ఆత్మకూరు రూరల్ (కర్నూలు): పిడుగుపాటుకు గురై గిరిజన యువకుడు మృతిచెందిన సంఘటన కర్నూలు జిల్లా కొత్తపల్లి మండలం పాలెం చెరువు వద్ద ఆదివారం జరిగింది. వివరాలు.. మండలంలోని శివపురం చెంచుగూడానికి చెందిన పరుశురాం (18) పాలెం చెరువులో ఉంటున్న తన అక్క ఇంటికి వచ్చాడు.
ఈ క్రమంలో గ్రామ శివారులో ఉన్న బ్రిడ్జి వద్ద ఇద్దరు స్నేహితులతో కలిసి కూర్చొని ఉన్న సమయంలో.. ఉరుములతో కూడిన వర్షం పడింది. ఆ సమయంలో బ్రిడ్జి పక్కన ఉన్న పరుశురాం తలపై పిడుగు పడటంతో.. అక్కడికక్కడే మృతిచెందగా.. మిగిలిన ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న స్థానికులు క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించారు.
పిడుగుపాటుతో యువకుడి మృతి
Published Sun, Sep 27 2015 3:36 PM | Last Updated on Sun, Sep 3 2017 10:05 AM
Advertisement
Advertisement