Vishnu Vishal
-
హిట్ సినిమాకు సీక్వెల్.. ఈసారి ఏకంగా ఫాంటసీ కథతో!
విష్ణు విశాల్, దర్శకుడు రామ్ కుమార్ కాంబోలో వచ్చిన హిట్ సినిమా 'రాక్షసన్'. 2018లో ప్రేక్షకుల ముందుకొచ్చి సంచలన విజయాన్ని సాధించింది. తెలుగులోనూ 'రాక్షసుడు' పేరుతో రీమేక్ అయి, హిట్ సొంతం చేసుకున్నారు. ఇప్పుడు దీనికి సీక్వెల్ రెడీ చేస్తున్నారట.(ఇదీ చదవండి: Society Of The Snow Review: కన్నీళ్లు ఆపుకునే శక్తి ఉంటే ఈ సినిమా చూడండి)'రాక్షసన్' సినిమా సస్పెన్స్ థ్రిల్లర్ స్టోరీతో తీయగా.. ఇప్పుడు దీని సీక్వెల్‌ని ఫాంటసీ జానర్లో తీస్తారట. ఇప్పటికే షూటింగ్ మొదలైంది. ఇతర వివరాలు తెలియాల్సి ఉంది. విష్ణు విశాల్ రీసెంట్గా ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన 'లాల్ సలామ్'తో వచ్చాడు. కానీ ఇది ఘోరమైన డిజాస్టర్‌గా నిలిచింది. దీంతో ఇతడికి 'రాక్షసన్ 2' హిట్ కావడం చాలా కీలకం. మరి ఏం చేస్తారో చూడాలి?(ఇదీ చదవండి: నా భర్తతో హోటల్ రూమ్‌లో ఆ హీరోయిన్.. అందుకే విడాకులు: శ్రీదేవి) -
నాలుగేళ్ల గొడవ క్లియర్.. హీరో-కమెడియన్ కలిసిపోయారు!
ఆ ఇద్దరూ సినిమా ఇండస్ట్రీకి చెందినవాళ్లే, కలిసి 7 సినిమాలు చేశారు. ఆ తరువాత ఓ విషయంలో ఒకరిని ఒకరు తీవ్రంగా విమర్శించుకున్నారు. కేసులు పెట్టుకున్నారు. అలాంటిది తాజాగా ఒకే ఫొటోలో నవ్వుతూ కనిపించారు. పైన చెప్పిన నటులెవరో కాదు. తమిళ ఇండస్ట్రీకి చెందిన విష్ణువిశాల్, హాస్య నటుడు సూరి. (ఇదీ చదవండి: సమంత, శ్రుతి హాసన్.. ఇద్దరూ ఆ ప్రాజెక్ట్ నుంచి ఔట్!) విష్ణువిశాల్ హీరోగా, సూరి హాస్య నటుడిగా గుర్తింపు తెచ్చుకున్నారు. కలిసి 7 సినిమాలు చేశారు. కానీ ఓ స్థలం విషయంలో ఇద్దరి మధ్య వివాదం చోటుచేసుకుంది. విష్ణువిశాల్, అతడి తండ్రి తనను మోసం చేశారని 2020లో నటుడు సూరి తీవ్ర ఆరోపణలు చేయడంతో పాటు పోలీస్‌స్టేషన్‌లో కేసు పెట్టాడు. ఈ వివాదం చాలాకాలం కొనసాగింది. నటుడు విష్ణువిశాల్ తండ్రి రమేష్.. మాజీ డీజీపీ. ఇటీవల లాల్ సలామ్ చిత్ర ప్రచార వేదికపై కూడా తమ మధ్య నెలకొన్న సమస్య గురించి తానూ, నటుడు సూరి చర్చించుకుంటున్నామని విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాంటిది ఇప్పుడు సడన్‌గా నటుడు విష్ణువిశాల్ ఆయన తండ్రి రమేష్, సూరితో కలిసి ఉన్న ఫొటోను తన ఎక్స్మీడియాలో పోస్ట్ చేశారు. అందులో టైమ్ అన్నింటికీ, అందరికీ బదులిస్తుంది. ఐలవ్ యూ నాన్న హీరో విష్ణు విశాల్ పేర్కొన్నారు. అలాగే నటుడు సూరి కూడా జరిగేవన్నీ మంచికే అని తన ఎక్స్ మీడియాలో పేర్కొన్నారు. దీంతో వీరి మధ్య సమస్య పరిష్కారం అయ్యిందని అందరూ అనుకుంటున్నారు. (ఇదీ చదవండి: స్టెప్పులతో అదరగొట్టిన రాజమౌళి.. వీడియో వైరల్!) TIME is the answer to everything and everyone.. Let the positivity flow @sooriofficial na.. Love u appa ..... pic.twitter.com/Yvn28SR31B — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) April 9, 2024 -
మరో ఆఫర్ అందుకున్న మలయాళ సెన్సేషన్
కోలీవుడ్‌లో కథానాయకుడిగా, నిర్మాతగా తనకుంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంసాదించుకున్నాడు హీరో విష్ణువిశాల్. ఈయన ఇంతకు ముందు కథానాయకుడిగా నటించిన రాక్షసన్ చిత్రం సంచలన విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఆ చిత్ర దర్శకుడు రామ్‌కుమార్.. విష్ణువిశాల్‌తో మరో సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. ఇది విష్ణువిశాల్ నటిస్తున్న 21వ చిత్రం అవుతుంది. ఇటీవలే షూటింగ్ మొదలవగా.. హీరోయిన్ ఎవరన్నది వెల్లడించలేదు. అయితే సోషల్ మీడియాలో మాత్రం మలయాళ నటి మమితా బైజు నటించనున్నట్లు ఆమె ఫొటో వైరలవుతోంది. ఆల్రెడీ ఆమె షూటింగ్ సెట్స్‌లో అడుగుపెట్టిందని ప్రచారం జరుగుతోంది. ఈమె ఇటీవల వచ్చిన మలయాళ చిత్రం ప్రేమలుతో ఓవర్‌నైట్ స్టార్‌గా మారిపోయింది. ఇప్పటికే ఆమె కోలీవుడ్‌లో జీవీ.ప్రకాశ్‌కుమార్ సరసన రెబల్ చిత్రంలో నటించింది. ఈమె నటించిన తొలి తమిళ చిత్రం ఇదే. ఇది ఈ నెల 15వ తేదీన తెరపైకి రానుంది. తాజాగా ఇప్పుడు విష్ణువిశాల్ సరసన నటించే అవకాశం ఈ భామను వరించిందన్న మాట. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రాన్ని దర్శకుడు రామ్‌కుమార్.. రాక్షసన్ చిత్రానికి భిన్నంగా ప్రేమతో కూడిన ఫాంటసీ కథా చిత్రంగా తెరకెక్కిస్తున్నట్లు సమాచారం. చదవండి: ధనుష్ మా కుమారుడే అంటూ పిటిషన్.. తీర్పు ఇచ్చిన కోర్టు -
విష్ణువిశాల్ హీరోయిన్ ఎవరో తెలుసా..?
తమిళసినిమా: ఒక్కొక్కసారి కొన్ని చిత్రాల్లో ముందుగా అనుకున్న నటీనటులు ఆ తరువాత మారే అవకాశం ఉంటుంది. ఇప్పుడు నటుడు శింబు విషయం లోనూ ఇదే జరిగిందని సమాచారం. వెందు తనిందదు కాడు చిత్రం తరువాత వేల్స్ ఫిలిం ఇంటర్నేషనల్ పతాకంపై నిర్మాత ఐసరి గణేశ్ శింబు హీరోగా కరోనా కుమార్ పేరుతో చిత్రం చేయ తలపెట్టారు. దీనికి గోకుల్ దర్శకత్వం వహించనున్నట్లు ప్రకటించారు. అయితే కొన్ని కారణాల వల్ల నటుడు శింబు ఈ చిత్రం నుంచి వైదొలగినట్లు సమాచారం. దీంతో చాలాకాలంగా ఈ చిత్రం సెట్స్‌పైకి రాలేదు. కాగా తాజాగా కరోనా కుమార్ చిత్రం మరోసారి వార్తల్లోకెక్కింది. దీనికి కారణం ఇందులో నటుడు శింబు పోషించాల్సిన పాత్రకు నటుడు విష్ణువిశాల్ను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. రజనీకాంత్ అతిథి పాత్రలో నటించిన లాల్ సలామ్ చిత్రంలో ఇద్దరు హీరోల్లో ఒకరిగా నటించిన విష్ణువిశాల్ ప్రస్తుతం తను సొంతంగా నిర్మిస్తున్న చిత్రంలో నటించడానికి సిద్ధం అవుతున్నారు. కాగా తాజాగా కరోనా కుమార్ చిత్రానికి కమిట్ కావడం విశేషం. మరో విశేషం ఏమిటంటే ఇందులో ఆయనకు జంటగా నటి అదితి శంకర్ నటించబోతున్నట్లు సమాచారం. ఈమె ఇప్పుటికే చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉన్నారు. ప్రస్తుతం విష్ణువర్ధన్ దర్శకత్వంలో ఆకాశ్ మురళికి జంటగా నటిస్తున్నారు. దీని తరువాత సూర్య సరసన నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. సుధా కొంగర దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర షూటింగ్ ఇప్పటికే ప్రారంభం అయ్యింది. సూర్య లేని సన్నివేశాలను దర్శకురాలు చిత్రీకరిస్తున్నారు. కాగా ఇందులో నటి అదితి శంకర్ నాయకిగా నటిస్తున్న విషయాన్ని చిత్ర వర్గాలు ఇంకా అధికారికంగా ప్రకటించలేదు. అయితే కరోనా కుమార్ చిత్రంలో ఈమె నటించడానికి సిద్ధం అవుతున్నారు. ఈ చిత్ర షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభం కానుందని సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలో వెలువడే అవకాశం ఉందని భావిస్తున్నారు. -
కలెక్షన్సే లేని సినిమాకు సక్సెస్ పార్టీ.. ఇది మరీ విడ్డూరం!
సూపర్‌స్టార్ రజనీకాంత్ అతిథిగా పవర్ ఫుల్ పాత్రను పోషించిన చిత్రం లాల్ సలామ్. ఆయన పెద్ద కూతురు ఐశ్వర్య రజనీకాంత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించారు. నటి నిరోషా, జీవిత రాజశేఖర్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించగా, ఏఆర్ రెహమాన్ సంగీతాన్ని అందించారు. లైకా ప్రొడక్షన్స్ పతాకంపై సుభాస్కరన్ నిర్మించిన లాల్ సలామ్ చిత్రం భారీ అంచనాల మధ్య ఈ నెల 9వ తేదీన ప్రపంచ వ్యాప్తంగా తెరపైకి వచ్చింది. ప్రేక్షకుల నుంచి మిశ్రమ స్పందన తెచ్చుకున్న ఈ చిత్రం అంతంతమాత్రంగానే వసూళ్లు రాబడుతోంది. థియేటర్లలో రిలీజైన ఈ మూవీ వరుసగా మూడవ వారంలోకి అడుగు పెట్టడంతో చిత్ర యూనిట్ శుక్రవారం చైన్నెలో సక్సెస్ పార్టీని జరుపుకుంది. ఈ పార్టీలో రజనీకాంత్‌తో పాటు సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ పాల్గొనడం విశేషం. హీరోలు విష్ణు విశాల్, విక్రాంత్ ఇందులో పాల్గొనలేదు. కాగా లాల్ సలామ్ చిత్రం సక్సెస్ పార్టీ ఫొటోలను సామాజిక మాధ్యమాల్లో విడుదల చేయగా నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కలెక్షన్సే లేని సినిమాకు సక్సెస్ పార్టీయా? అని ముక్కున వేలేసుకుంటున్నారు. மக்களின் பேரன்பிற்கும், பேராதரவிற்கும் நன்றி!!! 🙏🏻😇 Successful 2 weeks of LAL SALAAM, into the 3rd week today! 📽️✨#LalSalaam 🫡 Running Successfully 💥📽️@rajinikanth @ash_rajinikanth @arrahman @TheVishnuVishal @vikranth_offl @Ananthika108 @LycaProductions #Subaskaran… pic.twitter.com/fcCdDYDmMu — Lyca Productions (@LycaProductions) February 23, 2024 చదవండి: నాన్న వల్లే నా జీవితం నాశనం అయింది: వనితా విజయ్ కుమార్ -
హీరోగా ఎంట్రీ ఇస్తున్న విష్ణు విశాల్ సోదరుడు
చిత్ర పరిశ్రమలో సినీ తారల పిల్లలు, తోబుట్టువులు ఇండస్ట్రీకి పరిచయం కావడం కొత్తేమీ కాదు. ఆ కోవలోనే కోలీవుడ్‌లో మంచి పేరు తెచ్చుకున్న హీరో విష్ణు విశాల్ తమ్ముడు రుద్ర కూడా వెండి తెరపై ఎంట్రీ ఇస్తున్నాడు. హీరో విష్ణు విశాల్ తమ్ముడు రుద్ర కథానాయకుడిగా పరిచయమవుతున్న చిత్రం 'ఓహో ఎన్‌దన్ బేబీ'. ఈ సినిమాకు దర్శకనటుడు కృష్ణకుమార్ రామ్‌కుమార్ దర్శకత్వం వహిస్తున్నారు. ఇందులో బాలీవుడ్ నటి మిథిలా పాల్కర్ కథనాయికగా నటిస్తోంది. కోలీవుడ్‌లో ఈమెకు ఇదే తొలి సినిమా కావడం విశేషం. ఎన్నై నోక్కి పాయుమ్ తోట్టా, ముల్ నీ ముడివుమ్ నీ వంటి చిత్రాలకు సంగీతాన్ని సమకూర్చిన తర్పుగ శివ ఓహో ఎన్‌దన్ బేబీ చిత్రానికి సంగీత దర్శకుడిగా బాధ్యతలు వహిస్తున్నారు. ఈ చిత్ర తొలి షెడ్యూల్ పూజా కార్యక్రమంతో ప్రారంభమైంది. మరో రెండు వారాలపాటు ఈ షెడ్యూల్ షూటింగ్ కొనసాగనుంది. తర్వాత గోవా, పాండిచ్చేరి వంటి వివిధ ప్రాంతాలలో మలి విడత షూటింగ్ జరపనున్నట్టు చిత్ర వర్గాలు వెల్లడించాయి. The big day is here for my brother @TheActorRudra ❤️ need all your blessings and support for us.. Thrilled to introduce him in #OhoEnthanBaby - shoot started today.. Producing it at @VVStudioz along with dear #RomeoPictures @mynameisraahul and @DCompanyOffl @DuraiKv.… pic.twitter.com/w9kZoVHgJB — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) February 11, 2024 - పోడూరి నాగ ఆంజనేయులు చదవండి: బండ్లగణేశ్‌కు బిగ్ షాక్.. ఆ కేసులో జైలు శిక్ష ఖరారు! -
సూపర్ స్టార్ సినిమాకు షాక్.. ఇంత దారుణంగా ఎప్పుడు చూడలేదు!
సూపర్ స్టార్ రజినీకాంత్ అతిథి పాత్రలో నటించిన తాజా చిత్రం లాల్ సలామ్. గతేడాది జైలర్ సినిమాతో హిట్ కొట్టిన తలైవా ఈ ఏడాది తన కూతురి దర్శకత్వంలో నటించారు. యంగ్ హీరో విష్ణు విశాల్, విక్రాంత్ ప్రధాన పాత్రల్లో ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ సినిమా అభిమానుల భారీ అంచనాల మధ్య శుక్రవారం విడుదలైంది. ఈ చిత్రంలో తలైనా మొహిద్దీన్ భాయ్ అనే కీలక పాత్రలో నటించారు. రజినీకాంత్ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులు సైతం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తారు. ఇక కోలీవుడ్‌లో అయితే చెప్పాల్సిన పనిలిదు. రజినీకాంత్ మూవీ అంటే బాక్సాఫీస్ రికార్డులు బద్దవ్వాల్సిందే. కానీ ఎవరు ఊహించని లాల్ సలామ్ చిత్రానికి బిగ్ షాక్ తగిలింది. కోలీవుడ్‌లో ఫర్వాదలేనిపించినా.. తెలుగు ఆడియన్స్ మాత్రం ఈ మూవీని అస్సలు పట్టించుకోలేదు. స్పోర్ట్స్ డ్రామాగా వచ్చిన ఈ సినిమా ఏకంగా మార్నింగ్ షోలు రద్దు చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. సూపర్ స్టార్ సినిమా తొలి రోజే చాలా చోట్ల మార్నింగ్ షోలు రద్దయ్యాయి. దీంతో హైదరాబాద్‌లో అయితే మల్టీప్లెక్స్‌ల్లో రజినీ సినిమా చూడాలనుకున్న తెలుగు ఆడియన్స్‌కు నిరాశే మిగిలింది. రెండు తెలుగు రాష్ట్రాల్లో చాలా చోట్ల టికెట్లు కొనేవాళ్లు లేక మార్నింగ్ షోలు రద్దు చేశారు. అయితే ఇప్పటికే కొంత మంది టికెట్స్ బుక్ చేసుకోగా.. థియేటర్ల యాజమాన్యాలు వాళ్లకు డబ్బులు రీఫండ్ చేయడం గమనార్హం. తలైవా నటించిన సినిమాకు ఫస్ట్ డే ఫస్ట్ షోలకే ఇలాంటి పరిస్థితి ఎదురుకావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. అయితే తెలుగులో పెద్దగా ప్రమోషన్స్ చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి వచ్చిందని కొందరు సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు టాలీవుడ్ బాక్సాఫీస్ బరిలో రవితేజ ఈగల్, జీవా, మమ్ముట్టి యాత్ర-2 సినిమాలు రిలీజ్ కావడం ఒక కారణమని తెలుస్తోంది. ఏది ఏమైనా రజినీకాంత్ ఉన్న ఇమేజ్ ప్రకారం కనీసం సగం థియేటర్లు అయినా నిండి ఉండాల్సింది. ఏకంగా స్టార్ హీరో సినిమాకు ఫస్ట్ షోలు రద్దు కావడంతో ఆడియన్స్ షాక్‌కు గురవుతున్నారు. మరి వీకెండ్లోనైనా లాల్ సలామ్‌ను ప్రేక్షకులు ఆదరిస్తారో లేదో వేచి చూడాల్సిందే. కాగా.. గతంలో రజనీకాంత్ సినిమాలను తెలుగు ఆడియన్స్ బాగానే ఆదరించారు. గతేడాది వచ్చిన జైలర్ మూవీ టాలీవుడ్లో మంచి వసూళ్లు రాబట్టింది. తెలుగులో అత్యధిక వసూళ్లు సాధించిన డబ్బింగ్ సినిమాల్లో మూడో స్థానంలో నిలిచింది. ఏకంగా రూ.47 కోట్లకు పైగా కలెక్షన్లు సాధించింది. -
ఓటీటీలో రికార్డు సృష్టించిన తమిళ మూవీ.. మరోసారి కాంబో రిపీట్
హీరో విష్ణువిశాల్ నటించిన హిట్ చిత్రాల్లో కట్టకుస్తీ ఒకటి. ఇది తెలుగులో మట్టి కుస్తీ పేరిట విడుదలైంది. 2022 డిసెంబర్లో విడుదలైన ఈ మూవీ మంచి విజయాన్ని సాధించింది. విష్ణు విశాల్ తన సొంత బ్యానర్లో నిర్మించిన ఈ చిత్రానికి సెల్లా ఆయువు దర్శకత్వం వహించారు. ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ చిత్రం విమర్శకుల ప్రశంసలు అందుకుంది. అంతేకాకుండా గత ఏడాది ఓటీటీ ప్లాట్‌ఫామ్ నెట్‌ఫ్లిక్స్‌లో అత్యధిక ప్రేక్షకులు వీక్షించిన తమిళ చిత్రాలలో మూడవ స్థానంలో నిలిచింది. విష్ణు విశాల్, దర్శకుడు సెల్లా ఆయువు తాజాగా మరో చిత్రానికి కలిసి పనిచేయడానికి సిద్ధమయ్యారు. దీని గురించి విష్ణు విశాల్ వీడియోస్ సంస్థ మంగళవారం మీడియాకు అధికారికంగా విడుదల చేసిన ప్రకటనలో పేర్కొంది. వేలైను వందుట్టా వెళ్లైక్కారన్, కట్ట కుస్తీ, ఎఫ్ఐఆర్ వంటి 10 విజయవంతమైన చిత్రాలను నిర్మించిన తమ సంస్థ నిర్మిస్తున్న 11వ చిత్రం ఇది అని తెలిపారు. ఇది కుటుంబ సపరివార సమేతంగా చూసి ఆనందించే పూర్తి వినోద భరిత కథా చిత్రంగా ఉంటుందన్నారు. ఇందులో ప్రముఖ తారాగణం, సాంకేతిక వర్గం పని చేయనున్నారని, ప్రస్తుతం చిత్ర ప్రీప్రొడక్షన్ కార్యక్రమాలు జరుగుతున్నాయని తెలిపారు. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు. View this post on Instagram A post shared by Vishnu Vishal (@thevishnuvishal) చదవండి: తల్లికి క్యాన్సర్.. బిగ్‌బాస్‌కు వెళ్లకుండా ఉండాల్సిందంటూ బోరున ఏడ్చిన నటి -
రజనీకాంత్ ‘లాల్ సలామ్’ రిలీజ్ డేట్ ఫిక్స్
రజనీకాంత్, లెజెండరీ క్రికెటర్ కపిల్‌దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో సుభాస్కరన్ ఈ సినిమాను నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతికి విడుదల చేస్తామని తొలుత చిత్రం యూనిట్ ప్రకటించింది. తాజాగా ‘లాల్ సలామ్’ సినిమాను ఫిబ్రవరి 9న విడుదల చేస్తామని మంగళవారం కొత్త విడుదల తేదీని ప్రకటించారు మేకర్స్. ‘‘హిందూ, ముస్లిం యువకులు వారెంతగానో ప్రేమించే క్రికెట్ ఆట విషయంలో మతం పేరుతో గొడవలు పడుతూ ఉంటే ఆ గొడవలను మొయిద్దీన్ భాయ్ (సినిమాలో రజనీ పాత్ర) ఎలా సర్దుబాటు చేశాడు? అన్నదే చిత్రకథాంశం’’ అని యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఎ.ఆర్. రెహమాన్. -
యంగ్ హీరో కొత్త సినిమా... ఆ స్టార్ డైరెక్టర్‌తో కలిసి
తమిళ యంగ్ హీరో విష్ణు విశాల్ కొత్త సినిమాని ప్రకటించాడు. ప్రస్తుతం ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో 'లాల్ సలామ్'లో హీరోగా నటించాడు. ఇది జనవరి చివరి వారంలో థియేటర్లలోకి రానుంది. దీనితో పాటు 'ఆర్యన్' అనే యాక్షన్ ఎంటర్టైనర్ కూడా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పుడు మరో స్టార్ డైరెక్టర్‌తో కొత్త మూవీ చేయడానికి రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ఆ ఫొటో పోస్ట్ చేసి గుడ్‌న్యూస్ చెప్పిన లావణ్య త్రిపాఠి) విష్ణు విశాల్ హీరోగా చేస్తూనే పలు సినిమాలని నిర్మించాడు కూడా. ఇప్పుడు కూడా డైరెక్టర్ గోకుల్‌తో చేయబోయే మూవీలో నటిస్తూ నిర్మిస్తున్నాడు. రౌద్రం, కాష్మోరా లాంటి చిత్రాలతో ఆకట్టుకున్న గోకుల్.. ఇప్పుడు విష్ణు విశాల్‌తో ఎలాంటి మూవీ తీస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ వర్క్ ప్రారంభమైంది. త్వరలో ఇతర నటీనటులు, సాంకేతిక వర్గం వివరాలని వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 29 సినిమాలు) Extremely happy to share the official announcement of my next - joining hands with @DirectorGokul for a BADASS entertainer ❤️ Got really excited on hearing this wacky, high octane action script based on a true story. Can't wait to get started soon. #VVStudioz10#RiseandShine… pic.twitter.com/Row3hgfE74 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) January 8, 2024 -
ఏడేళ్ల తర్వాత తెలుగులో...
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా, సూపర్ స్టార్ రజనీకాంత్, క్రికెటర్ కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ కీలక పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలామ్’. క్రికెట్ నేపథ్యంలో సాగే ఈ సినిమాకు ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకురాలు. శనివారం (జనవరి 6) కపిల్ దేవ్ పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా కొత్త స్టిల్‌ను విడుదల చేశారు. ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావాల్సింది. అయితే వాయిదా పడింది. రామ్‌చరణ్ హీరోగా బుచ్చిబాబు సాన దర్శకత్వంలో ఓ చిత్రం రూపొందనున్న విషయం తెలిసిందే. ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తారనే వార్త ఎప్పట్నుంచో ఉంది. శనివారం (జనవరి 6) రెహమాన్ బర్త్ డే సందర్భంగా యూనిట్ ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. మైత్రీ మూవీ మేకర్స్ సమర్పణలో వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్‌పై వెంకట సతీష్ కిలారు ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ‘‘ఈ పాన్ ఇండియా చిత్రానికి బుచ్చిబాబు పవర్ఫుల్ స్క్రిప్ట్‌ని సిద్ధం చేశారు. యూనివర్సల్ అప్పీల్ ఉన్న కథ ఇది’’ అని చిత్రబృందం పేర్కొంది. ఇదిలా ఉంటే నాగచైతన్య హీరోగా రూపొందిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ (2016) తర్వాత ఏడేళ్లకు రెహమాన్ తెలుగులో సంగీతం అందిస్తున్న చిత్రం ఇదే. -
‘కుల్లనారి కూట్టం’ తమిళ మూవీ రివ్యూ
టైటిల్: కుల్లనారి కూట్టం(2011) నటీనటులు: విష్ణు విశాల్, రమ్య నంబీషన్, సూరి తదితరులు దర్శకత్వం: శ్రీబాలాజీ సంగీతం: వి.సెల్వగణేష్ సినిమాటోగ్రఫీ: జే.లక్ష్మణ్ ఎడిటర్: కాశీ విశ్వనాథన్ విడుదల తేది: మార్చి 25, 2011 ఓటీటీ: డిస్నీ ప్లస్ హాట్‌స్టార్ ‘కుల్లనారి కూట్టం’ కథేంటంటే.. "సరే! రీచార్జ్ చెయ్యాల్సిన నెంబర్ చెప్పండి" అనడిగింది ఆ మోబైల్ షాపు అమ్మాయి ."9445199205" అన్నాడు ఆ అబ్బాయి. చివరి టూ జీరో పైవ్ అంటే రెండు సున్నాలు ఒక అయిదు అనుకుని ఆ 9445199005 నెంబర్‌కు రూ: 1500 రీచార్జ్ చేసింది ఆ అమ్మాయి . ఆ డబ్బులు సరాసరి ప్రియా నంబియార్ అనే ఎంతో చూడచక్కని అమ్మాయి మోబైల్ కు రీచార్జ్ అయ్యింది. అలా మొదలయ్యింది ఈ సినిమా కథ .ఆ కుర్రవాడి పేరు వెట్రివేళ్(విష్ణువిశాల్). అతని తండ్రి తనను ఒకరోజు పదిహేను వందల రూపాయలు కొడుకు చేతిలో పెట్టి తన మొబైల్ రీచార్జ్ చేయించమన్నాడు. ఆ డబ్బు తన తండ్రి మొబైల్ కి కాకుండా అలా ఊరూ పేరూ తెలియని ఓ ఆందగత్తె పాలయ్యింది. ఉద్యోగం గట్రా ఏవి లేని వెట్రివేళ్ కి ఉన్న ఆదాయమల్లా రోజువారి పాకెట్ మనీ స్కీములో లభించే కేవలం రూ 10 మరి ఎలాగని? ఎక్కడినుంచని? ఇంకో 1500 సంపాదించి తండ్రి పోన్ రీచార్జి భారం తీర్చుకుంటాడు? అదంతా ఆ చావంతా, ఆబ్రతుకంతా ఆ ముచ్చటంతా మీరు ఈ సినిమా చూసి తీర్చుకోదగ్గ ముచ్చట. విశ్లేషణ కొన్ని ప్రయత్నాల అనంతరం వెట్రివేళ్ ఆ అమ్మాయి దగ్గరినుండి డబ్బునూ, ఆ వెనువెంటనే ఆ అమ్మాయి మనసుని కూడా అంది పుచ్చుకుంటాడు. ఈ ప్రయత్నాల్లో ఏ మాత్రం అలుపు సొలుపు బోర్ కు గురిచేయకుండా దర్శకుడు హాయి హాయిగా సినిమాలోకంలో మనల్ని ఊయాలలూపుతూ ఉంటాడు. సర్వసాధారణమయిన సినిమాల్లో పనీ గినీ లేని హీరో పక్కన మరో పనీ గినీ లేని ఒక విదూషక ఫ్రెండ్ పాత్ర పెట్టి మనల్ని అనవసరంగా నవ్వించే ప్రయత్నం దర్శకుడు శ్రీ బాలాజీ అసలు చెయ్యలేదు. ఈ సినిమాలో అనవసరం అనిపించే పాత్ర ఒక్కటీ లేదంటే అదే అశ్చర్యం! పైగా ఉన్న ప్రతి ఒక్కరు ఎంత బాగా నటించారో! హీరో తల్లి ఎంత బాగా నటించిండో కదా అని మనం ఆశ్చర్యపోతూంటే ! మామూలు సినిమ్మా తండ్రి కూడా ఎంత హాయిగా నటించాడో అని ఇంకా నిబిడాశ్చర్య పోతాము ! ఇక వేట్టి అన్నయ్య సంగతి కాదు కానీ తమిళ సినిమాల్లో అన్నపాత్రలు వేసే వారంతా అంత చక్కని నటులేంటో! వదిన మాత్రం తక్కువ నటించిందా ఏమిటి? . సిన్మా చివర్లో వచ్చిన ఆరు మంది మిత్రులు, వారి తోడుగా దూరిన కొంత పోలీసు వారు. వారని వీరని కాదు ఈ సినిమాలో మొహానికి రంగు వేసుకున్న ప్రతి పాత్రధారి మోసం అంటే అద్భుతం అన్నంత బాగా నటించారు . ఒక సీన్ లో తండ్రి చేతిలో స్కూల్ పిల్లల పరిక్ష పత్రాలు ఉంటాయి . ఒక్క సెకను మాత్రమే కనపడే సీన్ అది . సినిమా లో ఒక పాత్ర స్కూలు మాస్టరు అయినంత మాత్రానా ఆయన ఇంటికి ఆ కాగితాలు తీసుకెళ్ళి రాత్రి దిద్ది ఉదయం బడికి పట్టుకెడుతున్నాడనే చిన్న బ్యూటిఫుల్ డిటయిల్ ప్రేక్షకుడికి ఇవ్వాలని ప్రేమకలిగిన దర్శకుడిని ఊరికే ఒట్టి మాటల్తో ఎట్టా ప్రేమించగలం. దేవుడా! ప్రేమించలేకపోవడం ఎంత కష్టం కష్టం!! సరే మళ్ళీ కథలోకి వద్దాం. వెట్రి, ప్రియా ల ప్రేమని హీరోయిన్ తండ్రి ఒకలా ఒప్పుకుంటాడు. నాయనా నీకూ, మా అమ్మాయికి పెళ్ళి కావాలంటే పరమ సింపుల్‌గా నువ్వు మిలట్రీ ఉద్యోగం అయినా సంపాదించు లేదా పోలీసు వాడివయినా అవ్వమనేది షరతు. హీరోయిన్ అమ్మాయి వాళ్ళ ది ఒక విచిత్రమైన ఊరు. ఆ ఊర్లో ప్రతి కుటుంబంలో ఒకరిద్దరు మిలట్రీలో చేరి భారత్ మాతా కి సేవలో తరించే వాళ్ళే. మామూలుగా నిత్యజీవితాల్లో ఉద్యోగం సంపాదించడం అనేది కష్టం కావచ్చు కానీ, భారతీయ సినిమా హీరోకి- అందునా తెలుగు మరియు తమిళ హీరోలకి అసాధ్యం ఐనది ఏది? మీకెవరికయినా ఆడవి దోంగ అనే ఎనభైలనాటి సినిమా గుర్తు ఉందా? మాటలు కూడా రాని బ్బే బ్బే బ్బే అనే కథానాయకుడు . హీరోయిన్ రాధ వడిలో పడుకుని ముప్ఫై రోజుల్లో తెలుగు కామా ఇంగ్లీష్ కామా హిందీ కూడా నేర్చుకుని ఆ పై పుంజీడు రోజుల్లో జిల్లా కలెక్టరో, సుప్రీంకోర్ట్ జడ్జి వంటిది కూడా ఒకటి అయ్యి ప్రేక్షక దేవుళ్లతో చెవులు చిల్లులు పడేంత వీలలు , చిల్లర వేయించుకుంటాడు కదా. అడిగాడా మన సినిమా ఘన చరిత్ర ! మిలటరీలో చేరడానికి మరిక ప్రాబ్లెం ఏవిటి మన హీరోకి? అంటే ఏం చెప్పను? సినిమా చూడరాదు, ప్రాబ్లెమ్ ఏమిటో ! ఎంత బాగుందో ఈ సినిమా . కథ బావుంది, నడిపిన కథనం బావుంది. నటీ నటులు అందరూ బావున్నారు. అంత మంచి సినిమా చివర్లో వచ్చే కాస్త డ్రామా అంతగా ఆకట్టుకోదు! అయినా పర్లా ఆ అయిదు నిముషాల క్లైమాక్స్ అలా కన్నా ఇక మరలాగైనా తీయలేరేమో లే పాపం అని క్షమించేంత బావుంది. -
హీరో రిక్వెస్ట్.. మరో స్టార్ హీరోను రక్షించిన సిబ్బంది!
మిచౌంగ్ తుపాను ధాటికి చెన్నై అతలాకుతులం అవుతోంది. ఇప్పటికే పలు లోతట్లు ప్రాంతాలు జల దిగ్భందంలో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు ప్రభుత్వం ఆపదలో ఉన్నవారి కోసం సహాయక చర్యలు ముమ్మరంగా చేపడుతోంది. ఇప్పటికే తుపాను దెబ్బకు ఇంటి పైకి ఎక్కినట్లు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. హీరో సాయం కోరడంపై స్పందించిన అధికారులు వెంటనే చర్యలకు దిగారు. విశాల్‌ను సురక్షిత ప్రాంతానికి తరలించారు. అయితే విష్ణు విశాల్‌తో పాటు బాలీవుడ్ హీరో అమిర్ ఖాన్ కూడా ఉండటం గమనార్హం. ఈ సందర్భంగా విష్ణు విశాల్ తమిళనాడు ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. మాలాంటి వారికి సహాయం చేస్తున్న అగ్నిమాపక, రెస్క్యూ విభాగానికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం కరపాక్కంలో సహాయక చర్యలు ప్రారంభమయ్యాయని వెల్లడించారు. నిర్విరామంగా సహాయక చర్యల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి అభినందనలు అంటూ ట్విటర్(ఎక్స్)లో పోస్ట్ చేశారు. అయితే ఇప్పటి వరకు అంతా బాగానే ఉన్నప్పటికీ.. సడన్‌గా అమిర్ ఖాన్ చెన్నైలో దర్శనమివ్వడంపై నెటిజన్స్ ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అక్కడ ఉన్నది నిజంగా అమిర్ ఖాన్ యేనా అంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇంతకీ అమిర్ చెన్నైలో ఏం చేస్తున్నాడంటూ మరికొందరు ప్రశ్నిస్తున్నారు. మొత్తానికి వరదలో చిక్కుకున్న స్టార్ హీరోలిద్దరినీ సేఫ్‌గా బయటకు రావడంతో అభిమానులు ఊపిరి పీల్చుకుంటున్నారు. Thanks to the fire and rescue department in helping people like us who are stranded Rescue operations have started in karapakkam.. Saw 3 boats functioning already Great work by TN govt in such testing times Thanks to all the administrative people who are working relentlessly https://t.co/QdoW7zaBuI pic.twitter.com/qyzX73kHmc — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) December 5, 2023 -
సిగ్నల్ లేదు.. సాయం కోసం హీరో ఎదురుచూపులు!
మిచౌంగ్ తుఫాన్ ప్రభావంతో తమిళనాడు, ఏపీ రాష్ట్రాలు చిగురుటాకులా వణికిపోతున్నాయి. సముద్ర తీర ప్రాంతం వద్ద భయానక పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటికే అధికారులు అప్రమత్తమైన సహాయ చర్యలు చేపడుతున్నారు. చెన్నై నగరం నీటి ముంపునకు గురై జనజీవనం స్తంభించింది. అయితే తుపాన్ దెబ్బకు చెన్నైతో పలు ప్రాంతాలు నీట మునిగిపోయాయి. ఈ నేపథ్యంలో కోలీవుడ్ స్టార్ నటుడు విష్ణు విశాల్ చేసిన ట్వీట్ వైరల్‌గా మారింది. (ఇది చదవండి: ఇండస్ట్రీలో విషాదం.. సీఐడీ నటుడు మృతి!) తాను వరదల్లో చిక్కుకున్నట్లు ట్విటర్ ద్వారా వెల్లడించారు. కారప్పాకంలోని తమ ఇంట్లోకి నీరు చేరిందని.. సాయం కోసం వేచి కాల్ చేశానని తెలిపారు. విద్యుత్, ఇంటర్నెట్ సదుపాయం అందుబాటులో లేవని పేర్కొన్నారు. ఇంటి పైకప్పు పైకి రావడంతో సిగ్నల్ దొరకడంతో పోస్ట్ చేశానన్నారు. నాతో ఎంతోమంది సహాయం కోసం ఎదురు చూస్తున్నట్లు ట్వీట్లో ప్రస్తావించారు. విష్ణు విశాల్ ప్రస్తుతం రజినీకాంత్ లాల్ సలాం, ధనుశ్ డీ50 చిత్రాల్లో నటిస్తున్నారు. (ఇది చదవండి: సలార్‌తో పోటీ పడలేం.. అందుకే డేట్ మార్చాం: టాలీవుడ్ నిర్మాత) Water is entering my house and the level is rising badly in karapakkam I have called for help No electricity no wifi No phone signal Nothing Only on terrace at a particular point i get some signal Lets hope i and so many here get some help❤️ I can feel for people all over chennai… pic.twitter.com/pSHcK2pFNf — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) December 5, 2023 -
సంక్రాంతికే సలాం కొట్టిన రజనీకాంత్
సంక్రాంతికి ‘లాల్ సలాం’ అంటున్నారు రజనీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీకాంత్, కపిల్ దేవ్, జీవితా రాజశేఖర్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘లాల్ సలాం’. ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ సుభాస్కరన్ నిర్మించారు. ఈ సినిమాను సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లు వెల్లడించి, కొత్త పోస్టర్‌ను రిలీజ్ చేసింది చిత్ర యూనిట్. ‘‘లాల్ సలాం’ చిత్రంలో ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్ పాత్రలో కనిపిస్తారు రజనీకాంత్. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: ఏఆర్ రెహమాన్. -
ఇండియా పేరు మార్చాలన్న సెహ్వాగ్.. ఏం ఉపయోగమంటూ హీరో కౌంటర్
ఇండియా.. భారత్‌గా మారబోతుందా? సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారం చూస్తుంటే త్వరలోనే అది నిజం కానున్నట్లు కనిపిస్తోంది. అయితే చాలామంది పేరు మార్పును సమర్థిస్తుంటే మరికొందరు మాత్రం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. పేరు మార్పును సమర్థించే లిస్ట్‌లో ప్రముఖ క్రికెటర్ వీరేందర్ సెహ్వాగ్ ముందు వరుసలో ఉన్నారు. భారత్‌గా పేరు మార్చాలి 'మనకు గర్వకారణంగా అనిపించే పేరు ఒకటి ఉండాలని నేను ఎప్పటినుంచో అనుకుంటున్నాను. మనమంతా భారతీయులం. ఇండియా అనే పేరు బ్రిటీష్ వాళ్లు ఇచ్చారు. దాన్ని త్యజించాల్సిన సమయం వచ్చింది. మన దేశానికి భారత్ అనే పేరును ఖరారు చేయాలి. అలాగే వరల్డ్ కప్‌లో ఆడే క్రికెటర్ల షర్ట్‌లపై కూడా ఇండియాకు బదులు భారత్ అన్న పేరు ఉండేలా చర్యలు తీసుకోవలి' అంటూ బీసీసీఐని కోరారు. ఈ ట్వీట్‌కు కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ కౌంటరిచ్చాడు. 'సర్.. మీకు ఇన్నేళ్లుగా ఇండియా అనే పదం గర్వంగా అనిపించలేదా?' అని ప్రశ్నించాడు. దేనికి ఉపయోగం? మరో ట్వీట్లో షూటింగ్ లొకేషన్లో ఉన్న ఫోటో షేర్ చేస్తూ.. 'అసలు ఈ పేరు మార్పు దేనికి? మన దేశ ఉన్నతికి, ఆర్థిక వ్యవస్థకు ఇది ఏమేరకు ఉపయోగపడుతుంది? ఈ మధ్యకాలంలో నేను చూసిన వింతవార్త ఇదే.. ఇండియా అంటే భారత్.. మన దేశాన్ని ఇండియా, భారత్‌గా.. ఇలా రెండు పేర్లతో పిల్చుకుంటూ వచ్చాం.. కానీ ఉన్నట్లుండి భారత్ అనే పదాన్ని ఎందుకు వదిలించుకోవాలనుకుంటున్నారు?' అని ప్రశ్నించాడు. నీ గట్స్‌కు హ్యాట్సాఫ్ కేరళను కేరళంగా మార్చితే లేనిది.. ఇండియాను భారత్‌గా మార్చితే మాత్రం తప్పవుతుందా? అని నిలదీస్తున్నారు కొందరు నెటిజన్లు. మరికొందరేమో.. ప్రతిపక్షం ఇండియా అనే కూటమిగా ఏర్పడింది కాబట్టే ప్రభుత్వం తట్టుకోలేక భారత్ అని పేరు మారుస్తోందంటున్నారు. ఏదేమైనా ఈ అంశంపై సోషల్ మీడియా వేదికగా గళం వినిపించావంటే నువ్వు గ్రేట్ అని కొనియాడుతున్నారు అభిమానులు. Thinking deep from this shoot location… Wat ?????? name change ???? But why????? How does this help our country’s progress and its economy? This is the strangest news ive come accross in recent times… India was always bharat… We always knew our country as INDIA AND… pic.twitter.com/4X6Y8XbrL6 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) September 5, 2023 Sir with due respect… The name INDIA didn instill pride in you all these years?? https://t.co/ibm68uZ7e8 — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) September 5, 2023 చదవండి: అడల్ట్ సినిమాలు చేస్తే తప్పేంటి? టేస్టీ తేజకు షకీలా కౌంటర్ -
రజినీకాంత్ 'లాల్ సలాం'.. పవర్ఫుల్ రోల్‌కు తలైవా బై బై!
ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రూపొందుతోన్న లేటెస్ట్ క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తోన్న ఈ చిత్రాన్ని ఐశ్వర్య రజినీకాంత్ డైరెక్షన్లో తెరకెక్కిస్తున్నారు. చేస్తున్నారు. ముంబై డాన్ మొయిద్దీన్ భాయ్‌గా సూపర్‌స్టార్ రజినీకాంత్ నటిస్తుండటం విశేషం. రజినీకాంత్ కీలక పాత్రలో నటిస్తోన్న ఈ చిత్రంలో విష్ణు విశాల్, విక్రాంత్, జీవితా రాజశేఖర్, క్రికెట్ లెజెండ్ కపిల్ దేవ్ తదితరులు నటిస్తున్నారు. ఈ సినిమాలో రజినీకాంత్ మొయిద్దీన్ అనే పవర్ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆయన పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తయ్యింది. ఈ విషయాన్ని చిత్ర దర్శకురాలు ఐశ్వర్య రజినీకాంత్ తన సోషల్ మీడియా ద్వారా తెలియజేశారు. ‘‘మీతో సినిమా చేయటం ఓ అద్భుతం. నాన్నా.. మీరు ఎప్పుడూ నటనతో మ్యాజిక్ చేస్తుంటారు... ‘లాల్ సలాం’లో మొయిద్దీన్ పాత్రకు సంబంధించిన షూటింగ్ పూర్తి’. అని ఆమె పేర్కొన్నారు. రజినీకాంత్ సహా ఎంటైర్ యూనిట్ కలిసి దిగిన ఫొటోను ఆమె షేర్ చేశారు. లైకా ప్రొడక్షన్స్ ప్రతినిధులు మాట్లాడుతూ.. ‘‘మా బ్యానర్లో రజినీకాంత్ నటించటం మాకెప్పుడూ గర్వకారణంగానే ఉంటుంది. లాల్ సలాం సినిమాలో ఓ కీలక పాత్రలో నటించాలని ఆయన్ని రిక్వెస్ట్ చేయగానే వెంటనే చేస్తానని అన్నారు. ఆయన్ని ఓ పవర్ఫుల్ పాత్రలో చూడబోతున్నారు. ఐశ్వర్యా రజనీకాంత్‌గారు పర్ఫెక్ట్ ప్లానింగ్‌తో ఈ మూవీలో రజినీకాంత్‌గారి పాత్రకు సంబంధించిన షూటింగ్‌ను పూర్తి చేశారు. త్వరలోనే మరిన్ని విషయాలను తెలియజేస్తామన్నారు. భారీ బడ్జెట్ విజువల్ వండర్స్ చిత్రాలతో పాటు డిఫరెంట్ కంటెంట్ చిత్రాలను ప్రేక్షకులకు అందిస్తూ చిత్ర నిర్మాణ రంగంలో తమకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్. రీసెంట్గా విడుదలైన పాన్ ఇండియా మూవీ పొన్నియిన్ సెల్వన్ 2తో సూపర్ సక్సెస్‌ను సాధించి సంగతి తెలిసిందే. ఈ నిర్మాణ సంస్థ నుంచి రానున్న మరో క్రేజీ ప్రాజెక్ట్ ‘లాల్ సలాం’. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతుంది. మరో వైపు కమల్ హాసన్, స్టార్ డైరెక్టర్ శంకర్ కాంబోలో రూపొందుతోన్న ‘ఇండియన్ 2’, అరుణ్ విజయ్, ఎమీ జాక్సన్ హీరో హీరోయిన్లుగా నటిస్తోన్న ‘మిషన్ చాప్టర్ 1’, కోలీవుడ్ అగ్ర కథానాయకుడు అజిత్‌తో చేస్తోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘విడా ముయర్చి’ , 2018 వంటి బ్లాక్ బస్టర్ మూవీని తెరకెక్కించి దర్శకుడు జూడ్ ఆంథోని జోసెఫ్ దర్శకత్వంలోనూ ఓ భారీ చిత్రం.. ఇలా క్రేజీ ప్రాజెక్ట్స్‌ని కూడా లైకా ప్రొడక్షన్స్ ప్రేక్షకులను అలరించేందుకు సిద్ధమవుతోంది. -
రోజురోజుకీ మీపై ప్రేమ రెట్టింపవుతోంది, ఈ రోజు వస్తుందని ఊహించలేదు
‘‘నేను మిమ్మల్ని చూస్తూ పెరిగాను. కానీ మీతో షూటింగ్ చేసే రోజు వస్తుందని ఊహించలేదు. మీరంటే నాకు ఆరాధన.. స్ఫూర్తి... ఒక్కోసారి నేను ప్రపంచాన్ని మీ ద్వారా చూస్తాను. కానీ ఎక్కువసార్లు మీతో పాటు ప్రపంచాన్ని చూస్తాను. ఈ క్రమంలో నేను గ్రహించింది ఏంటంటే.. ‘నేను మీరే’ అని. అప్పా (నాన్న) రోజు రోజుకీ నాకు మీ మీద ఉన్న ప్రేమ రెట్టింపు అవుతోంది’’ అంటూ ‘సూపర్ స్టార్‌తో షూటింగ్’ అనే హ్యాష్‌ట్యాగ్‌తో సోషల్ మీడియా ద్వారా ఓ ఎమోషనల్ పోస్ట్‌ని షేర్ చేశారు రజనీకాంత్ పెద్ద కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్న ‘లాల్ సలామ్’ చిత్రంలో మొయుద్దీన్ భాయ్‌గా రజనీకాంత్ కీ రోల్ చేస్తున్నారు. సూపర్ స్టార్‌ని డైరెక్ట్ చేయడం ఏ డైరెక్టర్‌కి అయినా ఎగ్జయిటింగ్‌గా ఉంటుంది. ఇక స్వయానా కూతురు అయితే.. ఆ ఫీలింగ్ రెండింతలు ఉంటుంది. ఆ భావాన్నే ఐశ్వర్య సోషల్ మీడియాలో పేర్కొన్నారు. ఇక క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో సాగే ‘లాల్ సలామ్’లో స్టార్ క్రికెటర్ కపిల్ దేవ్ కీలక ΄పాత్ర చేస్తున్నారు. ఈ చిత్రంలో రజనీ పాత్ర ముంబై నేపథ్యంలో ఉంటుంది. రజనీ–కపిల్ పాల్గొనగా ఇటీవల ముంబైలో కీలక సన్నివేశాలు చిత్రీకరించారు. ఈ చిత్రం ఈ ఏడాదే విడుదల కానుంది. View this post on Instagram A post shared by Aishwaryaa Rajinikanth (@aishwaryarajini) -
భాయ్ ముంబైలో అడుగుపెట్టారు!
రజనీకాంత్ కెరీర్లో గుర్తుంచుకోదగ్గ చిత్రాల్లో ‘బాషా’ ఒకటి. పాతికేళ్ల క్రితం వచ్చిన ఈ సినిమా ఫ్లాష్‌బ్యాక్‌లో ముంబైలో ‘మాణిక్ బాషా’గా కనిపించారు రజనీకాంత్. బాషా భాయ్‌గా రజనీ నటన, స్టయిల్ని మరచిపొలేం. ఇప్పుడు మొయుద్దీన్ భాయ్‌గా రజనీ కనిపించనున్న చిత్రం ‘లాల్ సలామ్’. ముంబై బ్యాక్‌డ్రాప్ ఉన్న ఈ చిత్రాన్ని రజనీ పెద్ద కుమార్తె ఐశ్వర్య దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తోంది. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా నటిస్తున్న ఈ చిత్రంలో రజనీ చేస్తున్న మొయుద్దీన్ భాయ్ పాత్ర కీలకం. ‘అందరి ఫేవరెట్ అయిన భాయ్ మళ్లీ ముంబైలో అడుగుపెట్టారు’ అంటూ ఆయన లుక్‌ని సోమవారం రిలీజ్ చేశారు. ‘‘ఈ చిత్రంలో రజనీకాంత్ రాకింగ్ పెర్ఫార్మెన్స్తో ప్రేక్షకులను అలరించనున్నారు’’ అని చిత్ర యూనిట్ పేర్కొంది. ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ రెహమాన్, కెమెరా: విష్ణు రామస్వామి. -
గుత్తా జ్వాలకు విడాకులు? క్లారిటీ ఇచ్చిన విష్ణు విశాల్
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల విడిపోతున్నారంటూ సోషల్ మీడియాలో జోరుగా ప్రచారం జరుగుతోంది. ఇటీవల విష్ణు చేసిన ట్వీటే అందుకు కారణం.. 'నేను ఎంతో ప్రయత్నించాను, కానీ విఫలమవుతూనే ఉన్నాను. మరేం పర్వాలేదు.. దాని నుంచి గుణపాఠాన్ని నేర్చుకున్నాను. అయినా అది పరాజయం కాదు పూర్తిగా నా తప్పే! అది ఒక మోసపూరిత ద్రోహం..' అంటూ లైఫ్ లెస్సన్స్ హ్యాష్‌ట్యాగ్ జత చేశాడు. ఇది చూసిన నెటిజన్లు.. విష్ణు, జ్వాలకు మధ్య ఏదో జరిగిందని, వీరు విడాకులు తీసుకోబోతున్నారంటూ పుకారు లేపారు. తాజాగా ఈ వ్యవహారంపై విష్ణు విశాల్ క్లారిటీ ఇచ్చాడు. 'కొద్దిరోజుల క్రితం నేను చేసిన ట్వీట్‌ను అతి దారుణంగా అర్థం చేసుకున్నారు. నేను నా పర్సనల్ లైఫ్ గురించి మాట్లాడలేదు. కేవలం వృత్తిగత జీవితం గురించే ట్వీట్ చేశాను. ఇకపోతే మా ఇద్దరికీ ఒకరంటే మరొకరికి ఎంతో నమ్మకం. ఒకరికి మనం ఇవ్వగలిగే గొప్ప బహుమతి ఏమిటంటే నమ్మకం. ఒకవేళ అలా చేయడంలో విఫలమైతే మనల్ని మనమే నిందించుకుంటాం. మన పట్ల మనం మరీ అంత కఠినంగా ఉండకూడదని మాత్రమే దానర్థం' అని చెప్పుకొచ్చాడు. మొత్తానికి ఈ ట్వీట్‌తో విడాకుల రూమర్స్‌కు చెక్ పెట్టాడు హీరో. ఇకపోతే విష్ణు విశాల్ ప్రస్తుతం లాల్ సలాం సినిమా చేస్తున్నాడు. ఐశ్వర్య రజనీకాంత్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో విక్రాంత్ మరో హీరోగా నటిస్తున్నాడు. ఇందులో రజనీకాంత్ ఓ ముఖ్య పాత్రలో కనిపించనున్నాడు. లైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నాడు. Hey all My tweeet few days back has been terribly misinterpreted.. It was on proffessional front n not personal at all.. The biggest gift that we give someone is TRUST And when we fail we always blame ourselves.. We shudn be hard on ourselves THATS ALL I MEANT ALL IS WELL — VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) March 26, 2023 -
ప్రత్యేక పాత్రలో రజినీకాంత్.. ప్రారంభమైన షూటింగ్
విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సలాం'. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హోలీ రోజున ప్రారంభమైంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ద్వారా వెల్లడించింది. ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. 'విభిన్నమైన సినిమాలు నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ముందుంటుంది. అందులో భాగంగా లాల్ సలాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ పవర్ఫుల్ పాత్ర ఉంది. అందుకే సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయన ఈ రోల్లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు.'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు. Lights 💡 Camera 🎥 🎬 Action 😎✨#LalSalaam 🫡 Shoot starts today! 😌 Happy #HOLI everyone! 💫 🎬 @ash_rajinikanth 🎶 @arrahman 🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl 🤝 @gkmtamilkumaran 🪙 @LycaProductions #Subaskaran pic.twitter.com/SHYXxnGYod — Lyca Productions (@LycaProductions) March 7, 2023 -
ధనుష్ స్వీయ దర్శకత్వంలో క్రేజీ మూవీ, నలుగురు హీరోలతో..
తమిళసినిమా: ధనుష్ ఈ పేరు ఒక్క తమిళ్ చిత్రం కాదు టాలీవుడ్, బాలీవుడ్, హాలీవుడ్ పరిశ్రమలకు సుపరిచితమే. ఇటీవల ఈయన కథానాయకుడిగా నటించిన నానే వరువేన్ చిత్రం నిరాశపరిచినా, తగ్గేదేలే అన్నట్టుగా ధనుష్ వరుసగా చిత్రాలను చేసుకుంటూ పోతున్నారు. ప్రస్తుతం చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న నటుల్లో ఈయన ఒకరు. ప్రస్తుతం ఈయన తమిళం, తెలుగు భాషల్లో నటిస్తున్న వాత్తి (తెలుగులో సార్) చిత్రం. నిర్మాణ కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమా ఫిబ్రవరి 17న విడుదలకు ముస్తాబవుతోంది. కాగా దీంతో పాటు సత్యజ్యోతి ఫిలిమ్స్ సంస్థ నిర్మిస్తున్న కెప్టెన్ మిల్లర్ చిత్రంలో నటిస్తున్నారు. అరుణ్ మాదేశ్వరన్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం స్వాతంత్య్రానికి ముందు జరిగిన సంఘటనతో కూడిన కథా చిత్రంగా ఉంటుందని చిత్ర వర్గాలు వెల్లడించారు. వీరితోపాటు తెలుగులో శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ధనుష్ ఒక చిత్రంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన పూజా కార్యక్రమాలు ఇప్పటికే జరిగాయి. నటుడు ధనుష్ ఇప్పుడు మరో క్రేజీ చిత్రానికి సిద్ధమవుతున్నారనేది తాజా సమాచారం. ఇందులో నలుగురు హీరోలతో కలిసి నటించి స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించడానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఇందులో నటుడు ధనుష్‌తో పాటు విష్ణు, ఎస్.జే.సూర్య, కాళిదాస్ జయరాం నలుగురు హీరోలు నటించనున్నట్లు సమాచారం. ఈ క్రేజీ చిత్రాన్ని సన్ పిక్చర్స్ సంస్థ నిర్మించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. దీనికి రాయన్ అనే టైటిల్‌ను నిర్ణయించినట్లు టాక్. ఇది చిత్రానికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు ఇప్పటికే మొదలైనట్లు, త్వరలోనే ఈ చిత్రానికి సంబంధించిన అధికారిక ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. -
ఓటీటీకి 'మట్టి కుస్తీ'.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?
నటుడు విష్ణు విశాల్, ఐశ్యర్య లక్ష్మీ జంటగా నటించిన చిత్రం మట్టి కుస్తీ. విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ నటుడు రవితేజతో కలిసి ఈ సినిమాను నిర్మించారు. ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ఓటీటీ రిలీజ్ డేట్ వచ్చేసింది. నూతన సంవత్సర కానుకగా జనవరి ఒకటో తేదీన నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ కానున్నట్లు చిత్రబృందం వెల్లడించింది. (ఇది చదవండి: Matti Kusthi Review: ‘మట్టి కుస్తీ’మూవీ రివ్యూ) కథేంటంటే.. కేరళకు చెందిని కీర్తి(ఐశ్యర్య లక్ష్మీ)కి రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఇష్టం లేకపోయినా.. బాబాయ్ సపోర్ట్‌తో కుస్తీ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆడపిల్ల రెజ్లర్ అని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని పేరెంట్స్ భయపడతారు. ఆటను వదిలేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ టెన్షన్‌తో నాన్నకు గుండెపోటు వస్తుంది. దీంతో ఫ్యామిలీ కోసం కీర్తి పెళ్లికి ఓకే చెబుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్) ఊర్లో ఓ పెద్ద ఆసామీ. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మామయ్య(కరుణాస్) పెంచి పెద్ద చేస్తాడు. వీర ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. వయసు పెరిగిపోతుండటంతో పెళ్లిచేయాలనుకుంటారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్దగా చదువుకోవద్దని, తన చెప్పుచేతల్లో ఉండాలని కండీషన్స్ పెట్టుకుంటాడు వీర. తనకంటే ఎక్కువగా చదువుకుందని చాలా సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు రెజ్లర్ అయిన కారణంగా కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో కీర్తి బాబాయ్‌కి ఓ ఐడియా వస్తుంది. కీర్తికి ఏడో తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్దం చెప్పి వీరాతో పెళ్లి చేస్తాడు. కానీ వీరాకు ఓ రోజు కీర్తి ఓ రెజ్లర్ అనే నిజం తెలుస్తుంది. అలాగే ఆమెకు పెద్ద జడలేదని, అది విగ్ అని వెలుస్తుంది. ఆ తర్వాత వీర పరిస్థితి ఏంటి? నిజం తెలిసిన తర్వాత వీర, కీర్తిల మధ్య ఎలాంటి గొడవలు ఏర్పడ్డాయి? కుస్తీ పోటీలో భార్యతో వీర ఎందుకు పోటీ పడ్డాడు? విడాకుల వరకు వెళ్లిన వీరిద్దరు మళ్లీ ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. -
ఫిబ్రవరిలో లాల్ సలామ్లోకి...
‘లాల్ సలామ్’ గ్రౌండ్లోకి రజనీకాంత్ ఎంట్రీ ఫిబ్రవరిలో అని సమాచారం. విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా రజనీకాంత్ ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘లాల్‌సలామ్’. క్రికెట్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాకు రజనీకాంత్ కుమార్తె ఐశ్వర్యా రజనీకాంత్ దర్శకత్వం వహిస్తున్నారు. ఆ మధ్య ఓ పది రోజులు షూటింగ్ చేశారు. అయితే రజనీ లేని సీన్స్‌ని చిత్రీకరించారు. ఫిబ్రవరి మొదటివారంలో ఈ సినిమా సెట్స్‌లోకి రజనీ అడుగుపెడతారట. ఇక ‘3’ (2012) చిత్రం ద్వారా దర్శకురాలిగా పరిచయమైన ఐశ్వర్య ఆ తర్వాత ‘వై రాజా వై’ (2015), ‘రాజా రాణి’ (2017) చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఐదేళ్ల గ్యాప్ తర్వాత ఆమె తెరకెక్కిస్తున్న చిత్రం ‘లాల్ సలామ్’. -
థియేటర్స్‌లో దుమ్మురేపుతున్న మట్టి కుస్తీ.. రూ. 30 కోట్లకు పైగా వసూళ్లు
తమిళసినిమా: నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించి తన విష్ణు విశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై టాలీవుడ్ నటుడు రవితేజతో కలిసి నిర్మించిన చిత్రం కట్టా కుస్తీ. మలయాళ కుట్టి ఐశ్వర్య లక్ష్మి నాయకిగా నటించిన ఈ చిత్రానికి సెల్లా అయ్యావు కథ, దర్శకత్వం బాధ్యతలను నిర్వహించారు. ఈ చిత్రం విడుదల హక్కులను ఉదయనిధి స్టాలిన్‌కు చెందిన రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ పొందటం విశేషం. ఇటీవల విడుదలైన ఈ చిత్రం విశేష ప్రేక్షకాదరణ పొందుతోంది. దీంతో చిత్ర యూనిట్ బుధవారం మధ్యాహ్నం చెన్నై వడపళనిలోని ఓ హోటల్లో సక్సెస్ మీట్ నిర్వహించింది.నటి ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ కట్టా కుస్తీ చిత్రం విడుదలైన తొలి రోజు నుంచే పాజిటివ్ రిపోర్ట్ రావడం ఆనందాన్ని కలిగించిందన్నారు. ఇది టీం వర్కుతో రూపొందిన చిత్రమని పేర్కొన్నారు. ఇందులో నటించడం మంచి అనుభవంగా పేర్కొన్నారు. ఈ చిత్రాన్ని ఆయన నిర్మించడం వల్లనే ఈ విజయం సాధ్యమైందనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. నటుడు కృష్ణప్రసాద్ మాట్లాడుతూ దీనిని తన సెకండ్ ఇన్నింగ్స్‌గా భావిస్తున్నారన్నారు. ఈ చిత్ర టీం తనకు చాలా స్పెషల్ అని పేర్కొన్నారు.దర్శకుడు చెప్పిన చిత్రంలోని ఆడ మగ సమానం అనే థాట్ నచ్చడంతో చిత్రాన్ని చేయడానికి ముందుకు వచ్చానని చెప్పారు. తన విజయానికి అమ్మ, అక్క, తన భార్య కారణమన్నారు. వారంతా తనకు చాలా సపోర్టుగా నిలుస్తున్నారని పేర్కొన్నారు. తానే కాదు ప్రతి మగాడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందన్నది నిజమన్నారు. నిర్మాతగా మారడానికి కారణం నటుడిగా తన కలలను నిజం చేసుకోవడానికే అని చెప్పారు. కట్టా కుస్తీ చిత్ర తొలి ఆటను తాను మదురైలో ప్రేక్షకుల మధ్య చూశానని, థియేటర్లో మహిళల ఆదరణను చూసి చాలా సంతోషం కలిగిందన్నారు. ఈ చిత్రం ఇప్పటికే రూ.30 కోట్లకు పైగా వసూలు చేసిందని, ఇంకా వసూలు చేస్తుందన్న నమ్మకం ఉందన్నారు. మంచి అనుభూతినిచ్చింది. -
మట్టికుస్తీ: అలాంటి అమ్మాయి భార్యగా రావాలనుకుంటాడు.. కానీ
నటుడు విష్ణు విశాల్ కథానాయకుడిగా నటించి తన విష్ణువిశాల్ ప్రొడక్షన్స్ పతాకంపై నిర్మించిన చిత్రం మట్టికుస్తీ. మలయాళ బ్యూటీ ఐశ్వర్యలక్ష్మి హీరోయిన్గా నటించిన ఈ చిత్రంలోనటుడు కరుణాస్, మీనీష్ కాంత్ తదితరులు ముఖ్యపాత్రలు పోషించారు. చెల్లాఅయ్యావు కథ, దర్శకత్వ బాధ్యతలు నిర్వహింన ఈ చిత్రం కుస్తీ నేపథ్యంలో కుటుంబ కథా చిత్రంగా తెరకెక్కింది. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య అనుబంధం గురించి చర్చించే చిత్రంగా ఇది ఉంటుంది. గ్రామీణ ప్రాంతానికి చెందిన విష్ణువిశాల్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉంటాడు. తనకంటే తక్కువ చదివిన విష్ణువిశాల్ తనకు కాబోయే భార్య ఎలా ఉండాలి అన్న విషయంలో ఒక నిర్దిష్టమైన అభిప్రాయంతో ఉంటాడు. తనకంటే తక్కువ చదివిన అమ్మాయిగా ఉండాలి. తన మాటకు ఎదురు చెప్పకూడదు. ముఖ్యంగా పొడవైన కురులు కలిగి ఉండాలి. అలాంటి అమ్మాయిని పెళ్లి చేసుకుంటాను అని భీష్మించుకొని కూర్చుంటాడు. అయితే తను కోరుకున్న అమ్మాయికి భిన్నంగా జీవిత భాగస్వామి వస్తే జరిగే పరిణామాలు ఏమిటి? అన్నది కట్టాకుస్తీ చిత్రం. ఇందులో 20 ఎకరాల పొలం, బంగ్లా ఉన్నా.. బాధ్యతలు తెలియని యువకుడిగా నటుడు విష్ణువిశాల్ నటించారు. ఐశ్వర్యలక్ష్మి కుస్తీ క్రీడపై ఆసక్తితో ఆ రంగంలో పేరు తెచ్చుకున్న యువతిగా నటించారు. నటుడు విష్ణువిశాల్ కూడా కబడ్డీ క్రీడలు పరిచయం ఉన్న క్రీడాకారుడు. అలాంటి వీరిద్దరికీ ఎలా పెళ్లి జరిగింది. ఇద్దరు కుస్తీ పోటీల బరిలోకి దిగడానికి కారణాలేమిటి? వంటి పలు ఆసక్తికరమైన అంశాలతో రూపొందిన చిత్రం కట్టా కుస్తీ. భార్యాభర్తల మధ్య ఈగో అనేదానికి తావు లేకుండా ఒకరికొకరు గౌరవించుకోవాలి, భార్య ఇష్టాఇష్టాలు భర్త గుర్తెరిగి ప్రోత్సహించాలి అనే సందేశంతో కూడిన ఈ చిత్రం శుక్రవారం తెరపైకి వచ్చింది. -
Matti Kusthi Review: ‘మట్టి కుస్తీ’మూవీ రివ్యూ
టైటిల్: మట్టి కుస్తీ నటీనటులు: విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి, శ్రీజ రవి తదితరులు నిర్మాణ సంస్థలు: ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మాతలు: రవితేజ, విష్ణు విశాల్ దర్శకత్వం: చెల్లా అయ్యావు సంగీతం: జస్టిన్ ప్రభాకరన్ సినిమాటోగ్రఫీ: రిచర్డ్ ఎం నాథన్ ఎడిటర్: ప్రసన్న జికె విడుదల తేది: డిసెంబర్ 2, 2022 మాస్ మహారాజా రవితేజ నిర్మాతగా మారి నిర్మించిన చిత్రం ‘మట్టి కుస్తీ’(తమిళంలో-గట్టా కుస్తీ). విష్ణు విశాల్ హీరో. ఆయనకు జోడిగా ఐశ్వర్య లక్ష్మి నటించింది. ఈ సినిమా టైటిల్ ప్రకటించినప్పుడు ఇది స్పోర్ట్స్ డ్రామా కావొచ్చని అంతా భావించారు. కానీ ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్ అని చిత్ర యూనిట్ చెప్పడంతో సినిమాపై ఆసక్తి పెరిగింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్ సినిమాపై అంచనాలు పెంచేశాయి. దానికి తోడు సినిమా ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేయడంతో ‘మట్టి కుస్తీ’పై ఆసక్తి పెరిగింది. భారీ అంచనాల మధ్య ఈ శుక్రవారం(డిసెంబర్ 2) ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం ఎలా ఉందో రివ్యూలో చూద్దాం. కథేంటంటే.. కేరళకు చెందిని కీర్తి(ఐశ్యర్య లక్ష్మీ)కి రెజ్లింగ్ అంటే చాలా ఇష్టం. ఇంట్లో ఇష్టం లేకపోయినా.. బాబాయ్ సపోర్ట్‌తో కుస్తీ పోటీల్లో పాల్గొని రాష్ట్రస్థాయిలో ఛాంపియన్‌గా నిలుస్తుంది. అయితే ఆడపిల్ల రెజ్లర్ అని తెలిస్తే ఎవరూ పెళ్లి చేసుకోరని పేరెంట్స్ భయపడతారు. ఆటను వదిలేసి పెళ్లి చేసుకోమని ఒత్తిడి చేస్తారు. ఈ టెన్షన్‌తో నాన్నకు గుండెపోటు వస్తుంది. దీంతో ఫ్యామిలీ కోసం కీర్తి పెళ్లికి ఓకే చెబుతుంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వీర(విష్ణు విశాల్) ఊర్లో ఓ పెద్ద ఆసామీ. తల్లిదండ్రులు చిన్నప్పుడే చనిపోవడంతో మామయ్య(కరుణాస్) పెంచి పెద్ద చేస్తాడు. వీర ఎలాంటి లక్ష్యం లేకుండా ఊర్లో బలాదూర్‌గా తిరుగుతుంటాడు. వయసు పెరిగిపోతుండటంతో పెళ్లిచేయాలనుకుంటారు. తను పెళ్లి చేసుకునే అమ్మాయి పెద్దగా చదువుకోవద్దని, తన చెప్పుచేతల్లో ఉండాలని కండీషన్స్ పెట్టుకుంటాడు వీర. తనకంటే ఎక్కువగా చదువుకుందని చాలా సంబంధాలను రిజెక్ట్ చేస్తుంటాడు. మరోవైపు రెజ్లర్ అయిన కారణంగా కీర్తిని పెళ్లి చేసుకోవడానికి ఎవరూ ముందుకు రారు. ఈ నేపథ్యంలో కీర్తి బాబాయ్‌కి ఓ ఐడియా వస్తుంది. కీర్తికి ఏడో తరగతి వరకే చదువుకుందని, పెద్ద జడ ఉందని అబద్దం చెప్పి వీరాతో పెళ్లి చేస్తాడు. కానీ వీరాకు ఓ రోజు కీర్తి ఓ రెజ్లర్ అనే నిజం తెలుస్తుంది. అలాగే ఆమెకు పెద్ద జడలేదని, అది విగ్ అని వెలుస్తుంది. ఆ తర్వాత వీర పరిస్థితి ఏంటి? నిజం తెలిసిన తర్వాత వీర, కీర్తిల మధ్య ఎలాంటి గొడవలు ఏర్పడ్డాయి? కుస్తీ పోటీలో భార్యతో వీర ఎందుకు పోటీ పడ్డాడు? విడాకుల వరకు వెళ్లిన వీరిద్దరు మళ్లీ ఎలా కలిశారు? అనేదే మిగతా కథ. ఎలా ఉందంటే.. లింగ బేధం లేదని ఎంత చెప్పినా కూడా ఇప్పటికీ చాలా చోట్ల స్త్రీలకు సరైన గౌరవం ఉండడం లేదు. వాళ్లను చిన్న చూపుగా చూసేవాళ్లు ఇప్పటికీ ఉన్నారు. ముఖ్యంగా భార్యల విషయంలో చాలా మంది భర్తలు చులకనగా వ్యవహరిస్తారు. తన ఇష్టాలను ఆమె గౌరవించాలి కానీ.. భార్య ఇష్టాయిష్టాలతో తనకు సంబంధం లేదనే భర్తలు ఇప్పటికీ ఉన్నారు. అది తప్పని, భార్య ఇష్టాయిష్టాలను కూడా భర్తలు గౌరవించాలని చాటి చెప్పే చిత్రమే ‘మట్టి కుస్తీ’. ఓ మంచి సందేశాన్ని కామెడీ వేలో ప్రేక్షకులకు అర్థమయ్యేలా చెప్పడంలో దర్శకుడు చెల్ల అయ్యావు సఫలం అయ్యాడు. టైటిల్ చూస్తే ఇదేదో స్పోర్ట్స్ డ్రామా అనుకుంటాం. కానీ ఇది పక్కా ఫ్యామిలీ ఎంటర్టైనర్. కొత్తగా పెళ్లైన భార్యాభర్తల మధ్య వచ్చే మనస్పర్థలు, గొడవల నేపథ్యంలో కథనం సాగుతుంది. ఈ నేపథ్యంతో తెలుగులో చాలా సినిమాలు వచ్చాయి కానీ ఫ్యామిలీ డ్రామాకి, స్పోర్ట్స్ యాంగిల్‌ని మేళవించడం ‘మట్టి కుస్తీ’ స్పెషల్. సినిమా అంతా కామెడీ కామెడీగా సాగుతుంది. తను అనుకున్నట్లుగా భార్య పెద్దగా చదువుకోలేదని, పెద్ద జడ ఉందని భావించే హీరో.. రెజ్లర్ అన్న విషయం భర్తకు తెలియకుండా మ్యానేన్ చేసే క్రమంలో హీరోయిన్ పడే ఇబ్బందులతో ఫస్టాఫ్ అంతా ఫన్‌గా సాగుతుంది. కథంతా ఊహకందేలా సాగుతున్నా.. ఎక్కడా బోర్ కొట్టదు. ఇంటర్వెల్ ముందు హీరోయిన్ చేసే ఫైట్ సీన్ ఆకట్టుకుంటుంది. హీరోయిన్ రెజ్లర్ అనే విషయం హీరోకి తెలియడంతో ఫస్టాఫ్ ముగుస్తుంది. ఇక సెకండాఫ్‌లో హీరో పరిస్థితి రివర్స్ అవుతుంది. ఊరి జనాలంతా తన కంటే భార్యకే ఎక్కువ రెస్పెక్ట్ ఇవ్వడం.. అందరి ముందు తన పరువు తీసిందని భార్యపై కోపం పెంచుకోవడం.. ఈ క్రమంలో హీరో చేసే పనులు థియేటర్స్‌లో నవ్వులు పూయిస్తాయి. అయితే భార్య భర్తల ఇగో క్లాషెస్‌ని కామెడీగా చూపిస్తూనే ఎమోషనల్ యాంగిల్‌ని టచ్ చేశాడు దర్శకుడు. భార్యలు ఎప్పుడూ తమ చెప్పుచేతుల్లోనే ఉండాలనే భర్తల ఆలోచన తప్పనే విషయాన్ని వినోదాత్మకంగా చూపించాడు. ఎవరెలా చేశారంటే.. హీరోగా ఒక్కో మెట్టు ఎక్కుతున్నాడు విష్ణు విశాల్. కొత్తదనం ఉన్న కథలను ఎంచుకుంటూ కోలీవుడ్‌లో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకున్నాడు. . `రాక్షసన్` చిత్రంతో అక్కడ భారీ విజయాన్ని అందుకున్నాడు. ఇక మరో ప్రయోగంగా మట్టి కుస్తీ చేశాడు. ఇందులో వీర పాత్రకి పూర్తి న్యాయం చేశాడు. తనదైన కామెడీతో నవ్వించాడు. కీర్తి పాత్రలో ఐశ్యర్యలక్ష్మీ ఒదిగిపోయింది. ఈ సినిమాలో ఆమె పాత్ర చాలా కీలకం. హీరోతో సమానంగా ఆమె పాత్ర సాగుతుంది. యాక్షన్ సీన్స్‌లో అదరగొట్టేసింది. వీర మామయ్యగా కరుణాస్, కీర్తి బాబాయ్‌గా మునీష్ కాంత్‌తో పాటు మిగిలన నటీనటులు తమ పాత్రల పరిధిమేర నటించారు. ఇక సాంకేతిక విషయాలకొస్తే.. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం బాగుంది. పాటలు తమిళ నెటివిటీకి తగ్గట్లుగా ఉంటాయి. రిచర్డ్ ఎం నాథన్ సినిమాటోగ్రఫీ బాగుంది. ఎడిటింగ్ పర్వాలేదు. ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్లు ఉన్నతంగా ఉన్నాయి. -అంజి శెట్టి, సాక్షి వెబ్‌డెస్క్ -
అలాంటి పాత్రలే చేయాలనుకుంటున్నాను: ఐశ్వర్యా లక్ష్మీ
‘‘తెలుగు సినిమాలకు గొప్ప ఆదరణ లభిస్తోంది. ఇండియాలో టాలీవుడ్ బిగ్గెస్ట్ ఇండస్ట్రీగా ఎదిగింది. తెలుగు ప్రేక్షకులకు సినిమాలపై ఉన్న ప్రేమాభిమానాలే ఇందుకు కారణం’’ అన్నారు హీరోయిన్ ఐశ్వర్యా లక్ష్మీ. విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మి జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘మట్టి కుస్తీ’. విష్ణు విశాల్‌తో కలిసి రవితేజ నిర్మించిన ఈ చిత్రం డిసెంబరు 2న రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా ఐశ్వర్యా లక్ష్మీ మాట్లాడుతూ– ‘‘మూడేళ్ల క్రితమే ‘మట్టి కుస్తీ’ స్క్రిప్ట్ నా దగ్గరకు వచ్చింది. అయితే హీరోయిన్ పాత్ర సవాల్‌తో కూడుకున్నది. అందుకే ఓకే చెప్పలేదు. కానీ ఆశ్చర్యకరంగా మళ్లీ ఈ కథ నా వద్దకే వచ్చింది. ఈ గ్యాప్‌లో కొన్ని సినిమాలు చేసి, ఆత్మవిశ్వాసాన్ని కూడగట్టుకున్నాను. దాంతో ఈసారి ఓకే చెప్పాను. ఈ సినిమా ఎందుకు సవాల్‌గా అనిపించిందంటే నాకు టఫ్‌గా అనిపించే కామెడీని డీల్ చేయాల్సి వచ్చింది. ఇగో, వినోదం, ఎమోషన్స్ అన్నీ ఉన్న ఫ్యామిలీ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఇక కథల ఎంపికలో నాకు తొందరలేదు. ప్రేక్షకులు నన్ను గుర్తు పెట్టుకునే పాత్రలే చేయాలనుకుంటున్నాను’’ అన్నారు. -
మట్టి కుస్తీ మూవీ టీంతో " స్పెషల్ చిట్ చాట్ "
-
తెలుగింటి అల్లుడిని.. మంచి కంటెంట్ ఉన్న ‘మట్టి కుస్తీ’ తో వచ్చా: విష్ణు విశాల్
కోలీవుడ్ స్టార్ విష్ణు విశాల్ హీరో గా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా ‘మట్టి కుస్తీ’. ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను ‘ఆర్ టీ టీమ్ వర్క్స్’, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్స్ పై మాస్ మహారాజా రవితేజ తో కలిసి విష్ణు విశాల్ నిర్మించారు. ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదల అవుతోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ జోరుగా ప్రమోషన్స్ చేస్తోంది. ప్రమోషన్స్‌లో భాగంగా శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని ప్రముఖ ఏ ఎం బీ మాల్ లో మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఫ్యాన్స్ తో ఇంటరాక్షన్ కోసం నిర్వహించిన ఈ మీట్ అండ్ గ్రీట్ కార్యక్రమంలో హీరో విష్ణు విశాల్, హీరోయిన్ ఐశ్వర్య లక్ష్మి పాల్గొని సందడి చేశారు. సినిమాలోని పాటకు స్టెప్పులేసి అభిమానులను అలరించారు. అనంతరం విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘నేను జ్వాలా గుత్తాను పెళ్లి చేసుకున్న విషయం మీకు తెలిసిందే. నేను తెలుగింటి అల్లుడిని. నేను జ్వాలాని పెళ్లి చేసుకున్నాక తెలుగు సినిమాలు చేయమని జ్వాలా నన్ను హైదరాబాద్ కు తీసుకొచ్చింది. నా కెరీర్ లో అతిపెద్ద సినిమా ‘మట్టి కుస్తీ’తో ఇప్పుడు నేను మీ ముందుకు వచ్చాను. ఇందుకు కారణమైన జ్వాలాకు, నన్ను నమ్మి సినిమాను నిర్మించిన రవితేజ సర్ కు ధన్యవాదాలు. రాక్షసన్, అరణ్య, ఎఫ్ఐఆర్ సినిమాల ద్వారా తెలుగు ప్రేక్షకులకు నేను తెలుసు. ఇప్పుడు మట్టి కుస్తీతో మీ ముందుకు వస్తున్నా. ఎంటర్ టైన్ మెంట్, కంటెంట్ ఉన్న సినిమాలను తెలుగు ఆడియన్స్ ఎంతగానో ఆదరిస్తారు. మా మట్టి కుస్తీ లో ఎంటర్టైన్మెంట్ తో పాటు మంచి కంటెంట్ ఉంది. ఏ హీరో, ఏ భాష అనేది చూడకుండా కంటెంట్ ను మాత్రమే చూసి ఆదరించే తెలుగు ప్రేక్షకులపై నాకు ఎంతో గౌరవం ఉంది. ఈ సినిమాలో మంచి మెసేజ్ కూడా ఉంది. అందరూ ఈ సినిమాను థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయాలని కోరుతున్నా’ అన్నారు. ఐశ్వర్య లక్ష్మి మాట్లాడుతూ.. ‘నేను చేసిన ‘అమ్ము’, ‘పొన్నియన్ సెల్వన్’ సినిమాలను తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఆదరించారు. అలాగే ఈ ‘మట్టి కుస్తీ’ సినిమాను కూడా థియేటర్లలో చూసి ఆదరించాలని కోరుకుంటున్నా. రవితేజ సర్ విష్ణు విశాల్ సర్ ను నమ్మి ఖర్చుకు వెనకాడకుండా ఎంతో గ్రాండియర్ గా ఈ సినిమాను నిర్మించారు. రవితేజ గారి వల్లే నేను ఇప్పుడు మీ ముందుకు వచ్చా. డిసెంబర్ 2న థియేటర్లలో మా సినిమాను చూసి ఆదరించండి’ అన్నారు. -
ఆ హీరోకు నా మనసులో ప్రత్యేక స్థానం: విష్ణు విశాల్
విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఫ్యామిలీ, స్పోర్ట్స్ డ్రామా 'మట్టి కుస్తీ'. ఐశ్వర్య లక్ష్మి కథానాయిక. 'ఆర్ టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై మాస్ మహారాజా రవితేజతో కలిసి విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం డిసెంబర్ 2న ప్రపంచవ్యాప్తంగా విడుదలవుతోంది. ఈ నేపథ్యంలో హీరో విష్ణు విశాల్ చిత్ర విశేషాలని పంచుకున్నారు. ► 'మట్టి కుస్తీ' భార్యభర్తల ప్రేమ కథ. భార్యభర్తల మధ్య జరిగే ఇగో కుస్తీ. కేరళలో మట్టికుస్తీ అనే స్పోర్ట్ వుంది. ఇందులో హీరోయిన్ కేరళ అమ్మాయి. అలా ఈ చిత్రానికి మట్టికుస్తీ అనే పేరు పెట్టాం. ► ఇందులో నేను కబడ్డీ ప్లేయర్‌ను, కానీ కుస్తీ ఆటకి వెళ్తాను. అలా ఎందుకు వెళ్ళాల్సి వచ్చిందో.. సినిమా చూసినప్పుడు చాలా సర్ ప్రైజింగ్‌గా ఉంటుంది. ► 'ఎఫ్ఐఆర్' సినిమాను తెలుగులో విడుదల చేసే సమయంలో ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ ద్వారా రవితేజ గారిని కలిశాను. నేను చేసే సినిమాలు రవితేజ గారికి చాలా నచ్చాయి. ఎఫ్ఐఆర్ ట్రైలర్ ఆయనకి చాలా నచ్చింది. ఆ సినిమాని ప్రజెంట్ చేశారు. ఆ సమయంలోనే తర్వాత ఏం చేస్తున్నావని అడిగారు. అప్పుడు ఈ లైన్ చెప్పాను. అది వినగానే ఖచ్చితంగా విజయం సాధిస్తుందని ప్రొడ్యూస్ చేస్తానని చెప్పారు. అలా జర్నీ మొదలైయింది. రవితేజ గారు నన్ను ఎంతో నమ్మారు. 13 ఏళ్లుగా తమిళ ఇండస్ట్రీలో వున్నాను. ఏదైనా ఒక ప్రాజెక్ట్ గురించి ఎవరినైనా కలిస్తే నా బిజినెస్, మార్కెట్ గురించి మాట్లాడేవారు. కానీ రవితేజ గారు ఒక్క మీటింగ్‌లో నన్ను సంపూర్ణంగా నమ్మారు. ఆయన నమ్మకం నాకు ఎంతో కాన్ఫిడెన్స్ ఇచ్చింది. ఆయనకి మనసులో ఎప్పుడూ ప్రత్యేక స్థానం వుంటుంది. ► నేను మొదట్లో క్రికెట్‌ను ప్రేమించాను. సినిమాని పెళ్లి చేసుకున్నాను. రెండూ ఇష్టమే. అయితే క్రికెటర్‌గా చేయాలన్నది నా డ్రీమ్ రోల్. అలాగే సూపర్ హీరో పాత్రని కూడా చేయాలని ఉంది. ► ప్రతి ఇండస్ట్రీకి ఒక యూనిక్ నెస్ వుంటుంది. బాహుబలితో తెలుగు సినిమా ప్రపంచ దృష్టిని ఆకర్షించింది. ఆర్ఆర్ఆర్, పుష్ప, కేజీఎఫ్, కాంతారా , విక్రమ్, పీఎస్ 1 ఇలా అన్ని పరిశ్రమ నుంచి మంచి చిత్రాలు వస్తున్నాయి. ఇప్పుడు సౌత్‌లో గొప్ప వాతావరణం వుంది. ఇండియన్ సినిమాలో సౌత్ గురించి ఇప్పుడు గొప్పగా మాట్లాడుకోవడం మనం చూస్తున్నాం. ► నా భార్య జ్వాలా సినిమాలు ఎక్కువ చూస్తుంది, కానీ నటన పట్ల ఆసక్తి లేదు. ఇదివరకు ఎప్పుడో ఒక పాటలో కనిపించింది. ఆ విషయంలో ఇప్పటికీ రిగ్రేట్ ఫీలవుతుంటుంది. ఇంకెప్పుడూ తనని నటించమని అడగొద్దని చెప్పింది( నవ్వుతూ) ► నా నిర్మాణంలో ఇంకా మూడు సినిమాలు ఉన్నాయి. మోహన్ దాస్ చిత్రం చిత్రీకరణలో వుంది. సత్యజ్యోతి దర్శకత్వంలో ఓ సినిమా ఉంటుంది. జనవరిలో మరో సినిమా ప్రకటన వస్తుంది. రజనీకాంత్ గారి లాల్ సలాం చిత్రంలో నటిస్తున్నా. చదవండి: మార్ఫింగ్ ఫొటోలు వైరల్.. పోలీసులకు పవిత్ర లోకేశ్ ఫిర్యాదు ఫైమా చేతిలో ఎలిమినేషన్, ఎవరు ఎలిమినేట్ అవుతారంటే? -
విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' నుంచి లిరికల్ సాంగ్ అవుట్
విష్ణు విశాల్, ఐశ్వర్యా లక్ష్మీ జంటగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందుతున్న స్పోర్స్ డ్రామా మట్టి కుస్తీ. హీరో రవితేజ, విష్ణు విశాల్ నిర్మించిన ఈ సినిమా డిసెంబర్2న విడుదల కానుంది. ఈ సందర్భంగా ఈ సినిమా నుంచి చల్ చక్కని చిలక.. చిరునవ్వుల చక్కెర గుళిక.. అంటూ సాగే పాట లిరికల్ వీడియోను విడుదల చేశారు. సంగీత దర్శకుడు జస్టిన్ ప్రభాకరణ్ స్వరపరచిన ఈ పాటకు రెహమాన్ సాహిత్యం అందించగా హేమచంద్ర పాడారు. -
'అమాయకమైన ఆంధ్రప్రదేశ్ అబ్బాయిలు ఎక్కడా దొరకరమ్మా'.. ఆసక్తిగా ట్రైలర్
విష్ణు విశాల్, ఐశ్వర్య లక్ష్మి జంటగా తెరకెక్కిన చిత్రం 'మట్టి కుస్తీ'. ఈ చిత్రానికి చెల్లా అయ్యావు దర్శకత్వం వహించారు. రవితేజ, విష్ణు విశాల్ సంయుక్తంగా ఈ సినిమాను తెరకెక్కించారు. తాజాగా ఈ సినిమా ట్రైలర్ విడుదల చేసింది చిత్రబృందం. ట్రైలర్ చూస్తే.. ' ఇంకోసారి పిల్లను చూడమని నన్ను అడక్కు. మన అల్లుడికి పెళ్లయిందా రత్నం. ఈ జన్మలో అవ్వదు.' అనే డైలాగ్‌తో ట్రైలర్ ప్రారంభమైంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ప్రేమకథతో పాటు కామెడీ ఎంటర్టైనర్ను తలపించేలా ఉంది. హీరో ఈ సినిమాలో రెజ్లర్‌గా కనిపించనున్నారు. కేరళ అమ్మాయితో ఆంధ్ర అబ్బాయి మధ్య ప్రేమకథ ఆసక్తికరంగా కనిపిస్తోంది. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమా డిసెంబర్2న థియేటర్లలో ఈ మూవీ సందడి చేయనుంది. ఈ సినిమాకు జస్టిన్ ప్రభాకరణ్ సంగీతమందిస్తున్నారు. -
విష్ణు విశాల్ కొత్త సినిమా 'మట్టి కుస్తీ' రిలీజ్ డేట్ ఫిక్స్
వెండితెరపై రెజ్లర్‌గా తన సత్తా ఏంటో చూపేందుకు విష్ణు విశాల్ రెడీ అయ్యారు. విష్ణు విశాల్ హీరోగా చెల్లా అయ్యావు దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా మట్టి కుస్తీ. ఇందులో ఐశ్వర్య లక్ష్మి హీరోయిన్. ఎఫ్ఐఆర్ చిత్రం తర్వాత హీరోలు రవితేజ, విష్ణు విశాల్ కలిసి నిర్మించిన చిత్రం ఇది. ఈ సినిమా డిసెంబర్2న రిలీజ్ కానుంది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. ఈ సినిమాకు సంగీతం: జస్టిన్ ప్రభాకరణ్, కెమెరా: రిచర్డ్ ఎం. నాథన్. -
ఎట్టకేలకు విడుదలకు సిద్ధమైన విజయ్ సేతుపతి, విష్ణు విశాల్ చిత్రం
విజయ్ సేతుపతి, విష్ణు విశాల్, నటి ఐశ్వర్య రాజేశ్, నందితా శ్వేత ప్రధాన పాత్రలు పోషించిన చిత్రం ‘ఇడమ్ పొరుళ్ ఎవల్’. వైవిధ్య భరిత కథా చిత్రాల దర్శకుడు శీను రామస్వామి దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని తిరుపతి బ్రదర్స్ పతాకంపై దర్శకుడు లింగుస్వామి సమర్పణలో సుభాష్ చంద్రబోస్ నిర్మించారు. యువన్ శంకర్ రాజా సంగీతాన్ని అందించిన ఈ చిత్రం 2014లోనే విడుదల కావాల్సింది. అయితే ఆర్థికపరమైన సమస్యల కారణంగా ఆగిపోయింది. కాగా న్యాయస్థానం ఆదేశంతో 8 ఏళ్ల తరువాత ఇప్పుడు విడుదలకు సిద్ధమవుతోంది. దీంతో చిత్ర ట్రైలర్‌ను దీపావళి సందర్భంగా చిత్ర యూనిట్ విడుదల చేసింది. నిజానికి ఈ చిత్రంపై అప్పట్లో మంచి అంచనాలు ఏర్పడ్డాయి. కారణం దర్శకుడు శీను రామస్వామి కావడమే. కుటుంబ నేపథ్యంలో సాగే ఈ చిత్రం ఎప్పుడు తెరపైకి వస్తుందా? అన్న ఆసక్తి నెలకొంది. ఇన్నాళ్లకు విముక్తి కలిగింది. అయితే ఈ చిత్రాన్ని ఎప్పుడు విడుదల చేసేదీ? అది థియేటర్లలో విడుదల అవుతుందా? ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా? అన్న విషయంలో మేకర్స్ నుంచి క్లారిటీ రాలేదు. -
భర్త విష్ణు విశాల్ సినిమా షూటింగ్‌కి వచ్చిన గుత్తా జ్వాల
తమిళసినిమా: విష్ణు విశాల్ కథానాయకుడిగా నటిస్తున్న నూతన చిత్రానికి ఆర్యన్ అనే టైటిల్ నిర్ణయించారు. వైవిధ్య భరిత కథలను ఎంపిక చేసుకుని నటించే విష్ణు విశాల్ మరోసారి ఈ చిత్రం ద్వారా యాక్షన్ హీరోగా కనిపించబోతున్నారు. క్రైమ్, థ్రిల్లర్ నేపథ్యంలో సాగే ఇందులో ఆయన పోలీసు అధికారిగా నటించనున్నారు. సుబ్రా, ఆర్యన్ రమేష్‌ల సమర్పణలో విష్ణు విశాల్ స్టూడియోస్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రవీణ్ కథ, దర్శకత్వం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. దర్శకుడు సెల్వరాఘవన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఇందులో నటి శ్రద్ధా శ్రీనాథ్, వాణి భోజన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కాగా ఈ చిత్ర షూటింగ్ శనివారం చెన్నైలో పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. ఈ కార్యక్రమానికి పలువురు సినీ ప్రముఖులు హాజరై చిత్ర యూనిట్‌కు శుభాకాంక్షలు అందించారు. చిత్ర వివరాలను దర్శకుడు తెలుపుతూ రాక్షసన్ చిత్రం తరువాత విష్ణు విశాల్ ఇందులో పోలీసు అధికారిక ఫవర్‌ఫుల్ పాత్రను పోషిస్తున్నట్లు చెప్పారు. చిత్రం ఊహించని మలుపులతో పలు ఆసక్తికరమైన సన్నివేశాలతో సాగుతుందన్నారు. దీనికి విష్ణు సుభాష్ ఛాయాగ్రహణం, శ్యామ్ సీఎస్ సంగీతాన్ని అందిస్తున్నారు. -
భర్త న్యూడ్ ఫొటోలు తీసిన హీరో భార్య.. వైరల్
ఇప్పుడు సినీ ఇండస్ట్రీలోకి కొత్త ట్రెండ్ వచ్చింది. అదే న్యూడ్ ఫొటో షూట్. విజయ్ దేవరకొండ 'లైగర్' మూవీ ప్రమోషన్స్‌తో మొదలైన ఈ ట్రెండ్‌ను వివిధ హీరోలు, నటులు ఫాలో అవుతూ కొనసాగిస్తున్నారు. విజయ్ దేవరకొండ తర్వాత ఓ బ్రాండ్ ప్రమోషన్స్‌లో భాగంగా బాలీవుడ్ నటుడు రాహుల్ ఖన్నా అర్ధనగ్నంగా ఫొటోలు దిగి నెట్టింట్లో పోస్ట్ చేశాడు. ఆ ఫొటోలు చూసిన నెటిజన్స్ దుమ్మెత్తిపోశారు. ఇటీవల బాలీవుడ్ యంగ్ హీరో రణ్వీర్ సింగ్ ఓ మ్యాగజైన్ కోసం నగ్నంగా ఫొజులిచ్చి సెన్సేషన్ క్రియేట్ చేశాడు. ఇక ఈ ఫొటోషూట్‌ను నెటిజన్లు చీల్చి చెండాడారు. తాజాగా మరో హీరో ఇలాంటి న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేశాడు. దానికి 'ఈ ట్రెండ్‌లో నేను కూడా జాయిన్ అయ్యా' అంటూ చెప్పుకొచ్చాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో కాదు విభిన్నమైన సినిమాలతో అలరించే తమిళ హీరో విష్ణు విశాల్. రానా నటించిన 'అరణ్య'లో ఓ పాత్రతోపాటు ఇటీవల 'ఎఫ్ఐఆర్' సినిమాతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. విష్ణు హీరోగానే కాకుండా ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, తెలుగు అమ్మాయి గుత్తా జ్వాల భర్తగా సుపరిచితమే. చదవండి: సమంత యాటిట్యూడ్‌కు స్టార్ హీరో ఫిదా.. సినిమాలో అవకాశం! దిగొచ్చిన శ్రావణ భార్గవి.. ఆ వీడియో డిలీట్.. నడుము కింద వరకు కనిపించేలా, కేవలం దుప్పటి మాత్రమే అడ్డుపెట్టుకుని సెమీ న్యూడ్ ఫొటోలను సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశాడు విష్ణు విశాల్. 'నా భార్య గుత్తా జ్వాల ఫొటోగ్రాఫర్‌గా మారడంతో నేను కూడా ఈ ట్రెండ్‌లో జాయిన్ అయ్యా' అంటూ ట్వీట్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫొటో కూడా నెట్టింటి వైరల్ అవుతోంది. ఇకపోతే ఈ సెమీ న్యూడ్ ఫొటోలను ట్రెండ్‌గా తీసుకోని ఇంకెంతమంది హీరోలు ఫాలో అవుతారో చూడాలి. Well... joining the trend ! P.S Also when wife @Guttajwala turns photographer... pic.twitter.com/kcvxYC40RU — VISHNU VISHAL (VV) (@TheVishnuVishal) July 23, 2022 చదవండి: మిస్ ఇండియా సినీ శెట్టికి ఇష్టమైన తెలుగు హీరో అతడే.. ధనుష్ నటించిన హాలీవుడ్ చిత్రం 'ది గ్రే మ్యాన్' రివ్యూ.. -
రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ మరో సినిమా..
Ravi Teja Presenting Vishnu Vishal Movie Titled Matti Kusthi: కోలీవుడ్ యంగ్ హీరో విష్ణు విశాల్ కథానాయకుడిగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్ఐఆర్'. విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళంలో ఫిబ్రవరి 11న విడుదలై మంచి పాజిటివ్ టాక్ సంపాందించుకుంది. మాస్ మహారాజ రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ సినిమాను తెలుగులో విడుదల చేశారు. అనేక వివాదాల నడుమ రిలీజైన ఈ మూవీ విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. అయితే తాజాగా రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ మరో సినిమా రానుంది. రవితేజ సమర్పణలో విష్ణు విశాల్ 'మట్టి కుస్తీ' అంటూ క్రీడా నేపథ్యంలో వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. చదవండి: రవితేజ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు: విష్ణు విశాల్ ఆర్టీ టీమ్ వర్క్స్, విష్ణు విశాల్ స్టూడియోస్ బ్యానర్లపై డైరెక్టర్ చెల్లా అయ్యావు ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీ టైటిల్‌ను చిత్రబృందం మంగళవారం (ఏప్రిల్ 5) ప్రకటిస్తూ 'మట్టి కుస్తీ' మోషన్ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. సినిమా టైటిల్‌కు తగ్గట్టుగానే కుస్తీ ఆధారంగా ఈ చిత్రం రూపొందనున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీలో విష్ణు విశాల్‌కు జోడిగా ఐశ్వర్య లక్ష్మీ హీరోయిన్గా నటించనుంది. జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించగా.. 'మట్టి కుస్తీ' రెగ్యూలర్ షూటింగ్ బుధవారం (ఏప్రిల్ 6) నుంచి ప్రారంభమవుతుందని చిత్ర యూనిట్ ప్రకటించింది. -
ఓటీటీలో కోలీవుడ్ హీరో FIR మూవీ, స్ట్రీమింగ్ ఎప్పుడంటే..
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్ రీసెంట్గా నటించిన చిత్రం ఎఫ్ఐఆర్. ఫిబ్రవరి 11న తమిళం, తెలుగులో ఏకకాలంలో విడుదలైన ఈ సినిమా పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అయితే తాజాగా ఈ చిత్రం ఓటీటీలోకి రానుంది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాం అమెజాన్ ప్రైమ్‌లో ఈనెల 11నుంచి ఈ సినిమా స్ట్రీమింగ్ కానుంది. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విష్ణు విశాల్ స్వీయ నిర్మాణంలో తెరకెక్కించారు. తెలుగులో రవితేజ సమర్పణలో అభిషేక్ నామా విడుదల చేశారు.ఇందులో డైరెక్టర్ గౌతమ్ మీనన్ పోలీసు అధికారిగా నటించగా, మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ కీలక పాత్రల్లో కనిపించారు. -
కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌కి షాక్.. FIR మూవీ బ్యాన్
Vishnu Vishal FIR Movie Banned: కోలీవుడ్ హీరో విష్ణు విశాల్‌కి షాక్ తగిలింది. తాజాగా ఆయన నటించిన చిత్రం FIR(ఎఫ్ఐఆర్ )నేడు(ఫిబ్రవరి11)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. పాజిటివ్ రెస్పాన్స్‌తో దూసుకెళ్తున్న ఈ సినిమాకు మూడు దేశాలు షాకిచ్చాయి. కువైట్, మలేషియా, ఖతార్‌లతో ఈ చిత్రాన్ని బ్యాన్ చేశారు. ఈ విషయాన్ని స్వయంగా విష్ణు విశాల్ వెల్లడించాడు. సినిమాలోని ప్రధాన కంటెంట్ కారణంగా అక్కడ సెన్సార్‌ని క్లియర్ చేయకపోవడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. దీంతో మలేషియా, కువైట్, ఖతార్ ఫ్యాన్స్‌కు హీరో విష్ణు విశాల్ క్షమాపణలు చెప్పాడు. కాగా ఈ సినిమాలో విష్ణు ముస్లిం యువకుడిగా నటించగా, గౌతమ్ మీనన్ పోలీసు అధికారిగా నటించాడు. మంజిమా మోహన్, రైజా విల్సన్, రెబా మోనికా జాన్, గౌరవ్ నారాయణన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్ ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషించారు. 😔🤫🤫 Sorry #MALAYSIA and #KUWAIT audience... https://t.co/mUDZA3mJK4 — IRFAN AHMED (ABA) (@TheVishnuVishal) February 10, 2022 -
రవితేజ లేకపోతే ఇది సాధ్యమయ్యేదే కాదు: విష్ణు విశాల్
విష్ణు విశాల్ హీరోగా, నటించి నిర్మించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను తెలుగులో హీరో రవితేజ, అభిషేక్ నామా విడుదల చేస్తున్నారు. ఈ చిత్రం ఈ నెల 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. ఈ సందర్భంగా జరిగిన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో విష్ణు విశాల్ మాట్లాడుతూ – ‘‘రవితేజ నాకు బ్రదర్‌లాంటివారు. మీరు (రవితేజ) హీరోగా నటించిన ‘ఖిలాడి’, ‘ఎఫ్ఐఆర్’ ఒకేసారి విడుదలవుతున్నాయని నేను అన్నప్పుడు ‘అయితే.. ఏంటి?’ అన్నట్లు ఆయన కూల్‌గా రిప్లై ఇచ్చారు. రవితేజగారు లేకపోయినట్లయితే తెలుగులో ‘ఎఫ్ఐఆర్’ రిలీజ్ సాధ్యమయ్యేది కాదు. తెలుగులో స్ట్రయిట్ ఫిల్మ్స్ కూడా చేస్తాను’’ అన్నారు. ‘‘విష్ణు విశాల్గారిని హీరోగా అనుకుని ఆయనకు ఈ కథ చెప్పాను. కానీ పరిస్థితుల కారణంగా హీరోగా నటించడంతో పాటు ఆయన నిర్మించాల్సి వచ్చింది కూడా. చిన్న ప్రాజెక్ట్‌గా మొదలైన ఈ సినిమా ఇప్పుడు పెద్ద సినిమా అయింది’’ అన్నారు మను ఆనంద్. ‘‘ఎఫ్ఐఆర్’ సినిమాను తెలుగులో రిలీజ్ చేయాలని విష్ణు విశాల్‌తో చెప్పాను. మాకు సపోర్ట్ చేసిన రవితేజకు ధన్యవాదాలు’’ అన్నారు బ్యాడ్మింటన్ క్రీడాకారిణి, విష్ణు విశాల్ సతీమణి గుత్తా జ్వాల. ‘‘సాహసం శ్వాసగా సాగిపో’ తర్వాత నేను ఈ సినిమాతో మళ్లీ తెలుగు ప్రేక్షకుల ముందుకు వస్తున్నాను’’ అన్నారు మంజిమా మోహన్. ఈ కార్యక్రమంలో సందీప్ కిషన్, సిద్ధు జొన్నలగడ్డ పాల్గొని ‘ఎఫ్ఐఆర్’ సినిమా విజయం సాధించాలని కోరుకున్నారు. -
రవితేజగారు హిట్టవుతుందన్నారు
‘‘నా కెరీర్లో ‘రాక్షసన్’ కంటే ముందు కూడా మంచి హిట్స్ ఉన్నాయి. కానీ నా మార్కెట్‌ను పెంచిన చిత్రం ‘రాక్షసన్’. ఈ సినిమా తర్వాత నాకు పెద్ద నిర్మాతలు, దర్శకుల నుంచి మంచి ఆఫర్లు వచ్చాయి. కానీ కొన్ని కారణాలతో ఆ సినిమాలు మధ్యలోనే ఆగిపోయాయి. ఇలా ఎందుకు జరుగుతోంది? అనే కోపంతోనే నిర్మాతనయ్యాను’’ అని విష్ణువిశాల్ అన్నారు. విష్ణు విశాల్ హీరోగా నటించి, నిర్మించిన తమిళ చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వం వహించిన ఈ సినిమా తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ సినిమాను తెలుగు ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. ఈ సందర్భంగా విష్ణు విశాల్ చెప్పిన విశేషాలు. ► ముందు మను ఆనంద్ ఓ యాక్షన్ స్టోరీ చెప్పారు. వేరే కథ ఉందా? అని అడిగితే ‘ఎఫ్ఐఆర్’ సినిమా లైన్ చెప్పారు. నేను ఈ లైన్‌కి ఓకే చెప్పడంతో ఆయన ఆశ్యర్యపోయారు. ఎందుకంటే ఇలాంటి ఓ సున్నితమైన కథను నేను ఒప్పుకుంటానని ఆయన ఊహించలేదు. ఈ సినిమాను నా స్నేహితుడు ఒకరు నిర్మించాల్సింది కానీ పరిస్థితుల కారణంగా నేనే నిర్మాతగా మారాల్సి వచ్చింది. నేను ఎప్పుడు కులాలు, మతాలు అని చూడను. ఈ సినిమాలో ఏ మతాన్ని, ఎవ్వర్నీ తక్కువగా చూపించలేదు. మతం కంటే మాన వత్వం గొప్పది అని చెప్పే ప్రయత్నం చేస్తున్నాం. ► నా భార్య జ్వాల (బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల) ఫ్రెండ్ ఒకరు రవితేజ దగ్గర వర్క్ చేస్తున్నారు. అలా ‘ఎఫ్ఐఆర్’ సినిమా గురించి రవితేజతో మాట్లాడటం జరిగింది. ఈ సినిమా రఫ్ కట్ చూసిన రవితేజగారు తప్పకుండా హిట్ అవుతుందన్నారు. ‘మీలా నేను కమర్షియల్ సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అని నేను రవితేజతో అంటే.. ‘ నేను నీలా కంటెంట్ బేస్డ్ సినిమాలు చేయాలనుకుంటున్నాను’ అన్నారు. -
తండ్రి మాటలకు స్టేజ్‌పైనే కన్నీళ్లు పెట్టుకున్న హీరో విష్ణు విశాల్
Vishnu Vishal Turns Emotional At The FIR Trailer Launch: అరణ్య సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన కోలీవుడ్ హీరో విష్ణు విశాల్. తాజాగా మను ఆనంద్ దర్శకత్వంలో ఆయన నటించిన ఎఫ్ఐఆర్ చిత్రం త్వరలోనే తెలుగు, తమిళంలో ఏకకాలంలో విడుదల కానుంది. ఫిబ్రవరి 11న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సందర్భంగా చెన్నైలో నిర్వహించిన ప్రీ రిలీజ్ ఈవెంట్లో విష్ణు విశాల్ తండ్రి, పోలీస్ అధికారి రమేష్ ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మొదటిసారి ఓ సినిమా ఫంక్షన్‌కి గెస్ట్‌గా రావడం సంతోషంగా ఉంది. నా కొడుకు వల్లే ఇక్కడ మీ ముందు నిలబడి మాట్లాడుతున్నాను. నా కొడుకు ఈ స్థాయిలో ఉండటానికి కారణమైన వారందరికి కృతజ్ఞతలు. వాళ్ల అభిమానం, ప్రేమ నా కొడుకుపై ఎప్పుడూ ఉండాలి. ఎఫ్ఐఆర్ సినిమా చూశాను. నాకు బాగా నచ్చింది. మీ అందరికి కూడా నచ్చుతుందని భావిస్తున్నా అని పేర్కొన్నారు. అయితే తండ్రి మాటలకు హీరో విష్ణు విశాల్ భావోద్వేగంతో కంటతడి పెట్టారు. దీనికి సంబంధించిన విజువల్స్ నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. -
యాక్షన్ థ్రిల్లర్‌గా 'ఎఫ్ఐఆర్'.. ట్రైలర్ రిలీజ్ చేసిన నాని
Vishnu Vishal FIR Movie Trailer Released By Hero Nani: విష్ణు విశాల్ హీరోగా మను ఆనంద్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'ఎఫ్ఐఆర్'. విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ్లో ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ సినిమాను తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ఈ చిత్రం ట్రైలర్‌ని నెచురల్ స్టార్ నాని విడుదల చేశారు. నిర్మాతలు మాట్లాడుతూ ‘డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రం ఎఫ్ఐఆర్. ఇర్ఫాన్ అహ్మద్ పాత్రలో విష్ణు విశాల్ ఈజ్‌తో నటించారు. తీవ్రవాదులను నిర్మూలించే ఆఫీసర్ పాత్రను డైరెక్టర్ గౌతమ్ మీనన్ చేశారు' అన్నారు. 2 నిమిషాల 12 సెకండ్లు రన్‌టైమ్ ఉన్న ఎఫ్ఐఆర్ ట్రైలర్ ఆలోచింపజేసేలా ఉంది. అబూ బక్కర్ అబ్దుల్లా అనే భయంకరమైన టెర్రరిస్ట్ కారణంగా ఇర్ఫాన్ అహ్మద్ అనే యువకుడి జీవితంలో ఎలాంటి సంఘటనలు చోటుచేసుకున్నాయనేదే మూవీ కథగా తెలుస్తోంది. విష్ణు విశాల్, రేబా మోనికా జాన్‌ల కెమిస్ట్రీ బాగుండడంతోపాటు గౌతమ్ వాసుదేవ్ మీనన్ యాక్టింగ్ ప్రత్యేక ఆకర్షణ కానుంది. అరుల్ విన్సెంట్ కెమెరా వర్క్, అశ్వంత్ సంగీతం ఆకుట్టుకున్నాయి. Wishing @TheVishnuVishal and team a huge success :) Here’s the telugu trailer of #FIR presented by our own @RaviTeja_offl Anna Release on Feb 11th. https://t.co/r9msCuEsbe@VVStudioz @AbhishekPicture @itsmanuanand @mohan_manjima @raizawilson @Reba_Monica @menongautham pic.twitter.com/rGSoPbpINu — Nani (@NameisNani) February 3, 2022 -
విష్ణువిశాల్ ఎఫ్ఐఆర్ రిలీజ్ డేట్ వచ్చేసింది!
విష్ణు విశాల్ హీరోగా నటించిన చిత్రం ‘ఎఫ్ఐఆర్’. మను ఆనంద్ దర్శకత్వంలో విష్ణు విశాల్ నిర్మించిన ఈ చిత్రం తమిళ, తెలుగు భాషల్లో ఈ నెల 11న విడుదల కానుంది. హీరో రవితేజ సమర్పణలో అభిషేక్ నామా ఈ చిత్రాన్ని తెలుగులో రిలీజ్ చేస్తున్నారు. ‘‘డార్క్ యాక్షన్ థ్రిల్లర్‌గా రూపొందిన చిత్రమిది. సాధారణ జీవితాన్ని గడుపుతున్న ఇర్ఫాన్ అహ్మద్ అనే అమాయక యువకుడి జీవితంలో భయంకరమైన ఐయస్ఐ ఉగ్రవాది అబూ బక్కర్ అబ్దుల్లా పరిశోధన ఆధారంగా ఎలాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? అనేది ‘ఎఫ్ఐఆర్’ మూలకథ’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. -
విపరీతమైన ఒళ్లు నొప్పులు, జ్వరం: విష్ణు విశాల్
తమిళ నటుడు విష్ణు విశాల్ కరోనా బారిన పడ్డాడు. ఈ విషయాన్ని అతడు ఆదివారం నాడు ట్విటర్లో వెల్లడించాడు. '2022.. 'పాజిటివ్' రిజల్ట్‌తో ప్రారంభించాను. అవును, నాకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. గడిచిన వారం రోజుల్లో నన్ను కలిసినవాళ్లందరూ కాస్త జాగ్రత్తగా ఉండండి. విపరీతమైన ఒళ్లు నొప్పులున్నాయి, ముక్కు పనిచేయడం లేదు. గొంతుమంటగా ఉంది. అలాగే జ్వరం కూడా వచ్చింది. వీలైనంత త్వరగా దీని నుంచి బయటపడతానని అనుకుంటున్నాను' అని ట్వీట్ చేశాడు. 2022 Starting wid a +IVE result..🤕 Guys ... Yes im covid +ive... Anyone who came in contact with me in the last 1 week please take care.. Horrific body pains and nose block,itchy throat n also mild fever.. Looking forward to bounce back soon🙏 — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) January 9, 2022 కాగా అతడు జనవరి 7న మాస్ మహారాజ రవితేజతో దిగిన ఫొటో షేర్ చేశాడు. దీంతో విష్ణు రెండు రోజుల క్రితం రవితేను కలిశాడా? అంటూ అభిమానులు ఆరా తీయగా దీనిపై స్పందించిన విష్ణు అది పాత ఫొటో అని, భయపడాల్సిన పని లేదని స్పష్టం చేశాడు. ఇదిలా ఉంటే అతడు చివరగా 'అరణ్య' సినిమాలో కనిపించాడు. విష్ణు నటించిన ఎఫ్ఐఆర్, మోహన్‌దాస్ సినిమాలు రిలీజ్‌కు రెడీ అవుతున్నాయి. With The #MassMaharaja @RaviTeja_offl sir.. Starting the year with a fantastic collaboration.. A super positive actor and great human being... Someone who believed in me right from our first meeting.. Official details soon:) But right now time to stay safe and stay strong🙏 pic.twitter.com/ELMnTKFyrc — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) January 7, 2022 -
తొలిసారి పెళ్లి వీడియో షేర్ చేసిన విష్ణు విశాల్
Gutta Jwala And Vishnu Vishal Marriage: బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల తమిళ హీరో విష్ణు విశాల్‌ను ఏప్రిల్ 22న పెళ్లాడిన సంగతి తెలిసిందే. కరోనా కారణంగా ఇరు కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది అతిథుల సమక్షంలో వీరి వివాహ వేడుక అంగరంగ వైభవంగా జరిగింది. నేడు(సెప్టెంబర్ 7) గుత్తా జ్వాల బర్త్‌డే సందర్భంగా ఆమె భర్త, హీరో విశాల్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చాడు. కాగా వీరి వివాహం జరిగి అయిదు నెలలు గడిచింది. పెళ్లై ఇంతకాలం అవుతున్న భార్య బర్త్‌డే సందర్భంగా వారి వివాహ వేడుకకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియా వేదికగా తొలిసారి పంచుకున్నాడు. చదవండి: పెళ్లిపై స్పందించిన రాశి ఖన్నా, కాబోయేవాడు అచ్చం తనలాగే.. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో సందడి చేస్తోంది. విశాల్ వదిలిన ఈ వీడియో హల్దీ వేడుకతో పాటు పెళ్లి, రిసెప్షన్ కి సంబంధించిన సన్నివేశాలు ఉన్నాయి. ఇక రిసెప్షన్ పార్టీలో విశాల్, జ్వాల కుటుంబ సభ్యులు చేసిన హంగామా మాములుగా లేదు. ఒకరికి మంచి మరొకరు స్టెప్పులు వేస్తూ ఎంజాయ్ చేశారు. విజువల్స్ ఎఫెక్ట్‌తో క్రియేటివ్‌గా తీసిన ఈ వీడియో నెటిజన్లను తెగ ఆకట్టుకుంటోంది. ఇద్దరికి ఇది సెకండ్ మ్యారేజ్అయినప్పటికి సెలబ్రెటీలు కావడంతో పెళ్లి చాలా గ్రాండ్ జరుపుకున్నట్లుగా కనిపిస్తోంది. కాగా జ్వాలా బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ని 2005లో పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. చదవండి: ‘ఐశ్యర్య రాయ్‌కి నటన రాదు, బ్యాడ్ యాక్టింగ్‌కు ఉదాహరణ ఆమె’ Sharing with you all our wedding video... Thank you all for the love and support so far in this journey of LIFE...@Guttajwala Thank you 'THE STORY BOX' for the lovely video... ▶️ https://t.co/AYq80CoHGD Happy Birthday wishes to #JwalaGutta 🎂 — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) September 7, 2021 పలు కారణాలతో 2011లో ఈ జంట విడిపోయారు. తర్వాత చేతన్ మరో పెళ్లి చేసుకున్నారు. ఇక విష్ణు విశాల్ కూడా 2011లో ప్రముఖ తమిళ నటుడు కె.నటరాజ్ కుమార్తె రజినీని వివాహం చేసుకున్నాడు. వీరికి ఆర్యన్ అనే బాబు కూడా జన్మించాడు. మనస్పర్థల వల్ల 2018లో ఈ జంట విడాకులు తీసుకుని వేరుగా జీవిస్తున్నారు. ఈ క్రమంలో విష్ణు విశాల్ సోదరి వివాహంలో వీరిద్దరకి తొలిసారిగా కలుసుకున్నారు. ఈ పరిచయం కాస్తా ప్రేమగా మారడంతో కొన్నేళ్లపాటు డేటింగ్లో ఉన్నారు. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్‌లో వివాహ బంధంతో ఒక్కటయ్యారు. -
భర్తతో కలిసి గుత్తా జ్వాల తొలి ఇన్‌స్టా రీల్స్.. వీడియో వైరల్
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల ఇటీవల తన ప్రియుడు, తమిళ హీరో విష్ణు విశాల్‌ని పెళ్లాడిన సంగతి తెలిసిందే. గత కొద్ది కాలంగా ప్రేమలో ఉన్న ఈ జంట.. ఏప్రిల్ 22న వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హైదరాబాద్ శివారులోని మొయినాబాద్‌లో వీరి వివాహం జరిగింది. ప్రస్తుతం ఈ జంట హైదరాబాద్‌లోనే ఎంజాయ్ చేస్తుంది. కరోనా లాక్డౌన్ కారణంగా హనీమూన్‌కి వెళ్లలేకపోయిన ఈ ప్రేమ జంట.. పరిస్థితులు చక్కబడే వరకు హైదరాబాద్‌లోనే ఉండాలని డిసైడ్ అయింది. ఇదిలా ఉంటే.. పెళ్లి తర్వాత భర్తతో కలిసి తొలిసారి ఇన్‌స్టా రీల్స్ వీడియో చేసింది గుత్తా జ్వాల. అందులో విష్ణు విశాల్ బెడ్‌పై నిద్రపోయి ఉండగా.. గుత్తా జ్వాలా అతన్ని హత్తుకొని ముఖంతో ఫన్నీ హవభావాలు పలికిస్తూ ఉంది. బ్యాగ్రౌండ్లో లిల్గ్రౌండ్ బీఫ్ & గార్ఫీల్డ్ ర్యాన్’నథింగ్ టు డూ సాంగ్ ప్లే అవుతుంది. ‘నా ఫస్ట్ రీల్ ఇది చేయాల్సి వచ్చింది ’అంటూ ఈ వీడియోని తన ఇన్‌స్ట్రాగ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది జ్వాలా. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. View this post on Instagram A post shared by Jwala Gutta (@jwalagutta1) గుత్తా జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
వైరలవుతున్న గుత్తా జ్వాల పెళ్లి ఫొటోలు
-
ఒక్కటైన ప్రేమ జంట..జ్వాల, విష్ణు విశాల్ పెళ్లి ఫోటోలు వైరల్
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ ఒక్కటయ్యారు. గురువారం(ఏప్రిల్ 22) మధ్యాహ్నం 1.40 గంటలకు వీరిద్దరు వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. మొయినాబాద్ ఈ వేడుకకు వేదికైంది. కరోనా కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరిగింది. కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ జంట గతేడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న సంగతి తెలిసిందే. ( గుత్తా జ్వాల, విష్ణు పెళ్లి ఫోటోలు.. ఇక్కడ క్లిక్ చేయండి ) ఉగాది పర్వదినాన తమ లగ్న పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేశారు. కోవిడ్ కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే వీరిద్దరికి ఇది రెండో పెళ్లి. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఇక విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లివరకు దారితీసింది. చదవండి: గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్ -
గుత్తా జ్వాల-హీరో విష్ణు మెహందీ ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్ : భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట మరొకాసేపట్లో వధూవరులుగా మారనున్నారు. నేడు (ఏప్రిల్ 22)న పెళ్లిబంధంతో ఒక్కటి కానున్నారు. ఈ నేపథ్యంలో గత రాత్రి జరిగిన మెహందీ ఫంక్షన్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలకు ఇరువర్గాల కుటుంబ సభ్యులతో పాటు అతికొద్ది మంది సన్నిహితులు, స్నేహితులు పాల్గొన్నారు. ఇక మెహందీ వేడుకలకు గుత్తా జ్వాల పసుపు రంగు లెహంగాలో మెరిసిపోగా, బ్లాక్ కుర్తాలో విష్ణు విశాల్ సందడి చేశారు. ప్రస్తుతం జ్వాల-విశాల్‌ల మెహందీ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. కోవిడ్ కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఉగాది పర్వదినాన తమ లగ్న పత్రికను సోషల్ మీడియాలో షేర్ చేసిన హీరో విష్ణు విశాల్..కరోనా కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా విష్ణు, జ్వాల ఇద్దరికీ ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఇక విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లిపీటలకు దారి తీసింది. మరిన్ని ఫోటోల కోసం ఇక్కడ క్లిక్ చేయండి చదవండి : కాబోయే భార్య బయోపిక్ తీస్తాను: హీరో గుత్తా జ్వాల పెళ్లి డేట్ ఫిక్స్.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్ -
గుత్తా జ్వాల పెళ్లి డేట్ ఫిక్స్.. సోషల్ మీడియాలో వెడ్డింగ్ కార్డ్ వైరల్
శ్రేయోభిలాషులు, బంధు మిత్రులు, స్నేహితుల ప్రేమ కావాలని ఆహ్వానాలు పంపుతున్నారు తమిళ నటుడు విష్ణువిశాల్, బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల. గత ఏడాది సెప్టెంబరులో నిశ్చితార్థం చేసుకున్న విష్ణు విశాల్, గుత్తా జ్వాల ఈ నెల 22న వివాహం చేసుకోనున్నారు. ఉగాది పర్వదినాన ఈ విషయాన్ని సోషల్ మీడియా ద్వారా ఈ ప్రేమికులు వెల్లడించారు. కోవిడ్ కారణంగా కొద్దిమంది బంధుమిత్రుల సమక్షంలోనే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది. ఈ సంగతి ఇలా ఉంచితే... విష్ణు, జ్వాల ఇద్దరికీ ఇది రెండో వివాహం. 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్న విష్ణు విశాల్ 2018లో ఆమెతో విడాకులు తీసుకున్నారు. భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో వివాహం చేసుకున్న జ్వాల 2011లో అతనితో విడాకులు తీసుకున్నారు. ఓ పెళ్లిలో మొదలైన విష్ణు, జ్వాలల పరిచయం స్నేహంగా మారి, ప్రేమగా చిగురించి, ఇప్పుడు మూడు ముడుల బంధంగా మారనుంది. LIFE IS A JOURNEY.... EMBRACE IT... HAVE FAITH AND TAKE THE LEAP.... Need all your love and support as always...@Guttajwala#JWALAVISHED pic.twitter.com/eSFTvmPSE2 — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) April 13, 2021 -
పెళ్లి డేట్ ప్రకటించిన యంగ్ హీరో
భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌కు పెళ్లి ఘడియలు దగ్గర పడ్డాయి. గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట ఏప్రిల్ 22న పెళ్లి పీటలెక్కనున్నట్లు వెల్లడించారు. ఉగాది పండగ రోజు విష్ణు విశాల్ ఈ శుభవార్తను ట్విటర్లో తెలిపారు. ఈ మేరకు లగ్న పత్రికను సైతం షేర్ చేశాడు. దీంతో పలువురు అభిమానులు, సెలబ్రిటీలు ఈ ప్రేమ జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. అయితే కరోనా విజృంభిస్తున్న కారణంగా అందరికీ ఆహ్వానాలు పంపడం లేదని హీరో స్పష్టం చేశాడు. కేవలం ఇరు కుటుంబాలతో పాటు అతికొద్ది మంది సమక్షంలోనే వివాహం చేసుకోనున్నట్లు వెల్లడించాడు. LIFE IS A JOURNEY.... EMBRACE IT... HAVE FAITH AND TAKE THE LEAP.... Need all your love and support as always...@Guttajwala#JWALAVISHED pic.twitter.com/eSFTvmPSE2 — VISHNU VISHAL - V V (@TheVishnuVishal) April 13, 2021 విష్ణు విశాల్ 2010లో రజనీ నటరాజన్‌ను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆర్యన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కానీ మనస్పర్థల కారణంగా 2018లో వారిద్దరూ విడిపోయారు. మరోవైపు గుత్తా జ్వాల కూడా భారత బ్యాడ్మింటర్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో పెళ్లి చేసుకుంది. ఆరేళ్లకే వీరి మధ్య పొరపచ్చాలు రావడంతో 2011లో విడిపోయారు. ఇక విశాల్ సోదరి పెళ్లి వేడుకల్లో తొలిసారిగా వీరిద్దరూ కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ప్రేమగా మారగా ఇప్పుడది పెళ్లిపీటలకు దారి తీసింది. ఇదిలా వుంటే విష్ణు విశాల్ ఈ మధ్యే మూడు భాషల్లో విడుదలైన 'అరణ్య'లో తన నటనతో ఆకట్టుకున్నాడు. ప్రస్తుతం అతడు ఎఫ్ఐఆర్, మోహన్‌దాస్, ఇంద్రు నేత్రు నాలై 2 సినిమాల్లో నటిస్తున్నాడు. చదవండి: త్వరలోనే తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నాను: హీరో -
కాబోయే భార్య బయోపిక్ తీస్తాను: హీరో
తమిళ సినిమా: ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాల జీవిత చరిత్రను సినిమాగా తీస్తానని యువ నటుడు విష్ణు విశాల్ తెలిపారు. కోలీవుడ్‌లో సక్సెస్ ఫుల్ హీరోగా రాణిస్తున్న ఈయన తాజాగా నటించిన చిత్రాల్లో కాడన్ చిత్రం ఒకటి. పాన్ ఇండియాగా రూపొందిన ఈ చిత్రం ఈనెల 26వ తేదీన విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నటుడు విష్ణు విశాల్ సోమవారం మధ్యాహ్నం చెన్నైలో మీడియాతో ముచ్చటించారు. ఈ ఏడాది తాను నటించిన 4 చిత్రాలు వరుసగా విడుదల కానున్నాయని తెలిపారు. అందులో తాను సొంతంగా నిర్మించి, కథానాయకుడిగా నటిస్తున్న ఎఫ్ఐఆర్, మోహన్ దాస్ చిత్రాలు కూడా ఉన్నాయని చెప్పారు. అదేవిధంగా త్వరలోనే ప్రముఖ బ్యాడ్మింటన్ గుత్తా జ్వాలాను పెళ్లాడబోతున్నట్లు తెలిపారు. ఇది ప్రేమ వివాహం కాదన్నారు. ఇంతకుముందు ప్రేమించి పెళ్లి చేసుకున్న వైవాహిక జీవితం చేదు అనుభవాన్నే మిగిల్చిందన్నారు. అందు వల్ల తాను, జ్వాలా ఒకరికొకరం అర్థం చేసుకుని గౌరవించుకుని చేసుకుంటున్న పెళ్లి ఇది అని చెప్పారు. గుత్తా జ్వాలా ఒలింపిక్‌లో పాల్గొన్న బ్యాడ్మింటన్ క్రీడాకారిణి అన్న విషయం తెలిసిందేన్నారు. ఆమె తన గురించి పలు అనుభవాలను తనతో పంచుకున్నారని, ఆమె బయోపిక్‌ను చిత్రంగా నిర్మించాలని ఆలోచన తనకు ఉందని పేర్కొన్నారు. కాడన్ చిత్రంలో నటించడం మంచి అనుభవాన్ని ఇచ్చిందని తెలిపారు. చదవండి: తెరపైకి గుమ్మడి నర్సయ్య బయోపిక్.. అడవిలోనే 25 ఏళ్లు.. -
త్వరలోనే తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నాను: హీరో
భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్‌లకు గతేడాది సెప్టెంబర్‌లో నిశ్చితార్థం జరిగిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో త్వరలోనే తాను తెలుగింటి అల్లుడిని కాబోతున్నట్లు ప్రకటించాడు విష్ణ విశాల్. అరణ్య సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ఈ ప్రకటన చేశాడు. ఈ సందర్భంగా విష్ణు విశాల్ మాట్లాడుతూ.. ‘‘మూడు భాషల్లో నటిస్తానని నేను ఎప్పుడు అనుకోలేదు. కానీ జ్వాలా ఎంకరేజ్మెంట్, మద్దతుతో నేను ధైర్యం చేయగలిగాను. అతి త్వరలోనే మేం పెళ్లి పీటలు ఎక్కబోతున్నాం. తెలుగింటి అల్లుణ్ణి కాబోతున్నందుకు చాలా సంతోషంగా ఉంది. త్వరలోనే మా పెళ్లి తేదిని ప్రకటిస్తాం’’ అన్నారు. ఈ నెల 26న అరణ్య చిత్రం విడుదల కానుంది. దీనిలో విష్ణు విశాల్ మావటి(ఏనుగులను అదుపు చేసే వ్యక్తి) పాత్రలో నటించాడు. రానా హీరోగా నటిస్తున్న అరణ్య చిత్రంలో విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. 25 ఏళ్లుగా అడవిలో జీవించే ఒక వ్యక్తి కథ ఇది. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చించే సినిమా. తెలుగు, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘హ్యాపీ బర్త్‌డే గుత్త జ్వాల.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూలంగా ఉందాం. మన భవిష్యత్తుతో పాటు ఆర్యన్, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్థరాత్రి ఉంగరాన్ని ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు విష్టు విశాల్. వీరిద్దరికి గతంలోనే వివాహం అయ్యింది. కానీ మనస్పర్థల కారణంగా ఇద్దరు తమ జీవిత భాగస్వాములకు విడాకులు ఇచ్చారు. చదవండి: మాల్దీవుల్లో ప్రేమ పక్షులు.. రొమాంటిక్ ఫోటోస్ ఆనందపు క్షణాలు..తోడు ఉండాల్సిందే -
మాల్దీవుల్లో ప్రేమ పక్షులు.. రొమాంటిక్ ఫోటోస్
స్కూల్‌కు వెళ్లి స్టూడెంట్స్ అటెండెన్స్ వేసుకున్నట్లు అందేంటో ఇటీవల సెలబ్రిటీలంతా మాల్దీవుల్లో వాలిపోతున్నారు. కొన్ని రోజులు షూటింగ్‌లకు సైడ్ ఇచ్చి మరీ వెకేషన్ కోసం బీచ్ తీరంలో సేదతీరేందుకు క్యూ కడుతున్నారు. బాలీవుడ్ నుంచి టాలీవుడ్ వరకు ఇదే తంతు కొనసాగుతోంది. కత్రినా కైఫ్, అలియా భట్, శిల్పాశెట్టి నుంచి నాగార్జున, సమంత, కాజల్, మంచు లక్ష్మీ, రకుల్ వరకు మాల్దీవుల్లో హాలీడే ట్రిప్‌లు ఎంజాయ్ చేసినవారే. తాజాగా ఈ జాబితాలోకి మరో లవ్ బర్డ్స్ చేరిపోయారు. బ్యాడ్మింటర్ స్టార్ గుత్తా జ్వాల, తమిళ హీరో విష్ణు విశాల్ మాల్దీవుల్లో విహరిస్తున్నారు. లవర్‌తో కలిసి దిగిన రొమాంటిక్ ఫోటోలను విశాల్ సోషల్ మీడియాలో పోస్టు చేశారు. వీటిని చూసిన అభిమానులు సర్ప్రైజ్ అవుతున్నారు. కాగా బ్యాడ్మింటన్ బ్యూటీ, విష్ణు విశాల్ ప్రేమలో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవలే వీరద్దరికి ఎంగేజ్మెంట్ కూడా అయ్యింది. కానీ ఇప్పటి వరకు పెళ్లి బాజాలు మోగలేదు. దీంతో జ్వాల పెళ్లెప్పుడు అని ఆమె ఫ్యాన్స్.. స్పోర్ట్స్ లవర్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మరోవైపు కెరీర్ పరంగా గుత్తా జ్వాల బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించగా.. విష్ణు విశాల్ వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు. చదవండి: ప్రేయసికి నటుడి విషెస్; ‘ఇది బిగినింగ్ మాత్రమే’ -
అడవిలోనే 25 ఏళ్లు..
రానా దగ్గుబాటి హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. విష్ణు విశాల్, జోయా హుస్సేన్, శ్రియా పిల్గావోంకర్ కీలక పాత్రల్లో నటించారు. ఈరోస్ ఇంటర్నేషనల్ ఫిలింస్ నిర్మించిన ఈ చిత్రానికి ప్రభు సాల్మన్ దర్శకుడు. 25 ఏళ్లుగా అడవిలో జీవించే ఒక వ్యక్తి కథ ఇది. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభం గురించి చర్చించే సినిమా. మార్చి 26న చిత్రం విడుదల కానుంది ‘‘నాపై మీరు (ప్రేక్షకులు) చూపించిన ప్రేమ, ఓర్పు, మద్దతుకు ధన్యవాదాలు. మీరందరూ ఈ సినిమా చూస్తారని ఆశిస్తున్నాను’’ అన్నారు రానా. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: ఏఆర్ అశోక్ కుమార్. -
‘అరణ్య’ రిలీజ్ డేట్ ఫిక్స్.. మరో సినిమాతో పోటీ!
ఎనిమిది నెలలపాటు మూగ బోయిన థియేటర్లలో సినిమాల పండుగ షూరు అయ్యింది. తొలుత ఒకటి రెండుతో ప్రారంభమైన సినిమాలు జనవరి సంక్రాంతితో థియేటర్లలలో సౌండ్స్ మోతమోగించేందుకు రెడీ అవుతున్నాయి. లాక్‌డౌన్‌తో వాయిదా పడిన సినిమాలు ప్రస్తుతం వరుస పెట్టి రిలీజ్‌కు సిద్దమవుతున్నాయి. ఈ క్రమంలో ఇప్పటికే అల్లుడు అదుర్స్, క్రాక్, రెడ్, రంగ్‌దే వంటి చిత్రాలు విడుదల తేదిని ప్రకటించగా.. తాజాగా దగ్గుబాటి రానా నటించిన చిత్రం ఈ జాబితాలోకి చేరిపోయింది. రానా ప్రధాన పాత్రలో తెరకెక్కిన అరణ్య సినిమా రిలీజ్ డేట్‌ను ఫిక్స్ చేశారు. ప్రభు సోలోమీన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను మార్చి 26న థియేటర్లలో ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు ప్రకటించారు. చదవండి: రానా మరో జర్నీ బిగిన్స్ : కిల్లర్ కాంబో ఈ విషయాన్ని రానా తన ట్విటర్ అకౌంట్ ద్వారా వెల్లడించారు. ‘కొత్త సంవత్సరానికి సాధారణ పరిస్థితులతో ఆహ్వానం చెబుతున్నాము. ‘హాథీ మేరీ సాథీ, అరణ్య, కాదన్ సినిమా 26న మీ దగ్గరలోని థియేటర్లలో విడుదల కానుంది’. అని రానా ట్వీట్ చేశారు. కాగా అదే రోజున వెంకీ అట్లూరీ దర్శకత్వంలో నితిన్ నటించిన రంగ్ దే చిత్రం కూడా విడుదలవ కాబోతుంది. దీంతో మార్చి 26 రెండు సినిమాలు పోటీ పడనున్నాయి. ఇక తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో రానాతోపాటు జోయా హుస్సేన్, కల్కి కణ్మిణీ, పులకిత్ సామ్రాట్, విష్ణు విశాల్, శ్రియా పిలగోన్కర్ తదితరులు కీలక పాత్రల్లో నటించారు. వాస్తవానికి ఏప్రిల్ 2న విడుదల కావాల్సిన ఈ సినిమా కరోనా లాక్డౌన్ కారణంగా వాయిదా పడింది. చదవండి: ప్రభాస్ సలార్ అప్డేట్, విలన్ అతడేనా! Welcoming the new year and the new normal, we are excited to bring #HaathiMereSaathi, #Aranya, and #Kaadan on 26th March, in a theatre near you! #PrabuSolomon @PulkitSamrat @TheVishnuVishal @zyhssn @ShriyaP @ErosSTX @ErosMotionPics @ErosNow — Rana Daggubati (@RanaDaggubati) January 6, 2021 -
ప్రేయసికి నటుడి విషెస్; ‘ఇది బిగినింగ్ మాత్రమే’
నటుడు విష్ణు విశాల్, బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల కొన్నేళ్లుగా రిలేషన్ షిప్లో ఉన్న విషయం తెలిసిందే. ఇటీవల లాక్డౌన్ సమయంలో జ్వాల పుట్టిన రోజు సందర్భంగా ఈ జంట వివాహానికి మొదటి మెట్టుగా నిశ్చితార్థం కూడా చేసుకున్నారు. తాజాగా నవంబర్ 2న (సోమవారం) గుత్తా జ్వాల రంగారెడ్డిలో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్కలెన్సీని స్థాపించిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ప్రియుడు, కాబోయే భర్త విశాల్ జ్వాలకు శుభాకాంక్షలు తెలిపారు. ట్విటర్ వేదికగా..‘ వుహ్.. ఇది నీకు బిగ్ డే.. జ్వాలా గుత్తా అకాడమీ ప్రారంభమైంది. భారతదేశపు అతిపెద్ద బ్యాడ్మింటన్ అకాడమీ. జ్వాలా నన్ను క్షమించు. ఈరోజు హైదరాబాద్ రాలేక పోయాను. అందుకే నా ట్విట్టర్ స్నేహితులు, నా నుంచి నీకు శుభాకాంక్షలు చెబుతున్నాను. కానీ గుర్తుంచుకో.. ఇది బిగినింగ్ మాత్రమే..’ అంటూ ట్వీట్ చేశారు. చదవండి: జ్వాలా గుత్తా అకాడమీని ప్రారంభించిన కేటీఆర్ Wohoooo... Big day..@JwalaGuttaAcad opens today... India's biggest badminton academy...@Guttajwala 🤗🤗🤗🤗 Sorry i could not make it to hyderabad.. Sending you lots of wishes from my twitter friends and me🤗 But remember.. This is just the begining..💪💪💪 pic.twitter.com/EY7kiGLsKs — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) November 2, 2020 కాగా మొయినాబాద్‌లోని సుజాత స్కూల్లో జ్వాల గుత్తా అకాడమీ ఆఫ్ ఎక్సలెన్సీని ఐటీ మినిస్టర్, తెలంగాణ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రారంభించారు. 55 ఎకరాల విస్తీర్ణంలో 600ల సీటింగ్ కెపాసిటీతో 14 అంతర్జాతీయ బ్యాడ్మింటన్ కోర్ట్స్, క్రికెట్ అకాడమీ, స్విమింగ్ పూల్, వరల్డ్ క్లాస్ జిమ్, యోగా సెంటర్లను ఏర్పాటు చేశారు. అకాడమీ కల నెరవేరిందని, హైదరాబాద్ నుంచి మరింత మంది ఒలింపియన్లను తయారు చేయడమే తన లక్ష్యమని జ్వాల గుత్తా పేర్కొన్నారు. చదవండి: విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్మెంట్ Happy birthday @Guttajwala New start to LIFE.. Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around.. Need all your love n blessings guys..#newbeginnings thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQ — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020 -
ఆనందపు క్షణాలు..తోడు ఉండాల్సిందే
ఆనందపు క్షణాలను పూర్తిగా అనుభవించడానికి మనకు తోడుగా ఒకరు ఉండాల్సిందే అంటూ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా ట్వీట్ చేశారు. ప్రియుడు తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి ఉన్న ఫోటోను అభిమానులతో పంచుకుంది. గత రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నారు. ఇక హీరో విష్ణు విశాల్ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయారు.కానీ.. వీరిద్దరూ 2011లో విడిపోయారు. విష్ణు- జ్వాల దేశంలో కరోనా కేసులు తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి వీరిద్దరు కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. (హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్ ) View this post on Instagram To get full value of joy,you must have someone to divide it with!! “MARK TWAIN” A post shared by Jwala Gutta (@jwalagutta1) on Oct 24, 2020 at 4:02am PDT Happy birthday @Guttajwala New start to LIFE.. Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around.. Need all your love n blessings guys..#newbeginnings thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQ — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020 -
సంక్రాంతి బరిలో అరణ్య
రానా హీరోగా నటించిన చిత్రం ‘అరణ్య’. తెలుగులో ‘అరణ్య’గా హిందీలో ‘హాథీ మేరీ సాథీ’, తమిళ్లో ‘కాడన్’ పేరుతో రూపొందిన ఈ చిత్రం సంక్రాంతి పండగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్యాన్ ఇండియా సినిమాగా ఈ చిత్రాన్ని ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ నిర్మించింది. 25 ఏళ్లుగా అడవిలో జీవిస్తున్న ఓ మనిషి కథ ‘అరణ్య’. పర్యావరణ సమస్యలు, అటవీ నిర్మూలన సంక్షోభంపై దృష్టి పెట్టి తీసిన చిత్రమిది. మంగళవారం ఈ సినిమాకు సంబంధించిన నూతన పోస్టర్‌ను విడుదల చేశారు. పోస్టర్లో రానాతో పాటు విష్ణు విశాల్ కనిపిస్తున్నారు. జోయా హుస్సేన్, శ్రియ పిల్గావోంకర్ కీలక పాత్రలు చేసిన ఈ చిత్రానికి సంగీతం: శంతను మొయిత్రా, కెమెరా: ఎ.ఆర్. అశోక్ కుమార్. -
హీరో తండ్రిపై ప్రముఖ కమెడియన్ ఫిర్యాదు
చెన్నై: తమిళ హీరో విష్ణు విశాల్ తండ్రి రమేశ్ కడవ్లా మీద ప్రముఖ హాస్య నటుడు సూరి పోలీసులకు శుక్రవారం ఫిర్యాదు చేశాడు. ప్లాట్ అమ్మకానికి ఉందంటూ తన దగ్గర 2.70 కోట్ల రూపాయలు తీసుకుని మోసం చేశారని పేర్కొన్నాడు. తన డబ్బు తిరిగి చెల్లించాల్సిందిగా ఎన్నోసార్లు అడిగానని, అయినా ఐదేళ్లుగా వారి నుంచి సమాధానం రాలేదని తెలిపాడు. రమేశ్‌తో పాటు ఫినాన్షియర్ అంబువేల్ రాజన్‌కు కూడా ఇందులో ప్రమేయం ఉందని, అంతేగాకుండా వీర ధీర సూరన్ సినిమాకు గానూ తనకు ఇవ్వాల్సిన రూ. 40 లక్షల పారితోషికాన్ని ఎగ్గొట్టారని ఆరోపించాడు. సూరి ఫిర్యాదు మేరకు అడయార్ పోలీసులు రమేశ్‌తో పాటు అంబువేల్‌పై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. కాగా రమేశ్ గతంలో పోలీస్ అధికారిగా విధులు నిర్వర్తించి రిటైర్ అయ్యారు. (చదవండి: అబ్బే... ఆ ఉద్దేశం లేదు) షాకింగ్‌గా ఉంది: విష్ణు విశాల్ ఇక ఈ విషయంపై స్పందించిన విష్ణు విశాల్.. తమ కుటుంబంపై ఉద్దేశపూర్వకంగానే ఆరోపణలు చేస్తున్నారంటూ సోషల్ మీడియాలో ఓ ప్రకటన విడుదల చేశాడు. ‘‘ఇది చాలా షాకింగ్‌గానూ, బాధ కలిగించేది గానూ ఉంది. నాపై, మా నాన్నపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నారు. దీనికి వెనుక ఏదో దురుద్దేశం ఉంది. నిజానికి సూరి, విష్ణు విశాల్ స్టూడియో నుంచి 2017లో కవరిమాన్ పరాంబరై సినిమా కోసం తీసుకున్న అడ్వాన్స్ తిరిగి చెల్లించాల్సి ఉంది. ఆ సినిమా నుంచి అతడు తప్పుకొన్నాడు’’ అని పేర్కొన్నాడు. ఇతరులపై నిందలు వేయడం సులభమే కానీ, అంతకంటే ముందు తమ గురించి తాము పరిశీలన చేసుకోవాలన్న కోట్‌ను ఉటంకిస్తూ ట్విటర్ వేదికగా కౌంటర్ ఇచ్చాడు. ITS EASY TO ACCUSE OTHERS HARDER TO CHECK ON YOURSELF - BLESS#MOMENTOFTRUTH#உண்மைஒருநாள்வெல்லும் pic.twitter.com/nXaV7bLM9E — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) October 9, 2020 -
విష్ణు విశాల్‌తో గుత్తా జ్వాల ఎంగేజ్మెంట్
భారత బ్యాడ్మింటన్ సీనియర్ ప్లేయర్ గుత్తా జ్వాలతో తనకి ఎంగేజ్మెంట్ జరిగినట్లు తమిళ హీరో విష్ణు విశాల్ సోమవారం ప్రకటించారు. గత రెండేళ్ల నుంచి రిలేషన్షిప్లో ఉన్న ఈ జంట.. గుత్తా జ్వాల పుట్టిన రోజు (సెప్టెంబరు 7) సందర్భంగా ఒకటయ్యింది. ఈ మేరకు ఉంగరాలు మార్చుకున్న ఫొటోల్ని విష్ణు విశాల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దాంతో పాటు ‘హ్యాపీ బర్త్‌డే గుత్త జ్వాల.. జీవితానికి కొత్త ఆరంభం.. సానుకూలంగా ఉందాం. మన భవిష్యత్తుతో పాటు ఆర్యన్, మన కుటుంబాలు, స్నేహితులు, మన చుట్టూ ఉన్న జనాల భవిష్యత్తు ఉత్తమంగా ఉండేందుకు కృషి చేద్దాం. కొత్త ఆరంభానికి మీ అందరి ఆశీర్వాదం, ప్రేమ మాకు కావాలి. అర్థరాత్రి ఉంగరాన్ని ఏర్పాటు చేసిన బసంత్‌జైన్‌కు ధన్యవాదాలు’ అంటూ ట్వీట్ చేశారు విష్టు విశాల్. (చదవండి: స్వీట్ షాక్) Happy birthday @Guttajwala New start to LIFE.. Lets be positive and work towards a better future for us,Aryan,our families,friends and people around.. Need all your love n blessings guys..#newbeginnings thank you @basanthjain for arranging a ring in d middle of d night.. pic.twitter.com/FYAVQuZFjQ — VISHNU VISHAL - stay home stay safe (@TheVishnuVishal) September 7, 2020 వాస్తవానికి విష్ణు విశాల్‌కి 2010లోనే వివాహమయ్యింది. రజనీ నటరాజన్ అనే ఆమెను పెళ్లి చేసుకున్నాడు. వారికి ఆర్యన్ అనే కొడుకు కూడా ఉన్నాడు. కానీ.. మనస్పర్థలు కారణంగా 2018లో వారిద్దరు విడిపోయారు. మరోవైపు గుత్తా జ్వాలకి కూడా భారత బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌తో 2005లో వివాహమైంది. కానీ.. వీరిద్దరూ 2011లో విడిపోయారు. విష్ణు- జ్వాల దేశంలో కరోనా కేసులు తగ్గిన తర్వాత వివాహం చేసుకోవాలని భావిస్తున్నారు. విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి వీరిద్దరు కలిశారు. అప్పుడు వీరి మధ్య చిగురించిన స్నేహం ఆ తరవాత ప్రేమగా మారింది. ఇక కెరీర్ విషయానికి విష్ణు విశాల్ నటించిన థ్రిల్లర్ మూవీ విడుదలకి సిద్ధమవుతోంది. -
స్వీట్ షాక్
తమిళ హీరో విష్ణు విశాల్ పుట్టినరోజు సందర్భంగా బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల స్వీట్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఈ ఇద్దరూ కొంత కాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వచ్చిన విషయం తెలిసిందే. శుక్రవారం (జూలై 17న) విష్ణు విశాల్ పుట్టినరోజు. తాను వస్తున్నట్లు ముందు చెప్పకుండా హైదరాబాద్ నుంచి చెన్నై వెళ్లి జ్వాల బాయ్‌ఫ్రెండ్‌కు స్వీట్ షాక్ ఇచ్చారు. ‘నా బర్త్‌డే సర్ప్రైజ్’ అని ఆమెతో దిగిన ఫొటోలను విష్ణు విశాల్ ట్వీట్ చేశారు. మరోవైపు జ్వాల కూడా ‘హ్యాపీ బర్త్‌డే బేబీ’ అనే క్యాప్షన్ తో వారిద్దరూ దిగిన ఫొటోని ట్వీట్ చేశారు. కాగా విశాల్ సోదరి సంగీత్ వేడుకలో తొలిసారి జ్వాలను కలిశారట విశాల్. అప్పుడు కుదిరిన స్నేహం ఆ తర్వాత ప్రేమగా మారిందని టాక్. ‘మేమిద్దరం రిలేషన్ షిప్లో ఉన్నాం’ అంటూ జ్వాల ఆ మధ్య వెల్లడించారు కూడా. అయితే విష్ణు విశాల్‌కు ఇప్పటికే పెళ్లయింది. రజినీ నటరాజ్‌తో ఏడేళ్ల వైవాహిక జీవితం తర్వాత 2018లో ఆమె నుంచి విష్ణు విశాల్ విడిపోయారు. బ్యాడ్మింటన్ ప్లేయర్ చేతన్ ఆనంద్‌ను 2005లో జ్వాల పెళ్లాడారు. కారణాలేంటో తెలియదు కానీ 2011లో వీరిద్దరూ విడిపోయారు. మరి.. విష్ణు–జ్వాల ప్రేమ.. పెళ్లి వరకూ వెళుతుందా? -
బాయ్‌ఫ్రెండ్‌కు గుత్తా జ్వాల సర్ప్రైజ్
పుట్టిన రోజు నాడు అందరూ శుభాకాంక్షలు చెప్తారు. కానీ కొందరే గిఫ్టులిస్తారు. అందులోనూ కొన్ని సమ్‌థింగ్ స్పెషల్ ఉంటాయి. ప్రేమికులైతే ఒకరికొరు పోటీపడుతూ మరీ బహుమతులిచ్చుకుంటారు. అయితే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల మాత్రం తనే పెద్ద గిఫ్ట్ అంటున్నారు. శుక్రవారం పుట్టినరోజు జరుపుకుంటున్న ఆమె బాయ్‌ఫ్రెండ్, తమిళ నటుడు విష్ణు విశాల్ ఇంటి ముందు ప్రత్యక్షమై అతడిని సడన్ సర్ప్రైజ్ చేశారు. కాగా లాక్డౌన్ వల్ల ప్రేమికుడిని మిస్ అవుతున్నానంటూ గుత్తా విరహ వేదన చెందిన సంగతి తెలిసిందే. (హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్) అయితే ఇప్పుడు ఎంచక్కా ప్రియుడి పుట్టినరోజును పురస్కరించుకుని హైదరాబాద్ నుంచి చెన్నైకు వెళ్లారు. అతని బర్త్‌డే వేడుకను దగ్గరుండి నిర్వహించారు. ఈ విషయాన్ని నటుడు విష్ణు సోషల్ మీడియాలో పంచుకున్నారు. చేతిలో కేక్ పట్టుకుని గుత్తాతో కలిసి ఉన్న ఫొటోను షేర్ చేశారు. నటుడు విష్ణు విశాల్ 2018లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఆర్యన్ ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయారు. (బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్నా) -
లాక్డౌన్: బాయ్‌ఫ్రెండ్‌ను మిస్ అవుతున్నా
దేశంలో కరోనా వైరస్ వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ఏప్రిల్ 14 వరకు లాక్డౌన్ విధించిన విషయం తెలిసిందే. దీంతో ఎక్కడివారు అక్కడి ఉండిపోయారు. కొందరు అత్మీయులకు, బంధువులకు దూరంగా చిక్కుకుపోయారు. ఈ నేపథ్యంలోనే బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాలా తన బాయ్ ప్రెండ్ విష్ణు విశాల్‌ను మిస్ అవుతుందటా.. ఈ విషయాన్ని జ్వాలానే స్వయంగా ట్విటర్ ద్వారా తెలిపారు. లాక్డౌన్ కారణంగా గుత్తా జ్వాలా హైదరాబాద్‌లోనే ఉంటున్నారు. తన ప్రియుడు విష్ణు విశాల్‌ను మిస్ అవుతున్నట్లు తెలిపారు. ఈ మేరకు మిస్ యూ..అంటూ ట్వీట్ చేశారు. అయితే దీనిపై స్పందించిన విష్ణు పర్లేదు.. ప్రస్తుతం సామాజిక దూరం ముఖ్యం.. అంటూ జ్వాలాను కూల్ చేశారు. కాగా బ్యాడ్మింటన్ ఫైర్ బ్రాండ్ గుత్తా జ్వాల, తమిళ నటుడు విష్ణు విశాల్ రిలేషన్షిప్లో ఉన్న విషయం తెలిసిందే. గతంలో వీరిద్దరికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో వైరల్ అవ్వగా అందులో విష్ణు.. గుత్తా జ్వాలకు ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఇందులో ఉండటం విశేషం. దీంతో వీరిద్దరూ ప్రేమాయణం నడుపుతన్నట్లు క్లారిటీ ఏర్పడింది. ఇక హీరో విష్ణు విశాల్ గతేడాది జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. వీరికి నాలుగేళ్ల కుమారుడు ఉన్నాడు. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో విభేదాల కారణంగా విడిపోయారు. Its oki..Right now social distancing is important..🙏pray for all...🤗 https://t.co/al7iPw261N — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) March 28, 2020 -
‘అరణ్య’: విష్ణు విశాల్ మరో లుక్
దగ్గుబాటి రానా టైటిల్ రోల్లో నటించిన చిత్రం ‘అరణ్య’. ప్రభు సాల్మన్ దర్శకత్వంలో ఈరోస్ ఇంటర్నేషనల్ సంస్థ తెరకెక్కించింది. హిందీలో ‘హథీ మేరే సాథి’, తమిళంలో ‘కాడన్’ పేర్లతో రూపొందింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో ఏప్రిల్ 2న ఈ సినిమా విడుదలవుతోంది. ఇప్పటికే మూవీ ప్రమోషన్లను చిత్ర బృందం ప్రారంభించింది. ఇందులో భాగంగా ఇప్పటికే రానా, ఇతర ముఖ్యతారాగణం ఫస్ట్ లుక్ పోస్టర్లతో పాటు టీజర్‌ను విడుదల చేసింది. ప్రస్తుతం ఈ టీజర్ సోషల్ మీడియాలో రచ్చ చేస్తుండగానే మరో అస్త్రాన్ని విడుదల చేసింది ‘అరణ్య’టీం. ఈ చిత్రంలోని విష్ణు విశాల్‌కు చెందిన మరో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ఫోటో ప్రకృతి ప్రేమికులను ఎంతగానో ఆకట్టుకుంటోంది. దీంతో విష్ణు ఫస్ట్ లుక్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ‘రెండున్నరేళ్లు ఈ సినిమా కోసం కష్టపడ్డాను. అస్సాంలోని జాదవ్ ప్రియాంక్ అనే వ్యక్తి జీవితాన్ని ఆధారంగా చేసుకుని ఈ సినిమా చేశాం. పద్మశ్రీ అవార్డ్ పొందిన ఈయన 1300 ఎకరాల అడవిని నాటాడు. ‘అరణ్య’ సినిమా చేయడం వల్ల జీవితం అంటే ఏంటో తెలుసుకున్నాను. కథ విని పాత్రను అర్థం చేసుకోవడానికి నాకు ఆరు నెలలు పట్టింది. ఇలాంటి సినిమా ఇచ్చిన ప్రభుగారికి రుణపడి ఉంటాను. పర్యావరణంలో మనం ఒక భాగం అని చెప్పే సినిమా ఇది’అని టీజర్ రీలీజ్ సందర్బంగా రానా పైవిధంగా పేర్కొన్నాడు. జోయా హుస్సేన్, శ్రియా పిల్లావుంకర్, పుల్కిత్ సామ్రాట్, విష్ణు విశాల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఆస్కార్ విజేత రసూల్ సౌండ్ ఇంజినీర్‌గా పనిచేశారు. Never ever thought i would have coffee on top of an #elephant:) #unnikrishnan #kaadan tamil #aranya telugu... Releasing on April 2nd pic.twitter.com/gc6EM28nOS — VISHNU VISHAL - VV (@TheVishnuVishal) February 21, 2020 We're in 'aww' of how cute @TheVishnuVishal and his elephant friend look in #Aranya. To make new friends walk into your nearest theatre on April 02!#ErosNow | @RanaDaggubati | #PrabuSolomon | @ShriyaP | @zyhssn | @ErosIntlPlc | #SaveTheForest🐘 pic.twitter.com/ckTnWbZM7O — Eros Now (@ErosNow) February 23, 2020 చదవండి: వెరైటీ టైటిళ్లతో తేజ కొత్త చిత్రాలు.. హీరోలు వీరే ‘నా కలల రాకుమారి సోనాలి బింద్రే’ బాలయ్య సరసన అంజలి.. -
ఇతడే నా వేలంటైన్
వేలంటైన్స్ డే సందర్భంగా ఓ సందేహాన్ని క్లియర్ చేశారు బ్యాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాల. తమిళ నటుడు విష్ణు విశాల్, గుత్తా జ్వాల కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే వార్తలు వస్తూ ఉన్నాయి. ఒకరి బర్త్‌డేలు ఒకరు సెలబ్రేట్ చేసుకోవడం, సోషల్ మీడియాలో సెల్ఫీలు పోస్ట్ చేయడంతో వీళ్లు ప్రేమలో ఉన్నారా? అనే సందేహాలు ఏర్పడ్డాయి. వేలంటైన్స్ డే రోజున విష్ణు విశాల్‌కు ముద్దిస్తున్న ఫొటోను పోస్ట్ చేసి ‘ఇతడే నా వేలంటైన్’ అని రాశారు జ్వాల. 2011లో భర్త చేతన్ ఆనంద్ నుంచి గుత్తా జ్వాల, 2018లో భార్య రజనీ నటరాజ్ నుంచి విష్ణు విశాల్ విడిపోయారు. మరి.. ప్రస్తుతం ప్రేమలో ఉన్న ఈ ఇద్దరూ పెళ్లి ఎప్పుడు చేసుకుంటారో. -
రానా.. నీకు హ్యాట్సాఫ్!
రానా హీరోగా ప్రభు సాల్మన్ దర్శకత్వంలో తెరకెక్కిన త్రిభాషా చిత్రం ‘అరణ్య’. తమిళంలో ‘కాడన్’, హిందీలో ‘హాథీ మేరే సాథీ’ అనే టైటిల్స్‌ను పెట్టారు. మానవులు-జంతువుల మధ్య సంబంధాల్ని ప్రతిబింబించే వాస్తవ కథాంశాలతో తెరకెక్కిన ఈ చిత్రంలో రానా అడవిలో ఉండే ఆదివాసి ‘బన్ దేవ్’ పాత్రలో కనిపించనున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించి తెలుగు టీజర్‌ను చిత్ర బృందం కాసేపటి క్రితం విడుదల చేసింది. 75 సెకన్ల నిడివిగల టీజర్లో రానా గతంలో ఎప్పుడూ కనిపించన కొత్త లుక్, ఆహార్యంతో ఆకట్టుకున్నాడు. అంతేకాకుండా అంతరించిపోతున్న మూగజీవాల రక్షకుడిగా అతడి విన్యాసాలు అభిమానులను నివ్వెరపోయేలా చేసింది. టీజర్లో రానా నటనకు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ఇక ఇప్పటికే విడుదల చేసిని ఫస్ట్ లుక్ పోస్టర్లో రానా డిఫరెంట్ డ్రెస్సింగ్, హావభావాలతో అగ్రెసివ్‌గా వావ్ అనిపించేలా ఉన్నాడు. రౌద్రంగా.. కన్నెర్ర చేస్తూ యుద్ధానికి సిద్ధం అంటూ శత్రుసైన్యానికి సంకేతాలు ఇస్తున్నట్టు కనిపించాడు. రానా ఫస్ట్ లుక్‌తో సినిమాపై అంచనాలు మరింత పెంచాయి. ఈ సినిమా అధిక భాగాన్ని కేరళ అడవుల్లో చిత్రీకరించారు. ఆస్కార్ విజేత రసూల్ సౌండ్ ఇంజినీర్‌గా పనిచేశాడు. ఇటీవలే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. రానాతో పాటు జోయా హుస్సేన్, శ్రియా పిల్లావుంకర్, పుల్కిత్ సామ్రాట్, విష్ణు విశాల్ కీలక పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రం ఏప్రిల్ 2న విడుదల కానుంది. చదవండి: ‘ప్రేమ కూడా ఫీలింగే కదా.. మారదని గ్యారెంటీ ఏంటి?’ మీ లవ్.. నా లక్! -
గుత్తా జ్వాల ప్రియుడితో ప్రియా రొమాన్స్
యువ నటుడు విష్ణువిశాల్ ఇంతకుముందు వరకూ తన చిత్రాలకు సంబంధించిన వార్తలో ఉండేవారు. ఇప్పుడు ప్రియురాలు, ప్రేమ అంటూ వార్తలో నానుతున్నారు. బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ప్రేమలో మునిగితేలుగున్నట్లు సామాజిక మాధ్యమాల్లో వైరల్ ప్రచారం అవుతోంది. నటుడిగా మాత్రం బిజీగానే ఉన్నారు. ప్రస్తుతం జగజ్జాల కిల్లాడి, ఎఫైఆర్ చిత్రాల్లో నటిస్తున్నారు. కాగా విష్ణువిశాల్ ఇంతకుముందు సిలుక్కువార్‌పట్టి సింగం చిత్రంలో నటించడంతో పాటు దాని నిర్మాణ బాధ్యతలను చేపట్టారు. దీనికి సెల్లా ఆయ్యావు దర్శకుడు. ఈ చిత్రం 2018 డిసెంబర్లో విడుదలయ్యింది. చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేదు. అయినా విష్ణువిశాల్ ఈ దర్శకుడికి తాజాగా మరో అవకాశాన్నిచ్చారు. వీరి కాంబినేషన్లో కొత్త చిత్రానికి సంబంధించిన ఫ్రీ పొడక్షన్ కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. (హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్) కాగా ఇందులో విష్ణువిశాల్‌కు జంటగా నటి ప్రియాభవానీ శంకర్‌ను ఎంపిక చేసే ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలిసింది. ఇప్పటికే ఈ ముద్దుగుమ్మకు కథ వినిపించినట్లు, కథ నచ్చడంతో ప్రియాభవానీశంకర్ కూడా నటించడానికి సమ్మతించినట్లూ సమాచారం. ఈ చిత్రానికి ఇంకా కాల్షీట్స్ను కేటాయించలేదట. కారణం ఇప్పుడు ప్రియాభవానీశంకర్ చేతి నిండా చిత్రాలతో చాలా బిజీగా ఉంది. ప్రస్తుతం కురుది ఆట్టం, కళత్తిల్ సంథిస్పోమ్, కసడదపర, మాఫియా, బొమ్మై. ఇండియన్ 2 చిత్రాల్లో నటిస్తోంది. ఈ చిత్రాల మధ్య ఖాళీ చూసుకుని విష్ణువిశాల్ చిత్రానికి కాల్షీట్స్ కేటాయిస్తానని నటి ప్రియాభవానీశంకర్ మాట ఇచ్చినట్లు తెలిసింది. కాగా ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలు వెలువడాల్సి ఉందన్నది గమనార్హం. -
నిజాలు చెపితే కాంట్రవర్సీనా..
-
ఆ ఫోటోల గురించి తర్వాత మాట్లాడదాం: గుత్తా జ్వాల
హైదరాబాద్: న్యూ ఇయర్ సందర్భంగా బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల ట్వీటర్లో షేర్ చేసిన ఫోటోలు వైరల్‌గా మారాయి. బుధవారం తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్లో షేర్ చేయడంతో వీరిద్దరి మధ్య ప్రేమాయణం సాగుతుందనే వార్తలు హల్‌చేస్తున్నాయి. అయితే వీటిపై మాట్లాడటానికి గుత్తా జ్వాల నిరాకరించారు. గురువారం బ్యాడ్మింటన్ అకాడమీని ప్రారంభించిన జ్వాల మీడియాతో మాట్లాడారు. దీనిలో భాగంగా ఆ ఫోటోలకు గురించి జ్వాలను ప్రశ్నించగా తర్వాత మాట్లాడదాం అంటూ సమాధానం దాటవేశారు.(ఇక్కడ చదవండి: హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్) కాగా, ప్రస్తుతం తాను ప్రారంభించిన అకాడమీని సుమారు రూ. 14 కోట్లతో నిర్మించినట్లు తెలిపారు. ఇది కూడా అతి పెద్ద అకాడమీనేనని చెప్పిన జ్వాల.. కేవలం బ్యాడ్మింటన్‌కే కాకుండా మిగతా స్పోర్ట్స్‌కు కూడా ఈ అకాడమీ సేవలందిస్తుందన్నారు. తనకు ఇతర రాష్ట్రాల్లో కూడా అకాడమీలను నిర్మిస్తారా అన్న ప్రశ్నకు.. అవకాశం వస్తే అక్కడ కూడా నిర్మిస్తానని తెలిపారు. రంగారెడ్డి జిల్లా మొయినాబాద్‌లోని సుజాత హైస్కూల్ ప్రాంగణంలో ఈ అకాడమీని నెలకొల్పారు. గుత్తా జ్వాల అకాడమీ ఆఫ్ ఎక్సలెన్స్ పేరుతో ఏర్పాటు చేసిన ఈ అకాడమీలో 14 బ్యాడ్మింటన్ కోర్టులు, అత్యాధునిక జిమ్నాజియం ఉన్నాయి. ఈ అకాడమీలో బ్యాడ్మింటన్‌తోపాటు క్రికెట్, స్విమ్మింగ్ క్రీడాంశాల్లోనూ శిక్షణ ఇస్తారు. -
దాని గురించి తర్వాత మాట్లాడదాం
-
హీరోతో గుత్తా జ్వాల.. ఫోటోలు వైరల్
ప్రముఖ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి గుత్తా జ్వాల షేర్ చేసిన ఫోటోలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతున్నాయి. న్యూఇయర్ సందర్భంగా విషెస్ తెలుపుతూ తమిళ హీరో విష్ణు విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను గుత్తా జ్వాల తన అధికారిక ట్విటర్లో షేర్ చేశారు. అయితే ఇప్పటివరకు షేర్ చేసిన ఫోటోల్లో వీరిద్దరి మధ్య కాస్త గ్యాప్ ఉండేది.. కానీ తాజా ఫోటోల్లో ఆ చిన్న కాస్తంత గ్యాప్ కూడా కనిపిండం లేదు. అంతేకాకుండా గుత్తా జ్వాలకు ఏకంగా విశాల్ ముద్దు పెడుతున్న ఫోటో కూడా ఉండటం విశేషం. ఇక వీరిద్దరి మధ్య ఏదో నడుస్తుందని గుసగుసలు పెట్టిన నెటిజన్లు.. తాజా ఫోటోలతో పక్కా కన్ఫర్మ్ అయ్యారు. ప్రస్తుతం ఈ ఫోటోలపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. విష్ణు విశాల్ తన భార్య రజనీతో విడిపోవడానికి గుత్తా జ్వాలనే కారణమని ఓ నెటిజన్ విమర్శించాడు. అయితే ఈ జంట ఎంతో క్యూట్ అండ్ హాట్‌గా ఉందంటూ మరికొంతమంది కామెంట్ చేస్తున్నారు. వేరువేరుగా విడిపోయి ఒకటి అవుతున్న జంట అంటూ మరో నెటిజన్ సరదాగా పేర్కొన్నాడు. ఇక హీరో విష్ణు విశాల్ గత జూన్‌లో తన భార్య రజనీతో విడిపోయిన విషయం తెలిసిందే. మరోవైపు గుత్తా జ్వాల కూడా ప్రేమించి పెళ్లి చేసుకున్న మరో బ్యాడ్మింటన్ క్రీడాకారుడు చేతన్ ఆనంద్‌తో పలు విభేదాల కారణంగా విడిపోయారు. అయితే వీరిద్దరూ విడిపోవడానికి టీమిండియాకు చెందిన ఓ మాజీ క్రికెటర్ కూడా ఒక కారణమంటూ రూమర్స్ వచ్చాయి. అయితే ఈ వార్తలను గుత్తా జ్వాలా గతంలోనే కొట్టి పారేశారు. My baby ❤️❤️ happy new year ❤️❤️ @TheVishnuVishal pic.twitter.com/gxSRyVOHVb — Gutta Jwala (@Guttajwala) December 31, 2019 -
విష్ణు విశాల్ సినిమాలో ప్రియా
‘రాక్షసన్’చిత్రం సక్సెస్‌తో లైమ్‌లోకి వచ్చిన యువనటుడు విష్ణువిశాల్. ఇప్పుడు ఆయనతో రొమాన్స్‌కు నటి ప్రియా భవానీ శంకర్ సై అంటున్నట్లు తాజా వార్త. విష్ణువిశాల్ ప్రస్తుతం జగజాలా కిల్లాడి, ఎఫ్ఐఆర్ చిత్రాల్లో నటిస్తున్నాడు. తాజాగా మరో కొత్త చిత్రానికి కమిట్ అయ్యారు. ఇందులో లక్కీ హీరోయిన్ ప్రియా భవానీ శంకర్ హీరోయిన్గా నటించనుంది. ‘మేయాదమాన్’చిత్రంతో వెండితెరపైకి వచ్చిన బుల్లితెర నటి ఈ అమ్మడు. తొలి చిత్రమే సక్సెస్ కావడంతో హీరోయిన్గా సెటిల్ అయ్యిపోయ్యింది. ఆ తర్వాత కార్తికి జంటగా నటించిన కడైకుట్టి సింగం, ఎస్జే.సూర్యతో నటించిన మాన్స్టర్ చిత్రాల విజయాలు ప్రియా భవానీ శంకర్ కెరీర్‌కు బాగా హెల్ప్ అయ్మాయి. దీంతో ఈ చిన్నది బిజీ హీరోయిన్గా మారింది. శంకర్ దర్శకత్వంలో కమలహాసన్ కథానాయకుడిగా నటిస్తున్న ఇండియన్ 2 చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. కురిది ఆట్టం, కలత్తిల్ సందిప్పోమ్, కసర తపర, మాఫియా ఛాప్టర్ అంటూ అరడజను చిత్రాల వరకు నటిస్తుంది. తాజాగా విష్ణువిశాల్‌తో రొమాన్స్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాను విష్ణువిశాల్ స్వయంగా తన విష్ణువిశాల్ స్టూడియోస్ పతాకంపై నిర్మించనున్నారు. చెల్ల దర్శకత్వం వహించనున్నారు. వీరిద్దరి కాంబినేషన్లో ఇంతకు ముందు సిలుక్కువారుపట్టి సింగం అనే వినోదభరిత చిత్రం వచ్చింది. తాజా చిత్రాన్ని ప్రారంభించడానికి సన్నాహాలు జరుగుతున్నట్లు సమాచారం. పూర్తి వివరాలు తెలియాలంటే మరొ కొద్ది రోజులు ఆగాల్సిందే. -
లాయర్ మంజిమా
ఇండియన్ పీనల్ కోడ్ సెక్షన్స్‌ను తెలుసుకునే పనిలో బిజీగా ఉన్నారు కథానాయిక మంజిమా మోహన్. కోర్టులో లాయర్‌గా వాదించనున్నారు. ‘ఎఫ్.ఐ.ఆర్’ (ఫైజల్ ఇబ్రహీమ్ రైజ్) అనే సినిమాలో ఆమె లాయర్‌గా కనిపించనున్నారు. మను ఆనంద్ దర్శకత్వంలో విష్ణు విశాల్ హీరోగా ఈ తమిళ చిత్రం తెరకెక్కుతోంది. ఇటీవల ఈ సినిమా ఫస్ట్ లుక్‌ను విడుదల చేశారు. అనుకోని పరిస్థితుల కారణంగా పోలీసుల చేతిలో చిక్కిన ఓ ముస్లిం యువకుడి నేపథ్యంలో ఈ సినిమా సాగుతుంది. జూనియర్ అడ్వకేట్‌గా మంజిమా నటిస్తున్నారు. ఈ సంగతి ఇలా ఉంచితే.. తెలుగులో నాగచైతన్య నటించిన ‘సాహసం శ్వాసగా సాగిపో’ చిత్రంలో మంజిమా మోహన్ కథానాయికగా నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. -
తమిళ ఆటకు రానా నిర్మాత
కంటెంట్ బాగున్న సినిమాకు ఏ ఇండస్ట్రీలో అయినా మంచి ఆదరణ లభిస్తుంది. ఈ మధ్యకాలంలో తెలుగులో విడుదలైన ఇలాంటి చిత్రాల్లో ‘జెర్సీ’ ఒకటి. అందుకే ఈ సినిమాపై ఇతర భాషల దర్శక–నిర్మాతల దృష్టి పడింది. ఆల్రెడీ హిందీలో రీమేక్ కానుంది. అల్లు అరవింద్, ‘దిల్’రాజు, సూర్యదేవర నాగవంశీ నిర్మించనున్నారు. తాజాగా తమిళ రీమేక్ కూడా తెరపైకి వచ్చింది. ‘జెర్సీ’ తమిళ రీమేక్ రైట్స్‌ను హీరో రానా దక్కించుకున్నారని టాక్. ఇందులో రానా నటించబోవడం లేదు. నిర్మాతగా మాత్రమే వ్యవహరించనున్నారు. ఇందులో విష్ణు విశాల్ తమిళ ‘జెర్సీ’ హీరోగా నటించనున్నారని తెలిసింది. రానా హీరోగా నటిస్తున్న ‘కాడన్’ (తెలుగులో ‘అరణ్య’) సినిమాలో విష్ణు విశాల్ ఓ కీలక పాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా హిందీ వెర్షన్ ‘హాథీ మేరీ సాథీ’లో మాత్రం విష్ణు విశాల్ పాత్రను ఓ హిందీ నటుడు పోషిస్తున్నారు. అలాగే క్రికెట్‌పై విష్ణు విశాల్‌కు మంచి అవగాహన ఉందట. అందుకే ‘జెర్సీ’ తమిళ రీమేక్‌లో విష్ణు విశాలే కన్ఫార్మ్ అనుకోవచ్చు. -
గుత్తా జ్వాలతో డేటింగ్‌పై యంగ్ హీరో క్లారిటీ!
హైదరాబాద్: గత కొంతకాలంగా ప్రముఖ బాడ్మింటన్ ప్లేయర్ గుత్తా జ్వాలకి తమిళ హీరో విష్ణు విశాల్‌తో ఎఫైర్ నడుస్తోందని వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వీరిద్దరూ కలిసి క్లోజ్‌గా తీసుకున్న ఫోటోను విష్ణు తన ట్విటర్లో షేర్ చేశాడు. ప్రస్తుతం ఈ ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అవుతుండడంతో వీరిద్దరి మధ్య ఎఫైర్ నడుస్తుందనన్న వార్తలు మరింత బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు విష్ణు కొంతకాలం క్రితం తన భార్యతో విడిపోవడంతో ఇప్పుడు గుత్తా జ్వాలని పెళ్లి చేసుకునే అవకాశాలు మెండుగా ఉన్నాయంటూ కోలీవుడ్ మీడియాలో వార్తలు వస్తున్నాయి. అయితే ఈ వార్తలపై తాజాగా ఈ యంగ్ హీరో క్లారిటీ ఇచ్చాడు. తనకు జ్వాల అంటే ఇష్టమని, ఆమెకి కూడా నేనంటే కూడా ఇష్టమని అని చెప్పాడు. దాదాపు ఏడాదిన్నరగా ఒకరికి ఒకరు తెలుసని, కామన్ ఫ్రెండ్స్‌తో కలిసి కాలక్షేపం చేస్తుంటామని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం తమ మధ్య స్నేహం బంధం తప్ప మరే బంధము లేదని.. ఎవరి పనుల్లో వారు బిజీగా ఉన్నామని తెలిపారు. కాగా, ఇటీవల 'రాక్షసన్' చిత్రంతో సక్సెస్ అందుకున్న ఈ హీరో ప్రస్తుతం 'జగజ్జాల కిలాడి' అనే సినిమాలో నటిస్తున్నాడు. ఇక గుత్తా జ్వాలా, చేతన్ ఆనంద్ పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. బ్యాడ్మింటన్ డబుల్స్ ఆటగాళ్లుగా వీరిద్దరూ పలు అంతర్జాతీయ టోర్నీల్లో తమ అద్భుత ఆటతీరుతో ఆకట్టుకునేవారు. అయితే కొన్ని భేదాభిప్రాయాలు రావడంతో ఈ జంట విడిపోయింది. ఇక నాగార్జున హోస్ట్‌గా ప్రేక్షకుల ముందుకు రానున్న తెలుగు బిగ్‌బాస్ 3లో గుత్తా జ్వాల పార్టిసిపేట్ చేస్తున్నట్లు వార్తలు వచ్చాయి. అయితే ఈ వార్తలన్నీ వదంతులేనని ఆమె ట్విటర్ వేదికగా కొట్టిపారేశారు. -
సూపర్ హిట్ రీమేక్‌లో బెల్లంకొండ
మీడియం రేంజ్ సినిమాలతో ఆకట్టుకుంటున్న యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ వరుస సినిమాలతో బిజీ అవుతున్నాడు. ప్రస్తుతం తేజ దర్శకత్వంలో సీత సినిమాలో నటిస్తున్న బెల్లంకొండ, ఆర్ఎక్స్ 100 ఫేం అజయ్ భూపతి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఓకె చెప్పాడు. ఈ సినిమాతో పాటు మరో క్రేజీ ప్రాజెక్ట్ కు కూడా బెల్లంకొండ ఓకే చెప్పినట్టుగా తెలుస్తోంది. ఇటీవల కోలీవుడ్ లో సూపర్ హిట్ అయిన థ్రిల్లర్ మూవీ రాక్షసన్. విష్ణు విశాల్, అమలాపాల్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినిమాను తెలుగులో రీమేక్‌చేసే ఆలోచనలో ఉన్నాడు బెల్లంకొండ సాయి శ్రీనివాస్. ఈ సినిమాకు రైడ్, వీర చిత్రాల ఫేం రమేష్ వర్మ దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం చర్చల దశలో ఉన్న ఈ ప్రాజెక్ట్ పై త్వరలోనే అధికారిక ప్రకటన వెలువడనుంది. -
పది రోజులు.. మూడు సినిమాలు
విష్ణు విశాల్ హీరోగా రామ్‌కుమార్ దర్శకత్వంలో వచ్చిన తమిళ చిత్రం ‘రాక్షసన్’ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ సినిమా దర్శకుడు రామ్‌కుమార్ మంచి చాన్స్‌ను కొట్టేశారు. మాస్ హీరో ధనుష్ సినిమాకి దర్శకత్వం వహించే చాన్స్ రామ్‌కుమార్‌కి దక్కింది. సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ఈ సినిమాను నిర్మించనుంది. అలాగే సేమ్ నిర్మాణసంస్థలో ‘కొడి’ ఫేమ్ దురై సెంథిల్‌కుమార్ దర్శకత్వంలో ధనుష్ హీరోగా ఓ సినిమా చేయనుండటం విశేషం. ‘‘ధనుష్‌తో రెండు సినిమాలను చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’’ అని సత్యజ్యోతి ఫిల్మ్స్ సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. ఇటీవల ధనుష్ హీరోగా ‘అసురన్’ మూవీ అనౌన్స్మెంట్ వచ్చిన విషయం గుర్తుండే ఉంటంది. ఇలా జస్ట్ పది రోజుల్లో తన మూడు సినిమాలను అనౌన్స్ చేసి అభిమానులను ఖుషీ చేశారు ధనుష్. అంతా ఓకే కానీ ధనుష్, నాగార్జునలతో స్టార్ట్ అయిన మల్టీస్టారర్ మూవీ ఏమైనట్లబ్బా? అని ఆలోచిస్తున్నారు కోలీవుడ్ సినీవాసులు.