
ఈ నెలలో టాలీవుడ్ నుంచి రాబోతున్న బడా మూవీ 'ఓజీ'. పవన్ కల్యాణ్-సుజీత్ కాంబోలో తీసిన ఈ సినిమాపై ఓ మాదిరి అంచనాలు అయితే ఉన్నాయి. అయితే గ్లింప్స్, తొలి పాటతో హై తీసుకొచ్చారు గానీ తర్వాత వచ్చిన సాంగ్స్ మాత్రం ఓ మాదిరిగానే ఉన్నాయి. ప్రస్తుతానికైతే పవన్ అభిమానులు ఈ చిత్రం కోసం ఎదురుచూస్తున్నారు. ఇప్పుడు వాళ్లకు ఓ బ్యాడ్ న్యూస్ అని తెలుస్తోంది.
(ఇదీ చదవండి: 'లోక'తో డబ్బులు పోతాయని ఫిక్సయ్యా: దుల్కర్ సల్మాన్)
రీసెంట్ టైంలో పెద్ద సినిమాలకు ప్రీమియర్లు వేస్తున్నారు. అంతెందుకు పవన్ గత చిత్రం 'హరిహర వీరమల్లు'కి కూడా రిలీజ్ ముందురోజు రాత్రి షోలు వేశారు. కానీ కంటెంట్ తీసికట్టుగా ఉండటంతో మూవీ ఫలితం బెడిసికొట్టింది. దీంతో పోలిస్తే 'ఓజీ'పై హైప్ ఉంది. అందుకు తగ్గట్లే ఈ సినిమాకు కూడా ముందు రోజు సాయంత్రం నుంచి ప్రీమియర్లు ఉండొచ్చని కొన్నిరోజుల క్రితం టాక్ వినిపించింది. కానీ ఇప్పుడవి లేవని అంటున్నారు. అర్థరాత్రి ఒంటి గంటకు లేదంటే వేకువజామున 4 గంటల నుంచే తెలుగు రాష్ట్రాల్లో షోలు పడ్చొచని టాక్. ఈ మేరకు డిస్ట్రిబ్యూటర్స్ కు సమాచారం వెళ్లినట్లు తెలుస్తోంది.
1980-90లో ముంబై బ్యాక్ డ్రాప్‌లో నడిచే గ్యాంగ్‌స్టర్ డ్రామాగా 'ఓజీ'ని తెరకెక్కించారు. పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా చేసింది. బాలీవుడ్ నటుడు ఇమ్రాన్ హష్మీ విలన్ పాత్రలో కనిపించబోతున్నాడు. తమన్ సంగీతమందించాడు. డీవీవీ దానయ్య నిర్మాత.
(ఇదీ చదవండి: సింపతీ కార్డ్ ప్లే చేయొద్దు.. రీతూని ఏడిపించిన మాస్క్ మ్యాన్!)