గతం గురించి మాట్లాడను! భవిష్యత్తు ఊహించను! | Ravi Teja exclusive interview | Sakshi
Sakshi News home page

గతం గురించి మాట్లాడను! భవిష్యత్తు ఊహించను!

Published Thu, Dec 10 2015 12:00 AM | Last Updated on Sun, Sep 3 2017 1:44 PM

గతం గురించి మాట్లాడను! భవిష్యత్తు ఊహించను!

గతం గురించి మాట్లాడను! భవిష్యత్తు ఊహించను!

 రవితేజ ఏదైనా ఓపెన్‌గా మాట్లాడతారు.   ఫ్రాంక్‌గా మాట్లాడతారు.  నచ్చిన పని చేయడానికి ఏమాత్రం వెనుకాడరు.  చిటికెలో డెసిషన్ తీసేసుకుంటారు. ఫలితం గురించి బెంగపడటం అస్సలు తెలియదాయనకు.  కాన్సెప్ట్ నచ్చితే  బడ్జెట్  లిమిట్స్ కూడా పెట్టుకోరు. రవితేజ నేడు ‘బెంగాల్ టైగర్’ గా ప్రేక్షకుల ముందుకు వస్తున్నారు. ఈ సందర్భంగా రవితేజతో భేటీ...


 
 హలో రవితేజగారూ... ఆ మధ్య స్లిమ్‌గా ఉండి, ఇప్పుడు కొంచెం వెయిట్ పెరిగినట్లున్నారు...?
 అవునండి. కొంచెం పెరిగాను. ఒక్కోసారి తగ్గుతాం.. పెరుగుతాం. ఏది జరిగినా హెల్తీ వేలోనే ఉండాలి. ఆ మధ్య నేను సన్నబడాలనుకున్న విషయం నాకు క్లోజ్‌గా ఉన్నవాళ్లందరికీ తెలుసు. నా వర్కవుట్ ప్రాసెస్ గురించి కూడా వాళ్లకు చెబుతుంటాను. అందుకని నేను తగ్గినప్పుడు వాళ్లకేం అనిపించలేదు. సడన్‌గా చూసినవాళ్లు షాకయ్యారు. ఇప్పుడు బరువు పెరిగాక చూసినవాళ్లు ‘ఇదేంటి’ అనుకుంటున్నారు. నేను ఆర్టిస్ట్‌ని కాబట్టి, చూడ్డానికి బాగుండాలి. ఫిజిక్ మెయిన్‌టైన్ చేయాలి. ఆ ప్రాసెస్‌లో వర్కవుట్స్ గట్రా చేస్తుంటాను. నాకైతే ఇప్పుడు హ్యాపీగా ఉంది. హెల్త్‌వైజ్ కూడా చాలా బాగుంది.
 
 మీ డైట్  గురించి  చెబుతారా?
 అన్నీ తింటాను. రోజుకి జస్ట్ 45 నిమిషాలు వర్కవుట్స్ చేస్తానంతే. నాన్‌వెజ్ బాగా తింటాను. మన ఆరోగ్యం మన మైండ్ మీద ఆధారపడి ఉంటుంది. అది ఎంత ప్రశాంతంగా ఉంటే అంత హెల్తీగా కనిపిస్తాం.
 
 మీ ఫిజికల్ ఛేంజెస్‌ని చూసి మీ అబ్బాయి, అమ్మాయి ఏమంటారు?
 మా అబ్బాయికైతే తెగ నచ్చేసింది. నేనేం చేసినా ‘నాన్నా.. ఇలాగే ఉండు’ అంటాడు. నా స్టయిల్ ప్రతీదీ వాడికి ఇష్టమే.
 
 ఓకే.. ‘బెంగాల్ టైగర్’ గురించి మాట్లాడుకుందాం. రిలీజులు మీకు కొత్త కాకపోయినా ఏ సినిమాకి ఆ సినిమాకి కొత్తే కదా. ఏమనిపిస్తోంది?

 సినిమా గురించి పాజిటివ్‌గా ఉన్నాం. ఓ ప్రేక్షకుడిగా ఈ ట్రైలర్ చూసి, ఏమేం ఎక్స్‌పెక్ట్ చేస్తానో ఆ అంశాలన్నీ పుష్కలంగా ఉన్న సినిమా ఇది.
 
 పవన్ కల్యాణ్‌తో తీయాలనుకున్న చిత్రకథనే సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’గా మీతో తీశారనే టాక్ ఉంది?
 ఈ పాయింట్‌ను సంపత్ నంది నాకు ‘రచ్చ’ చిత్రానికి ముందే చెప్పాడు. నచ్చి, వర్కవుట్ చేయమన్నా. అసలా ైటె మ్‌లోనే స్టార్ట్  కావాల్సి ఉంది. ఎవరి కమిట్‌మెంట్స్‌తో వాళ్లం బిజీగా ఉండటంవల్ల కుదర్లేదు.
 
 ‘ఖుషి’  సినిమాలో ‘అయామ్ రాయల్ బెంగాల్ టైగర్.. సిద్ధూ... సిద్ధార్థ రాయ్’ అనే  డైలాగ్ ఉంది. పవన్ కల్యాణ్‌తో తీయాలనుకున్న సినిమాకి సంపత్ నంది ‘బెంగాల్ టైగర్’ టైటిల్ అనుకున్నారు కదా?
 అవును. టైటిల్ ఆయన కోసం అనుకున్నదే. కానీ, సంపత్ నంది ఆయనకీ విషయం చెప్పలేదట. నాతో అనుకున్న పాయింట్‌ని కథగా మలిచిన తర్వాత దీనికి ‘బెంగాల్ టైగర్’ బాగుంటుందని దాన్నే పెట్టాడు.
 
 ఫ్రాంక్‌గా మాట్లాడుకోవాలంటే ‘కిక్-2’ డిజప్పాయింట్ చేసింది కదా?
 ‘కిక్-2’ ఫలితం అందరికీ తెలిసిందే. ఫస్టాఫ్  బాగానే ఉన్నా, సెకండాఫ్ ప్రేక్షకులకు కనెక్ట్ కాలేదు. గతం వద్దండి. నాకైతే ప్రెజెంట్‌లో బతకడం అంటేనే ఇష్టం. గతం గురించి, ఫ్యూచర్ గురించి పెద్దగా ఆలోచించను.
 
 ఆ సినిమా కోసం కష్టపడి బాగా వ ర్కవుట్ చేసి తగ్గారు. మరి ఫలితం అనుకూలంగా లేకపోవడం బాధగా అనిపించలేదా?
 ఇష్టంతో కష్టపడ్డాను. అయినా ఏ సినిమాకైనా నేను ఎఫర్ట్ పెడతాను. ప్రేమించి చేస్తాను కాబట్టి, దాన్ని కష్టమనుకోను.
 
 ఒక కథ విన్నాక ఫైనలైజ్ చేయడానికి రోజులూ, నెలలూ తీసుకుంటారా?
 స్పాట్ డెసిషన్ తీసేసుకుంటా. ఒక్కసారి ఫిక్స్ అయితే చేసేస్తా.
 
 స్పాట్ డెసిషన్స్ వల్ల ఒక్కోసారి చేదు అనుభవాలు ఎదురవుతాయేమో?
 కొన్నిసార్లు రిజల్ట్ బ్యాడ్‌గా వచ్చింది. కాదనడం లేదు. ఒక్కోసారి నచ్చకపోయినా ఎందుకో చేసేస్తాను. కొన్ని ప్రాజెక్ట్స్ విన్నప్పుడు బాగానే ఉన్నా, ఎగ్జిక్యూషన్ ప్రాసెస్‌లో తేడా కొట్టేస్తుంది. అప్పుడే సినిమా రిజల్ట్ తెలిసిపోతుంది. ఏది ఏమైనా స్పాట్ డెసిషన్స్ తీసుకోవడం నా అలవాటు.
 
 సంపత్ నంది ఇప్పటివరకూ రెండు సినిమాలు మాత్రమే చేశారు కదా. ఆయనకు ఛాన్స్ ఇవ్వడానికి కారణం?
 ఎన్ని సినిమాలు చేశారన్నది ముఖ్యం కాదు. ఎంత నేర్చుకున్నారన్నది పాయింట్. వాళ్ల కాన్ఫిడెన్స్ దాని మీదే ఆధారపడి ఉంటుంది. అయినా సంపత్ నందికి ఇప్పటివరకూ ఫెయిల్యూర్ లేదు. ఈ సినిమాతో తను హ్యాట్రిక్ సాధించాలని కోరుకుంటున్నా.
 
 మీ ఇన్నేళ్ల కె రీర్‌ను విశ్లేషించుకుంటే ఏమనిపిస్తుంది?
 అలా జరిగిందేంటి.. ఇలా అయిందేంటి? అని గతం గురించి ఆలోచించను. కానీ హాయిగా, సంతోషంగా అనిపిస్తుంది.
 
 ఒక వేళ సినిమా ఇండస్ట్రీలోకి రాకపోయుంటే ఏంటి పరిస్థితి?
 అవన్నీ ఊహాత్మకమైన ప్రశ్నలు. హీరోగా కాకపోతే ఇంకో రకంగా వచ్చి ఉండేవాణ్ణి. కానీ రావడం మాత్రం ఖాయం.
 
 మీకు ఎందులో బాగా ఎంజాయ్‌మెంట్ లభిస్తుంది?
 సినిమాలంటే పిచ్చి. వాటిలోనే ఎంజాయ్‌మెంట్ దొరుకుతుంది. బుర్ర ఉన్నవాళ్లతో టైం స్పెండ్ చేస్తా. బుర్ర తక్కువ వాళ్లకి దూరంగా ఉంటాను.
 
 అంటే.. మీరు బాగా ఇంటెలిజెంటా? మీకన్నా తెలివైనవాళ్లతో కనెక్ట్ కాగలరా?
 నేను ఇంటెలిజెంటో కాదో నేను చెప్పకూడదు. ఎవరెలాంటి వాళ్లో తెలుసుకోగలను. కనీసం నా లెవల్ వరకైనా ఉండాలి. లేకపోతే  లెక్క తేడా వచ్చేస్తుంది. నా కన్నా ఎక్కువైనా ఫరవాలేదు. వాళ్లతో కచ్చితంగా కనెక్ట్ అయిపోతాను. నాకా కాన్ఫిడెన్స్ ఉంది.
 
 మీ తొమ్మిదేళ్ల వయసులో మీకున్నట్లుగానే ఇప్పుడు తొమ్మిదేళ్ల వయసులో ఉన్న మీ అబ్బాయి మహాధన్‌కు కూడా సినిమా పిచ్చి ఉందా?
 ఫుల్ పిచ్చి. సినిమాలు తెగ చూస్తాడు. అన్ని స్టయిల్స్ ఫాలో అవుతూ ఉంటాడు. ఇప్పుడు పిల్లలు చాలా ఫాస్ట్‌గా ఉంటున్నారు.
 
 అయితే మహాధన్ ఫ్యూచర్ స్టార్ అనుకోవచ్చా?
 గతం గురించి మాట్లాడను. భవిష్యత్తును ఊహించను. అయితే మనం వద్దనుకున్నా ఆ జీన్స్‌లో ఉంటుంది. చూద్దాం... ఫ్యూచర్‌లో ఏమవుతాడో.
 
 మీరు లవ్లీ డాడీయా? స్ట్రిక్టా?
 ఈ తరం పిల్లల దగ్గర స్ట్రిక్ట్‌గా ఉంటే కుదరదు. తిట్టడమే కష్టం. ఇక కొట్టడం కూడానా. నాకైతే నా పిల్లలను కొట్టడానికి చేతులు రావు. ఏది చెప్పాలన్నా స్వీట్‌గా చెబుతా.
 
 మీ పిల్లలకు మీరు లవ్లీ ఫాదర్... మీ పేరెం్టట్స్‌తో లవ్లీ సన్ అనిపించుకున్నారా?
 ఓ.. మా అమ్మానాన్న నాతో పాటు హైదరాబాద్‌లోనే ఉంటారు. వాళ్లు నాతోనే ఉండాలన్నది నా కోరిక. నా సక్సెస్‌ని ఆనందిస్తారు.
 
 ఓ ఇంటర్వ్యూలో దర్శకుడు వినాయక్ మీ అమ్మగారి లక్షణాలను మీలో బాగా చూశానని చెప్పారు.. మీ మదర్‌ని రోల్ మోడల్‌గా తీసుకుంటారా?
 రోల్ మోడల్ అని చెప్పలేను. అమ్మా, నాన్న అంటే నాకిష్టం.. గౌరవం. తల్లిదండ్రుల లక్షణాలు పిల్లల్లో ఉండటం సహజం. అందుకని ప్రత్యేకంగా వాళ్ల నుంచి తీసుకోవాల్సిన అవసరంలేదు.
 
 ‘మీ నాన్న కష్టపడి పైకొచ్చాడు’ అని మీ పిల్లల దగ్గర మీ పేరెంట్స్ చెబుతుంటారా?
 అమ్మ చెబుతుంటుంది. నా కష్టాలను దగ్గరుండి చూసింది కదా. నేను పడిన కష్టాలు నా పిల్లలు పడాల్సిన అవసరం లేదు. అయినప్పటికీ కష్టం విలువ తెలియాలని అమ్మ నా గురించి వాళ్ళకు చెబుతుంటుంది.
 
 పూరి జగన్నాథ్ మీ బాడీ లాంగ్వేజ్ బాగా అర్థం చేసుకున్నారు.. అందుకే ఆయన ఏర్పరిచిన ఆ స్టయిల్‌నే ఇప్పటికీ ఫాలో అవుతున్నారనుకోవచ్చా?
 నా బాడీ లాంగ్వేజ్‌ని ముందు అర్థం చేసుకున్నది కృష్ణవంశీ. ఆ తర్వాత  పూరి జగన్నాథ్. ఆ స్టయిల్ బాగుండటంతో కంటిన్యూ అవుతున్నా. అయినా కొత్తగా చేద్దామని ‘నా ఆటోగ్రాఫ్’, ‘శంభో శివ శంభో’, ‘నేనింతే’ చేస్తే  జనాలకు నచ్చలేదు. అలాంటి కథలు ఇప్పుడు వచ్చినా చేయడానికి రెడీ. ఏమో... ఒక్కోసారి అవి నచ్చే అవకాశం కూడా ఉంటుంది కదా.
 
 మీ గురించి వదంతులు వస్తే ఎలా రియాక్ట్ అవుతారు?
 ఒకడు గొప్పోడు,  మంచోడు అంటే ఎవరికీ నచ్చదు. ‘వాడు ఇదంట.. అదంట...’ అని మసాలా యాడ్ చేసి చెబితే అప్పుడు మజా వస్తుంది. అందుకోసం ఏదేదో చెబుతారు. నేనేంటో నాకు తెలుసు. నాకా క్లారిటీ ఉంది.
 
 - డి.జి. భవాని

 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement