విజయ్‌ కుమారుడి డైరెక్షన్‌లో టాలీవుడ్‌ హీరో | Sundeep Kishan Will Get Chance In Vijay's Son Movie | Sakshi
Sakshi News home page

విజయ్‌ కుమారుడి డైరెక్షన్‌లో టాలీవుడ్‌ హీరో

Published Tue, Sep 10 2024 12:01 PM | Last Updated on Tue, Sep 10 2024 12:15 PM

Sundeep Kishan Will Get Chance In  Vijay's Son Movie

కోలీవుడ్‌ స్టార్‌ హీరో విజయ్‌ కుమారుడు జేసన్‌ సంజయ్‌ తన తండ్రిలా యాక్టర్‌ కాకుండా డైరెక్టర్‌గా మారిన విషయం తెలిసిందే. ఆయన డైరెక్ట్‌ చేస్తున్న మొదటి సినిమాలో టాలీవుడ్‌ హీరోకు అవకాశం దక్కింది. విజయ్‌ అభిమానులు కూడా జేసన్‌ సినిమా కోసం ఎదురుచూస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌ను ప్రముఖ నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌ భారీ బడ్జెట్‌తో పాన్‌ ఇండియా రేంజ్‌లో తెరెక్కిస్తుంది.

జాస‌న్ సంజ‌య్ త‌న డెబ్యూ మూవీని ఇప్పటికే అఫీషియ‌ల్‌గా ప్రకటించారు. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రంలో సందీప్‌ కిషన్‌కు ఛాన్స్‌ దక్కినట్లు ప్రచారం జరుగుతుంది. ఇదే సమయంలో ఈ చిత్రానికి తమన్‌ సంగీతం అందించనున్నారని సమాచారం. సుభాస్కరన్‌ నిర్మాతగా వ్యవహరిస్తున్న ఈ సినిమాలో ప్రధాన హీరో, హీరోయిన్లు ఎవరనేది తెలియాల్సి ఉంది.

ఈ ప్రాజెక్ట్‌ గురించి నిర్మాత  సుభాస్కరన్‌ మాట్లాడుతూ.. 'జాసన్‌ సంజయ్‌ దర్శకత్వంలో లైకాలో చిత్రాన్ని నిర్మించడం ఆనందంగా ఉంది. అతను మాకు కథ చెప్పినప్పుడు చాలా బాగా నచ్చింది. సినిమా ప్రేక్షకులను మెప్పించే అన్ని అంశాలు కథలో ఉన్నాయి.  తమిళ చిత్రసీమలో పాపులర్ అవుతున్న పలువురు నటీనటులను ఈ సినిమా కోసం తీసుకుంటున్నాం. ఇప్పటికే వారితో చర్చలు కూడా జరుగుతున్నాయి.' అని ఆయన అన్నారు.

ఈ క్రమంలో  జేసన్ సంజయ్ మొదటి సినిమాలో విజయ్ సేతుపతి నటిస్తారని మొదట వార్తలు వచ్చాయి. అయితే, ఈ బిగ్‌ ప్రాజెక్ట్‌లో సందీప్ కిషన్ ప్రధాన పాత్రలో నటించడం దాదాపు ఖాయమైందని సమాచారం. కొన్ని నెలల క్రితం విడుదలైన 'రాయన్‌' చిత్రంతో ఆయన ఇప్పుడు ట్రెండ్‌లో ఉన్నారు. అందులోని ఆయన నటనకు మంచి మార్కులు పడ్డాయి. దీంతో సందీప్ కిషన్‌కు ఇలా ఛాన్స్‌ దక్కిందని చెప్పవచ్చు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement