Mahesh Babu Sarkaru Vaari Paata Premiere At 603 Locations: US Mahesh Babu Sarkaru Vaari Paata Premiere At 603 Locations - Sakshi
Sakshi News home page

Sarkaru Vaari Paata: మహేశ్​ బాబు 'సర్కారు వారి పాట' సరికొత్త రికార్డు..

Published Wed, May 4 2022 5:59 PM | Last Updated on Wed, May 4 2022 6:44 PM

Mahesh Babu Sarkaru Vaari Paata Premiere At 603 Locations - Sakshi

Mahesh Babu Sarkaru Vaari Paata Premiere At 603 Locations: సూపర్​ స్టార్​ మహేశ్​ బాబు, మహానటి కీర్తి సురేష్​ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రానికి పరశురామ్​ దర్శకత్వం వహించారు. మరో వారం రోజుల్లో అంటే మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది ఈ మూవీ. ప్రమోషన్స్​లో భాగంగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్​ యూట్యూబ్​లో దూసుకుపోతోంది. 24 గంటలు గడవక ముందే 25 మిలియన్​ వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్​ 24 గంటల్లో 27 మిలియన్స్​పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. 

అలాగే 1.2 మిలియన్స్​కుపైగా లైక్స్​తో యూట్యూబ్​లో నెంబర్​ వన్​ ట్రెండింగ్​లో కొనసాగుతోంది ఈ మూవీ ప్రచార చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా యూఎస్​లో సరికొత్త రికార్డు క్రియేట్​ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నడు లేని విధంగా యూఎస్​లో 603 ప్రాంతాల్లో రిలీజ్​ చేయనున్నారట. పాన్​ ఇండియా మూవీస్​ తప్పితే ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో ఇన్ని ప్రదేశాల్లో విడుదల కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమా ఓవర్సీస్​లో భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు.  

చదవండి: ఆ సాంగ్‌ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్‌


అయితే అక్కడ మే 11న 'సర్కారు వారి పాట' ప్రీమియర్స్​ వేయనున్నారు. ఇప్పటికే యూఎస్​ అడ్వాన్స్​ బుకింగ్స్​ కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ నెల 7న భారీగా ప్రీరిలీజ్​ ఈవెంట్​ నిర్వహించేందుకు ప్లాన్​ చేస్తున్నారని టాక్. ఈ వేడుకకు టాలీవుడ్​ స్టార్​ హీరోల్లో ఒకరు ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement