Varalakshi Sarath Kumar
-
స్టార్ హీరో సినిమాలో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ఛాన్స్
నటుడు విజయ్ చివరి చిత్రంగా చెప్పుకుంటున్న ఆయన 69వ చిత్రం షూటింగ్ చెన్నైలో శరవేగంగా సాగుతోంది. హెచ్ వినోద్ వహిస్తున్న ఈ చిత్రంపై భారీ అంచనాలు నెలకొన్నాయి. కారణం ఇది సమకాలీన రాజకీయ కథా చిత్రం కావడమే. అంతే కాకుండా దర్శకుడు హెచ్ వినోద్ ఈ కథను నటుడు కమలహాసన్ కోసం సిద్ధం చేసిన కథ అనే ప్రచారం కూడా సాగుతోంది. అదేవిధంగా రాజకీయ పార్టీ ప్రారంభించిన నటుడు విజయ్ రాజకీయ భవిష్యత్తుకు ఈ చిత్రం చాలా ప్రయోజనకరంగా ఉంటుందనే భావన కూడా వ్యక్తమవుతోంది. ఇందులో నటి పూజా హెగ్డే నాయకిగా నటిస్తుండగా ప్రకాష్ రాజ్, ప్రియమణి బాలీవుడ్ స్టార్ నటుడు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. కె.వి.ఎన్ పిక్చర్స్ సంస్థ భారీ ఎత్తున నిర్మిస్తున్న ఈ చిత్రానికి అనిరుధ్ సంగీతాన్ని అందిస్తున్నారు. మరో విషయం ఏమిటంటే నిర్మాత లలిత్‌కుమార్ ఫ్యాన్సీ రేటుకు హక్కులు పొందినట్లు సమాచారం. ఇకపోతే ఈ చిత్రంలో సంచలన నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ముఖ్య పాత్రను పోషిస్తున్నట్లు, ఇప్పుడు విజయ్, వరలక్ష్మి మధ్య జరిగే సన్నివేశాల చిత్రీకరణ జరుగుతున్నట్లు తెలిసింది. ఇంతకుముందు విజయ్ కథానాయకుడిగా నటించిన సర్కార్ చిత్రంలో నటి వరలక్ష్మి శరత్‌కుమార్ ప్రతినాయకి పాత్రను పోషించారు. ఆ చిత్రం మంచి విజయాన్ని సాధించింది. అలాంటిది ఇప్పుడు ఈ చిత్రంలో ఆమె ఎలాంటి పాత్ర పోషిస్తున్నారన్న అంశంపై సినీ వర్గాల్లో ఆసక్తి నెలకొంది. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం వచ్చే ఏడాది సమ్మర్ స్పెషల్‌గా తెరపైకి వచ్చే అవకాశం ఉంది. -
కృతి శెట్టి స్టైలిష్.. షాలినీ పాండే బ్లాక్ బస్టర్.. అలియా కూల్ లుక్
పెళ్లి ఫోటోలు అభిమానులతో పంచుకున్న వరలక్ష్మీ శరత్కుమార్స్టన్నింగ్ ఫోజులు ఇచ్చిన షాలినీ పాండేమీలోని అంతర్గత బలాన్ని స్వీకరించాలని కోరుతున్న కృతి శెట్టియాడ్ షూట్ కోసం బ్లాక్ డ్రెస్‌లో దుమ్మురేపిన అనన్య నాగళ్ల'పసుపు' ఇష్టమైన రంగు అంటూ ఇలా వివరణ ఇచ్చిన రష్మిక 'సూర్యరశ్మి, సన్ ఫ్లవర్స్, చిరునవ్వులు, ఆనందం వంటి దయ, సంతోషకరమైన అన్ని విషయాలను పసుపు రంగు సూచిస్తుంది.' View this post on Instagram A post shared by Varalaxmi Sarathkumar (@varusarathkumar) View this post on Instagram A post shared by Alia Bhatt 💛 (@aliaabhatt) View this post on Instagram A post shared by Shalini Pandey (@shalzp) View this post on Instagram A post shared by Krithi Shetty (@krithi.shetty_official) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Ananya nagalla (@ananya.nagalla) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Ruhii Siingh (@ruhisingh12) -
పాన్ ఇండియా సినిమాలోకి ఎంట్రీ ఇచ్చిన శివాజీ
టాలీవుడ్లో తెరకెక్కుతున్న మరో భారీ సోషియో ఫాంటసీ మూవీ 'కూర్మనాయకి'. ఈ చిత్రాన్ని ఎంఎం క్రియేషన్స్, కాలభైరవ ప్రొడక్షన్స్‌తో కలిసి రోషన్ ప్రొడక్షన్స్ బ్యానర్లో కె విజితా రావ్ నిర్మిస్తున్నారు. స్నిగ్ధ మణికాంత్ రెడ్డి, పూజ సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఇండియన్ స్క్రీన్ మీద ఇప్పటిదాకా రానటువంటి కథా కథనాలతో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల.వరలక్ష్మీ శరత్ కుమార్, సాయి కుమార్, అతిరారాజ్, వీటీవీ గణేష్ కీ రోల్స్ లో నటిస్తున్న ఈ చిత్రంలో ప్రముఖ యాక్టర్ శివాజీ ఓ ప్రధాన పాత్రను పోషించనున్నారు. ఈ రోజు శివాజీ బర్త్ డే సందర్భంగా ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు చిత్ర యూనిట్ తెలిపింది. ఈ భారీ ప్రాజెక్ట్‌లోకి వెల్కమ్ చేస్తూ స్పెషల్ వీడియోను కూర్మనాయకి టీమ్ రిలీజ్ చేసింది. శివాజీ ఈ చిత్రంలో పవర్ ఫుల్ రోల్ చేస్తున్నట్లు ఈ వీడియో ద్వారా తెలుస్తోంది.మహావిష్ణు అవతారాల్లోని కూర్మావతారం నేపథ్యంలో పాన్ ఇండియా మూవీగా 'కూర్మనాయకి' చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు దర్శకుడు హర్షవర్థన్ కడియాల. అత్యున్నత సాంకేతిక విలువలతో పాటు హై క్వాలిటీ వీఎఫ్ఎక్స్ షాట్స్ ఈ సినిమాకు ఉపయోగిస్తున్నారు. ప్రస్తుతం రెండు షెడ్యూల్స్ చిత్రీకరణ పూర్తి చేసుకున్నారు. థర్డ్ షెడ్యూల్ లో శివాజీ జాయిన్ అయ్యారు. కూర్మనాయకి సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారు. ఆయన ఎవరనేది త్వరలో వెల్లడించనున్నారు. -
అల్లు అర్జున్ ఇంట్లో వరలక్ష్మి శరత్‌కుమార్.. ఫోటోలు వైరల్
సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలో వరలక్ష్మి శరత్‌కుమార్‌కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ముఖ్యంగా టాలీవుడ్లో ఎక్కువ ప్రాధాన్యత ఉన్న పాత్రలే ఆమె చేసింది. అయితే, సినిమాలకు కాస్త బ్రేక్ ఇచ్చి త్వరలోనే పెళ్లి పీటలెక్కనుంది. ముంబయికి చెందిన గ్యాలరిస్ట్ నికోలాయ్ సచ్దేవ్ను ఆమె వివాహం చేసుకోనుంది. ఇప్పటికే వారి ఎంగేజ్మెంట్ కూడా జరిగిన విషయం తెలిసిందే.పెళ్లి సమయం దగ్గరపడుతుండటంతో తన సన్నిహితులతో పాటు సౌత్ ఇండియా చిత్రపరిశ్రమలోని చాలామంది ప్రముఖులను తన వివాహానికి రావాలంటూ వరలక్ష్మి ఆహ్వానిస్తుంది. ఇప్పటికే రజినీకాంత్, కమల్ హాసన్, సమంత,రవితేజ, ప్రశాంత్ వర్మ,తమన్, గోపిచంద్ మలినేని వంటి స్టార్స్‌కు వెడ్డింగ్ కార్డ్స్ అందజేసి ప్రత్యేకంగా అహ్వానించింది.అయితే తాజాగా తనకు కాబోయే భర్త నికోలాయ్ సచ్దేవ్తో కలిసి ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ఇంటికి వరలక్ష్మి చేరుకుంది. తమ వివాహానికి రావాలని ఆయన్ను ప్రత్యేకంగా ఆహ్వానించింది. అదే సమయంలో ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కు తమ ఆహ్వాన పత్రికను అందించింది. ఆ సమయంలో బన్నీతో వారు ఫోటోలు దిగారు. ప్రస్తుతం అవి నెట్టింట వైరల్ అవతున్నాయి. వరలక్ష్మి, నికోలాయ్ సచ్‌దేవ్‌ల వివాహం జులై 2న థాయ్‌ల్యాండ్‌లో జరగనున్నట్లు సమాచారం. -
ఆ సమయంలో నా బాయ్‌ఫ్రెండ్ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్‌కుమార్
ప్రేమ, పెళ్లి అనేది ఇద్దరు మనసులకు సంబంధించిన విషయం. ఒకరికొకరు నచ్చితే, మనసుకు నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు. ఇందులో ఇతరుల అభిప్రాయమో, ఇష్టాఇష్టాల్లో అక్కర్లేదు. అయినా ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చాలనేమీలేదు. అందువల్ల ఒకరి గురించి వ్యంగంగా మాట్లాడటం సబబు కాదు. కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్‌కుమార్ విషయంలోనూ ఇలాంటి కామెంట్సే సామాజక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ బోల్డ్ అండ్ బ్యూటీ గురించి అందరికీ తెలిసిందే. బహుభాషా నటి. ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించగల సత్తా ఉన్న నటి. ప్రముఖ నటుడు శరత్‌కుమార్ వారసురాలు అయినా స్వయం కృషితోనే ఎదిగిన నటి. తమిళ 'పోడాపోడీ' చిత్రంతో కథానాయకిగా తెరంగేట్రం చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌లో మంచి నృత్య కళాకారిణి ఉన్నారన్నది ఈ తరానికి చెందిన చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె బెల్లీ డాన్సర్. ఇకపోతే నటిగా బిజీగా ఉన్న ఈమె జీవితంలో ఒక తోడును వెతుక్కున్నారు. ఆయన పేరు 'నికోలయ్ సచ్దేవ్'. ఈయన్ని ప్రేమించిన వరలక్ష్మీ శరత్‌కుమార్ పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల వీరి వివాహ నిశ్చితార్థం కూడా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో నిడారంబరంగా జరిగింది. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌కు కారణం ఆమె ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్న నికోలయ్ ఇంతకు ముందే వివాహితుడు కావడమే. అంతే కాదు అతనికి ఒక కూతురు కూడా ఉంది. ఆయనెలా వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నచ్చారు? డబ్బు కోసం పెళ్లి చేసుకోబోతున్నారా? అనే కామెంట్స్ దొర్లుతున్నాయి. వాటిపై ఇటీవల ఒక భేటీలో స్పందించిన వరలక్ష్మీ శరత్‌కుమార్ తాను కష్టపడి పని చేస్తున్నాననీ, తన సంపాదనతో చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. నికోలయ్‌ను డబ్బు కోసమే పెళ్లి చేసుకోబోతున్నానని కొందరు కామెంట్స్ చేస్తున్నారనీ, అదే డబ్బు తన వద్దా ఉందని చెప్పారు. అలాంటిది డబ్బు కోసం తానెందుకు మరొకరిని పెళ్లి చేసుకోవాలి అని ప్రశ్నించారు. నికోలయ్ తనకు పరిచయం అయినప్పుడు భార్యతోనే కలిసున్నారని చెప్పారు. ఆయనతో తనకు కొన్ని నెలల క్రితమే స్నేహం ఏర్పడిందన్నారు. ఆ సమయంలో ఆయన ప్రవర్తన, మర్యాద, తన ప్రొఫెషన్‌పై గౌరవం చూసి తనకు ఆయనపై ప్రేమ కలిగిందన్నారు. అయినప్పటికీ నికోలయ్ తన తల్లిదండ్రులను కలిసి తనపై ఆయనకు ఉన్న ప్రేమ గురించి చెప్పారన్నారు. ఇకపోతే తనకాయన ఎలా నచ్చారు అనే కామెంట్స్ చేస్తున్నారనీ, తన కళ్లకు ఆయన నచ్చారనీ బదులిచ్చారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న తన తల్లిదండ్రులు సంతోషంగా జీవించడం లేదా? అని వరలక్ష్మీ శరత్‌కుమార్ స్ట్రాంగ్‌గా స్పందించడం గమనార్హం. -
స్టార్ హీరోని పెళ్లి చేసుకోబోతున్న 'హనుమాన్' నటి ?
-
అయోధ్య రామ మందిరానికి 'హనుమాన్' టీమ్ భారీ విరాళం
శ్రీరాముడి జన్మస్థలమైన అయోధ్యలో రామాలయ ప్రారంభోత్సం, బాలరాముని ప్రాణప్రతిష్టకు మరికొన్ని గంటలే మిగిలి ఉన్నాయి. నేడు ఆ మధుర క్షణాలు ఆస్వాధించేందుకు భారత్ మొత్తం ఎదురుచూస్తుంది. ఇదే సమయంలో టాలీవుడ్లో విడుదలైన హనుమాన్ చిత్రం దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. చిన్న సినిమాగా విడుదల అయిన ఈ చిత్రం నేడు బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ క్రియేట్ చేస్తుంది. రామమందిర ప్రారంభోత్సవ వేళ 'హను-మాన్' టీమ్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంటుంది. ఈ సినిమా ప్రతి టికెట్‌పై రూ.5 అయోధ్య రామమందిరానికి విరాళంగా ఇవ్వనుందని ప్రీరిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా వచ్చిన చిరంజీవి ప్రకటించిన విషయం తెలిసిందే. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జా టైటిల్ రోల్లో ప్రైమ్‌షో ఎంటర్టైన్మెంట్స్పై నిరంజన్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. మేకర్స్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో పేర్కొన్నట్లుగా, వారు అయోధ్య రామమందిరానికి ఒక్కో టికెట్ నుంచి రూ. 5 రామమందిరానికి కేటాయించారు. సినిమా ప్రీమియర్ షోల నుంచి విక్రయించిన 2,97,162 టిక్కెట్లకు గాను రూ.14,85,810 చెక్కును ఇప్పటికే అందించారు. ఆ తర్వాత నేటి వరకు విక్రయించిన 53,28,211 టిక్కెట్ల నుంచి రూ.2,66,41,055 అందిస్తున్నట్లు ప్రకటించారు. ప్రపంచవ్యాప్తంగా హనుమాన్ రూ. 150 కోట్ల మార్కును క్రాస్ చేసి రూ. 200 కోట్ల వైపు దూసుకుపోతుంది. గూస్బంప్స్ వచ్చాయి: నాగా చైతన్య హనుమాన్ చిత్రం విడుదలకు ముందే మెగాస్టార్ చిరంజీవి మెచ్చుకున్నారు. ఆపై బాలకృష్ణ కూడా అభినందించారు. సమంత కూడా సినిమా బాగుందంటూ ఆ చిత్ర మేకర్స్‌ను మెచ్చుకున్నారు. తాజాగా హీరో నాగచైతన్య మనుమాన్ చిత్రాన్ని చూశారు. చిత్ర యూనిట్‌ను అభినందిస్తూ తన ఎక్స్ పేజీలో ఒక పోస్ట్ పెట్టారు. హనుమాన్ కథతో పాటు తెరపైకి తీసుకువచ్చిన తీరు చాలా అద్భుతం అని డైరెక్టర్ ప్రశాంత్ వర్మను అభినందించారు. హనుమంతుగా తేజ సజ్జా అదరగొట్టేశారు. సినిమా చూస్తున్నంతసేపు గూస్బంప్స్ వచ్చాయని నాగ చైతన్య తెలుపుతూ టీమ్ మొత్తానికి అభినందనలు తెలిపారు. View this post on Instagram A post shared by Mythri Movie Makers (@mythriofficial) -
సోషల్ హల్చల్: రాశి ఖన్నా అందాల విందు..
ఇది ఉత్తమమైన రోజు అంటూ నిటీలో చేప పిల్లలా ఈదుతున్న ఫోటోని షేర్ చేసిన ఆలియా భట్ అంతర్జాతీయ సంతోష దినం సందర్భంగా మంచు లక్ష్మీ తన కూతరు నిర్వాణతో కలిసి ఓ ఫోటోని పంచుకుంది. అందులో ఆమె కూతురిని హత్తుకొని నవ్వుతూ ఉంది. మంచి చేయడం అదేని మంచి చెప్పడం కంటే బెటర్ అంటూ తన ఫోటోని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్ చేసిన లక్ష్మీరాయ్ సముద్రపు ఒడ్డు నికితాశర్మ సోయగాల ఉప్పెన మోస్ట్ బ్యాచిలర్ సెట్లో పూజా హెగ్డే కొంటే వేషాలు.. హీరో అఖిల్, డైరెక్టర్ పనికి ఆటంకం కలిగిస్తూ వారిని ఇరిటేట్ చేస్తుంది. దీనికి సంబంధించిన ఫోటోని తన అభిమానులతో పంచుకుంది ఈ బుట్ట బొమ్మ. కొన్నిసార్లు జీవితాన్ని బ్లాక్అండ్వైట్లో చూడటమే సులభం అంటున్న వరలక్ష్మీశరత్‌కుమార్ డ్యాన్స్‌తో కుర్రకారులను రెచ్చగొడుతోన్న విష్ణుప్రియ గోల్డ్ కలర్లో డ్రెస్‌లో హొయలు ఒలికిస్తున్న రాశి ఖన్నా View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Nidhhi Agerwal 🌟 (@nidhhiagerwal) View this post on Instagram A post shared by Vishnupriya (@vishnupriyabhimeneni) View this post on Instagram A post shared by Amritha - Thendral (@amritha_aiyer) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Bhanu shree (@iam_bhanusri) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) -
నేను సూపర్ హ్యాపీ: నటి వరలక్ష్మి
చెన్నై: సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే నటీమణుల్లో దక్షిణాదికి చెందిన వరలక్ష్మి శరత్ కుమార్ ఒకరు. అయితే తాజాగా వరలక్ష్మి ట్విటర్, ఇన్స్టాగ్రామ్ అకౌంట్లు డిసెంబర్ 2వ తేదీన హ్యాకింగ్ బారిన పడ్డాయి. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించారు. సోషల్ మీడియాలో తన పేరు మీద ఏమైనా పోస్టులు వస్తే జాగ్రత్తగా ఉండాలని అభిమానుల్ని కోరారు. అయితే తాజాగా వరలక్ష్మి శరత్‌కుమార్ ట్విటర్ ఖాతా తిరిగి సాధారణ స్థితికి చేరుకుంది. ఈ సందర్భంగా ఆమె ట్విటర్ యాజమాన్యానికి ధన్యవాదాలు తెలిపారు. (చదవండి: ‘తలైవి’ వర్ధంతి : కంగనా స్టన్నింగ్ స్టిల్స్) మళ్లీ ఇంత త్వరగా రీ ఎంట్రీ ఇచ్చినందుకు ఎంతో ఆనందంగా ఉందన్నారు. మనం సోషల్ మీడియాలో బతుకుతున్నాం, ఇక్కడ ఏమైనా జరగొచ్చు కానీ అదంతా నిజం కాదని, మనం చూసిన ప్రతీదాన్ని నమ్మకూడదని ట్విటర్లో పేర్కొన్నారు. వరలక్ష్మి ప్రస్తుతం తమిళ్, తెలుగు సినిమాల్లో హీరోయిన్గా, విలన్ క్యారెక్టర్లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తెలుగులో రవితేజ హీరోగా వస్తున్న క్రాక్ సినిమాలో వరలక్ష్మి నటించనున్నారు. Thank you to @Twitter for having retrieving my account..!!! Super happy to be back.. — 𝑽𝒂𝒓𝒂𝒍𝒂𝒙𝒎𝒊 𝑺𝒂𝒓𝒂𝒕𝒉𝒌𝒖𝒎𝒂𝒓 (@varusarath5) December 4, 2020 -
తప్పు ఎవరు చేసినా శిక్ష అనుభవించాల్సిందే
పెరంబూరు: తప్పెవరు చేసినా, శిక్ష అనుభవించాల్సిందేనని నటుడు, దక్షిణ భారత నటీనటుల సంఘం( నడిగర్‌సంఘం) కార్యదర్శి విశాల్ పేర్కొన్నారు. ఈ సంఘంకు ఎన్నికల 23వ తేదీన ఎన్నికలు జరగనున్న సంగతి తెలిసిందే. కాగా ప్రస్తుత కార్యవర్గం అయన విశాల్ జట్టు మళ్లీ పోటీకి దిగగా,వారికి పోటీగా దర్శక,నటుడు కే.భాగ్యరాజ్ నేతృతకవంలో ఐసరిగణేశ్, ఉదయ,ప్రశాంత్ బరిలోకి దిగుతున్నారు.దీంతో ఎన్నికల వాతావరణం వేడెక్కింది. ఓటు బ్యాంకు కోసం ఎవరి ప్రయత్నాలు వారు చేసుకుంటున్నారు. అందులో భాగంగా నటుడు విశాల్ ఇటీవల ఒక వీడియోను విడుదల చేసిన విషయం,దానిపై నటి వరలక్ష్మీశరత్‌కుమార్, రాధికాశరత్‌కుమార్‌లు ఆయనపై ద్వజమెత్తిన విషయం విదితమే.నటి వరలక్ష్మీ శరత్‌కుమార్ విశాల్ చర్యల్ని తీవ్రంగా ఖండించింది. ఇక నటి రాధికాశరత్‌కుమార్ సిగ్గుమాలిన చర్య అంటూ విశాల్‌పై ఆగ్రహం వ్యక్తం చేశారు. వీరిద్దరికి బదులిచ్చే విధంగా నటుడు విశాల్ స్పంధించారు. ఆయన పేర్కొంటూ నడిగర్‌సంఘం ఎన్నికల గురించి పలు రకాల ప్రచారం జరుగుతోందన్నారు. వాటిని ఎలా ఎదుర్కోవాలన్నదే ఇప్పుడు తీసుకోవలసిన చర్యలని పేర్కొన్నారు. ఒక వ్యక్తిపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయడం అన్నది అంత సాధారణంగా జరగదన్నారు.అన్నీ పూర్తిగా విచారించిన తరువాతనే ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని అన్నారు. తనతో సహా ఎవరైనా తప్పు చేస్తే శిక్షను అనుభవించాల్సిందేనని అన్నారు. తాము సంఘానికి ఏం చేశామన్నది చెప్పాల్సి వచ్చినప్పుడు నటుడు శరత్‌కుమార్ పేరును ప్రస్ధావించాల్సి వచ్చిందనీ,అందులో తప్పు లేదనీ అన్నారు.కాగా ఇంత జరుగుతున్నా న డిగర్ సంఘ మాజీ అధ్యక్షుడు శరత్‌కుమార్ మౌనంగానే ఉండటం విశేషం. అంతే కాకుండా ఈ ఎన్నికల వ్యవహారం గురించి స్పంధించాల్సిందిగా మీడియా కోరగా తాను ఆ సంఘంలో సభ్యుడినే కాదనీ,అలాంటప్పుడు ఎలా స్పంధిస్తాననీ శరత్‌కుమార్ బదులిచ్చారు. -
స్పందించకపోవడం సరికాదు!
స్పందించకపోవడం సరికాదని నటి వరలక్ష్మీశరత్‌కుమార్ సినీ ప్రముఖులకు చురకలు వేసింది. ఏ విషయంలోనైనా తనకు అనిపించింది వ్యక్తం చేయడానికి ఏ మాత్రం భయపడని నటి వరలక్ష్మీ. చేతినిండా చిత్రాలతో బిజీగా ఉన్న వరలక్ష్మీ శరత్‌కుమార్ సమాజంలోని స్త్రీలకు అండగా ఉండడానికి సేవ్‌శక్తి అనే సేవా సంస్థను ప్రారంభించిన విషయం తెలిసిందే. ఇక భవిష్యత్తులో తన రాజకీయరంగ ప్రవేశం తథ్యం అని కూడా కుండబద్దలు కొట్టినట్లు చెప్పింది. తన తండ్రి శరత్‌కుమార్ పార్టీలో చేరే ప్రసక్తే లేదని స్పష్టంగా చెప్పేసింది. ఈమె నోరు విప్పిందంటే సంచలనమే. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పలు విషయాల గురించి తన అభిప్రాయాలను పంచుకుంది. ముఖ్యంగా పొల్లాచ్చిలో ఇటీవల జరిగిన అత్యాచార సంఘటన గురించి తీవ్రంగా స్పందించింది. ఆ సంఘటనను ఇప్పుటికే పలువురు తీవ్రంగా ఖండించారని, అందరూ ముఖ్యంగా ప్రభుత్వం అలాంటి మృగాలపై కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు. ఇలాగే పలువురు సినీ ప్రముఖులు పొల్లాచ్చి సంఘటనపై తీవ్రంగా స్పందించారు.అయితే ఇంకా ఖండించని సినీ ప్రముఖులు ఉన్నారని, వారు ఎందుకు స్పందించలేదో అర్థం కావడం లేదని వరలక్ష్మీశరత్‌కుమార్ అంది. ఇటీవల మీటూ విషయంలోనూ తాను, గాయని చిన్మయి లాంటి వారు పోరాడామని, అయితే చాలా మంది ప్రముఖులు నోరు మెదపలేదని విమర్శంచింది. నిజానికి ఇలాంటి ఘోర సంఘటనలపై స్పందించడం ప్రముఖుల బాధ్యత అని పేర్కొంది. వారి స్పందనకు చాలా పవర్ ఉంటుందని అంది. దాని ప్రభావం చాలా ఉంటుందని అంది. కాబట్టి పొల్లాచ్చి సంఘటనలాంటి వాటిపై సినీ ప్రముఖులు స్పందించాలని వరలక్ష్మీశరత్‌కుమార్ అంటోంది. వరలక్ష్మీశరత్‌కుమార్ ఎవరిని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేసిందో అందరికీ తెలిసిందే. రాజకీయాల్లోకి వస్తామంటున్న కొందరు పొల్లాచ్చి సంఘటనపై ఇంకా గొంతు విప్పలేదన్నది వాస్తవం. -
పందెం ముగిసింది
హీరో విశాల్ తెలుగువాడే అయినా తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. తమిళంలో ఆయనకున్న ప్రేక్షకాదరణ, అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్. ఆ చిత్రం విడుదలైన పుష్కర కాలానికి సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ తెరకెక్కించారు. కీర్తీ సురేశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలకపాత్ర చేశారు. పార్ట్ 1 తెరకెక్కించిన లింగుస్వామి దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సీక్వెల్ షూటింగ్‌కి ఆదివారం గుమ్మడికాయ కొట్టేశారు చిత్రయూనిట్. ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. కాగా విశాల్, సమంత జంటగా మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరంబుదురై’ (అభిమన్యుడు) సినిమా ఆదివారంతో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం. -
దీపావళికి సర్కార్
ఈ ఏడాది దీపావళికి థియేటర్స్‌లోకి కొత్త సర్కార్ రానుంది. హీరో విజయ్ ఈ సర్కార్‌కు లీడర్. ‘కత్తి, తుపాకీ’ వంటి విజయవంతమైన చిత్రాల తర్వాత మురుగదాస్ దర్శకత్వంలో విజయ్ హీరోగా రూపొందుతోన్న సినిమాకు ‘సర్కార్’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఇందులో కీర్తీ సురేశ్ హీరోయిన్. వరలక్ష్మీ శరత్‌కుమార్, యోగిబాబు కీలక పాత్రలు చేస్తున్నారు. విజయ్ బర్త్‌డే సందర్భంగా ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ఇందులో విజయ్ త్రీ లుక్స్‌లో కనిపించనున్నారట. ప్రజెంట్ ఈ సినిమా షూటింగ్ చెన్నైలో జరుగుతోంది. విజయ్, వరలక్ష్మీలపై కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాను ఈ ఏడాది దీపావళికి రిలీజ్ చేయాలనుకుంటున్నారు. ‘‘విజయ్, నా కాంబినేషన్లో వచ్చిన ‘కత్తి, తుపాకీ’ చిత్రాల కన్నా ‘సర్కార్’ ఇంకా సూపర్‌గా ఉంటుందని కాన్ఫిడెంట్‌గా చెప్ప గలను’’ అన్నారు మురుగదాస్. -
బుద్ధి చెప్పాడు!
ఫుల్‌గా ఎంక్వైరీ చేశాడు. క్రిమినల్స్ చిట్టా పట్టాడు. కానీ చట్టంలో ఉన్న లొసుగులతో కొందరు శిక్ష నుంచి తప్పించుకోవాల నుకున్నారు. అప్పుడా పవర్ఫుల్ పోలీసాఫీసర్ తన బుద్ధిబలానికి పని చెప్పి వారికి ఎలా శిక్ష వేయించాడు? అతను ఎదుర్కొన్న రాజకీయ ఒత్తిళ్లు ఏంటి? ఇలాంటి కథాంశంతో మలయాళంలో ‘మాస్టర్ పీస్’ అనే చిత్రం రూపొందిందని సమాచారం. అజయ్ వాసుదేవ్ దర్శకత్వంలో మమ్ముట్టి, వరలక్ష్మీ శరత్ కుమార్, ఉన్ని ముకుందన్ కీలక పాత్రల్లో నటించారు. ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఇందులో వరలక్ష్మీ, మమ్ముట్టి పోలీసాఫీసర్లుగా నటించారని మాలీవుడ్ టాక్. ‘‘మమ్ముట్టి సార్, వాసుదేవ్లతో నటించడం ఎగై్జటింగ్‌గా ఉంది. చిత్రాన్ని డిసెంబర్ 21న విడుదల చేయాలనుకుంటున్నాం’’ అని పేర్కొన్నారు వరలక్ష్మి. ఈ సంగతి ఇలా ఉంచితే.. వెంకట్ ప్రభు దర్శకత్వంలో తమిళంలో రూపొందనున్న ‘తుపాకీ మునై’ చిత్రంలో ఆమె కీ రోల్ చేయనున్నారు. ఇంతకీ.. ఈ వరలక్ష్మి అంటే ఎవరో కాదు.. నటుడు శరత్‌కుమార్ తనయ. -
ఆ ఇద్దరి బాటలో వరలక్ష్మీ శరత్‌కుమార్
తమిళసినిమా: నయనతార, త్రిష తరహాలో ఫెరోషియస్ పోషించడానికి నటి వరలక్షీ శరత్‌కుమార్ రెడీ అయ్యింది. తారాతప్పట్టై చిత్రంతోనే తన టాలెంట్‌ను నిరూపించుకున్న వరలక్ష్మీ ఇప్పుడు తమిళంతో పాటు మలయాళం, కన్నడం భాషలోనూ నటిస్తోంది. తాజాగా కోలీవుడ్‌లో హీరోయిన్ సెంట్రిక్ పాత్రను పోషించే అవకాశం వరించింది. దర్శకుడు మిష్కిన్ శిష్యుడు ప్రియదర్శిని మెగాఫోన్ పట్టనున్న ఈ చిత్రం త్వరలో సెట్‌పైకి వేళ్లనుంది. ఈ వివరాలను దర్శకుడు తెలుపుతూ ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రం హీరోయిన్ ఓరియెంటెడ్ కథగా ఉంటుందని చెప్పారు. హీరోయిన్గా వరలక్ష్మీశరత్‌కుమార్ నటించనున్నారని, ఆమె పాత్ర అవుట్ అండ్ అవుట్ యాక్షన్ థ్రిల్లర్‌గా ఉంటుందని తెలిపారు. వరలక్ష్మీ పాత్రకు ఫైట్ సన్నివేశాలు భారీగా ఉంటాయని చెప్పారు. ఇంకా చెప్పాలంటే క్యాట్ అండ్ మౌస్ గేమ్ తరహాలో ఆమె పాత్ర ఉంటుందని అన్నారు. ఇందులో హీరోగా నటించడానికి ఒక ప్రముఖ నటుడితో చర్చలు జరుపుతున్నట్లు తెలిపారు. చిత్ర షూటింగ్‌ను చెన్నై, పూనె ప్రాంతాల్లో నిర్వహించనున్నట్లు చెప్పారు. ఇది జనరంజకమైన అన్ని కమర్షియల్ అంశాలతో రూపొందనున్న చిత్రం అన్నారు. యాక్షన్, మిస్టరీ, రోడ్ థ్రిల్లర్ చిత్రంగా ఉంటుందని తెలిపారు. దీనికి శ్యామ్.సీఎస్ సంగీతం, బాలాజీ రంగా ఛాయాగ్రహణం అందించనున్నారు. చిత్రాన్ని అక్టోబర్ 15న ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఫస్ట్‌లుక్‌ను దర్శకుడు మిష్కిన్ బర్త్‌డే సందర్భంగా బుధవారం విడుదల చేయాలనుకున్నా, అందుకు పనులు పూర్తి కాకపోవడంతో విజయదశమి సందర్భంగా ఈ నెల 30న విడుదల చేయనున్నామని చెప్పారు. ఈ చిత్రానికి సంబంధించిన పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిం చనున్నట్లు చెప్పారు.