సోషల్ మీడియా ప్రపంచంలో చాలా జాగ్రత్తగా మెలగాలి లేదంటే కేటుగాళ్ల చేతికి దొరికిపోతారు. ముఖ్యంగా చాలామంది సినిమా అవకాశాల కోసం ఎదురుచూస్తుంటారు. అలాంటి వారిని ట్రాప్‌లోకి లాగి నిండా ముంచేస్తారు. ఈ క్రమంలో సినీ ఇండస్ట్రీ పేరుతో మోసం చేయడానికి మోసగాళ్లు ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇలాంటి విషయాలపై ఎప్పటికప్పుడు జాగ్రత్త వహించాలని ప్రజలను పోలీసు శాఖ హెచ్చరిస్తూనే ఉంది. తాజాగా లైకా ప్రొడక్షన్స్ పేరుతో అనేక అనధికారిక కాస్టింగ్ కాల్స్ పేరుతో మోసాలకు పాల్పడుతున్నట్లు ఆ సంస్థ తెలిపింది.
కోలీవుడ్‌లో లైకా ప్రొడక్షన్స్ సంస్థ ద్వారా భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మాత సుభాస్కరన్ నిర్మించారు. లైకా ప్రొడక్షన్స్ పేరుతో అనధికారికంగా కొందరు ఫేక్ ఐడీలు క్రియేట్ చేసి సినిమా ఛాన్స్‌లు ఇస్తున్నట్లు ప్రకటనలు చేస్తున్నాయని ఆ సంస్థ గుర్తించింది. ఈ విషయం తమ దృష్టికి వచ్చినట్లు లైకా తెలిపింది. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మించనున్న సినిమాల కోసం ఏవైనా కాస్టింగ్ కాల్‌లు లేదా ఆడిషన్‌లు ఉంటే తమ ధృవీకరించబడిన సోషల్ మీడియా పేజీల ద్వారా మాత్రమే అధికారికంగా ప్రకటించబడతాయని తెలిపింది. సోషల్ మీడియాలో అనధికారికంగా ఇలా ఫేక్ కాస్టింగ్ కాల్స్‌ల ట్రాప్‌లో చిక్కుకోకూడదని తాము కోరుతున్నట్లు పేర్కొన్నారు.
తమ సంస్థ పేరుతో కాస్టింగ్ కాల్‌లు లేదా ఆడిషన్‌లు నిర్వహించే అనధికార వ్యక్తులు, ఏజెన్సీలపై తాము చట్టపరమైన చర్యలు తీసుకుంటామని లైకా ప్రొడక్షన్ హెచ్చరించింది. ఇలాంటి వారి సమాచారం మీ దృష్టికి వస్తే సమాచారం ఇవ్వండి అంటూ కోరింది.
Comments
Please login to add a commentAdd a comment