మాస్ మహరాజ ఎప్పుడు మొదలెడతాడో..?
మాస్ మహరాజ రవితేజ హీరోగా తెరకెక్కిన బెంగాల్ టైగర్ విడుదలై చాలాకాలమే అవుతోంది.ఈ సినిమా సెట్స్ మీద ఉండగానే రాబిన్ హుడ్ సినిమాను ప్రకటించిన రవితేజ, ఇంతవరకు ఆ సినిమాను స్టార్ట్ చేయలేదు. బెంగాల్ టైగర్ డీసెంట్ కలెక్షన్లతో హిట్ టాక్ తెచ్చుకున్నా.. రవితేజ నెక్ట్స్ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు.
కొంతకాలంగా భారీ హిట్స్ ఇవ్వటంలో ఫెయిల్ అవుతున్న రవితేజ, తన రేంజ్ మాస్ హిట్ కోసం ఎదురుచూస్తున్నాడు. అందుకే ఓ పక్కా మాస్ కథతో ఆడియన్స్ ముందుకు రావడానికి రెడీ అవుతున్నాడు. కొత్త దర్శకుడు చక్రి దర్శకత్వంలో రాబిన్ హుడ్ సినిమా చేస్తున్నట్టుగా ప్రకటించిన రవితేజ, జూలైలోనే ఈ సినిమాను ప్రారంభించాలని భావించాడు.
అయితే కథా కథనాల విషయంలో ఇంకా పూర్తి నమ్మకం రాకపోవటంతో ఇప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనుల్లోనే ఉంది ఈ సినిమా. తను చేయబోయే నెక్ట్స్ సినిమా రాబిన్ హుడ్ అంటూ క్లారిటీ ఇచ్చిన రవితేజ, ఆ సినిమాను ఎప్పుడు సెట్స్ మీదకు తీసుకెళ్లేది మాత్రం చెప్పలేకపోతున్నాడు.