అమ్మ సూచన.. ప్రైవేట్ జెట్‌లో షిరిడీ వెళ్లిన విజయ్ | Thalapathy Vijay Went To Shirdi Ahead Of GOAT Movie Release, Interesting Deets Inside | Sakshi
Sakshi News home page

అమ్మ సూచన.. ప్రైవేట్ జెట్‌లో షిరిడీ వెళ్లిన విజయ్

Published Sat, Aug 31 2024 9:36 AM | Last Updated on Sat, Aug 31 2024 10:25 AM

Thalapathy Vijay Went To Shirdi

తమిళనాడులో హీరో విజయ్‌ రాజకీయ ప్రస్థానాన్ని ప్రారంభించిన తర్వాత ప్రజలకు దగ్గరగా ఉంటూ వస్తున్నారు. మరికొన్ని రోజుల్లో పాదయాత్ర కూడా చేయనున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి సమయంలో తల్లి కోరిక మేరకు ఆయన షిరిడి చేరుకున్నారు. కోలీవుడ్‌లో అగ్ర కథానాయకుడిగా వెలుగొందుతున్న విజయ్‌.. సినిమాల నుంచి ఇప్పుడు రాజకీయాల్లో రాణించడానికి సిద్ధం అయ్యారు. తమిళగ వెట్రి కళగం పేరుతో పార్టీని పెట్టి ఆపై జెండా కూడా ఆవిష్కరించారు. రాజకీయాల కోసం భవిష్యత్‌లో సినిమాలకు స్వస్తి చెప్పడానికి కూడా ఆయన సిద్ధం అయ్యారు.  విజయ్‌ కథానాయకుడిగా నటించిన చిత్రం గోట్‌ సెప్టెంబర్‌ 5న విడుదల కానుంది. నటుడు మైక్‌ మోహన్, ప్రభుదేవా, ప్రశాంత్, అజ్మల్, నటి మీనాక్షీ చౌదరి, స్నేహా, లైలా ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు.

హీరో విజయ్‌ సినిమాలతో పాటు రాజకీయాల్లో కూడా బిజీగా ఉన్నారు. ఇలాంటి సమయంలో ఆయన  షిరిడీ సాయినాథుడిని దర్శించుకోవడానికి  చెన్నై నుంచి మహారాష్ట్రకు ప్రైవేట్ జెట్‌లో చేరుకున్నారు. కొద్దిరోజుల్లో ప్రజల దగ్గరకు విజయ్‌ వెళ్లబోతున్నారు. ఈ క్రమంలో  ముందుగా షిరిడీ సాయిబాబాను దర్శించుకోవాలని  తన తల్లి శోభ సూచించడంతో ఆయన ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. విజయ్‌ తల్లి శోభ సాయిబాబా  భక్తురాలు. ఆమ్మపై ప్రేమతో కొద్దిరోజుల క్రితం చెన్నైలో సాయిబాబా గుడి కూడా విజయ్‌ నిర్మించారు. ఇటీవలే పార్టీ జెండాను ఆవిష్కరించిన విజయ్‌ సెప్టెంబర్‌ 23న  తిరుచ్చిలో మొట్ట మొదటి సారిగా మానాడు కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement