ఇచ్చినమాట నిలబెట్టుకున్న రవితేజ | Ravi Teja Movie Offered To Amardeep | Sakshi
Sakshi News home page

ఇచ్చినమాట నిలబెట్టుకున్న రవితేజ

Published Sat, May 11 2024 9:44 AM | Last Updated on Sat, May 11 2024 12:26 PM

Ravi Teja Movie Offered To Amardeep

బిగ్ బాస్ 7 తెలుగు సీజన్‌తో   అమర్ దీప్ చౌదరి మరింత పాపులర్‌ అయ్యాడు. బిగ్‌ బాస్‌లో అమర్‌ ఆటతీరు పట్ల కొందరు నెటిజన్లు తప్పుపట్టినా.. అతనిలోని ఎమోషనల్‌ కోణం చాలామందికి నచ్చింది. అందుకే బిగ్‌ బాస్‌ ఫైనల్‌ వరకు చేరుకుని రన్నర్‌గా నిలిచాడు. టాలీవుడ్‌ మాస్‌మహారాజా రవితేజ అంటే అమర్‌కు చాలా ఇష్టం. ఇదే విషయాన్ని చాలా సమయాల్లో ఆయన చెప్పిన విషయం తెలిసిందే. అమర్‌ చూపిన అభిమానానికి ఫిదా అయిన రవితేజ కూడా ఒక ఆఫర్‌ ప్రకటించాడు. తన నటించబోయే సినిమాలో ఒక మంచి పాత్ర ఇస్తున్నట్లు బిగ్‌ బాస్‌ వేదికగా ప్రకటించాడు.

తాజాగా రవితేజను అమర్‌ దీప్‌ కలుసుకున్నాడు. అందుకు సంబంధించిన ఫోటోను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేశాడు. నా డ్రీమ్‌ నిజం అయిందంటూ అమర్‌ చెప్పుకొచ్చాడు. రవితేజతో కలిసి నటించే ఛాన్స్‌ వచ్చినట్లు తెలిపాడు. దీంతో అభిమానులు కూడా అభినందిస్తూ కామెంట్లు చేస్తున్నారు. ఇచ్చిన మాటను రవితేజ నిలిబెట్టుకున్నారని ఫ్యాన్స్‌ గుర్తుచేస్తున్నారు. 

బిగ్‌ బాస్‌ టైటిల్‌ రేసు నుంచి తప్పుకుంటే  రవితేజ సినిమాలో ఛాన్స్‌ ఇప్పిస్తానని హోస్ట్‌ నాగార్జున చెప్పగానే అమర్‌ కూడా అందుకు రెడీ అంటూ.. బయటకు వచ్చేందుకు ప్రయత్నిస్తాడు. దానిని గమనించిన రవితేజ సినిమాలో ఛాన్స్‌ ఇస్తున్నట్లు అదే స్టేజీ మీద మాట ఇస్తాడు. 105 రోజులు కష్టపడ్డావ్‌ ఆట పూర్తి అయ్యే వరకు ఉండమని రవితేజ కోరుతాడు. దీంతో ఫుల్‌ ఖుషి అయిన అమర్‌కు ఎట్టకేలకు తన అభిమాన హీరోతో కలిసి నటించే ఛాన్స్‌ దక్కింది.

రవితేజ ఒకవైపు మిస్ట‌ర్ బ‌చ్చ‌న్ సినిమా చేస్తూనే మరోవైపు తన బెంచ్ మార్క్ ప్రాజెక్ట్‌ను కూడా లాంచ్ చేశాడు. రవితేజ 75వ సినిమాని  ‘సామజవరగమన’ రచయిత భాను బొగ‌వరపు దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈ సినిమా తెరకెక్కుతుంది. రవన్న దావత్ ఇస్తుండు రెడీ అయిపోండ్రి అంటూ  ‘RT75’ పేరుతో ఒక పోస్ట‌ర్ కూడా విడుదలైంది. అమర్‌ ఈ రెండు చిత్రాలలో దేనిలో నటిస్తున్నాడు అనేది క్లారిటీ ఇవ్వలేదు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement