Rabinhood
-
'కిస్సిక్' కోసం భారీ రెమ్యునరేషన్.. స్పందించిన శ్రీలీల
ఇప్పుడు టాలీవుడ్లో ఎక్కడ చూసిన ‘పుష్ప 2’ మూవీ గురించే మాట్లాతున్నారు. ఇక ఇటీవల విడుదలైన స్పెషల్ సాంగ్ ‘కిస్సిక్’ అయితే యూట్యూబ్‌లో దుమ్ము దులిపేస్తుంది. ఈ పాటకు అల్లు అర్జున్, శ్రీలీల వేసిన స్టెప్పులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో పాటు ఈ పాటపై మరో ఆసక్తికర గాసిప్ కూడా నెట్టింట హల్చల్ చేస్తుంది. అదే శ్రీలీల రెమ్యునరేషన్. ఈ ఐటమ్ సాంగ్ కోసం శ్రీలీల భారీ రెమ్యునరేషన్ తీసుకుందని సోషల్ మీడియా కోడై కూస్తోంది. ఓ భారీ సినిమాకు ఎంత పారితోషికం తీసుకుంటుందో ఈ పాటకు అంతే మొత్తంలో డిమాండ్ చేసిందట. నిర్మాతలు కూడా శ్రీలీల అడిగినంత డబ్బు ఇచ్చారని నిన్నటి నుంచి తెగ ప్రచారం జరుగుతోంది. తాజాగా ఈ పుకారుపై శ్రీలీలతో పాటు నిర్మాతలు స్పందించారు.వెంకీ కుడుముల దర్శకత్వంలో నితిన్- శ్రీలీల జంటగా రాబిన్‌హుడ్ అనే సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ చిత్రం డిసెంబర్ 25న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో తాజాగా రాబిన్‌హుడ్ టీమ్ ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నితిన్, శ్రీలీలతో పాటు దర్శకుడు వెంకీ, నిర్మాత రవి, నవీన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా పుష్ప ఐటమ్ సాంగ్ రెమ్యునరేషన్‌పై శ్రీలీలకు ప్రశ్న ఎదురైంది. ‘కిస్సిక్’ సాంగ్ కోసం సినిమా స్థాయిలో రెమ్యునరేషన్ తీసుకున్నారట కదా?’ అని ఓ విలేకరి ప్రశ్నించగా.. ‘అసలు ఇప్పటి వరకు రెమ్యునరేషన్ మ్యాటరే మా మధ్య జరగలేదని అటు శ్రీలీల, ఇటు నిర్మాతలు చెప్పుకొచ్చారు. ‘అంత ఇంత అని ఏమి అనుకోలేదు. అవకాశం వచ్చింది చేసేశా. ఇంకా డబ్బుల గురించి మాట్లాడలేదు’అని శ్రీలీల అన్నారు. నిర్మాతలు, నవీన్ మాట్లాడుతూ..‘రెమ్యునరేషన్ టాపికే శ్రీలీల తీయలేదు. మీరు అనుకున్నంత రెమ్యునరేషన్ అయితే ఇవ్వలేదు’అని క్లారిటీ ఇచ్చారు.ఇక పుష్ప 2 విషయానికొస్తే.. అల్లు అర్జున్- రష్మిక జంటగా నటించిన ఈ చిత్రానికి సుకుమార్ దర్శకత్వం వహించారు. బ్లాక్ బస్టర్ మూవీ పుష్ప కి సీక్వెల్‌గా తెరకెక్కిన ఈ చిత్రం డిసెంబర్ 5న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. -
శ్రీలీల బర్త్ డే.. స్పెషల్ గ్లింప్స్ రిలీజ్ చేసిన టీమ్!
పెళ్లిసందడి మూవీతో ఫేమ్ తెచ్చుకున్న కన్నడ బ్యూటీ శ్రీలీల. ఆ తర్వాత రవితేజ ధమాకా, వైష్ణవ్ తేజ్ ఆదికేశవ, స్కంద, భగవంత్ కేసరి లాంటి చిత్రాల్లో నటించింది. ప్రస్తుతం రవితేజ సరసన మరో సినిమాకు సిద్ధమైంది. దీంతో నితిన్‌తో మరోసారి జతకట్టింది. నితిన్ సరసన రాబిన్‌హుడ్ చిత్రంలో కనిపించనుంది.తాజాగా ఇవాళ శ్రీలీల బర్త్ డే కావడంతో రాబిన్‌హుడ్ టీమ్ స్పెషల్ విషెస్ తెలిపారు. శ్రీలీల బర్త్ డే స్పెషల్ గ్లింప్స్ అంటూ ఓ వీడియోను రిలీజ్ చేశారు. ఇందులో శ్రీలీల, వెన్నెల కిశోర్ మధ్య ఫన్నీ డైలాగ్ నవ్వులు తెప్పిస్తోంది. 'సునామీలో టీ సైలెంట్‌గా ఉండాలి.. నా వద్ద నువ్వు సైలెంట్‌గా ఉండాలి' అంటూ వెన్నెల కిశోర్‌కు శ్రీలీల వార్నింగ్ ఇస్తుంది. గ్లింప్స్ చూస్తుంటే ఈ చిత్రంలో శ్రీలీల గ్లామరస్ లుక్స్‌తో ఆకట్టుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. కాగా.. ఈ సినిమాకు వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తుండగా.. జీవీ ప్రకాశ్ సంగీతమందిస్తున్నారు. కాగా.. ఈ చిత్రం డిసెంబర్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. -
ఢిల్లీలో ‘రాబిన్ హుడ్’ తరహా దొంగతనాలు.. ముఠా నాయకుడి అరెస్ట్!
న్యూఢిల్లీ: ధనవంతులను దోచుకుంటూ.. అందులో కాస్త పేదలకు పంచిపెడుతోన్న ‘రాబిన్ హుడ్’ తరహా ముఠా గుట్టు రట్టు చేశారు ఢిల్లీ పోలీసులు. ముఠా నాయకుడిని అరెస్టు చేసినట్లు సోమవారం తెలిపారు. ఆ గ్యాంగ్‌లో 25 మంది సభ్యులు ఉన్నారని ఓ ప్రకటన విడుదల చేశారు. ‘వసీం అక్రం (27) అలియాస్ లంబూ, అతని ముఠా.. దేశ రాజధానిలోని ధనవంతుల ప్రాంతాల్లో దొంగతనాలకు పాల్పడింది. డబ్బులు, బంగారు ఆభరణాలు కాజేసింది. అందులో కొంత మొత్తాన్ని పేదలకు పంచిపెట్టింది’ అని ప్రకటనలో పేర్కొన్నారు పోలీసులు. ఈ కారణంగానే అతనికి చాలా మంది అనుచరులు ఏర్పడ్డారని.. పోలీసుల కదలికలపట్ల ముందే సమాచారం అందిస్తూ.. తప్పించుకునేందుకు వీలుగా సహకరించేవారని తెలిపారు. దొంగతనాలకు అలవాటు పడిన వసీం అక్రం.. దేశంలోని పలు రాష్ట్రాల్లో రహస్య స్థావరాలను తరచూ మార్చేవాడని పోలీసులు చెప్పారు. దొంగతనాలు, హత్యాయత్నం, అత్యాచారం తదితర 160 కేసులు అతనిపై ఉన్నాయని తెలిపారు. గత 4 నెలలుగా అతని కదలికలపై నిఘా ఉంచిన ప్రత్యేక బృందం.. ఎట్టకేలకు పట్టుకుందని తెలిపారు. ‘ఇన్స్పెక్టర్ శివకుమార్ నేతృత్వంలో ప్రత్యేక బృందం ఏర్పాటు చేశాం. ఆనంద్ విహార్ రైల్వే స్టేషన్ సమీపంలో వేసిన ఉచ్చులో వసీం చిక్కాడు’ అని వెల్లడించారు. నిందితుడిని అరెస్టు చేసి, అతని వద్ద నుంచి మూడు బుల్లెట్లతో కూడిన సింగిల్ షాట్ పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఇదీ చదవండి: మలద్వారంలో గ్లాస్‌తో 10 రోజులుగా నరకం.. వైద్యులు ఏం చేశారంటే? -
మాస్ మహరాజ్ 6 ప్యాక్ లుక్
సినిమా సెలక్షన్ విషయంలోనే కాదు, లుక్ విషయంలో కూడా సీనియర్ హీరోలు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. యంగ్ జనరేషన్ కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడానికి ఆలోచిస్తుంటే సీనియర్లు మాత్రం సూపర్ బాడీతో షాక్ ఇస్తున్నారు. తాజాగా మాస్ మహరాజ్ రవితేజ కూడా ఈ లిస్ట్‌లో చేరిపోయాడు. ఇటీవల బెంగాల్ టైగర్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ సాధించిన రవితేజ తన నెక్ట్స్ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలిచిన రవితేజ ఈమధ్య స్టైలిష్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నంలో మరీ సన్నగా అయిన రవితేజ లుక్‌పై విమర్శలు రావడం, అదే లుక్‌లో కనిపించిన కిక్ 2 భారీ డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో తిరిగి ఫాంలోకి రావాలని భావించిన రవితేజ 6 ప్యాక్‌తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో సిక్స్ ప్యాక్‌లో కనిపించనున్నాడు. -
'రాబిన్ హుడ్' ఆకలిపై పోరాటం!
పారబోసేది వారబోయమన్నారు పెద్దలు... మనకు ఎక్కువై బయట పడేసేది మరొకరి కడుపు నింపుతుందని వారి నమ్మకం. అదే విషయాన్ని అక్షరాలా పాటిస్తున్నారు ఆ యువ సైన్యం. భారత, పాకిస్తాన్ దేశాలను వెంటాడుతున్న ఆకలిపై పోరాటానికి సిద్ధమయ్యారు. రాబిన్ హుడ్స్ పేరిట ఆరుగురు యువకులు ప్రత్యేక సేవా కార్యక్రమాన్ని భుజానికెత్తుకున్నారు. ఆకుపచ్చని వస్త్రాలను ధరించి, ఎన్నో పట్టణాల్లో తమ సేవలను విస్తరించి... ఆకలితో పోరాడే శక్తివంతమైన ఆయుధాలుగా మారారు. ఢిల్లీకి చెందిన ఆరుగురు యువకులు ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. రాబిన్ హుడ్ పేరిట ప్రారంభమైన వారి సేవా కార్యక్రమం..ఆపారంగా వ్యర్థమౌతున్న ఆహారాన్ని సద్వినియోగం చేయడమే. విందు సమయాల్లో, రెస్టారెంట్లలో మిగిలిపోయిన ఆహారాన్ని ఆకలితో అలమటించేవారికి పంపిణీ చేయడం పరమావధిగా ఎంచుకున్నారు. ఒక్క ఇండియాలోనే కాక, తమ సేవలను పాకిస్తాన్ పట్టణాలకూ వ్యాపింపజేసిన ఆర్ హెచ్ ఏ ప్రస్తుతం వెయ్యిమంది వాలంటీర్లతో 18 నగరాల్లో విస్తరించి సుమారు రెండున్నర లక్షలమంది ఆకలితో ఉన్న ప్రజలకు ఆహారాన్ని అందిస్తోంది. పోర్చుగల్ రెస్టారెంట్లో ఉద్యోగిగా పనిచేస్తున్ననీల్... అప్పట్లో తమ వద్దకు వచ్చిన రీ ఫుడ్ సంస్థ సభ్యులను చూసి ఎంతో స్ఫూర్తిని పొందాడు. సంస్థ సభ్యులు రెస్టారెంట్ లోని ఆహారాన్ని సేకరించి ఆకలితో ఉన్నవారికి అందించడం నీల్ ను ఎంతగానో ఆకట్టుకుంది. ఇటువంటి సేవలను ఇండియాలో ఎందుకు ప్రారంభించకూడదు అనుకున్నాడు. ఢిల్లీకి వచ్చిన అనంతరం తన స్నేహితులకు వివరించాడు. ఇంచుమించుగా 'రీఫుడ్' మాదిరిగానే తమ సేవా కార్యక్రమాన్ని ప్రారంభించారు. పలు నగరాల్లోని రెస్టారెంట్లు, వెడ్డింగ్ కాటరర్లకు తమ కార్యక్రమాన్ని వివరించిన 'ఆర్ హెచ్ ఏ' సభ్యులు.. వారి వద్దనుంచీ మిగిలిపోయిన ఆహారాన్ని సేకరించి, ప్యాకెట్లుగా తయారు చేసి పంపిణీ చేయడం ప్రారంభించారు. అయితే వాలంటీర్లంతా ఉద్యోగస్థులు కావడంతో ఈ కార్యక్రమాన్ని ఎక్కువగా వారాంతాల్లో చేయడం కొనసాగిస్తున్నారు. 2014 లో నీల్, ఆనంద్ ల బృందం.. సుమారు 150 మందికి ఆహారాన్ని అందించడం ప్రారంభించింది. అయితే నేడు సుమారు వెయ్యిమంది వాలంటీర్లతో రాబిన్ హుడ్... పలు పట్టణాల్లో లక్షల మందికి ఆహారం పంపిణీ చేస్తోంది. రాబిన్ హుడ్ కార్యక్రమాల్లో ముఖ్యమైనది ఆహార పంపిణీ అయినా... పలు ఇతర సేవలను కూడ అందిస్తోంది. చలికాలంలో ఢిల్లీలోని నిరుపేదలు, అనాధలకు దుప్పట్లు వంటివి అందిస్తోంది. ప్రస్తుతం పలు విభాగాలుగా ఏర్పడిన రాబిన్ హుడ్... ఒక్క ఢిల్లీలోనే ఏడు ఛాప్టర్లు పని చేస్తుండగా... ముంబైలో తొమ్మిది, ఇతర పట్టణాల్లో పలు విభాగాలు పనిచేస్తున్నాయి. ప్రతి విభాగంలోనూ సభ్యులంతా ఆ ఛాప్టర్ హెడ్ ఆధ్వర్యంలో ఎంతో ఉత్సాహంతో పనిచేస్తున్నారు. వీరంతా ముఖ్యంగా వాట్సాప్, ఫేస్ బుక్ గ్రూపుల ద్వారా తమ సేవలను అందిస్తున్నారు. 'ఆర్ హెచ్ ఏ' వాలంటీర్లు పెరగడంలో ముఖ్యంగా సోషల్ మీడియా ప్రధాన పాత్ర పోషిస్తోంది. తమ బృందంలో సేవలందించేందుకు ఎటువంటి ప్రత్యేక నిబంధనలు లేవని, అయితే రెండు విషయాలను మాత్రం సేవకులు దృష్టిలో ఉంచుకోవాలని గ్రూప్ ప్రారంభ నిర్వాహకుడు నీల్ అంటున్నారు. వాటిలో ఒకటి ఎవరిదగ్గరా, ఎటువంటి ఫండ్స్ వసూలు చేయకూడదని, తయారు చేసి, ఆరుగంటలకు మించిన ఆహారం సేకరించకూడదని మాత్రం చెప్తున్నారు. ప్రస్తుతం ఇండియాలోనే కాక, పాకిస్తాన్ లోని నాలుగు నగరాల్లో 'ఆర్ హెచ్ ఏ' సేవలు అందిస్తోంది. సోషల్ మీడియా ద్వారా పరిచయమైన నీల్ స్నేహితురాలు తారా పాకిస్తాన్ లో సేవలను ప్రారంభించారు. ప్రస్తుతం రెండు దేశాల్లోనూ 'ఆర్ హెచ్ ఏ' వాలంటీర్లు 23 నుంచి 30 మధ్య వయస్కులే ఎక్కువగా ఉన్నారు. అత్యంత ఉత్సాహభరితంగా ఉన్న కొందరు 50 ఏళ్ళ వయస్కులు కూడ ఉండగా... కోల్ కతాలో ఐదేళ్ళ అత్యంత చిన్న వయసు బాలుడు కూడ ప్రత్యేక సేవలు అందిస్తున్నాడు. ప్రస్తుతం నీల్, ఆనంద్ లు ఇరు దేశాల్లో పాఠశాలల్లో కూడ తమ సేవలను విస్తరించేందుకు ప్రయత్నిస్తున్నారు. తమ సేవలతో ఆకలి సమస్య కొంతవరకైనా తీరాలని తాపత్రయ పడుతున్నారు.