రవితేజ 'మిస్టర్ బచ్చన్‌'.. సూపర్‌ సాంగ్‌ రిలీజ్ ఎప్పుడంటే? | Tollywood Hero Mass Maharaja MrBachchan Song Release on this Date | Sakshi
Sakshi News home page

MrBachchan: 'నల్లంచు తెల్లచీర' అంటోన్న మిస్టర్ బచ్చన్‌.. సాంగ్‌ రిలీజ్‌ ఎప్పుడంటే?

Published Sun, Aug 11 2024 4:24 PM | Last Updated on Sun, Aug 11 2024 4:59 PM

Tollywood Hero Mass Maharaja MrBachchan Song Release on this Date

మాస్ మహారాజా రవితేజ హీరోగా నటించిన తాజా చిత్రం మిస్టర్ బచ్చన్. ఈ సినిమాకు హరీశ్ శంకర్ దర్శకత్వం వహించారు. బాలీవుడ్ భామ భాగ్యశ్రీ బోర్సే రవితేజ సరసన హీరోయిన్‌గా కనిపించనుంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఇండిపెండెన్స్‌ డే సందర్భంగా థియేటర్లలో సందడి చేసేందుకు సిద్ధమైంది.

తాజాగా ఈ సినిమాకు సంబంధించి రిలీజ్‌కు ముందు మరో అప్‌డేట్‌ ఇచ్చారు మేకర్స్. నల్లంచు తెల్లచీర అనే లిరికల్ సాంగ్‌ను ఈనెల 12న విడుదల చేస్తున్నట్లు వెల్లడించారు. ఈ విషయాన్ని హీరో రవితేజ ట్విటర్ ద్వారా షేర్ చేశారు. హీరోయిన్‌తో సరదాగా నడుచుకుంటూ వెళ్తున్న ప్రోమోను అభిమానులను తెగ ఆకట్టుకుంటోంది.

కాగా.. ఈ మూవీ నుంచి ఇప్పటికే రిలీజైన ట్రైలర్‌, పాటలకు ఆడియన్స్‌ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తోంది. సితార్‌ సాంగ్‌ యూట్యూబ్‌లో అత్యధిక వ్యూస్‌ను సొంతం చేసుకుంది. ఈనెల 15న మిస్టర్ బచ్చన్‌ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కానుంది. కాగా.. ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను కర్నూలులో గ్రాండ్‌గా నిర్వహించనున్నారు. 

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement