
కీర్తీ సురేశ్, విశాల్
హీరో విశాల్ తెలుగువాడే అయినా తమిళంలో స్టార్ హీరోగా రాణిస్తున్నారు. తమిళంలో ఆయనకున్న ప్రేక్షకాదరణ, అభిమానుల గురించి ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. ‘పందెంకోడి’ సినిమాతో తెలుగు ప్రేక్షకుల్లోనూ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు విశాల్. ఆ చిత్రం విడుదలైన పుష్కర కాలానికి సీక్వెల్‌గా ‘పందెం కోడి 2’ తెరకెక్కించారు.
కీర్తీ సురేశ్ కథానాయికగా నటించిన ఈ చిత్రంలో వరలక్ష్మీ శరత్‌కుమార్ ఓ కీలకపాత్ర చేశారు. పార్ట్ 1 తెరకెక్కించిన లింగుస్వామి దర్శకత్వంలోనే తెరకెక్కిన ఈ సీక్వెల్ షూటింగ్‌కి ఆదివారం గుమ్మడికాయ కొట్టేశారు చిత్రయూనిట్. ఈ సినిమా అక్టోబర్ 18న విడుదల కానుంది. కాగా విశాల్, సమంత జంటగా మిత్రన్ దర్శకత్వంలో వచ్చిన ‘ఇరంబుదురై’ (అభిమన్యుడు) సినిమా ఆదివారంతో 100 రోజులు పూర్తి చేసుకోవడం విశేషం.
Comments
Please login to add a commentAdd a comment