Keerthi Suresh
-
నెట్‌ఫ్లిక్స్‌తో సినిమాలు.. ఈవెంట్లో పాల్గొన్న ప్రముఖ నటీనటులు (ఫోటోలు)
-
ఇబ్బందిగా ఉన్నా నా భర్త సర్దుకుపోతాడు: కీర్తీ సురేష్
సౌత్ ఇండియా నటి కీర్తీ సురేష్(Keerthy Suresh) చాలా లక్కీ అనే చెప్పాలి. బాలనటిగా రంగప్రవేశం చేయడం వల్లో ఏమోగానీ, కథానాయకిగానూ చాలా త్వరగా క్లిక్ అయ్యారు. అదేవిధంగా మలయాళం, తమిళం, తెలుగు, హిందీ భాషల్లోనూ వెనువెంటనే రంగప్రవేశం చేసి అంతే వేగంగా విజయాలను తన ఖాతాలో వేసుకుని పాన్ ఇండియా నాయకిగా గుర్తింపు పొందారు. అంతేకాదు అతి పిన్న వయసులోనే మహానటి చిత్రంలో అద్భుతమైన హావభావాలను పలికించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. అంతే స్వీడ్‌గా పెళ్లి చేసుకున్నారు. ఇదంతా నటిగా దశాబ్ద కాలంలోనే జరిగిపోయింది. గత ఏడాది డిసెంబర్ 12వ తేదీన తన 15 ఏళ్ల బాయ్ ఫ్రెండ్ ఆంటోనిని(Antony Thattil) కుటుంబ సభ్యుల సమ్మతితో పెళ్లి చేసుకున్న ఆ వెంటనే తాను నటించిన చిత్రాల ప్రమోషన్ కార్యక్రమాల్లో పాల్గొనడం విశేషం. కాగా ఇటీవలే తన భర్తతో హనీమూన్ కోసం థాయ్‌ల్యాండ్ వెళ్లి వచ్చిన ఈ బ్యూటీని ఒక భేటీలో కీర్తీసురేశ్ తన వివాహ జీవితం గురించి అగిడిన ప్రశ్నకు తాను వివాహానికి ముందు ఎలా ఉన్నానో ఇప్పుడు అలానే సంతోషంగా ఉన్నానని చెప్పారు. కారణం తాము సుదీర్ఘ కాలంగా డేటింగ్లో ఉండటం వల్ల ఒకరి గురించి ఒకరికి బాగా తెలుసన్నారు. అందువల్ల తనకు పెద్దగా ఛేంజ్ అంటూ ఏమీ లేదని అన్నారు. తాను ఎక్కువగా సోషల్ మీడియాలో ఉంటుంటానని, అది తన భర్తకు కాస్త సంకటంగా ఉంటుందన్నారు. అయినా దాన్ని ఆయన ఇబ్బందిగా భావించడం లేదన్నారు. తనను అర్థం చేసుకున్న వ్యక్తి కావడంతో చాలా విషయాల్లో సర్దుకు పోతుంటారని చెప్పారు. అందువల్ల తమ సంసార జీవితం చాలా సంతోషంగా సాగుతుందని నటి కీర్తీసురేశ్ పేర్కొన్నారు. కాగా హిందీ చిత్రం బేబీ జాన్ ఇటీవల విడుదలై ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. ప్రస్తుతం నూతన చిత్రాలేమీ అంగీకరించలేదు. కీర్తీసురేశ్ నటించిన రివాల్వర్ రీటా, కన్నివెడి చిత్రాలు విడుదల కావాల్సి ఉన్నాయి. -
ఈ విషయం తెలిసుంటే 'బేబీ జాన్'లో నటించేదానినే కాదు: కీర్తి సురేష్
నటి కీర్తి సురేష్ అందమైన నటి అంతకుమించిన అభినయం ఈమెకు ఆభరణం. కుటుంబ కథాచిత్రాలకు, ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రాలకు కేరాఫ్‌గా మారిన ఈ బ్యూటీ మహానటి చిత్రంలో దివంగత నటి సావిత్రిగా జీవించి జాతీయ ఉత్తమ నటి అవార్డును గెలుచుకున్నారు. తర్వాత కొన్ని గ్లామర్ పాత్రలోనూ నటించి తన సత్తాను చాటుకున్నారు. కాగా గత నెల 11వ తేదీన తన స్నేహితుడు ఆంటోనీని పెళ్లి చేసుకున్న విషయం తెలిసిందే. ఆ తర్వాత కొత్త చిత్రం ఏదీ కమిట్ కాలేదు. దీంతో ఈమె నటనకు విరామం పలికినట్లు ప్రచారం అందుకుంది. కాగా కీర్తి సురేష్ చివరిగా నటించిన చిత్రం బేబీ జాన్. ఈమె నటించిన తొలి హిందీ చిత్రం ఇదే. అయితే ఈ చిత్రంలో నటించి ఉండేదాన్ని కాదని కీర్తి సురేష్ ఇటీవల ఒక భేటీలో పేర్కొనడం విశేషం. దీని గురించి ఆమె తెలుపుతూ ఇంతకుముందు తమిళంలో తను నటించిన 'రఘు తాత' చిత్రాన్ని తెరపైకి తీసుకొచ్చింది. అందులో హిందీ భాషను ఖచ్చితంగా నేర్చుకునే తీరాలంటూ ఒత్తిడి చేయడాన్ని తప్పు అనే ఇతివృత్తంతో రూపొందించినట్లు చెప్పారు. ఆ చిత్ర ట్రైలర్లో హిందీ తెలియదు పోవయ్యా అనే డైలాగ్ చోటు చేసుకుందన్నారు. తమిళ ప్రేక్షకులు పలువురు రఘు తాత చిత్రంలో కీర్తి నటించినందుకు ఎంతగానో ప్రశంసించారన్నారు. కాగా ఆ వెంటనే తాను బేబీ జాన్ అనే హిందీ చిత్రంలో నటించడం జరిగిందన్నారు. దీంతో హిందీ భాషకు వ్యతిరేక రూపొందిన కథ చిత్రంలో నటించి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకొని బాలీవుడ్లో ఎంట్రీ అయ్యావు అంటూ పలువురు హిందీ ప్రేక్షకులు విమర్శించినట్లు ఆమె గుర్తుచేసుకున్నారు. తాను హిందీ భాషకు వ్యతిరేక కథా చిత్రంలో నటించలేదని, హిందీ భాషను కచ్చితంగా నేర్చుకోవాల్సిందే అనే తీరును వ్యతిరేకిస్తూ తీసిన చిత్రంలోనే నటించానని చాలా భేటీల్లో చెప్పానన్నారు. అసలు ఇలాంటి విమర్శలు వస్తాయని ముందుగా ఊహించి ఉంటే బేబీ జాన్ చిత్రంలో నటించేదాన్నే కాదని నటి కీర్తి సురేష్ స్పష్టం చేశారు. -
రెండు సంప్రదాయాలను గౌరవిస్తూ కీర్తి సురేష్ పెళ్లి
సినీ తారల ప్రేమ, పెళ్లి అభిమానుల్లో ఆనందాన్ని కలిగిస్తాయి. ప్రస్తుతం ఇలాంటి సీజనే నడుస్తోందని చెప్పవచ్చు. ఇటీవల నటుడు నాగచైతన్య, శోభిత వివాహం సాంప్రదాయబద్ధంగా జరిగిన విషయం తెలిసిందే. మరుపక్క నటి సమంత బాలీవుడ్‌కు చెందిన ఓ నటుడి ప్రేమలో ఉన్నట్లు సామాజిక మాధ్యమాల్లో ప్రచారం జోరుగా సాగుతోంది. ఇకపోతే కురక్రారుల డ్రీమ్ గర్ల్ కీర్తి సురేష్ కూడా పెళ్లి పీటలు ఎక్కడానికి సిద్ధమవుతున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న హిందీ చిత్రం బేబీ జాన్‌తో ఈ అమ్మడు పాన్ ఇండియా కథానాయకిగా పేరు తెచ్చుకున్నారు. ఇలా కథానాయకిగా ఉన్నత స్థాయిలో రాణిస్తున్న సమయంలోనే కీర్తి సురేష్ పెళ్లికి సిద్ధమవడం చాలామందిని ఆసక్తికి గురిచేసింది. 15 ఏళ్లుగా ప్రేమించుకుంటున్న తన పాఠశాల స్నేహితుడు ఆంటోనితో ఏడడుగులు నడవడానికి కీర్తి సురేష్ సిద్ధమవుతున్నారు. కాగా తను పెళ్లి చేసుకోబోతున్న వ్యక్తి క్రిస్టియన్ మతానికి చెందినవాడు కావడంతో నటి కీర్తి సురేష్ కూడా మతం మారడానికి సిద్ధమవుతున్నట్లు ప్రచారం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. అయితే అది నిజం కాదంటూ తమ ప్రేమ, పెళ్లికి మతం సమస్య కాదని ఈ క్రేజీ జంట నిరూపించుకున్నారు. ఆ విధంగా ఇరు కుటుంబాల సమ్మతితో రెండు మతాలను సంప్రదాయాలనూ గౌరవించే విధంగా ఆంటోనీ, కీర్తి సురేష్ వివాహం చేసుకోవడానికి సిద్ధమయ్యారు. వీరి పెళ్లి ఈనెల 12న గోవాలో జరగనుంది. అక్కడ 12వ తేదీ ఉదయం హిందూ మత సంప్రదాయ ప్రకారం, అదేరోజు సాయంత్రం చర్చిలో క్రిస్టియన్ మత సాంప్రదాయ ప్రకారం కీర్తి సురేష్, ఆంటోనీ పెళ్లి రెండు సార్లు జరగనుందని తెలిసింది. వీరి వివాహ వేడుకలో పలువురు సినీ ప్రముఖులు పాల్గొననున్నట్లు సమాచారం. -
‘కల్కి’లో ఆ పాత్ర చేయమని అడిగితే..నచ్చలేదని తిరస్కరించా : కీర్తి సురేశ్
‘‘కల్కి 2898 ఏడీ’ సినిమాలో ఒక పాత్ర చేయమని నన్ను కోరారు నాగ్ అశ్విన్. అయితే ఆ పాత్ర నాకు అంత ఆసక్తిగా అనిపించలేదు.. అందుకే సున్నితంగా తిరస్కరించాను’’ అని హీరోయిన్ కీర్తీ సురేష్ అన్నారు. ఇటీవల గోవాలో జరిగిన ‘ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా’ (ఇఫీ) వేడుకల్లో డైరెక్టర్ నాగ్ అశ్విన్‌తో కలిసి పాల్గొన్నారు కీర్తీ సురేష్. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ– ‘‘కల్కి 2898 ఏడీ’లో నన్ను అడిగిన పాత్రను నేను తిరస్కరించినప్పటికీ నాగ్ అశ్విన్ ఏదో ఒక రకంగా ఆ సినిమాలో నన్ను భాగస్వామ్యం చేస్తాడని నమ్మాను. నేను అనుకున్నట్లుగానే బుజ్జి పాత్రకు (ప్రభాస్ వాడిన కారు పేరు) నాతో డబ్బింగ్ చెప్పించాడు. బుజ్జికి వాయిస్ ఓవర్ చెప్పడం వల్ల ప్రేక్షకులకు ఎలా చేరువ అవుతావు? అని కొందరు నన్ను ప్రశ్నించారు. కానీ, చాలా ప్రత్యేకంగా ఉంటుందని భావించి, నాగి అశ్విన్ అడిగిన వెంటనే ఓకే చెప్పాను. సినిమా విడుదల తర్వాత చాలా మంది.. ‘బుజ్జి కారుకు నీ డబ్బింగ్ ప్లస్ అయింది’ అని నాతో అనడం ఆనందాన్నిచ్చింది’’ అన్నారు. ఇదిలా ఉంటే... నాగ్ అశ్విన్ దర్శకత్వంలో కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘మహానటి’ (2018). సావిత్రి బయోపిక్‌గా రూపొందిన ఈ సినిమాలో సావిత్రిగా తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు కీర్తి. ఈ సినిమాకి జాతీయ ఉత్తమ నటి అవార్డును కీర్తీ సురేష్ సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక కీర్తి వ్యక్తిగత జీవితం గురించి చెప్పాలంటే.... తన స్నేహితుడు ఆంటోనీ తట్టిల్‌ని డిసెంబరులో గోవాలో పెళ్లి చేసుకోబోతున్నారామె. -
హీటెక్కిస్తున్న కీర్తి సురేష్ (ఫోటోలు)
-
15 ఏళ్లుగా ఆంటోనీతో ప్రేమలో కీర్తి..
-
OTT: ‘రఘు తాత’ మూవీ రివ్యూ
ఓటీటీలో ‘ఇది చూడొచ్చు’ అనే ప్రాజెక్ట్స్ చాలా ఉంటాయి. ప్రస్తుతం స్ట్రీమ్ అవుతున్న వాటిలో తమిళ చిత్రం ‘రఘు తాత’ ఒకటి. ఈ చిత్రం గురించి తెలుసుకుందాం.ఈ భూమి పై జీవన ఉనికికి భాష అనేది ఆయువు. ప్రస్తుత ప్రపంచంలో 7000కు పైచిలుకు భాషలు ఉండగా వాటిలో 200 నుండి 300 వరకు అధికారికంగా గుర్తించబడ్డాయి. కానీ ఈ భాషల వల్ల కూడా కొన్ని ప్రాంతాల్లో పోరాటాలు జరిగాయి... జరుగుతున్నాయి కూడా. ఇటువంటి సున్నితమైన అంశాన్ని ప్రధాన ఇతివృత్తంగా తీసుకుని దర్శకుడు సుమన్ కుమార్ ఇటీవల ‘రఘు తాత’ చిత్రాన్ని రూపొందించారు. (చదవండి: సత్యం సుందరం మూవీ రివ్యూ)తీసుకున్న పాయింట్ సీరియస్ అయినా చక్కటి స్క్రీన్‌ప్లేతో ప్రేక్షకులను అలరించారు దర్శకుడు. సినిమాలోని పాత్రధారులందరూ వారి వారి పాత్రలకు ప్రాణం పోశారనే చెప్పాలి. ఈ సినిమాలో నాయకురాలి పాత్రలో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన కీర్తీ సురేష్ నటించారు. తన అద్భుతమైన నటనా ప్రతిభతో ఈ సినిమాలోని ప్రధాన పాత్ర అయిన కయల్విళి పాండియన్ పాత్రకు ప్రాణం పోశారు కీర్తీ సురేష్. మరో ప్రధాన పాత్ర అయిన రఘు తాత పాత్రలో యం.యస్. భాస్కర్ ఇమిడియారు. (చదవండి: ‘దేవర మూవీ రివ్యూ)ఇక కథాంశానికొస్తే... కయల్విళి పాండియన్ మద్రాస్ సెంట్రల్ బ్యాంక్‌లో క్లర్కు ఉద్యోగం చేస్తూ ఉంటుంది. ఉద్యోగం చేసుకుంటూనే కా పాండియన్ అనే కలం పేరుతో రచనలు కూడా చేస్తుంటుంది. అంతేనా హిందీ భాష వద్దు, మన భాష ముద్దు అనే పేరుతో ఉద్యమాలు చేస్తూ సమాజంలో భాషాభివృద్ధికి చేస్తున్న పోరాటంలో కీలక పాత్ర వహిస్తుంది. కయల్విళికి ఓ తాత ఉంటాడు. ఆయనే రఘు తాత. కయల్ చేసే ఉద్యమమంతా రఘు తాత నుండి వచ్చిందే. అంతవరకు కథ బాగున్నా కొన్ని అనివార్య పరిస్థితుల వల్ల తన బ్యాంక్ ప్రమోషన్ కోసం హిందీ పరీక్ష దొంగతనంగా రాయవలసి వస్తుంది. ఓ పక్క హిందీ ఉద్యమం చేస్తూ మరో పక్క హిందీ పరీక్ష రాయడం కయల్విళి పెళ్ళిలో అందరికీ తెలిసిపోతుంది. అసలు కయల్ హిందీ పరీక్ష ఎందుకు రాయాల్సి వచ్చింది ? రాసినది అందరికీ తెలిసిన తరువాత తన పెళ్ళిలో ఏం జరిగింది? ఇలాంటివన్నీ జీ5 ఓటీటీ వేదికగా స్ట్రీమ్ అవుతున్న ‘రఘు తాత’లోనే చూడాలి. కొసమెరుపేంటంటే... ఈ సినిమా మాతృక తమిళం, పోరాటం చేసింది హిందీ భాషపై, కానీ మనం మాత్రం మన తెలుగు భాషలో ఈ సినిమా చూడడం. ఎందుకంటే భాష ఏదైనా భావం ముఖ్యం కాబట్టి.– ఇంటూరు హరికృష్ణ -
కీర్తి సురేశ్ ఆశలన్నీ ఆ సినిమాలపైనే
జయాపజయాలు ఎవరి చేతుల్లోనూ ఉండవు. అయితే విజయాలకంటే అపజయాల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది. అందుకే ఎవరైనా తాము నటించే చిత్రాలు సక్సెస్ కావాలనే కోరుకుంటారు. అయితే ఒక్కొక్కసారి లెక్క తప్పుతుంది. తాజాగా నటి కీర్తిసురేశ్ పరిస్థితి కూడా ఇలానే ఉంది. నిజం చెప్పాలంటే ఈమెకు విజయాలేమీ కొత్త కాదు. అయితే కోలీవుడ్‌లోనే వాటి శాతం చాలా తక్కువగా ఉందన్నది గమనార్హం. చాలా కాలం క్రితం విజయ్‌కు జంటగా నటించిన సర్కార్ చిత్రం విజయాన్ని సాధించింది. ఆ తరువాత రజనీకాంత్‌కు చెల్లెలిగా నటించిన ఆన్నాత్తే (పెద్దన్న) చిత్రం నిరాశ పరిచింది. ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటించిన మామన్నన్ చిత్రం సక్సెస్ అయ్యింది. ఆ తరువాత నటించిన సైరన్ చిత్రం అపజయాన్నే మిగిల్చింది. ఇకపోతే ఇటీవల ఈమె నటించిన 'రఘుతాత' చిత్రాన్ని కేజీఎఫ్ చిత్రాన్ని నిర్మించిన హోమ్‌బలే సంస్థ నిర్మించడం, ఉమెన్ సెంట్రిక్ కథా చిత్రం కావడంతో మంచి అంచనాలు నెలకొన్నాయి. అయితే ఈ చిత్రం ఆశించిన విజయాన్ని అందుకోలేకపోయింది. తంగలాన్, డీమాంటీ కాలనీ 2 చిత్రాల మధ్య విడుదలైన రఘుతాత వసూళ్ల పరంగా వెనుకపడిపోయిందన్నది ట్రేడ్ వర్గాల మాట. కాగా ప్రస్తుతం బేబీజాన్ చిత్రంతో బాలీవుడ్‌లోకి ఎంటర్ అయిన కీర్తిసురేశ్ చేతిలో రివాల్వర్ రీటా, కన్నివెడి అనే రెండు తమిళ చిత్రాలు మాత్రమే ఉన్నాయి. ఈ రెండు లేడీ ఓరియన్‌టెడ్ కథా చిత్రాలు కావడం విశేషం. బేబీ జాన్ అనే హిందీ సినిమాలో కూడా ఆమె నటిస్తుంది. ఈ చిత్రాలపైనే కీర్తి సురేశ్ ఆశలు పెట్టుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. -
కీర్తి సురేష్ 'రఘు తాత' సినిమా.. ఓటీటీలో డైరెక్ట్‌గా స్ట్రీమింగ్
మాలీవుడ్ నుంచి కోలీవుడ్‌కి ఆ తర్వాత టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి కథానాయకిగా దుమ్ము రేపుతున్న నటి కీర్తి సురేష్. రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా ఆమె చేస్తుంటారు. ఆమె నటించిన కొత్త సినిమా రఘు తాత ఓటీటీలో డైరెక్ట్‌గా విడుదల కానుందన ప్రచారం జరుగుతుంది. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న తమిళ్ వర్షన్ విడుదల అయింది.రవీంద్ర విజయ్, ఎమ్మెస్ భాస్కర్ ఆనంద్ సామి, దేవదర్శిని తదితరులు ముఖ్య పాత్రలు పోషించిన ఈ చిత్రాన్ని హోంబలే ఫిల్మ్స్ నిర్మించింది. హిందీ భాషకు వ్యతిరేకంగా తెరకెక్కిన ఈ చిత్రం కోలివుడ్ ప్రేక్షకులను మెప్పించింది. కాగా, రఘు తాత మూవీ ఓటీటీ హక్కులను జీ5 సంస్థ సొంతం చేసుకున్నట్లు తెలుస్తోంది. తెలుగు, తమిళం,మలయాళం, కన్నడ స్ట్రీమింగ్ హక్కులను జీ5 మంచి ధరకు కొనుగోలు చేసినట్లు ఇండస్ట్రీ వర్గాలు తెలుపుతున్నాయి. సెప్టెంబర్ మొదటి వారం లేదా సెప్టెంబర్ 14న ఓటీటీలో తెలుగు వర్షన్ డైరెక్ట్‌గా విడుదల అవుతుందని సినీ వర్గాలు తెలుపుతున్నాయి.హిందీ భాషను నేర్చుకోవడం తప్పనిసరి అనే విధానాన్ని వ్యతిరేకించడంతోపాటు మహిళలపై జరుగుతున్న పలు సంఘటనలను ఖండిస్తూ సాగే ఫ్యామిలీ ఎంటర్టైయినర్గా రఘుతాత సినిమా ఉంది. హిందీకి వ్యతిరేకంగా ఈ సినిమాలో కీర్తి పోరాడుతుంది. మొదటి నుంచి హిందీ భాషను వ్యతిరేకిస్తూ వచ్చిన ఆమె ఫైనల్‌గా హిందీ ఎగ్జామ్ రాయాలని ఎందుకు పూనుకుంటుంది అనేది సినిమా. -
సైజ్ జీరోలో సంయుక్త .. గ్లామర్ డోస్ పెంచేసిన జగతి మేడమ్
జిమ్‌లో 108రోజుల వర్కౌట్‌తో సైజ్ జీరోకు చేరుకున్న సంయుక్త మీనన్ స్టైలిష్, క్లాస్‌గా మెరిసిపోతున్న హన్సిక గ్లామర్ డోస్ పెంచేసిన 'గుప్పెడంత మనసు' జగతి మేడమ్ View this post on Instagram A post shared by Samyuktha (@iamsamyuktha_) View this post on Instagram A post shared by Mrunal Thakur (@mrunalthakur) View this post on Instagram A post shared by Hansika Motwani (@ihansika) View this post on Instagram A post shared by Jyothi Poorvaj (Jayashree Rai K K) (@jyothipoorvaaj) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Priya Prakash Varrier✨ (@priya.p.varrier) View this post on Instagram A post shared by Anjali (@yours_anjali) View this post on Instagram A post shared by Srinidhi Shetty 🌸 (@srinidhi_shetty) View this post on Instagram A post shared by Tejaswi Madivada (@tejaswimadivada) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Pranita Subhash (@pranitha.insta) View this post on Instagram A post shared by Avika Gor (@avikagor) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) -
అంతటి నొప్పిని ఎలా తట్టుకుందో.. కంటతడి పెట్టిస్తున్న కీర్తి సురేష్ మాటలు
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్ తన స్నేహితురాలిని గుర్తు చేసుకుని చాలా ఎమోషనల్ అయింది. ఈమేరకు సోషల్ మీడియాలో ఆమె ఒక పోస్ట్ చేసింది. ఇటీవల బ్రెయిన్ ట్యూమర్‌తో మరణించిన తన బెస్ట్ ఫ్రెండ్ మనీషా గురించి కీర్తి పలు విషయాలను పంచుకుంది. తన స్నేహితురాలితో ఉన్న బంధాన్ని సుదీర్ఘ పోస్ట్‌తో తెలిపింది. ఆసుపత్రిలో మనీషాను చూసినప్పుడు ఎలా ఏడ్చిందో గుర్తుచేసుకుంది. అలా తన స్నేహితురాలి గురించి షేర్ చేసిన పోస్టు అందరినీ కంటతడి పెట్టిస్తోంది.కీర్తి సురేష్ ప్రాణ స్నేహితురాలు మనీషా కొద్దిరోజుల క్రితమే బ్రెయిన్ ట్యూమర్‌తో చనిపోయింది. ఇదే విషయాన్ని ఆమె పుట్టినరోజు సందర్భంగా కీర్తి ఇలా గుర్తు చేసుకుంది. ' కొన్ని వారాలుగా నేను చాలా బాధను అనుభవిస్తున్నాను. నా చిన్ననాటి స్నేహితురాలు మనీషా ఇంత త్వరగా మమ్మల్ని విడిచిపెట్టి వెళ్లుతుందని అనుకోలేదు. ఈ సంఘటన నమ్మశక్యంగా లేదు. 21 ఏళ్ల వయసులో తీవ్రమైన బ్రెయిన్ ట్యూమర్‌తో బాధపడుతున్న ఆమె గత నెల వరకు దాదాపు 8 ఏళ్ల పాటు పోరాడింది. గతేడాది నవంబర్‌లో ఆమెకు మూడో సర్జరీ జరిగింది. అంతటి బాధను తట్టుకునే శక్తి ఆమెకు ఎలా వచ్చిందో.. అలాంటి సంకల్ప శక్తి ఉన్నవారిని నేను ఇప్పటి వరకు చూడలేదు. కానీ ఒక్కోసారి నొప్పిని భరించలేకపోతున్నానంటూ ఆ బాధను తట్టుకుంటూనే కన్నీళ్లు పెట్టుకునేది. ఆ సమయంలో ఆసుపత్రి కారిడార్ వద్ద నేను కూడా ఏడ్చేశాను. కన్నీటితో నిండిన ఆ సంఘటన నాకు ఇప్పటికీ గుర్తుంది. ఆమె ఆరోగ్యం క్షీణించడంతో ఈ ప్రపంచాన్ని వదిలేసి పోయింది. ఆమె అపస్మారక స్థితిలో ఉన్నప్పుడు నేను చివరిసారిగా కలిశాను. చిన్నవయసులోనే ప్రాణాలు కోల్పోయిన నా స్నేహితురాలు భవిష్యత్‌పై ఎన్నో కలలు కనేది. బతాకాలనే ఆశతో నా మనీషా చివరి శ్వాస వరకు పోరాడింది. కానీ దేవుడు దయ చూపలేదు. ఆమె దూరమై సరిగ్గా నెలరోజులు అవుతుంది. తన గురించి ఆలోచించకుండా ఒక్కరోజు కూడా గడవడం లేదు. మనీషా లేకుండానే తన పుట్టినరోజు జరుపుకోవాల్సి వస్తుందని కలలో కూడా అనుకోలేదు.' అని తన ప్రాణస్నేహితురాలి మరణం గురించి కీర్తి చెప్పుకొచ్చింది. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
కీర్తీ సురేష్ 'రఘు తాత' వచ్చేశాడు (ట్రైలర్)
రెగ్యులర్ కమర్షియల్ పాత్రలతో పాటు ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. మహానటి, పెంగ్విన్, మిస్ ఇండియా వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించి మెప్పించిన కీర్తి.. తాజాగా మరో ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘు తాత’తో వస్తుంది. తాజాగా ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఆగష్టు 15న ఈ చిత్రం విడుదల కానుంది. -
కీర్తీ సురేష్ సినిమా.. డైరెక్ట్‌గా ఓటీటీలోనే విడుదల
హీరోయిన్ కీర్తీ సురేశ్ మెయిన్ లీడ్ రోల్లో నటిస్తున్న కొత్త సినిమా ‘ఉప్పు కప్పురంబు’ డైరెక్ట్‌గా ఓటీటీలో విడుదల కానుంది. గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ సినిమాలో సుహాస్ మరో లీడ్ రోల్లో కనిపిస్తారు. ఐవీ శశి దర్శకత్వంలో తెరకెక్కుత్ను ఈ చిత్రాన్ని రాధికా లావు నిర్మించారు. వసంత్ మురళీ కృష్ణ మరింగంటి కథ అందిస్తున్నారు.ఓ గ్రామంలోని స్మశానం విస్తరణ నేపథ్యంలో ‘ఉప్పు కప్పురంబు’ సినిమా కథనం ఉంటుందనే ప్రచారం ఫిల్మ్‌నగర్‌లో వినిపిస్తోంది. కాగా ఈ సినిమాలో కీర్తీ సురేశ్, సుహాస్ జంటగా నటిస్తారా? లేదా? అనే విషయంపై స్పష్టత రావాలంటే సినిమా విడుదలయ్యే వరకు వేచి ఉండాల్సిందే. అయితే, ఉప్పు కప్పురంబు మూవీ డైరెక్ట్‌గా ఓటీటీలోనే రిలీజ్ కాబోతోంది. అమెజాన్ ప్రైమ్ కోసమే ఈ మూవీని తెరకెక్కిస్తున్నారు. తెలుగుతో పాటు తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈ చిత్రం రిలీజ్ కానుంది. ఈ ఏడాదిలోనే ఈ సినిమా విడుదల కానుంది. త్వరలోనే మరిన్ని విషయాలు ఉప్పు కప్పురంబు మేకర్స్ వెల్లడించనున్నారు. కీర్తీ సురేశ్ నటించిన రఘుతాత సినిమా ఆగష్టు 15న విడుదల కానుంది. మరోవైపు బేబీ జాన్ సినిమాతో ఆమె బాలీవుడ్లో ఎంట్రీ ఇస్తుంది. -
'రఘు తాత' వాళ్లకు వ్యతిరేకం కాదు: కీర్తి సురేష్
రెగ్యులర్ కమర్షియల్ క్యారెక్టర్స్ మాత్రమే కాకుండా... వీలైనప్పుడల్లా ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో పవర్ఫుల్ క్యారెక్టర్స్ కూడా చేస్తుంటారు హీరోయిన్ కీర్తీ సురేష్. ‘మహానటి’, ‘పెంగ్విన్’, ‘మిస్ ఇండియా’ వంటి ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్స్‌లో నటించి, ప్రేక్షకులను మెప్పించారు కీర్తి. తాజాగా ఆమె నటించిన ఉమెన్ సెంట్రిక్ ఫిల్మ్ ‘రఘు తాత’. కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటించిన ఈ సినిమాకు సుమన్ కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా టీజర్ విడుదలైన సమయం నుంచి పలు వివాదాలు వచ్చాయి. అయితే, తాజాగా కీర్తి వాటికి వివరణ ఇచ్చారు.జాతీయ భాష హిందీ గురించి చాలాకాలంగా చర్చ జరుగుతోంది. ముఖ్యంగా తమిళనాడులో హిందీ భాషపై చాలా వ్యతిరేకత ఉంది. మాతృభాష (తమిళభాష)పై ప్రేమ చూపించే తమిళనాడులో హిందీ భాషను నేర్చుకోవాలి అనే ఒత్తిడిని కేంద్ర ప్రభుత్వం తీసుకురావడమే ఇందుకు కారణం. హిందీలో మాట్లాడితేనే ప్రభుత్వ ఉద్యోగాలు అనే నిబంధన విధించడం కూడా ముఖ్య కారణం. ఇక ఇదే అంశాన్ని 'రఘుతాత' సినిమాలో చూపించబోతున్నట్లు టీజర్ ద్వారా కనిపిస్తోంది.కీర్తి సురేష్ మాట్లాడుతూ.. 'ఇది చాలా సంతోషకరమైన సమయం. దర్శకుడు కథ చెబుతూ చాలా చోట్ల నవ్వించాడు. హోంబలే ప్రొడక్షన్స్ వారు తమిళ చిత్రాలను నిర్మిస్తుండటం చాలా సంతోషంగా ఉంది. ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగా వచ్చాయి. రఘు తాత చిత్రాన్ని హిందీలో కూడా విడుదల చేస్తూ.. హిందీకి వ్యతిరేకంగా సినిమా చేయడమేంటి అంటున్నారు. ఇది హిందీ వ్యతిరేక చిత్రం కాదు. కానీ, హిందీని ఉద్దేశపూర్వకంగా ఒకరిపై విధించడాన్ని, మహిళలపై నేటి సమాజంలో విధించిన ఆంక్షలను వ్యతిరేకించే చిత్రం అని నేను చెప్పగలను. వివాదాస్పదం కాకుండా నవ్వించగలిగే మెయిన్ స్ట్రీమ్ సినిమా అవుతుంది. రఘుతాత విభిన్నమైన కథతో తెరకెక్కించాం. ఒక మహిళ ఎదుర్కొనే సవాళ్ల గురించి ఇందులో చూపించాం. సినిమా చూస్తే ఈ విషయం అందరికీ అర్థమవుతుంది. ఇందులో రాజకీయపరమైన వివాదాలు అంటూ ఏమీ లేవు. పూర్తిగా కామెడీ సినిమా మాత్రమే.. ఇందులో పనిచేసిన నటీనటులు అందరికీ నా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.' అన్నారు. -
'పుష్ప 2'కు పోటీగా దిగుతున్న కీర్తి సురేష్
సౌత్ ఇండియా స్టార్ హీరోయిన్ కీర్తి సురేష్.. కథ నచ్చితే చాలు ఎలాంటి పాత్రలోనైనా ఒదిగిపోతూ తన సహజమైన నటనతో ప్రేక్షకులను మెప్పిస్తుంది. నేను శైలజతో సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టిన కీర్తి.. కెరీర్ ఆరంభమైన కొన్నాళ్లకే 'మహానటి'గా నిరూపించుకుంది. ప్రస్తుతం భాషతో సంబంధం లేకుండా చేతినిండా సినిమాలతో బిజీగా ఉందామె.ఆమె ప్రధాన పాత్రలో నటిస్తున్న చిత్రం ‘రఘు తాత’. సుమన్ కుమార్ ఈ చిత్రాన్ని తెరకెక్కించారు. ప్రముఖ నిర్మాణ సంస్థ హోంబలే ఫిల్మ్స్ నిర్మిస్తున్న తొలి తమిళ చిత్రమిది. అయితే, తాజాగా రఘు తాత నుంచి టీజర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ఈ క్రమంలో ఆగష్టు 15న ఈ సినిమాను విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ప్రకటించింది. అదే రోజున పాన్ ఇండియా చిత్రం అల్లు అర్జున్ నటించిన పుష్ప కూడా విడుదల కానుంది. 'మహానటి' చిత్రానికి గాను కీర్తి సురేష్ నేషనల్ అవార్డు అందుకుంటే.. అల్లు అర్జున్ కూడా పుష్ప చిత్రం ద్వారా నేషనల్ అవార్డు అందుకున్నాడు. స్వాతంత్ర్య దినోత్సవం కానుకగా ఆగష్టు 15న పుష్ప, రఘు తాత రెండు చిత్రాలు విడుదల కానున్నాయి. దీంతో ఇద్దరు నేషనల్ అవార్డ్స్ అందుకున్న స్టార్స్ ఒకేరోజున బాక్సాఫీస్ వద్ద పోటీ పడనున్నారు. వాస్తవానికి కమల్ హాసన్ నటించిన ఇండియన్ 2 కూడా ఆగష్టు 15న విడుదల చేయాలనుకున్నారు. కానీ, పుష్ప 2 వల్ల దానిని విరమించుకున్నారు. అయితే, రఘు తాత చిత్రంతో కీర్తి సురేష్ బన్నీ సినిమాకు పోటీగా రేసులోకి దిగుతుంది. ఈ చిత్రంలో ఆమె NCC క్యాడెట్ శిక్షణలో ఉంటుంది. హిందీలో శిక్షణ ఇస్తుంటే తనకు హిందీ రాదని తమళంలో చెప్పాలని కోరుతుంది. హిందీ భాషను తమపై రుద్దకండి అంటూ ఇప్పటికే తమిళ ప్రజలు పోరాటం చేస్తున్నారు. ఇదే కాన్సెప్ట్‌లో రఘు తాత చిత్రం ఉండనున్నట్లు తెలుస్తోంది. -
లిప్‌లాక్ సీన్ కోసం కీర్తి సురేష్‌కు కండిషన్
ఇండియన్ సినిమా పాశ్చాత్య సంస్కృతికి మారి చాలా కాలమే అయ్యింది. అయితే దక్షిణాదిలో సంప్రదాయ విలువలు కొనసాగుతూ వచ్చాయి. కానీ ఇప్పుడు ఇక్కడా వాటికీ కట్టలు తెంచుకుంటున్నాయి. ముఖ్యంగా లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించడానికి మన కథానాయకలు సంకోచించే వారు. అయితే ఇప్పుడు అలాంటి సన్నివేశాలు పుంకాను పుంకాలుగా చూస్తున్నాం. అదేమంటే అలా నటించడంలో తప్పేంటి అనే ప్రశ్న ఎదురవుతోంది. కాగా నటి కీర్తి సురేష్ విషయానికి వస్తే ఈమె తమిళంలో గానీ, తెలుగులో గానీ పరిమితులు దాటని పాత్రల్లో నటిస్తూ పక్కింటి అమ్మాయి ఇమేజ్ను తెచ్చుకున్నారు. ఇక మహానటి చిత్రంలో అయితే సంసృతి, సంప్రదాయాలకు అద్దం పట్టేలా నటించి ప్రశంసలు అందుకున్నారు.ఆ తరువాత గ్లామర్ పాత్రల్లో నటించినా హద్దులు దాటలేదు. అలాంటిది ఎప్పుడైతే బాలీవుడ్‌కు ఎంట్రీ ఇచ్చారో అప్పుడే పాశ్చాత్య సంసృతికి మారిపోయారని సమాచారం. ప్రస్తుతం ఈమె బేబీజాన్ అనే చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. వరుణ్ దావన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రాన్ని తమిళ దర్శకుడు అట్లీ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశంలో నటించాలని ముందుగానే కండిషన్ పెట్టారట. బాలీవుడ్లో రాణించాలంటే అలాంటి సన్నివేశాల్లో నటించడం తప్పదని భావించిన కీర్తి సురేష్ బేబీజాన్ చిత్ర దర్శక నిర్మాతలకు ఓకే చెప్పారట. అలా ఆమె ఆ చిత్రంలో లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించారని తాజా సమాచారం. ఆ సన్నివేశాలు ఎంత కిక్ ఇస్తాయో చిత్రం విడుదలైన తరువాత తెలుస్తుంది. కాగా మరో విషయం ఏమిటంటే ఈమె ఇంతకు ముందు కోట్ల రూపాయలు ఇచ్చినా లిప్‌లాక్ సన్నివేశాల్లో నటించను అని ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఆ విషయాన్ని ఇప్పుడు నెటిజన్లు ట్రోలింగ్ చేస్తున్నారు. ఇకపోతే ఇటీవల కీర్తి సురేష్ తరచూ వార్తల్లో ఉంటున్నారు. తాజాగా తను తలకిందులుగా వర్కౌట్స్ చేస్తున్న ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. -
తనకు ఇష్టమైన 'బుజ్జి'ని పరిచయం చేసిన ప్రభాస్.. ఆసక్తిగా వీడియో
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్- నాగ్ అశ్విన్ కాంబినేషన్లో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ థ్రిల్లర్ 'కల్కి 2898 ఏడీ'. భారీ అంచనాల మధ్య తెరకెక్కుతున్న ఈ సినిమా గత కొన్ని రోజులుగా ట్రెండింగ్‌లో కొనసాగుతూనే ఉంది. కొన్ని గంటల క్రితం ప్రభాస్ చేసిన ఒక పోస్ట్‌తో కల్కి సినిమా పేరు భారీగా ట్రెండ్ అయింది. 'ఎట్టకేలకు మన జీవితంలోకి ఓ ప్రత్యేక వ్యక్తి రాబోతున్నారు. వెయిట్ చేయండి.' అంటూ అయిన షేర్ చేసిన పోస్ట్‌పై అందరూ ఎంతగానో ఆసక్తి కనపరిచారు. కొంత సమయం తర్వాత 'నా బుజ్జిని మీకు పరిచయం చేసేందుకు ఆసక్తిగా ఎదురుచూస్తున్నా.' అంటూ మరో పోస్ట్ చేశారు. దీంతో అసలు బుజ్జి ఎవరు..? ఎలా ఉంటుంది..? అని అభిమానుల్లో ఆసక్తి పెరిగింది.తాజాగా బుజ్జికి సంబంధించిన ఒక గ్లింప్స్‌ను మేకర్స్ విడుదల చేశారు. చాలా ఆసక్తిగా కొనసాగిన ఈ విడియోలో ఒక చిన్న రోబోను బుజ్జి అని అందరూ పిలుస్తూ ఉంటారు. బుజ్జికి వాయిస్‌ను కీర్తి సురేష్ ఇచ్చింది. 'నా లైఫ్ ఎంటి..? బాడీ లేకుండా బతికేయాల్సిందేనా' అంటూ బుజ్జి చెబుతుండగా ఇంతలో ప్రభాస్ ఎంట్రీ ఇచ్చి 'నీ టైమ్ మొదలైంది బుజ్జి' అంటూ ఒక వాహనాన్ని రివీల్ చేయబోయాడు. కానీ ఇంతలోనే ట్విస్ట్ ఇస్తూ బుజ్జి గురించి పూర్తిగా తెలుసుకోవాలంటూ జూన్ 22 వరకు వేచి ఉండాల్సిందేనని తెలిపారు. జూన్ 27న ప్రపంచవ్యాప్తంగా 'కల్కి' విడుదల కానుంది. -
బాలీవుడ్ లో కి 'మహానటి' కీర్తి సురేష్
-
కీర్తి సురేష్ పెళ్లి ఫోటో వైరల్.. అల్లుడూ అంటూ వరుడికి కాల్ చేసిన మేనక
సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్గా కీర్తి సురేష్‌కు ఎనలేని గుర్తింపు ఉంది. ఎక్కువగా సినిమా సెట్స్‌లో మాత్రమే కనిపించే ఈ బ్యూటీ గురించి తెగ రూమర్స్ వస్తూ ఉంటాయి. ఫంక్షన్స్,పార్టీలు అంటూ అందరు హీరోయిన్లు కనిపిస్తూనే ఉంటారు కానీ కీర్తి సురేష్ మాత్రం పెద్దగా ఎక్కడా కనిపించదు కూడా.. ఎందుకో కానీ ఆమె వ్యక్తిగత జీవితంపై విపరీతమైన రూమర్స్ వస్తూనే ఉన్నాయి. గతంలో సంగీత దర్శకుడు అనిరుధ్‌తో ప్రేమలో ఉందని త్వరలో పెళ్లి అంటూ వార్తలు వచ్చాయి. వాటిని ఆమె తండ్రి ఖండించడంతో అవి ఆగిపోయాయి. ఆ తర్వాత పలాన పారిశ్రామికవేత్తతో నిశ్చితార్థం, ఆ రాజకీయవేత్తతో వివాహం, ఆ నటుడితో పెళ్లి వంటి పుకార్లు తారాస్థాయికి చేరుకున్నాయి. ఇప్పుడు మళ్లీ ఆమె పెళ్లి గురించి ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కొన్నాళ్ల క్రితం కీర్తి సురేష్ తమిళ కమెడియన్ సతీష్‌ని పెళ్లి చేసుకున్నట్లు కోలీవుడ్‌లో ప్రచారం జరిగింది. ప్రస్తుతం వితికారన్ చిత్రాన్ని ప్రమోట్ చేస్తున్న నటుడు సతీష్, దాని గురించి ఇలా చెప్పాడు. 'దళపతి విజయ్ నటించిన భైరవ చిత్రంలో కీర్తి సురేష్‌తో నటించాను. ఈ చిత్రం షూటింగ్ సమయంలో పూజా కార్యక్రమం జరుగుతున్నప్పుడు అక్కడ ఉన్న వారందరి మెడలో పూల మాలలు వేసుకున్నాం. ఈ క్రమంలో మేమిద్దరమూ కూడా పూలమాలలు ధరించాం. ఫోటోలో మా ఇద్దరినీ మాత్రమే హైలెట్ చేసి కొందరు వైరల్ చేశారు. దీంతో తాము రహస్యంగా వివాహం చేసుకున్నామంటూ చాలా పుకార్లు వచ్చాయి. చాలా బాధ అనిపించింది. ఆ సమయంలో కీర్తి సురేష్ అమ్మగారు మేనక నాకు ఫోన్ చేసి కంగ్రాట్యులేషన్స్ అల్లుడు అన్నారు. అప్పుడు నేను షాక్ అయ్యాను. ఆ రూమర్‌ను వారు పెద్దగా పట్టించుకోలేదని అప్పుడు అర్థం అయింది. 2019లో నేను సింధుని వివాహం చేసుకున్న తర్వాత మాత్రమే ఆ పుకారు ముగిసింది. అని ఆయన చెప్పాడు. కోలీవుడ్‌లో ప్రముఖ కమెడియన్‌గా ఉన్న సతీష్ ఇప్పటి వరకు సుమారు 70 కి పైగా చిత్రాల్లో నటించారు. ప్రస్తుతం వితికారన్ చిత్రం ద్వారా ఆయన హీరోగా ఎంట్రీ ఇస్తున్నాడు. ఈ సినిమాకు సంబంధించిన పలు ఇంటర్వ్యూలలో ఆయన పాల్గొంటున్నాడు. శివకార్తికేయన్- కీర్తి సురేష్ నటించిన రెమో సినిమాలో కూడా వారిద్దరూ కలిసి నటించారు. -
కథలకు ప్రాణం పోసిన టాప్ హీరోయిన్స్.. ఓటీటీలో ఈ చిత్రాలు ఎవర్గ్రీన్
సౌత్ సినిమా పరిశ్రమలో హీరోలుకు ఏ మాత్రం తగ్గకుండా ఇప్పుడు హీరోయిన్లు సైతం సోలోగా కథలను నడిపించేస్తున్నారు. సింగిల్‌గానే వచ్చి బాక్సాఫీస్ వద్ద కోట్లు కొల్లగొడుతున్నారు. తమ స్టార్డమ్తో సినీప్రియుల్ని థియేటర్లకు రప్పించి.. వారి సత్తా ఎంటో బాక్సాఫీస్ ముందు చూపిస్తున్నారు. అందుకే ఇటీవల కాలంలో హీరోయిన్ ప్రాధాన్యం ఉన్న చిత్రాల జోరు కొనసాగుతుంది. అయితే ఇదీ నిన్నమొన్న మొదలైన ప్రస్థానం కాదు. సుమారు కొన్నేళ్ల క్రితమే ఈ ట్రెండ్ మొదలైంది. సమంత, అనుష్క, నయనతార, కీర్తి సురేష్ వంటి స్టార్లు ముందు వరుసలో ఉన్నారు. అనుష్క సినీ కెరియర్లో అరుంధితి సినిమా చాలా ప్రత్యేకం అని చెప్పవచ్చు. ఈ సినిమాకు ముందు ఆమె సుమారు 15 చిత్రాల్లో నటించింది. అప్పటి వరకూ గ్లామర్ పాత్రలే పోషించిన అనుష్కను లేడీ సూపర్ స్టార్ చేసింది కూడా 'అరుంధతి' సినిమానే. దివంగత దర్శకుడు కోడి రామకృష్ణ దర్శకత్వం వహించిన ఈ చిత్రం అనుష్క కెరీర్లో మైలు రాయిగా నిలిచింది. 2009 జనవరి 16న ప్రేక్షకుల ముందుకు వచ్చిన అరుంధతి వచ్చి ఇప్పటికి 15ఏళ్లు కావస్తోంది. ఈ సినిమాతో సౌత్ ఇండియాలో మోస్ట్ పాపులర్ హీరోయిన్గా అనుష్క చేరిపోయింది. అలా అరుంధతి చిత్రం సినీ ప్రేమికుల మస్ట్ వాచబుల్ లిస్ట్‌లో చేరిపోయింది. డిస్నీప్లస్ హాట్ స్టార్‌లో అరుంధతి స్ట్రీమింగ్ అవుతుంది. కిర్తీ సురేష్.. ప్రస్తుతం సౌత్ ఇండియాలో టాప్ హీరోయిన్ల లిస్ట్‌లో సత్తా చాటుతుంది. ఓ వైపు కమర్షియల్ చిత్రాలతో అలరిస్తూనే మరోవైపు కాన్సెప్ట్ ఓరియెంటెడ్ సినిమాలతో ప్రేక్షకులను కట్టి పడేయగలదు. ఈతరం 'మహానటి'గా కీర్తి సురేష్ గుర్తింపు పొందింది. అలనాటి తార సావిత్రిని వెండితెరపై మరోనటి ఆవిష్కరించడం సాధ్యమయ్యే పనేనా..? అని అందరూ అనుకుంటున్న సమయంలో ఆ పాత్రకు జీవం పోసి ప్రశంసలు పొందింది. 2018లో మహానటి చిత్రంతో ఆమె కెరియర్ ఒక్కసారిగా మారిపోయింది. అంతర్జాతీయంగా విజయం అందుకున్న ఈ చిత్రాన్ని నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేశాడు. ఈ సినిమా కిర్తీ సురేష్‌కు జాతీయ అవార్డును కూడా తెచ్చిపెట్టింది. ఈ సినిమా సౌత్ ఇండియా సినీ ప్రేక్షకుల మదిలో చెరగని ముద్రగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి సందేహం లేదు. అమెజాన్ ప్రైమ్‌లో మహానటి చిత్రాన్ని చూడవచ్చు. మోస్ట్ బ్యూటిఫుల్ హీరోయిన్గా ఇండస్ట్రీలో సమంత ఒక ట్రెండ్‌ను సెట్ చేసింది. ఆమె ఎన్నో సినిమాల్లో హీరోయిన్గా నటించి సూపర్ హిట్స్‌ను అందుకుంది. కానీ లేడీ ఓరియేంటేడ్ చిత్రం అయిన 'యశోద' చిత్రం ఒక అద్భుతమైన ప్రయోగం అని చెప్పవచ్చు. ఈ సినిమాలో ఎన్నో ట్విస్ట్‌లు ఉంటాయి. అన్నీ కూడా అంతే అద్భుతంగా ఉంటాయి. తన చెల్లిని కనిపెట్టడం కోసం హీరోయిన్ కృత్రిమ గర్భాన్ని ధరించి వెళ్లడం అనే సాహసవంతమైన పాయింట్‌తో దీనిని తెరకెక్కించారు.ఇందులో సమంత నటనకు 100 మార్కులకు మించి వేయవచ్చు. అంతలా తన రోల్లో ఆమె మెప్పిస్తుంది. హరి-హరీష్ సంయుక్తంగా తెరకెక్కించిన ఈ పాన్ ఇండియా యాక్షన్ థ్రిల్లర్.. దాదాపు రూ.50కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి వెండితెరపై సంచలనం సృష్టించింది. ఈ చిత్రం కోసం సమంత తొలిసారిగా గర్భవతిగా కనిపించడమే కాక.. డూప్ లేకుండా ఫైట్స్ సీన్స్ చేసింది. ఈ చిత్రం అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సినిమాలో అసలైన లేడీ సూపర్ స్టార్ అంటే నయనతారనే అని చెప్పవచ్చు. సినిమా కెరియర్ నుంచే ఆమె పాత్రకు ప్రాముఖ్యత ఉంటేనే గ్రీన్ సిగ్నల్ ఇస్తుంది.. అలా కాకుండా నాలుగు పాటలు, రెండు రొమాన్స్ సీన్స్‌కు మాత్రమే పరిమితం చేస్తే వెంటనే నో చెబుతుంది. సీనియర్ నటి విజయశాంతి తర్వాత ఎక్కువగా లేడీ ఓరియేంటెడ్ చిత్రాల్లో నటించింది కూడా నయనతారనే అని చెప్పవచ్చు. ఆమె సినిమాలో మాత్రమే నటిస్తుంది నో ప్రమోషన్స్, నో ప్రెస్మీట్స్, నో స్పెషల్ ఇంటర్వ్యూస్… సినిమా చేశామా, చేతులు దులిపేసుకున్నామా అంతే అనేలా ఉంటుంది. ఒక్కో సినిమాకు రూ.10కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటూ టాప్‌లో ఉంది. నయనతార ప్రధాన పాత్రలో గోపి నైనర్ దర్శకత్వంలో తమిళంలో రూపొందిన చిత్రం 'ఆరమ్'. ఈ చిత్రం 'కర్తవ్యం' పేరుతో తెలుగులోకి అనువాదమైంది. ఈ సినిమాలో కలెక్టర్‌గా నయన్ మెప్పిస్తుంది. బోరుబావిలో పడిపోయిన ఒక చిన్నారిని కాపాడే క్రమంలో ఒక కలెక్టర్‌గా ఆమె వ్యవహరించిన తీరు ప్రేక్షకులను కట్టిపడేస్తుంది. ఈ సినిమా అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. సుమారు ముప్పయ్యేళ్ల క్రితమే పాన్ ఇండియా హీరోయిన్గా మధుబాల సత్తా చాటింది. మణిరత్నం దృశ్యకావ్యం అయిన 'రోజా'లో ఆమె నటన యావద్దేశాన్నీ కట్టిపడేసింది. మనసును దోచుకునే చిరునవ్వుతో అందానికి చిరునామా అనిపించుకున్న మధుబాల... కొన్నేళ్లకే వెండితెరకు దూరమైంది. 'రోజా' విడుదలయ్యాక దేశవ్యాప్తంగా ఆమె పేరు మార్మోగింది. ఎక్కడికెళ్లినా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకూ రోజా అంటూ ఆప్యాయంగా పలకరించేవారు. ఇప్పటికీ ఆమెను రోజా మధుబాల అనే పిలుస్తుంటారు. 30 ఏళ్లు అయినా ఆ సినిమాకు ఉన్న క్రేజ్ అలాంటింది. సినిమా అవకాశాలు వస్తున్నా పెళ్లి తర్వాత సినిమా కెరియర్‌కు ఫుల్స్టాప్ పెట్టేసింది. సెకండ్ ఇన్నింగ్స్‌తో మళ్లీ తెరమీదకొచ్చిన ఆమె ‘శాకుంతలం’లో మేనకగా కనిపించింది. రోజా సినిమా అమెజాన్ ప్రైమ్,జీ5లో స్ట్రీమింగ్ అవుతుంది. -
Keerthy Suresh Latest Photos: ఫ్రెండ్ పెళ్లిలో హంగామా చేసిన కీర్తి సురేశ్ (ఫోటోలు)
-
Keerthy Suresh Photos : కీర్తి సురేష్ కవ్వింపులు.. వైరల్ అవుతోన్న లేటెస్ట్ (ఫోటోలు)
-
కలర్ ఫోటో సుహాస్ ని విలన్ ని చేసిన కీర్తి సురేష్
-
మామన్నన్ ఆడియో లాంఛ్‌లో కీర్తి సురేశ్ (ఫొటోలు)
-
లేడీ ఓరియంటెడ్ సినిమాలపై హీరోయిన్ల స్పెషల్ ఫోకస్!
సాధారణంగా నాయకులు కథలను నడిపిస్తారు.. ఆ కథల్లో నాయికలు ఆటాపాటలకు పరిమితం అవుతారు. కొన్నిసార్లు నాయికలే కథలను నడిపిస్తారు. ఆ కథల్లో ఆటాపాటలు కాదు.. ఫైట్లు ఎక్కువ ఉంటాయి. నాయికలు పవర్‌ఫుల్‌గా కనిపిస్తారు. ఇప్పుడు కొందరు కథానాయికలు లీడ్ రోల్స్‌లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రాల గురించి తెలుసుకుందాం. లేడీ సూపర్ స్టార్ @ 75 స్టార్ హీరోల సరసన రెగ్యులర్ కమర్షియల్ చిత్రాల్లో నటిస్తూ మరోవైపు హీరోయిన్ ఓరియంటెడ్ మూవీస్‌తో లేడీ సూపర్‌స్టార్‌గా పేరు తెచ్చుకున్నారు నయనతార. ఎక్కువగా లేడీ ఓరియంటెడ్ సినిమాలపైనే దృష్టి సారిస్తుంటారామె. అందులో భాగంగా ప్రస్తుతం నూతన దర్శకుడు నీలేష్ కృష్ణతో ఓ మూవీ చేస్తున్నారామె.నయనతార కెరీర్లో ఇది 75వ చిత్రం. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా సాగే ఈ సినిమా ప్రేక్షకులకు ఓ సందేశం కూడా ఇవ్వనుంది. ఇప్పటివరకూ నయనతార నటించిన చిత్రాల్లోకెల్లా భారీ బడ్జెట్‌తో ఈ మూవీ రూపొందుతోంది. నాలుగు లీడ్ రోల్స్‌లో... తెలుగు, తమిళ భాషల్లో అరడజనుకుపైగా సినిమాలతో బిజీ బిజీగా ఉన్నారు హన్సిక. వాటిల్లో నాలుగు చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారీ బ్యూటీ. తెలుగులో ఆమె నటించిన ‘105 మినిట్స్’ (రాజు దుస్సా దర్శకుడు), ‘మై నేమ్ ఈజ్ శృతి’ (శ్రీనివాస్ ఓంకార్ డైరెక్టర్) సినిమాలు విడుదలకు సిద్ధమవుతున్నాయి. అటు తమిళంలో జేఎం రాజా శరవణన్ దర్శకత్వంలో ‘రౌడీ బేబీ’, ఇగోర్ డైరెక్షన్లో ‘మాన్’ అనే సినిమాలు చేస్తున్నారు హన్సిక. నేనేనా.. హీరోయిన్ రెజీనా పురావస్తు శాస్త్రవేత్తగా లీడ్ రోల్లో నటించిన చిత్రం ‘నేనేనా’. కార్తీక్ రాజు దర్శకత్వంలో రాజశేఖర్ వర్మ నిర్మించిన ఈ చిత్రం తెలుగు, తమిళ (తమిళంలో ‘సూర్పనగై’) భాషల్లో విడుదల కానుంది. ఈ మిస్టరీ థ్రిల్లర్‌లో రెజీనా ఒక హత్య కేసు విచారణ చేస్తుండగా అది దాదాపు వందేళ్ల క్రితం జరిగిన ఘటన అని తెలుస్తుంది. 1920, ప్రస్తుతం.. ఇలా రెండు కాలాల్లో సాగే ఈ సినిమా రిలీజ్‌కి రెడీ అవుతోంది. రెండు చిత్రాల్లో.. ఓ వైపు కమర్షియల్ సినిమాల్లో నటిస్తున్న కీర్తీ సురేశ్ మరోవైపు ఫీమేల్ సెంట్రిక్ ఫిలిమ్స్‌కి గ్రీన్‌సిగ్నల్ ఇస్తున్నారు. ప్రస్తుతం ఆమె తమిళంలో ‘రఘు తాత’, ‘రివాల్వర్ రీటా’ అనే చిత్రాల్లో లీడ్ రోల్స్ చేస్తున్నారు. సుమన్ కుమార్ దర్శకత్వం వహిస్తున్న ‘రఘు తాత’ చిత్రంతో హోంబలే ఫిలింస్ (కేజీఎఫ్, కేజీఎఫ్ 2, కాంతార) తమిళంలో అడుగుపెడుతోంది. ఈ చిత్రంలో విప్లవ భావాలున్న అమ్మాయి పాత్రలో కీర్తి నటిస్తున్నారు. అదే విధంగా కీర్తి లీడ్ రోల్ చేస్తున్న మరో చిత్రం ‘రివాల్వర్ రీటా’. కె. చంద్రు దర్శకత్వంలో కామెడీ యాక్షన్ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రం తెలుగులోనూ విడుదలయ్యే చాన్స్ ఉంది. రెయిన్బోలో కొత్తగా... దక్షిణాదిలోని స్టార్ హీరోయిన్లలో ఒకరిగా దూసుకెళుతున్న రష్మికా మందన్న తొలిసారి ‘రెయిన్బో’ అనే లేడీ ఓరియంటెండ్ సినిమా చేస్తున్నారు. ఈ చిత్రం ద్వారా శాంతరూబన్ దర్శకునిగా పరిచయమవుతున్నారు. రొమాంటిక్ ఫ్యాంటసీ నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమాలో రష్మికకు జోడీగా దేవ్ మోహన్ నటిస్తున్నారు. ఇందులో రష్మిక వినూత్న పాత్రలో కనిపిస్తారు. -
‘దసరా’ పాటకు అల్లుడితో కలిసి కీర్తి సురేశ్ తల్లి అదిరిపోయే స్టెప్పులు
‘చమ్కీల అంగీలేసి ఓ వదినే..’ ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా ఇదే పాట వినిపిస్తోంది. నాని, కీర్తి సురేశ్ నటించిన ‘దసరా’లోని ఈ పాటకు చిన్నా పెద్ద అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరు ఈ పాటకు స్టెప్పులేస్తూ.. వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తున్నారు. తాజాగా కీర్తి సురేశ్ తల్లి, అలనాటి నటి మేనక సైతం ఈ పాటకు కాలు కదిపింది. కూమార్తె మాదిరే అదిరిపోయేలా స్టెప్పులేశారు. View this post on Instagram A post shared by Menaka Suresh (@menaka.suresh) అలాగే కీర్తి సురేశ్ సోదరి భర్త సైతం ‘చమ్కీల అంగిలేసి’ తమిళ వెర్షన్‌కు మేనకతో కలిసి స్టెప్పులేశాడు. ప్రస్తుతం ఈ వీడియోలు నెట్టింట వైరల్‌గా మారాయి. ఇక దసరా విషయానికొస్తే.. నాని హీరోగా నటించిన తొలి పాన్ ఇండియా చిత్రమిది.శ్రీకాంత్ ఒదెల దర్శకత్వంలో సుధాకర్ చెరుకూరి నిర్మించిన ఈ చిత్రం మార్చి 30న విడుదల కాబోతుంది. View this post on Instagram A post shared by Nithinnair \nn/ (@dilsewithnithin) -
బాలీవుడ్లో ఆ హీరోతో నటించాలని ఉంది: మనసులో మాట చెప్పేసిన కీర్తి
‘మహానటి’ కీర్తి సురేశ్ బాలీవుడ్ తన అదృష్టాన్ని పరిక్షించుకునేందుకు సిద్ధమైంది. తెలుగుతో పాటు దక్షిణాన అగ్ర నటిగా పేరు తెచ్చుకున్న కీర్తి ఇప్పుడు బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అంటోంది. ఆమె నటించిన లేటెస్ట్ పాన్ ఇండియా మూవీ దసరా మార్చి 30న విడుదలకు సిద్దంగా ఉంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్‌లో భాగంగా ఇటీవల ముంబై వెళ్లిన కీర్తి అక్కడి మీడియాతో మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హిందీ సినిమాలో నటిస్తారా? అని అడగ్గా.. తప్పకుండ చేస్తానంది. చదవండి: పొలిటీషియన్తో పరిణీతి పెళ్లి? క్లారిటీ ఇచ్చిన ఆప్ నేత.. వీడియో వైరల్ బాలీవుడ్ మీ అభిమాన హీరో ఎవరని ప్రశ్నించగా.. షారుక్ ఖాన్‌కు తను పెద్ద ఫ్యాన్‌ని అని సమాధానం ఇచ్చింది. అనంతరం ఆయనతో కలిసి నటించే అవకాశం వస్తే ఎప్పటికీ వదులుకోనని, షారుక్‌తో నటించేందుకు ఆసక్తిగా ఉన్నానంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది. కాగా ‘మహానటి’తో కీర్తి నేషనల్ అవార్డును అందుకుంది. అంతేకాదు ఈ సినిమాతో బ్లాక్‌బస్టర్ హిట్ అందుకున్న ఆమె అదే జోరును కొనసాగించలేకపోయింది. ఈ మూవీ తర్వాత ఆమె చేసిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద బొల్తా కొట్టాయి. ఈ నేపథ్యంలో చాలా గ్యాప్ తర్వాత సర్కారు వారి పాటతో సక్సెస్ అందుకుంది. ఇప్పుడు దసరా మూవీ విజయంపై ఆశలు పెట్టుకుంది. చదవండి: ఇటీవల భార్యకు ఆ హీరో విడాకులు.. ఇప్పుడు మీనాతో రెండో పెళ్లి! నటుడు సంచలన వ్యాఖ్యలు -
ముంబైలో కీర్తి.. ఎత్తిన బాటిల్ దించకుండ తాగి షాకిచ్చిన ‘మహానటి’
‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రస్తుతం దసరా మూవీ ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. శ్రీకాంత్ ఒదేల దర్శకత్వంలో నాని హీరోగా పాన్ ఇండియా మూవీ తెరకెక్కిన దసరా మార్చి 30న ఘనంగా విడుదల కాబోతోంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచిన చిత్ర బృందం దేశంలోని పలు నగరాలను పర్యటిస్తోంది. ఈ క్రమంలో ముంబైలో నిర్వహించిన ప్రమోషన్స్‌లో నాని, కీర్తి సురేశ్, ఇతర మూవీ టీం సభ్యులతో పాటు స్పెషల్ గెస్ట్‌గా రానా దగ్గుబాటి హాజరయ్యాడు. చదవండి: అప్పుడు సో కాల్డ్ అంటూ కామెంట్స్.. ఇప్పుడు ఏకంగా మాజీ ప్రియుడుకి క్రెడిట్.. ఇదిలా ఉంటే ఈ ముంబైలోని ప్రమోషన్స్ ఈవెంట్స్ హీరోయిన్ కీర్తి కల్లు తాగిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చేతితో పట్టుకోకుండా ఎత్తిన బాటిల్‌ను దించకుండ తాగి అక్కడి వారందరికి షాకిచ్చింది. కీర్తిని అలా చూసి హీరో రానా-నాని అవాక్కయ్యారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది. కాగా తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కిన ఈ మూవీలో నాని ఊరమాస్ లుక్‌లో కనిపంచనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో పలు సీన్లలో నిజంగానే తాగి నటించినట్లు నాని వెల్లడించాడు. ఏకంగా ఓ సీన్లలో అయితే ఫుల్ బాటిల్ ఎత్తి దించకుండ తాగానని ఓ ఇంటర్య్వూలో పేర్కొన్నాడు. చదవండి: జూనియర్‌తో శ్రీదేవి కూతురు జాన్వీ.. ముఖ్య అతిథిగా జక్కన్న.. ఫొటో వైరల్ ఈ క్రమంలో ముంబై ప్రమోషన్స్‌లో భాగంగా హీరోలు నాని, రానాలతో పాటు కీర్తికి కూడా కళ్లు తాగే టాస్క్ ఇచ్చారు హోస్ట్. ఇందులో భాగంగా కీర్తి గుటుక్కున కళ్లు బాటిల్ ఎత్తేసింది. కాగా ‘మహానటి’లో సంప్రదాయంగా కనిపించిన కీర్తి ఈ మధ్య సోషల్ మీడియాలో రెచ్చిపోయి ఫుల్ గ్లామర్ షో చేస్తోంది. ఫొటో షూట్స్‌లో అందాల ప్రదర్శన చేస్తూ తరచూ ఆ ఫొటోలను తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేస్తోంది. కీర్తి ఇలా చూసి ఫ్యాన్స్ అంతా సర్ప్రైజ్ అవుతున్నారు. కీర్తికి ఏమైంది.. ఇలా రెచ్చిపోతుందంటూ తన పోస్ట్స్‌పై నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. #DhoomDhaam storm in Mumbai as the crazy trio @NameisNani, @KeerthyOfficial & @RanaDaggubati recreate the hookstep of the Mass Song ❤️💃🏾#DhoomDhaam video song out today at 5:04 PM 🔥#Dasara #DasaraOnMarch30th@odela_srikanth @Music_Santhosh @Saregamasouth pic.twitter.com/1E7Q1qGJhm — SLV Cinemas (@SLVCinemasOffl) March 22, 2023 -
ఆ సీన్స్‌లో నిజంగానే మందు కొట్టి నటించారట, నిజమెంత? నాని క్లారిటీ
నేచరల్ స్టార్‌గా హీరో నాని ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నాడు. ప్రస్తుతం నాని నటించిన దసరా మూవీ మార్చి 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కాబోతోంది. పాన్ ఇండియాగా రాబోతున్న ఈ మూవీ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక మూవీ విడుదల దగ్గర పడుతుండటంతో హీరో నాని, చిత్ర బృందం ప్రమోషన్స్ స్టార్ట్ చేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ చానల్‌తో ముచ్చటించిన నాని దసరా మూవీ గురించి పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నాడు. చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటుడు హఠాన్మరణం ఈ సందర్భంగా దసరా కొన్ని సీన్స్ మందు కొట్టి చేశారని టాక్ వినిపిస్తోంది, నిజమెంత అని యాంకర్ నాని ప్రశ్నించారు. దీనికి నాని స్పందిస్తూ.. కథ, పాత్ర డిమాండ్ చేస్తే నటుడు ఎలాంటి రిస్క్ అయినా తీసుకోవాల్సి ఉంటుందన్నాడు. ‘ఇందులో కొన్ని మందు కొట్టి నటించాలని డైరెక్టర్ చెప్పాడు. నీకేమైనా అభ్యంతరం ఉందా? అని అడిగాడు శ్రీకాంత్. నాకేం అభ్యంతరం లేదు అని చెప్పాను. అందుకే అవసరం ఉన్న సీన్స్ లో నిజంగానే మందు కొట్టి నటించాను” అంటూ షాకింగ్ విషయాలు వెల్లడించాడు. చదవండి: మోహన్ బాబు బర్త్‌డేలో కొత్త కోడలు మౌనిక సందడి! విష్ణు ఫ్యామిలీ ఎక్కడా? ఆ సీన్స్‌లో కళ్లు ఎర్రగా ఉండాలి.. మందు కొట్టే మ్యానరిజం ఉండాలన్నాడు. అందుకే పాత్ర డిమాండ్ మేరకు నిజంగా మందు తాగాల్సి వచ్చిందని నాని వివరణ ఇచ్చాడు. ఇక దసరా మూవీలో డైరెక్టర్ శ్రీకాంత్ నన్ను కావాల్సినంత గట్టిగా వాడుకున్నాడంటూ నవ్వులు చిందించాడు. కాగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో నాని జోడిగా కీర్తి సురేశ నటించింది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. -
‘దసరా’ టీంకు కీర్తి ఖరీదైన కానుకలు! ఏకంగా 130 మందికి...
‘మహానటి’ మూవీతో ఉత్తమ నటిగా నేషనల్ అవార్డు అందుకుంది కీర్తి సురేశ్. ఈ సినిమాలో అచ్చం సావిత్రిని అభినయస్తూ మంచి మార్కులు కొట్టేసింది. దీంతో కీర్తి ఓవర్ నైట్ స్టార్ అయిపోయింది. అయితే అదే క్రేజ్‌ను ఆమె కొనసాగించలేకపోయింది. కథలను ఎంపికలతో తడపబడుతూ స్టార్ ఇమేజ్ను డ్యామేజ్ చేసుకుంది. మహానటి తర్వాత ఎన్నో చిత్రాల్లో నటించనప్పటికీ ఆమెకు పెద్దగా గుర్తింపు రాలేదు. చదవండి: గుర్తు పట్టలేనంతగా మారిపోయిన ‘మాతృదేవోభవ’ హీరోయిన్.. ఫొటోలు వైరల్ ఇటీవల మహేశ్ బాబు సర్కారు వారి పాటతో మంచి హిట్టు కొట్టిన కీర్తి దసరా మూవీతో ఎలాగైన మరో హిట్ కోట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తుంది. నానికి జోడిగా ఆమె నటించిన దసరా మూవీ ఈ నెల 30న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ క్రమంలో కీర్తికి సంబంధించిన ఓ ఆసక్తికర న్యూస్ నెట్టింట చక్కర్లు కొడుతోంది. సినిమా షూటింగ్ అయిపోయిన సందర్భంగా కీర్తి దసరా టీంకు ఖరీదైన బహుమతులు ఇచ్చిందట. చదవండి: షాకింగ్: లాకర్లోని రజనీకాంత్ కూతురు ఐశ్వర్య బంగారం, వజ్రాలు చోరీ ఈ మూవీకి పని చేసిన టెక్నీషియన్లకు బంగారు నాణెలు కానుక ఇచ్చినట్లు సమాచారం. దాదాపు 130 మంది టెక్నిషియన్లు ఒక్కొక్కరి కీర్తి గోల్డ్ కాయిన్స్ పచ్చినట్లు నెట్టింట జోరుగా ప్రచారం జరుగుతుంది. మరి ఈ వార్తల్లో నిజమెంతుంతో తెలియాల్సి ఉంది. కానీ కీర్తి గొప్ప మనసు ఆమె ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. మహానటి తర్వాత మళ్లీ నటనకు స్కోప్ ఉన్న అలాంటి పాత్ర రావడం, షూటింగ్లో తనకు అన్ని విధాలా సహకరించినందుకు గానూకృతజ్ఞతగా ఈ బంగారు నాణెలు ఇచ్చినట్లు తెలుస్తోంది. -
ఆ సంఘటన చాలా భయపెట్టింది, రెండు నెలలు నిద్రపట్టలేదు: నాని
నేచురల్ స్టార్ నాని హీరోగా నటించిన లేటెస్ట్ చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మార్చి 30న విడుదలకు సిద్ధమైంది. సింగరేణి బొగ్గు గనుల నేపథ్యంలో రూపొందిన ఈ సినిమాలో నాని పూర్థి స్థాయి మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ చిత్రం ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులతో పాటు ప్రమోషన్స్‌తో బిజీగా ఉంది. ఈ క్రమంలో తాజాగా ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న మూవీ విశేషాలను పంచుకున్నాడు. చదవండి: నా తమ్ముడే నన్ను చంపాలని చూశాడు.. స్లో పాయిజన్ ఇచ్చాడు: నటుడు ఈ సందర్భంగా దసరాలోని ఓ సన్నివేశం తనని చాలా ఇబ్బంది పెట్టిందని, దాని వల్ల రెండు నెలల సరిగా నిద్రపోలేదంటూ ఆసక్తిర విషయాన్ని బయటపెట్టాడు. ఈ మేరకు నాని మాట్లాడుతూ.. ‘డంపర్ ట్రక్ బోగ్గును తీసుకుని వెళ్లి డంప్ చేస్తుంటుంది. దీనిక సంబంధించిన సీన్లో నేను ఆ డంపర్ ట్రక్‌లో నుంచి కిందపడితే ఆ బొగ్గు నాపై పడాలి. దీని కోసం సింథటిక్ బొగ్గు రెడీ చేశారు. అది మొత్తం డస్ట్‌తో ఉంటుంది’ అన్నాడు. అలాగే ‘ఆ సీన్లో నేను ఆ డంపర్‌లో నుంచి క్రింద పడిపోయాను. చదవండి: చిరంజీవి వల్లే బతికాను, ఏదో చిన్న సాయం చేస్తారనుకుంటే..: నటుడు సింథటిక్ కోల్స్ కింద నుంచి నన్ను పైకి లాగడానికి కొంత సమయం పడుతుంది. ఆ గ్యాప్‌లో నేను గాలి పీల్చకుండా ఉండాలి. పీల్చితే డస్ట్ అంతా లోపలికి వెళ్లిపోతుంది. ఈ సీన్ షూటింగ్ అయ్యాక చాలా రోజుల పాటు డంప్‌లో నుంచి బొగ్గుతో పాటు నేను పడటం.. బొగ్గు నాపై పడటం.. నన్ను పైకి లాగడం.. ఇవన్నీ నాకు పదే పదే గుర్తుకొచ్చేవి. అది గుర్తోచ్చినప్పుడల్లా లోపల ఏదో ఇబ్బందిగా అనిపించేది. ఈ క్రమంలో తెలియకుండానే నేను శ్వాస ఆపడం చేస్తుండేవాడిని. దాని నుంచి బయటపడటానికి నాకు చాలా సమయం పట్టింది. దీనివల్ల రెండు నెలల పాటు సరిగా నిద్రపట్టలేదు’ అంటూ చెప్పుకొచ్చాడు. -
యూట్యూబ్‌లో దూసుకుపోతున్న ‘దసరా’ ట్రైలర్, ట్రెండింగ్‌లో నెంబర్ వన్
నేచురల్ స్టార్ నాని-మహానటి కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం దసరా. శ్రీకాంత్ ఓదెల దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ట్రైలర్‌ను నిన్న(మార్చి 14న) ట్రైలర్‌ను విడుదల చేశారు. ఐదు భాషల్లో విడుదలైన ఈ మూవీ ట్రైలర్ ప్రస్తుతం యూట్యూబ్‌ను షేక్ చేస్తోంది. ఇలా విడుదలైందో లేదో క్షణాల్లో ఈ ట్రైలర్ వేలల్లో వ్యూస్ తెచ్చుకుంది. ట్రైలర్ విడుదలైన 16 గంట్లోనే 5 భాష్లలో కలిపి 12 మిలియన్ల వ్యూస్, 400 వేల లైక్స్‌ను రాబట్టింది. దీంతో ఈ ట్రైలర్ ట్రెండింగ్స్‌లో అగ్ర స్థానంలో ఉన్నట్లు చిత్ర యూనిట్ ప్రకటిస్తూ ఆనందం వ్యక్తం చేసింది. అంతేకాదు హిందీలో కూడా ఈ ట్రైలర్‌కు అదరిపోయే రెస్పాన్స్ రావడం విశేషం. కాగా బొగ్గు గనుల నేపథ్యంలో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న ఈ చిత్రంపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. ఈ క్రమంలో మూవీ నుంచి విడుదలైన టీజర్, సాంగ్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేస్తున్నాయి. ఇటీవల విడుదలైన మూడో లిరికల్ సాంగ్ చమ్కీల అంగీలేసి.. ఓ వదినే.. చాకు లెక్క ఉండేటోడే.. కూడా ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ పాటే మారుమోగిపోతుంది. కాగా తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తెరకెక్కిన ఈ చిత్రం ఈనెల 30న ప్రేక్షకుల ముందుకు రానుంది. MONSTROUS RESPONSE for #DasaraTrailer all over 😍🔥 12M+ Views with 400K+ likes for #Dasara Trailer across 5 languages 🔥💥 - https://t.co/CMNWNxbUZ3#DasaraOnMarch30th Natural Star @NameisNani @KeerthyOfficial @Dheekshiths @odela_srikanth @Music_Santhosh @saregamasouth pic.twitter.com/60w6C6MpE2 — SLV Cinemas (@SLVCinemasOffl) March 15, 2023 -
కీర్తి ఆశలన్నీ ఆ సినిమాపైనే.. హిట్ అయితే పెద్ద పండగే!
బెస్ట్ యాక్టర్ అనిపించుకున్న ఏ స్టారైనా తన ఇమేజ్ కి తగ్గ స్టోరీస్ సెలెక్ట్ చేసుకోకపోతే ఇబ్బందులు పడాల్సిందే. ఆఫర్స్ వస్తున్నాయి కదా అని కథ పట్టించుకోకుండా నటిస్తే ప్రేక్షకులు ఆదరించరు. దీంతో ఇమేజ్ కి మాత్రమే కాదు కెరీర్ కి కూడా డ్యామేజ్ ఏర్పడే పరిస్థితి వస్తుంది. సేమ్ ఇలాంటి పరిస్థితిలోనే కీర్తి సురేశ్ ఉంది. మహానటి లో నటించి బెస్ట్ యాక్టర్ అవార్డ్ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన ఆఫర్ మిస్ చేయకుండా ప్రతి సినిమాలో నటించి బాక్సాపీస్ దగ్గర బోల్తా పడింది. మహానటి తర్వాత లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేయటానికే ఇంట్రెస్ట్ చూపించింది. అయితే కీర్తి నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా, గుడ్ లక్ సఖి సినిమాలు ప్రేక్షకాదరణ పొందలేదు. గతేడాది తమిళంలో చేసిన సాని కాయిధమ్ లో మాత్రం కీర్తి సురేష్ నటనకి మంచి మార్కులే పడ్డాయి. రివెంజ్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్ పెర్ఫార్మెన్స్ నెక్స్ట్ లెవల్ ఉంటుందనే చెప్పాలి. ఈ సినిమా ఓటిటిలో రిలీజ్ కావటంతో ప్రేక్షకులకి ఈ సినిమా గురించి ఎక్కువగా తెలియలేదు. ఆ సినిమా తర్వాత కీర్తి కమర్షియల్ హీరోయిన్ అనిపించుకోవటానికి ట్రై చేసింది. మహేష్ బాబు మూవీ సర్కారు వారి పాటలో నటించింది. ఈ సినిమాలో తన అందం, నటనతో ప్రేక్షకులను కీర్తి ఆకట్టుకున్న కీర్తికి ఒరిగింది ఏమి లేదు. ఆ సినిమా క్రెడిట్ మొత్తం మహేశ్ కే వెళ్లిపోయింది. అయితే ఈ సారి తన యాక్టింగ్ తో ప్రేక్షకులను ఇంప్రెస్ చేయాలని ఫిక్స్ అయిన కీర్తి...దసరా మూవీలో హీరోయిన్ ఛాన్స్ దక్కించుకుంది. ఈ సినిమా నాని కి జోడిగా నటిస్తున్న కీర్తి సురేశ్ కూడా డీ గ్లామర్ రోల్ లోనే నటిస్తుంది. పెర్ఫార్మెన్స్ కి స్కోప్ ఉన్న పాత్ర వస్తే కీర్తి సురేశ్ ఏ రేంజ్ లో నటిస్తుందో అందరికీ తెలుసు. ప్రస్తుతం కీర్తి సురేశ్ పెర్ఫార్మెన్స్ బెస్డ్ రోల్ చేసిన దసరా పైనే ఆశలన్నీ పెట్టుకుంది. ఈ సినిమాలో వెన్నెల పాత్రలో కనిపించనున్న కీర్తి సురేశ్ కి ఫెర్ఫార్మెన్స్‌కు చాలా స్కోప్ ఉందట. ఈ విషయం ట్రైలర్ చూస్తే కూడా అర్ధమవుతోంది. పుష్ఫ సినిమాలో రష్మిక మందన్న నటించిన శ్రీవల్లి క్యారెక్టర్ ఎంత హైలైట్ అయిందో దసరా సినిమాలో కూడా వెన్నెల క్యారెక్టర్ అలా హైలైట్ అవుతుందని కీర్తి సురేశ్ గట్టిగా నమ్ముతుంది. ఈ సినిమాలో నాని, కీర్తి సురేష్ పోటీ పడి నటించారని చెబుతున్నాడు డైరెక్టర్ శ్రీకాంత్ ఓదేల. అలాగే ఈ మూవీలోని పవర్ఫుల్ సీన్స్ లో కీర్తి సురేశ్ పండించే ఎమోషన్స్ ప్రేక్షకులకు గూస్బంప్స్ తెప్పిస్తాయట. ఈ సినిమా హిట్ అయితే కీర్తి సురేశ్ కి పండగే అని నెటిజన్స్ అంటున్నారు. -
AK 62: త్రిష కాదు.. సాయి పల్లవి కాదు.. కీర్తి సురేశ్ ఫైనల్!
తమిళ సినిమా: అజిత్ కథానాయకుడిగా నటించిన తుణివు చిత్రం పొంగల్ సందర్భంగా ఈ నెల 11వ తేదీ విడుదలై టాక్‌తో సంబంధం లేకుండా మంచి వసూళ్లను రాబడుతోంది. దీంతో చిత్ర యూనిట్ ప్రమోషన్ గురించి అస్సలు పట్టించుకోవడం లేదు. ఇక అజిత్ సంగతి తెలిసిందే. నటించి పూర్తి చేశాను... అంతవరకే అన్నట్లు ఉంటుంది ఈయన ధోరణి. ప్రస్తుతం ఈయన తన 62వ చిత్రానికి సిద్ధమవుతున్నారు. నయనతార భర్త విగ్నేష్ శివన్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించనున్నారు. మైకా ప్రొడక్షన్స్ నిర్మిస్తున్న ఈ భారీ చిత్రాన్ని ఫిబ్రవరి నెలలో సెట్స్‌పైకి తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నారు. దీని గురించి చిత్త యూనిట్ ఇంకా అధికారికంగా ప్రకటించకపోయినా ఇప్పటికే రకరకాల వార్తలు ప్రచారంలో ఉన్నాయి. ముఖ్యంగా ఇందులో అజిత్ సరసన నటించే హీరోయిన్ల గురించి పెద్ద చర్చే జరుగుతోంది. ముందుగా నటి నయనతార నటిస్తున్నట్లు ప్రచారం జరిగింది. ఆ తర్వాత త్రిష అంటూ వార్తలు వెలువడ్డాయి. ఆ తరువాత నటి ఐశ్వర్యరాయ్, సాయి పల్లవి పేర్లు వినిపించాయి. తాజాగా మరో బ్యూటీ పేరు తెరపైకి వచ్చింది. ఆవిడే కీర్తి సురేశ్. ఇంకా పేరు నిర్ణయించని ఈ చిత్రంలో అజిత్ సరసన ఇద్దరు హీరోయిన్లు నటించనున్నారని, అందులో నటి ఐశ్వర్యరాయ్ ఒకరు కాగా, రెండో హీరోయిన్గా నటి కీర్తి సురేశ్‌ను ఎంపిక చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే కీర్తి సురేష్ పంట పండినట్లే. ఇప్పటికే ఈమె నటుడు రజనీకాంత్, విజయ్, సూర్య, విక్రమ్ వంటి స్టార్ హీరోలతో నటించారు. అజిత్‌కు జంటగా నటించాలనే ఆసక్తిని ఇటీవల ఆమె ఒక భేటీలో వ్యక్తం చేశారు. కాగా ప్రస్తుతం ఉదయనిధి స్టాలిన్‌కు జంటగా నటిస్తున్న మామనిదన్ చిత్రం త్వరలో విడుదలకు సిద్ధమవుతోంది. -
తుపాకీ పట్టిన హీరోయిన్లు.. బాక్సాఫీస్‌పై గురి
తుపాకీ పట్టారు.. విలన్లపై గురి పెట్టారు...రెచ్చిపోయి ఫైట్స్ చేస్తున్నారు... బాక్సాఫీస్ కలెక్షన్లపై గురి పెట్టారు... ప్రస్తుతం కొందరు కథానాయికలు సిన్సియర్ పోలీసాఫీసర్లుగా, లేడీ జేమ్స్ బాండ్ తరహా పాత్రల్లో నటిస్తున్నారు. ఆ చిత్రాల గురించి తెలుసుకుందాం. సీనియర్ నటి టబు మరో రెండు నెలల్లో ఇన్స్పెక్టర్ డయానా జోసెఫ్‌గా కనిపించనున్నారు. అజయ్ దేవగన్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న హిందీ చిత్రం ‘భోలా’లోనే ఆమె పోలీస్ ఇన్స్పెక్టర్ డయానా జోసెఫ్ పాత్ర చేస్తున్నారు. మూడు రోజుల క్రితం ఈ చిత్రంలో టబు లుక్ విడుదలైంది. మార్చి 30న ఈ చిత్రం విడుదల కానుంది. ఇక గత ఏడాది సెప్టెంబర్‌లో ‘పొన్నియిన్ సెల్వన్’ చిత్రంలో యువరాణి పాత్రలో కనిపించిన త్రిష త్వరలో విడుదల కానున్న వెబ్ సిరీస్ ‘బృందా’లో తుపాకీ తూటాలను అలవోకగా వదిలే పోలీస్‌గా కనిపించనున్నారు. త్రిష నటించిన తొలి వెబ్ సిరీస్ ఇది. సూర్య వంగల దర్శకత్వంలో రూపొందిన ఈ సిరీస్ సీజన్ వన్ షూటింగ్ ఇటీవలే పూర్తయింది. త్వరలో స్ట్రీమింగ్ కానుంది. ఓ పవర్ఫుల్ పోలీస్ ఆఫీసర్ చుట్టూ తిరిగే కథతో ఈ సిరీస్ రూపొందింది. ఇక కాజల్ అగర్వాల్ కూడా సిన్సియర్ పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ‘ఘోస్టీ’ అనే చిత్రంలోనే ఈ పాత్ర చేశారామె. తన తండ్రి అడుగుజాడలను అనుసరించి, పోలీస్‌గా మారుతుంది ఆర్తి (కాజల్). ఇరవయ్యేళ్ల క్రితం తన తండ్రి కస్టడీ నుంచి తప్పించుకున్న ఖైదీని పట్టుకోవాలన్నదే ఆర్తి ఆకాంక్ష. ఈ క్రమంలో ఆమెకు విచిత్రమైన ఘటనలు ఎదురవుతుంటాయి. కాజల్ నటించిన తొలి హారర్ సినిమా ఇది. కల్యాణ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం విడుదలకు సిద్ధమవుతోంది. మరోవైపు అధికారిక ప్రకటన రాలేదు కానీ ఓ హిందీ షోలో తమన్నా పోలీస్‌గా చేస్తున్నారనే వార్త ప్రచారంలోకి వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ షో సాగుతుందని సమాచారం. ఇంకోవైపు దాదాపు లేడీ ఓరియంటెడ్ సినిమాలు చేస్తున్న నయనతార తన తొలి హిందీ చిత్రం ‘జవాన్’లో పోలీసాఫీసర్ పాత్ర చేస్తున్నారు. షారుక్ ఖాన్ హీరోగా తమిళ దర్శకుడు అట్లీ తెరకెక్కిస్తున్న తొలి హిందీ చిత్రం ఇది. ఈ చిత్రంలో అన్యాయంగా జైలుపాలైన మహిళలను విడిపించి, వారిని సాంఘిక దురాచారాలకు వ్యతిరేకంగా పోరాడే ఒక టీమ్‌గా మార్చే కామన్ మేన్ పాత్రను షారుక్ ఖాన్ చేస్తున్నారని సమాచారం. ఈ కేసును ఛేదించే పోలీసాఫీసర్ పాత్రలో నయనతార కనిపిస్తారని టాక్. ఈ ఏడాది జూన్ 2న ఈ చిత్రాన్ని విడుదల చేయాలనుకుంటున్నారు. ఇక అభినయానికి ఆస్కారం ఉన్న పాత్రలంటే దర్శకులకు గుర్తొచ్చే కథానాయికల్లో కీర్తీ సురేష్ ముందు వరుసలో ఉంటారు. ప్రస్తుతం కీర్తి చేస్తున్న చిత్రాల్లో ‘రివాల్వర్ రీటా’ ఒకటి. రెండు చేతులతో రెండు తుపాకీలు పట్టుకుని అలవోకగా షూట్ చేసే రీటా పాత్రలో కనిపించనున్నారు కీర్తి. కె. చంద్రు దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో లేడీ జేమ్స్ బాండ్ తరహా పాత్ర చేస్తున్నారామె. మరోవైపు హిందీ చిత్రం ‘కమాండో’ సీక్వెల్స్‌లో పోలీస్ ఇన్స్పెక్టర్ భావనా రెడ్డిగా కనిపించిన అదా శర్మ ప్రస్తుతం ఓ హిందీ చిత్రంలో పోలీస్ ఆఫీసర్‌గా చేస్తున్నారు. విశాల్ పాండ్య దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందుతోంది. మరోసారి పోలీస్‌గా నటించే అవకాశం రావడం ఆనందంగా ఉంది అంటున్నారు అదా. ఇక ‘సీతారామం’ చిత్రంతో పాపులర్ అయిన మృణాల్ ఠాకూర్ నటించిన హిందీ చిత్రం ‘గూమ్రా’. ‘సీతారామం’లో సున్నిత మనసు ఉన్న సీత పాత్రలో అందర్నీ ఆకట్టుకున్న మృణాల్ ‘గూమ్రా’లో శక్తిమంతమైన పోలీసాఫీసర్‌గా కనిపించనున్నారు. ఈ పాత్ర చేయడానికి శిక్షణ తీసుకున్నారు మృణాల్. తమిళ చిత్రం ‘తడమ్’కి రీమేక్‌గా వర్థన్ కట్కర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందింది. ఈ తారలే కాదు.. మరికొందరు కథానాయికలు కూడా పోలీసాఫీసర్ పాత్రలో విజృంభించనున్నారు. -
రివాల్వర్ రీటాగా కీర్తి సురేశ్, ఆసక్తి పెంచుతున్న ఫస్ట్‌లుక్!
నటి కీర్తి సురేష్ అనే పేరు వినగానే గుర్తొచ్చే చిత్రం మహానటి. సావిత్రినే మళ్లీ పుట్టిందా అనేంతగా ఆ చిత్రంలో అద్భుతంగా అభినయించారు ఆమె. అదేవిధంగా తమిళంలోనూ సాని కాగితం అనే చిత్రంలో మగజాతి వంచితురాలిగా, ప్రతీకారం తీర్చుకునే ఆడపులిగా నటించి నటిగా మరోసారి నిరూపించుకున్నారు. అయితే గ్లామర్ పాత్రల వైపు దృష్టి మళ్లించిన కీర్తి సురేశ్‌కు ఆ తరువాత చెప్పుకోదగ్గ పాత్రలు రాలేదనే చెప్పాలి. కెరీర్ ఆరంభంలో మంచి విజయాలను అందుకున్న ఈ బ్యూటీ ఇటీవల వాటికి దూరమయ్యారని చెప్పక తప్పదు. చదవండి: అది నా అదృష్టం: రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు గత ఏడాది తెలుగులో మహేష్ బాబుతో జతకట్టిన సర్కారి వారి పాట, తమిళంలో సాని కాగితం చిత్రాలు విడుదల అయ్యాయి. ఇక 2023 ఆమె చేతి నిండా ప్రజెక్ట్స్ బిజీగా ఉంది. నానికి జంటగా నటించిన తెలుగు చిత్రం ‘దసరా’ విడుదలకు సిద్ధమవుతోంది. మెగాస్టార్ చిరంజీవికి చెల్లెలిగా నటిస్తున్న ‘భోళాశంకర్’ చిత్రం షూటింగ్ దశలో ఉంది. ఇక తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన నటించిన ‘మామన్నన్’ చిత్రం షూటింగ్ పూర్తి చేసుకుని నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. జయంరవితో జత కట్టిన ‘సైరన్’ నిర్మాణంలో ఉంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో నూతన చిత్రంలో నటించడానికి సిద్ధమయ్యారు. చదవండి: విజయ్ వారసుడు ఓటీటీ స్ట్రీమింగ్ ఇక్కడే! అంతకు ముందే రిలీజ్? దీనికి ‘రివాల్వర్ రీటా’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. ఈ చిత్రాన్ని ఫ్యాషన్ స్టూడియోస్, ది రూట్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. చంద్రు దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్ర ఫస్ట్ లుక్ పోస్టర్‌ను పొంగల్ సందర్భంగా విడుదల చేశారు. రెండు చేతుల్లో రివాల్వర్లు పట్టుకున్న కీర్తి సురేష్ ఫొటోతో కూడిన పోస్టర్‌ను రిలీజ్ చేశారు. ఈ పోస్టర్ చూస్తుంటే ఇది యాక్షన్ నేపథ్యంలో సాగే లేడీ ఓరియంటెడ్ కథాచిత్రంగా ఉంటుందనిపిస్తోంది. కాగా కుటుంబ సభ్యులు, స్నేహితులతో కలిసి సంప్రదాయబద్ధంగా కీర్తి సురేష్ పొంగల్ వేడుకలను జరుపుకుంది. ఆ ఫొటోలను ఆమె తన ఇన్‌స్ట్రాగామ్‌లో పోస్ట్ చేశారు. Wishing some of my favourite people the very best ♥️@KeerthyOfficial @Jagadishbliss #RevolverRita Looking forward to this !! 🤗@dirchandru @dineshkrishnanb @Cinemainmygenes @Aiish_suresh @TheRoute @PassionStudios_ pic.twitter.com/1pqdOutCE8 — Samantha (@Samanthaprabhu2) January 14, 2023 -
వెకేషన్ ప్లాన్ చేసిన యంగ్ హీరో.. థాయ్‌లాండ్‌లో చిల్ అవుతున్న కీర్తి
► థాయ్‌లాండ్‌లో చిల్ అవుతున్న కీర్తి.. స్విమ్మింగ్ ఫూల్లో హాట్ ఫోజులు ► లైట్ బ్లూ శారీలో హోయలు పోతెన్న బుల్లితెర రాములమ్మ ► 2022లో రెండు బ్లాక్‌బస్టర్స్.. అలా వెకెషన్ ప్లాన్ చేసిన యంగ్ హీరో నిఖిల్ ► చీరలో మెస్మరైజ్ చేస్తున్న అషురెడ్డి ► లెహంగా చోళీలో అరియానా మెరుపులు.. గ్లామర్ కట్టిపడేస్తోన్న బోల్డ్ బ్యూటీ ► పట్టు చీరలో చిరు నవ్వులు చిందిస్తున్న యాంకర్ అనసూయ ► లంగావోణీలో శ్రద్ధాదాస్ సోకులు విందు View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Nikhil Siddhartha (@actor_nikhil) View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) View this post on Instagram A post shared by Ashu Reddy (@ashu_uuu) View this post on Instagram A post shared by Chhatriwali ☔ (@rakulpreet) View this post on Instagram A post shared by Aakanksha Singh (@aakankshasingh30) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) -
తొలిసారి కాస్టింగ్ కౌచ్‌పై స్పందించిన కీర్తి సురేశ్
'మహానటి' సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న మలయాళీ ముద్దుగుమ్మ కీర్తిసురేష్. అందం, అభినయంతో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్న కీర్తి ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతుంది. ఈ ఏడాది మహేష్ సర్కారు వారి పాట సినిమాతో హిట్టు కొట్టిన కీర్తి సురేష్ ప్రస్తుతం నాని సరసన దసరా చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. తెలుగుతో పాటు తమిళంలోనూ ఆమె బిజీ హీరోయిన్గా మారింది. ఈ నేపథ్యంలో రీసెంట్గా ఓ తమిళ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూలో కీర్తి కాస్టింగ్ కౌచ్‌పై షాకింగ్ కామెంట్స్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సందర్భంగా కీర్తి ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ ఉందని తనకు తెలుసంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఇండస్ట్రీలో కాస్టింగ్ కౌచ్ ఉంది. నాతో పాటు నటిస్తున్న హీరోయిన్లు కూడా దీని గురించి నాకు చెప్పారు. ఈ క్యాస్టింగ్ కౌచ్ అనేది ఇప్పటి వరకు నా దగ్గరకు రాలేదు. కాస్టింగ్ కౌచ్ అనేది మన ప్రవర్తన బట్టి కూడా ఉంటుందేమో. అందుకే ఇలాంటి సంఘటన నాకు ఇప్పటి వరకు ఎదురుకాలేదు. ఒకవేళ నిజంగా నన్ను ఎవరైనా కమిట్మెంట్ అడిగితే అసలు దానికి అంగీకరించను. కావాలంటే సినిమాలు మానేసి ఏదైనా జాబ్ చేసుకుంటాను కానీ, అవకాశాలు కోసం కమిట్మెంట్ ఇచ్చే టైప్ నేను కాదు’ అంటూ వ్యాఖ్యానించింది. దీంతో ప్రస్తుతం కీర్తి సురేశ్ కామెంట్స్ నెట్టింట వైరల్ అవుతున్నాయి. చదవండి: కన్నడలో రష్మికపై బ్యాన్! ‘శ్రీవల్లి’ ఏమన్నదంటే.. బిగ్‌బాస్ 6: హాట్‌టాపిక్‌గా ఫైమా రెమ్యునరేషన్! 13 వారాలకు ఎంతంటే? -
పెళ్ళికి సిద్ధమైన కీర్తి సురేష్..!
-
మరో లగ్జరీ కారు కొన్న కీర్తి సురేశ్, ధర ఎంతంటే..
హీరోయిన్ కీర్తి సురేశ్ క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. మహానటి సినిమాతో ఎంతో స్టార్డమ్ సంపాదించుకుంది. ఇందులో ఆమె సావిత్రిగా కనిపించి అందరి మన్నన్నలు అందుకుంది. ఇప్పటికీ ఆమె కీర్తిగా కంటే కూడా మహానటి అని పిలుస్తుంటారు. అయితే ఆ స్టార్‌డమ్‌ను కీర్తి కొనసాగించలేకపోతోంది. ఇటీవల ఆమె నటించిన సినిమాలన్ని బాక్సాఫీసు వద్ద నిరాశ పరిచాయి. ఈ నేపథ్యంలో మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట మూవీతో ఎన్నో ఫ్లాప్‌ల అనంతరం సక్సెస్ అందుకుంది. చదవండి: నటి దివ్య కేసులో కొత్త ట్విస్ట్, ఆమె కంటే ముందు ట్రాన్స్‌జెండర్‌తో ప్రేమ, పెళ్లి ఇదిలా ఉంటే ఈ మధ్య సన్నబడ్డ కీర్తి సినిమాలతో పాటు సోషల్ మీడియాలో ఫుల్ యాక్టివ్‌గా ఉంటోంది. తరచూ తన లేటెస్ ఫొటోలు షేర్ చేస్తు ఫ్యాన్స్ అలరిస్తోంది. ఇక ఆడపదడపా సినిమాలు చేస్తూ వస్తున కీర్తి ఇటీవల లగ్జరీ కారు కొనుగోలు చేసింది. దసరా పండగ సందర్భంగా కీర్తి లగ్జరీ బీఎండబ్య్లూ కారు ఖరీదు చేసింది. ఇందుకు సంబంధించిన ఫొటోలను ఆమె తన సోషల్ మీడియాలో షేర్ చేసింది. బీఎండబ్ల్యూలో కొత్త మోడల్ ఎక్స్7 సిరీస్ తీసుకుంది. చదవండి: మా నాన్నలో నాకు నచ్చనిది అదే: మంచు విష్ణు అయితే ఇప్పటికే ఆమె పలు లగ్జరీ కార్లు ఉన్నప్పటికీ కార్లపై ఉన్న మక్కువతో బీఎండబ్య్లూ(BMW X7 Luxury SUV) కొత్త మోడల్ సిరీస్‌ను తన కార్ల గ్యారేజ్‌లో చేర్చింది. బీఎండబ్ల్యూ ఎక్స్7 సిరీస్ బ్లూ కలర్ కారు చాలా రాయల్‌గా కనిపిస్తోంది. ఈ కారు ధర రూ. 1.18 కోట్ల నుండి రూ. 1.80 కోట్ల వరకు ఉంటుందని అంచన. 7 సీటర్ కార్లలో బీఎండబ్ల్యూనే బాగా ప్రాచుర్యం పొందింది. దీనిలో టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, కొత్త iDrive సిస్టమ్, డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్, మల్టీఫంక్షన్ స్టీరింగ్ వీల్, క్రిస్టల్-ఎఫెక్ట్ గేర్ లివర్, వాయిస్ అసిస్టెంట్ వంటి అత్యాధునిక ఫీచర్స్ ఉన్నట్లు సమాచారం. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
విడుదలకు సిద్దమైన కీర్తి సురేశ్ కొత్త చిత్రం
కీర్తి సురేష్, నవీన్ కృష్ణ జంటగా రూపొందిన చిత్రం `జానకిరామ్`. బేబీ శ్రేయారెడ్డి సమర్పణలో శ్రీ ఓబులేశ్వర ప్రొడక్షన్స్ పతాకంపై రాంప్రసాద్ రగుతు దర్శకత్వంలో తమటం కుమార్ రెడ్డి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఈ చిత్రం ఇటీవల సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుని విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సందర్భంగా నిర్మాత తమటం కుమార్ రెడ్డి మాట్లాడుతూ....‘ఇటీవల విడుదల చేసిన మా చిత్రంలోని పాటలకు మంచి రెస్పాన్స్ వచ్చింది. మా చిత్రానికి సంబంధించిన సెన్సార్ పనులు పూర్తయ్యాయి. సెన్సార్ వారు యు/ఏ సర్టిఫికెట్ మంజూరు చేశారు. త్వరలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నాం. హ్యుమన్ ట్రాఫికింగ్ నేపథ్యంలో మ్యూజికల్ లవ్ స్టోరీగా తెరకెక్కిన చిత్రమిది. కీర్తి సురేష్ , నవీన్ కృష్ణ మధ్య కెమిస్ట్రీ బాగా కుదిరింది. కీర్తి సురేష్ అందం, అభినయంతో పాటు నవీన్ కృష్ణ పర్పార్మెన్స్ ఆకట్టుకుంటాయి. ఇక కృష్ణ వంశీ గారి లాంటి పెద్ద దర్శకుల వద్ద దర్శకత్వ శాఖలో పని చేసిన రాంప్రసాద్ రగుతు ఈ చిత్రాన్ని అద్భుతంగా తెరకెక్కించాడు. ఇందులో సప్తగిరి, పోసాని, రాహుల్ దేవ్ , రఘు కారుమంచి ప్రాధాన్యత ఉన్న పాత్రల్లో నటించారు. మరో ఇంపార్టెంట్ రోల్ లో చాందిని నటించింది. త్వరలో సినిమా విడుదల తేదీ ప్రకటిస్తాం’ అన్నారు. -
గ్యాంగ్‌స్టర్‌గా విజయ్.. ఆమెతో ముచ్చటగా మూడోసారి?
సినిమా రంగంలో ఎప్పుడు ఏం జరుగుతుందో ఎవరూ చెప్పలేరు. ఇలాంటి సంఘటన తాజాగా కోలీవుడ్‌లో వినిపిస్తోంది. దళపతిగా విజన్ కోట్లాది మంది గుండెల్లో నిలిచిపోయారు. ఈయన చిత్రాలు జయాపజాయాలకు అతీతంగా ఆడేస్తుంటాయి. ఇప్పటికి 65 చిత్రాలు చేసిన విజయ్ ప్రస్తుతం 66వ చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా తెలుగు ప్రేక్షకులను నేరుగా అలరించడానికి సిద్ధమవుతున్నారు. వంశీ దర్శకత్వహిస్తున్న ఈ చిత్రం తెలుగు, తమిళం, హిందీ, మలయాళం పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానుంది. ఇందులో నటి రష్మిక మందన్న నాయకిగా నటిస్తోంది. ఈ చిత్రం ప్రస్తుతం నిర్మాణదశలో ఉంది. అయితే విజయ్ తన తదుపరి చిత్రానికి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. దీనికి లోకేష్ కనకరాజ్ దర్శకత్వం వహించబోతున్నట్లు ప్రచారం జోరుగా సాగుతోంది. వరుస విజయాలతో జోరు మీద ఉన్న దర్శకుడు లోకేష్ కనకరాజ్ ఇటీవల కమల్ హాసన్ హీరోగా తెరకెక్కించిన విక్రమ్ చిత్రం ఇండస్ట్రీ రికార్డుగా నిలిచింది. అంతకుముందు విజయ్ కథానాయకుడుగా రూపొందించిన మాస్టర్ చిత్రం సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. దీంతో విజయ్, దర్శకుడు లోకేష్ కనకరాజ్‌లో కాంబో మళ్లీ రిపీట్ కాబోతోందని సమాచారం. ఇందులో నటుడు విజయ్ 50 ఏళ్ల గ్యాంగ్ స్టర్‌గా నటించినట్లు, ఆయనకు జంటగా నటి త్రిష ఎంపిక కాగా, మరో నాయకిగా సమంత ప్రచారం జరిగింది. అయితే తాజాగా సమంతకు బదులు నటి కీర్తి సురేష్ నటించనున్నట్లు కోలీవుడ్ వర్గాల టాక్. కాగా విజయ్, కీర్తి సురేష్ కలిసి ఇప్పటికే సర్కార్, భైరవ చిత్రాల్లో నటించారు. తాజాగా ముచ్చటగా మూడోసారి ఈ జంట కలిసి నటించబోతున్నట్లు తెలుస్తోంది. ఇందులో ఆరుగురు విలన్లు ఉంటారని, ఒక్కో భాష నుంచి ఒక్కొక్కరిని ఎంపిక చేయనున్నట్లు తెలిసింది. అందులో బాలీవుడ్ స్టార్ నటుడు సంజయ్ దత్, మలయాళ నటుడు పృథ్వీరాజ్, కన్నడ నటుడు అర్జున్ను విలన్ పాత్రలకు ఎంపిక చేసినట్లు, మరో ముగ్గురిని ఎంపిక చేయాల్సి ఉన్నట్లు సమాచారం. -
రూటు మార్చిన కీర్తి సురేష్.. గ్లామర్ డోస్ పెంచేసిందిగా!
ఇప్పటివరకు పక్కింటి అమ్మాయి ఇమేజ్‌కు తొలి ఆప్షన్‌గా కీర్తి సురేష్ పేర్కొనేవారు. మహానటి వంటి చిత్రాలు ఆమెకు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టాయి. తర్వాత అతికొద్ది కాలంలోనే హీరోయిన్ సెంట్రిక్ కథా చిత్రాల్లో నటించి శభాష్ అనిపించుకుంది. అదేవిధంగా మలయాళం, తెలుగు, తమిళం భాషల్లో నటిస్తూ బహుభాషా నటిగా రాణిస్తోంది. దీంతో చాలామంది హీరోయిన్ల మాదిరిగా కాకుండా నటనకు అవకాశం ఉన్న పాత్రను ఎంచుకొని నటిస్తుందనే ప్రశంసలు వస్తున్నాయి. అలాంటి ఈ భామ తాజాగా గ్లామర్‌పై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఆ మధ్య బాగా వర్కౌట్ చేసి బక్కచిక్కిన కీర్తి సురేష్ ముఖంలో గ్లో పోవడంతో విమర్శలను ఎదుర్కొంది. అయితే ఈమధ్య తెలుగులో మహేష్ బాబుతో నటించిన సర్కారు వారి పాట చిత్రంలో అందాలను మెరుగు పరుచుకుని ఆకట్టుకుంది. కాగా తాజాగా బాలీవుడ్ హీరోయిన్ల తరహాలో మాస్ లుక్‌తో దిగిన ఫొటోలను సోషల్ మీడియాలో షేర్ చేసుకోవడంతో ప్రస్తతం ఆ ఫోటోలు నెట్టింట చక్కర్లు కొడుతున్నాయి. ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం కీర్తి చేతి నిండా చిత్రాలతో బిజీగా ఉంటోంది. మలయాళంలో ఒక చిత్రం, తెలుగులో జానీతో దసరా, చిరంజీవికి చెల్లిగా భోళాశంకర్ చిత్రాలతో పాటూ తమిళంలో ఉదయనిధి స్టాలిన్ సరసన మామన్నన్ చిత్రం చేస్తోంది. -
'ఆకాశం నీ హద్దురా'డైరెక్టర్‌తో కీర్తి సురేశ్?
ఇరుది సుట్రు చిత్రంతో వెలుగులోకి వచ్చిన మహిళా దర్శకురాలు సుధా కొంగర. ఈ చిత్రాన్ని తమిళం, హిందీ భాషల్లో తెరకెక్కించగా సంచలన విజయం సాధించింది. తెలుగులో వెంకటేష్ హీరోగా గురు పేరుతో రీమేక్ చేశారు. అక్కడ కూడా విశేష ప్రేక్షకాదరణ అందుకుంది. తదుపరి సూర్య కథానాయకుడిగా సూరరై పోట్రు తెరకెక్కించారు. ఎయిర్‌డెక్కన్ సంస్థ అధినేత గోపీనాథ్ జీవిత చరిత్రతో తెరకెక్కించిన ఈ చిత్రం ఘన విజయం సాధించింది. విమర్శకులను సైతం మెప్పించింది. ఐదు జాతీయ అవార్డులను కైవసం చేసుకుంది. ప్రస్తుతం సుధా కొంగర ఈ చిత్రాన్ని హిందీలో తెరకెక్కించే పనిలో బిజీగా ఉన్నారు. నెక్ట్స్ ఏంటి అన్న ప్రశ్నకు ఈమె గత నెల ఏప్రిల్‌లోనే బదులిచ్చారు. సంచలన విజయాన్ని సాధించిన కేజీఎఫ్ చిత్ర నిర్మాణ సంస్థలో సుధా కొంగర చిత్రం చేయనున్నట్లు అధికారికంగా ప్రకటన వెలువడింది. అయితే దీనికి సంబంధించిన అప్డేట్ తాజాగా సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఇది హీరోయిన్ ఓరియంటెడ్ కథా చిత్రంగా ఉంటుందని సమాచారం. ఇందులో నటి కీర్తి సురేష్ కథానాయకిగా నటించనున్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే కీర్తి సురేష్‌కు హీరోయిన్ సెంట్రిక్ చిత్రాల నటిగా మంచి పేరు ఉంది. మహానటి చిత్రంతో తానేంటో నిరూపించుకుని జాతీయ ఉత్తమనటి అవార్డును సైతం గెలుచుకుంది. ఇటీవల తమిళంలో సాని కాగితం అనే చిత్రంలో సెంట్రిక్ కథా చిత్రంలో అద్భుతంగా నటించింది. ప్రస్తుతం తెలుగు, మలయాళం, తమిళం భాషల్లో నటిస్తూ బిజీగా ఉన్న కీర్తి సురేష్ దర్శకురాలు సుధ కొంగర దర్శకత్వంలో నటించడం నిజమైతే, ఆమెను ఎలాంటి పాత్రలో చూపించనున్నారు? చిత్ర కథ ఎలా ఉంటుందనే ఆసక్తి ఇప్పటి నుంచే సినీ వర్గాల్లో నెలకొంది. -
పెళ్లి పీటలు ఎక్కబోతున్న కీర్తి సురేశ్!
హీరోయిన్ల పెళ్లిపై సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు సరికొత్త గాసిప్‌లు వస్తూనే ఉంటాయి. మొన్న ఆపిల్ బ్యూటీ హన్సిక పెళ్లికి కుదిరిందంటూ వార్తలు హల్చల్ చేశాయి. తాజాగా కీర్తీ సురేష్ సైతం త్వరలో పెళ్లి పీటలు ఎక్కనుందనే చర్చ కోలీవుడ్‌లో హాట్ హాట్‌గా జరుగుతుంది. తల్లిదండ్రులు నిశ్చయించిన వరుడితో ఏడు అడుగులు వేయటానికి సిద్ధమవుతున్నట్లు టాక్. పెళ్లికొడుకు వ్యాపారవేత్త అని, రాజకీయాల్లోనూ చురుగ్గా పాల్గొంటున్నారని ప్రచారం జరుగుతుంది. ఇదే కనుక నిజమైతే కీర్తీ సురేష్ ఇంట మంగళ వాయిద్యాలు మోగుతాయన్నమాట. అయితే ఈ గాసిప్‌లపై కీర్తి సురేష్ ఇప్పటి వరకూ స్పందించలేదు. సినీ కుటుంబ నేపథ్యం నుంచి వచ్చిన నటి కీర్తీ సురేష్ మలయాళంలో ఎంట్రీ ఇచ్చినా ఆ తరువాత తమిళం, తెలుగు చిత్ర పరిశ్రమలో టాప్ హీరోయిన్గా రాణిస్తోంది. మహానటి చిత్రంలో సావిత్రి పాత్రలో అద్భుతంగా అభినయించి జాతీయ ఉత్తమ నటి అవార్డు అందుకుంది. ప్రస్తుతం తమిళంలో ఉదయనిధి స్టాలిన్ జంటగా మామన్నన్ చిత్రంలో నటిస్తోంది. కేరీర్ మంచి స్వింగ్‌లో ఉండగా ఈ అమ్మడు పెళ్లికి అంగీకరించిందంటే నమ్మశక్యంగా లేదు కదా! -
లక్కీ చాన్స్ చేజార్చుకున్న కీర్తి సురేశ్? ట్రోల్ చేస్తున్న నెటిజన్లు!
దర్శకుడిగా మణిరత్నంకు ఎంతటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగ చెప్పనక్కర్లదు. ఆయన సినిమాలో నటించే చాన్స్ కోసం స్టార్ హీరోహీరోయిన్లు సైతం ఆశగా ఎదురుచూస్తుంటారు. ఆయన సినిమాల్లో చిన్న రోల్ చేసిన చాలు అని ఎంతోమంది నటీనటులు ఆరాటపడుతుంటారు. అలాంటి స్టార్ డైరెక్టర్ చాన్స్ ఇస్తే ఓ స్టార్ హీరోయిన్ వదులుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. ఆమె ఎవరో కాదు ‘మహానటి’ కీర్తి సురేశ్. మణిరత్నం తాజా చిత్రం పొన్నియన్ సెల్వన్ మూవీ బృందం నుంచి కీర్తికి పిలుపు అందగా.. డేట్స్ లేవని ఆ లక్కీ చాన్స్ వదుకుందట కీర్తి. చదవండి: నయన్ బాటలో తమన్నా.. ఆ అనుభూతి ఉత్సాహాన్నిచ్చిందంటున్న మిల్కీ బ్యూటీ తాజాగా ఈ విషయం ఆలస్యంగా వెలుగు చూసింది. ఇక ఇది తెలిసి ఆమె ఫ్యాన్స్ అయ్యే అంటుండగా.. మరికొందరు ఆమెను విమర్శిస్తున్నారు. ‘‘మహానటి’ తర్వాత ఒక్క హిట్ కూడా లేని ఆమెకు మణిరత్నం వంటి స్డార్ డైరెక్టర్ చిత్రంలో అవకాశం వస్తే వదులుకుందా?, చాలా తెలివి తక్కువ వ్యవహరించింది’’అంటూ నెటిజన్లు ఆమెను ట్రోల్ చేస్తున్నారు. కాగా మహానటి చిత్రంతో తన నటనకు గానూ కీర్తి జాతీయ అవార్డు అందుకుంది. ఆ తరువాత ఆమె పలు చిత్రాలలో నటించిన సరైన సక్సెస్‌ను అందుకోలేకపోయిన సంగతి తెలిసిందే. అలాంటి సమయంలో మణిరత్నం చారిత్రక చిత్రం పొన్ని యన్ సెల్వన్‌లో నటించే అవకాశం వచ్చింది. చదవండి: జూ.ఎన్టీఆర్-కొరటాల మూవీ షూటింగ్ మొదలయ్యేది అప్పుడే! అయితే అదే సమయంలో రజనీకాంత్‌కు చెల్లెలిగా అన్నాత్తే చిత్రంలో నటిస్తుండటంతో పాటు మరోవైపు ‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్లో పాల్గొంటుంది. ఇక రజనీకాంత్‌తో నటిస్తే మంచి క్రేజ్ వస్తుందని భావించిన కీర్తి తనకు డేట్స్ సర్దుబాటు కావడం లేదని చెప్పి మణిరత్నం మూవీకి నో చెప్పిందని సినీవర్గాల నుంచి సమాచారం. దీంతో కీర్తి పాత్రకు త్రిషని తీసుకుందట చిత్ర బృందం. ఇందులో త్రిష కుందనవై అనే రోల్ పోషించిన సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రంలో త్రిషతో పాటు ఐశ్వర్యరాయ్ బచ్చన్, చియాన్ విక్రమ్, జయం రవి, హీరో కార్తీ వంటి స్టార్ హీరోహీరోయిన్లు ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. -
అలా చేస్తే ‘సర్కారువారి పాట’మరో 100 కోట్లు వసూలు చేసేది
సూపర్ స్టార్ మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. మే 12న విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద కాసులు వర్షం కురిపించింది. తెరపై మహేశ్ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. రూ. 60 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం దాదాపు రూ.200 కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి సూపర్ హిట్‌గా నిలిచింది. అయితే ఈ చిత్రంలో చిన్న చిన్న మార్పులు చేసుంటే మరింత పెద్ద విజయం సాధించేదని ప్రముఖ సినీ రచయిత పరుచూరి గోపాలకృష్ణ అభిప్రాయపడ్డారు. ‘పరుచూరి పాఠాలు’ పేరుతో కొత్త సినిమాలపై రివ్యూ ఇస్తున్న అయన.. తాజాగా ‘సర్కారు వారి పాట’పై తన అభిప్రాయన్ని వెల్లడించారు. (చదవండి: జ్ఞాపకశక్తిని కోల్పోతుంటాను..అదే నా భయం : తమన్నా) ఈ సినిమా ఫస్టాఫ్‌లో మహేశ్ బాబు, కీర్తి సురేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ ప్రేక్షకులను బాగా అలరించాయని ఆయన అన్నారు. సరదాగా సాగిపోతున్న సమయంలో మహేశ్ ఇండియాకి తిరిగి రావడం అనేది ప్రమాదకరమైన మలుపు అని ఆయన అభిప్రాయపడ్డాడు. అలా కాకుండా కీర్తి సురేశ్, మహేశ్‌ల మధ్య వచ్చే కామెడీ సీన్స్ నిడివి పెంచి ఉంటే సినిమా మరింత పెద్ద హిట్ అయ్యేదన్నారు. హీరోతో పాటు హీరోయిన్ని కూడా ఒకే విమానంలో తిరిగి ఇండియాకు తీసుకువచ్చేలా కథ రాసుకొని ఉంటే..తెలియకుండానే కొన్ని కామెడీ సన్నివేశాలు, రొమాన్స్ సీన్స్ యాడ్ అయ్యేవని..అలా అయితే ఈ సినిమా మరో వంద కోట్లు ఎక్కువ కలెక్ట్ చేసేదని పరుచూరి చెప్పుకొచ్చారు. -
పోస్ట్ వెడ్డింగ్ అంటూ ఫొటోలు షేర్ చేసిన కీర్తి, పక్కనే మరో హీరోయిన్
మహానటి కీర్తి సురేశ్ తన సొంత రాష్ట్రం కేరళలో వాలిపోయింది. ‘సర్కారు వారి పాట’ మూవీ సక్సెస్ ఫుల్ జోష్‌లో ఉన్న కీర్తి షూటింగ్‌లకు బ్రేక్ తీసుకుని స్నేహితులతో కలిసి ఎంజాయ్ చేస్తోంది. ఈ నేపథ్యంలో కేరళలోని స్నేహితురాలి పెళ్లికి హాజరైన కీర్తి వరుస ఫొటోలను షేర్ చేసింది. ప్రస్తుతం ఆమె స్నేహితులతో కలిసి కేరళలో సందడి చేస్తోంది. ఇక ఈ ఫొటోలను పోస్ట్ వెడ్డింగ్ బాష్ అంటూ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసిన ఈ ఫొటోల్లో మరో హీరోయిన్ కల్యాణి ప్రియదర్శిని కూడా ఉండటం గమనార్హం. చదవండి: వెడ్డింగ్ యానివర్సరీ: వైరల్‌గా చరణ్, ఉపాసన పెళ్లి వీడియో.. దీంతో ఈ ఫొటోలు నెట్టింట వైరల్‌గా మారాయి. కాగా వరుస ప్లాప్‌లతో ఐరన్ లెగ్గా పేరు తెచ్చుకున్న కీర్తి.. ‘సర్కారు వారి పాట’తో భారీ విజయం అందుకుని మంచి కమ్ బ్యాక్ ఇచ్చింది. దీంతో ఆమెకు మళ్లీ ఆఫర్లు క్యూ కడుతున్నట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఆమె సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం కీర్తి మెగాస్టార్ చిరంజీవి భోళా శంకర్ సినిమాలో కీ రోల్ పోషిస్తోంది. ఇందులో ఆమె చిరుకు చెల్లెలిగా కనిపించనుంది. దీనితో పాటు ఆమె నాని ‘దసరా’ మూవీతో పాటు తమిళంలో ఒక చిత్రం, మలయాళంలో మరో చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. చదవండి: విజయ్, రష్మికల షూటింగ్ ఫొటోలు లీక్.. డైరెక్టర్ అప్సెట్ View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
12 రోజులు..రూ.200 కోట్లు.. ‘సర్కారు వారి పాట’ రికార్డు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన చిత్రం సర్కారు వారి పాట. మే 12న థియేటర్స్‌లో విడుదలైన ఈ మూవీ.. బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపిస్తుంది. తొలి రోజు ప్రపంచవ్యాప్తంగా రూ.75 కోట్ల వసూలు చేసిన ఈ చిత్రం.. కేవలం ఐదు రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ.160.2 కోట్ల గ్రాస్, రూ. 100.44 కోట్ల షేర్ని సాధించి రికార్డు క్రియేట్ చేసింది. తాజాగా ఈ చిత్రం రూ.200 కోట్ల క్లబ్బులో చేరింది. కేవలం 12 రోజుల్లోనే రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఈ ఏడాదిలో 12 రోజుల్లోనే రూ. 200 కోట్ల క్లబ్ లోకి అడుగుపెట్టిన తొలి సినిమాగా ‘సర్కారు వారి పాట’ రికార్డు సృష్టించింది. 12రోజుల్లో ఏపీ, తెలంగాణలో రూ.156.9కోట్ల గ్రాస్, రూ.100.01కోట్ల షేర్ రాబట్టింది. మొత్తంగా ఇప్పటి వరకు 122.09 కోట్ల షేర్, రూ.200 కోట్ల గ్రాస్ వసూళ్లను రాబట్టి మహేశ్ బాబు సత్తా ఏంటో మరోసారి ప్రపంచానికి తెలియజేసింది. తెలుగు రాష్ట్రాల్లో శుక్రవారం వరకు కొత్త సినిమాలేవి రిలీజ్‌కు లేకపోవడంతో కలెక్షన్స్ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. Super 🌟 @urstrulyMahesh's SWAG SEASON continues 🔥🔥#BlockbusterSVP 💥💥#SVPMania #SarkaruVaariPaata @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents pic.twitter.com/mWZ9u6xo8s — Mythri Movie Makers (@MythriOfficial) May 24, 2022 మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రంలో సముద్రఖని విలన్‌గా నటించారు. తమన్ సంగీతం అందించాడు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_931254882.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
అందుకే చెల్లెలి పాత్రలు చేస్తున్నా: కీర్తి సురేశ్
Keerthy Suresh Clarifies Why She Accepts Sister Roles: ‘నేను.. శైలజ’ మూవీతో టాలీవుడ్‌కు పరిచయమైన హీరోయిన్ కీర్తి సురేశ్. ఆ తర్వాత లెజెండరి నటి సావిత్రి బయోపిక్‌లో నటించే చాన్స్ కొట్టేసింది. ‘మహానటి’లో సావిత్ర పాత్ర పోషించిన కీర్తి ఆ రోల్‌కు వందశాతం న్యాయం చేసింది. అంతేకాదు ఈమూవీకి గాను ఉత్తమ నటిగా నేషనల్ అవార్డును కూడా అందుకుంది కీర్తి. ఇక ఆ తర్వాత వచ్చిన సినిమాలు కీర్తికి పెద్దగా గుర్తింపు తెచ్చిపెట్టేలేదు. చదవండి: ఆస్తులన్ని పోయాయి, ఒక్క పూట భోజనమే చేసేదాన్ని: ‘షావుకారు’ జానకి లేడీ ఓరియంటేడ్ సినిమాలైన ‘గుడ్‌లక్ సఖీ’, ‘పెగ్విన్’, ‘చిన్ని’లు డిజాస్టర్‌గా నిలిచాయి. ఇక తాజాగా ఆమె ‘సర్కారు వారి పాట’ మూవీతో అలరించింది. ఇందులో మహేశ్ బబు సరసన నటించిన కీర్తి ఈ మూవీ సక్సెస్ సందర్భంగా మీడియాతో ముచ్చటించింది. ఈ సందర్భంగా ఆమెకు చెల్లెలి పాత్రలు చేయడానికి కారణం ఏంటనే ప్రశ్న ఎదురైంది. దీనిపై కీర్తి స్పందిస్తూ.. ‘మంచి పాత్రలను వదులుకోవడం ఇష్టం లేదు. ప్రస్తుతం ఉన్నట్లు భవిష్యత్తు ఉండదు. భవిష్యత్తులో మళ్లీ ఇలాంటి పాత్రలు వస్తాయే రావో చెప్పలేం. చదవండి: Siri-Shrihan: సిరిని అర్థం చేసుకోవడం కష్టం, తనకు ఎవరూ సాయం చేయలేదు అందుకే నా దగ్గరికి వచ్చిన బెస్ట్ రోల్స్ అన్నింటికి ఒకే చెబుతున్న. ఇక రజనీకాంత్ లాంటి సూపర్ స్టార్ పక్కన చాన్స్ రావడం చాలా కష్టం. అలాంటి అవకావం వస్తే వదులుకోవద్దు. అందుకే అన్నాత్తైలో(తెలుగులో పెద్దన్న) ఆయన చెల్లెలిగా నటించాను. అలాగే చిరంజీవి లాంటి స్టార్ హీరోతో కూడా కలిసి నటించే అవకాశం రాదు. అందుకే భోళా శంకర్‌లో ఆయనకు చెల్లిగా చేసేందుకు ఒప్పుకున్నా’ అంటూ చెప్పుకొచ్చింది. అయితే పాత్రకు ఉన్న ఇంపార్టెన్స్ బట్టి కూడా తాను ఈ రోల్స్ చేస్తున్నట్టు ఆమె తెలిపింది. కాగా సర్కారు వారి పాటలో కళావతిగా కీర్తి మాస్‌గా, గ్లామరస్ కనిపించి ప్రేక్షకులను మెప్పించింది. తన నటనకు ప్రశంసలు అందుకుంటోంది. -
‘సర్కారు వారి పాట’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..
Sarkaru Vaari Paata First Day Collection: సూపర్ స్టార్ మహేశ్‌బాబు మోస్ట్ అవెటెడ్ మూవీ సర్కారు వారి పాట గురువారం(మే 12) విడుదలై పాజిటివ్ టాక్‌తో దూసుకెళ్తోంది. మార్నింగ్ షో నుంచే పాజిటివ్ టాక్ రావడంతో ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పడుతున్నారు. నిన్న దాదాపు అన్ని చోట్ల హౌస్‌ఫుల్ బోర్డులు దర్శనమిచ్చాయి. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత మహేశ్ నుంచి వచ్చిన సినిమా ఇది. (చదవండి: ‘సర్కారు వారి పాట’ రివ్యూ) తెరపై సూపర్ స్టార్ చాలా స్టైలీష్‌గా కనిపించడం.. కామెడీ, యాక్షన్‌తో పాటు అదిరిపోయే స్టెప్పులేయడంతో ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ‘సర్కారు వారి పాట’కి ఫిదా అయ్యారు. దీంతో తొలిరోజు బాక్సాఫీస్ వద్ద ఈ చిత్రం భారీ వసూళ్లను రాబట్టింది. తెలుగు రాష్ట్రాల్లో తొలి రోజు దాదాపు రూ. 36.63 కోట్ల కలెక్షన్స్ రాబట్టి.. మహేశ్ బాబు సత్తా ఏంటో మరోసారి గుర్తు చేసింది. ప్రపంచ వ్యాప్తంగా ఈ చిత్రం రూ.75 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. సర్కారు వారి పాట ఫస్ట్ డే కలెక్షన్స్ వివరాలు ► నైజాం - రూ. 12.24 కోట్లు ► సీడెడ్ - రూ. 4.7 కోట్లు ► ఈస్ట్ - రూ. 3.25 కోట్లు ► వెస్ట్ - రూ. 2.74 కోట్లు ► ఉత్తరాంధ్ర - రూ. 3.73 కోట్లు ► గుంటూరు- రూ. 5.83 కోట్లు ► కృష్ణా - రూ. 2.58 కోట్లు ► నెల్లూరు - రూ. 1.56 కోట్లు ► మొత్తం రూ.36.69 కోట్లు #SVP AP/TG Share 36.63Cr ALL TIME RECORD for Regional Film🤘💥#BlockbusterSVP #SarkaruVaariPaata https://t.co/QyE7gPFZIp — SarkaruVaariPaata (@SVPTheFilm) May 13, 2022 -
‘సర్కారు వారి పాట’పై అమెరికా ఆడియన్స్ రివ్యూ
సూపర్ స్టార్ మహేశ్‌బాబు మోస్ట్ అవెటెడ్ మూవీ ‘సర్కారు వారి పాట’ ఎట్టకేలకు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడిన ఈ చిత్రం.. మే 12న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత తమ అభిమాన హీరో నుంచి సినిమా రావడంతో మహేశ్ ఫ్యాన్స్ థియేటర్స్ వద్ద సంబరాలు చేసుకుంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు అమెరికాలో కూడా ఈ సినిమాను భారీ స్థాయిలో విడుదల చేశారు. దీంతో అక్కడ కూడా పలు థియేటర్స్‌లో ఫ్యాన్స్ సందడి చేశారు. సినిమా చూసిన అనంతరం తమ అభిప్రాయాన్ని ‘సాక్షి’తో పంచుకున్నారు. ఆ విశేషాలు మీకోసం.. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
‘సర్కారు వారి పాట’మూవీ ట్విటర్ రివ్యూ
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా, ‘గీత గోవిందం’ఫేమ్ పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారు వారి పాట’. కరోనా కారణంగా పలు మార్లు వాయిదా పడిన ఈ చిత్రం ఎట్టకేలకు నేడు(మే 12) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్‌తో సినిమా ఏ రేంజ్లో ఉండబోతుందో హింట్ ఇచ్చాడు పరశురాం. ఇక కళావతి, పెన్నీ.. మ..మ..మహేశ్ పాటలు ఎంత సూపర్ హిట్ అయ్యాయో తెలిసిందే. భారీ అంచనాల మధ్య నేడు ఈ చిత్రం థియేటర్లలో విడుదలైంది. ఇప్పటికే ఓవర్సీస్తో పాటు పలు చోట్ల బొమ్మ పడిపోయింది. దీంతో ఈ సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తన అభిప్రాయాన్ని తెలియజేస్తున్నారు. ‘సర్కారు వారి పాట’ కథేంటి? ఎలా ఉంది? తదితర విషయాలను ట్విటర్ వేదికగా చర్చిస్తున్నారు. అవేంటో చూడండి.అయితే, ఇది కేవలం ప్రేక్షకుడి అభిప్రాయం మాత్రమే. అందులో వారు పేర్కొన్న అంశాలకు ‘సాక్షి’ బాధ్యత వహించదు. Mahesh carries this movie from start to finish and definitely his best performance in recent times especially the comedy portions👍 Thaman’s BGM was only effective in a few places and thought it could’ve been in some portions especially in the first half and fights #SVP — Venky Reviews (@venkyreviews) May 11, 2022 మహేశ్ కెరీర్లో ఇది బెస్ట్ మూవీ. ముఖ్యంగా కామెడీ పోర్షన్స్‌లో ఆయన బెస్ట్ ఫెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. తమన్ నేపథ్య సంగీతం కొన్ని చోట్ల మెప్పించింది. ఫస్టాఫ్‌తో పాటు కొన్ని ఫైట్స్ సీన్స్‌కి తమన్ బీజీఎం అంతగా వర్కౌట్ కాలేదు అని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. 1st half🔔 :Good 👍 Mahesh Anna in Never before Style 🔥🔥🔥🥵🥵🤙🤙 One man show SSMB Chennai babu Adda 💥💫#SarkaruVaariPaata https://t.co/k28xtDVumd pic.twitter.com/K6OoEKylp1 — ShoLaY🎱 (@sholay9_9) May 12, 2022 ఫస్టాఫ్ గుడ్. మహేశ్ అన్న సరికొత్త లుక్‌లో అదరగొట్టేశాడు. వన్‌మ్యాన్ షో అంటూ ఓ నెటిజన్ తన రివ్యూని పోస్ట్ చేశాడు Mahesh Anna intro ayithe next level with @MusicThaman's music 🙌🙌 Idhi kada kavalsindhi.... Deenikosame andharu Mahesh fans waiting On Screen Penny song visuals 🔥🔥🔥🔥🔥🔥 @urstrulyMahesh Anna next level swag#MaheshBabu𓃵 #SVPCelebrations#SarkaruVaariPaata #SVPMania #SVP — Madhukar Doppalapudi (@urdhfm) May 12, 2022 మహేశ్ అన్న ఎంట్రీని అయితే తమన్ తనదైన బీజీఎంతో నెక్ట్స్ లెవల్ తీసుకెళ్లాడు. ఇదికదా కావాల్సింది. దీసికోసమే మహేశ్ ఫ్యాన్స్ ఎదురు చూశారు. పెన్నీ సాంగ్ విజువల్స్ అదిరిపోయాయి’అని మరో నెటిజన్ కామెంట్ చేశాడు. #SarkaruVaariPaata What a come back to see the @urstrulyMahesh in big screen. The energy and vibe he carries throughout is amazing. Romance and comedy timing is wow till interval right mix of action, romance and comedy 🤩😍❤️🥰💐👏🙌 — Madhusudhanan Varadarajulu (@Madhusu76425277) May 12, 2022 #SarkaruVaariPaata 1st half Routine Rotta...@/petla 💦 Deeniki pokiri range elevations entraa baabu 🤮leaves zero excitement for 2nd half — Nandha (@Nandha95807957) May 11, 2022 #SarkaruVaariPaata Entertaining First Half Two Action Blocks 🔥🔥🔥 Two Songs 👌👌👌 Mahesh Babu Perfect Treat for Fans Blockbuster Loading 💪😎 — Madhav Singh 💙 (@Send4Madhav) May 12, 2022 Okka Expression ledhu Oka proper Plot ledhu Konni konni saarlu idi comedy na Anipinchindi ra thu worst lo worst 1.5 /5 Disaster . Disappointed.#SarkaruVaariPaata — V$K (@RtsChestunta) May 12, 2022 #SarkaruVaariPaata Final Report : NON RRR INDUSTRY HIT. 👉Rating : 3.75/5 ⭐️ ⭐️ ⭐️ ⭐️ 👉BOXOFFICE WILL BLAST 🔥 🌊 👉#MaheshBabu Performance 👉Interval Block 👉Blockbuster First Half & Second Half 👉Mass Fights & #MaMaMahesha Song#SarkaaruVaariPaata #SVP — M@h€$h V@m$i (@maheshvamsi9) May 12, 2022 #SarkaruVaariPaata ...first half average..@KeerthyOfficial scenes and love track is nice...👌@urstrulyMahesh comedy timing..😂👌 — M@HaR$Hi (@MaharshiGollap1) May 12, 2022 #SarkaruVaariPaata 1st off 🔥 2 fights 💣 2 song's 🔥 Comdey 😊 Love 😘 Next level 💥#BlockBusterSarkaruVaaripaata — VEMULA MB 🔔 (@maheshbabu_jr) May 12, 2022 Superb first half @urstrulyMahesh screen presence outstanding, pre- interval 20 minutes 👏👏👌👌 SSMB comedy timing and charm this film 🙏🙏 #SarkaruVaariPaata — Raghava (@Raghava4mahesh) May 12, 2022 #SarkaruVaariPaata Entertaining First Half Two Action Blocks 🔥🔥🔥 Two Songs 👌👌👌 Mahesh Babu Perfect Treat for Fans Blockbuster Loading 💪 — 𝐕𝐚𝐦𝐬𝐢𝐒𝐡𝐞𝐤𝐚𝐫 (@UrsVamsiShekar) May 12, 2022 #SarkaruVaariPaata First half is very good Mahesh babu 👌👌👌👌 Scenes with keerthy suresh in first half and second half are 👌👌👌👌👌👌 Villan role and performance is biggest minus for the movie — Mithun Y (@mithun_y11) May 12, 2022 -
Keerthi Suresh: నా దృష్టిలో ఆ రెండూ కష్టం!
కీర్తీ సురేష్ అంటే సంప్రదాయబద్ధమైన పాత్రలకు చిరునామా అన్నట్లు ఉంటారు. కానీ ఆర్టిస్ట్ అంటే అన్ని రకాల పాత్రలు చేయాలన్నది కీర్తి అభిప్రాయం. అందుకే ‘సర్కారువారి పాట’లో కళావతి పాత్ర అంగీకరించారు. ‘‘ఇప్పటివరకూ తెలుగు తెరపై కనిపించనంత గ్లామరస్‌గా, మాస్‌గా ఈ సినిమాలో కనిపిస్తా’’ అంటున్నారు కీర్తి. పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట ఈ చిత్రాన్ని నిర్మించారు. నేడు ఈ సినిమా విడుదల సందర్భంగా కీర్తీ సురేష్ చెప్పిన విశేషాలు. ► ‘గుడ్ లక్ సఖి’, తమిళ చిత్రం ‘సాని కాయిదమ్’ (తెలుగులో ‘చిన్ని’), మధ్యలో ‘పెద్దన్న’లో రజనీకాంత్ చెల్లెలి పాత్ర. వీటికి భిన్నంగా ‘సర్కారువారి పాట’లో కనిపించడం గురించి? ‘సర్కారువారి పాట’లో మాస్‌గా, గ్లామరస్‌గా కనిపిస్తాను. కాస్ట్యూమ్స్ డిఫరెంట్‌గా ఉంటాయి. హెయిర్ స్టయిల్ కూడా భిన్నంగా ఉంటుంది. మేకప్ కొత్తగా ఉంటుంది. ఈ తేడా నాకు చాలా నచ్చింది. నాది సరదా పాత్ర. ఇప్పటివరకూ తెలుగులో చేసిన పాత్రలన్నింటికన్నా భిన్నంగా ఉంటుంది. ► అందుకేనేమో ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుకలో ‘కళావతి..’ (‘సర్కారువారి పాట’లో కీర్తి పాత్ర) నాకు మంచి గిఫ్ట్ అన్నారు. అవును. రేపు సినిమా చూశాక నాకు ఈ పాత్ర మంచి బహుమతి అని ప్రేక్షకులకు కూడా అర్థం అవుతుంది. తమిళంలో చేశాను కానీ తెలుగులో ఇప్పటివరకూ ఇలాంటి మాస్ క్యారెక్టర్ చేయలేదు. ► మరి.. ‘మహానటి’ లాంటి భారీ పాత్ర చేసిన మీకు ‘కళావతి’లాంటి మాస్ క్యారెక్టర్ చేయడం ఈజీ అయ్యుంటుందనుకోవచ్చా? లేదు. కళావతి కూడా చాలెంజింగ్ రోలే. ఈ పాత్రలో ఫన్ ఉంది. నా దృష్టిలో ఏడిపించడం, నవ్వించడం చాలా కష్టం. ఈ రెండూ పెద్ద సవాల్. పైగా డైలాగ్ డెలివరీ డిఫరెంట్‌గా ఉంటుంది. పరశురాంగారి హెల్ప్‌తో డబ్బింగ్ చెప్పాను. ఏ పాత్ర సవాల్ దానికి ఉంటుంది. ‘మహానటి’ సవాల్ ‘మహానటి’ది.. కళావతి సవాల్ కళావతిది. అంతే.. ► ‘లవ్ ట్రాక్’ కోసమే ప్రేక్షకులు మళ్లీ మళ్లీ ఈ సినిమా చూస్తారని మహేశ్‌బాబు అన్నారు... సినిమాలో మా ఇద్దరి కెమిస్ట్రీ బాగా కుదిరింది. కథతో పాటు ఈ ట్రాక్ ఉంటుంది. ఇలా లవ్ ట్రాక్ చేయడం నాకు ఫ్రెష్‌గా అనిపించింది. ► ఈ మధ్యే ‘చిన్ని’లో డీ గ్లామరస్‌గా కనిపించి, వారం తిరిగే సరికల్లా గ్లామరస్‌గా కనిపించడం గురించి.. ‘చిన్ని’లో సాదా సీదా బట్టలు, చింపిరి జుట్టుతో, చెవికి పోగులు కూడా లేకుండా కనిపిస్తాను. ఆ సినిమా విడుదలై వారం అయింది. వెంటనే ‘సర్కారువారి పాట’లో ఆ పాత్రకు భిన్నంగా గ్లామరస్‌గా కనిపించనున్నాను. ఇలా వెంట వెంటనే రెండు పూర్తి భిన్నమైన పాత్రల్లో కనిపించడం అనేది పెద్ద సవాల్. ఇలాంటి చాలెంజ్‌లు నాకిష్టం. ► తమిళంలో మాస్ సాంగ్స్‌కి డాన్స్ చేశారు.. ఇప్పుడు ‘మ..మ.. మహేశా..’ పాటకు మాస్ స్టెప్స్ వేయడం ఎలా అనిపించింది? ఈ పాట చాలా ఇష్టపడి చేశాను. ‘మ..మ.. మహేశా..’ ఫ్యాన్స్‌కి పర్ఫెక్ట్ సాంగ్. థియేటర్ అదిరిపోతుంది. సీట్లలోంచి లేచి మరీ ఫ్యాన్స్ డాన్స్ చేస్తారనుకుంటున్నాను. ఇలాంటి మాస్ సాంగ్స్ తమిళ్లో చేశాను. తెలుగులో ఇదే ఫస్ట్ టైమ్. ► ‘మహానటి’తో అందరూ మిమ్మల్ని మహానటి అన్నారు. ‘సర్కారు వారి..’తో మాస్ హీరోయిన్ అంటారా? ఏమో.. నిజానికి ‘మహానటి’కి చాన్స్ వచ్చినప్పుడు నేనలాంటి సినిమా చేయగలనని అనుకోలేదు... చేసేశా. ఇప్పుడు ‘సర్కారువారి..’లో మంచి మాస్ పాత్ర చేశాను. ఒక ఆర్టిస్ట్‌గా ఏ క్యారెక్టర్ వచ్చినా చేయాలి. అప్పుడే పరిపూర్ణత ఉంటుంది. ► ‘పెద్దన్న’లో రజనీకాంత్ చెల్లెలిగా, ఇప్పుడు ‘బోళా శంకర్’లో చిరంజీవి చెల్లెలిగా చేశారు. చెల్లెలి పాత్రలు చేస్తే అలాంటివే వస్తాయేమో అనే టెన్షన్ లేదా? అలా ఆలోచించలేదు. భవిష్యత్‌లో ఎలాంటి పాత్రలు వస్తాయో ఆలోచించి ఇప్పుడు వచ్చిన మంచి పాత్రలు వదులుకోవడం సరి కాదనిపించింది. పైగా రజనీ సార్‌తో చాన్స్ దొరకడం కష్టం. అలాగే చిరంజీవి సార్‌తో. ఈ పాత్రలను ఇష్టపడి చేశాను. -
సీఎం జగన్ చాలా సింపుల్.. ఎదుటి వాళ్లకు మంచి గౌరవం ఇస్తారు: మహేశ్ బాబు
‘ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎప్ జగన్మోహన్రెడ్డి గారిని నేరుగా కలిసినప్పుడు సర్ప్రైజింగ్గా అనిపించింది. ఆయనతో అప్పుడప్పుడు ఫోన్లో మాట్లాడాను అంతేకానీ నేరుగా కలవలేదు. కానీ ఆ మధ్య కలవడం చాలా హ్యాపీగా అనిపించింది. ఆయన చాలా సింపుల్. అంత సింపుల్‌గా ఉంటారా? అని నేరుగా కలిసినప్పుడు అనిపించింది. ఎదుటి వ్యక్తులకు మంచి గౌరవం ఇస్తారు. ఆయనతో చాలా విషయాలను చర్చించాం. సినిమాల గురించి చాలా విషయాలు అడిగి తెలుసుకున్నారు. బయట ఏం జరుగుతుంది? పరిస్థితులు ఎలా ఉన్నాయి అనే విషయాలు అడిగారు. ఇలాంటి మీటింగ్స్ మరికొన్ని జరిగితే బాగుంటుందని నేను అన్నాను. అందుకు ఆయన సానుకూలంగా స్పందించారు. ఆయన మమ్మల్ని రిసీవ్ చేసుకున్న విధానం నాకు బాగా నచ్చింది. ఆయనతో గడిపిన సమయం గుర్తుండిపోతుంది’ అని సూపర్‌స్టార్ మహేశ్ బాబు అన్నారు. మహేశ్ బాబు హీరోగా నటించిన తాజా చిత్రం 'సర్కారు వారి పాట'. మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రంలో కీర్తిసురేశ్ హీరోయిన్గా నటించింది. మే 12న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సందర్భంగా మంగళవారం (మే 10) హీరో మహేశ్ బాబు మీడయాతో ముచ్చటించారు. ఆ విశేషాలు. ► సర్కారు వారి పాట షూటింగ్ జర్నీ చాలా కష్టమైనది. లాక్డౌన్ వల్ల షూటింగ్ ఆగిపోవడం.. మళ్లీ మొదలు పెట్టడం..ఇలా ఇబ్బందులు ఎదురయ్యాయి. మా టీమ్ అందరికి థ్యాంక్స్ చెప్పాలి. సర్కారు వారి పాట ఫుల్ క్రెడిట్ పరశురామ్ గారికే దక్కుతుంది. ఎందుకంటే.. దీంట్లో హీరో క్యారెక్టరైజేషన్ చాలా కొత్తగా చేశారు. చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. కొన్ని సీన్స్‌లో అయితే పోకిరి రోజులు గుర్తుకు వచ్చాయి. ఆ డైలాగ్ డెలివరీ కానీ, బాండీ లాంగ్వేజీలోకానీ.. నిజంగా చాలా ఎంజాయ్ చేస్తూ ఈ సినిమా చేశాను. ట్రైలర్ అమెజింగ్. సినిమా కూడా అలానే ఉండబోతుంది. ► నా ప్రతి సినిమా పోకిరితో పోల్చలేదు. కానీ ఈ సినిమాలో నా ఫెర్ఫార్మెన్స్ ఆ సినిమాలో మాదిరి ఉంటుంది. పోకిరిలో ఉన్న మాస్ క్యారెక్టర్ ఇందులో ఉంది. పోకిరి స్టేజ్‌లో ఉన్న క్యారెక్టరైజేషన్ దొరికిందని హ్యాపీగా ఉంది. ఆ కారణంగానే పోకిరితో ఈ సినిమాను పోల్చాను. ► పరశురాం గొప్ప రచయిత కూడా. ఒక రచయిత దర్శకుడు అయితే మంచి ఔట్పుట్ వస్తుందని నేను నమ్ముతాను. దాదాపు నా దర్శకులందరూ రచయితలే. అందుకే మంచి సినిమాలొచ్చాయి. ► సర్కారు వారి పాట కథ ఫస్టాఫ్‌లో యూఎస్‌లో మొదలై సెకండాఫ్‌లో వైజాగ్‌కి వస్తుంది. ► మ..మ..మహేశా పాట స్థానంలో మొదటగా వేరే సాంగ్ అనుకున్నాం. షూటింగ్ కూడా పూర్తి చేశాం. కానీ డైరెక్టర్ గారితో పాటు మిగతా వాళ్లు సినిమా ఫ్లో చూసి.. ఒక మాస్ సాంగ్ ఉంటే బాగుంటుందని నిర్ణయించుకున్నారు. అప్పుడు తమన్ మ..మ..మహేశా ట్యూన్ తీసుకొచ్చాడు. ఇలాంటి మాస్ సాంగ్ నా కెరీర్లోనే ఇంతవరకు చేయలేదు. ► మురారి పాట ఈ సినిమాలో ఉండదు. దాని స్థానంలో మాస్ సాంగ్ ఉంటుంది. మురారి పాటను యూట్యూబ్‌లో విడుదల చేస్తాం. ► లాక్డౌన్ కారణంగా కథలో ఎలాంటి మార్పులు చేయలేదు. మొదట్లో అనుకున్న స్క్రిప్ట్‌నే ఫాలో అయ్యాం. ► మెడపై రూపాయి టాటూ క్రెడిట్ కూడా పరశురాం గారిదే. టైటిల్ అనౌన్స్మెంట్, పోస్టర్ రిలీజ్ టైమ్‌కి నా హెయిర్ పోస్టర్లో ఉన్నంత పెరగలేదు. పరశురామ్ గారే టాటూ వేయించి ఉన్న పోస్టర్ డిజైన్ చూపించి మీ పాత్ర ఇలా ఉంటుందన్నారు. ► నా గత మూడు నాలుగు సినిమాల్లో సమాజానికి మంచి మెసేజ్ ఇచ్చే ప్రయత్నం చేశాం. ఆడియన్స్ కూడా అదే ఫీల్ అయ్యారు. ఫస్ట్‌టైం మహేశ్‌ని ఇంత ఫ్రీగా చూపించారా అని సర్కారు వారి పాట సినిమా చూశాక అంతా అనుకుంటారు. అందరూ ఈ సినిమాను ఎంజాయ్ చేస్తారు. ► సర్కారు వారి పాట సినిమాను తెలుగు మూవీగానే తీద్దాం అనుకున్నాం. పాన్ ఇండియా మూవీగా చేద్దామని అనుకోలేదు. ► ఈ రెండేళ్లలో చాలా జరిగాయి. నాకు బాగా దగ్గరైనవాళ్లు దూరమయ్యారు. అందుకే ప్రీరిలీజ్ ఈవెంట్లో కాస్త ఎమోషనల్ అయ్యాను. ► కథలో నుంచి వచ్చిన టైటిల్ సర్కారువారి పాట. టైటిల్ ముందే లీక్ అయిపోయింది. అందరికి తెలిశాక నాకు వచ్చి చెప్పారు. వినగానే బాగా నచ్చేసింది.వెంటనే ఓకే చెప్పేశాను. ► బాలీవుడ్ సినిమాలు చేయనని నేను అనలేదు. నేను ఎప్పుడు తెలుగు సినిమాలే చేస్తానని చెప్పాను. మన తెలుగు సినిమాలు బాలీవుడ్‌కి రీచ్ అవ్వాలనేదే నా కోరిక. నేను పదేళ్ల నుంచి అనుకున్నది ఇప్పుడు నెరవేరుతుంది. మన తెలుగు సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో ఆడుతున్నాయి. చాలా హ్యాపీగా ఉంది. మన ఇండస్ట్రీని వదిలేసి అక్కడికి ఎందుకు వెళ్లాలి అనేదే నా ఫీలింగ్. ► రాజమౌళితో చేయబోయే సినిమా పాన్ ఇండియా స్థాయిలో చేస్తాను. ► ఈ సినిమాలో కీర్తి సురేశ్ క్యారెక్టర్ చాలా సర్ప్రైజింగ్గా ఉంటుంది. లవ్‌ట్రాక్ మాత్రం ఈ సినిమాకే హైలెట్. కీర్తి సురేశ్ చాలా బాగా నటించింది. ► తమన్ ఈ సినిమాకు ప్రాణం పెట్టేశాడు. మ్యూజిక్ సెన్సేషన్ అతనిప్పుడు. అతను ఏ మ్యూజిక్ ఇచ్చిన యూత్‌కి బాగా కనెక్ట్ అవుతుంది. కళావతి పాట ఎంత సూపర్ హిట్ అయిందో అందరికి తెలిసిందే. తమన్ ఫస్ట్ ఈ ట్యూన్ ఇచ్చినప్పుడు మా అందరికి నచ్చలేదు. స్లోగా ఉంది, మెలోడీ అని నా ఫీలింగ్.. మహేశ్ లాంటి మీరో కమ కమాన్ కళావతి అని పాడోచ్చా అని దర్శకుడి ఫీలింగ్. కానీ తమన్ మాత్రం నా మాట విననండి. ఇది మహేశ్‌బాబు కెరీర్లో ఒక బెస్ట్ సాంగ్ అవుతుంది అని చెప్పాడు. పాట విడుదల తమన్ చెప్పిందే నిజమైంది. ఇప్పుడు ఇదే నా ఫెవరేట్ సాంగ్. ► రాజమౌళితో సినిమా చేయడం లాంగ్ ప్రాసెస్. కానీ అతనితో ఒక్క సినిమా చేస్తే..పాతిక సినిమాలు చేసినట్లే. ► నాకు ఉన్న ఎక్స్పీరియన్స్ ప్రకారం చెబుతున్న ఈ సినిమాకు రిపీట్ ఆడియన్స్ వస్తారు. ► రామ్ లక్ష్మణ్‌లు నా ఫెవరేట్ ఫైట్ మాస్టర్స్ . వాళ్లు ఎప్పుడు కథనే ఫాలో అవుతారు. ప్రతి సినిమాలో కొత్త స్టైల్ ఉంటుంద. తమ చుట్టూ ఉన్నవాళ్లని జాగ్రత్తగా చూసుకుంటారు. అందుకే వాళ్లంటే నాకు ఇష్టం. ► ఈ సినిమాలో సముద్రఖని చాలా బాగా నటించారు. మొదట ఈ పాత్రలో దర్శకుడు చాలా పెద్ద పెద్ద నటుల పేర్లను చెప్పాడు. రెండు మూడు షెడ్యూల తర్వాత సముద్ర ఖనిని ఫైనల్ చేశాం. చాలా కొత్తగా ఉంటది ఆయన పాత్ర. సముద్ర ఖని అదగొట్టేశారు. సినిమా షూటింగ్ అయ్యాక.. గుర్తుగా నా కళ్ల జోడు ఇవ్వమని అడిగారు. ఆయన ఫెర్మార్మెన్స్ చూశాక.. ఒక కళ్ల జోడు ఏంటి.. ఒక కళ్ల జోడు కొట్టునే ఇవ్వాలనిపించింది. ► ‘నేను విన్నాను..నేను ఉన్నాను’ అనే డైలాగ్‌ని సినిమా చూశాక చాలా ఎంజాయ్ చేస్తారు. ► నాన్నగారి బయోపిక్ చేయాలనే ఆలోచననే లేదు. ఇంతవరకు నాన్నగారి బయోపిక్ కోసం ఎవరు నన్ను అప్రోచ్ కాలేదు. -
‘సర్కారు వారి పాట’కు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్
సాక్షి, హైదరాబాద్: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘సర్కారు వారి పాట’సినిమా టికెట్ రేట్లు పెంచుకునేందుకు అనుమతిస్తూ రాష్ట్ర హోంశాఖ సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈనెల 12వ తేదీ నుంచి 18వరకు ఈ పెంపు వర్తిస్తుందని హోంశాఖ ముఖ్య కార్యదర్శి రవిగుప్తా స్పష్టం చేశారు. (చదవండి: సితార చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది : మహేశ్ బాబు) అదేవిధంగా ఈ ఏడు రోజులు రోజూ ఐదు షోలు నడిపేందుకు వెసులుబాటు కల్పించినట్టు తెలిపారు. టికెట్ రేట్ల విషయానికొస్తే మల్టిప్లెక్స్, రిక్లైనర్, లార్జ్ స్క్రీన్ ఐమ్యాక్స్ వంటి థియేటర్లలో టికెట్‌పై రూ.50, సాధారణ ఏసీ థియేటర్లలో రూ.30 పెంచుకునేందుకు అనుమతించినట్టు తెలిపారు. మిగిలిన నాన్ ఏసీ థియేటర్లలో ఎలాంటి పెంపు ఉండదని స్పష్టం చేశారు. -
Mahesh Babu: రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. రాసి పెట్టుకోండి
‘‘సర్కారువారి పాట’లో నా పాత్రని ఎక్స్ట్రార్డినరీగా తీర్చిదిద్దిన పరశురాంగారికి థ్యాంక్స్.. నాకు ఇష్టమైన పాత్రల్లో ఇదొకటి. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి’’ అని మహేశ్‌బాబు అన్నారు. పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వ హించిన ప్రీ రిలీజ్ వేడు కలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘పరశురాంగారి కథ విని ఓకే చెప్పాను. ఆయన ఇంటికెళ్లిన తర్వాత.. ‘‘థ్యాంక్యూ సార్.. ‘ఒక్కడు’ చూసి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను.. మీతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.. చూడండి ‘సర్కారు వారి పాట’ని ఎలా తీస్తానో.. ఇరగదీస్తాను’’ అని మెసేజ్ పెట్టారు. ‘థ్యాంక్యూ సార్. ఈరోజు మా నాన్నగారు (కృష్ణ), నా అభిమానులకు మీరు వన్నాఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్స్. ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉంటాయి. వాటిలో హీరో హీరోయిన్ ట్రాక్ ఒకటి. ఈ ట్రాక్ కోసమే రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. కచ్చితంగా.. రాసిపెట్టుకోండి. తమన్ నేపథ్య సంగీతానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. ‘సర్కారువారి పాట’ సినిమా ‘పోకిరి’ని దాటుతుందని ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్‌గారు అనేవారు. ‘శ్రీమంతుడు’ సినిమాని ఎంత బాగా తీశారో ఈ సినిమాని అంతకంటే బాగా తీసిన కెమెరామేన్ మదిగారికి థ్యాంక్స్. ‘శ్రీమంతుడు, దూకుడు’ లాంటి బ్లాక్బ్లస్టర్స్ ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్.. మన కాంబినేషన్లో ‘సర్కారువారి పాట’ ఇంకో మరచిపోలేని బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాత జి. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘సర్కారువారి పాట’ పాటలు విడుదల కాగానే మూవీకి గుడ్ ఫీల్ వచ్చింది. ఏ సినిమా అయినా సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఫీల్ బాగుండాలి. రిలీజ్‌కి ముందే బాక్సాఫీస్ హిట్ అని ముద్ర వేసుకుంటున్న సినిమా ఇది’’ అన్నారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్‌లో మహేశ్‌గారు ‘శ్రీమంతుడు’ చేశారు. అప్పుటికి మాకు అనుభవం లేకపోయినా మమ్మల్ని నమ్మి, సినిమా చేసి బ్లాక్‌బస్టర్ ఇచ్చి మాకు ఇండస్ట్రీలోకి పాజిటివ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమా మాతో చేసిన పరశురాంకి థ్యాంక్స్. మే 12న మా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతోంది’’ అన్నారు. మనం సూపర్‌స్టార్‌ని (మహేశ్‌బాబు) ఎలా చూద్దామనుకుంటున్నామో పరశురాంగారు ఆ పాత్రని అలాగే డిజైన్ చేశారు. మే 12న మాకు డబుల్ బ్లాక్ బస్టర్’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘నాకొక బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నారు మహేశ్‌గారు. ఈ సినిమాతో మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు పరశురాం. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘మ మ మహేశ..’ పాట చూశా. ఈ పాట థియేటర్లో దద్దరిల్లిపోతుందని మాట ఇస్తున్నా. పరశురాం అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు.. తన డైలాగ్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడున్న బెస్ట్ మాటల రచయితల్లో తను ఒక్కడు. ‘గీత గోవిందం’ చూస్తే అంత సెన్సిటివ్‌గా చెప్పే ఆర్ట్ ఉంది. అలాంటి డైరెక్టర్ ఒక మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘సర్కారువారి పాట’లో చూస్తారు. ‘1 నేనొక్కడినే’ అప్పుడు మహేశ్‌గారు ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు తెలుసు. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ సెట్లో కింగ్‌లా ఉంటాడు. డైరెక్టర్స్‌కి అంత నమ్మకాన్ని ఇస్తారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారికి బెస్ట్ మెలోడీ పాటలు ఇచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించాను. ఫస్ట్ టైమ్ క్లాసికల్‌గా ‘కళావతి..’ పాట వినిపించినప్పుడు నాకు వందకు రెండొందల మార్కులు వేశారు’’ అన్నారు. మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ, డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, మెహర్ రమేశ్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రెండేళ్లల్లో చాలా జరిగాయి.. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు (చెమర్చిన కళ్లతో).. కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి. ఈ 12న మీ అందరికీ నచ్చే సినిమా (సర్కారువారి పాట) రాబోతోంది.. మళ్లీ మనందరికీ పండగే. – మహేశ్‌బాబు -
గ్రాండ్‌గా ‘సర్కారు వారి పాట’ ప్రీ-రిలీజ్ ఈవెంట్
Sarkaru Vaari Paata Grant Pre Release Event: సూపర్ స్టార్ మహేశ్‌బాబు నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం మే 12న విడుదల కానుంది. ఈ నేపథ్యంలో మూవీ ప్రమోషన్స్ వేగవంతం చేసిన చిత్ర బృందం ఈ రోజు గ్రాండ్ ప్రి-రిలీజ్ ఈవెంట్‌ను జరుపుకోనుంది. శనివారం(మే 7) సాయంత్రం 6 గంటలకు యూసుఫ్ గూడ 1వ టీఎస్ఎస్పీ బెటాలియన్ గ్రౌండ్లో ఈ వేడుకను నిర్వహించారు. చదవండి: సర్కారువారి పాట: మ.. మ.. మహేశా సాంగ్ విన్నారా? మైత్రి మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్మెంట్స్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ సినిమాకు థమన్ సంగీతం అందిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా నటించింది. ఇదిలా ఉంటే ఇప్పటికే ఈమూవీ నుంచి విడుదలైన పోస్టర్స్, టీజర్, ట్రైలర్, పాటలు ఈ మూవీ మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇందులోని కళావతి సాంగ్, ఎవ్రీ పెన్నీ సాంగ్‌లు అయితే రికార్డు స్థాయిలో వ్యూస్ రాబట్టి ట్రెండింగ్‌లో నిలిచాయి. దీంతో ఈ మూవీని చూసేందుకు తెలుగు ప్రేక్షకులు, మహేశ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. The Day is Here 💥 Witness the Grand #SVPPreReleaseEvent today evening 🤘 Watch Live here - https://t.co/WvhBKoVltB #SarkaruVaariPaata #SVPMania #SVP pic.twitter.com/y5WaFnbo9G — Mythri Movie Makers (@MythriOfficial) May 7, 2022 -
వైఎస్ఆర్గారిని చూస్తే హీరో ఫీలింగ్
‘‘దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డిగారి అభిమానిని నేను. ఆయన్ని చూస్తే ఒక హీరో అనే అనుభూతి కలుగుతుంది. ఆయన వద్దకు ఏదైనా సమస్యని తీసుకెళితే ‘నేను విన్నాను.. నేను ఉన్నాను’ అంటూ భరోసా ఇచ్చేవారు. ‘సర్కారువారి పాట’లో అలాంటి ఒక సందర్భంలో మహేశ్‌గారు ఆ డైలాగ్ చెబుతున్నప్పుడు చాలా ఎంజాయ్ చేశారు’’ అని పరశురాం అన్నారు. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. ఈ సందర్భంగా చిత్రదర్శకుడు పరశురాం మీడియాతో పంచుకున్న విశేషాలు. ‘గీత గోవిందం’ నిర్మాణంలో ఉన్నప్పుడే ‘సర్కారువారి పాట’ ఐడియా వచ్చింది. ‘గీత గోవిందం’ హిట్ నాకు గొప్ప ఎనర్జీ ఇచ్చింది. పరశురాం అనే దర్శకుడు రూ. 150కోట్ల సినిమా తీయగలడనే నమ్మకాన్ని ఇండస్ట్రీకి ఇవ్వడం సంతోషంగా ఉంది. ఇక ‘గీత గోవిందం’ విడుదలయ్యాక మహేశ్‌గారిని దృష్టిలో పెట్టుకొని స్క్రిప్ట్ వర్క్ చేశాను. ఈ చిత్రంలో బ్యాంక్ టాపిక్ ఉంటుంది కానీ మహేశ్‌గారు బ్యాంక్ ఉద్యోగి కాదు. ఈ సినిమాలో ఒక వ్యక్తి గురించి కానీ, వ్యవస్థని ప్రశ్నించడం కానీ ఉండవు. నా కల తీరింది మహేశ్‌గారితో సినిమా చేయాలనేది నా డ్రీమ్. ‘సర్కారువారి పాట’ ఆయన కోసం రాసిన కథ. దేవుడి దయ వల్ల ఆయనే చేయడంతో నా కల తీరింది. ఈ కథని అల్లు అర్జున్‌గారికి చెప్పలేదు. ‘గీత గోవిందం’ లాంటి హిట్ ఉన్నప్పటికీ నాలాంటి ఒక మీడియమ్ రేంజ్ దర్శకుడికి మహేశ్‌గారు చాన్స్ ఎలా ఇచ్చారనే ప్రశ్న కొందరిలో ఉండొచ్చు. కానీ ఈ సినిమా చూసిన తర్వాత అందరూ హ్యాపీగా ఫీలవుతారు. నేను చెప్పిన కథ నచ్చే మహేశ్‌గారు ‘సర్కారువారి పాట’కి పచ్చజెండా ఉపారు.‘పోకిరి’ ఒక అండర్ కాప్ బిహేవియర్. ‘సర్కారువారి పాట’ ఒక కామన్‌మేన్ బిహేవియర్. ఇందులో మహేశ్‌గారి మ్యానరిజమ్స్, లుక్స్, బాడీ లాంగ్వేజ్, డాన్స్‌లు చూసి ఫ్యాన్స్ సర్ప్రైజ్ అవుతారు. కీర్తి పాత్ర లవ్లీగా ఉంటుంది ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకి కీర్తీ సురేష్ తప్ప మరో ఆలోచన రాలేదు. తనది బలమైన పాత్ర. లవ్లీగా, లైవ్లీగా ఉంటుంది. ఆమె పాత్రకు కూడా మంచి పేరొస్తుంది. సముద్ర ఖని పాత్ర అద్భుతంగా ఉంటుంది. పూరీగారు అభినందించారు మా గురువు పూరి జగన్నాథ్, త్రివిక్రమ్‌గార్ల సినిమాలన్నీ చూస్తాను. అందుకేనేమో డైలాగులు బాగా రాయగలుగుతున్నాను. ‘సర్కారువారి..’ ట్రైలర్ చూసి పూరీగారు అభినందించారు. నెక్ట్స్ నాగచైతన్యతో... ‘పెన్నీ...’ సాంగ్ ప్రమోషన్లో సితార డాన్స్‌కి మంచి స్పందన వచ్చింది. ‘సర్కారువారి పాట’ని పాన్ ఇండియాగా చేయాలనే ఆలోచన నాకు కానీ, మహేశ్‌గారికి కానీ లేదు. ముందు అనుకున్నట్లే చేశాం. అన్ని చోట్లా తెలుగు వెర్షన్ రిలీజ్ అవుతుంది. నా తర్వాతి సినిమా నాగచైతన్య హీరోగా 14 రీల్స్ నిర్మాణంలో ఉంటుంది. -
మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సరికొత్త రికార్డు..
Mahesh Babu Sarkaru Vaari Paata Premiere At 603 Locations: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మరో వారం రోజుల్లో అంటే మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది ఈ మూవీ. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్ 24 గంటల్లో 27 మిలియన్స్‌పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. అలాగే 1.2 మిలియన్స్‌కుపైగా లైక్స్‌తో యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది ఈ మూవీ ప్రచార చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా యూఎస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నడు లేని విధంగా యూఎస్‌లో 603 ప్రాంతాల్లో రిలీజ్ చేయనున్నారట. పాన్ ఇండియా మూవీస్ తప్పితే ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో ఇన్ని ప్రదేశాల్లో విడుదల కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమా ఓవర్సీస్లో భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు. చదవండి: ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్ Super🌟 @urstrulyMahesh sets a new benchmark in TFI ❤️🔥❤️🔥#SVPTrailer is the MOST VIEWED trailer of TFI in 24 hours with 27M+ Views & 1.2M+ Likes! - https://t.co/AMjXMIUh7F@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/DulbFZZssX — Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2022 అయితే అక్కడ మే 11న 'సర్కారు వారి పాట' ప్రీమియర్స్ వేయనున్నారు. ఇప్పటికే యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ నెల 7న భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. -
ఈ మూవీకి కీర్తి పేరును నేనే సిఫార్స్ చేశా, మహేశ్ కాదు: డైరెక్టర్
ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మే 12 ఈ మూవీ థియేటర్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు, హీరోయిన్ వరుసగా ఇంటర్య్వూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న డైరెక్టర్ పరశురామ్ మూవీ విశేషాలతో పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గీత గోవిందం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా సర్కారు వారి పాట కథ రాసుకున్నాననని చెప్పారు. చదవండి: ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. సమన్లు జారీ ‘మహేశ్ బాబు గారి కోసమే ఈ స్క్రిప్ట్ రాశాను. ఒకవేళ ఆయన ఈ కథను రిజెక్ట్ చేస్తే స్క్రిప్ట్ పక్కన పెట్టేయాలని అనుకున్నా. కానీ మహేశ్ బాబు గారికి కథ వివరిస్తున్నంతసేపు ఆయన ఎంజాయ్ చేశారు. అప్పుడే ఆయనకు కథ నచ్చిందని అర్థమైంది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక పూర్తి స్క్రిప్ట్ విన్నాక.. కథ చాలా బాగుందంటూ మహేశ్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారన్నారు. ఆ వెంటనే హీరోయిన్గా ఎవరిని అనుకుంటున్నారని మహేశ్ తనని అడిగారని, అప్పుడే కీర్తి సురేశ్ పేరు చెప్పానన్నారు. చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు అందుకు ఆయన వెంటనే ఒకే అనేశారని చెప్పారు. అయితే కీర్తి సురేశ్‌ను చూసిన దగ్గర నుంచి ఆమెతో సినిమా చేయాలని అనుకున్నానని, అది సర్కారు వారి పాటతో కుదరిందన్నారు. అయితే ఈ సినిమాకు ఆమెను తీసుకోవడం వెనుక పాత్ర పరమైన కారణం ఉండి ఉంటుందనే ఉద్దేశంతో మహేశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. కథ ఒకసారి లాక్ చేసిన తరువాత మహేశ్ గారు ఏ విషయంలోను జోక్యం చేసుకోరని ఆయన వివరించారు. అలా కీర్తి సురేశ్ పేరును ఈ సినిమాకు తానే సిఫార్స్ చేశానని, మహేశ్ కాదని డైరెక్టర్ పరశురామ్ స్పష్టం చేశారు. -
‘సర్కారు వారి పాట’లో మహేశ్ బాబు లుక్ నెక్స్ట్ లెవెల్: ఆర్ట్ డైరెక్టర్
సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురాం ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, జీ ఎం బీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లో నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంటలు నిర్మించారు. ఇటీవల షూటింగ్‌ను పూర్తి చేసుకున్న ఈ మూవీ మే 12 ప్రపంచ వ్యాప్తంగా విడుదలకు రెడీ అవుతోంది. ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో పాటు పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈ నేపథ్యంలో ఈ మూవీకి పనిచేసిన ఆర్ట్ డైరెక్టర్ ఏఎస్ ప్రకాష్ మీడియాతో ముచ్చటించారు. ఈ సందర్బంగా ఆయన పంచుకున్న మూవీ విశేషాలు ఇలా ఉన్నాయి. ⇔ పరుశురాం గారు మొదట కథ చెప్పినపుడు ఇది పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ అనిపించింది. చాలా పెద్ద యాక్షన్, ఎంటర్ టైనర్ అవుతుందని డైరెక్టర్ గారికి అప్పుడే చెప్పా. తర్వాత పని చేయడం మొదలుపెట్టా. ⇔ మహేశ్ బాబు గారితో నాకు ఇది 7వ సినిమా. ఆయన సెట్స్‌లో చాలా సరదాగా ఉంటారు. అదే సమయంలో టెక్నిషియన్ నుంచి అవుట్ పుట్ కూడా అద్భుతంగా రాబట్టుకుంటారు. సాంగ్స్, యాక్షన్ సీక్వెన్స్ కి సంబధించిన అన్నీ విషయాలను చర్చిస్తారు. ఈ సినిమాలో మహేశ్ బాబు లుక్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ఆయన సెట్లో డాన్స్ చేస్తుంటే విజువల్ ట్రీట్‌లా ఉంటుంది. ⇔ 'సర్కారు వారి పాట' బ్యాంక్ నేపథ్యంలో సాగుతుంది. దీని కోసం మూడు బ్యాంకులు అవసరమయ్యాయి. అందులో ఒకటి యాబై ఏళ్ళ క్రితం బ్యాంకు ఎలా వుంటుంది ? అనే దానిపై స్టడీ చేసి, వింటేజ్ లుక్‌లో డిజైన్ చేశాం. దీనికి సంబంధించిన సెట్‌ను అన్నపూర్ణ స్టూడియో వేశాం. ఇది ఫ్లాష్ బ్యాక్‌లో వస్తుంది. అలాగే మరో రెండు మోడ్రన్ బ్యాంక్ సెట్స్ వేశాం. ⇔ భారీ సినిమా ఇది. ఆర్ట్ వైజ్ చాలా రోజులు పని చేశాం. బ్యాంకు కాకుండా దాదాపు ఎనిమిది సెట్స్ వేశాం. అలాగే ఒక వీధి సెట్ కూడా ఉంది. మొదట గోవాలో చేద్దామని అనుకున్నాం. అయితే కొన్ని ప్రాక్టికల్ సమస్యలు వచ్చాయి. మళ్ళీ హైదరాబాద్‌లోనే ఒక బేసిక్ కాలనీ తీసుకుని దాన్ని వైజాగ్ వీధిలా కథకు తగ్గట్టు డిజైన్ చేశాం. ఇలా ఒకటి కాదు.. చాలా వరకూ సెట్స్‌లోనే షూటింగ్ జరిగింది. చాలా ఇంటీరియర్, ఎక్స్ టీరియర్ డిజైన్ చేశాం. ⇔ దర్శకుడు కథ చెప్పిన తర్వాత ఆర్ట్ డైరెక్టర్ ఒక ఇమాజినేషన్ చేసుకుంటారు. ఆ కథ ఎలాంటి బ్యాక్‌డ్రాప్‌లో ఉంటుందో చెప్పినప్పుడే ఒక ఊహా ఏర్పడుతుంది. దర్శకులు ఒక విజన్‌తో వస్తారు. దానికి ఆర్ట్ డైరెక్టర్ విజన్ తోడవుతుంది. ఈ విజన్‌నే కెమరా మ్యాన్ క్యాప్చర్ చేయాలి. ⇔ మైత్రీ మూవీ మేకర్స్ నిర్మాతలకు సినిమా అంటే చాలా ప్యాషన్. ఎక్కడ రాజీ పడకుండా చిత్రాల్ని నిర్మిస్తారు. కథకు ఏం అవసరమో అది సమకూర్చడానికి ఎక్కడా కాంప్రమైజ్ అవ్వరు. సినిమా గ్రాండ్‌గా రావాలనే తపన మైత్రీ మూవీ మేకర్స్‌లో ఉంటుంది. -
గుడ్‌న్యూస్, ‘సర్కారు వారి పాట’కు గుమ్మడికాయ కొట్టేశారు
Sarkaru Vaari Paata Wraps Up Shoot: సూపర్ స్టార్ మహేశ్ బాబు ఫ్యాన్స్‌కు ‘సర్కారు వారి పాట’ టీం శుభవార్త అందించింది. ఈ మూవీ షూటింగ్ పూర్తయినట్లు తాజాగా మేకర్స్ ప్రకటించారు. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో కీర్తి సురేశ్ హీరోయిన్గా నటిస్తుంది. మే 12న ఈమూవీ విడుదల కానున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూవీ షూటింగ్‌ను డైరెక్టర్ శరవేగంగా పూర్తి చేశాడు. చదవండి: సమంత ఫేక్ ఫొటో షేర్ చేసిన విజయ్, పడిపడి నవ్విన సామ్ చివరిగా హైదరాబాద్‌లోని ప్రముఖ స్టూడియోలో ఓ పాట చిత్రీకరణతో సర్కారు వారి పాట షూటింగ్ కంప్లీట్ అయ్యింది. ఈ పాటలో మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్‌లు స్టెప్పులేశారు. ఇక పాట చిత్రీకరణ పూర్తికాగానే చిత్రానికి గుమ్మడికాయా కొట్టేసింది చిత్ర బృందం. ఈ నేపథ్యంలో శుక్రవారం(ఏప్రిల్ 22) సాయంత్రం మైత్రీ మూవీ మేకర్స్ సోషల్ మీడియా వేదికగా ఈ విషయాన్ని వెల్లడించారు. ‘‘సర్కారు వారి పాట’ మూవీ షూటింగ్ పూర్తి. ఇక మే 12న బాక్సాఫీసును షేక్ చేసేందుకే సిద్ధమవుతుంది’’ అంటూ మేకర్స్ ప్రకటించారు. చదవండి: అందులో తప్పేముంది, అది నా ఇష్టం: ట్రోల్స్‌పై మలైకా ఫైర్ ఈ సందర్భంగా ఈ మూవీలోని మహేశ్ కొత్తలుక్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో తాళల గుత్తితో మహేశ్ మాస్‌లుక్‌లో కనిపించాడు. ఇక ఇది చూసి సూపర్‌స్టార్ ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. దీంతో మహేశ్ లుక్‌ను సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. కాగా ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్ సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేశాయి. ఇక ఇందులో పాటలు కళావతి, ఎవ్రీ పెన్నీ సాంగ్స్ రికార్టు క్రియేట్ చేశాయి. Shoot Done & Dusted 🤘 All Set for the Box Office Recovery From MAY 12th 💥💥#SarkaruVaariPaata#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/UOVMq4Pqlc — Mythri Movie Makers (@MythriOfficial) April 22, 2022 var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4251450496.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
నేరుగా ఓటీటీలోకి కీర్తి సురేష్ సినిమా.. ఎప్పుడు ? ఎక్కడంటే ?
Keerthy Suresh Selva Raghavan Chinni Movie Release Date: 'ప్రతీకారం తీర్చుకోవడం అంటే ఏంటీ ? ఎవరైనా మన మీద రాయి విసిరితే.. తిరిగి మనమూ విసరాలి. మనమీద ఉమ్మేస్తే.. మనమూ ఉమ్మేయ్యాలి. మనల్ని కొడితే మనమూ కొట్టాలి' అని ఆవేశంగా అంటోంది కీర్తి సురేష్. 'మహానటి' కీర్తి సురేష్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబు సరసన 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తుంది. 'మహానటి' సినిమా తర్వాత కీర్తి సురేష్‌కు ఏ మూవీ అంతగా సక్సెస్‌ను ఇవ్వలేదు. ఇప్పుడు తన తదుపరి చిత్రాలపైనే ఆశలు పెట్టుకుంది కీర్తి సురేష్. 'సర్కారు వారి పాట' చిత్రం మే 12న విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాకు ముందే కీర్తి సురేష్ మరో సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ఆ మూవీ థియేటర్లలో కాకుండా నేరుగా ఓటీటీలో విడదల కానుంది. కీర్తి సురేష్ తాజాగా నటించిన చిత్రం 'సాని కాయిదమ్'. ఈ చిత్రాన్ని తెలుగులో 'చిన్ని' పేరుతో ప్రేక్షకుల ముందుకు తీసుకువస్తున్నారు. అమేజాన్ ప్రైమ్ వీడియో వేదికగా మే 6న 'చిన్ని' మూవీ రిలీజ్ కానుంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్‌ను కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ శుక్రవారం (ఏప్రిల్ 22) విడుదల చేశారు. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తి సురేష్‌తోపాటు ధనుష్ అన్న, డైరెక్టర్ సెల్వ రాఘవన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. పగ, ప్రతీకారం నేపథ్యంగా ఈ సినిమా తెరకెక్కినట్లు తెలుస్తోంది. టీజర్లో కీర్తి సురేష్ ఎమోషనల్‌గా చెప్పిన డైలాగ్‌లు ఆకట్టుకుంటున్నాయి. చదవండి: ఆ పాట ఓ ప్రయోగంలా అనిపించింది: కీర్తి సురేష్ var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_4261450729.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
స్పెషల్ హీరోయిన్.. సో స్పెషల్
హీరోయిన్ అంటేనే సినిమాకి స్పెషల్ ఎట్రాక్షన్ ఇక ‘స్పెషల్ హీరోయిన్’ అంటే ఇంకా స్పెషల్.. అంతే కదా..ఒక స్టార్ హీరోయిన్ స్పెషల్ రోల్ చేస్తే సో స్పెషల్‌గా ఉంటుంది కదా. రానున్న సినిమాల్లో కొందరు స్టార్ హీరోయిన్లు స్పెషల్ రోల్స్ చేస్తున్నారు. ఈ హీరోయిన్లు ఆ సినిమాలకు ‘స్పెషల్ హీరోయిన్’ అనొచ్చు. ఇక ఈ స్పెషల్ రోల్స్ గురించి తెలుసుకుందాం. ఇండస్ట్రీకి వచ్చి దాదాపు రెండు దశాబ్దాలు కొవొస్తున్నా నయనతార స్పీడు ఏ మాత్రం తగ్గలేదు. ఒకవైపు హీరోయిన్గా చేస్తూనే మరోవైపు లేడీ ఓరియంటెడ్ ఫిల్మŠస్తో కెరీర్లో బిజీగా ఉండేలా ప్లాన్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మరో స్టెప్ ముందుకు వేసి ‘గాడ్‌ఫాదర్’ చిత్రం కోసం నయనతార స్పెషల్ హీరోయిన్గా మారారు. మలయాళ హిట్ ‘లూసిఫర్’కు ‘గాడ్‌ఫాదర్’ తెలుగు రీమేక్. చిరంజీవి హీరోగా మోహన్‌రాజా దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ సినిమాలో ఓ కీ రోల్ చేస్తున్నారు నయనతార. ఇక చిరంజీవి హీరోగా నటిస్తున్న మరో చిత్రం ‘బోళాశంకర్’. తమన్నా హీరోయిన్గా నటిస్తున్న ఈ చిత్రంలో కీర్తీ సురేశ్ ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో చిరంజీవికి చెల్లెలి పాత్రలో కనిపిస్తారు కీర్తీ సురేశ్. అయితే కీర్తి ఇలా స్పెషల్ రోల్ చేయడం ఇది తొలిసారి కాదు. ‘అన్నాత్తే’ (తెలుగులో ‘పెద్దన్న’) చిత్రంలో రజనీకాంత్ చెల్లెలిగా పాత్రకు కీర్తీ సురేశ్ నటించిన విషయం గుర్తుండే ఉంటుంది. అలాగే చిరంజీవి హీరోగా నటించిన ‘ఆచార్య’ చిత్రంలో హీరోయిన్గా కాజల్ అగర్వాల్ నటించారు. కానీ ఈ చిత్రంలో కీలక పాత్రలో రామ్‌చరణ్ కనిపిస్తారు. రామ్‌చరణ్‌కు జోడీగా స్పెషల్ హీరోయిన్గా పూజా హెగ్డే నటించారు. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందిన ‘ఆచార్య’ చిత్రం ఈ నెల 29న థియేటర్స్‌లో విడుదల కానుంది. ఇంకోవైపు క్రేజీ హీరోయిన్ రష్మికా మందన్నా ఎంత బిజీగా ఉన్నారో ప్రత్యేకించి చెపక్కర్లేదు. ఇటు సౌత్ అటు నార్త్ ఇండస్ట్రీస్‌లో హీరోయిన్ గా రష్మికా మందన్నా వరుసగా సినిమాలు కమిట్ అవుతున్నారు. అయినప్పటికీ ‘సీతారామం’ చిత్రంలో స్పెషల్ రోల్ అంగీకరించారు. దుల్కర్ సల్మాన్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ‘సీతారామం’. ఇందులో లెఫ్టినెంట్ రామ్ పాత్రలో కనిపించే దుల్కర్‌ను, సీత పాత్రధారి మృణాళినీ ఠాకూర్లను కలిపే కశ్మీర్ ముస్లిం అమ్మాయి అఫ్రీన్ పాత్రలో రష్మికా మందన్నా కనిపిస్తారు. తెలుగు, తమిళం, మలయాళం భాషల్లో ఏక కాలంలో ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. కాగా డబుల్ స్పెషల్‌గా కనిపించనున్నారు హీరోయిన్ సోనాల్ చౌహాన్. ప్రస్తుతం నాగార్జున ‘ఘోస్ట్’ సినిమాలో హీరోయిన్గా నటిస్తున్న సోనాల్ ‘ఎఫ్ 3’లో ఓ కీ రోల్ చేస్తున్నారు. వెంకటేశ్, వరుణ్ తేజ్ హీరోలుగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం ఇది. ఈ ఏడాది మే 27న ‘ఎఫ్ 3’ చిత్రం థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఇక ప్రభాస్ ‘ఆదిపురు‹Ù’ చిత్రంలోనూ ఓ స్పెషల్ రోల్ చేశారు సోనాల్. ఓం రౌత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరి 12న రిలీజ్ కానుంది. ఇక ‘బొమ్మరిల్లు’ హీరోయిన్ హాసిని.. అదేనండీ.. జెనీలియాను మర్చిపోవడం అంత ఈజీ కాదు. నటుడు, నిర్మాత రితేష్ దేశ్‌ముఖ్‌ను వివాహం చేసుకున్న తర్వాత తెలుగు సినిమాలకు జెనీలియా కాస్త దూరంగా ఉంటున్నారు. కానీ ఇటీవలే రీ ఎంట్రీ షురూ చేశారు. భర్త రితేష్‌తో కలిసి మరాఠిలో ‘వేద్’, హిందీలో ‘మిస్టర్ మమ్మీ’ సినిమాలు చేస్తున్నారు జెనీలియా. అంతే కాదండోయ్.. దాదాపు పదేళ్ల తర్వాత ఓ ద్విభాషా (కన్నడం, తెలుగు) చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. రాధాకృష్ణ దర్శకత్వంలో కిరిటీ (వ్యాపారవేత్త గాలి జనార్థన్ కుమారుడు) హీరోగా పరిచయం అవుతున్న ఈ సినిమాలో జెనీలియా ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. మరోవైపు సినిమాలు, వెబ్ సిరీస్‌లు, లేడీ ఓరియంటెడ్... ఇలా బ్యాలెన్స్ చేస్తున్నారు ప్రియమణి. రానా, సాయిపల్లవి హీరో హీరోయిన్లుగా నటించిన ‘విరాటపర్వం’లో ప్రియమణి ఓ స్పెషల్ రోల్ చేశారు. ఈ చిత్రంలో కామ్రేడ్ భరతక్క పాత్రలో ప్రియమణి కనిపిస్తారు. మరోవైపు హిందీలో ఆమె మూడు నాలుగు చిత్రాల్లో హీరోయిన్ గా నటిస్తున్నారు. అలాగే ‘అద్భుతం’ చిత్రంతో హీరోయిన్గా ఇండస్ట్రీకి పరిచయం అయిన శివానీ రాజశేఖర్ ‘శేఖర్’ చిత్రంలో స్పెషల్ రోల్ చేశారు. ఆమె తండ్రి రాజశేఖర్ టైటిల్ రోల్లో, తల్లి జీవితా రాజశేఖర్ డైరెక్షన్లో రూపొందిన చిత్రం ఇది. ఇక ‘దొరసాని’ చిత్రంతో హీరోయిన్గా పరిచయం అయిన శివాతి్మక దర్శకుడు కృష్ణవంశీ తెరకెక్కంచిన ’రంగ మార్తండా’ చిత్రంలో ఓ స్పెషల్ రోల్ చేస్తున్నారు. ప్రకాశ్‌రాజ్, రమ్యకృష్ణ, బ్రహ్మానందం ప్రధాన తారాగణంగా ఈ చిత్రం రూపొందుతోంది. ఇలా స్పెషల్ హీరోయిన్స్ జాబితాలో ఇంకా వరలక్ష్మీ శరత్‌కుమార్, నివేదా పేతురాజ్, అనిఖా సురేంద్రన్‌లతో పాటు మరికొంత మంది హీరోయిన్ల పేర్లు కూడా ఉన్నాయి. -
మహేశ్ బాబు సినిమా నుంచి కొత్త అప్డేట్.. ఫ్యాన్స్‌కు పండగే
Mahesh Babu Sarkaru Vaari Paata Movie Complete Shoot Except A Song: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజాగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో 'మహానటి' కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పోస్టర్స్‌తోపాటు కళావతి, ఎవ్రీ పెన్నీ సాంగ్స్‌కు విశేష ప్రేక్షకదారణ లభించింది. తాజాగా ఈ మూవీ నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ వార్తతో మహేశ్ అభిమానులకు పండగే అని చెప్పవచ్చు. ఆ వార్త ఏంటంటే ఈ సినిమా షూటింగ్ గురించి మేకర్స్ అప్డేట్ ఇచ్చారు. ''సర్కారు వారి పాట' చిత్రీకరణ దాదాపు పూర్తయింది. కేవలం ఒకే పాటను షూట్ చేయాల్సి ఉంది.' అని చిత్రబృందం తెలిపింది. దీంతో అభిమానులు సంబరపడిపోతున్నారు. ఎందుకంటే ఒక పాట చిత్రీకరిస్తే సినిమా అనుకున్న సమయానికే విడుదలవుతుంది కాబట్టి. వేసవి కానుకగా మే 12న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానున్న విషయం తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోన్న ఈ చిత్రానికి తమన్ మ్యూజిక్ డైరెక్టర్‌గా పనిచేస్తున్నారు. చదవండి: మహేశ్ బాబు చిత్రంలో తమిళ స్టార్ హీరో.. క్లారిటీ! #SarkaruVaariPaata completes shoot except for a song! Get ready for exciting updates 💥#SVPManiaBegins 🔥#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @madhie1 @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/qK4tYD0h6d — Mythri Movie Makers (@MythriOfficial) April 12, 2022# -
కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్
Keerthy Suresh In Sharwanand, Krishna Chaitanya Movie: యంగ్ హీరో శర్వానంద్‌ను వరస ప్లాప్‌లు వెంటాడుతున్నాయి. ఇటీవల అతడు నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు ఎన్నో అంచాల మధ్య విడుదలై డిజాస్టర్‌గా నిలిచింది. ఇందులో శర్వానంద్‌కు జోడిగా రష్మిక నటించగా.. అలనాటి తారలు, సీనియన్ హీరోయిన్లు రాధిక శరత్ కుమార్, ఖుష్బూ సుందర్, ఊర్వశిలు ప్రధాన పాత్రల్లో కనిపించప్పటికీ ఈ సినిమా ప్రేక్షకులను అంతగా ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో ఈసారి ఎలాగైన హిట్ కొట్టాలని తదుపరి చిత్రం కోసం దర్శకుడు కృష్ణ చైతన్యతో జతకట్టాడు శర్వానంద్. విభిన్నమైన కాన్సెప్ట్‌తో శర్వా కోసం ఈ కథను సిద్ధం చేశాడు కృష్ణ చైతన్య. ఇక ఈ మూవీలో హీరోయిన్ కోసం తొలుత చిత్రం బృందం కృతిశెట్టిని సంప్రదించగా తను నో చెప్పినట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఇందులో హీరోయిన్ తల్లి పాత్ర పోషించాల్సి ఉంది. దీంతో కెరీర్ ప్రారంభంలోనే తాను మదర్ క్యారెక్టర్స్ చేయననని చెప్పినట్లు మరోవైపు గుసగుసలు వినిపిస్తున్నారు. దీంతో ఈ క్యారెక్టర్ కోసం కీర్తిసురేశ్‌ను అడగ్గా.. ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట. చివరకు ఈ మూవీలో కీర్తిని హీరోయిన్గా ఫైనల్ అయినట్లు జోరుగా ప్రచారం జరుగుతుంది. అయితే కృతి నో చెప్పిన ఈ పాత్రకు కీర్తి ఒకే చెప్పడం ఇప్పుడు పరిశ్రమలో చర్చనీయాంశమైంది. సాధారణంగా యంగ్ హీరోయిన్లు చెల్లి, తల్లి పాత్రలు చేసేందుకు అసలు అంగీకరించరు. కానీ కీర్తి మాత్రం తన దగ్గర వచ్చిన మంచి ప్రాజెక్ట్స్‌ను మాత్రం అసలు వదలుకోవడం లేదు. ఏలాంటి పాత్ర అయిన అది మంచి, భిన్నమైన స్క్రిప్ట్ అయితే చాలు చేస్తానంటుంది. ఇప్పటికే ఆమె అన్నాత్తైలో రజనీకాంత్‌కు చెల్లెలుగా నటించగా.. భోళా శంకర్‌లో చిరంజీవికి కూడా సోదరిగా కనిపించనుంది. అంతేకాదు ఇటీవల ఆమె నటించిన ‘పెంగ్విన్’ సినిమాలో ఒక బిడ్డకి తల్లిగా కనిపించిన సంగతి తెలిసిందే. -
సినీ తారల శుభాకాంక్షలు.. నెట్టింట ఉగాది సందడి
Cine Celebrities Wishes On Ugadi 2022: ఏప్రిల్ 2 శనివారం.. అంటే తెలుగువారికి కొత్త సంవత్సరం. ఈరోజు నుంచి 'శ్రీ శుభకృత్ నామ' తెలుగు సంవత్సరం ప్రారంభమవుతుంది. తెలుగు రాష్ట్రాల ప్రజలు సాంప్రదాయకంగా భావించే ఈ ఉగాది పర్వదినాన్ని దక్షిణ భారతదేశంలో ఎక్కువగా జరుపుకుంటారు. ముఖ్యంగా తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, కర్ణాటకలలో న్యూ తెలుగు ఇయర్ ప్రారంభంగా జరుపుకుంటారు. ఈ సందర్భంగా సినీ తారలు సోషల్ మీడియా వేదికగా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఉగాది శుభాకాంక్షలతో సోషల్ మీడియాలో పండుగ హడావిడి కనిపిస్తూ సందడిగా మారింది. 'శ్రీ శుభకృత్ నామ' సంవత్సరంలో ప్రతి ఒక్కరికీ అన్ని శుభాలే జరగాలని మెగాస్టార్ చిరంజీవి కోరుకున్నారు. సోషల్ మీడియా వేదికగా శనివారం ఉదయం అందరికీ శుభాకాంక్షలు తెలిపారు. చిరంజీవితోపాటు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు, మహేశ్ బాబు, యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్, మహానటి కీర్తి సురేష్, డైరెక్టర్ శ్రీనువైట్ల, యంగ్ హీరో సుధీర్ బాబు, బాలీవుడ్ స్టార్ హీరో అజయ్ దేవగణ్ సహా పలువురు సినీ ప్రముఖులు నెట్టింట తెలుగు సంవత్సరాది శుభాకాంక్షలు తెలిపారు. అందరికీ శ్రీ శుభకృత్ నామ ఉగాది శుభాకాంక్షలు ! ఈ ఉగాది అందరికీ అన్ని శుభాలు కలిగించాలని, అందరి జీవితాల్లో సుఖ సంతోషాలు వెల్లి విరియాలని కోరుకుంటున్నాను! 💐 pic.twitter.com/oFmh1H8IWQ — Chiranjeevi Konidela (@KChiruTweets) April 2, 2022 శ్రీ శుభకృత్ నామ సంవత్సరం, అంటే ఉగాది. ఈ ఉగాది నుంచైనా మనందరికీ మంచి జరగాలని భగవంతుడ్ని కోరుకుంటున్నాను. "శ్రీ శుభకృత్" నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు!! మీ మోహన్ బాబు#HappyUgadi #ఉగాది pic.twitter.com/3deIDbWYns — Mohan Babu M (@themohanbabu) April 2, 2022 Wishing you all a very happy Ugadi! May this day usher in love, harmony and prosperity! 🙏 — Mahesh Babu (@urstrulyMahesh) April 2, 2022 మీకు మరియు మీ కుటుంబ సభ్యులకు శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. Wishing everyone a Happy Ugadi, Gudi Padwa and Chaitra Sukhladi. — Jr NTR (@tarak9999) April 2, 2022 I wish you all a very Happy Ugadi ♥️ May God bless us all with peace and positivity ♥️ — Sai Pallavi (@Sai_Pallavi92) April 2, 2022 శుభకృత నామ సంవత్సరం మన అందరికీ సకల శుభాలను చేకూర్చాలని కోరుకుంటూ ఉగాది శుభాకాంక్షలు 🪴🥭🌺🍃 May the New Year bring happiness , wisdom, health and prosperity!! pic.twitter.com/ks7NopD9fv — Sreenu Vaitla (@SreenuVaitla) April 2, 2022 ఈ కొత్త ఏడాది మీకు ఆనందాన్ని , ఆరోగ్యాన్ని అందించాలని కోరుకుంటున్నాను. అందరికి శ్రీ శుభకృత్ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. — Kalyanram Nandamuri (@NANDAMURIKALYAN) April 2, 2022 అందరికి ఉగాది శుభాకాంక్షలు 😊🥭🌾 pic.twitter.com/uxjaFSbDnR — Ritu Varma (@riturv) April 2, 2022 వికారి, శార్వరి , దాటి ఆశలు మొలకెత్తించే ప్లవ నామంలోకి వచ్చి , ఇప్పుడు శుభాలు అందించే శుభకృత్ నామ వసంతంలోకి అడుగుపెట్టాము 😃ఈ శుభకృత్ మీకు మీ కుటుంబ సభ్యులకు సకల శుభాలు చెయ్యాలని కోరుకుంటూ , నూతన తెలుగు వత్సర శుభాకాంక్షలు 🌹 pic.twitter.com/7nnTO69XJL — Paruchuri GK (@GkParuchuri) April 2, 2022 Looking forward to another year of happiness, love and prosperity for all! Gudi Padwa aur Ugadi ki sabhi ko shubhkaamnayein ✨#happygudipadwa — Ajay Devgn (@ajaydevgn) April 2, 2022 -
‘సర్కారువారి పాట’ మూవీ స్టిల్స్
-
Sarkaru Vaari Paata: యూట్యూబ్‌లో ‘కళావతి’ సరికొత్త రికార్డు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో కీర్తి సురేశ్ హీరోయిన్. తమన్ సంగీతం అందిస్తున్నారు. ఇటీవల ఈ చిత్రం నుంచి ‘కళావతి’ అనే సాంగ్‌ని విడుదల చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సాంగ్ యూట్యూబ్‌లో దుమ్మురేపుతోంది. 100 మిలియన్స్ పైగా వ్యూస్‌ని సాధించి, రికార్డు సృష్టించింది. విడుదలైన తొలి రోజు నుంచే ఈ మెలోడీ సాంగ్ జనాల్లోకి దూసుకెళ్లింది. ఏ ఫంక్షన్లో చూసినా ఈ పాటే వినిపిస్తోంది. ముఖ్యంగా ఈ పాటలో మహేశ్‌బాబు వేసిన స్టెప్పులు యూత్‌ని బాగా అట్రాక్ట్ చేశాయి.ఈ పాటపై ఇప్పటికే అనేకమంది నెటిజన్స్ రీల్స్ చేసి అలరించారు. ఈ మెలోడీ సాంగ్‌కి అనంత్ శ్రీరామ్ సాహిత్యం అందించగా, సిద్ శ్రీరామ్ తనదైన శైలీలో ఆలపించారు. మరోవైపు ఈ సినిమా నుంచి విడుదలైన రెండో పాట ‘పెన్నీ సాంగ్’సాంగ్ కూడా యూట్యూబ్‌లో దూసుకెళ్తోంది. -
యాక్షన్ క్లైమాక్స్
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ యాక్షన్ క్లైమాక్స్‌కు చేరుకుంది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ హీరోయిన్. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. మహేశ్‌బాబుపై యాక్షన్ సన్నివేశాలు చిత్రీకరిస్తున్నట్లు సమాచారం. ఈ యాక్షన్ సీక్వెన్సే సినిమా క్లైమాక్స్‌లో ఉంటుందని తెలిసింది. ఈ సీక్వెన్స్‌తో టాకీపార్ట్ దాదాపు పూర్తవుతుందట. ఇక పాటల షూటì ంగ్ మాత్రమే బ్యాలెన్స్ ఉంటుంది. బ్యాంకు మోసాల నేపథ్యంలో ఈ సినిమా రూపొందుతోంది. ‘వెన్నెల’ కిశోర్, సుబ్బరాజు కీలక పాత్రలు పోషిస్తున్న ఈ సినిమాకు తమన్ సంగీతం అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మిస్తున్న ‘సర్కారువారి పాట’ మే 12న విడుదల కానుంది. -
Sarkaru Vaari Paata: మహేశ్ అభిమానులకు మహాశివరాత్రి కానుక
Mahesh Babu Movie Poster Out: మహా శివరాత్రి పర్వదినం సందర్భంగా సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు అదిరిపోయే కానుకను అదించింది సర్కారువారి పాట చిత్ర యూనిట్. ఈ చిత్రం నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేసింది. ఈ పోస్టర్లో మహేశ్ బాబు రౌడీలను కొడుతుంటే.. వాళ్లు గాల్లో ఎగిరిపడుతున్నారు. ఈ పోస్టర్ చూసి పండగ చేసుకుంటున్నారు ఫ్యాన్స్. సినిమాలో యాక్షన్ డోస్ ఎక్కువగానే ఉందని పోస్టర్ చూస్తుంటే అర్థమవుతుంది. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబి ఎంటర్ టైన్మెంట్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. A demeanour so calm and a rage so destructive 💥 Team #SarkaruVaariPaata wishes everyone a Happy Shivaratri! #SVPOnMay12 Super🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/2OJMKt3v5C — Mythri Movie Makers (@MythriOfficial) March 1, 2022 -
ఆడవాళ్ళు మీకు జోహార్లు మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫోటోలు)
-
ఛీఛీ ఇలాంటి చెత్త వీడియోలో నటించడమేంటి, కాస్తా చూసుకో: కీర్తిపై దారుణమైన ట్రోల్స్
Mahesh Babu Sarkaru Vaari Paata Movie: సూపర్ స్టార్ మహేశ్ బాబు తాజా చిత్రం సర్కారు వారి పాట. ఈ మూవీలో మహేశ్ ఫ్యాన్ష్ ఎన్నో అంచాలను పెట్టుకున్నారు. అయితే ఇందులో మహేశ్‌కు జోడిగా కీర్తి సురేశ్‌ను ప్రకటించినప్పటి నుంచి మహేశ్ ఫ్యాన్స్ నిరాశ భావం వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. సర్కారు వారి పాటలో హీరోయిన్గా కీర్తి ఉత్తమమైన ఎంపిక కాదని, మహేశ్‌కు ఆమె సరైనా జోడి కాదంటూ నెటిజన్లు మొదటి నుంచి వ్యతిరేకత చూపుతున్న సంగతి తెలిసిందే. ఇక మహేశ్ సినిమాను మేలో విడుదల చేస్తున్నట్లు ప్రకటించినప్పటి నుంచి ఈ వాదనలు మరింత ఎక్కువయ్యాయి. మే నెల మహేశ్‌కు కలిసి రాకపోవడం, పైగా కీర్తి సురేశ్ హీరోయిన్ కావడంతో ఫ్యాన్స్ ఆందోళన చెందుతున్నారు. ఎందుకుంటే ఇప్పటి వరకు ఆమె చేసిన చిత్రాల్లో నేను.. శైలజా, మహానటి తప్పా మరే సినిమాలు సక్సెస్ కాలేదు. ఇటీవల ఆమె నటించిన పెద్దన్న, గుడ్‌లక్ సఖీ, మిస్ ఇండియా బాక్సాఫీసు వద్ద భారీ పరాజయం పొందాయి. దీంతో కీర్తికి ఐరన్ లెగ్ అనే ముద్ర వేశారు. ఇదే సర్కారు వారి పాటకు కొనసాగుతుందేనేమోనని భయపడుతున్నారు అభిమానులు. ఇదిలా ఉంటే ఆమె నటించిన గాంధారి మ్యూజిక్ వీడియో రీసెంట్గా విడుదలైంది. ఈ మ్యూజిక్ వీడియోలో కీర్తి నటించడంపై మహేశ్ ఫ్యాన్స్, నెటిజన్లు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. చిన్నపాటి కళాకారులు సైతం మంచి విజువల్స్‌తో ఆకట్టుకునే మ్యూజిక్ వీడియోలు చేస్తున్న తరుణంలో కీర్తి ఇలాంటి చెత్త మ్యూజిక్ వీడియోలో నటించిందంటూ విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యూజిక్ వీడియో సహజంగా లేదని, పేలవంగా ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో ఆమె కాస్ట్యూమ్, వీడియో విజువల్స్ పేలవంగా ఉన్నాయని, ఈ సాంగ్ కాపీ కొట్టినట్లు ఉందంటూ కామెంట్స్ చేస్తున్నారు. ‘మహేశ్ బాబు వంటి స్టార్ హీరోతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకుంటున్న క్రమంలో ఆమె ఎంపికల అదే స్దాయిలో ఉండాలని, కానీ ఆమె ఇలాంటి సెకండ్ గ్రేడ్‌లో మ్యూజిక్‌లో నటించి తెలివి తక్కువగా వ్యవహరించింది’ ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. ఇకనైన ఆమె ఎంపికలో జాగ్రత్తగా ఉండాలని, కనీసం ‘సర్కారు వారి పాట’ సినిమాలో నటించే వరకు ఇలాంటి మ్యూజిక్ చేయద్దని ఆమెకు సూచిస్తున్నారు. ఇక గాంధారీ మ్యూజిక్ వీడియోతో ఆమెపై వస్తున్న నెగిటివిటిని చూసి ‘సర్కారు వారి పాట’ మూవీ టీం సైతం కీర్తిపై అప్సెట్ అయినట్లు సినీవర్గాల నుంచి సమాచారం. మరి ఈ ట్రోల్స్‌పై కీర్తి ఏవిధంగా స్పందిస్తుందో చూడాలి. -
'కళావతి సాంగ్'పై కళావతి స్టెప్పులు.. నెట్టింట వైరల్
Keerthi Suresh Dance On Kalavathi Song Videos Goes Viral: సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'సర్కారు వారి పాట'. పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని జిఎంబి ప్రొడక్షన్స్, మైత్రి మూవీ మేకర్స్, 14 రీల్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. ఇక ఈ సినిమా నుంచి ఇటీవలె విడుదలైన ఫస్ట్ లిరికల్ సాంగ్ 'కళావతి పాట' యూట్యూబ్‌లో దుమ్మురేపుతుంది. ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలైన ఈ సాంగ్ ఇప్పటికే 35 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోతుంది. ఈ పాటపై ఇప్పటికే అనేకమంది నెటిజన్స్ రీల్స్ చేసి అలరించారు. అలాగే మహేశ్ బాబు గారాల పట్టి సితార 'కళావతి సాంగ్'పై అదిరిపోయేలా స్టెప్పులేసింది. తాజాగా 'కళావతి సాంగ్'పై కళావతే అంటే కీర్తి సురేష్ డ్యాన్స్ చేసింది. ఈ వీడియోను తన ఇన్‌స్టా గ్రామ్ అకౌంట్లో పోస్ట్ చేసింది. దీంతో ఈ పోస్ట్ నెట్టింట వైరల్‌గా మారింది. 'సర్కారు వారి పాట' చిత్రాన్ని సమ్మర్ కానుకగా విడుదల చేసేందుకు మేకర్స్ ప్రణాళికలు రచిస్తున్నారు. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
‘సర్కారు వారి పాట’ మూవీ టీంకు షాక్, ముందుగానే ఆన్‌లైన్‌లోకి..
సూపర్ స్టార్ మహేశ్ బాబు నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. ప్రస్తుతం షూటింగ్‌ను జరుపుకుంటున్న ఈ మూవీ టీంకు మరోసారి భారీ షాక్ తగిలింది. ప్రారంభం నుంచి సర్కారు వారి పాటను పైరసి వీరులు వెంటాడుతున్నారు. ప్రారంభం నుంచి ఈ మూవీ అప్డేట్ విషయంలో చిత్ర బృందం కంటే లీక్ వీరులు ముందుగా స్పందిస్తున్నారు. ఫస్ట్‌లుక్ పోస్టర్ల నుంచి రేపు రాబోయే తొలి సాంగ్ వరకు ముందుగానే అప్డేట్ లీక్ చేస్తున్నారు. చదవండి: సీఎం జగన్‌తో సినీ పెద్దల భేటీపై నటుడు నరేశ్ ఆసక్తికర వ్యాఖ్యలు కాగా రేపు ఈ చిత్రం నుంచి విడుదల కానున్న ఫస్ట్ లిరికల్ సాంగ్ ముందుగానే నెట్టింట దర్శనమించింది. వాలంటైన్స్ డేకు మహేశ్ ఫ్యాన్స్‌ని సర్ప్రైజ్ చేయాలనుకున్న మూవీ టీంకు షాకిస్తూ లీకు వీరులు ఒకరోజు ముందుగానే ఈ పాటను ఆన్లైన్లో లీక్ చేశారు. దీంతో మహేష్ ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా మూవీ టీజర్ ఇలాగే లీక్ అయ్యిందని.. ఇప్పుడు కళావతి పాట కూడా లీక్ కావడంతో… చిత్రయూనిట్‌పై మండిపడుతున్నారు. చదవండి: ఖిలాడి డైరెక్టర్‌తో రవితేజ వివాదం, రమేష్ వర్మ భార్య షాకింగ్ కామెంట్స్ ఇదిలా ఉంటే నిన్న(శుక్రవారం) కళావతి పాటకు సంబంధించిన ప్రోమోను మేకర్స్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్, కీర్తి సురేశ్‌ల మధ్య రొమాంటి యాంగిల్ ఉండటంతో సోషల్ మీడియాలో రెస్పాన్స్ భారీగా వచ్చింది. ఈ నేపథ్యంలో ఫుల్సాంగ్ ఆసక్తికగా ఎదురు చూస్తున్న వారికి ఇది బిగ్ సర్ప్రైజ్ అంటు కామెంట్స్ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు. కాగా ఈ మూవీ ప్రపంచవ్యాప్తంగా మే 12న విడుదల కానుంది. -
కూకట్ పల్లిలో ‘మహానటి’ కీర్తి సురేశ్ సందడి
టాలీవుడ్ హీరోయిన్, ‘మహానటి’ కీర్తి సురేశ్ కూకట్‌పల్లిలో సందడి చేసింది. కూకట్‌పల్లిలో శనివారం జరిగిన ముగ్ధ ఫ్యాషన్ డిజైనర్ స్టోర్ ప్రారంభోత్సవానికి ఆమె ముఖ్య అతిథిగా వచ్చింది. ఈ సందర్భంగా ఆమెను ముగ్ధ కొత్త బ్రాంచ్‌ను ప్రారంభించింది. టాలీవుడ్ సెలబ్రిటీ డిజైనర్‌గా, లాక్మె వంటి ప్రఖ్యాత ఫ్యాషన్ ఈవెంట్స్‌లో పాల్గొన్న ప్రముఖ డిజైనర్ శశి వంగపల్లి తన ముగ్ధ స్టోర్‌ను కూకట్‌పల్లిలో ప్రారంభించారు. ఇప్పటికే నగరంలోని బంజారాహిల్స్, జూబ్లీహిల్స్ తదితర ప్రాంతాల్లో ముగ్ధ డిజైనర్ స్టూడియోని ఏర్పాటు చేసి ఫ్యాషన్ ప్రియుల ఆదరాభిమానాలను పొందిన శశి వంగపల్లి... హైదరాబాద్‌లోని కూకట్పల్లి వాసుల కోసం తన ముగ్ధ స్టోర్‌ను అందుబాటులోకి తెస్తున్నారు. -
‘సర్కారు వారి పాట’ తొలి సాంగ్ ప్రోమో..
మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ నెల 14న ప్రేమికుల రోజు సందర్భంగా ఈ చిత్రం నుంచి తొలి పాటను విడుదల చేస్తున్నట్లు ఇటీవల చిత్ర బృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ పాటకు సంబంధించిన ప్రోమో విడుదల చేశారు మేకర్స్. ‘వందో.. ఓక వెయ్యో’ అంటూ మహేశ్ బాబు కీర్తి సూరేశ్‌ను ఫాలో అవుతుంటాడు. మ్యూజిక్ సెన్సెషన్ తమన్ స్వరాలు అందించిన ఈ పాటను సింగర్ సిద్ శ్రీరామ్ ఆలపించాడు. పరశురాం దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూవీ షూటింగ్ చివరి దశకు చేరుకుంది. మైత్రీ మూవీ మేకరస్, 14 రీల్స్ సంస్థలు కలిసి నిర్మిస్తున్న ‘సర్కారు వారి పాట’ మే 12వ తేదీన ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. -
వాలంటైన్స్ డేకు ‘సర్కారి వారి పాట’ నుంచి సర్ప్రైజ్
సూపర్ స్టార్ మహేశ్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'సర్కారు వారి పాట'. ప్రస్తుతం షూటింగ్‌ను శరవేగంగా జరుపుకుంటున్న ఈ మూవీ నుంచి త్వరలోనే ఓ ఆసక్తికర అప్డేట్ రానుంది. దీనికి ప్రమేకుల రోజు ఫిబ్రవరి 14న చిత్ర బృందం డేట్ ఫిక్స్ చేస్తూ తాజాగా ప్రకటన ఇచ్చింది. ఈ సందర్భంగా సర్కారు వారి పాటోలోని ఫస్ట్‌సింగిల్ విడుదలకు రెడీ అయినట్లు మేకర్స్ స్పష్టం చేశారు. చదవండి: అషురెడ్డి రచ్చ, ఫోన్ నెంబర్ షేర్ చేయడంతో దిగొచ్చిన నెటిజన్.. ‘కళావతి’ అంటూ పాగే ఈ పాటను ఫిబ్రవరి 14న వాలెంటైన్స్ డే కానుకగా విడుదల చేయనున్నట్టు చిత్రబృందం పేర్కొంది. "వాలెంటైన్స్ డే రోజున 'కళావతి'తో ప్రేమలో పడండి" అంటూ ఓ ప్రకటన ఇచ్చింది. మహేశ్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ చిత్రం మే 12న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. సర్కారు వారి పాట చిత్రానికి తమన్ సంగీత దర్శకుడు. ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీఎంబీ ఎంటర్టయిన్ మెంట్స్ సంస్థలు నిర్మిస్తున్నాయి. Fall in love with #Kalaavathi this Valentines day ❤️ #SVPFirstSingle on February 14th 🎶#SarkaruVaariPaata#SVPOnMay12 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @GMBents @14ReelsPlus @saregamasouth pic.twitter.com/rlhzw9t0yq — Mythri Movie Makers (@MythriOfficial) February 7, 2022 -
గుడ్ లక్ సఖి మూవీ ట్విటర్ రివ్యూ
‘నేను శైలజ’మూవీతో టాలీవుడ్‌కి పరిచయం అయింది అందాల భామ కీర్తి సురేశ్. తొలి సినిమాతోనే తనదైన నటనతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఆ తర్వాత పలు సినిమాల్లో నటించినప్పటికీ అంతగా గుర్తింపు రాలేదు. ఇక నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ‘మహానటి’మూవీతో కీర్తి సురేశ్ జాతకమే మారిపోయింది. ఆ సినిమా తర్వాత కీర్తి వరుస సినిమాలు చేస్తూ దూసుకెళ్తోంది. ఒకపక్క స్టార్ హీరోలతో నటిస్తూ.. మరో పక్క లేడి ఓరియెంటెడ్ సినిమాలతో మెప్పిస్తోంది. తాజాగా ఈ బ్యూటీ నటించిన మరో లేడి ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’. స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్లో రూపొందిన ఈ చిత్రంలో ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ కీలక పాత్రలు పోషించారు. ఇప్పటికే విడుదలైన మూవీ పాటలు, ట్రైలర్ సినీ ప్రియులను ఆకట్టుకున్నాయి. వాస్తవానికి ఈ సినిమా ఎప్పుడో రిలీజ్ కావాల్సింది. కానీ. . కరోనా కారణంగా పలుమార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు ఈ శుక్రవారం (జనవరి 28)న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇప్పటికే సినిమా ప్రీమియర్స్ చూసిన ఆడియన్స్.. సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయాలను తెలుపుతున్నారు.. అసలు కథేంటీ.. కథనం ఎలా ఉంది.. ఏ మేరకు తెలుగు వారిని ఈ సినిమా ఆకట్టుకుంటోంది.. మొదలగు అంశాలను ట్విటర్లో చర్చిస్తున్నారు.. అవేంటో చూద్దాం. #GoodLuckSakhi Overall A Mostly Lackluster Sports Drama! Keerthy did her best and the film had lscope for comedy and emotion but could not engage with a flat screenplay The makers did not even finish dubbing and the dialogues were hard to understand throughout Rating: 2/5 — Venky Reviews (@venkyreviews) January 28, 2022 సినిమా యావరేజ్‌గా ఉందని, కానీ కీర్తిసురేశ్ నటన మాత్రం అద్భుతంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేశాడు. గుడ్ లక్ సఖి కాదు బ్యాడ్ లక్ కీర్తి అని మరో నెటిజన్ ట్వీట్ చేశాడు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కిన ఈ చిత్రం ఫ్యామిలీ అంతా కలిసి చూడతగ్గ సినిమా అని మరికొంతమంది చెబుతున్నారు. జగపతి బాబు ఆదిపినిశెట్టి పెర్ఫార్మన్స్ కూడా ఈ కథకి ప్లస్ అయిందని చెబుతున్నారు. #GoodLuckSakhi..! Solo release aithe kalisochindi kani NO Luck! Everything happens and ends abruptly with no reason..! Lacks the punch that is needed in sports drama..! Even shooting scenes did not have impact..! Feels like DSP is the only technician that worked honestly..! 2/5.! — FDFS Review (@ReviewFdfs) January 28, 2022 Papa account lo inkokati #GoodLuckSakhi pic.twitter.com/zmFHDvWDI2 — Kaushik🔔 (@ahvkboon) January 28, 2022 -
గుడ్ లక్ సఖి ప్రీరిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేశ్, రామ్‌చరణ్ 'నాటు' స్టెప్పులు
-
యూట్యూబ్ ఛానెల్ స్టార్ట్ చేసిన మహానటి
Keerthi Suresh Launched YouTube Channel: టాలీవుడ్ టాప్ హీరోయిన్లలో కీర్తి సురేష్ ఒకరు. ఎనర్జిటిక్ హీరో రామ్ హీరోగా తెరకెక్కిన 'నేను శైలజ' సినిమాతో తెలుగులో తెరంగ్రేటం చేసిన ఈ బొద్దుగుమ్మ 'మహానటి' చిత్రంతో జాతీయ స్థాయిలో ప్రశంసలు దక్కించుకుంది. ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ జోష్ మీద ఉంది కీర్తి. ప్రస్తుతం స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న 'గుడ్ లక్ సఖి' చిత్రంలో నటించింది. నగేష్ కుకునూర్ దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా పలు మార్లు వాయిదా పడుతూ ఎట్టకేలకు ఈ నెల 28న థియేటర్లలో విడుదల కానుంది. అయితే తాజాగా కీర్తి సురేష్ తన యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించింది. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'ఈరోజు (జనవరి 26) నా అధికారిక యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభిస్తున్నందుకు ఎంతో సంతోషంగా ఉంది. సబ్‌స్క్రైబ్ చేసి వీడియోలు చూడండి.' అని ట్విటర్లో ట్వీట్ చేసింది కీర్తి సురేష్. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్‌గా ఉండే ఈ భామ తన బ్యూటిఫుల్ ఫొటోస్‌తో అభిమానులను అలరిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ యూట్యూబ్ ఛానెల్ ద్వారా తన షార్ట్ వీడియోస్, ఫిట్నెస్ తదితర వీడియోలను అభిమానులతో పంచుకోనున్నట్లు తెలుస్తోంది. Hello! Excited to be launching my official YouTube channel today! Do click on the link to subscribe and keep watching! 😊✨https://t.co/W3UqhVHvD8 @YouTubeIndia #youtubeshorts pic.twitter.com/uolMqnfdqP — Keerthy Suresh (@KeerthyOfficial) January 26, 2022 -
సినీ పరిశ్రమను వణికిస్తోన్న కరోనా, మరో స్టార్ హీరోయిన్‌కు పాజిటివ్
కరోనా మహమ్మారి సినీ పరిశ్రమ వణికిస్తోంది. వరసగా సినీ పరిశ్రమలకు చెందిన సెలబ్రెటీలు కరోనా బారిన పడుతున్నారు. దీంతో రోజురోజుకు పరిశ్రమల్లో కరోనా కేసులు పెరుగుతున్నాయి. నటీనటులు, ప్రముఖులు కోవిడ్, ఒమిక్రాన్ పాజిటివ్‌గా పరీక్షిస్తున్నారు. ఇప్పటికే టాలీవుడ్‌కు చెందిన హీరో మంచు మనోజ్, లక్ష్మి మంచు, సూపర్ స్టార్ మహేశ్ బాబు, సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్ తదితరులు కరోనా రాగా తాజాగా ‘మహానటి’ కీర్తి సూరేశ్ కూడా కరోనా పాజిటివ్‌గా పరీక్షించింది. ఈ విషయాన్ని ఆమె సోషల్ మీడియా ద్వారా వెల్లడించింది. చదవండి: ‘బంగార్రాజు’ ట్రైలర్ వచ్చేసింది, చై హంగామా మామూలుగా లేదుగా.. ‘నాకు కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయ్యింది. స్వల్ప కరోనా లక్షణాలతో బాధపడుతున్నాను. అన్ని జాగ్రత్తలు తీసుకున్నా కరోనా వస్తుంది. అంటే పరిస్థితి చాలా సీరియస్‌గా ఉంది. అందరూ కరోనా రాకుండా జాగ్రత్తలు పాటించండి. నేను ప్రస్తుతం ఐసోలేషన్ లో ఉన్నాను. ఇటీవల నన్ను కలిసిన వాళ్లంతా దయచేసి టెస్ట్ చేయించుకోండి. మీరు ఇంకా వ్యాక్సిన్ వేయించుకోకపోతే త్వరగా వేయించుకోండి. మీరు మీ వాళ్ళు అంతా క్షేమంగా ఉండండి. త్వరగా రికవర్ అయి ఫాస్ట్ గా వస్తానని కోరుకుంటుంన్నాను’ అని పోస్ట్ చేసింది. pic.twitter.com/YF2lCxotOo — Keerthy Suresh (@KeerthyOfficial) January 11, 2022 -
మరో గ్రీన్ సిగ్నల్!
తెలుగులో ‘బోళాశంకర్’, ‘సర్కారు వారి పాట’, తమిళంలో ‘సాని కాయిదమ్’, మలయాళంలో ‘వాషి’ .. ఇలా సౌత్‌లో ఫుల్ బిజీగా ఉన్నారు హీరోయిన్ కీర్తీ సురేష్. తాజాగా ఈ మలయాళ బ్యూటీ మరో తమిళ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని కోలీవుడ్ టాక్. మారి సెల్వరాజ్ దర్శకత్వంలో ఉదయనిధి స్టాలిన్ హీరోగా ఓ సినిమా రూపొందనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ పాత్రకు కీర్తీ సురేష్‌ను సంప్రదించగా ఆమె గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారని టాక్. అంతేకాదు.. ఈ సినిమాకు ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ సంగీతం అందించనున్నారని సమాచారం. -
సూపర్ స్టార్ రజనీకాంత్ ‘అన్నత్తె’ మూవీ స్టిల్స్
-
సర్కారు వారి పాట: 70 శాతం షూటింగ్ పూర్తి, మహేశ్-కీర్తి మధ్య డ్యూయెట్స్
సూపర్ స్టార్ మహేష్ బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తోన్న తాజా చిత్రం ‘సర్కారు వారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా యాక్షన్ ఎంటర్టైనర్గా తెరకెక్కుతోంది. సంక్రాంతి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ మూవీ కోసం ప్రేక్షకులు, ఫ్యాన్స్ అంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇటీవల షూటింగ్ నేపథ్యంలో సర్కారు వారి పాట టీం స్పెయిన్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఫస్ట్ షెడ్యూల్ దుబాయ్, సెకండ్ షెడ్యుల్‌ను హైదరాబాద్, ఇటీవల స్పెయిన్‌లో షూటింగ్‌ను జరుపుకున్న ఈ మూవీ ఇప్పటి వరకు 70 శాతం పూర్తయినట్లు తెలుస్తోంది. ప్రస్తుతం సర్కారు వారి పాట టీం స్పెయిన్‌లోని బార్సిలోనాలో షూటింగ్‌ను జరుపుకుంటోదట. చదవండి: ప్రభాస్ బర్త్‌డే హంగామా.. లీకైన ‘సలార్’ యాక్షన్ సీన్ వీడియో అక్కడి అందమైన లొకేషన్స్‌లో మహేశ్, కీర్తి మధ్య పాటలను చిత్రీకరిస్తున్నట్లు తెలుస్తోంది. అంతేగాక వీరిద్దరి మధ్య జరిగే సన్నివేశాలు, లవ్ ట్రాక్‌కు సంబంధించిన సీన్స్‌ను కూడా అక్కడ షూట్ చేస్తున్నారని సమాచారం. ఈ నెల చివరి వరకు అక్కడ షూటింగ్‌ను పూర్తి చేసుకుని తిరిగి హైదరాబాద్ చివిరి షూటింగ్ షెడ్యూల్‌ను పూర్తి చేస్తారని సమాచారం. కాగా ఈ సినిమాకు మ్యూజిక్ సెన్సేషన్ తమన్ సంగీతం అందిస్తున్న సంగతి తెలిసిందే. బ్యాంకింగ్ రంగంలో జరిగే మోసాల నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. చదవండి: లైవ్‌చాట్‌లో పూజ హెగ్డేకు షాకింగ్ ప్రశ్న, నెటిజన్‌కు హీరోయిన్ చురక -
దిమ్మతిరిగే ట్విస్ట్.. ‘లక్ష్మీ నరసింహ స్వామి’గా మహేశ్!
విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉన్న హీరో. అతడు స్క్రీన్ పై కనిపిస్తే కలెక్షన్ల వర్షమే.. మైండ్ బ్లాక్ అయ్యే బ్లాక్ బస్టర్స్ కొడుతుంటాడు. పాత్రకు తగ్గ నటనతో ఆకట్టుకుంటూ ఉంటాడు. ఐతే.. గెటప్స్ విషయంలో మాత్రం పెద్దగా వేరియేషన్ చూపించడు. ఇప్పుడు ఆ లోటు కూడా తీర్చబోతున్నాడు. ఎడ్వేంచరస్ గెటప్ తో ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. 2018లో ‘భరత్ అనే నేను’, 2019లో ‘మహర్షి’, 2020లో ‘సరిలేరు నీకెవ్వరు’..ఇలా వరుసగా మూడు బ్లాక్ బస్టర్స్ కొట్టి ఫుల్ జోష్ లో ఉన్నాడు సూపర్ స్టార్ మహేశ్ బాబు. ఎన్నో సూపర్ హిట్ చిత్రాలను తన ఖాతాలో వేసుకున్న మహేశ్ గెటప్స్ జోలికి మాత్రం పెద్దగా పోలేదు. ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన పోకిరిలో మాత్రం కాస్త లాంగ్ హెయిర్ తో కనిపించి వేరియేషన్ చూపించాడు. 1 నేనొక్కడినే చిత్రంలో బాడీ షేప్ కాస్త మార్చాడు. అతిథిలో కూడా డిఫరెంట్ హెయిర్ స్టైల్ ట్రై చేశాడు. ఐతే.. అవేమీ పెద్దగా చెప్పుకోదగ్గ మార్పులు కావు. ఐతే.. ఈ సారి మహేశ్ ఎవరూ ఊహించని గెటప్ లో కనిపంచబోతున్నాడని తెలుస్తోంది. ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’ ఇందులో మహేశ్ దిమ్మతిరిగే ట్విస్ట్ ఇవ్వబోతున్నాడని ఫిలిం సర్కిల్స్ లో టాక్ నడుస్తోంది. ఈ మూవీలో ఇంటర్వెల్ బ్యాంగ్ కు ముందు ఓ భారీ యాక్షన్ సన్నివేశం ఉంటుందట. ఆ సీన్ లో మహేశ్ బాబు లక్ష్మీ నరసింహ స్వామి గెటప్ లో కనిపించ బోతున్నాడట. విలన్ మహేశ్‌ను అలా ఊహించుకుంటాడట. అదే నిజమైతే.. మహేశ్ అతిపెద్ద ఎడ్వేంచర్ చేస్తున్నట్టే. పరశురామ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న ఈ మూవీలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తోంది. సంక్రాంతికి ఈ మూవీ థియేటర్స్ లోకి దిగబోతుంది. -
ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతున్న కీర్తి
‘మహానటి’ కీర్తి సురేశ్ ప్రస్తుతం ముంబై రోడ్లపై చక్కర్లు కొడుతోంది. సరదాగా ఆమె ముంబై పర్యాటనకు వెళ్లినట్లు స్వయంగా సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. తన ఇన్‌స్టాగ్రామ్‌లో ‘ది పర్ఫెక్ట్ మిట్‌వీక్ మూడు’ అంటూ ఫొటో షేర్ చేసింది. ఇందులో కీర్తి బ్లూ డెనిమ్స్, ఫుల్ స్లీవ్డ్ తెలుపు రంగు చొక్కాలో ఉన్న కీర్తిసురేశ్ చిరునవ్వులు చిందిస్తూ పూల మొక్కల ముందు నిలబడి ఫొటోకు ఫోజు ఇచ్చింది. అలాగే వీకెండ్ కోసం ఎదురుచూస్తూ..అంటూ #WednesdayVibes, #MumbaiDiaries హ్యాష్ ట్యాగ్‌లను జతచేసింది. చదవండి: ఉత్తేజ్ భార్య పద్మావతి సంతాప సభలో చిరు భావోద్వేగం కాగా కీర్తి ప్రస్తుతం మహేశ్ బాబు ‘సర్కారు వారి పాట’ మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో మహేశ్ సరసన సందడి చేయనుంది. అయితే సర్కారు వారి పాట ప్రస్తుతం హైదరాబాద్‌లో షూటింగ్‌ను జరుపుకుంటుంది. ఈ క్రమంలో ‘కీర్తి హైదరాబాద్‌లో ఉండకుండా ముంబైలో ఏం చేస్తున్నారు’ అంటూ ఫ్యాన్స్ తన పోస్ట్‌పై కామెంట్స్ చేస్తున్నారు. అయితే సర్కారి వారి పాటలో తన షూటింగ్ షెడ్యూల్‌ను కాస్తా విరామ సమయంలో దొరకడంతో స్నేహితలతో కలిసి అలా సరదాగా గడిపేందుకు ముంబై వెళ్లినట్లు సన్నిహిత వర్గాల నుంచి సమాచారం. కాగా సర్కారు వారి పాటతో కీర్తీ చేతిలో ‘గుడ్ లక్ సఖీ’, ‘గాడ్ ఫాదర్’ చిత్రాలతో పాటు మలయాళంలో వాశి అనే మూవీలో నటిస్తుంది. చదవండి: ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ ట్రైలర్ మామూలుగా లేదుగా.. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
ఓటీటీకి కీర్తి సురేశ్ మూవీ
మహనటి కీర్తీ సురేశ్ ప్రస్తుతం సర్కారి వారి పాట మూవీ షూటింగ్‌తో బిజీగా ఉంది. దీనితో పాటు ఆమె తమిళంలో ‘సాని కాయిదమ్’ అనే వైవిధ్యమైన చిత్రంలో నటించింది. 1980 కాలం నేపథ్యంలో యాక్షన్ థ్రిల్లర్ మూవీగా దర్శకుడు మహేశ్వర్ తెరకెక్కించిన ఈ చిత్రం ఇటీవల షూటింగ్ పూర్తి చేసుకుని గుమ్మడి కాయ కూడా కొట్టెసింది. ఈ నేపథ్యంలో నిన్న(అగష్టు 19) ఈ మూవీ ఫస్ట్‌లుక్ పోస్టర్‌ను విడుదల చేశారు మేకర్స్. ఇందులో కీర్తి ఒక పెల్లెటూరి అమ్మాయిగా ఢిగ్లామర్తో కనిపించగా ఆమె పక్కనే ఆమె పక్కనే దర్శకుడు సెల్వరాఘవన్ లుక్ ఆసక్తిగా ఉంది. ఇందులో ఆయన చేతులకు రక్తంతో ఉండటం మరింత ఆసక్తిని రేకెత్తిస్తుంది. ఈ చిత్రంలో సెల్వ రాఘవన్ కీలక పాత్ర పోషిస్తున్న సంగతి తెలిసిందే. సాయి కానిదమ్ అద్భుతమైన జర్నీ అని, ఈ మూవీ ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నామని ఈ సందర్భంగా సెల్వ రాఘవన్ అన్నాడు. పొస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసుకున్న ఈ సినిమా విడుదలకు సిద్దమైంది. దీంతో ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా ఈ మూవీని థియేటర్లో కాకుండా ఓటీటీలో విడుదల చేయాలనే ఆలోచనలో మేకర్స్ ఉన్నారని వినికిడి. కీర్తిసురేశ్ ఇంతకుముందు చేసిన ‘పెంగ్విన్’ కూడా ఓటీటీలోనే విడుదలైంది. అలాగే ‘సానికాయిధమ్’ కూడా ఓటీటీలోనే రానుందని అంటున్నారు. సర్కారి వారి పాట మూవీతో పాటు కీర్తి సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నాత్తై మూవీలో నటిస్తోంది. ఇందులో ఆమె రజనీకి సోదరిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. -
మహేశ్సార్కు దిష్టి తీయడం మర్చిపోకండి: కీర్తిసురేష్
Keerthi Suresh Suggestion Namrata Shirodkar : టాలీవుడ్ మోస్ట్ హ్యాండ్సమ్ హీరో అనగానే టక్కున గుర్తొచ్చే పేరు సూపర్ స్టార్ మహేశ్‌బాబు. ఆయన అందానికి ఫిదా కాని వాళ్లు అమ్మాయిలెవరూ ఉండరేమో. అందుకే అత్యధిక లేడీ ఫాలోయింగ్ ఉన్న హీరోల్లో మహేశ్ ముందుంటారు. 46 ఏళ్ల వయసులోనూ ఇప్పటికీ యంగ్‌లుక్‌లో కనిపిస్తూ కుర్ర హీరోలకు సైతం షాకిస్తున్నాడు. వయసు పెరిగేకొద్దీ మరింత సూపర్ స్టైలిష్‌గా కనిపిస్తున్నారాయన. కాగా నిన్న(ఆగస్టు9)న మహేశ్‌బాబు బర్త్‌డే సందర్భంగా పలవురు ప్రముఖులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. హీరోయిన్ కీర్తి సురేష్ సైతం మహేశ్‌తో దిగిన ఓ ఫోటోను షేర్ చేస్తూ..నమ్రత మేడమ్..మహేశ్ సార్ పడుకునే ముందు ప్రతిరోజూ దిష్టి తీయడం మాత్రం మర్చిపోకండి అంటూ ఓ పోస్టును షేర్ చేసింది. దీనిపై స్పందించిన నమ్రత..సరే అంటే రిప్లై ఇచ్చారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. కాగా ‘సర్కారు వారి పాట’ చిత్రంలో కీర్తిసురేష్ హీరోయిన్గా నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్లో తెరకెక్కుతున్న ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ ఏడాది సంక్రాంతికి ఈ చిత్రం విడుదల కానుంది. -
‘సర్కారు వారి పాట’: కీర్తి పాత్ర రివీల్ చేసిన మహేశ్, ట్వీట్ వైరల్
సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేశ్ జంటగ నటిస్తున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. సోమవారం మహేశ్ బర్త్‌డే సందర్భంగా ‘సూపర్ స్టార్ బర్త్‌డే బ్లాస్టర్’ పేరుతో ఈ మూవీ టీజర్‌ను విడుదల చేసింది చిత్ర బృందం. ఈ టీజర్ విడుదలైన 24 గంటల్లోనే 25 మిలియన్ల వ్యూస్ రాబట్టింది. ఇక ఇందులో మహేశ్ మరింత యంగ్‌గా, సూపర్ స్టైలిష్ లుక్‌తో అదరగొట్టాడు. ఆయన చెప్పిన ఒక్కొక్క డైలాగ్ కేక పెట్టించేలా ఉన్నాయి. ఇక కీర్తి, మహేశ్‌ల జోడి అయితే చూడముచ్చటగా ఉంది. ‘పడుకునేముందు దిష్టి తీసుకోవడం మర్చిపోకండి’ ఆని ఆమె క్యూట్‌గా చెప్పిన డైలాగ్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. ఇక ఇదే డైలాగ్‌తో కీర్తీ మహేశ్ బర్త్‌డేకు ఫైనల్ టచ్ ఇచ్చింది. ‘నమత్ర మేడం సార్ పడుకునేముందు దిష్టి తీయడం మర్చిపోకండి’ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్టు చేసింది. అలాగే ట్విటర్లో ఆమెజింగ్ కో-స్టార్ మహేశ్ అంటూ పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపింది. ప్రస్తుతం ఆమె ట్వీట్, ఇన్‌స్టా పోస్టులు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. తన ఈ ట్వీట్‌కు మహేశ్ ఇచ్చిన సమాధానం అయితే చర్చనీయాంశంగా మారింది. అయితే తన పుట్టిన రోజున విషెస్ చెప్పిన ప్రతి నటీనటులకు మహేశ్ ట్విటర్ వేదికగా కృతజ్ఞతలు తెలిపాడు. ఈ క్రమంలో అందరికి కేవలం థ్యాంక్స్ చెప్పిన మహేశ్ కీర్తికి మాత్రం స్పెషల్‌గా ‘థ్యాంక్యూ కళావతి’ అని రిప్లై ఇచ్చాడు. దీంతో ఆయన ట్వీట్ చూసిన నెటిజన్లు ఈ మూవీలో కీర్తి పాత్ర పేరు ‘కళావతి’ అయ్యింటుందాని అభిప్రాయపడుతున్నారు. అయితే ఈ టీజర్లో ఎక్కడ కూడా హీరోహీరోయిన్లు పాత్రల పేర్లను బయట పెట్టలేదు చిత్ర బృందం. ఏదేమైన మహేశ్ తన బర్త్‌డే సందర్భంగా కీర్తి పాత్రను రివీల్ చేశాడని చర్చించుకుంటున్నారు. మహేశ్ పాత్ర పేరేంటో తెలియాలంటే ఇంకా కొన్ని రోజులు ఆగాల్సిందే. పరశురాం దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్టైన్మెంట్స్, 14 ప్లస్ రీల్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ మూవీకి తమన్ స్వరాలు సమకురుస్తున్నాడు. 2022 జనవరి 13న సంక్రాంతికి ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. You are not only an inspiration on screen but off screen as well!❤️ Here’s to an amazing co-star and a beautiful person. May you have a day as fabulous as you! Happy Birthday, @urstrulyMahesh sir!😊🤗 #SarkaruVaariPaata Teaser - https://t.co/vrmvtgw4Oq#HBDSuperstarMaheshBabu — Keerthy Suresh (@KeerthyOfficial) August 8, 2021 -
చిరు చెల్లిగా కీర్తి, ఆమెకంత రెమ్యునరేషన్ అవసరమా!
కీర్తి సూరేశ్ ‘మహానటి’ మూవీ తర్వాత మహిళ నేపథ్యం ఉన్న సినిమాలపై దృష్టి పెట్టింది. ఓ వైపు గ్లామర్ పాత్రల్లో నటిస్తూనే లేడి ఓరియంటెట్ చిత్రాలను ఎంచుకుంటుంది. ఈ క్రమంలో ఆమె నటించిన ‘పెగ్విన్, మిస్ ఇండియా’ చిత్రాలు అంతగా గుర్తింపు పొందలేదు. ఈ రెండు చిత్రాలు బాక్సాఫీసు వద్ద పరాజయం అయ్యాయి. ఈ నేపథ్యంలో ఆమె సైడ్ క్యారెక్టర్లోనూ నటించేందుకు సిద్దమైంది. స్టార్ హీరోలకు చెల్లెలి పాత్రల్లో నటించేందుకు కీర్తి ఏమాత్రం వెనకాడటం లేదు. ఈ క్రమంలో సూపర్ స్టార్ రజనీకాంత్ నటిస్తున్న అన్నాత్తే మూవీలో రజనీకి సోదరిగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా మెగాస్టార్ చిరంజీవికి కూడా చెల్లిగా నటించేందుకు ఆమె గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. తమిళంలో హిట్‌గా నిలిచిన వేదాళం మూవీని చిరు ప్రధాన పాత్రలో మెహర్ రాజా రీమేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ మూవీలో చిరు సోదరి పాత్రకు దర్శక-నిర్మాతలు మొదట కీర్తిని సంప్రదించడంతో వెంటనే ఒకే చెప్పిందట. అంతేగాక ఈ మూవీకి భారీ మొత్తంలో పారితోషికం డిమాండ్ చేసినట్లు వార్తలు వినిపిస్తున్నాయి. అయితే లేడి ఒరియంటెడ్ చిత్రాలకే అంత పారితోషికం తీసుకోనప్పుడు, సైడ్ క్యారెక్టర్‌కు అంత ఇవ్వడం ఎందుకని చిరు అభిప్రాయపడ్డారట. అంతేగాక ఈ విషయంపై ఆయన మేకర్స్‌ను వారించినట్లు వినికిడి. దీనిపై చర్చలు జరుగుతుండగానే కరోనా సెకండ్ వేవ్ కారణంగా షూటింగ్‌లు ఆగిపోవడంతో చిరు సలహా మేరకు కీర్తికి ప్రత్యామ్నాయం దర్శక-నిర్మాతలు మరో నటిని వేతికే పనిలో పడ్డారట. ఎవరు దొరకపోవడంతో మేకర్స్ కీర్తినే ఫైనల్ చేద్దామని చిరును ఒప్పించారట. అలా ఆమె అడిగినంత రెమ్యునరేషన్ ఇచ్చి కీర్తినే ఖారారు చేసేందుకు రెండోసారి ఆమెను సంప్రదించారట దర్శక-నిర్మాతలు. అయితే ఈసారి ఆమె మరో కోటి పెంచి మొత్తం 3 కోట్ల రూపాయలు డిమాండ్ చేసినట్లు టాలీవుడ్లో గుసగుసలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం లూసిఫర్ మూవీకి డేట్స్ ఇచ్చిన చిరు వేదాళం మూవీకి కూడా తన డేట్స్‌ను సర్దుబాటు చేసుకునేందుకు ప్లాన్ చేస్తున్నాడట. దీంతో త్వరలోనే వేదాళం మూవీని సెట్స్‌పై తీసుకొచ్చేందుకు మేకర్స్ సిద్దమవుతున్నారు. ఈ సమయంలో వేరే నటిని వేతకడం కంటే కీర్తినే ఫైనల్ చేమాలని నిశ్చయించుకుని, ఆమె అడిగినంత ఇచ్చేందుకు మేకర్స్ రేడి అయ్యారట. దీంతో మొత్తానికి కీర్తి తన రెమ్మునరేషన్ విషయంలో మాట నెగ్గించుకుందంటూ సినీవర్గాలు చర్చించుకుంటున్నాయి. -
‘సర్కారువారి పాట’..షూటింగ్ ఎప్పుడంటే..
కోవిడ్ బ్రేక్ తర్వాత సినిమా షూటింగ్‌లు మొదలయ్యాయి. మరి.. మహేశ్‌బాబు సెట్స్‌లోకి అడుగుపెట్టేది ఎప్పుడు? అంటే.. ఈ నెల 12న. పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తున్న చిత్రం ‘సర్కారువారి పాట’. కోవిడ్ బ్రేక్‌కి ముందు ఈ సినిమా షూటింగ్ జోరుగా జరిగింది. ఇప్పుడు మళ్లీ అదే స్పీడ్‌తో షూటింగ్‌కి రెడీ అవుతోంది ఈ చిత్రబృందం. 12 నుంచి నెలాఖరు వరకూ హైదరాబాద్‌లో చిత్రీకరణ జరపడానికి ప్లాన్ చేశారు. సోమవారం నుంచి మహేశ్‌బాబుతో పాటు సినిమాలోని కీలక తారాగణం చిత్రీకరణలో పాల్గొంటారు. టాకీ సీన్స్‌తో పాటు ఒక ఫైట్‌ని కూడా ఈ షెడ్యూల్లో చిత్రీకరించనున్నారు. కాగా, విదేశాల్లో కీలక సన్నివేశాలను చిత్రీకరించాలనుకుంటున్నారు. ఈ ఫారిన్ షెడ్యూల్ సెప్టెంబర్‌లో ఆరంభమయ్యే అవకాశం ఉంది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న కుంభకోణాల నేపథ్యంలో ఈ సినిమా ఉంటుందని తెలిసింది. ఇందులో కీర్తీ సురేశ్ కథానాయిక. -
Sarkaru Vaari Paata: టార్గెట్ ఫిక్స్
మహేశ్‌బాబు హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో కీర్తీ సురేశ్ కథానాయికగా నటిస్తున్నారు. కోవిడ్ సెకండ్ వేవ్ పరిస్థితుల కారణంగా ఈ సినిమా షూటింగ్‌కి తాత్కాలిక బ్రేక్ పడింది. కాగా ఈ సినిమా తాజా షెడ్యూల్ ఈ నెల 15న హైదరాబాద్‌లో ఆరంభం కానుందని సమాచారం. ఈ సినిమా షూటింగ్‌ను సెప్టెంబరు కల్లా పూర్తి చేయాలనే టార్గెట్‌ను కూడా ఫిక్స్ చేసుకున్నారట మహేశ్‌బాబు. ‘సర్కారువారి పాట’ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదలకు షెడ్యూలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్, అనిల్ రావిపూడి, రాజమౌళి దర్శకత్వాల్లో హీరోగా సినిమాలు కమిటయ్యారు మహేశ్‌బాబు. -
అన్నయ్యా.. దీపావళికి రెడీయా!
రజనీకాంత్ అభిమానులకు గురువారం సన్ పిక్చర్స్ ఓ తీపి వార్త అందించింది. ‘అన్నాత్తే.. దీపావళిక్కు రెడీయా’ (అన్నయ్యా.. దీపావళికి రెడీయా) అంటూ రజనీ వెనక్కి తిరిగి ఉన్న ఒక ఫొటోను ట్విట్టర్లో పోస్ట్ చేసింది. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో సన్ పిక్చర్స్ నిర్మించిన చిత్రం ‘అన్నాత్తే’. ఇటీవల వైద్య పరీక్షల కోసం రజనీ అమెరికా వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అక్కడికి వెళ్లక ముందే ఆయన ఈ సినిమా షూటింగ్‌ను పూర్తి చేశారు. దాంతో కరోనా లాక్డౌన్లాంటివి ఏమీ లేకపోతే ముందు అనుకున్నట్లుగానే చిత్రాన్ని నవంబర్ 4న విడుదల చేయాలని సన్ పిక్చర్స్ నిర్ణయించుకుంది. ఆ విషయాన్ని సూచించే విధంగానే గురువారం ట్వీట్ చేశారు. సో.. పండగకి రజనీ సినిమా వస్తే ఆయన అభిమానులకు పండగే పండగ. కీర్తీ సురేశ్, నయనతార, మీనా, ఖుష్బూ తదితరులు నటించిన ఈ సినిమాలో రజనీకాంత్ గ్రామ పెద్ద పాత్రలో కనిపిస్తారు. -
కీర్తి సురేష్ సినిమా విడుదలకు ముందే ఫ్యాన్స్‌కు చూపిస్తారట!
మహానటి చిత్రం తర్వాత కీర్తి సురేష్ దక్షిణాదిలో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. ప్రస్తుతం ఈ అమ్మడు నటించిన లేడీ ఓరియెంటెడ్ మూవీ ‘గుడ్ లక్ సఖి’ చిత్రాన్ని ఫ్యాన్స్ కోసం స్పెషల్ షో ప్రదర్శించనున్నారట. నిర్మాత సుధీర్ చంద్ర పాదిరి తన ట్విటర్ ద్వారా ఈ విషయాన్ని తెలిపారు. నగేశ్ కుకునూరు దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో కీర్తి సురేష్, ఆది శెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ ప్రధాన పాత్రలు పోషించారు. జూన్ 3న భారీ స్థాయిలో విడుదల చేయాలని చిత్ర యూనిట్ భావించగా, కరోనా సెకండ్ వేవ్ కారణంగా వాయిదా పడింది. దాంతో కీర్తి అభిమానుల నుంచి విడుదల విషయమై నిర్మాతకి ప్రశ్నలు ఎదురయ్యాయట. దీంతో నిర్మాత సుధీర్ చంద్ర 50 మంది అభిమానులను ఎంపిక చేసి ఈ సినిమాను చూపించబోతున్నట్లు సోషల్ మీడియా ద్వారా తెలిపారు. ఈ క్రమంలో చిత్రాన్ని విడుదల చేయడానికి ముందే ఎడిటింగ్ రూమ్‌లో స్పెషల్ షో ప్రదర్శించబోతున్నారు. ఈ వార్త విన్నప్పటి నుంచి కీర్తి అభిమానులు ఈ చిత్రం స్పెషల్ షో తేదీని ఎప్పుడు ప్రకటిస్తారని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. గత ఏడాది ఈ అమ్మడు నటించిన పెంగ్వి, మిస్ ఇండియా చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర బోల్తా పడ్డాయి. మరి ఈ సినిమా ఎలాంటి ఫలితాన్నిస్తుందో విడుదల వరకు వేచి చూడాల్సిందే. I will personally invite everyone whoever is asking me for a update to see the film in my edit room soon. Say who! — Sudheer Chandra (@sudheerbza) June 25, 2021 చదవండి: స్టార్ హీరోయిన్ చిన్ననాటి ఫోటో, ఇంతకీ ఎవరో గుర్తు పట్టారా? -
హల్చల్ : సన్నీలియోన్ ఫోటో షూట్..కోపంగా చూస్తున్న మెహ్రీన్
♦ వైరలవుతున్న సన్నీలియోన్ లేటెస్ట్ ఫోటో షూట్ ♦ బాయ్‌ఫ్రెండ్‌తో బర్త్‌డే సెలబ్రేట్ చేసుకున్న దిశా పటానీ ♦ ఫ్లోరల్ డ్రెస్‌లో గులాబి వర్ణంలో కీర్తి సురేష్ ♦ భార్య ప్రియాంక చోప్రాను మిస్ అవుతున్నానంటున్న నిక్ ♦ కోపంగా చూస్తున్న మెహ్రీన్ ♦ న్యూ మామ్ రష్మికకు కంగ్రాట్స్ అంటోన్న ఛార్మీ ♦ యోగా శిల్పా శెట్టి ఆసనాలు ♦ మాల్దీవుల్లో ఎంజాయ్ చేస్తోన్న నిఖితా శర్మ View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Ashmita karnani (@ashmita_9) View this post on Instagram A post shared by disha patani (paatni) (@dishapatani) View this post on Instagram A post shared by NICK JONɅS (@nickjonas) View this post on Instagram A post shared by Shamna Kasim | Poorna (@shamnakasim) View this post on Instagram A post shared by MEHREEN 🌟🧿 (@mehreenpirzadaa) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Krishna Mukherjee (@krishna_mukherjee786) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Shilpa Shetty Kundra (@theshilpashetty) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Puja Gupta Talukdar (@iampujagupta) -
థియేటర్స్‌లోనే గుడ్‌లక్
కరోనా సెకండ్ వేవ్‌తో థియేటర్లు మూతపడ్డాయి. దీంతో విడుదలకు సిద్ధంగా ఉన్న పలు సినిమాలు వాయిదా పడుతున్నాయి. మరికొందరు మాత్రం ఓటీటీలో విడుదల చేస్తున్నారు. ఈ కోవలోనే కీర్తీ సురేష్ నటించిన లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘గుడ్‌లక్ సఖి’ కూడా ఓటీటీలో రిలీజ్ కానుందనే వార్తలు వచ్చాయి. దీనిపై చిత్రబృందం స్పందించి, ‘‘మా సినిమాని థియేటర్లలోనే విడుదల చేస్తాం. దయచేసి పుకార్లను నమ్మొద్దు’’ అని స్పష్టం చేసింది. కీర్తీ సురేష్ టైటిల్ పాత్రలో, ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రల్లో నగేష్ కుకునూర్ దర్శకత్వంలో తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఈ చిత్రం తెరకెక్కింది. ‘దిల్’ రాజు సమర్పణలో సుధీర్ చంద్ర పదిరి, శ్రావ్యా వర్మ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 3న విడుదల కావాల్సి ఉంది. అయితే కోవిడ్ సెకండ్ వేవ్ కారణంగా విడుదల వాయిదా పడింది. -
మహానటి జ్ఞాపకాలు.. ఆ తర్వాతే ఊపిరి పీల్చుకున్న: కీర్తి
తన అందం, అభినయంతో హీరోయిన్ కీర్తి సూరేశ్ ఎంతో ప్రేక్షకాదరణను పొందింది. సావిత్రి జీవితం ఆధారంగా తెరకెక్కిన మహానటి చిత్రానికి గానూ ఉత్తమ నటిగా నేషనల్ అవార్డ్ కూడా గెలుచుకుంది. ఇందులో కీర్తి తన నటనతో సావిత్రని మైమరపించి విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది. ఈ సినిమాని పలు అంతర్జాతీయ వేదికల్లో ప్రదర్శించడం విశేషం. 2018లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం అనేక వివాదాల మధ్య విడుదలైంది. ఈ చిత్రాన్ని ప్రేక్షకుల్లో ఎంతవరకు చేరుతుందో లేదో తెలియని ఎన్నో సందేహాల మధ్య థియేటర్లోకి వచ్చి.. భారీ విజయాన్ని అందుకుంది. అయితే దర్శకుడు నాగ్ ఆశ్విన్ 2016 నుంచి ఈ సినిమాను తీయాలని ప్లాన్ చేశాడట. సావిత్రకి పాత్ర సరిపోయే నటి కోసం వేతుకుతుండగా.. నేను లోకల్ సినిమా చేస్తున్న సమయంలో కీర్తి సురేష్‌ని మేకర్స్ సంప్రదించారట. అయితే ఈ మూవీకి ఒకే చెప్పిన కీర్తి.. ఆ తర్వాత సావిత్రి పాత్రకు న్యాయం చేయగలుతుందో లేనని చాలా భయపడినట్లు పలు ఇంటర్వ్యూలో చెప్పుకొచ్చిన సంగతి తెలిసిందే. అయితే మహానటి మూవీ కోసం తనకు లుక్ టెస్ట్ చేయగా అచ్చం సావిత్రిని తలపించిందంటు ప్రశంసలు రావడంతో కీర్తి ఊపిరి పీల్చుకుందట. నాడు లంగా ఓణీలో ఉన్న తన ఫస్ట్ లుక్ టెస్ట్ ఫొటోను తాజాగా కీర్తి షేర్ చేస్తూ మురిసిపోయింది. దీనికి ‘హహ.. లుక్ టెస్ట్ చేసిన మొదటి రోజు.. ఈ ఫోటో వెనకాల ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయి’ అంటు తన ఇన్‌స్టా స్టోరిలో అభిమానులతో పంచుకుంది. -
‘రంగ్‌దే’ ఓటీటీలోకి వచ్చేసింది.. ఎప్పుడంటే
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం 'రంగ్‌దే'. మార్చి 26న థియేటర్లలో రిలీజైన ఈ సినిమా పర్వాలేదనిపించింది. వెంకీ అట్లూరి దర్శకత్వం వహించిన ఈ సినిమాకు దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించాడు. ఇక ఈ సినిమా ట్రైలర్ రీలీజైన నాటి నుంచి చిత్రంపై హైప్ క్రియేట్ అయ్యింది. దీనికి తోడు నితిన్-కీర్తి చేసిన ప్రమోషన్ వీడియోలు ఆకట్టుకున్నాయి. ఫ్యామిలీ ఎంటర్టైనర్ నేపథ్యంలో సాగిన ఈ చిత్రం పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. ఇక ఈ సినిమాను ఓటీటీలో రిలీజ్ చేయడానికి రంగం సిద్ధమైంది. జూన్ 12 నుంచి జీ5లో రంగ్‌దే సినిమా స్ర్టీమింగ్ కానుంది. దీనికి సంబంధించి జీ ఎంటర్టైన్మెంట్ అధికారికంగా ప్రకటన విడుదల చేసింది. Miru entagano eduruchustunna rangu rangula prema indrajalam #RangDe premieres 12th June nunchi #ZEE5 lo matrame.https://t.co/0VsbNRwblf#RangDeOnZEE5 #Premieres12thJune #ZEE5@actor_nithiin @KeerthyOfficial #VenkyAtluri @ThisIsDSP pic.twitter.com/l2K9iSuEPQ — ZEE5 Telugu (@ZEE5Telugu) May 28, 2021 -
Sarkaru Vaari Paata: అప్డేట్ లేదు
‘సర్కారువారి పాట’ సినిమా ఫస్ట్ లుక్ ఎప్పుడెప్పుడు విడుదలవుతుందా? అని హీరో మహేశ్‌బాబు అభిమానులు ఎదురు చూస్తున్నారు. ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు కావడంతో ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలయ్యే అవకాశం ఉందని ఫ్యాన్స్ భావించారు. అయితే కరోనా పరిస్థితుల దృష్ట్యా మే 31న ‘సర్కారువారి పాట’ నుంచి ఎలాంటి అప్డేట్ ఉండదు.. ఆ రోజు అన్ని వేడుకలు రద్దు చేసిన ట్లు మహేశ్‌బాబు టీమ్ అధికారికంగా పేర్కొంది. ‘‘ప్రస్తుత పరిస్థితుల్లో ‘సర్కారువారి పాట’ నుంచి ఎలాంటి అప్డేట్ను విడుదల చేయకూడదని నిర్మాతలు నిర్ణయించారు. సినిమా అప్డేట్ ఇవ్వడానికి ఇది సరైన సమయం కాదని వారు భావిస్తున్నారు. అప్డేట్ విషయంలో ఎలాంటి అనధికారిక, తప్పుడు సమాచారాన్ని స్ప్రెడ్ చేయకూడదు.. ఏదైనా సమాచారం ఉంటే యూనిట్ నుంచి అధికారికంగా వస్తుంది’’ అని మహేశ్‌బాబు టీమ్ ఓ ప్రకటన విడుదల చేసింది. పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న ‘సర్కారువారి పాట’లో కీర్తీ సురేష్ కథానాయికగా నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్‌తో కలిసి ఘట్టమనేని మహేశ్‌బాబు ఎంటర్టైన్మెంట్ సంస్థ నిర్మిస్తున్న ఈ చిత్రానికి తమన్ సంగీతం అందిస్తున్నారు. -
స్టార్ హీరో విజయ్‌తో జోడీ కట్టనున్న కీర్తి సురేష్?
కీర్తి సురేష్ ఫ్రస్తుతం దక్షిణాదిన వరుస అవకాశాలతో ఫుల్ బిజీగా ఉంది. ఇప్పటికే పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతున్న సర్కారు వారి పాట సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో తొలిసారిగా సూపర్‌స్టార్ మహేష్ బాబు సరసన జత కట్టనుంది. మరోవైపు గుడ్ లక్ సఖి, అన్నాతై సహా మైదానం సినిమాలో కీర్తి నటిస్తుంది. అయితే తాజాగా తెలుగులో మరో క్రేజీ ఆఫర్ వరించిందట. తమిళ స్టార్ హీరో విజయ్ టాలీవుడ్లో స్ట్రయిట్ ఫిల్మ్ చేయనున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. మహర్షి డైరెక్టర్ వంశీ పైడిపల్లి చెప్పిన కథ నచ్చడంతో ఆయనతో సినిమాకు రెడీ అయినట్లు టాక్ వినిపిస్తోంది. తెలుగులో నటించనున్న తొలి సినిమాకే విజయ్ ఏకంగా రూ.90 కోట్ల పారితోషికం అందుకోబోతున్నాడని ఫిల్మ్‌నగర్ టాక్. ఇక ఈ సినిమాలో విజయ్‌కు జంటగా కీర్తి సురేష్ నటిస్తుందని సమాచారం. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తారని తెలుస్తోంది. డైరెక్టర్ వంశీ పైడిపల్లి ఇప్పటికే ఈ సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ వర్క్‌తో పాటు ప్రీ ప్రొడక్షన్ పనులతో బిజీగా ఉన్నట్లు సమాచారం. ఈ ప్రాజెక్ట్ ఓకే అయితే, కీర్తి నటించే ఫస్ట్ పాన్ ఇండియా సినిమా ఇదే అవుతుంది. చదవండి : మహేష్‌బాబుకు పిన్నిగా ఒకప్పటి స్టార్ హీరోయిన్! మీకు ఏమైంది.. మరీ ఇంత సన్నబడ్డారు..! -
అనుపమ కొంటెచూపు, అమీషా ఫ్లయింగ్ కిస్
► చూపుల్తోనే బాణం వదులుతున్న అనుపమ పరమేశ్వరన్ ► ఈ సిరీస్‌లో ఇదే ఆఖరుదంటోన్న నందిత శ్వేత ► అమ్మాయిలకు మంచి ఆహారం అవసరమంటోన్న నిషా అగర్వాల్ ► ఏదైతే జరగదు అనుకుంటావో అవే నేడు విజయాలుగా మారుతాయంటోన్న దక్షి గుత్తికొండ ► ఒకే రోజు 20 మొక్కలు నాటిన కంగనా రనౌత్ ► తమ్ముడితో రచ్చ చేసిన వీడియోను షేర్ చేసిన శ్రీముఖి ► స్విమ్మింగ్ పూల్‌లో అందాలను వీక్షిస్తోన్న రీతూ వర్మ ► ఫ్లయింగ్ కిస్ ఇస్తోన్న అమీషా పటేల్ ► ఈ పెయింటింగ్స్ అద్భుతంగా ఉన్నాయంటోన్న రితికా సింగ్ ► కరోనాపై కీర్తి సురేశ్ వీడియో సందేశం ► తండ్రి బర్త్‌డే నాడు జెనీలియా భావోద్వేగం ► ఫేవరెట్ ఎమోజీ ఏదని అడుగుతోన్న సన్నీలియోన్ View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Nanditaswetha (@nanditaswethaa) View this post on Instagram A post shared by Nisha Aggarwal (@nishaaggarwal) View this post on Instagram A post shared by Kangana Ranaut (@kanganaranaut) View this post on Instagram A post shared by Sreemukhi (@sreemukhi) View this post on Instagram A post shared by Ruhani Sharma (@ruhanisharma94) View this post on Instagram A post shared by Ritu Varma (@rituvarma) View this post on Instagram A post shared by Richa Chadha (@therichachadha) View this post on Instagram A post shared by Ameesha Patel (@ameeshapatel9) View this post on Instagram A post shared by Ritika Singh (@ritika_offl) View this post on Instagram A post shared by Shivathmika Rajashekar (@shivathmikar) View this post on Instagram A post shared by URVASHI RAUTELA 🇮🇳Actor🇮🇳 (@urvashirautela) View this post on Instagram A post shared by Eesha Rebba (@yourseesha) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by D E E P T H I R E D D Y 🇮🇳 (@deepthi_sunaina) View this post on Instagram A post shared by Madhuri Dixit (@madhuridixitnene) View this post on Instagram A post shared by Sunny Leone (@sunnyleone) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Tanya Hope (@hope.tanya) View this post on Instagram A post shared by Nivetha Pethuraj (@nivethapethuraj) View this post on Instagram A post shared by Nivetha Thomas (@i_nivethathomas) -
ఆ సినిమాలో యువరాణిగా కీర్తి లుక్, ఫొటో వైరల్
మోహన్‌లాల్ కథానాయకుడిగా నటించిన మలయాళ తాజా చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’. పోర్చుగీసువారిని ఎదురించి పోరాడిన నావికాధికారి కుంజాలీ మరక్కర్ జీవితం ఆధారంగా ఈ మూవీని దర్శకుడు ప్రియదర్శన్ తెరకెక్కించాడు. గతేడాది 2020 మార్చి 26న విడుదల కావాల్సిన ఈ మూవీ కరోనా కారణంగా ఈ ఏడాది వేసవికి వాయిదా పడింది. 2022లో కూడా కరోనా సెకండ్ వేవ్ తీవ్రంగా ఉండటంతో మరోసారి ఈ మూవీ వాయిదా పడింది. కాగా ఈ చిత్రంలో కీర్తి సురేశ్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ (మోహన్‌లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషిస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ మూవీలోని కీర్తి సూరేశ్ న్యూలుక్ బయటకు వచ్చింది. సంగీతకారిణిగా జీవితాన్ని మొదలుపెట్టి కేరళ యువరాణిగా పట్టాభిషిక్తురాలైన యువతిగా కీర్తి పాత్ర కొనసాగనున్నట్లు సమాచారం. ఒంటినిండా ఆభరణాలు ధరించి రాచరికపు కాలం నాటి వస్త్రధారణతో వీణ వాయిస్తున్నట్లు ఉన్న తన స్టిల్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. కేరళ యువరాణిగా కీర్తి అదిరిపోయిందంటు నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇదిలా ఉండగా మరక్కల్ మూవీ విడుదలకు ముందే మూడు విభాగాల్లో(ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్ డిజైనింగ్) జాతీయ అవార్డులు గెలుచుకోవడం విశేషం. కాగా మరక్కర్.. ఓనమ్ పండగ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు ఇటీవల మోహన్‌లాల్ అధికారికంగా ప్రకటించారు. -
మీకు ఏమైంది.. మరీ ఇంత సన్నబడ్డారు..!
‘నేను.. శైలజా’ మూవీతో హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమయ్యారు కీర్తి సురేశ్. ఈ మూవీలో ముద్దుగా, కాస్తా బొద్దుగా తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న కీర్తి ఆ తర్వాత ఏకంగా మహానటి సావిత్రి బయోపిక్ వంటి ప్రతిష్టాత్మక చిత్రంలో లీడ్ రోల్ పోషించే చాన్స్ కొటేశారు. ఈ మూవీలో ఆమెకు అవకాశం రావడానికి ముఖ్యకారణం ఇప్పటి తరం హీరోయిన్ల కంటే కాస్తా బొద్దుగా, ముద్దుగా తెలుగమ్మాయిలా కనిపించడమే. ఇక ఈ మూవీలో సావిత్రి పాత్ర పోషించిన కీర్తికి ఎంతటి గుర్తింపు వచ్చిందో ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అచ్చం సావిత్రలా నటించి ప్రస్తుత కాలం ‘మహానటి’గా మారిపోయారు. ఈ మూవీకి ఉత్తమ నటిగా జాతీయ పురస్కారం అందుకున్నారు కీర్తి. అయితే ఈ మధ్య కీర్తి డైట్ అంటు సన్నబడిన సంగతి తెలిసిందే. ఇటీవల ఆమె నటించిన రంగేదే మూవీలో కీర్తి బక్కచిక్కినట్లుగా కనిపించారు. దీంతో ఆమె అభిమానులు ‘‘అయ్యో మరీ ఇంతలా సన్నబడిపోయారేంటి.. ఇలా అస్సలు బాగాలేరు, బొద్దుగానే బాగున్నారు’’ అంటూ తమ అసంతృప్తిని కామెంట్స్ రూపంలో వ్యక్తం చేశారు. ఇక తాజాగా తన ఇన్‌స్టాగ్రామ్‌లో ఓ వీడియో షేర్ చేసి తన అభిమానులను మరోసారి నిరాశ పరిచారు కీర్తి. ‘నిశ్శబ్దం, యోగా నా దినచర్యలో భాగమైంది’ అంటు షేర్ చేసిన ఈ వీడియోలో కీర్తిని చూసి అభిమానులు మండిపడుతున్నారు. ఇందులో ఆమె మరింత బక్కపలుచగా కనిపించడంతో ‘మీకు ఏమైంది.. మరీ ఇంత సన్నబడ్డారు.. ఇదంతా దేనికి, అంత అవసరం ఏమొచ్చింది’ అంటు నెటిజన్లు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.. కాగా ప్రస్తుతం కీర్తి మహేశ్ బాబు సరసన సర్కారు వారి పాట మూవీలో నటిస్తున్న సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
చీరలో అనసూయ సోయగాలు.. కూతురుతో సురేఖ రచ్చ రచ్చ
నా బలం, బలహీనత వీళ్లే అంటూ బర్త్‌డే వేడుకల ఫోటోని అభిమానులతో పంచుకుంది నటి సురేఖ వాణి యువర్ లిమిట్స్ ఈజ్ యువర్ మైండ్ అంటూ వేదాంతాలు చెబుతుంది హాట్ బ్యూటీ అనసూయ సెకండ్ డోస్ టీకా తీసుకున్న రమ్యకృష్ణ ‘అఖండ’కి సంబంధించి ఓ షెడ్యూల్‌కి ప్యాకప్ చెప్పి స్టైల్‌గా నడుస్తూ స్లోమోషన్లో వీడియో తీసి అభిమానులతో పంచుకుంది ప్రగ్యాజైస్వాల్ View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Surekhavani (@artist_surekhavani) View this post on Instagram A post shared by Priya Prakash Varrier💫 (@priya.p.varrier) View this post on Instagram A post shared by 𝐒𝐘𝐄𝐃 𝐒𝐎𝐇𝐄𝐋 𝐑𝐘𝐀𝐍 (@syedsohelryan_official) View this post on Instagram A post shared by Ramya Krishnan (@meramyakrishnan) View this post on Instagram A post shared by Pragya Jaiswal (@jaiswalpragya) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) View this post on Instagram A post shared by Allu Sneha Reddy (@allusnehareddy) -
మరోసారి వెనక్కు తగ్గిన మోహన్‌లాల్
మోహన్‌లాల్ నటించిన తాజా చిత్రం ‘మరక్కర్: లయన్ ఆఫ్ ది అరేబియన్ సీ’ విడుదల మరోసారి వాయిదా పడింది. 2020 మార్చి 26న విడుదలకు షెడ్యూల్ అయిన ఈ చిత్రం కరోనా కారణంగా ఈ ఏడాది వేసవికి వాయిదా పడింది. తాజాగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా ‘మరక్కర్’ సినిమాను ఓనమ్ పండగ సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 12న విడుదల చేయనున్నట్లు మంగళవారం మోహన్‌లాల్ అధికారికంగా ప్రకటించారు. ప్రియదర్శన్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో కీర్తీ సురేష్, మంజు వారియర్, అర్జున్, కల్యాణీ ప్రియదర్శన్, ప్రణవ్ మోహన్‌లాల్ (మోహన్‌లాల్ తనయుడు) కీలక పాత్రలు పోషించారు. 16వ శతాబ్దానికి చెందిన నేవల్ కమాండర్ కుంజాలి మరక్కర్ జీవితం ఆధారంగా ఈ సినిమా తెరకెక్కింది. ఈ సంగతి ఇలా ఉంచితే... తాజా జాతీయ అవార్డుల్లో ‘మరక్కర్’ సినిమా మూడు విభాగాల్లో (ఉత్తమ చిత్రం, స్పెషల్ ఎఫెక్ట్స్, కాస్ట్యూమ్ డిజైనింగ్) అవార్డులు సాధించిన సంగతి తెలిసిందే. -
ప్రతిష్టాత్మక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కీర్తి సురేష్..!
హైదరాబాద్: ఆభరణాల విక్రయ సంస్థ జోస్ ఆలుక్కాస్ తన బ్రాండ్ అంబాసిడర్‌గా ప్రముఖ నటి, జాతీయ అవార్డు గ్రహీత కీర్తి సురేష్‌ను నియమించుకుంది. దక్షిణాది సినిమా రంగంలో అత్యధిక ప్రజాదరణ కలిగిన కీర్తి... సంస్థ ప్రకటనల్లో నటించి తమ ఉత్పత్తులను కొత్త కస్టమర్లకు మరింత చేరువ చేస్తుందని కంపెనీ ఆశిస్తోంది. సంస్థ విస్తరణ ప్రణాళికల్లో భాగంగా ఈ ఏడాది పలు రాష్ట్రాల్లో కొత్త షోరూంలను ప్రారంభిస్తామని జోస్ ఆలుక్కాస్ ఒక ప్రకటనలో తెలిపింది. తమ సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా కీర్తి సురేష్ సేవలు దీర్ఘకాలం కొనసాగాలని సంస్థ ఆకాంక్షిస్తున్నట్లు ప్రకటన వివరించింది. జోస్ ఆలుక్కాస్ వంటి ప్రతిష్టాత్మక సంస్థకు బ్రాండ్ అంబాసిడర్‌గా నియమి తులుకావడం గర్వకారణమని కీర్తి పేర్కొంది. -
బైక్ నడిపిన ‘మాస్టర్’ భామ.. చెట్టెక్కిన బిగ్‌బాస్ బ్యూటీ
మీరు చేసే ప్రతి పనిలో ప్రేమ ప్రధానమైనది కావొచ్చు అంటుంది బిగ్‌బాస్ ఫేమ్ పునర్నవి సమ్మర్ ఫీలింగ్ అంటూ నవ్వులు చిందిస్తున్న తమన్నా మీ గురించి కొంచెం ఎక్కువగా నమ్మడంటున్న రాజ్‌పుత్ పాయల్ బుల్లెట్ నడుపుతున్న మాస్టర్ భామ మాలవికా మోహనన్ ప్లవర్ కోసం చెట్టు ఎక్కిన బిగ్‌బాస్ భామ అరియానా గ్లోరి.. సోషల్ మీడియాలో సినీతారలు పంచుకున్న నేటి విశేషాలు మీకోసం.. View this post on Instagram A post shared by Anupama Parameswaran (@anupamaparameswaran96) View this post on Instagram A post shared by Punarnavi Bhupalam🧿 (@punarnavib) View this post on Instagram A post shared by Malavika Mohanan (@malavikamohanan_) View this post on Instagram A post shared by Raai Laxmi (@iamraailaxmi) View this post on Instagram A post shared by Payal Rajput (@rajputpaayal) View this post on Instagram A post shared by Ariyana Glory (@ariyanaglory) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) A post shared by Nabha Natesh (@nabhanatesh) View this post on Instagram A post shared by Lakshmi Manchu (@lakshmimanchu) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) -
హాట్ పిక్స్‌తో హీటెక్కిస్తున్న రాశి ఖన్నా..కవ్విస్తున్న శ్రద్దా
►ఫ్యామిలీతో ఎంజాయ్ చేస్తున్న కీర్తిసురేశ్ ► ‘ఖిలాడి’సినిమా షూటింగ్ కోసం ఇటలీ వెళ్లిన అనసూయ.. అక్కడ రవితేజతో దిగిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది. ►చీరకట్టులో కవ్విస్తూ కుర్రకారు మతులు పోగొడుతన్న శ్రద్దాదాస్ ►ఇన్‌స్ట్రాగ్రామ్‌లో హాట్ ఫోటోలను షేర్ చేసి కుర్రకారును రెచ్చగొడుతున్న రాఖి ఖన్నా View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Shraddha Das (@shraddhadas43) View this post on Instagram A post shared by Alia Bhatt ☀️ (@aliaabhatt) View this post on Instagram A post shared by renu (@renuudesai) View this post on Instagram A post shared by Varshini (@varshini_sounderajan) View this post on Instagram A post shared by Pooja Hegde (@hegdepooja) View this post on Instagram A post shared by Rashmi Gautam (@rashmigautam) View this post on Instagram A post shared by Raashii Khanna (@raashiikhanna) -
‘రంగ్‌దే’ మూవీ రివ్యూ
టైటిల్ : రంగ్‌దే జానర్: రొమాంటిక్ ఎంటర్టైనర్ నటీనటులు : నితిన్, కిర్తి సురేశ్, నరేశ్, వెన్నెల కిశోర్, కౌసల్య, బ్రహ్మజీ తదితరులు నిర్మాణ సంస్థ : సితారా ఎంటర్టైన్మెంట్ దర్శకత్వం : వెంకీ అట్లూరి సంగీతం : వీ శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫీ : పీసీ శ్రీరాం ఎడిటింగ్ : నవీన్ నూలీ విడుదల తేది : మార్చి 26, 2021 గతేడాది ‘భీష్మ’తో సూపర్ హిట్ అందుకున్న యంగ్ హీరో నితిన్.. ఈ ఏడాది ఆదిలోనే పరాజయాన్ని చవిచూశాడు. ఆయన హీరోగా నటించిన ‘చెక్’ మూవీ ఫిబ్రవరి 26న విడుదలై బాక్సాఫీస్ వద్ద బోల్తాపడింది. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ‘చెక్’ మూవీకి ప్రేక్షకులు చెక్ పెట్టారు. దీంతో ఈ సారి పక్కా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు నితిన్. ఇందులో భాగంగానే ‘తొలి ప్రేమ’ ఫేమ్ వెంకీ అట్లూరితో కలిసి ‘రంగ్ దే’ మూవీ చేశాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీనికి తోడు ప్రమోషన్స్ కూడా గ్రాండ్‌గా చేడయంతో ‘రంగ్‌దే’పై అంచనాలు మరింత పెరిగాయి. మరి ఆ అంచనాలను ‘రంగ్‌దే’ టీమ్ అందుకుందా? నితిన్ కెరీర్లో 29వ సినిమాగా వచ్చిన ‘రంగ్‌దే’ని ప్రేక్షకులను ఏ మేరకు ఆకట్టుకుందో రివ్యూలో చూద్దాం. కథ అర్జున్(నితిన్) చిన్నప్పటి నుంచి చదువులో వెనకబడతాడు. అదే పక్కింట్లోకి వచ్చిన అను(కీర్తి సురేష్) టాపర్. దీంతో ప్రతిసారి అర్జున్ వాళ్ల నాన్న(నరేశ్)అనుతో పోలుస్తూ అతన్ని తిడుతుంటాడు. ఇలా ఫస్ట్ క్లాస్ నుంచి బీటెక్ వరకు అను వల్ల అర్జున్‌కు తిట్లు పడుతూనే ఉంటాయి. దీంతో అర్జున్‌కు అను అంటే విపరీతమైన కోపం, ద్వేషం ఏర్పడుతుంది. కానీ అనుకు మాత్రం అర్జున్ అంటే ఇష్టం. పెద్దయ్యాక ఆ ఇష్టం కాస్త ప్రేమగా మారుతంద. అర్జున్‌కు మాత్రం వయసుతో పాటు అనుపై కోపం పెరుగుతూనే వస్తుంది. ఇద్దరి మధ్య టామ్ అండ్ జెర్రీ వార్ జరుగుతూనే ఉంటుంది. అయితే అనుకొని ఒక సంఘటన వల్ల అర్జున్ అనుని పెళ్లి చేసుకోవాల్సివస్తుంది. అనుతో మాట్లాడడానికే ఇష్టపడని అర్జున్ ఆమెను పెళ్లి ఎందుకు చేసుకున్నాడు? పెళ్లి తర్వాత ఆమెతో కాపురం ఎలా చేశాడు? వారిద్దరి మధ్య గొడవలు అలానే నడిచాయా? లేదా ఒకరినొకరు అర్థం చేసుకొని సంసారం చేశారా? చివరికి వారిద్దరి ఇగోలు పక్కనపెట్టి ఎలా ఒక్కటయ్యారు అనేదే మిగతా కథ. నటీనటులు అల్లరిగా తిరిగే అర్జున్ పాత్రలో నితిన్ అద్భుతంగా నటించాడు. క్యూట్ అండ్ స్టైలీష్ లుక్‌తో అదరగొట్టాడు. కామెడీ స్లీన్లతో పాటు ఎమోషనల్ సన్నివేశాలలో అవలీలగా నటించాడు. నచ్చని భార్యతో కాపురం చేయమంటే ఎంత చికాకుగా ఉంటుందో అర్జున్ పాత్ర తెలియజేస్తుంది. ఇక మహానటి కీర్తి సురేష్ అల్లరి పిల్ల అను పాత్రలో జీవించేసింది. అమాయకంగా ఉంటూనే అర్జున్‌ని ఇరకాటంతో పడేస్తుంది. కొన్ని ఎమోషన్ సీన్లలో కూడా అవలీలగా నటించి నిజంగానే మహానటి అనిపించుకుంది. హీరో తండ్రి పాత్రలో నరేశ్ అలరించాడు. తనదైన శైలీలో కామెడీ చేస్తూ నవ్వులు పూయించాడు. ఇక హీరో స్నేహితులుగా ‘కలర్ ఫోటో’ ఫేమ్ సుహాస్, అభినవ్ గౌతమ్ పర్వాలేదనిపించారు. సెకండాఫ్‌లో వచ్చిన వెన్నల కిషోర్ ఉన్నంతలో కాస్త నవ్వించే ప్రయత్నం చేశాడు. వినీత్, సత్యం రాజేశ్, బ్రహ్మాజీ తదితరులు తమ పాత్రల పరిధిమేర నటించారు. విశ్లేషణ పక్క పక్కనే ఉండే రెండు కుటుంబాల కథ ఇది. సహజంగానే మనం మన ఇంట్లోవాళ్లను పక్కింటివాళ్లతో పోల్చి చూస్తుంటాం. ముఖ్యంగా చదువు విషయంలో ఈ పోలికలు మరీ ఎక్కువ. తమ బిడ్డ కంటే పక్కింటి వాళ్లు బిడ్డకు ఒక్క మార్కు ఎక్కువ వచ్చిన బాధపడే తల్లిదండ్రులు కోకొల్లలు. దీంతో పక్కింటి వాళ్లతో పోల్చడంతో సహజంగానే ఆ పిల్లల మధ్య అసూయ, ద్వేషం లాంటి ఏర్పడతాయి. ‘రంగ్ దే’ సినిమా నేపథ్యం కూడా అదే. ఒకరంటే ఒకరికి పడని ఓ అబ్బాయి, ఓ అమ్మాయి మధ్య వ్యవహారం పెళ్లిదాకా వస్తే ఎలాంటి పరిస్థితులకు దారి తీస్తాయనేదే ‘రంగ్‌దే’ కథ. దర్శకుడు వెంకీ అట్లూరి చెప్పాలనుకున్న పాయింట్‌ను కాస్త ఎమోషనల్‌గా చూపించాలనుకున్నాడు. కానీ అది వర్కౌట్ కాలేదు. కథలో కొత్తదనం ఏమిలేదు కానీ తెరపై చూపించిన విధానం బాగుంది. ప్రేక్షకుడికి బోర్ కొట్టించకుండా కథనాన్ని సాగించాడు. హీరో హీరోయిన్ మధ్య ఇగో, క్లాషెస్ లాంటి సన్నివేశాలు ప్రేక్షకుడి అలరిస్తాయి. అను, అర్జున్ మధ్య జరిగే టామ్ అండ్ జెర్రీ వార్ ప్రేక్షకులను అట్రాక్ట్ చేస్తుంది. అయితే స్లో నెరెషన్ మాత్రం ప్రేక్షకుడి సహనాన్ని పరీక్షించేలా ఉంటుంది. ఇంటర్వెల్లో ఇచ్చిన ట్విస్ట్ మాత్రం సెకండాఫ్‌పై మరింత ఆసక్తిని కలిగిస్తుంది. అయితే ఫస్టాఫ్‌లో సినిమానే బాగానే నడిపిన, సెకండాఫ్ కాస్త దెబ్బ కొట్టించినట్టు అనిపిస్తుంది. హీరో, హీరోయిన్ల మధ్య ఎమోషనల్ సీన్స్ కన్విన్సింగ్‌గా అనిపించవు. కథంతా రోటీన్‌గా సాగడం, దానికి తోడు ప్రతి సన్నివేశం పాత సినిమాలను గుర్తుకు తేవడం కాస్త ప్రతికూల అంశమే ఇక ఈ సినిమాకు ప్రధాన బలం దేవి శ్రీ ప్రాసాద్ సంగీతం. ప్రతి పాట ఆకట్టుకునేలా ఉంది. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కూడా అద్భుతంగా ఇచ్చాడు. ఎడిటర్ నవీన్ నూలి తన కత్తెర ఇంకాస్త పనిచెప్పాల్సింది. సెకండాఫ్‌లోని చాలా సన్నివేశాలను ఇంకాస్త క్రిస్ప్‌గా కట్ చేస్తే బాగుండనిపిస్తుంది. పీసీ శ్రీరాం సినిమాటోగ్రఫి బాగుంది. ప్రతి సీన్‌ని కళ్లకు కట్టినట్లు చూపించాడు. సితారా ఎంటర్టైన్మెంట్ నిర్మాణ విలువలు సినిమా స్థాయికి తగ్గట్టుగా ఉన్నాయి. మొత్తానికి రంగ్ దే స్టోరీ రొటీనే అయినప్పటికీ అర్జున్, అనుల టామ్ అండ్ జెర్రీ వార్ యువతను ఆకట్టుకుంటుందనడంలో సందేహం లేదు. ప్లస్ పాయింట్స్ నితిన్, కీర్తి సురేష్ నటన కామెడీ సీన్స్ సంగీతం మైనస్ పాయింట్స్: రొటీన్ స్టోరి స్లో నెరేషన్స్ సెకండాఫ్ సాగదీత సీన్లు వర్కౌట్ కాని ఎమోషనల్ సీన్లు - అంజి శెట్టె, సాక్షి వెబ్‌డెస్క్ -
‘నాకన్నా నితిన్, కీర్తి ఎక్కువ నమ్మారు’
‘‘నా జీవితంలోని ప్రేమకథలనే నేను సినిమాలుగా తీస్తున్నానని కొందరు అంటారు. అది కరెక్ట్ కాదు. నా జీవితంలో ప్రేమకథలే లేవు. నా తొలి రెండు చిత్రాలు ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’లో ఎంటర్టైన్ మెంట్ ఎక్కువగా ఉంటుంది. ‘రంగ్ దే’లో హ్యూమన్ ఎమోషన్స్ ఎక్కువగా ఉంటాయి’’ అన్నారు వెంకీ అట్లూరి. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ‘రంగ్ దే’ నేడు విడుదల కానుంది. ఈ సందర్భంగా వెంకీ అట్లూరి చెప్పిన విశేషాలు. ► ‘రంగ్ దే’ కథను నితిన్ కు చెప్పినప్పుడు ఆయన కమర్షియల్ సినిమా ‘భీష్మ’ చేస్తున్నారు. అలాగే ‘పవర్‌పేట’ అనే ఓ పొలిటికల్ మూవీ కమిటయ్యారు. ఈ సమయంలో నా కథకు ఓకే చెబుతారా? అనిపించింది. కానీ ఓకే అన్నారు. ఫస్ట్ సిట్టింగ్‌లోనే నితిన్, కీర్తి సినిమాకు ఓకే చెప్పారు. ఈ కథను ఇద్దరూ నాకన్నా ఎక్కువగా నమ్మారు. వారి నమ్మకం నాలో ధైర్యాన్ని పెంచింది. ► పక్క పక్క ఇళ్లల్లో ఉండే ఓ అమ్మాయి, అబ్బాయిల మధ్య చదువు, కెరీర్... ఇలా ప్రతి విషయంలోనూ పోలిక పెడుతుంటారు. అందుకే మొదట్లో ఒకరంటే ఒకరికి ఇష్టం ఉండదు. కానీ ఆ తర్వాత ఈ ఇద్దరూ పెళ్లి చేసుకుంటే ఎలా ఉంటుంది? అన్నదే ‘రంగ్ దే’ కథ. ఫ్యామిలీ ఆడియన్స్, యూత్‌కి కనెక్ట్ అయ్యే సినిమా ఇది. కెమెరా మ్యాన్ పీసీ శ్రీరామ్‌గారితో వర్క్ చేయడం వల్ల దర్శకుడిగా మెరుగయ్యాను. నా తర్వాతి సినిమాను సితార, ‘దిల్’ రాజు నిర్మాణ సంస్థలు కలిసి నిర్మిస్తున్నాయి. -
'రంగ్‌దే' ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫోటోలు
-
జీవితంలోని ఏడురంగులను చూపించే సినిమా 'రంగ్ దే'
‘‘అన్ని జంతువులూ నవ్వలేవు. కేవలం మనిషి మాత్రమే నవ్వగలడు అంటారు. అలాగే అన్ని జంతువులకు వస్తువులు బ్లాక్ అండ్ వైట్‌లోనే కనిపిస్తాయి. మనుషులకు మాత్రమే ఏడురంగులు చూసే అదృష్టం ఉంది. ఈ సినిమా కూడా మీకు జీవితంలో ఉన్న ఏడురంగులను చూపిస్తుంది’’ అన్నారు ప్రముఖ దర్శకులు త్రివిక్రమ్. నితిన్ , కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 26న విడుదల కానుంది. ఈ చిత్రం ప్రీ రిలీజ్ వేడుకలో ముఖ్య అతిథిగా పాల్గొన్న త్రివిక్రమ్ మాట్లాడుతూ – ‘‘ఈ సినిమా చూశాను. అర్జున్ , అను నాకు బాగా నచ్చారు. నేను తీసిన ‘అఆ’ సినిమాలో అఅ ఉన్నాయి. ఈ సినిమాలో (అర్జున్, అను) క్యారెక్టర్స్ ఉన్నాయి. ’అఆ!’ను మించి ‘రంగ్ దే’ హిట్ కావాలని కోరుకుంటున్నాను. నితిన్ నాకు బ్రదర్. అతను నటించిన ఏ సినిమా అయినా హిట్ కావాలని కోరుకుంటాను. ఎలాంటి పరిస్థితులనుంచైనా పాటను ఇవ్వగలడు దేవిశ్రీ ప్రసాద్.. టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’’అని అన్నారు. నితిన్ మాట్లాడుతూ – ‘‘ఈ వేదికపై నా ‘అఆ!’ సినిమా ఫంక్షన్ జరిగింది. దర్శకుడు వెంకీ ఈ సినిమాను బాగా తీశాడు. ఈ నిర్మాతలతో ఇది నా మూడో సినిమా. నా ఫ్లాప్ మూవీస్ తర్వాత నాకో హిట్ ఇస్తున్న నిర్మాతలు పీడీవీ ప్రసాద్, సూర్యదేవర నాగవంశీ, చినబాబులకు థ్యాంక్స్. దేవిశ్రీతో నాది ఫస్ట్ కాంబినేషన్ . మంచి ఆల్బమ్ ఇచ్చారు’’ అన్నారు. వెంకీ అట్లూరి మాట్లాడుతూ– ‘‘అర్జున్ , అను క్యారెక్టర్లకు ప్రాణం పోసిన నితిన్ , కీర్తీ సురేష్‌కు థ్యాంక్స్. కోవిడ్ కారణంగా కొన్ని నెలలు షూటింగ్‌లు జరగకపోయినా చిత్రయూనిట్ జీతాలు చెల్లించారు నిర్మాతలు పీడీవీ ప్రసాద్, నాగవంశీ. నిర్మాతలంటే నాకు మరింత గౌరవం పెరిగింది. పీసీ శ్రీరామ్‌గారితో వర్క్ చేయడం నా అదృష్టంగా భావిస్తున్నాను. ఆయన దగ్గర నేను రోజుకో విషయం నేర్చుకున్నాను’’ అన్నారు. దేవిశ్రీ ప్రసాద్ మాట్లాడుతూ – ‘‘వెంకీ అట్లూరి దర్శకత్వంలో వచ్చిన ‘తొలిప్రేమ’, ‘మిస్టర్ మజ్ను’ సినిమాలకు నేను మ్యూజిక్ డైరెక్టర్‌గా చేయాల్సింది.. కుదర్లేదు. ఈ సినిమా చేసినందుకు సంతోషంగా ఉంది. యూత్‌ఫుల్‌గా ఉండే మెచ్యూర్డ్ లవ్‌స్టోరీ ‘రంగ్ దే’. నితిన్ కెరీర్లో ఈ సినిమా మరో హిట్‌గా నిలవాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. -
వాళ్లిద్దరూ హ్యాండిచ్చారు : నితిన్
‘‘కర్నూలుకు రావడం ఇదే తొలిసారి. కర్నూలు అంటే నాకు గుర్తొచ్చేది కొండారెడ్డి బురుజు. అక్కడ తీసిన సినిమాలు హిట్టయ్యాయి. ఆ ప్రదేశం ఎంత పవర్ఫుల్లో మీరూ (కర్నూలువాసులను ఉద్దేశించి) అంతే పవర్‌ఫుల్‌గా ఉన్నారు’’ అని హీరో నితిన్ అన్నారు. వెంకీ అట్లూరి దర్శకత్వంలో నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ సినిమా ట్రైలర్ విడుదల వేడుకను కర్నూలులో నిర్వహించారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్, కోడుమూరు ఎమ్మెల్యే సుధాకర్, డీజీ భరత్ ట్రైలర్‌ను రిలీజ్ చేశారు. ‘‘రంగ్ దే’ ఘనవిజయం సాధించాలి. కర్నూలుకు తరచూ వచ్చి సినిమా షూటింగ్స్ చేయాలని నితిన్‌ను కోరుతున్నాం’’ అన్నారు హఫీజ్ ఖాన్, సుధాకర్. నితిన్ మాట్లాడుతూ– ‘‘ట్రైలర్ విడుదలకు కీర్తీ సురేశ్, వెంకీ అట్లూరి రావాల్సింది.. కానీ ఇద్దరూ హ్యాండిచ్చారు. రాయలసీమ అంటే మాస్, ఫ్యాక్షన్ అంటారు. కానీ ఆ రెండింటి కంటే కూడా మీలో ఎక్కువ ప్రేమ ఉంది. ఇదే ప్రేమతో మా సినిమా చూసి, హిట్టివ్వండి’’ అన్నారు. ‘‘మా సినిమాని పెద్ద హిట్ చేయాలని కోరుకుంటున్నాను’’ అన్నారు నాగవంశీ. -
సోషల్ హల్చల్: యూఎస్‌లో ‘జాతిరత్నాల’ రచ్చ
పిజ్జా తినకుండా ఉండలేకపోయిన కీర్తి సురేష్.. ఆటపట్టించిన నితిన్ ప్రితిజింటాకు ముద్దు ఇచ్చిన దితేశ్ దేశ్‌ముఖ్.. ఇంటికెళ్లక ఏం జరిగిందో తెలుసా అంటూ ఫన్నీ వీడియోని షేర్ చేసింది జెనిలియా అమెరికాలో రచ్చ రచ్చ చేస్తున్న ‘జాతిరత్నాలు’ కూతురి కోసం చికెన్ వండిన యాంకర్ రవి View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Anasuya Bharadwaj (@itsme_anasuya) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Samantha Akkineni (@samantharuthprabhuoffl) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Kajal A Kitchlu (@kajalaggarwalofficial) View this post on Instagram A post shared by Anchor Ravi (@anchorravi_offl) View this post on Instagram A post shared by Genelia Deshmukh (@geneliad) View this post on Instagram A post shared by Swapna Cinema (@swapnacinema) -
ఆమె వల్లే పెద్ద వెధవనయ్యానంటున్న నితిన్
హీరో నితిన్, కీర్తి సురేశ్ జంటగా వస్తున్న రొమాంటిక్ ఎంటర్టైనర్ మూవీ ‘రంగ్‌దే’. ఇటీవల ఈ మూవీ షూటింగ్‌ను పూర్తి చేసుకుని పోస్ట్ ప్రొడక్షన్ పనులను వేగవంతంగా జరపుకుంటోంది. ఈ నేపథ్యంలో చిత్ర యూనిట్ ‘రంగ్‌దే’ ట్రైలర్‌ను శుక్రవారం రాత్రి విడుదల చేసింది. ఇప్పటికే విడుదలైన ఈ మూవీ పోస్టర్లు, టీజర్లను ప్రేక్షకుల అంచనాలు పెంచుతున్నాయి. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ మూవీకి మరింత హైప్ క్రియేట్ చేస్తుందని చెప్పుకొవచ్చు. ఇందులో ‘మనం ప్రేమించిన వాళ్ల విలువ మనం వద్దనుకున్నప్పుడు కాదు.. వారు మనల్ని అక్కర్లేదు అనుకున్నపుడు తెలుస్తుంది’ అంటూ నితిన్ ఎమోషనల్‌గా చెప్పె డైలాగ్ ప్రేమికులను టచ్ చేస్తోంది. ‘తొలిప్రేమ’,‘మజ్ను’ వంటి వైవిధ్యమైన ప్రేమ కథాచిత్రాలను ఆవిష్కరించిన యువ దర్శకుడు వెంకీ అట్లూరి ఈ మూవీకి దర్శకత్వం వహించాడు. ‘నేను అర్జున్. నాకొక గర్ల్ ఫ్రెండ్‌ని ప్రసాదించమని దేవుణ్ని కోరుకున్నాను. కోరుకున్న ఆరో సెకండ్కే ఒక పాప మా కాలనీకి వచ్చింది. అప్పటి నుంచి తొక్కడం స్టార్ట్ చేసింది.. నా జీవితాన్ని’ అంటూ నితిన్ డైలాగ్‌తో ఈ ట్రైలర్ ప్రారంభం అవుతుంది. ఆ తర్వాత వెన్నెల కిషోర్ ‘మీకు చేసిన దానికి వాడిపై కోపం రావడం లేదా’ అని కీర్తిని ప్రశ్నిస్తాడు. దీనికి కీర్తి ‘చంపేస్తే ఒక్కసారే పోతాడు.. అందుకే పెళ్లి చేసుకున్నా’ అంటూ చెప్పె డైలాగ్ నవ్వులు పూయిస్తుంది. మొత్తానికి ఈ టైలర్ చూస్తుంటే మూవీలో నితిన్, కీర్తి సురేశ్‌లు టామ్ అండ్ జెర్రీలా పోట్లాడుకుంటారని అర్థం అవుతోంది. ఇక నితిన్ కీర్తికి భయపడుతూ చెప్పె కొన్ని పంచ్ డైలాగ్స్ బాగా ఆకట్టుకుంటున్నాయి. -
సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడొద్దు
‘‘ఒకే ఆల్బమ్‌లో ఒకదానికొకటి భిన్నంగా అనిపించే పాటలు ఉండటం అరుదు. దేవిశ్రీ ప్రసాద్ తన ఆల్బమ్‌లోని పాటలన్నీ డిఫరెంట్ వేరియేషన్స్‌తో ఉండేందుకు ప్రయత్నిస్తారు. ‘రంగ్ దే’ ఆల్బమ్ అలాంటిదే’’ అని పాటల రచయిత శ్రీమణి అన్నారు. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్ దే’. సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 26న విడుదలవుతోంది. ఈ చిత్రంలోని నాలుగు పాటలు రాసిన శ్రీమణి విలేకరులతో మాట్లాడుతూ– ‘‘100% లవ్’ సినిమాతో దేవిశ్రీతో నా ప్రయాణం మొదలైంది. ఈ ఏప్రిల్‌తో మా ప్రయాణానికి పదేళ్లు పూర్తవుతాయి. ‘తొలిప్రేమ’ చిత్రం నుంచే వెంకీ అట్లూరితో కలిసి పనిచేస్తున్నాను. సాధారణంగా మ్యూజిక్ డైరెక్టర్ ఇచ్చే ట్యూన్స్‌కే మేం లిరిక్స్ రాస్తుంటాం. ఒక్కోసారి కాన్సెప్ట్‌కు తగ్గ లిరిక్స్ రాసుకొని, ఆ తర్వాత ట్యూన్స్ కట్టడం జరుగుతుంది. ప్రతి పాటనూ ఓ ఛాలెంజ్‌గానే తీసుకుంటాను. నేను రాసే పాటని మొదట నా భార్యకు లేదంటే నా ఫ్రెండ్ మురళికి, రైటర్ తోట శ్రీనివాస్‌కు వినిపిస్తుంటాను. ఫిలాసఫికల్ సాంగ్స్‌ని మాత్రం సీతారామశాస్త్రిగారికి వినిపించి, సలహాలు తీసుకుంటుంటాను. ‘జులాయి’ నుంచే సితార ఎంటర్టైన్మెంట్స్ చిత్రాలకు పాటలు రాస్తున్నాను. సినిమా విడుదలకు ముందే పాటలు హిట్టయితే, సినిమాని పాటలు డామినేట్ చేస్తున్నట్లుగా చూడకూడదు. లవ్ స్టోరీకి పాటలు పాపులర్ అయితే కమర్షియల్‌గా అది సినిమాకు ఎంతో ఉపయోగపడుతుంది’’ అన్నారు. -
రంగ్‌దే ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతో తెలుసా!
నితిన్, కీర్తి సురేశ్ హీరోహీరోయిన్లుగా వస్తున్న మూవీ ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరీ దర్శకత్వం వహిస్తోన్న ఈ మూవీ సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నాగ వంశీ నిర్మిస్తున్నారు. దీనికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమాలోని రెండుపాటలు అభిమానులను తెగ ఆకట్టుకున్నాయి. ఇక పోస్టర్లు, టీజర్లు కూడా సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశాయి. దీంతో ఈ మూవీపై సినీ ప్రేమికుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ నేపథ్యంలో ‘రంగ్‌దే’ను విదేశీ హక్కుల కింద ఫార్స్ ఫిల్మ్స్ 1.5 కోట్ల రూపాయలకు స్వాధీనం చేసుకోగా.. ప్రీ రిలీజ్ వ్యాపారం మొత్తం రూ. 37.5 కోట్లుగా ఉన్నట్లు తాజాగా బిజినెస్ రిపోర్టు విడుదలైంది. కాగా గతంలో నితిన్-రష్మిక మండన్నా జంటగా వచ్చిన ‘భీష్మ’ బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఎన్నో అంచనాల మధ్య నితిన్, రకుల్ ప్రీత్ సింగ్, ప్రియా ప్రకాష్ వారియర్ లీడ్ రోల్లో వచ్చిన ‘చెక్’ మూవీ ఇటీవల విడుదలైంది. కానీ బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా బొల్తా పడింది. దీంతో నితిన్ ‘రంగ్‌దే’పై ఎన్నో ఆశలు పెట్టుకున్నాడు. ఈ మూవీతో మరోసారి హిట్ కొట్టాలని ఆసక్తిగా ఎదురు చూస్తున్నా నితిన్‌కు ఇది హిట్‌ను ఇస్తుందా లేదా అనేది మార్చి 26వ తేదీ వరకు వేచి చూడాల్సిందే. చదవండి: ‘నా కనులు ఎపుడు’ లిరికల్ వీడియో వచ్చేసిందిగా... అక్కినేని అభిమానులకు ఆర్జీవీ సర్ప్రైజ్ నరేష్‌తో లిప్‌లాక్‌పై నటి ఆమని కామెంట్ -
సోషల్ హల్చల్: హాట్ పిక్‌తో కవ్విస్తున్న జాన్వీ కపూర్
►కీర్తి సురేశ్ కొంగు పట్టుకొని వదులనంటున్న బుజ్జి కుక్క. ఫన్నీ వీడియోని ఫ్యాన్స్‌తో పంచుకున్న ‘మహానటి’ ►చూపులతో చంపేస్తున్న ‘జాతిరత్నాలు’ చిట్టి ►పని ఒత్తిడి తగ్గించుకునేందుకు కుక్కతో ఆడుకుంటున్న చార్మీ ►అందాలు ఆరబోయాలంటే నా తర్వాతే ఎవరైనా అంటూ హాట్ పిక్‌ని షేర్ చేసిన జాన్వీ కపూర్ View this post on Instagram A post shared by Poonam Bajwa (@poonambajwa555) View this post on Instagram A post shared by M Monal Gajjar (@monal_gajjar) View this post on Instagram A post shared by Janhvi Kapoor (@janhvikapoor) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) View this post on Instagram A post shared by Nikita Sharma (@nikitasharma_official) View this post on Instagram A post shared by Faria Abdullah (@fariaabdullah) View this post on Instagram A post shared by Rashmika Mandanna (@rashmika_mandanna) View this post on Instagram A post shared by Radhika (@radhikaofficial) View this post on Instagram A post shared by Charmmekaur (@charmmekaur) View this post on Instagram A post shared by Shreyas Media (@shreyasgroup) View this post on Instagram A post shared by Aditi B (@aditi_budhathoki) -
బస్టాండే.. బస్టాండే...
బస్టాండే... బస్టాండే.. సింపుల్గుండే లైఫు.. టెంపుల్ రన్‌లా మారే.. ఈ రంగు రంగు లోకం .. చీకట్లోకి జారే లవ్లీగుండే కళలే.. లైఫే లేనిదాయే స్మైలీ లాంటి ఫేసే.... స్మైలే లేనిదాయే’ హీరోయిన్‌కి తాళి కట్టే ముందు హీరో పాడే పాట ఇది. ఈ బాధ ఎందుకు? అనేది ‘రంగ్ దే’ సినిమా చూసి తెలుసుకోవాల్సిందే. నితిన్, కీర్తీ సురేష్ హీరో హీరోయిన్గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న చిత్రం ఇది. పీడీవీ ప్రసాద్ సమర్పకులు. నితిన్, కీర్తిపై చిత్రీకరించిన ఈ చిత్రంలోని రెండో పాట ‘సింపుల్గుండే లైఫు..’ని శనివారం విడుదల చేశారు. ‘‘ఫస్ట్ పాటకు కోటికి పైగా వ్యూస్ వచ్చాయి. రెండో పాట కూడా వీనులవిందుగా ఉంటుంది. దేవిశ్రీప్రసాద్ స్వరాలందించిన ఈ చిత్రంలోని అన్ని పాటలు బాగుంటాయి. కుటుంబసమేతంగా చూడదగ్గ ఈ చిత్రాన్ని మార్చి 26న రిలీజ్ చేస్తున్నాం’’ అని చిత్రబృందం పేర్కొంది. ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్. వెంకటరత్నం (వెంకట్). -
అన్నయ్య రెడీ
‘అన్నాత్తే’ తిరిగి షూటింగ్‌ను స్టార్ట్ చేయబోతున్నాడు. రజనీకాంత్ హీరోగా శివ దర్శకత్వంలో రూపొందుతోన్న సినిమా ‘అన్నాత్తే’. పెద్దన్నయ్య అని అర్థం. ఈ చిత్రంలో మీనా, ఖుష్బూ, కీర్తీ సురేష్, నయనతార నటిస్తున్నారు. గత ఏడాది డిసెంబరులో హైదరాబాద్‌లో ‘అన్నాత్తే’ సినిమా షూటింగ్‌ను స్టార్ట్ చేశారు. కానీ చిత్రబృందంలో కొందరు కరోనా బారిన పడటంతో సినిమా షూటింగ్ ఆగిపోయింది. ఇప్పుడు ఈ సినిమా షూటింగ్‌ను తిరిగి ప్రారంభించడానికి దర్శకుడు శివ సన్నాహాలు చేస్తున్నారు. డిసెంబర్లో స్వల్ప అస్వస్థతకు గురయ్యాక, విశ్రాంతిలో ఉన్న రజనీ షూటింగ్లో పాల్గొనడానికి రెడీ అయ్యారట. మార్చి 15న చిత్రీకరణ ఆరంభించడానికి సన్నాహాలు చేస్తున్నారని తెలిసింది. ఈ షెడ్యూల్లోనే రజనీకాంత్ కూడా పాల్గొంటారట. ఇప్పటికే షూటింగ్ బాగా ఆలస్యమైందని...ఆర్టిస్టుల కాల్షీట్స్ ఇబ్బంది లేకుండా సినిమా షూటింగ్‌ను తొందరగా కంప్లీట్ చేయాలని భావిస్తున్నారట శివ. నవంబరు 4న ‘అన్నాత్తే’ విడుదల కానుంది. -
హీరోయిన్ కీర్తి వెడ్డింగ్ బెల్స్? ఫోటోలు వైరల్
సాక్షి, హైదరాబాద్: టాప్ హీరోయిన్ కీర్తి సురేష్, మ్యూజిక్ డైరెక్టర్, సింగర్ అనిరుధ్ ప్రేమలో మునిగి తేలుతున్నారా? త్వరలో పెళ్లి పీటలెక్కేందుకు సిద్ధమవుతున్నారా? మహానటి మూవీతో నేషనల్ అవార్డు అందుకున్న కీర్తి సురేశ్ పెళ్లి వార్త మరోసారి సోషల్ మీడియాలో ఊపందుకుంది. కీర్తి వివాహానికి సంబంధించి ఇప్పటికే పలు వార్తలు వ్యాపించిన సంగతి తెలిసిందే. తాజాగా కీర్తి పెళ్లిపై మరో గాసిప్ ట్రెండింగ్‌లో ఉంది. తమిళ టాప్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్‌తో కీర్తి ప్రేమలో పడిందని, వీరి పెళ్లికి పెద్దల అంగీకారం కూడా లభించిందంటూ గుసగుసలు వినిపిస్తున్నాయి. తమిళంలో వరస మూవీలతో బిజీగా ఉన్న అనిరుధ్ ప్రియురాలు కీర్తి సురేష్‌తో త్వరలోనే ఏడడుగులు వేయాలని భావిస్తున్నాడట. దీంతో కీర్తి తల్లిదండ్రులు వీరి పెళ్లి ముహూర్తం నిశ్చయించనున్నారట. మరోవైపు ఈ సందర్భంగా అనిరుధ్, కీర్తి సన్నిహితంగా ఉన్న ఫోటోలను అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు. గత అక్టోబర్ (16 అనిరుధ్, కీర్తి సురేష్17) లో పుట్టిన రోజు సందర్భంగా వీరిద్దరూ పరస్పరం బర్తడే విషెస్ తెలుపుకోవడం విశేషంగా నిలిచింది. ఈ సందర్భంగా కీర్తి రెండు ఫోటోలను పోస్ట్ చేశారు. ఇపుడవే వైరల్‌గా మారాయి. మరోవైపు తమిళంలో ప్రముఖ గాయని జోనీతాగాంధీతో అనిరుధ్ పీకల్లోతు ప్రేమలో ఉన్నట్టు ఇటీవల వార్తలొచ్చాయి. మరి తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పిన కీర్తి తాజా ఊహాగానాలపై ఎలా స్పందిస్తారో చూడాలి. కాగా కీర్తి ప్రస్తుతం తెలుగులో మహేశ్‌బాబు ‘సర్కారు వారి పాట’ ‘రంగ్ దే’ ‘గుడ్ లక్ సఖి’ సినిమా పనుల్లో బిజీగా ఉంది. అటు దళపతి విజయ్ హీరోగా, విజయ్ సేతుపతి విలన్‌గా నటించిన మాస్టర్ ఫిల్మ్ సాంగ్స్ సూపర్ హిట్ కావడంతో అనిరుధ్ సంతోషంలో మునిగి తేలుతున్నాడు. ప్రస్తుతం తన స్నేహితుడు నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్ నటిస్తున్న కమాండర్ 65 చిత్రానికి సంగీతం సమకూర్చుతున్నాడు. -
మహానటి ఫేమ్ కీర్తీ సురేష్ లేటెస్ట్ పిక్స్..
-
మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌న్యూస్!
అబుదాబి: సూపర్ స్టార్ మహేశ్ బాబు అభిమానులకు గుడ్ న్యూస్. ఆయన తాజాగా నటిస్తున్న‘సర్కారు వారి పాట’ ఎప్పుడేప్పుడు సెట్స్‌పై వెళుతుందా అని ఎదురు చూస్తున్న అభిమానులకు మైత్రీ మూవీస్ సర్ప్రైజ్ అందించింది. ఇవాళ దుబాయ్‌లో ఈ మూవీ రెగ్యులర్ షూటింగ్ మొదలైందంటూ సోషల్ మీడియా వేదికగా చిత్ర యూనిట్ ప్రకటించింది. ‘ది యాక్షన్ అండ్ ది యాక్షన్ బిగిన్స్’ అనే క్యాప్షన్‌తో ట్వీటర్లో ఓ వీడియోను షేర్ చేసింది. ఇక అది చూసిన మహేశ్ అభిమానులంత పండగ చేసుకుంటున్నారు. సోషల్ మీడియాలో ‘సర్కారు వారి పాట’ పేరుతో హ్యాష్ ట్యాగ్‌ను ట్రెండ్ చేస్తున్నారు. టాలెంటెడ్ డైరెక్డర్ పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ భారీ చిత్రాన్ని 14 రీల్స్ ప్లస్, మహేశ్ బాబు సొంతంగా నిర్మిస్తుండగా లేటెస్ట్ మ్యూజిక్ సెన్సేషన్ తమన్ ఎస్.ఎస్. సంగీతం అందిస్తున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు మాట్లాడుతూ... ‘‘సర్కారు వారి పాట’ మూవీ రెగ్యులర్ షూటింగ్ ఈ రోజు దుబాయ్‌లో ప్రారంభమైంది. సూపర్‌స్టార్ మహేశ్‌బాబును డైరెక్ట్ చేయాలన్న ఇన్నేళ్ళ నా కల ఈ రోజు నిజమైంది. మహేష్ బాబుతో కలిసి పనిచేయడం చాలా ఎగ్జైటింగ్‌గా ఉంది. (చదవండి: ‘సర్కారు వారి పాట’ కోసం దుబాయ్ ఛలో) ఈ మూవీని ఒక ఛాలెంజింగ్ తీసుకుని చేస్తున్నాను. డెఫినెట్‌గా ప్రేక్షకులు, మహేష్ బాబు అభిమానుల అంచనాలకు తగినట్లుగా ఈ సినిమా పెద్ద స్థాయిలో ఉంటుంది. ఇరవై రోజుల పాటు దుబాయ్‌లో ఫస్ట్ షెడ్యూల్ జరగనుంది. ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలను త్వరలోనే వెల్లడిస్తాం’ అంటూ చెప్పుకొచ్చారు. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ.. ‘సర్కారు వారి పాట రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైన సందర్భంగా టీమ్ అందరికీ ఆల్ ది బెస్ట్’ చెప్పారు. బ్యాంకింగ్ నేపథ్యంలో రూపొందుతున్న ఈ చిత్రం భారత బ్యాంకింగ్ రంగంలోని కుంభకోణాల చుట్టూ ఈ కథ సాగుతుందని సమాచారం. కాగా మహేశ్‌బాబు సరసన కీర్తీ సురేశ్ మొదటిసారి నటిస్తున్నారు. ఇక వెన్నెల కిషోర్, సుబ్బరాజులు కీలక పాత్రలో కనిపించన్నారు. అంతేగాక ఇతర భారీ తారాగణం నటిస్తున్నఈ చిత్రానికి సినిమాటోగ్రఫి: మధి, ఎడిటర్: మార్తాండ్ కె. వెంకటేష్, ఆర్ట్ డైరెక్టర్: ఏ ఎస్ ప్రకాష్, ఫైట్ మాస్టర్: రామ్ - లక్ష్మణ్, పిఆర్ఓ: బి.ఏ.రాజు, లైన్ ప్రొడ్యూసర్: రాజ్ కుమార్, కో డైరెక్టర్: విజయ రామ్ ప్రసాద్, సీఈఓ: చెర్రీ, నిర్మాతలు: నవీన్ ఎర్నేని , రవిశంకర్ యలమంచిలి, రామ్ ఆచంట, గోపి ఆచంట,రచన, దర్శకత్వం: పరశురామ్ పెట్ల. (చదవండి: మహేశ్ ఫిట్నెస్ సీక్రెట్ ఇదేనా.. వీడియో వైరల్) The auction and the action begins 🎬 #SarkaruVaariPaataShuru 💥💥 Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @MythriOfficial @GMBents#SarkaruVaariPaata 🔔 pic.twitter.com/Z75sPfWoi9 — 14 Reels Plus (@14ReelsPlus) January 25, 2021 -
‘చాలా రోజుల తర్వాత మీ నవ్వు చూస్తున్నాం’
కొత్త ఏడాది ప్రారంభంలోనే క్యూట్ క్యూట్ ఫొటోలతో కీర్తి సురేశ్ అభిమానులను ఫిదా చేశారు. 2021 తొలి ఫొటోషూట్ అంటూ ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని ఫొటోలు షేర్ చేశారు. ‘మహానటి’ షేర్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తన పెంపుడు కుక్కతో కలిసి తీసుకున్న కొన్ని ఫొటోలను ఆమె బుమారాంగ్‌లో పంచుకున్నారు. డిజైనర్ అర్చామెహతా, హేర్, మేకప్ స్టైలిస్ట్ రేచెల్‌లను ట్యాగ్ చేశారు. అంతేగాక వారితో కలిసి సరదాగా కెమెరాకు ఫొజులిస్తున్న ఫొటోలను కూడా ఆమె పంచుకున్నారు. ‘చాలా రోజుల తర్వాత మీ నవ్వు చూస్తున్నాము’, చాలా అందంగా ఉన్నారు’ అంటూ అభిమానులు హర్ట్ ఎమోజీల వర్షం కురిపిస్తున్నారు. (చదవండి: పెళ్లి చేసుకోవాలంటూ కీర్తి పేరేంట్స్ ఒత్తిడి ?) కాగా కీర్తి ‘గీతా గోవిందం’ ఫేం పరశురామ్ తెరకెక్కించనున్న ‘సర్కారు వారి పాట’లో సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన కీర్తి నటించనున్న సంగతి తెలిసిందే. అలాగే ప్రస్తుతం ఆమె వెంకీ అట్లూరి రూపొందిస్తున్న రంగ్‌దేలో నితిన్ సరసన నటిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించిన చిత్ర యూనిట్ మార్చి 26న ‘రంగ్‌దే’ విడుదలకానుందంటూ ఓ వీడియోను విడుదల చేసింది. నరేశ్, వినీత్, రోహిణి,‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.సి శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. దీనితో పాటు జాతీయ అవార్డు గ్రహీత నగేష్ కుకునూర్ దర్శకత్వంలో కీర్తి నటించిన ‘గుడ్ లక్ సఖి’ కూడా విడుదలకు సిద్ధంగా ఉంది. అలాగే మలయాళంలో మోహన్ లాల్ ప్రధాన పాత్రలో నటిస్తోన్న ‘మరక్కర్’ కీర్తీ కీలక పాత్ర పోషిస్తోంది. (చదవండి: దర్శకుడి వెంటపడి చితకబాదిన హీరోయిన్) View this post on Instagram A post shared by Keerthy Suresh (@keerthysureshofficial) -
మార్చిలో రంగ్‌దే
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘రంగ్‌దే’. సితార ఎంటర్టైన్మెంట్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోంది. నూతన సంవత్సరాన్ని పురస్కరించుకుని ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించారు. మార్చి 26 ‘రంగ్‌దే’ థియేటర్లలో విడుదలకానుందని వీడియో ద్వారా విడుదల చేశారు. నితిన్, కీర్తీల డ్యాన్స్‌తో ఈ వీడియో ఉంది. ‘‘కుటుంబ సభ్యుల మధ్య ఉండే ప్రేమకథే ఈ సినిమా.. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చేలా ఉంటుంది’’ అన్నారు నాగవంశి. నరేశ్, వినీత్, రోహిణి,‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: పి.సి శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. -
‘రంగ్ దే’ రిలీజ్ డేట్ వచ్చేసింది..
యంగ్ హీరో నితిన్ నటిస్తున్న తాజా చిత్రం ‘రంగ్ దే’. రొమాంటిక్ లవ్ స్టోరిగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తుండగా.. కీర్తి సురేష్ హీరోయిన్గా నటిస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై సూర్యదేవర నాగవంశీ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. తాజాగా న్యూ ఇయర్ సందర్భంగా ఈ సినిమా నుంచి సరికొత్త అప్డేట్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. రంగ్ దే చిత్రాన్ని మార్చి 26న థియేటర్లలతో విడుదల చేస్తున్నట్లు అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు దర్శకుడు వెంకీ అట్లూరి ట్విటర్లో షేర్ చేశారు. చదవండి: నితిన్ 30వ సినిమా షూటింగ్ షురూ Love, Romance & Lot's of Entertainment coming to theatres near you from 26th March. 💖 #RangDeOn26thMarch ▶️ https://t.co/TvzL1VV9r3#RangDe @actor_nithiin @KeerthyOfficial @pcsreeram @thisisdsp @vamsi84 @sitharaents @adityamusic @SVR4446 @ShreeLyricist @navinnooli pic.twitter.com/B961KC8FBx — Atluri Venky (@dirvenky_atluri) January 1, 2021 ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. పాటలు, సన్నివేశాలు అన్ని కంప్లీట్ చేసుకుని విడుదలకు సిద్ధంగా ఉంది. నరేష్, వినీత్, రోహిణి, వెన్నెల కిషోర్, గాయత్రి రఘురామ్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. ఈ సినిమాలోని ఒక రొమాంటిక్ మ్యాజికల్ మెలోడీ సాంగ్‌ను ఇప్పటికే రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. `ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది…` అంటూ సాగే పల్లవి గల గీతానికి శ్రీమణి సాహిత్యం అందించారు. హరిప్రియ, కపిలన్ లు ఆలపించారు. హీరో నితిన్, కీర్తి సురేష్‌లపై రొమాంటిక్ మెలోడీగా వెండితెరపై ప్రేక్షకులకు కనువిందు కలిగించేలా ఈ పాటని దర్శకుడు వెంకీ అట్లూరి చిత్రీకరించారు. -
పెళ్లి చేసుకోవాలంటూ కీర్తి పేరేంట్స్ ఒత్తిడి ?
సాక్షి, చెన్నై : ప్రముఖ హీరోయిన్ కీర్తి సురేష్ పెళ్లికి సంబంధించి రకరకాలుగా ప్రచారం జరుగుతోంది. ఈ ఏడాది మార్చిలోనూ కీర్తి ఓ బిజినెస్‌మెన్‌ను పెళ్లాడనున్నట్లు వార్తలు వినిపించాయి. తాజాగా కీర్తి పేరేంట్స్ కూడా ఆమెకు పెళ్లి చేయాలని నిశ్చయించుకున్నారట. త్వరలోనే ఆమెకు పెళ్లి చేయాలని భావిస్తున్న కీర్తి కుటుంబ సభ్యులు అందుకోసం సంబంధాలు వెతికే పనిలో పడ్డట్లు సమాచారం. అయితే కీర్తి మాత్రం తనకు ఇప్పట్లో పెళ్లి చేసుకునే ఆలోచన లేదని చెప్పినట్లు టాక్ వినిపిస్తోంది. ప్రస్తుతం తెలుగు, తమిళ చిత్రాలతో బిజీగా ఉన్న ఆమె మరికొంతకాలం యాక్టింగ్ కెరియర్ను కంటిన్యూ చేస్తానని పేర్కొన్నట్లు సన్నిహితులు చెబుతున్నారు. దీంతో ప్రస్తుతానికి పెళ్లి ప్రణాళికలను వాయిదా వేస్తున్నట్లు తెలుస్తోంది. (కీర్తి సురేష్‌కు వెడ్డింగ్ బెల్? ) నటి మేనక, సురేష్‌కుమార్ దంపతుల ముద్దుల కుమార్తె అయిన కీర్తి సురేష్ కోలీవుడ్‌లో ‘ఇడు ఎన్నా మాయం’ చిత్రంతో తెరంగేట్రం చేశారు. అనతికాలంలోనే స్టార్ హీరోయిన్గా ఎదిగిన కీర్తి సురేష్ ‘మహానటి’ చిత్రానికి జాతీయ ఉత్తమ నటి అవార్డును అందుకున్నారు. కాగా ఈ ఏడాది ఆమె నటించిన పెంగ్విన్, మిస్ ఇండియా సినిమాలు ఓటీటీలోనే రిలీజ్ అయ్యాయి. ప్రముఖ దర్శకుడు కుకునూర్ నగేశ్ తొలిసారి తెలుగులో తెరకెక్కిస్తున్న స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ సినిమాలో ప్రస్తుతం కీర్తి సురేశ్ నటిస్తున్నారు. 'గుడ్ లక్ సఖి' అనే పేరుతో వస్తున్న ఈ సినిమాలో కీర్తి డీ- గ్లామర్ పాత్రలో కనిపించనున్నారు. అలాగే తెలుగులో నితిన్ సరసన 'రంగ్ దే', మహేష్‌కు జోడీగా 'సర్కారు వారి పాట' సినిమాల్లో కనిపించనున్నారు. (దర్శకుడిని పరిగెత్తించి మరీ కొట్టిన కీర్తి సురేశ్ ) -
దర్శకుడి వెంటపడి చితకబాదిన హీరోయిన్
నితిన్, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం 'రంగ్ దే'. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాను సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. కోవిడ్ బ్రేక్ తర్వాత ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. కొన్ని పాటల చిత్రీకరణ కోసం యూనిట్ దుబాయ్‌కి వెళ్లింది. ఈ క్రమంలో సినిమా సెట్లో 'మహానటి' కీర్తి సురేశ్ కాసేపు కునుకు తీస్తుండగా డైరెక్టర్ వెంకీతో కలిసి నితిన్ ఆమె వెనకాల చేరి సెల్ఫీ దిగారు. అనంతరం దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. షూటింగ్‌తో తమకు చెమటలు పడుతుంటే కీర్తి మాత్రం హ్యాపీగా రిలాక్స్ అవుతోందని నితిన్ అక్కసు వెళ్లగక్కారు. (చదవండి: సన్నీ డియోల్‌కు కరోనా) ఈ ఫొటో నెట్టింట వైరల్ కాగా కీర్తి సైతం స్పందించారు. షూటింగ్ సెట్లో ఎప్పుడూ నిద్రపోకూడదన్న గుణపాఠం నేర్చుకున్నానని, కానీ డైరెక్టర్, హీరోపై మాత్రం పగ తీర్చుకుంటానని శపథం చేశారు. అన్నట్లుగానే ఆమె ఈ ఇద్దరిలో ఒకరిపై తొందరగానే పగ తీర్చుకున్నట్లు కనిపిస్తోంది. చేతికి ఓ గొడుగు దొరకడంతో వెంకీ అట్లూరిని కీర్తి చితకబాదారు. ఆయనను పరిగెత్తించి మరీ కొట్టారు. అయితే అదంతా సరదాగానే చేశారు. ఇక నితిన్ ఒక్కడే మిగిలాడని, అతనిపై ప్రతీకారం తీర్చుకుంటే కానీ తన పగ చల్లారదంటున్నారు. చూస్తుంటే నితిన్ కూడా ఏదో ఒక రోజు ఆమె చేతిలో అడ్డంగా దొరికిపోతాడని అనిపిస్తోంది. కాగా రంగ్ దే సినిమాను చిత్రబృందం సంక్రాంతికి విడుదల చేయాలని భావిస్తోంది. (చదవండి: భాష లేని ఊసులాట!) -
'సర్కారు వారి' ప్లాన్ మారిందా?
మహేశ్‌బాబు నటించనున్న తాజా చిత్రం ‘సర్కారువారి పాట’. ఈ సినిమా షూటింగ్ షెడ్యూల్స్‌లో చిన్న మార్పు వచ్చిందని సమాచారం. ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో మహేశ్‌బాబు హీరోగా తెరకెక్కనున్న చిత్రం ‘సర్కారువారి పాట’. మైత్రీ మూవీ మేకర్స్, 14 రీల్స్ ప్లస్, జీయంబీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లు నిర్మించనున్నాయి. కీర్తీ సురేశ్ కథానాయిక. బ్యాంక్ స్కామ్ బ్యాక్‌డ్రాప్‌లో ఈ సినిమా కథాంశం ఉంటుందని తెలిసింది. ఈ సినిమాలో మహేశ్ బ్యాంక్ ఉద్యోగి పాత్రలో కనిపిస్తారట. ఈ సినిమా చిత్రీకరణను అమెరికా షెడ్యూల్‌తో ప్రారంభించాలనుకున్నారు. జనవరి నుంచి అమెరికాలో 45 రోజుల షెడ్యూల్ జరపాలని ప్లాన్ చేసింది చిత్రబృందం. అయితే ప్లాన్‌లో చిన్న చేంజ్ అని తెలిసింది. హైదరాబాద్‌లో కొన్ని రోజుల పాటు చిత్రీకరణ జరిపి, ఆ తర్వాత అమెరికా షెడ్యూల్ ఆరంభించాలనుకుంటున్నారట. జనవరి మొత్తం హైదరాబాద్‌లో చిత్రీకరణ జరిపి, ఫిబ్రవరిలో యూఎస్ వెళ్లనున్నారు. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు మది కెమెరామేన్. -
భాష లేని ఊసులాట!
‘‘ఏమిటో ఇది వివరించలేనిది.. మది ఆగమన్నది తనువాగనన్నది.. భాష లేని ఊసులాట సాగుతున్నది.. అందుకే ఈ మౌనమే ఓ భాష అయినది.. కోరుకోని కోరికేదో తీరుతున్నది...’’ అంటూ ప్రేయసికి తన ప్రేమను తెలియజేస్తున్నారు నితిన్. ఈ ప్రేమ పాట ‘రంగ్ దే’ చిత్రం కోసమే. నితిన్, కీర్తీ సురేష్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ‘ఏమిటో ఇది వివరించలేనిది..’ అంటూ సాగే ఈ చిత్రంలోని తొలి పాట వీడియోను విడుదల చేశారు. ఈ పాటకి శ్రీమణి సాహిత్యం సమకూర్చారు. హరిప్రియ, కపిల్ కపిలన్ పాడారు. దేవిశ్రీ ప్రసాద్ స్వరాలు అందించారు. ‘‘ఈ రొమాంటిక్ మెలోడీని వీక్షకులకు కనువిందు కలిగేలా చిత్రీకరించారు వెంకీ అట్లూరి. ఈ నెల చివరి వారం నుంచి చిత్రానికి సంబంధించిన కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తాం. దుబాయ్‌లో పాటల చిత్రీకరణతో త్వరలోనే షూటింగ్ పూర్తవుతుంది. 2021 సంక్రాంతికి సినిమా విడుదల చేస్తాం’’ అని చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రానికి సమర్పణ: పీడీవీ.ప్రసాద్, కెమెరా: పీసీ శ్రీరామ్, ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్: ఎస్.వెంకటరత్నం (వెంకట్). -
‘మిస్’ అయింది!
చిత్రం: ‘మిస్ ఇండియా’; తారాగణం: కీర్తీసురేశ్, జగపతిబాబు, నవీన్ చంద్ర, రాజేంద్రప్రసాద్, నరేశ్, నదియా, కమల్ కామరాజు; కెమేరా: సుజిత్ వాసుదేవ్; ఎడిటింగ్: తమ్మిరాజు; సంగీతం: తమన్; నిర్మాత: మహేశ్ కోనేరు; దర్శకత్వం: నరేంద్రనాథ్; రిలీజ్ తేదీ: నవంబర్ 4; ఓ.టి.టి. వేదిక: నెట్ ఫ్లిక్స్. లేడీ ఓరియంటెడ్ చిత్రాలు ఎప్పుడూ కత్తి మీద సామే. జనానికి నచ్చితే బ్రహ్మరథం పడతారు. లేదంటే, ఇంతే సంగతులు. ఈ సంగతి తెలిసీ, హీరోయిన్ కీర్తీ సురేశ్, దర్శక, నిర్మాతలు చేసిన సాహసం – ‘మిస్ ఇండియా’. ఆడవాళ్ళు ఆఖరికి వ్యాపార రంగంతో సహా దేనిలోనూ మగవాళ్ళకు తీసిపోరనే విషయాన్ని నిరూపించడానికి, అమెరికా నేపథ్యంలో, ఇండియన్ టీ తయారీ కథతో వండిన వెండితెర వంటకం ఇది. కథేమిటంటే... విశాఖ దగ్గరి లంబసింగి గ్రామంలోని ఓ మధ్యతరగతి కుటుంబంలో ముగ్గురు తోబుట్టువుల్లో ఒకరిగా పుట్టిన అమ్మాయి మానసా సంయుక్త (కీర్తీ సురేశ్). ‘‘అమ్మాయి బిజినెస్ చేయడమనేది మాటల్లోనే కాదు... మనసులో నుంచి కూడా తీసేయ’’మనే అన్నయ్య (కమల్ కామరాజు), తల్లితండ్రుల (నరేశ్, నదియా) మధ్య పెరుగుతుంది హీరోయిన్. అయితే, సకల రోగ నివారిణిగా రకరకాల మూలికలతో టీ ఇచ్చే ఆయుర్వేద వైద్యుడైన తాతయ్య విశ్వనాథ శాస్త్రి (రాజేంద్రప్రసాద్) నుంచి ఆ విద్య నేర్చుకుంటుంది. ఎం.బి.ఎ చదివాక, వ్యాపారవేత్తగా మారి, తాత పేరు నిలబెట్టాలనుకుంటుంది. అనుకోకుండా ఆ కుటుంబం అమెరికాకు మారాల్సి వస్తుంది. అక్కడ జరిగే రకరకాల సంఘటనల మధ్య హీరోయిన్ కుటుంబం నుంచి బయటకు వస్తుంది. అక్కడికి సినిమా సగం అవుతుంది. ‘మిస్ ఇండియా’ అనే బ్రాండ్ ఇండియన్ టీ తయారీతో వ్యాపారంలో తన జెండా ఎగరేయాలని హీరోయిన్ ఆలోచన. కానీ, అక్కడి బడా బిజినెస్ మ్యాన్, ప్రసిద్ధ కాఫీ తయారీ సంస్థ యజమాని కైలాశ్ శివకుమార్ (జగపతిబాబు)తో ఆమెకు ప్రతిఘటన ఎదురవుతుంది. ‘‘ఆ కాఫీ కన్నా పదిరెట్లు బాగుండే టీ’’ చేసే హీరోయిన్‌కూ, ‘‘బిజినెస్ ఈజ్ ఎ వార్’’ అని భావించే ఆ విలన్‌కూ మధ్య పోరాటంలో హీరోయిన్ ఎలా తుది విజయం సాధించిందనేది చాలా ఓపికగా చూడాల్సిన మిగతా సినిమాటిక్ స్టోరీ. ఎలా చేశారంటే... ‘మహానటి’ తరువాత కీర్తీ సురేశ్ ఒప్పుకున్న ఫస్ట్ డైరెక్ట్ తెలుగు సినిమా ‘మిస్ ఇండియా’. ఈ సినిమాకు ప్రధాన బలం కూడా ఆమే. ఈ కథ, ఇందులోని పాత్ర కోసం ఆమె కాస్తంత అతిగానే సన్నబడ్డారు. ఆ పాత్రలో ఒదిగిపోయేందుకు శతవిధాల ప్రయత్నించారు. జగపతిబాబు స్టైలిష్‌గా విలన్ పాత్రలో బాగున్నారు. కానీ, చిత్ర రూపకర్తలు ఈ కీలక పాత్రల స్వరూపాల మీద పెట్టినంత శ్రద్ధ వాటి స్వభావ చిత్రణ, వివిధ పరిస్థితుల్లో వాటి ప్రవర్తన మీద పెట్టినట్టు లేరు. మంచివాళ్ళు చెడ్డవాళ్ళు కావడం, చెడ్డవాళ్ళు మంచివాళ్ళు కావడం లాంటివి సినిమాటిక్‌గా జరిగిపోతుంటాయి. ఎలా తీశారంటే... ఈ సినిమాకు మరో ప్రధాన బలం కొన్నిసార్లు సీన్నూ, పాత్రలనూ కూడా కమ్మేసిన డైలాగు మెరుపులు (రచన – నరేంద్రనాథ్, తరుణ్ కుమార్). ‘‘గొప్పతనం అనేది ఒక లక్షణం. అది ఒకరు గుర్తించడం వల్ల రాదు. ఒకరు గుర్తించకపోవడం వల్ల పోదు’’, ‘‘జీవితంలో మనం చేసే ఏ పనిలోనైనా ఎంత కష్టపడ్డామన్నది ముఖ్యం కాదు. ఎంత ఆనందంగా ఉన్నామన్నది ముఖ్యం’’, ‘‘డబ్బు ఆనందాన్ని మాత్రమే ఇస్తుంది. కానీ, నచ్చినపని అనుభూతిని ఇస్తుంది’’, ‘‘ఇఫ్ యు ఓన్ట్ బిల్డ్ యువర్ డ్రీమ్స్, సమ్‌వన్ విల్ హైర్ యు టు బిల్డ్ దెయిర్ డ్రీమ్స్’’ లాంటి మరపురాని డైలాగులు చాలానే ఉన్నాయి. తమన్ సంగీతంలో ఈ సినిమాలో పదే పదే వచ్చే థీమ్ మ్యూజిక్, ‘నా చిన్ని లోకమే చేజారిపోయెనే..’ అనే బిట్ సాంగ్ (రచన – నీరజ కోన) కొన్నాళ్ళ పాటు చెవుల్లో రింగుమంటాయి. అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బాగున్నా... కథనంలోని లోపాలు ఈ సినిమాకు శాపాలు. అసలు పోరాటం ఆరంభం కాకపోవడంతో, సినిమా ఫస్టాఫ్ నిదానంగా సాగుతుంది. అసలు కథ మొత్తం సెకండాఫ్‌లో చెప్పాల్సి వచ్చేసరికి తొలి చిత్ర దర్శకుడు తడబడ్డారు. తాత పేరును అందరికీ తెలిసేలా చేస్తాననే హీరోయిన్, అసలు పోరాటంలో ఆ ఊసే ఎత్తకపోవడం లాంటి లోపాలూ ఉన్నాయి. వెరసి, ఏ రంగమైనా పురుషుల గుత్తసొత్తు కాదు, ఆధునిక ప్రపంచంలో అమ్మాయిలు అన్నింటిలోనూ ముందుంటారనే మంచి పాయింట్‌ను తీసుకున్నా, దాన్ని సరైన స్క్రిప్టుగా తీర్చిదిద్దలేకపోయారు. కథన లోపాలతో, కథ తడబడితే ఎలా ఉంటుందో చూడడానికి ‘మిస్ ఇండియా’ మరో ఉదాహరణ. అతి సినిమాటిక్ లిబర్టీలు, పాత్రల మీద ప్రేక్షకులకు సహానుభూతి కలగనివ్వని ఫేక్ ఎమోషన్లు ఇందులో పుష్కలం. అందుకే, బలమైన పాయింట్, పేరున్న పెర్ఫార్మర్లు ఉన్నా... ‘మిస్ ఇండియా’ వెండితెరపై వెలవెలపోయింది. కొసమెరుపు: టార్గెట్ ‘మిస్’ అయింది! బలాలు: కీర్తీసురేశ్, జగపతిబాబు లాంటి నటులు ∙తళుక్కున మెరిసే మంచి డైలాగులు ∙థీమ్ మ్యూజిక్, ‘నా చిన్నిలోకమే..’ బిట్ సాంగ్ ∙అమెరికా నేపథ్యం, నిర్మాణ విలువలు బలహీనతలు: ∙కథనంలో, క్యారెక్టరైజేషన్లో లోపాలు ∙స్లోగా సాగే ఫస్టాఫ్. కీలకమైన సెకండాఫ్‌లో తడబాట్లు ∙అతి సినిమాటిక్ లిబర్టీలు, ఫేక్ ఎమోషన్లు ∙అందాల పోటీ గురించి అని పొరబడేలా చేసే టైటిల్ ∙తేలిపోయిన క్లైమాక్స్ – రెంటాల జయదేవ -
సర్కారువారి పాటకి స్వాగతం
‘మహానటి’ సినిమాతో జాతీయ ఉత్తమ నటిగా అవార్డు అందుకున్నారు కీర్తీ సురేష్. దక్షిణాదిలో క్రేజీ ఆఫర్లతో దూసుకెళుతోన్న ఆమె పుట్టినరోజు శనివారం. ఈ సందర్భంగా టాలీవుడ్‌తో పాటు దక్షిణాది భాషల సినీ ప్రముఖులు ఆమెకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేశారు. హీరో మహేశ్ బాబు కూడా సోషల్ మీడియా వేదికగా కీర్తీకి పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పారు. ‘టాలెంటెడ్ కీర్తీ సురేష్‌కు పుట్టినరోజు శుభాకాంక్షలు. ‘సర్కారువారి పాట’ టీమ్ మీకు స్వాగతం పలుకుతోంది. ఈ సినిమా కచ్చితంగా మీ కెరీర్లో ఒక మంచి జ్ఞాపకంగా మిగిలిపోతుంది’ అని ట్వీట్ చేశారు మహేశ్‌బాబు. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహిస్తున్న సంగతి తెలిసిందే. కీర్తీ సురేష్ ప్రచార చిత్రం విడుదల నితిన్, కీర్తీ సురేష్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్ దే’. వెంకీ అట్లూరి దర్శకత్వం వహిస్తున్నారు. పీడీవీ ప్రసాద్ సమర్పణలో సూర్యదేవర నాగవంశీ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. కీర్తి పుట్టినరోజు సందర్భంగా ‘రంగ్ దే’లోని ఆమె ప్రచార చిత్రాన్ని చిత్రబృందం విడుదల చేసింది. -
అలిమేలు దొరికిందా?
దర్శకుడు తేజ తెరకెక్కించిన ‘జయం, నిజం’ చిత్రాల్లో గోపీచంద్ విలన్‌గా నటించారు. తాజాగా గోపీచంద్ హీరోగా తేజ దర్శకత్వంలో ఓ యాక్షన్ ఎంటర్టైనర్ తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘అలిమేలు మంగ వేంకటరమణ’ అనే టైటిల్ ఫిక్స్ చేశారు. ఇందులో గోపీచంద్ పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉంటుందని సమాచారం. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా ఎవరు నటిస్తారు అని కొంతకాలంగా చర్చలు నడుస్తున్నాయి. చాలామంది హీరోయిన్ల పేరు వినపడ్డాయి కూడా. తాజాగా ఈ సినిమాలో హీరోయిన్గా కీర్తీ సురేశ్ నటిస్తారని తెలిసింది. ఈ సినిమాను ఈ ఏడాది చివర్లో సెట్స్ మీదకు తీసుకెళ్లాలని చిత్రబృందం భావిస్తోంది. -
పూర్తి చేశాం
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై నాగవంశీ నిర్మిస్తున్నారు. ఇటీవలే కోవిడ్ బ్రేక్ తర్వాత చిత్రీకరణ ప్రారంభించారు. ఆ షెడ్యూల్‌ను విజయవంతంగా పూర్తి చేశాం అని తెలిపారు నితిన్. ‘‘రంగ్ దే’ తాజా షెడ్యూల్‌ను అన్ని జాగ్రత్తలతో సురక్షితంగా పూర్తి చేశాం’’ అని చిత్రబృందంతో దిగిన సెల్ఫీని ట్విట్టర్లో షేర్ చేశారు నితిన్. నెక్ట్స్ పాటల చిత్రీకరణ కోసం ఇటలీ వెళ్లనున్నారని సమాచారం. తమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా సంక్రాంతికి విడుదల కాబోతోంది. -
ఛలో ఇటలీ
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా తెరకెక్కుతున్న చిత్రం ‘రంగ్‌దే’. వెంకీ అట్లూరి దర్శకత్వంలో ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ నిర్మిస్తోంది. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇటీవలే ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్‌లో ప్రారంభం అయింది. ఈ సినిమాలో కొన్ని పాటలు, కీలక సన్నివేశాలను ఫారిన్లో చిత్రీకరించాలనుకున్నారు. కరోనా వల్ల ఆ షెడ్యూల్‌ను ఇండియాలో చేయాలనుకున్నారనే వార్త వినిపించింది. ఇప్పుడు ఫారిన్లోనే చిత్రీకరణ జరపడానికి చిత్రబృందం రెడీ అయింది. ఇటలీలో మూడువారాల పాటు పాటల్ని, సన్నివేశాలను షూట్ చేయనున్నారు. త్వరలోనే ‘రంగ్ దే’ టీమ్ ఇటలీ ప్రయాణించనున్నారు. సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. -
కీర్తి మూవీపై ముదురుతున్న వివాదం
సాక్షి, హైదరాబాద్ : టాలీవుడ్లో ఇద్దరు నిర్మాతల మధ్య వివాదం చెలరేగుతోంది. ‘ఐనా నువ్వంటే ఇష్టం’ సినిమా హక్కుల కోసం నిర్మాతలు నట్టి కుమార్, చంటి అడ్డాల మధ్య వివాదం ఏర్పడింది. సినిమా హక్కులకు సంబంధించి తనకు రావాల్సిన డబ్బు ఇంకా రాలేదని నిర్మాత నట్టి కుమార్‌పై చంటి అడ్డాల బంజారాహీల్స్ పోలీస్ట్ స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. ఫీల్మ్ ఛాంబర్లోనూ అతనిపై ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ మూవీలో సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ కృష్ణ, మహానటి కీర్తి సురేష్ జంటగా నటిస్తున్నారు. ఇద్దరి మధ్యగల వివాదాన్ని ఫ్రెండ్లీ మూవీస్ యజమాని చంటి అడ్డాల గురువారం మీడియాకు వివరించారు. నట్టి కుమార్ తనకున్న పలుకుబడితో ఫిల్మ్ ఛాంబర్‌ను సైతం మేనేజ్ చేశాడని చంటి ఆరోపించారు. మూవీ పోస్టర్‌పై తన పేరును తొలగించి తన పేరును వేయించుకున్నాడని తెలిపారు. ఛాంబర్ అగ్రిమెంట్ క్యాన్సిల్ చేశాక కూడా తన సినిమాను తన సినిమాగా చెప్పుకుంటున్నాడని వాపోయారు. కీర్తి సురేష్‌కు గతంలో కంటే ప్రస్తుతం క్రేజ్ పెరిగిపోవడంతోనే లాభం కోసం తనను మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. చంటి ఫిర్యాదుపై స్పందించిన పోలీసులు కేసును దర్యాప్తు చేపట్టారు. మరోవైపు దీనిపై సినీ నిర్మాత నట్టి కుమార్ భిన్నంగా స్పందించారు. చంటి అడ్డాల తనకు కాకుండా మరో ముగ్గురికి సినిమా విక్రయించారని ఆరోపించారు. తనను మోసం చేసినందుకు పోలీస్ కేసు కూడా పెట్టినట్లు తెలిపారు. -
అన్ని జాగ్రత్తలతో...
నితిన్, కీర్తీ సురేశ్ జంటగా నటిస్తున్న చిత్రం ‘రంగ్‌దే’. లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్గా తెరకెక్కుతున్న ఈ చిత్రానికి వెంకీ అట్లూరి దర్శకుడు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పిస్తున్నారు. ఈ మధ్యే హీరో నితిన్ పెళ్లి జరిగిన విషయం తెలిసిందే. అలాగే లాక్డౌన్ కారణంగా షూటింగ్‌కి బ్రేక్ పడింది. బుధవారం మళ్లీ షూటింగ్‌ను హైదరాబాద్‌లో ప్రారంభించారు. ప్రభుత్వం విధించిన జాగ్రత్తలు పాటిస్తూ, ఈ షూటింగ్‌ను జరుపుతున్నారు. కొన్ని సన్నివేశాలు, పాటల చిత్రీకరణ తో ఈ సినిమా పూర్తవుతుంది. ఈ చిత్రాన్ని సంక్రాంతికి విడుదల చేస్తామన్నారు నిర్మాతలు. నరేశ్, వినీత్, రోహిణి, బ్రహ్మాజీ, ‘వెన్నెల’ కిశోర్ తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా: పీసీ శ్రీరామ్, సంగీతం: దేవీశ్రీ ప్రసాద్. -
రజనీ వర్సెస్ జాకీ
రజనీకాంత్ నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘అన్నాత్తే’. శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఖుష్భూ, మీనా, నయనతార, కీర్తీ సురేశ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. సన్ పిక్చర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ఈ సినిమాలో విలన్‌గా ఎవరు నటిస్తారనే విషయం ఇప్పటివరకూ ప్రకటించలేదు. తాజాగా ఈ సినిమాలో విలన్ పాత్రలో బాలీవుడ్ నటుడు జాకీ ష్రాఫ్ నటిస్తారని తెలిసింది. ఈ ఫ్యామిలీ డ్రామాలో జాకీతో తలపడనున్నారట రజనీకాంత్. ఈ ఏడాది చివర్లో చెన్నైలో వేసిన ప్రత్యేక సెట్లో ఈ సినిమా చిత్రీకరణను ప్రారంభిస్తారని సమాచారం. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమాను విడుదల చేయాలనుకుంటున్నాం అని చిత్రబృందం తెలిపింది. కానీ ప్రస్తుత పరిస్థితుల్లో అది జరిగేలా కనిపించడం లేదు. -
జానకితో నేను
సీనియర్ నటుడు నరేష్ తనయుడు నవీన్ విజయ్ కృష్ణ, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రానికి ‘జానకితో నేను’ అనే టైటిల్‌ను ఖరారు చేశారు. తొలుత ‘ఐనా... ఇష్టం నువ్వు’ అనే టైటిల్ పెట్టిన విషయం తెలిసిందే. కానీ ‘జానకితో నేను’ అనే టైటిల్ మరింత బావుంటుందన్న ఉద్దేశంతో ఈ మార్పు చేసినట్లు చిత్రవర్గాలు పేర్కొన్నాయి. ఈ చిత్రం ద్వారా కృష్ణవంశీ శిష్యుడు రాంప్రసాద్ రౌతు దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఫ్రెండ్లీ మూవీస్ పతాకంపై అడ్డాల చంటి నిర్మిస్తున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ– ‘‘ఇప్పటికే షూటింగ్ కార్యక్రమాలు దాదాపుగా పూర్తయ్యాయి. నాలుగైదు రోజులు ప్యాచ్‌వర్క్ చిత్రీకరణ మాత్రమే మిగిలి ఉంది. త్వరలో కీర్తీ సురేష్‌తో ఆ సీన్స్ చిత్రీకరిస్తాం. అక్టోబర్ మొదటి వారానికి తొలి కాపీ సిద్ధం అవుతుంది. థియేటర్స్ ఓపెన్ కాగానే చిత్రాన్ని విడుదల చేస్తాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: సురేష్, సంగీతం: అచ్చు. -
బై బై గోలీరాజు
‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేష్ లీడ్ రోల్లో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ ఫిల్మ్ ‘గుడ్‌లక్ సఖి’. నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిర్మాత ‘దిల్’ రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో గోలీ రాజు పాత్రలో హీరో ఆది పినిశెట్టి నటిస్తున్నారు. శనివారంతో గోలీ రాజు పాత్రధారి ఆది పినిశెట్టి సన్నివేశాలు పూర్తయ్యాయి. దీంతో చిత్రబృందం గోలీ రాజుకి బై బై చెప్పింది. ఈ సందర్భంగా చిత్ర దర్శక–నిర్మాతలు మాట్లాడుతూ– ‘‘ఒక చురుకైన గ్రామీణ యువతి క్రీడల్లో అడుగుపెట్టి షూటర్‌గా ఎలా ఎదిగి ఊరికి పేరు తెచ్చిందనే కథాంశంతో తయారవుతున్న చిత్రమిది. షూటింగ్ ట్రైనర్‌గా జగపతిబాబు నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళం భాషల్లో ఏక కాలంలో నిర్మిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ హైదరాబాద్‌లో జరుగుతోంది. ఆగస్ట్ 15న రిలీజ్ చేసిన మా సినిమా టీజర్‌కు మంచి స్పందన వచ్చింది. అధిక శాతం మహిళా సాంకేతిక నిపుణులు ఈ చిత్రానికి పనిచేస్తుండటం విశేషం’’ అన్నారు. ఈ చిత్రానికి సంగీతం: దేవిశ్రీప్రసాద్, కెమెరా: చిరంతన్ దాస్. -
కొత్త పాత్ర
నటిగా కీర్తీ సురేశ్ ఫుల్ బిజీ. చేతి నిండా సినిమాలతో తీరిక లేకుండా ఉన్నారు. అయితే మరో కొత్త పాత్రలోకి వెళ్లనున్నారని టాక్. కీర్తీ సురేశ్ నిర్మాతగా మారాలనుకుంటున్నారట. దానికి సంబంధించిన పనులు కూడా చకచకా జరిగిపోతున్నాయని సమాచారం. ఓ తమిళ వెబ్ సిరీస్ కథ కీర్తీని బాగా ఆకట్టుకుందట. ఆ కథను ప్రేక్షకులకు చెప్పాలని సిరీస్‌ను నిర్మించాలని ఫిక్సయ్యారట. నటిగా అద్భుతమైన కథలను ప్రేక్షకుల దగ్గరకు తీసుకెళ్లి శభాష్ అనిపించుకున్నారు కీర్తి. నిర్మాతగా కూడా అలాంటి కథలే చూపిస్తారని ఊహించవచ్చు. మరో విషయం ఏంటంటే కీర్తీ సురేశ్ తండ్రి సురేశ్ కుమార్ మలయాళంలో పాపులర్ ప్రొడ్యూసర్. మరి తండ్రికి తగ్గ తనయ అనిపించుకుంటారా? చూడాలి. -
సీతగా మహానటి?
‘బాహుబలి, సాహో’ చిత్రాల తర్వాత ప్రభాస్ జోరు పెంచారు. ప్రస్తుతం ‘జిల్’ ఫేమ్ రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో ప్రభాస్ నటిస్తున్న ‘రాధేశ్యామ్’ చిత్రీకరణ దాదాపు పూర్తికావచ్చింది. ఆ తర్వాత నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తన 21వ చిత్రం చేసేందుకు పచ్చజెండా ఊపారు ప్రభాస్. 22వ చిత్రం ‘ఆదిపురుష్’ని కూడా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి ‘తానాజీ’ ఫేమ్ ఓమ్ రౌత్ దర్శకత్వం వహించనున్నారు. సోషియో ఫ్యాంటసీ నేపథ్యంలో ఈ చిత్రం ఉంటుందని తెలుస్తోంది. ఇందులో రాముడి పాత్రను ప్రభాస్ పోషిస్తారని సమాచారం. మరి రాముడికి సీతగా ఎవరు నటిస్తారు? అనే చర్చ ఇండస్ట్రీ వర్గాల్లో అప్పుడే మొదలైంది. కాగా సీత పాత్రకు కీర్తీ సురేష్‌ని అనుకుంటున్నారట చిత్రవర్గాలు. ‘మహానటి’ చిత్రంతో జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్నారు కీర్తీ సురేష్. సీత పాత్రకు ఆమె అయితేనే పర్ఫెక్ట్గా ఉంటుందనే ఆలోచనలో ఉన్నారట. హిందీ, తెలుగు, తమిళ, కన్నడ, మలయాళం భాషల్లో రూపొందనున్న ఈ చిత్రానికి టి సిరీస్ భూషణ్ కుమార్ నిర్మాత. -
ఫారిన్ ప్లాన్ వేశారా?
’సర్కారు వారి పాట’ చిత్రబందం ఫారిన్ ప్లాన్ వేసిందని సమాచారం. ఈ సినిమాను అమెరికాలో షూట్ చేయడానికి సిద్ధం అవుతున్నారని తెలిసింది. మహేష్ బాబు హీరోగా పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘సర్కారు వారి పాట’. ఈ చిత్రాన్ని14 రీల్స్ ప్లస్, మైత్రీ మూవీ మేకర్స్, జీఎంబీ ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్లు నిర్మిస్తున్నాయి. బ్యాంకు స్కామ్ బ్యాక్ డ్రాప్ లో ఈ చిత్రకథ సాగుతుందట. ఆల్రెడీ ఈ చిత్రం ప్రీ–లుక్ మరియు, మోషన్ పోస్టర్ ను విడుదల చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమా ఎప్పుడు సెట్స్ మీదకు వెళ్తుందనే ప్రశ్నకు సమాధానం దొరికింది. ఈ చిత్రం షూటింగ్ ను ఫారిన్ షెడ్యూల్ తో మొదలు పెట్టాలనుకుంటున్నారట. అక్టోబర్ లేదా నవంబర్ మొదటి వారంలో ఈ చిత్రబందం అమెరికా వెళ్లనున్నట్టు సమాచారం. ఒక నెలరోజుల పాటు అక్కడ చిత్రీకరణ చేయాలనుకుంటున్నారట. కరోనా పరిస్థితులు అప్పటికి సర్దుకుంటాయా? లేదా అనేది చిన్న సందేహం. ఈ సినిమాలో కీర్తీ సురేష్ కథానాయిక అని టాక్. కెమేరామ్యాన్ మది. తమన్ సంగీత దర్శకుడు. -
సరికొత్త కాంబినేషన్
శనివారం కీర్తీ సురేష్ ఓ కొత్త చిత్రాన్ని ప్రకటించారు. అయితే ఇందులో ఓ విశేషం ఉంది. ఈ చిత్రంలో ప్రముఖ తమిళ దర్శకుడు సెల్వ రాఘవన్ ముఖ్య పాత్ర చేయనున్నారు. ‘7/జి బృందావన్ కాలనీ’, ‘యుగానికి ఒక్కడు, ‘ఆడవారి మాటలకు అర్థాలే వేరులే’ వంటి సినిమాలతో తెలుగు ప్రేక్షకులకు సుపరిచితుడు ఆయన. ఇప్పుడు సెల్వ రాఘవన్, కీర్తీ సురేష్ ముఖ్య పాత్రల్లో ‘సాని కాయిదం’ అనే తమిళ చిత్రం తెరకెక్కనుంది. అరుణ్ మాతేశ్వరన్ ఈ చిత్రానికి దర్శకుడు. ఈ సినిమా పోస్టర్ ను విడుదల చేశారు. ‘‘దర్శకుడు సెల్వ రాఘవన్ గారితో స్క్రీన్ షేర్ చేసుకోవడం చాలా సంతోషం’’ అన్నారు కీర్తీ సురేష్. ‘‘మరో కొత్త అధ్యాయం ప్రారంభం’’ అన్నారు సెల్వ రాఘవన్. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది. -
గుడ్‌లక్ సఖి.. టీజర్ వచ్చేసింది
మహానటి ఫేం కీర్తి సురేశ్, ఆది పినిశెట్టి ప్రధాన పాత్రల్లో స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కుతున్న గుడ్‌లక్ సఖీ అఫీషియల్ టీజర్ వచ్చేసింది. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని చిత్రబృందం శనివారం టీజర్‌ను ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చింది. 'హైదరాబాద్ బ్లూస్, డోర్, ఇక్బాల్ సినిమాలతో క్రియేటివ్ డైరెక్టర్‌గా జాతీయస్థాయిలో గుర్తింపును తెచ్చుకున్న నగేష్ కుకునూర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. సీనియర్ నటి రమాప్రభ, రాహుల్ రామకృష్ణ, తదితరులు నటిస్తున్నారు. కీర్తి సురేశ్ అచ్చమైన పల్లెటూరి పిల్లగా కనిపిస్తూ టీజర్లో ఆకట్టుకుంటుంది. ఒక పల్లెటూరు నుంచి వచ్చిన అమ్మాయి.. దేశం గర్వించే షూటర్‌గా ఎలా తయారైందన్న అంశంతో చిత్రం రూపుదిద్దుకుంది. కీర్తిని జాతీయ షూటర్‌గా తయారు చేసే కోచ్‌గా జగపతిబాబు కీలకపాత్రలో నటించారు. టీజర్లో కీర్తి సురేశ్ డైలాగ్ డెలివరీ ఆకట్టుకుంటుంది. ఈ చిత్రానికి రాక్‌స్టార్ దేవీశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నాడు. దిల్‌రాజు సమర్పణలో వార్త్ షాట్ మోషన్ ఆర్ట్ ప్రొడక్షన్లో తెరకెక్కుతున్న గుడ్‌లక్ సఖీ చిత్రానికి సుధీర్ చంద్ర పాదిరి, శ్రావ్య వర్మ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. -
గుడ్ లక్
కీర్తీ సురేశ్ ముఖ్యపాత్రలో నటిస్తున్న లేడీ ఓరియంటెడ్ చిత్రం ‘గుడ్ లక్ సఖీ’. తెలుగు, తమిళ, మలయాళ భాషల్లో ఏకకాలంలో రూపొందుతున్న ఈ చిత్రానికి నగేశ్ కుకునూర్ దర్శకుడు. ‘దిల్’రాజు సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ బ్యానర్‌పై సుధీర్‌చంద్ర పాదిరి నిర్మిస్తున్నారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా ఈ చిత్రం టీజర్‌ను శనివారం విడుదల చేయనున్నారు. స్పోర్ట్స్ రొమాంటిక్ కామెడీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కీర్తి గ్రామీణ యువతిగా నటిస్తున్నట్లు పోస్టర్ చూస్తే తెలుస్తుంది. ఈ సినిమాకు ఎక్కువశాతం మంది మహిళలు పని చేయటం విశేషం. ఓ చిన్న షెడ్యూల్‌తో సినిమా పూర్తవుతుంది. నిర్మాణానంతర కార్యక్రమాలు ముగింపు దశలో ఉన్నాయి. ఈ చిత్రానికి సహనిర్మాత: శ్రావ్యా వర్మ. -
ఎర్రగులాబీలులో... కీర్తీ సురేష్
కమల్‌హాసన్, శ్రీదేవి జంటగా భారతీరాజా దర్శకత్వంలో దాదాపు 40 ఏళ్లక్రితం వచ్చి సంచలన విజయం సాధించిన చిత్రం ‘శిగప్పు రోజాక్కళ్’. ఈ చిత్రం తెలుగులో ‘ఎర్ర గులాబీలు’ పేరుతో అనువాదమై, విడుదలైంది. రెండు భాషల్లోనూ మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. హిందీలోనూ రీమేక్ అయింది. నలభైఏళ్ల తర్వాత ఇప్పుడు ‘శిగప్పు రోజాక్కళ్’కి సీక్వెల్ తీయటానికి సన్నాహాలు జరుగుతున్నాయి. భారతీరాజా ఈ చిత్రానికి కథ అందించటంతో పాటు నిర్మాతగా వ్యవహరిస్తారు. భారతీరాజా కుమారుడు మనోజ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తారు. శ్రీదేవి పాత్రలో ‘మహానటి’ ఫేమ్ కీర్తీ సురేశ్‌ని నటింపజేయాలనుకున్నారట. కీర్తి కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. మరి కమల్ పాత్రలో ఎవరు నటిస్తారో చూడాలి. ‘ఎర్రగులాబీలు’ చిత్రానికి సంగీతం అందించిన ఇళయరాజానే ఈ సీక్వెల్‌కు సంగీతాన్ని సమకూరుస్తారని సమాచారం. రివెంజ్ థ్రిల్లర్‌గా తెరకెక్కనున్న ఈ చిత్రం స్క్రిప్ట్ పూర్తయింది. తెలుగు, తమిళ భాషల్లో ఈ చిత్రాన్ని రూపొందించాలనుకుంటున్నారని తెలిసింది.