Ravi Teja
-
డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడు.. అంతలోనే ఇలా..
దిల్సుఖ్నగర్ (హైదరాబాద్)/చౌటుప్పల్ రూరల్: ఉన్నత చదువులు, ఉన్నతమైన జీవితం కోసం అమెరికా వెళ్లిన యువకుడు అక్కడ దుండగుల కాల్పులకు బలయ్యా డు. హైదరాబాద్‌లో బీటెక్ పూర్తి చేసిన రవితేజ.. మాస్టర్స్ చదివేందుకు 2022లో అమెరికాకు వెళ్లాడు. వాషింగ్టన్లో మాస్టర్స్ పూర్తి చేసి ఉద్యోగ అన్వేషణలో ఉన్న కొడుకు మృతిచెందాడన్న వార్త తల్లిదండ్రులను కలచివేసింది. యాదాద్రి–భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం కోయిలగూడెంకు చెందిన కొయ్యడ చంద్రమౌళి–సువర్ణ దంపతులు కొంతకాలం నుంచి ఆర్కే పురం డివిజన్ గ్రీన్‌హిల్స్ కాలనీలో నివాసం ఉంటున్నారు. చంద్రమౌళి క్యాబ్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. వీరికి కుమారుడు రవితేజ (26), ఒక కుమార్తె ఉన్నారు. రవితేజ ప్రస్తుతం కనెక్టికట్‌లో ఓ రెస్టారెంట్లో పార్ట్‌టైమ్ జాబ్ చేస్తున్నాడు. భారత కాలమానం ప్రకారం ఆదివారం సాయంత్రం కారు అద్దెకు తీసుకొని కేక్ డెలివరీ చేయడానికి వెళ్లారు. అయితే, దుండగులు అప్పటికే చోరీకి పాల్పడి.. పారిపోయే క్రమంలో రవితేజ ప్రయాణిస్తున్న కారుపై కాల్పులు జరిపారు. దీంతో ఆయన అక్కడిక్కడే మృతిచెందారు. రవితేజ ఎంతసేపటికీ తిరిగి రెస్టారెంట్‌కు రాకపోవడంతో యజమానికి అనుమానం వచ్చి ఫుడ్ ఆర్డర్ పెట్టిన లొకేషన్‌కు వెళ్లి చూడగా రవితేజ మృతదేహం కనిపించింది. ఈ సమాచారాన్ని సోమవారం తెల్లవారుజామున రవితేజ కుటుంబ సభ్యులకు తెలియజేశారు. అమెరికాలో ఉద్యోగం చేస్తున్న రవితేజ సోదరి ఆస్పత్రికి వెళ్లి ఆయన మృతదేహాన్ని సందర్శించారు. చేతికొచ్చిన కొడుకు మృతి చెందడంతో హైదరాబాద్‌లోని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు. దీంతో గ్రీన్‌హిల్స్ కాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. తాను మాస్టర్ డిగ్రీ పట్టా అందుకునే కార్యక్రమానికి రావాలని రవితేజ తల్లిదండ్రులకు చెప్పగా వారు పాస్‌పోర్ట్, వీసా తీసుకునే ఏర్పాట్లు చేసుకుంటున్నారని, ఇంతలోనే కుమారుడు మృతి చెందడంతో వారు విషాదంలో మునిగిపోయారని బంధువులు చెప్పారు. డాడీ త్వరలోనే మంచి గిఫ్టు ఇస్తానన్నాడుతాను గత శనివారం కొడుకుతో మాట్లాడానని చంద్రమౌళి చెప్పారు. తనకు త్వరలోనే మంచి జాబ్ వస్తుందని... మిమ్మల్ని చూసుకుంటానని చెప్పాడన్నారు. త్వరలోనే నీకు మంచి గిఫ్టు ఇస్తానన్నాడని, అయితే అది ఇదేనా అంటూ ఆయన భోరున విలపించారు. తన కొడుకు మృతదేహాన్ని వెంటనే హైదరాబాద్‌కు వచ్చేలా చూడాలని చంద్రమౌళి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను కోరారు. కేంద్ర మంత్రి బండి సంజయ్.. రవితేజ కుటుంబసభ్యులతో మాట్లాడి వారికి సహాయం చేస్తానని చెప్పారని ఆయన కార్యాలయం తెలిపింది. -
గోవాలో తాడేపల్లిగూడెం యువకుడి హత్య
తాడేపల్లిగూడెం: నూతన సంవత్సర వేడుకలను మిత్రులతో సంతోషంగా జరుపుకుందామని గోవా వెళ్లిన పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం యువకుడు హత్యకు గురయ్యాడు. వివరాలు.. తాడేపల్లిగూడెం పట్టణానికి చెందిన బొల్లా రవితేజ(28) హైదరాబాద్‌లోని ఓ సాఫ్ట్వేర్ కంపెనీలో పనిచేస్తున్నాడు. రవితేజతో పాటు మరో నలుగురు యువకులు, ముగ్గురు యువతులు నూతన సంవత్సర వేడుకలు జరుపుకునేందుకు శనివారం గోవా వెళ్లారు. రెండు రోజుల పాటు గోవాలోని పలు పర్యాటక ప్రాంతాలను సందర్శించి.. డిసెంబర్ 30వ తేదీ అర్ధరాత్రి నార్త్‌గోవా జిల్లా కలంగూట్ పోలీస్‌స్టేషన్ పరిధిలోని ఒక రెస్టారెంట్‌కు వెళ్లారు. అర్ధరాత్రి అయినందున బిల్లు మీద అధికంగా చెల్లించాలని రెస్టారెంట్ యజమాని డిమాండ్ చేయడంతో.. అక్కడి సిబ్బందికి, రవితేజ స్నేహితులకు మధ్య గొడవ జరిగింది. ఈ సమయంలో తన స్నేహితురాలితో అక్కడి సిబ్బంది అసభ్యంగా ప్రవర్తించడంతో రవితేజ జోక్యం చేసుకున్నాడు. వెంటనే రెస్టారెంట్ సిబ్బంది కర్రలతో రవితేజతో పాటు అతని స్నేహితులపై విచక్షణారహితంగా దాడి చేశారు. వెదురు కర్ర విరిగి గుచ్చుకోవడంతో రవితేజ తలకు తీవ్ర గాయమైంది. మిగిలినవారు స్వల్పంగా గాయపడ్డారు. రవితేజను ఆస్పత్రికి తరలిస్తుండగా.. ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న స్థానిక పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని.. రవితేజ స్నేహితులను విచారించారు. దాడి చేసిన నలుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. -
గోవాలో దారుణ హత్యకు గురైన రవితేజ మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
-
రవితేజకు 'నంది అవార్డు' తెచ్చిన సినిమా రీరిలీజ్‌పై ప్రకటన
మాస్ మహారాజా రవితేజ- డైరెక్టర్ పూరి జగన్నాథ్ కాంబినేషన్లో తెరకెక్కిన సినిమా రీరిలీజ్ కానుంది. ఈమేరకు తాజాగా విడుదులైన పోస్టర్ నెట్టింట వైరల్ అవుతుంది. అయితే, థియేటర్లలో డిజాస్టర్‌గా నిలిచిన ఈ సినిమాకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది. 2008లో విడుదలైన 'నేనింతే' చిత్రంలో రవితేజ,శియా గౌతం జోడీగా మెప్పించారు. పూరి దర్శకత్వానికి చక్రి సంగీతం తోడైతే ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. మ్యూజికల్‌గా ఈ చిత్రంలోని చాలా పాటలు ఇప్పటికీ వైరల్ అవుతూనే ఉంటాయి.సుమారు 16 ఏళ్ల తర్వాత నేనింతే చిత్రం రీరిలీజ్ కానుంది. రవితేజ బర్త్‌డే సందర్భంగా జనవరి 26న విడుదల చేస్తున్నట్లు చిత్ర మేకర్స్ ప్రకటించారు. ఈమరకు ఒక పోస్టర్‌ను కూడా అభిమానులతో పంచుకున్నారు. సినిమా ఇండస్ట్రీలో తమ టాలెంట్ చూపించాలని చాలామంది హైదరాబాద్ వస్తుంటారు. అలా కృష్ణ నగర్లో అడుగుపెట్టిన వారి కష్టాలను కళ్లకు కట్టినట్లుగా చూపిస్తూ.. దర్శకుడు పూరి జగన్నాథ్ నేనింతే మూవీని తెరకెక్కించాడు. చిత్ర పరిశ్రమలో సక్సెస్ కావడం వెనుక దాగి ఉన్న కష్టాలను చాలా ఎమోషనల్‌గా ఈ మూవీలో పూరి చూపించాడు. ఈ మూవీ కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అయినప్పటికీ ఉత్తమ నటుడిగా రవితేజకు నంది అవార్డు దక్కింది. ఇదే చిత్రానికి గాను ఉత్తమ మాటల రచయితగా పూరీ జగన్నాథ్, ఉత్తమ ఫైట్ మాస్టర్స్‌గా రామ్ లక్ష్మణ్‌లకు నంది అవార్డ్స్ లభించాయి.నేనింతే సినిమాలో రవితేజకు జోడీగా శియా గౌతమ్ హీరోయిన్గా తొలి పరిచయం అయింది. ఆమెకు అదితి గౌతమ్ అని మరో పేరు కూడా ఉంది. నేనింతే చిత్రంలో శియా నటనకు మంచి గుర్తింపు దక్కింది. అయినా ఆమెకు పెద్దగా అవకాశాలు రాలేదు. అయితే, ముంబయికి చెందిన వ్యాపార వేత్తతో రీసెంట్గా ఆమె పెళ్లి కూడా అయిపోయింది. నేనింతే చిత్రంలో బ్రహ్మానందం, వేణుమాధవ్, సుప్రీత్, సుబ్బరాజు కీలక పాత్రల్లో కనిపించారు. ఇదే మూవీలో డైరెక్టర్లు హరీష్ శంకర్, వీవీ వినాయక్, కోన వెంకట్‌తో పాటు మ్యూజిక్ డైరెక్టర్ చక్రి కూడా గెస్ట్ రోల్స్ కనిపించడం విశేషం. -
డిష్యూం... డిష్యూం...
విలన్స్ బెండు తీస్తున్నాడు లక్ష్మణ్ భేరి. డిష్యూం... డిష్యూం అంటూ అదిరిపోయే ఫైట్ చేస్తున్నాడు. ఈ లక్ష్మణ్ భేరి ఎవరంటే... రవితేజ అన్న మాట. రవితేజ హీరోగా నటిస్తున్న యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ‘మాస్ జాతర’లో ఆయన పాత్ర పేరు ఇది. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాకు భాను భోగవరపు దర్శకత్వం వహిస్తున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, శ్రీలీల మళ్లీ జంటగా ఈ సినిమాలో నటిస్తున్నారు. ఈ చిత్రంలో ఎస్ఐ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను చిత్రీకరిస్తున్నారు. యాక్షన్ కొరియోగ్రాఫర్ పృథ్వీ మాస్టర్ ఈ యాక్షన్ సీక్వెన్స్‌ను డిజైన్ చేస్తున్నారట. ఈ షెడ్యూల్ తర్వాత చిత్రయూనిట్ అరకు వెళ్లనుందని తెలిసింది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం మే 9న విడుదల కానుంది. ఈ సినిమాకు సంగీతం: భీమ్స్ సిసిరోలియో. -
కూతురిని కూడా ఇండస్ట్రీలోకి తెచ్చిన రవితేజ!?
తెలుగు హీరోలు చాలామంది తమ కొడుకుల్ని హీరోలుగా పరిచయం చేస్తారు గానీ కూతుళ్లని హీరోయిన్లని చేయడానికి ఇష్టపడరు. మిగతా విభాగాల్లో పనిచేసే విషయమై కూడా పెద్దగా ప్రోత్సహించారు. కానీ రవితేజ మాత్రం అలా కాదని నిరూపిస్తున్నాడు. ఎందుకంటే ఇతడి కూతురు దర్శకత్వం నేర్చుకుంటోందట.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 18 సినిమాలు)సినీ నేపథ్యం లేకుండా వచ్చి టాలీవుడ్లో స్టార్ హీరో అయ్యాడు రవితేజ. ఇతడికి కొడుకు మహాధన్, కూతురు మోక్షద ఉన్నారు. కొడుకు ఇదివరకే 'రాజా ది గ్రేట్' మూవీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చేశాడు. ప్రస్తుతం ఓ దర్శకుడి దగ్గర సహాయకుడిగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. రవితేజ కూతురు కూడా ఇప్పుడు అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తోందట.ప్రముఖ నిర్మాణ సంస్థ సితార ఎంటర్ టైన్మెంట్స్ తీస్తున్న ఓ సినిమాకు రవితేజ కూతురు మోక్షద.. అసిస్టెంట్ డైరెక్టర్‌గా పనిచేస్తుందట. గతంలో రవితేజ కూడా ఇలానే సహాయ దర్శకుడిగా కెరీర్ మొదలుపెట్టాడు. తర్వాత నటుడు అయ్యాడు. బహుశా మోక్షద కూడా ఇలా మొదట దర్శకత్వంలో మెలకువలు నేర్చుకుని, నటి అవుతుందేమో చూడాలి?(ఇదీ చదవండి: మూడు వారాలకే ఓటీటీలోకి వచ్చేసిన 'మెకానిక్ రాకీ') -
అరకులో ‘మాస్ జాతర’... రవితేజతో భారీ యాక్షన్ సీక్వెన్స్!
అరుకులో మాస్ జాతర చేయనున్నారు హీరో రవితేజ. ఆయన కెరీర్లో రూపొందుతున్న 75వ చిత్రం ‘మాస్ జాతర’. ‘మనదే ఇదంతా’ అనేది ట్యాగ్‌లైన్. హిట్ ఫిల్మ్ ‘సామజవరగమన’కు ఓ రైటర్‌గా పనిచేసిన భాను భోగవరపు ఈ సినిమాతో దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. ‘ధమాకా’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత రవితేజ, హీరోయిన్ శ్రీలీల కలిసి నటిస్తున్న సినిమా ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరీ పాత్రలో రవితేజ నటిస్తున్నారని తెలిసింది. ఈ సినిమా తాజా షెడ్యూల్ డిసెంబరు మూడో వారంలో అరకులో ప్రారంభం కానుందని సమాచారం. ముఖ్యంగా అరకు, ఆ తర్వాత పాడేరు, ఆంధ్రా–ఒరిస్సా సరిహద్దు లొకేషన్స్‌లో ‘మాస్ జాతర’ చిత్రీకరణ జరగనుందని తెలిసింది. ఈ షెడ్యూల్లో ప్రధాన తారాగణం పాల్గొంటారు. కొంత టాకీ పార్టుతో పాటు, ఓ యాక్షన్ సీక్వెన్స్‌ను కూడా ప్లాన్ చేశారు మేకర్స్. రాజేంద్రప్రసాద్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు భీమ్స్ సిసిరోలియో సంగీతం అందిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది మే 09న విడుదల కానుంది. -
స్టార్ హీరోలను మెప్పిస్తున్న యంగ్ డైరెక్టర్స్
సినిమాలో కంటెంట్ బాగుంటే చిన్నా పెద్దా అనే తేడాల్లేవ్. ఆడియన్స్ సూపర్ హిట్ చేస్తున్నారు. అలాగే కథలో బలం ఉందని హీరో–నిర్మాతలు నమ్మితే చాలు చిన్నా పెద్దా తేడాల్లేవ్, అనుభవం లెక్కలోకి రాదు. స్టార్ హీరోలు కొత్త దర్శకులతో సినిమాలు చేయడానికి రెడీ అయిపోతారు. కథ కోసం బడ్జెట్ కేటాయింపులకు నిర్మాతలు సిద్ధమైపోతారు. ఇలా తమ కలంతో స్టార్ హీరోలను ఒప్పిస్తున్న యువ దర్శకుల జాబితా టాలీవుడ్లో పెరిగిపోతోంది. స్టార్ హీరోలను డైరెక్ట్ చేయాలనే పట్టుదలతో బలమైన కథలు సిద్ధం చేసుకున్నారు కొందరు యువ దర్శకులు. ఆ కథలతో స్టార్ హీరోలను మెప్పించి, సినిమా చేస్తున్న ఆ దర్శకుల గురించి తెలుసుకుందాం.ఇద్దరు యువ దర్శకులతో... నూటయాభైకి పైగా సినిమాలు చేసిన చిరంజీవి వంటి అగ్రహీరో వరుసగా యువ దర్శకులకు చాన్స్ ఇస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి హీరోగా నటిస్తున్న ‘విశ్వంభర’ సినిమాకు వశిష్ఠ దర్వకత్వం వహిస్తున్నారు. ‘విశ్వంభర’కు ముందు వశిష్ఠ చేసింది ఒక్కటే సినిమా. అదే ‘బింబిసార’. తన ప్రతిభతో మెప్పించి, చిరంజీవి వంటి టాప్ హీరోతో సినిమా చేసే చాన్స్ దక్కించుకున్నారు వశిష్ఠ. అలాగే ‘దసరా’ సినిమాతో దర్శకుడిగా పరిచయం అయ్యారు శ్రీకాంత్ ఓదెల. నాని హీరోగా నటించిన ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా రూ. 100 కోట్ల గ్రాస్ కలెక్షన్స్‌ను కొల్లగొట్టింది. శ్రీకాంత్ ఓదెల కథను మెచ్చి, ఈ యువ దర్శకుడికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు చిరంజీవి. ఈ సినిమాకు హీరో నాని ఓ నిర్మాతగా ఉండటం విశేషం. ‘ప్యారడైజ్’ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కనుంది. సంక్రాంతి తర్వాత... ఇండస్ట్రీకి చాలామంది దర్శకులను పరి చయం చేశారు నాగార్జున. తెలుగు ఇండస్ట్రీలో కల్ట్ క్లాసిక్‌గా చెప్పుకునే ‘శివ’ సినిమాతో రామ్‌గోపాల్ వర్మను దర్శకుడిగా పరిచయం చేశారు. ఇంకా నాగార్జున పరిచయం చేసిన దర్శకుల లిస్ట్ చాలానే ఉంది. ఈ విధంగా యువ దర్శకులతో పని చేయడానికి నాగార్జున ఆసక్తి చూపిస్తుంటారు. తాజాగా ‘హుషారు, రౌడీబాయ్స్, ఓం భీమ్ బుష్’ సినిమాలు తీసిన దర్శకుడు హర్ష కొనుగంటితో సినిమా చేసే ఆలోచన చేస్తున్నారట నాగార్జున. అలాగే తమిళంలో రెండు సినిమాలకు దర్శకత్వం వహించిన నవీన్ అనే దర్శకుడు చెప్పిన కథను కూడా ఓకే చేశారట. ఈ యువ దర్శకులతో నాగార్జున చేయాల్సిన సినిమాలపై సంక్రాంతి తర్వాత ఓ స్పష్టత వస్తుంది. పెద్ది ‘రాజమౌళి, శంకర్’ వంటి ప్రముఖ దర్శకులతో సినిమాలు చేసిన రామ్‌చరణ్ తన తర్వాతి సినిమాను ‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు చేతుల్లో పెట్టారు. దర్శకుడిగా బుచ్చిబాబుకు ఇది రెండో సినిమా. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభమైంది. జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో జగపతిబాబు, శివరాజ్‌కుమార్ లీడ్ రోల్స్‌లో నటిస్తున్నారు. అంతేకాదు... తన రెండో సినిమాకే ఆస్కార్ విన్నింగ్ మ్యూజిక్ డైరెక్టర్ ఏఆర్ రెహమాన్‌ను ఒప్పించగలిగారు బుచ్చిబాబు. ‘పెద్ది’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్, వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ పతాకాలపై వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. డీజే టిల్లు దర్శకుడితో... యువ హీరో సిద్ధు జొన్నలగడ్డతో ‘డీజే టిల్లు’ వంటి సూపర్‌హిట్ ఫిల్మ్‌తో దర్శకుడిగా పరిచయం అయ్యారు విమల్ కృష్ణ. కాగా విమల్ రెడీ చేసిన ఓ కథను అగ్ర హీరో వెంకటేశ్ ఆల్మోస్ట్ ఓకే చేశారట. వీరిద్దరి మధ్య కథా చర్చలు జరిగాయని, వీరి కాంబినేషన్లోని సినిమాపై త్వరలోనే ఓ స్పష్టత రానుందని ఫిల్మ్‌నగర్ భోగట్టా. కథ విన్నారా? ‘హాయ్ నాన్న’ సినిమాతో దర్శకుడిగా శౌర్యువ్ తెలుగు ఇండస్ట్రీకి పరిచయమై, ప్రేక్షకులను ఆకట్టుకోగలిగారు. ఎన్టీఆర్ కోసం శౌర్యువ్ ఓ కథను సిద్ధం చేశారట. ఈ స్టోరీని ఎన్టీఆర్‌కు వినిపించగా, శౌర్యువ్‌కి అంగీకారం తెలిపారట. దీంతో ఈ సినిమా స్క్రిప్ట్‌కు మరింత మెరుగులు దిద్దే పనిలో పడ్డారు శౌర్యువ్. ఫైనల్ కథతో ఎన్టీఆర్‌ను శౌర్యువ్ మెప్పించగలిగితే, దర్శకుడిగా ఆయన కెరీర్ నెక్ట్స్ లీగ్‌లోకి వెళ్తుందని ఊహించవచ్చు. అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం ‘వార్ 2’తో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ప్రశాంత్ నీల్‌తో ‘డ్రాగన్’ (ప్రచారంలో ఉన్న టైటిల్) చేస్తారు. ఆ తర్వాత నెల్సన్ దిలీప్ కుమార్‌తో ఎన్టీఆర్‌కు ఓ కమిట్మెంట్ ఉంది. కాబట్టి... ఎన్టీఆర్–శౌర్యువ్‌ల కాంబినేషన్ సినిమాకు మరింత సమయం పట్టనుంది. మైల్స్టోన్ ఫిల్మ్‌కెరీర్‌లో మైల్స్టోన్ ఫిల్మ్స్ అంటే కొంచెం ఎక్స్ట్రా కేర్ తీసుకుంటుంటారు హీరోలు. అలాంటిది తన 75వ సినిమాను ఇప్పటివరకు ఒక్క సినిమా కూడా చేయని భాను భోగవరపు చేతిలో పెట్టారు రవితేజ. తన కథతో తొలి సినిమానే రవితేజతో చేసే చాన్స్ దక్కించుకున్నారు భాను భోగవరపు. ‘మాస్ జాతర’ టైటిల్‌తో రానున్న ఈ సినిమా చిత్రీకరణ శరవేగంగా జరుగుతోంది. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న ఈ సినిమా విడుదల కానుంది. ఇలా బలమైన కథలతో స్టార్ హీరోలను మెప్పిస్తున్న మరికొంతమంది దర్శకులు ఉన్నారు. -
'మిస్టర్ బచ్చన్'.. నేను తీసుకున్న చెత్త నిర్ణయం!
సినిమా హిట్ అయితే గొప్పగా చెప్పుకొంటారు. కానీ అదే ఫెయిలైతే మాత్రం చాలామంది నిర్మాతలు ఒప్పుకోరు. మేం బాగానే తీశాం, జనాలు ఆదరించలేదు అని ఏవేవో కబుర్లు చెబుతుంటారు. కానీ టాలీవుడ్ ప్రముఖ నిర్మాత టీజీ విశ్వప్రసాద్ మాత్రం 'మిస్టర్ బచ్చన్' ఫ్లాప్ అని అన్నారు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అసలు ఈ మూవీ ఎక్కడ ఫెయిలైందో అనే విషయాల్ని డీటైల్డ్‌గా చెప్పుకొచ్చారు.(ఇదీ చదవండి: సత్యదేవ్‌కి అన్యాయం? 'ఆర్ఆర్ఆర్'లో 16 నిమిషాల సీన్స్ కట్)సినిమా లాంచ్ కావడానికి ఒక్కరోజు ముందే ఈ ప్రాజెక్ట్‌లోకి వచ్చానని చెప్పిన టీజీ విశ్వప్రసాద్.. రీమేక్ అవసరమా అని తాను మొదటే అడిగానని అన్నారు. రీమేక్ కంటే ఒరిజినల్ స్టోరీతో చేస్తే బాగుంటుందని నా అభిప్రాయం చెప్పాను. కానీ అప్పటికే నిర్ణయం తీసుకునే విషయంలో చాలా లేట్ అయిపోవడంతో మరేం మాట్లాలేకపోయాను. 'మిస్టర్ బచ్చన్'ని లక్నోలో తీయడం నా జీవితంలో తీసుకున్న అతిపెద్ద చెత్త నిర్ణయం అనుకుంటున్నాను.80ల నాటి హిందీ పాటలు తమకు నచ్చడంతో 'మిస్టర్ బచ్చన్' ఆడేస్తుందని అనుకున్నామని విశ్వప్రసాద్ చెప్పారు. ఇది ఓ తప్పయితే, షూటింగ్ చాలా వేగంగా చేయడం మరో మైనస్ అని అన్నారు. సినిమాలో కొన్ని సీన్స్ అయినా సరిగా తీసుంటే.. హిట్ అయ్యుండేదేమో అని అభిప్రాయపడ్డారు. రైడ్ సీన్స్‌తో పాటు యాక్షన్ సన్నివేశాల విషయంలో ఇంకాస్త దృష్టి పెట్టి, కాస్త నెమ్మదిగా షూటింగ్ పూర్తి చేసి ఉంటే బాగుందని అన్నారు.(ఇదీ చదవండి: తల్లిని కావాలని ఇప్పటికీ ఉంది: సమంత)నిర్మాత విశ్వప్రసాద్ చెప్పిన దానిబట్టి చూస్తే తప్పంతా హరీశ్ శంకర్‌దే అనిపిస్తుంది. ఎందుకంటే రిలీజ్‌కి ముందు ఈయన మామూలు హడావుడి చేయలేదు. అంతెందుకు మొన్న ఐఫా అవార్డుల్లోనూ రానా-తేజ సజ్జా ఫన్నీగా 'మిస్టర్ బచ్చన్' గురించి ఏదో సెటైర్ వేశారు. దాన్ని కూడా హరీశ్ శంకర్ తీసుకోలేకపోయారు. 'ఎన్నో విన్నాను తమ్ముడు' అని ట్వీట్ చేశారు తప్పితే తన తప్పుని మాత్రం ఒప్పుకోవట్లేదు.పవన్ కల్యాణ్‌తో 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాని హరీశ్ శంకర్ చాన్నాళ్ల క్రితమే మొదలుపెట్టారు. కానీ అది ఎక్కడి వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉండిపోయింది. ప్రస్తుతానికి అయితే హరీశ్ శంకర్ చేతిలో మరో ప్రాజెక్టేం లేదు.(ఇదీ చదవండి: 'అమరన్' ఓటీటీ రిలీజ్ వాయిదా.. కారణం అదేనా?) -
మళ్ళీ రీమేక్ వైపు చూస్తోన్న రవితేజ..
-
రవితేజ 'మాస్ జాతర'.. ఈ సారి మోత మోగిపోవడం పక్కా!
టాలీవుడ్ హీరో మాస్ మహారాజ్ మరో యాక్షన్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నారు. మిస్టర్ బచ్చన్ తర్వాత ఆర్టీ75 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న మూవీలో నటిస్తున్నారు. తాజాగా దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇచ్చారు మేకర్స్. టైటిల్ రివీల్ చేయడంతో పాటు ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి మాస్ జాతర అనే టైటిల్ ఖరారు చేశారు. మనదే ఇదంతా అనే ట్యాగ్‌లైన్ కూడా ఇచ్చారు. తాజాగా రిలీజైన రవితేజ ఫస్ట్ లుక్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. చేతిలో గంట పట్టుకుని కనిపిస్తోన్న మాస్ మహారాజాను చూస్తుంటే.. ఈ సినిమాలో మోత మోగిపోవడం ఖాయం అనిపిస్తోంది. రవితేజ ఫ్యాన్స్‌కు మరోసారి మాస్ ఎంటర్టైనర్ పక్కా అని అర్థమవుతోంది. టైటిల్‌కు తగ్గట్టుగానే ఈ సినిమా థియేటర్లలో మాస్ జాతరను తలపిస్తుందని నిర్మాతలు అభిప్రాయం వ్యక్తం చేశారు.ఆ సూపర్ హిట్ జోడీ రిపీట్కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోంది. గతంలో వీరిద్దరు జోడి ధమాకా మూవీతో సూపర్ హిట్ అందుకున్నారు. దీంతో మరో బ్లాక్ బస్టర్ రావడం ఖాయమని చిత్ర బృందం భావిస్తోంది. ఈచిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ సినిమాను వచ్చే ఏడాది సమ్మర్లో మే 9న విడుదల చేయనున్నారు. ఈ మూవీకి భీమ్స్ సిసిరోలియో సంగీతాన్ని సమకూరుస్తున్నారు. ఈ మాస్ ఎంటర్టైనర్ మే 9, 2025న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. Get ready for a Re-Sounding Entertainer 💥Presenting our 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl in an out-and-out ‘MASS JATHARA’ 🧨🧨🎇BLASTING the screens with highly MASSIVE & EXPLOSIVE entertainment from MAY 9th, 2025 😎 💣 Wishing you all a very #HappyDiwali 🧨🪔… pic.twitter.com/k2CTLGdKMV— Sithara Entertainments (@SitharaEnts) October 30, 2024 -
ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మాస్ అప్డేట్ వచ్చేసింది!
ఇటీవల మిస్టర్ బచ్చన్ సినిమాతో మెప్పించిన టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ. ప్రస్తుతం మరో చిత్రంతో బిజీగా ఉన్నారు. ఇప్పటికే వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కిస్తోన్న మూవీకి సంబంధించిన లేటేస్ట్ అప్డేట్ ఇచ్చారు మేకర్స్. దీపావళీ సందర్భంగా ఫ్యాన్స్‌కు అదిరిపోయే అప్డేట్ ఇవ్వనున్నారు.రవితేజ నటిస్తోన్న 75వ చిత్రానికి సంబంధించిన టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ఈ విషయాన్ని పోస్టర్ ద్వారా వెల్లడించారు. బుధవారం సాయంత్రం 04:05 గంటలకు విడుదల చేస్తామని నిర్మాణ సంస్థ సితార ఎంటర్టైన్మెంట్స్ పోస్ట్ చేసింది. ఈ దీపావళికి మోత మోగిపోద్ది.. మనదే ఇదంతా అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు.కాగా.. సామజవరగమన వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తోన్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి కోహినూర్ అనే టైటిల్‌ను పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. 𝐌𝐀𝐒𝐒 𝐌𝐀𝐇𝐀𝐑𝐀𝐀𝐉 @RaviTeja_offl is gearing up to bring you a Special Cracker of a Surprise TOMORROW at 04:05 PM 🧨🧨🧨🎇Ee saari Deepavali ki Motha Mogipoddi... "Manade Idantha" 😎🔥Keep watching this space 🔥 #RT75FirstLook #RT75 🤩@sreeleela14 @BhanuBogavarapu… pic.twitter.com/udYz4c70EM— Sithara Entertainments (@SitharaEnts) October 29, 2024 -
పొంగల్ పోరు.. సీన్ మారుతోంది!
తెలుగు సినిమాకు సంక్రాంతి సీజన్ అంటే చాలా స్పెషల్. వరుసగా సెలవులు ఉంటాయి కాబట్టి దాదాపు అన్ని సినిమాల వసూళ్లు బాగుంటాయి. ఒకవేళ హిట్ టాక్ తెచ్చుకుంటే ఇక ఆ సినిమా బ్లాక్‌బస్టర్ హిట్‌ను సొంతం చేసుకుంటుంది. ఈ నేపథ్యంలో చాలా మంది హీరోలు, దర్శక – నిర్మాతలు వారి సినిమాలను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని పోటీ పడుతుంటారు. కానీ ఫైనల్‌గా బెర్త్ కొంతమందికే దొరుకుతుంది. 2025 సంక్రాంతి సమయం సమీపిస్తున్న తరుణంలో సంక్రాంతి బరిలో నిలిచేందుకు ఆయా చిత్రబృందాలు రెడీ అవుతున్నాయి. కానీ ఆల్రెడీ సంక్రాంతికి ప్రకటించిన సినిమాలు థియేటర్స్‌లోకి రాలేని పరిస్థితులు ఏర్పడ్డాయి. వాటి స్థానంలో వేరే సినిమాలు సంక్రాంతికి సై అంటున్నాయి. ఇలా సంక్రాంతి సినిమా సీన్ మారుతోంది. ఇక 2025 సంక్రాంతి బాక్సాఫీస్ పోరులోకి వెళదాం.సంక్రాంతికి వస్తున్నాం... కానీ! ‘సంక్రాంతికి వస్తున్నాం’ అనే వర్కింగ్ టైటిల్‌ని పెట్టుకుని మరీ వెంకటేశ్ అండ్ టీమ్ వర్క్ చేస్తున్నారంటే ఈ సినిమాను సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయాలని యూనిట్ ఎంతటి కృతనిశ్చయంతో ఉందో అర్థం చేసుకోవచ్చు. వెంకటేశ్ హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘సంక్రాంతికి వస్తున్నాం’ (ప్రచారంలో ఉన్న టైటిల్). ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ఆల్రెడీ ప్రకటించింది. సినిమా చిత్రీకరణ కూడా శరవేగంగా జరుగుతోంది. ఈ చిత్రంలో మాజీ పోలీస్ ఆఫీసర్‌గా వెంకటేశ్, అతని భార్య పాత్రలో ఐశ్వర్యా రాజేష్, మాజీ ప్రేయసిగా మీనాక్షీ చౌదరి నటిస్తున్నారు. ఇదిలా ఉంటే... మరోవైపు ‘దిల్’ రాజు నిర్మిస్తున్న మరో చిత్రం ‘గేమ్ చేంజర్’ కూడా సంక్రాంతికి రిలీజ్ కానుంది. ఈ నేపథ్యంలో ‘సంక్రాంతికి వస్తున్నాం’ సినిమా ఈ సంక్రాంతి పండక్కి రిలీజ్ అవుతుందా? లేదా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అయితే సంక్రాంతి పండక్కి ఎన్ని పెద్ద సినిమాలు వచ్చినా స్పేస్ ఉంటుంది కాబట్టి తమ బేనర్లోని ఈ రెండు చిత్రాలనూ ‘దిల్’ రాజు పండగ బరిలో దింపుతారని ఊహించవచ్చు. ఆఫీసర్ వస్తారా? ఈ ఏడాది సంక్రాంతి సమయంలో రవితేజ హీరోగా నటించిన ‘ఈగల్’ సినిమా థియేటర్స్‌లోకి రావాల్సింది. కానీ సంక్రాంతి బరిలో నిలిచిన సినిమాల నిర్మాతల రిక్వెస్ట్, వివిధ సమీకరణాల నేపథ్యంలో ‘ఈగల్’ సినిమా సంక్రాంతి నుంచి తప్పుకుని, ఫిబ్రవరిలో విడుదలైంది. దీంతో 2025 సంక్రాంతికి తన సినిమాను రిలీజ్ చేయాలని రవితేజ ప్లాన్ చేశారు. రచయిత భాను భోగవరపును దర్శకుడిగా పరిచయం చేస్తూ, హీరో రవితేజ ఓ సినిమా చేస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. రవితేజ కెరీర్‌లోని ఈ 75వ సినిమాను 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. ఇందుకు తగ్గట్లుగానే షూటింగ్ శరవేగంగా జరుపుకుంటూ వచ్చారు. కానీ ఇటీవల ఓ యాక్షన్ సీక్వెన్స్ తీస్తున్న సమయంలో రవితేజ భుజానికి గాయమైంది. దాంతో ఈ సినిమా చిత్రీకరణ సజావుగా సాగలేదు. ఈ నేపథ్యంలో ఈ సినిమా సంక్రాంతికి వస్తుందా? లేదా అనే విషయంపై మరోసారి క్లారిటీ రావాల్సి ఉంది. ‘ధమాకా’ సినిమా తర్వాత రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ఇది. ఈ చిత్రంలో రైల్వే ప్రొటక్షన్ ఫోర్స్ ఆఫీసర్ లక్ష్మణ్ భేరి పాత్రలో రవితేజ నటిస్తున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. గేమ్ చేంజర్ రెడీ సంక్రాంతి బరికి సిద్ధమయ్యారు రామ్‌చరణ్. తమిళ దర్శకుడు శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ ‘గేమ్ చేంజర్’. ఈ సినిమాను తొలుత 2024 క్రిస్మస్కి రిలీజ్ చేయాలనుకున్నారు ‘దిల్’ రాజు. కానీ ప్రపంచవ్యాప్తంగా క్రిస్మస్ సందర్భంగా రిలీజ్ అవుతున్న సినిమాల ట్రేడ్ బిజినెస్, డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్స్ సూచనల మేరకు ‘గేమ్ చేంజర్’ సినిమా రిలీజ్‌ను 2024 క్రిస్మస్ నుంచి 2025 సంక్రాంతికి వాయిదా వేసినట్లుగా నిర్మాత ‘దిల్’ రాజు ఇటీవల ఓ వీడియోలో వెల్లడించారు. 2025 జనవరి 10న ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఇక ‘గేమ్ చేంజర్’ సినిమాలో తండ్రీకొడుకులుగా రామ్‌చరణ్ ద్విపాత్రాభినయం చేస్తున్నారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా, నవీన్‌చంద్ర, ఎస్జే సూర్య, జయరాం, సునీల్, ప్రియదర్శి వంటి వారు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్‌పై ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మించిన చిత్రం ఇది. ఇక సార్వత్రిక ఎన్నికల సమయంలో ఐఏఎస్ ఆఫీసర్ల విధులు, హక్కులు, వారికి ఉండే ప్రత్యేక అధికారాలు వంటి అంశాల నేపథ్యంలో ‘గేమ్ చేంజర్’ ఉంటుందని టాక్.నార్త్ ఇండియాలో... ఈ సంక్రాంతి పండక్కి బాలకృష్ణ 109వ చిత్రం థియేటర్స్‌లోకి రానుంది. కేఎస్ రవీంద్ర ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. సూర్యదేవర నాగవంశీ, సాయి సౌజన్య ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని సంక్రాంతి సందర్భంగా రిలీజ్ చేయనున్నట్లు ఆల్రెడీ చిత్రయూనిట్ ప్రకటించింది. ఈ దీపావళి సందర్భంగా టైటిల్, రిలీజ్ డేట్‌పై ఓ స్పష్టత రానుంది. ఈ సినిమాలో బాలకృష్ణ బందిపోటుగా కనిపిస్తారని, కథకు నార్త్ ఇండియా నేపథ్యం ఉంటుందని, విలన్‌గా బాబీ డియోల్, ఓ పోలీసాఫీసర్ పాత్రలో హీరోయిన్ ఊర్వశీ రౌతేలా కనిపిస్తారని ఫిల్మ్‌నగర్ సమాచారం. మజాకా ఈ ఏడాది సంక్రాంతికి థియేటర్స్‌లో ‘మజాకా’ సెలబ్రేషన్స్ ఖాయం అంటున్నారు హీరో సందీప్ కిషన్. రవితేజతో ‘ధమాకా’ వంటి బ్లాక్‌బస్టర్ ఫిల్మ్ తీసిన నక్కిన త్రినాథరావు దర్శకత్వం వహిస్తున్న తాజా చిత్రం ‘మజాకా’. మాస్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమాలో సందీప్ కిషన్ హీరోగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్స్, హాస్య మూవీస్, జీ స్టూడియోస్ పతాకాలపై రాజేష్ దండా నిర్మిస్తున్న చిత్రం ఇది. మహేంద్రగిరి దేవాలయం సంక్రాంతి వంటి పెద్ద పండక్కి మీడియమ్, స్మాల్ మూవీస్ కూడా రిలీజ్ అవుతుంటాయి. ప్రతి సంక్రాంతికి ఇలాంటి చిత్రాలు రెండు అయినా వస్తుంటాయి. ఏ చిత్రం ఆడియన్స్‌కు నచ్చితే అది పెద్ద హిట్ అయిన సందర్భాలు ఉన్నాయి. 2025 సంక్రాంతికి ఈ కోవలో వస్తున్న చిత్రం ‘మహేంద్రగిరి వారాహి’. సుమంత్ హీరోగా, బ్రహ్మానందం మరో లీడ్ రోల్లో నటిస్తున్న సినిమా ఇది. సంతోష్ జాగర్లపూడి దర్శకత్వంలో కాలిపు మధు నిర్మిస్తున్నారు. మహేంద్రగిరిలో కొలువుదీరిన వారాహి అమ్మవారి ఆలయం చుట్టూ ఈ సినిమా కథనం సాగుతుందని యూనిట్ పేర్కొంది.2025 జనవరి 10న సంక్రాంతి సందర్భంగా ‘విశ్వంభర’ చిత్రం రిలీజ్ కావాల్సింది. చిరంజీవి హీరోగా ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. భారీ బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ ఈ సినిమా నిర్మిస్తోంది. కానీ ‘విశ్వంభర’ జనవరి 10న రిలీజ్ కావడం లేదు. ‘విశ్వంభర’ సినిమా వర్క్ ఆల్మోస్ట్ పూర్తయిపోయిందని, రామ్‌చరణ్– ‘దిల్’ రాజుగార్ల కోసం చిరంజీవిగారితో మాట్లాడి ‘విశ్వంభర’ రిలీజ్‌ను వాయిదా వేశామని, త్వరలోనే కొత్త రిలీజ్ డేట్‌ను ప్రకటిస్తామని చిత్రదర్శకుడు వశిష్ఠ పేర్కొన్నారు. ఇక ‘విశ్వంభర’ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్లో రిలీజ్ కానున్నట్టుగా తెలుస్తోంది.అలాగే 2025 సంక్రాంతి సందర్భంగా తాను హీరోగా నటించే ఓ సినిమా థియేటర్స్‌లోకి వస్తుందన్నట్లు నాగార్జున గతంలో పేర్కొన్నారు. కానీ ఇది సాధ్యపడేలా లేదు. అయితే నాగచైతన్య హీరోగా నటిస్తున్న ‘తండేల్’ చిత్రం 2025 సంక్రాంతి సందర్భంగా రిలీజ్ అవుతుందనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. కానీ ఓటీటీ డీల్స్, పర్ఫెక్ట్ రిలీజ్ డేట్స్ వంటి అంశాలను పరిశీలించుకుని ‘తండేల్’ సినిమా సంక్రాంతి రిలీజ్‌పై చిత్రయూనిట్ ఓ స్పష్టతకు వస్తారట. ‘లవ్‌స్టోరీ’ చిత్రం తర్వాత నాగచైతన్య, సాయిపల్లవి జంటగా నటిస్తున్న ‘తండేల్’ సినిమాకు చందు మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. అల్లు అరవింద్ సమర్పణలో ‘బన్నీ’ బాసు ఈ సినిమాను నిర్మిస్తున్నారు. సంక్రాంతి బరిలో స్ట్రయిట్ చిత్రాలతో పాటు ఒకటీ లేదా రెండు తమిళ హీరోల చిత్రాలు కూడా రిలీజ్‌కు రెడీ అవుతుంటాయి. ఇలా 2025 సంక్రాంతికి అజిత్ హీరోగా నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్స్‌లోకి రానుంది. మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. విశాల్ ‘మార్క్ ఆంటోని’ ఫేమ్ అధిక్ రవిచంద్రన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో అజిత్ క్యారెక్టర్లో మూడు వేరియేషన్స్ ఉంటాయి. – ముసిమి శివాంజనేయులు -
'మిస్టర్ ఇడియట్' మూవీతో హీరోగా రవితేజ వారసుడి ఎంట్రీ..(ఫొటోలు)
-
మరికొద్ది గంటల్లో ఓటీటీకి మిస్టర్ బచ్చన్.. ఎక్కడ చూడాలంటే?
మాస్ మహారాజ రవితేజ, భాగ్యశ్రీ బోర్సో జంటగా నటించిన చిత్రం'మిస్టర్ బచ్చన్'. హరీశ్ శంకర్ డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. భారీ అంచనాలు పెట్టుకున్నప్పటికీ.. ఊహించని ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. దీంతో బాక్సాఫీస్ వద్ద మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది.అయితే ఈ మూవీ ఓటీటీలో సందడి చేసేందుకు వచ్చేస్తోంది. ఈ రోజు అర్ధరాత్రి నుంచే నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఓటీటీ డేట్‌ను మేకర్స్ అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులకు అందుబాటులోకి రానుంది. థియేటర్లలో పెద్దగా సక్సెస్ కాలేకపోయిన మిస్టర్ బచ్చన్.. ఓటీటీ ప్రియులను అలరిస్తుందేమో చూడాలి.అసలు కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు.వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
ఓటీటీలో 'మిస్టర్ బచ్చన్' స్ట్రీమింగ్పై అధికారిక ప్రకటన
మాస్ మహారాజ రవితేజ- హరీశ్ శంకర్ కాంబినేషన్లో భారీ అంచనాలతో తెరకెక్కిన సినిమా 'మిస్టర్ బచ్చన్'. ఆగస్టు 15న ఈ చిత్రం థియేటర్లలో రిలీజ్ అయింది. అయితే, తాజాగా ఓటీటీ రిలీజ్‌పై అధికారికంగా ప్రకటన వచ్చేసింది. 'మిస్టర్ బచ్చన్' సాంగ్స్, ట్రైలర్ ప్రేక్షకులను ఆకట్టుకోవడంతో సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలు ఏర్పడ్డాయి. కానీ, రిలీజ్ తర్వాత మొదటి ఆట నుంచే మిక్స్డ్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ వద్ద ఈ మూవీ భారీ డిజాస్టర్‌గా నిలిచింది.పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ చిత్రంలో రవితేజకు జోడిగా భాగ్యశ్రీ బోర్సే జోడీగా కనిపించారు. సినిమా డిజాస్టర్ టాక్ వచ్చినా పాటలు బాగుండటంతో ఓటీటీలో చూద్దాంలే అనుకున్నవారే ఎక్కువగా ఉన్నారు. తాజాగా నెట్‌ఫ్లిక్స్ 'మిస్టర్ బచ్చన్' ఓటీటీలోకి తీసుకొస్తున్నట్లు ప్రకటించింది. సెప్టెంబర్ 12 నుంచి స్ట్రీమింగ్ అవుతుందని ఒక పోస్టర్‌ను పంచుకుంది. తెలుగు, తమిళ, మలయాళం, కన్నడ భాషల్లో రిలీజ్ కానుంది.కథేంటంటే..మిస్టర్ బచ్చన్ (రవితేజ) ఓ నిజాయితీపరుడైన ఇన్ కమ్ ట్యాక్స్ ఆఫీసర్. ఓ వ్యాపారవేత్తపై రైడ్ చేసి బ్లాక్ మనీ అంతా బయటకు తీస్తాడు. అయితే ఆ వ్యాపారీకి ఉన్న పలుకుబడితో బచ్చన్‌ని సస్పెండ్ చేయిస్తాడు. దీంతో బచ్చన్ తన సొంతూరు కోటిపల్లికి వచ్చి..స్నేహితులతో కలిసి ఆర్కెస్ట్రా రన్ చేస్తుంటాడు. ఈ క్రమంలో మార్వాడి అమ్మాయి జిక్కీ(భాగ్యశ్రీ బోర్సే)తో తొలి చూపులోనే ప్రేమలో పడతాడు. వీరి ప్రేమ విషయం ఇంట్లో తెలిసిన రోజే తనపై సస్పెన్షన్‌ను ఎత్తివేసిన విషయం తెలుస్తుంది. తిరిగి ఉద్యోగంలో చేరి..తన తొలి రైడ్‌ను ఎంపీ ముత్యం జగ్గయ్య(జగపతి బాబు)పై చేస్తాడు. తన అవినీతి పనులను బయటకు తీసేందుకు వచ్చిన ప్రభుత్వ అధికారుల్ని దారుణంగా హత్య చేసే జగ్గయ్య ఇంట్లో బచ్చన్ ఎలా రైడ్ చేశాడు? తన నల్లధనాన్ని కాపాడుకునేందుకు జగ్గయ్య ఏం చేశాడు? రాజకీయ నాయకుల నుంచి బచ్చన్‌కు ఎలాంటి ఒత్తిడి వచ్చింది? చివరకు జగ్గయ్య నల్లదనాన్ని బచ్చన్ ఎలా బటయకు తీశాడు? అనేదే మిగతా కథ. -
ఆస్పత్రి నుంచి హీరో రవితేజ డిశ్చార్జ్.. ట్వీట్ వైరల్
తెలుగు స్టార్ హీరో రవితేజ.. ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యాడు. ఈ విషయమై ట్విటర్లో పోస్ట్ పెట్టాడు. సర్జరీ సాఫీగా సాగిందని, విజయవంతంగా పూర్తయిందని.. దీంతో డిశ్చార్జ్ అయినట్లు పేర్కొన్నాడు. అందరి ఆశీర్వాదాలు, మద్ధతుకి కృతజ్ఞతలు చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: 'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?)రీసెంట్గా 'మిస్టర్ బచ్చన్' సినిమాతో వచ్చిన రవితేజ.. ప్రస్తుతం భాను భోగవరపు అనే కొత్త దర్శకుడు తీస్తున్న ఓ సినిమాలో నటిస్తున్నాడు. శ్రీలీల హీరోయిన్. షూటింగ్లో భాగంగా రవితేజ గాయపడగా.. హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. శస్త్ర చికిత్స చేశారు. అయితే రవితేజ గాయపడిన ఫొటో ఇదేనంటూ ఓ ఫేక్ పిక్‌ని తెగ వైరల్ చేశారు. ఇప్పుడు డిశ్చార్జ్ కావడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.(ఇదీ చదవండి: ప్రభాస్-అర్షద్ వివాదం.. సెటిల్ చేస్తున్న నాగ్ అశ్విన్) -
'మిస్టర్ బచ్చన్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్సయిందా?
రవితేజ హీరోగా నటించిన లేటెస్ట్ సినిమా 'మిస్టర్ బచ్చన్'. అప్పుడెప్పుడో 2018లో హిందీలో వచ్చిన 'రైడ్' అనే చిత్రాన్ని స్ఫూర్తిగా తీసుకుని దీన్ని తీశారు. కాకపోతే కమర్షియల్ హంగులు అని చెప్పి అసలు కథని సైడ్ చేయడంతో మూవీ ఫెయిలైంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైతే తొలిరోజే నుంచి ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది.(ఇదీ చదవండి: హీరోయిన్ ప్రణీత బేబీ షవర్ సెలబ్రేషన్స్.. ఫొటోలు వైరల్)రిలీజ్‌కి ముందు దర్శకుడు హరీశ్ శంకర్ హైప్ పెంచేలా కామెంట్స్ చేశాడు. దీంతో సినిమాపై ఓ మాదిరి అంచనాలు ఏర్పడ్డాయి. కానీ థియేటర్లలోకి వచ్చిన తర్వాత ఘోరమైన రిజల్ట్ కనిపించింది. హీరోయిన్ తప్పితే చూడటానికి సరైన కంటెంట్ లేదని ప్రేక్షకుల నుంచి విమర్శలు వచ్చాయి. అలానే సినిమాకు భారీ నష్టాలు తప్పవని ట్రేడ్ పండితుల అంచనా. ఈ క్రమంలోనే అనుకున్న టైమ్ కంటే ముందే ఓటీటీలోకి రాబోతుందని తెలుస్తోంది.'మిస్టర్ బచ్చన్' డిజిటల్ హక్కుల్ని నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. సినిమా ఫలితం పాజిటివ్‌గా వచ్చుంటే కాస్త లేటుగా ఆరు వారాల్లో స్ట్రీమింగ్కి వచ్చి ఉండేదేమో? కానీ రిజల్ట్ తేడా కొట్టేయడంతో థియేటర్లలో రిలీజైన నెలలోనే ఓటీటీలోకి తీసుకొచ్చేయబోతున్నారని తెలుస్తోంది. అంటే వినాయక చవితికి సెప్టెంబరు 6 లేదా 7న లేదంటే ఆ తర్వాత వారంలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. (ఇదీ చదవండి: షూటింగ్ లో గాయపడ్డ రవితేజ.. ఆరు వారాలు విశ్రాంతి) -
ఆరు వారాలు విశ్రాంతి
స్క్రీన్‌పై జోష్‌గా కనిపించే రవితేజ సినిమాలు చేయడంలోనూ అంతే జోష్‌గా ఉంటారు. ఏడాదికి మూడు నాలుగు సినిమాలు చేస్తూ బిజీగా ఉంటుంటారు. కాగా ఈ బిజీ షెడ్యూల్‌కి ఆరు వారాలు బ్రేక్ పడింది. కొన్నాళ్లుగా రవితేజ తన 75వ చిత్రం షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం ఈ మధ్య యాక్షన్ సీన్ చేస్తుండగా రవితేజ కుడి చేతికి గాయం అయింది. కండరం చిట్లినా లెక్క చేయకుండా షూటింగ్ చేస్తుండటంతో గాయం పెద్దదైందట.చివరికి శస్త్ర చికిత్స వరకు దారి తీసింది. హైదరాబాద్‌కి చెందిన ఓ ఆస్పత్రిలో గురువారం ఆయనకు సర్జరీ జరిగింది. సర్జరీ విజయవంతంగా జరిగిందని, ఈ గాయం తగ్గడానికి ఆరు వారాలు పడుతుందని, పూర్తిగా విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని పీఆర్ టీమ్ పేర్కొంది. దాంతో రవితేజ 75వ చిత్రం షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ పడింది. భాను భోగవరపు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో రవితేజ సరసన శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్నారు. -
హీరో రవితేజకు సర్జరీ.. షూటింగ్లో గాయం
మాస్ మహారాజ రవితేజకు సర్జరీ జరిగింది. ఇటీవల తన 75వ సినిమా చిత్రీకరణ సమయంలో అతడు స్వల్పంగా గాయపడ్డాడు. కుడిచేతికి గాయమైనప్పటికీ లెక్క చేయకుండా షూట్ కొనసాగించాడు. దురదృష్టవశాత్తూ నొప్పి తీవ్రతరం కావడంతో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరాడు. అతడిని పరీక్షించిన వైద్యులు శస్త్ర చికిత్స చేయాలని సూచించారు. అనంతరం విజయవంతంగా సర్జరీ పూర్తి చేశారు. హీరోను ఆరువారాలపాటు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.సినిమాల విషయానికి వస్తే.. రవితేజ ఇటీవలే మిస్టర్ బచ్చన్ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టలేకపోయింది. ప్రస్తుతం ఈ మాస్ హీరో తన 75వ సినిమాపై ఫోకస్ పెట్టాడు. ‘సామజవరగమన’ వంటి హిట్ సినిమాకు ఓ రచయితగా చేసిన భాను బోగవరపు ఈ చిత్రంతో దర్శకుడిగా పరిచయం కానున్నారు. శ్రీలీల హీరోయిన్గా నటిస్తున్న ఈ మూవీని సూర్యదేవర నాగవంశి, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. దీనికి కోహినూర్ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారు.చదవండి: టారోట్ మూవీ.. ధైర్యవంతులు మాత్రమే చూడండి! -
పొరబడ్డారు.. తను నా భార్య కాదు: హరీశ్ శంకర్
రీసెంట్గా రిలీజైన 'మిస్టర్ బచ్చన్' సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చింది. మరీ ముఖ్యంగా విడుదలకు ముందు దర్శకుడు హరీశ్ శంకర్ మాట్లాడిన దానికి.. మూవీ వచ్చిన తర్వాత అసలు పొంతనే లేదు. దీంతో ట్రోలర్స్ రెచ్చిపోయారు. సినిమాలో కంటెంట్ పట్ల విమర్శలు చేస్తున్నారు. మరోవైపు హరీశ్ శంకర్ భార్య ఈమెనే అని ఓ నటి ఫొటో వైరల్ అవుతోంది. తాజాగా ఈ విషయమై హరీశ్ శంకర్ క్లారిటీ ఇచ్చేశారు.(ఇదీ చదవండి: అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిన హీరో మోహన్ లాల్!)చాన్నాళ్ల నుంచి ఇండస్ట్రీలో ఉన్న హరీశ్ శంకర్.. 'గబ్బర్ సింగ్' సినిమాతో బోలెడంత పేరు తెచ్చుకున్నారు. కాకపోతే దాన్ని కొనసాగించే క్రమంలో తప్పటడుగులు వేస్తున్నారు. అలాంటి తప్పిదమే తాజాగా రిలీజైన 'మిస్టర్ బచ్చన్'. సరే దీని గురించి వదిలేస్తే గతంలో ఇదే రవితేజతో 'మిరపకాయ్' అనే మూవీ చేశారు. ఇందులో హీరోయిన్ రిచా గంగోపాధ్యాయ పక్కన ఓ అమ్మాయి నటించింది. అయితే ఈమెనే హరీశ్ శంకర్ భార్యని సోషల్ మీడియాలో కొన్ని పోస్టులు కనిపించాయి.తాజాగా ఇదే విషయమై ఓ ఇంటర్వ్యూలో హరీశ్ శంకర్‌ని అడగ్గా.. తన భార్య పేరు, ఆ అమ్మాయి పేరు స్నిగ్ద అని అందుకే చాలామంది పొరబడుతున్నారని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఆ అమ్మాయి అమెరికాలో జాబ్ చేసుకుంటోందని అన్నాడు. దీంతో ఓ క్లారిటీ వచ్చేసినట్లయింది. ఇదిలా ఉండగా హరీశ్ శంకర్.. రామ్‌తో తన తర్వాత సినిమా చేయబోతున్నాడు. బచ్చన్ మూవీ ప్రమోషన్స్‌లో ఈ విషయాన్ని బయటపెట్టాడు.(ఇదీ చదవండి: చిరంజీవి సినిమాని శ్రీలీల రిజెక్ట్ చేసిందా?) -
హీరో లను మించిపోయిన హీరోయిన్స్
-
పొరపాటు తెలుసుకున్న 'మిస్టర్ బచ్చన్'.. నిడివి తగ్గించి
ఆగస్టు 15. థియేటర్లలోకి తెలుగు స్ట్రెయిట్ మూవీస్ మూడు వచ్చాయి. వీటిలో రవితేజ 'మిస్టర్ బచ్చన్', రామ్ 'డబుల్ ఇస్మార్ట్' సినిమాలతో పాటు 'ఆయ్' అనే మరో చిన్న మూవీ కూడా రిలీజైంది. కాన్ఫిడెన్స్‌తో ముందు రోజే అంటే ఆగస్టు 14నే బచ్చన్ ప్రీమియర్స్ వేశారు. అయితే అప్పడే డివైడ్ టాక్ వచ్చింది. మూవీలో సీన్లపై ఘోరంగా ట్రోలింగ్ సాగుతోంది. ఇప్పుడు మూవీ టీమ్ జాగ్రత్త పడింది.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మలయాళ సస్పెన్స్ థ్రిల్లర్.. తెలుగులో స్ట్రీమింగ్)సోషల్ మీడియాలో వస్తున్న క్రిటిసిజం, ఫీడ్ బ్యాక్ ఆధారంగా దాదాపు 13 నిమిషాల నిడివి తగ్గించినట్లు స్వయంగా మూవీ టీమ్ పోస్టర్ రిలీజ్ చేసింది. అయితే ఇదేదో ముందే చేసుంటే టాక్ పాజిటివ్‌గా వచ్చి ఉండేదేమో? ఏదైతేనేం తప్పు ఎక్కడ జరిగిందో వెంటనే తెలుసుకున్న బచ్చన్ టీమ్.. నిడివిలో మార్పు చేయడం మంచిదే.లాంగ్ వీకెండ్ ఉన్న నేపథ్యంలో ఇలా నిడివి తగ్గించడం మరి 'మిస్టర్ బచ్చన్' కలిసొస్తుందేమో చూడాలి? ఇప్పటికే 'ఆయ్'తో పాటు డబ్బింగ్ బొమ్మ 'తంగలాన్'కి పాజిటివ్ టాక్ వచ్చింది. అలానే హిందీ మూవీ 'స్త్రీ 2' కూడా తెలుగు రాష్ట్రాల్లో మంచి నంబర్స్ నమోదు చేస్తోంది. ఇలా వీటిని తట్టుకుని బచ్చన్ మూవీ ఏ మేరకు నిలబడుతుందో చూడాలి?(ఇదీ చదవండి: జాతీయ ఉత్తమ చిత్రంగా 'ఆట్టమ్'.. ఏంటి దీని స్పెషాలిటీ?) -
మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్, తంగలాన్.. ఫస్ట్ డే కలెక్షన్స్
స్వాతంత్ర్య దినోత్సవ సందర్భంగా టాలీవుడ్లో సినిమాల జాతర జరిగింది. ముఖ్యంగా మిస్టర్ బచ్చన్, డబుల్ ఇస్మార్ట్ చిత్రాల మధ్యే బిగ్ ఫైట్ నడిచింది. భారీ అంచనాలతో విడుదలైన ఈ రెండు సినిమాలకు కూడా మిక్సిడ్ టాక్ వచ్చింది. ఏమాత్రం ప్రేక్షకులను మెప్పించేలా లేవని నెటిజన్ల నుంచి విమర్శలు అందుకున్నాయి. కోలీవుడ్ సినిమా 'తంగలాన్' కాస్త బాగుంది అంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరిగింది. విక్రమ్ నటన కోసం అయినా సినిమా చూడాలంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.మిస్టర్ బచ్చన్ కలెక్షన్స్రవితేజ- హరీశ్ శంకర్ సినిమా మిస్టర్ బచ్చన్ బాక్సాఫీస్ వద్ద రూ.7.5 కోట్ల వసూళ్లు వచ్చినట్లు సమాచారం. ఈ కలెక్షన్లు అడ్వాన్స్ ప్రీమియర్ షోలతో కలిపి అని ట్రేడ్ వర్గాలు తెలుపుతున్నాయి. మొదటిరోజు సుమారు రూ. 10 కోట్లకు పైగానే కలెక్షన్స్ రాబడుతుందని అందరూ అంచనా వేశారు. కానీ మిస్టర్ బచ్చన్ ఆ మార్క్ అందుకోలేకపోయిందని తెలుస్తోంది. దాదాపు రూ. 35 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన మిస్టర్ బచ్చన్ ఆ టార్గెట్ రీచ్ అవుతాడా..? అనే సందేహాలు వస్తున్నాయి. సినిమా పట్ల దారుణమైన నెగటివ్ టాక్ రావడంతో బయర్స్‌కు నష్టాలు తప్పవని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. పనోరమా స్టూడియోస్– టీ సిరీస్ సమర్పణలో టీజీ విశ్వ ప్రసాద్ ఈ చిత్రాన్ని నిర్మించారు.డబుల్ ఇస్మార్ట్ కలెక్షన్స్యంగ్ హీరో రామ్ నటించిన ఇస్మార్ట్ శంకర్ మూవీకి సీక్వెల్‌గా డబుల్ ఇస్మార్ట్ చిత్రాన్ని డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కించాడు. దాదాపు రూ. 60 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో విడుదలైన ఈ సినిమా కూడా అనుకున్నంత స్థాయిలో కలెక్షన్లు రాబట్టలేదు. ఈ క్రమంలో మొదటిరోజు రూ. 12. 45 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే, ట్రేడ్ వర్గాలు మాత్రం రూ. 10.40 కోట్లు మాత్రమే కలెక్షన్లు వచ్చినట్లు పేర్కొన్నాయి. మొత్తానికి కలెక్షన్ల పరంగా మిస్టర్ బచ్చన్ కంటే ఇస్మార్ట్ శంకర్ కాస్త బెటర్ అని చెప్పవచ్చు. ఈ చిత్రాన్ని పూరీ జగన్నాథ్, చార్మీ కౌర్ నిర్మించారు.తంగలాన్ కలెక్షన్స్ప్రయోగాత్మక పాత్రలతో మెప్పించే విక్రమ్ తాజాగా తంగలాన్ సినిమాతో ప్రేక్షకులను అలరించాడు. పా. రంజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద మొదటిరోజు రూ. 19.50 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. 1850ల్లో ఆంగ్లేయుల పాలనా కాలంలో జరిగే కథాంశంతో తెరకెక్కిన తంగలాన్ ఈ పోటీలో విజయం సాధించింది. సినిమా పట్ల పాజిటివ్ టాక్ రావడంతో కలెక్షన్లు మరింతగా పెరిగే అవకాశం ఉంది. అన్ని వర్గాల సినీప్రియులకు తంగలాన్ థ్రిల్ చేస్తాడు. చెన్నైలో మొత్తం 592 స్క్రీన్లలో తంగలాన్ ప్రదర్శించారు. 81 శాతం టికెట్లు అమ్ముడుపోయాయి. తంగలాన్ తెలుగు వర్షన్ రూ. 2 కోట్ల వరకు రాబట్టింది. -
రవితేజ-భాగ్యశ్రీ కాంట్రవర్సీ స్టెప్.. స్పందించిన హరీశ్ శంకర్
రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం ‘మిస్టర్ బచ్చన్’. హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఆగస్ట్ 15న విడుదలై మిక్స్డ్ టాక్ని సంపాదించుకుంది. కథ-కథనం బాలేకపోయినా.. సంగీతం మాత్రం అదిరిపోయిందని అంతా అంటున్నారు. పాటల విషయంలో హరీశ్ మరోసారి తన మార్క్ చూపించారని కొనియాడుతున్నారు. మిక్కీ జే మేయర్ మ్యూజిక్కే సినిమాకు ప్లస్ పాయింట్ అని పలు వెబ్సైట్లు తమ రివ్యూల్లో పేర్కొన్నాయి. అయితే ‘సితార్’ పాటలో రవితేజ-భాగ్యశ్రీ బోర్సే వేసిన ఓ స్టెప్పు మాత్రం కాంట్రవర్సీకీ దారి తీసింది. (చదవండి: మిస్టర్ బచ్చన్ రివ్యూ)కొంతమంది నెటిజన్స్ ఆ స్టెప్పు తాలుకు ఫోటోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ హరీశ్ శంకర్‌ని ట్రోల్ చేస్తున్నారు. చర్చనీయాంశమైన ఆ స్టెప్పు గురించి తాజాగా హరీశ్ శంకర్ స్పందించాడు. పాటలకు హీరోహీరోయిన్లు చేసే డ్యాన్స్‌ని ఫ్లోలో చూస్తే బాగుంటుందని.. స్క్రీన్ షాట్ తీస్తే ఇబ్బందిగానే కనిపిస్తుందని అని అన్నాడు.‘వాస్తవానికి ఆ పాటకు ఆ స్టెప్ అవసరం లేదని నాక్కుడా అనిపించింది. అయితే షూటింగ్ మొదటి రోజే ఆ పాటను షూట్ చేశాం. శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ చేశాడు. ఆయన చాలా పెద్ద కొరియోగ్రాఫర్. ఆయన కంపోజ్ చేసిన మూమెంట్‌ని మొదటి రోజే నేను వద్దు అంటే బాగోదేమో అని ఆగిపోయాను. షూటింగ్ బిజీలో పడి అది పట్టించుకోలేదు. సెన్సార్‌లో కూడాఫ్లోలో చూశారు కాబట్టి ఓకే అయింది. ఎప్పుడైనా పాటల్లో డ్యాన్స్‌ని ఫ్లోలో చూడాలి. అలా కాకుండా స్క్రీన్ షాట్ తీసి చూస్తే చాలా వరకు ఇబ్బందిగానే ఉండే అవకాశం ఉంది’ అని హరీశ్ చెప్పుకొచ్చాడు.