స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా 'రామ్' ఫస్ట్‌లుక్ | Ram Movie Glimpse Released By Director Parasuram | Sakshi
Sakshi News home page

RAM Movie: స్టార్ డైరెక్టర్ చేతుల మీదుగా 'రామ్' ఫస్ట్‌లుక్

Published Tue, Sep 19 2023 7:12 PM | Last Updated on Tue, Sep 19 2023 7:23 PM

Ram Movie Glimpse Released By Director Parasuram - Sakshi

ఈ మధ్య కాలంలో నిజ జీవిత కథలని సినిమాలుగా తీస్తున్నారు. అవి ప్రేక్షకుల్ని ఆకట్టుకుంటున్నాయి కూడా. ఈ నేపథ్యంలో దీపిక ఎంటర్‌టైన్‌మెంట్ బ్యానర్‌పై ఓఎస్‌ఎం విజన్‌తో కలిసి ప్రొడక్షన్‌ నెం.1గా 'రామ్‌' (ర్యాపిడ్ యాక్షన్ మిషన్) అనే సినిమా తీస్తున్నారు. దేశభక్తి నేపథ్యంలో రూపొందుతున్న ఈ సినిమా ఫస్ట్ లుక్, గ్లింప్స్‌‌ని స్టార్ డైరెక్టర్ పరశురామ్ చేతుల మీదగా మంగళవారం రిలీజ్ చేశారు.

(ఇదీ చదవండి: హిట్ ఇచ్చిన డైరెక్టర్‌నే అవమానించిన రజనీకాంత్!)

దేశాన్ని, దేశ ప్రజలను ఉద్దేశిస్తూ గ్లింప్స్‌లో వినిపించిన డైలాగ్స్ బాగున్నాయి. బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ ఆకట్టుకుంటోంది. దీపికాంజలి వడ్లమాని నిర్మాణంలో తెరకెక్కుతున్న ఈ సినిమాతో సూర్య హీరోగా పరిచయమవుతున్నాడు. మిహిరామ్ వైనతేయ దర్శకుడిగా ఎంట్రీ ఇస్తున్నాడు. ధన్య బాలకృష్ణ హీరోయిన్.

ఈ చిత్రంలో భాను చందర్, సాయి కుమార్, రోహిత్, శుభలేఖ సుధాకర్ తదితరులు ఇతర ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి ఆశ్రిత్ అయ్యంగార్ సంగీతం అందిస్తుండగా.. ధారణ్ సుక్రి డిఎసి సినిమాటోగ్రఫీ వర్క్ చేస్తున్నారు. త్వరలో ఇతర వివరాలు వెల్లడించనున్నారు.

(ఇదీ చదవండి: హీరోయిన్ త్రిషకు పెళ్లి? ఆ నిర్మాతతో ఏడడుగులు!)

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement