ఆ సమయంలో నా బాయ్‌ఫ్రెండ్‌ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్‌కుమార్‌ | Varalaxmi Sarathkumar responds to trolls targeting her fiancé | Sakshi
Sakshi News home page

ఆ సమయంలో నా బాయ్‌ఫ్రెండ్‌ భార్య కూడా ఉంది: వరలక్ష్మీ శరత్‌కుమార్‌

Published Tue, Apr 30 2024 7:51 AM | Last Updated on Tue, Apr 30 2024 9:21 AM

Varalaxmi Sarathkumar responds to trolls targeting her fiancé

ప్రేమ, పెళ్లి అనేది ఇద్దరు మనసులకు సంబంధించిన విషయం. ఒకరికొకరు నచ్చితే, మనసుకు నచ్చితే పెళ్లి చేసుకోవచ్చు. ఇందులో ఇతరుల అభిప్రాయమో, ఇష్టాఇష్టాల్లో అక్కర్లేదు. అయినా ఒకరికి నచ్చితే మరొకరికి నచ్చాలనేమీలేదు. అందువల్ల ఒకరి గురించి వ్యంగంగా మాట్లాడటం సబబు కాదు. 

కోలీవుడ్‌ హీరోయిన్‌ వరలక్ష్మీ శరత్‌కుమార్‌ విషయంలోనూ ఇలాంటి కామెంట్సే సామాజక మాధ్యమాల్లో వైరల్‌ అవుతున్నాయి. ఈ బోల్డ్‌ అండ్‌ బ్యూటీ గురించి అందరికీ తెలిసిందే. బహుభాషా నటి. ఎలాంటి పాత్రనైనా అవలీలగా నటించగల సత్తా ఉన్న నటి. ప్రముఖ నటుడు శరత్‌కుమార్‌ వారసురాలు అయినా స్వయం కృషితోనే ఎదిగిన నటి. తమిళ 'పోడాపోడీ' చిత్రంతో కథానాయకిగా తెరంగేట్రం చేసిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌లో మంచి నృత్య కళాకారిణి ఉన్నారన్నది ఈ తరానికి చెందిన చాలా మందికి తెలియకపోవచ్చు. ఆమె బెల్లీ డాన్సర్‌. 

ఇకపోతే నటిగా బిజీగా ఉన్న ఈమె జీవితంలో ఒక తోడును వెతుక్కున్నారు. ఆయన పేరు 'నికోలయ్‌ సచ్‌దేవ్‌'. ఈయన్ని ప్రేమించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ పెళ్లికి సిద్ధం అవుతున్నారు. ఇటీవల వీరి వివాహ నిశ్చితార్థం కూడా ఇరుకుటుంబ సభ్యుల సమక్షంలో నిడారంబరంగా జరిగింది. ఈ ఏడాదిలోనే పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్నారు. అయితే నటి వరలక్ష్మీ శరత్‌కుమార్‌పై జరుగుతున్న ట్రోలింగ్‌కు కారణం ఆమె ప్రేమించి పెళ్లి చేసుకోవడానికి సిద్ధం అవుతున్న నికోలయ్‌ ఇంతకు ముందే వివాహితుడు కావడమే. అంతే కాదు అతనికి ఒక కూతురు కూడా ఉంది. ఆయనెలా వరలక్ష్మీ శరత్‌కుమార్‌కు నచ్చారు? డబ్బు కోసం పెళ్లి చేసుకోబోతున్నారా? అనే కామెంట్స్‌ దొర్లుతున్నాయి. 

వాటిపై ఇటీవల ఒక భేటీలో స్పందించిన వరలక్ష్మీ శరత్‌కుమార్‌ తాను కష్టపడి పని చేస్తున్నాననీ, తన సంపాదనతో చాలా సంతోషంగా ఉన్నానని పేర్కొన్నారు. నికోలయ్‌ను డబ్బు కోసమే పెళ్లి చేసుకోబోతున్నానని కొందరు కామెంట్స్‌ చేస్తున్నారనీ, అదే డబ్బు తన వద్దా ఉందని చెప్పారు. అలాంటిది డబ్బు కోసం తానెందుకు మరొకరిని పెళ్లి చేసుకోవాలి అని ప్రశ్నించారు. నికోలయ్‌ తనకు పరిచయం అయినప్పుడు భార్యతోనే కలిసున్నారని చెప్పారు. ఆయనతో తనకు కొన్ని నెలల క్రితమే స్నేహం ఏర్పడిందన్నారు. 

ఆ సమయంలో ఆయన ప్రవర్తన, మర్యాద, తన ప్రొఫెషన్‌పై గౌరవం చూసి తనకు ఆయనపై ప్రేమ కలిగిందన్నారు. అయినప్పటికీ నికోలయ్‌ తన తల్లిదండ్రులను కలిసి తనపై ఆయనకు ఉన్న ప్రేమ గురించి చెప్పారన్నారు. ఇకపోతే తనకాయన ఎలా నచ్చారు అనే కామెంట్స్‌ చేస్తున్నారనీ, తన కళ్లకు ఆయన నచ్చారనీ బదులిచ్చారు. రెండు పెళ్లిళ్లు చేసుకున్న తన తల్లిదండ్రులు సంతోషంగా జీవించడం లేదా? అని వరలక్ష్మీ శరత్‌కుమార్‌ స్ట్రాంగ్‌గా స్పందించడం గమనార్హం.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement