‘గీత గోవిందం’లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత విజయ్ దేవరకొండ, పరశురామ్ కాంబోలో మరో చిత్రం తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. వీడీ 13 వర్కింగ్ టైటిల్‌తో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ పతాకంపై దిల్ రాజు, శిరీష్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం వచ్చే ఏడాది జనవరిలో సంక్రాంతి సందర్భంగా విడుదల కాబోతుంది.
తాజాగా ఈ సినిమా నుంచి కొత్త అప్‌డేట్‌ని వెల్లడించారు మేకర్స్. ఈ నెల 18న సాయంత్రం 6.30 నిమిషాలకు వీడీ 13 సినిమా టైటిల్ ను ప్రకటించనున్నారు. ఈ విషయాన్ని చిత్ర నిర్మాణ సంస్థ తెలియజేస్తూ ఓ స్పెషల్ పోస్టర్‌ని రిలీజ్ చేసింది. అందులో విజయ్ స్కూల్ డ్రెస్‌లో ఉన్న పిల్లల చేయి పట్టుకుని ముందుకు నడుస్తున్నట్లున్న చూపించారు. ఈ సినిమా కూడా గీత గోవిందం తరహాలోనే హీరో క్యారెక్టర్ బలంగా ఉంటూనే, అవుట్ అండ్ అవుట్ ఎంటర్‌టైన్‌మెంట్‌తో సాగుతుందట.
The official Naamakaranam for this special project will be announced through a small title teaser.❤️
— Sri Venkateswara Creations (@SVC_official) October 15, 2023
You will witness something special 🔥
Date- October 18
Time- 18:30#VD13 #SVC54@TheDeverakonda @mrunal0801@ParasuramPetla #KUMohanan @GopiSundarOffl @SVC_official pic.twitter.com/XTk2pSwFUR
Comments
Please login to add a commentAdd a comment