విష్ణు విశాల్, విక్రాంత్ హీరోలుగా తెరకెక్కుతున్న చిత్రం 'లాల్ సలాం'. ఐశ్వర్య రజినీకాంత్ దర్శకత్వంలో లైకా ప్రొడక్షన్స్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఇటీవలే పూజా కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ హోలీ రోజున ప్రారంభమైంది. ఈ చిత్రంలో సూపర్‌స్టార్ రజినీకాంత్ కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఈ విషయాన్ని లైకా ప్రొడక్షన్స్ తన ట్విటర్ ద్వారా వెల్లడించింది.
ఈ సందర్భంగా లైకా ప్రతినిధులు మాట్లాడుతూ.. 'విభిన్నమైన సినిమాలు నిర్మించడంలో లైకా ప్రొడక్షన్స్ ముందుంటుంది. అందులో భాగంగా లాల్ సలాం సినిమాను నిర్మిస్తున్నాం. ఇందులో ఓ పవర్‌ఫుల్ పాత్ర ఉంది. అందుకే సూపర్‌స్టార్ రజినీకాంత్‌గారిని రిక్వెస్ట్ చేశాం. ఆయన ఈ రోల్‌లో నటించటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఎనిమిదేళ్ల తర్వాత ఐశ్వర్య రజినీకాంత్ మళ్లీ మెగా ఫోన్ పట్టారు.'అని అన్నారు. కాగా.. ఈ చిత్రానికి ఎ.ఆర్.రెహమాన్ సంగీతాన్ని అందిస్తున్నారు.
Lights 💡
— Lyca Productions (@LycaProductions) March 7, 2023
Camera 🎥 🎬
Action 😎✨#LalSalaam 🫡 Shoot starts today! 😌
Happy #HOLI everyone! 💫
🎬 @ash_rajinikanth
🎶 @arrahman
🌟 @rajinikanth @TheVishnuVishal & @vikranth_offl
🤝 @gkmtamilkumaran
🪙 @LycaProductions #Subaskaran pic.twitter.com/SHYXxnGYod
Comments
Please login to add a commentAdd a comment