breaking news
Akhil Akkineni
-
భార్య జైనాబ్‌పై ట్రోలింగ్.. అఖిల్ స్పందన
గతేడాది జూన్‌లో అక్కినేని అఖిల్–జైనాబ్ వివాహ బంధంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. చాలా సాదాసీదాగా జరిగిన ఆ పెళ్లి వేడుక తర్వాత సోషల్ మీడియాలో వీరిద్దరిపై కొంతమంది ట్రోలింగ్ చేశారు. ముఖ్యంగా జైనాబ్ వయసు, ఆమె మతం వంటి అంశాలను ప్రస్తావిస్తూ విమర్శలు చేశారు. తాజాగా ఈ విషయంపై అఖిల్ స్పందించాడు. తనకు, తన భార్యకు మధ్య ఉన్న వయసు వ్యత్యాసం, ఆమె మతం వంటి విషయాలు తనకు అసలు సమస్యగా అనిపించలేదని ఆయన స్పష్టం చేశాడు. పెళ్లికి ముందే వీటిపై తామిద్దరం మాట్లాడుకున్నాం. అప్పట్లో కొన్ని నెలల పాటు తనపై, తన భార్యపై నడిచిన ట్రోలింగ్ గురించి ఆలోచించాలా.. లేక రాబోయే నా 50 ఏళ్ల జీవితం గురించి ఆలోచించాలా.. నేను నా జీవితం గురించి ఆలోచించాను. ఇవన్నీ నా దృష్టిలో చాలా చిన్నవి. తన భార్యగా మారిన తర్వాత ఇలాంటి నెగెటివ్ పోస్టులు వస్తాయని ముందే చెప్పాను.వాటిపై మానసికంగా సిద్ధంగా ఉండమని సూచించాను. జైనాబ్ అదే విధంగా పరిణతి చూపింది. తమ జంటపై వచ్చిన ప్రతి ట్రోలింగ్‌ను దీవెనగా తీసుకున్నాం. కులం, మతం, వయసు, ప్రేమ అన్నింటినీ దాటి తమ మధ్య అద్భుతమైన అవగాహన ఉందని చెప్పాడు. తాను మానసికంగా, శారీరకంగా కష్టకాలంలో ఉన్నప్పుడు జైనాబ్ అందించిన సపోర్ట్‌ను ఎప్పటికీ మరిచిపోలేను. అక్కడ్నుంచే తమ మధ్య అండర్స్టాండింగ్ మరింత బలపడింది. సోషల్ మీడియాలో కనిపించే ట్రోల్స్ నుంచి తనను రక్షించలేను. కానీ వాటిని తను ఎలా స్వీకరించిందనే అంశంపైనే ఆధారపడి ఉంటుంది. ఈ విషయంలో జైనాబ్ ఎంతో పరిణతి చూపింది. ఐదేళ్ల రిలేషన్షిప్లో తనను బాగా అర్థం చేసుకుందని అఖిల్ పేర్కొన్నాడు. అఖిల్ లెనిన్ మూవీతో సూపర్ హిట్ చిత్రాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన అఖిల్.. ఎట్టకేలకు అయ్యగారే నంబర్‌వన్ అనిపించుకున్నారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించిన విషయం తెలిసిందే. -
నవ్వాలంటే నాన్న.. ఏడవాలంటే అమ్మ.. 'సిసింద్రీ' సంగతులు
అక్కినేని అఖిల్ 'లెనిన్' సినిమాతో ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. మూవీ హడావుడి అంతా ముగిసిపోవడంతో ఇప్పుడో ఓ యూట్యూబర్‌కి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఇందులో తన చిన్నప్పటి నుంచి ఇప్పటివరకు జరిగిన బోలెడు విషయాల్ని పంచుకున్నాడు. మరీ ముఖ్యంగా నెలల వయసున్నప్పుడు తనతో తీసిన 'సిసింద్రీ' గురించి ఇప్పటివరకు ఎవరికీ తెలియని సంగతులు షేర్ చేశాడు.(ఇదీ చదవండి: షాకింగ్.. అఖిల్ అక్కినేని ఇండియన్ కాదా?)'నాకే గనక కొడుకు పుడితే సిసింద్రీ-2 చేస్తాను. ఈ విషయాన్ని నా భార్య జైనాబ్కి కూడా చెప్పాను. నాకు కొడుకు పుడతాడా? కూతురు పుడతుందా? అనేది దేవుడి చేతుల్లో ఉంది. ఒకవేళ కొడుకు పుడితే మాత్రం తనని పెట్టి సిసింద్రీ 2' తీయాలనేది నా ఆలోచన. అయితే ఈ మూవీ షూటింగ్ టైంలో నేను నాలుగు గంటల మాత్రమే మెలకువగా ఉండేవాడిని. ఆ టైంలో నా మూడ్ బాగుంటేనే షూటింగ్ చేసేవారు. సినిమాలో నేను నవ్వాల్సిన సందర్భంలో కెమెరా వెనక నాన్న నిలబడి సైగలు చేసేవారు. వాటిని చూసి నేను నవ్వేవాడిని. ఏడవాల్సిన సీన్స్ కోసం అమ్మ కారు ఎక్కి వెళ్లిపోయేది. అది చూసి నేను ఏడిస్తే ఆ సీన్స్ షూటింగ్ చేసేవారు' అని అఖిల్ పాత విషయాల్ని చెప్పుకొచ్చాడు.'సిసింద్రీ' సినిమాని హాలీవుడ్ సినిమా.. 'బేబీస్ డే ఔట్' ఆధారంగా తెరకెక్కించారు. శివనాగేశ్వరరావు దర్శకుడు కాగా నాగార్జున నిర్మించడంతోపాటు ఇందులో కీలక పాత్ర చేశాడు. ఈ మూవీ కమర్షియల్‌గా హిట్ అయింది. అఖిల్‌కి ఏకంగా ఫిల్మ్ ఫేర్ అవార్డ్ వచ్చింది. ఇకపోతే ఈ చిత్రంతో వచ్చిన లాభాలతోనే అమల.. తనకు ఎంతో ఇష్టమైన జంతు సంరక్షణ సంస్థ 'బ్లూ క్రాస్'ను ప్రారంభించారని అఖిల్ చెప్పాడు.'సిసింద్రీ' విషయానికొస్తే.. ఓ డబ్బింటి కుటుంబానికి చెందిన చిన్న పిల్లాడిని.. డబ్బుల కోసం తన బాబాయి కిడ్నాప్ చేయిస్తాడు. అందులో భాగమైన ముగ్గురు దొంగల్ని ఆ చిన్నపిల్లాడు ఎలా ముప్పుతిప్పలు పెట్టాడు? తిరిగి తన తల్లిదండ్రుల దగ్గరకు ఎలా చేరుకున్నాడు అనేది స్టోరీ. పూర్తిగా ఎంటర్టైనింగ్గా ఉండే ఈ సినిమాలో ఎంతో ముద్దుగా కనిపిస్తూ క్యూట్ ఎక్స్ప్రెషన్స్ ఇచ్చిన అఖిల్ ప్రేక్షకులకు తెగ నచ్చేశాడు.(ఇదీ చదవండి: నన్ను చూసి నాకే అసహ్యమేసింది: అఖిల్) -
నన్ను చూసి నాకే అసహ్యమేసింది: అఖిల్
అక్కినేని అఖిల్.. 'లెనిన్' సినిమాతో కెరీర్లో తొలి సక్సెస్ అందుకున్నాడు. ఈ నెల 10న థియేటర్లలో రిలీజైన ఈ మూవీని చూసిన చాలామంది బాగుందని అన్నారు. అందుకు తగ్గట్లే పర్లేదనిపించే కలెక్షన్స్ కూడా వచ్చాయి. ఇండస్ట్రీకి వచ్చిన పదకొండేళ్ల తర్వాత అఖిల్ అందుకున్న తొలి హిట్ ఇది. అయితే ఇతడి గత చిత్రం 'ఏజెంట్' ఎంత దారుణమైన డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో స్వయంగా అఖిల్.. 'ఏజెంట్' ఫ్లాప్ కావడంపై స్పందించాడు. ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది)'ఏజెంట్ డిజాస్టర్ అయిన తర్వాత మళ్లీ ఆ సినిమా చూశాను. స్క్రీన్‌పై నన్ను నేను చూసుకుంటే చాలా అసహ్యమేసింది. దాదాపు ప్రతి సీన్లోనూ అతిగా ఓవరాక్టింగ్ చేశానని నాకే స్పష్టంగా అర్థమైంది. అలానే రిలీజ్‌కి ముందు ఫస్ట్ కాపీ చూసుకున్నప్పుడే ఏదో తేడా కొట్టిందని గ్రహించాను. అదే విషయాన్ని నా ఫ్రెండ్స్, క్లోజ్ సర్కిల్లోని కొందరికి చెప్పాను. అయితే నిర్మాత ఈ ప్రాజెక్ట్ కోసం కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుబడి పెట్టారు. హీరోగా ఆ మొత్తాన్ని వీలైనంత వరకు రికవరీ చేయాలి. కాబట్టి మూవీకి సపోర్ట్ చేయాలని భావించి ప్రమోట్ చేశాను' అని అఖిల్ చెప్పుకొచ్చాడు.అయితే 'ఏజెంట్' సినిమాకు బౌండ్ స్క్రిప్ట్ లేకుండా దర్శకుడు సినిమా తీశారనే విమర్శలపై స్పందించిన అఖిల్.. ఇకపై తాను ఏ మూవీ కూడా బౌండ్ స్క్రిప్ట్ లేకుండా చేయనని కుండబద్దలు కొట్టేశాడు. 'ఏజెంట్' విషయానికొస్తే.. 2023లో థియేటర్లలో రిలీజైంది. సురేందర్ రెడ్డి తీసిన ఈ చిత్రం కోసం అఖిల్ చాలానే కష్టపడ్డారు. కండలు పెంచాడు. డైలాగ్ మాడ్యులేషన్ కూడా మార్చాడు. కానీ థియేటర్లలో తొలి షో తొలి ఆటకే డిజాస్టర్ టాక్ వచ్చింది. దీంతో డైలమాలో పడిపోయిన అఖిల్.. దాదాపు మూడేళ్లు గ్యాప్ తీసుకుని 'లెనిన్'తో వచ్చాడు. సక్సెస్ అందుకున్నాడు. (ఇదీ చదవండి: షాకింగ్.. అఖిల్ అక్కినేని ఇండియన్ కాదా?) -
షాకింగ్.. అఖిల్ అక్కినేని ఇండియన్ కాదా?
‘లెనిన్’తో హిట్ కొట్టాడు అఖిల్ అక్కినేని. నాగార్జున వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చిన అఖిల్..దాదాపు పదేళ్ల తర్వాత సాలిడ్ హిట్ అందుకున్నాడు. ఈ జోష్‌లో వరుస ఇంటర్వ్యూలో ఇస్తూ..తన కెరీర్ గురించి, పర్సనల్ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నాడు. తాజాగా ఓ పాడ్ కాస్ట్లో తన పౌరసత్వం గురించి ఆసక్తిక విషయాలు పంచుకున్నాడు.ఇండియన్ కాదా?అక్కినేని అఖిల్ 1994 ఏప్రిల్ 8న అమెరికాలోని కాలిఫోర్నియా లోని సాన్ జోస్ నగరంలో జన్మించారు. దీంతో అక్కడి చట్టాల ప్రకారం అఖిల్‌కు పుట్టుకతోనే అమెరికా పౌరసత్వం లభించింది. ఆయనకు అమెరికా పాస్‌పోర్ట్ కూడా లభించింది. చిన్ననాటి విద్యను హైదరాబాద్‌లోని చైతన్య విద్యాలయంలో ప్రారంభించిన అఖిల్, కొంతకాలం ఆస్ట్రేలియాలో చదువుకున్నారు. తిరిగి హైదరాబాద్‌లోని ఓక్రిడ్జ్ ఇంటర్నేషనల్ స్కూల్లో విద్యను పూర్తి చేశారు. అనంతరం నటనపై ఆసక్తితో న్యూయార్క్‌లోని లీ స్ట్రాస్‌బర్గ్ థియేటర్ & ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో యాక్టింగ్ కోర్సు చేశారు.కొద్ది రోజుల్లో భారతీయుడిని అవుతానుతాజాగా ఓ పాడ్ కాస్ట్లో మాట్లాడిన అఖిల్.. ‘ప్రస్తుతం నేను అమెరికన్ పౌరుడినే. నా వద్ద అమెరికా పాస్‌పోర్ట్ కూడా ఉంది. అయితే త్వరనే ఆ పౌరసత్వాన్ని వదులుకుంటాను. ఇంకొన్ని నెలల్లో నేను భారతీయుడిని అయిపోతాను. ఇండియన్ మేరా భారత్ మహాన్’ అని అఖిల్ చెప్పుకొచ్చాడు.I will be Indian citizen soon.. మేర భారత్ మహాన్ - అఖిల్ pic.twitter.com/SWyjQQwIvr— Mr. Akkineni (Sai) (@AkkineniFF) July 24, 2026 -
అఖిల్ లెనిన్.. లవ్ సాంగ్ ఫుల్ వీడియో రిలీజ్
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద వసూళ్ల పరంగా ఫర్వాలేదనిపించింది. కాగా.. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించింది. తాజాగా ఈ మూవీ నుంచి ఓ క్రేజీ సాంగ్ రిలీజ్ చేశారు. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమాలోని వారెవా వారెవా అంటూ సాగే పాట ఫుల్ వీడియోను మేకర్స్ విడుదల చేశారు. ఈ రొమాంటిక్ లవ్ సాంగ్‌కు అనంత శ్రీరామ్ లిరిక్స్ అందించగా.. శ్వేతా మోహన్, జుబిన్ నౌటియాల్ ఆలపించారు. ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేశారు. -
'లెనిన్' సక్సెస్ మీట్.. అక్కినేని హీరోలు స్పెషల్ ఎట్రాక్షన్ (ఫొటోలు)
-
మాకు పండుగ లాగుంది...
-
'లెనిన్' బ్లాక్‌బస్టర్ వేడుకలో అఖిల్ ఏమన్నాడంటే..? ఫ్యాన్స్ ఫిదా..!
-
ఒడిస్సీలా మనం ఎందుకు చేయలేం: నాగార్జున ఆసక్తికర కామెంట్స్
అక్కినేని అఖిల్ మూడేళ్ల గ్యాప్ తర్వాత వచ్చిన యాక్షన్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. మొదటి రోజు నుంచే కలెక్షన్స్ పరంగా దూసుకెళ్లింది. ఏజెంట్ తర్వాత అఖిల్‌కు హిట్ పడడంతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఈ ఈవెంట్‌కు హాజరైన నాగార్జున టాలీవుడ్ సినిమాలపై ఆసక్తికర కామెంట్స్ చేశారు.ముఖ్యంగా సినిమా రిలీజ్ డేట్స్ విషయంపై నాగార్జున కాస్తా ఘాటు కామెంట్స్ చేశారు. ఒడిస్సి మూవీ ఏడాది కిందట రిలీజ్ డేట్ ప్రకటించి అదే తేదీకి విడుదల చేశారు. కానీ మనం రిలీజ్ డేట్ ప్రకటించినా ఆ టైమ్‌కు రిలీజ్ చేయలేకపోతున్నామని అన్నారు. లెనిన్ విషయంలోనూ అదే జరిగిందని తెలిపారు. గతంలో నెల రోజుల ముందే రిలీజ్ కాపీని చూసేవాళ్లమని నాగ్ వెల్లడించారు. ఇప్పుడు అలా ఎందుకు చూడలేకపోతున్నామనేదే నా ప్రశ్న అని అన్నారు. ప్రకటించిన తేదీకే అందరు సినిమాలను విడుదల చేస్తే బాగుంటుందని నాగార్జున తన అభిప్రాయం వ్యక్తం చేశారు. సినిమాను కనీసం రెండు వారాల ముందు ఇస్తే బాగుంటుందని నాగ్ అన్నారు. Lenin Blockbuster Mikela Undho Theliyadhu Kani Naku, Chaitanya Ki, Akhil Ki Pandaga Laa Undhi, Illantha Kalakalalaaduthundhi - King @iamnagarjuna speech @ #LENIN Blockbuster Vaibhavam Event ❤️🔥 #BlockbusterLENIN 📷🌋 pic.twitter.com/bw3bAtC4ca— Annapurna Studios (@AnnapurnaStdios) July 20, 2026 -
100 కోట్లవైపు లెనిన్.. కింగ్ 100లో ముగ్గురు మొనగాళ్లు
-
అఖిల్ లెనిన్.. ఈ స్పెషల్ వీడియో చూశారా?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ మూవీ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా ప్రస్తుతం థియేటర్లలో సందడి చేస్తోంది. తొలి రోజే పాజిటివ్ టాక్ తెచ్చుకున్న ఈ మూవీ వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించింది. తొలి రోజే పాజిటివ్ టాక్ అందుకున్న ఈ సినిమాకు ఆడియన్స్ క్యూ కడుతున్నారు.సినిమా బాక్సాపీస్ వద్ద దూసుకెళ్తోన్న వేళ.. మేకర్స్ ఫ్యాన్స్‌కు సర్ప్రైజ్ ఇచ్చారు. తాజాగా లెనిన్ మూవీ నుంచి ప్రత్యేక వీడియోను షేర్ చేశారు. బ్లాక్‌బస్టర్ మాషప్ పేరుతో ప్రత్యేక వీడియో రిలీజ్ చేశారు. ఈ వీడియో అఖిల్ అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. అఖిల్ నటన, భాగ్యశ్రీ బోర్సే అందం చూసి ఫ్యాన్స్ ఫిదా అవుతున్నారు. ఇంకెందుకు ఆలస్యం మీరు కూడా స్పెషల్ వీడియో చూసేయండి. -
‘అయ్యగారి’ని కలిసిన అభిమాని.. కన్నీళ్లు తూడుస్తూ అఖిల్ ఎమోషనల్!
‘అయ్యగారే నెంబర్ వన్’ అంటూ తనపై ప్రేమను చాటిన వీరాభిమాని నాగరాజును అఖిల్ అక్కినేని ఎట్టకేలకు కలిశాడు. నిన్న(జులై 15) గుంటూరులో జరిగిన ‘లెనిన్’ సక్సెస్ మీట్ అనంతరం అఖిల్ తన అభిమాని నాగరాజుని కారవాన్‌లోకి పిలిపించుకొని మాట్లాడాడు. ఈ సందర్భంగా నాగరాజు ఎమోషనల్ అయ్యాడు. అఖిల్ కాళ్ల మీద పడిపోయి బోరున ఏడ్చేశారు. అతణ్ని ఓదారుస్తూ అఖిల్ కూడా ఎమోషనల్ అయ్యాడు. నీ వల్లే నాకు అయ్యగారు అనే పేరొచ్చింది అని చెప్పాడు. తర్వాత తన భార్యను పరిచయం చేశాడు కూడా. దీంతో నాగరాజు ఆనందానికి అవధుల్లేవు. ఎంతో స్వచ్ఛంగా అనిపిస్తున్న ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.అఖిల్ కెరీర్ ఆరంభంలో ఈ అభిమాని‘అయ్యగారే నంబర్ వన్.. ఆడే రావాలి.. ఆడే కరెక్టు’ అంటూ చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. ఆ తర్వాత అఖిల్ నుంచి ఏ సినిమా వచ్చినా సరే.. అందరి దృష్టి ఈ అభిమాని మీదకు వెళ్తుంది. లెనిన్ మూవీ రిలీజ్ ముందు కూడా నాగరాజు వీడియో మళ్లీ వైరల్ అయింది. కొంతమంది యూట్యూబర్లు అతన్ని ఇంటర్వ్యూ కూడా చేశారు. నాగరాజు కల్మషం లేని అభిమానం చూసి ప్రతి ఒక్కరు చలించిపోయారు. ఒక్కసారైనా హీరోని కలిస్తే బాగుండేదని కోరుకున్నారు. అందరూ కోరుకున్నట్లే..నిన్న నాగరాజుకు అఖిల్‌ను కలిసే అవకాశం దొరికింది. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
అయ్యగారే నంబర్‌వన్.. సక్సెస్ మీట్లో అఖిల్ సతీమణి..!
అక్కినేని హీరో అఖిల్ దాదాపు మూడేళ్ల తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చారు. మురళి కిశోర్ అబ్బూరి డైరెక్షన్లో వచ్చిన లెనిన్ బాక్సాఫీస్ వద్ద హిట్ టాక్‌ను సొంతం చేసుకుంది. కొన్నేళ్లుగా హిట్ కోసం తంటాలు పడుతున్న అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. ఈ విజయాన్ని అక్కినేని ఫ్యాన్స్ గ్రాండ్‌గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు.తాజాగా ఈ మూవీ సక్సెస్ మీట్ గుంటూరులో నిర్వహించారు మేకర్స్. ఈ ఈవెంట్‌కు అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆమె లెనిన్ సక్సెస్‌పై జైనాబ్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ సినిమా హిట్ కావడం చాలా హ్యాపీగా, గర్వంగా ఉందని తెలిపింది. అంతేకాకుండా అయ్యగారే నెంబర్ వన్ అంటూ సరదాగా కామెంట్స్ చేసింది. ఈ సందర్భంగా లెనిన్ టీమ్‌కు అభినందనలు తెలిపింది. ఈ వీడియో కాస్తా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. కాగా.. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చి ఈ మూవీలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా మెప్పించింది. #Lenin చూసి #AkhilAkkineni wife #Zainab కూడా ఒకే మాట...' అయ్యగారే నెంబర్ 1 '#Lenin Success Celebrations at Gunturpic.twitter.com/mVE9jJid5r— Taraq(Tarak Ram) (@tarakviews) July 15, 2026 -
నాగచైతన్య, సమంత, అఖిల్.. నెక్స్ట్ ఎవరు?
సాంకేతికంగా ప్రపంచం ఎంతలా అభివృద్ధి చెందినా సరే కొన్ని నమ్మకాలు, సెంటిమెంట్స్ అలా ఉండిపోతాయి. మరీ ముఖ్యంగా సినిమా ఇండస్ట్రీలో ఇలాంటి వాటిని ఎక్కువగా నమ్ముతారు, పాటిస్తారు. రీసెంట్ టైంలో టాలీవుడ్లో సరికొత్త ట్రెండ్ కనిపిస్తోంది. పెళ్లి చేసుకున్న వెంటనే పలువురు సెలబ్రిటీలు గుర్తుండిపోయే హిట్స్ కొట్టేస్తున్నారు. ఇంతకీ ఏంటి విషయం?(ఇదీ చదవండి: కొత్తింట్లోకి అడుగుపెట్టిన శ్రుతి హాసన్.. ఫొటోలు వైరల్)కిరణ్ అబ్బవరం హీరోగా చాలా సినిమాలు చేశాడు గానీ తొలి మూవీ తప్పితే మిగిలినవి ఏవీ సక్సెస్ కాలేదు. అలాంటి టైంలో అంటే 2024లో తన తొలి సినిమా హీరోయిన్ రహస్య గోరఖ్‌ని పెళ్లి చేసుకున్నాడు. ఇది జరిగిన కొన్నాళ్లకే 'క' మూవీతో వచ్చాడు. అద్భుతమైన సక్సెస్ అందుకున్నాడు.గతేడాది ఫిబ్రవరిలో నాగచైతన్య 'తండేల్'తో వచ్చాడు. అంతకు సరిగ్గా రెండు నెలల ముందే శోభితని పెళ్లి చేసుకున్నాడు. ఇక్కడ కూడా సెంటిమెంట్ వర్కౌట్ అయింది. చైతూ 'తండేల్'తో కెరీర్ బెస్ట్ కలెక్షన్స్ అందుకున్నాడు. ప్రస్తుతం 'వృషకర్మ' మూవీ చేస్తున్నాడు. దీనిపై బజ్ బాగానే ఉంది.గతేడాది డిసెంబరులో సమంత మళ్లీ పెళ్లి చేసుకుంది. 'ఫ్యామిలీ మ్యాన్' దర్శకుడు రాజ్ నిడిమోరుతో కొత్త జీవితం ప్రారంభించింది. కట్ చేస్తే లాంగ్ గ్యాప్ తర్వాత 'మా ఇంటి బంగారం' మూవీతో సామ్ రీఎంట్రీ ఇచ్చింది. విడుదలకు ముందు దీనిపై పెద్దగా బజ్ లేదు. కానీ ఊహించని విధంగా మూవీ హిట్ కావడంతో పాటు రూ.100 కోట్ల కలెక్షన్స్ కూడా వచ్చాయి. ప్రస్తుతం సమంత ప్రెగ్నెన్సీతోనూ ఉంది. అది ఇంకో గుడ్ న్యూస్.(ఇదీ చదవండి: ఈ వారం ఓటీటీల్లోకి 20 సినిమాలు.. ఆ రెండు డోంట్ మిస్)గతేడాది జూన్‌లో అక్కినేని అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. ప్రియురాలు జైనబ్ మెడలో మూడుముళ్లు వేశాడు. సరిగా ఏడాది తిరిగేసరికల్లా ఎన్నాళ్లగానో ఎదురుచూస్తున్న హిట్ 'లెనిన్' రూపంలో దక్కింది. ప్రస్తుతం అఖిల్ ఫుల్ హ్యాపీ. ఇదే ఊపులో జాగ్రత్తగా మరిన్ని మూవీస్ చేయాలనుకుంటున్నాడు. ఇలా వరసగా నలుగురు స్టార్స్ అలా పెళ్లిచేసుకున్నారో లేదో ఇలా కెరీర్లోనే గుర్తుండిపోయే సక్సెస్‌ని అందుకున్నారు.ఈ లిస్టులో ఇంకా ముగ్గురు మిగిలున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో విజయ్ దేవరకొండ-రష్మిక పెళ్లి చేసుకున్నారు. రష్మికకు ఎలానూ హిట్స్ ఉన్నాయి కానీ విజయ్‌కే కెరీర్ ప్రారంభంలో వచ్చిన 'అర్జున్ రెడ్డి' తప్పితే చెప్పుకోదగ్గ సక్సెస్ లేదు. మరోవైపు బెల్లంకొండ శ్రీనివాస్, అల్లు శిరీష్ కూడా రీసెంట్ టైంలోనే వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. ప్రస్తుతానికైతే వీళ్లు ముగ్గురు మాత్రమే వివాహం చేసుకుని హిట్ విషయంలో పెండింగ్‌లో ఉన్నారు. ఒకవేళ వీళ్లు కూడా సక్సెస్ అందుకుంటే 'పెళ్లి' సెంటిమెంట్, టాలీవుడ్లో మరింత పాపులర్ అయిపోవడం గ్యారంటీ.(ఇదీ చదవండి: జైలులోనే స్టార్ హీరో.. ఏడు నెలల తర్వాత ఓటీటీలోకి సినిమా) -
లెనిన్ సక్సెస్.. అఖిల్‌పై మెగాస్టార్ ప్రశంసలు
అక్కినేని అఖిల్‌పై మెగాస్టార్ ప్రశంసలు కురిపించారు. లెనిన్ గురించి అద్భుతమైన విషయాలు వింటున్నానని తెలిపారు. అఖిల్ నాకు మరో కొడుకు లాంటి వాడని అన్నారు. ప్రతి సినిమాతో అతను ఎదుగుతుండటం చూస్తుంటే చాలా ఆనందంగా ఉందని వెల్లడించారు. సక్సెస్ సాధించిన లెనిన్ చిత్రబృందానికి అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. త్వరలో 'లెనిన్' సినిమా చూడాలని ఎదురుచూస్తున్నాని రాసుకొచ్చారు.స్పందించిన అఖిల్...మెగాస్టార్ ట్వీట్‌కు అక్కినేని అఖిల్ కూడా స్పందించారు. పెదనాన్న మీ ప్రేమ ఎప్పుడూ అమితమైంది. మీ సహకారానికి ధన్యవాదాలు అని రాసుకొచ్చారు. దీనిపై నాగార్జున స్పందిస్తూ.. ధన్యవాదాలు చిరంజీవి. నా కుటుంబానికి, నాకు మీరు ఎప్పుడూ సపోర్ట్‌గా నిలిచారు. సినిమా చూడండి. మీకు తప్పకుండా నచ్చుతుందిని రాసుకొచ్చారు.అఖిల్ హీరోగా వచ్చిన లెనిన్ మూవీ జూలై 10న థియేటర్లలో రిలీజైంది. మొదటి రోజే పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్లపరంగా దూసుకెళ్తోంది. తొలిరోజు రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించిన లెనిన్.. రెండో రోజే రూ.32 కోట్లు దాటేసింది. ప్రస్తుతం బాక్సాఫీస్ వద్ద లెనిన్ మూవీ సందడి చేస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో తెరకెక్కించిన ఈ సినిమాకు మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. Hearing wonderful things about #Lenin. Delighted by the unanimous appreciation, especially for @AkhilAkkineni8’s performance. Akhil is very dear to me, like another son and it’s a joy to see him grow with every film.Congratulations to my dear friend @iamnagarjuna, the entire…— Chiranjeevi Konidela (@KChiruTweets) July 13, 2026 -
నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. ‘లెనిన్’పై ఆర్జీవీ రివ్యూ
అఖిల్ అక్కినేని తన తాజా చిత్రం ‘లెనిన్’ తో కెరీర్లోనే అతిపెద్ద విజయాన్ని అందుకున్నారు. “వస్తున్నాం.. మనోడు కొడుతున్నాడు” అంటూ ప్రమోషన్ చేసిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్‌బస్టర్ హిట్‌గా నిలిచింది. వసూళ్ల వివరాలు పక్కన పెడితే.. అఖిల్ నటనకు అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి ప్రశంసలు వెల్లువెత్తుతున్నాయి. పలువురు సినీ ప్రముఖులు ఈ చిత్రంతో ఆయన తన కెరీర్లోనే బెస్ట్ పర్ఫార్మెన్స్ ఇచ్చాడని కొనియాడారు. దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) సోషల్ మీడియాలో అఖిల్‌ను అభినందించారు. హే అఖిల్ అక్కినేని ‘లెనిన్’తో బ్లాక్‌బస్టర్ అందుకున్నందుకు బిగ్ కంగ్రాట్స్ అంటూ పోస్ట్ చేశారు. దీనికి అఖిల్ స్పందిస్తూ.. థ్యాంక్యూ సార్.. ప్లీజ్ సినిమా చూడండి అని రిప్లై ఇచ్చారు. Hey @AkhilAkkineni8 Just saw #Lenin , and apart from the FILM being GREAT , I realised that you are the BEST ACTOR in the #Akkineni family and I swear this on @iamnagarjuna 🔥🔥 Your ease is remarkable even when there’s no emotion in the scenes and in the emotional scenes you… https://t.co/az4x6dFsTL— Ram Gopal Varma (@RGVzoomin) July 12, 2026తాజాగా సినిమా చూసిన ఆర్జీవీ, ఎక్స్ వేదికగా తన రివ్యూని పంచుకున్నారు. ఆయన అఖిల్ నటనపై ప్రశంసలు కురిపించారు. నాగార్జున మీద ఒట్టేసి చెబుతున్నా.. అక్కినేని ఫ్యామిలీలోనే అఖిల్ అత్యుత్తమ నటుడు అని ఆర్జీవీ పేర్కొన్నారు. సాధారణ సన్నివేశాల్లో కూడా అఖిల్ నటనలో కనిపించే ఈజ్ అద్భుతం, భావోద్వేగ సన్నివేశాల్లో అయితే అదరగొట్టేశాడని వర్మ అభిప్రాయపడ్డారు. అఖిల్‌కు ఇలాంటి అద్భుతమైన పాత్రను అందించిన దర్శకుడు మురళి కిషోర్ అబ్బూరికి ప్రత్యేక అభినందనలు తెలిపారు. -
అఖిల్ లెనిన్ కలెక్షన్స్.. మొదటి రోజు కంటే ఎక్కువే
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ మూవీ లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో విడుదలైంది. ఎప్పటి నుంచో హిట్ కోసం తంటాలు పడుతోన్న అఖిల్.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత ప్రేక్షకుల ముందుకొచ్చాడు. ఏజెంట్ డిజాస్టర్ తర్వాత అఖిల్ నటించిన మూవీ కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు పెరిగాయి. అందుకు తగ్గట్టుగానే లెనిన్ మొదటి షో నుంచే పాజిటివ్ టాక్ అందుకుంటోంది.ఈ మూవీకి తొలిరోజే బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఫస్ట్ డేనే రూ.16 కోట్లకు పైగా వసూళ్లు సాధించింది. లెనిన్‌కు పాజిటివ్ టాక్ రావడంతో అక్కినేని ఫ్యాన్స్ పండుగ చేసుకుంటున్నారు. దీంతో రెండో రోజు ఆడియన్స్‌లో అదే జోరు కనిపించింది. ఈ సినిమా రెండు రోజుల్లోనే రూ.37.2 కోట్ల గ్రాస్ వసూళ్లు సాధించింది. మొదటి రోజు కంటే రెండో రోజే వసూళ్లలో పెరుగుదల కనిపించింది. వీకెండ్ కావడంతో మూడు రోజుల్లోనే రూ.50 కోట్లు కొల్లగొట్టేలా కనిపిస్తోంది.కాగా.. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించింది. The word of mouth is doing wonders ❤️The audience is doing the rest 💪🏼37.2 CR+ Worldwide Gross in just 2 days 💥💥#LENIN is marching from strength to strength 🔥🔥#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu @MusicThaman… pic.twitter.com/SQbib4c1mt— Sithara Entertainments (@SitharaEnts) July 12, 2026 -
అఖిల్ హిట్ కొడితే శ్రీలీల టార్గెట్ అయింది
అఖిల్ ఎట్టకేలకు హిట్ కొట్టాడు. 'లెనిన్'కి దాదాపుగా పాజిటివ్ టాక్ వినిపిస్తోంది. తొలిరోజు కొందరి నుంచి మిశ్రమ స్పందన వినిపించినప్పటికీ ఓవరాల్‌గా అయితే రెస్పాన్స్ బాగుంది. తొలి సక్సెస్ అందుకునేసరికి అటు అఖిల్, ఇటు భాగ్యశ్రీ ఫుల్ ఎమోషనల్ అయిపోయారు. ఇందుకు సంబంధించిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అదే టైంలో హీరోయిన్ శ్రీలీలని దారుణంగా ట్రోల్స్ చేస్తున్నారు.(ఇదీ చదవండి: ‘లెనిన్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?)శ్రీలీలపై చాలామంది నెటిజన్లు విమర్శలు చేయడానికి ఓ కారణం కనిపిస్తోంది. 'లెనిన్' సినిమాని ప్రకటించి ఓ వీడియో రిలీజ్ చేసినప్పుడు మొదటగా అనుకున్న హీరోయిన్ శ్రీలీలనే. అయితే తర్వాత ఈమె స్థానంలో భాగ్యశ్రీ బోర్సే వచ్చి చేరింది. సినిమాలోని ఈమె ఫెర్ఫార్మెన్స్, గ్లామర్‌కి మంచి మార్కులే పడ్డాయి. ఒకవేళ ఇదే ప్లేసులో శ్రీలీల ఉండుంటే కచ్చితంగా ఇలా చేసేది కాదని, సినిమాకు మైనస్ అయ్యిండేదని సోషల్ మీడియాలో పలువురు ట్రోల్స్ చేస్తున్నారు.ఒకవేళ నిజంగా శ్రీలీల.. 'లెనిన్' సినిమా చేసుంటే ఎలా ఉండేదో ఏమో గానీ సోషల్ మీడియాలో ఈమెని విమర్శించడం ఎక్కువైపోయింది. గతంలో శ్రీలీల తెలుగులో చాలా మూవీస్ చేసింది గానీ వీటిలో 'ధమాకా' తప్పితే మిగతా ఏది కూడా హిట్ కాలేదు. రొటీన్ క్యారెక్టర్స్ చేస్తుందని శ్రీలీలపై గతంలోనే విమర్శలు వచ్చాయి. ఇప్పుడు ఫ్రెష్‌గా 'లెనిన్' ప్రస్తావన తీసుకొచ్చి ఈమెని టార్గెట్ చేస్తున్నారు.ఈ ఏడాది రిలీజైన 'ఉస్తాద్ భగత్ సింగ్' సినిమాలో శ్రీలీల చివరగా కనిపించింది. ఇదెంత పెద్ద డిజాస్టర్ అయిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం హిందీలో ఒకటి, తమిళంలో మరొకటి చేస్తోంది. అసలు తెలుగులో కొత్తగా ఏం మూవీస్ చేయనప్పటికీ ట్రోలింగ్ వల్ల మళ్లీ వార్తల్లోకి వచ్చింది.(ఇదీ చదవండి: మా వాడికి హిట్ ఇవ్వమని దేవుడిని అడిగా.. పెళ్లయ్యాక అఖిల్ టైమ్ మొదలైంది) -
ఇంత సక్సెస్ అవుతుందని అనుకోలేదు మీ అభిమానం చూస్తే ఏడుపొస్తోంది
-
మా వాడికి హిట్ ఇవ్వండని అడిగా.. పెళ్లయ్యాక అఖిల్ టైమొచ్చింది
అఖిల్ ఎట్టకేలకు సక్సెస్ అందుకున్నాడు. థియేటర్లలోకి రిలీజైన 'లెనిన్' పాజిటివ్ టాక్ తెచ్చుకుని ప్రేక్షకుల్ని అలరిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో సక్సెస్ మీట్ నిర్వహించారు. ఇందులోనే నాగార్జున మాట్లాడుతూ తన కొడుకు అఖిల్ గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.(ఇదీ చదవండి: ‘లెనిన్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?)'అఖిల్‌లో సాధించాలనే తపన ఉంది. చిన్నప్పటి నుంచే ఎనర్జీతో ఉండేవాడు. అందుకే డాక్టర్స్ కూడా వాడిని నేలపై పడుకోబెట్టమని చెప్పేవారు. అలాంటి అఖిల్ సినిమాల కోసం కష్టపడ్టాడు కానీ ఆశించిన విజయం రాలేదు. బయటకు ఏది మాతో చెప్పడు. గాయాలపాలయ్యాడు. కామ్ అయిపోయాడు. తనలో తాను ఆలోచిస్తూ ఉండేవాడు. ఇంట్లోకి తన తోడు వచ్చాక తన గుడ్ టైమ్ మొదలైంది. అప్పటినుంచి అతడి ఆలోచన విధానం కూడా మారింది. పైనల్లీ లెనిన్ రిజల్ట్ పాజిటివ్‌గా వచ్చింది. ఎస్ అయ్యగారే నెంబర్ వన్.''ఎన్నోసార్లు వేంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లాను. ఎప్పుడూ ఏమీ అడిగింది లేదు. ఈసారి మాత్రం 'మా వాడికి ఒక హిట్ ఇవ్వండి' అని అడిగాను. ముందుగా ఆయనికి కృతజ్ఞతలు. తర్వాత మా పెద్ద పెద్ద అబ్బాయి తారక్‌కి థ్యాంక్స్' అని నాగార్జున చెప్పుకొచ్చాడు.(ఇదీ చదవండి: అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ) -
‘లెనిన్’ ఫస్ట్‌డే కలెక్షన్స్ ఎంతంటే..?
చాలా రోజుల తర్వాత అఖిల్ అక్కినేని ఖాతాలో హిట్ పడింది. ఆయన హీరోగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరి దర్శకత్వం వహించిన ఈ రూరల్ యాక్షన్ డ్రామా జులై 10న విడుదలై తొలి రోజే పాజిటివ్ టాక్ సంపాదించుకుంది. దీంతో తొలి రోజు ఈ చిత్రం ప్రపంచ వ్యాప్తంగా రూ.16.7 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్స్ రాబట్టింది. ఈ విషయాన్ని మేకర్స్ అధికారికంగా ప్రకటించండంతో, తమ హీరోకి హిట్ పడిదంటూ అక్కినేని అభిమానులు ఫుల్ ఖుషీ అవుతున్నారు. ఈ చిత్రంలో అఖిల్ ఊరమాస్ లుక్‌లో కనిపించాడు. చిత్తూరు యాసతో ఆయన చెప్పిన డైలాగులు..ప్రేక్షకులను ఈళలు వేయిస్తున్నాయి. అఖిల్‌కి జోడీగా భాగ్యశ్రీ నటించింది. సితార ఎంటర్టైన్మెంట్స్, అన్నపూర్ణ స్టూడియోస్ సంయుక్తంగా నిర్మించిన ఈ చిత్రానికి తమన్ సంగీతం అందించాడు. లెనిన్ కథేంటంటే.. చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అంటే 1976లో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు. ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి అంతా అనుకున్నట్లే జరిగిందా లేదా? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.AKHIL 2.0 is here... and the box office has heard it loud and clear 🔥🔥🔥A phenomenal 16.7 CR+ Worldwide Gross on Day 1 for #LENIN 💥💥💥The Telugu audience has once again celebrated good cinema in the grandest way possible 🫶🏻🫶🏻#BlockbusterLENIN 🌋 @AkhilAkkineni8… pic.twitter.com/UOKexRK2CA— Annapurna Studios (@AnnapurnaStdios) July 11, 2026 -
చివరి సినిమా కూడా ఇక్కడే.. కన్నీళ్లు పెట్టుకున్న భాగ్యశ్రీ
‘లెనిన్’తో సూపర్ హిట్‌ని తన ఖాతాలో వేసుకుంది హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ఈ చిత్రంలో ఆమె భారతి అనే పాత్రను పోషించింది. జులై 10న ఈ చిత్రం విడుదల కాగా.. తొలి రోజు హిట్ టాక్ వచ్చింది. అఖిల్‌తో పాటు భాగ్యశ్రీ నటనపై కూడా ప్రశంసలు కురిపిస్తున్నారు. అందరి కృషి వల్లే ఈ సినిమా విజయం సాధించిందన్నారు భాగ్యశ్రీ. తాజాగా ఈ సినిమా టీమ్ సక్సెస్‌లో మీట్ నిర్వహించింది. ఈ సందర్భంగా భాగ్యశ్రీ మాట్లాడుతూ.. అభిమానుల ప్రోత్సాహం వల్లే ఈ స్థాయిలో ఉన్నానని చెప్పింది. ‘లెనిన్’టీమ్‌తో ఏడాదిన్నర పాటు జర్నీ చేశాను. ప్రతి ఒక్కరు నన్ను ఎంతో ఎంకరేజ్ చేశారు. మీ(ఫ్యాన్స్) వల్లే నేను ఇక్కడ ఉన్నాను’ అంటూ భాగ్యశ్రీ కన్నీళ్లు పెట్టుకుంది. హైదరాబాద్ తన కర్మభూమి అని.. తన చివరి సినిమా కూడా తెలుగులోనే చేయాలాని కోరుకుంటున్నానని చెప్పింది. Bhagyashri ఎమోషనల్ అయిపోయింది.సోషల్ మీడియాలో చాలా Casual గా మాటలు అనేస్తారు But it will cause deep mental agony. Be considerate! #Lenin pic.twitter.com/lOHJFY38Ai— Journalist Nishant (@NishantOpinions) July 11, 2026 -
లెనిన్ సినిమాపై షాకింగ్ రివ్యూ
-
హిట్ కొట్టేశాం నాన్న.. తండ్రిని పట్టుకుని ఏడ్చేసిన అఖిల్
-
లెనిన్ మూవీ రివ్యూ.. సినిమా హిట్టా పట్టా?
-
లెనిన్ మూవీ పబ్లిక్ టాక్.. ఒక్క ముక్కలో తేల్చేశారుగా!
-
అఖిల్ 'లెనిన్' సినిమా రివ్యూ
అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన అఖిల్.. హీరోగా చాలా ప్రయత్నాలు చేశాడు గానీ సరైన హిట్ కొట్టలేకపోయాడు. 'ఏజెంట్' డిజాస్టర్ దెబ్బకు మూడేళ్ల గ్యాప్ తీసుకుని 'లెనిన్' సినిమా తీశాడు. గత కొన్నిరోజుల నుంచి ప్రమోషన్స్‌తో దీనిపై బజ్ క్రియేట్ అయింది. అలా ఇప్పుడు(జూలై 10) థియేటర్లలోకి వచ్చేసింది. ఇంతకీ మూవీ ఎలా ఉంది? అఖిల్ హిట్ కొట్టాడా లేదా? అనేది రివ్యూలో చూద్దాం.కథేంటి?చిత్తూరు జిల్లాలోని శ్రీరామాపురం అనే ఊరిలో ప్రతి ఏటా ద్రౌపది అమ్మ గుడిలో పద్దెనిమిదిరోజుల జాతర జరుగుతుంది. అనాథ అయిన లెనిన్ (అఖిల్) చిన్నతనంలో అంటే 1976లో అక్కడికి వస్తాడు. ఓ సందర్భంలో జయంతి(ఈశ్వరీరావు) ఇతడి గురించి కనుక్కొని అనాథ అని తెలిసి తన ఇంటికి తీసుకెళ్తుంది. తన కన్న కొడుకు వసంత్ (ప్రమోద్)తో పాటే పెంచి పెద్దచేస్తుంది. వసంత్ మద్రాసులో చదువుకొని డాక్టర్ అయి ఊరికి తిరిగొస్తాడు. లెనిన్ మాత్రం చదువుకోకుండా ఊరిలో ఉండిపోతాడు. ఓ ఏడాది జాతర టైంలో భారతి(భాగ్యశ్రీ బోర్సే)ని చూసి లెనిన్ ప్రేమలో పడతాడు. ఆమె కూడా లెనిన్ని ఇష్టపడుతుంది. కానీ కొన్ని పరిస్థితుల కారణంగా భారతిని వసంత్‌కి ఇచ్చి పెళ్లి చేయాలని పెద్దలు నిశ్చయిస్తారు. మరి అంతా అనుకున్నట్లే జరిగిందా లేదా? ఈ కథలో యతిరాజులు (శివాజీ), దామోదర్ (బ్రహ్మాజీ), పార్థసారథి(సునీల్) ఎవరు? ఈ మహాభారతంలో అసలు విలన్స్ ఎవరు? లెనిన్ చివరకు ఏమయ్యాడు? అనేది మిగతా స్టోరీ.ఎలా ఉందంటే?అఖిల్ 2015లో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఈ 11 ఏళ్లలో ఐదు సినిమాలు చేశాడు. వీటిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఓ మాదిరిగా ఆకట్టుకోగా, మిగిలినవన్నీ దారుణంగా ఫెయిలయ్యాయి. దీంతో అఖిల్ మూవీ వస్తుందంటే చాలు.. ఈసారైనా హిట్ కొడితే బాగుండు అని అభిమానులు అనుకుంటారు. మరి 'లెనిన్'తో సక్సెస్ అందుకున్నాడా అంటే అందుకున్నాడు!'లెనిన్' గురించి సింపుల్‌గా చెప్పుకోవాలంటే పక్కా కమర్షియల్ టెంప్లేట్లో సాగిన సినిమా. సాంగ్స్, ఫైట్స్, ఎమోషన్స్ అన్నీ ఉన్నాయి. కొన్ని షాకింగ్ ట్విస్టులు కూడా ఉన్నాయి. హీరో పక్కన ఉండే పాత్రల్లో కాస్త పేరున్న నటీనటుల్ని పెట్టారంటే వీళ్లతో ఏదో ట్విస్ట్ ప్లాన్ చేశారని ముందు నుంచి అనిపిస్తుంది. అందుకు తగ్గట్లే ట్విస్టులు ఉంటాయి. కాకపోతే ఆయా పాత్రలు, సదరు ట్విస్టుల వెనుకున్న రీజన్స్ మరీ వావ్ అనిపించకపోయినా పర్లేదనిపిస్తాయి.మూవీ మొదలైన తొలి గంట వరకు ఇదివరకే ఎన్నో సినిమాల్లో చూసేసిన సీన్లు మళ్లీ చూస్తున్నట్లు అనిపిస్తుంది. జైలు నుంచి హీరో విడుదలవడం, ఓ వ్యక్తితో తన కథంతా చెప్పడం, కట్ చేస్తే ఫ్లాష్ బ్యాక్.. హీరో ఒరిజినల్ ఎంట్రీ, ఆపై పాట, హీరోయిన్‌తో ప్రేమలో పడటం, ఓ రెండు డ్యూయెట్స్.. ఇలా అంతా రొటీన్‌గా సాగుతుంది. కానీ ఆ తర్వాత ట్విస్టులు మొదలవుతాయి. అక్కడి నుంచి మధ్యమధ్యలో కాస్త మూవీ డౌన్ అయినప్పటికీ చివరకు హీరో, విలన్ని చంపే సీన్‌తో సినిమా ముగుస్తుంది.ఈ సినిమాని మహాభారతంలోని రిఫరెన్స్‌లు చూపించిన తీరు, వాటిని ఎలివేషన్స్ కోసం ఉపయోగించుకోవడం బాగానే ఉంది. లెనిన్ ఒక్కడినే మూవీ అంతా చూపించాలని కాకుండా వసంత్, జయంతి, భారతి, యతిరాజులు పాత్రలని కూడా కథక తగ్గట్లు ఉపయోగించుకున్న తీరు కమర్షియల్‌గా వర్కౌట్ అయింది. 'కూతురు కనిపించకపోతే కూతుర్ని వెతకాలి గానీ మీరు పరువుని వెతుక్కున్నారు నాన్న', 'లెనిన్ నా గుండెల్లో ఉన్నాడు అయినా సరే నువ్వు నా గుండెల మీద పడుకుంటానంటే చెప్పు' లాంటి డైలాగ్స్ సరిగ్గా పడ్డాయి.లెనిన్ అసలు జైలుకి ఎందుకు వెళ్లాడు? అనే పాయింట్ మాత్రం సరిగా ఎష్టాబ్లిష్ చేయలేదు. అప్పటివరకు తన చుట్టూరా మందితో బలంగా కనిపించిన విలన్.. హీరో వేసిన ఒక్క దెబ్బకే చనిపోవడం కూడా ఏదో కృతకంగా అనిపించింది. కనీసం ఇద్దరి మధ్య కాస్త ఫైట్ లాంటిది నడిపించకుండానే చంపేయడం సింపుల్‌గా అనిపించింది. తల, కాలు నరికేయడం లాంటి సీన్స్ సున్నిత మనస్కులకు ఇబ్బంది పెట్టొచ్చు.ఎవరెలా చేశారు?ఇప్పటివరకు అఖిల్ యాక్టింగ్ విషయంలో చాలా కంప్లైంట్స్ ఉన్నాయి. 'లెనిన్'తో వాటిని చాలావరకు అధిగమించాడని చెప్పొచ్చు. ఫైట్స్, ఎమోషన్స్ పరంగా ఇంప్రూవ్ అయ్యాడు. ఈ సినిమాకే కీలకమైన భారతి పాత్రలో భాగ్యశ్రీ ఆకట్టుకుంది. కానీ ఫస్టాప్‌లో అఖిల్-భాగ్యశ్రీ పాత్రల మధ్య డ్రామా ఇంకాస్త బలంగా చూపించి ఉంటే చివరలో ఎమోషన్స్ ఇంకా బాగా వర్కౌట్ అయ్యేదేమో అనిపించింది. మిగతా వాళ్లలో ఈశ్వరీరావు చేసిన జయంతి పాత్ర బాగుంది. వసంత్‌గా చేసిన ప్రమోద్, యతిరాజులుగా చేసిన శివాజీ కూడా తమ పాత్ర వరకు న్యాయం చేశారు. మిగతా నటీనటులు ఓకే.టెక్నికల్ విషయాలకొస్తే విజువల్స్ రిచ్‌గా ఉన్నాయి. కాకపోతే చాలావరకు సెట్స్ అని తెలిసిపోతోంది. ఇవి కాస్త నేచురల్‌గా ఉండాల్సింది. తమన్ గురించి తెలిసిందేగా. తనకు అలవాటైన రీతిలో డ్రమ్స్ వాయించాడు. పాటలు పెద్దగా గుర్తుపెట్టుకునేలా ఉండవు గానీ బ్యాక్ గ్రౌండ్ మాత్రం చెవుల్ని హోరెత్తించింది. డైరెక్టర్ కమ్ రైటర్ మురళీ కిశోర్ అబ్బూరు ఈ మూవీతో కమర్షియల్‌గా ఏమేం చేయాలో అన్నీ చేశాడు. ఇక హిట్ అవుతుందా లేదా అనేది ప్రేక్షకులు నిర్ణయిస్తారు.- చందు డొంకాన (ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ) -
అఖిల్ 'లెనిన్' ట్విటర్ రివ్యూ
దాదాపు మూడేళ్ల గ్యాప్ తర్వాత అక్కినేని అఖిల్ చేసిన సినిమా 'లెనిన్'. దాదాపు 11 ఏళ్లుగా పలు మూవీస్ చేసినప్పటికీ సక్సెస్ అనేది అఖిల్‌కి అందలేదు. చివరగా వచ్చిన 'ఏజెంట్' డిజాస్టర్ కావడంతో కాస్త శ్రద్ధ తీసుకుని 'లెనిన్' చేసినట్లు టీమ్ అంతా చెబుతూ వచ్చారు. ఇప్పుడిది థియేటర్లలో రిలీజైపోయింది. మరి చూసిన ప్రేక్షకులు ఏమంటున్నారు?తెలుగు రాష్ట్రాల్లో ఉదయం 5 గంటలకు షోలు పడ్డాయి. ఓవర్సీస్లో అంతకు కాసేపటి ముందు షోలు పడ్డాయి. అయితే సోషల్ మీడియాలో ప్రస్తుతం భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఫస్టాప్ ఎంగేజింగ్‌గా ఉందని అంటున్నారు. లవ్ స్టోరీ ఓకే ఓకే అనిపించినప్పటికీ మహాభారతం రిఫరెన్స్‌లు వర్కౌట్ అయ్యాయని అంటున్నారు. అఖిల్ కూడా గతంతో పోలిస్తే చాలా మెరుగయ్యాడని, ఇంటర్వెల్ కూడా బాగుందని అంటున్నారు. ఓవరాల్‌గా ఇదో రెగ్యులర్ కమర్షియల్ మూవీలానే ఉందని, కొన్ని ట్విస్టులు ఆకట్టుకున్నాయని చెబుతున్నారు.(ఇదీ చదవండి: 'ఐ, నోబడీ' మూవీ రివ్యూ)#Lenin First Half : Decent!!The pre-interval to interval block is handled well. Despite a few flaws, the narration remains gripping for the most part.Undoubtedly, #AkhilAkkineni delivers the best performance of his career by a mile. #BhagyashriBorse shines, and Thaman’s…— cinee worldd (@Cinee_Worldd) July 10, 2026#LeninNarration is gripping throughout the first half. Great vision for blending Mahabharatam references into storyAkhil looks completely rooted in this role. Good interval episode. Excited for the second half 🙌🏻🙌🏻🔥🔥pic.twitter.com/yfZKCImm2N— Chimtu (@AkkineniCults) July 9, 2026Akhil babu comeback 🔥🔥#Lenin pic.twitter.com/jYdxHlKCCt— అభి (@Abhiiitweets) July 10, 2026Decent first half.. Akhil seems very much improved, he’s too good in this so far. His pairing with Bhagyashri worked very well #Lenin https://t.co/8aFZn4jMWh— Sai Kiran (@saikirantweetz) July 10, 2026#Lenin Template Commercial Film with a Few Interesting Twists!Decent intro with a setup drawing parallels to the Mahabharatham. However, the film soon turns flat with an ineffective love story and tried and tested commercial beats. The film picks up from the pre-interval, and…— Venky Reviews (@venkyreviews) July 10, 2026 -
నువ్వు అఖిల్ అయితే నేను నాగార్జున.. హీరోకి షాకిచ్చిన అపరిచితుడు
అఖిల్ అక్కినేని హీరోగా నటించిన ‘లెనిన్’ సినిమా జూలై 10న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. నేడు (శుక్రవారం) తెల్లవారుజామున 5 గంటల షోతో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ చిత్రానికి యూఎస్ ప్రీమియర్స్ ముందుగానే ప్రారంభం కానున్నాయి. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా అఖిల్, గెటప్ శ్రీనుతో కలిసి చేసిన ఓ ఇంటర్వ్యూ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. టీ తాగుతూ, మస్క్ బన్ తింటూ ఇద్దరూ సరదాగా ముచ్చటిస్తూ ఈ ఇంటర్వ్యూలో ఓ అపరిచితుడికి ప్రాంక్ కాల్ చేశారు. ఆ ప్రాంక్ కాల్లో.. అఖిల్ నేను అఖిల్ అక్కినేనిని మాట్లాడుతున్నానని చెప్పగా, దానికి అవతలి వ్యక్తి వెంటనే నేను నాగార్జునను మాట్లాడుతున్నానంటూ కౌంటర్ ఇచ్చాడు. అఖిల్ నిజంగానే తనతో మాట్లాడుతున్నాడని చెప్పినా కూడా ఆ వ్యక్తి నమ్మకుండా నాగ చైతన్య ఇప్పుడు ఎలా ఉన్నాడో చెప్పు అంటూ మరింత సెటైర్ చేశాడు. అంతేకాక, ఆ వ్యక్తి అక్కినేని నాగేశ్వరరావు వాయిస్‌ను మిమిక్రీ చేస్తూ “నా మనవడి వాయిస్ నేను గుర్తుపట్టలేను అనుకుంటున్నావా నాన్నా అఖిల్” అని మరో పంచ్ వేశాడు. అనంతరం అఖిల్ పక్కనే ఉన్న గెటప్ శ్రీను ఫోన్ అందుకుని నేను గెటప్ శ్రీను అన్నా అని చెప్పగా, ఆ వ్యక్తి వెంటనే నేను సుధీర్.. ఏంటో చెప్పండి అంటూ మరోసారి సెటైర్ చేశాడు. ఎంత చెప్పినా అతడు నమ్మకపోవడంతో అఖిల్, శ్రీను నవ్వుకుంటూ కాల్ కట్ చేశారు. కొద్దిసేపటికి ఆ వ్యక్తి తిరిగి కాల్ చేసి ఎవరు మీరు? ఎందుకు ఫోన్ చేశారు? అని అడగడం వీడియోలో కనిపించింది. ఈ సరదా ప్రాంక్ వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తోన్న సినిమా ఇదే కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. ఈ చిత్రంలో అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించింది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. -
సమంతకు అఖిల్ ఎఫెక్ట్.. ఆ రికార్డ్ కష్టమేనా?
అక్కినేని హీరో అఖిల్ నటించిన లేటేస్ట్ యాక్షన్ థ్రిల్లర్ లెనిన్. మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా జూలై 10న థియేటర్లలో సందడి చేయనుంది. ఈ మూవీ కోసం టాలీవుడ్ ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మూడేళ్ల గ్యాప్ తర్వాత అఖిల్ నుంచి వస్తోన్నసినిమా కావడంతో భారీగా అంచనాలు ఏర్పడ్డాయి.అయితే గత నెల రిలీజై సక్సెస్‌ఫుల్‌గా బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తోన్న చిత్రం మా ఇంటి బంగారం. ఈ మూవీ వంద కోట్ల వసూళ్లకు చేరువలో ఉంది. సమంత లీడ్ రోల్లో వచ్చిన ఈ మూవీ కేవలం మౌత్ టాక్‌తో ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా రూ.95 కోట్ల గ్రాస్ వసూళ్లను సాధించింది. మరో రూ.5 కోట్లు సాధిస్తే వందకోట్లు రాబట్టిన తొలి లేడీ ఓరియంటెడ్ మూవీగా ఘనత దక్కనుంది.సమంతకు లెనిన్ ఎఫెక్ట్..వందకోట్ల దిశగా దూసుకెళ్తోన్న మా ఇంటి బంగారానికి అఖిల్ లెనిన్ మూవీ ప్రభావం పడేలా కనిపిస్తోంది. ఈ శుక్రవారం లెనిన్ బాక్సాఫీస్ వద్ద సందడి చేయనున్న వేళ.. సమంత మూవీ వసూళ్లు వందకోట్లు దాటడం కష్టమేననిపిస్తోంది. లెనిన్ చిత్రం టాక్ ఆధారంగా మా ఇంటి బంగారం కలెక్షన్స్‌పై ప్రభావం పడే అవకాశముంది. మరోవైపు వీకెండ్ సామ్‌కు కలిసొస్తే వంద కోట్లు కొల్లగొట్టడం పెద్ద కష్టమేమి కాకపోవచ్చు. మరి బాక్సాఫీస్ రేసును తట్టుకుని సమంత సినిమా 100 కోట్ల క్లబ్లో అడుగుపెడుతుందో లేదో వేచి చూడాల్సిందే. -
నాన్న కోసం మనం... కొడుకు కోసం లెనిన్
‘‘నేను ఎక్కువగా ప్రమోషనల్ కార్యక్రమాల్లో పాలు పంచుకున్నది ‘మనం’ చిత్రం కోసమే. అది నాన్నగారి కోసం (అక్కినేని నాగేశ్వరరావు) చేశాను. ఇప్పుడు నా కొడుకు అఖిల్ కోసం ‘లెనిన్’కి చేస్తున్నాను. ఏ తండ్రి అయినా కొడుకు విజయం సాధించాలని కోరుకుంటాడు. కొడుకు సక్సెస్ అయితే తండ్రి సంతోషిస్తాడు. ప్రేమతో, ఇష్టంతో చేసిన ‘లెనిన్’ సినిమాకి ఆడియన్స్ కూడా అదే ప్రేమను తిరిగి ఇస్తారని ఆశిస్తున్నాను’’ అని నాగార్జున అక్కినేని తెలిపారు. అక్కినేని అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటించిన చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా రేపు (శుక్రవారం) రిలీజ్ కానుంది. బుధవారం నిర్వహించిన ప్రీ రిలీజ్ ప్రెస్మీట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘నందు (మురళీ కిషోర్) ఈ కథను అద్భుతంగా రాశారు. ‘లెనిన్’ కథలో ఉండే పెయిన్‌ని తన జీవితంలోనూ ఎదుర్కొన్నాడు అఖిల్. నేను ఈ సినిమాలోకి నిర్మాతగా ఎంట్రీ ఇచ్చాక కథ విషయంలోనూ ఎక్కువగా కల్పించుకున్నాను. మేం తీసిన సినిమా ముందు మాకు నచ్చాలి. ఓటీటీల కోసం ఈ చిత్రాన్ని చేయలేదు. అందుకే మాకు సంతృప్తి అనిపించేంత వరకూ విడుదల కోసం ఆగాం. సినిమా చూసిన నమ్మకంతో చెబుతున్నా... జూలై 10న వస్తున్నాం... కొడుతున్నాం... మనోడు కొడుతున్నాడు’’ అని పేర్కొన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘మన మూలాలకు, తెలుగు ప్రేక్షకుల మూలాలకు దగ్గరగా ఉండేలా ‘లెనిన్’ కథ ఉంటుంది. ఈ మూవీ కోసం మేం నిజాయితీగా కష్టపడ్డాం’’ అని చె΄్పారు. ‘‘లెనిన్’లాంటి మంచి సినిమా చేశామని గర్వంగా చెప్పగలను’’ అన్నారు సూర్యదేవర నాగవంశీ. మురళీ కిషోర్ అబ్బూరు మాట్లాడుతూ– ‘‘అఖిల్గారు తొలిసారి విలేజ్ కుర్రాడి పాత్రను పోషించిన సినిమా ఇది’’ అని పేర్కొన్నారు. ‘‘లెనిన్’లో నేను చేసిన భారతి పాత్ర నా మనసుకు ఎంతో దగ్గరైంది’’ అన్నారు భాగ్యశ్రీ బోర్సే. మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడారు. -
అక్కినేని హీరోకి అగ్నిపరీక్ష.. 11 ఏళ్లుగా వెయిటింగ్
కమర్షియల్ హీరోగా గుర్తింపు తెచ్చుకోవాలంటే ఏం కావాలి? ఈ ప్రశ్నకు సమాధానం చాలా సింపుల్. డ్యాన్స్, యాక్షన్, ఎమోషన్ పండించగలిగితే చాలు. కొందరు హీరోలకు ఈ ఇమేజ్ సంపాదించడానికి ఏళ్లు పడుతుంది. మరికొందరికి హీరోగా ఎంట్రీ ఇవ్వకముందే సదరు ఇమేజ్ వచ్చేస్తుంది. అలాంటి వాళ్లలో అక్కినేని అఖిల్ ఒకడు. తాత, తండ్రి, సోదరుడు హీరోలు. ఎన్నో ఏళ్లుగా ఇండస్ట్రీలో ఉన్న ఫ్యామిలీ. కానీ అఖిల్ సినీ జాతకంలో హిట్ అనే లోటు ఉండిపోయింది. మరి అఖిల్ 'లెనిన్'తో హిట్ కొడతాడా? అసలు ఈ మూవీ ఎందుకంత కీలకం?(ఇదీ చదవండి: ఓటీటీలో సైకలాజికల్ డార్క్ కామెడీ సినిమా.. తెలుగు రివ్యూ)2015లో హీరోగా పరిచయమైన అఖిల్.. అంతకు ముందు అంటే చిన్నప్పుడే 'సిసింద్రీ'లో నటించాడు. బుడిబుడి అడుగులు వేసే వయసులోనే ఇండస్ట్రీకి వచ్చేశాడు. పెరిగి పెద్దయిన తర్వాత అక్కినేని ఫ్యామిలీ చిత్రం 'మనం'లో అతిథి పాత్రలో కనిపించాడు. కుర్రాడికి మంచి స్క్రీన్ ప్రెజెన్స్ ఉందని అందరితో అనిపించుకున్నాడు. అలా 2015లో 'అఖిల్' మూవీతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. విడుదలకు ముందు ప్రమోషనల్ కంటెంట్ చూసి హిట్ లాంఛనమే అని అంతా అనుకున్నారు. కానీ అలా అస్సలు జరగలేదు.2015లో 'అఖిల్' వచ్చింది. తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ ఇలా వరసగా మూవీస్ అయితే వచ్చాయి గానీ హిట్ హీరో అని మాత్రం అఖిల్ అనిపించుకోలేకపోయాడు. హలో, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ చిత్రాలు బాక్సాఫీస్ దగ్గర ఓకే అనిపించుకున్నాయంతే. దీంతో హీరో అయ్యి పదకొండు సంవత్సరాలు గడిచినా అఖిల్ గురించి ఇప్పటికీ ఒకే మాట వినిపిస్తుంది. 'అతనిలో టాలెంట్ ఉంది కానీ దాన్ని నిరూపించే సినిమా మాత్రం ఇంకా రాలేదు' అని.అయితే అసలు సమస్య అఖిల్ చేసే సినిమాల స్క్రిప్ట్లదా? ప్రేక్షకులతో కనెక్షన్ ఏర్పడకపోవడమా? లేదంటే ప్రతి సినిమాతో కొత్త ఇమేజ్ కోసం ప్రయత్నిస్తూ తనకంటూ ఒక ప్రత్యేకమైన స్క్రీన్ ఐడెంటిటీని నిర్మించుకోలేకపోవడమా? అనేది అర్థం కాని ప్రశ్న. మరి ఈ శుక్రవారం(జూలై 09) విడుదలయ్యే 'లెనిన్'తో ఈ ప్రశ్నలకు సమాధానం దొరుకుతుందా అనేది చూడాలి? ఎందుకంటే ఈ మూవీ సక్సెస్ అఖిల్‌కి చాలా అంటే చాలా ముఖ్యం.(ఇదీ చదవండి: మళ్లీ పెళ్లి చేసుకున్న హీరోయిన్ 'కలర్స్' స్వాతి.. ఫొటోలు వైరల్)చాలామంది హీరోలు కెరీర్ ప్రారంభంలో ఒకే తరహా ఇమేజ్‌ని ఏర్పరుచుకుంటారు. అఖిల్ మాత్రం ప్రతి సినిమాతో కొత్త రూపంలో కనిపించేందుకు ప్రయత్నించాడు. అవే మైనస్‌లు అయ్యాయా అనిపిస్తుంది. ఎందుకంటే రకరకాల జానర్లు ట్రై చేశాడు కానీ వాటి కథాకథనాలు బలహీనంగా ఉండేసరికి మూవీస్ ఆకట్టుకోలేకపోయాయి. దీంతో అఖిల్ ఫ్లాప్ హీరోగా మిగిలిపోయాడు.మూడేళ్ల క్రితం అంటే 2023లో విడుదలైన 'ఏజెంట్' కోసం అఖిల్ చాలా కష్టపడ్డాడు. తన రూపాన్ని పూర్తిగా మార్చుకున్నాడు. భారీ బడ్జెట్, అంతర్జాతీయ స్థాయి యాక్షన్, పాన్ ఇండియా ఇమేజ్ టార్గెట్‌తో వచ్చిన ఈ చిత్రం పూర్తిగా తేలిపోయింది. కథ, స్క్రీన్‌ప్లే, యాక్షన్ సన్నివేశాలు, నటన.. దాదాపు ప్రతి అంశంపై విమర్శలు వచ్చాయి. సోషల్ మీడియాలో తీవ్ర ట్రోలింగ్‌కు గురైన ఈ సినిమా చాలా కాలం పాటు ఓటీటీలోకి కూడా రాలేదు. దీంతో అఖిల్ కూడా లాంగ్ గ్యాప్ తీసుకుని 'లెనిన్' చేశాడు. ప్రస్తుత ట్రెండ్‌కి తగ్గట్లు విలేజ్ బ్యాక్ డ్రాప్ తీసుకున్నాడు. యాక్షన్ ఉన్నప్పటికీ ట్విస్టులు, ఎమోషన్స్‌కి కూడా చోటిచ్చినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.ప్రస్తుతానికైతే అన్ని ఎలిమెంట్స్ అఖిల్‌కి పాజిటివ్‌గానే కనిపిస్తున్నాయి. ఇక హిట్ మాత్రమే బ్యాలెన్స్ ఉంది. ఒకవేళ 'లెనిన్' ప్రేక్షకులను మెప్పిస్తే, అది అఖిల్‌కు హిట్ ఇవ్వడమే కాదు. గత 11 ఏళ్లుగా వెతుకుతున్న ఒక స్పష్టమైన స్క్రీన్ ఐడెంటిటీని కూడా అందించగల సినిమా అవుతుంది. మరి ఏం జరుగుతుందో చూడాలి?(ఇదీ చదవండి: సినిమా సూపర్ హిట్.. డైరెక్టర్‌కి కాస్ట్లీ కారు గిఫ్ట్) -
'లెనిన్' సినిమా ప్రీ రిలీజ్ ప్రెస్‌మీట్ (ఫొటోలు)
-
అక్కినేని అఖిల్ లెనిన్.. రిలీజ్‌కు ముందే రికార్డ్
అఖిల్ అక్కినేని హీరోగా వస్తోన్న యాక్షన్ చిత్రం లెనిన్. రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో ఈ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా కనిపించనుంది. ఈ మూవీకి మురళి కిశోర్ అబ్బూరి దర్శకత్వం వహించారు. ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ కాగా.. అక్కినేని అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.ఈ సినిమా రిలీజ్ కేవలం మూడు రోజుల సమయ మాత్రమే మిగిలింది. ఇప్పటికే లెనిన్ మూవీ నాన్ థియేట్రికల్ బిజినెస్‌పరంగా కళ్లు చెదిరే ధరను సొంతం చేసుకుంది. ఈ మూవీ కోసం జీ నెట్వర్క్ డిజిటల్, శాటిలైట్ హక్కుల్ని రూ.19 కోట్లకు దక్కించుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా హిందీ వర్షన్‌కు ఏకంగా రూ.9 కోట్లకు అమ్ముడైనట్లు సమాచారం. ఇవీ కాకుండా ఆడియో రైట్స్ కోసం టీ సిరీస్ మరో రూ.6 కోట్లు ఇవ్వనున్నారని తెలుస్తోంది. దీంతో రిలీజ్‌కు ముందే లెనిన్ ఏకంగా రూ.34 కోట్ల వసూళ్లు సాధించినట్లే. ఈ లెక్కన చూస్తే నాన్ థియేట్రికల్ రూపంలో ఊహించని ధరలను సొంతం చేసుకుంది. ఇప్పుడు మార్కెట్ ప్రకారం మిడ్ రేంజ్ సినిమాలకు ఓటీటీలు అమ్మడమే కష్టమైన దశలో లెనిన్ భారీ ధరకు అమ్ముడు కావడం విశేషం. అయితే ఈ డీల్స్‌పై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కాగా.. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లో నిర్మించారు. -
మర్చిపోలేనంత ప్రేమ
‘లెనిన్ ’కు సపోర్ట్‌గా నిలిచారు హీరో ఎన్టీఆర్. అఖిల్ అక్కినేని హీరోగా నటించిన సినిమా ‘లెనిన్ ’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్ గా నటించారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న రిలీజ్ కానుంది. తాజాగా ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చారు. ‘‘లెనిన్ ’ సినిమా కథ, నేపథ్యం, శ్రీరామపురం గురించి ఎన్టీఆర్ తన గంభీరమైన గాత్రంతో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు. ఈ చిత్రానికి ఆయన వాయిస్ ఓవర్ ప్రధాన ఆకర్షణగా నిలుస్తుంది’’ అని యూనిట్ పేర్కొంది. ‘‘లెనిన్ ’ సినిమా కోసం గర్జించినందుకు థ్యాంక్యూ.. టైగర్. ఎప్పటికీ మర్చిపోలేనంత ప్రేమ ఇచ్చావు. లవ్యూ.. బ్రదర్ (ఎన్టీఆర్‌ను ఉద్దేశించి..)’’ అని ఈ సందర్భంగా ‘ఎక్స్’లో షేర్ చేశారు అఖిల్ అక్కినేని. -
అఖిల్‌పై ఆ భయం ఉండేది.. ‘లెనిన్’ చూసి ఆశ్చర్యపోయా : నాగార్జున
‘‘లెనిన్’ రాయలసీమ కథ. సింపుల్‌గా చెప్పాలంటే సీమలో జరుగుతున్న మహాభారతం. ఈ సినిమాకు ముందు అఖిల్ ఎక్కువగా అర్బన్ ఫిల్మ్స్ చేశాడు. మరి... ఈ సినిమాకి సూట్ అవుతాడా? అని ముందు నాకు భయంగా ఉండేది. కానీ సినిమా చూశాక, నేను కాదు... అందరూ ఆశ్చర్యపోయారు. ‘లెనిన్’ రోల్‌లోకి అఖిల్ వెళ్లిపోయాడు. సినిమా చూసిన తర్వాత లెనిన్ స్నేహాన్ని, ప్రేమను, పగని కూడా ప్రేమిస్తారు. లెనిన్ ను మీరు ఇంటికి తీసుకెళ్లిపోతారు. మీకు అఖిల్ కనపడడు... ‘లెనిన్ ’ కనిపిస్తాడు’’ అని నాగార్జున అన్నారు. అఖిల్, భాగ్యశ్రీ భోర్సే హీరో హీరోయిన్లుగా నటించిన చిత్రం ‘లెనిన్ ’. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మురళీ కిషోర్ అబ్బూరు (నందు) దర్శకత్వంలో అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమా ఈ నెల 10న విడుదల కానుంది. ఆదివారం తిరుపతిలో జరిగిన ‘లెనిన్’ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నాగార్జున మాట్లాడుతూ– ‘‘ప్రేమ కోసం యుద్ధాలు జరిగాయి. ప్రేమకోసం రాజ్యాలు కూలిపోయాయి. ‘లెనిన్’లో కూడా ఒక ప్రేమకథ ఉంది. నందు ఈ సినిమా కథ చెప్పడానికి వచ్చినప్పుడు ఇది శ్రీరామపురంలో జరిగే కథ అన్నాడు. ‘శ్రీరామపురం’ అంటే మా నాన్నగారు పుట్టిన ఊరు (కృష్ణా జిల్లా). అయితే ఈ శ్రీరామపురం చిత్తూరు జిల్లాలో అని చెప్పాడు. కానీ శ్రీరామపురం అంటే నాకో సెంటిమెంట్. దీంతో నందును కథ చెప్పమన్నాను. నందు కథ చెప్పడం మొదలు పెట్టాడు. ఇందులో పాత్రలు డిఫరెంట్‌గా అనిపించాయి. ‘లెనిన్’ సెకండాఫ్‌లోని ట్విస్ట్‌లను ప్రేక్షకులు ఊహించలేరు. మా పార్ట్నర్ నాగవంశీకి ఈ సినిమాపై ఎంత కాన్ఫిడెన్స్ అంటే... ఏపీ అంతా అతనే డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాడు. మన అందరికీ దేవుడు ఆ వెంకటేశ్వరస్వామి. నాన్నగారు ఎప్పుడూ అంటుంటారు ఆయనకు దేవుడు మాత్రం ప్రేక్షక దేవుళ్ళు అని. సో... ఈ ప్రేక్షక దేవుళ్లుకు చెబుతున్నాను. జూలై 10న వస్తున్నాం. మనవాడు కొడుతున్నాడు’’ అని అన్నారు. అఖిల్ మాట్లాడుతూ– ‘‘లెనిన్’ఉద్దేశం ఒకటే. నేను మీ ఇంటివాడినైపోవాలి. మీ సీమ బిడ్డ మురళీకిషోర్ రెండేళ్ల క్రితం ఈ సినిమా కథ చెప్పారు. నేను చేయాలనుకున్న కథ ఇదే అనిపించింది’’ అన్నారు. ‘‘ఈ మూవీలో భారతి అనే పాత్ర చేశాను. ఈ సినిమా నా కెరీర్లో చాలా స్పెషల్’’ అన్నారు భాగ్యశ్రీ బోర్సే. ‘‘నాగేశ్వరరావుగారి మనవడు, నాగార్జునగారి అబ్బాయి అఖిల్ గోల్డెన్ స్పూన్ తో పుట్టాడు. పెద్ద కష్టపడలేడని అంటుంటారు. కానీ సోల్ ఆఫ్ లెనిన్ వచ్చినప్పట్నుంచి ‘అఖిల్ ఫస్ట్ టైమ్ కష్టపడుతున్నట్లు కనిపిస్తుంది కదరా’ అనేవాళ్లు. ఈ అభిప్రాయాన్ని జనాల్లోకి తీసుకుని వెళ్లేందుకు అఖిల్గారు ఎంత కష్టపడ్డారో మేం చూశాం. ఇది రెగ్యులర్ మాస్ మూవీ కాదు. రెండు మూడు చోట్ల ఆడియన్స్ సర్ప్రైజ్ అవుతారు. అలాంటి స్క్రీన్‌ప్లే రాశాడు నందు’’ అన్నారు నాగవంశీ. బ్రహ్మాజీ, సునీల్ మాట్లాడారు. -
లెనిన్ ప్రీ-రిలీజ్ ఈవెంట్.. యాంకర్ సుమకు బ్రహ్మాజీ ఫన్నీ వార్నింగ్
అఖిల్ అక్కినేని, భాగ్యశ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన తాజా చిత్రం ‘లెనిన్’ జూలై 10న ప్రేక్షకుల ముందుకు రానుంది. మనం ఎంటర్ప్రైజెస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించిన ఈ సినిమాకు మురళి కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించారు.తిరుపతిలో ఆదివారం సాయంత్రం జరిగిన గ్రాండ్ ప్రీ-రిలీజ్ ఈవెంట్లో నాగార్జున, అఖిల్, భాగ్యశ్రీ, నాగవంశీ, సునీల్, బ్రహ్మాజీ, శివాజీ తదితరులు పాల్గొన్నారు. హోస్ట్‌గా వ్యవహరించిన యాంకర్ సుమ కనకాల తనదైన శైలిలో సరదా మాటలతో వేదికను కాసేపు నవ్వుల పండుగగా మార్చారు.ఈవెంట్లో సుమ తరచుగా చేసేలా బ్రహ్మాజీపై జోకులు వేస్తూ, ఆయన వయసు గురించి సెటైర్లు వేశారు. బ్రహ్మాజీ తన పాత్ర గురించి మాట్లాడుతూ.. ఈ సినిమాలో కుంటి దామోదరం అనే నెగిటివ్ రోల్ పోషించానని చెప్పారు. స్టేజ్‌పైనే కుంటుకుంటూ తన నటనను ప్రదర్శించారు. దానికి సుమ వావ్.. బ్యూటిఫుల్.. మీరు నటించాల్సిన అవసరం లేదు.. జీవిస్తున్నారంటూ సరదాగా వ్యాఖ్యానించారు. దానికి ప్రతిస్పందనగా బ్రహ్మాజీ స్టేజ్‌పైనే సీరియస్ ఫేస్ పెట్టి, కమ్ టు మై రూమ్ అంటూ సుమ వైపు వేలు చూపించారు. దాంతో ఒక్కసారిగా షాక్ అయిన సుమ వెంటనే అన్నయ్యా.. అంటూ కవర్ చేశారు. తన ఉద్దేశ్యం అది కాదని ప్రభాస్ పాపులర్ మీమ్‌ను గుర్తు చేశారు. 'ఆదిపురుష్' సినిమా టైంలో కమ్ టు మై రూమ్ అంటూ రెబల్ స్టార్ ప్రభాస్ ఆ చిత్ర దర్శకుడు ఓం రౌత్‌ను పిలవడం అప్పట్లో వైరల్ అయిన సంగతి తెలిసిందే. అదే డైలాగ్‌ను ఇప్పుడు బ్రహ్మాజీ సరదాగా సుమపై వాడటంతో ఈవెంట్లో నవ్వులు పూశాయి. -
సమంతకు కంగ్రాట్స్.. ట్రైలర్ చూసి ఫిక్సయ్యా: అఖిల్
నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని లేటేస్ట్ మూవీ లెనిన్ రిలీజ్‌కు అంతా సిద్ధమైంది. ఇటీవలే ట్రైలర్ రిలీజ్ చేయగా ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ సొంతం చేసుకుంది. యూట్యూబ్‌లో రిలీజైన కొద్ది గంటల్లోనే మిలియన్లకు పైగా వ్యూస్‌తో దూసుకెళ్లింది. ఈ మూవీని రాయలసీమ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ స్టోరీగా తెరకెక్కించినట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది.ప్రస్తుతం ఈ మూవీ ప్రమోషన్లతో అఖిల్ బిజీగా ఉన్నారు. వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతూ ఆసక్తికర విషయాలు పంచుకుంటున్నారు. తాజా ఇంటర్వ్యూలో సమంత లీడ్ రోల్లో వచ్చిన మా ఇంటి బంగారం మూవీ గురించి మాట్లాడారు. ఈ మూవీ హిట్ కావడంపై సమంతకు విషెస్ తెలిపారు. సినిమా చాలా కొత్త కాన్సెప్ట్‌తో వచ్చిందన్నారు.అఖిల్ మాట్లాడుతూ..' నేను ఇంకా మా ఇంటి బంగారం చూడలేదు. కానీ ట్రైలర్ చూడగానే చాలా నచ్చింది. ట్రైలర్ చూశాక కచ్చితంగా హిట్ అవుతుందని అనిపించింది. ఓ మంచి కుటుంబం ఉండే ఇంటికి కోడలిగా వెళ్లి.. వాళ్లందరితో బంగారం అనిపించుకోవాలనే పాయింట్ బాగా నచ్చింది. సమంత పవర్ఫుల్ యాక్షన్ చూపించడం చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. ముఖ్యంగా ఒక మహిళ ఆ స్థాయి యాక్షన్ సీన్స్ చేయించడం నిజంగా అద్భుతం. సమంత చాలా బాగా నటించారు. కంగ్రాట్స్ అంటూ సమంతతో పాటు చిత్రబృందానికి అభినందనలు' తెలిపారు. -
బాత్రూంలో జారి పడ్డా.. 48 కుట్లు పడ్డాయి : అఖిల్ అక్కినేని
‘ఏజెంట్’ సినిమా తర్వాత అఖిల్ అక్కినేని మూడేళ్ల గ్యాప్ తీసుకొని ఇప్పుడు ‘లెనిన్’తో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అయితే అంత గ్యాప్ ఎందుకు తీసుకోవాల్సి వచ్చిందో తాజాగా ఆయన వివరించారు. లెనిల్ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా తాజాగా ఆయన ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ.. ‘ఏజెంట్ తర్వాత వరసగా సినిమాలు చేయాల్సింది. కానీ ఆ సినిమా విడుదలైన మూడు నెలలకు ప్రమాదవశాత్తు బాత్రూంలో పడ్డాను. నా చేతికి గాజు ముక్కలు బలంగా గుచ్చుకున్నాయి. దీంతో ఎడమ చేతి వేళ్లకు రెండు శస్త్ర చికిత్సలు జరిగాయి. మొత్తం 48 కుట్లు పడ్డాయి. 16 నెలల పాటు విశ్రాంతి తీసుకోవాల్సి వచ్చింది. అందుకే మూడేళ్ల గ్యాప్ వచ్చింది’ అని అఖిల్ వివరణ ఇచ్చాడు. ఇనేళ్లు గ్యాప్ ఇచ్చినందుకు తన అభిమానులు కోపంగా ఉన్నారని.. మరోసారి అలా జరగదని వాళ్లకు నేను హామీ ఇస్తున్నాను అని అఖిల్ అన్నారు. లెనిన్ విషయానికొస్తే.. మురళీ కిశోర్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటించారు. జులై 10న ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. -
అక్కినేని అఖిల్ ‘లెనిన్’ మూవీ HD స్టిల్స్
-
' శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా?.. లెనిన్ ట్రైలర్ చూశారా?
అక్కినేని నాగార్జున కుమారుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం లెనిన్. ఈ మూవీని మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మించారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా రెండుసార్లు రిలీజ్ వాయిదా పడింది. ఈ మూవీని జూలై 10న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు. ఈ నేపథ్యంలోనే లెనిన్ ట్రైలర్ మేకర్స్ రిలీజ్ చేశారు.ఈ ట్రైలర్‌కు నాగార్జున అక్కినేని వాయిస్ ఓవర్ అందించారు. ట్రైలర్ చూస్తుంటే రూరల్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ డ్రామాగా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ప్రేమకథతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో ఫ్యాక్షన్ అంశాలు కూడా ఈ కథలో ఉన్నట్లు ట్రైలర్ చూస్తే అర్థమవుతోంది. 'కురుక్షేత్రంలో ఆఖరి ఘట్టం విశ్వరూపం' అని సునీల్ చెప్పే డైలాగ్ తెగ ఆకట్టుకుంటోంది. ఈ ట్రైలర్‌లోని ఫైట్స్ చూస్తుంటే రాయలసీమ ఫ్యాక్షన్‌ను తలపిస్తోంది. 'కురుక్షేత్రంలో శ్రీకృష్ణుడు అర్జునుడికి ఏం చెప్పినాడో తెలుసా? యుద్ధం కూడా ప్రశాంతంగా చేయాలని.. ఏంది అట్టనే సేద్దామా' అనే డైలాగ్ ఈ మూవీపై అంచనాలు పెంచేసింది. కాగా.. ఈ సినిమాకు తమన్ సంగీతమందించారు. -
అక్కినేని అఖిల్ 'లెనిన్'.. వయొలెంట్ సాంగ్ వచ్చేసింది
అక్కినేని నాగార్జున తనయుడు తనయుడు అఖిల్, భాగ్యశ్రీ బోర్సే జంటగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో ఈ మూవీని తెరకెక్కించారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించారు. కానీ కుదరకపోవడంతో వాయిదా వేయాల్సి వచ్చింది.ఇప్పటికే రిలీజైన సాంగ్స్‌కు ఆడియన్స్ నుంచి అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. తాజాగా ఈ మూవీ నుంచి మూడో లిరికల్ సాంగ్‌ను విడుదల చేశారు. సోల్ ఆఫ్ లెనిన్ పేరుతో ఈ పాటను రిలీజ్ చేశారు. ఈ సాంగ్ అక్కినేని ఫ్యాన్స్‌ను అలరిస్తోంది. ఈ పాటకు కల్యాణ్ చక్రవర్తి లిరిక్స్ అందించగా.. కుమార వాగ్దేవి, తమన్ ఎస్ పాడారు. ఈ సాంగ్‌ను తమన్ కంపోజ్ చేశారు. ఇప్పటికే షూటింగ్ పూర్తయిన ఈ సినిమా జూన్ 26న థియేటర్లలో సందడి చేయనుంది.No WAR is more VIOLENT than LOVE ❤️🔥#SoulOfLenin is out now▶️ https://t.co/caQUyeFpz1 MANODU VASTHUNNADU 🔥🔥#Lenin #LeninOnJune26th @MusicThaman Musical 🎶 🎤 @ImVagdevi ✍️ #KalyanChakravarthy@AkhilAkkineni8 #BhagyashriBorse @iamnagarjuna @vamsi84 @KishoreAbburu… pic.twitter.com/Cnm7pLzX5U— Sithara Entertainments (@SitharaEnts) June 5, 2026 -
నాగార్జునకు చిన్న కొడుకు సర్ప్రైజ్.. అదేంటో చూసేయండి!
మొదటి అడుగు ఎవరికైనా ప్రత్యేకమే.. కింగ్ నాగార్జున నటించిన మొదటి సినిమా విక్రమ్. ఈ మూవీ విడుదలై నేటి (మే 23)కి 40 ఏళ్లు పూర్తయ్యాయి. ఈ సందర్భంగా తండ్రికి ఓ సర్ప్రైజ్ ఇచ్చాడు చిన్న కుమారుడు, హీరో అఖిల్. అఖిల్ కథానాయకుడిగా నటించిన 'లెనిన్' మూవీ టీజర్ వదిలారు. ఈ విషయాన్ని నాగార్జున సోషల్ మీడియా వేదికగా పంచుకున్నాడు.తండ్రికి సర్ప్రైజ్'నా సినీ జీవితం మొదలైన రోజు అఖిల్ నాకో చిన్న సర్ప్రైజ్ ఇచ్చాడు. చూస్తుంటే చాలా హాయిగా ఉంది. మీరూ చూడండి, మనోడు వస్తున్నాడు' అని రాసుకొచ్చాడు. లెనిన్ టీజర్ విషయానికి వస్తే.. 'ఏమంటివి ఏమంటివి...' అన్న ఎన్టీఆర్ డైలాగ్‌తో వీడియో మొదలైంది. హీరోయిన్ భాగ్యశ్రీ బోర్సే రంగస్థల కళాకారిణిగా ఆ డైలాగ్‌ను స్టేజీపై చెప్తుంది. పల్లె పరిమళంఎన్టీఆర్ అంత కాకపోయినా బానే చెప్పావని మెచ్చుకున్నాడు హీరో అఖిల్. ఇద్దరూ పల్లెటూరి యాసలో డైలాగులు చెప్తూ మెప్పించారు. టీజర్ అయితే అదిరిపోయింది. ఈసారి అఖిల్ చాలా కొత్తగా ట్రై చేశాడని, హిట్టు గ్యారెంటీ అని అభిమానులు అప్పుడే ఫుల్ ఖుషీ అవుతున్నారు. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహించిన ఈ మూవీ జూన్ 26న విడుదల కానుంది. ఈ చిత్రాన్ని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ కలిసి నిర్మించారు. తమన్ సంగీతం అందించాడు. Today, May 23rd నా సిని జీవితం మొదలైన రోజు Akhil నాకో చిన్న surprise ఇచ్చాడు చూస్తుంటే చాలా హాయి గా ఉంది మీరు చూడండి. 👉🏽 https://t.co/QG2BFis2XTమనోడు వస్తున్నాడు…. #ManoduVasthunnadu #LeninOnJune26th— Nagarjuna Akkineni (@iamnagarjuna) May 23, 2026 -
కొత్త అఖిల్‌ని చూడబోతున్నారు
‘‘లెనిన్’ సినిమాలో కొత్త అఖిల్‌ని చూడబోతున్నారు’’ అని పేర్కొన్నారు అక్కినేని నాగార్జున. ఆయన తనయుడు అఖిల్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వంలో అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ మూవీని మే 1న రిలీజ్ చేయనున్నట్లు తొలుత ప్రకటించి, ఆ తర్వాత జూన్ 26కి వాయిదా వేశారు మేకర్స్. అయితే రామ్‌చరణ్ హీరోగా నటిస్తున్న ‘పెద్ది’ కూడా ఏప్రిల్ 30 నుంచి జూన్ 25కి విడుదల వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ‘పెద్ది, లెనిన్’ సినిమాల రిలీజ్‌కి కేవలం ఒక్క రోజు మాత్రమే గ్యాప్ ఉండటంతో ‘లెనిన్’ రిలీజ్ మళ్లీ వాయిదా పడనుందనే వార్తలు హల్చల్ చేస్తున్నాయి. అయితే అలాంటిదేం లేదని, జూన్ 26నే విడుదలవుతుందనీ పుకార్లన్నింటికీ తన పోస్ట్‌తో ఫుల్స్టాప్ పెట్టారు నాగార్జున. ‘‘నిన్న రాత్రి (మంగళవారం) మా ‘లెనిన్’ ఫస్ట్ కట్ చూశాను. నమ్మకంగా, గర్వంగా చెబుతున్నాను. ఈ సినిమాలో కొత్త అఖిల్‌ని చూడబోతున్నారు. 2026 జూన్ 26వ తేదీని గుర్తుపెట్టుకోండి. థియేటర్లలో కలుద్దాం’’ అని బుధవారం ‘ఎక్స్’లో పేర్కొన్నారు నాగార్జున. -
కొత్త అఖిల్‌ని చూస్తారు.. నాగార్జున ఫస్ట్ రివ్యూ
హీరోగా 100వ సినిమా చేస్తున్న నాగార్జున.. మరోవైపు కొడుకు అఖిల్ 'లెనిన్' చిత్ర బాధ్యతలని కూడా చూసుకుంటున్నారు. ఇప్పటికే ఐదు సినిమాలు చేసినప్పటికీ అఖిల్‌కి సక్సెస్ దక్కలేదు. దీంతో ఈసారి అంతా పక్కాగా ఉండేలా చూసుకుని 'లెనిన్' తీశారు. కానీ షూటింగ్ ఆలస్యం, 'పెద్ది' కారణంగా ఇది వాయిదా పడింది. చరణ్ సినిమా మరోసారి వాయిదా పడి జూన్ 25కి షిఫ్ట్ కావడంతో అఖిల్ తప్పుకొంటాడని అనుకున్నారు. కానీ ఇప్పుడా విషయంపైనా క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: విష్ణుప్రియ, అనన్య కాదు ఈమె 'సబ్స్క్రిప్షన్' సంగతి తెలిస్తే..)అఖిల్, భాగ్య శ్రీ బోర్సే హీరోహీరోయిన్లుగా నటించిన 'లెనిన్' మూవీని మే 01న థియేటర్లలోకి తీసుకొస్తామని తొలుత ప్రకటించారు. కానీ షూటింగ్, ఇతరత్రా పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేసుకున్నారు. జూన్ 26న రిలీజ్ చేస్తామని అధికారికంగా అనౌన్స్ చేశారు. కానీ రామ్ చరణ్ 'పెద్ది' కూడా జూన్ 25న వస్తుందనేసరికి అఖిల్ సైడ్ అవుతాడని అనుకున్నారు. కానీ చెప్పిన తేదీకే వస్తున్నారు. ఈ విషయాన్ని నిర్మాతల్లో ఒకరైన నాగార్జున స్పష్టం చేశారు.'నిన్న రాత్రి 'లెనిన్' సినిమా ఫస్ట్ కట్ చూశాను. మీరు కొత్త అఖిల్‌ని చూస్తారని గర్వంతో నమ్మకంగా చెబుతున్నా. డేట్ గుర్తుపెట్టుకోండి జూన్ 26న థియేటర్లలో కలుద్దాం' అని నాగార్జున ట్వీట్ చేశారు. అంటే 'పెద్ది' చిత్రం 25న వస్తుందని తెలిసినా సరే బరిలో ఉన్నారంటే ఈసారి బాక్సాఫీస్ దగ్గర మెగా vs అక్కినేని అనమాట. ఈ రెండు చిత్రాలు కూడా విలేజ్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ నేపథ్య కథతో తీయడం విశేషం. మరి చెప్పిన మాటకు కట్టుబడి ఒకరోజు తేడాతో వస్తారా? లేదంటే 'లెనిన్' వాయిదా బాట పడతాడా అనేది చూడాలి?(ఇదీ చదవండి: హీరో విజయ్‌ని టార్గెట్ చేసి తీసిన సినిమా! ఓటీటీలో స్ట్రీమింగ్) -
హీరో సంచలన నిర్ణయం.. రీషూట్ చేస్తున్న మేకర్స్ ?
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న కొత్త సినిమా ‘లెనిన్’కు విడుదల ముందే కష్టాలు మొదలయ్యాయని తెలుస్తోంది. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా విడుదల విషయంలో ఇప్పటికే ఒక్కసారి వాయిదా పడిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో జూన్ 26న రిలీజ్ చేస్తామని కొత్త తేదీని ప్రకటించారు. అయితే, ఇప్పడు తాజాగా వస్తున్న రూమర్స్ ప్రకారం చూస్తే జూన్‌లో లెనిన్ రావడం కష్టమేనని తెలుస్తోంది.'లెనిన్' మూవీ గురించి ఇండస్ట్రీలో వస్తున్న రూమర్స్ ప్రకారం రీషూట్ చేస్తున్నారని టాక్ వినిపిస్తుంది.. ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే ఏడాదికి పైగా నిర్మాణ దశలోనే ఉంది. అయితే, అఖిల్ కోరికమేరకు కొన్ని సీన్స్ రీషూట్ చేయాలని మేకర్స్ నిర్ణయం తీసుకున్నట్లు ప్రచారం జరుగుతుంది. దీంతో ఈ మూవీ జూన్ 26న విడుదల కావడం కష్టమేనని గుసగుసలు మొదలయ్యాయి.లెనిన్ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, గ్లింప్స్ ప్రేక్షకులను మెప్పించాయి. సినిమాపై భారీగానే బజ్ క్రియేట్ అయింది. ప్రేక్షకుల అంచనాలను లెనిన్ అందుకుంటాడో లేదో కొద్దిరోజుల్లోనే తేలనుంది. అఖిల్ సరసన భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. -
అక్కినేని హీరో సినిమా.. ఎట్టా ఎట్టా అంటోన్న అఖిల్..!
అక్కినేని హీరో అఖిల్ నటిస్తోన్న తాజా చిత్రం ‘లెనిన్’. ఈ మూవీకి మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్గా నటిస్తున్నారు. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ నెల 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్’ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు.తాజాగా ఈ మూవీ నుంచి క్రేజీ సాంగ్‌ను రిలీజ్ చేశారు. ఎట్టా ఎట్టా అంటూ సాగే లిరికల్ వీడియో పాటను విడుదల చేశారు. ఈ పాటకు భాస్కరభట్ల లిరిక్స్ అందించగా.. శ్రీకృష్ణ ఆలపించారు. ఈ సాంగ్ ఎస్ఎస్ తమన్ కంపోజ్ చేశారు. ఈ సినిమా జూన్ 26న ప్రేక్షకుల ముందుకు రానుందని ప్రకటించారు. ఇప్పటికే రిలీజైన ఓ సాంగ్‌కు ఆడియన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. -
భావోద్వేగాల లెనిన్
అఖిల్ అక్కినేని హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెనిన్’. మురళీ కిషోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో భాగ్యశ్రీ బోర్సే కథానాయికగా నటిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్ సమర్పణలో మనం ఎంటర్ప్రైజెస్ ఎల్ఎల్పీ, సితార ఎంటర్టైన్మెంట్స్పై అక్కినేని నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఏప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్భంగా ‘లెనిన్’ నుంచి కొత్త పోస్టర్ని విడుదల చేశారు. ‘‘ఓ డిఫరెంట్ స్టోరీతో ‘లెనిన్’ రూపొందిస్తున్నాం. భావోద్వేగాలతో పాటు ఆకట్టుకునే కథనంతో కంప్లీట్ సినిమాటిక్ ప్యాకేజీగా ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాం. ఈ సినిమాని భారీ స్థాయిలో రూపొందిస్తున్నారు మురళీ కిషోర్ అబ్బూరు. ఇప్పటికే విడుదల చేసిన ఫస్ట్ సింగిల్‌తో మా చిత్రంపై మంచి బజ్ ఏర్పడింది. అక్కినేని అభిమానులకు, సినీ ప్రేక్షకులకు అద్భుతమైన అనుభూతినిచ్చేలా మా మూవీ ఉంటుంది’’ అని చిత్రయూనిట్ పేర్కొంది. జూన్ 26న విడుదల కానున్న ఈ చిత్రానికి సంగీతం: తమన్, కెమెరా: లియోన్ బ్రిట్టో. -
'పెద్ది'కి దారి ఇచ్చేసిన 'లెనిన్'.. కొత్త రిలీజ్ డేట్
అక్కినేని హీరో అఖిల్.. ఎలాగైనా సరే ఈసారి హిట్ కొట్టాలని అనుకుంటూ చేసిన సినిమా 'లెనిన్'. విలేజ్ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీసిన యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ఇది. లెక్క ప్రకారం మే 01న థియేటర్లలోకి వస్తామని ప్రకటించారు. కానీ వాయిదా పడిన 'పెద్ది'.. ఏప్రిల్ 30న థియేటర్లలోకి వస్తుందని కొన్నాళ్ల క్రితం క్లారిటీ ఇచ్చారు. దీంతో 'లెనిన్' వాయిదా పక్కా అని అంతా అనుకున్నారు. ఇప్పుడు అదే జరిగింది. అధికారికంగా కొత్త విడుదల తేదీని అనౌన్స్ చేశారు.(ఇదీ చదవండి: రెండు వారాలుగా బెడ్‌పైనే స్టార్ హీరో ప్రియురాలు.. అదే కారణం?)'లెనిన్'లో అఖిల్, భాగ్యశ్రీ హీరోహీరోయిన్లుగా నటించారు. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకుడు. నాగార్జున, నాగవంశీ కలిసి ఈ చిత్రాన్ని నిర్మించారు. ఏప్రిల్ 30న వస్తున్న 'పెద్ది'కి అండగా నిలబడదాం అని చెప్పిన 'లెనిన్' మేకర్స్.. రామ్ చరణ్, అఖిల్ మధ్య ఎలాంటి బాండింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదని గుర్తుచేసుకున్నారు. అందుకే తమ చిత్రాన్ని జూన్ 26కు వాయిదా వేస్తున్నట్లు చెప్పుకొచ్చారు.జూన్ నెల ప్రారంభంలో అంటే 4వ తేదీన యష్ హీరోగా నటించిన పాన్ ఇండియా మూవీ 'టాక్సిక్' రిలీజ్ కానుంది. ఇదొచ్చిన మూడు వారాలకు అఖిల్ 'లెనిన్' థియేటర్లలోకి రాబోతుంది. ప్రస్తుతానికైతే ఈ నెలలో చెప్పుకోదగ్గ మూవీస్ ఏం లేవు. కాబట్టి కంటెంట్, టైమ్ కలిసొచ్చి అఖిల్ ఈసారైనా హిట్ కొడతాడేమో చూడాలి? ఇదివరకే ఓ పాట రిలీజ్ చేయగా పాజిటివ్ రెస్పాన్స్ అందుకుంది.(ఇదీ చదవండి: అల్లు అర్జున్‌కి డ్యాన్స్ నేర్పింది నేనే) View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) -
కథ కలిపింది
ఫిల్మ్ ఇండస్ట్రీలో ఒక్కోసారి ఒక్కో ట్రెండ్ కనిపిస్తుంటుంది. ఇటీవల పాన్ ఇండియా ట్రెండ్ కనిపించింది. పాన్ వరల్డ్ (భారతీయ భాషలతో పాటు విదేశీ భాషల్లోనూ సినిమా రిలీజ్ కావడం) ట్రెండ్ కూడా ఊపందుకుంది. ఇప్పుడు మల్టీస్టారర్ మూవీ ట్రెండ్ మరోసారి ఊపందుకుంది. ఇలా ఏ కథ ఏయే స్టార్స్‌ని కలిపింది? ఆ సినిమాల విశేషాలపై ఓ లుక్ వేయండి...కాకాజీతో మోహన్‌లాల్ మల్టీస్టారర్ మూవీస్ చేయడానికి చిరంజీవి సిద్ధంగా ఉన్నట్లు తెలుస్తోంది. ‘వాల్తేరు వీరయ్య’ సినిమాలో చిరంజీవి హీరోగా నటించగా, ఇందులో రవితేజ కీలక పాత్రలో నటించారు. బాబీ డైరెక్ట్ చేసిన ఈ సినిమా సూపర్ హిట్‌గా నిలిచింది. ఈ ఏడాది చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ బ్లాక్‌బస్టర్‌గా నిలిచింది. ఇందులో వెంకటేశ్ ఓ కీ రోల్ చేశారు. అనిల్ రావిపూడి డైరెక్ట్ చేసిన సినిమా ఇది. ఇలా కథలో స్కోప్ ఉంటే చిరంజీవి సినిమాలో మరో స్టార్ హీరో కూడా నటిస్తున్నారు. మరోసారి ఈ అవకాశం ఉన్నట్లుగా తెలిసింది.‘వాల్తేరు వీరయ్య’ వంటి హిట్ ఫిల్మ్ తర్వాత చిరంజీవి, దర్శకుడు బాబీ కాంబోలో ఓ సినిమా రానుంది. పక్కా మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్గా రానున్న ఈ సినిమాలో కథ రీత్యా మరో హీరోకు చాన్స్ ఉందని తెలిసింది. ఈ రోల్లో తొలుత ఓ తెలుగు హీరోను అనుకున్నప్పటికీ ఫైనల్‌గా మలయాళ నటుడు మోహన్‌లాల్ ఫైనలైజ్ అయ్యారని ఫిల్మ్‌నగర్ సమాచారం. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ డ్రామాగా రూపొందనున్న ఈ సినిమాలో చిరంజీవి భార్య పాత్రలో ప్రియమణి, చిరంజీవి కుమార్తెగా అనస్వరా రాజన్ కనిపిస్తారని తెలిసింది. ఇక మోహన్‌లాల్ పోలీస్ ఆఫీసర్ రోల్లో నటిస్తారని టాక్.చిరంజీవి వంటి స్టార్ హీరో, తెలుగు ప్రేక్షకులకు సుపరిచితులైన మోహన్‌లాల్ ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆడియన్స్ కచ్చితంగా ఆ సినిమాను ఎంజాయ్ చేస్తారని చెప్పవచ్చు. ఇక ఈ సినిమా చిత్రీకరణను ఈ ఏడాది మార్చిలోనే స్టార్ట్ చేయాలనుకున్నారు. కానీ ఇటీవల చిరంజీవి భుజానికి చిన్న సర్జరీ జరిగిన నేపథ్యంలో సినిమా చిత్రీకరణను ఈ నెల ఆరంభించడంలేదట.ఏప్రిల్‌లోనే ఈ సినిమా చిత్రీకరణను స్టార్ట్ చేసి, వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేయాలని మేకర్స్ ΄్లాన్ చేస్తున్నారని తెలిసింది. కెవీఎన్ ప్రోడక్షన్స్ పతాకంపై వెంకట్ కె. నారాయణ ఈ సినిమాను నిర్మించనున్నారు. ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా తొలుత ఏఆర్ రెహమాన్ పేరు వినిపించినప్పటికీ ఇటీవల తమన్ పేరు తెరపైకి వచ్చింది. అలాగే ఈ సినిమాకు ‘కాకా, కాకాజీ’ అనే టైటిల్‌ను పరిశీలిస్తున్నారని టాక్. అయితే ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. సంక్రాంతి సోగ్గాళ్ళు ‘మనం’ సినిమాలో నాగార్జున, నాగచైతన్య కలిసి నటించారు. ఈ చిత్రం క్లైమాక్స్‌లో అఖిల్ కూడా కనిపించారు. అలా ఒకే ఫ్రేమ్‌లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కనిపించగానే అక్కినేని అభిమానులు ఫుల్ హ్యాపీ ఫీలయ్యారు. అలాంటిది ఒకే సినిమాలో ఫుల్ లెంగ్త్ రోల్స్‌లో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటిస్తే అక్కినేని ఫ్యాన్స్‌కు అంతకుమించిన ఆనందం ఏముంటుంది. ఇదంతా సాధ్యమయ్యే సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయి. కల్యాణ్ కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీ నుంచి మూడో భాగం రానుందని తెలిసింది.తొలి భాగంలో నాగార్జున హీరోగా నటించగా, మలి భాగంలో నాగార్జున–నాగచైతన్య కలిసి నటించారు. లేటెస్ట్ మూవీలో నాగార్జున–నాగచైతన్య–అఖిల్ కలిసి హీరోలుగా నటించనున్నారని తెలిసింది. ‘వాసివాడి తస్సాదియ్యా.. వచ్చే 15 జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్ళు వస్తే పండగ ఇంకా కలర్ఫుల్గా ఉంటాది కదా... డేట్ మార్క్ చేసుకోండి’’ అని ఫిబ్రవరి 9న అన్నపూర్ణ స్టూడియో సంస్థ ‘ఎక్స్’లో పోస్ట్ చేసింది. ఇది... ‘సోగ్గాడే చిన్ని నాయనా’ సినిమా ఫ్రాంచైజీలోని థర్డ్ పార్ట్ మూవీకి సంబంధించినదే అని, ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ అవుతుందనే ప్రచారం తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ చిత్రంలో నాగార్జున–నాగచైతన్య–అఖిల్ కలిసి నటించనున్నారనే టాక్ కూడా తెరపైకి వచ్చింది.ప్రస్తుతం ఆర్కే కార్తీక్ డైరెక్షన్లో ‘కింగ్ 100’ అనే సినిమా చేస్తున్నారు నాగార్జున. ఇది నాగార్జున కెరీర్‌లోని వందో సినిమా. ఈ సినిమా చిత్రీకరణ పూర్తయిన తర్వాత ‘సోగ్గాడే చిన్నినాయనా’ ఫ్రాంచైజీలోని కొత్త సినిమా షూటింగ్లో నాగార్జున పాల్గొంటారని ఊహించవచ్చు. మరోవైపు ఇటీవల కాలంలో మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు నాగార్జున ఆసక్తి చూపిస్తున్నారు.రణ్‌బీర్ కపూర్ ‘బ్రహ్మాస్త్ర’, ధనుష్ ‘కుబేర’ చిత్రాల్లో నాగార్జున లీడ్ రోల్స్ చేశారు. అలాగే నాగార్జున మెయిన్ హీరోగా, అల్లరి నరేశ్, రాజ్ తరుణ్ ఇతర ప్రధాన పాత్రధారులుగా ‘నా సామి రంగ’ సినిమా వచ్చింది. ఇలా కథ నచ్చితే, మల్టీస్టారర్ సినిమాలు చేసేందుకు నాగార్జున సుముఖంగా ఉన్నట్లే తెలుస్తోంది. ఇక గతంలో వెంకటేశ్‌తో కలిసి ‘వెంకీ మామ’ చిత్రం చేశారు నాగచైతన్య. అలాగే ఆమిర్ ఖాన్ హీరోగా నటించిన ‘లాల్ సింగ్ చద్దా’ మూవీలో నాగచైతన్య ఓ కీ రోల్ చేసిన సంగతి గుర్తుంటే ఉంటుంది. బామ్మర్ది బాల్‌రెడ్డి టాలీవుడ్లో మల్టీస్టారర్ సినిమాలు చేయడంలో ముందు వరుసలో ఉంటారు హీరో వెంకటేశ్. ‘సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు’ (వెంకటేశ్–మహేశ్‌బాబు), ‘మసాల’ (వెంకటేశ్–రామ్), ‘గోపాల గోపాల’ (వెంకటేశ్–పవన్‌కల్యాణ్), ‘ఎఫ్ 2, ఎఫ్ 3’ (వెంకటేశ్–వరుణ్ తేజ్) వంటి చిత్రాలే ఇందుకు నిదర్శనం. ఇటీవల చిరంజీవి హీరోగా నటించిన ‘మన శంకరవరప్రసాద్‌గారు’ చిత్రంలో వెంకటేశ్ ఓ రోల్లో నటించిన సంగతి తెలిసిందే. తాజాగా మరో మల్టీస్టారర్ సినిమాకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చారు వెంకటేశ్. ‘ఎఫ్ 2, ఎఫ్ 3, సంక్రాంతికి వస్తున్నాం’ వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల తర్వాత హీరో వెంకటేశ్, దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్లో మరో సినిమా రానుంది. ఈ చిత్రంలో కల్యాణ్‌రామ్ మరో హీరోగా నటించనున్నారు.ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రోడక్షన్ వర్క్స్ జరుగుతున్నాయి. స్క్రిప్ట్ ప్రిపరేషన్లో బిజీగా ఉన్నారు అనిల్ రావిపూడి. జూలైలో ఈ సినిమా షూట్‌ను స్టార్ట్ చేయాలనుకుంటున్నారు. వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేయనున్నట్లుగా ఆల్రెడీ మేకర్స్ ప్రకటించారు. అయితే ఈ సినిమాను ఎవరు నిర్మించబోతున్నారనే విషయంపై ఇంకా క్లారిటీ రాలేదు. డి. సురేష్‌బాబు, సాహు గారపాటి వంటి నిర్మాతల పేర్లు తెరపైకి వచ్చాయి. అలాగే ఈ సినిమా బావా బామ్మర్దిల మధ్య నడిచే కథ అని, రాయలసీమ నేపథ్యంలో కథనం సాగుతుందని, ఈ చిత్రానికి ‘బామ్మర్ది బాల్‌రెడ్డి’ అనే టైటిల్‌ను అనుకుంటున్నారనే టాక్ తెరపైకి వచ్చింది. అంతేకాదు... ఈ సినిమాలో వెంకటేశ్ సరసన కీర్తీ సురేష్ హీరోయిన్గా నటిస్తారనే ప్రచారం సాగుతోంది. ఈ విషయాలపై అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఏకే 47లో... వెంకటేశ్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో రూపొందుతున్న సినిమా ‘ఆదర్శ కుటుంబం హౌస్ నెంబరు 47 – ఏకే47’. వెంకటేశ్ కెరీర్‌లోని ఈ 77వ సినిమాలో శ్రీనిధి శెట్టి హీరోయిన్గా నటిస్తున్నారు. కాగా, ఈ చిత్రంలోని మరో కీలక పాత్రలో నారా రోహిత్ నటించనున్నారని సమాచారం. ఎస్. రాధాకృష్ణ నిర్మిస్తున్న ఈ సినిమా ఈ ఏడాదే థియేటర్స్‌లో రిలీజ్ కానుంది. ఎవరు హీరో? సూపర్ స్టార్ హీరోలు రజనీకాంత్, కమల్‌హాసన్ వారి కెరీర్ స్టార్టింగ్‌లో ‘ఆపూర్వ రాగంగళ్, మూండ్రు ముడిచ్చు, 16 వయదినిలే, నినైత్తాలే ఇనిక్కుమ్’ వంటి చిత్రాల్లో కలిసి నటించారు. వీరి కాంబినేషన్లో దాదాపు ఇరవై సినిమాలొచ్చాయి. కానీ ‘అలావుద్దీనుమ్ అద్భుత విళక్కుమ్’ చిత్రం తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కాంబోలో మరో సినిమా రాలేదు. ఆ సమయం ఇప్పుడు వచ్చింది. 47 సంవత్సరాల తర్వాత రజనీకాంత్, కమల్‌హాసన్ కలిసి ఓ మల్టీస్టారర్ సినిమా చేయనున్నారు. రజనీకాంత్ దర్శకుడిగా ‘జైలర్’ సినిమా తీసి, సూపర్ హిట్ సాధించి, మళ్లీ రజనీకాంత్‌తోనే ‘జైలర్ 2’ చిత్రాన్ని డైరెక్ట్ చేస్తున్న నెల్సన్ దిలీప్‌కుమార్ ఈ మల్టీస్టారర్ సినిమాకు దర్శకత్వం వహించనున్నారు.ఇటీవల ఈ సినిమా ప్రోమోను రిలీజ్ చేశారు మేకర్స్. ఈ ప్రోమోలో కమల్‌హాసన్, రజనీ కాంత్ ‘ఈ సినిమాలో ఎవరు హీరో’ అని దర్శకుడు నెల్సన్‌ను అడగటం, నెల్సన్ సైలెంట్‌గా ఉండటంతో ప్రోమో కంప్లీట్ కావడం చూశాం. అయితే రజనీకాంత్–కమల్‌హాసన్ లేటెస్ట్ కాంబో మూవీలో ఎవరు మెయిన్ హీరోగా నటిస్తారనే చర్చ కోలీవుడ్‌లో హాట్ టాపిక్‌గా మారింది. ఇక ఈ సినిమా గురించి ఇద్దరి హీరోల ఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమాను రెడ్ జెయింట్ మూవీస్ సంస్థ నిర్మించనుంది. త్వరలోనే ఈ సినిమా చిత్రీకరణ ప్రారంభం కానుంది.వచ్చే ఏడాది వేసవి తర్వాత ఈ మూవీ రిలీజ్ కావొచ్చు. మరోవైపు రజనీకాంత్ కెరీర్‌లోని 173వ సినిమాను కమల్‌హాసన్ నిర్మిస్తున్నారు. సిబి చక్రవర్తి ఈ సినిమాకు దర్శకుడు. రజనీకాంత్ హీరోగా నటించనున్న ఈ చిత్రంలో కమల్‌హాసన్ ఓ గెస్ట్ రోల్ చేస్తారనే ప్రచారం జరుగుతోంది. ఇదే నిజమైతే... రజనీకాంత్–కమల్‌హాసన్ ఒకే ఫ్రేమ్‌లో ఉన్న సినిమాలు బ్యాక్ టు బ్యాక్ స్క్రీన్‌పైకి వస్తాయని ఊహించవచ్చు. పేట్రియాట్ 1980, 1990లలో మలయాళ స్టార్ హీరోలు మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి దాదాపు 50 సినిమాలు చేశారు. కానీ 2008లో వచ్చిన ‘ట్వంటీ:20’ చిత్రం తర్వాత మోహన్‌లాల్–మమ్ముట్టి కాంబినేషన్లో మరో సినిమా రావడానికి, వారి అభిమానులు 18 సంవత్సరాలు ఎదురుచూడాల్సి వచ్చింది. ‘ట్వంటీ:20’ మూవీ తర్వాత మోహన్‌లాల్, మమ్ముట్టి కలిసి ‘పేట్రియాట్’ అనే సినిమా చేస్తున్నారు. అలాగే ఈ చిత్రంలోనే ఫాహద్ ఫాజిల్, కుంచాకో బోబన్, నయనతార, రేవతి వంటి స్టార్ యాక్టర్స్ కూడా నటిస్తున్నారు.దేశభక్తి ప్రధానాంశంగా రూపొందుతున్న ఈ సినిమాలో మోహన్‌లాల్ మిలటరీ ఆఫీసర్ పాత్రలో నటిస్తుండగా, మమ్ముట్టి మిస్టరీ రోల్లో నటిస్తున్నట్లుగా టీజర్ స్పష్టం చేస్తోంది. మహేశ్ నారాయణన్ దర్శకత్వంలో ఈ సినిమాను ఆంటో జోసెఫ్, కేజీ అనిల్‌కుమార్ నిర్మిస్తున్నారు. ఈ చిత్రం ఈ ఏడాది ఏప్రిల్ 23న రిలీజ్ కానుంది. మరోవైపు ‘లూసీఫర్, లూసీఫర్ 2, బ్రో డాడీ’ వంటి సూపర్‌హిట్ చిత్రాల్లో మోహన్‌లాల్, పృథ్వీరాజ్ సుకుమారన్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. ఈ ఇద్దరు స్టార్ యాక్టర్స్ మరోసారి స్క్రీన్ షేర్ చేసుకోనున్నారు.పృథ్వీరాజ్ సుకుమారన్ మెయిన్ లీడ్ రోల్ చేస్తున్న ‘ఖలీఫా’ చిత్రంలో మోహన్‌లాల్ ఓ కీలక పాత్ర పోషించనున్నారు. ఈ విషయం గురించి ఆల్రెడీ అధికారిక ప్రకటన వచ్చింది. కృతీ శెట్టి హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాలో మలయాళ యువ హీరో టోవినో థామస్ మరో లీడ్ రోల్ చేస్తున్నారని మాలీవుడ్ సమాచారం. అరసన్ శింబు, విజయ్ సేతుపతి కలిసి నటిస్తున్న తమిళ సినిమా ‘అరసన్’. వెట్రిమారన్ ఈ సినిమాకు దర్శకత్వం వహిస్తుండగా కలైపులి ఎస్. థాను నిర్మిస్తున్నారు. ఆల్రెడీ ఈ సినిమా చిత్రీకరణ మొదలైంది. శింబు, విజయ్ సేతుపతి కాంబినేషన్లో కొన్ని సన్నివేశాల చిత్రీకరణ కూడా జరిగిందట. శింబు–విజయ్ సేతుపతిల కాంబోలో వస్తున్న ఈ సినిమాపై అంచనాలు ఉన్నాయి. నార్త్ చెన్నై బ్యాక్‌డ్రాప్‌లో సాగే పీరియాడికల్ గ్యాంగ్‌స్టర్ మూవీ ఇది. వచ్చే ఏడాది ఈ సినిమాను రిలీజ్ చేయాలనుకుంటున్నారు.ఒకే ఇండస్ట్రీలోని స్టార్ హీరోలు కలిసి మల్టీస్టారర్ మూవీస్ చేస్తున్న సినిమాలు కొన్ని ఉన్నాయి. అయితే పాన్ ఇండియా ట్రెండ్ వచ్చిన తర్వాత వివిధ ఫిల్మ్ ఇండస్ట్రీలకు చెందిన స్టార్ హీరోలు ఒకే సినిమాలో నటించే ధోరణి స్పష్టంగా కనిపిస్తోంది. ప్రభాస్ మెయిన్ హీరోగా చేస్తున్న ‘కల్కి 2898 ఏడీ’ ఫ్రాంచైజీలో బాలీవుడ్ నటుడు అమితాబ్ బచ్చన్, కోలీవుడ్ యాక్టర్ కమల్‌హాసన్ ఇతర మెయిన్ లీడ్ రోల్స్ చేస్తున్నారు. తెలుగు దర్శకుడు ప్రశాంత్ వర్మ నేతృత్వంలో ‘ప్రశాంత్ వర్మ సినిమాటిక్ యూనివర్స్’లోని లేటెస్ట్ మూవీ ‘జై హనుమాన్’.ఇందులో ‘కాంతార’ ఫేమ్ రిషబ్ శెట్టి హీరోగా నటిస్తున్నారు. కాగా ఈ మూవీలో టాలీవుడ్ హీరోలు ‘హను–మాన్’ ఫేమ్ యువ హీరో తేజ సజ్జా, రానా కీలక పాత్రల్లో నటిస్తున్నారని ఫిల్మ్‌నగర్ సమాచారం. టి సిరీస్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ ఎర్నేని, వై. రవిశంకర్ నిర్మిస్తున్న ఈ చిత్ర ప్రారంభోత్సవం ఇటీవల హంపీలో జరిగిన తెలిసిందే. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ఆరంభం కానుంది. ఈ తరహాలో క్రాస్ ఓవర్ మల్టీస్టారర్ సినిమాలు మరికొన్ని ఉన్నాయి.ఇంకా నిర్మాణంలో ఉన్న మల్టీస్టారర్ మూవీస్ మరికొన్ని ఉన్నాయి. – ముసిమి శివాంజనేయులు -
సంక్రాంతికి సోగ్గాళ్లు
‘‘వాసివాడి తస్సాదియ్యా... వచ్చే 15 జనవరి 2027 సంక్రాంతికి సోగ్గాళ్లు వస్తే పండగ ఇంకా కలర్ఫుల్గా ఉంటాది కదా. డేట్ మార్క్ చేసుకోండి’’ అంటూ అన్నపూర్ణ స్టూడియోస్ ప్రతినిధులు ‘ఎక్స్’లోపోస్ట్ చేశారు. నాగార్జున హీరోగా నటించిన సూపర్‌హిట్ మూవీ ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016). ఈ చిత్రంలో నాగార్జున ‘వాసివాడి తస్సాదియ్యా...’ అంటూ డైలాగ్ చెప్పిన విషయం గుర్తుండే ఉంటుంది. ఇప్పుడు ఇదే డైలాగ్ వచ్చేట్లు ‘ఎక్స్’ ఖాతాలో పేర్కొన్నారు కాబట్టి ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీ నుంచి కొత్త చిత్రం రాబోతోందని, ఈ సినిమా వచ్చే సంక్రాంతికి రిలీజ్ కానుందని స్పష్టమవుతోంది.ఇక ‘సోగ్గాడే చిన్ని నాయనా’ ఫ్రాంచైజీలో భాగంగా ఇప్పటికే వచ్చిన ‘సోగ్గాడే చిన్ని నాయనా’ (2016), ‘బంగార్రాజు’ (2022) సినిమాలు సంక్రాంతికే విడుదలై, సూపర్‌హిట్స్‌గా నిలిచిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ ఫ్రాంచైజీ దర్శకుడు కల్యాణ్ కృష్ణ ఇటీవలే నాగార్జునను కలిసి ఓ కథ వినిపించారని, ఈ కథతోనే కొత్త సీక్వెల్ తెరకెక్కనుందనీ, జూన్‌లో షూటింగ్ ఆరంభిస్తారనీ తెలిసింది. ‘బంగార్రాజు’లో నాగార్జున–నాగచైతన్య నటించారు. వచ్చే సంక్రాంతికి రానున్న చిత్రంలో నాగార్జున, నాగచైతన్య, అఖిల్ కలిసి నటించనున్నారని భోగట్టా. -
అక్కినేని అఖిల్ హలో.. జున్ను ఇంతలా మారిపోయిందేంటి?
అక్కినేని అఖిల్ హీరోగా వచ్చిన రెండో చిత్రం హలో. 2017లో ప్రేక్షకుల ముందుకొచ్చిన ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. అయినప్పటికీ ఆడియన్స్ మనసులను గెలుచుకుంది. ఈ చిత్రానికి విక్రమ్ కే కుమార్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో అఖిల్ సరసన కల్యాణి ప్రియదర్శన్ హీరోయిన్గా నటించింది. అయితే ఈ చిత్రంలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా నటించిన పాప ముద్దుముద్దు మాటలతో ఆడియన్స్‌ను ఆకట్టుకుంది. ఈ సినిమాలో జున్ను పాత్రలో అలరించింది. ఈ మూవీ రిలీజై దాదాపు తొమ్మిదేళ్లు పూర్తయింది. అయితే తాజాగా చైల్డ్ ఆర్టిస్ట్ జున్నుకు సంబంధించిన పిక్స్ నెట్టింట వైరల్‌గా మారాయి. అప్పుడు క్యూట్ క్యూట్‌గా ఈ చిన్నారి ఇప్పుడు పూర్తిగా మారిపోయింది. ఈ ఫోటోలను ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేశారు. ఇది కాస్తా వైరల్ కావడంతో హలో చిన్నారి ఇంతలా మారిపోయిందా? అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. అఖిల్ హలో సినిమాలో జున్ను ఎలా మారిపోయిందో చూడండి..#Hellomovie #AkhilAkkineni pic.twitter.com/s86NsIfAt8— 𝐊𝐢𝐧𝐠𝐕𝐞𝐧𝐤𝐲 𝐁𝐚𝐧𝐠𝐚𝐥𝐨𝐫𝐞 (@KingVenkyBAF) January 23, 2026 #Hello Movie ni Endhuku ra Hit Chailedhu 😈💔#HelloMovie 😻🗿 pic.twitter.com/CuA4LcgZSJ— sId 𝕏 (@IntrovertSidX) October 27, 2024 -
'ఏజెంట్' సినిమాతో వాళ్ల కెరీర్ పోయింది: నిర్మాత
అఖిల్ అక్కినేని సినిమా ఏజెంట్ నష్టాల గురించి నిర్మాత అనిల్ సుంకర మరోసారి రియాక్ట్ అయ్యారు. శర్వానంద్ (Sharwanand) హీరోగా అనిల్ సుంకర నిర్మించిన చిత్రం నారీ నారీ నడుమ మురారి. ఈ సంక్రాంతి కానుకగా జనవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది. అయితే, ఆరోజు సాయింత్రం 5:49 గంటలకు రిలీజ్ చేయనున్నట్లు వారు తెలిపారు. ఈ మూవీకి సామజవరగమన ఫేమ్ అబ్బరాజు దర్శకత్వం వహించాడు. ఇందులో సంయుక్త, సాక్షి వైద్య హీరోహీరోయిన్లుగా నటించారు. ప్రమోషన్స్‌లో భాగంగా అనిల్ సుంకర తాజాగా ఒక ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ క్రమంలోనే ఏజెంట్ సినిమాతో పాటు అఖిల్ కెరీర్ గురించి మాట్లాడారు.'ఏజెంట్ సినిమా వల్ల మేము అందరం నష్టపోయాం. ముఖ్యంగా అఖిల్, దర్శకుడు సురేంద్ర రెడ్డి కెరీర్ పరంగా బాగా నష్టపోయారు. మూడేళ్లుగా వారికి సినిమాలు లేవు. నేను డబ్బుల పరంగా నష్టాలు ఎదుర్కొన్నాను. ఈ దెబ్బ బయ్యర్ల మీద కూడా పడింది. అయితే, అఖిల్‌కు హిట్ ఇవ్వలేకపోయాననే బాధ ఇప్పటికీ ఉంది. నేను డబ్బులు మాత్రమే కోల్పోయాను. కానీ, అఖిల్ కెరీర్ ఏజెంట్ సినిమాతో దెబ్బతినింది. అదొక్కటే బాధ నాలో ఉంది. నాతో ఇప్పటికీ అఖిల్ టచ్‌లోనే ఉన్నాడు. తనతో ఒక సినిమా తీయాలని నేను చాలా కథలను పంపుతూనే ఉన్నాను. అయితే, భారీ బడ్జెట్‌తో వద్దని ఏదైనా తక్కువ బడ్జెట్‌తో ప్లాన్ చేయమని తను సలహా ఇస్తున్నాడు. ఎక్కువ బడ్జెట్ పెట్టి మరోసారి సాహసం వద్దని సూచిస్తున్నాడు. తను చాలా మంచి వ్యక్తి. తప్పకుండా ఒక మంచి సినిమాతో ప్రేక్షకులను మెప్పిస్తాం.' అని ఆయన అన్నారు. 'ఏజెంట్' మూవీ ఫ్లాప్ తర్వాత సినిమాలకు పూర్తిగా బ్రేక్ తీసుకున్న అఖిల్.. చాలా సైలెంట్‌గా 'లెనిన్' షూటింగ్ చేస్తూ వచ్చాడు. తాజాగా విడుదలైన గ్లింప్స్‌కు మంచి ఆదరణ దక్కింది. ఇందులో భాగ్యశ్రీ హీరోయిన్గా నటిస్తుంది. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకుడు. రాయలసీయ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. మే 01న 'లెనిన్' థియేటర్లలోకి రానుంది. -
ఇన్నావా బంగారం.. 'లెనిన్' తొలిసాంగ్ రిలీజ్
'ఏజెంట్' మూవీ ఫ్లాప్ దెబ్బకు పూర్తిగా సైలెంట్ అయిపోయిన అఖిల్.. చాలా సైలెంట్‌గా 'లెనిన్' షూటింగ్ చేస్తూ వచ్చాడు. తొలుత హీరోయిన్గా శ్రీలీల అనుకున్నారు. ఆ మేరకు గ్లింప్స్ రిలీజ్ చేశారు. తర్వాత ఈమె ప్లేసులోకి భాగ్యశ్రీ వచ్చింది. ఈ మధ్య వదిలిన పోస్టర్‌తో ఈ క్లారిటీ ఇచ్చారు. ఇప్పుడు సినిమా నుంచి తొలి గీతాన్ని వదిలారు. అలానే మూవీ రిలీజ్ డేట్ కూడా ప్రకటించారు.(ఇదీ చదవండి: నటి రాశికి క్షమాపణ చెప్పిన అనసూయ)తమన్ సంగీతమందించిన 'వారెవ్వా' అంటూ సాగిన ఈ మెలోడీ సాంగ్ వినడానికి బాగుంది. అఖిల్-భాగ్యశ్రీ కెమిస్ట్రీ కూడా వర్కౌట్ అయ్యేలానే కనిపిస్తుంది. నాగార్జున అన్నపూర్ణ స్టూడియోస్, నాగవంశీ సితార ఎంటర్ టైన్మెంట్స్ సంస్థలు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. మురళీ కిశోర్ అబ్బూరి దర్శకుడు. రాయలసీయ బ్యాక్ డ్రాప్ స్టోరీతో తీశారు. మే 01న 'లెనిన్' థియేటర్లలోకి రానుంది.ఇప్పటివరకు అఖిల్ ఐదు సినిమాలు చేస్తే.. వాటిలో 'మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్' ఓకే అనిపించుకుంది. మిగిలినవన్నీ బోల్తా కొట్టాయి. దీంతో ఈసారి ఎలాగైనా అఖిల్ హిట్ కొట్టాలి. మరి 'లెనిన్'తో ఏం చేస్తాడో చూడాలి?(ఇదీ చదవండి: అన్వేష్, అనసూయలతో లాభ పడుతుంది ఎవరు..?) -
తండ్రి నుంచి తాతగా ప్రమోషన్? నాగార్జున ఆన్సరిదే!
టాలీవుడ్ కింగ్ నాగార్జున తాత కాబోతున్నాడంటూ గత కొన్నినెలలుగా ప్రచారం ఊపందుకుంది. మొదట్లో నాగచైతన్య- శోభిత పేరెంట్స్ కాబోతున్నారని రూమర్స్ వచ్చాయి. కానీ, అదంతా ఉట్టిదేనని శోభిత టీమ్ కొట్టిపారేసింది. కొన్నిరోజులుగా అఖిల్-జైనబ్ తల్లిదండ్రులుగా ప్రమోషన్ పొందనున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనిపై అఖిల్ కానీ, అతడి ఫ్యామిలీ కానీ స్పందించలేదు.టైం వచ్చినప్పుడు చెప్తా..ఈ క్రమంలో ఓ హెల్త్ ఈవెంట్‌కు వచ్చిన నాగార్జునకు మీరు తండ్రి నుంచి తాతగా ప్రమోట్ అవుతున్నారని కథనాలు వస్తున్నాయి.. నిజమేనా? అన్న ప్రశ్న ఎదురైంది. అందుకాయన చిరునవ్వుతో.. సరైన సమయం వచ్చినప్పుడు నేనే చెప్తాను అని పేర్కొన్నాడు. ఆ వార్తలను ఖండించకుండా టైం వచ్చినప్పుడు చెప్తాననడంతో అఖిల్ నిజంగానే తండ్రి కాబోతున్నాడని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.15 ఏళ్లుగా సమస్యఇకపోతే ఇదే ఈవెంట్ అనంతరం నాగార్జున తన మోకాలి నొప్పి గురించి మాట్లాడుతూ.. 15 ఏళ్లుగా మోకాలినొప్పితో బాధపడుతున్నాను. సర్జరీ చేయించుకోవాలనుకోలేదు. కాకపోతే మోకాలు బెటర్ అయ్యేందుకు లూబ్రికెంట్ ఫ్లూయిడ్స్ వాడాను. వైద్యులు పీఆర్పీ (ప్లేట్లెట్-రిచ్ ప్లాస్మా) చేశారు. ఒక్కోసారి నాకు నొప్పి లేకపోయినా గ్యాప్ ఇవ్వకుండా ప్రతిరోజు ఉదయం మోకాలి కోసం ప్రత్యేకంగా వ్యాయామం చేశాను. దాన్ని అసలు వదిలేయలేదు. అలా మోకాలి నొప్పికి చికిత్స తీసుకుంటున్నాను. ప్రస్తుతం బాగానే ఉన్నాను అని చెప్పుకొచ్చాడు. -
ఈ ఏడాది పెళ్లి చేసుకున్న సెలబ్రిటీలు వీళ్లే..
సెలబ్రిటీలు ఎంతసేపూ పనిగురించే ఆలోచిస్తుంటారు. వయసు మీద పడుతున్నా పెళ్లి ఊసెత్తరు. కొందరైతే డేటింగ్‌లోనే కాలం గడిపేస్తూ వెడ్డింగ్‌ను మాత్రం వాయిదా వేస్తుంటారు. అయితే కల్యాణం వచ్చినా.. కక్కొచ్చినా ఆగదన్నట్లు.. శుభ ఘడియలు దగ్గరపడితే పెళ్లిని ఎవరూ ఆపలేరు. అలా ఈ ఏడాది (2025) పలువురు తారలు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు. సింగిల్ లైఫ్‌కు ఫుల్స్టాప్ పెట్టి జంట ప్రయాణం మొదలుపెట్టిన ఆ సెలబ్రిటీలెవరో చూసేద్దాం..అఖిల్ - జైనబ్కింగ్ నాగార్జున తనయుడు అఖిల్ అక్కినేని ఈ ఏడాదే పెళ్లి చేసుకున్నాడు. గతేడాది అన్న నాగచైతన్య.. శోభితను పెళ్లి చేసుకుంటే ఈ ఏడాది తమ్ముడు జైనబ్‌తో ఏడడుగులు వేశాడు. జూన్ 6న ఎంతో గ్రాండ్‌గా ఈ వెడ్డింగ్ జరిగింది.సమంత- రాజ్ నిడిమోరుహీరోయిన్ సమంత, దర్శకుడు రాజ్ నిడిమోరు కొంతకాలంగా ప్రేమాయణం నడుపుతున్నారు. ఇద్దరూ జంటగా చెట్టాపట్టాలేసుకుని తిరిగారు కానీ అఫీషియల్‌గా మాత్రం ప్రకటించలేదు. డిసెంబర్ 1న తమిళనాడులోని కోయంబత్తూరులో ఈషా యోగా సెంటర్లో భూతశుద్ధి వివాహం చేసుకుని సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. అన్నట్లు వీరిద్దరికీ ఇది రెండో పెళ్లే!అభిషన్ జీవింత్- అఖిలటూరిస్ట్ ఫ్యామిలీ సినిమాతో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే సక్సెస్ అయ్యాడు అభిషన్ జీవింత్. ఓ సినిమా ఈవెంట్లో ప్రియురాలు అఖిలను అక్టోబర్ 31న నన్ను పెళ్లి చేసుకుంటావా? అని ప్రపోజ్ చేశాడు. చెప్పిన డేట్ ప్రకారం అక్టోబర్ 31న ప్రియురాలు మెడలో మూడు ముళ్లు వేశాడు.అవికా గోర్- మిలింద్ చంద్వానీచిన్నారి పెళ్లికూతురుతో ప్రేక్షకులను మెప్పించిన అవికా గోర్ నిజంగానే పెళ్లికూతురుగా ముస్తాబైంది. సెప్టెంబర్ 30న ఓ రియాలిటీ షోలో ప్రియుడు మిలింద్ చంద్వానీని పెళ్లి చేసుకుంది.అర్మాన్ మాలిక్- ఆష్న ష్రాఫ్సింగర్ అర్మాన్ మాలిక్ ప్రియురాలు, సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఆష్న ష్రాఫ్‌ను పెళ్లి చేసుకున్నాడు. జనవరి 2న ఎంతో గ్రాండ్‌గా వీరి పెళ్లి జరిగింది.హీనా ఖాన్- రాకీ జైస్వాల్బుల్లితెర నటి హీనా ఖాన్ కొంతకాలంగా క్యాన్సర్‌తో పోరాడుతోంది. ఇలాంటి కష్టసమయంలోనూ ఆమె చేయిని వదలకుండా పట్టుకున్నాడు ప్రియుడు రాకీ. ఈ ప్రేమజంట జూన్ 4న పెళ్లి చేసుకున్నారు.ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా23 ఏళ్లుగా ప్రేమలో మునిగి తేలుతూ పెళ్లిని పక్కనపెట్టేశారు నటులు ఆశ్లేష సావంత్- సందీప్ బస్వానా. కానీ ఇటీవల ఓ కృష్ణుడి గుడికి వెళ్లినప్పుడు పెళ్లి చేసుకోవాలన్న కోరిక మనసులో పుట్టింది. అనుకున్నదే తడవుగా నవంబర్ 23న వైవాహిక బంధంలోకి అడుగుపెట్టారు.అర్చన- బీఆర్ శరత్కన్నడ నటి అర్చన కొట్టిగె, క్రికెటర్ బీఆర్ శరత్ వేదమంత్రాల సాక్షిగా కొత్త జీవితాన్ని ఆరంభించారు. వీరి పెళ్లి ఏప్రిల్ 23న బెంగళూరులో జరిగింది.వీళ్లే కాకుండా సారా ఖాన్- క్రిష్ పాఠక్.. సెలీనా గోమెజ్-బెన్నీ బ్లాన్కో, దర్శన్ రావల్-దరల్ సురేలియా, ప్రతీక్ బాబర్- ప్రియా బెనర్జీ, ఆదార్ జైన్- అలేఖ అద్వానీ, ప్రజక్త కోహ్లి- వృషాంక్ ఖనల్ వంటి పలువురు జంటలు సైతం ఈ ఏడాది పెళ్లి బంధంలో అడుగుపెట్టారు. -
కట్టుబట్టలతో ఇంటినుంచి పారిపోయి..: అమల
టాలీవుడ్ స్టార్ కపుల్ నాగార్జున - అమల (Amala Akkineni) జంటగా నటించిన శివ సినిమా 36 ఏళ్ల తర్వాత రీరిలీజైంది. నవంబర్ 14న మరోసారి ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాను అందరూ ఎంతగానో ఎంజాయ్ చేశారు. కొన్నేళ్లుగా వెండితెరకు దూరంగా ఉంటున్న అమల ఈ సినిమా ప్రమోషన్స్‌లో చురుకుగా పాల్గొంది. ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో తన కుటుంబం గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించింది.ఆస్తులు కోల్పోయాంఅమల మాట్లాడుతూ.. అమ్మ ఐరిష్, నాన్న బెంగాలి. నాన్న చిన్నతనంలో బెంగాల్ విభజన జరిగింది. అప్పుడు మేము ఆస్తులన్నీ కోల్పోయాం. కట్టుబట్టలతో నాన్న రాత్రికి రాత్రి ఇంటి నుంచి పారిపోయి వచ్చారు. బాగా చదువుకుంటేనే పైకొస్తామని ఆలోచించి చదువుపై దృష్టి పెట్టాడు. అలా బాగా చదివి యూకేలో నౌకాదళంలో ఉద్యోగం సంపాదించాడు. నాన్నకు తొమ్మిది మంది చెల్లెళ్లు, తమ్ముళ్లున్నారు. తను సంపాదించేదంతా వారికే పెట్టేవాడు.చిన్నతనంలో భరతనాట్యంఅమ్మానాన్న ఇద్దరూ నౌకాదళ అధికారులుగా పనిచేసేవారు. వృత్తిరీత్యా అనేక ప్రదేశాలు మారుతూ ఉండేవాళ్లం. అలా వైజాగ్‌లో ఉన్నప్పుడు భరతనాట్యం నేర్చుకున్నాను. మా డ్యాన్స్ టీచర్ అమ్మతో.. మీ కూతురికి మంచి టాలెంట్ ఉంది. చెన్నైలోని కళాక్షేత్రలో చేర్పించండి. అక్కడ ఇంకా బాగా నేర్పిస్తారు అని సలహా ఇచ్చింది.అక్కడే చదువుకున్నా..అలా నన్ను 9 ఏళ్ల వయసులో కళాక్షేత్ర స్కూల్లో చేర్పించారు. 19 ఏళ్లు వచ్చేవరకు అక్కడే విద్యాభ్యాసం పూర్తి చేశాను. దేశంలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో నాట్యప్రదర్శనలు ఇచ్చాను. మా ఇంట్లో పనివాళ్లు ఎవరూ ఉండేవారు కాదు. గిన్నెలు తోమడం, ఇల్లు తుడవడం, బట్టలు ఉతకడం, వంట చేయడం అన్నీ మేమే చేసుకునేవాళ్లం. సినిమాల్లో ఎంట్రీదర్శకుడు టి.రాజేందర్ తన సినిమా కోసం క్లాసికల్ డ్యాన్సర్ కావాలని కళాక్షేత్రకు వచ్చాడు. అలా మైథిలి ఎన్నయి కథలై సినిమాతో హీరోయిన్గా పరిచయమయ్యాను. అది చాలా పెద్ద హిట్టవడంతో సినిమాలు చేసుకుంటూ పోయాను. అత్తమ్మ అక్కినేని అన్నపూర్ణమ్మ దగ్గరే తెలుగు బాగా నేర్చుకున్నాను. తను నన్ను అత్తలా కాకుండా అమ్మలా చూసుకుంది. తండ్రి మాట జవదాటడుపిల్లల విషయానికి వస్తే నాగచైతన్య తల్లి చెన్నైలో ఉంటుంది. కాలేజీ విద్య కోసం అతడు హైదరాబాద్ వచ్చాడు. అప్పుడే తన గురించి బాగా తెలుసుకున్నాను. చైకి మెచ్యూరిటీ ఎక్కువ. ఎటువంటి తప్పు చేయడు. నాన్న మాట జవదాటడు. చై, అఖిల్.. వీళ్లిద్దరినీ సొంత నిర్ణయాలు తీసుకోమని వదిలేశాం. అప్పుడే వాళ్లంతట వాళ్లు అన్నీ తెలుసుకుంటారు. నాకు మంచి కోడళ్లు దొరికారు. వాళ్లు చాలా టాలెండెట్. ఇంత మంచి కోడళ్లు దొరకడం నా అదృష్టం అని అమల చెప్పుకొచ్చింది.చదవండి: ఇమ్మూకి తల్లి ఊహించని గిఫ్ట్ -
పెళ్లి తర్వాత తొలి దీపావళి.. అక్కినేని అఖిల్ భార్య స్పెషల్ విషెస్!
టాలీవుడ్ హీరో అక్కినేని అఖిల్ ఈ ఏడాది వివాహబంధంలోకి అడుగుపెట్టారు. చైతూ పెళ్లికి ముందే తన ప్రియురాలు జైనాబ్ రవ్దీతో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్.. జూన్‌లో ఆమె మెడలో మూడుముళ్లు వేశారు. ఈ పెళ్లి వేడుక హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో గ్రాండ్‌గా జరిగింది. తమ్ముడి పెళ్లిలో నాగచైతన్య తన సతీమణి శోభిత ధూళిపాలతో కలిసి సందడి చేశారు.ఈ ఏడాది పెళ్లి తర్వాత వీరిద్దరు కలిసి తొలిసారి దీపావళి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ పండుగ సెలబ్రేషన్స్ ఫోటోను అఖిల్ సతీమణి జైనాబ్ రవ్దీ సోషల్ మీడియాలో షేర్ చేసింది. దీపావళి శుభాకాంక్షలు.. ఈ పండుగ అందరికీ శ్రేయస్సు, మంచి ఆరోగ్యం, శాంతి, ప్రేమతో నిండిన ఏడాదిగా నిలవాలని కోరుకుంటున్నానని పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. ఈ జంటను చూసిన అభిమానులు సోషల్ మీడియాలో క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. ఇటీవలే అఖిల్- జైనాబ్ జంటగా ఎన్టీఆర్ బామ్మర్ది నార్నే నితిన్ పెళ్లి వేడుకలో సందడి చేశారు. View this post on Instagram A post shared by Zainab Ravdjee (@zainabravdjee) -
ఎన్టీఆర్ బామ్మర్ది రిసెప్షన్ వేడుక.. సతీసమేతంగా హాజరైన అక్కినేని అఖిల్
టాలీవుడ్ హీరో నార్నే నితిన్ ఓ ఇంటివాడయ్యారు. శివానీ అనే అమ్మాయి మెడలో మూడు ముళ్లు వేశారు. ఈ నెల పదో తేదీన వీరిద్దరి వెడ్డింగ్ గ్రాండ్‌గా జరిగింది. మ్యాడ్ స్క్వేర్ మూవీతో ఫేమస్ అయిన నితిన్ మన యంగ్ టైగర్ బామ్మర్ది అన్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది మ్యాడ్ స్క్వేర్తో అభిమానులను అలరించిన హీరో సెకండ్ ఇన్నింగ్స్ మొదలెట్టారు.తాజాగా నితిన్ -శివానీల వెడ్డింగ్ రిసెప్షన్ వేడుక జరిగింది. హైదరాబాద్‌లో జరిగిన ఈ వేడుకలో మన అక్కినేని హీరో అఖిల్ కూడా పాల్గొన్నారు. తన సతీమణి జైనాబ్ రవ్దీతో కలిసి గ్రాండ్ రిసెప్షన్‌కు హాజరయ్యారు. అఖిల్ తన భార్య చేయి పట్టుకుని వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇది చూసిన అక్కినేని ఫ్యాన్స్ క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు. -
తాత, తండ్రి, కొడుకు..‘అక్కినేని’మూడు తరాలతో నటించిన ఏకైక హీరోయిన్ ఈమే!
చిత్రపరిశ్రమలో హీరోలకు వయసుతో సంబంధం ఉండదు కానీ..హీరోయిన్లకు మాత్రం కచ్చితంగా ఉంటుంది. 30-35 ఏళ్లు దాటితే చాలు చాన్స్‌లు తగ్గుతాయి. అలా పట్టుమని పదేళ్లు కూడా హీరోయిన్గా రాణించలేరు. వయసు ఉన్నా.. ఖాతాలో హిట్ లేకపోతే అంతే సంగతి. వరుసగా 3-4 ఫ్లాపులు పడ్డాయంటే.. ఇక ఆమె వెండితెరపై మర్చిపోవాల్సిందే. ప్రస్తుతం పదేళ్లకు పైగా ఇండస్ట్రీలో రాణిస్తున్న హీరోయిన్లు చాలా తక్కువే ఉన్నారు. కానీ ఒకప్పుడు హీరోయిన్ స్పాన్ 20 ఏళ్ల వరకు ఉండేది. భారీ హిట్స్ వస్తే..ఆమెను నెత్తినపెట్టుకొని ఆరాధించేవాళ్లు. హీరోలతో సమానంగా వాళ్లకు అభిమానులు ఉండేవాళ్లు. అలాంటి వాళ్లలో రమ్యకృష్ణ(Ramya Krishnan) ఒకరు. దాదాపు రెండు దశాబ్దాలుగా ఆమె హీరోయిన్గా నటించింది.13 సంవత్సరాల వయస్సులోనే ఆమె ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది. తమిళ చిత్ర దర్శకుడు, సి.వి. శ్రీధర్ దర్శకత్వంలో 1983లో విడుదలైన వెల్లై మనసుతో ఆమె సినీ రంగ ప్రవేశం చేసింది. . మె తొలి తెలుగు చిత్రం భలే మిత్రులు (1986). చిరంజీవి,నాగార్జున, వెంకటేశ్, బాలకృష్ణ, మోహన్ బాబు, రాజేంద్రప్రసాద్..ఇలా అప్పటి స్టార్ హీరోలందరితోనూ ఆమె స్క్రీన్ షేర్ చేసుకుంది. అంతేకాదు ‘అక్కినేని’ హీరోలందరితోనూ నటించిన రికార్డు ఆమె పేరిట ఉంది. అక్కినేని నాగేశ్వరరావు మొదలు అఖిల్ వరకు.. మూడు తరాలతో రమ్యకృష్ణ కలిసి నటించింది.అక్కినేని నాగేశ్వరరావుతో ‘దాగుడు మూతలు దాంపత్యం, ఇద్దరే ఇద్దరు, సూత్రధారులు సినిమాల్లో కలిసి నటించింది. ఇక నాగార్జునతో ఆమె 10కి పైగా సినిమాలు చేసింది. అందులో హల్లో బ్రదర్, సంకీర్తన, చంద్రలేఖ, అన్నమయ్య, అల్లరి అల్లుడు లాంటి బ్లాక్ బస్టర్ హిట్స్ కూడా ఉన్నాయి. ఇక అక్కినేని మూడో తరం.. నాగార్జున పెద్ద కొడుకు నాగ చైతన్యతోనూ రమ్యకృష్ణ స్క్రీన్ షేర్ చేసుకుంది. శైలజా రెడ్డి సినిమాలో చైతుకి అత్తగా, బంగార్రాజు చిత్రంలో నానమ్మగా నటించింది. నాగ్ చిన్న కొడుకు అఖిల్ ‘హలో’ మూవీలోనూ రమ్యకృష్ణ కీలక పాత్ర పోషించింది. ఇలా అక్కినేని మూడు తరాలతో నటించిన ఏకైన హీరోయిన్గా రమ్యకృష్ణ నిలిచింది. సమంత కూడా ఈ నలుగురితో కలిసి ‘మనం’ సినిమాలో నటించింది. అయితే విడివిడిగా నటించిన ఏకైక నటి మాత్రం రమ్యకృష్ణ అనే చెప్పాలి. -
2025లో ఒక్క సినిమా కూడా చేయని స్టార్ హీరోలు వీరే!
గతంలో హీరోలు వరుసగా సినిమాలు చేసేవారు. ఏడాదికి రెండు మూడు లేదంటే కనీసం ఒక్క సినిమా అయినా విడుదల చేసేవారు. అయితే ప్రస్తుతం దాదాపు చాలామంది హీరోల నుంచి వరుస పెట్టి సినిమాలు రావడం లేదు. ఒక్కొక్కరు రెండు మూడేళ్లకు ఓ మూవీని ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు. ఏడాదికి ఓ సినిమాని ఆడియన్స్ ముందుకి తీసుకొచ్చే వాళ్లను వేళ్లల్లో లెక్కపెట్టొచ్చు. పైగా ప్రస్తుతం తెలుగు సినిమా స్థాయి ప్రపంచవ్యాప్తంగా పెరిగింది. అందుకే ఇప్పుడు అందరూ భారీ బడ్జెట్‌తో పాన్ ఇండియా సినిమాలవైపు మొగ్గు చూపుతున్నారు.లేట్ అయినా భారీ హిట్ ఇవ్వాలనే ఆలోచనలతో ఇటు హీరోలు, అటు దర్శక–నిర్మాతలు కథ, షూటింగ్, క్వాలిటీ, విజువల్ ఎఫెక్ట్స్ కోసం బాగా సమయం తీసుకుని, ఆచి తూచి ఎంతో జాగ్రత్తగా సినిమాలు చేస్తున్నారు. ఈ కారణంగా షూటింగ్, పోస్ట్ ప్రోడక్షన్‌కే చాలా ఎక్కువ సమయం తీసుకుంటున్నారు. ఈ కారణంగా చిరంజీవి, నాగార్జున, ప్రభాస్, మహేశ్‌బాబు, అల్లు అర్జున్, ఎన్టీఆర్, అఖిల్, నిఖిల్, వరుణ్ తేజ్, శర్వానంద్... ఇలా పలువురు హీరోలు 2025ని మిస్ అవుతున్నారు. ఈ ఏడాది వారు సోలో హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఏమాత్రం లేవు. అలా 2025ని మిస్ అవుతున్న కథానాయకులెవరో చూద్దాం. రెండేళ్లుగా వెయిటింగ్ తెలుగు చలన చిత్ర పరిశ్రమలోని స్టార్ హీరోల్లో చిరంజీవి ఒకరు. ఆయన సినిమా ఎప్పుడొస్తుందా? అని మెగా అభిమానులు రెండేళ్లకు పైగా వెయిటింగ్లో ఉన్నారు. చిరంజీవి హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘భోళా శంకర్’. మెహర్ రమేశ్ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2023 ఆగస్టు 11న విడుదలైంది. ఈ చిత్రం తర్వాత చిరంజీవి నటించిన సినిమా ‘విశ్వంభర’. ‘బింబిసార’ ఫేమ్ వశిష్ఠ దర్శకత్వం వహించిన ఈ మూవీలో త్రిష, ఆషికా రంగనాథ్ హీరోయిన్లుగా నటించారు. విక్రమ్ రెడ్డి సమర్పణలో యూవీ క్రియేష న్స్ పై వంశీకృష్ణా రెడ్డి, ప్రమోద్ ఉప్పల పాటి తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ, హిందీ భాషల్లో నిర్మించారు.ఈ సినిమాని 2025 సంక్రాంతి కానుకగా జనవరి 10న విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ ప్రకటించింది. అందుకు తగ్గట్టే షూటింగ్ కూడా శరవేగంగా జరిగింది. అయితే చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ హీరోగా నటించిన ‘గేమ్ ఛేంజర్’ చిత్రం కోసం ‘విశ్వంభర’ విడుదలను వాయిదా వేశారు మేకర్స్. ఆ తర్వాత ఈ సినిమా రిలీజ్‌పై రకరకాల వార్తలొచ్చాయి. కానీ, ఈ ఏడాది కూడా ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రావడం లేదు. వీఎఫ్ఎక్స్, గ్రాఫిక్స్ కారణంగా ఈ సినిమాని 2026 వేసవిలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు మేకర్స్.ఇదిలా ఉంటే చిరంజీవి హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘మన శంకరవరప్రసాద్ గారు’. ‘పండగకి వస్తున్నారు’ అన్నది ట్యాగ్‌లైన్. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో నయనతార హీరోయిన్ గా నటిస్తున్నారు. అర్చన సమర్పణలో సాహు గార పాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని 2026 సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు రానున్నట్లు ఇప్పటికే చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. దీంతో వరుసగా 2024, 2025ని మిస్ అయ్యారు చిరంజీవి. అయితే వచ్చే ఏడాది రెండు సినిమాల్లో కనిపించి, అలరించనున్నారు.సోలో హీరోగా గ్యాప్ టాలీవుడ్ టాప్ ఫోర్ సీనియర్ హీరోల్లో నాగార్జున కూడా ఒకరు. ఆయన సోలో హీరోగా వచ్చిన చివరి చిత్రం ‘నా సామిరంగ’. విజయ్ బిన్నీ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న రిలీజైంది. అయితే ఆ తర్వాత ఆయన సోలో హీరోగా ఏ చిత్రంలోనూ నటించలేదు. కానీ ‘కుబేర, కూలీ’ సినిమాల ద్వారా తమిళ–తెలుగు ప్రేక్షకులను పలకరించారాయన. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ సినిమాలో ధనుష్‌తో కలిసి స్క్రీన్ చేసుకున్నారు నాగార్జున. ఈ సినిమా జూన్ 20న విడుదలైంది.అలాగే రజనీకాంత్ హీరోగా లోకేశ్ కనగరాజ్ దర్శకత్వం వహించిన ‘కూలీ’ సినిమాలో విలన్ పాత్రలో మెప్పించారు నాగార్జున. ప్రతి నాయకుడిగా ఆయనకు ఇదే మొదటి చిత్రం. ఇక నాగార్జున సోలో హీరోగా రూపొందనున్న వందో చిత్రానికి తమిళ డైరెక్టర్ కార్తీక్ దర్శకత్వం వహించనున్నారు. తన కెరీర్‌లోని ఈ మైలురాయి చిత్రంలో హీరోగా నటించడంతో పాటు అన్నపూర్ణ స్టూడియోస్‌పై స్వయంగా నిర్మించనున్నారు నాగార్జున.ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే లాక్ అయింది. ఆగస్టు 29న నాగార్జున పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా ప్రకటన ఉంటుందని అక్కినేని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూశారు. కానీ, ఎలాంటి అప్డేట్ లేక పోవడంతో వారు నిరాశ చెందారు. ఈ సినిమా ఈ ఏడాది సెట్స్‌పైకి వెళ్లినా విడుదలయ్యేది మాత్రం 2026లోనే. ఆ రకంగా సోలో హీరోగా 2025ని నాగార్జున కూడా మిస్ అయినట్టే. అభిమానులకు నిరాశే వరుస పాన్ ఇండియా చిత్రాలతో ఫుల్ స్వింగ్‌లో దూసుకెళుతున్నారు హీరో ప్రభాస్. ప్రస్తుతం ఆయన చేతిలో నాలుగైదు సినిమాలున్నాయి. ప్రభాస్ సోలో హీరోగా నటించిన ‘కల్కి 2898 ఏడీ’ చిత్రం 2024 జూన్ 27న విడుదలైంది. ఆ తర్వాత ఆయన కథానాయకుడిగా రూ పొందుతోన్న సినిమా ‘ది రాజా సాబ్’. మారుతి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో నిధీ అగర్వాల్, మాళవికా మోహనన్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. టీజీ విశ్వప్రసాద్ నిర్మిస్తున్నారు. రొమాంటిక్ హారర్ జానర్లో రూ పొందుతున్న ఈ సినిమాలో ప్రభాస్ ద్వి పాత్రాభినయం చేస్తున్నారు.దీంతో ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో క్యూరియాసిటీ నెలకొంది. ఇప్పటికే పలుమార్లు వాయిదా పడ్డ ఈ సినిమాని డిసెంబరు 5న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే టాకీ పార్ట్ పూర్తయినా కొన్ని పాటల చిత్రీకరణ బ్యాలెన్స్ ఉండటం, వీఎఫ్ఎక్స్ వల్ల డిసెంబరు 5న ఈ చిత్రాన్ని రిలీజ్ చేయలేక పోతున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ ఇటీవల ప్రకటించారు. దీంతో ప్రభాస్ అభిమానులు నిరాశపడ్డారు. ‘‘ది రాజా సాబ్’ సంక్రాంతికి వస్తే బాగుంటుందని ప్రభాస్ అభిమానులు కోరుకుంటున్నారు.తెలుగు బిజినెస్ సర్కిల్ వారు కూడా ఈ సినిమాని జనవరి 9న విడుదల చేయాలని చెబుతున్నారు. కానీ, హిందీ ఆడియ న్స్ మాత్రం డిసెంబర్ 5న రిలీజ్ చేయాలని కోరుతున్నారు’’ అంటూ టీజీ విశ్వప్రసాద్ తెలి పారు. అయితే తెలుగువారికి పెద్ద పండగైన సంక్రాంతి సందర్భంగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు ఆయన ప్రకటించారు. ఆ రకంగా సోలో హీరోగా 2025ని ప్రభాస్ మిస్ అయినట్టే. అయితే విష్ణు మంచు హీరోగా నటించిన ‘కన్నప్ప’లో రుద్రగా ప్రభాస్ అతిథి పాత్రలో కనిపించి, అలరించారు. ఈ చిత్రం జూన్ 27న విడుదలైంది.నిరీక్షణ తప్పదు మహేశ్‌బాబు హీరోగా రూ పొందుతోన్న తాజా చిత్రం ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ (వర్కింగ్ టైటిల్). ‘ఆర్ఆర్ఆర్’ వంటి బ్లాక్‌బస్టర్ మూవీ తర్వాత ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న సినిమా ఇది. మహేశ్‌బాబు హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వం వహించిన ‘గుంటూరు కారం’ చిత్రం 2024 సంక్రాంతి కానుకగా జనవరి 14న విడుదలైన సంగతి తెలిసిందే. ఆ సినిమా తర్వాత రాజమౌళి సినిమా ‘ఎస్ఎస్ఎమ్బీ 29’ కమిట్ అయ్యారు మహేశ్. ఈ సినిమాలో ప్రియాంకా చో్ర పా, హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కేఎల్ నారాయణ నిర్మిస్తున్నారు.ఈ చిత్రంలో ఇప్పటివరకూ చేయని వైవిధ్యమైన పాత్రలో కనిపించనున్నారు మహేశ్. ఇందుకోసం పొడవాటి జుట్టు, గడ్డంతో మేకోవర్ అయ్యారాయన. ఆఫ్రికా అడవుల నేపథ్యంలో సాగే ఇండియానా జో న్స్ స్టైల్ కథతో ఈ సినిమా రూ పొందుతోందనే వార్తలు గత కొన్నాళ్లుగా వినిపిస్తున్నాయి. రాజమౌళి సినిమా అంటే కనీసం రెండేళ్లకు పైగా చిత్రీకరణకు సమయం పడుతుంది. ఆ తర్వాత పోస్ట్ ప్రోడక్షన్‌కి కూడా ఎక్కువ టైమ్ తీసుకుంటారాయన. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ సినిమా 2026లో విడుదలయ్యే అవకాశాలు లేవని ఫిల్మ్‌నగర్ టాక్. 2027లో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలున్నాయి. ఈ రకంగా చూస్తే 2025 కాదు... 2026ని కూడా మహేశ్ మిస్ అయ్యే అవకాశాలున్నాయి. అప్పటి వరకూ ఆయన అభిమానులకు నిరీక్షణ తప్పదు. రెండేళ్లు గ్యాప్? ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన చిత్రం ‘దేవర: పార్ట్ 1’. కొరటాల శివ దర్శకత్వం వహించిన ఈ సినిమా 2024 సెప్టెంబరు 27న విడుదలైంది. ఆ సినిమా తర్వాత ఆయన హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘ఎన్టీఆర్ నీల్’ (వర్కింగ్ టైటిల్). ‘కేజీఎఫ్, సలార్’ చిత్రాల ఫేమ్ ప్రశాంత్ నీల్ దర్శకత్వం వహిస్తున్నారు. గుల్షన్ కుమార్, భూషణ్ కుమార్, టి. సిరీస్ ఫిల్మ్స్ సమర్పణలో మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్స్‌పై కల్యాణ్ రామ్ నందమూరి, నవీన్ యెర్నేని, రవిశంకర్ యలమంచిలి, హరికృష్ణ కొసరాజు నిర్మిస్తున్నారు.ఈ సినిమా చిత్రీకరణ ప్రస్తుతం శరవేగంగా జరుపుకుంటోంది. ఈ చిత్రానికి ‘డ్రాగ న్ ’ అనే టైటిల్ పరిశీలనలో ఉందని ఫిల్మ్‌నగర్ టాక్. తెలుగు, హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లో 2026 సంక్రాంతి కానుకగా జనవరి 9న ఈ సినిమాని విడుదల చేయనున్నట్లు చిత్రయూనిట్ తొలుత ప్రకటించింది. అయితే రిలీజ్ డేట్లో మార్పు చేసుకుంది. జనవరి 9న కాకుండా జూన్ 25న విడుదల చేయనున్నట్లు చిత్రబృందం పేర్కొన్న విషయం తెలిసిందే.అంటే... సోలో హీరోగా దాదాపు రెండేళ్లు గ్యాప్ వచ్చినట్లు అవుతుంది ఎన్టీఆర్‌కి. ఇదిలా ఉంటే... హృతిక్ రోషన్, ఎన్టీఆర్ నటించిన హిందీ చిత్రం ‘వార్ 2’. ఈ చిత్రం ద్వారా ఎన్టీఆర్ బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చారు. ఈ సినిమా హిందీ, తెలుగు, తమిళ భాషల్లో ఈ నెల 14న విడుదల అయింది. అయితే ఎన్టీఆర్ సోలో హీరోగా నటించిన ఏ సినిమా కూడా 2025లో రిలీజ్ కాలేదు.. అలా ఈ ఏడాదిని ఆయన మిస్ అయినట్లే అని చె ప్పాచ్చు. గ్యాప్ ఇవ్వలేదు... వచ్చింది ‘గ్యాప్ ఇవ్వలేదు.. వచ్చింది..’ అంటూ ‘అల వైకుంఠపురములో...’ సినిమాలో అల్లు అర్జున్ ఓ డైలాగ్ చెబుతారు. అలా ‘పుష్ప 1, 2’ సినిమాల తర్వాత ఆయనకు 2025లో గ్యాప్ వచ్చినట్లే. సుకుమార్ దర్శకత్వం వహించిన ‘పుష్ప: ది రైజ్’, ‘పుష్ప: ది రూల్’ సినిమాలతో అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను అలరించారు హీరో అల్లు అర్జున్. ‘పుష్ప: ది రూల్’ 2024 డిసెంబరు 5న విడుదలై, ప్రపంచవ్యాప్తంగా దాదాపు 1800 కోట్ల రూ పాయల వసూళ్లు సాధించింది.ఆ సినిమా తర్వాత తమిళ డైరెక్టర్ అట్లీతో సినిమా చేస్తున్నారు అల్లు అర్జున్. ‘ఏఏ22 ఏ6’ అనే వర్కింగ్ టైటిల్‌తో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ఈ పాన్ ఇండియా చిత్రంలో బాలీవుడ్ నటి దీపికా పదుకోన్ హీరోయిన్గా ఫిక్స్ అయ్యారు. కళానిధి మార న్ సమర్పణలో సన్‌పిక్చర్స్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం ముంబైలో జరుగుతోంది.‘అవతార్’, ‘డ్యూన్’, ‘బార్బీ’ వంటి హాలీవుడ్ చిత్రాలకు పని చేసిన కన్నెక్ట్ మాబ్ సీన్ అనే ప్రముఖ టెక్నికల్ టీమ్ ఈ చిత్రానికి పని చేస్తోంది. ‘పుష్ప: ది రూల్’ తర్వాత వస్తున్న ఈ సినిమాపై ఇటు ఇండస్ట్రీలో అటు ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ‘ఏఏ22 ఏ6’ చిత్రం 2026 చివర లేదా 2027 సంక్రాంతికి విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అలా 2025ని అల్లు అర్జున్ కూడా మిస్ అయ్యారు. ఇంకా... ⇒ అఖిల్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం ‘లెని న్ ’. ‘ప్రేమ కన్నా ఏ యుద్ధం హింసాత్మకమైనది’ కాదు అనేది ఉపశీర్షిక. మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నారు. అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై నాగార్జున, నాగవంశీ ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అఖిల్ నటించిన చివరి చిత్రం ‘ఏజెంట్’. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న విడుదలైంది. ఆ తర్వాత ఆయన నటిస్తున్న చిత్రం ‘లెనిన్’. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటున్న ఈ మూవీ 2026లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం ఉంది. ఈ లెక్కన వరుసగా 2024, 2025ని అఖిల్ మిస్సయ్యారు. ⇒ వరుణ్ తేజ్ హీరోగా రూ పొందుతోన్న తాజా చిత్రం ‘వీటీ 15’ (వర్కింగ్ టైటిల్). మేర్ల పాక గాంధీ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో రితికా నాయక్ కథానాయికగా నటిస్తున్నారు. యువీ క్రియేష న్స్ , ఫస్ట్ ఫ్రేమ్ ఎంటర్టై న్ మెంట్ సంస్థలు నిర్మిస్తున్నాయి. గత ఏడాది నవంబరు 14న ‘మట్కా’ సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు వరుణ్. తాజాగా ఆయన నటిస్తున్న ‘వీటీ 15’ సినిమా ఈ ఏడాది నవంబరులో విడుదల కానుందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఈ చిత్రం కూడా 2026లోనే రిలీజ్ కానుందని ఫిల్మ్‌నగర్ టాక్. దీంతో వరుణ్ తేజ్ కూడా 2025ని మిస్ అయినట్లే. ⇒ నిఖిల్ హీరోగా నటిస్తున్న తాజా పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’. భరత్ కృష్ణమాచారి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సంయుక్త, నభా నటేశ్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్ బ్యానర్‌పై భువన్, శ్రీకర్ నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశం లేదు. నిఖిల్ నటించిన ‘అప్పుడో ఇప్పుడో ఎప్పుడో’ చిత్రం గత ఏడాది నవంబరు 8న విడుదలైంది. సో... ‘స్వయంభు’ 2026లో రిలీజ్ కానుండటంతో 2025ని నిఖిల్ మిస్సయ్యారని చెప్పాచ్చు. ⇒ శర్వానంద్ హీరోగా నటించిన ‘మనమే’ చిత్రం 2024 జూన్ 7న విడుదలైంది. ఈ సినిమా తర్వాత ఆయన నటిస్తున్న చిత్రాల్లో ‘నారి నారి నడుమ మురారి’ ఒకటి. సంయుక్త, సాక్షీ వైద్య హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఏకే ఎంటర్టై న్ మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఈ ఏడాది విడుదల కావాల్సి ఉన్నా రిలీజ్ డేట్‌పై స్పష్టత లేదు. అదే విధంగా శర్వానంద్, మాళవికా నాయర్ జోడీగా నటిస్తున్న చిత్రం ‘శర్వా 36’ (వర్కింగ్ టైటిల్). అభిలాష్ రెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ జరుపుకుంటోంది. ఈ రెండు చిత్రాలు కూడా ఈ ఏడాది ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశాలు లేవు. ఈ కారణంగా శర్వానంద్ కూడా 2025ని మిస్ అయినట్లే. పైన చెప్పిన హీరోలే కాదు. ఇంకా పలువురు కథానాయకులు 2025ని మిస్ అయ్యారు. 2025ని మిస్ అయినప్పటికీ 2026లో మాత్రం తమ జోరు చూపిస్తామంటున్నారు. – డేరంగుల జగన్ మోహన్ -
డిజాస్టర్ సినిమాలు.. అతను ఒక్క పైసా తీసుకోలేదు: అనిల్ సుంకర
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం 'ఏజెంట్'. అత్యంత భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రం 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైంది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో ఏకే ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు. అయితే, తాజాగా అనిల్ సుంకర ఒక ఇంటర్వ్యూలో మాట్లాడుతూ అఖిల్ రెమ్యునరేషన్ గురించి చెప్పుకొచ్చారు.'ఏజెంట్' సినిమా కోసం అఖిల్ ఒక్క పైసా కూడా పారితోషికం తీసుకోలేదని ఆ చిత్ర నిర్మాత అనిల్ తాజాగా పేర్కొన్నారు. సినిమా మంచి విజయం సాధిస్తే రెమ్యూనరేషన్ తీసుకుంటానని ఆయన ముందే చెప్పాడని నిర్మాత తెలిపారు. అయితే, సినిమా పెద్దగా రన్ కాకపోవడంతో అఖిల్ ఒక్క రూపాయి కూడా తీసుకోలేదని అనిల్ వెల్లడించారు. ఏజెంట్ సినిమా బాక్సాఫీస్ వద్ద కేవలం రూ. 15 కోట్ల మేరకు మాత్రమే రాబట్టింది. దీంతో ఆయన భారీగా నష్టపోయారు. అదే సమయంలో 'భోళా శంకర్' ఫెయిల్యూర్ వల్ల కూడా తాను నష్టపోయానని చెప్పారు. ఆ సమయంలో తనకు చిరంజీవి కొంతమేరకు సాయం చేశారంటూ ఆయన క్లారిటీ ఇచ్చారు.'ఏజెంట్' సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుంది. ఓటీటీలోకి వచ్చిన తర్వాత ఈ చిత్రాన్ని భారీగానే చూశారు. ఈ చిత్రం కోసం అఖిల్ చాలా కష్టపడ్డారు. సినిమా ఫలితం తర్వాత అఖిల్ ఇలా చెప్పారు. 'మేము మా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ చిత్రం తెరపై మేము కోరుకున్న విధంగా మెప్పించలేదు. మేము మీ కోసం మంచి చిత్రాన్ని అందించలేకపోయాము. నాకు పెద్ద సపోర్ట్‌గా నిలిచిన నిర్మాత అనిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. నన్ను నమ్మిన వారి కోసం బలంగా తిరిగి వస్తా.' అంటూ గతంలో ఆయన ఒక నోట్ విడుదల చేశారు. అఖిల్ ప్రస్తుతం లెనిన్ చిత్రంలో నటిస్తున్నారు. -
అఖిల్ మూవీలో జగపతిబాబును వద్దన్న నాగార్జున
గత కొంతకాలంగా విజయాల్లేక తడబడుతున్న అక్కినేని ఫ్యామిలీకి ఈ ఏడాది వరుస హిట్లు వచ్చాయి. నాగచైతన్య తండేల్ సినిమాకు వంద కోట్లు రాగా, నాగార్జున (Nagarjuna Akkineni) కుబేర చిత్రానికి రూ.132 కోట్లు వచ్చాయి. అలా తండ్రీకొడుకులిద్దరూ ఈసారి సెంచరీ కొట్టారు. అఖిల్ అక్కినేని మాత్రం ఈ రేసులో ఎక్కడో ఆగిపోయాడు. ఏజెంట్‌తో డిజాస్టర్ అందుకున్న ఇతడు ప్రస్తుతం లెనిన్ మూవీ చేస్తున్నాడు.టాక్ షోలో నాగ్దీన్ని నాగవంశీతో కలిసి నాగార్జున నిర్మిస్తున్నాడు. అంతేకాదు ఈ మూవీలో అఖిల్‌కు తండ్రిగా కనిపించనున్నారన్న టాక్ కూడా వినిపించింది. ఈ మూవీలో నటించేందుకు జగపతిబాబుకు ఆఫర్ ఇస్తే.. దానికి నాగ్ ఒప్పుకోలేదట! ఈ విషయాన్ని ఆయన జయమ్ము నిశ్చయమ్మురా టాక్ షోలో వెల్లడించాడు. ఈ షోకు జగపతిబాబు వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నాడు. అవును, రిజెక్ట్ చేశా..జగ్గూ భాయ్ మాట్లాడుతూ.. అఖిల్ (Akhil Akkineni) రీసెంట్ సినిమా(లెనిన్)లో ఏదో చిన్న పాత్రకు నన్ను అడిగారట! ఇంత చిన్న క్యారెక్టర్‌కు ఆయన్ను అడగడమేంటి? మేం కలిసేదే తక్కువ. ఇలాంటివి చేస్తే మా స్నేహమే చెడిపోతుంది అన్నావంట కదా అని అడిగాడు. అందుకు నాగ్.. అవును, ఆ చిన్న పాత్రకు నువ్వెందుకని తిరస్కరించాను అని చెప్పాడు. దీంతో జగపతిబాబు థాంక్యూ చెప్తూ.. నిజానికి నీకసలు సంబంధం లేదు. ఆ సినిమాకు నీతోపాటు మరో నిర్మాత కూడా ఉన్నారు. ముందు మనం ఫ్రెండ్స్నువ్వు విలువల్ని పాటిస్తావు.. అది నాకెంతో ఇష్టం అన్నాడు. అది వినగానే నాగ్.. వీటన్నింటికంటే ముందు మనమిద్దరం ఫ్రెండ్స్ అని చెప్పుకొచ్చాడు. లెనిన్ విషయానికి వస్తే.. వినరో భాగ్యము విష్ణు కథ ఫేమ్ కిరణ్ మురళీ కిశోర్ అబ్బూరు దర్శకత్వం వహిస్తున్నాడు. తమన్ సంగీతం అందిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఈ ఏడాది చివర్లో రిలీజ్ చేయాలనుకుంటున్నారు.చదవండి: సినీ పరిశ్రమలో విషాదం.. ప్రముఖ నటి కన్నుమూత -
'నా జీవితంలో అత్యుత్తమమైన రోజు'.. పెళ్లి తర్వాత అఖిల్ పోస్ట్
అక్కినేని హీరో అఖిల్ ఇటీవలే ఓ ఇంటివాడయ్యారు. తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని ఆయన పెళ్లాడారు. ఈ నెల ఆరో తేదీన వీరిద్దరు పెళ్లిబంధంలోకి అడుగుపెట్టారు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఈ గ్రాండ్ వెడ్డింగ్ వేడుకలో టాలీవుడ్ తారలు, సన్నిహితులు సందడి చేశారు.పెళ్లి తర్వాత హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ కూడా ఏర్పాటు చేశారు. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా జరిగిన రిసెప్షన్ వేడుకలో సినీ ప్రముఖులతో పాటు రాజకీయ నాయకులు కూడా పాల్గొన్నారు. తాజాగా పెళ్లి తర్వాత తొలిసారి తన మ్యారేజ్ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నా జీవితంలో అత్యుత్తమ రోజులో కొన్ని క్షణాలను మీతో పంచుకోవాలని నా హృదయానికి అనిపించిందని క్యాప్షన్ రాసుకొచ్చారు. ఈ మధుర జ్ఞాపకాలు అందించిన వారికి ధన్యవాదాలు అంటూ పోస్ట్ చేశారు.కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. ఈ ఏడాదిలోనే వివాహబంధంలోకి అడుగుపెట్టారు. View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
అఖిల్‌కి హ్యాండ్ ఇచ్చిన శ్రీలీల?
కొన్నాళ్ల ముందు వరకు తెలుగులో వరస సినిమాలు చేసిన శ్రీలీల.. ప్రస్తుతం టాలీవుడ్‌తో పాటు కోలీవుడ్, బాలీవుడ్‌లోనూ కొత్త మూవీస్ చేస్తోంది. సరైన హిట్స్ పడట్లేదు గానీ ఇప్పటికీ ట్రెండింగ్ హీరోయిన్గా కొనసాగుతోందని చెప్పొచ్చు. అలాంటిది ఇప్పుడు ఈమె.. అఖిల్ సినిమాకు హ్యాండ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఇంతకీ అసలేంటి విషయం?(ఇదీ చదవండి: జపనీస్ వీడియో గేమ్‌లో రాజమౌళి.. ఇదో క్రేజీ రికార్డ్)శ్రీలీల చేతిలో ప్రస్తుతం రెండు హిందీ సినిమాలు, ఒక తమిళ సినిమా ఉంది. అలానే తెలుగులో అక్కినేని అఖిల్ సరసన 'లెనిన్' అనే మూవీ కూడా చేస్తోంది. ఈ ఏప్రిల్‌లో అఖిల్-శ్రీలీల జంటగా కనిపించనున్నారని ఓ వీడియో రిలీజ్ చేసి అనౌన్స్మెంట్ కూడా ఇచ్చారు. దీపావళికి మూవీ రిలీజ్ అనుకుంటున్నారు. అయితే ఎక్కువగా హిందీ, తమిళ సినిమాలకే డేట్స్ ఇస్తున్న కారణంగా శ్రీలీలకు బదులు మరో హీరోయిన్ని చూసుకోవాలని టీమ్ భావిస్తుందట.శ్రీలీల చివరగా తెలుగులో 'రాబిన్ హుడ్' మూవీలో కనిపించింది. త్వరలో 'మాస్ జాతర' చిత్రంతో రాబోతుంది. ఇది కాకుండా పవన్ కల్యాణ్ 'ఉస్తాద్ భగత్ సింగ్'లోనూ ఈమెనే హీరోయిన్. కొన్నిరోజుల క్రితమే ఈ చిత్ర షూటింగ్ కూడా మొదలైంది. హిందీలో ఆషికి 3, తమిళంలో 'పరాశక్తి' చేస్తోంది. ఈమె నటించిన కన్నడ చిత్రం 'జూనియర్' రిలీజ్ కావాల్సి ఉంది.(ఇదీ చదవండి: ఓటీటీలో క్రేజీ సిరీస్.. 'ఫ్యామిలీ మ్యాన్ 3' కొత్త అప్డేట్) -
అఖిల్ వెడ్డింగ్.. శోభితను అలా చూస్తుండిపోయిన నాగచైతన్య!
ఏడాది వ్యవధిలోనే అక్కినేని వారి ఇంట రెండు పెళ్లిళ్లు జరిగాయి. గతేడాది నాగచైతన్య- హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను పెళ్లాడారు. ఆ తర్వాత ఇటీవలే అఖిల్ అక్కినేని సైతం ఓ ఇంటివాడయ్యారు. గతేడాది తన ప్రియురాలు జైనాబ్‌తో ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్ జూన్ 6న తన మెడలో మూడు ముళ్లు వేశారు. వీరిద్దరి గ్రాండ్ వెడ్డింగ్‌కు సన్నిహితులు, కుటుంబ సభ్యులు హాజరయ్యారు. ఈ పెళ్లి వేడుకలో నాగచైతన్య- శోభిత పాల్గొని సందడి చేశారు. తమ్ముడి వెడ్డింగ్‌లో చైతూ- శోభిత స్పెషల్ అట్రాక్షన్‌గా కనిపించారు.తాజాగా వీరిద్దరి సంబంధించిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ పెళ్లి వేడుకలో శోభిత ధూలిపాళ్ల దోశ తింటూ ఉండగా.. పక్కనే నాగచైతన్య తన సతీమణి వైపే అలానే చూస్తూ ఉండిపోయారు. ఈ వెడ్డింగ్‌లో తన భార్యతో కలిసి సంప్రదాయ దుస్తుల్లో మెరిశారు చైతూ. ఈ వీడియోను ప్రముఖ కేటరింగ్ సంస్థ తమ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసింది. ఈ వీడియో నెట్టింట వైరల్ కావడంతో అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.అఖిల్ గ్రాండ్ వెడ్డింగ్ తర్వాత హైదరాబాద్‌లో రిసెప్షన్ నిర్వహించారు. ఈ వేడుకకు టాలీవుడ్ సినీ ప్రముఖులు, రాజకీయ నాయకులు కూడా హాజరయ్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఏర్పాటు చేసిన ఈ వేడుకలో అఖిల్- జైనాబ్ జంటను ఆశీర్వదించారు. దీనికి సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలోనూ వైరలయ్యాయి. -
సీక్రెట్ చెప్పిన శోభిత.. ట్రోలర్స్‌కు కౌంటర్?
కింగ్ అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) తీరిక లేకుండా వరుస పనులతో బిజీగా ఉన్నాడు. గతేడాది చివర్లో పెద్ద కొడుకు నాగచైతన్య పెళ్లి చేశాడు. ఆ తర్వాత షూటింగ్స్‌లో మునిగాడు. ఈ నెలలో (జూన్ 6న) చిన్నకుమారుడు అఖిల్ వివాహం జరిపించాడు. అతడు ప్రేమించిన అమ్మాయి జైనబ్ రవ్జీతోనే ఘనంగా పెళ్లి జరిపించి ఆమెను చిన్న కోడలిగా స్వీకరించాడు. పెళ్లి సింపుల్‌గా అయిపోయినా రిసెప్షన్ మాత్రం ఎంతో ఘనంగా జరిగింది. అందంగా ముస్తాబైన శోభితతాజాగా చై సతీమణి, హీరోయిన్ శోభిత ధూళిపాళ (Sobhita Dhulipala) జూన్ ముచ్చట్లు అంటూ కొన్ని ఫోటోలు షేర్ చేసింది. అందులో అఖిల్ పెళ్లి సెలబ్రేషన్స్‌లో తను ముస్తాబైన పిక్స్‌ను పంచుకుంది. ఓ ఫోటోలో ఆరెంజ్ డ్రెస్‌లో శోభిత చాలా అందంగా మెరిసిపోగా.. మరోదాంట్లో మామ నాగార్జునను ఆత్మీయంగా హత్తుకుంది. అలాగే బరాత్ కోసం ఏర్పాటు చేసిన డీజే ఫోటోను కూడా యాడ్ చేస్తూ ఫుల్‌గా ఎంజాయ్ చేశామని చెప్పకనే చెప్పింది.ట్రోలర్స్‌కు కౌంటర్?పనిలో పనిగా ఓ సీక్రెట్ చెప్పింది. నా సీక్రెట్ ఏంటో తెలుసా? ఎవరేమనుకుంటున్నారు? అసలేం జరుగుతుందనేది పట్టించుకోకపోవడమే అని కృష్ణమూర్తి చెప్పిన మాటను యథాతథంగా పొందుపరిచింది. అఖిల్ పెళ్లిలో శోభిత లుక్‌పై చాలానే ట్రోల్స్ వచ్చాయి. తను.. నాగచైతన్య పక్కన భార్యలా కాదు, ఆంటీలా ఉందని కొందరు నెగెటివ్ కామెంట్లు చేశారు. తన డ్రెస్సింగ్ స్టైల్, లుక్‌పైనా విమర్శలు వచ్చాయి. వాటన్నింటికీ కౌంటర్‌గానే ఐ డోంట్ కేర్ అనే సందేశాన్ని యాడ్ చేసినట్లు తెలుస్తోంది. View this post on Instagram A post shared by Sobhita Dhulipala (@sobhitad)చదవండి: రూ.230 కోట్ల మూవీ.. డైలాగ్‌తో సహా కథంతా కాపీయే!: దర్శకుడి -
అఖిల్‌తో పెళ్లి క్యాన్సిల్.. శ్రీయ భూపాల్ ఎవరు? ఇప్పుడేం చేస్తోంది?
పీటల దాకా వచ్చిన పెళ్లిళ్లు ఆగిపోతే అది సామాన్యులకు సంకటం కావచ్చు కానీ సెలబ్రిటీల భవిష్యత్తుకు ఏ మాత్రం ఆటంకం కాదనేది తెలిసిందే. అందుకే ప్రేమలు, పెళ్లిళ్లు, బ్రేకప్‌లు సర్వసాధారణంగా కనిపించే తారా లోకంలో సంఘటనలు సామాన్యులకు ఎప్పుడూ వింతల్లా, విశేషాల్లాగే ఉంటాయి. అలాంటిదే అఖిల్ ప్రేమ, నిశ్చితార్ధం, బ్రేకప్... తాజాగా పెళ్లి... అక్కినేని వంశ ఘనమైన నట వారసత్వాన్ని మోయడానికి సినీ రంగంలోకి దిగిన అఖిల్... ఇంకా కెరీర్ నిర్మాణంలో తడబడుతూనే ఉన్నాడనేది తెలిసిందే. అయితే కారణం తెలీదు గానీ చాలా మంది నట వారసులకు భిన్నంగా ఇంకా కెరీర్ రూపుదిద్దుకోకుండానే అఖిల్ పెళ్లికి మాత్రం తొందరపడ్డాడనే చెప్పాలి. నిజానికి 2016లో, అఖిల్ అక్కినేని తన ప్రియురాలైన 26 ఏళ్ల శ్రియా భూపాల్‌తో నిశ్చితార్థం చేసుకున్నప్పుడు కేవలం 22 సంవత్సరాలు అని సమాచారం. అంటే అక్కినేని యంగ్ హీరోకి ఆమెకీ దాదాపు 4 సంవత్సరాల వయస్సు అంతరం ఉందని తెలుస్తోంది. విచిత్రం ఏమిటంటే...తాజాగా అఖిల్ పెళ్లి చేసుకున్న యువతి కూడా తనకన్నా వయసులో పెద్ద అంటూన్నారు.మరోవైపు అఖిల్‌తో పెళ్లి రద్దు చేసుకున్న శ్రియా భూపాల్(Shriya Bhupal) ఎవరు? ప్రస్తుతం ఏం చేస్తోంది? అనే విషయానికి వస్తే... హైదరాబాద్‌లో అత్యంత సంపన్న కుటుంబాల్లో ఒకటైన జివికె వారి ఇంట జన్మించిన శ్రియ, ప్రముఖ సెలబ్రిటీ ఫ్యాషన్ డిజైనర్, కాస్ట్యూమ్ మేకర్. ప్రపంచంలోని అత్యంత ప్రతిష్టాత్మక ఫ్యాషన్ స్కూల్లలో ఒకటిగా ప్రసిద్ధి చెందిన న్యూయార్క్‌లోని పార్సన్స్ స్కూల్ ఆఫ్ డిజైన్ నుంచి ఫ్యాషన్ డిజైనింగ్ కోర్సులో ఆమె పట్టభద్రురాలైంది, ఫ్యాషన్ డిజైనర్‌గా శ్రియా శరణ్, సమంతా రూత్ ప్రభు కాజల్ అగర్వాల్ వంటి టాప్ టాలీవుడ్ సెలబ్రిటీలకు కూడా ఆమె డిజైన్లను అందించారు. అంతేకాకుండా శ్రియా ’శ్రియా సోమ్’ అనే దుస్తుల బ్రాండ్ కు వ్యవస్థాపకురాలు కూడా. ప్రస్తుతం ఆమె లో ప్రొఫైల్ మెయిన్ టెయిన్ చేస్తున్నా... తన పనిలో బిజీగానే ఉన్నారని సమాచారం.అఖిల్‌తో బ్రేకప్ తర్వాత ఆమె చాలా వేగంగా కొత్త అనుబంధంలోకి అడుగుపెట్టింది. తెలంగాణ రాజకీయ ప్రముఖుడు, ఎంపి కొండా విశ్వేశ్వర్ రెడ్డి కుమారుడైన అనిందిత్ రెడ్డి ని ఆమె పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరికీ ఒక బిడ్డ కూడా ఉన్నాడు. సినిమా సెలబ్రిటీ కాకపోయినా అనిందిత్ రెడ్డి కూడా సాదా సీదా యువకుడేమీ కాదు. అత్యంత అరుదైన రంగంలో అతను రాణిస్తున్నాడు. హైదరాబాద్ నుంచి టాప్ క్లాస్ రేసింగ్ డ్రైవర్‌గా నిలిచాడు. గత 2016లో యూరో జెకె 16 ఛాంపియన్ షిప్, యూరో జెకె 2017 ఛాంపియన్ షిప్‌లలో పాల్గొన్నాడు, ఫెడరేషన్ ఆఫ్ మోటార్‌స్పోర్ట్స్ క్లబ్స్ ఆఫ్ ఇండియా (ఎఫ్ఎమ్ఎస్సి)లో 2017లో మోటార్‌స్పోర్ట్ పర్సన్ ఆఫ్ ది ఇయర్‌గా నిలిచాడు.అతను ఢిల్లీలో జరిగిన వోక్స్వ్యాగన్ వెంటో కప్ 2015ను గెలుచుకున్నాడు.2019లో, అతను వరల్డ్ మోటార్ స్పోర్ట్స్ ఫార్మ్ నుంచి అత్యుత్తమ పెర్ఫార్మర్గా ఎంపికయ్యాడు. -
అఖిల్ రిసెప్షన్లో అట్రాక్షన్‌గా 'శోభిత ధూళిపాళ' చీర.. ధర ఎంతో తెలుసా? (ఫోటోలు)
-
Akhil-Zainab Reception: స్పెషల్ ఎట్రాక్షన్‌గా శోభితా ధూళిపాళ.. లక్షలు ఖరీదు చేసే..
అఖిల్-జైనాబ్ వివాహ రిసెప్షన్(Akhil Akkineni-Zainab's wedding reception)లో నూతన వధువరులిద్దరూ సింపుల్ లుక్‌లో అందరిని కట్టిపడేశారు. వివాహం అనంతరం అక్కినేని ఫ్యామిలీ రిసెప్షన్ వేడుకను నిర్వహించింది. ఈ కార్యక్రమానికి నాగ చైతన్య, శోభితా ధూళిపాళ హాజరు కావడం ప్రధాన అకర్షణగా నిలిచింది. ఈ రిసెప్షన్ వేడుకలో శోభితా ఎర్రటి శాటిన్ చీరలో స్టైలిష్ లుక్‌లో కనిపించిది. ఈ చీరకు మ్యాచింగ్‌గా బంగారు వర్ణం బ్లౌజ్‌ను ధరించడం మరింత ట్రెండీగా కనిపించింది. అయితే శోభితా అందమైన లుక్ కంటే ఆమె ధరించిన డియోర్ బ్యాగ్ అందరి దృష్టిని ఆకర్షించింది. శోభితా ధరించిన చీరకు పూర్తి విభిన్నంగా బ్లాక్ బ్యాగ్ ఎంచుకోవడం మరింత హైలెట్‌గా నిలిచింది. అయితే ఈ బ్యాగ్ ధర వింటే కళ్లు చెదిరిపోతాయ్. ఇది అక్షరాల రూ. 3 లక్షల పైనే పలుకుతుందట. ఇక అఖిల్ జైనాబ్ వివాహ వేడుకలో చైతూ, శోభితాల జంట తెలుపు, క్రీమ్ కలర్ డిజైనర్‌వేర్‌లలో కనిపించి సందడి చేశారు. అంతేగాదు వారిద్దరూ జైనాబ్ను తమ కుటుంబంలోకి ఆహ్వానిస్తూ..ప్రత్యేకంగా హృదయపూర్వక అభినందనలు తెలిపారు. కాగా, అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట వరుస శుభాకార్యాలు జరిగాయి. గతేడాది చివర్లో నాగచైతన్య- శోభిత (Sobhita Dhulipala) పెళ్లి జరగ్గా ఇటీవల (జూన్ 6, 2025న) అఖిల్ వివాహం జరిగింది. బిజినెస్మెన్ జుల్ఫీ రవ్జీ కూతురు జైనబ్‌ను అఖిల్ (Akhil Akkineni) వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకను నాగార్జున సింపుల్‌గా ఇంట్లోనే జరిపించాడు. అయితే రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది.(చదవండి: Akhil-Zainab Reception డైమండ్ నగలతో, గార్జియస్‌గా అఖిల్ అర్థాంగి) -
బొమ్మలా నిల్చున్న జైనబ్.. తమన్ ఇచ్చిన గిఫ్ట్ ఏంటో తెలుసా?
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని (Akhil Akkineni) పెళ్లి సింపుల్‌గా, రిసెప్షన్ ఘనంగా జరిగింది. ప్రియురాలు జైనబ్ రవ్జీని అఖిల్ హిందూసాంప్రదాయం ప్రకారం వివాహం చేసుకున్నాడు. జూన్ 6న వెడ్డింగ్, 8న రిసెప్షన్ వేడుకలు జరిపారు. రిసెప్షన్లో ఎంతోమంది టాలీవుడ్ సెలబ్రిటీలు సందడి చేశారు. అందుకు సంబంధించిన ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.వీడియో 1జైనబ్ బొమ్మలా నిల్చుని ఉంటే ఓ యువకుడు తనకు చకచకా పెళ్లిచీర కట్టేశాడు. ఇది చూసిన జనాలు అయ్యో, జైనబ్‌కు చీర కట్టుకోవడం రాదా? అని కామెంట్లు చేస్తున్నారు. ఏదేమైనా సులువుగా ఆమెకు చీర కట్టేసిన యువకుడి నైపుణ్యాన్ని మెచ్చుకుంటున్నారు.వీడియో 2అఖిల్- జైనబ్ రిసెప్షన్‌కు మ్యూజిక్ డైరెక్టర్ తమన్ కూడా హాజరయ్యాడు. తన ఫ్రెండ్స్ గ్యాంగ్‌తో స్టేజీ ఎక్కిన తమన్.. ఫ్రెండ్‌కు ఊహించలేని బహుమతిచ్చాడు. క్రికెట్ బ్యాట్‌ను కానుకగా ఇచ్చాడు. దీంతో పెళ్లికూతురు సహా అక్కడున్నవారంతా ఒక్కసారిగా నవ్వారు. అభిమానులు సైతం ఇదేం గిఫ్ట్రా నాయనా.. అని కామెంట్లు చేస్తున్నారు. నిజానికి సినిమాల్లో తడబడుతున్న అయ్యగారు (అఖిల్) క్రికెట్లో మాత్రం నెం.1. సెలబ్రిటీ క్రికెట్ లీగ్ (CCL) టోర్నీలో తెలుగు వారియర్స్ జట్టు కెప్టెన్‌గా ఉన్నారు. తమన్ ఈ జట్టులోనే ఆడుతున్నాడు. Bro wait .! 🙄 pic.twitter.com/3InivJmTjc— 🕴🏼 (@kaali02) June 11, 2025 Thaman gifted a cricket bat to #AkhilAkkineni at his reception! pic.twitter.com/Mu914iRI2a— Movies4u Official (@Movies4u_Officl) June 11, 2025 చదవండి: ఆ హీరోయిన్ను సీక్రెట్‌గా ఫాలో అవుతున్నా.. ఆమె చాలా స్పీడు -
Akhil-Zainab డైమండ్ నగలతో గార్జియస్‌గా అఖిల్ అర్థాంగి
Akhil-Zainab Reception నూతన వధూవరులు అక్కినేని అఖిల్, జైనబ్ రవ్జీ రిసెప్షన్ వేడుకలో అందంగా మెరిసారు. మూడు ముళ్ల వేడుక అనంతరం అక్కినేని ఫ్యామిలీ రిసెప్షన్ ఇచ్చింది. ఈ వేడుకల్లో పలువురు సెలబ్రిటీలు సందడిగా కనిపించారు. ఆర్టిస్ట్, వ్యాపారవేత్త జైనబ్ రవద్జీ రిసెప్షన్ లుక్ వైరల్‌గా మారింది. మేకప్ ఆర్టిస్ట్ సూర్య సింగ్ జైనబ్ లుక్కు సంబంధించిన వీడియోన, ఫోటోలను ఇన్‌స్టాలో షేర్ చేశారు. దీంతో ఈ వీడియో అక్కినేని అభిమానులను విపరీతంగా ఆకట్టుకుంటోంది. సింపుల్‌గా నెట్టెడ్ ఫ్రాక్ ధరించిన జైనబ్ మినిమల్ మేకప్‌తో అందంగా మెరిసింది. అలాగే పెళ్లికి ధరించినట్టు గానే మొత్తం వజ్రాభరణాలను ఎంచుకుంది. డైమండ్ చౌకర్, లేయర్డ్ చెయిన్ ధరించింది. మ్యాచింగ్‌గా చెవులకు డైమండ్ ఝుంకీలు వేసుకుంది. అటు కొత్త పెళ్లి కొడుకు అఖిల్ కూడా సింపుల్ లుక్‌లో అదరగొట్టేశాడు. View this post on Instagram A post shared by Surya Singh (@suryasinghmakeup)మరోవైపు టాలీవుడ్ యంగ్ హీరో మరిది అఖిల్ రిసెప్షన్ లో రెడ్ సారీలో అక్కినేని వారి పెద్ద కోడలు నాగ చైతన్య భార్య శోభిత ధూళిపాళ లుక్ నెట్టింట సందడిగా మారింది. భర్త నాగ చైతన్యతో కలిసి ఆమె ఫోటోలకు ఫోజులిచ్చారు. అక్కినేని నాగార్జున, అమల దంపతుల కుమారుడు అఖిల్ అక్కినేని వివాహం తరువాత రిసెప్షన్ వేడుక ఘనంగా నిర్వహించిన సంగతి తెలిసిందే. -
Akhil-Zainab Reception: తమ్ముడి రిసెప్షన్.. అన్నావదినలదే హవా!
అక్కినేని నాగార్జున (Nagarjuna Akkineni) ఇంట వరుస శుభాకార్యాలు జరిగాయి. గతేడాది చివర్లో నాగచైతన్య- శోభిత (Sobhita Dhulipala) పెళ్లి జరగ్గా ఇటీవల (జూన్ 6, 2025న) అఖిల్ వివాహం జరిగింది. బిజినెస్మెన్ జుల్ఫీ రవ్జీ కూతురు జైనబ్‌ను అఖిల్ (Akhil Akkineni) వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. ఈ వివాహ వేడుకను నాగార్జున సింపుల్‌గా ఇంట్లోనే జరిపించాడు. అయితే రిసెప్షన్ మాత్రం అన్నపూర్ణ స్టూడియోలో ఎంతో గ్రాండ్‌గా జరిగింది. కొత్త జంటను ఆశీర్వదించేందుకు మహేశ్‌బాబు, రామ్‌చరణ్, సూర్య, యశ్, నిఖిల్, అల్లరి నరేశ్, సుకుమార్, బుచ్చిబాబు, తమన్.. ఇలా ఎంతోమంది వచ్చారు.రిసెప్షన్లో హైలైట్..ఈ ఫోటోలను అన్నపూర్ణ స్టూడియో అధికారిక ఎక్స్ (ట్విటర్) హ్యాండిల్లో రిలీజ్ చేశారు. తాజాగా నాగచైతన్య- శోభితల స్పెషల్ ఫోటోను వదిలారు. తమ్ముడి పెళ్లిలో చై సూటుబూటేసుకుని హుందాగా కనిపించగా శోభిత ఎరుపు చీరతో ఆకట్టుకుంది. ఈ చీరకు మ్యాచింగ్‌గా బంగారు వర్ణం బ్లౌజ్‌ను ధరించడంతో మరింత ట్రెండీగా కనిపించింది. అటు బరాత్‌లో చై.. డీజే దగ్గర సందడి చేస్తూ కనిపించాడు. చై సంబరం చూసిన నెటిజన్లు.. తమ్ముడి పెళ్లంటే ఆమాత్రం జోష్ ఉండాలిగా.. అని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Annapurna Studios (@annapurnastudios) My Demigod Marriage Vibes 🔥King Akhil Chay 🤯Energy Levels 💥#AkhilWedding #AkhilAkkineni pic.twitter.com/EEIhmEyWy5— King Srinu (@KingSrinu0120) June 6, 2025 చదవండి: ఇది నా జీవితంలో ఓ మైలురాయి.. సింగర్ సునీత ఎమోషనల్ -
అఖిల్ పెళ్లి.. 33 ఏళ్లనాటి సీన్ రిపీట్.. అచ్చం నాన్నలాగే..
టాలీవుడ్ హీరో అఖిల్ అక్కినేని ఓ ఇంటివాడయ్యారు. ఈ నెల 6న తన ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేశారు. కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో జైనాబ్ రవ్దీని అఖిల్ పెళ్లాడారు. ఈ పెళ్లి వేడుకలో పలువురు సినీ ప్రముఖులు సందడి చేశారు. గతేడాది నవంబర్‌లో ఎంగేజ్మెంట్ చేసుకున్న వీరిద్దరు పెళ్లిబంధంలో కొత్త జీవితం ప్రారంభించారు.తాజాగా వీరి పెళ్లి వేడుక తర్వాత నాగార్జున పెళ్లి ఫోటోను వైరలవుతోంది. అఖిల్- జైనాబ్ పెళ్లిని నాగార్జున- అమల్ పెళ్లి (వీరి వివాహం 1992లో జరిగింది) ఫోటోతో పోలుస్తూ ఓ నెటిజన్ పోస్ట్ చేశాడు. అచ్చం నాన్న స్టైల్లోనే అఖిల్ పెళ్లి ఫోటో ఉందంటూ ఇద్దరి ఫోటోలను జత చేస్తూ ట్విటర్ ద్వారా పంచుకున్నారు. చూసేందుకు రెండు ఫోటోలు ఓకేలాగా కనిపించడంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. అఖిల్ - జైనాబ్ కూడా నాగార్జున-అమల మాదిరిగానే కుర్తా, చీరను ధరించారు. అఖిల్ పెళ్లి వేళ నాగార్జున-అమల వివాహ వేడుక ఫోటోను చూసిన అభిమానులు క్రేజీ కామెంట్స్ చేస్తున్నారు.పెళ్లి తర్వాత టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో గ్రాండ్ రిసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ వేడుకలో రామ్ చరణ్, మహేష్ బాబు, యశ్‌తో సహా పలువురు సినీ ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాగా.. 2016లోనే వ్యాపారవేత్త జీవీ కృష్ణారెడ్డి మనవరాలు శ్రియ భూపాల్‌తో అఖిల్‌కు నిశ్చితార్థం జరిగింది. ఆ తర్వాత 2017లో ఊహించని విధంగా వివాహం రద్దైన సంగతి తెలిసిందే. #KingNagarjunaAmala #AkhilZainab Same pattern... ❤️ pic.twitter.com/R2z5vyH8uw— NagaKiran Akkineni (@NagaKiran60) June 8, 2025 -
పెళ్లి తరువాత తొలిసారి జంటగా : అఖిల్- జైనబ్ డాజ్లింగ్ లుక్
మోస్ట్ అడోరబుల్ సెలబ్రిటీ కపుల్ అఖిల్ అక్కినేని, జైనబ్ ( Akhil -Zainab ) జంట పెళ్లి తరువాత తొలిసారి సందడి చేశారు. మూడు ముళ్ల బంధంలోకి అడుగుపెట్టి జీవితంలో కొత్త అధ్యాయాన్ని ప్రారంభించిన ఈ జంటే ఇపుడు టాలీవుడ్లో హాట్ టాపిక్. కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో జూన్ 6న పెళ్లి చేసుకున్న ఈ జంటల ఫోటోలు, వీడియోలు ఇప్పటికే నెట్టింట సందడి చేస్తున్నాయి. తాజాగా సూఫీ నైట్‌లో అందంగా మెరిసారు. మురిపెంగా ఒకరి చేతిలో ఒకరు చేయి వేసుకుని అందర్నీ అబ్బుర పరిచారు.సూఫీ రాత్రిలో అఖిల్- జైనాబ్ అద్భుతంగాసెలబ్రిటీ జంట, అఖిల్ అక్కినేని లేడీ లవర్ జైనాబ్ సూఫీ కార్యక్రమంలో కనువిందు చేశారు. జైనాబ్ పూల ప్రింట్‌తో ఉన్న లాంగ్ ఫ్రాక్ ధరించగా, అఖిల్ నేవీ బ్లూ షేర్వాన, పైజామాతో కనిపించాడు. మాంగ్ టీకా, డైమండ్ నెక్‌పీస్‌తో తన లుక్‌ను మరింత అద్భుతంగా మల్చుకుంది. ఈ వేడుకలో కూడా డైమండ్ ఎంగేజ్మెంట్ రింగ్ స్పెషల్‌గా కనిపించింది. వివాహం తర్వాత నూతన వధూవరులుగా తొలిసారి ఇలా కనిపించి అలంకరించారు. పవర్ కపుల్ వరుణ్ జైన్, అతని భార్య సన్యా ఈ వేడుకలో కనిపించారు.అఖిల్ - జైనబ్ వెడ్డింగ్ 2024 నవంబర్ 26న నిశ్చితార్థం చేసుకున్న అఖిల్ -జైనాబ్ మూడేళ్ల బంధం తరువాత ఈ నెలలో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. పెళ్లి తరువాత గ్రాండ్రిసెప్షన్ కూడా ఇచ్చారు. మహేష్ బాబు, చిరంజీవి, రాంచరణ్, ప్రశాంత్ నీల్ లాంటి సినీ ప్రముఖులతోపాటు, అనేక రాజకీయ, క్రీడారంగ సెలబ్రిటీలు ఈ పార్టీకి హాజరై కొత్త దంపతులను ఆశీర్వదించారు. -
అఖిల్ రిసెప్షన్లో సింపుల్‌గా మహేశ్.. ఆ టీ షర్ట్ ధర లక్షల్లో..!
అందరికీ వయసు పెరుగుతుంది. కానీ టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్‌బాబు (Mahesh Babu)కు మాత్రం వయసు తగ్గిపోతూ వస్తుంది. అన్నం తింటాడా? అందం తింటాడా? అన్నంత హ్యాండ్సమ్గా కనిపిస్తుంటాడు. కుమారుడు గౌతమ్ పక్కన నిలబడితే అతడికి తండ్రిలా కాదు, అన్నలా ఉంటాడు. మహేశ్ అందం గురించి చెప్తే మాటలు సరిపోవు. అతడి ఫోటో కనిపిస్తే చాలు సోషల్ మీడియా షేకైపోతుంది.సింపుల్‌గా టీ షర్ట్‌లో మహేశ్తాజాగా మహేశ్.. అక్కినేని ఇంట శుభకార్యానికి హాజరయ్యాడు. నాగార్జున చిన్న కుమారుడు అఖిల్ అక్కినేని- జైనబ్ రవ్జీలు జూన్ 6న పెళ్లి చేసుకున్నారు. ఆదివారం (జూన్ 8న) అన్నపూర్ణ స్టూడియోలో వీరి రిసెప్షన్ ఘనంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్.. భార్య నమ్రత, కూతురు సితారను తీసుకుని హాజరయ్యాడు. అయితే మహేశ్.. సింపుల్‌గా టీ షర్ట్ వేసుకుని వెళ్లాడు. లక్ష పైచిలుకు..చూడటానికి సింపుల్‌గా కనిపిస్తున్న ఈ టీ షర్ట్ ధర వేలల్లో కాదు లక్షల్లోనే ఉంది. ఫ్లవర్ ప్రింటింగ్ ఉన్న ఈ టీషర్ట్.. హెర్మ్స్ అనే లగ్జరీ బ్రాండ్‌కు చెందినది. దీని ధర దాదాపు రూ.1.37 లక్షలని తెలుస్తోంది. సినిమాల విషయానికి వస్తే మహేశ్ చివరగా గుంటూరు కారం అనే సినిమాలో కనిపించాడు. ప్రస్తుతం రాజమౌళితో #SSMB 29 చేస్తున్నాడు. ఇందులో ప్రియాంక చోప్రా కథానాయికగా నటిస్తోంది. పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు.చదవండి: అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా? -
అఖిల్ అక్కినేని రిసెప్షన్.. ఈ విషయం గమనించారా?
అక్కినేని ఇంట వరుస శుభకార్యాలు జరుగుతున్నాయి. గతేడాది చివర్లో నాగార్జున (Nagarjuna Akkineni) పెద్ద కుమారుడు నాగచైతన్య వివాహం శోభితతో జరిగింది. ఆరు నెలలు తిరిగేసరికి చిన్న కుమారుడు అఖిల్ పెళ్లి.. జైనబ్‌తో జరిపించాడు. ఈ రెండు కూడా ప్రేమ పెళ్లిళ్లు కావడం విశేషం. జూన్ 6న పెద్ద హడావుడి లేకుండా తన ఇంట్లోనే పెళ్లి జరిపించాడు నాగ్. కానీ రిసెప్షన్ మాత్రం గ్రాండ్‌గా ఏర్పాటు చేశాడు. రెండు రోజుల గ్యాప్‌తో రిసెప్షన్జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో అంగరంగ వైభవంగా రిసెప్షన్ జరిగింది. మహేశ్‌బాబు, రామ్ చరణ్, నిఖిల్, సూర్య, యశ్, నాని, కిచ్చా సుదీప్, దిల్ రాజు, సుకుమార్, బుచ్చిబాబు.. ఇలా పలువురు సెలబ్రిటీలు ఈ ఫంక్షన్‌కు హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. అందుకు సంబంధించిన ఫోటోలు కూడా నెట్టింట వైరల్‌గా మారాయి. అయితే ఈ ఫోటోల్లో మీరో విషయం గమనించారా? అఖిల్ (Akhil Akkineni) దాదాపు అన్ని ఫోటోల్లోనూ జైనబ్ చేయి పట్టుకునే కనిపించాడు. అఖిల్-జైనబ్ ఫ్యామిలీ ఫోటోఅన్ని ఫోటోల్లోనూ..ఆమె చేతిని అస్సలు విడిచిపెట్టడం లేదు. సినీతారలే కాదు, సీఎం రేవంత్ రెడ్డి సహా పలువురు రాజకీయ నాయకులు వచ్చినప్పుడు కూడా భార్య చేతిని వదల్లేదు. అటు జైనబ్ కూడా అంతే..! ఇది చూసిన అభిమానులు ఈ కొత్త జంట జీవితాంతం సంతోషంగా ఉండాలని ఆశీర్వదిస్తున్నారు. ఎన్ని ఆటంకాలు ఎదురైనా ఆ చేయి వదలకూడదని చెప్తున్నారు. ఒక ఫోటోలో అయితే అఖిల్ అటు అత్త చేతిని, ఇటు భార్య చేతిని పట్టుకుని ఆనందంగా కనిపించాడు. డ్రెస్సింగ్ విషయానికి వస్తే కొట్టొచ్చినట్లు కనిపించే రంగుల జోలికి వెళ్లకుండా పెళ్లికి తెలుపు, రిసెప్షన్‌కు గోధుమ రంగు దుస్తులు ధరించారు. ఎవరీ జైనబ్?ప్రముఖ వ్యాపారవేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్. ఈమె సోదరుడు జైన్ రవ్జీ.. జెడ్ఆర్ రెన్యువబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చైర్మన్‌గా, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నాడు. జైనబ్.. పెయింటింగ్ ఆర్టిస్ట్. అఖిల్ వయసు 31 ఏళ్లు కాగా ఈమె వయసు 39 ఏళ్లని తెలుస్తోంది. The Akkineni Family extends a heartfelt welcome to the beloved Victory @VenkyMama GaruYour presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/QDgglYEOSG— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025The Akkineni Family extends a heartfelt welcome to the beloved Natural Star @NameisNani & @actor_Nikhil.Your presence lights up our celebration and adds to the joy of this special day.#AkhilZainabReception pic.twitter.com/O2ZzJuf9SJ— Annapurna Studios (@AnnapurnaStdios) June 8, 2025 చదవండి: ఓటీటీలో క్రైమ్ ఇన్వెస్టిగేటివ్ థ్రిల్లర్ మూవీ.. నెలలోనే స్ట్రీమింగ్ -
వేల కోట్ల బిజినెస్ కాదని.. అఖిల్ భార్య చేసే పనేంటో తెలుసా..?
-
గ్రాండ్‌గా అక్కినేని అఖిల్ రిసెప్షన్
అక్కినేని అఖిల్.. రెండు రోజుల క్రితం పెళ్లి చేసుకున్నాడు. నాగార్జున ఇంటిలోనే ఈ వివాహం జరిగింది. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ వేడుకకు హాజరయ్యారు. అందుకు సంబంధించిన ఫొటోలు, వీడియోలు వైరలయ్యాయి. తాజాగా ఆదివారం అన్నపూర్ణ స్టూడియోస్‌లో వివాహ రిసెప్షన్ జరిగింది. దీనికి పలువురు సినీ, రాజకీయ ప్రముఖులు హాజరయ్యారు.నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య గతేడాది డిసెంబరులో శోభితని పెళ్లి చేసుకున్నాడు. ఇది అన్నపూర్ణ స్టూడియోస్‌లోనే జరిగింది. ఇప్పుడు అఖిల్ వివాహ నాగ్ ఇంట్లో జరగ్గా.. రిసెప్షన్ అక్కినేని ఫ్యామిలీకి చెందిన అన్నపూర్ణ స్టూడియోస్‌లో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకకు మహేశ్ బాబు కుటుంబంతో సహా హాజరయ్యాడు. హీరో సూర్యతో పాటు దర్శకుడు వెంకీ అట్లూరి హాజరయ్యారు. వీళ్లతో పాటు పలువురు సినీ సెలబ్రిటీలు కూడా సందడి చేశారు.నాగ్ చిన్న కొడుకు అఖిల్‌కి గతంలోనే శ్రియా భూపాల్ అనే అమ్మాయితో నిశ్చితార్థం జరిగింది కానీ అది పెళ్లి వరకు వెళ్లలేదు. తర్వాత కొన్నాళ్లకు జైనబ్‌తో ప్రేమలో పడ్డట్లు తెలుస్తోంది. అయితే తన బంధాన్ని రహస్యంగా ఉంచాడు. గతేడాది నవంబరులో ఆమెతో ఎంగేజ్మెంట్ జరిగిన విషయాన్ని బయటపెట్టాడు. రీసెంట్గా పెళ్లి చేసుకుని కొత్త జీవితంలోకి అడుగుపెట్టాడు. ఇప్పుడు రిసెప్షన్ ఏర్పాటు చేశారు. -
గ్రాండ్‌గా అఖిల్- జైనాబ్ రిసెప్షన్ వేడుక.. హాజరైన పలువురు ప్రముఖులు (ఫొటోలు)
-
అఖిల్ అక్కినేని సతీమణి 'జైనబ్' ఫోటోషూట్ లుక్స్ చూశారా..? (ఫొటోలు)
-
Akhil-Zianab : జైనాబ్ డైమండ్ జ్యుయల్లరీ స్పెషల్ ఎట్రాక్షన్
అక్కినేని కుటుంబం మొత్తానికి అఖిల్ అక్కినేని , జైనాబ్ రవ్జీ మూడు ముళ్ల వేడుకలను ఘనంగా నిర్వహించారు. గత ఏడాది నవంబరులో నిశ్చితార్థం చేసుకున్న ఈ జంట సన్నిహిత కుటుంబ సభ్యులు, స్నేహితుల సమక్షంలో(జూన్ 6న)వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. అఖిల్ తల్లిదండ్రులు అక్కినేని నాగార్జున-అమల, సవతి సోదరుడు నాగ చైతన్య -శోభిత ధూళిపాళ దంపతులు దగ్గరుండి వీరి పెళ్లి వేడుకను వైభవంగా జరిపించారు. అఖిల్-జైనాబ్ వెడ్డింగ్ పిక్స్ నెట్టింట సందడిగా మారాయి. అలాగే వధువు జైనాబ్ చీర, నగలపై ఆసక్తి నెలకొంది.వధువు జైనాబ్ వజ్రాభరణాలతో అందంగా మెరిసిపోయింది. జైనాబ్ ముఖంలో ఐవరీ-గోల్డ్ చీర, జడలో మల్లె పూలతో పెళ్లి కళ ఉట్టి పడింది. అలాగే పెళ్లి ముస్తాబులో మొత్తం డైమండ్ నగలనే ఎంచుకోవడం స్పెషల్ ఎట్రాక్షన్. వజ్రాల ఆభరణాలతో తన బ్రైడల్ లుక్‌ను తీర్చిదిద్దుకుంది. రెడ్ రూబీ పొదిగిన డైమండ్ చోకర్ నెక్‌పీస్ అందంగా అమిరింది. దీంతోపాటు మ్యాచింగ్ చైన్, మూడు లేయర్ల డైమండ్ నెక్లెస్, మఠపట్టి, మ్యాచింగ్ ఝుమ్కాలు, ముక్కెర, వజ్రాల గాజులు, డైమండ్ వడ్డాణం ఇలా ప్రతీదీ డైమండ్స్‌తో తళుక్కున మెరిసింది. అటు కొత్త పెళ్లికొడుకు అఖిల్ కూడా శ్వేత వస్త్రాల్లో సింపుల్‌గా అందంగా కనిపించాడు. View this post on Instagram A post shared by Surya Singh (@suryasinghmakeup)జైనబ్‌తో తన రిలేషన్‌షిప్‌ను అఖిల్ ఇన్స్టాగ్రామ్ ద్వారా వెల్లడించాడు. రెండు ఫోటోలను ఫ్యాన్స్‌తో పంచుకున్నాడు. ఈ ఫోటోలు జైనబ్ డైమండ్ రింగ్‌ను కూడా మనం చూడవచ్చు. మొత్తానికి అక్కినేని నాగార్జున తన ఇద్దరి కొడుకులకు పెళ్లిళ్లు చేసి, తండ్రిగా తన బాధ్యతలను పూర్తి చేశాడు. -
ఘనంగా అఖిల్, జైనబ్ వివాహం ఎవరీ జైనబ్..?
-
కుమారుడి పెళ్లి ఫోటోలు షేర్ చేసిన నాగార్జున
టాలీవుడ్ నటుడు అఖిల్ అక్కినేని (Akhil Akkineni) శుక్రవారం తెల్లవారుజామున వివాహబంధంలోకి అడుగుపెట్టారు. తన ప్రియురాలు జైనబ్ రవ్జీతో కలిసి ఏడడుగులు వేశారు. ఇదే విషయాన్ని చెబుతూ తాజాగా నాగార్జున ఒక పోస్ట్ షేర్ చేశారు. అత్యంత సన్నిహితుల మధ్య జరిగిన ఈ వేడుకలో చిరంజీవి, రాజమౌళి తనయుడు కార్తికేయ, దర్శకుడు ప్రశాంత్ నీల్‌తో పాటు పలువురు సినీ ప్రముఖులు పాల్గొన్నారు. అన్నపూర్ణ స్టూడియోస్‌లో జూన్ 8న రిసెప్షన్ జరగనుంది. ఆ సమయంలో సినీ, రాజకీయ ప్రముఖులు హాజరుకానున్నారు.అఖిల్ వివాహ వేడుక ఫొటోలను అభిమానులతో నాగార్జున పంచుకున్నారు. తన ఆనందాన్ని ఇలా చెప్పుకొచ్చారు. 'మా ప్రియమైన కుమారుడు తనకు ఇష్టమైన జైనాబ్ను మా ఇంట్లో (తెల్లవారుజామున 3:35 గంటలకు) వివాహం చేసుకున్నాడు. అమలతో పాటు నేను ఎంతో ఆనందంగా ఈ విషయాన్ని మీతో పంచుకుంటున్నాను. ఈ ప్రదేశం మా హృదయాలకు ఎంతో దగ్గరైంది. ఇక్కడ వారు కలిసి కొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నారు. మేము మీ ఆశీర్వాదాలను కోరుకుంటున్నాము. ప్రేమ, కృతజ్ఞతతో అంటూ..' నాగార్జున పోస్ట్ చేశారు.అఖిల్ సతీమణి జైనబ్ రవ్జీ హైదరాబాద్‌కు చెందిన అమ్మాయినే.. అయితే, ముంబయిలో స్థిరపడింది. ఆమె తండ్రి జుల్ఫీ రవ్జీ ప్రముఖ వ్యాపారవేత్త. రెండేళ్ల క్రితం ఒక ఫంక్షన్లో అఖిల్-జైనబ్ కలుసుకున్నారని తెలుస్తోంది. అలా వీళ్లిద్దరి మధ్య చిగురించిన స్నేహం క్రమంగా ప్రేమగా మారింది. With immense joy, Amala and I are delighted to share that our dear son has married his beloved Zainab in a beautiful ceremony (3:35 am) at our home, where our hearts belong. We watched a dream come true surrounded by love, laughter, and those dearest to us.We seek your blessings… pic.twitter.com/jiIDnQrVSk— Nagarjuna Akkineni (@iamnagarjuna) June 6, 2025 -
పెళ్లి చేసుకున్న అఖిల్.. అమ్మాయి బ్యాక్ గ్రౌండ్ ఏంటంటే?
అక్కినేని నాగార్జున చిన్న కొడుకు అఖిల్ పెళ్లి చేసుకున్నాడు. శుక్రవారం వేకువజామున 3 గంటలకు జైనబ్ రవ్జీతో ఒక్కటయ్యాడు. హిందూ సంప్రదాయం ప్రకారం ఈ వివాహం జరగ్గా.. కుటుంబ సభ్యులు, అతికొద్ది మంది సన్నిహితులు మాత్రమే ఈ శుభకార్యానికి హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.అఖిల్.. గతేడాది నవంబరులో జైనబ్‌తో నిశ్చితార్థం చేసుకున్నాడు. ఇది జరిగేంతవరకు ఎవరికీ తెలియనంత సీక్రెట్‌గా ఉంటారు. ఎంగేజ్మెంట్ జరిగిన ఆరు నెలలకు ఇప్పుడు సంప్రదాయ బద్ధంగా పెళ్లి చేసుకున్నారు. ఈ క్రమంలోనే అఖిల్ భార్య జైనబ్ గురించి తెగ సెర్చ్ చేస్తున్నారు. ఇంతకీ జైనబ్ ఎవరు? ఆమె బ్యాక్ గ్రౌండ్ ఏంటి?(ఇదీ చదవండి: సైలెంట్‌గా పెళ్లి చేసుకున్న 'ఆరెంజ్' హీరోయిన్)అఖిల్ భార్య జైనబ్ రవ్జీ.. ముంబైకి చెందిన పెయింటింగ్ ఆర్టిస్ట్. ఇదివరకే హైదరాబాద్, ముంబై, ఢిల్లీ, లండన్, దుబాయిలలో ఎగ్జిబిషన్స్ పెట్టింది. ఈమె సోషల్ మీడియా ఇన్ఫ్లూయెన్సర్ కూడా. ముంబైకి చెందిన బిజినెస్‌మ్యాన్ జుల్ఫీ రవ్జీ కూతురే జైనబ్. ఈమెకు జైన్ రవ్జీ అనే సోదరుడు కూడా ఉన్నాడు. అతడు జేఆర్ రెన్యూవబుల్ ఎనర్జీ ప్రైవేట్ లిమిటెడ్ అనే సంస్థకు ఛైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్‌గా ఉన్నాడు.జైనబ్ తండ్రి, నాగార్జున స్నేహితులు. అలా వీరిమధ్య ఉన్న స్నేహం కారణంగా కుటుంబాల మధ్య కూడా స్నేహం కుదిరింది. అలా అఖిల్-జైనబ్ ఒకరికొకరు పరిచయం. అలా కొన్నాళ్ల తర్వాత వీళ్లిద్దరూ ప్రేమలో పడ్డారు. గతేడాది పెద్దల్ని ఒప్పించి నిశ్చితార్థం చేసుకున్నారు. ఇప్పుడు పెళ్లితో కొత్త జీవితాన్ని ప్రారంభించారు. అయితే అఖిల్ కంటే జైనబ్ ఎనిమిదేళ్ల పెద్ద. అఖిల్ ప్రస్తుత వయసు 31 ఏళ్లు కాగా.. జైనబ్ వయసు 39 అని తెలుస్తోంది. జైనబ్ కూడా గతంలో 'మీనాక్షి ఏ టేల్ ఆఫ్ త్రీ సిటీస్' అనే హిందీ సినిమాలో నటించిందని తెలుస్తోంది.(ఇదీ చదవండి: ఈ శుక్రవారం ఓటీటీల్లోకి వచ్చేసిన 33 సినిమాలు) -
అక్కినేని ఇంట పెళ్లి సందడి
-
Akhil -Zainab Wedding : ఘనంగా అఖిల్ అక్కినేని- జైనబ్ వివాహం (ఫోటోలు)
-
అక్కినేని అఖిల్ వివాహం.. హాజరైన చిరంజీవి ఫ్యామిలీ
సాక్షి, హైదరాబాద్: హీరో నాగార్జున (Nagarjuna Akkineni) చిన్న కుమారుడు అక్కినేని అఖిల్ (Akkineni Akhil) బ్యాచిలర్ లైఫ్‌కు గుడ్‌బై చెప్తూ వైవాహిక జీవితానికి వెల్కమ్ చెప్పాడు. ప్రియురాలు జైనబ్‌ను వేదమంత్రాల సాక్షిగా పెళ్లాడాడు. జూబ్లీహిల్స్‌లో నాగార్జున నివాసంలో శుక్రవారం (జూన్ 6న) ఉదయం మూడు గంటలకు ఈ వివాహం జరిగింది. ఇరుకుటుంబ సభ్యులు సహా అతి దగ్గరివాళ్లే ఈ వెడ్డింగ్‌కు హాజరయ్యారు. సెలబ్రిటీల హాజరుమెగాస్టార్ చిరంజీవి (Chiranjeevi Konidela)- సురేఖ, రామ్‌చరణ్- ఉపాసన దంపతులు, దర్శకుడు ప్రశాంత్ నీల్, హీరో సుమంత్ సహా తదితరులు పెళ్లికి హాజరై కొత్త జంటను ఆశీర్వదించారు. పెళ్లి అనంతరం జరిగిన బరాత్‌లో హీరో నాగచైతన్య హుషారుగా పాల్గొన్నాడు. జూన్ 8న అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా రిసెప్షన్ జరగనుంది. అంగరంగ వైభవంగా జరగనున్న ఈ కార్యక్రమానికి సినీ, రాజకీయ ప్రముఖులు, పారిశ్రామికవేత్తలు హాజరుకానున్నారు.అఖిల్ ఎంగేజ్మెంట్అఖిల్- జైనబ్‌ల నిశ్చితార్థం గతేడాది నవంబర్‌లో జరిగింది. సరిగ్గా అదే సమయంలో నాగచైతన్య (Naga Chaitanya)- శోభితల పెళ్లి పనులు మొదలుకావడంతో అఖిల్ పెళ్లిని వాయిదా వేశారు. చై-శోభిత గతేడాది డిసెంబర్లో పెళ్లి చేసుకున్నారు. ఇక హైదరాబాద్‌లో పుట్టిన జైనబ్ రవ్జీ ఒక ఆర్టిస్ట్. రిఫ్లెక్షన్ పేరుతో హైదరాబాద్‌లో ఓ పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించగా అందులో ఈమె వేసిన పెయింటింగ్స్‌ను ప్రదర్శించారట! మీనాక్షి: ఎ టేల్ ఆఫ్ త్రీ సిటీస్ సినిమాలోనూ ఓ చిన్న పాత్రలో నటించిందట! ఈమె తండ్రి జుల్ఫీ రవ్జీ నిర్మాణ రంగంలోనే పెద్ద బిజినెస్ టైకూన్ అని తెలుస్తోంది. గతంలో పెళ్లి క్యాన్సిల్మరి అఖిల్- జైనబ్లు పెయింటింగ్ ఎగ్జిబిషన్లోనే ఒకరికొకరు పరిచయమయ్యారా? అసలు వీరి ప్రేమకథ ఎలా మొదలైందన్నది ఇప్పటికీ సస్పెన్స్‌గానే ఉంది. ఇదిలా ఉంటే అఖిల్ గతంలో.. పారిశ్రామికవేత్త జీవీకే రెడ్డి మనవరాలు శ్రేయ భూపాల్‌తో ప్రేమలో పడ్డాడు. 2016లో వీరి ఎంగేజ్మెంట్ కూడా జరిగింది. పెళ్లితో ఒక్కటి కాబోతారనుకునేలోపే వివాహం రద్దు చేసుకుని అందరికీ షాకిచ్చారు. ప్రస్తుతం అఖిల్ 'లెనిన్' అనే సినిమా చేస్తున్నాడు.👉: (ఫోటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి)Director #PrashanthNeel at #AkhilAkkineni's wedding.#NTRNeelpic.twitter.com/D8jMH6gJHx— Milagro Movies (@MilagroMovies) June 6, 2025Yuvasamrat #NagaChaitanya at the baraat ceremony of his brother @AkhilAkkineni8!📸#AkhilAkkineni #Nagarjuna pic.twitter.com/wVUqswOfVV— shiva (@shivshankar68) June 5, 2025#TFNExclusive: Yuvasamrat @chay_akkineni and @sobhitaD snapped at #AkhilAkkineni & #ZainabRavdjee's wedding! 📸😍#NagaChaitanya #SobhitaDhulipala #SoChay #TeluguFilmNagar pic.twitter.com/1uCz8xUcym— Subhodayam Subbarao (@rajasekharaa) June 6, 2025చదవండి: విడాకులు కోర్టులో ఉండగా హీరో పెళ్లి? అసలు విషయమిదే! -
సీఎం చంద్రబాబును కలిసిన సినీ నటుడు నాగార్జున
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును సినీ నటుడు నాగార్జున కలిశారు. సీఎం నివాసంలో ఆయన్ను కలిసి తన చిన్న కుమారుడు అఖిల్ వివాహానికి హాజరు కావాలని నాగార్జున ఆహ్వానించారు. గతేడాది నవంబర్‌లో అఖిల్ నిశ్చితార్థం జైనబ్ రవ్జీతో జరిగిన విషయం తెలిసిందే. జూన్ 6న వారి వివాహం జరగనుంది. ఈ వేడుకలో సినీ, రాజకీయ ప్రముఖులు భారీ సంఖ్యలో పాల్గొననున్నారు. జూన్ 8న రిసెప్షన్ జరగనున్నట్లు సమాచారం. నాగార్జున ఇప్పటికే తన కుటుంబ సభ్యులతో పాటు తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిని కలిసి శుభలేఖ అందించిన విషయం తెలిసిందే. -
నాగార్జున కొడుకు పెళ్లి.. సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం
అక్కినేని ఇంట త్వరలో పెళ్లి భాజాలు మోగనున్నాయి. నాగార్జున చిన్న కొడుకు అఖిల్.. ఈ జూన్‌లో కొత్త జీవితంలోకి అడుగుపెట్టబోతున్నాడు. ఈ క్రమంలోనే గత కొన్నిరోజుల నుంచి రూమర్స్ వచ్చాయి. జూన్ తొలివారంలో అఖిల్ పెళ్లి చేసుకోనున్నాడని అంటున్నారు. ఇదలా ఉండగానే ఇప్పుడు నాగ్ వైపు నుంచి ఓ క్లారిటీ వచ్చేసింది.(ఇదీ చదవండి: వారానికే ఓటీటీలోకి వచ్చేసిన తెలుగు సినిమా)శనివారం ఉదయం.. నాగార్జున దంపతులు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని జూబ్లీహిల్స్‌లోని ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. తమ కుమారుడి వివాహానికి సీఎంని ఆహ్వానించారు. ఇప్పుడు ఈ ఫొటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.నాగార్జున-అమల దంపతులకు పుట్టిన సంతానం అఖిల్. ఇప్పటికే హీరోగా ఐదు సినిమాలు చేశాడు గానీ హిట్ కొట్టలేకపోయాడు. గతంలో ఓసారి అఖిల్ నిశ్చితార్థం జరిగి రద్దయింది. దీంతో గతేడాది ఎలాంటి హడావుడి లేకుండా జైనబ్ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ఇప్పుడు కూడా ఎలాంటి హడావుడి లేకుండా పెళ్లికి రెడీ అయిపోయాడు.(ఇదీ చదవండి: శిరీషతో పెళ్లి ఎప్పుడంటే.. ప్రకటించిన నారా రోహిత్) -
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్- జైనాబ్ పెళ్లి తేదీ ఫిక్స్!
అక్కినేని వారి ఇంట త్వరలోనే పెళ్లి సందడి మొదలు కానుంది. గతేడాది నిశ్చితార్థం చేసుకున్న అక్కినేని అఖిల్ ఓ ఇంటివాడు కాబోతున్నారు. తాజా సమాచారం ప్రకారం ఆయన త్వరలోనే ప్రియురాలి మెడలో మూడు ముళ్లు వేయనున్నట్లు తెలుస్తోంది. టాలీవుడ్ వినిపిస్తోన్న టాక్ ప్రకారం వచ్చేనెలలోనే అక్కినేని ఇంట పెళ్లిభాజాలు మోగనున్నాయి. అఖిల్ తన ప్రియురాలు జైనాబ్ రవ్దీని జూన్ 6న పెళ్లి చేసుకోబోతున్నట్లు సమాచారం. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగానే వీరి వివాహం జరగనున్నట్లు తెలుస్తోంది.కాగా.. గతేడాది అక్కినేని నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూలిపాళ్లను ఆయన పెళ్లాడారు. వీరి పెళ్లి ప్రకటన తర్వాతే అఖిల్ అక్కినేని ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. జైనాబ్ రవ్దీతో నిశ్చితార్థం జరిగినట్లు అక్కినేని నాగార్జున వెల్లడించారు. -
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్ పెళ్లి ఎప్పుడంటే! (ఫొటోలు)
-
ప్రియురాలితో అఖిల్ పెళ్లికి సిద్ధమయ్యాడా?
అక్కినేని హీరో అఖిల్.. హీరోగా ఐదు సినిమాలు చేశాడు. కానీ వీటిలో ఒక్కటి యావరేజ్, మిగతావన్నీ డిజాస్టర్స్ అయ్యాయి. గతంలో ఓసారి నిశ్చితార్థం జరగ్గా.. అది రద్దయింది. దీంతో చాన్నాళ్ల పాటు అఖిల్ వ్యక్తిగత జీవితం గురించి ఎవరూ పెద్దగా మాట్లాడుకోలేదు. కానీ ఉన్నఫలంగా గతేడాది నవంబరులో తనకు నిశ్చితార్థం జరిగిందని చెప్పి అందరికీ షాకిచ్చాడు.జైనబ్ రవ్జీ అనే అమ్మాయితో అఖిల్ ఎంగేజ్మెంట్ గతేడాది నవంబరులో జరిగింది. దీని తర్వాత పలుమార్లు ఎయిర్‌పోర్ట్‌లో జంటగా కనిపించారు. కానీ ఇప్పుడు పెళ్లి విషయంలో సడన్ సర్ప్రైజ్ ఇవ్వబోతున్నట్లు తెలుస్తోంది. జూన్ 6నే ఈ శుభకార్యం జరగనుందని సోషల్ మీడియాలో చిన్నగా టాక్ వినిపిస్తోంది. మరి ఇది నిజమా కాదా అనేది అఖిల్ చెప్పాలి.(ఇదీ చదవండి: ఓటీటీలోకి మోహన్ లాల్ రీసెంట్ హిట్ మూవీ) ఇకపోతే గతేడాది నవంబరులో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. తర్వాత కొన్నిరోజులకే అక్కినేని ఇంట్లో మరో శుభకార్యం జరిగింది. అదే నాగచైతన్య పెళ్లి. గతంలో సమంతతో ఏడడుగులు వేసిన చైతూ.. నాలుగేళ్లకే ఆమెకు విడాకులు ఇచ్చేశాడు. తర్వాత కొన్నాళ్ల పాటు ఒంటరిగానే ఉన్న ఇతడు.. హీరోయిన్ శోభితతో ప్రేమలో పడ్డాడు. గతేడాది డిసెంబరులో వీళ్లిద్దరూ పెళ్లి చేసుకున్నారు.ఇప్పుడు అఖిల్ కూడా జూన్ తొలివారంలో పెళ్లి చేసుకోబోతున్నాడనే న్యూస్ బయటకొచ్చింది. ఒకవేళ ఇదే నిజమైతే మాత్రం ఈపాటికే ఏర్పాట్లు జరుగుతూ ఉండాలి. లేదంటే శుభలేఖల్లాంటివి ఏమైనా ఫొటోలు లీక్ కావాలి. కానీ అలాంటి సూచనలేం కనిపించట్లేదు. మరి సోషల్ మీడియాలో వినిపిస్తున్న పుకార్లు నిజమేనా? కాదా అనే దానిపై మరికొన్ని రోజుల్లో క్లారిటీ వస్తుంది.(ఇదీ చదవండి: విజయ్ ఆంటోనీ... మరో డిఫరెంట్ థ్రిల్లర్ మూవీ) -
అక్కినేని అఖిల్ బర్త్ డే స్పెషల్.. కొత్త సినిమా టైటిల్ తెలుసా?
అక్కినేని హీరో అఖిల్ దాదాపు రెండేళ్ల గ్యాప్ తర్వాత అభిమానులకు గుడ్ న్యూస్ చెప్పనున్నారు. ఇవాళ అఖిల్ బర్త్ డే కావడంతో ఫ్యాన్స్‌కు అదిరిపోయే ట్రీట్ ఇవ్వనున్నారు. అఖిల్- మురళి కిశోర్ అబ్బురు కాంబోలో వస్తోన్న మూవీకి సంబంధించిన క్రేజీ అప్డేట్ ఇచ్చారు. ఈ సినిమాకు సంబంధించిన గ్లింప్స్‌ను తాజాగా విడుదల చేశారు.అఖిల్ నటిస్తోన్న ఈ సినిమాకు లెనిన్ అనే క్రేజీ టైటిల్‌ను ఫిక్స్ చేశారు. గ్లింప్స్ చూస్తుంటే ఫుల్ మాస్ యాక్షన్ మూవీగానే తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ చిత్రంలో అఖిల్ సరసన శ్రీలీల హీరోయిన్గా కనిపించనుంది. ఈ చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్, సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్లపై నాగార్జున, సూర్యదేవర నాగవంశీ నిర్మిస్తున్నారు. ఈ ప్రకటనతో అఖిల్ ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఏజెంట్ మూవీ తర్వాత వస్తోన్న చిత్రం కావడంతో అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమాకు ఎస్ఎస్ తమన్ సంగీతమందిస్తున్నారు. This role is going to be remembered for a long time!! 💥Can’t wait for you all to witness @AkhilAkkineni8 in his most stunning avatar 🔥Presenting you all ~ #LENIN ❤️🔥#Akhil6 @sreeleela14 @iamnagarjuna @KishoreAbburu @MusicThaman @NavinNooli @artkolla #NaveenKumarI… pic.twitter.com/IsyooyDViq— Naga Vamsi (@vamsi84) April 8, 2025 -
ఒకేసారి 3 సినిమాలను లైనప్ చేసిన అఖిల్
-
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంస్థ!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ థ్రిల్లర్ మూవీ 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద ఊహించని విధంగా బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ చిత్రంలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లైన ఓటీటీకి రాలేదు. ఎట్టకేలకు ఈ నెల 14 నుంచి ఓటీటీకి రానుందని సోనిలివ్ ప్రకటించింది. అయితే అనుకున్న తేదీ కంటే ఒకరోజు ముందుగానే ప్రేక్షకులకు అందుబాటులోకి తీసుకొచ్చింది. ఈ రోజు సాయంత్రం నుంచే ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. ఇంకేందుకు ఆలస్యం ఏజెంట్ మూవీని ఎంచక్కా ఓటీటీలో చూసి ఎంజాయ్ చేయండి.Secrets, shootouts, and a mission that rewrites the rules.#Agent is now streaming on SonyLIV.#AgentOnSonyLIV #Agent @mammootty @akkineniakhil @_vaidyasakshi#SurenderReddy #DinoMorea @varusarath5@UrvashiRautela #Varalakshmi pic.twitter.com/iAONMsxtZn— Sony LIV (@SonyLIV) March 13, 2025 -
ఎట్టకేలకు మోక్షం.. ఓటీటీకి అఖిల్ ఏజెంట్ మూవీ
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం 'ఏజెంట్'. 2023 ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది. అయితే అభిమానుల భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్‌గా నిలిచింది. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ మూవీ విడుదలై దాదాపు రెండేళ్లు కావొస్తోంది. కానీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్‌లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కొన్ని అనివార్య కారణాలతో ఓటీటీ రిలీజ్ వాయిదా పడుతూనే ఉంది. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. అయితే తాజాగా అఖిల్ అభిమానులకు ఎట్టకేలకు ఓ గుడ్ న్యూస్ వచ్చేసింది.(ఇది చదవండి: ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?)తాజాగా ఏజెంట్ మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ తేదీని ఖరారు చేశారు. మార్చి 14వ తేదీ నుంచి సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ కానుందని వెల్లడించారు. ఈ విషయాన్ని ఓటీటీ సంస్థ సోనీ లివ్ అధికారికంగా ప్రకటించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు. View this post on Instagram A post shared by Sony LIV (@sonylivindia) -
దుబాయ్‌లో జూనియర్ ఎన్టీఆర్- ప్రణీత, నమ్రత, ఉపాసన సందడి (ఫోటోలు)
-
దుబాయ్‌లో టాలీవుడ్ సెలబ్రిటీలు.. అఖిల్ 'నాటు నాటు' స్టెప్పులు
టాలీవుడ్‌కు చెందిన పలువురు సెలబ్రిటీలు ఫారిన్లో చిల్ అవుతున్నారు. దుబాయ్‌లో జరిగిన ఓ పెళ్లి వేడుకలో తెలుగు చలనచిత్ర పరిశ్రమకు చెందిన పలువురు సెలబ్రిటీలు, హీరోల కుటుంబసభ్యులు పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను మహేశ్‌బాబు సతీమణి నమ్రత శిరోద్కర్ (Namrata Shirodkar) ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసింది. జీవితంతం సంతోషంగా..'కీర్తి- నితేశ్ జంటగా సరికొత్త ప్రయాణాన్ని ప్రారంభిస్తున్నందుకు సంతోషంగా ఉంది. వీరు జీవితాంతం ఆనందంగా ఉండాలని కోరుకుంటున్నాను' అని క్యాప్షన్ జోడించింది. ఈ ఫోటోల్లో ఉపాసన, ఎన్టీఆర్ (Jr NTR)- లక్ష్మీ ప్రణతి తదితరులు ఉన్నారు. మ్యూజిక్ డైరెక్టర అనిరుధ్ రవిచంద్రన్‌తో కలిసి మహేశ్ కూతురు సితార, సుకుమార్ కూతురు సుకృతి సెల్ఫీ కూడా దిగారు.నాటు నాటు పాటకు స్టెప్పేసిన అఖిల్ఈ పెళ్లిలో అఖిల్ సహా మరికొంతమంది ఉన్నట్లు తెలుస్తోంది. అఖిల్ అక్కినేని (Akhil Akkineni) నాటునాటు పాటకు స్టెప్పులేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సినిమాలో చరణ్, తారక్ డ్యాన్స్ చేసినట్లుగానే ఇక్కడ కూడా అఖిల్ వేరొకరితో కలిసి స్టెప్పులేశాడు. ఈ సెలబ్రిటీల హంగామా చూసిన ఫ్యాన్స్ మిగతా హీరోలు కూడా ఈ పార్టీలో ఉంటే బాగుండని కామెంట్లు చేస్తున్నారు. View this post on Instagram A post shared by Namrata Shirodkar (@namratashirodkar) Akhil Akkineni Dance For "NattuNattu" Song 🔥Happy to witness His Dance 🥹@AkhilAkkineni8 Anna Akhil6 lo Dance kummeyandi #AkhilAkkineni #RRR pic.twitter.com/xxg7OKuz3r— Vinay Vk18 (@Vinay_Akhil999) February 23, 2025చదవండి: హీరోయిన్ కుమార్తెలకు బంగారు గాజులు తొడిగిన స్టార్ హీరో -
కాబోయే భార్యతో అఖిల్ అక్కినేని.. పెళ్లి పనులు మొదలైనట్టేనా?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ గతేడాది నిశ్చితార్థం చేసుకుని అభిమానులకు సర్ప్రైజ్ ఇచ్చాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు రెడీ అయిపోయాడు. ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా అక్కినేని నాగార్జున పంచుకున్నారు. అయితే అఖిల్ ఎంగేజ్మెంట్ తర్వాత నాగచైతన్య వివాహాబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత దూళిపాలను చైతూ పెళ్లాడారు. హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో వీరి పెళ్లి వేడుక ఘనంగా జరిగింది. ఇక అక్కినేని అభిమానులంతా అఖిల్ పెళ్లి కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.అయితే ఈ ఏడాదిలోనే అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. వచ్చేనెలలోనే అఖిల్- జైనాబ్ ఒక్కటి కాబోతున్నట్లు సమాచారం. అంతా అనుకున్నట్లు జరిగితే మార్చి 24న గ్రాండ్ వెడ్డింగ్ ప్లాన్ చేస్తున్నట్లు టాలీవుడ్లో టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలకు మరింత బలం చేకూర్చుతోంది తాజా వీడియో. అఖిల్ అక్కినేని తనకు కాబోయే భార్య జైనాబ్ రవ్జీతో కలిసి ఎయిర్‌పోర్ట్‌లో కనిపించారు. దీంతో పెళ్లి పనులు మొదలైనట్లేనని కొందరు అభిమానులు భావిస్తున్నారు. ఇద్దరు కలిసి జంటగా వెళ్తున్న వీడియో నెట్టింట తెగ వైరలవుతోంది. ఇది చూసిన కొందరు నెటిజన్స్ అక్కినేని వారి చిన్న కోడలు అంటూ కామెంట్స్ చేస్తున్నారు. కాగా.. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. అయితే వీరి పెళ్లికి సంబందించిన అధికారిక ప్రకటనైతే ఇంకా రావాల్సి ఉంది.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత 2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. ప్రస్తుతం సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌తో బిజీగా ఉన్నారు అఖిల్. ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్.. ఆమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్‌లో జైనాబ్ పెరిగింది. ఇప్పటికే ఎంగేజ్మెంట్ చేసుకున్న అఖిల్-జైనాబ్ త్వరలోనే పెళ్లిబంధంలోకి అడుగుపెట్టనున్నారు. Dhisti Teeyandra..😍😍Chinnodu ,Chinna Vadhina Merisipothunaru Iddharu ..😍#akhilakkineni & #zainabravdjee 👩❤️👨 pic.twitter.com/c9ovnyfnyc— 𝗖𝗵𝗮𝘆-𝗦𝗮𝗶 ⛓️ (@SaiNavabathula) February 18, 2025 Anna style vere level #Akhil6 #akhilakkineni pic.twitter.com/cfy3ZBOMUQ— SAITEJA VARMA (@Missile_Saiteja) February 18, 2025 -
బెంగళూరుకు తెలుగు వారియర్స్ కెప్టెన్.. తొలి మ్యాచ్‌కు రెడీ
సినీ, క్రీడా అభిమానులను అలరించే సెలబ్రిటీ క్రికెట్ లీగ్‌కు అంతా సిద్ధమైంది. బెంగళూరు చిన్నస్వామి స్డేడియం వేదికగా ఈ ఏడాది సీసీఎల్(CCL) ప్రారంభం కానుంది. దాదాపు 7 జట్లు ఈ సారి కప్ కోసం పోటీపడుతున్నాయి. తెలుగు వారియర్స్(Telugu Warriors) తన తొలి మ్యాచ్‌లో కన్నడ బుల్డోజర్స్‌ను ఢీకొట్టనుంది. ఇటీవలే హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన సమావేశంలో తెలుగు వారియర్స్ కెప్టెన్ అఖిల్ అక్కినేని మాట్లాడారు. ఇప్పటికే నాలుగుసార్లు కప్ గెలిచామమని.. ఈ సారి కూడా ఛాంపియన్స్ అవుతామని ధీమా వ్యక్తం చేస్తున్నారు.సీసీఎల్ తొలి మ్యాచ్ కోసం అక్కినేని అఖిల్ ఇప్పటికే బెంగళూరు చేరుకున్నారు. ఎయిర్‌పోర్ట్‌లో అఖిల్ వెళ్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ లీగ్ తొలి మ్యాచ్‌లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్ తలపడనుండగా.. ఆ తర్వాత జరిగే రెండో మ్యాచ్‌లో తెలుగు వారియర్స్ తన కప్ వేటను ప్రారంభించనుంది. సాయంత్రం 6:30 గంటలకు ప్రారంభమయ్యే ఈ మ్యాచ్‌లో కర్ణాటక బుల్డోజర్స్తో తలపడుతోంది.INDIA'S BIGGEST SPORTAINMENT EVENT CCL STARTS *TOMORROW*... The 11th season of #CelebrityCricketLeague [#CCL] starts on 8 Feb 2025... Witness the thrill as #India's leading stars clash on the cricket field.Watch LIVE on #SonyTen3 and #Hotstar.#CCL2025Live | #CCL2025 | #CCL11 pic.twitter.com/7NKrABg4Vc— taran adarsh (@taran_adarsh) February 7, 2025#AkhilAkkineni off to Bengaluru for the Telugu Warriors' first match in #CCL @AkhilAkkineni8 ❤️❤️❤️❤️❤️#Akhil6 pic.twitter.com/0FlVsPj29p— 𝐀𝐤𝐡𝐢𝐥𝐅𝐫𝐞𝐚𝐤𝐬_𝐅𝐂 (@AkhilFreaks_FC) February 7, 2025 -
తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఈవెంట్లో అక్కినేని అఖిల్ (ఫొటోలు)
-
ఐపీఎల్‌కు ముందే క్రికెట్ సమరం.. సిద్ధమంటోన్న అఖిల్ అక్కినేని
క్రికెట్ సంబరానికి అంతా సిద్ధమైంది. ఇన్ని రోజుల తెరపై అభిమానులను అలరించిన సినీ తారలు గ్రౌండ్లో అడుగుపెట్టనున్నారు. ఇప్పుడు నటనతో కాదు.. బ్యాట్, బాల్‌తో ఫ్యాన్స్‌ను ఆకట్టుకోనున్నారు. ఎప్పటిలాగే ఈ ఏడాది కూడా సీసీఎల్ (సెలబ్రిటీ క్రికెట్ లీగ్) సమరానికి సమయం ఆసన్నమైంది. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వేదికగా ఫిబ్రవరి 8 నుంచి ఈ క్రికెట్ సమరం మొదలు కానుంది. ఈనేపథ్యంలోనే తాజాగా హైదరాబాద్‌లో టాలీవుడ్ సినీ తారలకు చెందిన తెలుగు వారియర్స్ టీమ్ జెర్సీ ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. ఈవెంట్లో జట్టు కెప్టెన్ అఖిల్ (Akhil Akkineni)తో పాటు తమన్, ఆది, అశ్విన్, రఘు, సామ్రాట్ పాల్గొన్నారు. జట్టు యజమాని సచిన్ జోషి కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా అక్కినేని అఖిల్ మాట్లాడుతూ.. మేము నాలుగుసార్లు కప్ గెలిచామని వెల్లడించారు. ఈసారి మేమే ఛాంపియన్స్‌గా నిలుస్తామని ధీమా వ్యక్తం చేశారు.కాగా.. ఈ సీసీఎల్ లీగ్‌లో మొత్తం 7 సినీ సెలబ్రిటీ జట్లు తలపడనున్నాయి. చెన్నై రైనోస్, ముంబై హీరోస్, తెలుగు వారియర్స్, కర్ణాటక బుల్డోజర్స్, బెంగాల్ టైగర్స్, పంజాబ్ ది షేర్, బోజ్‌పురి దబాంగ్స్ పోటీ పడుతున్నాయి. ఈ నెల 8న బెంగళూరు వేదికగా ఈ టోర్నీ మొదలు కానుంది. ప్రస్తుతం జరుగుతున్న 11 వ సీజన్ జనవరి 31న హైదరాబాద్‌లోనే ప్రారంభం కావాల్సి ఉండగా.. అనివార్య కారణాలతో షెడ్యూల్లో మార్పులు చేశారు.కాగా.. ఈ ఏడాది సీసీఎల్ టోర్నమెంట్ ఫిబ్రవరి 8న బెంగళూరులో ప్రారంభమై మార్చి 2 వరకు కొనసాగుతుంది. తొలి రోజు మ్యాచ్‌లో చెన్నై రైనోస్, బెంగాల్ టైగర్స్, సాయంత్రం కర్ణాటక బుల్డోజర్స్ టీమ్.. తెలుగు వారియర్స్‌ను ఢీకొంటుంది. హైదరాబాద్‌లో ఈనెల 14,15 తేదీల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి. ఈ సీజన్లో కూడా అఖిల్ అక్కినేని తెలుగు వారియర్స్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. ఈ మ్యాచ్‌లన్నీ డిస్నీ ప్లస్ హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్ అవుతాయి. సెమీ-ఫైనల్, ఫైనల్ మార్చి 1, 2 తేదీల్లో జరగనున్నాయి. #TFNExclusive: Actor @AkhilAkkineni8 and Music sensation @MusicThaman snapped at CCL Telugu Warrior event in Hyderabad!!🏏📸#AkhilAkkineni #Thaman #Tollywood #TeluguFilmNagar pic.twitter.com/WDxjeEsr1S— Telugu FilmNagar (@telugufilmnagar) February 2, 2025 The excitement is building! ⏳ Just 6 days to go for A23 Rummy CCL 2025! 🏏🔥 Brace yourselves for an electrifying season where cinema meets cricket!🎟 Grab your tickets now: https://t.co/xvVGHVHEcj📺 Catch the action LIVE on Sony Sports Ten 3 & Disney+ Hotstar#A23Rummy… pic.twitter.com/lBRRZaiwyH— CCL (@ccl) February 2, 2025 -
అక్కినేని వారి మరో పెళ్లి సందడి.. శోభిత- నాగచైతన్యకే ఆ బాధ్యతలు..! (ఫోటోలు)
-
అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి.. అఖిల్ మ్యారేజ్ డేట్ ఫిక్స్!
టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున ఇంట్లో మరో శుభకార్యం జరగనుంది. గతేడాది చైతూ వివాహబంధంలోకి అడుగుపెట్టారు. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లను ఆయన వివాహమాడారు. అంతకుముందే అఖిల్ అక్కినేని సైతం ఎంగేజ్మెంట్ చేసుకుని ఫ్యాన్స్‌కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చాడు. తాజాగా అఖిల్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త నెట్టింట వైరల్‌గా మారింది. ఈ ఏడాది మార్చిలో అఖిల్ పెళ్లి పీటలెక్కనున్నట్లు తెలుస్తోంది. ఓ నివేదిక ప్రకారం అఖిల్, జైనాబ్ ఈ ఏడాది మార్చి 24న వివాహం చేసుకోబోతున్నట్లు సమాచారం. అంటే మార్చి చివరి వారంలో అక్కినేని వారి ఇంట పెళ్లి సందడి మొదలు కానుంది.అఖిల్ పెళ్లి వేడుక కోసం అక్కినేని ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతేడాది నవంబర్ 26న జైనాబ్ రావ్జీతో అఖిల్ నిశ్చితార్థం జరిగింది. దీనికి సంబంధించిన ఫోటోలను నాగార్జున ట్విటర్ ద్వారా పంచుకున్నారు. కొంతకాలంగా డేటింగ్లో ఉన్న వీరిద్దరు ఓ ప్రైవేట్ వేడుకలో నిశ్చితార్థం చేసుకున్నారు. అయితే వీరి పెళ్లి తేదీకి సంబంధించి అక్కినేని ఫ్యామిలీ నుంచి అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. చైతూ బాటలోనే అఖిల్..అయితే అఖిల్ పెళ్లి వేడుక కూడా హైదరాబాద్‌లోనే జరగనున్నట్లు తెలుస్తోంది. చైతూ- శోభిత పెళ్లి మాదిరే అన్నపూర్ణ స్టూడియోస్ వేదికగా వీరి వివాహా వేడుక జరగనున్నట్లు టాక్. అక్కినేని నాగేశ్వరరావు విగ్రహం ముందే నాగచైతన్య పెళ్లి వేడుక జరిగిన సంగతి తెలిసిందే. అక్కినేని నాగేశ్వరరావు స్థాపించినందున ఈ స్టూడియో నాగార్జున కుటుంబానికి సెంటిమెంట్‌గా కనెక్ట్ అయింది. అయితే మరోవైపు ఈ జంట డెస్టినేషన్ వెడ్డింగ్‌కు కూడా వెళ్లే అవకాశం ఉందని రూమర్స్ వినిపిస్తున్నాయి. అదే జరిగితే టాలీవుడ్ ప్రముఖుల కోసం హైదరాబాద్‌లో రిసెప్షన్‌ను నిర్వహించనున్నారు. అయితే పెళ్లి తేదీ, వేదికపై ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటనైతే రాలేదు.ఇక సినిమాల విషయాకొనిస్తే.. అఖిల్ అక్కినేని 1994లో సిసింద్రీలో చైల్డ్ ఆర్టిస్ట్‌గా చిత్ర పరిశ్రమలోకి అడుగుపెట్టాడు. ఆ తర్వాత2 015 అఖిల్ మూవీతో హీరోగా అరంగేట్రం చేశాడు. ఆ తర్వాత హలో, మిస్టర్ మజ్ను, మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్, ఏజెంట్ వంటి చిత్రాలతో అభిమానులను మెప్పించారు. -
కొత్త సంవత్సరానికి గ్రాండ్‌గా వెల్కమ్ చెప్పిన తారలు (ఫోటోలు)
-
తొలి సినిమానే వంద కోట్ల బడ్జెట్.. ‘మెగా’, ‘అక్కినేని’ హీరోలతో సాహసం!
దర్శకుడిగా తొలి అవకాశం కోసం చాలామంది చాలా స్ట్రగుల్స్ ఫేస్ చేస్తుంటారు. కానీ కొందరిని మాత్రం మొదటే బంపర్ ఆఫర్ వరిస్తుంది. ఏ రేంజ్ ఆఫర్ అంటే ఆ యువ దర్శకుల తొలి సినిమాలకే భారీ బడ్జెట్ కేటాయింపులు జరిగిపోతున్నాయి. అఖిల్ హీరోగా ఓ భారీ బడ్జెట్ మైథలాజికల్ మూవీ చేయనున్నట్లుగా ఎప్పట్నుంచో వార్తలు వస్తున్నాయి. యూవీ క్రియేషన్స్, హోంబలే ఫిల్మ్స్ (కేజీఎఫ్, సలార్, కాంతార’ వంటి సినిమాలను నిర్మించిన సంస్థ) ఈ సినిమాను వంద కోట్ల భారీ బడ్జెట్‌తో తీయనున్నాయనే టాక్ ఫిల్మ్‌నగర్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.ఈ చిత్రాన్ని నూతన దర్శకుడు అనిల్ తెరకెక్కించనున్నారు. అలాగే సాయి దుర్గా తేజ్ హీరోగా ఓ పీరియాడికల్ యాక్షన్ డ్రామా రూపపొందుతోంది. ఈ సినిమాతో కేపీ రోహిత్ దర్శకుడిగా పరిచయం కానున్నారు. కె. నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి నిర్మిస్తున్న ఈ సినిమా బడ్జెట్ కూడా వంద కోట్ల రూపాయలపైనే అని వినికిడి. నిఖిల్ హీరోగా ‘స్వయంభూ’ అనే భారీ బడ్జెట్ మూవీ తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెండు భాగాలుగా విడుదల కానుందనే టాక్ తెరపైకి వచ్చింది. ఈ సినిమాతో భరత్ కృష్ణమాచారి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. అలాగే కిశోర్ అనే యువ దర్శకుడికి రానా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని, రవి అనే ఓ కొత్త దర్శకుడితో దుల్కర్ సల్మాన్ తెలుగులో ఓ సినిమా చేయనున్నారనే వార్తలు ప్రచారంలోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఇవన్నీ కూడా భారీ బడ్జెట్ సినిమాలే కావడం విశేషం.. -
కొత్త జంట చైతూ-శోభితకు ఏఎన్నార్ ఆశీర్వాదం! (ఫొటోలు)
-
అక్కినేని చిన్న కోడలు అఖిల్ కంటే వయసులో ఎన్నేళ్లు పెద్దో తెలుసా..?
-
అఖిల్-జైనాబ్ నిశ్చితార్థం.. ఈ ఏడాది మాకెంతో ప్రత్యేకం: నాగార్జున
అక్కినేని వారి ఇంట త్వరలోనే శుభకార్యం జరగనుంది. వచ్చేనెల 4వ తేదీన నాగచైతన్య- శోభిత ధూళిపాళ్ల వివాహా వేడుక జరగనుంది. ఈ పెళ్లి పనులతో ఇరు కుటుంబాలు ప్రస్తుతం బిజీగా ఉన్నారు. అంతలోనే మరో సర్ప్రైజ్ ఇచ్చేశారు అక్కినేని ఫ్యామిలీ. నాగార్జున తనయుడు, హీరో అక్కినేని అఖిల్ ఎంగేజ్మెంట్ చేసుకున్నట్లు ప్రకటించారు. ముంబయికి చెందిన జైనాబ్ రవ్జీతో నిశ్చితార్థం చేసుకున్నారు. దీనికి సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు.అయితే మరోవారంలో నాగచైతన్య పెళ్లి జరగనుంది. దీంతో అఖిల్ పెళ్లి ఎప్పుడని అప్పుడే ఆరా తీయడం మొదలెట్టారు నెటిజన్స్. అయితే అఖిల్- జైనాబ్ల పెళ్లి 2025లోనే జరగనుందని నాగార్జున ఇటీవల ఇంటర్వ్యూలో వెల్లడించారు. అయితే ఈ ఏడాది తమకు ఎంతో స్పెషల్ అని కింగ్ తెలిపారు. ఓకే ఏడాదిలో అక్కినేని శతజయంతి ఉత్సవాలు, నాగచైతన్య- శోభితల పెళ్లి, అఖిల్ ఎంగేజ్మెంట్ జరగడం చాలా సంతోషంగా ఉందన్నారు. అంతే కాకుండా అఖిల్, జైనాబ్ రవ్జీల రిలేషన్‌పై నాగ్ మాట్లాడారు.నాగార్జున మాట్లాడుతూ..'అఖిల్ ఎంగేజ్మెంట్ పట్ల చాలా సంతోషంగా ఉన్నా. జైనాబ్ అందమైన అమ్మాయి మాత్రమే అఖిల్‌కు సరైన జోడి. వారిద్దరు తమ జీవితాలను కొనసాగించాలని నిర్ణయించుకున్నందుకు ఆనందంగా ఉంది. వారిద్దరి వివాహం 2025లోనే జరుగుతుంది" అని తెలిపారు. అఖిల్- జైనాబ్ల నిశ్చితార్థానికి సంబంధించిన ఫోటోలను ట్విటర్ ద్వారా పంచుకున్నారు నాగార్జున. కాగా.. నాగ చైతన్య, నటి శోభిత ధూళిపళ్ల వివాహం డిసెంబర్ 4న హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో జరగనున్న సంగతి తెలిసిందే. -
హీరో అఖిల్‌తో ప్రేమ-నిశ్చితార్థం.. ఎవరీ జైనాబ్?
హీరో నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభితల పెళ్లి మరో వారం రోజుల్లో అంటే డిసెంబరు 4న జరగనుంది. ఇంతలోనే తన చిన్న కొడుకు అఖిల్ నిశ్చితార్థం జరిగిపోయిందని ప్రకటించారు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయి తమ ఇంటికి కోడలు కాబోతుందని ప్రకటించారు. అంతా బాగానే ఉంది కానీ అసలు ఎవరీ అమ్మాయి? సినిమా నటి లేదా మోడల్ అనేది ప్రశ్నగా మారింది.(ఇదీ చదవండి: హమ్మయ్యా.. 'పుష్ప 2' షూటింగ్ ఇన్నాళ్లకు పూర్తి)అఖిల్ చేసుకోబోయే అమ్మాయి పేరు జైనాబ్ రవ్జీ అని.. ఈమె ఓ ఆర్టిస్ అని మాత్రమే బయటపెట్టారు. అంతకు మించి ఒక్క డీటైల్ కూడా చెప్పలేదు. సోషల్ మీడియాలో వినిపిస్తున్న సమాచారం ప్రకారం ఈమెది హైదరాబాద్. కానీ లండన్, దుబాయిలో చదువంతా పూర్తి చేసిందట. హైదరాబాద్‌లోనే గతంలో రిఫ్లెక్షన్ పేరుతో ఆర్ట్ గ్యాలరీలో పెయింట్ ఎగ్జిబిషన్ నిర్వహించారు. అందులో ఈమె వేసిన మోడ్రన్, అబ్స్ట్రాక్ట్ పెయింటింగ్స్‌ని కూడా ప్రదర్శించారట.జైనాబ్ ప్రస్తుతం ముంబైలో నివసిస్తోందట. ఇన్ స్టాలో ఈమెకు ఖాతా ఉంది గానీ అది ప్రైవేట్‌లో ఉంది. అఖిల్ ఈమెని చాలా ఏళ్లుగా ప్రేమించాడని చెప్పారు కానీ వీళ్లిద్దరూ ఎక్కడ ఎప్పుడు పరిచయమైంది ప్రస్తుతానికి సస్పెన్స్. బహుశా ఏదైనా పెయింటింగ్ ఎగ్జిబిషన్లో వీళ్లిద్దరూ పరిచయమై, అది ప్రేమగా మారిందేమో? అలానే జైనాబ్.. అఖిల్ కంటే వయసులో పెద్దది అనే మాట కూడా వినిపిస్తోంది. మరి ఇందులో నిజమెంతనేది తెలియాలి.(ఇదీ చదవండి: బిగ్‌బాస్ ఫేమ్, నటితో సిరాజ్ డేటింగ్?.. రూమర్లకు కారణం ఇదే!) View this post on Instagram A post shared by Akhil Akkineni (@akkineniakhil) -
అక్కినేని ఇంట మరో పెళ్లి సందడి..అఖిల్ ఎంగేజ్మెంట్ (ఫోటోలు)
-
నిశ్చితార్థం చేసుకుని షాకిచ్చిన అక్కినేని అఖిల్
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నిశ్చితార్థం చేసుకున్నాడు. జైనాబ్ రవ్జీ అనే అమ్మాయితో కొత్త జీవితం ప్రారంభించేందుకు సిద్ధమయ్యాడు. హైదరాబాద్‌లోని నాగార్జున ఇంట్లో కుటుంబ సభ్యుల సమక్షంలో ఈ వేడుక జరిగింది. ఈ క్రమంలో అఖిల్.. తన నిశ్చితార్థం ఫొటోలని సోషల్ మీడియా వేదికగా ప్రకటించాడు. ఇలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చేసరికి అందరూ అవాక్కవుతున్నారు.(ఇదీ చదవండి: శివంగి మళ్లీ గెలుపు.. బిగ్‌బాస్ 8 తొలి ఫైనలిస్ట్ ఎవరంటే?)ప్రముఖ పారిశ్రామిక వేత్త జుల్ఫీ రవ్జీ కూతురే జైనాబ్ అని తెలుస్తోంది. ఈమెకు స్కిన్ కేర్‌కి సంబంధించిన కంపెనీ ఉన్నట్లు తెలుస్తోంది. భారత్, దుబాయి, లండన్‌లో ఈమె పెరిగింది. కొన్నాళ్ల క్రితంగా ప్రేమలో ఉన్న అఖిల్-జైనాబ్.. పెద్దల్ని ఒప్పించి ఇప్పుడు నిశ్చితార్థం చేసుకున్నారు. వచ్చే ఏడాది పెళ్లి ఉంటుందని అక్కినేని ఫ్యామిలీ ప్రకటించింది. ప్రస్తుతం అఖిల్ కాబోయే భార్య ఎవరా అని సోషల్ మీడియాలో అందరూ తెగ వెతికేస్తున్నారు. ఇకపోతే అఖిల్-జైనబ్‌ని ఆశీర్వదించాలని నాగార్జున అక్కినేని కోరారు. ఇదలా ఉండగా నాగార్జున పెద్ద కొడుకు నాగచైతన్య-శోభిత.. డిసెంబరు 4న హైదరాబాద్‌లో వివాహం చేసుకోబోతున్నారు. ప్రస్తుతం అక్కినేని ఫ్యామిలీకి పెళ్లికళ వచ్చేసింది.(ఇదీ చదవండి: అమ్మాయిలకే 'సెకండ్ హ్యాండ్' లాంటి ట్యాగ్ ఎందుకు?: సమంత) -
ఒకే ఫ్రేమ్‌లో చిరు, నాగ్, మహేశ్.. ఇది కదా కావాల్సింది!
ఒకరిద్దరు స్టార్ హీరోలు ఒక చోట కనిపిస్తేనే అభిమానులు పండగ చేసుకుంటారు. అలాంటిది టాలీవుడ్ అగ్ర హీరోలందరూ ఒక్కచోట కనిపిస్తే ఇంకేమైనా ఉందా? సరిగ్గా అలాంటి అద్భుతమే జరిగింది.. మెగాస్టార్ చిరంజీవి, కింగ్ నాగార్జున, సూపర్‌స్టార్ మహేశ్‌బాబు, గ్లోబల్ స్టార్ రామ్‌చరణ్, అఖిల్.. ఇలా అందరూ కలిసి దిగిన ఫోటో ఒకటి సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. స్టార్స్ అంతా ఒకేచోటఓ వ్యాపారవేత్త పుట్టినరోజు వేడుకకు వీళ్లంతా హాజరైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే హీరోలందరూ కలిసి భోజనం చేశారు. ఉపాసన, నమ్రత సైతం ఈ వేడుకలో పాల్గొన్నారు. ఈ అద్భుత కలయికకు మాల్దీవులు వేడుకగా నిలిచింది.సినిమా..సినిమాల విషయానికి వస్తే.. చిరంజీవి విశ్వంభర సినిమాతో బిజీగా ఉన్నాడు. నాగార్జున కుబేర, కూలీ సినిమాలు చేస్తున్నాడు. రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ మూవీతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. మహేశ్‌బాబు.. రాజమౌళి డైరెక్షన్లో సినిమా కోసం రెడీ అవుతున్నాడు.చదవండి: ఫైట్ యాక్షన్ సీక్వెన్స్.. సునీల్ శెట్టికి గాయాలు! -
లక్కీ భాస్కర్ డైరెక్టర్ పై మండి పడుతున్న నితిన్, అఖిల్
-
మెగాస్టార్‌కు ఏఎన్నార్ జాతీయ అవార్డ్.. హాజరైన టాలీవుడ్ సినీ ప్రముఖులు (ఫొటోలు)
-
తిరుపతి నేపథ్యంలో...
వాట్ నెక్ట్స్? అఖిల్ అక్కినేని చేయనున్న కొత్త చిత్రం గురించిన చర్చ ఇది. వార్తల్లో ఉన్న ప్రకారం అఖిల్ రెండు సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఒకటి యూవీ క్రియేషన్స్ నిర్మించనున్న సినిమా అని, ఈ చిత్రాన్ని అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్నారని ఇప్పటికే ప్రచారంలో ఉంది. ఇక మరో చిత్రాన్ని అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మించనుందని భోగట్టా. కిరణ్ అబ్బవరం హీరోగా ‘వినరో భాగ్యము విష్ణుకథ’ చిత్రాన్ని తెరకెక్కించిన మురళీ కిషోర్ దర్శకత్వంలో ఈ చిత్రం రూపొందనుందని సమాచారం.మురళి చెప్పిన కథ నాగార్జునకు నచ్చడంతో హోమ్ బేనర్లో నిర్మించాలని నిర్ణయించుకున్నారట. తిరుపతి నేపథ్యంలో పీరియాడిక్ మూవీగా రూపొందనుందని టాక్. ఈ చిత్రానికి ‘లెనిన్’ టైటిల్ అనుకుంటున్నారని భోగట్టా. అలాగే యూవీ క్రియేషన్స్‌లో నటించనున్న చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉందట. ఇది కూడా పీరియాడికల్ బ్యాక్‌డ్రాప్ మూవీ అట. ఇక అఖిల్ అయితే ఈ మధ్య మేకోవర్ అయ్యారు. ఈ మేకోవర్ ఏ సినిమా కోసం అనేది తెలియాల్సి ఉంది. -
మమ్మల్ని బలిపశువులను చేసింది: అక్కినేని అఖిల్
తెలంగాణ మంత్రి కొండా సురేఖ చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై ఇప్పటికే చాలామంది తెలుగు చిత్ర పరిశ్రమ నుంచి రియాక్ట్ అయ్యారు. ఈ క్రమంలో అఖిల్ అక్కినేని కూడా అమల చేసిన ట్వీట్‌నే షేర్ చేశాడు. అయితే, ఈ క్రమంలో తాజాగా ఆయన మరోసారి కొండ సురేఖపై ఘాటుగానే స్పందించారు.కొండా సురేఖ ప్రవర్తించిన తీరు సిగ్గుచేటు, క్షమించరానిది. కుటుంబ సభ్యుడిగా, సినీ ఇండస్ట్రీ సభ్యుడిగా నేను మౌనంగా ఉండలేను. ఇలాంటి నీచమైన వ్యాఖ్యలు చేసిన వ్యక్తిని శిక్షించాలి. ఆమె చేసిన నిరాధారమైన, హాస్యాస్పదమైన ప్రకటనలు అసభ్యకరంగా, జుగుప్సాకరంగా ఉన్నాయి. ప్రజా సేవకురాలిగా ప్రజలకు రక్షణ కల్పించాలని భావించిన ఆమె తన నైతికత, సామాజిక సంక్షేమాన్ని మరచిపోవాలని నిర్ణయించుకుంది. ఆమె వ్యాఖ్యల వల్ల మా కుటుంబ సభ్యులతో పాటు ప్రజలు కూడా బాధపడ్డారు. ఆమె స్వార్థపూరితంగా నడుచుకుంటుంది. రాజకీయ యుద్ధంలో ఆమె తన కంటే చాలా ఉన్నతమైన విలువలు, సామాజిక అవగాహన ఉన్న అమాయక వ్యక్తులపై సిగ్గు లేకుండా ఇలాంటి దాడి చేసి బలిపశువులను చేసింది. మన సమాజంలో ఆమెలాంటి వాళ్లకు చోటు, గౌరవం లేదు. ఎవరూ సహించలేని ఆమె తీరు ఎప్పటికీ క్షమించబడదు.' అని అఖిల్ అక్కినేని ఘాటుగా స్పందించారు.The baseless and ridiculous statements made by Konda Surekha are vulgar and disgusting. Being a public servant who is expected to protect the people she has decided to forget her morals and social welfare. The way she has acted is shameful and unforgivable. There are respected…— Akhil Akkineni (@AkhilAkkineni8) October 4, 2024 -
హిట్ సినిమా కొట్టిన తర్వాతే అఖిల్ మీ ముందుకొస్తాడు: నాగార్జున
తెలుగు సినిమా లెజెండ్ అక్కినేని నాగేశ్వరరావు శత జయంతిని నేడు (సెప్టెంబర్ 20) ఆయన అభిమానులు ఘనంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా ఫ్యాన్స్ నిర్వహించిన ఓ వేడుకలో నాగార్జున మాట్లాడారు. తన తండ్రి నటించిన చిత్రాలను ఆయన మరోసారి గుర్తుచేసుకున్నారు.ఎంతో ఘనంగా జరిగిన ఆ ఈవెంట్లో అఖిల్ పాల్గొనలేదు. దీంతో కాస్త నిరుత్సాహపడిన ఫ్యాన్స్ నాగార్జునను ప్రశ్నించారు. అఖిల్ ఎక్కడ అంటూ తమ అభిమానాన్ని చాటుకున్నారు. దీంతో నాగార్జున రియాక్ట్ అయ్యారు. బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టే వరకూ అభిమానుల ముందుకు రానని అఖిల్ చెప్పినట్టుగా నాగార్జున తెలిపారు. దీంతో అభిమానులు భారీగా కేకలు, విజిల్స్ వేశారు.అభిమానులు చూపుతున్న ప్రేమను చూసి నాగర్జున ఆనందపడ్డారు. వారి గురించి ఆయన ఇలా చెప్పుకొచ్చారు. ' మీరు చూపించే అభిమానం, ఆశీస్సుల వల్లే మేము ఈ స్థానంలో ఉన్నాం. నేడు నాన్నగారి జయంతిని ఘనంగా జరుపుకుంటున్న వారందరికీ నా ధన్యవాదాలు. ఈ సందర్భంగా కొందరు రక్తదానం చేశారు. ఇలా మీ ప్రేమను పొందడం మాకు చాలా ఆనందంగా ఉంది. ఇలాంటి సమయంలో నాన్నగారు ఉండుంటే చాలా బాగుండేది. నాన్నగారి శత జయంతి సందర్భంగా కొన్ని హిట్ సినిమాలు విడుదల చేస్తున్నాం. ఉచితంగా చూసి మీరందరూ ఆనందించవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో సింగిల్ స్క్రీన్ థియేటర్లతోపాటు పీవీఆర్‌లో కూడా ఈ చిత్రాలను ఉచితంగా చూడండి.' అని అభిమానులను నాగార్జున కోరారు.#ANR lives on ♥️ #NagarjunaAkkineni about #akhilakkineni at #ANR100 birthday celebration in Hyderabad pic.twitter.com/5ksfKaxBYC— ARTISTRYBUZZ (@ArtistryBuzz) September 20, 2024 -
అఖిల్ ఏజెంట్.. ఎట్టకేలకు వచ్చేస్తోంది!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తయిన ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్‌లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఈ నెలలో మరోసారి ఏజెంట్ సినిమా ఓటీటీకి వస్తోందంటూ టాక్ వినిపించింది. ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది.తాజాగా చివరికీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఏజెంట్ సిద్ధమైంది. ఈనెల 28న రాత్రి 8 గంటలకు గోల్డ్‌మైన్స్ టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్‌గా టీవీల్లో చూసే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం హిందీ వర్షన్లో మాత్రమే టీవీల్లో సందడి చేయనుంది. #Agent (Hindi) @AkhilAkkineni8 | 28th July Sun 8 PM | Tv Par Pehli Baar Only On #Goldmines Tv Channel @mammukka #DinoMorea #SakshiVaidya @GTelefilms pic.twitter.com/UyBDijRU9f— Goldmines Telefilms (@GTelefilms) July 15, 2024 -
మూడు పాన్ ఇండియా మూవీస్ ని రెడీ చేస్తున్న అక్కినేని వారసుడు ...!
-
ఓటీటీకి అఖిల్ ఏజెంట్.. మళ్లీ ఏమైంది?
అక్కినేని హీరో అఖిల్ నటించిన భారీ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఈ చిత్రాన్ని రూ . 70 కోట్లతో అనిల్ సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.అయితే ఈ సినిమా విడుదలైన ఏడాది పూర్తయినా ఇప్పటికీ ఓటీటీకి రాలేదు. పెద్ద పెద్ద సినిమాలే రిలీజైన 50 రోజుల్లోనే ఓటీటీలో సందడి చేస్తున్నాయి. గతంలో పలుసార్లు డేట్స్ అనౌన్స్ చేసినప్పటికీ స్ట్రీమింగ్కు రాకపోవడంతో అఖిల్ ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కాగా.. ఏజెంట్ ఓటీటీ రైట్స్ సోని లివ్ కొనుగోలు చేసింది. ఈ నెలలో ఓటీటీ రావచ్చని ఫ్యాన్స్ భావించారు. కానీ స్ట్రీమింగ్ తేదీపై ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. ఇటీవల ఏజెంట్ సినిమాను సెప్టెంబరు 29న స్ట్రీమింగ్ చేయబోతున్నట్టు పోస్టర్ విడుదల చేసింది. దీంతో అఖిల్ ఫ్యాన్స్ ఖుషి అయ్యారు. కానీ ఆ తర్వాత సోనిలివ్ తమ సోషల్ మీడియాలో ఖాతా నుంచి ఏజెంట్ ప్రీమియర్ పోస్టర్ లను తొలగించింది. దీంతో కథ మళ్లీ మొదటికి వచ్చినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది సెప్టెంబరులో స్ట్రీమింగ్ అవుతుందో.. లేదో వేచి చూడాల్సిందే. మరోవైపు అఖిల్ ధీర అనే చిత్రంలో నటిస్తున్నారు. -
ఏడాది తర్వాత ఓటీటీకి ఏజెంట్.. స్ట్రీమింగ్ అప్పుడేనా?
టాలీవుడ్ యంగ్ అఖిల్ అక్కినేని, మమ్ముట్టి ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఫుల్ యాక్షన్ అండ్ స్పై థ్రిల్లర్ చిత్రం ఏజెంట్. ఈ చిత్రం గతేడాది థియేటర్లలో రిలీజైంది. అయితే బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమాను సురేందర్ రెడ్డి దర్శకత్వంలో తెరకెక్కించారు. సురేందర్ 2 సినిమా, ఏకే ఎంటర్టైన్మెంట్స్ పతాకాలపై అనిల్ సుంకర, రామబ్రహ్మం సుంకర ఈ చిత్రాన్ని నిర్మించారు.కాగా.. ఈ మూవీ ఏప్రిల్ 28, 2023 థియేటర్లలో విడుదలైన సంగతి తెలిసిందే. ఇప్పటివరకు ఏజెంట్ ఓటీటీకి రాలేదు. దీంతో అభిమానులు ఓటీటీకి ఎప్పుడొస్తుందా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. గతంలో చాలాసార్లు స్ట్రీమింగ్కు వస్తుందని భావించినా అలా జరగలేదు. అయితే తాజాగా జూలైలో ఓటీటీకి స్ట్రీమింగ్కు వచ్చే అవకాశమున్నట్లు తెలుస్తోంది. త్వరలోనే ఈ చిత్రం సోనీ లివ్‌లో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. కాగా.. ఈ చిత్రంలో సాక్షి వైద్య హీరోయిన్గా నటించగా.. వరలక్ష్మి శరత్‌కుమార్, మురళీ శర్మ, ఊర్వశి రౌతేలా కీలక పాత్రలు పోషించారు. -
ఓటీటీలోకి 'ఏజెంట్' సినిమా.. ట్వీట్ చేసిన నిర్మాత
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇదొక శుభవార్త అనే చెప్పవచ్చు. ఎప్రిల్ 8న అఖిల్ పుట్టినరోజు సందర్బంగా ఎజెంట్ నిర్మాత అనిల్ సుంకర శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అఖిల్ ఫ్యాన్స్ రియాక్ట్ అయ్యారు. ముందు ఏజెంట్ సినిమాను ఓటీటీలో విడుదల చేయండి అంటూ కామెంట్లు చేశారు. దీంతో అనిల్ సుంకర రిప్లై ఇచ్చారు. ఏజెంట్ ఓటీటీ స్ట్రీమింగ్ హక్కులను సోనీ లివ్ దక్కించుకున్నట్లు అనిల్ తెలిపారు. ఈ విషయాన్ని చాలా సార్లు చెప్పాను. అతి త్వరలోనే ఏజెంట్ సినిమా సోనీ లివ్‌లో స్ట్రీమింగ్ అవుతుందని అనిల్ ట్వీట్ ద్వారా తెలిపారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ విషయం వైరల్ అవుతుంది. గత ఏడాది ఏప్రిల్ 28న రిలీజైన ఈ మూవీ సుమారు రూ. 85 కోట్లతో తెరకెక్కినట్లు సమాచారం. కానీ ఇందులో పది శాతం కలెక్షన్స్ కూడా సినిమా రాబట్టలేకపోయింది. దీంతో నిర్మాత అనిల్ సుంకరకు భారీగా నష్టాలు వచ్చినట్లు తెలుస్తోంది. ఎజెంట్‌లో మలయాళ టాప్ హీరో మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. దీంతో మలయాళంలో కూడా సినిమాను విడుదల చేశారు. కానీ అక్కడ కూడా డిజాస్టర్‌గా మిగిలిపోయింది. ఏజెంట్ మూవీతో సాక్షి వైద్య హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. తాజాగా అనిల్ సుంకర చేసిన ట్వీట్‌తో ఏజెంట్ ఓటీటీ విషయంపై మళ్లీ వార్తలు వైరల్ అవుతున్నాయి. I already informed couple of times. We sold the digital to B4U and they to Sony. Hopefully they will do it asap. https://t.co/5k0aFYKZbB — Anil Sunkara (@AnilSunkara1) April 8, 2024 -
సలార్‌లో అఖిల్ అక్కినేని.. క్లారిటీ ఇచ్చిన ప్రశాంత్ నీల్ సతీమణి
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన 'సలార్' బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించి తాజాగా ఓటీటీలోకి కూడా వచ్చేసింది. ప్రశాంత్ నీల్ దర్శకత్వానికి.. ప్రభాస్, పృథ్వీరాజ్‌ల యాక్షన్ సీన్స్‌కు ఫ్యాన్స్ ఫిదా అయ్యారు. సలార్ పార్ట్-2 ఉంటుందని ఇప్పటికే ప్రకటన వచ్చేసింది. దానికి 'సలార్ శౌర్యాంగపర్వం' అనే టైటిల్ కూడా రివిల్ అయిపోయింది. సలార్ సీక్వెల్ కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇందులో టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్ అక్కినేని అతిథి పాత్రలో కనిపించనున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతుంది. అఖిల్ లుక్‌తో పాటు అతని బాడీ కూడా బాలీవుడ్ హీరోలకు ఏం తక్కువ కాదు అన్నట్టుగా ఉంటుంది. అఖిల్ భారీ యాక్షన్ సీన్స్‌లలో దుమ్ములేపగలడు. దీంతో సలార్ పార్ట్ 2లో అఖిల్ ఎంట్రీ దాదాపు ఖాయం అని నెట్టింట వార్తలు వైరల్ అయ్యాయి. దీనిపై ప్రశాంత్ నీల్ సతీమణి లిఖితా రెడ్డి తాజాగా స్పందించారు. అవన్నీ పూర్తిగా వదంతులు మాత్రమేనని, అందులో ఎలాంటి నిజం లేదని ఆమె తెలిపారు. ఈ విషయాన్ని తన ఇన్స్టాగ్రామ్ వేదికగా నెటిజన్లు అడిగడంతో క్లారిటీ ఇచ్చారు. సలార్‌లో దేవా తండ్రి పాత్ర ఎవరు పోషిస్తున్నారు..? తన తండ్రిని రాజమన్నార్ చంపాడనే విషయం దేవాకు తెలుసా..? అని చాలామంది అడిగిన ప్రశ్నకు ఆమె రివీల్ చేయలేదు.. సమాధానాల కోసం తాను కూడా ఎదురు చూస్తున్నట్లు చెప్పారు. 'సలార్' గ్లింప్స్‌లో చూపించిన జురాసిక్ పార్క్ డైలాగ్ గురించి ఆమె చాలా ఆసక్తికరమైన సమాధానం చెప్పారు. శౌర్యాంగపర్వం విడుదలయ్యాకు ఆ డైలాగ్ కరెక్టా? కాదా? అనేది తెలుస్తుందని తెలిపారు. అంతేకాకుండా పండిట్ రోల్ కూడా సలార్‌లో కొంత మాత్రమే రివీల్ చేసినట్లు ఆమె చెప్పారు. -
గాయపడ్డ టాలీవుడ్ యంగ్ హీరో అఖిల్.. ఇంతకీ ఏమైంది?
అక్కినేని యంగ్ హీరో అఖిల్ గాయపడ్డాడు. తాజాగా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్ జరిగాయి. ఇందులో అఖిల్ కనిపించాడు. కాకపోతే ఎడమ చేతికి కట్టు ఉండటంతో పెద్ద దెబ్బ తగిలిందని అర్థమైంది. అసలు ఇంతకీ అఖిల్ చేతికి ఏమైంది? 'సలార్' సక్సెస్ పార్టీలో ఈ కుర్ర హీరో కనిపించడానికి కారణమేంటనేది చూద్దాం. గతేడాది డిసెంబరు 22న థియేటర్లలోకి వచ్చిన 'సలార్' సినిమా ప్రేక్షకుల్ని ఆకట్టుకుంది. ప్రస్తుతం రూ.700 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. ఈ క్రమంలోనే మొన్నీమధ్య బెంగళూరులో గ్రాండ్ సక్సెస్ పార్టీ చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో మూవీ టీమ్ అంతా పాల్గొన్నారు. అదే టైంలో అయ్యగారు అఖిల్ కూడా కనిపించాడు. కాకపోతే చేతికి కట్టుతో కనిపించడంతో గాయం విషయం బయటపడింది. (ఇదీ చదవండి: Salaar OTT: 'సలార్' ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యిందా? స్ట్రీమింగ్ అప్పుడేనా?) అయితే అఖిల్.. గతేడాది 'ఏజెంట్' మూవీతో వచ్చాడు. ఘోరమైన డిజాస్టర్ తన ఖాతాలో వేసుకున్నాడు. అయితే యువీ క్రియేషన్స్ బ్యానర్లో ఓ కొత్త దర్శకుడితో అఖిల్ సినిమా అని అప్పట్లో అన్నారు. ఇది నిజమో కాదో క్లారిటీ రావాల్సి ఉంది. అయితే యువీ క్రియేషన్స్ అంటే ప్రభాస్ సొంత సంస్థనే. అలా అఖిల్‌కి ఆహ్వానం అంది ఉండొచ్చు. అలా 'సలార్' సక్సెస్ సెలబ్రేషన్స్‌లో కనిపించి ఉండొచ్చు. ఇక గాయం విషయానికొస్తే.. బయటకు చెప్పకుండా అఖిల్ సినిమా షూటింగ్లో పాల్గొంటున్నాడేమో. ఈ క్రమంలోనే గాయమై ఉండొచ్చని అంటున్నారు. మరి ఈ విషయమై క్లారిటీ రావాల్సి ఉంది. చేతికి కట్టు చూస్తే పెద్ద గాయంలానే కనిపిస్తుంది. మరి ఎప్పుడైందో ఏమో? (ఇదీ చదవండి: రూ.100 కోట్ల వసూళ్లు దాటేసిన 'హనుమాన్'.. ఆ విషయమైతే చాలా స్పెషల్) -
అయ్యగారు ఈసారైనా ఓటీటీలోకి వస్తారా..?
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్.. లీడ్ రోల్లో నటించిన చిత్రం 'ఏజెంట్'. ఈ సినిమాను స్టార్ డైరెక్టర్ సురేందర్ రెడ్డి తెరకెక్కించారు. గతేడాది ఏప్రిల్ నెలలో వచ్చిన ఈ సినిమాలో అఖిల్‌కు జోడీగా యంగ్ బ్యూటిఫుల్ నటి సాక్షి వైద్య నటించారు. ఒక సినిమా థియటర్లోకి వచ్చాక కనీసం 50 రోజుల్లో ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ ఈ సినిమా ఇప్పటికీ ఓటీటీ రిలీజ్‌కు నోచుకోలేదు. దీంతో అక్కినేని ఫ్యాన్స్ నిరాశ చెందారు. అయితే ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఫ్యాన్స్‌కు ఇదొక గుడ్‌న్యూస్ అనే చెప్పవచ్చు. ఈ సినిమా ఓటీటీ రిలీజ్‌కు ఉన్న చిక్కులు అన్నీ తొలగిపోయాయని తెలుస్తోంది. దీంతో జనవరి 26న రిపబ్లిక్ డే సందర్భంగా 'ఏజెంట్' చిత్రాన్ని 'సోని లివ్' ప్రసారం చేయనున్నట్లు సమాచారం. ఈ సినిమా వల్ల సుమారు రూ. 30 కోట్ల వరకు నష్టం వచ్చినట్లు ట్రేడ్ వర్గాలు అంచనా వేశాయి. దీంతో ఏజెంట్ చిత్రాన్ని ఓటీటీ సంస్థలు కూడా తీసుకునేందుకు పెద్దగా ముందుకు రాలేదు. ఇప్పటికే ఈ సినిమా ఓటీటీలోకి వచ్చేస్తుందంటూ పలు మార్లు వార్తలు వచ్చాయి. కానీ కొన్ని కారణాల వల్ల మళ్లీ బ్రేక్ పడుతూ వచ్చింది. ఈసారైనా జనవరి 26న ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతుందా..? అంటూ సోషల్‌మీడియాలో సందేహాలు వ్యక్తమౌతున్నాయి. ఈ సినిమాలోని అనవసరమైన సన్నివేశాలను తొలగించి.. మంచి సన్నివేశాలను జోడించి కొత్త వెర్షన్‌ను విడుదల చేయాలనే ఉద్దేశంలో మేకర్స్ ఉన్నారట. -
నెలలోపే ఓటీటీ వస్తుంటే.. ఈ సినిమాలకేమైంది?
ప్రస్తుత సినిమా ప్రపంచంలో ఓటీటీలదే హవా. తమ అభిమాన స్టార్ హీరోల సినిమాలు ఎప్పుడొస్తాయా అని చూస్తున్నారు అభిమానులు. సినిమా రిలీజైన మొదటి రోజు నుంచే.. ఏ ఓటీటీలో వస్తుంది? ఏ రోజు స్ట్రీమింగ్ అవుతుందని తెలుసుకోవాలని తహతహలాడుతుంటారు. పెద్ద పెద్ద స్టార్స్ సినిమాలు, బ్లాక్ బస్టర్స్ సైతం నెల తర్వాతే ఓటీటీల్లో ప్రత్యక్షమవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఈ ఏడాది రిలీజై నెలల గడుస్తున్నా కొన్ని సినిమాలు ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఇంతకీ ఆ సినిమాలేవీ? ఎందుకు రాలేదు? అనే విషయాలపై ఓ లుక్కేద్దాం. అఖిల్ ఏజెంట్… అఖిల్ అక్కినేని ఏజెంట్ మూవీ ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. ఏప్రిల్‌లో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్‌గా నిలిచింది. సురేందర్ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. మలయాళ స్టార్ మమ్ముట్టి కీలకపాత్రలో కనిపించారు. ఈ మూవీ ఓటీటీ రైట్స్‌ను సోనీ లివ్ దక్కించుకున్న సంగతి తెలిసిందే. అసలు కథేంటంటే? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్‌లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. నయనతార కనెక్ట్… లేడీ సూపర్ స్టార్ నయనతార ప్రధాన పాత్రలో నటించిన చిత్రం కనెక్ట్. థియేటర్లలో మంచి వసూళ్లను రాబట్టిన ఈ మూవీ ఓటీటీలో మాత్రం రిలీజ్ కాలేదు. అశ్విన్ శరవణన్ దర్శకత్వంలో థ్రిల్లర్ మూవీగా తెరకెక్కించారు. ఈ సినిమా గతేడాది డిసెంబర్లో థియేటర్లలో విడుదలైంది. నయనతార భర్త విఘ్నేష్ శివన్ ఈ మూవీని నిర్మించాడు. కనెక్ట్ ఓటీటీ హక్కులను డిస్నీ ప్లస్ హాట్ స్టార్ దక్కించుకున్నట్లు ప్రచారం జరిగింది. కానీ సినిమా మాత్రం ఇప్పటివరకు ఓటీటీ రిలీజ్ కాలేదు. ఆదా శర్మ.. ది కేరళ స్టోరీ ఆదా శర్మ ప్రధాన పాత్రలో తెరకెక్కించిన చిత్రం 'ది కేరళ స్టోరీ'. బాలీవుడ్ డైరెక్టర్ సుదీప్తో సేన్ ఈ చిత్రాన్ని తెరకెక్కించగా.. బాక్సాఫీస్ వద్ద భారీ వసూళ్లు సాధించింది. కేవలం రూ.40 కోట్ల బడ్జెట్‌తో తీసిన ఈ మూవీ.. దాదాపు రూ.300 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టింది. ఈ చిత్రం రిలీజ్ నెలలు గడుస్తున్నా ఇంతవరకు ఓటీటీకి రావడం లేదు. సెన్సిటివ్ కంటెంట్ కావడంతోనే ఓటీటీ ఫ్లాట్‌ఫామ్స్ వెనక్కి తగ్గినట్లు తెలుస్తోంది. -
అఖిల్‌పై రూ. 100 కోట్లు.. కొత్త డైరెక్టర్‌తో ప్రయోగం!
సినిమా ఫలితం ఎలా ఉన్నా.. టాలీవుడ్ మార్కెట్లో అఖిల్ అక్కినేనికి ఓ ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఒక్క హిట్ పడితే చాలు..అఖిల్ స్టార్ హీరో అయిపోవడం ఖాయం. కానీ దురదృష్టవశాత్తు..అఖిల్ ఖాతాలో ఇప్పటి వరకు ఓ భారీ హిట్ లేదు. భారీ అంచనాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ డిజాస్టర్‌గా నిలిచింది. దాదాపు 80 కోట్ల భారీ బడ్జెట్‌తో నిర్మించిన ఈ చిత్రానికి రూ. 10 కోట్ల కలెక్షన్స్ కూడా రాలేదు. అంతేకాదు.. ఓటీటీ స్ట్రీమింగ్ సైతం వివాదంలో చిక్కుకొని..ఇప్పటికీ రిలీజ్ కాలేదు. దీంతో అఖిల్ కొన్ని రోజులుగా మీడియాకు దూరంగా ఉంటున్నారు. ఇప్పుడిప్పుడే ఏజెంట్ ఫలితాన్ని మర్చిపోయి..కొత్త సినిమాపై దృష్టిపెడుతున్నాడట. రూ. 100 కోట్లతో కొత్త సినిమా ఏజెంట్ రిలీజై ఆరు నెలలు దాటినా..అఖిల్ కొత్త సినిమాను ప్రకటించలేదు. అయితే యూవీ క్రియేషన్స్ బ్యానర్లో అఖిల్ తదుపరి సినిమా ఉండబోతున్నట్లు తెలుస్తోంది. ఈ మూవీతో అనిల్ కుమార్ అనే కొత్త దర్శకుడు తెలుగు తెరకు పరిచయం కాబోతున్నాడు. యూవీ క్రియేషన్స్ అత్యంత ప్రతిష్టాత్మకంగా ఈ చిత్రాన్ని నిర్మించబోతోంది. ఫ్లాప్ హీరో, కొత్త డైరెక్టర్ అయినప్పటికీ..దాదాపు రూ. 100 కోట్ల బడ్జెట్‌తో ప్రయోగం చేయబోతోంది యూవీ క్రియేషన్స్. ప్రస్తుతం అఖిల్‌కు టాలీవుడ్ మార్కెట్లో ఉన్న విలువ కంటే ఇది చాలా ఎక్కువ. కంటెంట్‌పై ఉన్న నమ్మకంతోనే రూ. 100కోట్లు పెట్టడానికి కూడా నిర్మాతలు భయపడడం లేదట. పాన్ ఇండియా స్థాయిలో ఈ చిత్రాన్ని రూపొందించబోతున్నారు. 2025లో రిలీజ్? అఖిల్ కొత్త సినిమాకు సంబంధించిన స్క్రిప్ట్ విషయంలో చాలా జాగ్రత్తగా ఉంటున్నారట. నాగార్జున సైతం ఈ చిత్రాన్ని దగ్గరుండి చూసుకోవాలని భావిస్తున్నారు. ప్రస్తుతం ఆయన నా సామిరంగ, బిగ్‌బాస్ 7 షోతో బిజీగా ఉన్నారు. వచ్చే ఏడాది జనవరిలో ఆయన ఫ్రీ అయిపోతారు. అప్పుడు మరోసారి కథ విని..ఫైనల్ వెర్షన్‌ని లాక్ చేస్తారట. ఫిబ్రవరి లేదా మార్చిలో ఈ చిత్రం సెట్స్‌పైకి వెళ్లనుంది. 2025లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశం ఉంది. -
మరింత అందంకోసం సర్జరీ చేయించుకున్న అఖిల్ !
-
అక్కినేని అఖిల్ గురించి వైరల్ అవుతున్న న్యూస్!
అఖిల్ అక్కినేని నటించిన 'ఏజెంట్' చిత్రం తర్వాత ఆయన మళ్లీ కొత్త సినిమాను ప్రకటించలేదు. భారీ యాక్షన్, స్పై థ్రిల్లర్‌గా 'ఏజెంట్' తెరకెక్కింది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ సినిమా కోసం అఖిల్ ఎంతో కష్టపడ్డారు. సిక్స్ ప్యాక్‌తో కనిపించడం కోసం ఆయన కొన్నినెలలపాటు శ్రమించారు. కానీ ఏజెంట్ అంతగా ప్రేక్షకులను మెప్పించలేదు. ఎజెంట్ సినిమాలో అఖిల్ హాలీవుడ్ హీరోలకు ధీటుగా కనిపిస్తాడు. అతని ప్రధాన బలం హైట్, అందుకు తగ్గట్టు ఆయన మెయిన్టైన్ చేస్తున్న సిక్స్ ప్యాక్.. ఏజెంట్ స్క్రిప్టు పక్కాగా ఉండుంటే భారీ హిట్ అయిండేది. ఇదే విషయాన్ని ఆ చిత్ర నిర్మాత బహిరంగంగానే చెప్పాడు. (ఇదీ చదవండి: సాక్షి టీవీ వాట్సాప్ ఛానెల్ క్లిక్ చేసి ఫాలో అవ్వండి) తాజాగా అక్కినేని అఖిల్‌కు సంబంధించిన ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఆయన ఓ కాస్మోటిక్ సర్జరీ చేయించుకుంటున్నట్లు ఇండస్ట్రీలో ప్రచారం జరుగుతుంది. ఇప్పటికే హాలీవుడ్ హీరోలా ఉన్న అఖిల్ మరింత అందంగా కనిపించడానికి తన ముఖానికి స్వల్ప సర్జరీ చేయించుకుంటున్నారని సమాచారం. తన ముక్కుకు సంబంధించి కొన్ని మెరుగులు దిద్దుతున్నారట. దీనికోసం ఆయన విదేశాలకు వెళ్తున్నారని టాక్. ఇందులో నిజం ఎంత ఉందో తెలియదు కానీ ఈ వార్తలు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతున్నాయి. అఖిల్ ఏజెంట్ తర్వాత పక్కా ప్లాన్‌తో ఒక ప్రాజెక్ట్‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని టాక్. ఈ సినిమాకు అనిల్ కూమార్ అనే కొత్త దర్శకుడు డైరెక్షన్ చేయనున్నారని తెలుస్తోంది. అనిల్ గతంలో సాహో, రాధేశ్యామ్ వంటి పాన్ ఇండియా సినిమాలకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేశాడు. ఈ సినిమాకు ధీర అనే టైటిల్ కూడా సెలెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ నటిస్తుందని వార్తల వస్తున్నాయి. ఆమె ప్రస్తుతం జూ.ఎన్టీఆర్ దేవర చిత్రంలో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన విషయం తెలిసిందే. -
రాజమౌళి పరివేక్షణలో అఖిల్ సినిమా..
-
ఓటీటీలోకి 'ఏజెంట్'.. ఐదు నెలల తర్వాత ఆ రోజే రిలీజ్
ఏ సినిమా అయినా మహా అయితే నెల.. లేదంటే నెలన్నరలోపే ఓటీటీలోకి వచ్చేస్తుంది. కానీ అక్కినేని హీరో అఖిల్ నటించిన 'ఏజెంట్' మాత్రం పత్తా లేకుండా పోయింది. అప్పుడెప్పుడో ఏప్రిల్ చివర్లో థియేటర్లలోకి వచ్చింది. ఆ తర్వాత వెంటనే ఓటీటీ రిలీజ్ ఫిక్స్ చేసుకున్నా.. దాన్ని అలా వదిలేశారు. దీంతో అందరూ ఆ మూవీ గురించి మర్చిపోయారు. ఇన్నాళ్లకు ఓటీటీ రిలీజ్ తేదీని అధికారికంగా ప్రకటించారు. ఏమైంది? దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్‌తో తీసిన యాక్షన్ మూవీ 'ఏజెంట్'. అయితే రిలీజ్‌కి ముందు అంచనాలు బాగానే ఉండటంతో.. హిట్ అవుతుందని అందరూ అనుకున్నారు. కానీ ఘోరంగా బోల్తా కొట్టింది. పదుల కోట్ల నష్టాన్ని నిర్మాతకు మిగిల్చింది. దీంతో డిజిటల్ హక్కులు కొనుగోలు చేసిన సోనీ లివ్.. ఓటీటీ రిలీజ్ విషయంలో వెనకడుగు వేసింది. (ఇదీ చదవండి: సమ్మోహనుడా పాట షూటింగ్లో దర్శకుడితో గొడవ, ఏడ్చేసిన హీరోయిన్!) ఐదు నెలల తర్వాత అయితే మే 19నే తొలుత ఓటీటీ రిలీజ్ చేస్తామని చెప్పారు. కానీ ఆ సమయానికి విడుదల చేయలేదు. అప్పుడు ఇప్పుడు అనుకుంటూ వచ్చారు కానీ పూర్తిగా పక్కనబెట్టేశారు. దీంతో అందరూ 'ఏజెంట్' గురించి మర్చిపోయారు. ఇలాంటి టైంలో సెప్టెంబరు 29 నుంచి స్ట్రీమింగ్ చేయనున్నట్లు సోనీలివ్ అధికారికంగా ప్రకటించింది. అంటే దాదాపు ఐదు నెలల తర్వాత ఓ సినిమా ఓటీటీలోకి రానుంది. ఇది నిజంగా విశేషమే. కథేంటి? రామకృష్ణ అలియాస్ రిక్కీకి రా(RAW) ఏజెంట్ కావాలనేది కల. దానికోసం మూడుసార్లు పరీక్ష రాసి పాస్ అయినా రిజెక్ట్ అవుతాడు. మహాదేవ్(మమ్ముట్టి) రా చీఫ్. భారతదేశాన్ని టార్గెట్ చేసిన ది గాడ్ (డినో మోరియా)ని అంతం చేయాలనేది ఈయన లక్ష్యం. అందుకోసం ఓ మిషన్ ప్లాన్ చేస్తాడు. అనుకోకుండా ఈ మిషన్‌లో భాగమవుతాడు. ఇంతకు మహాదేవ్.. రిక్కీకి ఏం చేయమన్నాడు? రిక్కీ రా ఏజెంట్ కల నేరవేరిందా? మహాదేవ్ మిషన్ పూర్తయిందా? లేదా? అన్నదే 'ఏజెంట్' స్టోరీ. (ఇదీ చదవండి: ఓటీటీలో సూపర్‌హిట్ లవ్ స్టోరీ.. ఫ్రీగా చూసేయండి!) The wait is over! Brace yourself for the wild adrenaline rush! The Agent starring Mammotty and Akhil Akkineni will be streaming on Sony LIV from 29th Sept.#SonyLIV #AgentOnSonyLIV #Agent @AkhilAkkineni8 @mammukka @DirSurender @sakshivaidya99 @AnilSunkara1 pic.twitter.com/zYL0ljh8M1 — Sony LIV (@SonyLIV) September 22, 2023 -
నువ్వు నా కొడుకు కాబట్టి...అఖిల్ పై నాగార్జున ఫన్నీ కామెంట్స్
-
చాలా స్ట్రెస్ గా ఉంది నాన్న..!
-
అమ్మ మీద చిరాకు పడతావ్ ఏంట్రా..? అక్కినేని నాగార్జున
-
నిన్ను చూస్తే జెలస్ ఉందిరా : అక్కినేని నాగార్జున
-
మిస్టర్ మజ్ను గురించి అక్కినేని నాగార్జున సూపర్ ఫన్ ఇంటర్వ్యూ అఖిల్ తో
-
నిన్న అఖిల్...ఈ రోజు నిఖిల్...మీరు మారిపోయారయ్యా
-
ఫ్లాప్స్ తట్టుకోలేక యూ టర్న్ తీసుకున్న అక్కినేని బ్రదర్స్
-
ఓటీటీలో అఖిల్ 'ఏజెంట్' మూవీ వాయిదా.. స్ట్రీమింగ్ అప్పుడే
అక్కినేని అఖిల్ తాజాగా నటించిన చిత్రం ఏజెంట్. సాక్షి వైద్య ఇందులో హీరోయిన్గా నటించింది. స్పై థ్రిల్లర్ కథాంశంతో తెరకెక్కిన ఈ సినిమాను సురేందర్ రెడ్డి డైరెక్ట్ చేశారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్‌గా మిగిలింది. మేకోవర్ కోసం చాలా కష్టపడిన అఖిల్‌కు ఏజెంట్ తీవ్ర నిరాశనే మిగిల్చింది. తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో ప్రేక్షకుల అంచనాలను ఏమాత్రం అందుకోలేకపోయింది. ఇదిలా ఉంటే ఇప్పుడీ సినిమా ఓటీటీ రిలీజ్‌పై మరో కన్ఫ్యూజన్ వచ్చి పడింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీ లివ్ ఈ సినిమా డిజిటల్ హక్కులను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈరోజు(మే19)నుంచే స్ట్రీమింగ్ చేస్తున్నట్లు కూడా సోనీలివ్ ఓ పోస్టర్‌ను రిలీజ్ చేసింది. చదవండి: షూటింగ్లో ప్రమాదం.. సల్మాన్‌ఖాన్‌కు గాయాలు అయితే మళ్లీ ఏమైందో ఏమో కానీ ఏజెంట్ స్ట్రీమింగ్‌ను వాయిదా వేసింది. థియేటర్ రిలీజ్‌కు, ఓటీటీ విడుదలకు కనీసం 20 రోజుల గ్యాప్ కూడా లేకపోవడంతో మరో వారం పాటు వాయిదా వేస్తున్నట్లు తెలుస్తుంది. మే26న ఏజెంట్ మూవీ ఓటీటీలో అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. Were is #Agent OTT RELEASE MAY 19 @SonyLIV @SonyLIVHelps pic.twitter.com/gLANHasQ1S — OTTGURU (@OTTGURU1) May 19, 2023 -
ఏజెంట్‌పై ఫలితంపై అఖిల్ రియాక్షన్..
అక్కినేని అఖిల్, సాక్షి వైద్యం జంటగా నటించిన చిత్రం ఏజెంట్. ఇటీవలే థియేటర్లలో రిలీజైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద అభిమానుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ చిత్రంలో మలయాళ స్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. తాజాగా ఈ చిత్రం రిజల్ట్‌పై అఖిల్ స్పందించారు. తన ఫ్యాన్స్, ఏజెంట్ మూవీ నటీనటులను ఉద్దేశిస్తూ ఆయన ట్వీట్ చేశారు. అఖిల్ తన ట్వీట్లో రాస్తూ.. 'ఏజెంట్ సినిమాకి ప్రాణం పోయడం కోసం తమ జీవితాలను అంకితం చేసిన నటీనటులు, సిబ్బందికి నేను హృదయపూర్వక ధన్యవాదాలు. మేము మా స్థాయిలో ఉత్తమంగా ప్రయత్నించాం. కానీ దురదృష్టవశాత్తూ ఈ చిత్రం తెరపై మేము కోరుకున్న విధంగా మెప్పించలేదు. మేము మీ కోసం మంచి చిత్రాన్ని అందించలేకపోయాము. నాకు పెద్ద సపోర్ట్‌గా నిలిచిన నిర్మాత అనిల్‌కు ప్రత్యేక ధన్యవాదాలు. మా సినిమాపై నమ్మకం ఉంచిన డిస్ట్రిబ్యూటర్లందరికీ.. మాకు ఎంతో సపోర్ట్ చేసిన మీడియాకు ధన్యవాదాలు. నేను పని చేయడానికి కారణం మీరిచ్చే ప్రేమ, శక్తి . నన్ను నమ్మిన వారి కోసం బలంగా తిరిగి వస్తా.' అంటూ నోట్ విడుదల చేశారు. pic.twitter.com/MxG9cT5c19 — Akhil Akkineni (@AkhilAkkineni8) May 15, 2023 -
మరో తెలుగు సినిమాలో ఛాన్స్ కొట్టేసిన జాన్వీ కపూర్!
బాలీవుడ్ బ్యూటీ జాన్వీ కపూర్ ఇప్పటికే తెలుగులో ఎన్టీఆర్ సరసన ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాతో జాన్వీకపూర్ టాలీవుడ్‌కి పరిచయం కానుంది. ఈ మూవీ సెట్స్‌పై ఉండగానే ఈ అందాల తార ఇప్పుడు తెలుగులో మరో అవకాశాన్ని దక్కించుకుంది. అఖిల్ అక్కినేని లేటెస్ట్ మూవీలో జాన్వీని ఫైనల్ చేసినట్లు టాక్ వినిపిస్తుంది. యూవీ క్రియేషన్స్ అఖిల్‌తో ఓ భారీ బడ్జెట్ సినిమాను రూపొందిస్తున్నారు. ఈ చిత్రానికి ధీర అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ఈ సినిమాలో హీరోయిన్గా జాన్వీ కపూర్ దాదాపుగా ఫిక్స్ అయ్యిందట. త్వరలోనే దీనికి సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ రానున్నట్లు తెలుస్తుంది. ఇక రామ్‌చరణ్‌తో బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న సినిమాలోనూ హీరోయిన్గా జాన్వీని ఫైనల్ చేసినట్లు సమాచారం. ఈ లెక్కన NTR30 రిలీజ్ అనంతరం ఈ భామకు తెలుగులో మరిన్ని అవకాశాలు వస్తాయనడంలో ఏమాత్రం సందేహం లేదనే టాక్ ఇండస్ట్రీలో జోరుగా వినిపిస్తుంది. -
ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ కొత్త సినిమా.. టైటిల్ ఇదే!
కేరీర్లో సాలిడ్ హిట్ కోసం ట్రై చేస్తున్న అఖిల్ అక్కినేనికి ప్రతిసారి నిరాశే మిలుగుతుంది. భారీ అంచాలు పెట్టుకున్న ‘ఏజెంట్’ ఇటీవల విడుదలై భారీ పరాజయాన్ని మూటగట్టుకుంది. ఈ సినిమాతో పాన్ ఇండియా స్థాయిలో సత్తా చాటాలనుకున్నాడు అఖిల్. కానీ ఆయన ప్రయత్నం ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అఖిల్ కెరీర్లోనే భారీ డిజాస్టర్ మూవీగా ఏజెంట్ నిలిచింది. (చదవండి: ‘తొలిప్రేమ’ తర్వాత అవకాశాలు వచ్చినా కాదనుకున్నాను: వాసుకి) అయితే సినిమా ఫలితాన్ని పట్టించుకోకుండా.. తన తర్వాత చిత్రంపై ఫోకస్ పెట్టాడు ఈ అక్కినేని హీరో. ‘సాహో’ సినిమాకు అసిస్టెంట్ డైరెక్టర్‌గా చేసిన అనిల్ కుమార్ ఇటీవల అఖిల్‌కు ఓ కథ వినిపించారట. అది తనకు బాగా నచ్చడంతో వెంటనే ఓకే చెప్పాడట. ఫ్యాంటసీ బ్యాక్‌డ్రాప్‌లోని ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ నిర్మించనుందని టాక్. (చదవండి: చైతూ నా దగ్గర ఆ ప్రామిస్ తీసుకున్నాడు: వెంకట్ ప్రభు ) అంతేకాదు ఈ చిత్రానికి ‘ధీర’ అనే టైటిల్ పరిశీలనలో ఉన్నట్లు ఫిల్మ్‌నగర్‌లో ప్రచారం జరుగుతోంది. త్వరలోనే ఈ సినిమా షూటింగ్ ప్రారంభం కానుందట. మరి ఈ చిత్రంతోనైనా అఖిల్ సాలిడ్ హిట్ కొడతాడో లేదో చూడాలి. -
అక్కినేని కుటుంబాన్ని వెంటాడుతున్న ఫ్లాపులు.. స్పందించిన చై!
అక్కినేని ఫ్యామిలీకి బ్యాడ్ టైం నడుస్తోంది. ఇటీవలి కాలంలో వారు నటించిన సినిమాలేవీ విజయం సాధించలేదు. నాగార్జున మొదలు నాగ చైతన్య, అఖిల్ నటించిన సినిమాలన్నీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టాయి. సక్సెస్ పదం విని చాలాకాలమే అయింది. గతేడాది నాగార్జున, చైతన్య కలిసి నటించిన బంగార్రాజు చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. ఆ తర్వాత నాగార్జున నటించిన 'ది ఘోస్ట్', చైతన్య 'థాంక్యూ', అఖిల్ 'ఏజెంట్'.. సినిమాలన్నీ చతికిలపడ్డాయి. ఈ క్రమంలో అక్కినేని ఫ్యాన్స్ అంతా ఓ సాలిడ్ హిట్ కోసం వెయిట్ చేస్తున్నారు. ఈ తరుణంలో కస్టడీ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచేందుకు సిద్ధమయ్యాడు నాగచైతన్య. మే 12న కస్టడీ థియేటర్లలో విడుదల కానుంది. ఈ సందర్భంగా ఓ సమావేశంలో చైతూకు ఆసక్తికర ప్రశ్న ఎదురైంది. 'అక్కినేని అభిమానులు ఏడాదికాలంగా స్ట్రాంగ్ కమ్బ్యాంక్ కోసం ఎదురుచూస్తున్నారు. అన్నీ నిరాశాజనకమైన ఫలితాలే వస్తున్నాయి. అభిమానులకు ఏం చెప్పదలుచుకున్నారు?' అని ఓ పాత్రికేయుడు చైను ప్రశ్నించాడు. దీనికి యువసామ్రాట్ స్పందిస్తూ.. 'అభిమానులకు మేము ఎప్పుడూ సక్సెస్‌నే ఇవ్వాలనుకుంటాం. వారు మాపై ఎంతో ప్రేమాభిమానాలను చూపిస్తారు. ఎల్లప్పుడూ మద్దతుగా నిలబడతారు. వారికి మేము బహుమతిగా మంచి సినిమాను మాత్రమే ఇవ్వగలం. మా కుటుంబం నుంచి వచ్చిన గత కొన్ని సినిమాలు వర్కవుట్ అవలేదు. అనుకున్న ఫలితాలు రాలేదు. ఈ కెరీర్లో ఎత్తుపల్లాలు సహజమే! అందరూ దాన్ని అంగీకరించక తప్పదు. త్వరలోనే ఈ బ్యాడ్‌టైం ముగిసిపోతుంది. మళ్లీ మేము హిట్ ట్రాక్ ఎక్కుతాం. కస్టడీతోనే అది ప్రారంభమవుతుంది. నాకు ఆ నమ్మకముంది' అని చెప్పుకొచ్చాడు నాగ చైతన్య. చదవండి: టార్చర్, రోజూ నన్ను కొట్టి హింసించేవాడు: నటి సర్జరీ వికటించడంతో డిప్రెషన్లోకి వెళ్లిపోయా: ప్రియాంక చోప్రా -
మా నాన్న స్టోరీ వినలేదు.. నాన్న కథ విన్నారు
-
ఇప్పటికే డైరెక్టర్ ని వెనకేసుకొస్తున్న ఏజెంట్ ప్రొడ్యూసర్
-
'ఏజెంట్ ఫ్లాప్'..డిప్రెషన్లోకి అఖిల్? ఒంటరిగా దుబాయ్‌కి..
అక్కినేని అఖిల్ నటించిన తాజా చిత్రం ఏజెంట్. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తాకొట్టింది. స్పై యాక్షన్ మూవీగా తెరకెక్కిన ఈ చిత్రం ఆశించనంతగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయింది. ఫలితంగా తొలిరోజు నుంచే నెగిటివ్ టాక్‌తో డిజాస్టర్ అనిపించుకుంది. అఖిల్ కెరీర్లో మరో ఫ్లాప్ వచ్చి చేరింది. ఏజెంట్ సినిమా కోసం అఖిల్ సుమారు రెండేళ్లు కష్టపడ్డాడు. జిమ్‌లో గంటల కొద్దీ శ్రమించి లుక్ మొత్తం మార్చుకున్నాడు. ఈ సినిమాతో సాలిడ్ హిట్ వస్తుందనుకుంటే ఊహించని విధంగా దెబ్బ పడింది. చదవండి: అభిమానిని తోసేసిన షారూక్ ఖాన్.. మండిపడుతున్న నెటిజన్స్ దీనికి తోడు సోషల్ మీడియాలోనూ విమర్శలు, ట్రోలింగ్‌తో అఖిల్ కాస్త డిప్రెషన్‌కు వెళ్లినట్లు తెలుస్తుంది. దీంతో దాన్నుంచి బయటపడేందుకు సింగిల్‌గా దుబాయ్‌కు వెకేషన్‌కు వెళ్లిపోయాడు. తాజాగా దీనికి సంబంధించిన ఫోటో నెట్టింట వైరల్ అవుతుంది. చదవండి: VD12: రౌడీ హీరోతో శ్రీలీల.. ఘనంగా సినిమా ప్రారంభం -
క్షమించండి తప్పంతా మాదే
-
Agent OTT Release: మూడు వారాల్లో ఓటీటీలోకి ఏజెంట్, మరీ ఇంత త్వరగానా?
ఏజెంట్ సినిమా కోసం ఎంతో కష్టపడ్డాడు అఖిల్ అక్కినేని. కానీ చివరకు ఆ సినిమా ఫ్లాప్ టాక్ మూటగట్టుకోవడంతో తన కష్టమంతా బూడిదలో పోసిన పన్నీరైంది. ఈ సినిమా పరాజయానికి బాధ్యత వహిస్తూ నిర్మాత అనిల్ సుంకర సోషల్ మీడియా వేదికగా సినీప్రియులకు క్షమాపణలు తెలిపిన విషయం తెలిసిందే! తాజాగా ఈ మూవీ ఓటీటీ రిలీజ్ డేట్ ఖరారైంది. ఓటీటీలో ఏజెంట్ స్ట్రీమింగ్ డేట్ గురించి రకరకాల వార్తలు చక్కర్లు కొడుతుండటంతో ఓటీటీ ప్లాట్‌ఫామ్ సోనీలివ్ స్పందించింది. ఓ యూజర్ అడిగిన ప్రశ్నకు స్పందిస్తూ.. మే 19 నుంచి సోనీలివ్‌లో ప్రసారం కానున్నట్లు వెల్లడించింది. ఏప్రిల్ 28న థియేటర్లలో రిలీజైన ఏజెంట్ మూడు వారాల్లోనే ఓటీటీలోకి వచ్చేస్తుందా? అని కామెంట్లు చేస్తున్నారు అభిమానులు. కాగా ఏజెంట్ సినిమాతో సాక్షి వైద్య హీరోయిన్గా తెలుగు తెరకు పరిచయమైంది. సురేందర్ రెడ్డి దర్శకత్వం వహించిన ఈ మూవీలో డినో మోరియా విలన్‌గా నటించాడు. బాలీవుడ్ బ్యూటీ ఊర్వశి రౌతేలా ఐటం సాంగ్ చేసింది. హిప్ హాప్ తమిళ సంగీతం అందించాడు. #AGENT Streaming On from May 19 Sony LIV Platform Telugu | Kannada | Malayalam | Tamil #AgentOnSonyLIV pic.twitter.com/gzCm5hktuS — Filmy Corner (@filmycorner9) May 3, 2023 చదవండి: బ్రో, నా కిడ్నీ తీసుకుంటావా? షారుక్ తనయుడిపై ట్రోలింగ్


