
సినిమా ఇండస్ట్రీకి వచ్చి 48 ఏళ్ళు అయ్యింది. చాలా వెరైటీ పాత్రలు చేశాను. రాబిన్‌హుడ్‌లోనూ నా పాత్ర డిఫరెంట్‌గా ఉండబోతుంది. ఆ సినిమా చూశాక.. నేను హీరోగా చేసిన ఎంటర్‌టైనింగ్ సినిమాలు, ఆనాటి రోజులు గుర్తుకు వచ్చాయి. ఈ సినిమా, క్యారెక్టర్ పట్ల చాలా హ్యాపీగా ఉంది’ అన్నారు నట కిరీటీ రాజేంద్రప్రసాద్. నితిన్, శ్రీలీల జంటగా నటించిన తాజా చిత్రం ‘రాబిన్‌హుడ్’.వెంకీ కుడుముల దర్శకత్వం వహించిన ఈ సినిమాలో రాజేంద్రప్రసాద్ కీలక పాత్ర పోషించాడు. మార్చి 28న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాజేంద్రప్రసాద్ మీడియాతో ముచ్చటించారు. ఆ విశేషాలు..
→ రాబిన్‌హుడ్( Robinhood Movie) చేశాక యాక్టర్ గా నామీద నాకు కాన్ఫిడెన్స్ లెవల్ పెరిగింది. క్యారెక్టర్, పెర్ఫార్మెన్స్ పరంగా సినిమా చాలా ఎంటర్టైనింగ్ గా ఉంటుంది. దర్శకుడు వెంకీ అద్భుతంగా రాశాడు, తీశాడు. ఇందులో ఇండియాలోనే హయ్యస్ట్ సెక్యురిటీ ఏజెన్సీ నాది. నా ఏజెన్సీలో పని చేయడానికి హీరో వస్తాడు. ఇంతకంటే కథ చెప్పకూడదు(నవ్వుతూ) ఈ కాంబినేషన్ లో చాలా అద్భుతంగా ఉంటుంది.
→ ఇందులో నా టైమింగ్ నితిన్(Nithiin) ఫాలో అవ్వాలి, నితిన్ టైమింగ్ నేను ఫాలో అవ్వాలి. క్యారెక్టర్స్ అలా డిజైన్ చేయబడ్డాయి. మేము ఇద్దరం వెన్నెల కిశోర్ కి దొరక్కూడదు. సినిమా చూసినప్పుడు భలే గమ్మత్తుగా ఉంటుంది. ఇలాంటి ఎంటర్ టైనింగ్ సినిమా చేసి చాలా కాలమయింది. రాబిన్‌హుడ్ ఆడియన్స్ కి మంచి ఫీస్ట్.
→ వెంకీ కుడుముల చాలా బిగ్ డైరెక్టర్ అవుతారు. ఈ మధ్య కాలంలో వన్ అఫ్ ది బెస్ట్ క్యారెక్టర్ రాబిన్‌హుడ్ లో చేశాను. డైరెక్టర్ వెంకీ స్పెషల్ గా ఈ క్యారెక్టర్ ని నా గురించి రాసుకున్నారు. వర్క్ చేస్తున్నప్పుడే చాలా ఎంజాయ్ చేస్తూ చేసిన సినిమా ఇది. వెంకీ, త్రివిక్రమ్ దగ్గర అసిస్టెంట్ గా చేశారు. ఆయన లక్షణాలు అన్నీ వచ్చాయి. డైలాగ్ లో మంచి పంచ్ ఉంటుంది. తను కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను.
→ నటుడిగా ఈ జీవితం దేవుడు, ప్రేక్షకులు ఇచ్చిన గొప్ప అవకాశంగా భావిస్తున్నాను. లేడిస్ టైలర్, ఏప్రిల్ ఒకటి విడుదల, మిస్టర్ పెళ్ళాం,పెళ్లి పుస్తకం, ఆ ఒక్కటీ అడక్కు.. ఇలా ప్రతి సినిమా దేనికదే భిన్నంగా వుంటుంది. డిఫరెంట్ క్యారెక్టర్స్ కనిపిస్తాయి. ఒకే ఏడాది హీరోగా 12 సినిమాలు రిలీజ్ చేసిన రోజులున్నాయి. దాదాపు ఆ సినిమాలన్నీ మనం రిలేట్ చేసుకునే పాత్రలే. అందుకే ప్రేక్షకులకు మరింత దగ్గరయ్యానని అనుకుంటాను.
→ నాటి ప్రధాని పీవీ నరసింహారావు గారు దగ్గర నుంచి ఇప్పటికీ చాలా మంది ప్రేక్షకులు జీవితంలో ఒత్తిడి, నిరాశలో ఉన్నప్పుడు సరదాగా నవ్వుకోవడానికి, మనసు తేలిక అవడానికి నా సినిమాలు చూస్తుంటామని చెప్పడం ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఇప్పటికీ దర్శకులు నా కోసం ప్రత్యేకంగా పాత్రలు రాయడం నా అదృష్టం. రాబిన్‌హుడ్ సినిమా చూసినప్పుడు ఆ స్పెషాలిటీ మీరు ఫీలౌతారు.
→ శ్రీలీల(Sreeleela) చాలా మంచి సినిమాలు చేస్తోంది. చాలా మెచ్యూర్ యాక్టర్ గా కనిపించింది. ఇందులో ఆమె బిహేవియర్ నాకు చాలా నచ్చింది. ఇందులో ఫారిన్ నుంచి వచ్చిన తనకి సెక్యురిటీ ఇచ్చే బాధ్యత మాది. చాలా సరదాగా ఉంటుంది.
→ నాకు కొత్త పాత అని ఉండవు, నిజానికి కొత్త దర్శకులు నాతో వర్క్ చేయడానికి చాలా ఇష్టపడతారు. అందరికంటే ముందు నేనే సెట్స్ లో తెగ అల్లరి చేస్తాను. దీంతో అందరూ చాలా కంఫర్ట్ బుల్ గా ఫీలౌతారు. నాతో వర్క్ చేయడం చాలా ఈజీ.
→ ప్రస్తుతం చాలా సినిమాలు చేస్తున్నాను. దాదాపు ఏడు సినిమాలు రన్నింగ్ లో ఉన్నాయి. మొదలు పెట్టాల్సిన సినిమాలు ఓ ఐదు వరకు ఉంటాయి.
Comments
Please login to add a commentAdd a comment