parasuram
-
ఫ్యామిలీ స్టార్ క్రెడిట్ అంతా ఆయనకే: విజయ్ దేవరకొండ ఆసక్తికర కామెంట్స్
విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన చిత్రం ఫ్యామిలీ స్టార్. గీతగోవిందం తర్వాత పరశురామ్- విజయ్ కాంబినేషన్లో వస్తోన్న ఈ చిత్రంపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. దిల్ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించారు. ఇప్పటికే అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఏప్రిల్ 5న థియేటర్లలో అలరించనుంది. ఇటీవల ఈ మూవీకి సంబంధించి ప్రీ రిలీజ్ ఈవెంట్‌ను భారీ ఎత్తున నిర్వహించారు. మైసమ్మగూడలోని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో ఈ వేడుక జరిగింది. ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ డైరెక్టర్ పరశురామ్‌పై ప్రశంసలు కురిపించారు. హీరో విజయ్ దేవరకొండ మాట్లాడుతూ ..'ఫ్యామిలీ స్టార్ నా కెరీర్లో చాలా ఇంపార్టెంట్ మూవీ. పరశురామ్ నాకు ఈ కథ చెప్పినప్పుడు మా నాన్న గుర్తుకొచ్చాడు. ఈ సినిమాలో నా ఫర్మామెన్స్ నెక్ట్ లెవెల్ అని పరశురామ్ అంటున్నాడు. కానీ ఈ క్రెడిట్ మొత్తం పరశురామ్‌కే ఇవ్వాలి. ఈ సినిమాకు హార్ట్ అండ్ సోల్ పరశురాముడే. ఆయన లేకుంటే ఫ్యామిలీస్టార్ సినిమానే లేదు. ఈ సినిమాకు ఎన్ని అవార్డ్స్ వచ్చినా ఆ క్రెడిట్ అంతా ఆయనకే దక్కుతుంది' అని అన్నారు. కాగా.. వీరిద్దరి కాంబోలో వచ్చిన గీత గోవిందం బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. -
షూటింగ్ పూర్తి చేసుకున్న విజయ్ దేవరకొండ ‘ఫ్యామిలీ స్టార్’ (ఫొటోలు)
-
భక్త విజయం.. పరశురాముడి తపస్సు..!
ఒకనాడు పరశురాముడు ఆశ్రమంలో ఉన్న తండ్రి జమదగ్ని వద్దకు వెళ్లి, ‘తండ్రీ! నాకు పితామహ ప్రపితామహులను చూడాలని ఉంది. వెళ్లి రావడానికి అనుమతించు’ అన్నాడు.‘సరే’నన్నాడు జమదగ్ని. తండ్రి అనుమతితో బయలుదేరిన పరశురాముడు తొలుత తన తాత అయిన ఋచీకుడి ఆశ్రమానికి వెళ్లాడు. అక్కడ కొద్ది రోజులు గడిపి సెలవు తీసుకుని, ముత్తాత అయిన భృగు మహర్షి ఆశ్రమానికి బయలు దేరాడు. భృగు మహర్షి ఆశ్రమంలో కొన్నాళ్లు ఉన్నాడు. భృగు మహర్షి ఒకనాడు పరశురాముణ్ణి పిలిచి, ‘నాయనా! లోకక్షేమం కోసం నువ్వు ఇక్కడి నుంచి హిమాలయాలకు వెళ్లి, ఆశ్రమం ఏర్పాటు చేసుకుని, తపస్సుతో పరమశివుణ్ణి మెప్పించు. ఆయన ప్రసన్నుడై వరం కోరుకోమని అడిగితే, అప్పుడు శత్రువినాశకరాలైన దివ్యాస్త్రాలను కోరుకో. భవిష్యత్తులో నువ్వు ఎన్నో మహత్కార్యాలను చేయవలసి ఉంటుంది. క్షేమంగా వెళ్లిరా’ అని సాగనంపాడు. ముత్తాత ఆదేశంపై పరశురాముడు హిమాలయాలకు చేరుకుని, అక్కడ ఒక సుందర సరోవర తీరంలో ఆశ్రమం ఏర్పాటు చేసుకున్నాడు. అక్కడే ఉంటూ పరమశివుడి కోసం ఘోరమైన తపస్సు ప్రారంభించాడు. గ్రీష్మంలో పంచాగ్నుల మధ్య నిలబడి, శీతకాలంలో సరోవరం నీళ్లలో నిలబడి శీతోష్ణాలను సహించి తన తపస్సును కొనసాగించాడు. పరశురాముడి తపస్సు సంగతి మునిగణాలకు తెలిసి, వారంతా ఆశ్చర్యం చెందారు. తమ తపస్సుతో పాపక్షయం చేసుకుని, పరమ తాపసులుగా ప్రసిద్ధి పొందిన అత్రి, జాబాలి, వామదేవుడు, మృకండుడు వంటి వారంతా పరశురాముడి తపస్సును చూడటానికి అక్కడకు చేరుకున్నారు. పరశురాముడి తపోదీక్ష పరమశివుడిని కదిలిచింది. వరాలు ఇచ్చే ముందు పరశురాముడి ప్రతిభను పరీక్షించాలనుకున్నాడు. అనుకున్నదే తడవుగా పరమశివుడు ఒక ఆటవికుడి రూపం దాల్చాడు. ఒక చేత మాంసఖండం పట్టుకుని, దానిని నములుతూ పరశురాముడి ఆశ్రమ ప్రాంగణంలో ఉన్న ఒక చెట్టు వద్ద నిలుచున్నాడు. సరోవరంలో స్నానం ముగించుకున్న పరశురాముడు ఆశ్రమంలోకి అడుగుపెడుతూ కనిపించాడు. ఆటవికుడి రూపంలో ఉన్న పరమశివుడు అతడికి ఎదురుగా వెళ్లి నిలిచాడు. ‘స్వామీ! నేను వ్యాధుడను. నా పేరు తోషప్రహర్షుడు. ఈ మహావనంలో నేను చిరకాలంగా ఉంటున్నాను. నేనే ఈ ప్రదేశానికి అధిపతిని. ఇక్కడ నా అనుమతి లేనిదే ఎవరూ నివసించకూడదు. ఇంతకూ తమరెవరు? ఇక్కడకు ఎందుకు వచ్చారు?’ అని అడిగాడు. ‘నా పేరు రాముడు. జమదగ్ని మహర్షి కొడుకును. భృగువంశీయుణ్ణి. పరమశివుడి అనుగ్రహం కోసం నేను చిరకాలంగా ఇక్కడే తపస్సు చేసుకుంటున్నాను. నేను ఇక్కడే ఉండి తపస్సు చేసుకుంటాను. ఇది నీ ప్రదేశం అంటున్నావు కాబట్టి నేను నీకు అతిథినవుతాను. పైగా నేను తపస్సు చేసుకోవడానికి వచ్చాను. అతిథులను గౌరవించడం ధర్మం. నన్ను తిరస్కరించడం నీకు క్షేమం కాదు. నువ్వే ఎక్కడికైనా వెళ్లడం మంచిది.’ అని బదులిచ్చాడు పరశురాముడు. ‘ఇదేం ధర్మం? నా ప్రదేశానికి వచ్చి, నన్నే వెళ్లమంటున్నావే! ఇది నా నివాసం. నేను ఇక్కడే ఉంటాను. ఇక్కడే తింటాను. నీకు అసహ్యంగా ఉంటే వేరే ప్రదేశానికి నిరభ్యంతరంగా వెళ్లిపోవచ్చు. లేదా అన్నీ సహిస్తూ ఇక్కడే ఉండు. నాకు అభ్యంతరం లేదు’ అన్నాడు వ్యాధుడు. పరశురాముడు ఉగ్రుడయ్యాడు. ‘నువ్వు నిజంగానే చూడటానికి అసహ్యంగా ఉన్నావు. జంతువులను హింసించి, వాటి మాంసాన్ని తింటూ అధముడిలా ఉన్నావు. నువ్వు నా సమీపంలో నివసించడానికి తగవు. నువ్వు మర్యాదగా వెళితే సరేసరి, లేకుంటే బలప్రయోగం చేయాల్సి ఉంటుంది’ అన్నాడు. వ్యాధుడు ఏమీ ఆవేశపడకుండా, ‘స్వామీ నేను నా ధర్మాన్ని నిర్వర్తిస్తున్నాను. జంతువులను వేటాడటం నా వృత్తి. వాటి మాంసం నాకు భుక్తి. నా అవసరానికి మించి ఏ ఒక్క జీవిని చంపినా నాకు పాపం తాకుతుంది. అయినా, ఇన్ని ధర్మపన్నాలు చెబుతున్న నువ్వు నిజంగా ధర్మాత్ముడివేనా? తండ్రి మాట విని తల్లిని చంపిన నువ్వు నాకు నీతులు చెప్పడం విడ్డూరంగా ఉంది. మనుషుల్లో భేదభావాలు చూపే నిన్ను ఆ పరమశివుడు ఎలా అనుగ్రహిస్తాడు?’ అని నిలదీశాడు. ఒక మామూలు వ్యాధుడు తన వృత్తాంతమంతటినీ చెప్పడంతో పరశురాముడు ఆశ్చర్యచకితుడయ్యాడు. తన ఎదుట ఉన్నది వ్యాధుడు కాదని గ్రహించాడు. సాక్షాత్తు పరమశివుడే తనను పరీక్షించడానికి ఇలా వచ్చాడేమో అనుకున్నాడు. ‘మహానుభావా! నువ్వెవరివి? అనవసరంగా నీ మీద ఆగ్రహించాను. నన్ను క్షమించు. నువ్వు సామాన్య వ్యాధుడవు కాదు. నా అపరాధాన్ని మన్నించి, నీ నిజరూపాన్ని చూపించు’ అని ప్రార్థించాడు. వ్యాధుడు బదులివ్వలేదు. పరశురాముడు అక్కడే కూర్చుని, ధ్యానమగ్నుడయ్యాడు. అతడి మనోనేత్రానికి వ్యాధుడి రూపంలో ఉన్న పరమశివుడు దర్శనమిచ్చాడు. ధ్యానం విరమించుకుని పరశురాముడు కళ్లు తెరిచాడు. ఎదురుగా వ్యాధుడు చిరునవ్వుతో కనిపించాడు. పరశురాముడు వెంటనే అతడి పాదాల మీద పడి పరిపరి విధాలుగా శివస్తోత్రం చేశాడు. శివుడు సంతోషించాడు. ‘రామా! నీ కోరిక నాకు తెలుసు. భూమండలంలోని సమస్త తీర్థాలలో స్నానం ఆచరించి, తపస్సు చేస్తే తప్ప నువ్వు నా దివ్యాస్త్రాలను పొందలేవు. నేను చెప్పిన విధంగా ఆచరించి తిరిగిరా. అప్పుడు నీకు దివ్యాస్త్రాలు లభిస్తాయి’ అని చెప్పి అంతర్ధానమయ్యాడు. -సాంఖ్యాయన -
ఫ్యామిలీ స్టార్ మూవీలో రష్మిక ?
-
విదేశాలకు ఫ్యామిలీస్టార్
విదేశాలకు పయనం అవనున్నారు ఫ్యామిలీస్టార్. విజయ్ దేవరకొండ, మృణాల్ ఠాకూర్ జంటగా పరశురామ్ పెట్ల దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం ‘ఫ్యామిలీస్టార్’. ఈ సినిమా చిత్రీకరణ ఢిల్లీ పరిసర ప్రాంతాల్లో జరుగుతోంది. విజయ్, మృణాల్‌పై కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమా నెక్ట్స్ షెడ్యూల్ చిత్రీకరణ అమెరికాలో జరగనుందని తెలిసింది. నెలరోజులకుపైగా అక్కడి లొకేషన్స్‌లో జరిగే ఈ భారీ షెడ్యూల్‌తో ఈ సినిమా మేజర్ షూటింగ్ పూర్తి కానున్నట్లుగా తెలుస్తోంది. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ‘ఫ్యామిలీస్టార్’ తొలుత సంక్రాంతికి విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ చిత్రం సంక్రాంతికి విడుదల కావడం లేదని, మార్చిలో రిలీజ్ కానుందనే టాక్ లేటెస్ట్గా వినిపిస్తోంది. ఈ సినిమాలో రష్మికా మందన్నా ఓ అతిథి పాత్ర చేస్తున్నారని భోగట్టా. అయితే ఈ అంశాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. -
పరశురామ్‌తో గొడవ..గతంలో జరిగింది ఇదే: బన్నీ వాసు
తెలుగు ఇండస్ట్రీలో టాప్ నిర్మాణ సంస్థగా గీతా ఆర్ట్స్‌కు మంచి పేరు ఉంది. ఈ బ్యానర్లో భాగమైన GA2 నుంచి విజయ్ దేవరకొండ, డైరెక్టర్ పరుశురామ్ కాంబినేషన్లో 'గీత గోవిందం' చిత్రం వచ్చింది. అప్పట్లో ఆ సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. అల్లు అరవింద్‌కు అనుగుణంగా వారి ప్రొడక్షన్ నుంచి వచ్చే సినిమాల్లో ప్రముఖ పాత్ర పోషిస్తున్నారు బన్నీ వాస్. GA2 బ్యానర్లో ఆయన చాలా సినిమాలే తీశాడు. గీతగోవిందం సినిమా తర్వాత డైరెక్టర్ పరుశురామ్‌తో జరిగిన వివాదం గురించి బన్నీ వాస్ తాజాగా పలు వ్యాఖ్యలు చేశారు. 'గీత గోవిందం తర్వాత నాతో పరశురామ్ ఒక కథ చెప్పాడు. ఆ కథ నాకు బాగా నచ్చింది. వెంటనే ఆ కథను విజయ్‌కు ఫోన్ చేసి చెప్పాను. సినిమా చేసేందుకు విజయ్ కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కానీ ఈలోపు దిల్ రాజుతో పరశురామ్ ఇదే కథ చెప్పినట్లు తెలిసింది. దిల్ రాజు బేనర్లో అది చేస్తానని అన్నాడు. ఈ విషయంలో నన్ను, అరవింద్ గారిని ఎంతగానో బాధించింది. పరశురామ్ ఈ విషయాన్ని మాతో సరిగా కమ్యూనికేట్ చేయలేదు. ఇదే విషయం అతడి ద్వారా కాకుండా వేరే మార్గంలో తెలవడంతో మేం బాగానే బాధపడ్డాం. ఆ సమయంలో మేమంతా కొంచెం కోపంగా ఉన్నాం. అందుకు తగినట్లే పరుశురామ్‌పై రియాక్టయ్యాం. ఆ తర్వాత పరశురామ్ ఫోన్ చేసి వివరణ ఇచ్చాడు. సర్కారు వారి పాట సినిమా సమయంలో ఏదో ఫ్లోలో దిల్ రాజుకు కథ చెప్పాను ఆయన సినిమా ఓకే చేయడం. ఆ తర్వాత విజయ్‌కి కూడా కథ నచ్చి సినిమా చేయడానికి ముందుకొచ్చాడు. ఇదే విషయం మీతో పొద్దున చెబుదామని అనుకున్నలోపే ఇలా జరిగిపోయిందని వివరణ ఇచ్చాడు. ఆ వివాదం తర్వాత దిల్ రాజు గారు ఫోన్ చేసి.. ఇదే సినిమాలో వాటా కావాలంటే తీసుకో అన్నారు. కానీ అరవింద్ గారు వద్దని చెప్పారు. ప్రస్తుతం మా మధ్య ఎలాంటి గొడవ లేదు. త్వరలో విజయ్- పరశురామ్ కాంబినేషన్లో ఒక సినిమా చేస్తాం.' అని బన్నీ వాసు పేర్కొన్నాడు. గతంలో ఏం జరిగింది..? గీతగోవిందం చిత్రం హిట్ కొట్టడంతో డైరెక్టర్ పరుశురామ్ చాలా సినిమాలకు ఒకేసారి కమిట్మెంట్ ఇచ్చాడు. ఇందులో భాగంగా ఆయన వారి నుంచి కొంతమేరకు అడ్వాన్స్ కూడా తీసుకున్నారని అప్పట్లో టాక్ వచ్చింది. కానీ ముందుగా అనుకున్నట్లుగా గీతగోవిందం తర్వాత పరశురామ్ అల్లు అరవింద్‌కే సినిమా చేయాల్సి ఉంది. కానీ 14 రీల్స్ బ్యానర్లో నాగచైతన్య సినిమా తీసి వస్తానని అల్లు కాంపౌండ్ నుంచి ఆయన బయటకు వచ్చేశాడు. ఆ తర్వాత కూడా మహేశ్ బాబు సర్కారువారి పాట సినిమా ఛాన్స్ దక్కడంతో నాగచైతన్య సినిమాను పక్కనపెట్టి మహేశ్- మైత్రీ మేకర్స్ వైపు మొగ్గుచూపాడు. ఆ సమయంలో 14 రీల్స్‌తో ఆయన కొన్ని ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో సర్కారు వారి పాటలో 14 రీల్స్‌ను కూడా భాగం అయింది. సర్కారు వారి పాట చిత్రం తర్వాత కూడా దిల్ రాజు- విజయ్ దేవరకొండ కాంబినేషన్లో 'ప్యామిలీ స్టార్' చిత్రాన్ని పరుశురామ్ ప్రకటించాడు. దీంతో అల్లు అరవింద్‌కు కోపం వచ్చిందని ఇండస్ట్రీలో వైరల్ అయింది. గీతగోవిందం తర్వాత తమతో సినిమా చేస్తానని కమిట్మెంట్ ఉండగానే దిల్ రాజుతో పరశురామ్ సినిమా ఎనౌన్స్ చేయడం అరవింద్‌కు ఆగ్రహం తెప్పించిందని అప్పట్లో వార్తలు వైరల్ అయ్యాయి. దీంతో వారిద్దరి మధ్య చిన్నపాటి గొడవ జరిగిందని తెలిసింది. -
ఆ మీమ్స్ ఏంట్రా?.. ఒక్క డైలాగ్‌తో చంపేస్తున్నారు!!
విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబినేషన్లో వస్తోన్న ‘ఫ్యామిలీస్టార్. ఈ చిత్రంలో సీతారామ బ్యూటీ మృణాల్ ఠాకూర్ జోడీగా కనిపించనుంది. గీతగోవిందం సూపర్ హిట్ తర్వాత పరశురామ్‌తో మరోసారి జతకట్టారు. ఇటీవలే ఈ చిత్రానికి సంబంధించిన గ్లింప్స్ రిలీజ్ చేశారు మేకర్స్. అయితే ఈ మూవీలో ఓ డైలాగ్ మాత్రం ఇప్పుడు సోషల్‌మీడియాను ఊపేస్తోంది. నెట్టింట ట్రెండ్ అవుతోంది. అంతే కాకుండా ఈ డైలాగ్పై నెట్టింట మీమ్స్ చక్కర్లు కొడుతున్నాయి. తాజాగా టాలీవుడ్ స్టార్ హీరోల సినిమాల్లోని సీన్స్‌కు ఈ ఫ్యామిలీ స్టార్‌లోని 'ఉల్లిపాయలు కొంటే మనిషికాదా? పిల్లల్ని రెడీ చేస్తే మగాడు కాదా? ఐరనే వంచాలా ఏంటి?' అనే డైలాగ్‌లో మీమ్స్ తెగ వైరల్ చేస్తున్నారు. ఇప్పటికే మిర్చి సినిమాలోని డైలాగ్‌తో లింక్ చేస్తూ విజయ్ దేవరకొండ ఇన్‌స్టాలో షేర్ చేశారు. ఇంటర్నెట్లో అసలు ఏం నడుస్తోంది అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చారు. ఐరనే వంచాలా ఏంటి? అనే డైలాగ్‌తో ప్రభాస్ బాహుబలి, అల్లు అర్జున్ సరైనోడు, రేసుగుర్రం సినిమాల్లోని సీన్లతో కలిపి తెగ ట్రెండ్ చేసేస్తున్నారు. దీంతో ఒక్కసారిగా సోషల్ మీడియాలో ఈ ఒక్క డైలాగ్ హాట్ టాపిక్‌గా మారింది. మీరు కూడా ఈ డైలాగ్పై వచ్చిన మీమ్స్ చూస్తే నవ్వుకుండా ఉండలేరు. అయితే దీని వెనుక మరో కారణం కూడా ఉన్నట్లు సమాచారం. ఈ ఐరన్ డైలాగ్, విజువల్స్ యాడ్‌ను తలపించేలా ఉన్నాయంటూ ట్రోల్స్ వచ్చాయి. వాటిని తిప్పికొట్టేందుకే మేకర్స్ ఇలా ప్లాన్ చేసిందని కొందరు నెటిజన్లు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ఫ్యామిలీ ఎంటర్టైనర్గా రూపొందుతున్న ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో నిలవనుంది. Promotions lo evadina ma vadi tharvatha ne ani prove chesadu Insta story of #VijayDeverakonda 𝙃𝙖𝙩𝙚𝙧𝙨 𝙩𝙝𝙧𝙤𝙬𝙞𝙣𝙜 𝙨𝙩𝙤𝙣𝙚𝙨 𝙤𝙣 𝙝𝙞𝙢 😅 𝘽𝙪𝙩 𝙝𝙚 𝙞𝙨 𝙗𝙪𝙞𝙡𝙙𝙞𝙣𝙜 𝙖𝙣 𝙀𝙢𝙥𝙞𝙧𝙚 𝙬𝙞𝙩𝙝 𝙩𝙝𝙚𝙢 𝙆𝙄𝙉𝙂 👑#Airanevonchalaenti pic.twitter.com/7T1OHhLyGy — THE CHANTI (@chanticomr95290) October 26, 2023 #AiranevanchalaEnti 😅#FamilyStar #VijayDeverakonda pic.twitter.com/u5wEjJeH71 — Ee Nagaraniki Emaindi Meme Project (@enememeproject) October 26, 2023 #Airanevanchalaenti #AlluArjun #FamilyStar @TheDeverakonda Entertainment Teaser 😂 pic.twitter.com/3yRMQQONfr — 𝕂ℝ𝕚𝕤𝕙𝕟🅰️🅰️ (@sAAi_krishnAA) October 26, 2023 Me from last 2 days#FamilyStar @zunkkkkkk @sanjaysahu4510 pic.twitter.com/cwQVSomXdn — Vinsmoke Akhil🚬(Mr.Typo) (@Erengaadu) October 26, 2023 Twitter mottham idhe Lolli🚶🏻♂️#Airanevonchalaenti #FamilyStar pic.twitter.com/bMkif1b5LA — Devil🦦 (@AlwaysDevill) October 26, 2023 Sorry but not sorry .#VijayDevarakonda #FamilyStar #AiraneVanchalaEnti pic.twitter.com/KAMGdztXyT — filmyentity (@filmyentity) October 26, 2023 Wait for it🙂#FamilyStar pic.twitter.com/yZER1ciIuT — VIRAT⭐️ #AiraneVanchalaEnti (@ReyyViratuu) October 26, 2023 #FamilyStar X #NaaSaamiRanga 🙂 pic.twitter.com/BFEQa0g1cY — VIRAT⭐️ #AiraneVanchalaEnti (@ReyyViratuu) October 26, 2023 -
'ఫ్యామిలీ స్టార్'గా విజయ్.. భార్యగా మృణాల్
గత కొన్నిరోజుల నుంచి అనుకుంటున్నట్లే విజయ్ దేవరకొండ కొత్త సినిమాకు 'ఫ్యామిలీ స్టార్' టైటిల్ ఖరారు చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమా టైటిల్ ప్రకటిస్తూ ఓ గ్లింప్స్ వీడియోని బుధవారం సాయంత్రం రిలీజ్ చేశారు. అయితే ఇప్పటివరకు చేసిన చిత్రాలతో పోలిస్తే విజయ్ డిఫరెంట్ లుక్‌లో మిడిల్ క్లాస్ తండ్రి పాత్రలో కనిపించడం విశేషం. (ఇదీ చదవండి: 'భగవంత్ కేసరి' సినిమా రిలీజ్‌కి ముందే రూ 3.5 కోట్లు నష్టం?) ఈ టీజర్లో.. ఇంట్లో పనులు చేసే ఫ్యామిలీ మ్యాన్, బయట రౌడీల బెండు తీసే పవర్ఫుల్ మ్యాన్‌గా విజయ్ దేవరకొండ కనిపించారు. లైన్లో నిలబడి ఉల్లిపాయలు తేవడాలు, టైమ్‌కు లేచి పిల్లల్ని రెడీ చేసి స్కూల్‌కు పంపించడాలు అనుకున్నావా మగతనం అంటే అని విలన్ ఎగతాళిగా మాట్లాడగా.. భలే మాట్లాడతారన్నా మీరంతా, ఉల్లిపాయలు కొంటే ఆడు మనిషి కాదా, పిల్లల్ని రెడీ చేస్తే ఆడు మగాడు కాదా? ఐరెన్ వంచాలా ఏంటి? అని డైలాగ్స్‌తో విజయ్ ఆకట్టుకున్నాడు. ఇక టీజర్ చివరలో విజయ్ భార్యగా మృణాల్ నటిస్తుందనే విషయాన్ని రివీల్ చేశారు. 'ఫ్యామిలీ స్టార్' వీడియో చూస్తుంటే మిడిల్ క్లాస్ ఎమోషన్స్ చూపిస్తూనే అక్కడక్కడ యాక్షన్ చూపిస్తారనిపిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకొంటున్న 'ఫ్యామిలీ స్టార్' సినిమా వచ్చే సంక్రాంతి కానుకగా థియేటర్లలో రిలీజ్ కాబోతోంది. త్వరలో రిలీజ్ డేట్ అనౌన్స్ చేయనున్నారు. (ఇదీ చదవండి: పులివెందులలో 'యాత్ర 2'... పవర్ఫుల్ పోస్టర్స్ రిలీజ్) -
విజయ్ దేవరకొండ- పరశురామ్ నయా మూవీ టైటిల్‌కి ముహూర్తం ఫిక్స్
‘గీత గోవిందం’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో మరో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీడీ 13 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది. తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్డేట్ని వెల్లడించారు మేకర్స్. ఈ నెల 18న సాయంత్రం 6.30 నిమిషాలకు వీడీ 13 సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టర్ని రిలీజ్ చేసింది. అందులో విజయ్ స్కూల్ డ్రెస్‌లో ఉన్న పిల్లల చేయి పట్టుకుని ముందుకు నడుస్తున్నట్లున్న చూపించారు. ఈ సినిమా కూడా గీత గోవిందం తరహాలోనే హీరో క్యారెక్టర్ బలంగా ఉంటూనే, అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైన్మెంట్తో సాగుతుందట. The official Naamakaranam for this special project will be announced through a small title teaser.❤️ You will witness something special 🔥 Date- October 18 Time- 18:30#VD13 #SVC54@TheDeverakonda @mrunal0801@ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/XTk2pSwFUR — Sri Venkateswara Creations (@SVC_official) October 15, 2023 -
సంక్రాంతి బరిలో విజయ్ దేవరకొండ
వచ్చే ఏడాది సంక్రాంతి బరిలోని విజయ్ దేవరకొండ దిగబోతున్నారు. గీత గోవిందం లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరుశురామ్ కాంబోలో ఓ చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు నిర్మిస్తున్న ఈ చిత్రంలో మృణాలు ఠాకూర్ హీరోయిన్. వీడీ 13 వర్కింగ్ టైటిల్‌తో ఈ చిత్రం షూటింగ్‌ని జరుపుకుటుంది. ఇంకా టైటిల్‌ని అయితే ప్రకటించలేదు కానీ.. విడుదల ఎప్పుడో చెప్పేశారు. వీడీ 13 మూవీ 50 శాతం షూటింగ్ పూర్తయిందని తెలియజేస్తూ.. సంక్రాంతికి గ్రాండ్‌గా రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించారు.త్వరలోనే ఈ సినిమా టైటిల్, ఫస్ట్ లుక్ ను విడుదల చేయనున్నారు. ఇప్పటికే సంక్రాంతి బరిలో మహేశ్ బాబు ‘గుంటూరు కారం’ మూవీ ఉంది. త్రివిక్రమ్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం సంక్రాంతికి విడుదల చేస్తామని చిత్ర యూనిట్ ఎప్పుడో ప్రకటించింది. దీంతో పాటు విక్టరీ వెంకటేశ్ ‘సైంధవ్’, నాగార్జున ‘నా సామిరంగ’, తేజ సజ్జ ‘హనుమాన్’ చిత్రాలు కూడా సంక్రాంతికి రాబోతున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. మరి వీటిలో ఒకటి రెండు చిత్రాలు తమ విడుదలను వాయిదా వేసుకునే అవకాశం ఉంది. -
స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా 'రామ్' ఫస్ట్‌లుక్
ఈ మధ్య కాలంలో నిజ జీవిత కథలని సినిమాలుగా తీస్తున్నారు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి కూడా. ఈ నేపథ్యంలో దీపిక ఎంటర్టైన్మెంట్ బ్యానర్‌పై ఓఎస్ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్ నెం.1గా 'రామ్' (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా తీస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌ని స్టార్ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదగా మంగళవారం రిలీజ్ చేశారు. (ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్!) దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ గ్లింప్స్‌లో వినిపించిన డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య హీరోగా పరిచయమవుతున్నాడు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ధన్య బాలకృష్ణ హీరోయిన్. ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు. (ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!) -
ఫ్యామిలీస్టార్ సినిమాలో హీరోయిన్గా లక్కీ చాన్స్?
‘గీత గోవిందం’ (2018) వంటి హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ ప్రారంభమైంది. అయితే కథ రీత్యా ఈ సినిమాలో మరో హీరోయిన్‌కు చోటు ఉందని, దీంతో ఈ పాత్రకు దివ్యాంశ కౌశిక్‌ను చిత్రయూనిట్ సెలక్ట్ చేసుకున్నారనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది. ఇదే నిజమైతే దివ్యాంశకు మరో లక్కీ చాన్స్ దక్కినట్లేనని సినిమా ప్రేమికులు చెప్పుకుంటున్నారు. ‘దిల్’ రాజు, శిరీష్ నిర్మిస్తున్న ఈ సినిమాకు ‘ఫ్యామిలీస్టార్’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే ప్రచారం సాగుతోంది. ఈ సినిమాను వచ్చే ఏడాది సంక్రాంతి సందర్భంగా జనవరిలో విడుదల చేయనున్నట్లుగా చిత్రయూనిట్ ప్రకటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. -
సంక్రాంతి బరిలో...
హిట్ ఫిల్మ్ ‘గీత గోవిందం’ (2018) తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్స్ లో మరో సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ . ‘దిల్’ రాజు, శిరీష్‌లు నిర్మిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ మొదలైందని వెల్లడించి, ఈ చిత్రాన్ని 2024 సంక్రాంతికి రిలీజ్ చేస్తున్నట్లుగా శనివారం చిత్ర యూనిట్ ప్రకటించింది. ఈ చిత్రానికి సంగీతం: గోపీసుందర్, కెమెరా: కేయూ మోహనన్స్ . -
'గీతగోవిందం' కాంబో రిపీట్.. కాకపోతే ఆ ఇద్దరు మాత్రం!
విజయ్ దేవరకొండ ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఆల్రెడీ 'ఖుషి'తో బిజీగా ఉన్న ఇతడు.. గౌతమ్ తిన్ననూరి మూవీలోనూ హీరోగా చేస్తున్నారు. ఇప్పుడు 'గీతగోవిందం'తో తనకు హిట్ ఇచ్చిన పరశురామ్ తో మరో ప్రాజెక్ట్ చేసేందుకు రెడీ అయిపోయాడు. హైదరాబాద్ లో బుధవారం(జూన్ 14) ఈ సినిమా ఘనంగా ప్రారంభమైంది. ప్రముఖ నిర్మాత శ్యామ్ ప్రసాద్ రెడ్డి క్లాప్ కొట్టగా, ఫస్ట్ షాట్ ని గోవర్ధన్ రావు దేవరకొండ డైరక్ట్ చేశారు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ స్టేజీలో ఉన్న ఈ సినిమా షూటింగ్ త్వరలోనే షురూ కానుంది. 'గీతగోవిందం' కాంబో రిపీటైంది కానీ ఇందులో హీరోయిన్, ప్రొడ్యూసర్ మారారు. 'సీతారామం' బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ కాగా, దిల్ రాజు నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మిగతా వివరాలు త్వరలో ప్రకటిస్తారు. Happy to announce my next! @TheDeverakonda and @GopiSundarOffl , it’s time to recreate our magic again. @mrunal0801 @SVC_official #KUMohanan #VasuVarma #DilRaju #Shirish Shoot begins soon.#SVC54 pic.twitter.com/7WbrKdbrcT— Parasuram Petla (@ParasuramPetla) June 14, 2023 (ఇదీ చదవండి: వారి కోసం అవార్డునే అమ్మేశాడు.. దటీజ్ విజయ్ దేవరకొండ!) -
'సీతారామం' బ్యూటీకి బంపరాఫర్.. ఈసారి ఏకంగా!
రౌడీహీరో విజయ్ దేవరకొండకు 'లైగర్'తో కోలుకోలేని దెబ్బ తగిలింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హల్ చల్ చేద్దామనుకున్నాడు కానీ అది జరగలేదు. దీంతో రూట్ మార్చేశాడు. యాక్షన్ ని పక్కనబెట్టి లవ్ స్టోరీలు చేస్తున్నాడు. 'ఖుషి' ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ఈ ఏడాది సెప్టెంబరు 1న రిలీజ్ కానుంది. ఇంతలో మరో లవ్ స్టోరీతో విజయ్ రెడీ అయిపోయాడు. (ఇదీ చదవండి: ‘సీతారామం 2’ కోసం వెయిటింగ్: మృణాల్ ఆసక్తికర వ్యాఖ్యలు) విజయ్ దేవరకొండ కెరీర్ లో హిట్ సినిమాలంటే 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' మాత్రమే. విజయ్ లో యాక్షన్ కంటే లవ్ యాంగిలే చాలామంది ఫ్యాన్స్ కి ఇష్టం. అందుకే 'గీత గోవిందం'కి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని చాలారోజుల నుంచి రౌడీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే కొన్నాళ్ల ముందు డైరెక్టర్ పరశురామ్ తో విజయ్ మూవీ అనౌన్స్ చేశారు. దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేని తీసుకున్నారని కొన్నిరోజుల ముందు వార్తలొచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని తేలిపోయింది. 'సీతారామం'తో సెన్సేషన్ సృష్టించిన మృణాల్ ఠాకుర్ ని.. విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారని టాక్. హైదరబాద్ లో బుధవారం(జూన్ 14).. ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇది ప్యూర్ లవ్ స్టోరీ అని, విజయ్-మృణాల్ మధ్య మాంచి రొమాన్స్ గ్యారంటీ అని సమాచారం. ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది. (ఇదీ చదవండి: మృణాల్ ఠాకూర్‌కు బెదిరింపులు.. అసలేం జరిగింది!) -
ఆయన టైం వేస్ట్ చేశారు.. డైరెక్టర్‌పై నాగచైతన్య కామెంట్స్ వైరల్
నాగచైతన్య, కృతిశెట్టి జంటగా నటించిన తాజా చిత్రం 'కస్టడీ'. శ్రీనివాసా సిల్వర్ స్క్రీన్ పతాకంపై శ్రీనివాసా పొట్లూరి నిర్మించిన ఈ ద్విభాషా (తమిళం, తెలుగు) చిత్రానికి వెంకట్ ప్రభు దర్శకత్వం వహించారు. ఇళయరాజా, యువన్ శంకర్ రాజా కలిసి సంగీతాన్ని అందించిన ఇందులో అరవింద్‌స్వామి, శరత్‌కుమార్, ప్రియమణి ముఖ్యపాత్రలు పోషించారు. ఇప్పటికే నిర్మాణ కార్యక్రమాలు పూర్తి చేసుకున్న ఈ చిత్రం ఈనెల 12న ప్రేక్షకుల ముందుకు రానుంది. మూవీ ప్రమోషన్లలో బిజీగా ఉన్న చైతూ తాజాగా ఓ ఇంటర్వ్యూకు హాజరయ్యారు. ఓ డైరెక్టర్ గురించి మాట్లాడుతూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. (ఇది చదవండి: నాగచైతన్యతో నటించడం మంచి ఎక్స్పీరియన్స్: కృతిశెట్టి) గతంలో నాగచైతన్యతో డైరెక్టర్ పరశురాం సినిమా చేస్తున్నారని వార్తలొచ్చిన సంగతి తెలిసిందే. అయితే సూపర్ స్టార్ మహేష్ బాబుతో ‘సర్కారు వారి పాట’ సినిమాకు ఛాన్స్ రావడంతో నాగ చైతన్య ప్రాజెక్ట్‌ను పక్కన పెట్టేసినట్లు సమాచారం. తాజా ఇంటర్వ్యూలో దీనిపై ప్రశ్నించగా.. 'ఆయన గురించి మాట్లాడటం టైం వేస్ట్. నా టైం వేస్ట్ చేశారు. ఆయన గురించి మాట్లాడటం మన టైం వేస్ట్.' అంటూ సమాధానమిచ్చారు. (ఇది చదవండి: అవే మనల్ని దూరం చేశాయి.. సమంత ఇంట్రెస్టింగ్ పోస్ట్) అయితే ఆ సినిమా తరువాత మళ్లీ చైతూ దగ్గరకు పరశురాం వెళ్లారని.. నాగేశ్వరరావు అనే టైటిల్‌తో సినిమాను పట్టాలెక్కిస్తున్నారని టాక్ వినిపించింది. కానీ కథ నాగచైతన్యకు నచ్చకపోవడంతో సినిమా రద్దు చేసుకున్నారని వార్తలొచ్చాయి. దీంతో ప్రస్తుతం నాగచైతన్య చేసిన కామెంట్స్ వైరల్‌గా మారాయి. -
కార్తీని ఇంప్రెస్ చేసిన ‘గీతగోవిందం’ డైరెక్టర్
హీరో కార్తీ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో ఓ సినిమా రూపుదిద్దుకోనుందని టాలీవుడ్ టాక్. ‘ఊపిరి’ (2016) సినిమా తర్వాత తెలుగులో ఓ స్ట్రయిట్ ఫిల్మ్ చేయాలని ఆసక్తిగా ఉన్నారు కార్తీ. ఇందుకోసం కథలు కూడా వింటున్నారు. ఈ ప్రక్రియలో భాగంగానే పరశురామ్ చెప్పిన ఓ కథకు ఇంప్రెస్ అయ్యారట కార్తీ. దీంతో వీరిద్దరి కాంబినేషన్లో ఓ సినిమా రానుందని, కథ పరంగా ఈ మూవీకి ‘రెంచ్ రాజు’ అనే టైటిల్ అనుకుంటున్నారని ప్రచారం జరుగుతోంది. కాగా ‘గీతగోవిందం’ తర్వాత విజయ్ దేవరకొండతో మరో సినిమాకు కమిటయ్యారు పరశురామ్. అయితే ఆయన ఏ హీరోతో ముందుగా సినిమా చేస్తారనే విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. చదవండి: నటి హేమ కూతురిని చూశారా? ఇప్పుడు ఆమె ఏం చేస్తుందో తెలుసా? తారకరత్న మృతి.. బాలకృష్ణ కీలక నిర్ణయం -
బ్లాక్‌బస్టర్ గీత గోవిందం కాంబినేషన్ రిపీట్
‘గీతగోవిందం’ (2018) వంటి సూపర్ హిట్ ఫిల్మ్ తర్వాత హీరో విజయ్ దేవరకొండ, దర్శకుడు పరశురామ్ కాంబినేషన్లో మరో సినిమా తెరకెక్కనుంది. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై ‘దిల్’ రాజు, శిరీష్ ఈ సినిమాను నిర్మించనున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కనున్న ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి. మరోవైపు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ‘ఖుషి’ చిత్రంలో విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఇందులో సమంత హీరోయిన్గా నటిస్తున్నారు. ఇప్పటికే షూటింగ్ కూడా మొదలైంది. అయితే సమంత అనారోగ్యం, కాల్షీట్స్ సర్దుబాటు కారణాల వల్ల ఈ చిత్రం షూటింగ్ తాత్కాలికంగా నిలిచిపోయింది. కాగా ప్రస్తుతం ఈ సినిమాకు సంబంధించిన మ్యూజిక్ సిట్టింగ్స్ శరవేగంగా జరుగుతున్నాయి. హేషామ్ అబ్దుల్ వహాబ్ సంగీతం అందిస్తున్నారు. అలాగే దర్శకుడు సుకుమార్‌తో విజయ్ దేవరకొండ ఓ సినిమాకి కమిట్ అయిన సంగతి తెలిసిందే. View this post on Instagram A post shared by Sri Venkateswara Creations (@srivenkateswaracreations) చదవండి: జూనియర్ ఎన్టీఆర్ హీరోయిన్ ఇప్పుడెలా ఉందో తెలుసా? -
బ్లాక్ బస్టర్ అందించిన ఈ దర్శకులు.. ఇలా సైలెంట్ అయ్యారేంటి?
ఓ సినిమా సెట్స్‌పై ఉండగా లేదా విడుదలకు సిద్ధం అవుతున్న సమయంలోనే తర్వాతి సినిమా గురించి అనౌన్స్ చేస్తుంటారు కొందరు దర్శకులు. అయితే కొందరు డైరెక్టర్స్ మాత్రం మూడు నాలుగేళ్లుగా తమ తర్వాతి ప్రాజెక్ట్స్‌పై క్లారిటీ ఇవ్వలేదు. దీంతో ‘వాట్ నెక్ట్స్?’ అనే చర్చ జరగడం కామన్ . మరి ఆ ప్రశ్నకు ఆయా దర్శకులే క్లారిటీ ఇవ్వాల్సి ఉంటుంది. తెలుగులో తమ తర్వాతి సినిమాలపై ఓ క్లారిటీ ఇవ్వని శ్రీను వైట్ల, శ్రీకాంత్ అడ్డాల, విజయ్ కుమార్ కొండా, సంతోష్ శ్రీనివాస్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్, సుజిత్, బుచ్చిబాబు వంటి దర్శకులపై ఓ లుక్కేద్దాం. లవ్, యాక్షన్, ఫ్యామిలీ.. ఇలా అన్ని జానర్స్‌లో సినిమాలు తీసి హిట్ అందుకున్నారు శ్రీను వైట్ల. చిరంజీవి, నాగార్జున, వెంకటేశ్, మహేశ్‌బాబు, ఎన్టీఆర్, రామ్‌చరణ్, రవితేజ, మంచు విష్ణు, రామ్.. వంటి హీరోలతో వరుసగా చిత్రాలు తీసిన ఆయన నాలుగేళ్లుగా నెమ్మదించారు. వరుణ్ తేజ్‌తో తీసిన ‘మిస్టర్’ (2017), రవితేజతో తెరకెక్కించిన ‘అమర్ అక్బర్ ఆంటోనీ’ (2018) చిత్రాల తర్వాత మంచు విష్ణుతో శ్రీను వైట్ల ‘ఢీ’ సినిమాకి సీక్వెల్‌గా ‘ఢీ అండ్ ఢీ’ని ప్రకటించారు. అయితే ఆ సినిమాని ప్రకటించి రెండేళ్లవుతున్నా ఇప్పటివరకూ సెట్స్‌పైకి వెళ్లలేదు. ఈ మధ్యలో మంచు విష్ణు ‘జిన్నా’ సినిమాని పూర్తి చేశారు. ఈ మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. మరో దర్శకుడు శ్రీకాంత్ అడ్డాల విషయానికి వస్తే.. సున్నితమైన ప్రేమకథకు ఫ్యామిలీ ఎవెషన్స్ యాడ్ చేసి తొలి సినిమాతోనే (కొత్తబంగారు లోకం) హిట్‌కొట్టారు. ఆ తర్వాత వెంకటేశ్, మహేశ్‌బాబులతో మల్టీస్టారర్ మూవీ ‘సీతమ్మవాకిట్లో సిరిమల్లె చెట్టు’ హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నారు. ఆ తర్వాత ‘ముకుంద, బ్రహ్మోత్సవం, నారప్ప’ వంటి చిత్రాలు తీశారాయన. వెంకటేశ్ హీరోగా రూపొందిన ‘నారప్ప’ గత ఏడాది జూలై 20న ఓటీటీలో విడుదలై మంచి హిట్‌గా నిలిచింది. ఈ చిత్రం రిలీజై ఏడాది దాటినా తర్వాతి ప్రాజెక్టుపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు శ్రీకాంత్ అడ్డాల. సేమ్ ఇలానే దర్శకుడు విజయ్ కుమార్ కొండా కూడా ఏడాదికిపైనే అయినా తాజా చిత్రాన్ని ప్రకటించలేదు. నితిన్ హీరోగా ‘గుండెజారి గల్లంతయ్యిందే’ వంటి లవ్, ఫ్యామిలీ ఎంటర్టైనర్ త్రాన్ని తెరకెక్కిం బ్లాక్‌బస్టర్ అందుకున్నారు విజయ్ కుమార్ కొండా. ఆ తర్వాత ‘ఒక లైలా కోసం, ఒరేయ్ బుజ్జిగా, పవర్ ప్లే’ వంటి సినిమాలు తెరకెక్కించారు. రాజ్ తరుణ్‌తో తీసిన ‘పవర్ ప్లే’ చిత్రం 2021 మార్చి 5న రిలీజ్ అయింది. ఈ చిత్రం విడుదలై ఏడాదిన్నర్ర అవుతున్నా ఆయన తర్వాతి సినిమాపై ఎలాంటి స్పష్టత లేదు. శ్రీకాంత్ అడ్డాల, విజయ్‌కుమార్‌లా తదుపరి చిత్రంపై ఏడాది అవుతున్నా స్పష్టత ఇవ్వని మరో దర్శకుడు ‘బొమ్మరిల్లు భాస్కర్’. అందమైన కుటుంబ కథకి ప్రేమ, భావోద్వేగాలు కలగలిపి ‘బొమ్మరిల్లు’ సినిమాతో సెన్సేషనల్ హిట్ అందుకున్నారు భాస్కర్. ఆ సినిమానే ఆయన ఇంటిపేరుగా మారిందంటే ఆ త్రం ఏ రేంజ్లో ఆయనకి గుర్తింపు తీసుకొచ్చిందో ప్రత్యేకించెప్పక్కర్లేదు. ఆ తర్వాత తెలుగులో ‘పరుగు, ఆరెంజ్, ఒంగోలు గిత్త’ చిత్రాలు తీశారు. అఖిల్ హీరోగా ‘మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్’ త్రాన్ని తెరకెక్కించారు. 2021 అక్టోబర్ 15న విడుదలైన ఈ చిత్రం మంచి హిట్ అందుకుంది. అయితే తన నెక్ట్స్ సినిమాపై భాస్కర్ క్లారిటీ ఇవ్వలేదు. ఇక కెమెరామేన్ నుంచి దర్శకునిగా మారిన సంతోష్ శ్రీనివాస్ కూడా తదుపరి చిత్రం ప్రకటించని దర్శకుల జాబితాలో ఉన్నారు. ‘కందిరీగ, రభస, హైపర్, అల్లుడు అదుర్స్’ వంటి త్రాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారాయన. బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా తెరకెక్కింన ‘అల్లుడు అదుర్స్’ (2021 జనవరి 15న విడుదలైంది) తర్వాత తన నెక్ట్స్ మూవీ ఎవరితో ఉంటుంది? అనే స్పష్టత ఇవ్వలేదాయన. పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు గతంలో వినిపించాయి. సీనియర్లే కాదు.. యువ దర్శకుడు సుజీత్ కూడా మూడేళ్లయినా తన తదుపరి త్రం ప్రకటించలేదు. తొలి చిత్రం ‘రన్ రాజా రన్(2014)’ తో మంచి హిట్ అందుకున్నారు సుజిత్. ఆ సినిమా ఇచ్చిన హిట్‌తో స్టార్ హీరో ప్రభాస్‌ని డైరెక్ట్ చేసే చాన్స్ దక్కించుకున్నారు. ప్రభాస్ హీరోగా సుజిత్ దర్శకత్వం వహించిన ‘సాహో’ చిత్రం 2019 ఆగస్టు 30న విడుదలైంది. యాక్షన్, టెక్నికల్ పరంగా అత్యున్నత విలువలతో రూపొందిన ఈ చిత్రం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్‌పై ఉన్న భారీ అంచనాలను అందుకోలేకపోయింది. ‘సాహో’ విడుదలై మూడేళ్లు అవుతున్నా తన తర్వాతి సినిమాపై ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు సుజిత్. అయితే పవన్ కల్యాణ్‌తో ఓ సినిమా చేయనున్నారని, ఇప్పటికే కథ వినిపించారని టాక్. డీవీవీ దానయ్య నిర్మించనున్న ఈ సినిమాకి దర్శకుడు త్రివిక్రమ్ కూడా నిర్మాతగా వ్యవహరించనున్నారట. ఈ చిత్రం గురించి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. మరోవైపు ప్రేమకథతో టాలీవుడ్‌కి ‘ఉప్పెన’లా దూసుకొచ్చారు బుచ్చిబాబు. డైరెక్టర్ సుకుమార్ వద్ద అసిస్టెంట్‌గా చేసిన బుచ్చిబాబు తొలి చిత్రంతోనే సెన్సేషనల్ హిట్ అందుకున్నారు. ఆ చిత్రంతో హీరో హీరోయిన్లుగా పరిచయమైన వైష్ణవ్ తేజ్, కృతీశెట్టి ఫుల్ బిజీ అయిపోయారు. 2021 ఫిబ్రవరి 12న ఈ చిత్రం విడుదలై బ్లాక్ బస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రం విడుదలై దాదాపు ఏడాదిన్నర్ర కావస్తున్నా బుచ్చిబాబు తర్వాతి సినిమాపై స్పష్టత లేదు. అయితే తన తర్వాతి మూవీ ఎన్టీఆర్‌తో ఉంటుందని, ఇందుకోసం కథ కూడా సిద్ధం చేశారని వార్తలు వచ్చాయి.. కానీ, దీనిపై అధికారిక ప్రకటన లేదు. వీరితో పాటు వేణు శ్రీరాం, రాహుల్ సంకృత్యాన్, రాధాకృష్ణ కుమార్, పరశురామ్ వంటి దర్శకుల తర్వాతి మూవీస్పైనా క్లారిటీ రావాల్సి ఉంది. వీరిలో వేణు శ్రీరామ్ హీరో రామ్‌చరణ్‌తో ఓ సినిమా చేయనున్నారని టాక్. నాగచైతన్య హీరోగా పరశురామ్ ఓ మూవీ చేయనున్నారని సమాచారం. -
నాగ చైతన్యకు జోడిగా రష్మిక మందన్నా?
Naga Chaitanya To Romance Rashmika Mandanna: టాలీవుడ్ యంగ్ హీరో నాగ చైతన్య సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి 13 ఏళ్లు కావోస్తుంది. 2009లో 'జోష్' చిత్రంతో అక్కినేని నాగార్జున నట వారసుడిగా పరిచయమైన చైతూ ఇటీవల థ్యాంక్యూ మూవీతో ప్రేక్షకులను పలకరించాడు. ప్రస్తుతం వరుస పెట్టి సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నాడు. అలాగే హిందీలో డెబ్యూ ఇస్తూ తన మార్కెట్ పెంచుకునే దిశగా వెళ్తున్నాడు చైతూ. నాగ చైతన్య తాజాగా నటించిన చిత్రం 'లాల్ సింగ్ చద్దా'. అమీర్ ఖాన్ ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ చిత్రంలో చైతూ కీలక పాత్ర పోషిస్తున్న విషయం తెలిసిందే. ఆగస్టు 11న విడుదల కానున్న ఈ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటున్నాడు. ఇదిలా ఉంటే నాగ చైతన్యకు సంబంధించిన ఒక కొత్త వార్త చక్కర్లు కొడుతోంది. నాగ చైతన్య హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ పూర్తయిన ఈ మూవీ త్వరలోనే సెట్స్‌పైకి తీసుకెళ్లేందుకు ప్లాన్ చేస్తున్నాట. ఈ చిత్రంలో హీరోయిన్ కోసం వెతుకులాట మొదలు పెట్టిన దర్శకనిర్మాతలు నేషనల్ క్రష్ రష్మిక మందన్నాను తీసుకోనున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే, రష్మికకు డైరెక్టర్ పరశురామ్ కథ వినిపించారా? లేదా? అన్నది స్పష్టత లేదు. ఒకవేళ ఇది ఓకే అయితే నాగ చైతన్య, రష్మిక మందన్నా తొలిసారిగా జోడి కట్టిన చిత్రం ఇదే అవుతుంది. కాగా పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన 'గీత గోవిందం'లో రష్మిక హీరోయిన్గా చేసిన విషయం తెలిసిందే. -
అప్పన్న భక్తులకు ‘సర్కారు వారి పాట’ దర్శకుడు క్షమాపణ
సాక్షి, సింహాచలం(పెందుర్తి): ఇటీవల విడుదలైన సర్కారు వారి పాట సినిమాలో సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని ఉద్దేశించి విలన్‌తో పలికించిన ఒక డైలాగ్ భక్తుల మనోభావాలు దెబ్బతినే విధంగా ఉంటే క్షమించాలని ఆ సినిమా దర్శకుడు పరశురామ్ తెలిపారు. సర్కారు వారి పాట సినిమా విజయవంతం కావడంతో శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామిని శుక్రవారం ఆయన దర్శించుకున్నారు. (చదవండి: అభిమానిని తలుచుకొని ఎమోషనల్ అయిన సూపర్‌స్టార్ కృష్ణ) ఈ సందర్భంగా సినిమాలోని ఒక డైలాగ్ విమర్శలకు తావివ్వడంపై మీడియా ప్రతినిధులు, కొందరు భక్తులు పరశురామ్ దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై ఆయన మాట్లాడుతూ అది ఉద్దేశపూర్వకంగా చేసింది కాదని, ఆ విషయంలో భక్తుల మనోభావాలు దెబ్బతిని ఉంటే మనస్పూర్తిగా క్షమాపణలు అడుగుతున్నానని తెలిపారు. శ్రీ వరాహ లక్ష్మీనృసింహస్వామి అంటే తనకు ఎంతో భక్తి అని, వీలైనప్పుడల్లా స్వామిని దర్శించుకుంటానని అన్నారు. సర్కారు వారి పాట సినిమా ప్రారంభ సమయంలోనూ స్వామిని దర్శించుకున్నానన్నారు. సినిమాకు విజయం చేకూర్చిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు చెబుతున్నానని తెలిపారు. నాగచైతన్యతో త్వరలో సినిమా తీస్తున్నట్టు చెప్పారు. దర్శనార్థం వచ్చిన పరశురామ్ ఆలయంలోని కప్పస్తంభాన్ని ఆలింగనం చేసుకున్నారు. ఆయన పేరిట అర్చకులు స్వామికి పూజలు చేశారు. వేద ఆశీర్వచనం అందజేశారు. ఆలయ సంప్రదాయం ప్రకారం టెంపుల్ ఇన్స్పెక్టర్ కనకరాజు స్వామి వారి ప్రసాదాన్ని అందజేశారు. var request = 'https://www.sakshi.com/knowwidget/kwstr_721246091.json'; $.ajaxPrefilter( function (request) { if (request.crossDomain && jQuery.support.cors) { var http = (window.location.protocol === 'http:' ? 'http:' : 'https:'); request.url = http + '//cors-anywhere.herokuapp.com/' + request.url; } }); $.get( request,function (response){ if(response == ''){ $('#frameId').hide(); }else{ $('#frameId').show(); } }); -
సినిమా రిలీజైన రోజు ఉదయం మహేశ్‌బాబు ఫోన్ చేసి ఆ మాటన్నారు
‘‘సర్కారువారి పాట’ కథ అనుకున్నప్పుడే మహేశ్‌గారి కెరీర్లో పెద్ద హిట్ అవ్వాలని భావించాం. మేము ఊహించినట్లే సినిమా ఘనవిజయం సాధించింది. ఈ సినిమా కోసం నేను ఎంత కష్టపడ్డానో మహేశ్‌గారికి తెలుసు. ఆ కష్టానికి తగ్గ ప్రతిఫలం దక్కడం ఆనందంగా ఉంది’’ అని డైరెక్టర్ పరశురాం అన్నారు. మహేశ్‌బాబు, కీర్తీ సురేశ్ జంటగా పరశురాం దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్, రామ్ ఆచంట, గోపీ ఆచంట నిర్మించిన ఈ చిత్రం ఈ నెల 12న విడుదలైంది. ఈ సందర్భంగా పరశురాం బుధవారం విలేకరులతో మాట్లాడుతూ– ‘‘మా సినిమా రిలీజైన రోజు ఉదయం మహేశ్‌గారు ఫోన్ చేసి, ‘అన్ని చోట్ల నుండి బ్లాక్ బస్టర్ టాక్ వస్తోంది.. కంగ్రాట్స్’ అన్నారు. దర్శకులు సుకుమార్, పూరి జగన్నాథ్, హరీష్ శంకర్‌గార్లు ఫోన్ చేసి కంగ్రాట్స్ చెప్పారు. ‘మహేశ్‌గారిని ఇలా చూస్తామని జన్మలో అనుకోలేదు.. బాగా చూపించారు’ అని ఆయన అభిమానులు ఫోన్ చేసి, ఆనందపడ్డారు. కథ చెప్పడంలో ఒక్కో డైరెక్టర్‌ది ఒక్కో శైలి. ప్రేక్షకులను ఆహ్లాదపరుస్తూ చెప్పాలనుకున్న పాయింట్‌ని చెప్పడం నాకు ఇష్టమైన శైలి. ఈ సినిమా పరంగా సూపర్ స్టార్ మహేశ్‌గారిని డైరెక్ట్ చేశాననేది నా మొదటి కిక్కు. సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడం రెండో కిక్. మహేశ్‌గారిని కొత్తగా చూపించారని ఫ్యాన్స్ ఆనందపడటం మూడో కిక్’’ అన్నారు. చదవండి 👇 ఆహాలో అశోకవనంలో అర్జున కల్యాణం, ఎప్పుడంటే? పోకిరి కంటే కూడా మహేశ్ ఈ సినిమాలో చాలా యంగ్‌గా ఉన్నాడు -
వేదికపై మహేష్‌బాబు డ్యాన్స్
కర్నూలు (కల్చరల్): అభిమానులు తనపై చూపిన ప్రేమ, అభిమానాలను జీవితంలో మరిచిపోలేనని సినీ హీరో మహేష్‌బాబు ఉద్వేగంతో చెప్పారు. ఏ జన్మలో చేసుకున్న అదృష్టమో ఇలాంటి అభిమానులు తనకు దొరికారన్నారు. ఒక్కడు సినిమా షూటింగ్ సమయంలో కర్నూలు వచ్చానని.. మళ్లీ చాలా రోజుల తర్వాత ఇప్పుడు వచ్చినట్టు చెప్పారు. కర్నూలు ఎస్టీబీసీ కళాశాల మైదానంలో సోమవారం రాత్రి ‘సర్కారు వారి పాట’ విజయోత్సవ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా మహేష్ మాట్లాడారు. మొదటిసారి వేదికపై డ్యాన్స్ చేసి అభిమానులను అలరించారు. ఫంక్షన్లంటూ జరిగితే రాయలసీమలోనే జరగాలని మహేష్‌బాబు అన్నారు. సినిమా డైరెక్టర్ పరుశురామ్ మాట్లాడుతూ.. కర్నూలులో విజయోత్సవ సభ జరుపుకోవడం లైఫ్ టైం గిఫ్ట్ అన్నారు. సంగీత దర్శకుడు తమన్, పాటల రచయిత అనంత శ్రీరామ్, ప్రొడ్యూసర్స్ నవీన్, రవి, గోపి, రామ్ తదితరులు పాల్గొన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
Sarkaru Vaari Paata: మహేశ్‌బాబు రెమ్యునరేషన్ ఎన్ని కోట్లో తెలుసా?
సూపర్ స్టార్ మహేశ్‌బాబు సినిమా వస్తోందంటేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది మాస్ మసాలా మూవీతో వచ్చాడంటే ప్రేక్షకులు థియేటర్ల ముందు క్యూ కడతారు. తాజాగా మహేశ్‌బాబు నటించిన సర్కారువారి పాట థియేటర్లో కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా ఓవర్సీస్లోనూ మంచి వసూళ్లు రాబడుతోంది. ఈ క్రమంలో ఈ సినిమాలో నటీనటులు ఏ రేంజ్లో రెమ్యునరేషన్ తీసుకున్నారన్న విషయం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. డైరెక్టర్ పరశురామ్ రూ.10 కోట్లు తీసుకోగా మహేశ్‌బాబు రూ.35 - 50 కోట్ల మేర పారితోషికం తీసుకున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. సినిమా బడ్జెట్‌ను బట్టి మహేశ్ తీసుకునే రెమ్యునరేషన్ లెక్కలు కూడా మారతాయట. అయితే ఈ సూపర్ స్టార్ తను ఎంత డబ్బు తీసుకున్నా దాని సాయంతో చిన్నారుల కోసం ఎన్నో సేవాకార్యక్రమాలు చేస్తాడని, అలాంటప్పుడు ఆయన ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నా తప్పు లేదంటున్నారు ఫ్యాన్స్. ఇక సర్కారువారిపాట సినిమా విషయానికి వస్తే మైత్రీ మూవీ మేకర్స్, జీఏంబీ ఎంటర్టైన్మెంట్, 14 రీల్స్ ప్లస్ బ్యానర్లపై నవీన్ యెర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించారు. తమన్ సంగీతం అందించిన ఈ మూవీ మే 12న ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. Bang! SUPERSTAR Box office bang 💵🔥#SVP SMASHED magical $1.5Million gross mark in the USA 🧨🧨#SVPUsaSandhadi #SarkaruvaariPaata @urstrulyMahesh @KeerthyOfficial@ParasuramPetla @GMBents @MythriOfficial @14ReelsPlus @FlyHighCinemas @ShlokaEnts#BlockbusterSVP pic.twitter.com/vGiT5iJ94T — SarkaruVaariPaata (@SVPTheFilm) May 14, 2022 Box Office Veta Shuru 💥💥 ALL TIME RECORD for #SVP 75 Crores gross worldwide on Day 1 for #SarkaruVaariPaata#BlockbusterSVP #SVPMania Super 🌟 @urstrulyMahesh @KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @MythriOfficial @saregamasouth pic.twitter.com/ohgWExyDSt — SarkaruVaariPaata (@SVPTheFilm) May 13, 2022 -
‘సర్కారు వారి పాట’ బ్లాక్ బస్టర్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)
-
అదే సినిమాకి ప్లస్ అయ్యింది: డైరెక్టర్ పరశురాం
‘‘దేశ ప్రజలందరికీ కనెక్ట్ అయ్యే కథ ‘సర్కారువారి పాట’. బ్యాంకింగ్ సెక్టార్, ఈఎంఐతో ఇబ్బందిపడని మధ్య తరగతి మనిషి ఉండరు. అలాంటి పాయింట్‌ని మహేశ్‌గారి లాంటి సూపర్ స్టార్‌తో చెప్పించడం సినిమాకి ప్లస్ అయ్యింది. రచయితగా, దర్శకుడిగా ఈ సినిమా నాకు తృప్తినిచ్చింది. మా సినిమాకి ప్రీమియర్ షో నుంచే అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి బ్లాక్ బస్టర్ స్పందన రావడం ఆనందంగా ఉంది. మహేశ్‌గారి ఫ్యాన్స్‌తో పాటు మూవీ లవర్స్, ఫ్యామిలీ ఆడియన్స్, మాస్, క్లాస్.. ఇలా అన్ని వర్గాల ప్రేక్షకులకు మా సినిమా నచ్చింది’’ అని పరశురాం అన్నారు. చదవండి: బాలీవుడ్‌పై మహేశ్ కామెంట్స్, స్పందించిన బోనీ కపూర్, ఆర్జీవీ మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా నటించిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా గురువారం (మే 12) విడుదలైంది. ఈ సందర్భంగా చిత్ర యూనిట్ నిర్వహించిన ‘బ్లాక్ బస్టర్ మీట్’లో నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. ‘‘మా రెండేళ్ల కష్టం బ్లాక్ బస్టర్ రెస్పాన్స్‌తో ఎగిరిపోయింది. అమెరికాలో ప్రీమియర్‌లో మిలియన్ డాలర్స్‌ని కలెక్ట్ చేసి నాన్ ‘ఆర్ఆర్ఆర్’ రికార్డులన్నీ క్రాస్ చేసింది’’ అన్నారు. వై. రవిశంకర్ మాట్లాడుతూ.. ‘‘ఇప్పుడంతా పాన్ ఇండియా సినిమాలైపోయాయి. పూర్తిగా తెలుగులో ‘సర్కారువారి పాట’ లాంటి పెద్ద సినిమా మళ్లీ చూడగలమా? అంటే సందేహమే’’ అన్నారు. (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) చదవండి: ‘సర్కారు వారి పాట’ మూవీ చూసిన దర్శకేంద్రుడు, ఏమన్నారంటే -
ప్రీమియర్ కలెక్షన్స్‌తో సర్కారువారి పాట రికార్డు
ఎప్పుడొచ్చామన్నది కాదు, బుల్లెట్టు దిగిందా? లేదా?.. ఈ డైలాగ్ మహేశ్‌బాబుకు సెట్టయినంతగా మరెవరికీ సెట్ కాదేమో! ఎందుకంటే రెండున్నరేళ్ల గ్యాప్ తర్వాత వచ్చినా మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు మహేశ్. 'సర్కారువారి పాట'లో డిఫరెంట్ స్టెప్పులు, భిన్నమైన ఫైట్లు, యూత్‌కు కనెక్ట్ అయ్యే డైలాగ్స్.. అన్నింటికీ మించి ఇంకా వయసు తగ్గినట్లుగా మరింత యంగ్‌గా కనిపించడంతో ఫిదా అయ్యారు ఫ్యాన్స్. ఇక మహేశ్, కీర్తి సురేశ్‌ల స్టెప్పులకు థియేటర్లు దద్దరిల్లిపోతున్నాయి. ఈ సినిమాలో ఎక్కువగా కథ.. బ్యాంకుల్లో డబ్బులు ఎగ్గొట్టే బడా బాబుల గురించి తిరుగుతుంది. అయితే ఈ విషయంలో తాను ఎవరినీ టార్గెట్ చేయలేదని క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరశురామ్. కేవలం వార్తాపత్రికలో వచ్చిన ఓ కథనం ఆధారంగా సినిమా కథను రాసుకున్నానని చెప్పాడు. ఈ సినిమా అన్ని వర్గాల వారికి, అందరికీ కనెక్ట్ అవుతుందని పేర్కొన్నాడు. నిర్మాత నవీన్ ఎర్నేని మాట్లాడుతూ.. 'బ్లాక్‌బస్టర్ టాక్ వచ్చింది. ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభిస్తోంది. మాకు ఇంత మంచి హిట్ ఇచ్చినందుకు మహేశ్‌బాబుకు, డైరెక్టర్ పరశురామ్‌కు కృతజ్ఞతలు. ఇప్పటికే ప్రీమియర్ల ద్వారా 1 మిలియన్ డాలర్ల కలెక్షన్స్ సాధించి రికార్డు సృష్టించింది. ఆర్ఆర్ఆర్ తర్వాత అత్యధిక కలెక్షన్లు రాబట్టే చిత్రంగా సర్కారువారి పాట నిలుస్తుంది. రెండువారాల్లోనే ఈ చిత్రానికి భారీ కలెక్షన్స్ వస్తాయి' అని తెలిపాడు. మరో నిర్మాత రవిశంకర్ మాట్లాడుతూ.. 'మహేశ్‌బాబు రాజమౌళితో పాన్ ఇండియా సినిమా చేయబోతున్నాడు. మళ్లీ ఇప్పట్లో ఇలాంటి ఎనర్జిటిక్ రోల్లో మహేశ్‌ను మనం చూడలేము' అన్నాడు. చదవండి: 'సర్కారువారి పాట' పబ్లిక్ రివ్యూ, ఆడియన్స్ ఏమంటున్నారంటే? -
సితార చాలా పెద్ద హీరోయిన్ అవుతుంది : మహేశ్ బాబు
సూపర్ స్టార్ మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటించిన తాజా చిత్రం ‘సర్కారువారి పాట’.పరశురామ్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఇప్పటికే సినిమా నుంచి రిలీజైన ట్రైలర్, కళావతి సాంగ్స్ సినిమాపై మరిన్ని అంచనాలను పెంచేస్తున్నాయి. మే 12న ఈ సినిమా విడుదల కానుంది. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ జోరు పెంచింది చిత్ర బృందం. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న మహేశ్ బాబు ఈ సినిమా సహా పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పెన్నీ సాంగ్‌లో కూతురు సితార పర్ఫార్మెన్స్ గురించి అడగ్గా.. మహేశ్ మాట్లాడుతూ.. అది తమన్ ఆలోచన అని, నమ్రతతో ఈ విషయం గురించి చెప్పేలోపు తమన్ నమ్రతని అడిగాడని చెప్పారు. ఇక ఈ సినిమాలో సితార డ్యాన్స్ ఎండ్ టైటిల్స్‌లో అయినా కనిపిస్తుందా అని అడగ్గా.. 'మేకింగ్ వీడియోలో అనుకున్నాం. ఇప్పటికే ప్రింట్స్ యూఎస్‌కి వెళ్లిపోయాయి. అయినా దయచేసి ఇవన్నీ అడగకండి. ఇప్పటికే సినిమాల్లో ఎందుకు లేను అని సితర అడుగుతుంది. కానీ పర్ఫార్మన్స్ పరంగా తను నన్ను చాలా గర్వపడేలా చేసింది. నాకు తెలిసి తను భవిష్యత్తులో పెద్ద హీరోయిన్ అవుతుంది' అంటూ ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు మహేశ్. -
మహేశ్ కోసం ఆ హీరోని పక్కకు పెట్టిన పరశురాం..నెక్ట్స్ అతనితోనే మూవీ!
మాట ఇస్తే, ఆ మాటకు కట్టుబడి ఉండటం అనేది గొప్ప విషయం. బాహుబలి 2 రిలీజ్ తర్వాత రాజమౌళికి బాలీవుడ్ నుంచి చాలా ఆఫర్స్ వచ్చాయి. కాని టాలీవుడ్ లో తనకు కమిట్ మెంట్స్ ఉన్నాయని చెప్పి బాలీవుడ్ ప్రాజెక్ట్స్ ను హోల్డ్ లో పెట్టాడు. ఇప్పుడు సర్కారు వారి పాట దర్శకుడు పరశురాం కూడా సేమ్ ట్రెండ్ ఫాలో అవుతున్నాడు. నాగ చైతన్యకు ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటున్నాడు. 2018 లో రిలీజైన బ్లాక్ బస్టర్ గీత గోవిందం తర్వాత నాగ చైతన్య తో మూవీ కమిట్ అయ్యాడు డైరెక్టర్ పరశురాం. తీరా సెట్స్ పైకి వెళ్లాల్సిన సమయంలో మహేశ్ నుంచి సర్కారు వారి పాట చిత్రం చేయాల్సిందిగా కబురు రావడంతో నాలుగేళ్లుగా ఈ ప్రాజెక్ట్‌లో బిజీగా ఉన్నాడు. మే 12న సర్కారు వారి పాట రిలీజ్ అవుతోంది. (చదవండి: నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు.. మహేశ్‌బాబు ఎమోషనల్) సర్కారు వారి పాట థియేటర్స్ కు వచ్చిన తర్వాత, వెంటనే నాగ చైతన్యతో సినిమా స్టార్ట్ చేస్తానని చెబుతున్నాడు పరశురాం. నాలుగేళ్ల క్రితం నాగ చైతన్య కోసం నాగేశ్వరరావు అనే టైటిల్ తో స్టోరీ రాసుకున్నాడట. ప్రస్తుతం ఇదే స్టోరీని తెరకెక్కిస్తానంటున్నాడు. సర్కారు వారి పాట నిర్మాతలే ఈ చిత్రాన్ని కూడా నిర్మించబోతున్నారు. చైతూతో రష్మిక జోడి కట్టే అవకాశాలు ఉన్నాయి. ఇక నాగ చైతన్య సినిమా విషయాలకొస్తే.. బంగార్రాజు తర్వాత నాగ చైతన్య థ్యాంక్యూ అనే సినిమాను రిలీజ్ రెడీ చేశాడు. త్వరలోనే ఈ మూవీ రిలీజ్ డేట్ లాక్ చేయనున్నాడు నిర్మాత దిల్ రాజు. ఈలోపు చైతూ అమెజాన్ కోసం వెబ్ సిరీస్ లో నటిస్తున్నాడు. త్వరలో తమిళ దర్శకుడు వెంకట్ ప్రభుతోనూ అలాగే పరశురాం తోనూ మూవీ స్టార్ట్ చేయనున్నాడు. -
Mahesh Babu: రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. రాసి పెట్టుకోండి
‘‘సర్కారువారి పాట’లో నా పాత్రని ఎక్స్ట్రార్డినరీగా తీర్చిదిద్దిన పరశురాంగారికి థ్యాంక్స్.. నాకు ఇష్టమైన పాత్రల్లో ఇదొకటి. ఈ సినిమాని చాలా ఎంజాయ్ చేస్తూ చేశాను.. కొన్ని సన్నివేశాల్లో నటిస్తున్నప్పుడు ‘పోకిరి’ రోజులు గుర్తొచ్చాయి’’ అని మహేశ్‌బాబు అన్నారు. పరశురాం దర్శకత్వంలో మహేశ్‌బాబు, కీర్తీ సురేష్ జంటగా తెరకెక్కిన చిత్రం ‘సర్కారువారి పాట’. నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్, రామ్ ఆచంట, గోపీచంద్ ఆచంట నిర్మించిన ఈ సినిమా ఈ నెల 12న రిలీజవుతోంది. ఈ సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వ హించిన ప్రీ రిలీజ్ వేడు కలో మహేశ్‌బాబు మాట్లాడుతూ– ‘‘పరశురాంగారి కథ విని ఓకే చెప్పాను. ఆయన ఇంటికెళ్లిన తర్వాత.. ‘‘థ్యాంక్యూ సార్.. ‘ఒక్కడు’ చూసి డైరెక్టర్ అవుదామని హైదరాబాద్ వచ్చాను.. మీతో సినిమా చేసే అవకాశం ఇచ్చారు.. చూడండి ‘సర్కారు వారి పాట’ని ఎలా తీస్తానో.. ఇరగదీస్తాను’’ అని మెసేజ్ పెట్టారు. ‘థ్యాంక్యూ సార్. ఈరోజు మా నాన్నగారు (కృష్ణ), నా అభిమానులకు మీరు వన్నాఫ్ ది ఫేవరెట్ డైరెక్టర్స్. ఈ సినిమాలో చాలా హైలెట్స్ ఉంటాయి. వాటిలో హీరో హీరోయిన్ ట్రాక్ ఒకటి. ఈ ట్రాక్ కోసమే రిపీట్ ఆడియన్స్ ఉంటారు.. కచ్చితంగా.. రాసిపెట్టుకోండి. తమన్ నేపథ్య సంగీతానికి నేను పెద్ద ఫ్యాన్‌ని. ఈ సినిమాకి ఫైట్ మాస్టర్స్ రామ్–లక్ష్మణ్ బెస్ట్ వర్క్ ఇచ్చారు. ‘సర్కారువారి పాట’ సినిమా ‘పోకిరి’ని దాటుతుందని ఎడిటర్ మార్తాండ్ కె. వెంకటేశ్‌గారు అనేవారు. ‘శ్రీమంతుడు’ సినిమాని ఎంత బాగా తీశారో ఈ సినిమాని అంతకంటే బాగా తీసిన కెమెరామేన్ మదిగారికి థ్యాంక్స్. ‘శ్రీమంతుడు, దూకుడు’ లాంటి బ్లాక్బ్లస్టర్స్ ఇచ్చిన మా నిర్మాతలకు థ్యాంక్స్.. మన కాంబినేషన్లో ‘సర్కారువారి పాట’ ఇంకో మరచిపోలేని బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నాను’’ అన్నారు. నిర్మాత జి. ఆదిశేషగిరి రావు మాట్లాడుతూ– ‘‘సర్కారువారి పాట’ పాటలు విడుదల కాగానే మూవీకి గుడ్ ఫీల్ వచ్చింది. ఏ సినిమా అయినా సక్సెస్ కావాలంటే ఫస్ట్ ఫీల్ బాగుండాలి. రిలీజ్‌కి ముందే బాక్సాఫీస్ హిట్ అని ముద్ర వేసుకుంటున్న సినిమా ఇది’’ అన్నారు. నవీన్ ఎర్నేని మాట్లాడుతూ– ‘‘మైత్రీ మూవీస్‌లో మహేశ్‌గారు ‘శ్రీమంతుడు’ చేశారు. అప్పుటికి మాకు అనుభవం లేకపోయినా మమ్మల్ని నమ్మి, సినిమా చేసి బ్లాక్‌బస్టర్ ఇచ్చి మాకు ఇండస్ట్రీలోకి పాజిటివ్ ఎంట్రీ ఇచ్చారు. ఇలాంటి మంచి సినిమా మాతో చేసిన పరశురాంకి థ్యాంక్స్. మే 12న మా సినిమా పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టబోతోంది’’ అన్నారు. మనం సూపర్‌స్టార్‌ని (మహేశ్‌బాబు) ఎలా చూద్దామనుకుంటున్నామో పరశురాంగారు ఆ పాత్రని అలాగే డిజైన్ చేశారు. మే 12న మాకు డబుల్ బ్లాక్ బస్టర్’’ అన్నారు గోపీ ఆచంట. ‘‘నాకొక బ్లాక్ బస్టర్ ఇవ్వాలన్నారు మహేశ్‌గారు. ఈ సినిమాతో మీ నమ్మకాన్ని నిలబెట్టుకుంటాననే నమ్మకం ఉంది’’ అన్నారు పరశురాం. సుకుమార్ మాట్లాడుతూ– ‘‘మ మ మహేశ..’ పాట చూశా. ఈ పాట థియేటర్లో దద్దరిల్లిపోతుందని మాట ఇస్తున్నా. పరశురాం అసిస్టెంట్ డైరెక్టర్‌గా ఉన్నప్పటి నుంచి నాకు తెలుసు.. తన డైలాగ్స్ అంటే బాగా ఇష్టం. ఇప్పుడున్న బెస్ట్ మాటల రచయితల్లో తను ఒక్కడు. ‘గీత గోవిందం’ చూస్తే అంత సెన్సిటివ్‌గా చెప్పే ఆర్ట్ ఉంది. అలాంటి డైరెక్టర్ ఒక మాస్ సినిమా చేస్తే ఎలా ఉంటుందో ‘సర్కారువారి పాట’లో చూస్తారు. ‘1 నేనొక్కడినే’ అప్పుడు మహేశ్‌గారు ఎంత సపోర్ట్ ఇచ్చారో నాకు తెలుసు. ఆయనతో సినిమా చేస్తున్నప్పుడు డైరెక్టర్ సెట్లో కింగ్‌లా ఉంటాడు. డైరెక్టర్స్‌కి అంత నమ్మకాన్ని ఇస్తారు’’ అన్నారు. సంగీత దర్శకుడు తమన్ మాట్లాడుతూ– ‘‘మహేశ్‌గారికి బెస్ట్ మెలోడీ పాటలు ఇచ్చేందుకు ఎప్పుడూ ప్రయత్నించాను. ఫస్ట్ టైమ్ క్లాసికల్‌గా ‘కళావతి..’ పాట వినిపించినప్పుడు నాకు వందకు రెండొందల మార్కులు వేశారు’’ అన్నారు. మైత్రీ మూవీస్ సీఈఓ చెర్రీ, డైరెక్టర్స్ వంశీ పైడిపల్లి, మెహర్ రమేశ్, అనిల్ రావిపూడి, గోపీచంద్ మలినేని, బుచ్చిబాబు తదితరులు పాల్గొన్నారు. ఈ రెండేళ్లల్లో చాలా జరిగాయి.. చాలా మారాయి. నాకు బాగా దగ్గరైనోళ్లు దూరమయ్యారు (చెమర్చిన కళ్లతో).. కానీ ఏది జరిగినా, ఏది మారినా మీ (ఫ్యాన్స్) అభిమానం మాత్రం మారలేదు.. అలానే ఉంది. ఇది చాలు ధైర్యంగా ముందుకెళ్లి పోవడానికి. ఈ 12న మీ అందరికీ నచ్చే సినిమా (సర్కారువారి పాట) రాబోతోంది.. మళ్లీ మనందరికీ పండగే. – మహేశ్‌బాబు -
మహేశ్ బాబు 'సర్కారు వారి పాట' సరికొత్త రికార్డు..
Mahesh Babu Sarkaru Vaari Paata Premiere At 603 Locations: సూపర్ స్టార్ మహేశ్ బాబు, మహానటి కీర్తి సురేష్ జంటగా నటించిన చిత్రం 'సర్కారు వారి పాట'. ఈ చిత్రానికి పరశురామ్ దర్శకత్వం వహించారు. మరో వారం రోజుల్లో అంటే మే 12న ప్రేక్షకుల ముందుకు వచ్చి సందడి చేసేందుకు సిద్ధంగా ఉంది ఈ మూవీ. ప్రమోషన్స్‌లో భాగంగా విడుదలైన ఈ సినిమా ట్రైలర్ యూట్యూబ్‌లో దూసుకుపోతోంది. 24 గంటలు గడవక ముందే 25 మిలియన్ వ్యూస్ రాబట్టిన ఈ ట్రైలర్ 24 గంటల్లో 27 మిలియన్స్‌పైగా వీక్షణలు సొంతం చేసుకుంది. అలాగే 1.2 మిలియన్స్‌కుపైగా లైక్స్‌తో యూట్యూబ్‌లో నెంబర్ వన్ ట్రెండింగ్‌లో కొనసాగుతోంది ఈ మూవీ ప్రచార చిత్రం. ఇదిలా ఉంటే తాజాగా ఈ సినిమా యూఎస్‌లో సరికొత్త రికార్డు క్రియేట్ చేసేందుకు సిద్ధంగా ఉంది. ఎన్నడు లేని విధంగా యూఎస్‌లో 603 ప్రాంతాల్లో రిలీజ్ చేయనున్నారట. పాన్ ఇండియా మూవీస్ తప్పితే ఓ తెలుగు సినిమా ఈ స్థాయిలో ఇన్ని ప్రదేశాల్లో విడుదల కావడం ఇదే తొలిసారి. దీంతో ఈ సినిమా ఓవర్సీస్లో భారీ కలెక్షన్లు రాబట్టడం ఖాయమంటున్నాయి సినీ వర్గాలు. చదవండి: ఆ సాంగ్ చేస్తున్నప్పుడు మహేశ్‌కు సారీ చెప్పా: కీర్తి సురేష్ Super🌟 @urstrulyMahesh sets a new benchmark in TFI ❤️🔥❤️🔥#SVPTrailer is the MOST VIEWED trailer of TFI in 24 hours with 27M+ Views & 1.2M+ Likes! - https://t.co/AMjXMIUh7F@KeerthyOfficial @ParasuramPetla @MusicThaman @14ReelsPlus @GMBents @saregamasouth pic.twitter.com/DulbFZZssX — Mythri Movie Makers (@MythriOfficial) May 3, 2022 అయితే అక్కడ మే 11న 'సర్కారు వారి పాట' ప్రీమియర్స్ వేయనున్నారు. ఇప్పటికే యూఎస్ అడ్వాన్స్ బుకింగ్స్ కూడా ప్రారంభమయ్యాయని సమాచారం. ఈ నెల 7న భారీగా ప్రీరిలీజ్ ఈవెంట్ నిర్వహించేందుకు ప్లాన్ చేస్తున్నారని టాక్. ఈ వేడుకకు టాలీవుడ్ స్టార్ హీరోల్లో ఒకరు ముఖ్య అతిథిగా రానున్నారని వార్తలు వినిపిస్తున్నాయి. -
ఈ మూవీకి కీర్తి పేరును నేనే సిఫార్స్ చేశా, మహేశ్ కాదు: డైరెక్టర్
ప్రస్తుతం ‘సర్కారు వారి పాట’ టీం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. మే 12 ఈ మూవీ థియేటర్లో విడుదల కాబోతున్న నేపథ్యంలో ఈ సినిమా దర్శకుడు, హీరోయిన్ వరుసగా ఇంటర్య్వూలు ఇస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవల ఓ ఇంటర్య్వూలో పాల్గొన్న డైరెక్టర్ పరశురామ్ మూవీ విశేషాలతో పలు ఆసక్తిర విషయాలను పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘గీత గోవిందం’ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా సర్కారు వారి పాట కథ రాసుకున్నాననని చెప్పారు. చదవండి: ధనుష్‌కు మద్రాస్ హైకోర్టు షాక్.. సమన్లు జారీ ‘మహేశ్ బాబు గారి కోసమే ఈ స్క్రిప్ట్ రాశాను. ఒకవేళ ఆయన ఈ కథను రిజెక్ట్ చేస్తే స్క్రిప్ట్ పక్కన పెట్టేయాలని అనుకున్నా. కానీ మహేశ్ బాబు గారికి కథ వివరిస్తున్నంతసేపు ఆయన ఎంజాయ్ చేశారు. అప్పుడే ఆయనకు కథ నచ్చిందని అర్థమైంది’’ అంటూ చెప్పుకొచ్చారు. ఇక పూర్తి స్క్రిప్ట్ విన్నాక.. కథ చాలా బాగుందంటూ మహేశ్ తనకు షేక్ హ్యాండ్ ఇచ్చారన్నారు. ఆ వెంటనే హీరోయిన్గా ఎవరిని అనుకుంటున్నారని మహేశ్ తనని అడిగారని, అప్పుడే కీర్తి సురేశ్ పేరు చెప్పానన్నారు. చదవండి: హిందీ భాష వివాదంపై సుహాసిని స్పందన, ట్రోల్స్ చేస్తున్న నెటిజన్లు అందుకు ఆయన వెంటనే ఒకే అనేశారని చెప్పారు. అయితే కీర్తి సురేశ్‌ను చూసిన దగ్గర నుంచి ఆమెతో సినిమా చేయాలని అనుకున్నానని, అది సర్కారు వారి పాటతో కుదరిందన్నారు. అయితే ఈ సినిమాకు ఆమెను తీసుకోవడం వెనుక పాత్ర పరమైన కారణం ఉండి ఉంటుందనే ఉద్దేశంతో మహేశ్ ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. కథ ఒకసారి లాక్ చేసిన తరువాత మహేశ్ గారు ఏ విషయంలోను జోక్యం చేసుకోరని ఆయన వివరించారు. అలా కీర్తి సురేశ్ పేరును ఈ సినిమాకు తానే సిఫార్స్ చేశానని, మహేశ్ కాదని డైరెక్టర్ పరశురామ్ స్పష్టం చేశారు. -
మీడియాతో ‘సర్కారు వారి పాట’ డైరెక్టర్, ఆసక్తికర విషయాలు వెల్లడి
Director Parashuram Talks With Media: తెలుగు ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ‘సర్కారు వారి పాట’సినిమాను మే 12న విడుదల చేస్తున్నట్లు ఆ సినిమా దర్శకుడు పెట్ల పరశురామ్ వెల్లడించారు. ఆయన కుటుంబ సమేతంగా శ్రీ నూకాలమ్మ తల్లిని శుక్రవారం దర్శించుకుని పూజలు చేశారు. ఈ సందర్బంగా ప్రేక్షకులకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం చెర్లోపాలెంలోని తన స్వగృహంలో మాజీ సర్పంచ్ మాకిరెడ్డి వెంకటరమణతో కలిసి విలేకరులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘సర్కారు వారి పాట’ సినిమా షూటింగ్ పూర్తి చేసేందుకు 30 నెలల సమయం పట్టిందన్నారు. కరోనా కారణంగా ముందస్తు ప్రణాళిక కంటే.. అధిక రోజులు వెచ్చించాల్సి వచ్చిందన్నారు. చదవండి: కృతిశెట్టి నో చెప్పిన ప్రాజెక్ట్‌కు ‘మహానటి’ గ్రీన్ సిగ్నల్ విదేశాలు, మన దేశంలో వివిధ రాష్ట్రాలతో పాటు విశాఖపట్నంలో కూడా కొన్ని సన్నివేశాలు చిత్రీకరించినట్లు చెప్పారు. హీరో మహేష్‌బాబు, హీరోయిన్ కీర్తి సురేష్ అద్భుతంగా నటించారని.. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా సన్నివేశాలు, పాటలు, డైలాగ్‌లు ఉంటాయన్నారు. నర్సీపట్నంలోని శ్రీకన్య థియేటర్లో ఈ సినిమా మొదటి ఆట చూస్తానని వెల్లడించారు. ఇప్పటి వరకు ఏడు చిత్రాలకు దర్శకత్వం వహించానని.. సోలో చిత్రం పరిశ్రమలో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందన్నారు. గీత గోవిందం, ఆంజనేయులు, యువత, శ్రీరస్తు శుభమస్తు సినిమాలు సంతృప్తినిచ్చాయన్నారు. తాండవ షూటింగ్‌లకు అనుకూలం సినిమా షూటింగ్‌లకు విశాఖ జిల్లా ఎంతో అనుకూలమన్నారు. సొంత ప్రాంతంపై మమకారంతో జిల్లాలోని ఏదో ప్రాంతంలో షూటింగ్ చేస్తున్నట్లు చెప్పారు. విశాఖ ఏజెన్సీతో పాటు తాండవ రిజర్వాయర్ అందాలు తనను బాగా ఆకర్షించాయన్నారు. ఇటీవల తాండవ రిజర్వాయర్ సందర్శించానని చెప్పారు. తమ గ్రామ దేవత జిల్లేడుపూడి బుచ్చేంపేట నూకాలమ్మ తల్లిని దర్శించుకోవడానికి కుటుంబ సమేతంగా ఏటా వస్తానన్నారు. తను ఏ పని తలపెట్టినా.. అమ్మవారిని తలచుకుని ప్రారంభిస్తానని తెలిపారు. అమ్మవారి ప్రాంగణంలో సేవా కార్యక్రమాలు చేపట్టడం తన భార్యకు చాలా ఇష్టమన్నారు. ఆంధ్రా యూనివర్సిటీలో ఎంబీఏ పూర్తి చేసి సినిమాలపై ఉన్న ఆసక్తితో ప్రముఖ సినీ డైరెక్టర్ పూరి జగన్నాథ్ వద్ద అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేరానని.. తర్వాత దర్శకుడిగా మారినట్లు వివరించారు. -
ముగ్గురు హీరోలతో మహేశ్ డైరెక్టర్ సినిమా.. భారీ మల్టీ స్టారర్ !
Director Parashuram Planning Big Multistarrer With 3 Heros: దర్శకుడు పరశురామ్ ప్రస్తుతం సూపర్ స్టార్ మహేశ్ బాబుతో సర్కారు వారి పాట సినిమాను తెరకెక్కిస్తున్నారు. కీర్తి సురేశ్ హీరోయిన్గా చేస్తున్న ఈ చిత్రం షూటింగ్ చివరి దశలో ఉంది. ఏప్రిల్ 1న ఈ సినిమా భారీ స్థాయిలో విడుదల చేయనున్నట్లు ఇప్పటికే మేకర్స్ ప్రకటించారు. ఇక ఈ సినిమా తర్వాత స్టార్ హీరోలతో భారీ మల్టీ స్టారర్‌ను ప్లాన్ చేశాడట పరశురామ్. ప్రస్తుతం ఈ టాపిక్ సోషల్ మీడియాలో గింగిరాలు తిరుగుతోంది. మళ్లీ ఈ చిత్రాన్ని పాన్ ఇండియా రేంజ్లో తెరకెక్కిస్తున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఈ వార్తలు ఎంతవరకూ నిజమో వేచి చూడాలి మరి. ఇదిలా ఉంటే అక్కినేని నాగ చైతన్య హీరోగా 14 రీల్స్ సంస్థలో పరశురామ్ ఓ సినిమా చేయాల్సి ఉంది. డ్యాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ శిష్యుడిగా 'యువత' సినిమాతో వెండితెరకు డైరెక్టర్‌గా పరిచయమయ్యాడు పరశురామ్. తర్వాత ఆంజనేయులు, సోలో, సారొచ్చారు, శ్రీరస్తు శుభమస్తు వంటి చిత్రాలతో ఆకట్టుకున్నాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా గీత గోవిందం చిత్రంతో రూ. 100 కోట్ల మార్క్‌కు వెళ్లాడు. పరశురామ్ ఒక డైరెక్టర్‌గా ఎంత కష్టపడతాడో సర్కారి వారి పాట సినిమా చిత్రీకరణలో నిరూపించాడు. మండుటెండలో కూర్చుని తన స్క్రిప్ట్ వర్క్ చూసుకోవడం పలువురిని ఆకట్టుకుంది. ఇది చదవండి: ‘సర్కారి వారి పాట’ సెట్లో ఎంపీ శశిథరూర్.. -
ఫొటో వైరల్: వాటే డైరెక్టర్!
పూరీ జగన్నాథ్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన పరశురామ్ యువత చిత్రంతో దర్శకుడిగా మారాడు. చేసింది తక్కువ సినిమాలే అయినా ఎక్కువ పేరు సంపాదించుకున్నాడు. తాజాగా ఆయన సర్కారు వారి పాటకు దర్శకత్వం వహిస్తున్నాడు. మహేశ్‌బాబు, కీర్తి సురేశ్ జంటగా నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే దుబాయ్‌లో ప్రారంభమైంది. ఈ క్రమంలో సెట్స్‌లో సాంప్రదాయ దుస్తుల్లో ఉన్న కీర్తి ఫొటోలు ఆ మధ్య సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. తాజాగా సెట్స్‌లో గొడుగు నీడన నడుస్తున్న మహేశ్ ఫొటో నెట్టింట చక్కర్లు కొడుతోంది. (చదవండి: జనగణమన: మహేశ్ నుంచి పవన్‌కు!) కానీ ఈ ఫొటోను చూసిన వెంటనే అందరూ మహేశ్‌కు బదులు డైరెక్టర్ గురించే మాట్లాడుకుంటున్నారు. మండుటెండను లెక్క చేయకుండా, తన హోదాను పక్కనపెట్టి మరీ ఏదో స్క్రిప్ట్ చూసుకుంటూ నేలమీద కూర్చుండిపోయాడు పరశురామ్. నిజానికైతే అక్కడున్న బాయ్స్‌ను పిలిచి కుర్చీ తెమ్మని పిలవచ్చు, తనకో గొడుగు పట్టమని అడగనూవచ్చు. కానీ ఆయన అలా చేయలేదు. పనిలో మమేకమై అలాంటివేవీ పట్టించుకోకుండా ఎర్రటి ఎండలోనే మట్టి మీద కూర్చుండిపోయాడు. ఇక ఆయన సింప్లిసిటీ చూసిన జనాలు పరశురామ్‌ను మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు. ఎంత శ్రద్ధ!, ఎంత నిబద్ధత! అని కొనియాడుతున్నారు. (చదవండి: సంక్రాంతికి వస్తున్న 'సర్కారు వారి పాట') -
భూమిపూజ : రాష్ట్రపతి కోవింద్‌ను ఆహ్వానించాల్సింది
లక్నో : అయోధ్యలో రామమందిర నిర్మాణానికి జరిగిన భూమిపూజ కార్యక్రమానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో పాటు దళిత వర్గానికి చెందిన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ పిలిచి ఉండాల్సిందని బీఎస్పీ అధినేత్రి, యూపీ మాజీ ముఖ్యమంత్రి మాయావతి అన్నారు. ఆగస్ట్ 5న జరిగిన మందిర శంకుస్ధాపనకు రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌నూ ఆహ్వానించాల్సిందని, ఆయన హాజరు మంచి సందేశం పంపిఉండేదని వ్యాఖ్యానించారు. ఈ కార్యక్రమంలో పాలుపంచుకునేందుకు దళిత సాధువులు ఆసక్తి కనబరిచినా వారిని పూర్తిగా విస్మరించారని మాయావతి ఆరోపించారు. మరోవైపు లక్నోలో 108 అడుగుల ఎత్తైన పరుశురాముని విగ్రహ ఏర్పాటుకు సమాజ్‌వాదీ పార్టీ (ఎస్పీ) ప్రతిపాదనను ఆమె దుయ్యబట్టారు. బ్రాహ్మణ ఓటర్లను ఆకట్టుకునేందుకే ఎస్పీ ఈ ఎత్తుగడ వేస్తోందని ఆరోపించారు. బీఎస్పీ హయాంలో వివిధ కులాలకు చెందిన ప్రముఖ సాధుసంతుల పేర్లతో పలు పథకాలు చేపట్టామని, ఎస్పీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కుల దృక్పథంతో వాటి పేర్లను మార్చారని విమర్శించారు. పరుశురాముడి విగ్రహం గురించి ఎస్పీ ఇప్పుడు మాట్లాడటం కంటే అధికారంలో ఉన్నప్పుడే ఆ విగ్రహాన్ని నిర్మించాల్సిందని చురకలు వేశారు. ఎస్పీ ప్రతిపాదిత విగ్రహం కంటే అధికంగా పరుశురాముడి భారీ విగ్రహాన్ని అయోధ్యలో నిర్మిస్తామని మాయావతి పేర్కొన్నారు. 2022లో జరిగే యూపీ అసెంబ్లీ ఎన్నికల్లో 11 శాతం ఉన్న బ్రాహ్మణుల ఓట్లు కీలకం కావడంతో వారిని ఆకట్టుకునేందుకు విపక్షాలు ప్రయత్నిస్తున్నాయి. చదవండి : అమెరికాలో 'అయోధ్య' సంబరాలు -
మేలో ముహూర్తం?
ఈ ఏడాది సంక్రాంతికి ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రంతో మంచి విజయాన్ని అందుకున్నారు మహేశ్‌బాబు. ప్రస్తుతం క్వారంటైన్ సమయాన్ని కుటుంబంతో సరదాగా గడుపుతున్నారు. మహేశ్ తర్వాతి చిత్రానికి ‘గీత గోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వం వహించబోతున్నారనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. తాజా సమాచారం ఏంటంటే... ఈ సినిమా ప్రారంభోత్సవం మహేశ్ తండ్రి సూపర్‌స్టార్ కృష్ణ పుట్టిన రోజు సందర్భంగా మే 31న జరగనుందట. మహేశ్ నటించిన గత చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్ర ప్రారంభోత్సవం కూడా కృష్ణ బర్త్ డే (2019 మే 31) సందర్భంగానే జరిగిన విషయం గుర్తుండే ఉంటుంది. -
ఐదేళ్ల తర్వాత...!
‘సన్నాఫ్ సత్యమూర్తి’ (2015) చిత్రం తర్వాత స్ట్రయిట్ తెలుగు చిత్రంలో క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటించలేదు ఉపేంద్ర. ఇప్పుడు ఐదేళ్ల తర్వాత ఉపేంద్ర ఓ తెలుగు సినిమాలో నటించనున్నారని సమాచారం. మహేశ్‌బాబు హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనుందనే ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలోని ఓ కీలక పాత్రకు ఉపేంద్రను సంప్రదించారట చిత్రబృందం. మరి... పరుశురామ్ కథకు ఉపేంద్ర ఊ అంటారా? వెయిట్ అండ్ సీ. -
జోడీ కుదిరిందా?
నాగచైతన్య హీరోగా ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. 14 రీల్స్ ప్లస్ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాకు ‘నాగేశ్వరరావు’ అనే టైటిల్ అనుకుంటున్నారని, ఆ టైటిల్ రోల్‌నే నాగచైతన్య చేస్తారని వార్తలు వస్తున్నాయి. తాజాగా ఈ సినిమాలో కథానాయికగా రష్మికా మందన్నా నటించబోతున్నారనే వార్త షికారు చేస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో వచ్చిన ‘గీతగోవిందం’ చిత్రంలో గీతగా రష్మిక నటించిన సంగతి గుర్తుండే ఉంటుంది. ‘గీతగోవిందం’ చిత్రం రష్మికా కెరీర్‌కు మంచి మైలేజ్‌ని ఇచ్చింది. మరి.. స్క్రీన్‌పై నాగచైతన్యతో రష్మికా జోడీగా కనిపిస్తుందా? వెయిట్ అండ్ సీ. -
హిట్ డైరెక్టర్‌తో అఖిల్ నెక్ట్స్..!
అక్కినేని నటవారసుడిగా భారీ అంచనాల మధ్య వెండితెరకు పరిచయం అయిన నటుడు అక్కినేని అఖిల్. తొలి సినిమాతో నిరాశపరిచిన అఖిల్ తరువాత లవర్ బాయ్ ఇమేజ్ కోసం ప్రయత్నించినా ఆశించిన స్థాయిలో సక్సెస్ కాలేకపోయాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో బొమ్మరిల్లు భాస్కర్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే ప్రాజెక్ట్‌ను కూడా అఖిల్ ఓకె చేసినట్టుగా తెలుస్తోంది. పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడట అఖిల్. గీత గోవిందం సినిమాతో సూపర్‌హిట్ అందుకున్న పరశురామ్ తరువాత మహేష్ బాబుతో సినిమా చేసేందుకు చాలా ప్రయత్నించాడు. దాదాపుగా ఓకే అను ప్రాజెక్ట్ ఆగిపోవటంతో ప్రస్తుతం అఖిల్ సినిమా మీద దృష్టి పెట్టినట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే. -
మెగా బ్యానర్లో అక్కినేని హీరో
అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు అఖిల్, తన మీద ఉన్న అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు. తొలి సినిమాతో ఇప్పటికి మూడు సినిమాలు చేసిన అఖిల్ వరుసగా తడబడుతున్నాడు. మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ఫెయిల్ అయిన ఈ యంగ్ హీరో తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు. అయితే అఖిల్ నాలుగో సినిమా మెగా బ్యానర్లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. అక్కినేని హీరోకు సక్సెస్ ఇచ్చే బాధ్యతను అల్లు అరవింద్ తీసుకున్నట్టుగా తెలుస్తొంది. ఇప్పటికే గీత గోవిందం ఫేం పరశురాం, బొమ్మరిల్లు భాస్కర్లు అఖిల్ కోసం కథలు రెడీ చేస్తున్నారట. వీరిలో ఎవరి కథకు అఖిల్ ఓకె చెప్తే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది. -
ఆ స్టార్ హీరో అల్లు అర్జునేనా..!
నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా సినిమా ఫ్లాప్ కావటంతో స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ తదుపరి చిత్రం విషయంలో జాగ్రత్తగా అడుగులు వేస్తున్నాడు. విక్రమ్ కె కుమార్‌తో సినిమా ఉంటుందన్న ప్రచారం జరిగినా అది సెట్ కాలేదు తరువాత త్రివిక్రమ్ శ్రీనివాస్ పేరు వినిపించినా ఆ ప్రాజెక్ట్ కూడా కన్ఫమ్ కాలేదు. దీంతో బన్నీ నెక్ట్స్ ప్రాజెక్ట్ ఎనౌన్స్మెంట్ కోసం అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. తాజా సమాచారం ప్రకారం బన్నీ నెక్ట్స్ సినిమా యంగ్ డైరెక్టర్ పరుశురాం దర్శకత్వంలో అన్న టాక్ వినిపిస్తోంది. ఈ రోజు (మంగళవారం) తన పుట్టిన రోజు సందర్భంగా మీడియాతో మాట్లాడిన పరుశురాం.. తన నెక్ట్స్ ప్రాజెక్ట్ కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే ఉంటుందని ఆ సినిమాలో ఓ స్టార్ హీరో నటించనున్నారని హింట్ ఇచ్చారు. దీంతో పరుశురాం చెప్పిన ఆ స్టార్ హీరో అల్లు అర్జునే అంటున్నారు ఫ్యాన్స్. మరి ఈ వార్తల్లో నిజమెంతో తెలియాలంటే అఫీషియల్ ఎనౌన్స్మెంట్ వరకు వెయిట్ చేయాల్సిందే. -
సూపర్ హిట్ డైరెక్టర్‌తో మెగా హీరో
మెగా వారసుడిగా టాలీవుడ్‌కు పరిచయం అయిన యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. కెరీర్ స్టార్టింగ్‌లో పరవాలేదనిపించిన సాయి ధరమ్ తరువాత గాడి తప్పాడు. వరుస ఫ్లాప్‌లతో కష్టాల్లో పడ్డాడు. ప్రస్తుతం ఈ యంగ్ హీరో చిత్రలహరి సినిమా పనుల్లో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా తరువాత చేయబోయే సినిమాను కూడా సాయి ధరమ్ ఇప్పటికే ఫైనల్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. తాజాగా గీతా ఆర్ట్స్ 2 బ్యానర్ లో సూపర్ హిట్ కొట్టిన దర్శకుడితో సాయి ధరమ్ తేజ్ సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు. బన్నీ వాసు నిర్మాతగా విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన బ్లాక్ బస్టర్ హిట్ సినిమా గీత గోవిందం. ఈ చిత్ర దర్శకుడు పరుశురాం అదే బ్యానర్లో మరో సినిమా చేసేందుకు అంగీకరించాడు. ఆ సినిమాలో సాయి ధరమ్ తేజ్ హీరోగా నటించనున్నాడట. ఇప్పటికే కథ కూడా ఫైనల్ చేశారన్న టాక్ వినిపిస్తోంది. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వెలువడే అవకావం ఉంది. -
‘గీత గోవిందం’ దర్శకుడి నెక్ట్స్ ప్రాజెక్ట్!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సూపర్ హిట్ సినిమా గీత గోవిందం. చిన్న సినిమాగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా వందకోట్లకు పైగా గ్రాస్ సాధించి సత్తా చాటింది. ఓవర్ సీస్లో రెండు మిలియన్లు వసూళ్లు సాధించిన ఈ సినిమా.. దర్శకుడు పరశురామ్‌కు స్టార్ ఇమేజ్ను తెచ్చిపెట్టింది. గీత గోవిందం భారీ సక్సెస్ సాధించటంతో పరుశురామ్ తెరకెక్కించబోయే తదుపరి సినిమాపై ఆసక్తి నెలకొంది. తాజాగా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చాడు దర్శకుడు పరుశురామ్. గీత గోవిందం చిత్రాన్ని నిర్మించిన గీతా ఆర్ట్స్ 2 బ్యానర్లోనే తన తదుపరి చిత్రం ఉంటుందని క్లారిటీ ఇచ్చారు. ఇప్పటికే నిర్మాత బన్నీవాసుకు నాలుగైదు లైన్లు వినిపించినట్టుగా చెప్పిన పరుశురామ్ దేవుడికి మనిషి మధ్య జరిగే ఓ కథను బన్నీవాసు ఫైనల్ చేసినట్టుగా తెలిపారు. పూర్తి స్క్రిప్ట్ రెడీ అయిన తరువాత అల్లు అరవింద్‌కు వినిపిస్తానని తెలిపారు. -
‘గీత గోవిందం’ సక్సెస్ సెలబ్రేషన్స్
-
‘గీత గోవిందం’ తరువాత అదే బ్యానర్లో..!
విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన సినిమా గీత గోవిందం. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు సూపర్ హిట్ టాక్ రావటంతో చిత్రయూనిట్ సంబరాలు చేసుకుంటున్నారు. గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీ వాసు నిర్మించిన సినిమాకు పరశురామ్ దర్శకుడు. గతంలో ఇదే బ్యానర్లో శ్రీరస్తు శుభమస్తు లాంటి డీసెంట్ హిట్ ఇచ్చిన పరశురామ్ తన తదుపరి చిత్రాన్ని కూడా గీతా ఆర్ట్స్ బ్యానర్లోనే చేయనున్నారట. మరోసారి మెగా హీరోతో సినిమా చేసేందుకు రెడీ అవుతున్నాడు పరశురామ్. ఇప్పటికే వరుణ్ తేజ్ హీరోగా పరశురామ్ దర్శకత్వంలో ఓ సినిమాను నిర్మించేందుకు గీతా ఆర్ట్స్ రెడీ అవుతున్నట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే వరుణ్ కోసం పరశురామ్ కథ రెడీ చేసే పనిలో ఉన్నాడట. త్వరలోనే ఈ ప్రాజెక్ట్‌పై అధికారిక ప్రకటన వచ్చే అవకాశం ఉంది. -
విశాఖలో ‘గీత గోవిందం’ ప్రీ రిలీజ్ వేడుక
-
‘గీత గోవిందం’ మూవీ స్టిల్స్
-
‘వాట్ ద ఎఫ్’ అంటున్న విజయ్
అర్జున్ రెడ్డి సినిమాలో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ త్వరలో గీత గోవిందం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. ప్రస్తుతం నిర్మాణాంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు పరుశురాం దర్శకుడు. ఇప్పటికే ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ రేపు (గురువారం) ఓ పాటను రిలీజ్ చేయనున్నారు. వాట్ ద ఎఫ్ అంటూ సాగే ఈ పాటను హీరో విజయ్ దేవరకొండ ఆలపించటం విశేషం. సాంగ్ బై వన్ ఫ్రస్ట్రేటెడ్ సింగర్ అంటూ ప్రమోట్ చేస్తున్న ఈ పాటను గురువారం ఉదయం 11 గంటల 55 నిమిషాలకు రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. విజయ్ తొలిసారిగా పాడుతున్న ఈ పాటకు గోపి సుందర్ సంగీతమందించారు. విజయ్ దేవరకొండ సరసన ఛలో ఫేం రష్మిక హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాను గీతా ఆర్ట్స్ 2 బ్యానర్‌పై బన్నీవాసు నిర్మిస్తున్నారు. -
హీరోయిన్ చెంపదెబ్బ.. హీరో కల చెదిరింది
అర్జున్ రెడ్డి తర్వాత ఓవర్‌నైట్ స్టార్ అయిన నటుడు విజయ్ దేవర్ కొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ఈ సినిమా నుంచి విడుదలైన తొలి పాట ‘ఇంకేం.. ఇంకేం.. ఇంకేం.. కావాలే..’తోనే గీత గోవిందంపై అంచనాలు రెట్టింపయ్యాయి. టైటిల్‌తోనే ఆకట్టుకున్న ఈ మూవీ ప్రస్తుతం మోస్ట్ వాంటెండ్ సినిమాగా మారింది. ప్రమోషన్లో భాగంగా టీజర్‌ను చిత్ర యూనిట్ సోమవారం విడుదల చేసింది. ‘ఎన్నెన్నో జన్మల బంధం నీదీ నాదీ’ అంటూ హీరో బ్లాక్ అండ్ వైట్ కలలు కనడం, హీరోయిన్ చెంపదెబ్బతో ఈ లోకంలోకి రావడం.. ఇంకొక్కసారి అమ్మాయిలు.. ఆంటీలు.. ఫిగర్లు అంటూ తిరిగావంటే యాసిడ్ పోసేస్తా.. అంటూ హీరోయిన్ వార్నింగ్ ఇవ్వడం... మొత్తంగా చూస్తే.. ఓ రొమాంటిక్ కామెడీ సినిమాగా గీత గోవిందం రాబోతుందనే ఫీలింగ్ కనిపిస్తోంది. ఇక మారవా అంటూ హీరోయిన్ డైలాగ్.. లేదు మేడం, ఐ యామ్ కంప్లీట్లీ డిసెంట్ నౌ అనడంతో నిజంగానే విజయ్ దేవర్కొండ డిసెంట్‌గా మారిపోయాడు. తొలి పాట, టీజర్‌తోనే అభిమానుల గుండెల్లో సరికొత్త ఫీల్‌ను కల్పిస్తున్న గీత గోవిందం, థియేటర్లలో మరెంత ఆకట్టుబోతోందనని అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. పరశురాం దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రష్మికా మండన్నా హీరోయిన్గా నటిస్తున్నారు. -
గీత గోవిందం : తొలి పాటతో సిద్ధం
అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా గుర్తింపు తెచ్చుకున్న హీరో విజయ్ దేవరకొండ. ఈ యువ కథానాయకుడు హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం గీత గోవిందం. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సినిమాకు సంబంధించిన ప్రమోషన్ కార్యక్రమాలను చిత్రయూనిట్ ఇటీవల ప్రారంభించారు. విజయ్ తనదైన స్టైల్లో ట్వీటర్ వేదికగా ఆసక్తికర కామెంట్స్‌తో సినిమా మీద హైప్ క్రియేట్ చేస్తున్నాడు విజయ్. ఇప్పటికే ఫస్ట్‌లుక్, పోస్టర్లతో ఆకట్టుకున్న చిత్రయూనిట్ జూలై 10న తొలి పాటను రిలీజ్ చేస్తున్నట్టుగా ప్రకటించారు. గోపి సుందరం సంగీత సారధ్యంలో ‘ఇంకేం ఇంకేం ఇంకేం కావాలే’ అంటూ సాగే ఈ పాటను మంగళవారం ఉదయం 11 గంటల 50 నిమిషాలకు రిలీజ్ చేయనున్నారు. పరుశురామ్ దర్శకత్వంలో బన్నీవాసు నిర్మిస్తున్న ఈ సినిమాలో ఛలోఫేం రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. -
‘మీ బరువు, బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్’
‘నా కాళ్లు తిమ్మిరెక్కినా.. నడుము నొప్పి లేచినా.. మీ బరువు బాధ్యత ఎప్పుడూ నాదే మేడమ్..’ అంటున్నాడు యంగ్ హీరో విజయ్ దేవరకొండ. ఈ మాటలు విజయ్ ఎందుకు అన్నాడో..? ఈరోజు విడుదలైన గీత గోవిందం ఫస్ట్ లుక్ చూస్తే అర్థమవుతుంది. విజయ్ గోడకు కాళ్లు పెట్టుకుని కూర్చుంటే, కాళ్ల పై రష్మిక ఎంచక్కా కూర్చొని నవ్వుతూ ఉంది. దీని గురించే విజయ్ మాట్లాడుతూ పై విధంగా కామెంట్ చేశాడు. గీతా ఆర్ట్స్ నిర్మిస్తున్న ఈ మూవీలో గీత పాత్రలో ఛలో ఫేం రష్మిక మందన నటించగా, గోవిందం పాత్రలో విజయ్ దేవరకొండ నటిస్తున్నాడు. సోలో ఫేం పరుశురామ్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా గోపి సుందర్ సంగీతాన్ని అందిస్తున్నారు. ఇప్పటికే గీతా ఆర్ట్స్‌లో విజయ్ ‘టాక్సీవాలా’ సినిమాను చేస్తున్నాడు. గ్రాఫిక్స్ పనుల కారణంగా ఈ సినిమా విడుదల విషయంలో జాప్యం జరుగుతోంది. త్వరలోనే ‘టాక్సీవాలా’గా విజయ్ ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాడు. Naa kaallu thimmiri ekkina, Nadumu noppi lechina, Mee baruvu badhyata eppudu naade madam :) #GeethaGovindam pic.twitter.com/mMnlEB9ver — Vijay Deverakonda (@TheDeverakonda) 23 June 2018 -
అతిథి పాత్రలో అను
ఇటీవల హీరోయిన్ అను ఇమ్మాన్యూల్ పేరు వార్తల్లో ప్రముఖంగా వినిపిస్తోంది. కెరీర్ స్టార్ట్ చేసిన కొద్ది రోజుల్లోనే అల్లు అర్జున్ లాంటి స్టార్ హీరో సరసన నటించే ఛాన్స్ కొట్టేసిన ఈ బ్యూటీ ఇప్పుడు వరుసగా అవకాశాలను చేజార్చుకుంటున్నారు. ప్రస్తుతం నాగచైతన్య హీరోగా తెరకెక్కుతున్న శైలజారెడ్డి అల్లుడు సినిమాలో నటిస్తున్న ఈ బ్యూటీ రవితేజ సరసన నటించే ఛాన్స్ వచ్చినా వదులుకుంది. తాజాగా ఈ బ్యూటీ ఓ యంగ్ హీరో సినిమాలో అతిథి పాత్రలో నటించేందుకు అంగీకరించినట్టుగా తెలుస్తోంది. అర్జున్ రెడ్డి సినిమాతో సెన్సేషనల్ స్టార్‌గా పేరు తెచ్చుకున్న విజయ్ దేవరకొండ త్వరలో టాక్సీవాలా ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఈ సినిమా తరువాత పరుశురామ్ దర్శకత్వంలో గీతా ఆర్ట్స్ బ్యానర్లో ఓ సినిమా చేస్తున్నాడు. ఈ మూవీలో అను ఇమ్మాన్యూల్ గెస్ట్ అపియరెన్స్ ఇవ్వనుంది. -
వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శిగా రాగె పరశురాం
సాక్షి, హైదరాబాద్: అనంతపురం మాజీ మేయర్ రాగె పరశురాం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులయ్యారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకం జరిగినట్లు కేంద్ర కార్యాలయం సోమవారం ఓ ప్రకటన విడుదల చేసింది. -
వివాహితపై లైంగిక వేధింపులు
బుక్కపట్నం: మండలంలోని పాముదుర్తి వెంకటాపురంలో ఓ వివాహితపై అదే గ్రామానికి చెందిన పరశురాం లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు స్థానిక పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదయింది. వివరాలు. పొలం పనులకు వెళ్లినప్పుడు పరుశురాం అక్కడికి వచ్చి తన భార్యపై లైంగికంగా వేధింపులకు పాల్పడుతున్నాడని బాధిత మహిళ భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఆయనపై కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలన్నాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
టీఐఎస్ఎస్లో ఏపీ విద్యార్థులకు సీట్లు
సాక్షి, అమరావతి: సామాజిక, ఆర్థిక, మానవాభివృద్ధి రంగాల్లో పరిశోధనలు చేస్తున్న టాటా ఇనిస్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్ (టిస్)లో రాష్ట్రానికి 6 సీట్లు లభించనున్నాయి. ఏపీ ప్రభుత్వం స్పాన్సర్ చేసే ఈ బీఏ కోర్సు సీట్లకు విధివిధానాలు ఖరారు చేసి ఈ ఏడాది నుంచే కేటాయించనున్నారు. ప్రస్తుతం 60 సీట్లతో నడుస్తున్న హైదరాబాద్ క్యాంపస్‌లో మరో 6 సూపర్ న్యూమెరరీ సీట్లను ఏపీకి కేటాయించనున్నారు. ఈమేరకు టిస్ ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకొన్నారు. మంత్రి గంటా శ్రీనివాసరావు సమక్షంలో టిస్ డైరెక్టర్ ఎస్.పరశురామ్.. ఏపీ సాంకేతిక, కళాశాల విద్యా కమిషనర్ పండా దాస్ గురువారం ఎంవోయూపై సంతకాలు చేశారు. ఈ ఏడాది నుంచే ప్రవేశాలుంటాయని టిస్ అధికారులు తెలిపారు. -
కూడేరు ఏఎస్ఐ హఠాన్మరణం
అనంతపురం సెంట్రల్: కూడేరు ఏఎస్ఐ పరుశురాం(58) ఆదివారం గుండెపోటుతో మృతి చెందారు. వివరాలిలా ఉన్నాయి. ఉదయం ఇంట్లో ఉన్న ఆయనకు ఛాతీనొప్పి రావడంతో కుటుంబసభ్యులు ఓ ప్రైవేటు ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడికెళ్లిన కొద్దిసేపటికే ఆయన మృతి చెందారు. మృతదేహాన్ని ఉమానగర్‌లోని నివాసానికి తీసికెళ్లారు. ఈయనకు భార్య మల్లీశ్వరితో పాటు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. విషయం తెలుసుకున్న ఎస్పీ రాజశేఖరబాబు ఏఎస్ఐ మృతికి సంతాపం తెలిపారు. కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి వ్యక్తం చేశారు. ఏఎస్ఐ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. పరుశురాం పార్థివదేహానికి ఆత్మకూరు సీఐ శివనారాయణస్వామి, ఎస్ఐలు రాజు, ధర ణికిశోర్, శ్రీనివాసులు, పోలీసుల అధికారుల సంఘం అధ్యక్షులు త్రిలోక్‌నాథ్, కార్యదర్శి గోరంట్ల మాధవ్, సభ్యులు రాజశేఖర్, సూర్యనారాయణ, హరినాథ్ తదితరులు నివాళులు అర్పించారు. అనంతరం జేఎన్‌టియూ సమీపంలోని శ్మశానవాటికలో పోలీసు లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. -
టోల్గేట్పైకి దూసుకెళ్లిన బస్సు: ఒకరికి గాయాలు
మెదక్ : మెదక్ జిల్లా కొండపాక మండలం దుద్దెడ టోల్గేట్ వద్ద బుధవారం ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు అదుపు తప్పి టోల్గేట్ సిబ్బందిపైకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో పరశురామ్ అనే వ్యక్తికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి... క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం సిద్ధిపేట ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శిరీష్ డైరెక్టర్‌తో శర్వానంద్
గౌరవం, కొత్త జంట సినిమాలతో ఆకట్టుకోలేకపోయిన అల్లు వారబ్బాయి శిరీష్, తొలిసారిగా శ్రీరస్తు శుభమస్తు సినిమాతో సక్సెస్ అందుకున్నాడు. చాలా రోజులుగా మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న శిరీష్‌కు సక్సెస్ అందించిన దర్శకుడు పరశురాంతో సినిమాలు చేసేందుకు యంగ్ హీరోలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. తమ బ్యానర్‌కు మంచి హిట్ అందించిన పరశురాంతో మరో సినిమా నిర్మించేందుకు గీతా ఆర్ట్స్ సంస్థ ప్లాన్ చేస్తోంది. ఈ సినిమాను శర్వానంద్ హీరోగా తెరకెక్కించాలని భావిస్తున్నారట. ఇప్పటికే శర్వానంద్‌కు కథ వినిపించిన పరశురాం.. రెస్పాన్స్ కోసం ఎదురుచూస్తున్నాడు . అయితే శర్వా మాత్రం ప్రస్తుతం చేస్తున్న సినిమాతో పాటు దిల్ రాజు నిర్మాణంలో తెరకెక్కుతున్న శతమానంభవతి సినిమాలు పూర్తయిన తరువాతే నెక్ట్స్ ప్రాజెక్ట్‌పై క్లారిటీ ఇచ్చే అవకాశం ఉంది. దీంతో శర్వా, పరశురాంల సినిమా క్లారిటీ రావాలంటే మరికొంత కాలం వెయిట్ చేయాల్సిందే. -
విజయం.. గౌరవం... రెండూ దక్కాయి
అల్లు శిరీష్, లావణ్యా త్రిపాఠి జంటగా నటించిన సినిమా ‘శ్రీరస్తు శుభమస్తు’. గీతా ఆర్ట్స్ పతాకంపై అల్లు అరవింద్ నిర్మించారు. యువతరం అభిరుచులకు తగ్గట్టు కుటుంబ కథా చిత్రాలు తెరకెక్కించడంలో సిద్ధహస్తుడైన పరశురామ్ (బుజ్జి) ఈ సినిమాకి దర్శకత్వం వహించారు. గత శుక్రవారం విడుదలైన ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటూ విజయవంతంగా ప్రదర్శితమవుతోందని చిత్రబృందం తెలిపారు. ఈ సందర్భంగా ‘సాక్షి’తో పరశురామ్ ప్రత్యేకంగా ముచ్చటించారు. ‘శ్రీరస్తు శుభమస్తు’కి లభిస్తున్న స్పందనపై మీ అనుభూతి? ఓ మంచి కథ చెప్పారంటూ ప్రతి ఒక్కరూ అభినందిస్తున్నారు. అన్ని ఏరియాల నుంచి చక్కటి ప్రేక్షకాదరణ లభిస్తోంది. విజయంతో పాటు దర్శకుడిగా నాకు గౌరవం తీసుకొచ్చిన చిత్రమిది. మా కష్టానికి తగ్గ ప్రతిఫలం రావడంతో ఆనందంగా ఉంది. ఇలాంటి కథలు ప్రేక్షకులకు చేరువైనప్పుడు ఎనర్జీ వస్తుంది. లేదంటే ఇంత కష్టపడ్డా ఫలితం రాలేదని మూస కథలు వైపు వెళ్లాలనిపిస్తుంది. కానీ, ప్రేక్షకులు తమకు మంచి అభిరుచి ఉందని నిరూపించారు. ఓ దర్శకుడిగా ఇంతకంటే ఆనందం ఏముంటుంది? చెప్పండి. అల్లు శిరీష్ కోసమే ఈ కథ రాశారా? అవునండి. సిరి (అల్లు శిరీష్)తో ముందు మరో సినిమా తీయాలనుకున్నాను. ‘హిట్ సినిమా కాదు, నా కెరీర్లో గుర్తుండే ఓ మంచి సినిమా కావాలి’ అని సిరి అడిగాడు. తిరుపతిలో దేవుణ్ణి దగ్గర్నుంచి చూసే సన్నివేశం స్ఫూర్తితో అప్పుడీ కథ రాశా. నా కథను నమ్మి అల్లు అరవింద్, సిరిలు ఎంతో ప్రోత్సహించారు. ఓ టీచర్లా పరశురామ్ నాకు చాలా విషయాలు నేర్పారని అల్లు శిరీష్ అన్నారు.. శిరీష్ సంస్కారం అది. కథ రాసి, సినిమా తీయడానికి నేను పడిన కష్టం కంటే నటుడిగా అతను పడ్డ కష్టమే ఎక్కువ. పాత్రకు అనుగుణంగా తనను తాను మలచుకున్నాడు. ‘మీకెలా కావాలో చెప్పండి, నటిస్తా’ అన్నాడు. నేనెంత చెప్పినా తెరపై చేసింది అతనే కదా. క్లైమాక్స్ సీన్స్ తీసే టైమ్‌కి మా ఇద్దరికీ బాగా సింక్ అయ్యింది. చాలా సహజంగా నటించాడు. లావణ్యా త్రిపాఠి, ప్రకాశ్‌రాజ్, రావు రమేశ్.. ప్రతి ఒక్కరూ బాగా చేశారు. దర్శకుడిగా కంటే మాటల రచయితగానే ఈ చిత్రం మీకు ఎక్కువ పేరు తెచ్చినట్లుంది? కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, డెరైక్షన్ అంటూ విడదీసి చూడడం నాకు తెలియదు. కథతో పాటు సహజంగా ఉండేలా మాటలు రాస్తాను. ప్రత్యేక శ్రద్ధ ఏమీ తీసుకోను. గతంలో రైటర్ కమ్ డెరైక్టర్స్ పూరి జగన్నాథ్, ‘బొమ్మరిల్లు’ భాస్కర్ వద్ద పనిచేయడంతో ఆ పద్దతి అలవాటయింది. ‘బొమ్మరిల్లు’తో మీ సినిమాను పోల్చడం గురించి? నేపథ్యం ఒక్కటే కావొచ్చు కానీ, భావోద్వేగాల్ని వ్యక్తం చేసిన విధానం వేరు. ఈ చిత్రాన్ని ‘బొమ్మరిల్లు’తో చిరంజీవిగారు పోల్చినప్పుడు చాలా సంతోషమేసింది. నాపై పూరి, భాస్కర్ల ప్రభావం ఉంది. గురువుగారి హిట్ సినిమాతో పోలిస్తే గర్వంగానే ఉంటుంది కదా. తదుపరి సినిమా? లవ్ ఎంటర్టైనర్ చేస్తా. గీతా ఆర్ట్స్ సంస్థలోనే ఉంటుంది. నేను రాసుకున్న కథలన్నీ అల్లు అరవింద్‌గారు, బన్నీ వాసులకు తెలుసు. హీరో ఎవరనేది అల్లు అరవింద్‌గారే చెప్పాలి. -
మెగా హీరో తిక్క చూపిస్తున్నాడు
రేయ్ సినిమా నుంచి సుప్రీమ్ వరకు తన ఇమేజ్ను మార్కెట్ రేంజ్‌ను అంచలంచెలుగా పెంచుకుంటూ వస్తున్న యంగ్ హీరో సాయి ధరమ్ తేజ్. మెగా హీరోగా ఎంట్రీ ఇచ్చినా, తన మార్క్ సినిమాలతో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంటున్నాడు ఈ యంగ్ హీరో. ప్రస్తుతం పరశురామ్ దర్శకత్వంలో తిక్క సినిమాలో నటిస్తున్నాడు సాయి. ఈ సినిమాలో ఫుల్ మాస్ అవతార్‌లో కనిపిస్తున్న సాయి ఫస్ట్ లుక్ రిలీజ్ అయ్యింది. కలర్ ఫుల్‌గా కనిపిస్తున్న ఈ పోస్టర్లో గుర్రమీద కూర్చున్న సాయి, ఒక చేత్తో బేబి ట్రంపెట్‌ను వాయిస్తూ మరో చేత్తో బీర్ బాటిల్‌ను పట్టుకున్నాడు. టైటిల్‌కు తగ్గట్టుగానే పోస్టర్లో హీరో క్యారెక్టరైజేషన్ ఎలా ఉండబోతుందో హింట్ ఇచ్చేశారు చిత్రయూనిట్. థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాకు రోహిణ్ కుమార్ రెడ్డి నిర్మాత. -
పిడుగుపాటుతో యువకుడి మృతి
ఆత్మకూరు రూరల్ (కర్నూలు): పిడుగుపాటుకు గురై గిరిజన యువకుడు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పాలెం చెరువు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు.. మండలంలోని శివపురం చెంచుగూడానికి చెందిన పరుశురాం (18) పాలెం చెరువులో ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చాడు. ఈ క్రమంలో గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వద్ద ఇద్దరు స్నేహితులతో కలిసి కూర్చొని ఉన్న సమయంలో.. ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో బ్రిడ్జి పక్కన ఉన్న పరుశురాం తలపై పిడుగు పడటంతో.. అక్కడికక్కడే మృతిచెందగా.. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.