బిగ్‌బాస్ షోలో ప్రస్తుతం పదిమంది మిగిలారు. వీరిలో ప్రశాంత్, అశ్విని, రతిక మినహా మిగతా అందరూ కెప్టెన్లయ్యారు. ఈసారి అందరికీ అవకాశమిస్తూ బిగ్‌బాస్ ఈ సీజన్‌లోనే చివరి కెప్టెన్సీని ప్రవేశపెట్టాడు. కానీ ఎప్పటిలాగే ఈసారి కూడా కెప్టెన్సీని హౌస్‌మేట్స్ చేతుల్లో పెట్టాడు బిగ్‌బాస్.
గన్ షూటింగ్ వినబడిన ప్రతిసారి దాని ముందుకు ఇద్దరు ఇంటిసభ్యులు రావాల్సి ఉంటుంది. వాళ్లకు బిగ్‌బాస్ రెండు ఫోటోలు చూపిస్తాడు. అందులో ఒకరిని కెప్టెన్సీ పోటీ నుంచి తప్పిస్తూ షూట్ చేయాల్సి ఉంటుంది. ఈ క్రమంలో అమర్, అశ్విని ఫోటోలు రాగా.. శోభ, ప్రశాంత్ ఇద్దరూ అమర్‌కు సపోర్ట్ చేద్దాం అని చర్చించుకున్నారు. ఇది విన్న అశ్విని.. నన్ను ఇంకెవ్వరు తీసినా పట్టించుకోకపోయేదాన్ని. కానీ నువ్వు తీసేస్తున్నావ్.. చూడు అంటూ ప్రశాంత్‌పై గుస్సా అయింది.
దాదాపు అందరి ఫోటోలు కాలిపోగా చివర్లో శివాజీ, అమర్, అర్జున్ మిగిలినట్లు తెలుస్తోంది. ఫైనల్‌గా అమర్ కెప్టెన్‌గా గెలిచినట్లు ఓపక్క వార్తలు వస్తుంటే మరోవైపు కెప్టెన్సీ టాస్క్ రద్దయిందని, ఈ వారం ఎవరూ కెప్టెన్ కాలేదని ప్రచారం జరుగుతోంది. మరి వీటిలో ఏది నిజమనేది తెలియాలంటే నేటి ఎపిసోడ్ వచ్చేంతవరకు ఆగాల్సిందే!
చదవండి: కోటబొమ్మాళి పీఎస్ ట్విటర్ రివ్యూ.. టాక్ ఎలా ఉందంటే?
Comments
Please login to add a commentAdd a comment