మాస్ మహరాజ్ 6 ప్యాక్ లుక్ | Ravi Teja's Stunning 6 Pack Look | Sakshi
Sakshi News home page

మాస్ మహరాజ్ 6 ప్యాక్ లుక్

Published Sat, Mar 5 2016 3:42 PM | Last Updated on Sun, Sep 3 2017 7:04 PM

మాస్ మహరాజ్ 6 ప్యాక్ లుక్

మాస్ మహరాజ్ 6 ప్యాక్ లుక్

సినిమా సెలక్షన్ విషయంలోనే కాదు, లుక్ విషయంలో కూడా సీనియర్ హీరోలు కుర్ర హీరోలకు పోటీ ఇస్తున్నారు. యంగ్ జనరేషన్ కూడా సిక్స్ ప్యాక్ బాడీతో కనిపించడానికి ఆలోచిస్తుంటే సీనియర్లు మాత్రం సూపర్ బాడీతో షాక్ ఇస్తున్నారు. తాజాగా మాస్ మహరాజ్ రవితేజ కూడా ఈ లిస్ట్లో చేరిపోయాడు. ఇటీవల బెంగాల్ టైగర్ సినిమాతో మంచి కమర్షియల్ హిట్ సాధించిన రవితేజ తన నెక్ట్స్ సినిమా కోసం కొత్త లుక్ ట్రై చేస్తున్నాడు.

మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన రవితేజ ఈమధ్య స్టైలిష్ హీరోగా పేరు తెచ్చుకోవడానికి ట్రై చేస్తున్నాడు. అయితే ఆ ప్రయత్నంలో మరీ సన్నగా అయిన రవితేజ లుక్పై విమర్శలు రావడం, అదే లుక్లో కనిపించిన కిక్ 2 భారీ డిజాస్టర్గా నిలిచింది. దీంతో తిరిగి ఫాంలోకి రావాలని భావించిన రవితేజ 6 ప్యాక్తో అలరించడానికి రెడీ అవుతున్నాడు. ప్రస్తుతం రవితేజ హీరోగా నటిస్తున్న రాబిన్ హుడ్ సినిమాలో సిక్స్ ప్యాక్లో కనిపించనున్నాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement