రవితేజ సమర్పణలో విష్ణు విశాల్‌ మరో సినిమా.. | Ravi Teja Presenting Vishnu Vishal Movie Titled Matti Kusthi | Sakshi
Sakshi News home page

Vishnu Vishal Movie: రవితేజ సమర్పణలో విష్ణు విశాల్‌ మరో సినిమా..

Published Wed, Apr 6 2022 9:24 PM | Last Updated on Wed, Apr 6 2022 9:31 PM

Ravi Teja Presenting Vishnu Vishal Movie Titled Matti Kusthi - Sakshi

Ravi Teja Presenting Vishnu Vishal Movie Titled Matti Kusthi: కోలీవుడ్‌ యంగ్‌ హీరో విష్ణు విశాల్‌ కథానాయకుడిగా మను ఆనంద్‌ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్‌ఐఆర్‌'. విష్ణు విశాల్‌ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఫిబ్రవరి 11న విడుదలై మంచి పాజిటివ్‌ టాక్‌ సంపాందించుకుంది. మాస్‌ మహారాజ రవితేజ సమర్పణలో అభిషేక్‌ నామా ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. అనేక వివాదాల నడుమ రిలీజైన ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా రవితేజ సమర్పణలో విష్ణు విశాల్‌ మరో సినిమా రానుంది. రవితేజ సమర్పణలో విష్ణు విశాల్‌ 'మట్టి కుస్తీ' అంటూ క్రీడా నేపథ్యంలో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. 

చదవండి: రవితేజ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు: విష్ణు విశాల్‌

ఆర్‌టీ టీమ్ వర్క్స్‌, విష్ణు విశాల్‌ స్టూడియోస్‌ బ్యానర్‌లపై డైరెక్టర్‌ చెల్లా అయ్యావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌ను చిత్రబృందం మంగళవారం (ఏప్రిల్ 5) ప్రకటిస్తూ 'మట్టి కుస్తీ' మోషన్‌ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే కుస్తీ ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విష్ణు విశాల్‌కు జోడిగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్‌గా నటించనుంది. జస్టిన్‌ ప్రభాకరన్‌ సంగీతం అందించగా.. 'మట్టి కుస్తీ' రెగ్యూలర్‌ షూటింగ్‌ బుధవారం (ఏప్రిల్‌ 6) నుంచి ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్‌ ప్రకటించింది. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement