ్చేస్తున్నా' అని చెప్పింది. అది తీసుకుని మురిసిపోయిన అమర్ స్టేజీపైనే దాన్ని ధరించి సంబరపడ్డాడు. ఇది చూసిన జనాలు శోభను మెచ్చుకుంటున్నారు. ఫ్రెండ్ అంటే నీలా ఉండాలని కామెంట్లు చేస్తున్నారు. చదవండి: షారుక్ ఖాన్ అంత ఆస్తి లేదు, భరణం ఎంతిచ్చానంటే? -
సరికొత్త కథతో శ్రీకారం
‘బిగ్ బాస్’ ఫేమ్ అమర్దీప్ చౌదరి హీరోగా, నటి సురేఖా వాణి కుమార్తె సుప్రీత హీరోయిన్గా కొత్త చిత్రానికి శ్రీకారం జరిగింది. ఈ చిత్రానికి మాల్యాద్రి రెడ్డి దర్శకుడు. మహర్షి కూండ్ల సమర్పణలో ఎం3 మీడియా బ్యానర్‌పై మహా మూవీస్‌తో కలిసి మహేంద్రనాథ్ కూండ్ల నిర్మిస్తున్న ఈ సినిమా గురువారం ఆరంభమైంది. ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత ఏఎం రత్నం కెమెరా స్విచ్చాన్ చేయగా, బసిరెడ్డి క్లాప్ కొట్టగా, వీర శంకర్ గౌరవ దర్శకత్వం వహించారు. మహేంద్రనాథ్ కూండ్ల మాట్లాడుతూ– ‘‘ఇండియన్ సినిమాలో ఇంతవరకూ ఎవరూ టచ్ చేయని కొత్త కథతో ఈ సినిమాని రూపొందిస్తున్నాం’’ అన్నారు. ‘‘మాలాంటి కొత్త వాళ్లకి ఎం3 మీడియా చాన్స్ ఇవ్వడం హ్యాపీగా ఉంది’’ అన్నారు మాల్యాద్రి రెడ్డి. ‘‘బిగ్ బాస్’కి వెళ్లకముందే ఈ సినిమా ఒప్పుకున్నాను’’ అన్నారు అమర్దీప్ చౌదరి. సుప్రీత, నటీనటులు సురేఖా వాణి, తేజస్వి, గౌతమ్ కృష్ణ, రఘు, నటుడు, దర్శకుడు తల్లాడ సాయికృష్ణ మాట్లాడారు. ఈ చిత్రానికి సంగీతం: దాస్ కడియాల, కెమెరా: బాల సరస్వతి. -
హీరోగా ఛాన్స్ కొట్టేసిన 'బిగ్‌బాస్' అమర్దీప్.. హీరోయిన్ సెలక్షన్ అదుర్స్
'జానకి కలగనలేదు' సీరియల్స్‌తో బుల్లితెర ప్రేక్షకులకు దగ్గరైన అమర్దీప్ చౌదరి బిగ్ బాస్‌తో మరింత పాపులర్ అయ్యాడు. సీజన్-7లో ఆయన రన్నర్‌గా నిలిచినా ప్రేక్షకుల్లో మాత్రం చెరిగిపోని ముద్రే వేశాడని చెప్పవచ్చు. టైటిల్ విన్నర్‌గా ఆట బరిలోకి దిగిన అమర్.. గెలవాలనే తపన, కోరిక ఎక్కువగానే కనిపించినా అప్పుడప్పుడు అతనిలోని కోపం కంట్రోల్ తప్పడంతోనే రన్నర్‌గా మిగిలాడని చెప్పవచ్చు. బిగ్ బాస్‌తో వచ్చిన గుర్తింపుతో ఇప్పటికే చాలా మంది మరో అడుగు ముందుకేసి అవకాశాలు అందిపుచ్చుకుంటున్నారు. బిగ్ బాస్‌తో గుర్తింపు తెచ్చుకున్న సయ్యద్ సోహైల్ ఇప్పటికే పలు సినిమాల్లో హీరోగా మెప్పిస్తున్నాడు. ఫిబ్రవరి 2న బూట్‌కట్ బాలరాజు సినిమా కూడా విడుదల కానుంది. తాజాగా అమర్దీప్ చౌదరి కూడా హీరోగా తన అదృష్టాన్ని మరోసారి పరీక్షించుకోనున్నాడు. ఆయన గతంలోనే ‘ఐరావతం’ అనే సినిమాలో కనిపించిన విషయం తెలసిందే. ఇందులో ప్రముఖ మోడల్ తన్వీ నేగితో పాటు ఎస్తేర్ నొరోహా కీలక పాత్రలో కనిపించారు. డిస్నీ ప్లస్ హాట్ స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతున్న ఈ సినిమా ఫర్వాలేదనిపిస్తుంది. అమర్ నుంచి మరోక సినిమా వస్తుందని అఫీషియల్‌గానే ప్రకటన వచ్చేసింది. M3 మీడియా బ్యానర్లో మహేంద్ర నాథ్ కొండ్ల ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రంలో సీనియర్ హీరో వినోద్ కుమార్‌తో పాటు రాజా రవీంద్ర వంటి సీనియర్ నటులు నటిస్తున్నారు. హీరోయిన్గా ఎంట్రీ ఇస్తున్న సుప్రీత అమర్దీప్ హీరోగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో హీరోయిన్ ఎంపిక చాలా క్రేజీగా ఉందని చెప్పవచ్చు. టాలీవుడ్లో సీనియర్ నటిగా ఎంతో గుర్తింపు తెచ్చుకున్న సురేఖ వాణి కూతురు సుప్రీత ఈ చిత్రంలో హీరోయిన్గా ఎంట్రీ ఇవ్వనుంది. వెండితెరపై అడుగుపెట్టకుండానే ఈ బ్యూటీకి భారీగానే పాపులారిటీని సంపాదించుకుంది.. సుప్రీతకు హీరోయిన్ కావాల్సినన్ని అర్హతలు కూడా ఆమెలో ఉన్నాయని చెప్పవచ్చు. ఇన్‌స్టాలో ఈ బ్యూటీకి 8 లక్షలకు పైగానే ఫాలోవర్స్ ఉన్నారు. ఆమె తన అమ్మగారితో కలిసి చేస్తున్న రీల్స్‌కు సోషల్ మీడియాలో విపరీతమైన క్రేజ్ ఉంది. View this post on Instagram A post shared by Revanth Chowdary (@_revanth_chowdhary_) View this post on Instagram A post shared by Bandaru Supritha Naidu (@_supritha_9) -
నా తల్లి ముందే అలాంటి బూతులు వినాల్సి వచ్చింది: అమర్
బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 పలు వివాదాలతో ముగిసింది. హౌస్‌లో అమర్, శోభ,ప్రియాంక (SPY) ఒక బ్యాచ్‌లో ఉంటే.. శివాజీ, ప్రశాంత్, యావర్ (SPA) బ్యాచ్‌లో ఉన్నారు. ఈ రెండు బ్యాచ్‌ల మధ్య పెద్ద గొడవలే జరిగాయి. ఫైనల్‌గా ప్రశాంత్ విన్నర్ అయితే.. అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. కానీ చాలా మంది ప్రేక్షకుల అభిమానాన్ని ఆయన అమర్ పొందాడు. అతను హీరో రవితేజ సినిమాలో ఛాన్స్ వస్తే చాలు అనుకున్నాడు. బిగ్ బాస్ వల్ల ఆ అవకాశం దక్కింది అదే నాకు పెద్ద విజయం అని అమర్ పేర్కొన్నాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అమర్ కారుపై దాడి జరుగుతున్నప్పుడు అతని పరిస్థితి ఎలా ఉందో ఒక ఇంటర్వ్యూలో అమర్ ఇలా తెలిపాడు. 'హౌస్ నుంచి బయటకు రాగానే మా వాళ్లు అందరూ నన్ను దాక్కో అన్నారు... బయట ఏం జరుగుతుందో నాకు అర్థం కాలేదు. నేను ఎందుకు దాక్కోవాలి..? నేను ఏం తప్పు చేశాను అని కారు ఎక్కి స్టార్ట్ అయ్యాం. కారు బయటకు రాగానే చాలామంది నా కారు చూట్టూ తిరుగుతూ ఫోన్ లైట్ ఆన్ చేశారు. నేను కనిపించగానే ఒక్కసారిగా బూతులు తిట్టడం స్టార్ట్ చేశారు. రాళ్లతో కారు అద్దాలు పగలకొట్టారు.. అమ్మ పక్కన ఉండగానే నోటికి ఏదొస్తే అది అనేశారు. తల్లి పక్కన ఉన్నప్పుడు అలాంటి మాటలు ఏ కుమారుడు వినలేడు.. వారందరి కోపం నామీద కదా అని కారు దిగే ప్రయత్నం చేస్తే అమ్మ ఆపింది. నాలుగు దెబ్బలు తిన్నా పర్వాలేదు కానీ ఆ తిట్లు భరించలేకపోయాను. కొందరైతే నా భార్య తేజును తీసుకెళ్తాం అంటూ బూతులు మాట్లాడారు. ఇవే మాటలు మిమ్మల్ని ఎవరైనా అంటే తట్టుకోగలరా..? ఓర్చోకోగలరా..? వారందరి మీదా నేనూ రియాక్ట్ కాగలను, కేసులు పెట్టగలను కానీ వారికీ కుటుంబాలు ఉంటాయని ఆలోచించి వద్దనుకున్నాను. నేను మీకు ఏం పాపం చేశాను..? అదొక గేమ్ మాత్రమే.. హౌస్‌లో కొందరు నన్ను పదేపదే తిట్టినా పెద్దవారు కదా అని ఓర్చుకున్నాను.. వారి వద్ద నేను నిజాయితీగానే మాట్లాడాను.. బ్యాక్ బిచింగ్ చేయలేదు. అని అమర్ తెలిపాడు. అందరిలా తను కూడా సామాన్య కుటుంబం నుంచి వచ్చానని అమర్ పేర్కొన్నాడు. తన నాన్నగారు ఆర్టీసీ ఉద్యోగి అని.. అందులో ఒక మెకానిక్‌గా పనిచేస్తాడని అమర్ తెలిపాడు. సినిమా అంటే అభిమానంతో ఈ పరిశ్రమలోకి వచ్చి నిలదొక్కుకునే ప్రయత్నం చేస్తున్నానని చెప్పాడు. తన అమ్మగారు అనంతపురం జిల్లాలో బీజేపీ మహిళా విభాగం 'మహిళా మోర్చా' లో కార్యకర్తగా పనిచేస్తున్నారని ఆయన చెప్పాడు. -
పల్లవి ప్రశాంత్ అరెస్ట్‌పై మొదటిసారి రియాక్ట్ అయిన అమర్ దీప్
బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అనే ట్యాగ్‌లైన్‌తో ఎంట్రీ ఇచ్చిన పల్లవి ప్రశాంత్ గెలుచుకుంటే రన్నర్‌గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. అంతేకాకుండా అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను కూడా కొందరు దుండగులు ధ్వంసం చేశారు. పోలీసుల సూచనలు పాటించకుండా పల్లవి ప్రశాంత్ ర్యాలీ చేయడం వల్లే ఈ గొడవకు కారణమని పోలీసులు అయన్ను అరెస్ట్ చేసి చంచల్‌గూడ జైలుకు కూడా పంపించారు. ఆపై ప్రశాంత్ బెయిల్ మీద విడుదలయ్యాడు. తాజాగా అమర్ మొదటిసారి బిగ్ బాస్ గురించి రియాక్ట్ అయ్యాడు. 'హౌస్ నుంచి నేను బయటకు రాగానే ఏం జరుగుతుందో అనేది నాకేం అర్థం కాలేదు. అప్పుడు నా మైండ్ బ్లాంక్‌గా ఉంది. అక్కడితోనే ఆ గొడవ ముగిసిపోయింది. బిగ్ బాస్ వల్ల నాకు చాలా మంచి గుర్తింపు వచ్చింది. అంతేకాకుండా అభిమానుల ప్రేమ దొరికింది. అన్నింటికి మించి నా అన్న రవితేజ సినిమాలో ఛాన్స్ దక్కింది. బిగ్ బాస్ విన్నర్ కంటే నాకు రవితేజ సినిమా అవకాశం దక్కడమే గొప్ప విజయం. ఈ షో ద్వారా నాకు కావాల్సిన ఆదరణ దక్కింది. ఇప్పుడు ఎక్కడికెళ్లినా నన్ను గుర్తిస్తారు.. ఇవన్నీ కూడా బిగ్ బాస్ ద్వారా వచ్చిన అచీవ్మెంట్స్ అని నేను భావిస్తాను. పల్లవి ప్రశాంత్ అరెస్ట్ అనేది మిస్ అండర్స్టాండింగ్ వల్లే జరిగింది. ఇప్పుడు ఎలాంటి సమస్య లేదు. కంటెస్టెంట్ల మధ్య ఎలాంటి గొడవలు ఉండవు.. కానీ కొందరు ఫ్యాన్స్ చేస్తున్న పనుల వల్లే ఇలాంటి ఇబ్బందులు ఎదరైతాయి. ఫ్యాన్స్ మధ్య గొడవలు ఉండటం సహజమే.. ఇదీ ఎప్పుడూ ఉండేదే.. నేను విద్యార్థిగా ఉన్నప్పుడు నా అభిమాన హీరోను ఎవరైనా ఒక మాట అంటే గొడవపడే వాళ్లం... కొంత ఆలోచన శక్తి వచ్చాక అవన్నీ వదిలేసి అందరం కలిసి ప్రతి హీరో సినిమా చూసేవాళ్లం.. ఒకరి కోసం తిట్టుకోవడం, గొడవ పడటం లేకుండా అందరూ కలిసి ఆనందంగా ఉండండి.' అని అమర్ అన్నాడు. -
అమర్ రన్నర్ కావడంతో నాగార్జునకు చెడ్డపేరు: శివాజీ
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7లో మూడో స్థానంతో సరిపెట్టుకున్న అక్కసు శివాజీలో కనిపిస్తుంది. అందుకే ఆయన పలు ఇంటర్వ్యూలలో ఇప్పటికీ కూడా అమర్, శోభా పట్ల పలు చిల్లర వ్యాఖ్యలతో పాటు పరుష పదజాలం ఉపయోగిస్తూ మాట్లాడుతున్నాడు. చివరకు అమర్ రన్నర్ ఎలా అయ్యాడో అంటూ చెప్పుకొస్తున్నాడు. బిగ్ బాస్‌లో శివాజీని అన్నిరోజులు ఉంచడమే గొప్ప విషయం అనుకుంటుంటే.. తనను తాను ఎదో గొప్ప అనుకునే భ్రమలో ఇప్పటికీ ఆయన ఉన్నాడు. శివాజీ వల్లే ఈ సీజన్లో ఇంత రచ్చ అయిందని చెప్పేవారు ఎందరో ఉన్నారు. అనవసరంగా తనను ఈ సీజన్లోకి తీసుకున్నారని కూడా పలువురు కామెంట్లు కూడా చేశారు. హౌస్‌లో ఎప్పుడూ కూడా తాను పోతా పోతా అంటాడు, ఆటలు ఆడడు, బెడ్డు వదలడు, పైగా చెయ్యి నొప్పి, మాట్లాడితే వెటకారాలు, నీతిబోధలు. బిగ్ బాస్‌లో ఆయన చేసింది ఇదే కదా.. మరోకటి ఏమైనా ఉంటే చెప్పండి అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు కూడా. గట్టు పంచాయితీలు తీర్చే ఈ పెద్దకు ఇద్దరు పాలేర్లు. వారిద్దరినీ తన చుట్టూ తిప్పుకోవడం.. బిగ్ బాస్‌లో శివాజీ చేసింది ఏమిటి..? నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడం.. ఇప్పడు బిగ్ బాస్ బయట కూడా అదే చేస్తున్నాడు. శోభా శెట్టి గొడవతో తనను నెగిటివ్‌గా చూపించే ప్రయత్నం బిగ్ బాస్ చేశారని తాజాగా శివాజీ సంచలన ఆరోపణ చేశాడు. శోభా శెట్టి పరాకాష్టకు వెళ్లింది. అందుకే మా ఇంట్లో ఆడపిల్లలు అయితే.. అంటూ కోపంగా ప్రవర్తించానని అంటూ శివాజీ ఇలా చెప్పాడు. 'గేమ్ ఒక దశకు వచ్చాక విన్నర్ ఎవరు..? ఎవరెవరికి ఏ స్థానాలు దక్కుతాయో కూడా అంచనా వేశాను. 1, 2, 3 స్థానాల్లో మనం ముగ్గురం ఉండబోతున్నామని ప్రశాంత్ చేతిలో రాశాను. అయితే ఊహించని విధంగా ఒక వ్యక్తిని బిగ్ బాస్ కావాలనే హైలైట్ చేస్తూ వచ్చాడు. బిగ్ బాస్ కూడా అతడిని పొగడడం నాకు నచ్చలేదు. అతను (అమర్) చపాతి చేస్తే బాగుంది నాకు కూడా పంపించు అని బిగ్ బాస్ అంటాడు... నేను ఎంతో కష్టపడి వడలు చేపిస్తే కనీసం ఒక మాట కూడా నాకు దక్కలేదు. పలుసార్లు పౌల్ గేమ్ ఆడిన వ్యక్తిని చివరకు రన్నరప్‌ను చేశారు. ఇలాంటి తప్పిదాల వల్ల నాగార్జున గారికి చెడ్డ పేరు వస్తుంది. ఇదే విషయం నాగ్ సారుకు కూడా త్వరలో చెబుతాను. న్యాయంగా అయితే టాప్ 3లో ప్రశాంత్, నేను, యావర్ ఉండేవాళ్లం.' అని శివాజీ అన్నారు. -
బిగ్ బాస్ అమర్‌పై శివాజీ చెత్త వ్యాఖ్యలు.. ఇవి దేనికి సంకేతం..?
బిగ్ బాస్ తెలుగు సీజన్ -7 ముగిసిపోయి చాలా రోజులే అయింది. విన్నర్ పల్లవి ప్రశాంత్ అరెస్ట్ ఆపై బెయిల్ మీద విడుదల ఇలా పలురకాల వివాదాలతో ఇప్పటికీ అప్పుడప్పుడు ఈ సీజన్ గురించి వార్తలు వస్తునే ఉన్నాయి. ఈ సీజన్లో రన్నర్‌గా ఆమర్ దీప్ ఉంటే టాప్-3లో శివాజీ ఉన్నాడు. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆయన బిగ్ బాస్ గురించి పలు వ్యాఖ్యలు చేశాడు. బిగ్ బాస్ జర్నీలో బాగా ఇబ్బంది పడిన సందర్భం ఎంటి..? అని శివాజీకి ప్రశ్న ఎదురైంది. హౌస్‌లో మాదిరే ఇంటర్వ్యూలో కూడా అమర్ పట్ల ఉన్న కోపాన్ని తన వ్యాఖ్యలతో శివాజీ ఇలా చెప్పాడు. 'ప్రశాంత్, యావర్ విషయంలో నేను స్టాండ్ తీసుకున్న సందర్భాల్లో చాలా సార్లు ఇబ్బంది పడ్డాను. ప్రశాంత్ కెప్టెన్ బ్యాడ్జ్ లాక్కున్నారు. అతను సరిగ్గా హౌస్‌ను హ్యాండిల్ చేయలేకున్నాడు అని అందరూ ఓట్లు వేయడంతో అతని బ్యాడ్జ్‌ను బిగ్ బాస్ తీసుకున్నాడు. ఒక కామన్ మ్యాన్ కెప్టెన్ అయితే సెలబ్రిటీలకు నచ్చట్లేదా అని కోపం వచ్చింది. హౌస్‌లో కొందరు యావర్‌తో గొడవలు పెట్టుకున్నప్పుడు కోపం వచ్చింది. ఫైనల్‌గా నేను ఒకరిని కొట్టేద్దామని అనుకున్న సందర్భం కూడా వచ్చింది. మూడు వారాలుగా బిగ్ బాస్‌లో ప్రశాంత్‌ను మానశికంగా కొందరు టార్చర్ చేశారు. ఆ సమయంలో ప్రశాంత్‌ను అమర్ రెచ్చగొడుతున్నాడు. నేను పక్కనే ఉన్నాను.. నేను వాడి పక్కన ఉంటే ఎవరినీ లెక్క చేయడు. 14 వారంలో అమర్, ప్రశాంత్ మధ్య భారీగా గొడవ జరుగుతుంది. ఆ సందర్భంలో ఆమర్‌ను నాలుగు పీకి వెళ్లిపోదాం అనిపించింది. ప్రశాంత్ భుజం మీద చెయి వేసి అమర్ తోసుకుంటూ వెళ్తున్నప్పుడు నాలో కోపం కట్టలు తెంచ్చుకుంది. గేమ్‌కు బౌండ్ అయి అగ్రిమెంట్లో సంతకం చేశాను కాబట్టి అమర్‌ను ఏం చేయలేకపోయాను. ఆ సమయంలో నా రక్తం మరిగిపోయింది.' అంటూ అమర్‌పై మరోసారి ఇంటర్వ్యూలో శివాజీ రెచ్చిపోయాడు. బిగ్ బాస్ అనేది ఒక గేమ్.. ఒక్కొసారి మాటల వల్ల అదుపు తప్పుతుంటారు. అది సహజం అని అందరికీ తెలుసు.. ఆ తర్వాత మళ్లీ ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ముందుకు వెళ్తారు. అదీ హౌస్ వరకే పరిమితం. అయినా ప్రశాంత్, అమర్ ఇద్దరూ ఎన్ని గొడవలు పడినా మళ్లీ బ్రదర్స్ మాదిరి ఒకటిగా ఉన్న సందర్భాలు చాలానే ఉన్నాయి. బిగ్ బాస్ సీజన్ -7 ముగిసి పోయిన చాప్టర్.. బయటకు వచ్చాక కూడా ఇలా ఒకరిపై విషం చిమ్మడం ఎందుకు శివాజీ.. ఇలాంటి చెత్త వ్యాఖ్యలు చేసి ఏం చెప్పదలుచుకుంటున్నారు. అయినా ప్రశాంత్ కెప్టెన్సీ నచ్చలేదని మీరు కూడా చెప్పారు కదా.. అప్పుడే మరిచిపోతే ఎలా శివాజీ.. అమర్‌ను నువ్వు రెచ్చగొట్టలేదా మానసిక వేదనకు గురి చేయలేదా అంటూ శివాజీపై నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. హౌస్‌లో ఇలాంటి మాటలు మాట్లాడే బయట జనాన్ని రెచ్చగొట్టి అమర మీద దాడి చేయించావు అంటూ పలువురు కామెంట్లు చేస్తున్నారు. అమర్ ఇంటికి వెళ్లి దాడి చేయండి అని ఇలా పరోక్షంగా మళ్లీ రెచ్చగొడుతున్నావా అంటూ శివాజీపై విరుచుకుపడుతున్నారు. అమర్‌పై చేసిన వ్యాఖ్యల వీడియో కింద ఎక్కువ మంది శివాజీని ఏకిపారేసిన కామెంట్లే కనిపిస్తున్నాయి. -
అమర్ కారుపై దాడి.. రియాక్ట్ అయిన ప్రియాంక
బిగ్‌బాస్ తెలుగు సీజన్- 7 ఫైనల్ తర్వాత అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద దుమారమే రేగింది. ఈ సీజన్లో పల్లవి ప్రశాంత్ విన్నర్ కాగా అమర్ దీప్ రన్నర్ అయ్యాడు. బిగ్ బాస్ ఫైనల్ రోజున హౌస్ నుంచి బయటకు వస్తున్న సమయంలో ఆమర్ కారుపై ఒక వర్గం ఫ్యాన్స్ దాడి చేశారు. అశ్విని, గీతూ రాయల్ కారుతో పాటు ఆరు ఆర్టీసీ బస్సులను ధ్వంసం చేశారు. తాజాగా ఈ విషయంపై ఒక యూట్యూబ్ ఛానల్లో ప్రియాంక రియాక్ట్ అయింది. అభిమానులు ఎవరైనా కానీ ఇలా దాడి చేయడం చాలా దారుణమని ఆమె ఇలా తెలిపింది. 'ఫ్యాన్స్ పేరుతో ఇలాంటి చర్యలకు పాల్పడటం చాలా దారుణం. మీకు ఎవరైనా నచ్చకపోతే వారిని వ్యతిరేకించండి.. అందులో తప్పులేదు కానీ ఇలా దాడి చేయడం చాలా హేయం. ఎవరమైనా ఎంతో కష్టపడి ఒక వస్తువును కొంటాము. కానీ ఇలా కొన్ని క్షణాల్లో నాశనం చేయడం కరెక్ట్ కాదు. దాడి సమయంలో కారులోపల మహిళలు ఉన్నారనే ఆలోచన కూడా లేకుంటే ఎలా..? హౌస్‌లో గేమ్ పరంగా మాత్రమే మాలో గొడవలు ఉన్నాయి. టాస్క్ ముగియగానే పల్లవి ప్రశాంత్,యావర్,శివాజీ,అమర్ ఇలా అందరం చాలా బాగా కలిసే ఉండే వాళ్లం. మాలో ఎలాంటి గొడవలు లేవు.' ముఖ్యంగా చివరి 4 వారాల్లో ప్రశాంత్‌తో నాకు మంచి బాండింగ్ ఏర్పడింది. వాడు నిజంగానే భూమి బిడ్డ అని ఆమె తెలిపింది. కానీ ఆ ఇంటర్వ్యూ జరిగిన సమయానికి పల్లవి ప్రశాంత్ అరెస్ట్ కాలేదు.. దీంతో ఆ ఇంటర్వ్యూలో ప్రశాంత్ అరెస్ట్‌పై ఆమెకు ఎలాంటి ప్రశ్నలు ఎదురు కాలేదు. -
బిగ్‌బాస్ రన్నరప్ గొప్పమనసు.. కుటుంబంతో కలిసి ఏం చేశాడంటే?
తెలుగువారి రియాలిటీ షో బిగ్‌బాస్ సీజన్-7 ఈ ఏడాది అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంది. ఆదివారం జరిగిన గ్రాండ్ ఫినాలేలో రైతుబిడ్డ ప్రశాంత్ ట్రోఫిని దక్కించుకోగా.. అమర్దీప్ రన్నరప్‌గా నిలిచాడు. అయితే బిగ్‌బాస్ ముగియడంతో ప్రస్తుతం ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నారు. తాజాగా రన్నరప్ అమర్దీప్ తన కుటుంబంతో కలిసి సొంత జిల్లా అనంతపురం వెళ్లారు. అనంతపురం వెళ్లిన అమర్దీప్ తన ఫ్యామిలీతో కలిసి సేవ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఓ ట్రస్ట్ తరఫున పేద విద్యార్థులు, మహిళలకు దుప్పట్లు అందజేశారు. అక్కడే చిన్నపిల్లలతో కలిసి కేక్ కట్ చేశారు. ఈ కార్యక్రమంలో అమర్‌దీప్‌తో పాటు ఆయన భార్య తేజు, మదర్ కూడా పాల్గొన్నారు. అనంతరం అక్కడికి వచ్చన వారికి భోజనాలు వడ్డించారు. ఈ సందర్భంగా.. దేవుడికి నాకు ఇచ్చిన శక్తిమేరకు తప్పకుండా సాయం చేస్తూనే ఉంటానని అమర్దీప్ తెలిపారు. కాగా.. బిగ్ బాస్ షో ముగిశాక తన ఫ్యామిలీతో కలిసి వెళ్తున్న అమర్దీప్ కారుపై రాళ్లదాడి జరిగిన సంగతి తెలిసిందే. -
బిగ్ బాస్‌పై మానవ హక్కుల కమిషన్‌కు ఫిర్యాదు
బిగ్ బాస్ తెలుగు 7 సీజన్ ఫైనల్ రోజున అన్నపూర్ణ స్టూడియో వద్ద భారీ రచ్చే జరిగింది. బిగ్ బాస్ విన్నర్ ప్రశాంత్ అభిమానులు చేసిన ఫలితంగా అక్కడ గొడవలు జరిగాయని పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. ఇలా అన్నపూర్ణ స్టూడియో వద్ద పెద్ద గొడవే జరిగింది. ఇప్పటికే బిగ్ బాస్ షోను బ్యాన్ చేయాలని పలువురు ప్రముఖులు కామెంట్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా బిగ్ బాస్ షో గురించి తెలంగాణ మానవ హక్కుల కమిషన్‌కు (HRC ) హైకోర్టు న్యాయవాది అరుణ్ ఫిర్యాదు చేశారు. బిగ్ బాస్ షో అనేది ప్రజలపై తీవ్రమైన ప్రభావం చూపుతుందని ఆయన పేర్కొన్నారు. బిగ్ బాస్ ఫైనల్ రోజున అక్కడ జరిగిన గొడవపై రెండు కేసులు నమోదు అయ్యాయి. కానీ ఎక్కడ హీరో నాగార్జున పేరు లేదు. ఈ కేసులలో నాగార్జున పేరును కూడా చేర్చాలి. అయన కూడా ఈ గొడవలకు బాద్యులే. అంత గొడవ బిగ్ బాస్ నిర్వాహకులు నిర్లక్ష్యం వహించారు. దీంతో 6 ఆర్టీసీ బస్సులు, కార్లు ధ్వంసం అయ్యాయి. ఇప్పటికే ఇదే విషయంపై హైకోర్టుకు లేఖ రాశాను. నాగార్జునను కూడా వెంటనే అరెస్ట్ చెయ్యాలి.' అని ఆయన కోరారు. కేసుల విషయాలు.. బిగ్ బాస్ తెలుగు ఏడో సీజన్లో పాల్గొన్న అమర్దీప్, అశ్విని, అక్కడే ఉన్న మరో సెలబ్రిటీ గీతూ రాయల్ కార్ల మీద దాడి జరిగింది. వారి కార్ల అద్దాలు పగిలాయి. దీంతో గీతూ రాయల్ పోలీస్ స్టేషన్లో కేసు కూడా పెట్టారు. ఆ తరువాత ఆరు ఆర్టీసీ బస్సులు, ఒక పోలీసు వాహనంపై కూడా దాడి చేశారు. పోలీసులు సుమోటోగా ఈ కేసు పెట్టారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితులను గుర్తించే పనిలో ఉన్నారు. జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో 147, 148, 290, 353, 427 r/w 149 IPC, సెక్షన్ 3 PDPP AC కింద కేసులు పెట్టారు. మొత్తం రెండు కేసులు ఉండగా ఒకదానిలో పల్లవి ప్రశాంత్ పేరు ఉన్నట్లు సమాచారం. -
నేనైతే కారుతో గుద్దిపడేసేవాడిని.. అమర్ విషయంపై సోహైల్ ఫైర్
బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్‌ను రైతుబిడ్డ అని చెప్పుకుంటున్న పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు. ఈ సీజన్ రన్నర్‌గా బుల్లితెర నటుడు అమర్ దీప్ ఉన్నాడు. బిగ్ బాస్‌లో ఉన్న సమయంలో వీరిద్దరి మధ్య పెద్ద మాటల యుద్ధమే జరిగింది. కానీ వారిద్దరూ మళ్లీ ఒకటిగా సొంత బ్రదర్స్ మాదిరి కలిసిపోయే వారు. అయితే బిగ్‌బాస్ సీజన్ 7 టైటిల్ విన్నర్‌ను ప్రకటించిన తర్వాత అమర్, ప్రశాంత్ అభిమానుల మధ్య గొడవ జరిగింది. ఆ గొడవ కాస్త అమర్దీప్ కారుపై దాడి చేసే వరకు వెళ్లింది. ఆ సమయంలో కారులో తన కుటుంబ సభ్యులతో కలిసి అమర్ ఉన్నాడు. ఈ విషయంపై చాలామంది రియాక్ట్ అవుతున్నారు. తాజాగా సయ్యద్ సోహైల్ రియాక్ట్ అయ్యాడు. 'ఒక వ్యక్తిపై అభిమానం ఉండాలి కానీ ఉన్మాదం పనికిరాదు.. అమర్ కారుపై దాడి చేసింది అందరూ కూడా యువకులే. మనకు ఉద్యోగాలు లేక ఇలా ఎన్నో ఇబ్బందులు పడుతున్నాము. ఇలాంటి పనులు చేసి తల్లిదండ్రులకు చెడ్డపేరు తీసుకు రాకండి. అభిమానం ముసుగులో ఇలా అమర్‌పై దాడి చేయడం ఎంత వరకు కరెక్ట్... ఆ దాడి సమయంలో అమర్‌తో పాటు ఆయన అమ్మగారు, భార్య తేజు ఉన్నారు. వారి కారును చుట్టుముట్టి అద్దాలు పగులకొట్టి ఆపై వారందరినీ నోటికి వచ్చిన బూతులు తిట్టారు. అమర్ భార్య, అమ్మగారిని చెప్పలేని పదాలతో తిట్టారు. మరోకడు అయితే ఆ బూతులు వినలేడు కూడా.. అలాంటి పదాలతో తిట్టడం ఎంత వరకు కరెక్ట్... నేను కూడా ఒక కొడుకుగా చెబుతున్నా.. ఇలాంటి మాటలు నాకే ఏదురైతే గనుకా ఆ సమయంలో కారుతోనే గుద్దిపడేసేవాడిని తర్వాత ఏదైతే అది జరగని.. తన తల్లిదండ్రులను అంటే ఎవరిలోనైనా ఇదే అభిప్రాయం వస్తుంది. భార్య, అమ్మను తన ముందే ఇలా తిడితే ఎవడూ సహించడు. కారుతో అలానే గుద్ది పారేస్తాడు.. కానీ అమర్ సైలెంట్‌గా వెళ్లిపోయాడు. నిజానికి వాడు చాలా మంచోడు ఇండస్ట్రీలో ఎవరినీ అడిగినా అదే చెబుతాడు.. అంత గొడవ జరిగినా తర్వాత కూడా తన అమ్మ, భార్య జోలికి మాత్రం రాకండి. ఏమైనా చేయాలనుకుంటే తనను మాత్రమే చేసుకోండి అని చెప్పాడు. ఇంతలా ఒక మనిషిని ఇబ్బంది పెట్టడం దేనికి..?' అని సోహైల్ రియాక్ట్ అయ్యాడు. -
పరారీలో బిగ్‌బాస్ విజేత పల్లవి ప్రశాంత్!
హైదరాబాద్: పబ్లిక్ న్యూసెన్స్‌కు కారకుడైన బిగ్‌బాస్ సీజన్–7 విజేత గొడుగు పల్లవి ప్రశాంత్ కోసం జూబ్లీహిల్స్ పోలీసులు గాలింపు చేపట్టారు. ప్రస్తుతం ఆయన పరారీలో ఉండగా ఫోన్ కూడా స్విచ్చాఫ్‌లో ఉండటంతో అతడి అనుచరులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. గజ్వేల్ సమీపంలోని కొలుగూరు గ్రామానికి చెందిన పల్లవి ప్రశాంత్ ఆదివారం రాత్రి జరిగిన బిగ్‌బాస్–7 విజేతగా ఎంపిక కాగా, అమర్దీప్ రన్నరప్‌గా నిలిచారు. ఈ నేపథ్యంలో ఇద్దరి అభిమానులు పెద్ద సంఖ్యలో జూబ్లీహిల్స్‌రోడ్ నె.ం 5లోని అన్నపూర్ణ స్టూడియో వద్దకు చేరుకుని నినాదాలు చేయడంతో ఉద్రిక్తత చోటు చేసుకుంది. అమర్‌దీప్‌ను విజేతగా ప్రకటించ కపోవడంతో ఆయన అభిమానులు గొడవకు దిగారు. మరోవైపు పల్లవి ప్రశాంత్ అభిమానులు వేలాదిగా అక్కడికి చేరుకుని నినాదాలు చేస్తూ అమర్దీప్ కారును ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా ఇరువర్గాలు పరస్పర దాడులకు దిగడమేగాక అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సులపై రాళ్లు రువ్వి ధ్వంసం చేశారు. బయట గొడవ జరుగుతున్నట్లు గుర్తించిన బిగ్‌బాస్ యాజమాన్యం పల్లవి ప్రశాంత్‌ను స్థానిక పోలీసుల సహకారంతో రహస్య మార్గం నుంచి బయటికి పంపించింది. మళ్లీ ఇటు వైపు రావొద్దని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు. అయితే పల్లవి ప్రశాంత్ ఇటు పోలీసుల ఆదేశాలను, అటు బిగ్‌బాస్ యాజమాన్యం సూచనలను బేఖాతర్ చేస్తూ గొడవ జరుగుతున్న ప్రాంతానికి ఓపెన్ టాప్ జీప్‌పై చేరుకోవడంతో రావడంతో పరిస్థితి మరింత ఉద్రిక్తంగా మారింది. ఇరు వర్గాల మద్దతుదారులు రాళ్లు రువ్వుతూ మహిళా కంటెస్టెంట్లపై దాడి చేసి బీభత్సం సృష్టించారు. ఇందుకు కారకుడైన పల్లవి ప్రశాంత్‌పై జూబ్లీహిల్స్ పోలీసులు పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మంగళవారం ఈ విషయం తెలుసుకున్న పల్లవి ప్రశాంత్ ఫోన్ స్విచ్చాఫ్ చేసి పోలీసులకు దొరక్కుండా పరారయ్యాడు. దీంతో అతడి సోదరుడు పరుశరాములు కోసం పోలీసులు ఒక బృందాన్ని స్వగ్రామానికి పంపించారు. కారు డ్రైవర్ సాయి కిరణ్‌ను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. పల్లవి ప్రశాంత్ కోసం ప్రత్యేకంగా మూడు బృందాలు ఏర్పాటు చేశారు. ఆయన అనుచరుల ఫోన్ డేటాను సేకరించారు. కొమరవెల్లి సమీపంలోని ఓ గ్రామంలో పల్లవి ప్రశాంత్ ఉన్నట్లుగా గుర్తించిన పోలీసులు అక్కడికి కూడా ఓ బృందాన్ని పంపించనున్నారు. ఇదిలా ఉండగా బస్సులపై రాళ్లు రువి్వన వ్యక్తులను గుర్తించేందుకు సీసీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ఇందుకోసం 15 మంది పోలీసులు ఆయా ప్రాంతాల్లోని సీసీ ఫుటేజీలను వడపోస్తున్నారు. -
నాకేం జరిగినా భయపడను..
-
నా కుటుంబంతో సహా రోడ్డుపై నిల్చోబెట్టారు.. నాకేం జరిగినా పర్లేదు.. కానీ: అమర్దీప్
బిగ్ బాస్ సీజన్లో రైతుబిడ్డ తర్వాత పోటీలో నిలిచిన కంటెస్టెంట్ అమర్దీప్. హౌస్‌లో ఫుల్ అగ్రెసివ్‌గా కనిపించిన అమర్.. ఈ సీజన్ రన్నరప్‌గా నిలిచారు. రైతుబిడ్డతో చివరి వరకు పోటీపడిన అమర్దీప్ రన్నర్‌గా బయటికొచ్చాడు. అ?అయితే మాస్ మహారాజా రవితేజ సినిమాలో ఛాన్స్ కొట్టేసిన అమర్.. అంతే సంతోషంగా బిగ్ బాస్ హౌస్ నుంచి తన ఇంటికి బయలుదేరాడు. కానీ ఊహించని విధంగా అతని కారుపై జరిగిన దాడి అతని అభిమానులకు తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసింది. స్టూడియో బయట జరిగిన రాళ్లదాడితో అమర్ కుటుంబసభ్యులు, ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఈ నేపథ్యంలో అమర్దీప్ ఈ ఘటనపై తొలిసారి మాట్లాడారు. ఈ మేరకు తన యూట్యూబ్ ఛానెల్లో ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇంతకీ అమర్దీప్ ఏమన్నారో తెలుసుకుందాం. అమర్దీప్ మాట్లాడుతూ.. 'అందరికీ నమస్కారం. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు. రెండు రాష్ట్రాల తెలుగు ప్రజలకు పాదాభివందనం. మీలో ఒక్కడిగా నన్ను చూశారు. ఇంతకన్నా నేను చెప్పుకోవడానికి ఏం లేదు. గెలవలేను అనుకున్నవాన్ని..గెలుపుదాకా తీసుకొచ్చి గెలిపించారు. ఇంతకు మించిన అదృష్టం లేదు. ఈ విషయంలో నేను ఫీల్ అవ్వాల్సిన లేదు. కానీ ఇక్కడ బాధాకరమైన విషయం ఎంటంటే.. చాలామంది నన్ను అడుగుతున్నారు. నేను ఈ విషయాన్ని చెప్పాలని కూడా అనుకోలేదు. బాధలో ఉండిపోయాను' అని అన్నారు. రాళ్లదాడిని ప్రస్తావిస్తూ..' కారు అద్దాలు పగలగొట్టారు.. బయటికి రా.. నీ అంతు చూస్తాం అన్నారు. నేను ఒక్కడినే ఉన్నప్పుడు మీ ఇష్టం వచ్చింది చేసుకోండి. నాకేం భయం లేదు. ఎవరికీ భయపడను. భయపడాల్సిన అవసరం లేదు. కానీ మన ఇంట్లో కూడా అమ్మ, అక్క, చెల్లి, భార్య ఉంటుంది. వాళ్లు మన పక్కన ఉన్నప్పుడు ఎలా ప్రవర్తించాలి అని ఆలోచిస్తే బాగుండు అని నా అభిప్రాయం. కారు అద్దం పగలగొట్టినప్పుడు ఆ గాజు పెంకులన్నీ మా అమ్మ, భార్య తేజు మీద పడ్డాయి. ఎవరికీ ఏం కాలేదు కాబట్టి సరిపోయింది. రాళ్లదాడి వల్ల ఏదైనా జరిగి ఉంటే ఈ రోజు నేను ఎవరినీ కోల్పోయేవాడినో నాకు తెలియదు' అని ఆవేదన వ్యక్తం చేశాడు. అప్పుడే నేను గెలిచా.. ఇలాంటివీ ఎవరికీ జరగకూడదు. ఇంకెప్పుడు ఇలా చేయకండి. మీకు కోపముంటే తిట్టండి పడతాను. కామెంట్స్ పెట్టండి చూస్తాను. ఇంకా కోపముంటే వీడియోలు తీసి పెట్టండి. ఎలాగో పెట్టారు. నా కుటుంబాన్ని మొత్తం బాధపెట్టారు. అయినా నేను ఏది పట్టించుకోవడం లేదు. నేను అభిమానించే హీరో మాస్ మహారాజా రవితేజ గారే వచ్చి సినిమాలో అవకాశమిచ్చారు. అప్పుడే నేను గెలిచా. ఆ గెలుపుతోనే బయటికి వచ్చాను' అని అన్నారు. చాలా బాధేసింది.. కారు దాడిపై స్పందిస్తూ.. 'కానీ ఆనందంతో బయటకు వస్తాననుకున్న నన్ను నా కుటుంబంతో సహా రోడ్డుపై నిల్చోబెట్టారు. ఆ విషయంలో చాలా బాధేసింది. అయిన ఫర్వాలేదు. ఆ దేవుడు, అభిమానుల దయవల్ల మా ఇంట్లో వాళ్లకి ఏం కాలేదు. నాకు ఏం అయినా ఫర్వాలేదు. మన ఫ్యామిలీ పక్కన ఉన్నప్పుడు దయచేసి ఆలోచించండి. కప్పుపోతే తిరిగి తెచ్చుకోవచ్చు. డబ్బు పోతే తిరిగి సంపాదించుకోవచ్చు. కానీ మనిషి పోతే తిరిగి తీసుకురాలేం. ఈ విషయాన్ని గుర్తు పెట్టుకోండి. చాలా రిక్వెస్ట్‌గా అడుగుతున్నా. దయచేసి ఇలా ఎవరిమీద ఇలా ప్రవర్తించకండి. నా మీద మీకు ఏదైనా కోపం ఉంటే చెప్పండి. ఎక్కడికి రమ్మన్నా వస్తా. కానీ దయచేసి ఇలా మాత్రం ఎవరికీ చేయకండి. థ్యాంక్యూ ఆల్. అందరికీ ధన్యవాదాలు' అని వీడియోలో వెల్లడించారు. కాగా.. బిగ్‌బాస్ షో ముగిసిన అనంతరం అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లతో పాటు ఆర్టీసీ బస్సులపై రాళ్ల దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
BB7 RunnerUp Amardeep Photos: సింపుల్ లుక్‌లో బీటెక్ బాబు అమర్దీప్ (ఫోటోలు)
-
' ఆయన చేసిందేమీ లేదు.. మీరు అనవసరంగా పైకెత్తకండి..'.. అమర్దీప్ కామెంట్స్!
ఉల్టా- పుల్టా అంటూ మొదలైన బిగ్‌బాస్ సీజన్-7కు ఆదివారం ఎండ్‌కార్డ్ పడింది. అందరూ అనుకున్నట్లుగానే సింపతీ వర్కవుటై రైతుబిడ్డ విన్నర్‌గా నిలిచాడు. ఈ సీజన్ రియాలిటీ షో రన్నరప్‌గా అమర్దీప్ స్థానం దక్కించుకున్నాడు. అయితే దాదాపు వంద రోజులకు పైగా తెలుగు ప్రేక్షకులను అలరించిన ఈ షో గ్రాండ్‌గా ముగిసింది. ఈ షో అనంతరం బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ ఇంటర్వ్యూ ఇవ్వడం కామన్. అందరిలాగే రన్నరప్ అమర్దీప్ సైతం ఇంటర్వ్యూకు హాజరైన ప్రోమో రిలీజైంది. ఈ ప్రోమోలో ఇంటిసభ్యుల గురించి అమర్దీప్ ఆసక్తికర విషయాలు పంచుకున్నారు. అమర్దీప్ మాట్లాడుతూ.. 'మొదటి 5 వారాలకే నా ఫర్మామెన్స్‌కు ఎలిమినేట్ అయిపోతానని డిసైడ్ అయిపోయా. రన్నరప్ అయినప్పటికీ నాకు ఎలాంటి ఫీలింగ్ కలగలేదు. నేను ఎవరినైతే దేవుడిగా భావించానో ఆయనే కోట్ల ప్రజల ముందు ఒక అభిమానిగా నన్ను గుర్తించాడు. నా దృష్టిలో నేను గెలిచాను. శోభాశెట్టి, ప్రియాంక విషయాకొనిస్తే నాకు ఇద్దరు సమానమే. ఒకరు ఎక్కువ కాదు.. ఒకరు తక్కువ కాదు.' అని అన్నారు. ఆ తర్వాత శివాజీ హౌస్‌లో ఉండగానే ప్రశాంత్‌ను విన్నర్‌ను చేసే పోతానని చెప్పారు కదా.. దీనికి మీ సమాధానమేంటి? అని అమర్‌దీప్‌ను యాంకర్ ప్రశ్నించారు. దీనికి బదులిస్తూ.. ' మీరు అలా చెప్పి అనవసరంగా ఆయన్ను పైకి లేపకండి'.. ఆయన గేమ్ ఆడుకుని బయటికి వెళ్లిపోయాడు. ప్రశాంత్ తన గేమ్ తాను ఆడుకున్నాడు. కప్ కొట్టాడు అంతే' అని చెప్పారు. ఆ తర్వాత శివాజీ హౌస్‌లో లేకపోతే యావర్, ప్రశాంత్‌ను మీరంతా ఎప్పుడో తొక్కేసేవాళ్లా? అని మరో ప్రశ్న ఎదురైంది. దీనికి బదులిస్తూ.. 'నీ బలమేంటో తెలుసుకో.. పక్కోన్ని నమ్ముకో.. పక్కన పెట్టుకో.. ముందుకు రా..' అని సమాధానమిచ్చాడు. దీంతో ప్రోమో ముగిసింది. అయితే ఈ షో ముగిసిన తర్వాత అమర్దీప్, అశ్విని, గీతూ రాయల్ కార్లపై దాడి జరిగిన సంగతి తెలిసిందే. -
జనం చూశారు.. అమర్‌కు జై కొట్టారు, శివాజీనీ ఛీ కొట్టారు!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో 19 మంది కంటెస్టెంట్లు అడుగుపెట్టారు. వీరందరూ తమకు తోచిన ఆట ఆడారు. హౌస్‌లో ఉండేందుకు ప్రయత్నించారు. కానీ షో ముందుకు సాగాలంటే ఎవరో ఒకరు ఎలిమినేట్ అవ్వాల్సిందే! అలా ఒక్కొక్కరు ఎలిమినేట్ అవుతూ పోగా గ్రాండ్ ఫినాలే వచ్చేసరికి ఆరుగురు మిగిలారు. ఇక్కడ విచిత్రం ఏంటంటే.. షోలో కొనసాగడం కోసం కష్టపడ్డ ఎంతోమంది ముందే ఎలిమినేట్ అయిపోగా.. ఏమాత్రం కష్టపడకుండా సోఫాలో సేద తీరుతూ.. బిగ్‌బాస్‌కే ఆర్డర్లు వేసిన శివాజీ మాత్రం టాప్ 3 వరకు వచ్చాడు. పగతో రగిలిపోయాడు.. ఈయనది మాస్టర్ మైండ్ అని నాగ్ అన్నారు. నిజమే, శివాజీ అంత కన్నింగ్ మాస్టర్ మైండ్ బిగ్‌బాస్ చరిత్రలోనే ఎవరికీ లేదు. ఒకరి మీద పగపెట్టుకుని ద్వేషంతో రగిలిపోతూ కుట్రలు పన్నుతూ పైకి మాత్రం ఏమీ ఎరుగనివాడిలా నటించడం ఆయనకే సాధ్యమైంది. శివాజీ హౌస్‌లో చేసింది రెండే రెండు. ఒకటి.. అమర్‌ను టార్గెట్ చేయడం. రెండు.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లను తన గుప్పిట్లో పెట్టుకోవడం. కామన్ మ్యాన్‌కు సపోర్ట్ చేస్తే జనాల్లో తనకు మంచి గుర్తింపు వస్తుందనుకున్నాడు. అందుకే రైతుబిడ్డను, అలాగే నటుడిగా పెద్ద గుర్తింపు లేని ప్రిన్స్ యావర్‌ను తన గ్రూపులో చేర్చుకున్నాడు. టాస్కుల్లో విజృంభించి ఆడేది వీళ్లిద్దరే కాబట్టి వీళ్లేది సాధించినా అది తన ఖాతాలోనే వేసుకునేవాడు. మానసికంగా వేధించిన ఛీవాజీ బిగ్‌బాస్ 7 మొదలైనప్పుడే అమర్ టైటిల్ ఫేవరెట్‌గా హౌస్‌లో అడుగుపెట్టాడు. ఈ విషయం తెలిసిన శివాజీ అతడి గురించి అంతా రీసెర్చ్ చేసి మరీ తనను టార్గెట్ చేయడం మొదలుపెట్టాడు. తనను ఎప్పుడూ కిందకు లాగాలని చూశాడు. సూటిపోటి మాటలతో వేధించాడు. లక్షలాది మంది ప్రేక్షకులు చూసే షోలో అతడిని పనికిరాని వెధవగా చిత్రీకరించాడు. తను ఏం చేసినా తప్పనేవాడు. శివాజీ కుట్రలు తెలియని అమర్దీప్ అతడిని మాత్రం గురువుగానే భావించాడు. ఈ వంకతో మరింత చనువు తీసుకున్న సోఫాజీ.. అమర్ మీద ఎన్నోసార్లు విషం కక్కాడు. ఏదైనా అంటే సరదాగా అన్నానని తప్పించుకునేవాడు. డమ్మీ చాణక్య.. జనం చూశారు! పదేపదే జనం చూస్తున్నారు అని చెప్పే శివాజీ.. తను అనే మాటలను, తన చేష్టలను జనం పట్టించుకోరనుకున్నాడేమో! కానీ జనం చూశారు. ఈ డమ్మీ చాణక్య పన్నాగాలు తెలుసుకున్నారు. ఒకరిని కిందకు లాగాలనుకుంటే ఏం జరుగుతుందో కళ్లకు కట్టినట్లు చూపించారు. అమర్‌కు జై కొట్టి రెండో స్థానంలో నిలబెట్టాడు. అతడిని తొక్కేయాలని చూసిన శివాజీని మూడో స్థానానికే పరిమితం చేశారు. ఇక్కడే శివాజీ ఓడిపోయాడు. అమర్‌కు వేస్ట్ ఫెలో, పనికిమాలినోడు, వెధవన్నర వెధవ, పిచ్చి పోహ.. ఇలా ఎన్నో బిరుదులిచ్చాడు. మరి అతడి చేతిలో ఓడిపోయిన శివాజీని ఏమని పిలిస్తే బాగుంటుందో అతడికే తెలియాలి. వాళ్లు లేకపోయుంటే శివాజీ 'జీరో' పోనీ శివాజీ హౌస్‌లో పెద్దగా పొడిచేసిందేమైనా ఉందా? అంటే అదీ లేదు. ఒక టాస్క్ ఆడలేదు, ఎంటర్టైన్మెంట్ అసలే చేతకాలేదు. పైగా ఆడలేక మద్దెల దరువు అన్నట్లు ప్రతిసారి తన చేయినొప్పిని సాకుగా చూపిస్తూ ఎంచక్కా ట్రిప్పుకు వచ్చినట్లు సోఫాలో సెటిలై గేమ్ చూస్తూ ఎంజాయ్ చేశాడు. సీజన్ అంతా చేయినొప్పినే చూపిస్తూ సింపతీ ఓట్లు సంపాదించుకున్నాడు. ప్రశాంత్‌ను విన్నర్ చేసింది తానే అని విర్రవీగుతున్న శివాజీ ఈ రోజు కనీసం టాప్ 3లో అయినా ఉన్నాడంటే అందుకు కారణం.. ప్రశాంత్, ప్రిన్స్ యావర్లే! ఇది ఎవరూ కాదనలేని నిజం! వాళ్లు లేకపోయుంటే శివాజీ 'జీరో'. చదవండి: ప్రశాంత్‌ను కారు దిగనివ్వని పోలీసులు.. రైతుబిడ్డను అన్నా.. ఇట్ల చేస్తే ఎలా? -
అన్నపూర్ణ స్టూడియో దగ్గర అర్థరాత్రి ఉద్రిక్తత
-
‘ఇదేం అభిమానం!’ బిగ్‌బాస్ గొడవపై కేసు నమోదు
సాక్షి, హైదరాబాద్: బిగ్‌బాస్-7లో రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఫినాలే పూర్తి అయిన తర్వాత కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో అమర్ ఫాన్స్, పల్లవి ప్రశాంత్ అభిమనులు గొడవకు దిగారు. అయితే ఈ గొడవలో ఆర్టీసి బస్సుల అద్దాలను ఫాన్స్ ధ్వంసం చేశారు. తాజాగా ఈ ఘటనపై టీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ స్పందించారు. ‘‘అభిమానం పేరుతో చేసే పిచ్చి చెష్టలు సమాజానికి శ్రేయస్కరం కాదు. ప్రజలను సురక్షితంగా, క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చే ఆర్టీసీ బస్సులపై దాడి చేయడమంటే సమాజంపై దాడి చేసినట్టే. ఇలాంటి ఘటనలను టీఎస్ఆర్టీసీ యాజమాన్యం ఏమాత్రం ఉపేక్షించదు. టీఎస్ఆర్టీసీ బస్సులు ప్రజల ఆస్తి. వాటిని కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉంది’’ అని ఆయన ఎక్స్‌లో పేర్కొన్నారు. ఫాన్స్ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో టీఎస్ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు. బాధ్యులపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇదేం అభిమానం! బిగ్ బాస్-7 ఫైనల్ సందర్భంగా హైదదాబాద్ లోని కృష్ణానగర్ అన్నపూర్ణ స్టూడియో సమీపంలో ఆదివారం రాత్రి #TSRTC కి చెందిన బస్సులపై కొందరు దాడి చేశారు. ఈ దాడిలో 6 బస్సుల అద్ధాలు ద్వంసం అయ్యాయి. ఈ ఘటనపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో ఆర్టీసీ అధికారులు ఫిర్యాదు చేశారు.… pic.twitter.com/lJbSwAFa8Q — VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) December 18, 2023 -
Bigg Boss 7: అమర్దీప్ కారుపై రైతుబిడ్డ ఫ్యాన్స్ దాడి.. అద్దాలు ధ్వంసం
బిగ్‌బాస్ 7 పూర్తయిపోయింది. రైతుబిడ్డ ట్యాగ్‌తో హౌసులోకి వచ్చిన పల్లవి ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అమర్ రన్నరప్‌గా నిలిచాడు. ఇక్కడివరకు బాగానే ఉంది. కానీ ఫినాలే పూర్తయిన తర్వాత అమర్ ఫ్యాన్స్ vs రైతుబిడ్డ ఫ్యాన్స్ గొడవకు దిగారు. ఈ క్రమంలోనే అమర్ కారుతో పాటు మరో ఇద్దరి సెలబ్రిటీలు కారు అద్దాలు ధ్వంసం అయ్యాయి. అలానే ఆర్టీసీ బస్సుని కూడా వదల్లేదు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ విన్నర్ ప్రశాంత్.. మొత్తం ఎన్ని లక్షలు సంపాదించాడంటే?) అసలు విషయానికొచ్చేస్తే.. బిగ్‌బాస్ అనేది గేమ్ షో. కానీ అభిమానులు అని చెప్పుకు తిరిగే వాళ్లకు అవేమి పట్టవు. ఈ సీజన్లో నామినేషన్స్‌లో భాగంగా అమర్, ప్రశాంత్ మధ్య చాలాసార్లు వాదన జరిగింది. అయితే అదంతా కూడా గేమ్‌లో భాగమని అర్థం చేసుకోలేకపోయిన ఈ పిచ్చి ఫ్యాన్స్.. అమర్ కుటుంబ సభ్యులని సోషల్ మీడియాలో వేధించడం మొదలుపెట్టారు. కొన్నాళ్లకు అక్కడ సైలెంట్ అయ్యారు. ఇప్పుడు ఫినాలే ముగిసిన తర్వాత అమర్ తన కారులో ఇంటికి వెళ్లిపోతుంటే.. అతడి కారుపై పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ దాడికి దిగారు. వెనకవైపు అద్దం ధ్వంసం చేశారు. అలానే మరో కంటెస్టెంట్ అశ్విని, వీళ్లందరినీ ఇంటర్వ్యూలు చేసిన గీతూ రాయల్ కారుని కూడా పల్లవి ప్రశాంత్ ఫ్యాన్స్ ధ్వంసం చేశారు. దీంతో గీతూ.. పోలీస్ కేసు పెట్టింది. ఇది కాదన్నట్లు అన్నపూర్ణ స్టూడియోస్ బయట ప్రశాంత్, అమర్ ఫ్యాన్స్ కొట్టుకున్నారు. ఈ క్రమంలోనే ఆర్టీసీ బస్ అద్దాలు ధ్వంసం అయ్యాయి. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. (ఇదీ చదవండి: బీటెక్ కుర్రాడు అమర్.. బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?) View this post on Instagram A post shared by ❤HD EDITS❤ (@_hd__edits) View this post on Instagram A post shared by Ashwini Sree (@ashwinii_sree) -
బీటెక్ కుర్రాడు.. బిగ్‌బాస్ ద్వారా ఎంత సంపాదించాడంటే?
ప్రతి సీజన్లో ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు ఒకరుంటారు. అలా ఈ సీజన్లో అమర్దీప్ ఉన్నాడు. షో ప్రారంభంలో తడబడ్డా తర్వాత నెమ్మదిగా పుంజుకున్నాడు. అయితే కొన్ని సార్లు తన మాటలతో పాటు ఆటల్లో తెలిసీతెలియక చేసిన తప్పుల వల్ల నలుగురిలో నవ్వులపాలయ్యాడు. అంతేకాకుండా శత్రువులు ఎక్కడో ఉండరు.. మన పక్కనే ఉంటారన్నది అమర్ విషయంలో నిజమైంది. మెంటల్ టార్చర్‌ను చిరునవ్వుతో భరించాడు కొన్నిసార్లు స్నేహితులు సైతం తనను పట్టించుకోలేదు. గురువుగా భావించే శివాజీ అయితే అమర్‌ను అనరాని మాటలన్నాడు.. మెంటల్ టార్చర్ పెట్టాడు. అయినా అన్నింటినీ చిరునవ్వుతో భరించాడు. అనారోగ్యంతో బాధపడుతున్నా ఏనాడూ బయటకు చెప్పుకోలేదు. హెల్త్ ప్రాబ్లమ్ వల్ల టాస్కులు ఆడలేకపోయినా అది తన వైఫల్యంగానే భావించాడే కానీ అనారోగ్యాన్ని సాకుగా చెప్పలేదు. విజయానికి అడుగు దూరంలో ఆగిపోయిన అమర్ రన్నరప్‌గా నిలిచాడు. వారానికి రూ.2.5 లక్షలు మరి ఈ అనంతపురం కుర్రాడు ఎంత సంపాదించాడో తెలుసా? షోలోకి రావడానికి ముందే సీరియల్స్ ద్వారా బోలెడంత గుర్తింపు ఉంది. కనుక అమర్‌దీప్‌కు భారీగానే డబ్బులు ఆఫర్ చేశారు. వారానికి రూ.2.5 లక్షలు ఇచ్చారట! ఈ లెక్కన 15 వారాలకుగానూ రూ.37,50,000 అందుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో ట్యాక్స్‌లు, జీఎస్టీల రూపంలో దాదాపు సగం ప్రభుత్వమే లాగేసుకుంటుంది. చదవండి: బిగ్‌బాస్ 7 విజేతగా ప్రశాంత్.. ప్రైజ్‌మనీ ఎంతంటే? -
Bigg Boss 7 Finale Highlights: బిగ్‌బాస్ 7వ విజేతగా రైతుబిడ్డ ప్రశాంత్
105 రోజులకు పైగా ప్రేక్షకుల్ని అలరించిన బిగ్‌బాస్ 7 షోకి ఎట్టకేలకు పూర్తయింది. ఆదివారం అంగరంగ వైభవంగా గ్రాండ్ ఫినాలే జరిగింది. ఫినాలేకి అమర్దీప్, ప్రశాంత్, శివాజీ, ప్రియాంక, యావర్, అర్జున్ మిగిలారు. వీరిలో రైతుబిడ్డ ప్రశాంత్ విజేతగా నిలిచాడు. అలానే ఆదివారం ఎపిసోడ్లో చాలా అంటే చాలా ఎంటర్టైన్మెంట్ అందించారు. అవేంటో ఓ లుక్కేసేయండి. ►'కేజీఎఫ్' సినిమాలో మంచి ఎలివేషన్ సాంగ్‌తో నాగార్జున.. ఫినాలే ఎపిసోడ్లో గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. బ్లాక్ సూట్లో రాయల్ లుక్‌లో కనిపించి, ప్రేక్షకుల్ని మెస్మరైజ్ చేశాడు. ►ఇక ఫినాలే కోసం వచ్చిన ఈ సీజన్ మిగిలిన హౌస్మేట్స్ అందరూ హిట్ సాంగ్స్‌కి డ్యాన్స్ చేసి అదరగొట్టేశారు. అశ్విని-పూజా, శోభా-తేజ, గౌతమ్-శుభశ్రీ, సందీప్-నయని పావని స్టెప్పులతో అదరగొట్టారు. భోలే అంటే హీరో, హీరో అంటే బిగ్‌బాస్ అని స్వయంగా కంపోజ్ చేసిన పాటకు భోలె డ్యాన్స్ చేసి ఫుల్‌గా ఎంటర్టైన్ చేశాడు. ►బిగ్‌బాస్ హౌస్ నుంచి బయటకొచ్చిన తర్వాత 15 సినిమా ఆఫర్లు వచ్చాయని టేస్టీ తేజ చెప్పుకొచ్చాడు. 9 వారాల్లో బిగ్‌బాస్ షోలో ఉండి ఎంత సంపాదించానో.. బయటకొచ్చిన తర్వాత 6 వారాల్లో అంతకంటే రెట్టింపు సంపాదించానని తేజ.. ఇంట్రెస్టింగ్ విషయాల్ని బయటపెట్టాడు. తేజతో పాటు గౌతమ్, భోలె, శోభాశెట్టి తదితరులు.. బిగ్‌బాస్ నుంచి బయటకెళ్లినా తర్వాత తమ లైఫ్ చాలా బాగుందని అందరూ తమ అభిప్రాయాల్ని చెప్పుకొచ్చారు. ►ఇక ఎలిమినేట్ అయిన హౌస్మేట్స్, హౌస్‌లో ఉన్న ఫ్యామిలీ మెంబర్స్‌తో హోస్ట్ నాగార్జున మాట్లాడిన తర్వాత.. ఇంట్లో ఉన్న ఆరుగురు డ్యాన్స్ ఫెర్ఫార్మెన్సులతో అదరగొట్టేశారు. యావర్ జిమ్ సామాన్లతో, శివాజీ కాఫీ కప్పుతో, ప్రియాంక కిచెన్ సామాగ్రితో, మొక్కతో ప్రశాంత్, రాకెట్స్‌తో అర్జున్, కప్పుతో అమర్ డ్యాన్స్ చేశారు. ►ఇక మొత్తం 19 మందికి సంబంధించిన బిగ్‌బాస్ జర్నీని వీడియోగా ప్లే చేసి అందరికీ చూపించారు. ఇది మొత్తం మంచి ఎంటర్టైన్మెంట్తో సాగింది. ప్రతిఒక్కరూ తమని తాము స్క్రీన్‌పై చూసుకుని మురిసిపోయారు. ఇక చివర్లో ఎమోషనల్ కంటెంట్ చూసి తేజ.. గుక్కపట్టి ఏడ్చేశాడు. మా అందరిదీ చాలా బ్యూటీఫుల్ జర్నీ అని చెప్పుకొచ్చాడు. ►ఇంట్లోని ఆరుగురు సభ్యులతో చిన్న ఫన్ టాస్క్ పెట్టిన నాగ్.. ఒక్కో కంటెస్టెంట్ మరొకరిలా యాక్ట్ చేసి మెప్పించారు. శివాజీ.. యావర్‌లా, అర్జున్.. శివాజీలా, యావర్.. అర్జున్‌లా, ప్రశాంత్.. ప్రియాంకలా, అమర్.. ప్రశాంత్‌లా, ప్రియాంక.. అమర్‌లా యాక్ట్ చేసి చూపించారు. ►హౌస్‌లో ఉన్న ఆరుగురిని బీబీ హౌస్‌లో మీ ఫేవరెట్ ప్లేస్ ఏంటి? అని నాగార్జున అడగ్గా.. ఒక్కొక్కరు తమకు నచ్చిన ప్లేస్ చెప్పారు. ప్రియాంక-స్టాండర్డ్ రూమ్, అర్జున్ - గార్డెన్ ఏరియా.. శివాజీ- యావర్-జోయకాలూస్ రూమ్, అమర్- గోడౌన్, ప్రశాంత్-గార్జెన్ ఏరియాలోని మొక్క అని చెప్పి..తమ బొమ్మలను ఆయా ప్లేసుల్లో పెట్టారు. ► అందాల తార నిధి అగర్వాల్ డాన్స్‌తో అదరగొటేటసింది. జవాన్ సినిమాలోని రామయ్య వస్తావయ్యా సాంగ్‌తో పాటు నాగార్జున సినిమాకు చెందిన పలు పాటలకు నిధి తనదైన స్టెప్పులేసి అలరించింది. ►టాప్-6లో ఉన్న ఆరుగురిలో నుంచి ఫినాలే ఎపిసోడ్లో అర్జున్ ఫస్ట్ ఎలిమినేషన్‌గా బయటకొచ్చాడు. ఇతడిని యాంకర్ సుమ.. హౌస్ నుంచి ఇతడిని బయటకు తీసుకొచ్చింది. ►దామిని బాగా కుక్ చేస్తుందనే ప్రశ్నకు యస్.. అశ్వినిని శోభా, ప్రియాంక తొక్కేశారు అన్న ప్రశ్నకు నో.. అర్జున్-అమర్ సంభాషణ ఒక్కోటి ఆణిముత్యం అన్న ప్రశ్నకు యస్.. శోభాపై పెట్టిన శ్రద్ధ, గేమ్ పై పెట్టుంటే తేజ టాప్-5లో ఉండేవాడనే ప్రశ్నకు యస్.. తదితర ప్రశ్నలకు అందరూ సమాధానాలు చెబుతూ ఫన్ జనరేట్ చేశారు. ►కాస్త ఎంటర్టైన్మెంట్ అయిన తర్వాత నటి చంద్రిక రవి స్టేజీ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చింది. 'బావ మనోభావాలు దెబ్బతిన్నాయ్' లాంటి పాటకు కేక పుట్టించే స్టెప్టులేసింది. ఇకపోతే ఎక్స్-కంటెస్టెంట్స్‌ని పలు అవార్డులతో హోస్ట్ నాగార్జున సత్కరించాడు. పిడకల అవార్డ్- దామిని ఇన్స్టంట్ న్యూడిల్స్ అవార్డ్- నయని పావని వాటర్ బాటిల్ అవార్డ్ - పూజామూర్తి రెడ్ లిప్‌స్టిక్ అవార్డ్ - శుభశ్రీ ఉడత అవార్డ్ - రతిక సంచాలక్ ఆఫ్ సీజన్ అవార్డ్- సందీప్ మాస్టర్ గోల్డెన్ మైక్ అవార్డ్ - భోలె టిష్యూ అవార్డ్ - అశ్విని డంబెల్ అవార్డ్ - గౌతమ్ ఫైర్ బ్రాండ్ - శోభాశెట్టి బేబీ సోనోగ్రఫీ ఫొటోని టీషర్ట్ పై వేసి, దాన్ని అర్జున్‌కి గిఫ్ట్‌గా ఇచ్చారు. ఇది కాస్త స్పెషల్‌గా అనిపించింది. ►ఇక 'ఈగిల్' సినిమా ప్రమోషన్లో భాగంగా స్టేజీపైకి వచ్చిన రవితేజ.. తన అభిమాని అయిన అమర్‌తో కాసేపు డ్రామా పండించాడు. తన తర్వాతి సినిమాలో ఛాన్స్ ఇస్తానని బిగ్‌బాస్ సాక్షిగా హామీ ఇచ్చాడు. అయితే మూవీ ఛాన్స్ ఇస్తా, బయటకొచ్చేస్తావా? అని నాగ్ అడగ్గానే మరో ఆలోచన లేకుండా అమర్ బయటకొచ్చేస్తానని అన్నాడు. అమర్ ఇష్టం చూసి నాగ్-రవితేజ ఇద్దరూ అవాక్కయ్యారు. దీనిబట్టి చూస్తే రవితేజ రాబోయే సినిమాల్లో ఏదో ఒకదానిలో అమర్ యాక్ట్ చేయడం గ్యారంటీ. ►ఫినాలేలో రెండో ఎలిమినేషన్ గా ప్రియాంక బయటకొచ్చింది. కొత్త సినిమా ప్రమోషన్ కోసం వచ్చిన రవితేజ.. ప్రియాంక ఎలిమినేట్ అయినట్లు చెప్పాడు. ►'నా సామి రంగ' మూవీ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన అల్లరి నరేశ్, రాజ్ తరుణ్.. రూ.15 లక్షల డబ్బుతో ఉన్న గోల్డెన్ సూట్‌కేస్‌తో బిగ్‌బాస్‌లోకి వచ్చారు. మిగిలిన నలుగురితో (అమర్, ప్రశాంత్, శివాజీ, యావర్) చాలాసేపు డిస్కషన్ పెట్టారు. డబ్బులు తీసుకునేలా టెంప్ట్ చేశారు. చివరకు యావర్.. సూట్‌కేస్ తీసుకుని, తనకు తానుగా ఎలిమినేట్ అయ్యాడు. అయితే యావర్.. సోదరులు కూడా చెప్పడంతో ఇక ఫైనల్‌గా సూట్ కేసు తీసుకుని బయటకొచ్చేశాడు. ►'డెవిల్' మూవీ ప్రమోషన్లో భాగంగా షోకి వచ్చిన కల్యాణ్ రామ్, సంయుక్త మేనన్.. కాసేపు సినిమా గురించి చిట్‌చాట్ చేశారు. కాసేపు సస్పెన్స్ క్రియేట్ చేసిన తర్వాత మిగిలిన ముగ్గురిలో శివాజీ ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే శివాజీ ఎలిమినేట్ కావడాన్ని ప్రశాంత్ తట్టుకోలేకపోయాడు. కాళ్లు పట్టేసుకుని మరీ కన్నీళ్లు పెట్టుకున్నాడు. ►ఇక టాప్-2లో మిగిలిన అమర్, ప్రశాంత్ కోసం హౌసులోకి వెళ్లొచ్చిన హోస్ట్ నాగార్జున.. వీళ్లిద్దరినీ స్టేజీపైకి తీసుకొచ్చారు. అయితే విజేత ఎవరనేది ప్రకటించడానికి ముందు బిగ్‌బాస్ చిన్న సర్ప్రైజ్ ప్లాన్ చేశాడు. నాగార్జున జర్నీని వీడియోగా ప్లే చేసి కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ►చివరి వరకు సస్పెన్స్ మెంటైన్ చేస్తూ వచ్చిన బిగ్‌బాస్ హౌస్ట్ నాగార్జున.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్‌ని విజేతగా ప్రకటించాడు. అయితే ఈ విషయాన్ని అస్సలు నమ్మలేకపోయిన ప్రశాంత్.. అలా షాక్‌లో ఉండిపోయాడు. ఇకపోతే అమర్దీప్ రన్నరప్‌గా నిలిచాడు. ► బిగ్ బాస్ 7వ సీజన్ విజేతగా నిలిచిన పల్లవి ప్రశాంత్‌కి రూ.35 లక్షల చెక్‌తో పాటు మారుతీ సుజుకీ బ్రెజా, రూ.15 లక్షల విలువైన జ్యూవెల్లరీ నెక్లెస్ సెట్‌ని కూడా బహుమతిగా అందించారు. నాకు వచ్చిన రూ.35 లక్షలు రైతులకే పంచుతాను. రైతుల కోసమే వచ్చిన రైతుల కోసమే ఆడాను. కారు నాన్నకు, నెక్లెస్ అమ్మకు బహుమతిగా ఇస్తాను అంటూ స్పీచ్‌తో అదరగొట్టాడు. -
బిగ్‌బాస్ గ్రాండ్ ఫినాలే.. అమర్‌కు ఊహించని ఆఫరిచ్చిన నాగ్.. మరో ఆలోచన లేకుండా!
Bigg Boss Season 7 Telugu Grand Finale: మరికొద్ది గంటల్లో బిగ్‌బాస్ సీజన్-7 గ్రాండ్ ఫినాలే షురూ కానుంది. వందకు పైగా రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులు కట్టి పడేసిన తెలుగువారి బిగ్ రియాలిటీ షోకు ఎండ్ కార్డ్ పడనుంది. ఈ నేపథ్యంలో సీజన్-7 విన్నర్ ఎవరనే విషయంపై అందరిలో ఆసక్తిని పెంచుతోంది. శనివారం రోజు ఇంటి సభ్యులంతా చిల్ అయ్యారు. 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. ఇక చివరి రోజు సాయంత్రం 7 గంటలకే ఎపిసోడ్ ప్రసారం కానుండగా.. తాజాగా ప్రోమో రిలీజ్ చేశారు మేకర్స్. (ఇది చదవండి: 'సలార్' రెండో ట్రైలర్‌తో ప్రభాస్ రెడీ) తాజాగా రిలీజైన ప్రోమో చూస్తే ఈ ఏడాది సీజన్-7 గ్రాండ్ ఫినాలేను మరింత గ్రాండ్ సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ సీజన్లో పాల్గొన్న కంటెస్టెంట్స్ అందరూ గ్రాండ్ ఫినాలేకు హాజరైనట్లు కనిపిస్తోంది. అయితే ఈ గ్రాండ్ ఫినాలేలో మాస్ మహారాజా రవితేజ, కల్యాణ్ రామ్, యాంకర్ సుమ, ఆమె కొడుకు రోషన్, బబుల్ గమ్ హీరోయిన్ మానస చౌదరి, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ సందడి చేశారు. వీరంతా తమ సినిమాల ప్రమోషన్లలో భాగంగా గ్రాండ్ ఫినాలేకు హాజరయ్యారు. అయితే మరోవైపు ఈరోజు బిగ్ బాస్ సీజన్-7 విన్నర్ ఎవరో తెలిసిపోనుంది. కానీ అంతకంటే ముందు టాప్-6లో ఉన్న కంటెస్టెంట్స్‌కు సూట్ కేస్ ఆఫర్ తీసుకొచ్చారు. అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ సూట్‌కేసుతో హౌస్‌లో అడుగుపెట్టారు. 'రండి బాబు రండి.. ఆలోచిస్తే ఆశాభంగం' అంటూ అల్లరి నరేశ్ వారికి సూట్‌కేస్ కోసం రండి వేలంపాట మొదలెట్టాడు. ఆ తర్వాత ఇన్ని రోజుల కష్టపడి ఉట్టి చేతులతో బయటికెళ్లడమా? అంటూ రాజ్ తరుణ్ టెంప్టింగ్ అయ్యేలా సలహా ఇచ్చాడు. అయితే ప్రోమో చివర్లో మాస్ రవితేజ అదిరిపోయే ఎంట్రీ ఇచ్చాడు. అయితే బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున అమర్‌దీప్‌కు ఎవరు ఊహించని ఆఫర్ ఇచ్చాడు. బిగ్‌బాస్ గేట్స్ తెరిచి ఉన్నాయి.. నువ్వు బయటకి వస్తే నెక్ట్స్ సినిమాలో రవితేజతో పాటు నటిస్తావ్ అన్నారు. అంతేకాకుండా అమర్‌కు కేవలం 7 సెకన్లు మాత్రమే టైం ఇచ్చాడు. దీంతో అమర్దీప్ మరో ఆలోచన లేకుండా పరుగుత్తాడు. అయితే అమర్దీప్ నిజంగానే బయటికొచ్చేశాడా? చివరి నిమిషంలో ఏం జరిగింది? అనేది తెలియాలంటే ఇవాళ ప్రసారమయ్యే గ్రాండ్ ఫినాలేను మిస్ అవ్వకండి. (ఇది చదవండి: Bigg Boss 7: అన్ని లక్షలు ఆఫర్ చేసిన నాగ్.. టైటిల్ రేసు నుంచి ఆ ఒక్కడు డ్రాప్!) -
Bigg Boss 7: రూ.10 లక్షల టెంప్టింగ్ ఆఫర్.. ఆ విషయంలో అర్జున్, ప్రియాంక సూపర్
మరికొన్ని గంటల్లో బిగ్‌బాస్ ఫినాలే అంటే హడావుడి ఎలా ఉండాలి. ఇంటి సభ్యులు గానీ ప్రేక్షకులు గానీ టెన్షన్‌తో ఉక్కిరిబిక్కిరి అయిపోవాలి. ఈ విషయంలో నిర్వహకులు పూర్తిగా చేతులెత్తేశారు. ఏం చేయాలో తెలీక ఏదేదో చేస్తూ ఫుల్ టైమ్ పాస్ చేస్తూ వచ్చారు. చివర్లో సూట్‌కేస్‌తో కాస్త సస్పెన్స్ క్రియేట్ చేయాలనుకున్నారు గానీ ఇందులోనూ సక్సెస్ కాలేకపోయారు. ఇంతకీ శనివారం ఏం జరిగిందనేది Day 104 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. టైమ్‌పాస్ పల్లీ బఠాణీ ఎప్పటిలానే మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఆదివారం ఫైనల్ ఎపిసోడ్ ఉంది కాబట్టి నాగార్జున శనివారం రాలేదు. ఇంట్లో ఉన్న ఆరుగురితోనే టైమ్ పాస్ చేయించాలని ఫిక్సయిన బిగ్‌బాస్.. చిన్నపిల్లల ఆటలన్నీ పెట్టాడు. కళ్లకు గంతలు కట్టుకుని ఎవరు కొట్టారో చెప్పుకోండి చూద్దాం అనే తరహాలో ఓ గేమ్ పెట్టాడు. ఇందులో ఏమంత ఫన్ క్రియేట్ కాలేదు. దీని తర్వాత ఇంట్లో ఉన్న వాళ్లలా యాక్ట్ చేసి చూపించాలని బిగ్‌బాస్ కొన్ని ఇన్సిడెంట్స్ చెప్పాడు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో రైతుబిడ్డ ప్రశాంత్, అమర్‌లా యాక్ట్ చేసి చూపించిన అర్జున్.. అలానే కాఫీ ఇవ్వకపోతే బయటకెళ్లిపోతానంటూ శివాజీ చేసే హడావుడిని రీక్రియేట్ చేసిన ప్రియాంక.. ఫుల్ మార్కులు కొట్టేశారు. మిగతా నలుగురికి ఛాన్స్ రాలేదో, మరి వాళ్లు చేయలేదో తెలియలేదు. శ్రీముఖి ఎంటర్టైనర్ ఇక త్వరలో ప్రారంభమయ్యే 'సూపర్ సింగర్' కొత్త సీజన్ ప్రమోషన్ కోసం హౌసులోకి వచ్చిన 3వ సీజన్ రన్నరప్, యాంకర్ శ్రీముఖి.. కాసేపు ఆరుగురు ఇంటి సభ్యులతో పాటలు పాడించింది. 'ట్రూత్ ఆర్ డేర్' గేమ్ ఆడిపించింది. ఈ ఆటలో భాగంగా శివాజీని శ్రీముఖి ఓ ప్రశ్న అడగ్గా.. బయటకెళ్లిన తర్వాత నయని పావనితో బాండింగ్ పెంచుకుంటానని శివాజీ అన్నాడు. రతిక.. ఓసారి ఎలిమినేట్ అయి, హౌసులోకి తిరిగొచ్చినా సరే ఇంకా మెచ్యూరిటీ లెవల్స్ రాలేదని శివాజీ చెప్పాడు. అలానే మరో ప్రశ్నకు బదులిచ్చిన యావర్.. అశ్వినిని పెళ్లి చేసుకుంటా, రతికతో డేట్‌కి వెళ్తా, శుభశ్రీని కిల్ చేస్తానని నవ్వుతూ చెప్పాడు. సూట్‌కేస్ గమ్ ప్రతి సీజన్లో ఉన్నట్లే ఫినాలేకి ఓ రోజు ముందు హౌసులోకి బిగ్‌బాస్ డబ్బుల సూట్‌కేస్ పంపించాడు. రూ.3 లక్షల మొత్తంతో వేలం పాట మొదలుపెట్టాడు. ఎవరు తీసుకుంటారంటూ ఒకరి తర్వాత మరొకరికి ఆఫర్ ఇచ్చాడు. రూ.3 లక్షల దగ్గర మొదలైన ఈ ఆఫర్.. వరసగా రూ.5 లక్షలు, రూ.8 లక్షలు, రూ.10 లక్షల వరకు వెళ్లింది. కానీ ఎవరు తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపించలేదు. ఈ మొత్తం మంచి టెంప్టింగ్గా ఉన్నప్పటికీ ఎవరూ ఆసక్తి చూపించలేదు. అయితే ఈ వేలంపాట జరుగుతున్నప్పుడు మధ్యలో శివాజీ.. అర్జున్, అమర్‌తో చిన్న పిచ్చి డిస్కషన్ పెట్టాడు. ఎంత కావాలి? ఎంత కావాలి? అని అన్నాడు. తనకు రూ.40 లక్షలిస్తే పోతానని అర్జున్.. రూ.45 లక్షలైతే వెళ్లిపోతానని అమర్ అన్నాడు. ఇక చివరగా ప్రియాంకకు ఇంటి నుంచి ఫుడ్ రావడంతో శనివారం ఎపిసోడ్ ముగిసింది. ఆదివారం ఫినాలే ఎపిసోడ్ సాయంత్రం 6 లేదా 7 గంటలకు మొదలయ్యే ఛాన్స్ ఉంది. -
బిగ్‌బాస్: ప్రశాంత్‌కు బంపరాఫర్ ఇచ్చిన శ్రీముఖి
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో అభిమానులు తమ ఫేవరెట్ కంటెస్టెంట్లను గెలిపించుకునేందుకు పోటాపోటీగా ఓట్లు గుద్దేశారు. అటు కంటెస్టెంట్లు ఫినాలే వరకు రావడానికి ఎంతో కష్టపడ్డారు. మొత్తానికి బిగ్‌బాస్ ఇంటా, బయటా ఓ చిన్నపాటి యుద్ధమే జరిగింది. ఈ యుద్ధం ముగిసింది.. కానీ ఇందులో ఎవరు గెలిచారనేది మాత్రం తెలియాల్సి ఉంది. ఆ ఫలితాల కోసం బిగ్‌బాస్ ప్రేమికులు కళ్లలో వత్తులు వేసుకుని మరీ ఎదురుచూస్తున్నారు. రేపు రాత్రి ఈ ఎదురుచూపులకు మోక్షం లభించనుంది. ప్రశాంత్ ప్లీజ్.. ఇది ఫన్ టాస్క్ ఇకపోతే తాజాగా బిగ్‌బాస్ ఓ ప్రోమో రిలీజ్ చేశాడు. ఇందులో యాంకర్ శ్రీముఖి హౌస్‌లో అడుగుపెట్టింది. త్వరలో పాటల ప్రోగ్రామ్ మొదలుకాబోతోందని చెప్తూ కంటెస్టెంట్లను ఆడిషన్ చేసింది. అయితే ముందుజాగ్రత్తగా ప్రశాంత్‌ను హెచ్చరించింది. ప్రశాంత్, ప్లీజ్.. ఇది ఫన్ టాస్క్. ఓడిపోతే హగ్ ఇస్తా.. గెలిస్తే గట్టి హగ్ ఇస్తా కానీ ఏడవకు అని బంపరాఫర్ ఇచ్చింది. ఇంత మంచి ఆఫర్ ఇస్తే ఎందుకు వదులుకుంటానన్నట్లుగా తెగ మెలికలు తిరిగాడు రైతు బిడ్డ. ట్రూత్ ఆర్ డేర్.. ఇక ఆడిషన్స్ మొదలవగానే అమర్దీప్ తనలోని బాత్రూమ్ సింగర్‌ను బయటకు తీశాడు. గోంగూర తోట కాడ కాపు కాశా.. అంటూ పాట మొదలుపెట్టాడు. కానీ మధ్యలోనే లిరిక్స్ మర్చిపోయాడు. తర్వాత అర్జున్ సరదాగా పాట పాడి నవ్వించేశాడు. కంటెస్టెంట్లతో ట్రూత్ ఆర్ డేర్ గేమ్ ఆడించింది శ్రీముఖి. ముగ్గురు లేడీ కంటెస్టెంట్లలో ఎవరిని పెళ్లి చేసుకుంటావని అడగ్గా ప్రిన్స్ యావర్ క్షణం ఆలోచించకుండా అశ్విని పేరు చెప్పాడు. దీంతో హౌస్మేట్స్ అతడిని ఆటపట్టించారు. చదవండి: విడాకుల రూమర్స్.. భర్త, మామతో ఐశ్వర్య డ్యాన్స్.. వీడియో వైరల్ -
Bigg Boss 7: శివాజీ అతి బద్ధకం.. అమర్‌కి సర్ప్రైజ్ ఇచ్చిన రైతుబిడ్డ
బిగ్‌బాస్ 7 పూర్తయిపోవడానికి ఇంకొన్ని గంటలే ఉంది. మొన్నటివరకు జర్నీ వీడియోలతో ప్రేక్షకుల్ని ఎమోషనల్ చేసిన నిర్వహకులు.. ఇప్పుడు ఏం చేయాలో తెలీక టైమ్ పాస్ చేస్తున్నారు. అందరూ ఎంటర్టైన్ చేస్తున్నారు. శివాజీ మాత్రం అతి బద్ధకంతో చిరాకు తెప్పిస్తున్నాడు. రైతుబిడ్డ అమర్‌కి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 103 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ అలాంటి భాష ఆరుగురు ఇంటిసభ్యులు నిద్రలేవడంతో శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. అయితే అమర్.. మిగిలిన ఐదుగురి జాతకం చెప్పాలని చెప్పి ఓ టాస్క్ ఇచ్చాడు. ఉన్నంతలో మనోడు బాగానే ఎంటర్టైన్ చేయాలని చూశాడు. కానీ మధ్యలో శివాజీ దూరి.. వెధవ-వెధవ అనే పదేపదే అడ్డుతగిలి చిరాకు తెప్పించాడు. టాస్క్ సరిగా పూర్తి చేయనీకుండా తలనొప్పి తీసుకొచ్చాడు. ఇక ఉన్న ఆరుగురూ మరీ బద్ధకంగా వ్యవహరిస్తున్నారని సీరియస్ అయిన బిగ్‌బాస్.. విన్నర్‌గా నిలిచేవారు చివరివరకు వచ్చి ఆగిపోరు అని అలెర్ట్‌గా ఉండాలని చెప్పుకొచ్చాడు. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు హీరోయిన్.. ఎవరో చెప్పండి చూద్దాం?) యావర్ సేఫ్ గేమ్ ఇక గురువారం ఎపిసోడ్లో భాగంగా అర్జున్, శివాజీ, అమర్.. ఇంట్లో వాళ్లు పంపిన ఫుడ్‌ని ఆస్వాదించారు. లేటెస్ట్ ఎపిసోడ్లో ప్రియాంక, ప్రశాంత్, యావర్ కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చింది. అయితే వీళ్లకి ఫుడ్ దక్కుతుందా లేదా అనేది అర్జున్, అమర్, శివాజీ చేతుల్లో ఉంటుందని బిగ్‌బాస్ ట్విస్ట్ ఇచ్చాడు. వీళ్ల ముగ్గురికి గేమ్స్ పెట్టి, అందులో గెలిచిన వాళ్లు ఫుడ్ ఎవరికి రావాలో డిసైడ్ చేస్తారని బిగ్‌బాస్ చెప్పాడు. తొలి గేమ్‌లో గెలిచిన అమర్.. యావర్ పేరు చెప్పాడు. అయితే ఇంటి ఫుడ్ మరో సభ్యుడితో పంచుకోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పగా.. ఎవరి పేరు చెప్పినా మరొకరు ఫీల్ అవుతారని నాకు ఫుడ్ వద్దని చెప్పేశాడు. శివాజీ బద్ధకం ఇక కప్పులు బ్యాలెన్స్ చేసే రెండో గేమ్‌లో అర్జున్ గెలిచాడు. ప్రశాంత్ పేరు చెప్పాడు. అయితే ప్రశాంత్ నువ్వు ఎవరితో ఫుడ్ పంచుకుంటావ్? అని బిగ్‌బాస్ అడగ్గా.. అమర్ పేరు చెప్పాడు. అయితే ఈ రోజు అమర్ పెళ్లి వార్షికోత్సవం సందర్భంగా ప్రశాంత్ ఇతడి పేరు చెప్పాడు. వీళ్లిద్దరూ ప్రశాంత్ అమ్మ చేసి పంపిన మటన్ కర్రీ, బగారా రైస్ తిన్నారు. ఇకపోతే రెండు గేమ్స్‌లోనూ శివాజీ మరీ బద్ధకం ఆడి.. ఒక్క గేమ్‌లోనూ గెలవలేకపోయాడు. ఇలాంటోడిని గనుక బిగ్‌బాస్ పొరపాటున విజేతని చేస్తే అంతకంటే దరిద్రం మరొకటి ఉండదు! మరోవైపు తనదగ్గరున్న పాయింట్స్ ఉపయోగించుకున్న అమర్.. తన భార్య తేజస్వితో బిగ్‌బాస్ హౌస్ నుంచి లైవ్ వీడియో కాల్ మాట్లాడాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ పూర్తయింది. (ఇదీ చదవండి: 'సలార్' మూవీ సీక్రెట్స్ అన్నీ బయటపెట్టిన ప్రభాస్..) -
ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ
బిగ్‌బాస్ 7 ఫినాలే దగ్గరపడుతోంది. ఇప్పుడు కూడా హౌస్మేట్స్.. వారిలో వారే కొట్టుకోకుండా కాస్త కలిసిమెలిసి ఉండేందుకు సరదా టాస్కులిచ్చాడు బిగ్‌బాస్. ఒకరి కోసం మరొకరు ఆడాలంటూ వారి మధ్య బంధాన్ని బలపర్చేందుకు ప్రయత్నించాడు. మరి ఎవరు ఎవరికోసం ఆడారు? ఏలియన్స్ ఇంట్లో ఎందుకు దూరాయి? ఈ విషయాలన్నీ తాజా ఎపిసోడ్ (డిసెంబర్ 14) హైలైట్స్‌లో చూసేద్దాం.. మీ ఇంటి వంట.. ఈ వారం నామినేషన్ల గోల లేదు, పెద్దగా టాస్కులు కూడా లేకపోవడంతో హౌస్మేట్స్ విశ్రాంతి తీసుకుంటున్నారు. బద్ధకస్తులుగా మారిపోయిన కంటెస్టెంట్లను హుషారెత్తించేందుకు బిగ్‌బాస్ మరోసారి హాచీ ఏలియన్స్‌ను రంగంలోకి దింపాడు. ఈ హాచీ.. కంటెస్టెంట్ల కోసం ఇంటి నుంచి ఫుడ్ వచ్చిందని, తమను సంతోషపరిస్తేనే ఆ ఆహారం ఇస్తామని చెప్పింది. అయితే మీ ఫుడ్ కోసం తోటి ఇంటిసభ్యులు ఆ ఆహారాన్ని సంపాదించాల్సి ఉంటుందని మెలిక పెట్టింది. శివాజీ కోసం ఆడి గెలిచిన ప్రియాంక మొదటగా అర్జున్ ఇంటి నుంచి రాగిముద్ద-మటన్ కూర వచ్చింది. ఈ ఫుడ్ కోసం యావర్ షేక్ బాల్ షేక్ గేమ్ ఆడి గెలిచాడు. తనకోసం ఆడి గెలిచిన యావర్‌కు తన చేతితో ఇంటి ఫుడ్‌ను తినిపించాడు అర్జున్. శివాజీ కోసం ఇంటి నుంచి చికెన్ కర్రీ వచ్చింది. దీనికోసం ప్రియాంక బ్యాలెన్స్ ది బాల్స్ గేమ్ ఆడి గెలిచి చికెన్ కూర శివాజీకి దక్కేలా చేసింది. ఆ తర్వాత అమర్‌దీప్‌కు రొయ్యల బిర్యానీ వచ్చింది. దీని కోసం శివాజీ బెలూన్ల టాస్క్ ఆడి గెలవడంతో అమర్ రొయ్యల బిర్యానీని ఇతరులతో షేర్ చేసుకుంటూ కడుపునిండా ఆరగించాడు. గంట ఎపిసోడ్లో ఎవరెంత కనిపిస్తారు? తర్వాత కొందరు గ్రహాంతరవాసుల్లాగా మాస్కులు పెట్టుకుని ఇంట్లోకి వచ్చి అందరినీ ఓ ఆటాడుకుని వెళ్లిపోయారు. అనంతరం బిగ్‌బాస్.. మీ 14 వారాల జర్నీలో మీ ఓవరాల్ పర్ఫామెన్స్ ఆధారంగా 60 నిమిషాల ఎపిసోడ్లో మీరు ఎంతసేపు కనిపించడానికి అర్హులో చెప్పాలంటూ కొన్ని బోర్డులు ఇచ్చాడు. ముందుగా అర్జున్.. 10 నిమిషాల బోర్డు తన మెడలో వేసుకున్నాడు. ఫౌల్స్ ఆడుతూ, దొంగతనాలు చేస్తూ, తిట్లు తింటూ అమర్ 20 నిమిషాలు కనబడతాడని అనుకుంటున్నట్లు చెప్పాడు. శివాజీకి 15, ప్రియాంకకు 7, ప్రిన్స్ యావర్‌కు 5, ప్రశాంత్‌కు 3 నిమిషాల బోర్డులు ఇచ్చాడు. అమర్‌ను చులకనగా చూస్తున్న శివాజీ శివాజీ.. ఎవరికీ తక్కువ నిమిషాల బోర్డు ఇవ్వబుద్ధి కావట్లేదంటూనే అమర్ మెడలో 3 నిమిషాల బోర్డు వేసి క్లాస్ పీకాడు. నువ్వు ఈ 2 వారాలే ఆడావు.. అంతకుముందు ఏమీ ఆడలేదంటూ మరోసారి తనను టార్గెట్ చేశాడు. కొన్నిసార్లు నువ్వు నెగెటివ్ కంటెంట్ కోసం ప్రయత్నించావు, అసలు గేమ్ ఆడలేదు అని అన్నాడు. 3 నిమిషాలు యాక్సెప్ట్ చేయలేకపోతున్నా, నేను గేమ్ ఆడానన్నా.. అని అమర్ డిఫెండ్ చేసుకుంటుంటే.. నేను 5 వేసుకున్నప్పుడు నీకు 3 నిమిషాలు వేస్తే రోగమా? అని తిట్టాడు శివాజీ. అంతేకాదు.. అర్జున్‌కు 7 ఇచ్చి అమర్ కంటే నువ్వు అద్భుతమైన ఎంటర్టైన్మెంట్ ఇవ్వగలవన్నాడు. ముష్టి బ్యాచ్ ప్రియాంకకు 10 ఇచ్చి మిగిలిన 15, 20 నిమిషాల బోర్డులు ప్రిన్స్, ప్రశాంత్ చేతిలో పెట్టి ఇద్దరూ తమకు నచ్చినవి వేసుకోమని ఆఫర్ ఇచ్చాడు. తర్వాత అందరూ ఈ బోర్డుల ప్రక్రియను ఒకరి తర్వాత ఒకరు పూర్తి చేశారు. కాగా ఫినాలే దగ్గరపడుతున్నప్పటికీ టైం దొరికినప్పుడల్లా అమర్ మీద విషం కక్కుతూనే ఉన్నాడు శివాజీ. వేస్ట్ ఫెలో, దొంగ, వెధవ, పనికిమాలినోడు, పిచ్చి పోహా.. ఇలా ఎన్నో మాటలన్నాడు. తాజా ఎపిసోడ్‌లోనూ స్పా(శోభ, ప్రియాంక, అమర్) బ్యాచ్‌ను ఉద్దేశిస్తూ ముష్టి బ్యాచ్.. ముష్టినాయాళ్లు.. అంటూ తన స్పై బ్యాచ్ దగ్గర చులకనగా మాట్లాడాడు. వాళ్ల ముందేమో పద్ధతిగా, పెద్దాయనలా ప్రవర్తిస్తూ పక్కకు రాగానే ఇలా అడ్డదిడ్డంగా మాట్లాడుతూ మరోసారి తన వంకరబుద్ధి బయటపెట్టుకున్నాడు శివాజీ. చదవండి: నటుడు కన్నుమూత.. గురువు మరణం కలిచివేసిందంటూ భారతీరాజా పోస్ట్.. -
బిగ్ బాస్ మిడ్ వీక్ ఎలిమినేషన్.. ఆ ముగ్గురిలో ఎవరు?
మరో నాలుగు రోజుల్లో బిగ్ బాస్ సీజన్-7 ముగియనుంది. చివరి వారంలో హౌస్‌లో ఇంకా ఆరుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. దీంతో వంద రోజుల పాటు బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తూ వచ్చిన ఈ షో విజేత ఎవరో ఆదివారం తేలిపోనుంది. ఈ నేపథ్యంలో చివరి వారంలో ఫైనలిస్టుల జర్నీ గురించి బిగ్‌బాస్ ఆడియన్స్‌కు పరిచయం చేస్తున్నారు. మొత్తంగా ఈ వారాన్ని ఎమోషనల్ ఎపిసోడ్‌గా మార్చేసిన బిగ్‌బాస్.. మొదటి రోజు అమర్, అర్జున్‌ని వీడియోలను చూపించిన ఏడిపించేశారు. రెండో రోజు శివాజీతో స్టార్ట్ చేసి.. చివరీకీ ప్రియాంక ఎమోషనల్ జర్నీతో ముగించాడు బిగ్‌బాస్. అలా ఫైనలిస్టులైన వారిలో ఇంకా పల్లవి ప్రశాంత్, ప్రిన్స్ యావర్ జర్నీ మూడో రోజు ఆడియన్స్‌కు చూపించనున్నారు. తాజాగా ప్రిన్స్ యావర్ జర్నీకి సంబంధించిన ప్రోమో రిలీజైంది. అయితే యావర్ పట్టుదల అద్భుతమని బిగ్‌బాస్ కొనియాడారు. దీంతో యావర్ ఫుల్ ఎమోషనలై కంటతడి పెట్టుకున్నాడు. మిడ్ వీక్‌లో ఎవరు అవుట్? అయితే ఈ వారంలో మిడ్ వీక్ ఎలిమినేషన్ ఉన్న సంగతి తెలిసిందే. మరీ వారం మధ్యలో హౌస్ నుంచి ఎవరు బయటికొస్తారు? టాప్-5 లో ఎవరెవరు నిలుస్తారు అనే విషయంపై అభిమానుల్లో విపరీతమైన ఆసక్తి నెలకొంది. ఆ ఒక్కరు ఎవరన్న విషయంపై త్వరలోనే క్లారిటీ రానుంది. ఇప్పటికైతే పల్లవి ప్రశాంత్, శివాజీ, అమర్దీప్ టాప్-5లో నిలుస్తారని తెలుస్తోంది. మరో వైపు అర్జున్, ప్రియాంక, ప్రిన్స్ యావర్‌లో ఎవరో ఒకరు బయటకు రావడం ఖాయంగా కనిపిస్తోంది. మరీ మిడ్ వీక్‌లో ఎవరు ఎలిమినేట్ అవుతారో తెలియాలంటే వేచి చూడాల్సిందే. -
Bigg Boss 7: రూట్ మార్చిన బిగ్‌బాస్.. అర్జున్, అమర్ కన్నీళ్లు పెట్టేశారు!
బిగ్‌బాస్ 7వ సీజన్ చివరి వారానికి వచ్చేశాం. కొన్నిరోజుల ముందు హోస్ట్ నాగార్జున చెప్పినట్లు ఈసారి నామినేషన్స్ లాంటి హడావుడి ఏం లేదు. కేవలం హౌస్‌లోని ఉన్న ఆరుగురు సభ్యుల ఎమోషన్స్ మాత్రమే పలికించాలని ఫిక్స్ అయినట్లు ఉన్నారు. అందుకు తగ్గట్లే తాజా ఎపిసోడ్లో అమర్, అర్జున్‌కి బోలెడన్ని సర్ప్రైజులతో పాటు అదిరిపోయే ఎలివేషన్స్ దక్కాయి. ఇంతకీ సోమవారం ఏం జరిగిందనేది Day 99 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. మెమొరీస్ బుక్ చివరి వారాన్ని చాలా అంటే చాలా హ్యాపీ మెమొరీస్‌తో చాలా పాజిటివ్‌గా ఎండ్ చేద్దామని బిగ్‌బాస్ ఫిక్సయ్యాడు. అందుకు తగ్గట్లే ఒక్కో ఇంటి సభ్యుడి జర్నీని చూపించి, అతడి నుంచి ఎమోషన్స్ అన్నీ బయటకు లాగేయాలనేది ఆర్గనైజర్స్ ప్లాన్. ఫస్ట్ ఫస్ట్ అమర్ ని మాత్రమే లాన్లోకి రమ్మన్నారు. అక్కడ అతడి బిగ్‌బాస్ మెమొరీస్ అన్నింటినీ ఫొటోల రూపంలో ప్రదర్శించాడు. ఆ తర్వాత యాక్టివిటీ రూంలోకి పిలిచిన తర్వాత దాదాపు 16 నిమిషాల జర్నీ వీడియోని ప్లే చేశారు. (ఇదీ చదవండి: హీరో చిరంజీవిపై కేసు.. ప్రముఖ నటుడి తిక్క కుదిర్చిన హైకోర్ట్!) అమర్ ఎమోషనల్ ఇందులో భాగంగా అమర్.. బిగ్ బాస్ హౌసులోకి వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ఏమేం చేశాడు? ఎలా ప్రవర్తించాడు? లాంటి సీన్స్ అన్నింటినీ ఒక్కటిగా చేసి 16 నిమిషాల జర్నీ వీడియో ప్లే చేశారు. అయితే ఈ వీడియో చూస్తే అమర్ నవ్వాడు, కన్నీళ్లు పెట్టుకున్నాడు, గూస్ బంప్స్ తెచ్చుకున్నాడు. చివరకు థ్యాంక్స్ బిగ్‌బాస్ అని చెప్పాడు. చాలా పెద్ద గిఫ్ట్ ఇది. అల్టిమేట్ బిగ్‌బాస్ అని అమర్ తన ఆనందాన్ని బయటపెట్టాడు. అర్జున్ ఎమోషనల్ ఇక అమర్‌కి చేసినట్లే అర్జున్‌ని కూడా పిలిచిన బిగ్‌బాస్.. అలానే 'బిగ్‌బాస్ బుక్ ఆఫ్ మెమొరీస్' చూపించాడు. తన బిగ్‌బాస్ ఫొటోల్ని చూసి తెగ మురిసిపోయాడు. కాసేపటి తర్వాత యాక్టివిటీ రూంలోకి వెళ్లిన తర్వాత దాదాపు 14 నిమిషాల జర్నీ వీడియో చూసి ఎమోషనల్ అయ్యాడు. ఓవరాల్ వీడియో అంతా నవ్వుతూ చూసిన అర్జున్.. భార్య వచ్చిన క్లిప్ చూసినప్పుడు మాత్రం ఎమోషనల్ అయ్యాడు. అయితే ఈ రోజు ఎపిసోడ్‌ని రాయడం కంటే వీడియోగా చూస్తేనే కిక్ వస్తుంది. అలా సోమవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: నాగార్జున స్పెషల్ స్వెట్ టీ-షర్ట్.. ఎన్ని లక్షల ఖరీదంటే?) -
వెనకాల గోతులు తవ్వుతోంది.. అమర్ వీడియో చూసి షాకైన శోభ
బిగ్‌బాస్ హౌస్ నుంచి ఆదివారం నాడు శోభా శెట్టి ఎలిమినేట్ అయింది. తన ఎలిమినేషన్‌ను జనాలే కాదు శోభా కూడా పసిగట్టేసింది. అందుకే ఏదైతే అదైందని గతవారం హౌస్‌లో విశ్వరూపం చూపించింది. అందరి మీదా అరిచేసింది. కావాలని గొడవపెట్టుకుంది. ఇతరుల్ని రెచ్చగొట్టింది. చివరకు ఎలిమినేట్ అయి బయటకు వచ్చేసింది. తాజాగా ఆమె బిగ్‌బాస్ బజ్‌లో పాల్గొంది. ఈ సందర్భంగా గీతూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్పింది. మీరు హౌస్‌లో ప్రిన్స్ యావర్ సహా పలువురిని టార్గెట్ చేశారనిపించింది.. నిజమేనా? అని గీతూ అడగ్గా.. గేమ్‌ను టార్గెట్ చేశానే తప్ప ఎవరినీ టార్గెట్ చేయలేదని వివరణ ఇచ్చింది. తేజ కోసం బిగ్‌బాస్‌కు రాలే.. తేజ నువ్వు లేకుండా ఉండలేనన్న మీరు అతడు వెళ్లిపోయాక ఒక్కసారి కూడా తల్చుకోలేదేంటి? అని అడిగింది గీతూ.. దీనికి శోభా స్పందిస్తూ.. తేజ కోసం బిగ్‌బాస్ హౌస్‌కు రాలేదు, తేజని తల్చుకుని ఏడుస్తూ సింపతీ రావాలనుకోలేదని క్లారిటీ ఇచ్చింది. శోభా ఇంకా మాట్లాడుతూ.. అమర్, అర్జున్.. ఇద్దరికీ సపోర్ట్ చేస్తాను. ప్రియాంక నా స్నేహితురాలైనా సపోర్ట్ చేయను. ఎందుకంటే అమర్ గెలవాలని ఎక్కువగా ఉంది. శివాజీ స్ట్రాటజీతో ఆడుతున్నాడు. మైండ్ గేమ్ ఆడుతున్నాడు. బిగ్‌బాస్ హౌస్‌లో ఉండాలంటే మెంటల్ గేమ్ ఆడటం చాలా అవసరం.. అది శివాజీ గ్రిప్‌లో పెట్టుకున్నాడు. జనాలకు ఏది చేస్తే నచ్చుతుంది అనేది ఆలోచించి మరీ ఆడుతున్నాడు. ఇలా ఆడితే ఏకంగా విన్నర్ అయిపోవచ్చు. అమర్ మాటలు విని షాక్ అమర్.. శోభ గురించి మాట్లాడిన వీడియో చూపించింది గీతూ. 'శోభ బ్యాక్‌బిచింగ్ చేస్తుంది. స్వార్థం ఎక్కువైపోయింది.. అంత స్వార్థంగా ఆలోచించేవారు గేమ్‌లో ముందుకు వెళ్లలేరు' అని మాట్లాడాడు.. ఇది చూసి షాకైన శోభ.. 'ఇది నాకు తెలియలేదు, హౌస్‌లో ఈ వీడియో చూపించాల్సింది' అని అభిప్రాయపడింది. ఇక చాలామటుకు గీతూ అడిగే ప్రశ్నలకు సమాధానాలు దాటవేసింది శోభ. చదవండి: బంగారు తల్లీ.. నిన్ను కలిసేవరకు నాకీ శోకం తప్పదు.. విజయ్ ఆంటోని భార్య ఎమోషనల్ -
సైకోలా మారిన అమర్దీప్.. టైటిల్ రేసులో నుంచి అవుట్..
ఎంత కష్టపడ్డా ప్రతిఫలం దక్కట్లేదు.. చేతి దాకా వచ్చింది నోటి దాకా రావట్లేదు.. అదృష్టం కలిసి రావట్లేదు.. అంటూ ఎప్పుడూ బాధపడుతూ ఉంటాడు అమర్దీప్. ఈ నెగెటివ్ ఫీలింగ్ పోగొట్టడానికి బిగ్‌బాస్, నాగార్జున సైతం గత వారం అమర్ ఆటతీరు అద్భుతంగా ఉందని, అందుకు బహుమతిగా కెప్టెన్సీని అనుభవించమని బంపరాఫర్ ఇచ్చాడు. కానీ అమర్ ఏం చేస్తున్నాడు? హౌస్‌మేట్స్‌తో సరిగా పనులు చేయించుకోలేకపోతున్నాడు. కొందరికి ఎక్కువ పనులు, కొందరికి తక్కువ పనులు అప్పజెబుతుండటంతో ఇంటిసభ్యులు అమర్ కెప్టెన్సీపై అసహనం వ్యక్తం చేస్తున్నారు. కెప్టెన్సీ బ్యాడ్జ్‌తో మొదలైంది.. అటు నామినేషన్స్‌లోనూ నేను కెప్టెన్‌ను చెప్తున్నా.. కూర్చో అని కాస్త రూడ్‌గా మాట్లాడాడు. ఇక ఎప్పుడైతే అమర్ కెప్టెన్సీ బ్యాడ్జ్ పెట్టుకున్నాడో.. అప్పుడే అతడికి బ్యాడ్ టైం స్టార్ట్ అయింది. వరుస కొట్లాటలు.. గొడవలు.. ఆఖరికి స్నేహితుల మధ్య కూడా పొరపచ్చాలు. అంతకుముందు వరకు సరదాగా ఉండే అమర్ ఈ వారం మాత్రం కంట్రోల్ తప్పిపోయాడు. ఏం మాట్లాడుతున్నాడు? ఎందుకు గొడవపడుతున్నాడు? అన్న స్పృహ కూడా లేకుండా పోయింది. చేతులారా తన ఆటను తానే చెడగొట్టుకుంటున్నాడు. మొన్నటి వరకు విన్నర్ రేసులో ఉన్న అతడి గ్రాఫ్ నిన్నటి ఒక్క ఎపిసోడ్‌తో పాతాళానికి పడిపోయింది. కొడుతూ, తిడుతూ, కొరికేస్తూ.. ఏంటీ అరాచకం? నిజానికి ఏ సీజన్లో అయినా అప్పటిదాకా కొట్టుకున్న కంటెస్టెంట్లు కూడా ఫినాలే దగ్గరపడగానే అంతా మర్చిపోయి కలిసిపోతారు. కానీ ఈ సీజన్లో మాత్రం గొడవలు ముదురుతున్నాయే తప్ప చల్లారడం లేదు. నిన్నటి ఎపిసోడ్లో అయితే అమర్దీప్ రైతుబిడ్డ పట్ల దారుణంగా ప్రవర్తించాడు. అతడిని తిడుతూ, కొడుతూ.. ఒరేయ్ అని పిలుస్తూ సైకోలా మారిపోయాడు. చెప్పుతో కొడతానంటూ సంజ్ఞ చేశాడు. పైగా కోపంతో ప్రశాంత్‌ను పంటితో కొరికేశాడు. ఇలా కొరుకుతున్నావేంటన్నా అని ప్రశాంత్ అడిగిన పాపానికి అతడిని మెడికల్ రూమ్‌కు తోసుకుంటూ, నెట్టేస్తూ, లాక్కెళ్తూ హీనంగా ప్రవర్తించాడు. ఎందుకంత చులకన? తోయకు అన్నా.. వద్దన్నా.. అని ప్రశాంత్ ఎంత అర్థిస్తున్నా వినకుండా అతడి మీద చేయి చేసుకుంటూ, చులకనతో నెట్టేస్తూ అతి చేశాడు. ఇది చూసిన జనాలు అమర్‌ను ఏకిపారేస్తున్నారు. 'అమర్‌కు ప్రశాంత్ అంటే ఎందుకంత చులకనభావం?', 'ఒక వ్యక్తి పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తారా?', 'ఇలాంటి వ్యక్తికి నాగార్జున రెడ్ కార్డ్ చూపించి ఎలిమినేట్ చేయాలి' అని ఆగ్రహిస్తున్నారు. ఈ ఒక్క ఎపిసోడ్‌తో అమర్ గెలుపు దాదాపు దూరమైనట్లే! ప్రశాంత్ విజయానికి మరో అడుగు ముందుకు పడినట్లే! #BiggBossTelugu7#Biggboss7Telugu Amar inthakante digajaradu anukunna prathi sari antha kante worst ga behave chestunnadu. Dear @StarMaa and @iamnagarjuna, its rigt time to show RED card to this worst fellow #Amardeep pic.twitter.com/RKgUYvdx9L — 🦋🅺🆄🆂🆄🅼🅰🦋 (@KusumaAllada) December 7, 2023 Poorthiga pichhodi la maripotunna #amardeep 👍🏻#BiggBossTelugu7 pic.twitter.com/9pAVafq3h7 — MK (@MK99086) December 7, 2023 చదవండి: అమర్దీప్ ఫ్యాన్స్ గలీజ్ మాటలు.. కాళ్లు మొక్కుతానంటూ కీర్తి ఎమోషనల్ -
నా జీవితంతో ఆడుకోకండి.. మీ అమ్మతోనే నడిరోడ్డుపై కొట్టిస్తా: కీర్తి
బిగ్‌బాస్ హౌస్‌లో కొట్లాటలు కామన్.. వీరు గొడవపడ్తారు అంతలోనే మళ్లీ కలిసిపోతారు. కానీ బయట జరిగే కొట్లాటలు, గొడవలు, వివాదాలు మాత్రం అంతకుమించి అన్నట్లుగానే ఉంటాయి. సోషల్ మీడియాలో జరిగే ఫ్యాన్స్ వార్‌కు అయితే లెక్కే లేదు. అయితే కంటెస్టెంట్లను విమర్శించి, అక్కడితో ఆగకుండా వారి కుటుంబాలను కూడా గొడవలోకి లాగుతున్నారు. అసభ్యపదజాలంతో దూషిస్తున్నారు. గౌతమ్‌కు సపోర్ట్ చేయడమే పాపమైపోయింది! పొరపాటున ఏ సెలబ్రిటీ అయినా తమ ఫేవరెట్ కంటెస్టెంట్‌కు సపోర్ట్ చేయట్లేదని తెలిస్తే ఇక అంతే సంగతులు. బిగ్‌బాస్ బ్యూటీ కీర్తి భట్.. ఇటీవల ఎలిమినేట్ అయిన గౌతమ్ కృష్ణకు సపోర్ట్ చేస్తూ మాట్లాడింది. అతడికి వెల్కమ్ చెప్తూ జరిపిన సెలబ్రేషన్స్‌లో పాల్గొంది. అంతే.. సీరియల్ బ్యాచ్‌కు కాకుండా గౌతమ్‌కు మద్దతు తెలపడంతో అమర్దీప్ ఫ్యాన్స్ ఆమెను పచ్చిబూతులు తిడుతూ వేధిస్తున్నారట. దీంతో ఆవేదనకు గురైన కీర్తి సోషల్ మీడియాలో వీడియో రిలీజ్ చేసింది. సోలోగా ఆడేవారికే నా సపోర్ట్ 'కొద్ది రోజుల నుంచి నాకు చాలా మెసేజ్‌లు వస్తున్నాయి. బిగ్‌బాస్ షో నుంచి బయటకు వచ్చిన గౌతమ్ కృష్ణ సెలబ్రేషన్స్‌కు నేను వెళ్లాను. అప్పుడు ఇంటర్వ్యూలు అడిగితే ఇచ్చాను. అందులో ఎవరి గురించీ చెడుగా మాట్లాడలేదు. కానీ అమర్ ఫ్యాన్స్ కొందరు నన్ను చెండాలమైన బూతులు తిడుతున్నారు. నీ తల్లి కూడా ఒక ఆడదే కదా.. నేను బిగ్‌బాస్ హౌస్ లోపల ఉన్నప్పుడు ప్రియాంక, మానస్, మహేశ్ తప్ప నాకెవరూ సపోర్ట్ చేయలేదు. సోలోగా ఎవరు ఆడతారో వారికే నేను సపోర్ట్ చేస్తున్నాను. ఒక్కొక్కరికీ ఒక్కొక్కరు నచ్చుతారు. గౌతమ్ నాకు ముందునుంచీ పరిచయమే లేదు. తను ఒంటరిగా ఆడటం నచ్చింది.. అందుకే తన దగ్గరకు వెళ్లి సపోర్ట్ చేశా.. నా జీవితంలో నాకు నచ్చింది చేస్తాను. ఎందుకిలా వేధిస్తున్నారు? నడిరోడ్డుపై కొడతా మీకు దండం పెడతా.. మీ ఇంట్లో కూడా ఆడపిల్లలు ఉన్నారు. ఫ్యాన్స్ అన్న పేరుతో ఇతరులను బాధపెట్టకండి. ఇంత గలీజ్‌గా మాట్లాడొద్దు. నా తప్పుంటే మీ అందరి కాళ్లు మొక్కుతా.. తప్పు లేదంటే మాత్రం అస్సలు ఊరుకోను. సోషల్ మీడియాలో అలాంటి కామెంట్లు పెడుతుంటే చూసి చాలా హర్ట్ అవుతున్నాను. నా జీవితంతో ఎందుకు ఆడుకుంటున్నారు? అమ్మాయిలను గౌరవించండి. లోపల ఉన్న నలుగురి స్నేహితులకు పరోక్షంగా సపోర్ట్ చేస్తున్నాను. అది మీకేం తెలుసు? నా తిండి నేను తింటున్నాను. ఎవరి దగ్గరా అడుక్కోవట్లే.. నేను తిని నలుగురికి ఇస్తున్నాను. వీలైతే మీరు సాయం చేయండి. ఎవరు ఏ ఐడీ నుంచి మెసేజ్‌లు పెడుతున్నారో అవన్నీ ట్రాక్ చేసి మీరెక్కడున్నా వచ్చి నడి రోడ్డుపై కొడతా.. మీ అమ్మతోనే కొట్టిస్తా..' అని ఆగ్రహించింది కీర్తి భట్. View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) View this post on Instagram A post shared by Keerthi Keshav Bhat (@keerthibhatofficial) చదవండి: స్టార్ హీరోతో బెడ్రూమ్ సీన్... ఆ అత్యాచార సీన్ కంటే బెటరేనన్న బ్యూటీ -
కంట్రోల్ తప్పిన అమర్.. ప్రశాంత్‌ను కొరికి నెట్టేస్తూ..
బిగ్‌బాస్ తెలుగు 7వ సీజన్లో 94 రోజులు గడిచిపోయాయి. దాదాపు శుభం కార్డు పడే సమయం వచ్చేసింది. ఉల్టా పుల్టా పేరుతో వచ్చిన ఈ సీజన్ పేరుకు తగినట్లే జరిగింది. ఒక ఎపిసోడ్లో ఫైర్ ఉంటే.. మరో ఎపిసోడ్లో ఫన్ ఉంటుంది. కానీ ఒక్కోసారి ప్రేక్షకులు బోర్ ఫీల్ అవుతున్నారు. గురువారం ఎపిసోడ్ అయితే అమర్, ప్రశాంత్ మధ్య మాటల యుద్ధమే నడిచింది. Day 95 హైలైట్స్ ఇప్పుడు చూద్దాం. అమర్ Vs అర్జున్ టాస్క్‌లో భాగంగా ఓట్ అప్పీల్ చేసుకునే అవకాశాన్ని బిగ్ బాస్ కల్పించాడు. అందుకు రీచ్ కావాలంటే కొన్ని ఫన్ టాస్క్‌లలో గెలవాలని రూల్ పెట్టాడు. వాటిలో అమర్, అర్జున్ ఇద్దరూ గెలిచి ఓట్ అప్పీల్ రేసులోకి వచ్చారు. వారిద్దిరిలో ఒకరిని ఎంపిక చేసి ఓట్ అప్పీల్ అవకాశం ఎవరికి కల్పిస్తారో అనే అంశాన్ని మాత్రం ఓట్ల ప్రాతిపదికన కంటెస్టెంట్ల చేతిలో పెట్టాడు బిగ్ బాస్. ఈ క్రమంలో ఎక్కువ ఓట్లు అర్జున్‌కు రావడంతో ఆయన ఓట్ అప్పిల్ చేసుకున్నాడు. యావర్,పల్లవి ప్రశాంత్, శివాజీ ముగ్గురూ అర్జున్‌కు సపోర్ట్ చేస్తే... శోభ,ప్రియాంక ఇద్దరూ అమర్‌కు సపోర్ట్ చేశారు. దీంతో అర్జున్‌కు మెజారిటీ వచ్చింది. ఈ ఓటింగ్ విషయంలో కూడా SPY బ్యాచ్‌లోని ముగ్గురితో అమర్ చిన్నపాటి గొడవకు దిగాడు. దీనికి ప్రధాన కారణం అతను ఈ వారం ఎలిమినేషన్లో ఉండటం... అర్జున్ లేకపోవడం. దీంతో ఓట్ అప్పీల్ అవకాశం తనకు కల్పించాలని అమర్ బలంగా కోరాడు కానీ SPY బ్యాచ్ ఈ విషయంలో అమర్‌కు ఎలాంటి సాయం చేయలేదు. శోభ ట్రాప్‌లో యావర్.. ఛీ.. ఛీ.. అంటూ ఫైర్ ఓట్ అప్పీల్ కోసం మరో టాస్క్‌ను బిగ్ బాస్ ఇచ్చాడు. హౌస్‌లోని కంటెస్టెంట్లు అయిన అందరికీ టీ షర్ట్స్ ఇస్తాడు బిగ్ బాస్. ఒక బార్డర్ లైన్లో వారందరూ ఉంటూ వారి వద్ద ఉన్న బాల్స్‌ను తను ప్రత్యర్థులు అనుకున్న వారిపై విసరాలి.. అవి ఎవరి టీ షర్ట్‌కు ఎక్కువగా అంటుకుంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేషన్ అయినట్లు అని రూల్స్ పెడుతాడు బిగ్ బాస్. ఈ క్రమంలో మొదట శోభపై యావర్ అటాక్ స్టార్ట్ చేస్తాడు. అదే సమయంలో ఆమె కూడా అతనిపై ఫైట్ చేస్తుంది. ఈ సమయంలో యావర్ కోపంతో రెచ్చిపోయి శోభపై ఫైర్ అవుతాడు. కానీ శోభ చాలా తెలివిగా యావర్‌ను బార్డర్ లైన్ దాటేలా చేస్తుంది. కావాలనే ఆట నుంచి ఆమె బయటకు వస్తుంది. కోపంలో ఉన్న యావర్ అదేమి గమనించకుండా లైన్ క్రాస్ అవుతాడు. దీంతో బిగ్ బాస్ ఇద్దరినీ ఎలిమినేట్ చేస్తాడు. అప్పుడు యావర్ కంట్రోల్ తప్పిపోయి శోభపై ఛీ.. ఛీ.. ఛీ.. అంటూ రెచ్చిపోతాడు. పదే పదే అదే మాటను యావర్ ఉపయోగించడం చాలా తప్పుగా ఉంటుంది. చివరకు శివాజీ కూడా యావర్‌ను కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తాడు. కంట్రోల్ తప్పిన అమర్.. పల్లవి ప్రశాంత్ సూపర్ ఇదే బాల్ టాస్క్‌లో అమర్ Vs పల్లవి ప్రశాంత్ మధ్య బిగ్ ఫైట్ జరిగింది. గేమ్‌లో భాగంగా మొదట ప్రశాంత్ వద్దకు అమర్ వెళ్తాడు. ఇద్దరూ టాస్క్‌లో ఫిజికల్ అవుతారు. ఈ క్రమంలో అమర్ గొంతును ప్రశాంత్ పట్టుకుంటే.. అతని చెయిని అమర్ కొరుకుతాడు. కానీ అది ఆటలో అనుకోకుండా జరిగినట్లు భావించవచ్చు. కానీ ఇదే విషయంలో ఇద్దరూ మాటకు మాట పెరుగుతుంది. ఎవరు ఎవర్నీ కొట్టారో తెలుసుకోవాలంటే మెడికల్ రూమ్‌కు పోదాం పదండి అన్నా అంటూ ప్రశాంత్ అంటాడు. ఆ సమయంలో అమర్ కంట్రోల్ తప్పుతాడు. ఎదుట ఉండేది ఒక కంటెస్టెంట్ అనే విషయాన్ని అమర్ మరిచిపోయినట్లు ఉన్నాడు. ప్రశాంత్ వీపుపై చెయ్యి పెట్టిన అమర్ పదే పదే తోస్తూ మెడికల్ రూమ్‌కు పదా అంటూ నెట్టేస్తాడు. ఆ సమయంలో ప్రశాంత్ పట్ల అమర్ చాలా రూడ్‌గా ప్రవర్తించాడు. తన గొంతును గట్టిగా పట్టుకున్నాడని చెప్పుకొస్తున్న అమర్ కంట్రోల్ తప్పి భారీగానే రెచ్చిపోయాడు. ప్రశాంత్, ఆమర్ మధ్య చాలా సేపు మాటలు యుద్ధం జరిగింది. కానీ ఎక్కడా కూడా ప్రశాంత్ కంట్రోల్ తప్పి మాట్లడలేదు.. పదే పదే అమర్‌ను అన్నా అంటూ తన వాదనను చెప్పుకొస్తున్నాడు. కానీ అమర్ మాత్రం రెచ్చ గొట్టకు రా అంటూ ప్రశాంత్‌పై ఫైర్ అవుతున్నాడు. తనను తాను ఏ మాత్రం కంట్రోల్ చేసుకోలేకపోయిన ఆమర్ పూర్తిగా ట్రాక్ తప్పాడు. ఆ సమయంలో అతను ఏం మాట్లాడుతున్నాడో కూడా గ్రహించలేకపోయాడు.. అలా కోపంలో ఉన్న అమర్‌ను చూస్తే ఎవరికైనా భయం వేయడం ఖాయం. అంతలా కంట్రోల్ తప్పాడు.. ఆ కోపంలో ఒకానొక సమయంలో ఏమైనా చేసుకుంటా అంటూ రెచ్చిపోయాడు. ఈ విషయంలో అతనిపై నెటిజన్ల నుంచి విమర్శలు వస్తున్నాయి. -
'హౌస్‌లో ఉంటే ఎంత.. పోతే ఎంత.. నీ నిజ స్వరూపం అందరికీ తెలియాలి'
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 మరికొద్ది రోజుల్లో ముగియనుంది. ఇప్పటి వరకు హౌస్‌లో కేవలం ఏడుగురు కంటెస్టెంట్స్ మాత్రమే మిగిలారు. ఇక గ్రాండ్ ఫినాలే మరో వారంలో షురూ కానుంది. ఈ నేపథ్యంలో ఈవారంలో హౌస్ నామినేషన్స్ రోజే యుద్ధరంగాన్ని తలపించింది. అయితే ఇప్పటి దాకా హౌస్‌మేట్స్‌తో కేకులు తినే గేమ్స్ పెట్టిన బిగ్‌బాస్ ఈసారి త్రో బాల్ టాస్క్‌ను ఇచ్చాడు. తాజాగా దీనికి సంబంధించిన ప్రోమో రిలీజైంది. ఈ టాస్క్‌లో ప్రతి రౌండ్లో ఎవరీ జాకెట్‌కు అయితే ఎక్కువ బాల్స్ అంటుకుని ఉంటాయో వారు ఆ రౌండ్ నుంచి ఎలిమినేట్ అవుతారని బిగ్‌బాస్ ప్రకటించాడు. అయితే గేమ్ నుంచి శోభా శెట్టి, యావర్ మొదట్లోనే ఎలిమినేట్ అయ్యారు. ఇక మిగిలిన ఐదుగురు పోటీలో నిలిచారు. అయితే దూరం నుంచి బాల్స్ విసరాల్సిన అమర్.. పల్లవి ప్రశాంత్‌ను పట్టుకుని బాల్స్ అంటించేందుకు యత్నించాడు. ఈ క్రమంలోనే ఇంటి సభ్యులైన అమర్, పల్లవి ప్రశాంత్ మధ్య తీవ్రమైన తోపులాట జరిగింది. దీంతో అమర్ తనను కొరికాడంటూ పల్లవి ప్రశాంత్ ఆరోపించాడు. దీనికి అమర్ కూడా ధీటుగానే స్పందించి అవునురా.. నేను తప్పని ఒప్పుకుంటా.. నేను చేసేవి కనిపిస్తాయి.. కానీ నువ్వు చేసేవి కనపడవు తెలుసా అన్నాడు. నువ్వు తప్పు చేసి నన్ను అంటున్నావ్ అన్నాడు ప్రశాంత్. దీంతో ఇద్దరి మధ్య తీవ్రమైన మాటల యుద్ధానికి దారితీసింది. రేయ్ హౌస్‌లో ఉంటే ఎంత.. పోతే ఎంత? వీడి గురించి అందరికీ తెలియాలి.. నీకున్న డబుల్ గేములు ఎవరికీ లేవు తెలుసా? అని అమర్ ఆగ్రహంతో ఊగిపోయాడు. నా గురించి ఇంట్లో అందరికీ తెలుసు అని ప్రశాంత్ బదులిచ్చాడు. 'నేను అబద్ధం.. వాడే నిజం..కట్టుకథ అల్లొద్దు.. వాడు ఏం చెప్పాడో ఎవరికీ చెప్పనని మాట ఇచ్చా. అందుకే మాట్లాడటం లేదు' అంటూ బాంబ్ పేల్చాడు. వాడు ఏం చెప్పాడో తెలుసా.. నన్ను పిచ్చోన్ని చేసి ఆడుకుంటావా? మాట్లాడకు.. అంటూ తల బాదుకున్నాడు అమర్. దీనికి ఆగమాగం చేయకు.. నీళ్లు తాగు అంటూ రైతు బిడ్డ ప్రశాంత్ కౌంటరిచ్చాడు. అమర్‌ను శోభా వారిస్తుండగా.. అర్జున్ కలగజేసుకుని రేయ్ ఆపండ్రా అంటూ నోర్లు మూయించాడు. దీంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్లో ఏం జరిగిందనే పూర్తి వివరాలు తెలియాలంటే చూసేయాల్సిందే. -
'బిగ్‌బాస్ 7' టైటిల్ విజేత రేసులో ఆ ముగ్గురు.. కానీ?
బిగ్‌బాస్ 7వ సీజన్ చివరకొచ్చేసింది. ప్రస్తుతం 14వ వారం నడుస్తోండగా, మరో 10 రోజుల్లో షో పూర్తి అయిపోతుంది. ఈ క్రమంలోనే విన్నర్ ఎవరవుతారనే కుతుహలం ఉండటం పక్కా. అందుకు తగ్గట్లే నిర్వహకులు.. ఉన్న ఏడుగురితో గేమ్స్ అవీఇవీ అని టైమ్ పాస్ చేస్తున్నారు. కానీ టైటిల్ రేసులో మాత్రం ముగ్గురే ఉన్నారు. (ఇదీ చదవండి: 'పుష్ప' నటుడిని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) మిగతా సీజన్లతో పోలిస్తే ఈసారి బిగ్‌బాస్ అనుకున్నంత ఇంట్రెస్ట్ లేకుండానే సాగుతోంది. శివాజీ బ్యాచ్, సీరియల్ బ్యాచ్.. ఒకరిపై ఒకరు అరుచుకోవడం తప్పితే ఓ ఎంటర్టైన్మెంట్ సరిగా లేదు, ఓ లవ్ ట్రాక్ లేదు. ఎమోషనల్‌గా ఫీలయ్యే సంఘటన లేదు. ఎలాగోలా ఎపిసోడ్స్ టెలికాస్ట్ చేస్తున్నారు తప్పితే చాలా బోర్ కొట్టించేస్తున్నారు. ఏదైతేనేం షో చివరకు వచ్చేశాం. విజేత ఎవరనేది మరో 10 రోజుల్లో తేలిపోతుంది. అయితే గడిచిన వీకెండ్ సందర్భంగా నిర్వహకులు ఓ క్లారిటీ ఇచ్చేశారు. ఈ రెండు వారాలు కూడా ఓటింగ్ లైన్స్ తెరుచుకునే ఉంటాయని, ఎక్కువ ఓట్లు వచ్చిన కంటెస్టెంట్.. బిగ్‌బాస్ 7 విజేతగా నిలుస్తారని క్లారిటీ ఇచ్చారు. ప్రస్తుతం ఓటింగ్ నంబర్స్ చూసుకుంటే.. రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ 34 శాతం ఓట్లతో టాప్ లో కొనసాగుతున్నట్లు తెలుస్తోంది. (ఇదీ చదవండి: విరాట్ కోహ్లీ బావతో 'యానిమల్' బ్యూటీ డేటింగ్?) ప్రశాంత్ తర్వాత శివాజీ, అమర్దీప్ దాదాపు 20 శాతం ఓటింగ్ పర్సంటేజ్‌తో ఉన్నారు. ఆ తర్వాత వరసగా యావర్, అర్జున్, ప్రియాంక, శోభాశెట్టి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఈ లిస్టులోని తొలి ముగ్గురిలోనే స్థానాలు అటుఇటు మారాలి తప్పితే మిగతా వాళ్లు.. టాప్-3లోకి వచ్చే ఛాన్సులు తక్కువ. అంటే ప్రశాంత్, శివాజీ, అమర్‌లలో ఎవరో ఒకరే విజేత అయ్యే అవకాశాలు గట్టిగా ఉన్నాయి. ఓట్లు ఎవరికి ఎక్కువ వస్తే వాళ్లే విజేత అని బిగ్‌బాస్ నిర్వహకులు చెప్పారు. కానీ రాబోయే 10 రోజుల్లో ఏమైనా జరగొచ్చు. లెక్కలు మార్చొచ్చు. ఎన్ని లెక్కలు మారినా సరే ప్రశాంత్ లేదంటే అమర్ విజేత అయితే పెద్దగా సమస్య ఉండదు. శివాజీకి విన్నర్ అయ్యే ఛాన్స్ ఉండకపోవచ్చు. ఎందుకంటే మిగతావాళ్లతో పోలిస్తే.. మనోడు చాలా విషయాల్లో పూర్. ఏదో మాటలతో లాక్కోచ్చేస్తున్నాడు అంతే! ఏదైతేనేం టైటిల్ కోసం పోటీ మంచిగా నడుస్తోంది. మరి ఈ సీజన్ విన్నర్ ఎవరు అవుతారని మీరనుకుంటున్నారు? (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: అపరిచితుడులా ప్రవర్తిస్తున్న అమర్.. ప్రియాంకతో అలాంటి సిల్లీ గొడవ!
బిగ్‌బాస్ 14వ వారం నామినేషన్స్ ఒకేరోజులో పూర్తయ్యాయి. కానీ అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం రాత్రంతా నడుస్తూనే ఉంది. 'ఓట్ ఫర్ అప్పీల్' అనే టాస్క్ పెట్టిన బేసిక్ లాజిక్ మర్చిపోయి మరీ ప్రేక్షకుల్ని పిచ్చోళ్లని చేశాడు. శోభా అయితే ఓటు అడిగే విషయంలో అవసరం లేకపోయినా సరే ఎమోషనల్ అయిపోయింది. ఇంతకీ మంగళవారం ఏం జరిగిందనేది Day 93 హైలైట్స్‌లో చూద్దాం. రైతుబిడ్డ ఎదురుదెబ్బ నామినేషన్స్‌లో అర్జున్ తప్ప మిగతా వాళ్లంతా ఉన్నారని బిగ్‌బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే మంగళవారం ఎపిసోడ్ మొదలైంది. నామినేషన్స్‌లో భాగంగా 'అమ్మాయిలా మాట్లాడుతున్నావ్' అని అర్థమొచ్చేలా ప్రశాంత్, అమర్‌తో అన్నాడు. తననే 'ఆడోడు' అని అంటావా? అని అమర్.. అదే పదాన్ని పదేపదే చెబుతూ ప్రశాంత్‌ని రెచ్చగొట్టాడు. సెటైర్స్ కూడా వేశాడు. కాసేపటి తర్వాత ఇద్దరూ సైలెంట్ అయిపోయారు. (ఇదీ చదవండి: రెండు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తున్న స్టార్ హీరో హిట్ సినిమా) ఓటు అప్పీలుకు ఛాన్స్ చిల్ పార్టీ పేరుతో కొన్ని గేమ్స్ ఉంటాయని చెప్పిన బిగ్‌బాస్.. ఇందులో గెలిచిన వాళ్లకు ఓటు అడిగే ఛాన్స్ దక్కుతుందని చెప్పాడు. అలా పాట ప్లే కాగానే.. బెంచ్‌పై వస్తువుల్లో ఒకదాన్ని తీసుకుని స్విమ్మింగ్ పూల్‌లో దూకాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. ఈ పోటీలో చివరివరకు నిలిచిన యావర్ విజేతగా నిలిచాడు. ఇక కలర్స్ జంపింగ్ గేమ్‌లో అందరూ తడబడ్డారు కానీ శోభా చివరివరకు ఉండి విన్నర్ అయింది. అమర్ కాదు అపరిచితుడు ఈ గేమ్ అయిపోయిన తర్వాత శోభా, ఓ టెడ్డీ బేర్ తీసుకుని రూంలోకి వచ్చింది. అక్కడే అన్న అమర్-ప్రియాంకతో కాసేపు మాట్లాడింది. ఆ తర్వాత ప్రియాంక.. సరదాగానే తలగడతో అమర్ ముఖంపై కొట్టింది. సీరియస్ అయిపోయిన అమర్.. అలిగి బయటకెళ్లిపోయాడు. కాసేపటి తర్వాత లోపలికి వచ్చాడు. అప్పుడు ప్రియాంక-శోభా లేచి అక్కడి నుంచి వెళ్లిపోయారు. దీనికి హర్ట్ అయిన అమర్.. ఏమైంది? మాట్లాడకపోతే మాట్లాడొద్దు అని ప్రియాంకపై సీరియస్ అయ్యాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!) అమర్ అలా అనేసరికి ప్రియాంక ఊరుకోలేదు. రిటర్న్‌లో గట్టిగానే ఇచ్చేసింది. ఏం మాట్లాడుతున్నావ్? అదీ ఇదీ అని అమర్‌కి ఆన్సర్ ఇచ్చింది. బొమ్మలకు ఉన్న విలువ మనుషులకు లేకుండా పోయింది, స్ట్రెయిట్‌గా చేయాల్సిన పని స్ట్రెయిట్‌గా చేయవ్ అని అమర్, ప్రియాంకని ఉద్దేశిస్తూ అన్నాడు. ఎందుకు గతవారం జరిగిన విషయాన్ని ఇప్పుడు తీస్తున్నావ్ అని ప్రియాంక రెచ్చిపోయింది. ఈ గొడవలోకి ఎంటరైన శోభా.. మా ఇద్దరి మీద నీకో ఏదో ఉంది, అందుకే ఇలా ప్రవర్తిస్తున్నావ్ అని అమర్‌కి కౌంటర్ ఇచ్చింది. అయితే ఇదంతా కూడా కంటెంట్ ఇవ్వాలని చేశారా అనే సందేహం వచ్చింది. ఎందుకంటే ఈ ఇష్యూ అంతా అయిపోయిన తర్వాత అర్జున్ మాట్లాడుతూ.. టైమ్ పాస్ కావట్లేదా మీ ముగ్గురికి? అని చిన్న సెటైర్ వేసి నవ్వేశాడు. ఓటు ఫర్ అప్పీలు టాస్క్ పోటీల్లో గెలిచిన యావర్, శోభా.. ఇద్దరు కూడా 'ఓటు ఫర్ అప్పీలు' చేసుకోవాలని, కాకపోతే ఇద్దరిలో ఒకరికి మాత్రమే అవకాశముంటుందని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. శోభాకి తక్కువ ఓట్లు పడిన కారణంగా.. అప్పీలు చేసుకునే ఛాన్స్ ఆమెకి దక్కింది. దీంతో.. 'అందరికీ నమస్కారం. నేను 'కార్తీకదీపం' మోనితగానే మీకు తెలుసు. బిగ్‌బాస్‌లో చూసేవాళ్లకు శోభాశెట్టిగా తెలుసు. ఇక్కడ మీరు నాకు చాలాచాలా సపోర్ట్ చేశారు. ఈ రోజు నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉన్నాం. కడుపు నిండా తింటున్నాం అంటే మీ అందరీ సపోర్ట్ కారణం. థ్యాంక్యూ సోమచ్ ఫర్ ద సపోర్ట్. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఎలిమినేషన్ హింట్ ఇచ్చేసిన బిగ్‌బాస్.. ఆ ఇద్దరిలో ఒకరు ఔట్?) 6వ సీజన్ వరకు అబ్బాయిలే గెలిచారు. సీజన్ 7లో నేను గెలవాలి, టైటిల్ కొట్టుకుని వెళ్లాలి. ఈ సీజన్ లో ఉల్టా పుల్టాలో అమ్మాయిగా నేను గెలవాలి అనేది ఒకత్తైతే.. బిగ్‌బాస్ గెలిస్తే వచ్చే అమౌంట్ గానీ వేరే ఏదైతే ఉందో నాకు చాలా ఇంపార్టెంట్. మీ సపోర్ట్ అనేది నాకు చాలా చాలా ఇంపార్టెంట్. నాకు తెలియకుండా ఏదైనా తప్పు చేసుంటే ప్లీజ్ క్షమించండి. ప్లీజ్ ఓటు చేయండి' అని శోభా.. ప్రేక్షకుల్ని ఓట్లు అడుక్కుంది. ఇక ఓటు ఫర్ అప్పీలు టాస్క్‌లో ఏ ఒక్కరు ఉండాలని.. ఇంటి సభ్యులు డిసైడ్ చేస్తున్న టైంలో ప్రియాంక-శోభా మధ్య చిన్నపాటి వాదన జరిగింది. యావర్ నువ్వు నెక్స్ట్ గేమ్‌లో గెలిచి, మళ్లీ ఈ ప్లేసులో నిల్చుంటావ్! అందుకే నేను శోభాకి ఇవ్వాలనుకుంటున్నాని ప్రియాంక కారణం చెప్పింది. అంటే నేను వీక్‌గా ఉన్నానా.. ప్రియాంక మాటల్ని నెగిటివ్‌గా తీసుకుంది. దీంతో కాసేపు గొడవ జరిగింది. ఈ రోజు ఎపిసోడ్లో మిగతా సోది అంతా పక్కనబెడితే సీరియల్ బ్యాచ్ ప్రవర్తన మాత్రం చాలా విచిత్రంగా అనిపించింది. అప్పుడే గొడవ పడతారు. అప్పుడే కలిసిపోతారేంట్రా బాబు అనిపించింది. అలానే ఎక్కడైనా గేమ్స్ లో ఓడిపోతే ఓట్లు అడుక్కుంటారు. ఈరోజు మాత్రం ఓ పోటీలో గెలిచిన శోభనే ఓట్ల కోసం ప్రాధేయపడటం విడ్డూరంగా అనిపించింది. మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: తెలుగు హీరోయిన్ పెళ్లికి రెడీ.. కాబోయే భర్త పోలీస్ ఇన్స్పెక్టర్!) -
Bigg Boss 7: మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్న రైతుబిడ్డ.. ఎదురుదెబ్బ తగిలేసరికి!
బిగ్‌బాస్ 7లో రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ బాగానే ఆడుతున్నాడా? అంటే అవుననే సమాధానం వస్తుంది. ఎందుకంటే అలా లేకపోతే 14వ వారం వరకు ఎలా వస్తాడు. అంతే కదా. అయితే అంతా బాగానే ఉన్నా గానీ మళ్లీ మళ్లీ అదే తప్పు చేస్తున్నాడు. తాజా నామినేషన్స్‌లోనూ తనకు అలవాటైన ఓ థియరీ ఉపయోగిద్దామని చూశాడు. కానీ ఎదురుదెబ్బ తగిలింది. గిలగిల కొట్టేసుకున్నాడు. తాజాగా రిలీజైన ప్రోమోతో ఆ విషయం అర్థమైంది. (ఇదీ చదవండి: ఆరు నెలల తర్వాత ఓటీటీలోకి వచ్చిన తెలుగు సినిమా) రైతుబిడ్డ అతితెలివి కామన్‌మ్యాన్ ప్లస్ రైతుబిడ్డ అనే ట్యాగ్‌తో బిగ్‌బాస్‌లో అడుగుపెట్టిన మిగతా రోజుల్లో ఏ మాత్రం సౌండ్ చేయకుండా, అసలు ఉన్నాడా లేడా అన్నట్లు ఉంటాడు. నామినేషన్స్ వస్తే మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టేసి, మెడలో టవల్ వేసుకుని మరీ బుద్దిమంతుడు అయిపోయాడు. అవతల వాళ్లు చెబుతున్నది వినకుండా, వాళ్ల చెప్పిన పాయింట్ మార్చేసి మరీ తనపై సింపతీ వచ్చేలా ప్లేట్ తిప్పేస్తాడు. గతంలో ఓసారి సందీప్ మాస్టర్ నామినేషన్ చేసిన టైంలో.. తనని ఊరోడు అన్నాడని నానా హంగామా చేశాడు. అమర్ రివర్స్ పంచ్ అయితే గతకొన్ని వారాల నుంచి నామినేషన్స్ సైలెంట్‌గా పూర్తి చేస్తూ వచ్చిన తాజాగా సోమవారం మాత్రం అమర్‌తో పెద్ద వాదనకు దిగాడు. ఈ క్రమంలోనే 'ఆడవాళ్లలా మాట్లాడకు' అని అర్థమొచ్చేలా అన్నాడు. దీంతో అమర్.. దాన్ని రచ్చ చేశాడు. 'నన్ను ఆడోడా అంటావా, చేతులకు గాజులు వేసుకోవాలా?' అని అమర్ రెచ్చిపోయాడు. దీంతో రైతుబిడ్డ డిఫెన్స్‌లో పడిపోయాడు. ప్రతిసారీ ఏదో ఒకలా సింపతీ కొట్టేద్దామని చూసే రైతుబిడ్డకు ఈసారి అమర్ రివర్స్ పంచ్ ఇచ్చాడు. ఈ గొడవని ఎవరో ఒకరు ఫుల్స్టాప్ పెట్టాలి. కానీ అమర్ రెచ్చిపోయి ప్రశాంత్ తప్పు చేసేలా చేస్తున్నాడు. మంగళవారం ఎపిసోడ్‌లోనూ ఈ పంచాయతీ సాగింది. మరి ఈ గొడవకు ఎప్పుడు ఎలా? ఎండ్ కార్డ్ పడిందనేది రాబోయే ఎపిసోడ్లో తేలుతుంది. అప్పటివరకు వెయిట్ అండ్ సీ. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 32 సినిమాలు) -
Bigg Boss 7: మళ్లీ గొడవపడ్డ అమర్-ప్రశాంత్.. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ చిట్టచివరి నామినేషన్స్ అయిపోయాయి. ఎంతో ఇంట్రెస్టింగ్గా ఉండాల్సిన ఈ ప్రక్రియ.. చాలా సిల్లీగా నడిచింది. ఎప్పటిలానే పనికిమాలిన సీరియల్ బ్యాచ్, శివాజీ బ్యాచ్ ఒకరిపై ఒకరు పగ ప్రతీకారాలు చూపించుకున్నారు. వీటన్నింటిలో అమర్-ప్రశాంత్ గొడవ మాత్రం కాస్తోకూస్తో ఎంటర్టైనింగ్గా అనిపించింది. ఇంతకీ సోమవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 92 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. నామినేషన్స్ హడావుడి గౌతమ్ ఎలిమినేట్ అయిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. ఇక నామినేషన్స్‌తో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. 'టికెట్ టూ ఫినాలే' రేసులో గెలిచిన ఫైనలిస్ట్ అయిన కారణంగా అర్జున్.. ఈ వారం నామినేషన్స్ నుంచి సేవ్ అయినట్లు చెప్పారు. అలా ఈ ప్రక్రియ షురూ అయింది. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? యావర్ - శోభా, ప్రియాంక శోభాశెట్టి - యావర్, శివాజీ ప్రశాంత్ - అమర్,శోభాశెట్టి అర్జున్ - అమర్, యావర్ ప్రియాంక - అమర్, యావర్ శివాజీ - ప్రియాంక, అమర్ అమర్ - ప్రశాంత్, యావర్ చాలా అతి చేసిన యావర్ వీకెండ్ ఎపిసోడ్లో ఓ సందర్భంలో ప్రియాంక మాట్లాడుతూ యావర్.. ఇంట్లో తక్కువ పనిచేస్తున్నాడని చెప్పింది. ఇప్పుడు అదే పాయింట్ కారణాన్ని చూపించి ప్రియాంకని యావర్ నామినేట్ చేశాడు. అయితే ప్రియాంక గురించి మాట్లాడినప్పుడు ఆమెతోనే మాట్లాడాలి. కానీ శోభా-అమర్ పేర్లు ప్రస్తావించాడు. ఫేవరిజం చూపిస్తున్నావ్ నువ్వు అని ప్రియాంకతో అన్నాడు. మధ్యలో ఎంటరైన శోభా.. నీత నన్ను కంపేర్ చేయకు, అసలు నువ్వేం చేస్తావ్.. డిన్నర్ రెడీ అయిన తర్వాత వస్తావ్, తింటావ్, వెళ్లిపోతావ్.. అంతకు మించి ఏం చేస్తున్నావ్ అని యావర్ అసలు చేసేదాన్ని బయటపెట్టింది. దీంతో యావర్ పిచ్చిపిచ్చిగా ప్రవరిస్తూ అతి చేశాడు. అమర్‌కి షాకిచ్చిన ప్రియాంక సీరియల్ బ్యాచ్‌కి చెందిన ప్రియాంక.. తన ఫ్రెండ్ అయిన అమర్నే నామినేట్ చేసింది. గతవారం టికెట్ టూ ఫినాలే పోటీలో భాగంగా గేమ్ ఓడిపోయిన బాధలో ఉంటే, పదే పదే పాయింట్స్ గురించి తనని అడగడం నచ్చలేదని కారణం చెప్పింది. ఇక మిగిలిన వాళ్లవి ఓకే అనిపించేలా నామినేషన్స్ జరిగాయి. అమర్-ప్రశాంత్ మధ్యలో మాత్రం ఇంట్రెస్టింగ్ డిస్కషన్ జరిగింది. రెండో వారం నామినేషన్స్‌ని గుర్తుచేశారు. అమర్ vs ప్రశాంత్ గత కొన్ని వారాల నుంచి బాగానే ఉన్న ప్రశాంత్, అమర్.. ఈసారి నామినేషన్స్‌లో రెచ్చిపోయారు. అమర్.. ప్రశాంత్‌ని నామినేట్ చేశాడు. వీళ్లిద్దరి మధ్య నువ్వు ఫేక్ అంటే నువ్వు ఫేక్ అంటూ, మోసం చేస్తున్నావ్ అదీ ఇది అని అనుకున్నారు. మీదమీదకు వెళ్లి మరీ కొట్టుకుంటారా అనేలా ప్రవర్తించారు. చివరకు శివాజీ, మిగతా ఇంటి సభ్యులు కల్పించుకోవడంతో సైలైంట్ అయిపోయారు. ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్ ఈ ఫినాలే రేసు మిమ్మల్ని ఓ ఫైనలిస్టుని చేస్తుంది లేదా ఫినిష్ లైన్ చేరకుండానే ఆపేస్తుంది. ఆ నిర్ణయం ప్రేక్షకుల చేతుల్లోనే ఉంది. వారు మీ ప్రతి ఆట ప్రతి మాట ప్రతి కదలిక చాలా దగ్గర నుంచి గమనిస్తున్నారు. కాబట్టి ఇప్పటినుంచి మీరు చేసే ప్రతి పని మీ గెలుపోటములని నిర్ణయిస్తుంది. బిగ్ బాస్ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఈ రెండు వారాలు కూడా మీ ఓటింగ్ లైన్స్ తెరుచుకుంటాయి. ఎక్కువ ఓట్లు పొందిన వాడు.. బిగ్‌బాస్ 7 విజేతగా నిలుస్తాడు. కానీ ఒకవేళ ఈ వారం మీ ఓట్లు.. మిగతా వారి కంటే తక్కువగా ఉంటే ఫినాలే వారానికి చేరుకోవడానికి ముందే ఎలిమినేట్ అవుతారు. అర్జున్.. ఫినాలే వీక్కి చేరుకున్నాడు కాబట్టి ఈ వారం ఎలిమినేషన్ నుంచి సేవ్ అయ్యాడని బిగ్‌బాస్ చెప్పడంతో సోమవారం ఎపిసోడ్ ముగిసింది. -
నేను మోసపోయానంటూ రైతుబిడ్డ ఫైర్.. కప్పు ఇచ్చేయండన్న అమర్!
బుల్లితెర ప్రేక్షకులను అలరిస్తోన్న రియాలిటీ షో చివరిదశకు చేరుకుంది. మరో వారంలో గ్రాండ్ ఫినాలేకు తెరలేవనుంది. గతవారం గౌతమ్ ఎలిమినేట్ కావడంతో హౌస్‌లో ఇంకా ఏడుగురు ఉన్నారు. వారిలో ఇప్పటికే అర్జున్ గ్రాండ్ ఫినాలేకు అర్హత సాధించాడు. ఇక మరోవారం మొదలైందంటే నామినేషన్స్ ప్రక్రియ షురూ అయింది. హౌస్‌లో ఒకరిపై ఒకరు కారణాలు చెబుతూ నామినేట్ చేసే సమయంలో జరిగే తంతు మామూలుగా ఉండదు. అసలే ఈ వారం నుంచి టగ్ ఆఫ్ వార్ అన్న రీతిలో నామినేషన్స్ ప్రక్రియ కొనసాగింది. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. బిగ్‌బాస్ సీజన్-7 ఇవాల్టి ఎపిసోడ్ల నామినేషన్స్ ప్రక్రియలో విమర్శలు వేరే లెవల్‌కు చేరుకున్నాయి. తాజాగా రిలీజైన ప్రోమోలో ప్రశాంత్‌ను అమర్దీప్ నామినేట్ చేశాడు. దీంతో ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడించింది. నువ్వు నన్ను రా అనొద్దంటూ వాదించగా.. నా తమ్ముడిని రా అనే అంటానురా.. పలికితే పలుకు.. లేదంటే పో అంటూ రెచ్చిపోయాడు. ఆ తర్వాత అర్జున్.. అమర్, యావర్‌ను నామినేట్ చేశాడు. ఆ తర్వాత హౌస్‌లో సేఫ్ ప్లేయర్ ఎవరంటే.. ఒక్క పల్లవి ప్రశాంతే అంటూ శోభా శెట్టి నామినేట్ చేసింది. ఆ తర్వాత శివాజీ, ప్రియాంకల చిన్నపాటి వార్ నడిచింది. ఫ్రెండ్షిప్ విషయాకొనిస్తే త్యాగం చేసే వాళ్లు కావాలని శివాజీ అనగా.. ప్రియాంక ఏదో అనడంతో.. నువ్వు ఓవర్ స్మార్ట్ ఇక్కడ చేయొద్దమ్మ అంటూ చురకలంటించాడు. దీనికి ఐయామ్ నాట్ ఓవర్ స్మార్ట్ అంటూ ప్రియాంక సమాధానమిచ్చింది. ఆ తర్వాత ప్రశాంత్, అమర్ మధ్యే పెద్ద వార్ నడిచింది. అమర్ అన్న ఫస్ట్ నుంచి నా మీద నెగెటివ్‌గానే ఉన్నాడు అనడంతో మధ్యలో శోభా ఎంటరైంది. మాట అంటే మాటే.. తగ్గేదేలే.. ప్రాణమైనా ఇస్తాడు అని లోపలికి వెళ్లి దాచి కూర్చోలే అని శోభా అనడంతో.. ఇది నిజ స్వరూపం.. అందరినీ మోసం చేసే గుణం నీది అంటూ ప్రశాంత్ రెచ్చిపోయాడు. దీంతో టాపిక్ డైవర్ట్ చేసి తవ్వుకోద్దంటూ అని అమర్ అన్నాడు. దీనికి ప్రశాంత్ బరాబర్ తవ్వుతా.. తగ్గదేలే అన్నాడు. దీంతో ఆగరా.. నువ్వు..నీ అబద్ధాలు అంటూ అమర్ ఫైరయ్యాడు. ఎదుటివాళ్లను మోసం చేసుడు నీగుణం.. మోసపోయింది నువ్వు కాదు.. నేను అంటూ ప్రశాంత్ మరింత రెచ్చిపోయాడు. ఆ తర్వాత నన్ను బయటకు పంపించేయండి.. వాడికి కప్పు ఇచ్చేయండి.. మీరందరూ హ్యాపీగా ఉండండి.. వాడు హ్యాపీగా ఉంటాడు అని అమర్ అనడంతో ప్రోమో ముగిసింది. మొత్తానికి ప్రోమో చూస్తే నామినేషన్స్ ప్రక్రియ ఫుల్ హీటెక్కినట్లు తెలుస్తోంది. ఎవరు ఎవరినీ నామినేట్ చేశారో పూర్తి వివరాలు తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూడాల్సిందే. -
Bigg Boss 7: ప్రియాంకని ఒప్పించడానికి నాగ్ ప్రయత్నం.. శివాజీకి చెప్పడానికి నో ధైర్యం!
బిగ్‌బాస్ 7వ సీజన్లో మరో వీకెండ్ వచ్చేసింది. అయితే ఈ వారం ఓ మాదిరి ఎంటర్టైన్మెంట్ ఇచ్చారు. కాకపోతే శివాజీ మీద నాగ్ ప్రేమ ఎంత ఉందనేది మరోసారి బయటపడింది. ప్రియాంకని అయితే నాగ్ పదే పదే ఓ విషయం ఒప్పించేందుకు తెగ ప్రయత్నించాడు. అమర్‌కి ఓ సర్ప్రైజ్ కూడా ఇచ్చాడు. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 90 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. బయటపడ్డ ప్రియాంక ఆవేదన టికెట్ టూ ఫినాలే రేసులో గెలిచిన అర్జున్.. ఈ సీజన్ తొలి ఫైనలిస్ట్ కావడంతో శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచి శనివారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీకెండ్ కాబట్టి స్టేజీపైకి వచ్చిన నాగార్జున.. శుక్రవారం ఏం జరిగిందో చూశాడు. ఆ తర్వాత ప్రస్తుతానికి వచ్చేశాడు. ఫినాలే రేసు మొదటి రౌండులోనే ఎలిమినేట్ అయిపోయిన శోభా-శివాజీ నిలబెట్టి.. ఒకరి గేమ్ గురించి మరొకరు చెప్పాలని అన్నాడు. ఈ డిస్కషన్లో వీళ్లిద్దరూ అమర్‌కి పాయింట్స్ ఇవ్వడంపై నాగ్ కౌంటర్స్ వేశాడు. (ఇదీ చదవండి: 'యానిమల్'లో రష్మిక కంటే హైలైట్ అయిన బ్యూటీ.. ఈమె ఎవరంటే?) అమర్ అలుగుతాడని, బ్లాక్ మెయిల్ చేస్తాడని నవ్వుతూనే నిజాలు చెప్పేశాడు. ఆ వెంటనే.. ప్రియాంక చెప్పమ్మా అని ఆమెని నిలబెట్టాడు. దీన్ని నిజమేనని ఒప్పుకొన్న ప్రియాంక.. అది చాలా పెయిన్ఫుల్, ఆల్రెడీ ఓడిపోయినా బాధ ఓవైపు ఉంటే.. మళ్లీ మళ్లీ అమర్ పాయింట్స్ ఇవ్వమని చెబుతుంటే చాలా బాధగా అనిపించింది ప్రియాంక తన ఆవేదన బయటపెట్టింది. ప్రియాంకని ఒప్పించే ప్రయత్నం ప్రియాంకని నిలబెట్టి మాట్లాడిన నాగ్.. గతవారమే అనుకున్నాం కదా ఒంటరిగా గేమ్ ఆడమని.. కానీ నువ్వు ఏం చేశావ్? అని అమర్‌కి గౌతమ్ ద్వారా పాయింట్లు ఇచ్చిన విషయం గురించి మాట్లాడాడు. అయితే ఈ మొత్తం డిస్కషన్లో ప్రియాంకది గ్రూప్ గేమ్ అని ఒప్పించాలని నాగ్ చాలా ప్రయత్నించాడు. కానీ ఈ విషయంలో ఫెయిలయ్యాడు. ఆ తర్వాత గౌతమ్‌తోనూ నాగ్.. ప్రియాంకది తప్పని చెప్పించాడు. ప్రియాంక.. నువ్వు ఎంత సమర్ధించుకున్నాసరే నీది గ్రూప్ గేమ్ అని మాకు అనిపించిందని నాగ్ అన్నాడు. కానీ ఇలానే గతంలో శివాజీ బ్యాచ్‌గా ఆడినప్పుడు మాత్రం నాగ్ కనీసం పల్లెత్తు మాట కూడా అనలేకపోయాడు. దీనిబట్టి శివాజీపై నాగ్ ప్రేమ ఏంటనేది అర్థం చేసుకోవచ్చు. (ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కు హెల్త్ ఇష్యూ.. షూటింగ్‌కు బ్రేక్ ఇచ్చిన సుకుమార్) అమర్‌కి సర్ప్రైజ్.. ప్రశాంత్‌కి షాక్ ఈ వారం 'టికెట్ టూ ఫినాలే' అర్జున్ గెలిచిన కారణంగా.. ఎవిక్షన్ పాస్ 14వ వారం కాదు, ఈ వారమే ఉపయోగించాలని ప్రశాంత్‌కి నాగ్ కండీషన్ పెట్టాడు. దాని గురించి తర్వాత చెబుతానని అన్నాడు. కానీ శనివారం ఎపిసోడ్లో కారణం లాంటిది ఏం చెప్పలేదు. మరోవైపు అమర్ మాట్లాడుతూ.. ఒక్కసారి మీరు నన్ను కెప్టెన్ అని పిలిస్తే వినాలని ఉందని నాగార్జునని రిక్వెస్ట్ చేశాడు. ఇది జరిగిన నాగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. టికెట్ టూ ఫినాలే పోటీలో 1200 పాయింట్లతో అగ్రస్థానంలో నిలిచిన కారణంగా.. వచ్చే వారం కెప్టెన్ అయ్యావ్ అమర్ అని నాగ్ చెప్పాడు. శివాజీ, అర్జున్.. డిప్యూటీస్ అని నాగ్ ఆదేశించాడు. శివాజీతో గౌతమ్ గొడవ ఇక 'బీబీ లైబ్రరీ' అని ఓ గేమ్ పెట్టారు. ఇందులో భాగంగా కొన్ని పేర్లు రాసున్న బుక్... మరొకరికి ఇవ్వాల్సి ఉంటుందని నాగ్ చెప్పాడు. మిగతా వాళ్ల విషయంలో పెద్దగా ఇబ్బంది కాలేదు కానీ.. 'ప్రతిదానికి నేనే రైట్ అని అనుకోకుండా ఎలా ఉండాలి?' అనే బుక్ మాత్రం గౌతమ్.. శివాజీకి ఇచ్చాడు. దీన్ని తీసుకోలేకపోయిన శివాజీ.. 'కుళ్లు, కుట్ర, కుతంత్రం నుంచి విముక్తి పొందడం ఎలా?' అని పుస్తకాన్ని.. రిటర్న్‌లో గౌతమ్‌కి ఇచ్చాడు. దీంతో గొడవ మొదలైంది. ఇద్దరూ నీది తప్పంటే నీది తప్పు అని నామినేషన్స్‌లో వాదించుకున్నట్లు హోస్ట్ నాగార్జున ముందే గొడవపడ్డారు. అంతా విన్న నాగార్జున.. ఎప్పటిలానే శివాజీకి సపోర్ట్ చేశాడు. గౌతమ్దే తప్పన్నట్లు తీర్పు ఇచ్చాడు. ఫినాలే అస్త్ర గెలుచుకున్న కారణంగా అర్జున్.. ఈ వారం ఎలిమినేషన్స్ నుంచి సేవ్ అయిపోయినట్లు నాగ్ ప్రకటించాడు. అలా శనివారం ఎపిసోడ్ పూర్తయింది. అయితే శనివారం అంతా కూడా నవ్వుతూనే సీరియల్ బ్యాచ్ గురించి నాగార్జున నిజాలు చెప్పాడు. ఇలానే శివాజీ బిహేవియర్ గురించి కూడా నిజాలు చెబితే బాగుండేది అనిపించింది. (ఇదీ చదవండి: ఆ సమస్యతో బాధపడుతున్న అమర్.. లోపల ట్రీట్మెంట్ లేదు!) -
ఆ సమస్యతో బాధపడుతున్న అమర్.. లోపల ట్రీట్మెంట్ లేదు!
బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్లో పల్లవి ప్రశాంత్, అమర్దీప్ చౌదరి టైటిల్ రేసులో ఉన్నారు. మొదటి నుంచీ ఏ ముసుగు వేసుకోకుండా మాట్లాడుతున్నాడు అమర్. అయితే తను చేసే తింగరి పనుల వల్ల సోషల్ మీడియాలో ఎక్కువ ట్రోల్ అవుతుంటాడు. ఇక హౌస్‌లో శివాజీ మొదటి నుంచీ అమర్‌ను టార్గెట్ చేస్తూ అతడిని చులకన చేస్తూ మాట్లాడుతూ వచ్చాడు. ఈ వైఖరిని తాను కూడా సహించలేకపోయానంటోంది అమర్ భార్య, నటి తేజస్విని. హౌస్‌లో అడుగుపెట్టాక అంతా మర్చిపోయా తాజాగా తేజస్విని ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. 'కొన్ని విషయాల్లో శివాజీ ప్రవర్తన వల్ల నేను బాధపడ్డాను. ఎందుకలా మాట్లాడుతున్నారు అనుకునేదాన్ని. బహుశా అమర్ టఫ్ కాంపిటీషన్ ఇస్తాడనుకున్నారేమో, అందుకే తనతో అలా ప్రవర్తించారేమో! నేను బిగ్‌బాస్ హౌస్‌లోకి వెళ్లినప్పుడు చాలా అనుకున్నాను, ఎన్నో చెప్పాలనుకున్నాను. కానీ హౌస్‌లోకి వెళ్లాక ఏదీ గుర్తులేదు. అమర్ తప్ప ఎవరూ కనిపించలేదు. తనే అందరినీ పరిచయం చేశాడు. అమర్‌కు శివాజీ అంటే ప్రత్యేక గౌరవం ఉంది. అందుకే నన్ను ఆయన దగ్గరకు తీసుకెళ్లాడు, ఆశీర్వాదం తీసుకున్నాం. ఆ సమస్యతో అమర్‌కు ఫిజియోథెరపీ అమర్‌కు అనారోగ్యసమస్యలు ఉన్నాయి. బిగ్‌బాస్ షోలోకి వెళ్లేముందు కూడా తనకు విపరీతమైన బ్యాక్‌పెయిన్ ఉంది. హౌస్‌లోకి వెళ్లే ఒకరోజు ముందు కూడా అతడికి ఫిజియోథెరపీ జరిగింది. నీతోనే డ్యాన్స్ షో ఫినాలే రోజు పెయిన్ కిల్లర్స్ ఇంజక్షన్స్ వేయించుకున్నాడు. అంత నొప్పి అనుభవిస్తూనే షోకి వెళ్లాడు. ఇప్పటికీ అతడు నొప్పి అనుభవిస్తున్నాడు. హౌస్‌లో తనకు వెన్ను నొప్పి ఉన్న విషయాన్ని బయటకు చెప్పడం లేదు. ఏ ట్రీట్మెంట్ తీసుకోవడం లేదు. దెబ్బ తగిలితే ఫ్రాక్చర్.. ఎక్కడ సింపతీ అనుకుంటారోనని తన అనారోగ్య సమస్యను ఎవరికీ చెప్పట్లేదని నాకు చెప్పాడు. తనకు నొప్పి తగ్గడానికి డాక్టర్ రాసిచ్చిన క్రీమ్ పంపిస్తూనే ఉన్నాను. అమర్ రోజూ అది రాసుకునే పడుకుంటున్నాడు. తనకు కండరాల బలహీనత కూడా ఉంది. దీనివల్ల ఏదైనా దెబ్బ తగిలితే అక్కడ ఫ్రాక్చర్ అవుతుందని డాక్టర్ చెప్పారు. అయినా సరే ఏమీ లెక్క చేయకుండా అమర్ బిగ్‌బాస్ షోకి వెళ్లాడు. అందుకే మొదట్లో టాస్కులు పెద్దగా ఆడలేకపోయాడు. కానీ తర్వాత ఏదైతే అదైందని ఆడుతూ పోయాడు' అని చెప్పుకొచ్చింది తేజస్విని. చదవండి: స్టార్ హీరోయిన్ మాజీ భర్తతో నాలుగేళ్లుగా డేటింగ్.. బ్రేకప్‌కు అదే కారణమంటూ.. -
అమర్‌ను ఛాలెంజ్ చేసిన గౌతమ్.. అర్జున్‌కు అన్యాయం!
బిగ్‌బాస్ హౌస్‌లో టికెట్ టు ఫినాలే కోసం పోటీ జరుగుతోంది. ఇప్పటికే ముగ్గురు ఆటలో వెనకబడి రేసులో నుంచి పక్కకు తప్పుకోగా ఐదుగురు ఫినాలే అస్త్ర కోసం పోటీపడుతున్నారు. మరి వీరిలో ఎవరు ఆ అస్త్రాన్ని గెలుచుకోవడానికి దగ్గర్లో ఉన్నారు? ఎవరు రేసులో వెనకబడ్డారు? అనేది తాజా ఎపిసోడ్ (నవంబర్ 30) హైలైట్స్‌లో చదివేద్దాం... క్రికెట్ టాస్క్.. సిక్సులు బాదిన అమర్ తక్కువ పాయింట్లు ఉన్న ప్రియాంక, శివాజీ, శోభ ఫినాలే అస్త్ర రేసు నుంచి తప్పుకున్నారు. అయితే ప్రియాంక తన పాయింట్లను గౌతమ్‌కు ఇవ్వడాన్ని జీర్ణించుకోలేకపోయాడు అమర్దీప్. కనీసం ఫ్రెండ్ అని కూడా చూడలేదు, ఎందుకు తప్పు నిర్ణయం తీసుకున్నావంటూ బాధపడ్డాడు. ఇంతలో మిగతా ఐదుగురు ఇంటిసభ్యులకు వెరైటీ క్రికెట్ టాస్క్ ఇచ్చాడు. ఈ టాస్క్‌లో అమర్ గెలిచాడు. తప్పించుకో రాజా టాస్క్‌లో రైతుబిడ్డ గెలిచాడు. తప్పు చేసిన యావర్.. నోరు విప్పని శివాజీ అయితే ఈ టాస్కులో ఎవరి కాలికి ఉన్న తాళాలకు వారు కీ వెతికి విడిపించుకోవాలి. యావర్ ఒక కీ తీసుకుని అది రాకపోవడంతో కింద పడేశాడు. దీంతో అర్జున్‌కు బాక్స్‌లో ఎంత వెతికినా సరైన కీ దొరకలేదు. కీ కింద పడేయకూడదు కదా.. సంచాలకులు చెప్పాలి కదా అని గరమయ్యాడు. యావరే కీ కింద పడేశాడని తెలిసినా శివాజీ పెదవి విప్పలేదు. ఇక పాయింట్ల పట్టికలో యావర్ దిగువన ఉండటంతో రేసు నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. ఈ క్రమంలో తన పాయింట్లను పల్లవి ప్రశాంత్‌కు ఇచ్చాడు. అమర్ విజయంపై డౌట్ తర్వాత పట్టుకో తెలుసుకో టాస్క్ జరగ్గా ఇందులో అమర్దీప్ గెలిచాడు. కానీ కళ్లు కనిపించకుండా ఇచ్చిన మాస్క్‌లు సరిగా పనిచేస్తున్నాయో, లేదోనని యావర్ చెక్ చేయడంతో అమర్ అసహనానికి లోనయ్యాడు. నేను గెలిచినప్పుడే అందరికీ అనుమానాలు వస్తాయని ఆవేశపడ్డాడు. తర్వాత బ్యాలెన్స్ ది బాల్ టాస్కు జరిగింది. బ్యాలెన్స్ టాస్కులకు పెట్టింది పేరైన ప్రశాంత్ ఈ గేమ్‌లో గెలిచాడు. ఇక ఈ టాస్కు ప్రారంభంలో నిన్ను ఓడిస్తా చూడు అని అమర్‌కు ఛాలెంజ్ చేశాడు గౌతమ్. అన్నట్లుగానే అమర్ ఓడిపోయిన తర్వాత గౌతమ్ ఆటలో నుంచి పక్కకు వెళ్లిపోయాడు. గౌతమ్ తనతో ఛాలెంజ్ చేసిన విషయాన్ని శోభాతో చెప్పాడు అమర్. దీంతో శోభ.. అతడు ఈ టికెట్ టు ఫినాలే రేసులో ఒక్క టాస్క్ కూడా గెలవలేదంటూ డాక్టర్ బాబును హేళన చేసి మాట్లాడింది. ఒక్క టాస్క్ కూడా గెలవని గౌతమ్ మొత్తానికి పాయింట్ల పట్టికను చూస్తుంటే అమర్- పల్లవి ప్రశాంత్ మధ్య గట్టి పోటీ ఉండేట్లు కనిపిస్తోంది. పాపం.. అర్జున్ గట్టిగా ప్రయత్నిస్తున్నా తనకెవరూ పాయింట్లు దానం చేయకపోవడంతో స్కోర్ బోర్డులో వెనుకబడ్డాడు. ఇక ప్రియాంక.. గౌతమ్‌ను తన పాయింట్లు అమర్‌కే ఇవ్వాలని మాట తీసుకుంది. దీంతో అతడు అమర్‌కు దానం చేయడం గ్యారెంటీ! సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం రైతుబిడ్డ రేసు నుంచి తప్పుకోగా అమర్ వర్సెస్ అర్జున్ మాత్రమే టికెట్ టు ఫినాలే కోసం పోటీపడనున్నట్లు తెలుస్తోంది. మరి వీరిలో ఎవరు గెలుస్తారో వేచి చూడాలి! చదవండి: దిల్ రాజు ఇంట పెళ్లి సందడి.. 'రౌడీ బాయ్స్' హీరో ఎంగేజ్మెంట్ -
Bigg Boss 7: మాటలు జారిన అమర్.. ప్రియాంక తప్పు చేయకపోయినా సరే అలా!
బిగ్‌బాస్ ప్రస్తుత సీజన్లో ఫినాలేలో తొలి స్థానం కోసం మంచి పోటీ నడుస్తోంది. మంగళవారం ఓ మూడు గేమ్స్ జరగ్గా.. తాజాగా మరో రెండు గేమ్స్ జరిగాయి. ఇందులో SPY(శివాజీ, ప్రశాంత్, యావర్) బ్యాచ్‌కి షాక్ తగిలింది. మరోవైపు సీరియల్ బ్యాచ్ లో ప్రియాంకని ఒంటరి చేసేశారు. శోభా-అమర్ కలిసి ఈమెపై మానసికంగా దాడి చేశారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో అసలేం జరిగిందనేది Day 87 హైలెైట్స్లో ఇప్పుడు చూద్దాం. ఓ దాంట్లో టాప్.. మరో దానిలో ఫెయిల్ సోమవారం మూడు గేమ్స్ జరగ్గా.. రెండింటిలో అర్జున్ విజయం సాధించాడు. తాజాగా బుధవారం పెట్టిన గేమ్స్‌లోనూ అర్జున్ చాలా స్మార్ట్‌గా వ్యవహరించాడు. 'టికెట్ టూ ఫినాలే' కోసం 'ఎత్తరా జెండా' అని పెట్టిన నాలుగో గేమ్‌లో ప్రశాంత్, యావర్ తొలి రెండు స్థానాల్లో నిలవగా.. అర్జున్ మూడో స్థానం సంపాదించాడు. ఇక 'గెస్ చేయ్ గురూ' అని పెట్టిన ఐదో గేమ్‌లో.. వినిపించే సౌండ్స్ బట్టి, అవేంటనేవి వరసగా పలకపై రాయాల్సి ఉంటుంది. ఇందులో అర్జున్ 31 పాయింట్లతో టాప్‌లో నిలిచాడు. ఇదే పోటీలో సరిగా ఆడని కారణం.. ప్రశాంత్, యావర్ మధ్యలో ఔట్ అయిపోయారు. అలా స్పై బ్యాచ్ ఎదురుదెబ్బ తగిలింది (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రియాంక పాయింట్స్ దానం ఇక ఐదు గేమ్స్ పూర్తయిన తర్వాత చివరి స్థానంలో ప్రియాంక ఉన్న కారణంగా.. 'టికెట్ టూ ఫినాలే' రేసు నుంచి ఆమెని బిగ్‌బాస్ తప్పించాడు. అయితే ఆమె దగ్గరున్న వాటిలో సగం పాయింట్స్ వేరొకరికి ఇచ్చేయాల్సి ఉంటుంది చెప్పగా.. 125 పాయింట్లని గౌతమ్‌కి ఇచ్చేసింది. దీంతో ఓవరాల్ పొజిషన్లో గౌతమ్... మూడో స్థానానికి చేరుకున్నాడు. అయితే ఆ పాయింట్లు తనకు ఇస్తుందనుకున్న అమర్.. ప్రియాంకపై అలిగాడు. మాటలు జారిన అమర్ ప్రియాంక ఎలిమినేట్ అయిపోయి, తన పాయింట్లు గౌతమ్‌కి ఇచ్చేయడాన్ని అమర్ తీసుకోలేకపోయాడు. ఆమె తప్పు చేసిందని అన్నాడు. అది తన గేమ్, తను ఎవరికైనా ఇచ్చుకోవచ్చు అని శోభా.. పరిస్థితి వివరించడానికి చూసింది. కానీ అమర్ తీసుకోలేకపోయాడు. కాసేపటి తర్వాత ప్రియాంకతో మాట్లాడుతూ.. నాకు ఇవ్వాలనిపించలేదా? అని అమర్.. డైరెక్ట్‌గా ఆమెనే అడిగాడు. ప్రియాంక, అమర్‌కి పరిస్థితి అర్థమయ్యేలా చెప్పడానికి చూస్తుంటే.. 'వెధవని అయిపోయింది నేనేగా' అని అమర్ మాట జారాడు. ఏం చెప్పాలనుకుంటున్నావ్, క్లియర్‌గా చెప్పి వెళ్లు అని ప్రియాంక.. తిరిగి మాట్లాడుతుండగానే అమర్ అక్కడి నుంచి లేచి వెళ్లిపోయాడు. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) అమర్ ఇలా తయారయ్యాడేంటి? ప్రియాంకపై ఏది పడితే మాట్లాడేసిన అమర్.. 'అస్సలు ఎక్స్పెక్ట్ చేయకూడదు, మన అనేది ఎక్స్పెక్ట్ చేయకూడదు' అని తనలో తానే ఏదేదో మాట్లాడేసుకున్నాడు. 'పిచ్చ నా కొడకా, ఇప్పుడైనా నీకు కళ్లు తెరుచుకుంటే బాగుపడతావ్' అని తనని తానే తిట్టుకున్నాడు. మరోచోట.. ప్రియాంక, గౌతమ్‌తో మాట్లాడుతూ.. వాళ్లకు వాళ్లకే గ్రాటిట్యూడ్ ఉంటుంది, మాకు ఉండదా అని శోభా-అమర్‌ని ఉద్దేశిస్తూ తన మనసులో మాట బయటపెట్టింది. ఇదంతా జరిగిన కాసేపటి తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. చేసిన దానికి క్షమాపణలు చెప్పింది. తప్పయిపోయింది, ప్లీజ్ క్షమించు అని బతిమాలాడుకుంది. అయినా సరే అమర్.. శాంతించలేదు. దీంతో మిగతా వాళ్లతో ఈ విషయం గురించి మాట్లాడుతూ కన్నీళ్లు పెట్టుకుంది. ఇక్కడ ఓ విషయం మాత్రం వింతగా అనిపించింది. ఎందుకంటే అమర్.. మరీ స్వార్థపరుడిలా ప్రవర్తించాడా అనే సందేహం వచ్చింది. ఎంత ఫ్రెండ్స్ అయితే మాత్రం ప్రియాంక ఏం చేయాలో కూడా అమరే డిసైడ్ చేస్తాడా? ఆమెకు స్వాతంత్రం లేదా అనిపించింది. అలా బుధవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'సలార్' స్టోరీ లీక్ చేసిన డైరెక్టర్ ప్రశాంత్ నీల్.. అదీ మ్యాటర్!) -
Bigg Boss 7: సీరియల్ బ్యాచ్ కొట్లాట.. చివరకొచ్చేసరికి ఇలా తయారయ్యేంట్రా!
బిగ్‌బాస్ గత సీజన్స్ మాటేమో గానీ ఈసారి మాత్రం బ్యాచ్‌ల గోల ఎక్కువైంది. అంతెందుకు రీసెంట్ వీకెండ్ ఎపిసోడ్లో స్వయంగా హోస్ట్ నాగార్జున ఒప్పుకొన్నాడు. చుక్క బ్యాచ్, ముక్క బ్యాచ్ అని చెప్పుకొచ్చాడు. ఇందులో శివాజీ ఆధ్వర్యంలోని ముక్క బ్యాచ్ బాగానే ఉంది. చుక్క బ్యాచ్ అధ్వానంగా తయారైంది. బయటవాళ్లతో కాదు వీళ్లలో వీళ్లే గొడవపడి ఆ తప్పు చేస్తున్నట్లు అనిపిస్తుంది. ఇంతకీ ఏం జరుగుతోంది? (ఇదీ చదవండి: బ్రేకప్ స్టోరీ బయటపెట్టిన యాంకర్ శ్రీముఖి.. పెళ్లి గురించి హింట్!) ప్రస్తుత సీజన్లో సీరియల్ బ్యాచ్ సభ్యులైన అమర్, ప్రియాంక, శోభా.. ప్రారంభం నుంచి ఒక్కటిగా ఆడుతున్నారు. మరోవైపు శివాజీ, ప్రశాంత్, యావర్.. ఓ బ్యాచ్‌గా ఆడుతున్నారు. నామినేషన్స్ దగ్గర నుంచి గేమ్స్ వరకు పోటీ అంతా వీళ్ల మధ్య ఉంటోంది. శివాజీ బ్యాచ్‌తో పోలిస్తే సీరియల్ బ్యాచ్ కొన్ని విషయాల్లో బెటర్. కానీ ఇప్పుడు వీళ్లే తమ నిల్చున్న కొమ్మ తామే నరుక్కుంటున్నట్లు అనిపిస్తోంది. తాజాగా 'టికెట్ టూ ఫినాలే' కోసం పోటీలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శోభా, శివాజీ ఇప్పటికే తక్కువ పాయింట్లు సాధించిన కారణంగా గేమ్ నుంచి సైడ్ అయిపోయారు. అమర్, ప్రశాంత్, అర్జున్, గౌతమ్, యావర్, ప్రియాంక.. ఇలా దాదాపుగా అబ్బాయిలే ఉన్నారు. ఇప్పుడు ప్రియాంక కూడా తక్కువ పాయింట్లు ఉన్న కారణంగా గేమ్ నుంచి సైడ్ అవ్వాలి. దీంతో ఆమె తన సగం పాయింట్లని వేరొకరికి ఇవ్వాలని చెప్పగా, గౌతమ్‌కి ఇచ్చేసింది. (ఇదీ చదవండి: Kiraak RP Marriage: సీక్రెట్‌గా పెళ్లి చేసుకున్న కమెడియన్ కిర్రాక్ ఆర్పీ..) 12వ వారం ప్రియాంక కెప్టెన్ కావడానికి గౌతమ్ సాయం చేశాడు. ఇప్పుడు పాయింట్స్ ఇచ్చి అతడి రుణం తీర్చుకుంది. అయితే పాయింట్స్ ఇవ్వడానికి తాను కనిపించలేదా అని అమర్ హర్ట్ అయిపోయారు. దీంతో శోభా-అమర్ ఒక్కటైపోయారు. ప్రియాంకని వేరు చేసి చూస్తున్నారు. ఇన్నాళ్లు ఒక్కటిగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. శివాజీని అన్ని విషయాల్లోనూ ఎదుర్కొంటూ వచ్చారు. ఇప్పుడు చివరకొచ్చేసరికి వీళ్లలో వీళ్లు కొట్లాడుకుని.. శివాజీ బ్యాచ్ కి హెల్ప్ అయ్యేలా ఉన్నారనిపిస్తుంది. ఒకవేళ ఇలానే జరిగితే మాత్రం.. తెలియకుండానే శివాజీ బ్యాచ్ కి హెల్ప్ చేసినట్లు అవుతుంది. గేమ్‌లో ఉన్న ఆ కాస్త మజా కూడా పోవడం గ్యారంటీ. అయితే ఈ గొడవలో ప్రియాంక కాస్త ఆలోచనతో వ్యవహరించినట్లు అనిపించింది. అమర్ మాత్రం ప్రతిదానికి అలుగుతూ తనపై ఉన్న సింపతీని కాస్త నెగిటివిటీ చేసుకునేలా కనిపిస్తున్నాడు. మరోవైపు అతడికి సపోర్ట్ చేస్తున్న శోభా కూడా తెలియకుండానే మరింత నెగిటివీ తెచ్చుకుంటోందనిపిస్తోంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి రాబోతున్న 25 సినిమాలు) -
బిగ్‌బాస్: అమర్‌కు ఝలక్ ఇచ్చిన ప్రియాంక..
విజయవంతంగా దూసుకుపోతున్న బిగ్‌బాస్ తెలుగు ఏడో సీజన్ ముగింపు దశకు చేరుకుంటోంది. ప్రస్తుతం హౌస్‌లో ఎనిమిది మంది ఉన్నారు. వీరిలో ఎవరు టాప్ 5లో ఉంటారు? ఎవరు విజేతగా అవతరిస్తారు? అనేది అత్యంత ఆసక్తికరంగా మారింది. అయితే ఫినాలేలో అందరి కంటే ముందు అడుగుపెట్టేందుకు బిగ్‌బాస్ ఫినాలే అస్త్రను ప్రవేశపెట్టాడు. ఇది గెలిచినవారు నేరుగా టాప్ 5కి చేరుకుంటారు. ఇప్పటికే టికెట్ టు ఫినాలే మొదలైంది. ఇందులో భాగంగా పలు గేమ్స్ ఆడిస్తున్నాడు బిగ్‌బాస్. తొలి ఆటలో అర్జున్ గెలవగా రెండో టాస్క్‌లో ప్రశాంత్ గెలిచాడు. ఈరోజు హౌస్‌లో మరిన్ని టాస్కులు ఆడించాడు బిగ్‌బాస్. మూడో టాస్క్‌లో అర్జున్, నాలుగో టాస్కులో ప్రశాంత్ విజయం సాధించినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత ఇచ్చిన మరో టాస్క్‌లో అమర్దీప్ విజేతగా నిలిచాడు. తక్కువ పాయింట్లు ఉన్నవారు ఒక్కొక్కరిగా రేసులో నుంచి అవుట్ అవుతున్నారు. ఇప్పటివరకు శివాజీ, శోభతో పాటు ప్రియాంక సైతం గేమ్‌లో అవుట్ అయినట్లు తెలుస్తోంది. అయితే తన పాయింట్లను అమర్‌కు కాకుండా తన కెప్టెన్సీ కోసం పోరాడిన గౌతమ్‌కు ఇచ్చిందట! ప్రస్తుతం టికెట్ టు ఫినాలే రేసులో ప్రశాంత్, అర్జున్, అమర్దీప్, గౌతమ్, యావర్ ఉన్నారు. వీరిలో గౌతమ్ దగ్గర తక్కువ పాయింట్లు ఉన్నాయని టాక్! మరి ఫినాలే అస్త్ర ఎవరి సొంతమవుతుంది? ఎవరు టాప్ 5లో తొలుతగా చోటు దక్కించుకుంటారనేది ఆసక్తికరంగా మారింది. -
శివాజీ ఆటలో బలిపశువుగా అర్జున్.. ఈ వారం అస్సాం టికెట్ ఫిక్స్!
ఎలిమినేషన్‌కు పునాదులు పడేది నామినేషన్లోనే! కేవలం నామినేట్ అయితేనే ఎలిమినేట్ అయిపోరు.. ఇక్కడ ఎవరు ఏ కారణాలు చెప్తున్నారు? ఎవరి తప్పొప్పులు బయటపడుతున్నాయి? ఇలా అన్నింటినీ గమనిస్తారు ప్రేక్షకులు. ఎవరైతే కరెక్ట్ అనిపిస్తారో వారికి సపోర్ట్‌గా ఉంటారు. ఫలానా వాళ్లు తప్పనిపిస్తే వారికి ఓట్లేయడం మానేసి బయటకు పంపించేస్తారు. మరి ఈ పదమూడోవారం నామినేషన్ ప్రక్రియ ఎలా జరిగిందో చూసేద్దాం... అబద్ధాలు ఆడుతున్నానా? ఈ వారం నామినేషన్ ప్రక్రియ రైతుబిడ్డతో మొదలైంది. సీక్రెట్ టాస్క్‌లో కూడా నీ ఫ్రెండ్ శోభాను కాపాడాలనుకున్నావ్, అది నచ్చలేదంటూ ప్రియాంకను, వీఐపీ రూమ్‌లోని దుప్పటి దాచుకుని వాడుతున్నావంటూ శోభాను నామినేట్ చేశాడు ప్రశాంత్. గౌతమ్.. ప్రియాంక, శివాజీకి రంగు పూశాడు. తర్వాత ప్రియాంక మాట్లాడుతూ.. నాగార్జున సార్ ముందు నేను అబద్ధాలే ఆడతానని నెగెటివిటీ స్ప్రెడ్ చేశారు... అది నేను తీసుకోలేకపోతున్నాను అంటూ శివాజీకి రంగు పూసింది. తర్వాత ప్రశాంత్‌ను నామినేట్ చేసింది. పెద్ద తప్పు చేసిన అర్జున్ ఒక్కోసారి చిన్న తప్పులే మన మెడకు చుట్టుకుంటాయి. అలా గతవారం సెల్ఫ్ నామినేట్ చేసుకుని ఏకంగా ఎలిమినేట్ అయిపోయింది అశ్విని. ఇక ఎప్పుడూ తెలివిగా నామినేషన్స్ వేసిన అర్జున్ అంబటి ఈవారం సరిదిద్దుకోలేని తప్పు చేశాడు. కెప్టెన్సీ కోసం తనకు మద్దతుగా నిలబడ్డ శివాజీని నామినేట్ చేశాడు. నిజానికి శివాజీ.. అర్జున్ను అడ్డుపెట్టుకుని అమర్ మీద కసి తీర్చుకున్నాడు. అతడిని కెప్టెన్ కానీయకుండా చేశాడు. ఈ విషయాన్ని హౌస్‌లో గౌతమ్ తప్ప ఎవరూ పసిగట్టలేకపోయారు. అర్జున్ అప్పుడే ఓ మెట్టు దిగి అమర్‌ను కెప్టెన్ చేయండి అని చెప్పుంటే హీరో అయ్యేవాడు. అర్జున్‌కు దెబ్బ పడింది అప్పుడు సైలెంట్‌గా ఉండి ఇప్పుడు శివాజీని నామినేట్ చేయడం వల్ల అందరి దృష్టిలో విలన్ అయిపోయాడు. ఫినాలే దగ్గరకు వస్తున్నా సొంతంగా ఆడకపోవడం కరెక్ట్ కాదంటూ ప్రియాంకను నామినేట్ చేశాడు. తర్వాత శివాజీ వంతురాగా.. అర్జున్ ఇచ్చిన ఫ్రెండ్షిప్ బ్యాండ్ తీసేశాడు. నువ్వు గేమ్ ఆడుతున్నావని తెలిసాక కూడా ఇది ఉంచుకోవడం కరెక్ట్ కాదన్నాడు. నీకు కెప్టెన్ కావాలని ఇంట్రస్ట్ లేకపోతే మొదట్లోనే చెప్పేస్తే సరిపోయేది.. ఇప్పుడు నేను పిచ్చోడిని అయిపోయాను అంటూ అర్జున్ను నామినేట్ చేశాడు. తర్వాత తనను నామినేట్ చేసిన గౌతమ్‌కు రివేంజ్ నామినేషన్ వేశాడు. తప్పు చేసిన అమర్, ఏడ్చేసిన ప్రశాంత్ అనంతరం అమర్దీప్ చౌదరి కూడా ఓ పెద్ద తప్పు చేశాడు. కెప్టెన్సీ టాస్కులో తనకు సపోర్ట్ చేసిన ప్రశాంత్‌ను నామినేట్ చేశాడు. బీబీ మ్యాన్షన్ గేమ్‌లో నువ్వు అంత త్వరగా చనిపోవడం నచ్చలేదు. నీతో గేమ్ ఆడటం మిస్ అయ్యానంటూ సిల్లీ రీజన్ చెప్పాడు. ఇది విని షాకైన ప్రశాంత్.. నిన్ను నమ్మినందుకు బాధపడుతున్నా అని ఏడ్చేశాడు. నమ్మకద్రోహం అని మాట్లాడకు.. నీకు వేయను పో అని అమర్ అన్నప్పటికీ ప్రశాంత్ అక్కడినుంచి కదలకపోవడంతో రైతుబిడ్డకు రంగు పూశాడు అమర్. అలాగే తనకు కెప్టెన్సీ కోసం సాయపడలేదని గౌతమ్‌ను నామినేట్ చేశాడు. తర్వాత యావర్.. గౌతమ్, ప్రియాంకను నామినేట్ చేశాడు. చివరిగా శోభా.. ప్రశాంత్, యావర్‌లను నామినేట్ చేసింది. మొత్తంగా ఈ వారం అమర్దీప్ మినహా మిగతా అందరూ నామినేట్ అయ్యారు. చదవండి: ఓటీటీలో దూసుకుపోతున్న తెలుగు చిత్రం.. నిర్మాతకు కాస్ట్లీ కారు గిఫ్ట్ -
Bigg Boss 7: బయటకొచ్చేస్తానని శివాజీ డ్రామా? అమర్ నిజస్వరూపం బట్టబయలు!
బిగ్‌బాస్ షోలో కాస్తోకూస్తో ఆసక్తిగా ఉండేవి అంటే నామినేషన్స్, వీకెండ్ ఎపిసోడ్ మాత్రమే. ఈ సీజన్లో నామినేషన్స్ తప్ప వీకెండ్ ఎపిసోడ్స్ బోరింగ్‌గా సాగుతూ వచ్చాయి. ఇన్నాళ్లకు ఓ వీకెండ్ ఎపిసోడ్ ఇంట్రెస్టింగ్గా అనిపించింది. హోస్ట్ నాగార్జున అయితే ఒక్కొక్కరిని నిలబెట్టి కడిగేశాడు. అలానే చాలామంది ఊహించినట్లే అశ్విని ఎలిమినేట్ అయిపోయింది. ఇంతకీ శనివారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 83 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ భుజం డ్రామా కెప్టెన్సీ టాస్క్‌లో తనకు అన్యాయం జరగడంపై అమర్ రాత్రంతా ఏడుస్తూనే ఉన్నాడు. ఎవరొచ్చి చెప్పినా సరే ఆ బాధ నుంచి బయటకు రాలేకపోయాడు. ఇక శివాజీని కన్ఫెషన్ గదికి పిలిచిన బిగ్‌బాస్.. భుజం నొప్పి తగ్గిందా? అంతా ఓకేనా అని ఆరా తీశాడు. డాక్టర్స్ చెప్పిన దాని ప్రకారం కోలుకుంటున్నారని, రాబోయే వారాల్లో టఫ్ గేమ్స్ ఉంటాయని చెప్పాడు. హౌసులో ఉండాలనుకుంటున్నారా? బయటకొచ్చేయాలనుకుంటున్నారా? అని బిగ్‌బాస్ అడగ్గా.. కాస్త టైమ్ ఇస్తే ఆలోచించి చెబుతానని అన్నాడు. అయితే ఇకపై హౌసులో మీ గాయానికి ఎలాంటి ప్రమాదం జరిగినా బాధ్యత అంతా మీదే అని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు. తొలుత కొనసాగుతానని చెప్పిన శివాజీ.. కాసేపటి తర్వాత మనసు మార్చుకుని.. బయటకెళ్లిపోతా అని అన్నాడు. (ఇదీ చదవండి: ఆస్పత్రిలో చేరిన 'జబర్దస్త్' ఫైమా.. అసలు ఏమైందంటే?) ధైర్యం చెప్పిన నాగ్ ఇదంతా జరిగిన తర్వాత హోస్ట్ నాగార్జున కూడా కన్ఫెషన్ రూంకి పిలిచి మరీ శివాజీ ఆరోగ్య పరిస్థితి గురించి ఆరా తీశాడు. 100 శాతం ఎఫర్ట్ పెట్టలేనప్పుడు కప్ ఆశించడం కరెక్ట్ కాదని, అందుకే వెళ్లిపోతానని అన్నట్లు శివాజీ చెప్పాడు. ఎక్కువ ఆలోచించొద్దు, భయమనేది వద్దని నాగ్ కాస్త సర్దిచెప్పేసరికి శివాజీ అంగీకరించాడు. ఇకపై ఏం జరిగినా బాధ్యత తనదేనని చెప్పాడు. దీనిబట్టి చూస్తే.. ఒకవేళ గాయం ఏమైనా తిరగబెడితే మాత్రం ఎప్పుడైనా సరే శివాజీ హౌస్ నుంచి బయటకెళ్లిపోయే ఛాన్స్ ఉంది. మరి చివరి వారం వరకు ఉంటాడా లేదా అనేది అతడి గాయం తీవ్రత బట్టి ఆధారపడి ఉంటుంది. అమర్ నిజస్వరూపం ఎవిక్షన్ పాస్ గెలుచుకున్న ప్రశాంత్‌ని నాగార్జున మెచ్చుకున్నాడు. ఆ తర్వాత అశ్విని నిలబెట్టి.. డబుల్ ఎలిమినేషన్ అని తెలిసి కూడా సెల్ఫ్ నామినేట్ చేసుకుంటావా? కాన్ఫిడెన్సా, ఓవర్ కాన్ఫిడెన్సా? అని అని నాగ్ సీరియస్ అయ్యాడు. అనంతరం అమర్‌తో మాట్లాడాడు. గతంలో ప్రశాంత్ ఏడుస్తుంటే, దాన్ని యాక్టింగ్ అని అమర్ అందులో అన్నట్లు ఉంది. తాజాగా కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా అమర్ ఏడవటాన్ని లింకప్ చేసి నాగ్ ప్రశ్నించాడు. వేరేవాళ్లు ఏడిస్తే, వాళ్లది యాక్టింగ్ అని నువ్వు అన్నావ్.. ఇప్పుడేమో నువ్వు చేసింది యాక్టింగా? అని నాగ్ అడిగేసరికి.. నా వరకు వస్తే గానీ తెలియలేదు అని అమర్ తన అభిప్రాయం చెప్పాడు. అలానే గత వారం కెప్టెన్సీ టాస్క్ సందర్భంగా తన ఏడిచింది స్ట్రాటజీ అని శివాజీతో మాట్లాడుతూ అమర్ ఓ సందర్భంలో చెప్పాడు. ఆ వీడియోని కూడా స్క్రీన్‌పై ప్లే చేసిన నాగ్.. ఇదేంటని అడిగాడు. అమర్ ఏదో చెప్పబోతుంటే.. నీ విషయంలో ఏది యాక్టింగ్? ఏది జెన్యూనిటీ? ఏది స్ట్రాటజీ? అనేది మాకే అర్థం కావట్లేదని నాగ్ అసహనం వ్యక్తం చేశాడు. ఏదైనా సరే కెప్టెన్సీ కంటే కప్ ముఖ్యం అని చెప్పి అమర్‌ని నాగ్ శాంతింపజేశాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: రైతుబిడ్డ వల్ల రెండోసారి రతిక ఎలిమినేట్.. వేరే లెవల్ రివేంజ్!) శివాజీ వాదన శివాజీ.. కెప్టెన్సీ విషయమై అమర్‌కి మాటిస్తున్నా అన్నావ్? మాట కోసం చచ్చిపోతాను అన్నావ్? ఎందుకు మాట మార్చావ్ అని నాగ్, శివాజీని అడిగాడు. దానికి శివాజీ ఏదేదో చెప్పుకొచ్చాడు. అమర్ కెప్టెన్ అయితే తన డిప్యూటీలుగా ప్రియాంక-శోభాని పెట్టుకుంటానన్నాడని అది తనకు నచ్చలేదని, అలానే ప్రియాంక కెప్టెన్సీలో చాలా విషయాలు కరెక్ట్‌గా జరగలేదని నాగ్ ముందే చెప్పాడు. మధ్యలో లేచిన ప్రియాంక.. నాగ్ ముందే శివాజీతో వాదన పెట్టుకుంది. ఇదంతా కూడా చిన్నపిల్లలా యవ్వారంలా అనిపించింది తప్పితే డీసెంట్‌గా అయితే లేదు. అలానే 'హత్య టాస్క్' సందర్భంగా శోభాకి సీక్రెట్ చెప్పి, ఆమె డెడ్ అవ్వకుండా ప్రియాంక కాపాడింది. ఈ వీడియోని చూపించిన నాగ్.. ప్రియాంకని కూడా ఓ రేంజులో ఇచ్చిపడేశాడు. మీ ముగ్గురూ(అమర్-ప్రియాంక-శోభా).. ఒకరికి ఒకరు హెల్ప్ చేసుకుంటున్నారని సీరియస్ అయ్యాడు. అశ్విని ఎలిమినేట్ చివర్లో యావర్‌ని కూడా నిలబెట్టి కెప్టెన్ అంటే హౌస్ మొత్తానికి కెప్టెన్ అని, ఆమెతో నామినేషన్స్ సందర్భంగా ప్రవర్తించిన తీరు సరికాదని చెప్పిన నాగార్జున.. యావర్‌తో ప్రియాంకకు సారీ చెప్పించాడు. కట్ చేస్తే ఈ వారం డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని గుర్తుచేసిన నాగ్.. గన్‌తో పేల్చడం అనేది పెట్టి అశ్విని ఎలిమినేట్ అయినట్లు ప్రకటించారు. అయితే ప్రశాంత్.. నువ్వేమైనా ఎవిక్షన్ పాస్ ఇప్పుడు ఉపయోగిస్తావా అని అడగ్గా.. 14వ వారం వేరొకరి కోసం ఉపయోగిస్తానని ప్రశాంత్, నాగార్జునకు మాటిచ్చేశాడు. అలా శనివారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన తెలుగు స్టార్ హీరోయిన్.. ఈమె ఎవరంటే?) -
అమర్‌ని మోసం చేసిన శివాజీ? చివరకు అలాంటి పరిస్థితి!
బిగ్‌బాస్ హౌస్‌లో అమర్ మరోసారి బలైపోయాడు. శివాజీ దారుణంగా మోసం చేశాడు. దీంతో నొప్పి తట్టుకోలేకపోయాడు. చివర్లో ఓకే చెప్పాడు గానీ బిగ్ బాస్ ట్విస్ట్ ఇవ్వడంతో హౌస్మేట్స్ అందరూ షాకయ్యారు. అయితే ఆ ఒక్కటి చేయకపోవడమే అమర్ కెప్టెన్సీపై దెబ్బేసింది. ఇంతకీ శుక్రవారం ఏం జరిగిందనేది Day 82 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. చివరి కెప్టెన్సీ టాస్క్ ఈ వారం నామినేషన్స్ తర్వాత 'హత్యల టాస్క్' ఇచ్చిన అని బిగ్‌బాస్ గేమ్ పెట్టాడు. అది అయిపోవడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. ఏడో సీజన్లో చిట్టచివరి కెప్టెన్ కోసం 'పాయింట్ బ్లాంక్' అని టాస్క్ పెట్టడంతో శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఈ గేమ్ ప్రకారం.. ఓ చోట రెండు ఫొటోలు చూపిస్తారు. ఇద్దరు హౌస్మేట్స్ ఓ నిర్ణయానికొచ్చి, ఆ రెండు ఫొటోల్లో కెప్టెన్ కావడానికి ఎవరు అనర్హులో గన్‌తో కాల్చేయాల్సి ఉంటుందని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చాడు. (ఇదీ చదవండి: 'కోటబొమ్మాళి పీఎస్' సినిమా రివ్యూ) ఎవరు ఎవరిని కాల్చారు? ఎవరిని సేవ్ చేశారు? హౌస్మేట్స్ షూట్-సేఫ్ గౌతమ్ , ప్రియాంక - శోభా, అర్జున్ ప్రశాంత్, శోభాశెట్టి - అశ్విని, అమర్ యావర్, రతిక - ప్రశాంత్, శివాజీ శివాజీ, అశ్విని - యావర్, అర్జున్ అమర్, అర్జున్ - ప్రియాంక, శివాజీ యావర్, రతిక - గౌతమ్, అర్జున్ ప్రియాంక, అశ్విని - రతిక, అమర్ అమర్, గౌతమ్ - శివాజీ, అర్జున్ శివాజీ, శోభా - అర్జున్, అమర్ అమర్ కెప్టెన్సీ పిచ్చి గత వీకెండ్ సందర్భంగా.. 12వ వారం గురించి రెండు ట్విస్టులు ఇచ్చాడు. డబుల్ ఎలిమినేషన్ ఉంటుందని, అలానే కెప్టెన్సీ టాస్క్ కూడా ఈ వారం చివరిదని హోస్ట్ నాగార్జున చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఉన్నవాళ్లలో అమర్, అశ్విని, రతిక.. కెప్టెన్ కాలేదు. దీంతో అమర్, తన ఫొటో కాల్చొద్దని అందరినీ బతిమలాడుకున్నాడు. దీనికి అందరూ ఓకే చెప్పారు కూడా. అయితే మిగతా వాళ్లతో పోలిస్తే.. నేను కెప్టెన్ అవ్వాలి, లేకపోతే ఉండలేను అనేంత రేంజులో అమర్ హడావుడి చేశాడు. దీన్ని పిచ్చి అంటారా? లేదా ఇంకేదైనా అంటారా అనేది అర్థం కాలేదు. శివాజీ వెన్నుపోటు? హౌస్‌లోకి వచ్చినప్పటి నుంచి అమర్ అంటే శివాజీకి ఎందుకో కోపం. కారణమున్నా లేకపోయినా సరే కొన్నివారాలు అతడినే నామినేట్ చేసేవాడు. ఇక ఇది చివరి వారమని.. తనకు కెప్టెన్ అయ్యే ఛాన్స్ ఇవ్వాలని.. టాస్క్ ప్రారంభానికి ముందే అమర్ అడిగాడు. దానికి శివాజీ కూడా సరేనన్నాడు. కానీ చివర్లో అర్జున్, అమర్ ఫొటోలు వచ్చేసరికి తన ఓటు అర్జున్‌కి వేస్తున్నట్లు చెప్పాడు. అమర్ విషయంలో ప్లేటు తిప్పేశాడు. శివాజీకి జోడిగా ఉన్న శోభా మాత్రం.. అమర్ పేరు చెప్పింది. దీనిబట్టి చూస్తే శివాజీ.. మరోసారి అమర్ అంటే కోపాన్ని బయటపెట్టడంతో పాటు వెన్నుపోటు పొడిచేశాడు. (ఇదీ చదవండి: Aadikeshava Review: 'ఆదికేశవ' సినిమా రివ్యూ) అదే కొంపముంచింది అయితే అర్జున్ భార్య అతడిని కెప్టెన్ కావాలని కోరుకుందని, అందుకే తన పేరు చెప్పినట్లు శివాజీ తన కారణం చెప్పాడు. దీంతో అమర్-శివాజీ మధ్య చాలాసేపు డిస్కషన్ జరిగింది. అమర్ అయితే నేను ఎలాగైనా కెప్టెన్ కావాలన్నా అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. ఓవైపు అర్జున్ తన స్టాండ్ బలంగా చెబుతుండేసరికి.. ఇది ఎంతకీ తెగలేదు. దీంతో ఇక నిర్ణయం చెప్పకపోతే.. కెప్టెన్సీనే పూర్తిగా రద్దు చేస్తామని హెచ్చరించాడు. అప్పుడు ఇక వేరే దారిలేక శోభా-శివాజీ కలిసి.. అర్జున్ పేరు చెప్పారు. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగింది. అర్జున్ ఫొటోతో పాటు అమర్ ఫొటో కూడా కాలిపోయింది. అయితే ఈ విషయంలో శివాజీది ఎంత తప్పుందో అమర్ది కూడా అంతే తప్పుందని చెప్పొచ్చు. ఏడుస్తూ టైమ్ వేస్ట్ చేసుకోకుండా శివాజీని కన్విన్స్ చేసి ఉండాల్సింది. కానీ బ్యాడ్ లక్. నిర్ణయం ఆలస్యమయ్యేసరికి అర్జున్‌తో పాటు అమర్ ఫొటో కూడా కాలిపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. మరీ అమర్ కొత్త కెప్టెన్ అవుతాడా? లేదా? అనేది శనివారం ఎపిసోడ్లో తేలుతుందిలే. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 23 సినిమాలు) -
చిట్టచివరి కెప్టెన్సీ.. బిగ్ ట్విస్ట్ ఇచ్చిన బిగ్‌బాస్!
బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం పదిమంది మిగిలారు. వీరిలో ప్రశాంత్, అశ్విని, రతిక మినహా మిగతా అందరూ కెప్టెన్లయ్యారు. ఈసారి అందరికీ అవకాశమిస్తూ బిగ్‌బాస్ ఈ సీజన్లోనే చివరి కెప్టెన్సీని ప్రవేశపెట్టాడు. కానీ ఎప్పటిలాగే ఈసారి కూడా కెప్టెన్సీని హౌస్మేట్స్ చేతుల్లో పెట్టాడు బిగ్‌బాస్. గన్ షూటింగ్ వినబడిన ప్రతిసారి దాని ముందుకు ఇద్దరు ఇంటిసభ్యులు రావాల్సి ఉంటుంది. వాళ్లకు బిగ్‌బాస్ రెండు ఫోటోలు చూపిస్తాడు. అందులో ఒకరిని కెప్టెన్సీ పోటీ నుంచి తప్పిస్తూ షూట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అమర్, అశ్విని ఫోటోలు రాగా.. శోభ, ప్రశాంత్ ఇద్దరూ అమర్‌కు సపోర్ట్ చేద్దాం అని చర్చించుకున్నారు. ఇది విన్న అశ్విని.. నన్ను ఇంకెవ్వరు తీసినా పట్టించుకోకపోయేదాన్ని. కానీ నువ్వు తీసేస్తున్నావ్.. చూడు అంటూ ప్రశాంత్‌పై గుస్సా అయింది. దాదాపు అందరి ఫోటోలు కాలిపోగా చివర్లో శివాజీ, అమర్, అర్జున్ మిగిలినట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా అమర్ కెప్టెన్‌గా గెలిచినట్లు ఓపక్క వార్తలు వస్తుంటే మరోవైపు కెప్టెన్సీ టాస్క్ రద్దయిందని, ఈ వారం ఎవరూ కెప్టెన్ కాలేదని ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో ఏది నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే! చదవండి: కోటబొమ్మాళి పీఎస్ ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే? -
బిగ్‌బాస్: అమర్‌కు ఫిట్స్.. నిజమేనన్న నటుడు.. రెండు నెలల నుంచి..
బిగ్‌బాస్ హౌస్‌లో ఎవరికైనా అన్యాయం జరుగుతుందంటే అది అమర్‌కు మాత్రమే! శివాజీ పదేపదే అతడిని హేళన చేస్తూ తన మానసిక ధైర్యం కోల్పోయేలా మాట్లాడుతూ మెంటల్ టార్చర్ చేస్తున్నాడు. అమర్ పైకి నవ్వుతూ సరదాగా తీసుకుంటున్నా లోలోపల మాత్రం చాలా బాధపడుతున్నట్లు తెలుస్తోంది. అందుకే మొన్నటి కెప్టెన్సీ టాస్క్‌లో ఆ బాధ, ఆవేశం అంతా కూడా కన్నీటి రూపంలో బయటకు తన్నుకొచ్చింది. ఫిట్స్ వచ్చాయి.. అయినా సరే బిగ్‌బాస్ ఈ విషయాన్ని లైట్ తీసుకుంటున్నాడు. ఇకపోతే తాజాగా హౌస్‌లో అమర్దీప్ అస్వస్థతకు లోనయ్యాడని, ఫిట్స్ వచ్చి పడిపోయాడని ప్రచారం జరుగుతోంది. అతడి ఆరోగ్యం బాలేకపోవడంతో మెడికల్ రూమ్‌కు తీసుకెళ్లి చికిత్స చేశారని తెలుస్తోంది. తాజాగా ఈ విషయాన్ని అతడి స్నేహితుడు, నటుడు నరేశ్ ధ్రువీకరించాడు. నరేశ్ మాట్లాడుతూ.. 'అతడికి ఫిట్స్ వచ్చాయంటూ వస్తున్న వార్తలు నిజమే! అతడికి నిజంగానే ఆరోగ్య సమస్యలు ఉన్నాయి. నీతోనే డ్యాన్స్ షోలో శారీరకంగా, మానసికంగా చాలా బలహీనమయ్యాడు. అమర్ స్నేహితుడు, నటుడు నరేశ్ కండరాల ఎదుగుల లోపించింది విశ్రాంతి తీసుకోకుండా పని చేయడంతో చాలా ఇబ్బందిపడ్డాడు. నాకు తెలిసిన డాక్టర్ దగ్గరకు తీసుకెళ్లాను. అక్కడికి వెళ్లాక మాకు తెలిసిందేంటంటే.. అమర్ శరీరంలో కండరాల ఎదుగుదల జీరో అయిపోయింది. రెండు నెలల నుంచి అతడికి మజిల్ గ్రోత్ లేదు. అది తనకు చాలా పెద్ద బ్యాక్‌డ్రాప్. బిగ్‌బాస్ షోకు వెళ్లే రెండు రోజుల ముందు మాత్రమే తను ప్రశాంతంగా కంటి నిండా నిద్రపోయాడు. తను ఎక్కువ ఒత్తిడికి లోనవుతున్నాడు. సరిగా నిద్రపోవడం లేదు. శరీరం సహకరించడం లేదు. అయినా అమర్ ఎక్కడా ఆ విషయం చెప్పలేదు. గేమ్‌లోనూ ఆ సమస్యను లెక్క చేయకుండా బాగా ఆడుతున్నాడు' అని చెప్పుకొచ్చాడు నరేశ్. చదవండి: ఓటీటీలో హిట్ సినిమాలు, హారర్ సిరీస్.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే? -
ముసలి వెంట్రుక ఎంతపని చేసింది? వంకరబుద్ధి పోనిచ్చుకోని శివాజీ!
బిగ్‌బాస్ హౌస్‌లో బీబీ మ్యాన్షన్ టాస్క్ జరుగుతోంది. బిగ్‌బాస్ భార్య హత్య జరిగిందని, చంపిందెరో కనుక్కోవాలని బిగ్‌బాస్ ఆదేశించాడు. ఈ హత్య కేసును ఛేదించే బాధ్యతను పోలీస్ ఇన్వెస్టిగేటర్లయిన అమర్, అర్జున్‌లకు అప్పగించాడు. దీంతో హౌస్‌లో ఉన్న అందరినీ విచారిస్తున్నారు. మరి వీరు హంతకులను పట్టుకున్నారా? లేదా? అనేది తాజా (నవంబర్ 23) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. అమర్ మీద అదేపనిగా అక్కసు.. శివాజీ టాస్క్‌లో కూడా అమర్ మీద అక్కసు వెల్లగక్కుతూనే ఉన్నాడు. పోలీస్ గెటప్‌లో ఉన్న అమర్‌ను 420, జామకాయలు అమ్ముకునేవాడివి, వీడికెవడ్రా పోలీస్ డ్రెస్ ఇచ్చింది అంటూ హేళన చేస్తూ మాట్లాడాడు. అమర్ మాత్రం ఎంతో సహనంతో అతడికి గౌరవమిచ్చి మాట్లాడటం విశేషం. ఇక అర్జున్.. ప్రశాంత్‌ను ఎవరు చంపారో తెలుసుకుంటే హౌస్‌లో జరుగుతున్న హత్యలకు కారకుడిని పట్టుకున్నట్లే అన్నాడు. దీంతో అమర్.. శివాజీనే అని చెప్పాడు. ఆయన అందరినీ తప్పుదారి పట్టించేందుకు ప్రయత్నిస్తున్నాడు అసలు గుట్టు బయటపెట్టాడు. హంతకుడిని పట్టించిన ముసలి వెంట్రుక ఇంతలో శివాజీకి మరో మర్డర్ టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. అందులో భాగంగా అద్దంపై క్రైయింగ్ బేబి అశ్విని గెటౌట్ అని రాయడంతో ఆమె చనిపోయి దెయ్యంగా మారింది. అయితే శివాజీ మీద రతిక అనుమానపడటంతో.. ఏయ్ పిచ్చా, ఏం చేస్తున్నవ్.. అని అరిచి కవర్ చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నాడు. అద్దం మీద ఏ పేస్ట్‌తో శివాజీ రాశాడో దాన్ని వెతికి తీసుకొస్తాడు అమర్. దానికి ఒక వెంట్రుక అంటుకుని ఉంటుంది. అది ముసలి వెంట్రుకలా ఉంది, తెల్లబడింది అని శివాజీపై అనుమాం వ్యక్తం చేస్తారు. హంతకుడు శివాజీనే అని శోభా, గౌతమ్, ప్రియాంకలు కూడా ఫిక్సయిపోతారు. ఫెయిలైన శివాజీ అనంతరం గౌతమ్‌ను చంపాలని టాస్క్ ఇచ్చాడు బిగ్‌బాస్. ఐయామ్ డెడ్ అని ఉన్న స్టిక్కర్ గౌతమ్‌కు అంటించాలన్నాడు. అయితే శివాజీయే ఇదంతా చేస్తున్నాడని మరోసారి పసిగట్టేశాడు అమర్. కానీ శివాజీ ఆ స్టిక్కర్‌ను గౌతమ్‌ను అంటించకపోవడంతో ఈ సీక్రెట్ టాస్క్‌లో ఫెయిలయ్యాడు. అలా ఆ టాస్క్ ప్రియాంకకు బదిలీ అయింది. ఎంతో అలవోకగా టాస్క్ పూర్తి చేసింది ప్రియాంక. ఇన్వెస్టిగేటర్లు మొదట రతికపై అనుమానంతో ఆమెను జైల్లో వేశారు. తర్వాత శివాజీపై అనుమానం బలపడటంతో రతికను వదిలేసి అతడిని జైల్లో బంధించారు. మరి హంతకుడు ఇతడేనని ఈసారైనా గట్టి నిర్ణయంతో ఉంటారా? మళ్లీ అతడిని వదిలేస్తారా? అనేది చూడాలి! చదవండి: ఓటీటీలో హిట్ సినిమాలు, హారర్ సిరీస్.. ఏవి ఎక్కడ స్ట్రీమింగ్ అవుతున్నాయంటే? -
Bigg Boss 7: అమర్‌కి ఎదురుదెబ్బలు.. మొన్న ప్రియాంక ఇప్పుడు శోభా!
బిగ్‌బాస్ షో నిర్వహకులు, హౌస్మేట్స్ ఇద్దరికి ఇద్దరూ అలానే తగలడ్డారు. లేటెస్ట్ ఎపిసోడ్ చూస్తే సరిగ్గా ఈ డైలాగే గుర్తొచ్చింది. ఎందుకంటే అందరూ ఫెర్ఫార్మ్ చేయమని.. బిగ్‌బాస్ ఓ టాస్క్ ఇచ్చారు. అందుకు తగ్గట్లే ఎంటర్టైన్ చేయాల్సింది పోయి అందరూ కలిసి చిరాకు కలిగేలా చేశారు. మరీ ముఖ్యంగా శోభా-అమర్దీప్ అయితే నస పెట్టారు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 80 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. టాస్క్ ఓకే.. ఫెర్ఫార్మెన్సే? ఎవిక్షన్ పాస్ ప్రశాంత్ గెలుచుకోవడంతో మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. ఇక మిసెస్ బిగ్‌బాస్‌ని ఎవరో హత్య చేశారని, చంపిందెవరో కనుక్కోమని అర్జున్-అమర్‌కి బిగ్‌బాస్ టాస్క్ ఇవ్వడంతో బుధవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. వీళ్లిద్దరూ కూడా ఇన్వెస్టిగేట్ ఆఫీసర్స్ ఇంద్రజిత్-కామ్‌జిత్ రోల్స్ చేశారు. అశ్విని-శోభాశెట్టి రిపోర్టర్స్‌గా, రతిక-గౌతమ్ సీక్రెట్ ప్రేమ జంటగా, యావర్-ప్రియాంక.. పని మనషులుగా నటించారు. శివాజీ, నువ్వు మర్డరర్ అని చెప్పిన బిగ్‌బాస్.. పోలీసులు దొరక్కుండా మరిన్నీ మర్డర్స్ చేయాలని సీక్రెట్ టాస్క్ ఇచ్చాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: శివాజీకి షాక్.. ఈ వారం ఎలిమినేట్ అయ్యేది ఆ ఇద్దరేనా?) శోభా-అమర్ నస సీరియల్ బ్యాచ్ అనగానే శోభా-అమర్-ప్రియాంక గుర్తొస్తారు. ఇప్పటివరకు ఒక్కటిగా ఆడుతూ వస్తున్న వీళ్ల మధ్య గ్యాప్ వస్తోంది. గతవారం కెప్టెన్సీ టాస్క్‌లో గెలిచిన తర్వాత అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. నేను గెలుస్తుంటే నీకు ఆనందంగా లేదని ఉన్న నిజాన్ని బయటపెట్టింది. ఇప్పుడు టాస్క్‌లో భాగంగా శోభా తన మైక్ పట్టుకుని పైపైకి వస్తుందని చెప్పి, ఓవర్ ల్యాప్ చేస్తున్నావ్ నువ్వు అని అమర్, ఆమెతో అన్నాడు. దీంతో శోభా హర్ట్ అయిపోయింది. స్మెల్ వస్తోంది, దూరంగా వెళ్లు అని పదేపదే అంటున్నాడని చెప్పి అమర్‌తో శోభా గొడవ పెట్టుకుంది. ఈ వాదన ఎక్కువయ్యేసరికి అమర్.. తన లాఠీ విసిరేసి మరీ కాస్త అతి చేశాడు. వెనక్కి తోయడం అనేది యాక్టింగ్‌లో భాగం, నేను ఎవరినైనా కావాలని ఆపుతున్నానా అని అమర్ తన పాయింట్ చెప్పాడు. అయితే ఈ మాట తనని చూసి ఎందుకు అంటున్నావ్ అని అశ్విని, అమర్‌పై రెచ్చిపోయింది. గొడవ మీ ఇద్దరికీ జరిగితే నన్ను ఎందుకు బ్లేమ్ చేస్తున్నావ్ అని అశ్విని అరిచింది. ఫెర్ఫార్మ్ చేయండ్రా అని బిగ్ బాస్ చెబితే సీరియల్ బ్యాచ్‌లోని అమర్-శోభా మాత్రం అనవసర వాదనలతో చాలా నస పెట్టేశారు. సీక్రెట్ టాస్క్‌లో భాగంగా రైతుబిడ్డ ప్రశాంత్ మొక్కని శివాజీ మాయం చేశాడు. అయితే మిగతా రోజులతో పోలిస్తే.. లేటెస్ట్ ఎపిసోడ్ చాలా నీరసంగా సాగింది. హౌస్మేట్స్ ఒక్కరు కూడా కనీసం ఎంటర్టైన్మెంట్ ఇవ్వలేకపోయారు. అలా బుధవారం ఎపిసోడ్ ముగింది. (ఇదీ చదవండి: పెళ్లి చేసుకున్న తెలుగు సీరియల్ హీరోయిన్.. భర్త ఎవరంటే?) -
అప్పుడు అమర్ చేసిందే ఇప్పుడు గౌతమ్ చేశాడు.. తప్పేముంది?
బిగ్‌బాస్ ఇచ్చిన కెప్టెన్సీ టాస్క్‌లో జరిగిన రభస మామూలుగా లేదు. ఒక్కొక్కరు వీర లెవల్లో పోరాడారు. చివర్లో అమర్, ప్రియాంక ఇద్దరూ మిగలగా అంతిమంగా ప్రియాంక కెప్టెన్సీ సాధించింది. అందుకు గౌతమ్ కృష్ణ ఎంతగానో సాయపడ్డాడు. గేమ్‌లో కూడా అందరిముందే ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరీ ఆడాడు. కానీ అమర్.. తనను అందరూ టార్గెట్ చేస్తున్నారన్న ఉద్దేశంతో ఎమోషనల్ అయిపోయాడు. కన్నీళ్లు పెట్టుకున్నాడు. తన ప్రవర్తన కొంతమందికి చికాకు తెప్పించగా ఎక్కువమందికి బాధ కలిగించింది. చేసిన సాయం అప్పుడే మర్చిపోయిన రతిక అయితే అమర్ బాధకు ప్రధాన కారణం గౌతమ్ కాదు రతిక. గతవారం జరిగిన బేబీ టాస్క్‌లో అమర్‌ను తనకోసం ఆగిపోమని వేడుకుంది. ఈ వారం తనకు చాలా అవసరమంటూ, తనను నిరూపించుకునే అవకాశం ఇవ్వమని బతిమాలుకుంది. దీంతో ఆమె కోసం వెనకడుగు వేశాడు. ఆమెను గెలిపించి తాను ఓడిపోయాడు. అందుకు కనీసం కృతజ్ఞత చూపించకుండా రతిక నిన్నటి బ్రిస్క్ టాస్కులో అమర్‌ను టార్గెట్ చేసింది. అతడిని ఓడించేందుకు విశ్వ ప్రయత్నం చేసింది. ప్రియాంక కోసం ఆడటం తప్పా? అటు గౌతమ్ కూడా అమర్ అమర్చిన బ్రిస్క్ మీదకు బాల్స్ విసిరాడు. అందుకు కారణం.. అతడి మీద ఏదో పగ, ప్రతీకారాలు ఉన్నాయని కాదు. తన చెల్లిగా భావించిన ప్రియాంక గెలవాలని తాపత్రయపడ్డాడు. ఆమె కెప్టెన్ అవడం కోసం అమర్‌ను ఆటలో నుంచి అడ్డు తొలగించుకోవాలనుకున్నాడు. అందరి ముందే ప్రియాంకకు సపోర్ట్ చేస్తున్నా అని చెప్పి మరీ గేమ్ ఆడాడు! కానీ చాలామంది దీన్ని తప్పుపడుతున్నారు. అమర్ అంత ఏడుస్తుంటే జాలి చూపించట్లేదు అని ఫీలవుతున్నారు. అతడు బాధపడుతున్నాడని అప్పటికప్పుడు ప్రియాంకను ఓడించాలని ఎందుకనుకుంటాడు? తన చెల్లిని గెలిపించాలనుకున్నాడు, అదే చేశాడు. శోభ కోసం అమర్.. ప్రియాంక కోసం గౌతమ్ నిజానికి గతంలో కెప్టెన్సీ టాస్క్‌లో శోభా కోసం అమర్ వీరోచిత పోరాటం చేసి ఆమెను గెలిపించాడు. అప్పుడు అమర్‌ను ఆకాశానికెత్తేశారు. ఇప్పుడు ప్రియాంక కోసం పోరాడిన గౌతమ్‌ను మాత్రం నిందిస్తున్నారు. ఒకానొక సమయంలో డాక్టర్ బాబు ఎలిమినేట్ అవ్వాలని అతడికి వ్యతిరేకంగా ఓట్ వేశాడు అమర్. అలాంటప్పుడు గౌతమ్.. అమర్‌కు సపోర్ట్ చేయకపోవడంలో తప్పేముంది? అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. చదవండి: అల్లాడిపోతున్నాడంటూ అతడికి స్టేజీపై ముద్దు పెట్టిన స్టార్ హీరో, వీడియో వైరల్ -
Bigg Boss 7: అమర్దీప్ది ఓవరాక్షనా? నిజమైనా ఎమోషనా?
బిగ్‌బాస్ గేమ్ ఈ రోజు ఎందుకో చాలా అంటే చాలా ఆసక్తిగా అనిపించింది. బహుశా శివాజీ గ్యాంగ్ లేకపోవడం వల్ల కావచ్చు. అలానే అమర్దీప్ అయితే హౌస్ అంతా గాయిగత్తర చేశాడు. పిచ్చిపట్టిన వాడిలా అరుస్తూ బీభత్సం సృష్టించాడు. మరోవైపు ప్రియాంకని చూస్తే నిజంగా హేట్సాఫ్ అనిపించింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్ లో ఏం జరిగిందనేది Day 75 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. శివాజీ బ్లాక్మెయిల్ ఎవిక్షన్ పాస్ చివరి రౌండ్లో నిర్ణయం తీసుకునే దగ్గర గురువారం ఎపిసోడ్ ముగిసింది. అక్కడి నుంచే శుక్రవారం ఎపిసోడ్ మొదలైంది. శోభా తన అభిప్రాయం చెప్పడానికి ప్రయత్నిస్తుంటే.. శివాజీ తన వాళ్లకు రాకపోతే బాగోదు అన్నంత రేంజులో బ్లాక్మెయిల్ చేశాడు. సంచాలక్స్ ఒక్క మాట అనుకుని యావర్.. ఎవిక్షన్ పాస్ విజేత అని ప్రకటించడంతో శివాజీ చల్లబడ్డాడు. మంచి డెసిషన్ తీసుకున్నారని పుడింగిలా పనికిమాలిన కామెంట్ చేశాడు. దీంతో శోభా ట్రిగ్గర్ అయిపోయింది. నియమాల ప్రకారం అన్నప్పుడు ఒకవేళ నేను గానీ, ప్రశాంత్ గానీ తప్పు నిర్ణయం తీసుకుంటే.. పనిష్మెంట్ తీసుకోవడానికి రెడీగా ఉంటానని శోభాశెట్టి చెప్పింది. దీంతో శివాజీ అతి చేశాడు. నువ్వు సంచాలక్‌గా ఉన్న ప్రతిసారీ 90 శాతం వాదనలు, గొడవలు, డిస్కషన్, మనస్పర్థలు జరిగాయి కాబట్టే నేను చెబుతున్నానని శివాజీ అన్నాడు. మూడుసార్లు సంచాలక్‌గా ఇబ్బందిపడ్డావ్ శోభా, ఇది నిజం, అందుకే నేను నిన్ను అలెర్ట్ చేశానని శివాజీ నీతికబర్లు చెప్పాడు. ఇక్కడంతా గమనిస్తే శోభాదే తప్పు అని తను అనుకునేలా శివాజీ బ్లాక్మెయిల్ చేశాడనిపించింది. (ఇదీ చదవండి: Bigg Boss 7: ఈ వారం డబుల్ ఎలిమినేషన్.. ఆ ఇద్దరు ఔట్?) ప్లేటు తిప్పేసిన శివాజీ ఇక యావర్ ఎవిక్షన్ పాస్ గెలుచుకున్నాడు. దీంతో దాన్ని నచ్చినప్పుడు ఉపయోగించుకోవచ్చని బిగ్‌బాస్ క్లారిటీ ఇచ్చేశాడు. అయితే శోభాతో అంతా గొడవపడ్డ శివాజీ.. మళ్లీ ప్లేట్ తిప్పేశాడు. నేను గెలవలేదని ఫైట్ చేశానని అనుకున్నారా మీరేమైనా అని శోభానే శివాజీ నైస్‌గా అడిగాడు. అరిచినప్పుడేమో అరిచేసి, ఇప్పుడేమో నంగనాచిలా మాటలు చెప్పి శోభాని ఏమార్చడానికి శివాజీ ట్రై చేశాడు. నువ్వు కరెక్ట్ డెసిషన్ తీసుకోవాలని నేను ఫైట్ చేశానని నీతికబుర్లు చెప్పాడు. దీంతో నా అనుకున్న ఫ్రెండ్స్ అందరూ బాల్కానీలో తనని వదిలేసి మీటింగ్ పెట్టిరని, తాను అందరికీ శత్రువు అయిపోయానని శోభా తెగ బాధపడిపోయింది. ప్రియాంక నువ్వు సూపర్ ఎవిక్షన్ పాస్ తంతు పూర్తయిన తర్వాత కొత్త కెప్టెన్ కోసం రెండు లెవల్స్‌లో టాస్కులు జరుగుతాయని బిగ్ బాస్ చెప్పుకొచ్చాడు. ఇందులో అందరూ పోటీదారులే అని అన్నాడు. తొలుత ఇటుకులు తెచ్చే టాస్క్ పెట్టగా అందరూ చాలా పోటీపోటీగా గేమ్ ఆడారు. కాకపోతే ప్రతి దశలోనూ తక్కువ ఇటుకులు తెచ్చిన కారణంగా రతిక, గౌతమ్, అశ్విని, శోభాశెట్టి వరసగా ఎలిమినేట్ అయ్యారు. వీళ్లందరూ గేమ్ ఎలా ఆడాలో తెలియక, కిందపడిపోయి, అరుస్తూ ఆటపై సరిగా కాన్సట్రేషన్ చేయలేకపోయారు. అమ్మాయిల్లో ప్రియాంక ఒక్కతే సైలెంట్ గా తనపని తాను చేసుకుని నెక్స్ట్ రౌండ్‌కి అర్హత సాధించింది. ఈమెతో పాటు అమర్, ప్రశాంత్, అర్జున్.. ఫైనల్ టాప్-4కి క్వాలిఫై అయ్యారు. (ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి ఏకంగా 33 సినిమాలు) అమర్ పిచ్చిపట్టినట్లు ప్రవర్తన ఈ గేమ్ లో భాగంగా నలుగురు పోటీదారులు ఇటుకులతో టవర్ కట్టాలి. బజర్ మోగిన తర్వాత మిగిలిన వాళ్లు వాటిని పడగొట్టడానికి ట్రై చేయాలి. ఇందులో ప్రశాంత్, అర్జున్ వరసగా ఔట్ అయిపోయారు. చివరకు అమర్, ప్రియాంక మిగలగా.. అమ్మాయి అయిన ప్రియాంక చాలా చక్కగా అస్సలు సౌండ్ చేయకుండా గేమ్ ఫినిష్ చేసింది. అమర్ మాత్రం కెప్టెన్సీ కోసం రెచ్చిపోయాడు. అరుస్తూ, ఏడుస్తూ, భయపెడుతూ స్ట్రాటజీలన్నీ ఉపయోగించాడు కానీ వర్కౌట్ కాలేదు. ప్రియాంక గెలిచింది. దీంతో కిందపడి కొట్టేసుకున్నాడు. అయితే అది కోపంతో వచ్చిన బాధే కానీ ఎవరిపై కోపం ఏం లేదని అమర్ సంజాయిషీ ఇచ్చుకున్నాడు. ప్రియాంక-అమర్ మనస్పర్థలు అయితే తాను కెప్టెన్ అయినట్లు కలగన్నాను కానీ తాను ఏది అనుకుంటే అది జరగదని అమర్దీప్ తెగ బాధపడిపోయాడు. అమర్ దగ్గరకొచ్చిన ప్రియాంక.. నువ్వు గెలిస్తే నేను అంతే సంతోషపడుతున్నాను, కానీ నీ దగ్గర నుంచి మాత్రం అలాంటి రెస్పాన్ రావట్లేదని అమరదీప్తో ఖరాఖండీగా చెప్పేసింది. దీంతో ఫ్రెండ్స్ ఇద్దరి మధ్య మనస్పర్థలు బయటపడ్డాయి. అయితే ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే ప్రియాంక దగ్గర నుంచి అమర్ ఎలా ఆడాలో తెలుసుకోవాలి. కానీ మనోడు అది చేయకుండా ఏడుస్తూ కనిపించాడు. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. (ఇదీ చదవండి: 'సప్త సాగరాలు దాటి సైడ్-బి' సినిమా రివ్యూ) -
రతిక పెట్టిన చిచ్చు.. మీదపడి మరీ అరుచుకున్న ఆ ఇద్దరు!
అమ్మాయిల వల్ల రాజ్యాలే కుప్పకూలిపోయాయి. ఆఫ్ట్రాల్ 'బిగ్‌బాస్' ఎంత? అవును మీరు కరెక్ట్‌గానే విన్నారు. తాజాగా 11వ వారం నామినేషన్స్‌లో ఓ అమ్మాయి గతంలో అనేసిన ఓ మాట కోసం ఇద్దరు మేల్ కంటెస్టెంట్స్ గొడవపడ్డారు. మీదమీదపడి కొట్టుకునేంతవరకు వెళ్లిపోయింది. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 72 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: నటి అన్నపూర్ణ కన్నీళ్లు.. కూతురి ఆత్మహత్య విషయం గుర్తొచ్చి!) నామినేషన్స్‌లో రచ్చరచ్చ సోమవారం నలుగురు హౌస్మేట్స్ తమతమ నామినేషన్స్ పూర్తిచేశారు. మంగళవారం మిగతా కంటెస్టెంట్స్ నామినేషన్స్ కంప్లీట్ చేశారు. అయితే సోమవారం కాస్తోకూస్తో లాజిక్స్ మాట్లాడారు కానీ మంగళవారం మాత్రం చాలా సిల్లీగా అసలేం ఏ మాత్రం ఇంట్రెస్ట్ లేకుండా సాగాయి. ఓవరాల్‌గా ఎనిమిది మంది ఈ వారం నామినేషన్స్‌లో ఉన్నారు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రశాంత్ - అర్జున్, రతిక అశ్విని - ప్రియాంక, అమరదీప్ యవర్ - శోభాశెట్టి, అమరదీప్ శోభాశెట్టి - యవర్, అశ్విని అమరదీప్ - గౌతమ్, యవర్ శివాజీ - గౌతమ్, ప్రియాంక దొరికిపోయిన యవర్ అమరదీప్‌ని నామినేట్ చేసిన అశ్విని.. తనపై పాట పాడినందుకే చేస్తున్నానని కారణం చెప్పింది. అయితే మరీ ఇంత సిల్లీ రీజనే ఏంట్రా బాబు అనిపించింది. దీని తర్వాత వచ్చిన యవర్, అమరదీప్‌ని నామినేట్ చేశాడు. అయితే ఫస్ట్ టెడ్డీ గేమ్‌లో తన బొమ్మ ఎందుకు పట్టుకున్నావ్ అని మాట్లాడాడు. ఇది నా గేమ్ అని అమర్ క్లారిటీ ఇచ్చేసరికి యవర్ మాట మార్చేశాడు. అది కాదు నింజా గేమ్ గురించి మాట్లాడుతున్నా అన్నాడు. దీంతో అమర్ చాలా కూల్‌గా క్లారిటీ ఇచ్చే ప్రయత్నం చేశాడు. గత వారాల్లో తప్పులు ఎత్తిచూపి నామినేషన్ చేస్తున్నావ్ అంతేగా అని అమర్ అనేసరికి.. ఇప్పటివరకు జరిగింది మొత్తం చూసి చెబుతున్నా అని యవర్ అరిచాడు. బిగ్‌బాస్ నెక్స్ట్ టైమ్ నుంచి ఇలాంటి గేమ్స్ ఇవ్వకండి.. యవర్‌కి ఇవి నచ్చట్లేదు అని అమరదీప్ సెటైరికల్‌గా మాట్లాడాడు. (ఇదీ చదవండి: స్టార్ హీరో ప్రేమ వ్యవహారం.. మోసం చేసిన క్లోజ్ ఫ్రెండ్!) రతిక చెప్పిన దానికోసం ఇకపోతే అమర్-యవర్ నామినేషన్స్ సందర్భంగా.. హైప్ కోసమే రతిక వెనక యవర్ తిరుగుతున్నాడని అమరదీప్ అప్పుడెప్పుడో మూడో వారామో నాలుగో వారమో అన్నాడట. ఇప్పుడు దాని గురించి డిస్కషన్ జరగడం ఆశ్చర్యంగా అనిపించింది. ఇది ఇక్కడితో ఆగిపోయింటే పర్లేదు గానీ అమర్ రెచ్చగొట్టేసరికి యవర్ పైపైకి వచ్చాడు. మధ్యలో ఎంటరైన శివాజీ.. వాళ్లని ఆపుచేశాడు. యవర్ కావాలనే అబద్ధాలు చెబుతున్నాడని అమర్ రెచ్చిపోయాడు. అలా మంగళవారం ఎపిసోడ్ పూర్తయింది. ఈ వారం నామినేట్ అయినోళ్లు అమరదీప్ శోభా ప్రియాంక అర్జున్ రతిక అశ్విని యవర్ గౌతమ్ (ఇదీ చదవండి: 'KCR' మూవీకి అడ్డంకులు.. 'జబర్దస్త్' కమెడియన్ ఎమోషనల్ వీడియో) -
'ఎవ్వరివీ అంత పెద్ద జాతకాలు కావు'.. రారా అంటూ ఊగిపోయిన అమర్!
ఇప్పటి వరకు ఒక ఎత్తు.. ఇప్పటి నుంచి ఒక ఎత్తు అన్న మాటను అందరూ పాటిస్తున్నట్లు ఉన్నారు. బిగ్ బాస్ సీజన్-7లో పదకొండో వారం నామినేషన్స్ మొదలయ్యాయి. మొదటి రోజే బిగ్ బాస్ హౌస్‌ను గత వారంలో మహారాణుల పాత్ర పోషించిన నలుగురు హీటెక్కించేశారు. ఈసారి నామినేషన్ల పర్వంలో ఎప్పుడు లేనంతగా వాదనలు మొదలయ్యాయి. ఒకరిని ఒకరు నామినేట్ చేసుకుంటూ ప్రతి విమర్శలతో హాట్ హాట్‌గా సాగింది. రతికా, శోభా, ప్రియాంక, అశ్విని ఇలా వీరిలో ఎవరు కూడా ఏమాత్రం తగ్గడం లేదు. మరోవైపు రైతుబిడ్డ, అంబటి అర్జున్ మధ్య ఏకంగా చిన్నపాటి వార్ నడిచింది. ప్రస్తుతం పదిమంది కంటెస్టెంట్స్ మాత్రమే హౌస్‌లో ఉండగా.. నామినేషన్ ప్రక్రియ రెండో రోజు కూడా కొనసాగనుంది. తాజాగా రెండో రోజుకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవీ చూస్తే రెండో రోజు హౌస్ మరింత హాట్ హాట్‌గా సాగినట్లు కనిపిస్తోంది. నామినేషన్ సమయంలో అమర్దీప్, యావర్ మధ్య మాటల యుద్ధం జరిగింది. యావర్‌ను నామినేట్ చేస్తూ.. గతం తవ్వుకుంటే ఎవ్వరివీ అంతా పెద్ద జాతకాలు కావు ఇక్కడ అని అమర్ అన్నాడు. వీరిద్దరి మధ్యలో రతికా ఎంటర్ కావడంతో అమర్ మరింత రెచ్చిపోయాడు. స్ప్రైట్ కోసం నామినేషన్ చేశావంటూ యావర్‌ను అమర్ అనడంతో.. నామినేషన్ కోసం అమర్ చెప్పే పాయింట్ రెండో, మూడో వారానిదా అని యావర్‌తో రతిక అన్నారు. దీంతో అమర్, యావర్ మధ్య ఫైట్ మొదలైంది. ఆ తర్వాత ఒకరినొకరు మీది మీదికి దూసుకొచ్చారు. రారా..నువ్వు రా.. అంటూ కొట్టుకున్నంత పనిచేశారు. దీంతో ఇద్దరి మధ్యలో శివాజీ ఎంటరై సర్ది చెప్పాలిన పరిస్థితి ఏర్పడింది. ఆ తర్వాత అమర్ కావాలి.. అమర్ పోవాలి.. అంటూ గట్టిగా వెటకారంగా స్లోగాన్స్ ఇచ్చాడు అమర్. పాత విషయాన్ని గుర్తు చేసి.. నిజంగా వేయాలంటే.. నిన్ను అప్పుడే నామినేషన్స్‌లో వేసేసేవాడినని అమర్ అన్నారు. ఆ తర్వాత ఎమోషన్ ఇజ్ ది లూజ్ మోషన్ ఇన్ ద బిగ్ బాస్ హౌస్.. ఆ ఫ్లోను మనం కంట్రోల్ చేయలేం అని గౌతమ్ అనగా.. అది కంట్రోల్ చేసుకోవాలిరా.. మంచిదిరా అని కెప్టెన్ శివాజీ అనడంతో ప్రోమో ముగిసింది. -
బిగ్ బాస్ టాప్-5 ఎవరంటే..? ఫైనల్ లిస్ట్ ఇదేనా..?
బిగ్ బాస్ ఆదివారం ఎపిసోడ్ చాలా గ్రాండ్, కలర్ఫుల్గా సాగింది. టాలీవుడ్ సెలబ్రిటీలు చాలామంది వచ్చారు. అలానే దీపావళి పండగ సెలబ్రేషన్స్ జరిగాయి. 11 మంది కంటెస్టెంట్స్ కుటుంబసభ్యులు స్టేజీపైకి వచ్చి టాప్-5 ఎవరో కూడా చెప్పుకొచ్చారు. ఈసారి టాప్- 5లో శివాజీ, ప్రశాంత్, అమర్ దీప్, ప్రియాంక, గౌతమ్ ఉంటారని.. ఫ్యామిలీ మెంబర్స్ ఎక్కువగా అభిప్రాయపడ్డారు. అమ్మాయిలలో ప్రియాంక మాత్రమే టాప్ ఫైవ్ రేసులో ఉంది. ► మొదట అమర్ దీప్ కోసం ఆయన అమ్మగారు వచ్చారు.. అమర్ స్నేహితుడు అయిన మానస్ కూడా స్టేజీపైన కనిపించాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్ మెంబర్స్ ఎవరు అనేది తేల్చేశారు. ► భోలే షావలి కోసం ఆయన స్నేహితులు వచ్చారు. వారిలో బిగ్ బాస్ వల్ల గుర్తింపు తెచ్చుకున్న నటుడు సయ్యద్ సోహెల్ ఉన్నాడు. మరో ఫ్రెండ్ మదీన్ వచ్చాడు. ► అశ్విని కోసం ఆమె తండ్రి శ్రీనివాస్, వారి కుటుంబ స్నేహితుడు తేజ వచ్చాడు. వారి ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► అర్జున్ కోసం ప్రముఖ డైరెక్టర్ బుచ్చిబాబు వచ్చాడు.. ఆయన ప్రకారం టాప్ ఫైవ్ ఉండేది వీళ్లే.. ► గౌతమ్ కుటుంబ స్నేహితుల ప్రకారం టాప్ ఫైవ్ కంటెస్టెంట్స్ వీరే.. ► పల్లవి ప్రశాంత్ కోసం ఆయన అమ్మగారితో పాటు సోదరి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► ప్రియాంక జైన్ కోసం ఆమె అమ్మగారితో పాటు ప్రముఖ నటి ప్రగతి కూడా వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ వీళ్లే ► రతికా రోజు కోసం ఆమె అమ్మగారితో పాటు యాంకర్, బిగ్ బాస్ ఫేమ్ భాను వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► శోభ కుటుంబ సభ్యుల ప్రకారం టాప్ ఫైవ్‌లో ఉండేది వీళ్లే.. ► శివాజీ కోసం ఆయన సతీమణితో పాటు వారి కుమారుడు రిక్కీ వచ్చాడు.. వారి ప్రకారం టాప్ ఫైవ్ ► యావర్ కోసం ఆయన ఫ్యామిలీ ఫ్రెండ్స్ వచ్చారు. వారి ప్రకారం టాప్ ఫైవ్ లిస్ట్ ఇదే -
తోలుబొమ్మలా ఉండకంటూ యావర్‌కు వార్నింగ్, అమర్‌కు హింట్సిచ్చిన భార్య
బిగ్‌బాస్ హౌస్‌లో ఫ్యామిలీ వీక్ ఎమోషనల్‌గా సాగుతోంది. వచ్చిన కుటుంబసభ్యులను చూసి కంటెస్టెంట్లు ఓపక్క సంతోషంతో ఎగిరి గంతేస్తూ మరోపక్క ఇన్నాళ్లు దూరంగా ఉన్నందుకు బాధతో ఒక్కసారిగా ఏడ్చేస్తున్నారు. అలాగే వచ్చిన ప్రతి ఒక్కరూ హౌస్‌మేట్స్‌కు ఏదో ఒక హింట్ ఇచ్చే వెళ్తున్నారు. ఈరోజు హౌస్‌లోకి అమర్దీప్, శోభా శెట్టి, ప్రిన్స్ ఫ్యామిలీ మెంబర్స్ వచ్చారు. మరి వారు ఏమేం హింట్స్ ఇచ్చారు? హౌస్‌లో ఏం జరిగిందనేది తాజా(నవంబర్ 9) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. అమర్‌ను ఆడుకున్న బిగ్‌బాస్ బిగ్‌బాస్ అమర్‌ను ఓ ఆటాడుకున్నాడు. నీ భార్య తేజస్వి రావడం లేదని, తను నీ బర్త్‌డే కోసం కేక్ పంపించిందని దాన్ని అతడికి అప్పగించాడు. సరే, ఏం చేద్దాం.. కేక్‌తో తృప్తిపడదాం అని దిగాలుగా కన్ఫెషన్ రూమ్‌లో నుంచి బయటకు వచ్చిన అమర్‌కు స్వీట్ షాక్ తగిలింది. ఎదురుగా తేజస్విని కనిపించింది. నోట మాటలు రాక భార్యను ఆప్యాయంగా హత్తుకున్నాడు. తేజు అయితే భర్త స్పర్శ తగలగానే ఏడ్చేసింది. తర్వాత తేజును తన బెడ్ దగ్గరకు తీసుకెళ్లిన అమర్.. చాలా ఆలోచించా.. ఇంకోసారి పెళ్లి చేసుకుందామా? అనడంతో తేజు సిగ్గుపడిపోయింది. ప్రశాంత్ నా తమ్ముడైపోయాడు.. తర్వాత ఇంటిసభ్యుల మధ్య కేక్ కట్ చేసి ఒకరికి ఒకరు తినిపించుకున్నారు. అమర్‌కు ఊహించని గిఫ్ట్ ఇచ్చింది తేజు. తమ ఎంగేజ్మెంట్ రింగ్‌ను మరోసారి భర్త వేలికి తొడిగింది. అనంతరం ప్రశాంత్ గురించి తేజుతో ఓ మాటన్నాడు. హౌస్‌లో మొదట వీడితోనే గొడవైంది.. కానీ ఇప్పుడు తమ్ముడైపోయాడని రైతుబిడ్డను హగ్ చేసుకున్నాడు. వదిన.. అన్న విషయంలో ఏమైనా అంటే ఏమనుకోకండి అని ప్రశాంత్ చెప్పగా.. వీడు కూడా ఏదైనా అంటే ఏమనుకోకు.. అమర్ చిన్నపిల్లాడిలానే.. అని చెప్పుకొచ్చింది. నీకు తెలియకుండానే చిక్కుల్లో పడుతున్నావ్.. ఇక అమర్‌ను పక్కకు తీసుకెళ్లి.. ఒంటరిగా ఆడు. ఎవరేం చెప్పినా నమ్మవద్దు. నువ్వు నీ కోసం ఆడు, ఎవరూ నీకోసం లేరు. అది గుర్తుపెట్టుకో.. ఫినాలే వచ్చే టైమ్‌కు నువ్వు ముందుకు వెళ్లురా, నేను బయటకు వెళ్లిపోతా అని ఎవరైనా త్యాగం చేస్తారా? అందరూ వాళ్ల గేమ్ కోసం వచ్చారు. అలాగే కొన్నిసార్లు నువ్వు తెలియకుండానే ఇరుక్కుంటున్నావ్.. అవి చూసుకో అని సలహాలు ఇచ్చింది. తర్వాత ఎంగేజ్మెంట్ ఫోటో ఫ్రేమ్ ఇచ్చింది. బిగ్‌బాస్ రొమాంటిక్ సాంగ్ ప్లే చేయడంతో తేజును ఎత్తుకుని డ్యాన్స్ చేశాడు అమర్. తర్వాత శివాజీ కాళ్ల మీద పడి ఇద్దరూ ఆశీర్వాదం తీసుకున్నారు. తినడానికి తిండి లేక బాధపడ్డ శోభ తేజు వెళ్లిపోయిన కాసేపటికి శోభా శెట్టి తల్లి హౌస్‌లోకి వచ్చింది. అమ్మను చూడగానే చిన్నపిల్లలా ఏడ్చేసింది. ఆ తల్లి కూడా అందరినీ దగ్గరకు తీసుకుంది. అలాగే ప్రిన్స్ యావర్‌కు తన తల్లి ఫోటోను బహుమతిగా ఇచ్చింది. ఇక కూతురితో 'కోపం ఎక్కువ కాకూడదు. గేమ్ ఓడిపోతే ఏడవకూడదు. పాత విషయాలు గుర్తు చేసుకో.. అప్పుడు తినడానికి తిండి కూడా లేక బాధపడ్డాం.. ఎంత కష్టపడ్డావో గుర్తు చేసుకుని ఆడు' అని కన్నీళ్లతో సలహా ఇచ్చింది. వెళ్లేముందు కూతురికి టెడ్డీబేర్‌ను గిఫ్ట్‌గా ఇచ్చింది. తోలుబొమ్మలా ఉన్నావ్.. తర్వాత ప్రిన్స్ యావర్ అన్నయ్య హౌస్‌లో ఎంట్రీ ఇచ్చాడు. మొదట ఎమోషనల్ అయి అందరినీ ఏడిపించేసిన ఇద్దరూ తర్వాత ఆట గురించి మాట్లాడారు. నువ్వు ఫైటర్.. టైగర్.. ఆటలో పక్కకు వెళ్లిపోకు.. ఫైటలర్ ఫైట్ చేయు. నాకు ఆ కప్పు కావాలి, వేరే ఏదీ వద్దు. ఈ మధ్య నీ ఆట చూసి కొంచెం ఫీలయ్యా. కెప్టెన్సీ ముందు ఉన్న యావర్ నాకు మళ్లీ కావాలి. నీ అమాయకత్వం, ప్రేమ అసలు వదులుకోకు.. ఎక్కడా దారి మారకు. నేను ఏం చెప్తున్నానో అది కచ్చితంగా పాటించు. అందరూ దృష్టి పెట్టి ఆడుతున్నారు, నువ్వు తప్ప! ఇప్పుడొక తోలుబొమ్మలా ఉన్నావు.. వేరేవారి మాటలు వింటూ అటూఇటూ తిరుగుతున్నావ్.. ఎవరైతే జనాలు ఇష్టపడ్డారో ఆ యావర్‌లా ఉండు' అని తమ్ముడిలో ఉత్తేజం నింపి వెళ్లిపోయాడు. చదవండి: 'జిగర్ తండ డబుల్ ఎక్స్' ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే? -
అమర్ దీప్‌కు షాకిచ్చిన బిగ్ బాస్.. తెలియకుండానే ఏడ్చాను అంటూ..
బిగ్ బాస్ ఏ సీజన్లో అయినా సరే కంటెస్టెంట్ల మధ్య గొడవలు సహజం.. వారి మధ్య కోపాలు, పంతాలు ఎన్ని ఉన్నా సరే ఫ్యామిలీ వారం అనేది ఒక దశలో వస్తుంది.. ఆ సమయంలో వారందరూ ఎంతో సంతోషంగా కలిసిపోతారు. ఆ సమయం నుంచి వారి ఆటలో మార్పులు కూడా రావచ్చు.. ప్రస్తుతం బిగ్‌బాస్ -7 సీజన్లో కూడా కంటెస్టెంట్లలో ఎమోషన్ నింపి ప్రేక్షకులతో కట్టిపడేసే సీన్లు ఎన్నో కనిపిస్తున్నాయి. తాజాగా బిగ్ బాస్‌లోకి అమర్ దీప్ సతీమణి తేజశ్విని వచ్చారు. అందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. (ఇదీ చదవండి: మహ్మద్ షమీ బౌలింగ్‌కు క్లీన్ బౌల్డ్ అయిన హీరోయిన్) ఈ సీజన్లో ఇప్పటికే శివాజీ, అర్జున్, గౌతమ్, అశ్విని, భోలే, ప్రియాంక కుటుంబ సభ్యులు హౌస్‌కు వచ్చి వారందరితో కొంత సమయం గడిపారు. ఫ్యామిలీ మెంబర్స్ రాకతో కంటెస్టెంట్స్‌లలో సంతోషం రెట్టింపు అయింది. నవంబర్ 8న అమర్ దీప్ పుట్టినరోజు కావడంతో ఆయనకు బిగ్ బాస్ షాకిచ్చాడు. మొదట అమర్‌ను ప్రత్యేక గదికి పిలిపించిన బిగ్ బాస్ అక్కడ ఒక కేకును ఉంచుతాడు. ఈ కేకును మీ సతీమణి తేజశ్విని పంపించారని ఆమె రాలేదని చెప్పి కొంత ఫన్ క్రియేట్ చేస్తాడు బిగ్ బాస్. అప్పుడు కొంతమేరకు నిరుత్సాహపడిన అమర్ కేకును తీసుకుని బయటకు వచ్చేస్తాడు. ఆ సమయంలో అక్కడ తేజశ్విని వచ్చి ఉంటుంది. ఒక్కసారిగా ఆయన ముందుకు వచ్చి ఆమె షాకిస్తుంది. దీంతో తేజశ్వినిని కౌగిలించుకున్న అమర్ ఎమోషనల్ అయ్యాడు. బిగ్ బాస్ ఎంట్రీకి కొన్ని రోజులకు ముందే వారిద్దరూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. కానీ ప్రోమోలో మళ్లీ పెళ్లి చేసుకుందామా..? అని ఫన్నీగా అంటాడు. తేజూని చూసిన అమర్ బాగా ఎమోషనల్ అయి ఇలా అంటాడు 'కొన్ని సార్లు పడుకొని ఏడుస్తున్నాను. ఒకవేళ ఏడుస్తే కనపడుతుంది కదా అని తెలియకుండానే ఏడ్చాను.' అనే మాటలు ప్రేక్షకులను కట్టిపడేస్తున్నాయి. ఈ రోజు రాత్రి టెలికాస్ట్ అయ్యే ఎపిసోడ్లో అమర్ కుటుంబ సభ్యులతో పాటు మరికొందరి ఫ్యామిలీ మెంబర్స్ కూడా రావచ్చు. -
ఎలిమినేట్ చేయండన్న గౌతమ్, చెప్పుతో కొట్టుకుంటానన్న అమర్దీప్
బిగ్‌బాస్ కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం ఇంటిసభ్యులను రెండు టీములుగా విభజించాడు. అయితే గౌతమ్ టీమ్‌ను గెలిపించాలని బిగ్‌బాస్ బలంగా ఫిక్సయినట్లు కనిపిస్తోంది. ఎరుపు, నలుపు రంగులో ఉన్న బాల్స్ గౌతమ్ సంపాదించగా వాటితో విజయం సాధించేలా బిగ్‌బాస్ పావులు కదిపాడు. అసలు హౌస్‌లో ఇంకా ఏమేం జరిగాయో తాజా(నవంబర్ 3) ఎపిసోడ్ హైలైట్స్‌లో చదివేయండి.. ఆ టీమ్‌లోని అందరూ కంటెండర్లే బిగ్‌బాస్ బ్లాక్ బాల్ ఎవరి దగ్గరుందని అడిగాడు. వీరసింహాలు టీమ్ తమ దగ్గరే ఉందని బదులిచ్చారు. ఈ నల్ల బంతి సాయంతో అవతలి టీమ్ దగ్గరున్న అన్ని బంతులను తీసుకోవచ్చని భలే సర్ప్రైజ్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో వీరసింహాలు టీమ్ సభ్యులు ఎగిరి గంతేశారు. కానీ గర్జించే పులుల టీమ్‌లోని శివాజీ, ప్రియాంక మాత్రం ఓ రెండు బంతులకు కక్కుర్తి పడ్డారు. అన్నీ ఇచ్చేయమన్నాక ఇంకెందుకు ఆలోచిస్తున్నారని గౌతమ్ ప్రశ్నించగా మా ఇష్టమొచ్చినట్లు చేస్తామన్నాడు శివాజీ. దీంతో గౌతమ్ ఆవేశంతో ఊగిపోయాడు. ఇక అన్ని బంతులు వీరసింహాలకే దక్కి పైచేయి సాధించడంతో ఆ టీమ్‌లో ఉన్న అందరినీ కెప్టెన్సీ కంటెండర్లుగా ప్రకటించాడు బిగ్‌బాస్. రతికతో దూరంగా ఉండమన్న శివాజీ మరోవైపు రతికతో కాస్త దూరంగా ఉండమని యావర్‌ను హెచ్చరించాడు శివాజీ. మీ అతి చనువు జనాలకు నచ్చకపోవచ్చని సుతిమెత్తగా వార్నింగ్ ఇచ్చాడు. ఇదిలా ఉంటే బంతుల టాస్కు మధ్యలో వీరసింహాలు టీమ్ తమ సభ్యులైన భోలె షావళిని అవతలి టీమ్‌లోని అర్జున్‌తో స్వాప్ చేసిన సంగతి తెలిసిందే కదా! అయితే తాను మొదట తేజ పేరు సూచించానని గౌతమ్ అన్నాడు. అదేంటి? నువ్వు భోలె పేరు చెప్పావటగా అని అశ్విని గబుక్కున అడిగేసింది. అది విని షాకైన గౌతమ్.. భోలె దగ్గరకు వెళ్లి నేను డైరెక్ట్‌గా మీ పేరు చెప్పలేదు.. అది టీమ్ నిర్ణయం అని క్లారిటీ ఇచ్చాడు. స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకున్న ప్రిన్స్ అనంతరం బిగ్‌బాస్ బీన్ బ్యాగ్ అనే కెప్టెన్సీ టాస్క్ ఇచ్చాడు. కానీ ఇక్కడో మెలిక పెట్టాడు. వీరసింహాలు టీమ్‌లోని కెప్టెన్సీ కంటెండర్స్ కోసం అవతలి టీమ్‌లోని కంటెస్టెంట్లు ఆడాల్సి ఉంటుందన్నాడు. అలాగే ఓ కంటెండర్ స్వచ్ఛందంగా ఆటలో నుంచి తప్పుకోవాలన్నాడు. దీంతో ప్రిన్స్ యావర్ ఆట నుంచి వైదొలిగాడు. గౌతమ్ తరపున అశ్విని, అర్జున్ తరపున శివాజీ, తేజ తరపున ప్రియాంక, రతిక తరపున భోలె షావళి ఆటలో దూకారు. ఇదసలే ఫిజికల్ టాస్క్.. చేయి నొప్పి ఉన్న శివాజీ ముందే ఆటలో నుంచి వైదొలగాల్సింది. అయినా సరే తన ప్రతాపం చూపిస్తానంటూ ఆడేందుకు వెళ్లాడు. దెబ్బ తగలడంతో శివాజీ అవుట్ తీరా అక్కడ అందరూ లాక్కుని పీక్కునే క్రమంలో అతడి చేతికి దెబ్బ తగిలింది. దీంతో ఆయన ఆటలో నుంచి తప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇక ఈ ఆటలో అమర్దీప్- అశ్విని కొట్టుకున్నారు. బిగ్‌బాస్ గీసిన వృత్తంలో నుంచి అందరూ బయటకు వచ్చారని సంచాలకుడైన ప్రశాంత్ అభిప్రాయపడ్డాడు. ఆ గీత దాటి బయటకు వచ్చింది శివాజీ అన్న అని, కావాలంటే వీడియో చూడమన్నాడు అమర్దీప్. ఒకవేళ తాను చెప్పింది తప్పయితే చెప్పుతో కొట్టుకుంటానని సవాలు విసిరాడు. అమర్ సాయం.. కెప్టెన్‌గా శోభ ఇక బీన్ బ్యాగ్ టాస్కులో శోభా శెట్టి తరపున ఆడి, పోరాడి అమర్ గెలిచాడు. మొత్తానికి అమర్ సాయంతో ఈ సీజన్లో శోభా శెట్టి తొలి లేడీ కెప్టెన్‌గా అవతరించింది.ఇక శోభా కెప్టెన్ అయిందో, లేదో అర్జున్, తేజ ఆమెను ఏడిపించేందుకు ప్రయత్నించారు. ఎలిమినేట్ అయి వెళ్లేటప్పుడు నీ దగ్గరున్న కాయిన్స్ ఎవరికి ఇస్తావు? అని అర్జున్ అడగడంతో చిర్రుబుర్రులాడింది శోభ. కామెడీ చేయడానికి కూడా ఓ సమయం ఉంటుందని విసుక్కుంది. శివాజీపై ఫిర్యాదు తర్వాత గౌతమ్.. శివాజీ ప్రవర్తనపై అసహనం వ్యక్తం చేశాడు. 'శివాజీ అన్న గేమ్‌ను ముందే మ్యాచ్ ఫిక్సింగ్ చేస్తున్నాడు. నీతి, నిజాయితీ, ధర్మం అని మాటలు చెప్తుంటాడు.. కానీ ఆయన చాలా తప్పులు చేస్తున్నాడు. అవన్నీ కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయి. ఆయన చేసేదంతా చేసి మళ్లీ ఏమీ ఎరుగనట్లు తప్పించుకుంటున్నాడు. ఇలా ఆడి, గెలిచి ఆయన కప్పు కొట్టుకుంటాడేమో.. కానీ ఇది నేను భరించలేకపోతున్నాను. నేను తప్పయితే నన్ను ఎలిమినేట్ చేసేయండి' అని కెమెరాల ముందు బిగ్‌బాస్‌కు ఫిర్యాదు చేశాడు. చదవండి: రాహుల్-రతిక పెళ్లి.. అతడు పెట్టిన కండీషన్స్ వల్లే బ్రేకప్! -
కెప్టెన్‌గా శోభ.. ఈ వారం ఎవరు బలి కానున్నారు?
బిగ్‌బాస్ షోలో తొమ్మిదో వారం ఎలిమినేషన్ దగ్గరపడుతోంది. అమర్ దీప్, రతికా రోజ్, శోభా శెట్టి, ప్రియాంక జైన్, అర్జున్, టేస్టీ తేజ, భోలే షావలి, ప్రిన్స్ యావర్.. ఈ వారం నామినేషన్లో ఉన్నారు. శోభ, తేజలకు ఆల్రెడీ ఎలిమినేషన్ భయం పట్టుకుంది. నిజానికి శోభ గతవారమే ఎలిమినేట్ అవ్వాల్సిన కంటెస్టెంట్.. అయితే తను వెళ్లిపోతే షో చప్పగా ఉంటుందనుకున్నారో, మరేంటో కానీ ఆమెను సేవ్ చేసి సందీప్ మాస్టర్‌ను పంపించేశారు. శోభా కోసం మరొకరు బలి? ఈ వారం కూడా శోభా శెట్టి ఎలిమినేట్ అవుతుందనే ప్రచారం జరుగుతోంది. సోషల్ మీడియాలోని అనధికారిక పోల్స్‌లో కూడా శోభా తక్కువ ఓట్లతో చివరి స్థానంలో ఉంది. దీంతో ఆమె ఎలిమినేషన్ ఖాయమే అని నెటిజన్లు ఫిక్సయిపోతున్నారు. కానీ ఇలాంటి గ్లామరస్, అలాగే తన అరుపులతో హౌస్‌ను దద్దరిల్లేలా చేసే కంటెస్టెంట్ వెళ్లిపోతే షో నీరసించిపోవడం, టీఆర్పీ దెబ్బతినడం ఖాయం. ఈ రకంగా బిగ్‌బాస్ ఆలోచిస్తే మాత్రం మరోసారి తనకు బదులుగా మరో కంటెస్టెంట్‌ను పంపించే ఆస్కారం లేకపోలేదు. అప్పుడు చైతూ ఎలిమినేట్! ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే.. ఈ వారం ఇంటి కెప్టెన్‌గా శోభా అవతరించినట్లు తెలుస్తోంది. తను కెప్టెన్ అయితే వచ్చేవారం ఇమ్యూనిటీ లభిస్తుంది. కానీ ఈ వారం లభించదు. ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటంటే శోభా కోసం అమర్ గేమ్ ఆడి గెలిపించాడట. అది కూడా బీన్ బ్యాగ్ గేమ్. బిగ్‌బాస్ నాన్‌స్టాప్ సీజన్లోనూ ఇలాంటి టాస్కే నడిచింది. అప్పుడు ఆర్జే చైతూ కోసం అఖిల్ ఆడాడు.. తాను గెలిచి చైతూను కెప్టెన్ చేశాడు. కానీ ఆ వారం చైతూ నామినేషన్స్‌లో ఉండటంతో కెప్టెన్సీ పవర్ అనుభవించకుండానే ఎలిమినేట్ అయిపోయాడు. మరి ఈ వారం శోభా కెప్టెన్సీని అనుభవించకముందే ఎలిమినేట్ అవుతుందా? లేదంటే తనకోసం తేజ లేదా ఏ ఇతర కంటెస్టెంట్‌నైనా బలి చేయనున్నారా? అనేది చూడాలి! చదవండి: ఏం తప్పు చేశానో చెప్పండి?.. శివాజీపై మండిపడ్డ గౌతమ్! -
భయపెడితే భయపడతారనుకున్నావా?.. పక్కకెళ్లి ఆడుకో.. హౌస్‌లో మాటల యుద్ధం!
తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ తొమ్మిదో వారం హాట్‌హాట్‌గా కొనసాగుతోంది. ఈ వారంలో ఇప్పటికే నామినేషన్స్ ప్రక్రియ ముగియడంతో హౌస్‌లో టాస్కుల పర్వం మొదలైంది. కెప్టెన్సీ కంటెండర్ రేసు మొదలెట్టేశాడు బిగ్‌బాస్. ఈ వారం కెప్టెన్సీ కంటెండర్ అయ్యేందుకు ఓ గేమ్ ఇచ్చాడు. దీని కోసం ఇంటిసభ్యులను రెండు టీమ్‌లుగా విభజించాడు. వీరసింహాలు టీమ్‌లో యావర్, గౌతమ్, భోలె, తేజ, శోభా, రతిక ఉండగా.. మిగిలినవారంతా గర్జించే పులులు టీమ్‌లో ఉన్నారు. (ఇది చదవండి: వాడో వేస్ట్‌గాడు, ఐటం రాజా.. అమర్‌పై మళ్లీ విషం కక్కిన శివాజీ) మొదట బాల్స్ టాస్కు పెట్టిన బిగ్ బాస్.. దాని ఫలితాలను మాత్రం ప్రకటించలేదు. తర్వాత పవర్ బాక్స్ చాలెంజ్ ఇచ్చాడు. ఇది గెలిచిన టీమ్‌కు ఒక స్పెషల్ పవర్ లభిస్తుందని చెప్పాడు. మొదట జంపింగ్ జపాంగ్ అనే టాస్క్ ఇచ్చాడు. ఇందులో వీరసింహాలు టీమ్ గెలవడంతో.. అవతలి టీమ్‌లోని ఒకరిని గేమ్ నుంచి తొలగించే ఛాన్స్ ఇచ్చాడు బిగ్‌బాస్. దీంతో అందరూ చర్చించుకుని పల్లవి ప్రశాంత్‌ను గేమ్ నుంచి తొలగించారు. తాజా ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోను మేకర్స్ రిలీజ్ చేశారు. ఇవాళ మరో ఛాలెంజ్‌తో ఎపిసోడ్ మొదలైంది. అమర్దీప్, కెప్టెన్ గౌతమ్ పరుగుత్తుకెంటూ వెళ్లి ఛాలెంజ్‌లో పాల్గొన్నారు. అయితే ఈ టాస్క్ విషయంలో రతికా, అమర్ దీప్ మధ్య మాటల యుద్ధం జరిగింది. ఎందుకు కింద పడేశావ్ అంటూ అమర్‌ను రతికా ప్రశ్నించగా.. నా ఇష్టం ఇది నా స్ట్రాటజీ అంటూ మాట్లాడాడు. ఆ తర్వాత ప్రతిసారి వెధవ పని చేయడం నీకు అలవాటు అనడంతో.. నువ్వు చేసే పనులతో నన్ను పోల్చొద్దు అని అమర్ కౌంటరిచ్చాడు. దీంతో రతికా కోపంతో మాటలు జాగ్రత్త అంటూ వార్నింగ్ ఇచ్చింది. దీనికి అమర్ సైతం నువ్వు కూడా అంటూ రెచ్చిపోయాడు. భయపెడితే భయపడతారనుకున్నావా? పక్కకెళ్లి ఆడుకో.. వచ్చి నా బ్యాగ్ లాగడం కాదు.. నీ బ్యాగ్ లాగినవాళ్ల దగ్గరికి వెళ్లి లాగు అంటూ ఇచ్చిపడేశాడు. ఆ తర్వాత బిగ్‌బాస్ ఇచ్చిన బ్రేక్ ఫాస్ట్ ఛాలెంజ్‌లో అమర్, శోభా తలపడగా.. ఇందులో అమర్ విన్ అయ్యాడు. దీంతో ప్రోమో ముగిసింది. మరీ ఫైనల్‌గా ఏ టీమ్ కెప్టెన్సీ కంటెండర్ నిలిచిందో తెలియాలంటే ఇవాల్టి ఎపిసోడ్ చూస్తే క్లారిటీ వస్తుంది. (ఇది చదవండి: కింగ్ ఖాన్ బర్త్ డే.. సర్ప్రైజ్ ఇచ్చిన మేకర్స్!) -
శివాజీ మీద పైచేయి సాధించిన అమర్
బిగ్ బాస్ నామినేషన్స్ ఈ వారం చాలా ఫన్నీ రీజన్స్‌తో ముగిసింది. మంగళవారం జరిగిన నామినేషన్లో యావర్ మాస్టర్ ప్లాన్ వేసి అశ్వినిని నామినేషన్లోకి తీసుకొచ్చాడు. నామినేషన్లో పసలేని కారణాలతో రతికా రోజ్, అశ్వినిలు ఉన్నారని చెప్పవచ్చు. కానీ ఈ వారం నామినేషన్ ప్రక్రియలో శివాజీ మీద అమర్ పైచేయి సాధించాడు. ఆ కథేంటో మంగళవారం జరిగిన ఎపిసోడ్లో ఏం జరిగిందో Day 58 హైలెట్స్ ఇప్పుడు చూద్దాం. సోమవారం ఎపిసోడ్లో ప్రశాంత్ ,ప్రియాంక,అర్జున్ ,శివాజీ,రతిక, తేజ, భోలె నామినేషన్ ప్రక్రియలో పాల్గొని వారికి నచ్చని ఇద్దరి పేర్లు చెబుతూ ఎలిమినేషన్ లిస్ట్‌లో చేర్చారు. మంగళవారం ఎపిసోడ్లో మొదట శోభ నామినేషన్ విదానాన్ని ప్రారంభంచింది. శోభ సరైన కారణాలతో రతికా రోజ్‌ను నామినేట్ చేసినా వాటిని తిప్పకొట్టడంలో రతిక విఫలమైంది. లాజికల్ పాయింట్లు లేకుండా రతిక మాట్లాడిన మాటలు చిరాకు తెప్పించాయి. ఆడియన్స్‌కు బాగా దొరికి పోతున్నావని ఒకానొక సమయంలో తేజ కలుగచేసుకుని రతికా రోజ్‌ను హెచ్చరిస్తాడు. అయినా ఆమె వినకుండా మరింత రెచ్చిపోయి పసలేని కారణాలు శోభకు చెప్పి రతిక ప్రేక్షకులకు దొరికిపోయింది. ఆ తర్వాత యావర్‌ను సరైన కారణంతో శోభ నామినేషన్ చేయడంతో ఆయన ఎటువంటి మాటలు మాట్లడకుండా స్వీకరిస్తాడు. యావర్‌తో అశ్విని ఫైట్ యావర్ మొదటగా శోభను నామినేషన్లో చేర్చగా వారిద్దరి మధ్య ఎలాంటి వాగ్వాదం జరగలేదు. దానికి ప్రధాన కారణం యావర్ చెప్పిన సరైన పాయింట్లకు ఆమె నుంచి ఎలాంటి సమాధానం లేకుండాపోయింది. ఆ తర్వాత అశ్విని పేరును యావర్ లేవనెత్తుతాడు. ఆటలో కన్ఫ్యూజ్ అవుతున్నావని హౌస్‌లో ఉండాలంటే ఆట తీరును ఆర్థం చేసుకుంటూ ముందుకు సాగాలని ఇవేవి నీలో లేవని అశ్వినికి తెలిపి యావర్ నామినేషన్ చేస్తాడు. అందుకు ఉదాహరణగా గతంలో అమర్‌ను నామినేట్ చేస్తానని చెప్పి ఆ తర్వాత ఫ్లిప్ అయి అర్జున్ను నామినేషన్ చేయడం ఏంటని యావర్ ప్రశ్నించాడు. అలా యావర్ చెప్పిన ఐదు పాయింట్లలో నాలుగు సరైనవే అనేలా ఉన్నాయి. కానీ సందీప్ మాస్టర్‌కు ఒక టాస్క్‌లో అశ్విని వాటర్ పోస్తుంది. దానిని యావర్ తప్పుబడుతూ నామినేట్ చేస్తాడు. ఇందులో ఏ మాత్రం పసలేదని తెలుస్తోంది. వారిద్దరి మధ్య నామినేషన్ ప్రక్రియ చాలా ఫన్నీగా జరుగుతుంది. శివాజీ మీద పైచేయి అమర్ చేసిన నామినేషన్లలో ఈ వారం శివాజీపై పైచేయి సాధించాడని చెప్పవచ్చు. శివాజీని ఉద్దేశిస్తూ.. అన్నా మీకు నేను ఎందుకు నచ్చనో అలాగే మీరు కూడా నాకు నచ్చరు అని ఓపెన్‌గానే చెబుతాడు అమర్. ఆటలో నేను మాత్రమే అరుస్తున్నాని, కేకలు వేస్తున్నానని ప్రతిసారి నన్ను నామినేషన్ చేస్తున్నావ్.. అలాగే నీ పక్కన ఉన్నవారు కూడా నామినేషన్ సమయంలో కేకలు వేస్తున్నారు కదా వారిని ఎందుకు హెచ్చరించరని సరైన పాయింట్‌ను శివాజీకి అమర్ వేశాడు. అప్పుడు శివాజీ కూడా వాళ్లకు వార్నింగ్ ఇచ్చాను.. చెబుతున్నాను అంటాడు. అలా చెప్పడం కాదన్నా.. నాకు ఎలా చెప్పారో వాళ్లను కూడా నామినేషన్లో నిలబెట్టి చెప్పండి అని అమర్ తెలుపుతాడు. దీంతో ఇబ్బంది పడ్డ శివాజీ ఆన్సర్ చెప్పలేక సైడ్ అయిపోతాడు. అలాగే సందీప్ మాస్టర్‌ను ఇంటి నుంచి పంపించావ్ అని తేజను నామినేట్ చేస్తాడు శివాజీ.. మరి సందీప్ మాస్టర్‌ను ఎలిమినేషన్ లిస్ట్‌లో పెట్టిన యావర్‌ను మాత్రం ఒక మాట కూడా అనలేకపోయాడు శివాజీ. ఇలా ఈ వారంలో శివాజీ దొరికిపోయాడు. ఈ వారం నామినేషన్లో ఉండేది వీళ్లే 1. అమర్ దీప్ 2. రతికా రోజ్ 3. శోభ శెట్టి 4. ప్రియాంక జైన్ 5. అర్జున్ 6. టేస్టీ తేజ 7. భోలే షావలి 8. ప్రిన్స్ యావర్ -
దొరికిపోయిన రతిక.. మోకాళ్లపై కూర్చుని దండం పెట్టిన అమర్!
బిగ్‌బాస్ షోలో మిగతా రోజుల సంగతెలా ఉన్న నామినేషన్స్ మాత్రం మంచి ఎంటర్టైన్మెంట్ ఇస్తాయి. కంటెస్టెంట్స్ అందరూ పిచ్చిపట్టినట్లు ప్రవర్తిస్తారు. అవతలి వాళ్లని నామినేట్ చేసి, వాళ్ల వ్యతిరేకిస్తే గొడవ పెట్టుకోవడానికైనా అస్సలు వెనుకాడరు. ఇప్పటికే సోమవారం సగం నామినేషన్స్ పూర్తి కాగా, మంగళవారం మిగిలినవి జరిగాయి. ఇందుకు సంబంధించిన ప్రోమోని తాజాగా రిలీజ్ చేయగా.. అందులో అమరదీప్ హైలైట్ అయ్యాడు. అలానే రతిక ఓ పాయింట్లో దొరికిపోయింది. (ఇదీ చదవండి: లాజిక్స్ మర్చిపోయిన శివాజీ.. అమర్ అడిగిన దానికి నో ఆన్సర్!) యవర్ లాజిక్ లేని నామినేషన్స్ చేశాడు. కారణాలు ఏం చెప్పాలో తెలీక శోభాశెట్టి, అశ్వినిని నామినేట్ చేశాడు. మరోవైపు రతిక - శోభాశెట్టి మధ్య వాదన గట్టిగా నడిచినట్లు ప్రోమోలో చూపించారు. శోభాతో మాట్లాడుతూ తేజ పేరు తీసుకొచ్చింది. దీంతో తేజ ముందుకొచ్చి.. 'నా పేరు ఎందుకు మధ్యలో తీసుకొచ్చావ్' అని రతికతో అతడు గొడవ పెట్టుకున్నాడు. 'దొరికిపోయావ్.. దారుణంగా జనాలకి దొరికిపోతున్నావ్' అని తేజ అన్నాడు. మరి రతిక నోరు మూసుకుంది. మరి ఆమె ఏ విషయంలో దొరికిపోయిందనేది మంగళవారం ఎపిసోడ్లో క్లారిటీ వచ్చేస్తుంది. 'మీరు నామినేట్ చేసిన విధానం నాకు నచ్చలేదు, అందుకే బాధతో మిమ్మల్ని నామినేట్ చేస్తున్నా' అని అమర్, భోలెని నామినేట్ చేశాడు. 'ఈ హౌసులో ఇంత మంచి పేరు తెచ్చుకున్న నన్ను..' అని భోలె అంటుండగానే.. 'అయ్యో సూపరన్నా మీరు నిజంగా దేవుడు మీరు' అంటూ వెటకారంగా అనేసరికి భోలె మెంటలెక్కిపోయాడు. 'ఈ బిగ్‌బాస్ హౌసులో ఏం సాధించావ్ నువ్వు? బ్యాడ్ నేమ్ తెచ్చుకున్నావ్' అని భోలె అన్నాడు. 'ఐ యామ్ హియర్ ఏజ్ ఏ బ్యాడ్ బాయ్, మీకు ఏమన్నా ప్రాబ్లమా?' అని కౌంటర్ ఇచ్చాడు. అలానే 'మారు.. మారు' అని ఒకరికొకరు చెప్పుకొన్నారు. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ షో చరిత్రలో ఫస్ట్‌టైమ్ అలాంటి నిర్ణయం!) -
లాజిక్స్ మర్చిపోయిన శివాజీ.. అమర్ అడిగిన దానికి నో ఆన్సర్!
బిగ్ బాస్ నామినేషన్స్ ఈసారి మరీ అంత హోరాహోరీగా కానప్పటికీ ఇంట్రెస్టింగ్‌గానే సాగాయి. శివాజీ బ్యాచ్ అంతా సీరియల్ బ్యాచ్ ని మళ్లీ టార్గెట్ చేశారు. ఈరోజు అది మళ్లీ క్లియర్ అయిపోయింది. అలానే అమరదీప్ లాజిక్స్ మాట్లాడేసరికి శివాజీ దగ్గర సమాధానం లేకుండా పోయింది. ఇంతకీ సోమవారం నామినేషన్స్ ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 57 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. లాజిక్ లెస్ నామినేషన్స్ సందీప్ ఎలిమినేట్ అయి బయటకు వెళ్లిపోవడంతో ఆదివారం ఎపిసోడ్ ముగిసింది. కంటెస్టెంట్స్ నిద్రలేవడంతో సోమవారం ఎపిసోడ్ మొదలైంది. బిగ్‌బాస్ కొత్త కెప్టెన్‌గా గౌతమ్ బాధ్యతలు అందుకున్నాడు. తనకు డిప్యూటీలుగా రతిక, శోభాని ఎంచుకున్నాడు. ఈ వారమంతా ఉమెన్స్ వీక్ సందర్భంగా.. ఇంట్లోని అమ్మాయిలకు విశ్రాంతి అని, అబ్బాయిలే అన్ని పనులు చేయాలని కెప్టెన్ గౌతమ్ ఆర్డర్ వేశాడు. తర్వాత నామినేషన్స్ షురూ అయ్యాయి. (ఇదీ చదవండి: వరుణ్-లావణ్య పెళ్లి.. రేణు దేశాయ్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్) ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? ప్రశాంత్ - అమరదీప్, తేజ ప్రియాంక - రతిక, భోలె అర్జున్ - శోభా, అమరదీప్ శివాజీ - అమరదీప్, తేజ రతిక - ప్రియాంక, శోభాశెట్టి తేజ - అర్జున్, రతిక భోలె - ప్రియాంక, అమరదీప్ రైతుబిడ్డ చల్లబడ్డాడు! నామినేషన్స్ అంటే రెచ్చిపోయే రైతుబిడ్డ ప్రశాంత్ దగ్గర ఈసారి కారణాలు లేవు. దీంతో ఎప్పటిలానే తన బ్యాచ్‌కి వ్యతిరకమైన అమరదీప్‌ని నామినేట్ చేసిపడేశాడు. గతవారం మిర్చి దండ వేశాడని తేజని కూడా నామినేట్ చేశాడు. దీంతో తేజకి చిరాకేసింది. కెప్టెన్సీ కంటెండర్‌షిప్ రేసులో గెలిచిన వాళ్ల మధ్య గేమ్ పెట్టి, విజేతని డిసైడ్ చేయండి. వాళ్ల గురించి తమకు అప్పజెప్పి ఈ పంచాయతీలు పెట్టకండి బిగ్‌బాస్ అని తన డిసప్పాయింట్మెంట్ బయటపెట్టాడు. (ఇదీ చదవండి: Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?) శివాజీ పగ-ప్రతీకారం బిగ్‌బాస్‌లో పెద్దగా పనులేం చేయకుండా, పెద్దమనిషిలా కలరింగ్ ఇస్తూ ప్రతివారం నెట్టుకొస్తున్న శివాజీ.. ఎప్పటిలానే ఈసారి కూడా అమరదీప్‌ని నామినేట్ చేశాడు. గతవారం నామినేషన్స్ సందర్భంగా అమరదీప్ గట్టిగట్టిగా అరవడం, డబుల్ మీనింగ్‌లో మాట్లాడటం నచ్చలేదని శివాజీ అన్నాడు. మరి ప్రశాంత్ ఇలా అరిచాడు కదా అప్పుడు ఎందుకు నామినేట్ చేయలేదన్న? అని అమరదీప్, శివాజీని ప్రశ్నించాడు. వాడికి చాలాసార్లు చెప్పాను, మార్చుకున్నాడని శివాజీ అన్నాడు. ఇక్కడ శివాజీ.. పుత్రప్రేమ క్లియర్‌గా బయపడింది. ఇక ప్రియాంక.. గేమ్ కనిపించలేదని రతికని నామినేట్ చేసింది. కానీ రతిక మాత్రం ప్రియాంక తనని చేసింది కదా అని ఆమెని నామినేట్ చేసి పడేసింది. అలా ఎంతో సీరియస్‌గా సాగుతున్న ఈ ప్రక్రియలో తేజ కాస్త ఫన్ జనరేట్ చేశాడు. ఓవరాల్‌గా చూస్తే శివాజీ బ్యాచ్‌కి చెందిన శివాజీ, ప్రశాంత్, భోలె.. కావాలని టార్గెట్ చేసి మరీ అమరదీప్ ని నామినేట్ చేయడం.. గ్రూపుల యవ్వారాన్ని మొత్తం బయటపెట్టినట్లయింది. అలానే అమర్ అంటే శివాజీకి ఎందుకంత పగ అనేది అర్థం కావట్లేదు. (ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!) -
Bigg Boss 7: బెస్ట్ ఫ్రెండ్స్ మధ్య గొడవ.. ఈసారి నామినేషన్స్‌లో ఉన్నదెవరంటే?
బిగ్‌బాస్‌లో మిగతా రోజులు ఎలా ఉన్నాసరే నామినేషన్స్ అప్పుడు మాత్రం మంచి ఊపు వస్తుంది. ఎందుకంటే అన్నిరోజులు మనసులో దాచుకున్నవన్నీ సోమవారం బయటకు కక్కేస్తారు. తమ కోపాన్నంతా చూపించేస్తారు. అలా ఈసారి కూడా మంచి వాడీవేడిగా సాగాయి. అయితే ఈసారి బెస్ట్ ఫ్రెండ్స్ ఇద్దరు తగువులాడుకోవడం మాత్రం షాకిచ్చింది. ఇంతకీ ఏంటి విషయం? వరసగా ఏడు వారాలు అమ్మాయిలు ఎలిమినేట్ అయిపోయారు. ఎనిమిదో వారం మాత్రం సందీప్ ఎలిమినేట్ అయ్యాడు. ప్రస్తుతం తొమ్మిదో వారంలోకి అడుగుపెట్టేశాం. ఇకపోతే ఈసారి ఒక్కో కంటెస్టెంట్.. ఇద్దర్ని నామినేట్ చేయాల్సి ఉంటుంది. నామినేట్ అయిన వ్యక్తులు.. డ్రాగన్ స్నేక్ ముందు నిల్చుంటే అందులో కలర్ పౌడర్ ముఖంపై పడుతుంది. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లో ఏకంగా 32 సినిమాలు రిలీజ్) ప్రియాంక vs అమరదీప్ ఈసారి అనుకోని విధంగా నామినేషన్స్ జరిగాయి. ఇన్నాళ్లు ఒకరికొకరు అండగా ఉంటూ వచ్చిన సీరియల్ బ్యాచ్.. ఇప్పుడు ఎవరికి వాళ్లు ఆడాలని డిసైడ్ అయినట్లు ఉన్నారు. శోభాని అర్జున్ నామినేట్ చేయగా, ఇక ఏది పడితే అది మాట్లాడుతున్నాడని అమరదీప్తో ప్రియాంక గొడవ పెట్టుకుంది. నామినేషన్స్ కంటే ఇదే ఇంట్రెస్టింగ్ గా అనిపించింది. ఇకపోతే తేజ.. అర్జున్, రతికని నామినేట్ చేశాడు. ప్రియాంక.. రతికని నామినేట్ చేసింది. భోలె షావళి.. ప్రియాంకని నామినేట్ చేశాడు. ఎప్పటిలానే శివాజీ బ్యాచ్‌లోని శివాజీ, ప్రశాంత్.. ఏదో పగ ఉన్నట్లు కావాలనే పిచ్చి పిచ్చి కారణాలు చెప్పి అమరదీప్‌ని నామినేట్ చేసినట్లు ప్రోమోలో క్లియర్‌గా కనిపించింది. ఓవరాల్ గా ఈ వారం.. ప్రియాంక, అమరదీప్, శోభాశెట్టి, అర్జున్, తేజ, రతిక, భోలె, యవర్ నామినేట్ అయినట్లు తెలుస్తోంది. మరి ఈ సారి ఎవరు ఎలిమినేట్ అవుతారనేది చూడాలి? (ఇదీ చదవండి: యాంకర్ విష్ణుప్రియకు అనారోగ్యమా? లేకపోతే అలా ఎందుకు!) -
పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలి: రైతుబిడ్డకు అమర్దీప్ కౌంటర్
ఈ ఏడాది తెలుగువారి రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్-7 కాస్తా ఆడియన్స్‌ను ఆకట్టుకుంటోంది. గతేడాది నిరాశపర్చిన బిగ్‌బాస్ ఈసారి ఉల్టా-పుల్టా అంటూ సరికొత్తగా పరిచయం చేశారు. ఆ తర్వాత షో జరిగిన ఐదు వారాలకు బిగ్‌బాస్ 2.0 అంటూ మరోసారి ఆసక్తిని పెంచేశారు. ఐదుగురిని ఎలిమినేట్ అవ్వగా.. కొత్తగా అంతేమందిని హౌస్‌లోకి తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ షో ఎనిమిదో వారానికి చేరుకుంది. ఈ వారంలో జరుగుతున్న కెప్టెన్సీ టాస్క్ చివరిదశకు చేరింది. బిగ్‌బాస్ మారథాన్‌లో గెలిచి కెప్టెన్సీ పోటీదారులుగా నిలిచిన వారిలో అర్హతలేని వ్యక్తి మెడలో మిరపకాయల దండ వేయమని బిగ్‌బాస్ కంటెస్టెంట్లకు సూచించాడు. (ఇది చదవండి: రైతుబిడ్డను మళ్లీ ఏడిపించిన రతిక.. నోరేసుకుని సాధిస్తున్న శోభ!) కాగా.. ఈ వారం బిగ్‌బాస్ మారథాన్‌లో ప్రియాంక, ప్రశాంత్, సందీప్, గౌతమ్, శోభ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. ఈ క్రమంలో కెప్టెన్ అయ్యేందుకు అర్హతలేని వ్యక్తుల మెడలో మిరపకాయల దండ వేసి వాళ్లను ఎలిమినేట్ చేయాలని బిగ్‌బాస్ హౌస్‌మేట్స్‌కు సూచించాడు. ఇప్పటికే ఒకసారి కెప్టెన్ అయినందుకు ప్రశాంత్‌కు వ్యతిరేకంగా అమర్దీప్ ఓటు వేస్తున్నట్లు ప్రకటిస్తాడు. కెప్టెన్సీ కంటెండర్స్ నుంచి పల్లవి ప్రశాంత్ ఎలిమిషన్ కోసం మొదట అమర్దీప్ ఓటేస్తాడు. 'పంట పండించేవాడికి.. పంచుకోవడం కూడా తెలియాలిరా నీకు అంటూ అమర్దీప్ అంటాడు. ఏదైన చెప్పినప్పుడు తొడ కొట్టేది, మీసాలు తిప్పేది, మేలేసేది, పక్కవాళ్లు నవ్వితే సంక గుద్దేది కాదు.. అంటూ ప్రశాంత్‌ను ఉద్దేశించి మాట్లాడతాడు. ఆ తర్వాత టేస్టీ తేజ మాట్లాడుతూ.. ప్రశాంత్ నీవు ఇప్పటికే కెప్టెన్ అయ్యావ్ కాబట్టి.. మరోసారి నీకు అవసరం లేదంటూ ప్రశాంత్ మెడలో మిరపకాయల దండ వేస్తాడు. దీనికి ప్రశాంత్ బదులిస్తూ.. మీరంతా నాపై ఇలా దండలు వేస్తుంటే రైతులు పండించిన పంట పూలమాలలా ఉంది.'అని నవ్వుతూ చెబుతాడు. అలాగే ప్రియాంక మెడలో భోలే షావలి మిరపకాయల దండ వేసి ఆమెకు వ్యతిరేకంగా ఓటు వేశాడు. ఇక శోభకు వ్యతిరేకంగా రతిక, యావర్‌లు ఓటేస్తారు. ఈ క్రమంలో శోభ, యావర్‌ల మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. యావర్‌ను పిచ్చోడు అంటూ శోభ మాట్లాడటంతో ఆమెపై ఫైర్ అవుతాడు. (ఇది చదవండి: ఓటీటీలోకి వచ్చేస్తున్న తెలుగు హిట్ మూవీ.. స్ట్రీమింగ్ అప్పుడేనా?) ఆ తర్వాత అశ్విని మాట్లాడుతూ.. ప్రశాంత్‌కు ఓటేయడానికి ఇక్కడున్న వారికి ఎవరికీ అర్హత లేదని అంటుంది. ఇది విన్న టేస్టీ తేజ ఆమెపై ఫైర్ అవుతాడు. ఆ విషయం చెప్పడానికి నువ్వెవరు? అని ప్రశ్నిస్తాడు. నేను అపోజిట్‌లో ఉన్నంత వరకు కెప్టెన్ అయినోన్ని ఇంకోసారి అవ్వనివ్వనని అమర్దీప్ చెప్పడంతో ప్రోమో ముగిసింది. ఇవాల్టి ఎపిసోడ్‌కు సంబంధించిన ప్రోమోలు చూస్తే కెప్టెన్ ఎవరు అవుతారనే విషయంపై మరింత ఆసక్తి కలుగుతోంది. మరి ఇంటి సభ్యుల మనసు గెలుచుకుని ఈ వారం కెప్టెన్‌గా ఎవరు నిలిచారో తెలియాలంటే ఎపిసోడ్ చూడాల్సిందే! -
శివాజీ ఆడట్లేదు.. అతడు క్యారెక్టర్ వదిలేశాడు!: పూజా
టాలీవుడ్ రియాలిటీ షో బిగ్ బాస్ మరింత ఆసక్తికరంగా మారింది. ఈ సీజన్లో మొదటి నుంచి మహిళా కంటెస్టెంట్స్‌ను ఎలిమినేట్ చేస్తూ వచ్చిన బిగ్ బాస్.. 2.0లోనూ అదే సాంప్రదాయం కొనసాగించారు. వరుసగా ఏడో వారంలోనూ లేడీ కంటెస్టెంట్ పూజా మూర్తిని ఎలిమినేట్ చేశారు. అయితే హౌస్ నుంచి బయటకొచ్చిన పూజా.. కంటెస్టెంట్స్ గురించి ఆసక్తికర కామెంట్స్ చేసింది. తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరైన ఆమె చాలా విషయాలు పంచుకుంది. శివాజీ వల్లే ఆ ఇద్దరు ఆడుతున్నారా? అని యాంకర్ ప్రశ్నించగా.. పూజా ఇంట్రెస్టింగ్ సమాధానమిచ్చింది. (ఇది చదవండి: నాలుగు కోట్ల కారు కొన్న స్టార్ హీరోయిన్.. సోషల్ మీడియాలో వైరల్!) 'పల్లవి ప్రశాంత్, యావర్‌కు శివాజీ సపోర్ట్‌గా ఉన్నారు. అంటే వాళ్ల గేమ్ వాళ్లు ఆడుతున్నారు. మనం కేవలం కొంతవరకు పుష్ చేయగలం. కానీ శివాజీ మాత్రం కాస్త ఎక్కువే సపోర్ట్ చేస్తున్నారు. వారంతా కలిసి బ్యాలెన్స్డ్గానే ఉన్నారు. వీళ్లిద్దరికైతే అందరికంటే ఎక్కువ మద్దతు ఇస్తున్నారు. తను ఆడట్లేదు, కానీ ఆడిస్తున్నాడు. ఆడట్లేదని చెప్పి నామినేట్ చేస్తే మాత్రం అసలు ఒప్పుకోడు. ఇక అమర్దీప్ నాకు బయట కూడా బాగా తెలుసు. కానీ హౌస్‌లోకి వెళ్లాక పూర్తిగా మారిపోయాడు. తన ఒరిజినల్ క్యారెక్టర్‌ను వదిలేశాడు. నేను అందగాన్ని అంటూ రెచ్చిపోయే అమర్.. అక్కడ పూర్తిగా డీలా పడిపోయాడు. నేను అతనితో కలిసి పనిచేశా. నేను చూసిన అమర్.. లోపల కనిపిస్తున్న అమర్ వేరు. అతను తన ఆత్మవిశ్వాసాన్ని కోల్పోయాడు' అని తెలిపింది. (ఇది చదవండి: స్టార్ కమెడియన్ కూతురు బర్త్ డే.. హాజరైన అగ్ర హీరోలు!) -
Bigg Boss 7: మళ్లీ దొరికిపోయిన శివాజీ.. అమర్ ఆ పాయింట్ చెప్పేసరికి!
బిగ్‌బాస్‌లో మిగతా వాటి సంగతెలా ఉన్నా నామినేషన్స్ మాత్రం మంచి మజా ఇస్తాయి. ఈసారి కూడా అలానే జరిగాయి. సోమవారం నాడు శోభాశెట్టి శివాజీ మీద రెచ్చిపోగా, మంగళవారం నాడు అమరదీప్ శివాజీపై రెచ్చిపోయాడు. ఎప్పుడూ హడావుడి చేసే రైతుబిడ్డ ఈసారి చల్లబడ్డాడు. ఇంతకీ మంగళవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 51 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి:'జైలర్' విలన్ని అరెస్ట్ చేసిన పోలీసులు.. కారణం అదే?) శివాజీ రంగు బయటపడింది సోమవారం సగం నామినేషన్స్ పూర్తయ్యాయి. ఇక మిగిలిన నామినేషన్స్‌తో మంగళవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. ఫస్ట్ ఫస్ట్ వచ్చిన అమరదీప్ శివాజీని నామినేట్ చేశాడు. 'నేను చనిపోయేటప్పుడు కూడా నా పిల్లల్ని నీతో మాట్లాడొద్దని చెబుతాను' అని శివాజీ అనడం అస్సలు కరెక్ట్ కాదని అమరదీప్ అన్నాడు. అయితే ఇది జోక్‌గా అన్నానని శివాజీ ఏదో కవర్ చేశాడు. కానీ అమరదీప్ అలా అనేసరికి ముఖం మాడిపోయింది. కిందకు దించేసి అలా ఉండిపోయాడు. చివర్లో మాత్రం 'గుర్తులేదు, చూడలేదు, మర్చిపోయా.. దిస్ ఈజ్ మై ప్లాన్' అని శివాజీ అన్నాడు. ఎవరు ఎవరిని నామినేట్ చేశారు? అమరదీప్ - శివాజీ, భోలె యవర్ - శోభాశెట్టి, సందీప్ తేజ - అశ్విని, సందీప్ ప్రశాంత్ - గౌతమ్, అమరదీప్ రతిక - శోభాశెట్టి, అమరదీప్ అర్జున్ - తేజ, భోలె నోరు జారిన సందీప్ ఇక యవర్, సందీప్‌ని నామినేట్ చేశాడు. ఒకానొక దశలో సందీప్ సీరియస్ అయ్యాడు. యవర్ని ఉద్దేశిస్తూ.. 'బొంగులోది' అనే పదం ఉపయోగించడంతో పాటు చేతితో ఓ సైగ చేశాడు. దీంతో 'బొంగు' అనే పదాన్ని పదే పదే రిపీట్ చేశాడు. దీంతో ప్రతిసారి బిగ్ బాస్.. బీప్ వేసుకోవాల్సి వచ్చింది. ఈ గొడవ జరుగుతుంటే మధ్యలో వచ్చిన శివాజీకి కూడా సందీప్ గట్టిగా ఇచ్చేశాడు. (ఇదీ చదవండి: చిరంజీవి కొత్త సినిమాలో విలన్‌గా రామ్‌చరణ్ ఫ్రెండ్!) ప్రశాంత్.. ఈసారి ఏం లే మిగతారోజుల్లో ఉన్నాడో లేడో అన్నట్లు ఉండే ప్రశాంత్.. నామినేషన్స్ వచ్చేసరికి మాత్రం షర్ట్ పై బటన్ కూడా పెట్టుకుని బుద్దిమంతుడిలా రెడీ అవుతాడు. అవతల వాళ్లు చెప్పేది పూర్తికాకుండానే వాదిస్తుంటాడు. ఈసారి మాత్రం అంత సీన్ లేకపోయింది. గౌతమ్.. ప్రశాంత్ గాలి మొత్తం తీసేశాడు. తనని నామినేట్ చేయడంతో.. ప్రశాంత్ దగ్గర సరైన కారణం లేదు. రివేంజ్ నామినేషన్ చేస్తున్నాడని చెప్పాడు. ప్రశాంత్ ఎప్పుడూ చేసినట్లు గౌతమ్ బిహేవ్ చేస్తూ.. కరెక్ట్ గా చెప్పాలంటే అరుస్తూ డైలాగ్స్ చెబుతూ మరీ టీజ్ చేశాడు. దెబ్బకు ప్రశాంత్ సైలెంట్ అయిపోయాడు. ఇక అమరదీప్‌ని కూడా నామినేట్ చేసిన ప్రశాంత్.. తమ గ్రూప్ సభ్యుడైన భోలె గురించి మాట్లాడటం నచ్చలేదని కారణం చెప్పాడు. దీంతో గ్రూప్ రాజకీయాలు బయటపడినట్లు అయింది. గ్రూపులో ఉన్న అతడిని కంట్రోల్ చేసుకోలేకపోయారని భోలె అనడంతో.. గ్రూప్ మెంబర్ అయిన శోభా రెచ్చిపోయింది. ఇంతలో అమరదీప్ చెవిలో గౌతమ్ ఏదో చెప్పాడని ప్రశాంత్ అనడంతో గౌతమ్ రెచ్చిపోయాడు. ఏదైనా చేసుకుంటా నువ్వేమైనా బిగ్ బాస్ వా దొబ్బెయ్ అని అమరదీప్, ప్రశాంత్‌తో అన్నాడు. నన్ను ఏకినా, పీకినా, లాగినా ఏం చేసుకున్నా వెనకడుగు వేయను. ఒక్కటి గుర్తుపెట్టుకో ఇక్కడి నుంచి పోతే కప్పుతోనే పోతా, ఎవ్వడు ఏమైనా చేసుకోండి అని అమరదీప్ గట్టిగా అరుస్తూ ప్రశాంత్‌తో చెప్పాడు. అలా మంగళవారం ఎపిసోడ్ ముగిసింది. మొత్తంగా ఈ వారం ఎనిమిది నామినేట్ అయ్యారు. ఈ వారం నామినేట్ అయినోళ్లు శోభా భోలె శివాజీ అశ్విని ప్రియాంక అమరదీప్ సందీప్ గౌతమ్ (ఇదీ చదవండి: పవన్ మతిమరుపు.. సొంత సినిమా గురించే మర్చిపోయాడు!) -
ఎవరెన్ని వెధవ ప్రయత్నాలు చేసినా కప్పు కొట్టుకునే పోతా: అమర్
వారాలు గడిచేకొద్దీ, హౌస్‌లో జనం పలుచబడే కొద్దీ నామినేషన్స్ రసవత్తంగా మారుతున్నాయి. ఈ వారం కూడా నామినేషన్స్‌తో ఇంటిసభ్యుల మధ్య మంట పెట్టేశాడు బిగ్‌బాస్. నామినేషన్స్ తప్ప మిగతా అన్ని సందర్భాల్లో అమాయకుడిగా కనిపించే ప్రశాంత్ నిన్న మళ్లీ ఓవరాక్షన్ మొదలుపెట్టాడు. ఈ రోజు కూడా అది కొనసాగేట్లు కనిపిస్తోంది. ఈ మేరకు తాజాగా ప్రోమో రిలీజైంది. మధ్యలో దూరిన శివాజీ.. గౌతమ్‌ను మళ్లీ ఇరిటేట్ చేశాడు. గౌతమ్‌తో పాటు అమర్‌దీప్‌ను సైతం నామినేట్ చేశాడు. అయితే ప్రశాంత్- అమర్ల మధ్య వార్ నడుస్తుంటే సందులో సడేమియాలా భోలె షావళి కలుగజేసుకున్నాడు. దీంతో చిర్రెత్తిపోయిన అమర్.. మధ్యలో వస్తే పగిలిపోద్ది.. అంటూ అక్కడున్న కుర్చీని తన్నాడు. అయినా సరే శివాజీ కలగజేసుకుంటూ నీకు అవసరం అయినప్పుడు ఒకలా మాట్లాడతావ్.. అవసరం లేనప్పుడు ఇంకోలా మాట్లాడతావా? అని అడిగాడు. విశ్వరూపం చూపించిన అమర్ అప్పటికే కోపంతో ఊగిపోతున్న అమర్.. మీరు వాడిని సపోర్ట్ చేయాలనుకుంటే చేసేయండి అని బదులిచ్చాడు. నన్ను ఇక్కడి నుంచి పంపించేయాలని ఎంత వెధవ ప్రయత్నాలు చేసినా కప్పుతోనే పోతా.. ఐయామ్ బ్యాక్ అని తన విశ్వరూపం చూపించాడు అమర్. అటు శోభా శెట్టి- భోలె షావళిల మధ్య కూడా మాటల యుద్ధం నడిచింది. తేజ- అశ్విని మధ్య సైతం ఫైట్ జరిగినట్లు కనిపిస్తోంది. మొత్తానికి నామినేషన్స్‌తో కంటెస్టెంట్ల మధ్య ఆరని చిచ్చు పెట్టేశాడు బిగ్‌బాస్. చదవండి: హీరోతో లవ్‌లో ఉన్న యాక్షన్ కింగ్ కూతురు -
బూతులు బిగ్ బాస్‌లోనే కాదు.. బయట మరీ దారుణం..ఆమెను రేప్ చేస్తారంటూ
బిగ్‌బాస్ సీజన్ 7లో ఒక ప్రత్యేకత చోటు చేసుకుంది. ఈసారి ఆటలోని కంటెస్టెంట్లు అదుపు తప్పి బూతులు మాట్లాడటం చాలా ఎక్కువగా కనిపిస్తుంది. ముఖ్యంగా గేమ్స్, టాస్కులు, నామినేషన్లలో హీట్ సంభాషణలు పెరిగి నాలుకలు అదుపు తప్పుతుంటయ్… అది సహజమే గతంలో కూడా ఉండేవి కానీ వాటిని టెలికాస్ట్ చేసే వాళ్లు కాదు. ప్రస్తుతం ప్రోగ్రామ్‌పై బజ్ క్రియేట్ చేసేందకు ఇవన్నీ తప్పడం లేదని తెలుస్తోంది. బిగ్‌బాస్ హౌస్‌లో ఇలా ఉంటే బయట వారి ఫ్యాన్స్ చేసే భూతుల రచ్చ తారా స్థాయికి చేరింది. తను అభిమానించే వ్యక్తి గెలుపు కోసం మరో ఇంటి ఆడబిడ్డపై బూతులతో దాడిచేస్తారా..?ముఖ్యంగా హౌస్‌లోని లేడీ కంటెస్టెంట్లు శోభ, ప్రియాంకలతో పాటు ఎలిమినేట్ అయిన రతికా రోజ్‌ను మాటలతో చెప్పలేని భూతు పదాలతో దాడిచేస్తున్నారు. ఆటలో వారికి నచ్చిన స్ట్రాటజీ ఉపయోగించి ముందుకు వెళ్తున్నారు. నచ్చకుంటే ఓటు వేయకండి అని ప్రచారం చేయడంలో ఎలాంటి తప్పులేదు. కానీ అసభ్య పదాలతో వినకూడని మాటలతో వారిద్దరిపై ఎదురు దాడి జరుగుతుంది. రేప్ కూడా చేస్తారు అంటూ కామెంట్లు బిగ్ బాస్ లేడీ కంటెస్టెంట్లలో ఒకరిపై (పేరు తెలపడం లేదు) రేప్ కూడా చేస్తారు.. ఏం చేస్తారో చెప్పండి అంటూ ఒక మహిళ తనకు నచ్చిన కంటెస్టెంట్‌ను వెనుకేసుకొస్తూ.. సోషల్ మీడియాలో కామెంట్ చేసి వీడియో షేర్ చేసింది. ఇంతటి ఉన్మాదం ఎందుకు...? ఎవరి కోసం..? భోలే చెప్పినట్లు ఎర్రగడ్డలో చేర్పించాల్సింది శోభను కాదు... ఇలాంటి సిగ్గుమాలిన కామెంట్లు చేసే వారందరిని అక్కడ వైద్యం కోసం చేర్పించాలి. అలాగే అమర్దీప్, సందీప్ కుటుంబ సభ్యులపై కూడా ఇలాంటి దాడే జరుగుతుంది. ఒకరి గెలుపు కోసం ఇంతటి నీచానికి పాల్పడటం ఎంత వరకు కరెక్ట్ అని విమర్శలు వస్తున్నాయి. ఇలాంటి చెత్త పనులు మొదట ప్రారంభించేది హౌస్‌లోని కంటెస్టెంట్ల పీఆర్ టీమ్ వారే... వారికి నచ్చని వారిపై దుమ్మెత్తిపోయడమే పనిగా పెట్టుకుంటారు. బూతులు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదులుతారు. వాటికి కనెక్ట్ అయిన కొందరు కామన్ ఫ్యాన్స్ షేర్ చేస్తుంటారు. (ఇదీ చదవండి: Bigg Boss 7: మాటలు మార్చి దొరికిపోయిన రైతుబిడ్డ.. ఫ్రూప్స్‌తో సహా మొత్తం!) నామినేషన్ల సమయంలో సింగర్ భోలే బూతుల ధారను తాజాగా నాగార్జున కూడా తప్పుబట్టారు. ప్రశాంత్ మీకు బరాబర్ చేసిండు.. అంటూ ఒక బీప్ మాట ఏదో వేసుకున్నాడు భోలే. ఆ సమయంలో ప్రియాంక, శోభాశెట్టి సక్సెస్‌ఫుల్‌గా వాటిని తిప్పికొట్టారు కూడా. ఇలాంటి భాషను, ఈ బూతుల్ని సహించేది లేదంటూ తీవ్ర స్థాయిలో తిరగబడ్డారు. చివరకు తన తప్పును తెలుసుకుని సారీ చెప్పి తలవంచాల్సి వచ్చింది. దీంతో సహజంగానే ట్రోలర్లు రెండువైపులా చేరిపోయారు. మాయాస్త్రం టాస్కులో కూడా అమర్ వర్సెస్ ప్రశాంత్… అమర్ బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయి, వాడు రీజన్ లేకుండా నన్ను తీసేశాడు.. వాడి వల్ల నా గేమ్ నాశనం అయిందటూ వినరాని పరుష వ్యాఖ్య చేశాడు. ఈ పదం వాడినప్పుడు కూడా ప్రియాంకే సాక్షి… అప్పుడు కూడా అమర్‌ను 'నోరు జాగ్రత్త' అని హెచ్చరించింది. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి'కి షాకిచ్చిన తారక్,మెగా ఫ్యాన్స్.. భారీగా నష్టాలు) శోభాశెట్టిని, ప్రియాంకలను తిట్టడంతో పాటు. అమర్ దీప్ అమ్మగారిని, అతని భార్యను కూడా భూతులు తిట్టడం అధికం అయింది. సోషల్ మీడియాలో భూతుల దాడి తట్టుకోలేక అమర్ తల్లి కన్నీరు పెట్టింది. ముఖ్యంగా ప్రశాంత్ పీఆర్ టీమ్ ఇతర కంటెస్టెంట్లపై బూతు పదాలతో ఎక్కువగా దాడి చేస్తున్నారనేది మెజారిటీగా వినిపిస్తోంది. మరోవైపు సందీప్ భార్య జ్యోతి పరిస్థితి అదే. బిగ్‌బాస్‌లో ఉండాలంటే ఆయా కంటెస్టెంట్ల సోషల్ మీడియా బ్యాచులు సైట్లనూ మేనేజ్ చేయాలాల్సిందేనా అనే అపవాదు కనిపిస్తుంది. గతంలో ఏ సీజన్లో కూడా పీఆర్ టీమ్ ప్రభావం అంతగా లేదు. కానీ ఈ సీజన్లో మాత్రం దాదాపు చాలా మందికి పీఆర్ టీమ్ ఉంది. ఎప్పుడూ లేని విధంగా వారు బూతులు క్రియేట్ చేయడం చాలా బాధకారం. ఇవన్నీ చూస్తున్న కామన్ ప్రేక్షకులు కూడా షో నుంచి దూరం అవుతున్నారు. గత సీజన్‌ను తిరస్కరించినట్టుగానే ఈ సీజన్‌కు కూడా చాలామంది దూరమైపోయారు. -
నోటికొచ్చింది వాగుతున్న శివాజీ.. మళ్లీ మంచోడిలా కవరింగ్!
బిగ్‌బాస్‌లో శివాజీ ఉండలేకపోతున్నాడు. గత ఆరువారాల నుంచి ఏదో మాటలు, మరోవైపు మైండ్ గేమ్‌తో నెట్టుకొచ్చేశాడు గానీ ఇప్పుడు వాటికి కూడా స్కోప్ లేకుండా పోయింది. ఓ విషయాన్ని తాను చేస్తే ఘనకార్యం అనుకుంటాడు. పక్కనోళ్లు చేస్తే మాత్రం నాన్సెన్స్ అంటున్నాడు. అమరదీప్తో జరిగిన ఓ సంఘటనతో ఇది బయటపడింది. ఇంతకీ శుక్రవారం ఎపిసోడ్లో ఏం జరిగిందనేది Day 47 హైలైట్స్‌లో ఇప్పుడు చూద్దాం. (ఇదీ చదవండి: బిగ్‌బాస్ 7: మళ్లీ షాకింగ్ ఎలిమినేషన్.. ఏడోవారం కూడా అమ్మాయే?) శివాజీపై బిగ్‌బాస్ ప్రేమ కెప్టెన్సీ టాస్క్ పూర్తి కావడంతో గురువారం ఎపిసోడ్ ముగిసింది. కెప్టెన్సీ టాస్కులో విజేతని ప్రకటించడంతో శుక్రవారం ఎపిసోడ్ ప్రారంభమైంది. టాస్కులో విజయం సాధించిన జిలేబీపురం గ్రామస్థులు కెప్టెన్సీ కంటెండర్స్‌గా నిలిచారు. అయితే సంచాలక్‌గా వ్యవహరించిన శివాజీకి కూడా ఛాన్స్ ఉందని, కాకపోతే గెలిచిన జట్టులో ఒకరితో ఎక్సేంజ్ చేసుకోవాల్సి ఉంటుందని బిగ్‌బాస్ చెప్పాడు. దీంతో భోలె.. తన కంటెండర్‌షిప్ శివాజీకి దానం చేశాడు. కొత్త కెప్టెన్ ఎవరు? కెప్టెన్సీ కంటెండర్‌షిప్ కోసం పోటీలో ఉన్న ఆరుగురిలో (ప్రియాంక, అర్జున్, సందీప్, ప్రశాంత్, అశ్విని, శివాజీ) ఎవరు కెప్టెన్ కావాలనేది ప్రత్యర్థి జట్టు గులాబీపురం చేతిలో ఉంటుందని బిగ్‌బాస్ ఫిట్టింగ్ పెట్టాడు. దీంతో శోభా వచ్చి అశ్వినిని ఎలిమినేట్ చేసింది. అమరదీప్.. శివాజీని ఎలిమినేట్ చేశాడు. పూజామూర్తి.. ప్రశాంత్‌ని ఎలిమినేట్ చేసింది. యవర్.. ప్రియాంకని ఎలిమినేట్ చేశాడు. ఫైనల్‌గా అర్జున్, సందీప్.. కెప్టెన్సీ కోసం పోటీపడబోతున్నారు. (ఇదీ చదవండి: క్షమాపణలు చెప్పిన 'భగవంత్ కేసరి' డైరెక్టర్) శివాజీ అసహనం బిగ్‌బాస్‌లో ఉన్నప్పుడు ఎన్ని వారాలు, ఎలాంటి టాస్కులైనా సరే అన్నింటికి తట్టుకుని నిలబడాలి. ఈ క్రమంలోనే విజయం సాధించొచ్చు లేదంటే అక్కడివరకు వచ్చామనే ఆనందంతోనైనా బయటకెళ్లొచ్చు. తొలి కొన్నివారాలు మాటలు చెప్పుకొని శివాజీ మంచిగా బండి లాక్కోచేశాడు గానీ ఇప్పుడు శరీరంలోని సహనం అంతా పోయింది. దీంతో నోటికొచ్చింది మాట్లాడుతున్నాడు. కెప్టెన్సీ టాస్కులో భాగంగా అమరదీప్ శివాజీని నామినేట్ చేసి ఎలిమినేట్ చేసేశాడు. దీంతో శివాజీ.. 'నేనో వేస్ట్ కేండిడేట్లా కనిపిస్తున్నా. నేను ఈ హౌసులో పనికిరాను. నాకు ఈ హౌస్ వద్దు, నువ్వు(బిగ్‌బాస్) వద్దు, తలుపు తీస్తే నేను వెళ్లిపోతా' అని ఏది పడితే అది మాట్లాడాడు. లాజిక్ మర్చిపోయిన శివాజీ అయితే ఐదోవారమే కెప్టెన్ అయ్యే ఛాన్స్ వచ్చినా దాన్ని ప్రశాంత్ కోసం శివాజీ త్యాగం చేశాడు. అప్పుడేమో పెద్ద త్యాగమూర్తిలా నీతులు చెప్పాడు. ఇప్పుడు అమరదీప్.. తనని సైడ్ చేసేసరికి బుర్ర బాదుకున్నాడు. ఈ విషయమై అమర్, సందీప్‌తో మాట్లాడుతూ కరెక్ట్ లాజిక్ చెప్పాడు. 'ఆయనకు వాళ్లు(ప్రశాంత్, యవర్) ఎంత ముఖ్యమో నాకు నా వాళ్లు అంతే ఇంపార్టెంట్ కదా?' అని అమరదీప్ అన్నాడు. అప్పుడేమో శివాజీ, ప్రశాంత్‌కి కెప్టెన్సీ వచ్చేలా చేయొచ్చు. ఇప్పుడు మాత్రం అమర్.. తన వాళ్లకు కెప్టెన్సీ ఇవ్వాలని చూసేసరికి శివాజీకి ఎక్కడలేని కోపమొచ్చేసింది. ఇదెక్కడి లాజిక్కో శివాజీకే అర్థం కావాలి. తీరా కాసేపటి తర్వాత అమర్‌తో అనరాని మాటలు అన్నాడు. 'నేను చచ్చిపోయేటప్పుడు కూడా నా పిల్లలకు నిన్ను నమ్మొద్దని చెబుతాను' అని శివాజీ తనతో అన్నట్లు అమర్, శోభా దగ్గర ఆవేదన వ్యక్తం చేశాడు. మరో సందర్భంలో శివాజీ, తేజతో మాట్లాడుతూ శోభా వెనక తిరగడంపై అతడికి క్లాస్ పీకాడు. (ఇదీ చదవండి: అబ్బ.. ఏం డ్రామా శివాజీ.. అమర్‌దీప్‌పై అంత పగ దేనికి?) వెళ్లిపోతానని ఒకటే గోల ఇదే ఎపిసోడ్లో శివాజీని కన్ఫెషన్ రూంలోకి పిలిచిన బిగ్‌బాస్... ఎలా ఉన్నారు? అని అడిగాడు. దీంతో శివాజీ జరిగిదంతా చెప్పాడు. 'చాలా ఇబ్బంది పడుతున్నా, చెయ్యంతా లాగుతుంది, నన్ను బయటకు పంపేయ్ బిగ్‌బాస్.. రోజు ఏడుస్తున్నా, ఎవరైనా ఉంటే నవ్వుతూ ఏడుస్తున్నా, ఇలా పిల్లలతో మాటలు పడటం కావట్లేదు. అన్ని ఉన్నాయ్ కానీ న్యాయం చేయలేకపోతున్నా, చాలా ఆశలతో ఇక్కడికి వచ్చా కానీ టైం పడతది బిగ్‌బాస్.. తెలుస్తుంది నా బాడీ నాకు కోపరేట్ చేయట్లేదని, అమరదీప్ చెప్పింది కరెక్టే, నేను వెళ్తా బిగ్‌బాస్.. వాళ్లందరి ముందు ఏడవలేకపోతున్నా. నాకు చాలా బరువుగా ఉంది. నేనుంటే కప్ కొడతానని నాకు తెలుసు. కప్పు కొడదామనే వచ్చా. మంచిగా ప్రారంభించినా, ఇప్పుడు పరిస్థితులు నాకు సహకరించట్లేదు. మీతో మాట్లాడుతుంటే కూడా నొప్పిగా ఉంది, కానీ దీన్నంతా కవర్ చేసుకుని అక్కడ నవ్వుతూ మాట్లాడుతున్నా' అని ఎమోషనల్ అయ్యాడు. అయితే మరోసారి డాక్టర్‌కి చూపించిన తర్వాత చూద్దాం అని బిగ్‌బాస్ చెప్పుకొచ్చాడు. శివాజీని ఎందుకు ఉంచుతున్నట్లు? ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఫిజికల్ టాస్కుల పరంగా శివాజీ ఒక్కటి ఆడట్లేదు. ఓసారి ఆడిన దానికే చెయ్యికి దెబ్బ తగిలింది. ఇప్పటికీ నొప్పితే విలవిల్లాడిపోతున్నాడు. అలానే ఇప్పటికే 10-15 సార్లు కంటే ఎక్కువగానే.. బయటకెళ్లిపోతా బయటకెళ్లిపోతా అని చెబుతున్నాడు. ఇంత చెబుతున్నాడు. ఇంతలా పోతా పోతా అని అంటున్నా సరే బిగ్‌బాస్, శివాజీపై ఎందుకు ప్రేమ చూపిస్తున్నాడనేది అర్థం కాని ప్రశ్నలా మారిపోయింది. అలా శుక్రవారం ఎపిసోడ్ ముగిసింది. ఈసారి ఆదివారం కాకుండా శనివారం ఎలిమినేషన్ ఉందంటున్నారు. మరి ఇందులో నిజమెంత ఉందనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: రెండోసారి తండ్రి అయిన 'బలగం' డైరెక్టర్ వేణు) -
అబ్బ.. ఏం డ్రామా శివాజీ.. అమర్‌దీప్‌పై అంత పగ దేనికి?
బిగ్‌బాస్ హౌస్‌లోకి ఎవరైనా దేనికి వెళ్తారు? గేమ్ ఆడటానికి.. కానీ ఈ సీజన్లో ఒకరు మాత్రం ఆటగాడిగా కన్నా కోచ్‌గానే ఎక్కువగా వ్యవహరిస్తున్నాడు. అతడెవరో మీకీపాటికే అర్థమై ఉంటుంది. కర్ర విరగకుండా పామును చంపడం శివాజీకి బాగా తెలుసు. ఈ చావు తెలివితేటలతోనే హౌస్‌లో నెట్టుకుంటూ వస్తున్నాడు. అందరిలోనూ తనే పెద్ద తోపు అని ఫీలవుతాడు. ఎదుటివారు ఒక్కటంటే ఒక్క మాట తనకు వ్యతిరేకంగా మాట్లాడినా తీసుకోలేడు. కానీ తను మాత్రం అందరినీ ఏది పడితే అది అనేస్తాడు.. దానికి ఎవరూ అడ్డు చెప్పొద్దు అన్నట్లుగా మాట్లాడతాడు. ఆత్మవిశ్వాసాన్ని దెబ్బ తీయడంలో దిట్ట హౌస్‌లో ఇప్పటివరకు శివాజీని గట్టిగా ప్రశ్నించింది ఎవరైనా ఉన్నారా? అంటే.. అది అమర్దీప్, గౌతమ్ మాత్రమే! కానీ వాళ్లు అడిగే ప్రశ్నలకు తన దగ్గర సమాధానాలు లేని శివాజీ అడ్డదారిలో నరుక్కొచ్చేవాడు. అసలు నువ్వేం ఆడావు? నీ ఆట నాకు కనిపించలేదు అని బట్ట కాల్చి మీద వేసేవాడు. మొదటి నుంచీ ఇప్పటివరకు నువ్వు ఆడిందే లేదు అని వారిలో ఆత్మ విశ్వాసాన్ని దెబ్బతీసేవాడు. అలా అమర్‌ను కిందకు లాగడంలో సక్సెస్ అయ్యాడు కూడా! తను ఆడితే గేము.. అవతలివారు ఆడితే క్రైమూ.. ఈ వారం జరిగిన ఏలియన్స్ టాస్కులో కూడా శివాజీ ఆడలేదు. సంచాలకుడిగా మాత్రమే వ్యవహరించాడు. ఏలియన్స్ ఇచ్చిన టాస్కుల్లో జిలేబీపురం గెలవడంతో అందులో ఉన్న అందరూ కెప్టెన్సీ కంటెండర్లుగా నిలిచారు. వీరిలో టీమ్‌ను గెలిపించినవారికి ఒక ఛాన్స్ ఇద్దామనుకున్నాడు అమర్. అందుకని గేమ్ ఆడకుండా కూర్చున్న శివాజీని కెప్టెన్సీ పోటీ నుంచి తొలగించాడు. అది జీర్ణించుకోలేకపోయిన శివాజీ రివర్స్ గేమ్ స్టార్ట్ చేశాడు. సింపతీ డ్రామాలు నేనొక వేస్ట్ క్యాండెట్లా కనిపిస్తున్నాను అంటూ సీన్ క్రియేట్ చేశాడు. కన్ఫెషన్ రూమ్‌లోనూ బిగ్‌బాస్ ముందు ఏడ్చేశాడు. నేను ఆడటం లేదని పరోక్షంగా అనేసరికి తట్టుకోలేకపోయానని కన్నీళ్లు పెట్టుకున్నాడు. మరి ఇదే మాటను డైరెక్ట్‌గా గౌతమ్, అమర్‌దీప్‌లతో చాలాసార్లు అన్నాడు శివాజీ. నువ్వు ఏ గేమూ ఆడలేదు. నీకు ఆడటమే చేతకాదు.. అని నానామాటలు అని వారిని మానసిక స్థైర్యాన్ని దెబ్బ తీసే ప్రయత్నం చేశాడు. అంటే తను చేస్తే ఒప్పు, ఎదుటివాళ్లు చేస్తే తప్పా? ఆ ఇద్దరినీ పావులుగా వాడుకుంటున్న శివాజీ అందరినీ గ్రూప్ గేమ్ అంటూ బ్లేమ్ చేసే శివాజీయే అసలైన గ్రూప్ గేమ్ ఆడుతున్నాడు. ప్రశాంత్, ప్రిన్స్ యావర్‌లను తన ఆట కోసం పావులుగా మార్చుకున్నాడు. నామినేషన్స్ దగ్గరి నుంచి గేమ్ వరకు ఎక్కడ ఎలా ఉండాలి? ఎలా మాట్లాడాలో నేర్పిస్తున్నాడు. తను ఆడటం మానేసి వాళ్లతో ఆడించాలనుకుంటున్నాడు. అంతేకాదు, వారికి లేనిపోనివి నూరిపోస్తున్నాడు కూడా! పైకి మాత్రం తనకు అందరూ సమానమే అని నీతులు వల్లిస్తున్నాడు. అమర్‌దీప్‌ను మొదటి నుంచీ టార్గెట్ ఇకపోతే అమర్దీప్ గురించి బిగ్‌బాస్ షోకు రావడానికి ముందే బాగా తెలుసుకున్నాడు శివాజీ. అమర్-తేజస్వినిల ఇంటర్వ్యూ కూడా చూశానని అమర్‌తోనే చెప్పాడు. అంటే అతడిని సైడ్ చేయాలని ముందుగానే గట్టిగా ప్లాన్ వేసుకుని మరీ వచ్చాడు. మొదటి నుంచి అమర్‌ను టార్గెట్ చేస్తూ పోయాడు. గేమ్‌లో అమర్‌ను కిందకు లాగడమే కాకుండా తనను చులకన చేస్తూ మాట్లాడుతున్నాడు. 'నేను చనిపోయేటప్పుడు కూడా చెప్తారా.. నిన్ను మాత్రం నమ్మవద్దని నా పిల్లలకు చెప్తా..' అని శివాజీ తనతో అన్నాడని అమర్దీప్ బాధపడ్డాడు. అంటే అమర్ మీద శివాజీకి ఎంత కోపం ఉందో ఇక్కడే తెలిసిపోతుంది. రైతుబిడ్డకు సపోర్ట్ చేసేది అందుకే! వ్యక్తిగతంగా అతడి మీద అంత పగ దేనికి? ఎందుకని శివాజీ అమర్‌ను టార్గెట్ చేస్తున్నాడు? అని నెటిజన్లు బుర్ర గోక్కుంటున్నారు. టైటిల్ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన అమర్‌దీప్‌ను సైడ్ చేయాలన్నది శివాజీకి ముందు నుంచీ ఉన్న ప్లాన్. అందులో భాగంగానే షో ప్రారంభం నుంచి అతడిని టార్గెట్ చేస్తూ తనను కిందకు లాగాడు. ఆ తర్వాత సామాన్యులకే తన మద్దతు అంటూ ప్రశాంత్, ప్రిన్స్‌లకు సపోర్ట్ చేస్తూ బయట తనకు పాపులారిటీ పెంచుకోవాలనుకున్నాడు. రైతుబిడ్డకు సపోర్ట్ చేస్తే బయట తనకు సింపతీ పెరుగుతుందని, అది తన రాజకీయ ప్రయోజనాలకు ఉపయోగపడుతుందన్నది తన ఆలోచన. పాతాళానికి తొక్కేస్తాడు అందుకే ఎప్పుడూ అతడిని ఆకాశానికెత్తేస్తూ ఉంటాడు, అవతలివారిని పాతాళానికి తొక్కేయాలని చూస్తుంటాడు. ఇప్పుడు ఏ గేమూ ఆడకపోయినా అవతలివారిని మాత్రం హేళన చేయడం ఆపడం లేదు. మళ్లీ అందరితో కలుపుగోలుగా ఉంటూ అందరి బాగోగులు కోరుకున్నట్లు నటిస్తుంటాడు. కానీ ఇంకా ఎన్నాళ్లు శివాజీ? ఎప్పటికైనా ముసుగు తీయాల్సిందే.. నిజ స్వరూపం బయటపడాల్సిందే! Looks going personal now#BiggBossTelugu7 #Amardeep #Shivaji pic.twitter.com/jUU0BYWAzk — BiggBossTelugu7 (@TeluguBigg) October 19, 2023 చదవండి: మొన్నటివరకు శివాజీ.. ఇప్పుడు శోభ, ప్రియాంక.. అందరూ అమర్‌ను చులకనచేసి మాట్లాడేవారే