అఖిల్‌ ఏజెంట్‌.. ఎట్టకేలకు వచ్చేస్తోంది! | Akkineni Akhil Movie Agent Coming To Digital Premiere On This Date | Sakshi
Sakshi News home page

Agent Movie: అఖిల్‌ ఏజెంట్‌.. డిజిటల్‌ ప్రీమియర్‌ ఎక్కడంటే?

Published Mon, Jul 15 2024 6:33 PM | Last Updated on Mon, Jul 15 2024 6:48 PM

Akkineni Akhil Movie Agent Coming To Digital Premiere On This Date

టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్‌ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్‌లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు.  ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్‌గా మెప్పించింది.

అయితే ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తయిన ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్‌లో స్ట్రీమింగ్‌కు రానుందని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఈ నెలలో మరోసారి ఏజెంట్ సినిమా ఓటీటీకి వస్తోందంటూ టాక్ వినిపించింది. ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది.

తాజాగా చివరికీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఏజెంట్ సిద్ధమైంది. ఈనెల 28న రాత్రి 8 గంటలకు గోల్డ్‌మైన్స్‌ టీవీ ఛానెల్‌లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్‌మైన్స్‌ టెలీఫిల్మ్స్‌ ట్విటర్‌ ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్‌గా టీవీల్లో చూసే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం హిందీ వర్షన్‌లో మాత్రమే టీవీల్లో సందడి చేయనుంది.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement