Actress Mrunal Thakur In Vijay Devarakonda New Movie, Deets Inside - Sakshi
Sakshi News home page

Mrunal Thakur: విజయ్ దేవరకొండతో రొమాన్స్‌కు మృణాల్ రెడీ!

Published Tue, Jun 13 2023 12:17 PM | Last Updated on Tue, Jun 13 2023 1:14 PM

Mrunal Thakur In Vijay Devarakonda New Movie - Sakshi

రౌడీహీరో విజయ్ దేవరకొండకు 'లైగర్'తో కోలుకోలేని దెబ‍్బ తగిలింది. ఈ సినిమాతో పాన్ ఇండియా లెవల్లో హల్ చల్ చేద్దామనుకున్నాడు కానీ అది జరగలేదు. దీంతో రూట్ మార్చేశాడు. యాక్షన్ ని పక్కనబెట్టి లవ్ స్టోరీలు చేస్తున్నాడు. 'ఖుషి' ఆల్రెడీ సెట్స్ మీద ఉంది. ఈ ఏడాది సెప్టెంబరు 1న రిలీజ్ కానుంది. ఇంతలో మరో లవ్ స్టోరీతో విజయ్ రెడీ అయిపోయాడు.

(ఇదీ చదవండి: ‘సీతారామం 2’ కోసం వెయిటింగ్‌: మృణాల్‌ ఆసక్తికర వ్యాఖ్యలు)

విజయ్ దేవరకొండ కెరీర్ లో హిట్ సినిమాలంటే 'అర్జున్ రెడ్డి', 'గీతగోవిందం' మాత్రమే. విజయ్ లో యాక్షన్ కంటే లవ్ యాంగిలే చాలామంది ఫ్యాన్స్ కి ఇష్టం. అందుకే 'గీత గోవిందం'కి సీక్వెల్ ఎప్పుడొస్తుందా అని చాలారోజుల నుంచి రౌడీ ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అందుకు తగ్గట్లే కొన్నాళ్ల ముందు డైరెక్టర్ పరశురామ్ తో విజయ్ మూవీ అనౌన్స్ చేశారు.

దిల్ రాజు నిర్మిస్తున్న ఈ సినిమాలో హీరోయిన్ గా పూజాహెగ్డేని తీసుకున్నారని కొన్నిరోజుల ముందు వార్తలొచ్చాయి. కానీ ఇందులో నిజం లేదని తేలిపోయింది. 'సీతారామం'తో సెన్సేషన్ సృష్టించిన మృణాల్ ఠాకుర్ ని.. విజయ్ దేవరకొండకు హీరోయిన్ గా కన్ఫర్మ్ చేశారని టాక్. హైదరబాద్ లో బుధవారం(జూన్ 14).. ఈ మూవీ గ్రాండ్ గా లాంచ్ కానుందని తెలుస్తోంది. ఇండస్ట్రీ వర్గాల సమాచారం ప్రకారం ఇది ప్యూర్ లవ్ స్టోరీ అని, విజయ్-మృణాల్ మధ్య మాంచి రొమాన్స్ గ్యారంటీ  అని సమాచారం. ఇందులో నిజమేంటనేది తెలియాల్సి ఉంది.

(ఇదీ చదవండి: మృణాల్‌ ఠాకూర్‌కు బెదిరింపులు.. అసలేం జరిగింది!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement