Premier
-
అఖిల్ ఏజెంట్.. ఎట్టకేలకు వచ్చేస్తోంది!
టాలీవుడ్ యంగ్ హీరో అక్కినేని అఖిల్ నటించిన ఫుల్ యాక్షన్ చిత్రం ఏజెంట్. గతేడాది థియేటర్లలో రిలీజైన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద బోల్తా కొట్టింది. సురేందర్ రెడ్డి డైరెక్షన్లో తెరకెక్కించిన ఈ మూవీలో మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి కీలక పాత్రలో కనిపించారు. ఇందులో అఖిల్ సరసన సాక్షి వైద్య హీరోయిన్గా మెప్పించింది.అయితే ఈ మూవీ విడుదలై ఏడాది పూర్తయిన ఇప్పటివరకు ఓటీటీకి రాలేదు. గతంలో సోనీలివ్‌లో స్ట్రీమింగ్కు రానుందని ప్రకటించారు. కానీ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. ఈ నెలలో మరోసారి ఏజెంట్ సినిమా ఓటీటీకి వస్తోందంటూ టాక్ వినిపించింది. ఈసారి కూడా అభిమానులకు నిరాశే ఎదురైంది.తాజాగా చివరికీ బుల్లితెరపై సందడి చేసేందుకు ఏజెంట్ సిద్ధమైంది. ఈనెల 28న రాత్రి 8 గంటలకు గోల్డ్‌మైన్స్ టీవీ ఛానెల్లో ప్రసారం కానుంది. ఈ విషయాన్ని గోల్డ్‌మైన్స్ టెలీఫిల్మ్స్ ట్విటర్ ద్వారా పంచుకుంది. దీనికి సంబంధించిన ప్రోమోను విడుదల చేసింది. ఓటీటీ స్ట్రీమింగ్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న అభిమానులకు డైరెక్ట్‌గా టీవీల్లో చూసే అవకాశం దక్కింది. అయితే ఇది కేవలం హిందీ వర్షన్లో మాత్రమే టీవీల్లో సందడి చేయనుంది. #Agent (Hindi) @AkhilAkkineni8 | 28th July Sun 8 PM | Tv Par Pehli Baar Only On #Goldmines Tv Channel @mammukka #DinoMorea #SakshiVaidya @GTelefilms pic.twitter.com/UyBDijRU9f— Goldmines Telefilms (@GTelefilms) July 15, 2024 -
గుండెపోటుతో చైనా మాజీ ప్రధాని కన్నుమూత
బీజింగ్: చైనా మాజీ ప్రధాని (Premier) లీ కెకియాంగ్ (68) కన్నుమూశారు. షాంఘైలో గురువారం ఆయనకు తీవ్రమైన గుండెపోటు రాగా.. చికిత్స పొందుతూ శుక్రవారం ఉదయం ఆయన మరణించినట్లు అక్కడి మీడియా తెలిపింది. 2013 నుంచి మార్చి 2023 వరకు ఆయన చైనా ప్రధానిగా ఉన్నారు. సంస్కరణల మేధావిగా పేరున్న కెకియాంగ్ను అధ్యక్షుడు జీ జిన్‌పింగ్ తొక్కేశారనే రాజకీయ విమర్శ ఒకటి ఉంది. అన్హూయి ప్రావిన్స్‌కు చెందిన ఓ రాజకీయ నేత కొడుకు లీ కెకియాంగ్. రాజకీయాల్లో నేతలకు స్వేచ్ఛా నిర్ణయాలు ఉండాలనే కెకియాంగ్.. దశాబ్దకాలంగా మాత్రం జిన్‌పింగ్ సారథ్యంలోని పార్టీ గీత మీదే నడిచారు. మాజీ బ్యూరోక్రాట్ అయిన ఈయన ఆంగ్లంలోనూ అనర్గళంగా మాట్లాడగలరు. ఆర్థిక సంస్కరణలకు అధిక ప్రాధాన్యమిచ్చే విధానాలను ఆయన రూపొందించారు. అయితే హెనాన్ ప్రావిన్స్‌లో పనిచేస్తూండగా అడ్డగోలుగా రక్తదాన శిబిరాల నిర్వహణ, ఫలితంగా హెచ్ఐవీ/ఎయిడ్స్ కేసులు రికార్డు కావడంతో ఆయన ప్రతిష్ట ఘోరంగా దెబ్బతింది. తరువాతి కాలంలో అధ్యక్షుడు జిన్‌పింగ్ అధికారాలను పరిమితం చేయడం ద్వారా లీ కెకియాంగ్ను ఓ కీలుబొమ్మ ప్రధానిగా మార్చేశారని చైనా మేధావులు తరచూ విమర్శిస్తుంటారు. మరీ ముఖ్యంగా ఆర్థికపరమైన నిర్ణయాలు తీసుకోవడంలో సమర్థుడైన కెకియాంగ్ సేవల్ని కరోనా సంక్షోభం నుంచి బయటపడేందుకు జిన్‌పింగ్ వినియోగించుకోలేదని అభిప్రాయపడుతుంటారు. State Media is reporting that Li Keqiang has died of a heart attack. No word on a funeral, but mourning dead leaders, especially ones recently forced out of office, is always a tricky proposition for the Party. pic.twitter.com/NHHX8waDmi — Jeremiah Jenne (@JeremiahJenne) October 27, 2023 -
జీ20 సదస్సుకు జిన్‌పింగ్ స్థానంలో చైనా ప్రీమియర్
బీజింగ్: భారత దేశంలో అత్యంత ప్రతిష్టాత్మంకంగా నిర్వహిస్తోన్న జీ20 సమావేశాలకు చైనా అధ్యక్షుడి స్థానంలో ఆ దేశ ప్రీమియర్ హాజరు కానున్నట్లు తెలిపింది చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో న్యూఢిల్లీ వేదికగా జరగనున్న జీ20 సదస్సుకు హాజరు కావడం లేదని మొదట రష్యా అధ్యక్షుడు పుతిన్ ప్రకటించగా ఆయనను అనుసరిస్తూ చైనా అధ్యక్షుడు షి జిన్‌పింగ్ ప్రకటించారు. ఈ నేపథ్యంలో చైనా విదేశాంగ శాఖ స్పోక్స్‌పర్సన్ మావో నింగ్ కీలక ప్రకటన చేశారు. మావో నింగ్ మాట్లాడుతో.. భారత్ ప్రభుత్వ ఆహ్వానం మేరకు సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరగనున్న 18వ జీ20 సమావేశాలకు చైనా ప్రీమియర్ లీ కియాంగ్ హాజరవుతారని అన్నారు. ఈ శిఖరాగ్ర సమావేశాల్లో రెండు దేశాల దౌత్యపరమైన సంబంధాల విషయమై ఏకాభిప్రాయాన్ని సాధించి అభివృద్ధికి దోహద పడతామని అన్నారు. రెండు దేశాల సంబంధాలకు చైనా ఎప్పుడూ అధిక ప్రాధాన్యతనిస్తూనే వచ్చిందని దీనికి సంబంధించి జరిగిన అనేక సమావేశాల్లో కూడా తాము చురుగ్గా పాల్గొన్నామని గుర్తు చేశారు. ముఖ్యంగా ఈ సమావేశాల్లో సమాఖ్య దేశాల ఐక్యతను బలోపేతం చేసి ప్రపంచ ఆర్ధికాభివృద్ధికి మిగతా దేశాలతో కలిసి పనిచేసే విషయమై చైనా ప్రీమియర్ లీ కియాంగ్ చైనా అభిప్రాయాలను వెల్లడిస్తారని తెలిపారు మావో నింగ్. స్థిరమైన ప్రపంచ ఆర్ధిక పునరుద్ధరణ, సుస్థిరమైన అభివృద్ధిని ప్రోత్సహించేందుకు మిగతా జీ20 భాగస్వామ్య దేశాలతో కలిసి పనిచేస్తామని ఈ సమావేశాలు విజయవంతం కావాలని కోరుకుంటున్నామని అన్నారు. ఇది కూడా చదవండి: ఆకాశంలో అద్భుతం.. ఆకుపచ్చ కాంతిలో ఉల్కపాతం -
ఏసీఏ వల్లే ఆటగాళ్ల అద్భుత రాణింపు
విశాఖ స్పోర్ట్స్: ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్(ఏసీఏ) ప్రోత్సాహంతోనే ఏపీ ఆటగాళ్లు రాణించి.. జాతీయ స్థాయిలో అవకాశాలు పొందుతున్నారని బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ అన్నారు. ఏసీఏ 70 వసంతాల వేడుకలు సోమవారం విశాఖపట్నంలోని వైఎస్సార్ స్టేడియంలోని ప్రధాన కార్యాలయంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా స్టేడియంలో ఏర్పాటు చేసిన పైలాన్‌ను బీసీసీఐ అధ్యక్షుడు రోజర్ బిన్నీ ఆవిష్కరించారు. అనంతరం రోజర్ బిన్నీ మాట్లాడుతూ.. ‘ప్రస్తుతం ఏపీలో క్రికెటర్లకు అవసరమైన మౌలిక వసతులు, గ్రౌండ్లు, అకాడమీలు పెరుగుతున్నాయి. మరో పదేళ్లలో ఢిల్లీ, ముంబైతో పోటీపడే స్థాయికి రాష్ట్రంలో క్రికెట్ అభివృద్ధి చెందుతోంది. తొలిసారిగా 1975లో రంజీ మ్యాచ్ ఆడేందుకు విశాఖ వచ్చాను. ఇప్పుడు విశాఖపట్నం ఎంతో అభివృద్ధి చెందింది. ఏపీలో మాదిరిగా అన్ని రాష్ట్రాల్లోనూ క్రీడలకు తగిన మౌలిక వసతులు కల్పించి.. క్రీడాకారులను ప్రోత్సహించాల్సిన అవసరముంది. అప్పుడే భారత్‌లో క్రీడాభివృద్ధి సాధ్యపడుతుంది. బీసీసీఐ తరఫున స్కూల్ స్థాయి నుంచే ప్రొఫెషనల్ క్రికెటర్లను తయారు చేసేందుకు కృషి చేస్తున్నాం. ఈ ప్రక్రియ ఐదు రాష్ట్రాల్లో ముందంజలో ఉండగా.. ఇప్పుడు ఆంధ్ర చేరింది’ అని అన్నారు. ఐపీఎల్‌తో అద్భుత అవకాశాలు.. క్రికెట్ ఆడే దేశాల్లో నిర్వహిస్తున్న ప్రీమియర్ లీగ్స్ అన్నింటిలో.. ఐపీఎల్‌కున్న క్రేజ్ ప్రత్యేకమైనదని రోజర్ బిన్నీ చెప్పారు. ఆ స్టాండర్డ్స్‌ను కాపాడాలంటే.. ఐపీఎల్లో పాల్గొనే ప్రాంచైజీల నియంత్రణ చాలా అవసరమన్నారు. అందుకే ఐపీఎల్లో మరో కొత్త ఫ్రాంచైజీకి అవకాశం ఇవ్వడం లేదని చెప్పారు. ఆ రోజుల్లో మూడు దశల్లో రాణించిన వారికి జాతీయ జట్టులో అవకాశం వచ్చేదని.. కానీ ఇప్పుడు ఐపీఎల్ తరహా ప్లాట్‌ఫాంలతో మెరుగైన ప్రొఫెషనల్ క్రికెటర్‌గా మారేందుకు అవకాశం ఏర్పడిందని పేర్కొన్నారు.మహిళల క్రికెట్‌ను బాగా ప్రోత్సహిస్తున్నామని.. వరల్డ్‌కప్ ఫైనల్‌కు చేరడమే ఇందుకు నిదర్శనమన్నారు. టీమిండియా మాజీ క్రికెటర్, కోచ్ మదన్‌లాల్ మాట్లాడుతూ.. మహిళా క్రికెట్ అభివృద్ధికి ఏసీఏ ఎంతో కృషి చేస్తోందని ప్రశంసించారు. ఔత్సాహిక క్రీడాకారులను ప్రోత్సహిస్తూ వారికి ప్రీమియర్ లీగ్ నిర్వహించడం అభినందనీయమన్నారు. కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, మాజీ మంత్రి, ఎమ్మెల్యే ముత్తంశెట్టి శ్రీనివాసరావు, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ కార్యదర్శి ఎస్ఆర్ గోపినాథరెడ్డి, ఏసీఏ అపెక్స్ కౌన్సిల్ ఉపాధ్యక్షుడు పి.రోహిత్‌రెడ్డి, ఏసీఏ పూర్వ కార్యదర్శి చాముండేశ్వర్‌నాథ్, అపెక్స్ కౌన్సిల్ సభ్యులు, సీఈఓ శివారెడ్డి, వీడీసీఏ వర్కింగ్ ప్రెసిడెంట్ విష్ణుకుమార్ రాజు తదితరులు పాల్గొన్నారు. -
ఓటీటీలో హిట్...టీవీలో ఎంట్రీ...
కరోనా అనంతర పరిస్థితులు ఇంటింటి వినోదాన్ని అమాంతం మార్చేసిన వైనం తెలిసిందే. థియేటర్లు మూత పడడంతో సినీ అభిమానులకు చిన్నితెరే ఏకైక వినోద సాధనంగా మారింది. ఈ పరిస్థితుల్లో పలు చిన్న చిత్రాలు ఓటీటీ ప్లాట్‌ఫామ్‌పై విడుదలై ప్రేక్షకుల సినిమా ఆకాంక్షల్ని కొంత మేరకు తీర్చాయి. అదే సమయంలో నెట్ ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వీడియో, ఆహా, జీ ఫైవ్ వంటి పలు ఓటీటీ వేదికలు తెలుగు ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయి. ఈ నేపధ్యంలో ఓటీటీ వేదికలపై విజయం సాధించిన వాటిలో కొన్నింటిని మరోసారి థియేటర్లలోకి తీసుకువస్తుండగా... మరికొన్ని చిన్నితెరలోనే మరో వినోద సాధనమైన టీవీ తెరపై ప్రత్యక్షమవుతుండడం విశేషం. ఈ విశేషానికి శ్రీకారం చుడుతోంది మిడిల్ క్లాస్ మెలొడీస్ మూవీ. విజయ్ దేవరకొండ తమ్ముడు ఆనంద్ హీరోగా జీ ఫైవ్ వేదికగా ఈ సినిమా ఇప్పటికే మంచి హిట్టయింది. ఇప్పుడీ సినిమాని జీ తెలుగు చానెల్లో ప్రసారం చేస్తున్నారు. ప్రేమికుల రోజైన వాలెంటైన్స్ డేని పురస్కరించుకుని ఈ సినిమాని మధ్యాహ్నం 12 గంటలకు జీ తెలుగులో అందిస్తున్నట్టు చానెల్ ప్రతినిధులు తెలిపారు. చదవండి : (మరోసారి వార్తల్లో నిలిచిన శ్రీరెడ్డి) (హీరో సుమంత్ అశ్విన్ హల్దీ ఫంక్షన్.. ఫొటోలు వైరల్) -
'ఇంతకన్నా గొప్ప ఆదివారం రాదు'
బాహుబలి 2 సినిమా వెండితెర మీదే కాదు బుల్లితెర మీద కూడా సంచలనాలు నమోదు చేస్తుందని చిత్రయూనిట్ ఎంతో నమ్మకంగా ఉంది. అందుకే ఒకేసారి మూడు భాషల్లో టీవీ ప్రసారానికి రంగం సిద్ధం చేసింది. ఎలాంటి పండుగ సీజన్ కాకపోయినా.. బాహుబలి ప్రదర్శనే ఓ పండుగు అన్నట్టుగా ప్రచారం చేశారు చిత్రయూనిట్. ఆదివారం (08-10-2017) హిందీ, తమిళ, తెలుగు భాషల్లో రెండు గంటల తేడాతో సినిమాను ప్రసారం చేయనున్నారు.స ఈ ప్రీమియర్స్ షోస్ పై హీరో ప్రభాస్ ఆసక్తికరంగా స్పందించాడు. తన ఫేస్ బుక్ పేజ్ లో బాహుబలి 2 సినిమాను టీవీలో చూసి ఆనందించాలని కోరిన ప్రభాస్, ఇంతకంటే గొప్ప ఆదివారం రాదంటూ కామెంట్ చేశాడు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన బాహుబలి 2 ప్రపంచ వ్యాప్తంగా 1500 కోట్లకు పైగా వసూళ్లు సాదించి సంచలనం సృష్టించింది. -
'పింక్'ప్రీమియర్ షో లో సెలబ్రిటీలు
-
రోబోలు ప్రపంచాన్ని శాసిస్తాయా?
కార్టలన్ః యాంత్రీకరణ పలు రకాల ఉద్యోగాలు అంతర్థానమయ్యేలా చేస్తోంది. వీటి ప్రభావం ఉపాధిని భారీగా దెబ్బతీస్తోంది. కంప్యూటరరీకరణ వల్ల ఉపాధి శాతం ఇప్పటికే తగ్గిపోగా.. ఆధునిక రోబోట్లు ఆ సమస్యను మరింత జఠిలం చేస్తాయా అన్న అనుమానాలు వ్యక్తమౌతున్నాయి. అదే కొనసాగితే వచ్చే 20 ఏళ్ళలో ప్రపంచమే రోబోట్ లా మారిపోతుందేమోనన్న ఆందోళనా వ్యక్తమౌతోంది. ఇటీవల ఓ ఫుడ్ కంపెనీలో పనికోసం ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో అందుకు నిదర్శనంగా నిలుస్తోంది. ఇటీవల బ్రిటన్ బార్న్ స్లే లోని కారల్టన్.. ప్రిమియర్ ఫుడ్ ఫ్యాక్టరీలో కొత్తగా ప్రవేశ పెట్టిన అతిపెద్ద రోబో.. అనేకమంది కార్మికుల ఉపాధిని కొల్లగొట్టింది. ఆ సరికొత్త యంత్రం.. వందలకొద్దీ మిస్టర్ క్లిప్పింగ్ కేక్ లను సునాయాసంగా బాక్స్ లలో పెట్టి ప్యాక్ చేసేస్తోంది. ఇక్కడ ఈ యంత్రానికి సంబంధించిన అన్ని పనులు ఆపరేషన్ప్ మేనేజర్ డారన్ రైనే చూసుకుంటాడు. పని సరిగా చేయడం లేదు, ప్యాకింగ్ సరిగా లేదు అంటూ కార్మికులపై అరవాల్సిన పని ఇప్పుడతడికి లేదు. పనికోసం అధికశాతం ఖర్చు చేయాల్సిన అవసరం కూడా లేదు. అనేక చేతులున్న మనుషుల్లాగా పనిచేసే ఆరోబో... ఎంతోమంది కార్మికులు చేయాల్సిన పనిని స్వయంగా చేసేస్తోంది. ప్రిమియర్ ఫుడ్స్ ఫ్యాక్టరీ కొత్తగా ప్రవేశపెట్టిన డజన్లకొద్దీ చేతులున్న ఆ యంత్రం.. సుమారు వెయ్యి కేక్ ముక్కలను కేవలం ఒక్క నిమిషంలోనే ప్యాక్ చేసేస్తుంది. రోబోకి ఏర్పాటు చేసిన కళ్ళు.. కేక్ ఆకారాన్ని గుర్తుపట్టగల్గుతాయి. దీంతో ట్రేలో సర్దుకునే ముందే వాటిలో లోపాలను గుర్తించి, ఏమాత్రం తేడా కనిపించినా వాటిని పక్కకు నెట్టేస్తుంది. ఈ మిషన్ తో కేవలం ఒక్క నిమిషంలో 1000 వరకూ కేక్ లు ప్యాక్ అయిపోవడం చూసినవారికి ఎంతో ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రోబోకు ఏర్పాటు చేసిన చేతులు అతి వేగంగా ఒక్కో ముక్కను ఎంచుకోవడం, ట్రేలో పెట్టి నిమిషాల్లో ప్యాక్ చేసేయడం చూపరులను మంత్రముగ్ధుల్ని చేస్తుంది. ఇక్కడ కార్మికులు కేవలం మిషన్ ను ఆపరేట్ చేయడానికి, క్లీన్ చేయడానికి మాత్రమే అవసరం అవుతారు. దీంతోపాటు రోబో తీసుకోకుండా వదిలేసిన ముక్కలు, ప్లాస్టిక్ పేపర్లను తొలగించి ఫ్యాక్టరీ ఉద్యోగుల షాప్ కు తరలిస్తారు. బ్రిటన్ ఫ్యాక్టరీల్లో ఈ ఆటోమేషన్ ఉపయోగం ఇటీవల చాలా మామూలైపోయింది.ఇటువంటి అత్యాధునిక రోబోలు నిజంగా అద్భుతమే అనిపించినప్పటికీ, ఇక్కడ కార్మిక శక్తి తగ్గిపోవడం, ఉపాధి మార్గాలు కరువవ్వడం మాత్రం కొంత నిరాశను కలిగిస్తుంది. చివరికి మనుషులు.. ఫ్యాక్టరీల్లో చెత్తను క్లీన్ చేయడానికి మాత్రమే ఉపయోగపడతారా అన్న అనుమానం వ్యక్తమౌతుంది.