
అక్కినేని నట వారసుడిగా వెండితెరకు పరిచయం అయిన యువ కథానాయకుడు అఖిల్, తన మీద ఉన్న అంచనాలను అందుకోవటంలో ఫెయిల్ అవుతున్నాడు. తొలి సినిమాతో ఇప్పటికి మూడు సినిమాలు చేసిన అఖిల్ వరుసగా తడబడుతున్నాడు. మిస్టర్ మజ్ను సినిమాతో మరోసారి ఫెయిల్ అయిన ఈ యంగ్ హీరో తదుపరి చిత్రం విషయంలో ఆలోచనలో పడ్డాడు.
అయితే అఖిల్ నాలుగో సినిమా మెగా బ్యానర్‌లో తెరకెక్కనుందన్న ప్రచారం జరుగుతోంది. అక్కినేని హీరోకు సక్సెస్ ఇచ్చే బాధ్యతను అల్లు అరవింద్ తీసుకున్నట్టుగా తెలుస్తొంది. ఇప్పటికే గీత గోవిందం ఫేం పరశురాం, బొమ్మరిల్లు భాస్కర్‌లు అఖిల్ కోసం కథలు రెడీ చేస్తున్నారట. వీరిలో ఎవరి కథకు అఖిల్ ఓకె చెప్తే ఆ సినిమా పట్టాలెక్కే అవకాశం ఉంది.
Comments
Please login to add a commentAdd a comment