Sujeet
-
సస్పెన్స్ విడిపోయింది.. ఒకేసారి రెండు సినిమాలపై క్లారిటీ
ఇప్పుడున్న హీరోల్లో వేగంగా సినిమాలు చేసేది ఎవరా అని చూస్తే చాలామందికి గుర్తొచ్చే పేరు నాని. ఓ మూవీ సెట్స్‌పై మరొకటి అనౌన్స్ చేస్తుంటాడు. అయితే ఇప్పుడు మాత్రం డబుల్ ధమాకా ఇచ్చేశాడు. గత కొన్నాళ్ల నుంచి ఏవైతే రూమర్స్ వస్తున్నాయో వాటిపై అధికారికంగా అందరికీ ఓ క్లారిటీ వచ్చేసింది. ఇంతకీ ఏంటా సినిమాలు? ఏంటి సంగతి? గతేడాది డిసెంబరులో 'హాయ్ నాన్న' అనే సెంటిమెంట్ మూవీతో హిట్ కొట్టిన హీరో నాని.. ప్రస్తుతం 'సరిపోదా శనివారం' చేస్తున్నాడు. ఈ ఏడాది ఆగస్టు 29న థియేటర్లలోకి ఇది రానుంది. దీని షూటింగ్ జోరుగా నడుస్తోంది. మరోవైపు నాని చేయబోయే కొత్త చిత్రాలపై కూడా ఇప్పుడు స్పష్టత వచ్చేసింది. (ఇదీ చదవండి: ఖరీదైన కారు కొన్న హీరోయిన్ ప్రియమణి.. రేటు ఎంతో తెలుసా?) 'బలగం' దర్శకుడు వేణు.. తన రెండో మూవీతో నానితో చేయబోతున్నాడని చాలారోజుల నుంచి రూమర్స్ వస్తున్నాయి. తాజాగా నాని పుట్టినరోజు సందర్భంగా నిర్మాతలతో పాటు వేణు కూడా నానిని కలిసి విష్ చేయడంతో ఈ సినిమా కన్ఫర్మ్ అయిపోయింది. విలేజ్ బ్యాక్ డ్రాప్ తో తీసే ఈ సినిమా ప్రకటన త్వరలో వస్తుంది. మరోవైపు 'ఓజీ' తీస్తున్న సుజీత్.. నానితో సినిమా చేయబోతున్నాడు. తాజాగా ఓ వీడియో రిలీజ్ చేసి మరీ అధికారికంగా ప్రకటించేశారు. క్రూరమైన వ్యక్తి.. సౌమ్యుడిగా మారడంతో అతడి ప్రపంచం తలకిందులైపోతుంది. ఆ తర్వాత ఏం జరిగిందో సినిమా చూసి తెలుసుకోవాలని హింట్ ఇచ్చారు. వచ్చే ఏడాది రిలీజ్ ఉంటుందని క్లారిటీ ఇచ్చేశాడు. సో ఇలా తన పుట్టినరోజున రెండు సినిమాల అప్డేట్స్ నాని నుంచి వచ్చేశాయ్. (ఇదీ చదవండి: మూడు ఓటీటీల్లో ఒకేసారి హిట్ సినిమా రిలీజ్.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే?) -
పవన్ కల్యాణ్ సరసన ప్రియాంక మోహన్.. పోస్టర్ రిలీజ్
సుజిత్ దర్శకత్వంలో పవన్ కల్యాణ్ నటింస్తున్న సినిమా ‘ఓజీ’. ఈ సినిమాలో పవన్ గ్యాంగ్‌స్టర్‌గా కనిపించబోతున్నారు. ఇటీవలె ముంబైలో షూటింగ్ ప్రారంభమయ్యింది. డీవీవీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్‌పై భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో ప్రియాంక మోహన్ నటిస్తుందంటూ కొన్నాళ్లుగా వార్తలు వినిపిస్తున్నాయి. వాటినే నిజం చేస్తూ తాజాగా అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేశారు మేకర్స్. ఈ సినిమాలో పవన్ సరసన ప్రియాంక మోహన్ హీరోయిన్గా నటిస్తుందంటూ మేకర్స్ ట్విటర్ వేదికగా తెలిపారు. దీనికి సంబంధించిన పోస్టర్‌ను కూడా రిలీజ్ చేశారు. కాగా గతంలో ఈ ముద్దుగుమ్మ నాని సరసన గ్యాంగ్ లీడర్, శర్వానంద్ సరసన శ్రీకారం చిత్రంలో నటించి గుర్తింపు తెచ్చుకుంది. ఇప్పుడు పవన్ కల్యాన్‌తో నటించే ఛాన్స్ కొట్టేసింది. 𝑷𝑹𝑰𝒀𝑨𝑵𝑲𝑨 𝑴𝑶𝑯𝑨𝑵… We are very happy & excited to have you on board for #OG. ❤️@PawanKalyan @PriyankaaMohan @sujeethsign @dop007 @MusicThaman #ASPrakash @DVVMovies #FireStormIsComing#TheyCallHimOG pic.twitter.com/OMED1rGkrF — DVV Entertainment (@DVVMovies) April 19, 2023 -
35 రూపాయల కోసం ఐదేళ్ల పోరాటం
కోటా: రాజస్తాన్‌కు చెందిన సుజీత్ స్వామి అనే ఇంజనీర్ రైల్వే నుంచి తనకు రావాల్సిన 35 రూపాయలను ఐదేళ్ల పాటు పోరాడి మరీ సాధించుకున్నాడు! ఆ క్రమంలో దేశవ్యాప్తంగా మరో 3 లక్షల మందికీ లబ్ధి చేకూర్చాడు. 2017 జూలై 2న కోటా నుంచి ఢిల్లీ వెళ్లేందుకు ఆ ఏడాది ఏప్రిల్‌లో స్వామి టికెట్ బుక్ చేసుకున్నాడు. తర్వాత దాన్ని రద్దు చేసుకున్నాడు. క్యాన్సలేషన్‌లో భాగంగా 35 రూపాయల సర్వీస్ చార్జిని కూడా టికెట్ డబ్బుల్లోంచి రైల్వే శాఖ మినహాయించుకుంది. అదేమంటే జూలై 1 నుంచి జీఎస్టీ అమల్లోకి వచ్చిందన్న బదులు వచ్చింది. జూలై 1కి ముందే రద్దు చేసుకున్న టికెట్‌పై సర్వీస్ చార్జి ఎలా వసూలు చేస్తారంటూ ఆయన న్యాయ పోరాటానికి దిగాడు. ఆర్టీఐ కింద ఏకంగా 50 దరఖాస్తులు పెట్టడంతో పాటు నాలుగు ప్రభుత్వ శాఖలకు లేఖలపై లేఖలు రాశాడు. వరుస ట్వీట్లు చేశాడు. ప్రధానితో పాటు కేంద్ర మంత్రులను, జీఎస్టీ కౌన్సిల్‌ను టాగ్ చేశాడు. ఎట్టకేలకు సర్వీస్ చార్జీ మొత్తాన్ని వెనక్కిస్తామంటూ రైల్వే శాఖ 2019లో దిగొచ్చింది. కానీ రౌండాఫ్ పేరుతో 33 రూపాయలే రీఫండ్ చేసింది. దాంతో మిగతా 2 రూపాయల కోసం కూడా పట్టుబట్టిన స్వామి, మూడేళ్ల పోరాటంతో వాటినీ సాధించాడు! 2017 జూన్ 2కు ముందు టికెట్లు రద్దు చేసుకున్న 2.98 లక్షల మందికీ రూ.35 సర్వీస్ చార్జి రిఫండ్ చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. -
అమెజాన్ ప్రైమ్‌లో సాహో మూవీ!
బాహుబలి తరువాత ప్రభాస్ హీరోగా అదేస్థాయి అంచనాలతో తెరకెక్కిన భారీ సినిమా సాహో.. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి రోజు నుంచే డివైడ్ టాక్ వచ్చింది. అయినా కలెక్షన్ల పరంగా పర్వాలేదనిపించింది. దక్షిణాదిలో ఓ మోస్తరు వసూళ్లు రాబట్టిన ‘సాహో’ హిందీలో మాత్రం అదిరిపోయే కలెక్షన్లతో ‘సాహో’ అనిపించింది. త్వరలోనే ఈ సినిమా అమెజాన్ ప్రైమ్ వీడియోలో ప్రసారం కానుంది. ఈ నెల 19 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో సాహో సినిమా అమెజాన్ ప్రైమ్‌లో అందుబాటులో ఉండనుందని తెలుస్తోంది. రూ.42 కోట్ల భారీ ధరతో ‘సాహో’ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. ఇక, ఈ సినిమా హిందీ వెర్షన్ మాత్రం నెట్‌ఫ్లిక్స్‌లో ఉండనుందని సమాచారం. రూ. 350 కోట్ల భారీ బడ్జెట్‌తో సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ సాహో సినిమాను తెరకెక్కింది. బాక్సాఫీస్ వద్ద ఈ సినిమా రూ. 425 కోట్లకుపైగా వసూళ్లు సాధించి పలు రికార్డ్‌లు సృష్టించింది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిశోర్, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
‘సాహో’ రిలీజ్ తరువాత తొలిసారి మీడియాతో ప్రభాస్
బాహుబలి తరువాత అదే స్థాయి అంచనాలతో భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన సినిమా సాహో. ఆగస్టు 30న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాకు తొలి షో నుంచే డివైడ్ టాక్ వచ్చినా కలెక్షన్ల పరంగా మాత్రం సత్తా చాటింది. అయితే సినిమా రిలీజ్‌కు ముందు వరుసగా మీడియా ఇంటర్వ్యూలు ఇచ్చిన ప్రభాస్ రిలీజ్ తరువాత మాత్రం మీడియాకు దూరంగా ఉంటున్నారు. సాహో రిలీజ్ అయిన రెండు వారాల తరువాత ప్రభాస్ మీడియా ముందుకు వచ్చారు. ఓ జాతీయ మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ప్రభాస్ పలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. బాలీవుడ్ ఇండస్ట్రీలో హిందీ సినిమాల పట్ల పక్షపాత ధోరణిపై ప్రభాస్ స్పందించాడు. ఇతర భాషల సినిమాలను బాలీవుడ్ జనాలు పెద్దగా ఆదరించరన్నా విషయాన్ని అంగీకరిస్తూనే, ఇలాంటి పరిస్థితులు అన్ని రంగాల్లో ఉన్నాయన్నాడు. ‘ప్రతి భాషలో అక్కడి ప్రాంతీయ నటులు ఉంటారు. వారు 20, 30 సంవత్సరాలుగా వారికి తెలుసు. అందుకే కొత్తగా వచ్చిన వారిని త్వరగా యాక్సెప్ట్ చేయలేరు. కానీ సినిమా బాగుంటే ఇవ్వని పక్కన పెట్టి ప్రేక్షకులు సినిమాను ఆదరిస్తారు. లేదంటే కొత్త నటుడికి, దర్శకుడికి అసలు అవకాశమే రాదు. బాహుబలి గతంలో ఉన్న ఎన్నో హద్దులను చెరిపేసి జాతీయ స్థాయి సినిమాలకు అవకాశం కల్పించింది. భవిష్యత్తులోనూ ఇలాంటి సినిమాలు చాలా వస్తాయి’ అన్నారు. సుజీత్ దర్శకత్వంలో యూవీ క్రియేషన్స్ నిర్మించిన సాహో ఇప్పటికే 425 కోట్లకు పైగా వసూళ్లు సాధించి మరిన్ని రికార్డ్ల దిశగా దూసుకుపోతోంది. ప్రభాస్ సరసన శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటించిన ఈ సినిమాలో జాకీష్రాఫ్, చంకీ పాండే, నీల్ నితిన్ ముఖేష్, అరుణ్ విజయ్, లాల్, వెన్నెల కిశోర్, మందిర బేడీలు ఇతర కీలక పాత్రల్లో నటించారు. -
తొలి తెలుగు చిత్రంగా ‘సాహో’
టాలీవుడ్లో ఇప్పటివరకు ఏ చిత్రానికి దక్కని అరుదైన ఘనతను ‘సాహో’ సొంతం చేసుకుంది. ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్‌తో తెరకెక్కించిన చిత్రం ‘సాహో’. సుజీత్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. యువీ క్రియేషన్ నిర్మించిన ఈ సినిమా ఆగస్టు 30న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుంది. ఈ చిత్రంపై ఇప్పటికే జాతీయ స్థాయిలో క్రేజ్ ఏర్పడింది. ఇప్పటికే ప్రమోషన్స్ మొదలుపెట్టిని చిత్ర బృందానికి మరింత జోష్ కలిగించే వార్త లభించింది. తాజాగా సాహోకు ట్విటర్ ఎమోజీ వచ్చింది. ఇందులో వింతేముంది అనుకోకండి. ట్విటర్ ఎమోజీ లభించిన తొలి తెలుగు సినిమాగా ‘సాహో’నిలిచింది. టాలీవుడ్‌ను ఏలిన అగ్రహీరోల సినిమాలకు సాధ్యంకానీ ఘనతను ప్రభాస్ సాహో సాధించింది. ఈ మధ్యకాలంలో తమిళంలో కాలా, సర్కార్, బాలీవుడ్లో జీరో, సుల్తాన్ సినిమాలకు ట్విటర్ ఎమోజీలు వచ్చాయి. ఇక ఇప్పటికే విడుదలైన టీజర్, ట్రైలర్లతో ‘సాహో’పై భారీ అంచనాలే నమోదయ్యాయి. ఈ సినిమా తెలుగు చిత్ర పరిశ్రమ స్థాయిని పెంచుతుందని సినీ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. చదవండి: ‘సాహో’ఖాతాలో ప్రపంచ రికార్డు ‘సాహో నుంచి తీసేశారనుకున్నా’ సాహో : ప్రభాస్ సింగిలా.. డబులా? -
సాహో సర్ప్రైజ్ వచ్చేసింది!
యంగ్ రెబల్‌స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న భారీ యాక్షన్ చిత్రం సాహో. బాహుబలి సక్సెస్‌తో ప్రభాస్‌కు జాతీయ స్థాయిలో గుర్తింపు రావటంతో సాహోను కూడా బహు భాషా చిత్రంగా తెరకెక్కిస్తున్నారు. ప్రస్తుతం నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటున్న ఈ సినిమాకు సంబంధించి ఓ సర్ప్రైజ్ ఇస్తున్నాం అంటూ ప్రభాస్ సోమవారం ఓ వీడియో మేసేజ్ రిలీజ్ చేశాడు. అప్పటి నుంచి అభిమానులు ప్రభాస్ ఇచ్చే సర్ప్రైజ్ ఏంటా అని ఆసక్తిగా ఎదురుచూశారు. మంగళవారం మద్యాహ్నం 12 గంటలకు ప్రభాస్ సర్ప్రైజ్ను రివీల్ చేశాడు. సినిమా రిలీజ్ డేట్‌ను అధికారికంగా ప్రకటించటంతో పాటు ఫస్ట్‌లుక్‌ను రిలీజ్ చేశాడు. డిఫరెంట్ స్పెక్ట్స్‌తో సీరియస్ లుక్‌లో ఉన్న ప్రభాస్ పోస్టర్ క్షణాల్లో వైరల్‌గా మారింది. రన్ రాజా రన్ ఫేం సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ సంస్థ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ఈ సినిమా ఆగస్టు 15న ప్రపంచ వ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రభాస్ సరసన బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ హీరోయిన్గా నటిస్తున్నారు. View this post on Instagram Here it is darlings, for all of you... The new official poster of my next film Saaho. See you in theatres on 15th August! 😎 #15AugWithSaaho @officialsaahomovie @sujeethsign @shraddhakapoor @uvcreationsofficial #BhushanKumar @tseries.official A post shared by Prabhas (@actorprabhas) on May 20, 2019 at 11:33pm PDT -
రికార్డుల వేట మొదలైంది... సాహో
బాహుబలి సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దుబాయ్‌లో జరుగుతోంది. ఈ భారీ షెడ్యూల్లో యాక్షన్ సీన్స్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరించనున్నారు. దాదాపు 150 కోట్ల బడ్జెట్‌తో యూవీ క్రియేషన్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. ఈ సినిమా షూటింగ్ పూర్తి కాకుండానే రికార్డుల వేట మొదలు పెట్టింది. బాహుబలి సినిమాతో ఉత్తరిదిలో ప్రభాస్‌కు భారీ మార్కెట్ ఏర్పడింది. దీంతో సాహో సినిమా హక్కుల కోసం బాలీవుడ్ లో గట్టి పోటి నెలకొంది. అందుకు తగ్గట్టుగా సాహో హిందీ శాటిలైట్ హక్కులు 120 కోట్లకు అమ్ముడయినట్టుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఈ విషయంపై చిత్రయూనిట్ మాత్రం ఎలాంటి క్లారిటీ ఇవ్వలేదు. బాలీవుడ్ నటులు జాకీ ష్రాఫ్, నీల్ నితిన్ ముఖేష్, చుంకీ పాండే, మందిరా బేడిలు కీలక పాత్రలో నటిస్తుండటంతో పాటు బాలీవుడ్ సంగీత త్రయం శంకర్ ఇషాన్ లాయ్‌లు స్వరాలందించటం కూడా బాలీవుడ్ మార్కెట్‌కు కలిసొస్తుందని భావిస్తున్నారు. -
ప్రభాస్ కొత్త సినిమాకు ముహుర్తం కుదిరింది
గత మూడేళ్లుగా బాహుబలి సినిమాతో కాలం గడిపేస్తున్న ప్రభాస్ ఫైనల్‌గా మరో సినిమాకు ముహుర్తం సెట్ చేశాడన్న టాక్ వినిపిస్తోంది. బాహుబలి తొలిభాగం పూర్తవ్వగానే స్టార్ట్ చేయాల్సిన సినిమాను ఎట్టకేలకు బాహుబలి 2 షూటింగ్ పూర్తయిన తరువాత మొదలు పెట్టాలని భావిస్తున్నాడు. ఇప్పటికే పక్కా స్క్రిప్టురెడీగా ఉన్న దర్శకుడు సుజిత్, ఈ సినిమాను డైరెక్ట్ చేయనున్నాడు. ప్రస్తుతం బాహుబలి 2 షూటింగ్లో ఉన్న ప్రభాస్ ఈ ఏడాది అక్టోబర్ కల్లా ఆ సినిమాను పూర్తిచేయాలని భావిస్తున్నాడు. రాజమౌళి కూడా ఎట్టి పరిస్థితుల్లో అక్టోబర్ కల్లా ప్రభాస్ పార్ట్ ముగించేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో నవంబర్ నుంచి తన నెక్ట్స్ సినిమాను ప్రారంభించడానికి ప్లాన్ చేసుకుంటున్నాడు బాహుబలి. రన్ రాజా రన్ సినిమాతో సూపర్ హిట్ కొట్టిన సుజిత్ చాలాకాలంగా ప్రభాస్‌తో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్నాడు. ప్రభాస్ హోం బ్యానర్ యువి క్రియేషన్స్, ప్రభాస్, సుజిత్ కాంబినేషన్లో సినిమాను నిర్మించనుంది.