స్టార్‌ హీరో సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఛాన్స్‌ | Varalaxmi Sarathkumar To Play Key Role In Thalapathy Vijay Last Movie After Entering Into Politics | Sakshi
Sakshi News home page

స్టార్‌ హీరో సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఛాన్స్‌

Published Mon, Nov 25 2024 10:22 AM | Last Updated on Mon, Nov 25 2024 11:29 AM

Varalaxmi Sarathkumar Entry Thalapathy Vijay Last Movie

నటుడు విజయ్‌ చివరి చిత్రంగా చెప్పుకుంటున్న ఆయన 69వ చిత్రం షూటింగ్‌ చెన్నైలో శరవేగంగా సాగుతోంది. హెచ్‌ వినోద్‌ వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం ఇది సమకాలీన రాజకీయ కథా చిత్రం కావడమే. అంతే కాకుండా దర్శకుడు హెచ్‌ వినోద్‌ ఈ కథను నటుడు కమలహాసన్‌ కోసం సిద్ధం చేసిన కథ అనే ప్రచారం కూడా సాగుతోంది. అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్‌ రాజకీయ భవిష్యత్తుకు ఈ చిత్రం చాలా ప్రయోజనకరంగా ఉంటుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. 

ఇందులో నటి పూజా హెగ్డే నాయకిగా నటిస్తుండగా ప్రకాష్‌ రాజ్, ప్రియమణి బాలీవుడ్‌ స్టార్‌ నటుడు  ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి.ఎన్‌ పిక్చర్స్‌ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే నిర్మాత లలిత్‌కుమార్‌ ఫ్యాన్సీ రేటుకు హక్కులు పొందినట్లు సమాచారం. 

ఇకపోతే ఈ చిత్రంలో సంచలన నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు, ఇప్పుడు విజయ్, వరలక్ష్మి మధ్య జరిగే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిసింది. ఇంతకుముందు విజయ్‌ కథానాయకుడిగా నటించిన సర్కార్‌ చిత్రంలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్‌ ప్రతినాయకి పాత్రను పోషించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రంలో ఆమె ఎలాంటి పాత్ర  పోషిస్తున్నారన్న అంశంపై  సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్‌ స్పెషల్‌గా తెరపైకి వచ్చే అవకాశం ఉంది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement